Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
#1
ఈ కధ కొన్ని భాగాల్లో ఉంటుంది. సెక్స్ తక్కువ ఉంటుంది నా అన్ని కధల్లానే, కానీ మాటలు ఎక్కువ ఉంటాయి. సైకాలజీ కధ అనుకోండి. అంటే పాత్రలు, అవి కధలో సమస్య దగ్గర చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, వీటి గురించి ఎక్కువ ఉంటుంది.

ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిసారి. మలుపులు ఏమీ లేవు, మొత్తం కధ వచ్చేసింది, కాబట్టి ఎలా వస్తుందో చూద్దాం అనట్లేదు. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.

మొదటి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 5 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మొబైల్ అలారం మోగిన శబ్దం వినిపిస్తూనే ఉండటంతో వంటింట్లో కూరలు తరుగుతున్న సుజాత లోపల మంచం దగ్గరికి వచ్చింది.

మొబైల్ ఇంకా మోగుతూనే ఉంది. ఆపింది. మొగుడి వైపు చూసింది, గాఢనిద్రలో ఉన్నాడు. కాసేపాగి లేపుదామని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది.

ఓ గంట గడిచింది.

మొబైల్ మళ్ళీ మోగింది. ఎవరో ఫోన్ చేసినట్టు రింగ్ టోన్ వినిపిస్తోంది.

కాల్ మాట్లాడుతున్నట్టు మొగుడి గొంతు వినిపిస్తోంది.

"సుజాతా" అంటూ పిలిచాడు మురళి.

"తొమ్మిదయింది, శీను వస్తున్నాడు, అలారం ఎందుకాపావు, లేచేవాడిని కదా" అడిగాడు.

"పొద్దున మూడింటికి వచ్చారు, అలారం మోగుతున్నా మత్తుగా నిద్రపోతున్నారు, నేనే తొమ్మిదికి లేపుదాం అనుకున్నా, ఈలోపు శీనే ఫోన్ చేసాడు" బదులిచ్చింది.

తల పట్టుకుని కూర్చున్నాడు మురళి.

వచ్చి పక్కన కూర్చుని భుజం మీద చేయి వేసి మొగుడ్ని తన వైపు తిప్పుకుంది.

మొగుడి కళ్ళల్లో బాధ. మొగుడి తల తన భుజం మీద పెట్టుకుని ఓదార్చసాగింది.

"ఈ సమస్య నించి బయటపడతామని నాకు నమ్మకముంది, మీరు అధైర్యపడద్దు"

తల ఊపాడు.

మళ్ళీ మోగింది మొబైల్.

"శీను వస్తున్నాడు, నీళ్ళు పెట్టు"

"కాఫీ"

"ఇప్పుడు టైం లేదు, ముందు స్నానం చేస్తాను"

"ఉప్మా చేస్తున్నా, శీను వచ్చేటప్పటికి అయిపోతుంది, కాస్త తినండి" అంటూ లోపలికెళ్ళింది.

మొగుడి స్నానం ఏర్పాట్లు చూసి ఉప్మా చేయసాగింది.

స్నానం చెయ్యడానికి లోపలికెళ్ళాడు మురళి.

కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది శీనూనే అని తెలిసిన సుజాత, టకాటకా తలుపు తీసి... "ఉప్మా చేస్తున్నా, తిని వెళ్లండి" అంది.

"తొందరగా" అన్నాడు శీను.

ఇంతలో మురళి వచ్చాడు.

రెండు నిమిషాల్లో ఉప్మా తెచ్చింది సుజాత.

మగాళ్ళిద్దరూ తిన్నారు.

"వెళ్ళొస్తా" అంటూ సుజాత వైపు బాధ, అపనమ్మకం కలిపి చూస్తూ బండి ఎక్కాడు మురళి.

నవ్వుతూ చెయ్యి ఊపుతూ బండి కనుమరుగయ్యేంత వరకూ అక్కడే ఉండి, లోపలికొచ్చి కూర్చుని తలపట్టుకుంది సుజాత.

వీళ్ళ సమస్యేంటో వచ్చే భాగంలో చూద్దాం.
Like Reply
#3
Nice update
Like Reply
#4
Nice బాగుంది మిత్రమా
Like Reply
#5
కథ ప్రారంభం చాల బాగుంది, 

దయ చేసి కొనసాగించండి
Like Reply
#6
Katha baaga modalu pettaru
Like Reply
#7
Well come new story
Like Reply
#8
స్పందనకి ధన్యవాదాలు.

రెండో భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
#9
మురళి, సుజాత భార్యాభర్తలు.

పెళ్ళయి ఆరేళ్లయింది, మూడేళ్ళ పాప.

సుజాత తెలివిగలది, మురళి మామూలువాడు. కానీ తెలిసిన కుటుంబమని, కుర్రాడు బుద్దిమంతుడని, కట్నం ఇచ్చే పని లేదని సుజాత తల్లిదండ్రులు సుజాతని మురళికిచ్చి చేసారు.

తన కన్నా సుజాత స్థాయి ఎక్కువని మురళికి తెలుసు. ఏదో అలా జరిగింది కానీ లేకపోతే తన కన్నా మంచి సంబంధం సుజాతకి వచ్చుండేదని, సుజాత జీవితం చాలా బాగుండేదని అనుకుంటూ ఉంటాడు.

అనుకోవడమే కాకుండా అప్పుడప్పుడు సుజాతతో కూడా ఈ మాట అంటూ ఉంటాడు. ఈ మాట అన్నప్పుడల్లా సుజాతకి కోపంగా, బాధగా ఉండేది.

తను సంతోషంగా ఉన్నానని, తనకి ఏ లోటూ లేదని, భర్త, బిడ్డే తన లోకం అని, తనకది చాలని మురళితో అంటూ ఉండేది.

అలానే మురళి ఏది చేస్తానన్నా అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తూ, అతని నిర్ణయాల పట్ల తనకి నమ్మకం ఉన్నట్టుగా చెప్తూ, అతను చేసే పనుల వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే తను పట్టించుకుంటూ, అతనికి నైతిక బలాన్నిస్తూ ఉండేది.

వీళ్ళ జీవితం ఇలా ఉన్నంతలో సాఫీగా సాగిపోయింది కొన్నేళ్లు.

మురళి ఒక పైపుల డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. పనితనం కన్నా కష్టంతో, నిజాయితీతో ఉద్యోగం చేసేవాడు. ఆ వచ్చే జీతం సరిపోతూ ఉండేది, మిగిలేది సుజాత జాగ్రత్త చేస్తూ ఉండేది.

అలా నాలుగేళ్ళలో పోగయిన డబ్బులతో ఊరి చివర ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తుంటే, తెలిసినవాళ్ళతో పాటు వీళ్ళు కూడా కొన్ని గజాలు కొనుక్కున్నారు. వీళ్ళు కొన్న మూడు లక్షల విలువైన స్ధలం పది లక్షలయింది. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉండేవాళ్ళు.

మురళి, శీను ఇద్దరూ మంచి స్నేహితులు. మురళి లానే చిన్న ఉద్యోగి. శీను సుజాతకి దూరపు చుట్టం, అన్నయ్య వరస కూడా. అందుకే ఆ ఇంట్లో సొంతమనిషి లాగా ఉంటాడు, ఒక్కొక్కసారి వీళ్ల ఇంట్లోనే పడుకుంటాడు.

ఒకసారి ఈ మగాళ్ళిద్దరికీ తెలిసిన ఒక కార్డ్ బోర్డ్ యూనిట్ ఒకటి అమ్మకానికి ఉన్నట్టుగా తెలిసింది. ఇద్దరికీ సొంతంగా ఒక వ్యాపారం ఉంటే బాగుండు అని ఉండటంతో, ఆ యూనిట్ చూడటం, ఆ పని చెయ్యగలం అనిపించడంతో, ఆ యూనిట్ కొనాలని అనుకున్నారు.

తన మీద తనకి ఉన్న నమ్మకం కనా సుజాత మీద ఎక్కువ నమ్మకమున్న మురళి, పెద్ద పనులు ఏవైనా సుజాతని అడుగుతూ ఉంటాడు మురళి.

ఇంటికొచ్చి చాలా ఉత్సాహపడిపోతూ విషయం చెప్పాడు.

భర్తని అంత ఆనందంగా ఎప్పుడూ చూడని సుజాత ఆశ్చర్యపోయింది.

"కల లాగా ఉంది సుజాతా. చెయ్యాలనుంది. ఇంతకన్నా మన జీవితం మారే అవకాశం రాదనిపిస్తోంది. అన్నిటి కన్నా నన్ను చేసుకున్నందుకు నీకు ఇన్నాళ్లకి న్యాయం చేస్తున్నాను అనిపిస్తోంది" అన్నాడు.

"ఆ ఒక్క మాట అనద్దు. నాకు ఆ మాట నచ్చదని మీకు తెలుసు, అనకండి. నాకు మీరూ ఎప్పుడూ గొప్పే. ఇది మన అందరి కోసం, మన బిడ్ద కోసం చేద్దాం అనండి" అంది.

"ఔను సుజాతా, మన బిడ్ద మన లాగా కాకుండా గొప్పగా ఔతుంది"

తలూపింది.

"కానీ ఇంత పెద్ద పని చెయ్యగలం అంటావా. తొందరపడుతున్నానా, నా వల్ల ఔతుందంటావా"

మురళి అడుగు ముందుకు వేస్తూ, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడని తెలుసు సుజాతకి. అందుకే ప్రోత్సహిస్తూ ఉంటుంది.

"మీరు కష్టపడే మనిషి, తప్పకుండా చెయ్యగలరు. మీరూ, శీనే కాదు, నేను కూడా నా వంతు పని చేస్తాను. మీకు వచ్చిన ఆలోచన చాలా బాగుంది, అడుగు ముందుకు వెయ్యండి"

సుజాత ఇచ్చిన ప్రోత్సాహంతో ఉరకలేసే ఉత్సాహంతో తనని తను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వబోతున్నాను అనుకుంటూ బయటికెళ్లాడు మురళి.

మురళి, శీను ఇద్దరూ వెళ్ళి ఓనర్ని కలిసారు. పని ఎక్కువ అవ్వడంతో, వయసు పెరగడంతో, విశ్రాంతి తీసుకుకోవాలని అనుకుంటున్నానని, మంచివాళ్లయితే నలభై లక్షల యూనిట్ ముప్పై లక్షలకే ఇస్తానని, తనకి వేరే చోట డబ్బు సర్దాల్సి ఉందని, అందుకని యూనిట్ చూసుకుని, నచ్చితే ముందు పదిహేను లక్షలు అడ్వాన్స్ ఇమ్మని, యూనిట్ రెడీగా ఉందని, పనివాళ్ళు ఉన్నారని, వెంటనే పని మొదలుపెట్టచ్చని, ఆర్డర్స్ కూడా ఉంటాయని, మిగతా డబ్బులు బిజినెస్ లాభాల నించి ఇవ్వచ్చని, రెండేళ్ళలో మొత్తం తీర్చేయ్యచ్చని అన్నాడు ఓనర్.

జీవితంలో గొప్ప అవకాశం లభించినట్టుగా ఆనందించారు మురళి, శీను.

విషయం తెలిసిన సుజాతకి కూడా సంతోషమేసింది. ఒక చిరుద్యోగి అయిన భర్త ఒక చిన్న వ్యాపారస్తుడు ఔతున్నాడని బాగా సంతోషించింది.

తమ దగ్గరున్న డబ్బులు, బంధువుల దగ్గర చేబదులుగా తీసుకున్న డబ్బులు, మురళికి ఉన్న పొలం తాకట్టు పెట్టి పదిహేను లక్షలు యూనిట్ యజమానికి ఇచ్చేయడం, అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది.

తమ జీవితం బాగుపడబోతోంది, ఆర్ధికంగా ఎదగబోతున్నాము అని సుజాత అనుకుంటూ ఆనందిస్తున్న తరుణంలో, ఒక రాత్రి మురళి ఇంటికి తాగొచ్చాడు.

మందు అలవాటు లేని మురళి అలా తాగి రావడంతో ఆశ్చర్యపోయి ఏమైందని అడిగిన సుజాతకి, ముద్దముద్దగా మురళి చెప్పిన విషయం అర్ధం కాలేదు. శీనుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్.

ఏమైందో అర్ధంకాక అలా మెలకువగా ఉన్న సుజాతకి ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు, మెలకువ వచ్చి లేచి చూసే సరికి ఎదురుగా తననే చూస్తూ ముఖంలో గొప్ప దిగులుతో, కళ్ళల్లో నీళ్ళతో మురళి.
Like Reply
#10
Nice beautiful update  clps

పాఠక మిత్రులకు, రచయితలకు, అడ్మిన్ గారికి శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  banana

thanks
Like Reply
#11
Nice start
Like Reply
#12
Nice update
Like Reply
#13
Nice super
Like Reply
#14
GOOD UPDATE
Like Reply
#15
Nice start All Best for your new story
Like Reply
#16
మొత్తానికి ఏమి జరిగింది ఆనందం తో మందు తాగడా డబ్బులు ఏమి అయిన మిస్ అయిందా లేక ఓనర్ సుజాతని అడిగాడా 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#17
(23-03-2023, 02:55 PM)stories1968 Wrote: మొత్తానికి ఏమి జరిగింది ఆనందం తో మందు తాగడా డబ్బులు ఏమి అయిన మిస్ అయిందా లేక ఓనర్ సుజాతని అడిగాడా 

మామూలూ కధే ఇది, కానీ మరీ అంత మామూలూ కాదు. తినబోతూ రుచెందుకు అడగడం.
Like Reply
#18
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
#19
తన ఎదురుగా కూర్చుని తన వైపే దిగులుగా చూస్తున్న మొగుడి దగ్గరికి వెళ్ళి పట్టుకుని అడిగింది.

"ఏమైంది చెప్పండి"

"మోసపోయాం సుజాతా"

"మోసమేంటి. అసలు విషయం చెప్పండి నాకు"

"మనం కొన్న యూనిట్ మీద అప్పు ఉందిట. ఆ అప్పు తీర్చకుండా అది మన సొంతం కాదుట"

"అప్పుందా. అప్పుంటే మనకి ఎలా అమ్మారు"

"అప్పుందని మనకి తెలీదు, పక్క యూనిట్ల వాళ్ళకి తెలీదుట"

"అప్పుందని ఎవరికీ తెలీదా"

"బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పు కాదుట. ఇది ప్రైవేట్ బాకీట"

"అంటే"

"అప్పు తీర్చకుండా మనం సొంతం చేసుకుంటే మనల్ని ఏమైనా చేసేలాంటి వాళ్ళు"

"ఇంకా ఎంత ఇస్తే మనదౌతుంది"

"ఇంకో ఇరవై లక్షలు"

"ఇరవై లక్షలా, మన దగ్గర లేవు కదా. బిజినెస్ వద్దూ ఎమీ వద్దూ, చేసుకున్న అగ్రిమెంట్ చింపేసి, మనం ఇచ్చిన అడ్వాన్స్ తీసేసుకుందాం"

"ఆ డబ్బులు యూనిట్ ఓనర్ వేరే అప్పులుంటే తీర్చేసాడట. ఇరవై లక్షలిస్తే యూనిట్ మన పేర రాసి డాక్యుమెంట్స్ ఇస్తానన్నాడు"

"మన డబ్బులతో తన అప్పులు ఎలా తీర్చుకున్నాడు. మనం వెనక్కి డబ్బులు అడిగితే అప్పుడి వెనక్కి ఇవ్వాలి కదా"

"మనం తీసుకుంటాం అని అంత గట్టిగా అన్నాం కదా"

"అయితే మనం ఇప్పుడేం చెయ్యాలి"

"మిగిలిన డబ్బులు ఇస్తే యూనిట్ మనదౌతుంది, లేదా డబ్బులు వదులుకోవాలి"

"మిగిలిన డబ్బులు అప్పుడే వద్దు, జరిగే బిజినెస్ నించి ఇవ్వమని చెప్పాడు అన్నారు కదా మీరు"

"మనతో ఈ మాట అన్నాడు, కానీ అప్పటికే హక్కులు వేరే వాళ్ల దగ్గర ఉన్నాయిట. వాళ్ళు మొత్తం ఇచ్చేదాకా పని మొదలుపెట్టేది లేదు అన్నారు"

"అలా ఎలా. పని మొదలుపెట్టి, ఆర్డర్స్ వస్తూ ఉంటే, సప్లై చేస్తూ ఉండి, ఆ డబ్బుల నించి అప్పు తీర్చేస్తాం, రెండేళ్ళలో తీరుస్తాం కదా"

"ఓనర్ అలానే అన్నాడు. కానీ హక్కులు ఉన్న వాళ్ళు అలా అనట్లేదు, దానికి ఒప్పుకోలేదు. ఇరవై లక్షలు ఒకేసారి ఇమ్మంటున్నారు. మొత్తం ఇస్తేనే తెరిచేది అన్నారు"

"యూనిట్ మూసేస్తే వాళ్లకీ నష్టమే కదా"

"వాళ్ళు వేరేవాళ్లకి అమ్ముకుంటారు, వాళ్లకి నష్టం లేదు"

"వేరేవాళ్లకి ఎలా అమ్ముతారు, మనం అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ చేసుకున్నాం కదా"

"మనం అగ్రిమెంట్ చేసుకున్నది యూనిట్ ఓనర్తో, కానీ హక్కులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి"

"అలా ఎలా చేస్తారు"

"మనం ముప్పై లక్షలు ఒకేసారి ఇచ్చుంటే మనకే ఇచ్చుండేవాడుట. మనం పదిహేను లక్షలు ఇచ్చే లోపు ఓనర్ తను అప్పున్న వాళ్ళకి హక్కులు ఇచ్చేసాడట. వాళ్ళు ఓనర్ లాగా రెండేళ్ళ గడువు ఇవ్వకుండా డబ్బులు ఒకేసారి ఇవ్వమంటున్నారు"

"మన దగ్గర లేవు, మనం ఇవ్వలేము, ఇప్పుడేంటి"

"వాళ్ళు వేరే బేరం వస్తే అమ్ముకుంటారు"

"మరి మన డబ్బులు"

"ఆ ఓనర్ ఎప్పుడిస్తాడో తెలీదు, అసలు ఇస్తాడో లేదో కూడా తెలీదు"

"అయితే ఎవరైనా లాయర్ని కలుద్దాం"

"నిన్న కలిసాం"

"ఏమన్నారు"

"ఇవన్నీ మామూలని, ఇలాంటివి కోర్టు దాకా వెళ్లకుండా చూసుకోవాలని, ముందే విచారించుకుని అడ్వాన్స్ ఇవ్వాల్సిందని, డబ్బులుంటే మిగతావి ఇచ్చేసి యూనిట్ సొంతం చేసుకోమని, లేదా బతిమిలాడి ఎంతో కొంత వెనక్కి తీసుకోమని అన్నారు"

"అయితే బతిమిలాడి వెనక్కి తీసుకుందాం, కొంత పోతే పోయింది"

"అతనికి చాలా అప్పులు ఉన్నాయిట. వడ్దీలు కట్టలేకే, అప్పులన్నీ తీర్చడానికి నలభై లక్షల యూనిట్ ముప్పై లక్షలకి అమ్ముతున్నాడుట"

"శీనూ ఎక్కడ"

"లాయర్ మనల్నే తేల్చుకోమన్న తర్వాత వాడు ఎటో వెళ్ళాడు. వాడికి కూడా ఏం చెయ్యాలో తెలియలేదు"

మొగుడు చెప్తున్న ఒక్కొక్క మాటా వింటున్న సుజాతకి తల పగిలిపోతుందన్నట్టుగా అనిపించసాగింది.

"మనం మోసపోయాం సుజాతా, ఇరుక్కుపోయాం"

ఆ మాటతో ఒక్కసారిగా "ఇవన్నీ తెలీదా మీకు, ఏమీ కనుక్కోకుండా ఇంత పెద్ద పని చేస్తారా. అయినా మనకెందుకు ఇంత పెద్దవి, మన స్థాయికి తగ్గవి చూసుకోవాలి. నేను వచ్చుంటే ఇలా జరిగేది కాదు, అగ్రిమెంట్ మొత్తం చదివి డబ్బులు ఇచ్చుండేదాన్ని" అంటూ మొదటిసారిగా పట్టలేని కోపంతో అరిచింది సుజాత.

సుజాత ఏ మాట అనకుండా ఉంటే చాలు అనుకుంటూ ఉండేవాడో, ఆ మాట అనేసరికి, ఎన్నో ఏళ్ళుగా తనని చేసుకున్నందుకు సుజాతకి బాధగా ఉండి ఉంటుంది అన్న ఆలోచన నిజమైనట్టుగా, తన స్ధాయి ఇది అని సుజాత అన్నట్టు అనిపించి, ఒక్కసారిగా ఏడ్చేసాడు మురళి.

విషయం అర్ధమైంది సుజాతకి.

వెంటనే మురళిని హత్తుకుని... "ఏదో పరిష్కారం ఉంటుంది దీనికి, అదేంటో ఆలోచిద్దాం. ఈ జన్మకి ఒకరికొకరం మనం. ఏదున్నా, లేకపోయినా ఇద్దరికీ. సుఖమైనా, కష్టమైనా, ఇద్దరిదీ" అని చెప్పింది.

అలానే కాసేపు ఉండిపోయారు ఇద్దరూ.
Like Reply
#20
అప్డేట్ చాల ఎమోషనల్ గా ఇచ్చారు earthman గారు, 

చాల బాగుంది మీ కథ,  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)