Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
#41
Nice good update  thanks
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(03-06-2023, 01:03 PM)Uday Wrote: ఇలాగే జరుగుతోంది. ఒకే స్థలాన్ని ఇద్దరికంటే ఎక్కువమంది అమ్మేయడం, ఇందులో తమాషా ఏంటంటే అందరి పేరున రిజిష్టర్ కూడ చేయడం. తల తాకట్టు పెట్టి మొత్తం అంతా కట్టేక రేటు పెంచేయడం లేకపోతే ఇంకోడు వచ్చి ఎది నాది అనడం...కలియుగం నిజంగానే అంతానికి దగ్గరైనట్లుంది. 

కథ బావుంది, వర్తమానానికి తగినట్లు. మనది కథ కదా, కాస్త మసాలా కూడా జోడిస్తే బావుంటుందేమో ఆలోచించండి.

ముందుభాగాల్లో కాస్త ఉంటుంది మసాలా. ఆ మసాలా గురించే నిజానికి కథ.

కాకపోతే నేను కథకి ముందు చెప్పినట్టు, ఇదొక సైకలాజికల్ కథ, మాటలు ఎక్కువ ఉంటాయి. ఆ మాటలు, ఆ పార్ట్ బాగుండాలంటే పునాది బాగా పడాలి, ఇప్పటిదాకా రాసిందంతా ఆ పునాదే.
[+] 2 users Like earthman's post
Like Reply
#43
తదుపరి భాగం ఇస్తున్నాను, కథని ఇక ముందుకి తీసుకెళ్తాను.
[+] 1 user Likes earthman's post
Like Reply
#44
ఈ సమస్య నించి ఎలా బయటపడాలా, ఒకవేళ డబ్బులు వెనక్కి రాకపోతే, మురళికి ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ తలపట్టుకుని కూర్చున్న శీను, సిగరెట్ తాగుదామని పక్కనున్న ఒక షాప్ దగ్గరికి వెళ్లాడు.

సిగరెట్ ఒకటి కొని ముట్టిస్తుండగా... "లైటర్ ఉందా" అని ఎవరో షాప్ అతన్ని అడగడం వినిపించింది.

అడిగిన అతను లైటర్ కొని పక్కనే ఆగున్న కార్ దగ్గరికి వెళ్ళి లైటర్ లోపల ఎవరికో ఇచ్చి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి ఇంకేవో కొనసాగాడు.

కార్లో వ్యక్తి కూడా సిగరెట్ ముట్టించి, విండో కిందికి దింపి పొగ బయటకి ఊదసాగాడు.

ఆ పెద్ద కార్ వంక చూస్తూ, ఏవడి అదృష్టం వాడిది అని మనసులో అనుకుని, ఇంకో సిగరెట్ కొందామని షాప్ మెట్లెక్కుతున్న శీను భుజం మీద చెయ్యి పడటంతో వెనక్కి తిరిగాడు.

అప్పటిదాకా ఆ పెద్ద కార్లో ఉండి సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి భుజం మీద చెయ్యేడంతో, అర్థం కాక, ఏం కావాలి అన్నట్టు చూసాడు శీను.

"అయితే నన్ను గుర్తుపట్టలేదు"

"మీరు, ఏమో, నేను మీకు తెలుసా"

"రాజాపేట హైకాలేజ్, నైన్త్ క్లాస్, మమత, ఇవి గుర్తున్నాయా"

"మీరు"

"నా పుట్టినరోజు, వాగులో ఈత, నేను లోతు తెలీక దిగితే, నన్ను పట్టుకుని పైకి లాగావు"

"మధుకర్"

"నేనే శీను, మధుకర్"

"అస్సలు గుర్తుపట్టలేదు, నువ్వు ఊరు నించి వెళ్ళిపోయాక ఒక్కసారి కూడా కలిసినట్టులేము కదా"

"లేదు కలవలేదు, ఇరవైరెండేళ్ళయింది మనం కలిసి"

"అవును మళ్ళీ ఎప్పుడూ నిన్ను చూడలేదు, చాలా మారిపోయావు, అస్సలు గుర్తుపట్టలేదు, ఎవరో అనుకున్నాను"

"నువ్వు మాత్రం అలాగే ఉన్నావు, అందుకే గుర్తుపట్టాను, సంతోషం. నువ్వు ఫ్రీ అంటే చెప్పు, రాత్రంతా మాట్లాడుకుందాం"

"పెద్ద పనుంది మధు, ఆ పని చూసుకుని కలుస్తాను, నీ నంబర్ ఇవ్వు, ఫోన్ చేస్తాను"

"నువ్వే నీ నంబర్ ఇవ్వు, నా పనులు అవ్వగానే నేను ఫోన్ చేస్తాను. నిజంగా నీతో మాట్లాడాలనుంది, నీతో మాట్లాడాకే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేది"

"ఏ ఊర్లో మధు మీరుండేది"

"న్యూ యార్క్"

"అంటే"

"అమెరికా"

"అమెరికాలో ఉంటావా, అబ్బో"

ఇంతలో వెనక నించి షాపులో వస్తువులు కొన్న డ్రైవర్... "అన్నీ కొన్నాను సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడమే" అన్నాడు.

"సరే శీను నాకు పనుంది, నీ నంబర్ ఇవ్వు" అని శీను నంబర్ తీసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి కార్లో వెళ్ళిపోయాడు మధు.

కార్ వెళ్ళిన వైపే చూస్తూ, మధు వల్ల లాభం ఏదైనా కలుగుతుందా అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు శీను.

ఇంటికెళ్లాక చూస్తే మురళి నిద్రపోతున్నాడు, బయట కుర్చీలో ఏడ్చిన మొహంతో సుజాత.

వెళ్ళి సుజాత భుజం మీద చెయ్యేసి... "నువ్వేమీ బాధపడకు, ఏం కాదు" అన్నాడు శీను.

"డబ్బులు పోతే పోయాయి, ఆయనకి ఏం కాకుండా చూడు. మనిషి మనిషిలా లేడు. నాకు భయంగా ఉంది"

"నీకే భయం వద్దు. మురళికి ఏం కాదు, మనకి సాయం కూడా దొరకచ్చు అసలు" అంటూ మధు గురించి ఆలోచించసాగాడు శీను.

ఇంతలో ఫోన్ మోగింది.
Like Reply
#45
బావుంది, మధు ఎలా ఆదుకుంటాడో చూడాలి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#46
అప్డేట్ బాగుంది
Like Reply
#47
Super update
Like Reply
#48
Nice update
Like Reply
#49
Superb update bro waiting for next update
Like Reply
#50
Good update
Like Reply
#51
Small update
Like Reply
#52
తరువాతి భాగం ఇస్తున్నాను, కథ ఇంకొంచెం ముందుకి కదిలింది.
[+] 2 users Like earthman's post
Like Reply
#53
ఫోన్ తీసుకుని బయటకి వెళ్ళాడు శీను.

శీను వెనకే తలుపుదాకా వెళ్ళింది సుజాత.

"ఇది మీకు ఏమన్నా న్యాయంగా ఉందా, అన్ని లక్షలు మేము ఎక్కడ నించి తీసుకురాగలం. మా డబ్బులు ఇచ్చి మేము ఇరుక్కుపోయాము. మీకు మాకు ఏమన్నా సంబంధం ఉందా, మమ్మల్ని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంది మేము కాదు కదా"... శీను అంటూ పోతున్నాడు.

విషయం అర్ధమైంది సుజాతకి. బాధగా వెనక్కి తిరిగింది. ఎప్పుడొచ్చాడో తెలీదు శీను అంటున్న మాటలన్నీ సుజాత పక్కనే ఉండి విన్నాడు మురళి.

వెనక్కొచ్చి తలపట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. భుజం మీద చెయ్యేసి పక్కనే కూర్చుంది సుజాత.

లోపలికొచ్చాడు శీను.

"ఏమంటున్నారు"... అడిగింది సుజాత.

"డబ్బుల గురించే మనం ఏమని ఆలోచించుకున్నామో అడుగుతున్నారు, మనం తొందరగా చెప్పకపోతే వాళ్ళు యూనిట్ వేరేవాళ్ళకి అమ్మేస్తారుట"... ఉన్నమాట చెప్పేసాడు శీను.

"ఆ ఓనర్ని కలిసి నేను మాట్లాడతాను, మీరు డబ్బులిచ్చింది ఆయనకే కదా, నేను మాట్లాడతాను" లేస్తూ అంది సుజాత.

"వద్దు సుజాత" గట్టిగా అన్నాడు మురళి.

మురళి వైపు చూసింది సుజాత.

"ఇది నేను చేసిన వెధవపని, తప్పు చేసింది నేను, బ్రతిమిలాడినా, కాళ్లమీద పడ్డా నేనే చేస్తాను, నువ్వు వద్దు"

"ఇంట్లో ఆడవాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే ఆయన డబ్బులు తిరిగిస్తాడేమో అని"

"వద్దు, మగాడు చేసిన తప్పుకి ఆడది తప్పు చేసినట్టు మాట్లాడడం వద్దు, నువ్వు కలవద్దు" గట్టిగా అన్నాడు మురళి.

మళ్ళీ ఫోన్ మోగింది.

"ఆఫీస్ నించి" అంటూ మళ్ళీ బయటకి నడిచాడు శీను.

పది నిమిషాలు గడిచాయి.

లోపలికొచ్చాడు శీను.

"ఏంటి శీను" అంది సుజాత.

తల అడ్డంగా ఊపుతూ, చెప్పకుండా అలానే ఉన్నాడు శీను.

"చెప్పు శీనూ, ఏమన్నారు" అడిగాడు మురళి.

"మనం ఉద్యోగాలు చేస్తున్నామా, మానేస్తామా అని అడిగారు. మానేస్తున్నాం అంటే కొత్తవాళ్లని పెట్టుకుంటారుట" చెప్పాడు శీను.

మౌనంగా అయిపోయాడు మురళి. పరిస్థితి దిగజారుతూ జీవితం పైకి రాలేని లోతుల్లోకి వెళ్తున్నట్టు అనిపించసాగింది. ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు.

వెనకే వెళ్ళబోయింది సుజాత.

"నాకు అన్నం పెట్టు సుజాత, ఆఫీస్ వాళ్ళని కలిసి, మా ఉద్యోగాల గురించి మాట్లాడతాను. ఒకళ్ళు అప్పిచ్చే అవకాశం ఉంది. అన్నం పెట్టు, చాలా పనులున్నాయి" అన్నాడు శీను.

"ఏమీ వండలేదు, వెంటనే చేస్తాను"... అంటూ వంటింట్లోకి వెళ్ళి వంట మొదలుపెట్టింది సుజాత.

మురళి దగ్గరికెళ్ళాడు శీను.

"ఆఫీస్ సంగతి నేను వెళ్ళి మాట్లాడతాను. నిన్న మా చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు కనిపించాడు, డబ్బున్నవాడు, అతనిని అడిగి చూస్తాను. అన్నం తిని రెడీగా ఉంటాను, అతను ఫోన్ చేస్తే వెళ్ళి కలిసి విషయం చెప్పి డబ్బులు అడుగుతాను, నువ్వేం కంగారుపడకు, నువ్వు కూడా కాస్త తిను" మురళితో అని బయటకి వచ్చాడు శీను.

ఏం మాట్లాడకుండా ఆలోచనల్లో పడిపోయాడు మురళి.

ఆఫీస్ వాళ్లని కలిసి, డబ్బులు ఇరుక్కుపోయాయని, రెండు మూడు రోజులు టైం కావలని వాళ్ళని బ్రతిమిలాడుకుని ఇంటికొచ్చాడు శీను.

"ఏమన్నారు" అడిగింది సుజాత.

"నాలుగురోజులు టైం ఇచ్చారు, ఈ నాలుగురోజులు ఒక ఆలోచన తప్పింది" అని కుర్చీలో కూర్చున్నాడు శీను.

శీను చెప్పింది విన్నాడు మురళి. బుర్రంతా పిచ్చిగా అనిపించసాగింది మురళికి. తను చేసిన తప్పుకి అందరూ బాధపడుతూ ఉండటం, అందరినీ ఆనందానికి దూరం చేసినట్టుగా అనుకోసాగాడు.

అన్నం తిని మధు చేసే ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు శీను.

ఫోన్ మోగింది.
Like Reply
#54
Nice update
Like Reply
#55
Good update
Like Reply
#56
Nice update
Like Reply
#57
Good update
Like Reply
#58
అప్డేట్ బావుంది earthman గారు ...కొనసాగించండి.      
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#59
తరువాతి భాగం ఇస్తున్నాను. కథ ముందుకి పోతోంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#60
వెంటనే ఫోన్ ఎత్తాడు శీను.

అవతల నించి మధు.

మధు గొంతు వెంటనే గుర్తుపట్టలేదు కానీ ఫోన్ చేసింది మధేనని తెలియడంతో శీను మొహం వెలిగిపోయింది.

"హల్లో శీనేనా"

"అవును మధు, నేనే"

"ఎక్కడున్నావు శీను"

"మూసా పేట"

"అమీర్ పేట వైట్ పాండా బార్ తెలుసా"

"తెలుసు మధు, చాలా పెద్ద బార్"

"ఈ బార్ లోనే ఉన్నాను నేను. మా ఫ్రెండ్ ఒక అతనిని కలిసి అక్కడే ఉన్నాను. నువ్వు వెంటనే వచ్చెయ్"

"ఈ బార్ లోకి నా లాంటి వెళ్లరు మధు, నన్ను రానిస్తారో లేదో తెలీదు."

"ఏం ఇబ్బంది లేదు, నువ్వు వస్తున్నట్టు చెప్తాను. నీ పేరు చెప్పు, ప్రైవేట్ రూం పార్టీ అని చెప్పు, లోపలికి తీసుకొస్తారు"

సరేనంటూ ఫోన్ పెట్టేసాడు శీను.

మురళి నిద్రపోతున్నాడు.

బట్టలు మడతపెడుతూ బయట గదిలోకి వచ్చింది సుజాత.

"ఎవరూ శీనూ ఫోన్"

"మా చిన్నప్పటి క్లాస్ మేట్, బాగా డబ్బులున్నవాడు. చాలా ఏళ్ళ తరువాత నిన్న కనిపించాడు, నన్ను కలిసి మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు కలుస్తున్నాను. అవకాశం ఉంటే అతనిని అప్పు అడుగుతాను"

"చాలా ఏళ్ళ తర్వాత కనిపించాడు అంటున్నావు. డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది. ఇస్తాడంటావా"

మురళి పడుకున్న గది వైపు చూసాడు శీను.

"నిద్రపోతున్నాడు" అన్నట్టు కళ్ళు మూసి తల వంచింది సుజాత.

"ఏన్నో ఏళ్ళ తర్వాత కలుస్తున్నది నిజమే. అతని గురించి ఏమీ తెలియదు అనేది కూడా నిజమే. కానీ నిన్న చాలా బాగా మాట్లాడాడు. అమెరికాలో ఉంటాడుట, అంటే బాగా డబ్బులు ఉంటాయి కదా. మన సంగతి చెప్తాను. మన కష్టం చెప్తాను. ఏదన్నా సాయం చేస్తాడనే అనిపిస్తోంది. అనుకోకుండా ఎలా ఇరుక్కున్నామో, అలా అనుకోకుండా మా ఫ్రెండ్ కనిపించినట్టుగా ఉంది. చూద్దాం"

'మీ ఫ్రెండ్ పేరు"

"మధుకర్. హైకాలేజ్ క్లాస్ మేట్స్ మేము. మా సీనియర్ ఒకమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి గురించి చాలా మాట్లాడుకునేవాళ్ళం. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో. చిన్నప్పుడు అతని పుట్టినరోజున లోతు తెలియకుండా నీళ్ళల్లోకి దిగితే నేనే పైకి లేపాను. నిన్న తనే గుర్తుచేసాడు ఈ విషయం"

"మరి ఎప్పుడూ చెప్పలేదే ఈయన గురించి"

"నైన్త్ క్లాస్ తరువాత వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలీదు. ఏదో ఆస్తి గొడవ ఉంది అని ఎవరో అన్నారు. ఇంకేమీ తెలియలేదు అప్పుడు. మళ్ళీ నిన్నే చూడటం"

తల ఊపింది సుజాత.

"ఒక వెయ్యి ఉంటే ఇవ్వు. మరీ డబ్బులు లేకుండా వెళ్తే బాగోదు. బిల్ నాలుగైదు వేలు అవుతుంది, మధునే ఇస్తాడు. కనీసం నేనొక వెయ్యితో వచ్చాను అంటే బాగుంటుంది"

"ఎక్కువ లేవు శీనూ, అవసరం లేకుండా ఖర్చుపెట్టకు"

"తెలుసు, ఇప్పుడు మనకి వంద కూడా ఎక్కువ కిందే లెక్క"

"నిజంగా ఆయన సాయం చేస్తే, ఆయన కాళ్ళకి దండం పెడతాను" ...కొన్ని రోజుల తర్వాత మొదటిసారి కొంచెం ఆనందంగా అంది సుజాత.

"నువ్వేంటి, నేను కూడా పెడతాను. కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను, చూద్దాం. సరే వెళ్ళొస్తాను. మురళి లేస్తే విషయం చెప్పు" ...అంటూ బయటకి వెళ్ళాడు శీను.

ఆయనెవరో తెలీదు, కానీ సాయం చేస్తే మాత్రం ఆయని జీవితంలో మర్చిపోను అని మనసులో అనుకుంది సుజాత. అప్పుడు సుజాతకి తెలీదు, నిజంగానే మధుని జీవితంలో మర్చిపోలేదని.
[+] 15 users Like earthman's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)