Posts: 1,856
Threads: 4
Likes Received: 2,920 in 1,322 posts
Likes Given: 3,764
Joined: Nov 2018
Reputation:
58
బావుంది earthman గారు...మద్య తరగతి మామూలు సగటు మనుషుల కథతో వచ్చారు, తొందరగా మెట్లెక్కేసి పెద్దవాళ్ళమైపోదమన్న ఆశతో ముందేమి జరుగుతుందో, ఎలా మొదలెట్టాలో తెలియక ఇలా ఇరుక్కు పోతున్న (ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో) సవాలక్షల మంది కథ...కొనసాగించండి
: :ఉదయ్
Posts: 185
Threads: 0
Likes Received: 85 in 79 posts
Likes Given: 32
Joined: Aug 2019
Reputation:
2
Posts: 3,099
Threads: 0
Likes Received: 1,444 in 1,228 posts
Likes Given: 417
Joined: May 2019
Reputation:
21
•
Posts: 5,110
Threads: 0
Likes Received: 2,978 in 2,496 posts
Likes Given: 6,101
Joined: Feb 2019
Reputation:
19
•
Posts: 3,656
Threads: 0
Likes Received: 2,355 in 1,825 posts
Likes Given: 9
Joined: Feb 2020
Reputation:
32
•
Posts: 924
Threads: 0
Likes Received: 485 in 402 posts
Likes Given: 407
Joined: Jun 2021
Reputation:
6
•
Posts: 1,680
Threads: 1
Likes Received: 721 in 593 posts
Likes Given: 1,483
Joined: Jun 2019
Reputation:
2
•
Posts: 1,033
Threads: 0
Likes Received: 498 in 440 posts
Likes Given: 86
Joined: Dec 2022
Reputation:
14
•
Posts: 1,680
Threads: 1
Likes Received: 721 in 593 posts
Likes Given: 1,483
Joined: Jun 2019
Reputation:
2
•
Posts: 3,793
Threads: 0
Likes Received: 1,275 in 1,056 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Nice opening,plz continue
•
Posts: 1,680
Threads: 1
Likes Received: 721 in 593 posts
Likes Given: 1,483
Joined: Jun 2019
Reputation:
2
•
Posts: 75
Threads: 5
Likes Received: 24 in 20 posts
Likes Given: 19
Joined: May 2019
Reputation:
2
•
Posts: 3,793
Threads: 0
Likes Received: 1,275 in 1,056 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,997 in 5,326 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
91
•
Posts: 1,680
Threads: 1
Likes Received: 721 in 593 posts
Likes Given: 1,483
Joined: Jun 2019
Reputation:
2
•
Posts: 369
Threads: 47
Likes Received: 2,059 in 304 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.
తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
Posts: 369
Threads: 47
Likes Received: 2,059 in 304 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
125
కాలింగ్ బెల్ మోగింది.
సుజాత వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా శీను.
లోపలికొచ్చి ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాడు.
లోపల నించి బయటకి వచ్చాడు మురళి.
సుజాత కూడా కూర్చుంది.
"నేను మళ్ళీ వెళ్ళి లాయర్ని కలిసాను, ఆయన వేరే లాయర్ గురించి చెప్పాడు, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు మన అగ్రిమెంట్ డాక్యుమెంట్స్, మిగిలిన అన్ని వివరాలు, మొత్తం తీసుకుని సాయంత్రం రమ్మన్నారు" అన్నాడు శీను.
"ఈ కొత్త లాయర్ మన డబ్బులు వెనక్కి ఇప్పించగలడా" అడిగింది సుజాత.
"ఈ లాయర్ ఇలాంటివి చూస్తూ ఉంటాడుట, మనకి ఎంతో కొంత మేలు జరగచ్చు, చూద్దాం. సుజాతా నాకు వేడి కాఫీ ఇవ్వవా, తల నెప్పిగా ఉంది, కాఫీ తాగి పడుకుంటాను, సాయంత్రం లేపు నన్ను" చెప్పాడు శీను.
తలూపుతూ కాఫీ పెట్టడానికి లోపలికెళ్ళింది సుజాత.
"కొంత పోయి మిగిలింది వెనక్కొచ్చినా చాలు శీను" అన్నాడు మురళి.
"చూద్దాం, సాయంత్రం తేలుతుంది, నువ్వు ఎక్కువ ఆలోచించకు, మనం ఎవరికీ అన్యాయం చెయ్యని వాళ్లం, మనకి ఏదో ఒక మార్గం దొరకకపోదు" అన్నాడు శీను.
"ఏదో ఒకలా డబ్బులు వెనక్కొస్తే చాలు శీను, ఇక ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యం"... కాఫీతో గదిలోకి వస్తూ అంది సుజాత.
అందరూ కాఫీ తాగారు. శీను పడుకున్నాడు.
సాయంత్రం అయింది. శీనూని లేపారు. ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని లాయర్ దగ్గరికి బయలుదేరారు మగాళ్ళిద్దరూ.
మురళి మొహంలో బాధ. ధైర్యం చెప్తున్నట్టుగా భుజం తట్టి పంపించింది సుజాత.
లాయర్ ఇంటికి వెళ్లారు.
డాక్యుమెంట్స్ అన్నీ చూసి, ఓనర్ ఏమన్నాడో మొత్తం చెప్పమన్నాడు లాయర్.
నలభై లక్షల యూనిట్ అమ్ముతున్నారని తెలిసిందని, వెళ్ళి చూసామని, అంతా బాగుందని, పదిహేను లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని, మిగిలిన డబ్బులు బిజినెస్ జరిగేదాన్ని బట్టి ప్రతి నెలా కట్టచ్చు అన్నారని, అందుకే పదిహేను లక్షలు అడ్వాన్స్ ఇచ్చామని, తాము ఇచ్చిన డబ్బులతో ఓనర్ వేరే బాకీలు తీర్చేసాడని, తాము పని మొదలుపెట్టే లోపే వేరేవాళ్ళు ఎవరో యూనిట్ హక్కులు రాయించుకున్నారని, వాళ్ళిప్పుడు ఇరవై లక్షలు ఒకేసారి ఇమ్మంటున్నారని, లేదంటే యూనిట్ లోకి రానివ్వం అన్నారని, యూనిట్ వేరేవాళ్లకి అమ్ముకుంటాం అన్నారని, మొత్తం చెప్పాడు మురళి.
డబ్బులిచ్చినట్టు ఉన్న డాక్యుమెంట్ చూస్తూ తల అడ్డంగా ఊపాడు లాయర్.
అర్ధం కానట్టు చూసారు మురళి, శీను.
"మీరు డబ్బులు ఇచ్చినట్టుగా నోట్ ఉంది, కానీ ఆ డబ్బులు యూనిట్ కొనడం కోసం అన్నట్టుగా లేదు, అడ్వాన్స్ అని లేదు, అప్పు ఇచ్చినట్టు అని కూడా అనుకోవచ్చు" చెప్పాడు లాయర్.
"అంటే మా డబ్బులు వెనక్కి వస్తాయి కదా సార్" అన్నాడు మురళి.
"వస్తాయి కానీ అప్పుకి వడ్డీ ఇంత అని, నెలకి ఇంత కడతాను అని కానీ ఎక్కడా లేదు" బదులిచ్చాడు లాయర్.
"మేము ఇచ్చింది అప్పు కాదు కదా సార్, అడ్వాన్స్ కదా, అప్పు ఇవ్వలేదు కాబట్టే వడ్డీ గురించి లేదు కదా" అన్నాడు శీను.
"నిజమే, కానీ ఇందులో ఎలాంటి డీటెయిల్స్ లేవు, కేవలం అప్పు ఇచ్చినట్టుగా ఉంది అంతే. మీరు కోర్టుకి వెళ్ళచ్చు, కానీ ఆ ఓనర్ తన దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు అంటే అతనికి జైలు శిక్ష వేస్తారు కానీ మీ డబ్బులు మాత్రం మీకు రావు" అన్నాడు లాయర్.
"మమ్మల్ని ఏం చెయ్యమంటారు సార్" అడిగాడు మురళి.
"చేసేదేం లేదు, ఆ ఓనర్ని కలిసి కాళ్ళ మీద పడి డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పడమే" బదులిచ్చాడు లాయర్.
"ఆయనకి వేరే అప్పులు ఉంటే అవి తీర్చాడు సార్" చెప్పాడు శీను.
"అయితే అతని ఇచ్చేదాకా ఎదురుచూడాల్సిందే, ఇంకేమీ చెయ్యలేం" అన్నాడు లాయర్.
"మేమిచ్చిన అడ్వాన్స్ కొంత అప్పు చేసి తెచ్చింది సార్, మా స్థలం కూడా తాకట్టు పెట్టాం, దానీ వడ్డి కట్టాలి, మా జీతాలతో ఇవన్నీ జరగవు సార్. అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఇంకేమీ లేవు సార్" దీనంగా అన్నాడు మురళి.
"ఇవన్నీ సంతకాలు పెట్టడానికి ముందు, డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించుకుని, మా లాంటి లాయర్లతో మాట్లాడి చెయ్యాల్సిన పనులయ్యా. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఎలా" కుండ బద్దలు కొట్టినట్టు అన్నాడు లాయర్.
అక్కడే కళ్ళ వెంట నీరు వచ్చింది మురళికి, వెంటనే బయటకి వెళ్ళాడు.
"మళ్ళీ వస్తాను సార్" అంటూ మురళి కోసం పరిగెత్తాడు శీను.
అక్కడే ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుని కళ్ళ వెంట నీళ్ళతో తల వంచుకుని ఉన్నాడు మురళి.
మురళి పక్కకి వచ్చి భుజం మీద చెయ్యి వేసాడు శీను.
"నేను చచ్చిపోతానురా, ఈ నరకం నా వల్ల కావట్లేదు, సుజాత ముందు నేను తల ఎత్తుకోలేకపోతున్నా, నాకు లక్ష రూపాయల ఇన్ష్యురెన్స్ పాలసీ ఉంది, నేను పోతే ఆ డబ్బుల్లన్నా సుజాతకి వస్తాయి, నేను ఉండను కాబట్టి అప్పులవాళ్ళు ఎవరూ తనని అప్పు తీర్చమని అడగరు, నేను ఉండటం కన్నా లేకపోతేనే సుజాతకి హాయిగా ఉంటుందిరా, నా వల్ల ఏ ఉపయోగం లేదు తనకి, నేను చచ్చిపోతానురా" ఏడుస్తూ అన్నాడు మురళి.
"నోరు మూసుకోరా, ఈ మాత్రానికే అంత మాటలు ఎందుకు, నువ్వు బాధపడకు, ఓనర్ని మళ్ళీ కలుద్దాం, మన పరిస్థితి చెప్దాం, ఎలా మాట్లాడాలి అనేది లాయర్ని అడుగుదాం. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకుని వస్తా"... అంటూ మొబైల్ తీసి ఫోన్ చేసాడు మురళి.
పది నిముషాల్లో ఆటోలో వచ్చింది సుజాత. మురళిని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి వాళ్లని పంపించి మళ్ళీ లోపలికి వెళ్ళాడు శీను.
"సార్ ఆ ఓనర్‌తో ఏం మాట్లాడాలో చెప్పండి, మీరు అడగమన్నది అడుగుతాం" అడిగాడు శీను.
"నేను చెప్పేది ఏముందయ్యా, అతను ఏం చెప్తే వింటాడో నాకెలా తెలుస్తుంది. మీ పని లా గురించి కాదు, అతని క్యారెక్టర్ గురించి. అతని మనసు కరిగేలా అవీ ఇవీ చెప్పి కాళ్ళ మీద పడండి, అంతకు మించి చెయ్యగలిగింది ఏమీ లేదు" తేల్చాడు లాయర్.
"అదేంటి సార్ అలా అంటారు"
"ఇంకేం అనమంటావు, ఈ ముందుచూపు ముందు ఉండాలి, ఇరుక్కున్నాక ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదు"
సహజంగా ధైర్యంగల శీనుకి మొదటిసారి డబ్బులు వెనక్కి రాకపోవచ్చు అని అనిపించసాగింది. వెంటనే మురళి చచ్చిపోతాను అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి.
డాక్యుమెంట్స్ తీసుకుని బయటకి వచ్చి, చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుని తల పట్టుకుని ఇప్పుడు ఏం చెయ్యాలి, ఒకవేళ మురళి ఏదైనా చేసుకుంటే ఇక అంతే, సుజాత, పాప సంగతి, వామ్మో అనుకుంటూ తల ముక్కలవుతుంటే కళ్ళు మూసుకుని ఆలోచనల్లో ఉండిపోయాడు మురళి.
The following 18 users Like earthman's post:18 users Like earthman's post
• hrr8790029381, K.R.kishore, naree721, premkk, pula_rangadu1972, raki3969, ramd420, Sachin@10, Satya9, Sivak, sri7869, sriramakrishna, stories1968, taru, Uday, Y5Y5Y5Y5Y5, Yar789, ytail_123
Posts: 7,546
Threads: 1
Likes Received: 5,064 in 3,910 posts
Likes Given: 47,795
Joined: Nov 2018
Reputation:
82
•
Posts: 3,863
Threads: 9
Likes Received: 2,328 in 1,841 posts
Likes Given: 8,945
Joined: Sep 2019
Reputation:
23
•
Posts: 1,856
Threads: 4
Likes Received: 2,920 in 1,322 posts
Likes Given: 3,764
Joined: Nov 2018
Reputation:
58
ఇలాగే జరుగుతోంది. ఒకే స్థలాన్ని ఇద్దరికంటే ఎక్కువమంది అమ్మేయడం, ఇందులో తమాషా ఏంటంటే అందరి పేరున రిజిష్టర్ కూడ చేయడం. తల తాకట్టు పెట్టి మొత్తం అంతా కట్టేక రేటు పెంచేయడం లేకపోతే ఇంకోడు వచ్చి ఎది నాది అనడం...కలియుగం నిజంగానే అంతానికి దగ్గరైనట్లుంది.
కథ బావుంది, వర్తమానానికి తగినట్లు. మనది కథ కదా, కాస్త మసాలా కూడా జోడిస్తే బావుంటుందేమో ఆలోచించండి.
: :ఉదయ్
|