Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Love ఊర్మిళ దేవి
#1
ఊర్మిళ దేవి 
-  Abhisaarika
చుట్టూ చిమ్మన చీకటి, అడవి మధ్యలో ఒక కాగడాతో ఎదో వెతుకుతోంది ఒక 19 ఏళ్ళ అమ్మాయి. ఖరీదైన నగలు, పట్టు వస్త్రాలు, పొడుగు జడ, మంచి పసిమి ఛాయా శరీరం ఆ కాగడా వెలుగులో కూడా మెరిసిపోతోంది. అందమైన ఆ కళ్ళలో భయం, పెదవి చిట్లి కారుతున్న రక్తాన్ని కూడా లెక్కచేయకుండా పరిగెడుతోంది. అంతటి నిశ్శబ్దం ఆమె అప్పటివరకు ఎరగలేదు కాబోలు ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. ఎండిన ఆకుల పై నడుస్తున్న ఆమెకు, అవి నలుగుతున్న శబ్దం కూడా భయంకరంగా వినపడుతోంది.  గమ్యం తెలియని పరుగు తీస్తున్న ఆమెకు, ఒక చిన్నయేరు కనిపించింది, ఆ ఏరుకు అటు వైపున్నా ఒక పూరి గుడిసెలో దీపం వెలుగు, ఆమె అప్పటివరకు పడ్తున్న భయాన్ని పోగొట్టి, చిన్న ఆశను కలిగించింది. పరుగు లాంటి నడకతో ఆ వైపుకు వెళ్ళబోతున్న ఆమె తల పై ఎదో పెద్ద దెబ్బ, వెంటనే నేల కూలిపోతు “వా...... సు…. ” అని అరుస్తూ పడిపోయింది.
ఉలిక్కిపడి చటుక్కున మంచంపై నుండి లేచింది ఆకాంక్ష. ఒళ్ళంతా చెమటలు, గొంతు తడారిపోయింది. నుదుటిన, గొంతుకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ నీళ్ల బాటిల్ కోసం చుట్టూ చూసింది.
“ఏంటే ఏమైంది ??” అని బాటిల్ తీసిచ్చింది ఆమె స్నేహితురాలు హారిక.
“ఉం, ” అని మరో మాటకు తావివ్వకుండా గడగడా నీళ్లు తాగి బాత్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆకాంక్ష. వచ్చిన ఆ కల గురించే ఆలోచిస్తూ షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకుంది. చల్లని నీళ్లు తల మీద నుండి పడుతుండగా ఆమె మనసు కొంత తెలీక పడింది.
“ఒసేవ్ త్వరగా రెడీ అవ్వు, ఎదో ఇంటర్వ్యూ ఉందన్నావుగా” అని తలుపు బాదుతూ అరుస్తోంది హారిక.
“హా సరే” అని తల గట్టిగ విదిలించి. స్నానం చేసి తయారయ్యి, ఆటో బుక్ చేసుకుంది ఆకాంక్ష. GPS ట్రాకింగ్ లో చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు ఆటో డ్రైవర్. ఆకాంక్ష ఇంటర్వ్యూ కి కావాల్సిన పేపర్స్ ఏవో సర్దుతోంది. ఒక్కసారిగా GPS అడ్రెస్స్ మారిపోయింది, అప్పటిదాకా చూపించిన లొకేషన్ స్థానంలో మరేదో అడ్రెస్స్ మారిపోవటం గమనించిన డ్రైవర్, “మేడం, అడ్రెస్స్ ఏమైనా చేంజ్ చేసారా ???” అని వెనక్కి తిరక్కుండానే అడిగాడు. “లేదు ఎందుకు” అని అయోమయంగా అడిగింది ఆమె. “ఎంలే మేడం” అని ఆ gps చుపించిన లొకేషనులో ఆపాడు డ్రైవర్.
ఆకాంక్ష దిగింది, అదొక నాలుగంతస్థుల బిల్డింగ్, నిర్మానుష్యంగా విసిరేసినట్టు డెడ్ ఎండ్ లో కట్టారు. మనిషి సంచారం లేదు. బోర్డు మీద “లేపాక్షి ఆర్ట్స్ గాలరీ” అని రాసి ఉంది. ఆమె సంశయిస్తూనే లోపలికి అడుగుపెట్టింది. పెద్ద హాల్, హాలు నిండా పెయింటింగ్స్, పురాతన వస్తువులు అందంగా అమర్చి ఉన్నాయ్. ఒక్కో వస్తువును, పెయింటింగ్స్ ని గమనిస్తోంది ఆకాంక్ష. వెనక నుండి ఒక్కసారిగా “ఎవరు” అన్న పిలుపుకు ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది, ఎదురుగ ఒక 60 ఏళ్ల వృద్ధుడు మాములు దుస్తులలో ఉన్నాడు. “నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను” అని అన్నది రెస్యూమే చేతికి ఇస్తూ.
“అవునా కూర్చో, మా సారుని పిలుస్త” అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆకాంక్ష మళ్ళి చుట్టూ ఉన్న వస్తువులను తీక్షణంగా ఒక్కొక్కటిగా గమనిస్తోంది. ఆమె దృష్టిని ఒక పెయింటింగ్ ఆకర్షించింది. అద్భుతమైన రీతిలో ఒక అందమైన అమ్మాయి లిపి బొమ్మ. ఆమె కళ్ళు, ఎన్నో ఏళ్లుగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా, అలసిపోయి ఉన్నాయి. ఆమె పెదాలపై ఉన్న సన్నని నవ్వు, ఎవరినో చుసిన ఆనందం తాలుకు చిహ్నంగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది ఆ పెయింటింగ్, చుస్తునా కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు, ఆకాంక్షను చూసి నవ్వుతు పలకరించాడు. “సో మీరు ఆకాంక్ష” అని అడిగాడు
“అవును” అన్నట్టు తలూపింది ఆమె
“ఎంబీఏ, చేసి ఎందుకు మీరు ఇంత చిన్న జాబ్ కి అప్లై చేశారు” అని అడిగాడు అతను
“నాకు పని అంటే చిన్నదా ??పెద్దదా?? అనే బేధం లేదు, మనం చేసే పనిని ఎంత సక్రమంగా చేస్తున్నామనేదే కావాలి” అని అన్నది ఆకాంక్ష
“నైస్ ఆన్సర్, బై ద వే అయామ్ సిద్దార్థ్ వర్మ, ఈ గేలరీ నాదే, కూర్చోండి” అని అన్నాడు అతను
ఆమె ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి వంకే చూస్తూ కూర్చుంది
“మీకా పెయింటింగ్ బాగా నచ్చినట్టుంది” అని అడిగాడు సిద్దార్థ్
“చాలా నచ్చింది, infact, చాలా అందంగా ఉంది” అని అంది ఆమె
“అది 1890 నాటి పెయింటింగ్, ఇప్పటి ఖమ్మం జిల్లాలోని తీర్థాల అనే ఉరి జమీందారు కూతురు “ఊర్మిళ దేవి” గారి పెయింటింగ్” అని అన్నాడు.
ఆకాంక్ష ఏమి మాట్లాడలేదు. కళ్లప్పగించి చూస్తూనే ఉంది.
“ఆకాంక్ష గారు, మీరు సెలెక్ట్ అయ్యారు, రేపటినుండి మీరు జాయిన్ అవొచ్చు. ???” అని అడిగాడు
ఆకాంక్ష ఎదో ఆలోచిస్తున్నదల్లా ఈ లోకానికి వచ్చి “థాంక్స్” అని చెప్పి అక్కడి నుండి తిరిగి హాస్టల్ కి వచ్చింది.
ఎదో ఆలోచిస్తూ కూర్చున్న ఆకాంక్షను తడుతూ “ఏమైంది ?? ఆలా ఉన్నావ్?” అని అడిగింది హారిక
“ఏమి లేదు” అని అంటూ దిండును చేతిలోకి తీస్కొని కళ్ళు మూసుకుంది.
“ఇంటర్వ్యూ ఏమైంది ???” అని అడిగింది హారిక
“రేపటి నుండి జాయిన్ అవమన్నారు” అని అన్నది ఆమె కళ్ళు తెరవకుండానే
“ఓహ్ కంగ్రాట్స్, ఈ విషయం ఇంత మెల్లిగనా చెప్పేది, నాకు తెల్సు నువ్వు ఈ జాబ్ కొడ్తావని, యూవీ సోలుషన్స్ లో జాబ్ అంటే లైఫ్ సెటిల్ అనుకో” అని ఎదో మాట్లాడబోతున్న హరికను
“వెయిట్ ఏంటి ?? యువీ సోలుషన్స?? అదేంటి లేపాక్షి ఆర్ట్స్ గాలరీ కాదా ???” అని అయోమయంగా అడిగింది ఆకాంక్ష
“లేపాక్షా ???” ఎక్కడికెళ్లావ్ ? నువ్వసలు ??” అని అడిగింది హారిక మరింత అయోమయంగా
“నువ్వు పంపిన అడ్రెస్స్ కె వెళ్ళాను” అని అంది ఆకాంక్ష
“ఆ…. ఏది చూడని” అని ఆకాంక్ష పోనే తీస్కుని మ్యాప్స్ ఓపన్ చేసింది. అందులో అడ్రెస్స్ లేపాక్షి నే ఉంది, అదే అడ్రెస్స్ ఆమె ఫోనులో మాత్రం యూవీ నే చూపిస్తోంది.
“ఇదేంటి ?? నేను పంపిన అడ్రెస్స్ ఇది కాదు.” అని అంటూ బిత్తరపోయిన హరికను వారిస్తూ
“అబ్బా ఏదోకటి లేవే నాక్కావాల్సినది ఉద్యోగం అదెక్కడా వస్తే ఏంటి ?? నాకు నచ్చింది జాబ్ అందుకే ఒప్పేసుకున్న” అని అంది
ఆ మరోసటిరోజు గ్యాలరీ కి వెళ్లిన ఆకాంక్షకు ఆమె చెయ్యవలసిన పనులు పురమాయించాడు సిద్దార్థ్. అందులో భాగంగా కొత్తగా వచ్చిన పెయింటింగ్సుని అందంగా అమర్చడం. పాత వాటిని డిస్ప్లే నుండి తీసెయ్యడం. రోజులు గడుస్తున్నాయి ఆ పెయింటింగ్ ఆకాంక్షతో ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతంగా ఆమె ఆ చిత్ర పటం ముందు నుండి వెళ్ళినప్పుడల్లా ఎదో ఒక విధంగా కదలడంతో లేక ఆమె చుంనికో లేక డ్రెస్సుకో చిక్కడం లాంటివి జరిగేవి. అవి పెద్దగా పట్టించుకోలేదు ఆకాంక్ష
ఒకరోజు ఆమె యధావిధిగా తన పనిని ముగించుకుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. వెంటనే “ఎవరు” అని పిలిచింది …. ఒక్కసారిగా పవర్ పోయి చిమ్మన చీకటిగా మారింది, పైనే పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఆమె ఆఫీసులో ప్యానిక్స్ ఆ వృద్ధుడి పేరు ముసలయ్య వచ్చి కాండిల్ తెచ్చి ఆమె ముందు పెట్టాడు. “గాలికి ఏదైనా కింద పడి ఉంటుంది మేడం” అని అన్నాడు
ఒకసారి వెళ్లి చూస్తాను అని ఆ కొవ్వొత్తి చేతిలో పట్టుకుని ముల్లిగా అడుగులో అడుగు వస్తూ వెళ్తున్న ఆకాంక్ష ఆ చిత్రం ముందుకు వెళ్ళగానే ఎదో ఊదినట్టుగా కొవ్వొత్తి ఆరిపోయింది. గాలికి అయుంటాడని భావించిన ఆమె తిరిగి కొవ్వొత్తిని ముట్టించి, మళ్ళి ఆహ్ చిత్ర పాఠం ముందు నుండి మెట్ట్లెక్కుతుండగా, ఆరిపోయింది. ఈ సారి ఆమెకు భయం వేసింది. తిరిగి వెలిగించి ఆ పటం ముందుకు వెళ్లి నిలబడింది, కొన్ని క్షణాల నిరీక్షణ తర్వాత కూడా కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది. ఆమె గట్టిగ ఊపిరి తీస్కుని అక్కడి నుండి కదలబోతుండగా కొవ్వొత్తి ఆరిపోయింది. ఆమె వెన్నులోంచి భయం ఒళ్ళంతా పాకింది. అస్సలు ఎం జరుగుతోందో అర్ధం చేసుకునే లోపు, పటంలో వెనక్కి తిరిగి నిలబడి ఉన్న ఆ అమ్మాయి ముందుకు తిరిగి ఆకాంక్ష వైపు చూసి నవ్వింది, అప్పుడే ఉరిమిన మెరుపు వెలుగులో స్పష్టంగా కనపడింది. అంతే కెవ్వున కేక పెట్టి కింద పడింది ఆకాంక్ష వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ముసలయ్య ఆమెను లేపుతూ “ఏమైనదమ్మా” అని అడిగాడు కంగారుగా
“ఆ పటంలో..... పటంలో......” అని ఆ పెయింటింగ్ వైపు చూపెట్టింది,
“ఏడ, ఏమైనదమ్మా, ఇక్కడ ఎవ్వరు లేరే” అని అన్నాడు అతను
వణికి పోతున్న ఆకాంక్షను లేపి సోఫా లో కూర్చోపెడుతుండగా పవర్ వచ్చింది. ఎవరో గొడుగు అడ్డం పెట్టినట్టు వర్షం కూడా ఆగిపోయింది. మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు ముసలయ్య. అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు, వణికిపోతున్న ఆకాంక్షను చూసి కంగారుగా “ఏమైంది ??? ఎందుకు ఆలా ఉన్నారు ??” అని అడిగాడు సిద్దార్థ్
ముసలయ్య “కరెంటు లేకుండే సారూ, సీకట్ల ఎదో చూసి భయపడ్డట్టున్నారు” అని అన్నాడు
ఒళ్ళంతా చెమటలతో, భయంతో బిగుసుకుపోయిన ఆకాంక్షను చూస్తున్న సిద్ధార్థ్ కి జాలేసింది.
“చుడండి ఆకాంక్షగారు, ఇక్కడ చాలా పురాతన వస్తువులున్నాయి మే బి మీ సబ్ concious మైండ్ లో ఎదో ఒక మూల ఉన్న ఒక చిన్న పాటి అనుమానం మిమ్మల్ని భయపెట్టి ఉండొచ్చ” ని అన్నాడు తాపీగా
కానీ ఆకాంక్షకు తెలుసు ఆమె చూసింది నిజమని, అది నిజమని నిరూపించే అధరాలు ఆమె వద్ద లేవు, చెప్పిన ఎవరు నమ్మరు. అందుకే తలూపింది. ఆ రోజుకి ఆమెను ఆమె హాస్టల్ వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు సిద్దార్థ్.
ఆ రాత్రి డిన్నర్ చేసాక, ఆలోచనలోపడ్డ ఆకాంక్షను “ఏమైందని” అడిగింది హారిక
“ఏమోనే చెప్తే నువ్వు నమ్ముతావో లేదో” అని అన్నది ముభావంగా
“ నీతో వచ్చిన చిక్కల్లా ఇదేనే, పక్కనోళ్లు ఏమనుకుంటారోనని ముందే నువ్వు ఫిల్ ఐతావ్. చెప్పు తర్వాత సంగతి తర్వాత చుద్దాం” అని అన్నది ఆమె పక్కనే కూర్చుంటూ
సాయంత్రం గాలరీలో జరిగిన విషయమంత పూస గుచ్చినట్టు చెప్పింది.
అంత విన్న హారిక “దొంగమొహందానా నాకు దయ్యాలంటే భయమని ఇప్పుడు ఈ కథ చెప్పి నన్ను రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేద్దామని కదా ని ప్లాన్” అని తిట్టింది దుప్పటి నిండుగా కప్పుకుంటూ
తల బాదుకుంటూ “నేను చెప్పేది ఎవరు నమ్మట్లేదు ఈ సమస్య ఎలా తెలుసుకోవాలో అర్ధం కావటంలేదు” అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంది. వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయింది.
మరుసటిరోజు గ్యాలరీకి వెళ్లిన ఆకాంక్షకు, ఆ రోజు వచ్చిన కొత్త పెయింటింగ్స్ ని ఎక్సిబిషనులో పెట్టి పాతవి పైన సర్దాలి. ఊర్మిళ దేవి పెయింటింగ్ కూడా స్టోర్ రూంలో పెట్టమని అన్నాడు సిద్దార్థ్. భయపడ్తూనే ఆ పెయింటింగుని స్టార్ రూముకి తీసుకెళ్లింది ఆమె. ఎన్నో సార్లు వెలుగు తక్కువగా ఉన్న ఆ స్టోర్ రూముకి వెళ్ళింది కానీ ఏ ఏనాడూ కలగని భయం ఆమెకు ఆ రోజు కలిగింది. బయపడ్తూనే ఊర్మిళ దేవి పెయింటింగ్ పెట్టేసి పరిగెడుతూ బయటకి వచ్చిన ఆమె చూసుకోకుండా అక్కడే నిలబడి ఉన్న సిద్దార్థ్ ని డీ కొట్టి వెనక్కి వాలిపోతున్న ఆకాంక్షను ఒక్కో చేత్తో గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అతని కళ్ళతో ముడిపడిన ఆమె కళ్ళలో, అప్పటివరకు ఉన్న భయం స్థానంలో, ఆశ్చర్యం, సిగ్గు కమ్మేసింది. సిద్ధార్థ్ మెల్లిగా ఆమెను లేపి “ఏమైంది ??? అంత కంగారుగా బయటకి వచ్చారు ??” అని అడిగాడు.
“ఏమిలేదాండీ” అని తడబడుతూ వెళ్ళిపోయింది.
సాయంత్రం పని ముగించుకుని స్టోర్ రూంలో పెయింటింగ్స్ పెట్టడానికి వెళ్లిన ఆకాంక్ష ఊర్మిళ దేవి పెయింటింగ్ కనిపించకపోవడంతో ఆశ్చర్య పోయింది. గది మొత్తం వెతికిన ఎక్కడ కనిపించలేదు. ఆమెకు కంగారు ఎక్కువైంది, వెంటనే కిందకి వచ్చింది మెట్ల పక్కనే ఉన్న గోడ పై నవ్వుతు నిల్చున్న ఆ పెయింటింగ్ ఉంది, అంతే అవాక్కయిన ఆకాంక్ష కిందకి దిగబోతుండగా “ఆగు” అన్న పిలుపుతో ఆగిపోయిన ఆకాంక్ష, వణికిపోతూ పటం వైపు చూసింది. కరెంట్ పోయింది మెరుపులతో కూడిన వాన అందుకుంది.
ఆశ్చర్యంగా ఊర్మిళ దేవి పటంలో ఉన్న కాగడా వెలుగుతోంది. ఆ వెలుగులో కోపంగా కళ్ళు పెద్దవి చేసి, ఆమెనే చుస్తూ “ఎక్కడికి వెళ్తున్నావ్, నన్ను తప్పించుకుపోవడం నీ తరంమనుకున్నావా ??? ఎక్కడో ఎదో కంపెనీలో ఉద్యోగానికి వెళ్లాల్సిన నువ్వు ఈ గ్యాలెరీకి రప్పించింది నేను” అని అరిచింది ఊర్మిళ దేవి
“ఎందుకు??” అని బొంగురుపోయిన గొంతుతో అడిగింది ఆకాంక్ష
“కొన్ని నిజాలను తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి” అని అంది ఆమె శాంతంగా మారుతూ
“అర్ధం కాలేదు, ఏ నిజాలు” అని అడిగింది అయోమయంగా ఆకాంక్ష.
“ముందు నా గురించి తెలుసుకో” అని అన్నది ఆమె
“ని గురించి తెలుసుకున్నాను 1895 లో నువ్వు పెద్ద జమిందార్ అమ్మాయివని, ముచ్చట పడి గీయించుకున్న పటం అయుంటుంది అందుకే నువ్వు ఇంకా ఈ పటంలో ఉన్నావ్” అని అన్నది
“కాదు, ఎంతో ముచ్చట పడి గీయించుకున్న పటం కాదు ఆకాంక్ష, ఇది నా రక్తం తో గీసిన పటం, నేను చనిపోయే కొన్ని ఘడియల ముందు గీసిన పటం” అని అన్నది దుక్ఖన్ని అదుపుచేస్తూ
“చనిపోయే ముందు గిసింద ?? అస్సలేం జరిగింది ??” అని అడిగింది ఆమె కుతూహలంగా
“మాది చాలా పెద్ద జమీన్, మా నాన్న వీర ప్రతాప వర్మ పరువుకు ప్రాణం ఇచ్చే వ్యక్తి. అలంటి వ్యక్తికి పెద్ద కూతురిగా జన్మించాను నేను. అదే నేను చేసినా తప్పు. నాకు 18వ ఏట పెళ్లి చెయ్యాలన్న ఆలోచనతో మా నాన్న నా చిత్రపటాన్ని గీయించారు. అందుకు మా చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న మంచి చిత్రకారులను రప్పించారు. అందులో ఒక యువ చిత్రకారుడి పనితనం మా నాన్నకు నచ్చి అతన్ని నా చిత్రాన్ని గీయడానికి పురమాయించాడు.
అతను రోజు మా ఇంటికి వచ్చి, ఒక రెండు గంటలు నా బొమ్మను గీసేవాడు. మొట్టమొదటిసారి ఒక మగవాడి చూపు తదేకంగా నా ఒంటిని తాకడంతో, నా వయసు ఊహల్లో తేలిపోయేది. అతని కళ్ళతో నా చూపు ముడిపడిన ప్రతిసారి, నా ఒళ్ళు చిన్నపాటి ప్రకంపనకు లోనయ్యేది. ఆలా ఆలా అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను. ఆ విషయం అతనికి తెలిసేలా చేయాలనుకున్నాను. ఇంతలో నా చిత్రం పూర్తయ్యింది. అతనికి వీడుకోలు పలకాల్సిన సమయం ఆసన్నంమైంది. ఆ రోజు నా మనసు పడిన ఆవేదన వర్ణనాతీతం. అతన్ని ఎంతగానో ప్రేమించాను, ఈ ప్రపంచం కన్నా, నా కన్నా కూడా ఎక్కువ అతన్ని ప్రేమించాను. కానీ రక్తం చుక్క లేకుండా నన్ను చంపేశాడు అతను నన్ను తిరస్కరించాడు, కారణం అతను ఒక సామాన్యుడు, సామాజికంగా, ఆర్థికంగా మా కన్నా దిగువ. కానీ నేను అతని మాట వినలేదు. నా ప్రేమలోని నిజాయితీ అతన్నీ కూడా అంగీకరించేలా చేసింది.
అతను దగ్గరలోని ఆలయంలో బొమ్మలుస్తుంటాడని తెలిసి ఆ కోవెలకు వెళ్లేదాన్ని. కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా మేమిద్దరం కలుసుకునేవాళ్ళం. ఆలా కాలం కరిగిపోయింది. ప్రేమని, నిప్పుని ఎంతోకాలం గుప్పిట్లో దాచలేము, అది మా నాన్నగారికి తెలిసింది. అయన మూర్ఖత్వం నాకు తెలుసు అందుకే ఇద్దరం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుని బతకాలనుకున్నాము, నేను నా స్నేహితురాలి సహాయంతో ఆ జమీన్ నుండి బయటపడగలిగాను, ఇద్దరం మా పక్క ఊరి ఆలయంలో పెళ్లి చేసుకుని, అతని స్నేహితుడి జట్కాబండిలో పట్నం పారిపోతున్నాం. ఆ రోజు అతని భుజంపై తలవాల్చి, చేతిలో చేయి వేసి పడుకున్న నన్ను ఒక్క ఉదుటున ఎవరో కిందకు లాగినట్టుగా పడిపోయాను. లేచి చూసేసరికి అతన్ని మా నాన్నగారి మనుషులు కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టసాగారు. అడ్డుగా వెళ్లిన నన్ను, అందులో ఒకడు నా భుజం పట్టి పక్కకు లాగి చెంపపై గట్టిగ చరిచాడు. అతన్ని కసిగా కాలితో తంతు భూతులు తిడ్తున్నారు. ఆ దృశ్యం చూస్తున్న నాకు నరాలు తెగిపోతున్నంత బాధతో అరిచాను, కానీ నాఅరుపులు అరణ్య రోదనయ్యింది. నా వల్ల ఒక మనిషిని హింసించడం సంహించలేని నేను పక్కనే ఉన్న అమ్మవారి సులంతో పొడుచుకున్నాను. ఇది ఊహించని ఆ గుండాలు అవాక్కయ్యారు. అందులో ఒకడు “అన్న ఎందిది అమ్మాయిగొరిని చంపకుండా తెమ్మంటిరే అయ్యగోరు, గిమే గిట్ల పొడ్సుకుందిగా “ అని అన్నాడు “దానికి మనమేం చేస్తాం, వాడిని కూడా పొడిచి వెళ్ళిపోదాం పదండి” అని అంటూ అతన్ని కత్తితో పొడిచి అక్కడి నుండి వెళ్లిపోయారు.
నేను అతనితో ఎంతగానో జీవించాలనుకున్నాను మనసావాచా కర్మణా అతనే నా సర్వస్వం అనుకుని అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, కానీ అతని చావుకు కారణమయ్యానని కన్నీరు మున్నీరవుతున్న నన్ను, అతని పూర్వికులు రాసిన తాళపత్ర గ్రంధాల ప్రకారం, చనిపోయేముందు ఆ మనిషి రక్తంతో ఒక చిత్ర పటాన్ని గిస్తే, ఏ జన్మలోనైనా, ఈ జన్మ తాలూకు జ్ఞాపకాలను మాట్లాడే అవకాశముందని చెప్పి, ద్రవిస్తున్న నా రక్తంతో, ఈ చిత్ర పటాన్ని గీశాడు. మరు జన్మలోనైనా మనిద్దరం కలిసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిద్దామని నాకు ప్రమాణం చేసి చనిపోయాడు. అతను ఊపిరి వదిలిన కాసేపటికి నేను చనిపోయి ఇప్పుడు ఇలా ని రూపంలో జన్మించాను. వాసు కూడా పుట్టాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అతన్ని ఎలా అయినా వెతికి పట్టుకుని పెళ్లి చేసుకో” అని అంటున్న ఊర్మిళ దేవి వైపు రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయింది ఆకాంక్ష
“ఏమిటి ఆకాంక్ష, నేను చెప్పింది మీరు వింటున్నారా ??” అని అడిగింది ఊర్మిళ దేవి
“ఇదంతా ఎలా నమ్మడం” అని అడిగింది ఆకాంక్ష
“ ఉదయం : 5 గంటల 9 నిముషాలు, కార్తీక మాసం, పొర్ణమి, విశాఖ నక్షత్రం, శుక్ల పక్షం ప్రతి సంవత్సరం ఈ రోజున నీకొక కల వస్తోంది కదా, అందులో ఒక అమ్మాయి చీకట్లో కాగడాతో పరిగెత్తుతూ ఉంటుంది, ఆవలి ఒడ్డున ఒక గుడిసెలో దీపం వెలుగుతుంటుంది, ఆమె యేరు దాటేలోపే ఎవరో ఆమెను బలంగా కొడతారు” ఇదేగా నీకు వచ్చే కల” అని అడిగింది ఊర్మిళ
“ఈ కల గురించి నీకెలా తెలుసు, ఇప్పటిదాకా నేనెప్పుడూ ఎవరితో పంచుకోలేదు, అది కాకా అదే రోజు నాకు ఆ కల వస్తోందని నువ్వలా చెప్పగలవు ??” అని ఆశ్చర్యంగా అడిగింది ఆకాంక్ష
“కారణం నేను అదే రోజు చనిపోయాను కనుక, ఆ అడవి మా జమీన్ అయితే నా చేతిలో కాగడా మా ప్రేమ, గుడిసెలో దీపం నా వాసు అయితే ఆ యేరు మా నాన్న. నిన్ను ఇక్కడిదాకా రప్పించింది నీకు నీ గురించి చెప్పడానికే, నేను పుట్టానంటే కచ్చితంగా వాసు పుట్టేవుంటాడు, అతన్ని వెతుకు, అతని ఆనవాళ్లు, పోయిన జన్మ స్మృతులు కొద్దో గొప్పో ఉంటాయి కాబట్టి కచ్చితంగా ఆటను చిత్రకారుడే అయుంటాడు పైగా అతని భుజంపై చిత్ర లేఖనం చేసే ఈక పచ్చబొట్టు ఉంటుంది” అని అంది కళ్ళు మూసుకుని, రెండు రెప్పలా చాటున దాగిన కన్నీటి బొట్లు కారాయి.
తిరిగి ఆమె “ప్రేమించటమే నేను చేసిన తప్పు, ఆ తప్పు నేను చేస్తే ఇంకొకరికి శిక్షపడింది. నా వల్ల అర్దాయుష్షుతో ఒక మంచి మనిషి ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణానికి కారణమయ్యాను.” అని ఏడుస్తున్న ఉర్మిళను చుసిన ఆకాంక్ష మనసు బాధతో నిండింది.
“ఆ రోజుల్లోనే కాదు ఆ కుసంప్రదాయం ఇప్పటికి కొనసాగుతోంది, కులం పేరుతొ, మతం పేరుతొ, పరువు పేరుతో తీస్తున్న ప్రాణాలకు లెక్కేలేదు. ఈ మారణహోమానికి వీళ్ళు పెట్టుకున్న పేరు “పరువు హత్యలు” ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నా గమ్యం ఏంటో నాకు తెలియదు. ఒక దిశా లేకుండా ప్రయాణం చేసేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా గమ్యస్థానం, నా పుట్టుక యొక్క అర్ధం వాసు అని తెలిసింది. కచ్చితంగా అతన్ని కలిసి తీరతాను, ఇదే నా మాట” అని అంటున్న ఆకాంక్ష వైపు తృప్తిగా చూసి, ఒక చిన్న దీపంలా మారి ఆమెలో కలిసింపోయింది ఊర్మిళ దేవి
 
అయిపొయింది .....
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల బాగుంది. కానీ మధ్యలో ఆపేసారు, కొనసాగించి ఉంటే ఇంకా బాగుంటుంది.
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)