Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
రామ్ weds సీత
- Devanshika janu
ఒక పల్లెటూరు లోని ఒక ఇంట్లో ఆ ఊరంతా అంతా పెళ్లి అని తెలిసేటట్టు అలంకరించబడి ఉంది...పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు కోపంగా పంతులు గారు చెప్పే పూజ చేస్తుంన్నాడు... పెళ్లి కూతురు మాత్రం మౌనంగా తలదించుకుని బాధపడుతోంది....
పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లిని చూస్తున్నారు...
ఇంతలో పంతులుగారు మాంగల్యధారణ అనగానే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వైపు చూస్తే వాళ్ళ అమ్మ కోపంగా పెళ్లి కొడుకు వైపు చూస్తుంది.. పెళ్ళికొడుకు ఏమీ చేయలేక నిస్సహాయంగా తాళి ని తీసుకొని పెళ్లి కూతుర్ని కోపంగా చూస్తూ మెడ బిగుసుకునేలా తాళి కడుతుంటే పెళ్లి కూతురు భయంగానే తలెత్తగా పెళ్లి కొడుకుని చూస్తుంది... పెళ్ళికొడుకు కోపంగా పెళ్లికూతురు కళ్ళల్లోకి చూస్తాడు... ఆ కోపానికి భయపడి తలదించుకుంటే పెళ్లికూతురు పూలజడ పట్టుకున్న పెళ్లి కూతురు చెల్లెలు వరుసయ్యే అమ్మాయి "బావ తాళి మెడ వరకు వచ్చింది కిందకి కట్టు" అని నవ్వుతూ చెప్తుంది...
పెళ్ళికొడుకు కోపంగా తన ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది... పెళ్ళికొడుకు తాళికట్టి పెళ్లి కూతురు పక్కన అసహనంగా కూర్చుంటాడు
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులు సంతోషంగా వాళ్లపై అక్షింతలు వేస్తారు...
అలా పెళ్లి అయిపోయి అప్పగింతల కార్యక్రమం లో పెళ్లి కూతురు ఏడుస్తుంటే పెళ్లి కూతురు అమ్మ రాగిని"వదిన నీకు నా కూతురు గురించి చెప్పనవసరం లేదు... నా కూతురు గురించి మొత్తం తెలుసు జాగ్రత్త అని మాత్రం చెప్తాను... ఏదైనా తప్పు చేస్తే తల్లిలా కడుపులో పెట్టుకో బాధ పెట్టకు" అని ఏడుస్తూ అంటుంది
పెళ్లి కొడుకు తల్లి మాధురి"నీకు తెలుసు కదా వదిన నాకు ఇదే అంటే ఎంత ఇష్టమో!!! నేను దాన్ని నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను నువ్వు భయపడొద్దు"అని భరోసా ఇస్తుంది
పెళ్లి కూతురు తండ్రి మణికంఠ పెళ్లి కొడుకు తో"అల్లుడు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశానని నా కూతురిని బాధ పెట్టకు... దాని అర్థం చేసుకో దాన్ని అర్థం చేసుకున్నాక అది అందించే ప్రేమ నీకు ఎవరిని గుర్తుకు రానివ్వదు అంత ప్రాణంగా ప్రేమిస్తుంది... అది అసలే అమాయకురాలు దాని బాధ్యత నీదే జాగ్రత్త అల్లుడు"అంటుంటే
పెళ్ళికొడుకు మణికంఠ వైపు సీరియస్ గా చూస్తాడు...
పెళ్లి కొడుకు తండ్రి మహేశ్వర్"వాడితో ఏంటి బావ!!! మేమున్నాం కదా మేము జాగ్రత్తగా చేసుకుంటాము" అని భరోసా ఇస్తాడు
పెళ్లి కూతురు వాళ్ల అమ్మని హగ్ చేసుకొని "మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ నేను లేనని నువ్వు అమ్మ బెంగ పెట్టుకోవద్దు... నేనూ అక్కడ జాగ్రత్తగానే ఉంటాను" అని ఏడుస్తూ చెబుతుంది
"సరే తల్లి నువ్వు వెళ్ళేది నీ సొంతమే నేను ఇంటికే ఇక నుంచి అదే నీ ఇల్లు జాగ్రత్తగా మసలుకో... బావ ని ఎప్పుడు బాధ పెట్టకు" అని చెప్తుంది
"సరే సరే వర్జం వస్తుంది పదండీ"అని మాధురి అనగాని
పెళ్లికూతురు ఏడుస్తూ అందరికీ వీడ్కోలు చెప్పి కార్ లో పెళ్ళికొడుకు పక్కన కూర్చుంటుంది.. కార్ని మహేశ్వర్ గారు నడుపుతుంటే పక్కన మాధురి కూర్చుంటుంది వెనుక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటారు...
అలా పెళ్ళికొడుకు ఫ్యామిలీ మొత్తం కలిసి పెళ్లికూతురు ఊరికి రెండు ఊర్ల అవతల వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గుమ్మంలోనే ఆపి దిష్టి తీసి పెళ్ళికొడుకు చెల్లి వరుసయ్యే అమ్మాయి "పేర్లు చెప్పి లోపలికి రండి" అని ఆటపట్టిస్తూ ఆపేస్తుంది...
పెళ్లి కొడుకు కోపంగా ఆఅమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి భయపడి పక్కకు తప్పుకుంటుంది...
అలా పెళ్ళికొడుకు గబగబా లోపలికివెల్తూ ఉంటే పెళ్ళికూతురు కొంగుముడి వల్ల పెళ్లి కొడుకు తో పాటు ఇద్దరు కలిసి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తారు
అలా మెట్ల వరకు వెళ్ళిన పెళ్ళికొడుకు వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి పెళ్ళికూతురు తల దించుకొని ఉండటం చూసి కోపంగా తన కండువా తీసి పెళ్లికూతురు మొహం మీద విసిరేసి స్పీడ్ గా తన రూం కి వెళ్ళి పోతాడు
పెళ్ళికొడుకు అలా వెళ్ళిపోవడం చూసి పెళ్లికూతురు బాధగా పెళ్ళికొడుకు రూమ్ వైపు చూస్తుంటే మాధురి వచ్చి "బాధపడుకు బుజ్జి వాడు మారుతాడు... నీ ప్రేమతో నువ్వే మార్చుకోవాలి... అంతా నీ చేతుల్లోనే ఉంది... నువ్వు కూడా రెస్ట్ తీసుకో రేపు వ్రతం ఉంది..." అని ఒక రూం లోకి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని మాధురి వెళ్ళిపోతుంది
పెళ్లికూతురు రూమ్ లోకి వెళ్లి మనసులో "నాకు తెలుసత్తా బావ మనసుకి గాయం అయింది... అది కూడా నా వల్లే... దాన్ని నేనే ప్రేమగా మార్చుకుంటాను" అని ఆలోచించుకుంటూ నిద్రపోతుంది...
తర్వాత రోజు ఉదయాన్నే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత వ్రతం చేయిస్తారు...
ఆ సాయంత్రం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసి ఇద్దర్నీ లోపలికి పంపించి అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లిపోతారు
లోపలికి వచ్చిన పెళ్లికూతురు ఎక్కడ తన బావ కనిపించకపోవటంతో మొత్తం వెతుకుతూ బాల్కనీలో చూస్తే అక్కడ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు...
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి "ఏంటి బావ ఇక్కడ ఉన్నవు??? ఈ రోజు ఏంటో గుర్తులేదా???" అని కవ్విస్తూ నడుము కనిపించే లాగా వయ్యారంగా నిలబడి అడుగుతుంటే
పెళ్లి కొడుకు కోపంగా పెళ్లికూతురు వైపు చూసి ఒక్క క్షణం మెస్మరైజ్ అయ్యి తనని పై నుంచి కింద వరకు స్కాన్ చేసి తన నడుం వైపు వైపు అలాగే చూస్తూ ఉంటే పెళ్లికూతురు సిగ్గుపడుతూ "అంత అందంగా ఉన్నానా బావ!!! అయితే ఒక ముద్దు పెట్టొచ్చు కదా" అని గారంగా అడుగుతుంది
పెళ్ళికొడుకు అప్పుడు స్పృహలోకి వచ్చే" ఏయ్ ఎక్కువ చేస్తున్నవు మూసుకొని పోయి పడుకో నన్ను విసిగించకు" అని నడుం వైపు చూపు తిప్పకుండా అంటాడు
పెళ్లికూతురు మనసులో "నీ కోపం ఎందుకో నాకు తెలుసు బావ... ఆ కోపం నేనే చెరిపేస్తా!!!" అనుకుంటూ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్లి మెడ చుట్టూ చేతులు వేసి "అదేంటి బావా ఈరోజు ఏంటో మర్చిపోయావా!!! మన ఫస్ట్ నైట్ ఇద్దరం కలిసి అలసిసొలసి నిద్ర పోవాలి కానీ ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకొని కాదు"తన బుగ్గ మీద ముద్దు పెడుతూ అని మత్తుగా అంటుంటే
పెళ్లికూతురు అలా చెప్తుంటే పెళ్లి కొడుకు వశం తప్పి పెళ్లికూతురు నడుం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు
పెళ్లికూతురు నవ్వుతూ పెళ్లి కొడుకు ని చూసి "ప్రొసీడ్ అయిపోదామా మా బావ" అని మెడ మీద ముద్దు పెడుతూ ఉంటుంది
పెళ్ళికొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి పెళ్లి కూతుర్ని వెనక్కి జరిపి "ఎయ్ సీత నన్ను విసిగించకుండా వెళ్లి పడుకో "అని విసుగ్గా చెప్పి మనసులో "నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను కమిట్ అయ్యేటట్టు ఉన్నాను!!! వెళ్ళవే బాబు"అని కష్టంగా అనుకుంటాడు
పెళ్ళికొడుకు అలా తన మీద విసుకు చూపించేసరికి సీత బాధగా "నా మీద ప్రేమ తగ్గిపోయిందా బావా???" అని అడిగే సరికి
పెళ్ళికొడుకు కి బాధగా అనిపించింది వెంటనే జరిగింది గుర్తుకు వచ్చి "అవును నా ప్రేమ కాదని వేరే వాడిని చేసుకోవాలి అనుకున్నావ్ కదా!!! అందుకే నీ మీద నా మనసు విరిగిపోయింది అది ఇప్పుడప్పుడే అతుక్కోదు నన్ను విసిగించకు పో" అని కసురుతాడు
ఆ మాటకి సీతకి బాధగా ఏడిస్తూ రూంలోకి వెళ్ళి పోతుంది...
సీతా అలా ఏడుస్తూ వెళ్ళటం చూసి పెళ్ళికొడుకు కి బాధగా అనిపించి తన వెనకే వెళ్ళిబోయి మనసులో "ఇప్పుడు నేను దానిని దగ్గరికి తీసుకుంటే నా ప్రేమ విలువ తెలిసి రాదు... కొన్నాళ్ళు ఇలాగే ఉండాలి అప్పుడు తెలిసింద్ది నా బాధ" అనుకొని అక్కడే రైలింగ్ కి తన చేతిని గట్టిగా కొట్టి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు
"ఎందుకు రామ్ బావ ఇలా మాట్లాడుతున్నవు??? నువ్వు నన్ను కాదని అంటేనే కదా మా నాన్న వేరే వాడిని చూసి పెళ్లి వరకు తీసుకుని వచ్చింది" అనుకుంటూ ఏడుస్తూ అలాగే నిద్ర పోతుంది
సీత నిద్రపోయాక రామ్ లోపలికి వచ్చి తన మొహం చూస్తే మొహం కొంచెం ఉబ్బి, ముక్కు ఎర్రగా అయిపోయి కన్నీటి ఛారలు తన చెంపల మీద కనిపిస్తుంటే బాధగా అనిపించి "ఎందుకే నన్ను ఇలా తయారు చేశావు... నువ్వు అలా చేయబట్టే కదా ఇప్పుడు ఇలా" అనుకుంటూ తన పక్కనే పడుకొని గుండెల మీదకి తీసుకుని తన చుట్టూ చేయి వేసి జరిగింది గుర్తు చేసుకుంటాడు....
రాగిని, మహేశ్వర్ గారు అన్నా చెల్లెళ్ళు అలా మహేశ్వర్ గారికి మాధురి గారిని ఇచ్చి పెళ్లి చేసారు... తర్వాత రాగినిని మాధురి గారి అన్నగారు మణికంఠ గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు... అలా ఇద్దరు కుండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకుంటారు...
అలా మాధురి గారికి మహేశ్వర్ గారికి ఒక సంవత్సరానికి రామ్ పుడతాడు... రామ్ పుట్టిన ఇంకొక సంవత్సరానికి రాగిని, మణికంఠ లకి సీత పడుతుంది... తర్వాత ఇద్దరు పిల్లలు వద్దనుకుని ఒక్కొక్కరితో ఆపేస్తారు....
వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు... అలా ఇద్దరు పెరుగుతూ ఒకరినొకరు అస్సలు పడక ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు... అలాగని వేరే వాళ్ళు రామ్ ని అరిస్తే సీత ఒప్పుకునేది కాదు... సీతని అరిస్తే రామ్ ఒప్పుకునేవాడు కాదు... అలా ఇద్దరు ఒకరికొకరు పడరు కానీ ఒకరి మీద ఒకరు ఈగ కూడా వాళ్ళ నిచ్చేవాళ్ళు కాదు... అలా ఇద్దరూ పెరిగి పెద్దయి చదువు ఐపోయి రామ్ కి ఉద్యోగం వస్తుంది... ఇప్పుడు సీత అపరంజి బొమ్మలా అయితే ఆరడుగుల అందగాడిలా తయారవుతాడు...
అప్పుడే మొదలైంది అసలైన కథ ఒకరోజు ఇద్దరి తల్లిదండ్రులు మణికంఠ గారి ఇంట్లో కలుసుకొని సీతని,రామ్ ని పిలిచి ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నామని వాళ్ల నిర్ణయం చెబుతారు...
రామ్ వెంటనే "దీన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి??? అది ఎప్పటికీ జరగదు!!! నాకు ఇది అంటే అస్సలు ఇష్టం లేదు... మీకు అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు
అది వినగానే అందరూ బాధపడతారు... సీత మనసులో బాధగా ఉన్నా "నాకు కూడా బావ అంటే ఇష్టం లేదు... నేను కూడా ఈ పెళ్ళి చేసుకోను" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి వెక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తుంది... ఎందుకంటే సీతకి చిన్నప్పటినుంచే రామ్ అంటే ప్రాణం కానీ ఎప్పుడూ చూపించలేదు అదే ఇప్పుడు తనకి బాధని మిగిల్చింది...
అలా రామ్ తన జాబ్ కి వెళ్తే అక్కడ ఎప్పుడూ సీతే గుర్తుకొస్తుంటే ఎందుకు గుర్తుకు వస్తుంది అని ఆలోచించి సీత ని ప్రేమిస్తున్నాను అని తెలుసుకుని తన ప్రేమ విషయం చెప్పాలనుకొని సర్ప్రైస్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ తనకి ఎదురు షాక్ తగులుతుందని తెలియదు...
రామ్ సెలవులకు ఇంటికి వెళ్లేసరికి సీతను కలవాలని ముందు మణికంఠ గారి ఇంటికి వెళితే అక్కడ సీతకీ నిశ్చితార్థం జరుగుతుంది....
అది చూసి రామ్ గుమ్మం దగ్గరే నిలబడి బాధగా చూస్తూ ఉంటే మాధురి గారు రామ్ ని చూసి పిలిచి "ఇంకొక వారం రోజుల్లో సీత పెళ్లి" అని ఆనందంగా చెప్తుంది కానీ మనసులో మాత్రం "నువ్వు చేసిన వెధవ పని వల్లే వేరొక ఇంటికి కోడలిగా వెళుతుంది"అని కోపంగా అనుకుంటుంది
నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు సీత కనీసం తల కూడా ఎత్తదు....
అలా నిశ్చితార్థం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతే రామ్ బాధగా సీతను చూసి "నాకు అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ వస్తాను" అని చెప్పి తన ఇంటికి వెళ్లి రూమ్ కి వెళ్లి బాధగా మంచం మీద కూర్చుని పోతాడు
"ఎలా సీత నన్ను కాదని వాడిని ఆగొట్టం గాడిని చేసుకోవాలి అనుకుంటున్నావు??? కనీసం నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా!!! అయినా ఇదంతా నేను చేసుకున్నదేలే" అనుకుంటూ బాధగా ఆ రోజంతా రూమ్ లోనే ఉండిపోతాడు
తర్వాత రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం సీతకి చెప్పి తనని ఒప్పించి పెళ్లి ఆపేయాలి అనుకొని ఇంటికి వెళ్తే అప్పటికే పసుపు దంచే పని అయిపోయి పెళ్లి పనులు స్టార్ట్ చేశారు... ఇవన్నీ చూస్తూ అసహనంగా డైరెక్ట్ గా సీత రూమ్ కి వెళ్లి చూస్తే సీతా రామ్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ "ఎందుకు బావ నేను నీకు నచ్చలేదు... నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా!!! నిన్ను కాదని వేరే వాళ్లని చేసుకోవాలంటే ప్రాణం పోతున్నట్టుంది" అని అనుకుంటూ ఉంటే
అది విని ఆనందంగా రూమ్ బోల్ట్ పెట్టి సీత దగ్గరికి వెళ్లి "నాఫోటోలు ఏం చూస్తావ్ కానీ డైరెక్ట్ గా వచ్చాను చూడు" అని నవ్వుతూ తన ముందు నిలుచొని అంటే
సీత కంగారుగా ఫోటో దిండు కింద దాచి లేచి నిలబడుతుంది...రామ్ వెంటనే సీతని హత్తుకుని "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను సీత... నిన్ను వదిలి వెళ్లాకే నాకు అర్థమైంది నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానని... పద వెళ్లి మనం మన అమ్మానాన్నలకి మన ప్రేమ విషయం చెప్పి ఈపెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్దాము" అని సీత చెయ్యి పట్టుకొని తీసుకు వెళ్తుంటే
సీత రామ్ చేతిలో నుంచి తన చెయ్యి తీసుకొని "ఆలస్యం అయిపోయింది బావ... ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు... అమ్మ నాన్న పరువు తీయలేను నేను... ఇక నుంచి మన జీవితం ఇంతే నువ్వు కూడా నన్ను మర్చిపోయి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో" అని బాధగా అంటుంది
రామ్ కోపం గా సీత చెంపమీద కొట్టి "ఏంటే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నవు!!! బుర్ర పోయిందా??? మనమిద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్లి చేసుకుందాం అనుకుంటే పరువు మర్యాద అంటూ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నావు???" అని కోపంగా అరుస్తాడు
సీత చెంప మీద చేయి పెట్టుకుని"నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను బావ మన విషయం బయటకు తెలిస్తే నేను చచ్చినంత ఒట్టే" అని ఆవేశంగా అంటుంది
ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Superb ji keka, we are waiting for eagerly waiting
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
(26-01-2023, 10:01 PM)Manoj1 Wrote: Superb ji keka, we are waiting for eagerly waiting
ధన్యవాదములు
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
రామ్ కోపం గా సీత ని చూస్తూ "నీ చావు నువ్వు చావు నీతో పాటు నన్ను కూడా చంపు" అంటూ బాధగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు...
వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉండగానే పెళ్లి ముందు రోజు రానే వచ్చింది... ఆ రోజు నైట్ పెళ్ళికొడుకు అమ్మాయి నచ్చలేదని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పి తన అమ్మ నాన్న లని తీసుకొనివెళ్ళిపోయాడని తెలుస్తుంది... అది తెలిసి మణికంఠ, రాగిని బాధపడుతుంటే మాధురి రామ్ దగ్గరికి వెళ్లి "రామ్ నువ్వు సీతని పెళ్లి చేసుకో ప్లీజ్" అంటుంటే
"అమ్మ నేను సీతని పెళ్లిచేసుకునేది ఏంటి నీకు పిచ్చి గాని పట్టిందా!!!" అని కోపంగా అరుస్తుంటే
ఆ మాటకు సీత బాధగా రామ్ ని చూస్తుంది
మణికంఠ రామ్ దగ్గరికి వచ్చి రామ్ చేతులు పట్టుకుని "ఇవి చేతులు కాదు కాళ్లు అనుకో అల్లుడు... నా కూతుర్ని పెళ్లి చేసుకొని దానికి జీవితాన్ని ఇవ్వు.... ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే నా కూతుర్ని అందరూ నష్ట జాతకురాలు అంటారు.... ఇక జీవితంలో దాని పెళ్లి జరగదు...దానిని అలా చూసి మేము బ్రతకలేము" అని బ్రతిమాలుతుంటే
మాధురి "మీరాగండి అన్నయ్య నేను వాడితో మాట్లాడతాను" అని చెప్పి రామ్ ని ఒక రూం లోకి తీసుకుని వెళ్లి డోర్ వేసి "నీ ప్రాబ్లమ్ ఏంటి రామ్???? ఎందుకు సీతని పెళ్లి చేసుకోను అంటున్నవు??? దాని కంటే అందమైన గుణవంతురాలైన అమ్మాయి నీకు దొరుకుతుందా!!! ఎందుకిలా తయారవుతున్నవు???" అని అసహనంగా అడుగుతుంది
"అమ్మ నాకు అది అంటే ఇష్టం... ఇష్టం కూడా కాదు ప్రాణం... నేను దానికి నా ప్రేమ విషయం చెప్తే పరువు ప్రతిష్ట అని చెత్త కారణాలు చెప్పి నన్ను వద్దు అనుకుంది ఇప్పుడు మీరు అడిగితే చేసుకోవాలా???" అని ఆవేశంగా అడుగుతాడు
"ఏంటి మీ ఇద్దరి ప్రేమించుకున్నారా??? ఎప్పుడు జరిగింది రా ఇదంతా!!! కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు!!!" అని ఆనందంగా అడుగుతుంటే
"నాక్కూడా తెలియదు అమ్మ నేను దానిని ప్రేమిస్తున్నానని... బెంగళూరు వెళ్ళినప్పుడు అర్థమైంది దాన్ని వదిలి నేను ఉండలేనని అందుకే దానికి సర్ప్రైజ్ చేద్దామని వెంటనే ఇక్కడికి వచ్చాను... కానీ నేను వచ్చేలోపే దానికి నిశ్చితార్థం జరిగిపోయింది... అది చూసి ఏం మాట్లాడలేక వెళ్ళిపోయాను.... కానీ నా ప్రేమని చంపుకోలేక సీత ఒప్పించి పెళ్లి చేసుకుందామని అడగడానికి వస్తే అని జరిగిందంతా చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పింది... ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి" అని ఆవేశంగా అడుగుతాడు
"అది చిన్న పిల్ల దానికేం తెలుసు... మాకైనా చెప్పచ్చు కదా!!! మేం చూసుకునేవాళ్ళం" అని కోపంగా అడిగితే
"చేసుకోవాల్సిందే ఒప్పుకోకపోతే మీకు చెప్పి ఏం లాభం అమ్మ అందుకే నా ప్రేమని చంపుకొన్నాను... నాను దానిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని ఖరాఖండిగా చెప్పేస్తాడు...
దాంతో మాధురి కి కోపం వచ్చి "నువ్వు ఇప్పుడు సీతని పెళ్లి చేసుకోకపోతే నాశవాన్ని చూస్తావు... నేను బ్రతికి ఉండడం నీకు ఇష్టం అయితే వచ్చి పెళ్లి ఇష్టమని చెప్పు లేకపోతే నీ ఇష్టం" అని కోపంగా చెప్పి బయటికి వెళ్లి పోతుంది
రామ్ కొంచెంసేపు ఆలోచించుకుని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తనలో తానే నవ్వుకొని బయటకు వచ్చి "సరే మావయ్య నేను సీతని పెళ్లి చేసుకుంటాను... కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటాడు
రామ్ ఒప్పుకోవడమే మహాభాగ్యం అన్నట్టు "సరే రామ్ మీరిద్దరూ సీత రూమ్ కి వెళ్లి మాట్లాడుకోండి" అని చెప్పి సీత రూమ్కి పంపిస్తాడు
రూమ్ కి వెళ్ళాక సీత భయంగా తల దించుకొని నిలబడితే రామ్ సీత ని కోపంగా చూస్తూ "ఇప్పుడు సంతోషంగా ఉన్నావా???" అని కోపంగా అడుగుతాడు
సీత అయోమయంగా తల పైకెత్తి చూసి "అదేంటి బావా అలా అడిగావు??" అని నిదానంగా అంటుంది
"మరి ఏమనాలి వాడు పోయాడు అని నన్ను చేసుకుంటున్నావు... లేకపోతే నన్ను చేసుకునేదానివా??? ఏదో తప్పక చేసుకోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే నా మొహం కూడా చూసే దానివి కాదు" అని కోపంగా అంటుంటే
సీత ఏడుస్తూ "అలా మాట్లాడకు బావ... నువ్వంటే నాకు ప్రాణం... తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంతే తప్ప నిన్ను వదులుకోవాలని కాదు" అని బాధగా ఉంటుంది
"ఏదైనా కానీ మనకి పెళ్లి జరిగిన నేను నిన్ను మరదలు గా మాత్రమే చూస్తాను పెళ్ళాంగా చూడను... ఈ విషయం గుర్తుంచుకొని పెళ్లి పీటల పై కూర్చో" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు
"నువ్వు ఎలా చేసుకున్న పెళ్లయితే చేసుకో బావ నిన్ను నేను మార్చుకుంటాను ఇంతకు ముందులాగా" అనుకొని కన్నీరు తుడుచుకొని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది
అప్పుడే మాధురి లోపలికి వచ్చి "ఏమంటున్నాడు నా కొడుకు???" అని అడిగితే
సీతా ఆనందంగా "బావ పెళ్ళికి ఒప్పుకున్నాడు" అని రామ్ చెప్పిందంతా చెప్తుంది
"మరి మనం ప్లాన్ చేస్తే అవ్వకుండా ఉంటుందా ఏంటి!!! వాడు అలాగే అంటాడు మనం మన ప్లాన్ లో ఉండాలి అంతే" అని ఇద్దరు నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటారు....
అలా ఒకరు కోపంతో ఒకరి ఆనందం తో రామ్ వెడ్స్ సీత గా మారిపోయింది పెళ్ళి....
అదంతా గుర్తుతెచ్చుకొని రామ్ సీత వైపు చూసి "రాక్షసివే నువ్వు... నిన్ను చేసుకోడానికి వాడిని తప్పించాల్సీవచ్చింది" అనుకుని పెళ్లి కొడుకు తో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటాడు...
పెళ్ళికొడుకు విడది ఇంట్లో దిగగానే రామ్ పెళ్లి కొడుకు తో మాట్లాడి పెళ్లి ఆపేయాలని వెళ్లి పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని పెళ్లి కొడుకు రూమ్ లోకి వెళ్లి "మీరేనా పెళ్లి కొడుకు???" అని అడిగితే
అతను "అవునండి" అని నవ్వుతూ చెప్పి "ఇంతకీ మీరెవరు???" అని అడుగుతాడు
"నేను రామ్ సీత కి కాబోయే భర్త ని" అని నవ్వుతూ చెప్పి డోర్ బోల్టు పెట్టి బెడ్ పై కూర్చుంటాడు
అతను అయోమయంగా రామ్ ని చూస్తూ "అదేంటి సీతని చేసుకోబోయేది నేను కదా!!!మీరు అంటున్నారు ఏంటి???" అని అడిగితే
"అవును నేనే సీత ని పెళ్లి చేసుకుంటాను అది ఎలాగైనా గాని దానికి మిమ్మల్ని తప్పించటానికి కూడా వెనుకాడను... దానికి కూడా నేనంటే ప్రాణం" అని ఈపెళ్లి గురించి తన గురించి మొత్తం చెప్తాడు
"అయితే ఇప్పుడేంటి పెళ్లి జరిగాక సీత నన్ను ప్రేమిస్తుంది తన ప్రేమ కోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను" అని కోపంగా అంటాడు
రామ్ మనసులో "వీడు నాకు మగసవితి అయ్యేలా ఉన్నాడు... ఎలాగైనా వీడిని తప్పించాలి" అనుకొని "ప్లీజ్ బాస్ నా మాట విని సీత ని నాకు వదిలెయ్" అని బ్రతిమాలుతుంటే
"నేను ఒప్పుకోను... నాకు సీత బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే సీతనే చేసుకుంటా!!!" అని అంటుంటే
రామ్ కి కోపం వచ్చే అతని చెంప మీద గట్టిగా కొడతాడు దెబ్బకి బెడ్ మీద పడతాడు...
రామ్ కోపం గా "చెప్తే అర్థం కాదా!!! నేను సీత గాఢంగా ప్రేమించుకుంటున్నాం... మా మధ్యలో నువ్వు గొట్టం గాడిలా వచ్చి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా????" అని కోపంగా అతనిని కొడుతుంటే అతను కుయ్యె మొర్రో అంటూ మూలుగుతూ భయంగా ఒక మూల నిలబడి రామ్ ని చూస్తూ ఉంటాడు
అతన్ని అలా చూసి రామ్ బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని "ఇప్పుడు చెప్పు నా సీత ని పెళ్లి చేసుకుంటావా???" అని ఒక ఐబ్రో ఎగరేసి స్టైల్గా అడుగుతాడు
"లేదు లేదు నేను చచ్చినా చేసుకోను... ఇప్పుడే పారిపోతాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతాను" అని రామ్ కాళ్ళమీద పడి పోతాడు
"దెబ్బ పడితే గాని దారిలోకి రారే... మామూలుగా చెప్పినప్పుడు వినచ్చు కదా ఇలా కొట్టే వాడిని కాదు" అని కోపంగా అంటూ భుజం మీద చరవగానే "ఆ...ఆ" అంటూ అరుస్తాడు
"అయ్యో సారీ బ్రదర్ కోపంలో కొట్టేశాను... ఏమనుకోకు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకో ఇప్పుడు నువ్వు వెళ్ళిపో" అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు
అతను మనసులో "ఈ పెళ్లి నా చావుకొచ్చింది... ఆ సీత వద్దు ఈ పెళ్ళి వద్దు" అనుకొని తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోయేంతలో
మాధురి సీత ఇద్దరూ కలిసి పెళ్లి కొడుకు రూమ్ లోకి వచ్చి అతన్ని అలా చూసి "ఎక్కడికి వెళ్ళిపోతున్నారు???" అని మాధురి అడిగితే (రామ్ దెబ్బలు కనిపించట్లేదా అనుకోకండి రామ్ పైకి కనిపించకుండా కొట్టాడు అందుకే అతను నార్మల్గా ఉన్నట్టు కనిపించాడు)
(మాధురి సీత రూమ్ లోకి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంది... కంగారుగా తన దగ్గరికి వెళ్లి "ఎందుకు ఏడుస్తున్నావ్ సీత???" అని అడిగితే
"నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అత్త... బావ అంటే ప్రాణం...ఈపెళ్ళి నాన్న కోసం చేసుకుందామనుకుంటున్నాను కానీ నావల్ల కావడం లేదు" అని ఏడుస్తూ మాధురిని హత్తుకుంటుంది
మాధురి సీత ని ఊరుకోబెట్టి "ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఏమైనా చేసే దాన్ని కదా!!!" అని నిదానంగా అడుగుతుంది
"చెప్తామనే అనుకున్న అత్త కాని కి
బావకి నేనంటే ఇష్టం లేదని చెప్పలేకపోయాను ఇప్పుడు బావ కి కూడా నేనంటే ఇష్టమే" అని వాళ్ల మధ్య జరిగింది చెప్తుంది...
"ఇంత పిచ్చిగా ఎందుకు బిహేవ్ చేసావే... మీకంటే మాకు పరువు ముఖ్యమా???" అని కోపంగా అడుగుతుంది
సీత బిక్క మొహం వేసుకొని "అప్పుడు తెలియలేదు ఇప్పుడు కష్టంగా ఉంది" అని అంటుంది
"మరి ఇప్పుడేం చేయాలి???" అని ఆలోచించి "ముందు పెళ్లి కొడుకు తో ఒకసారి మాట్లాడదాం పదా" అని సీతను తీసుకొని వెళుతుంది...)
అతను సీతని చూసి "ఇంత అందగత్తెని నేనెందుకు వదులుకోవాలి పెళ్లి పీటల మీద కూర్చున్నక ఏం చేస్తాడు" అనుకొని "ఎక్కడికి లేదండి అన్నీ బట్టలు ఉన్నాయా లేవా అని చూసుకుంటున్నాను!!!" అని నవ్వుతూ అంటాడు
"మీతో కొంచెం మాట్లాడాలి అండి" అని సీత అనగానే
"చెప్పండి" అని నవ్వుతూ సీతని చూస్తూ ఉంటాడు
అతని చూపు ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత ఇంకెప్పటికీ మాట్లాడలేను... అనుకొని "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి... నేను మా బావ రామ్ ని ప్రేమించాను... తననే పెళ్లి చేసుకుంటాను" అని తల దించుకొని అంటుంది
అతను కోపంగా "మీ బావ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నన్ను ఎందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చారు???" అని కోపంగా అరుస్తాడు
"అప్పుడు మా బావకి నామీద ప్రేమ లేదండి... మీతో ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్పాడు... నేను మా నాన్న ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను... కానీ చేసుకోలేకపోతున్నాను!! మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను బ్రతికున్న శవంలాగే బ్రతకాలి... అందుకే ధైర్యం చేసి మీతో మాట్లాడదామని వచ్చాను" అని అంటుంది
అతను అసహనంగా అయితే "ఇప్పుడు నన్నేం చేయమంటారు???" అని అరుస్తాడు
"ఏం లేదండి మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపొండి... మా బావని ఎలాగోలా మా అత్త ఒప్పిస్తుంది" అని నవ్వుతూ ఉంటుంది
"మీ అందరికీ నేను ఒక జోకర్లా కనిపిస్తున్నానా??? మీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి!!! నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే తీరుతాను" అని కోపంగా అంటాడు
మాధురి కోపంగా వెళ్లి అతని చెంప మీద కొడుతుంది
ఆ దెబ్బకి అతనికి కళ్ళు బైర్లు కమ్ముతాయి తల పట్టుకుని బెడ్ మీద కూర్చుంటాడు
"అయ్యో అత్త అలా ఎలా కొట్టేసావు!!! పాపం అతను ఎలా ఉన్నాడో చూడు..." అని జాలిగా ఉంటే
"అత్త అంటే మీకు ఏమవుతుంది??" అన డౌట్ గా అడిగితే
"మా రామ్ బావ వాళ్ళ అమ్మ... నాకు కాబోయే అత్త" అని నవ్వుతూ చెప్తుంది
"అతనికి ఈమె పోలికే అనుకుంటా అతను కూడా ఇలాగే కొట్టాడు" అనుకొని "సరే నేను వెళ్ళిపోతా లెండి.. నావల్ల మీరు ఇద్దరు కలిస్తే అంతే చాలు" అని సెంటిమెంట్ డైలాగ్స్ కొడతాడు
"అయ్యో సారీ బాబు నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు... లేకపోతే ఇంకో నాలుగు తగిలిద్దాం అనుకున్నా" అని నవ్వుతూ ఉంటుంది
"ఆహా ఎంత మంచి వారండి వెళ్లకపోతే ఇంకో నాలుగు తగిలించైనా పంపించాలి అనుకున్నారా??? మీలాంటి మంచి వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఉండరు... మీకోక నమస్కారం ఈ పెళ్ళి కో నమస్కారం" అని చేతితో?? పెట్టి బ్యాగ్ పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న లని తీసుకొని వెళ్ళి పోతాడు...
ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Posts: 997
Threads: 9
Likes Received: 8,419 in 608 posts
Likes Given: 3,984
Joined: May 2019
Reputation:
1,042
Posts: 744
Threads: 2
Likes Received: 735 in 499 posts
Likes Given: 597
Joined: Dec 2020
Reputation:
14
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
ప్రస్తుతం
రామ్ కి తెలిసినంతవరకు గుర్తుకు తెచ్చుకొని సీత ని చూస్తూ "ఎంత క్యూట్ గా నిద్ర పోతున్నావే!!! నీకోసం పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది... మా అమ్మ ముందు కూడా నటించాల్సి వచ్చింది... రాక్షసి అయినా నీ కోసం ఏదైనా చెయ్యొచ్చులే"అని నవ్వుతూ అనుకుంటూ తనని ఇంకా దగ్గరికి తీసుకుని నిద్ర పోతాడు
ఉదయాన్నే నిద్రలేచిన సీత రామ్ కౌగిట్లో ఉండటం చూసి నవ్వుకుంటూ "నన్ను దూరంగా ఉండమని నువ్వు దగ్గరికి వస్తావా బావ???" అనుకుంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళుతుంది
రామ్ సీత లేచినప్పుడే నిద్ర లేచిన ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు తన మాట్లాడుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకునే సరికి మనసులో సంతోషంగా ఉన్న బయటికి చూపించకుండా నిద్ర నటిస్తాడు... తను వెళ్ళగానే నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని అలా కొంచెం సేపటికి నిజంగానే నిద్రపోతాడు
సీత కొంచెం సేపటికి ఫ్రెష్ అయి వచ్చి రామ్ ని నిద్ర లేపుతుంటే రామ్ విసుగ్గా కళ్ళు తెరిచి సీతను చూసి ఫ్రిజ్ అయిపోయాడు
సీత చీర కట్టుకోకుండా ఓన్లీ లంగా జాకెట్ మీద వచ్చి రామ్ ముందు నిలబడి నిద్ర లేపుతుంది...
వెంటనే కళ్ళు మూసుకొని "ఏంటే ఈ ఫ్రీ షో నాకు!!!" అని కంగారుగా అడుగుతుంటే
"బావ" అని గారంగా పిలుస్తుంది...
తనాల పిలవగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చి "ఏంటి??" అని అడుగుతాడు
"నీకు తెలుసు కదా నాకు చీర కట్టుకోవడం రాదని!!! నువ్వే నాకు చీర కట్టు" అని తన చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే
"ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు??? నేను నీకు చీర కట్టడం ఏంటి???" అని కంగారుగా అడుగుతాడు
"తప్పేముంది బావ నేను నీ పెళ్ళాన్ని కదా!!! నన్ను నువ్వు ఎలా అయినా చూడొచ్చు అందుకే సైలెంట్ గా చీర కట్టు... లేకపోతే ఇలానే బయటికి వెళ్లిపోతాను" అని బెదిరిస్తుంది
"అమ్మో ఇది ఇలా బుక్ చేస్తుందంటి దీన్ని ఇలా చూసి నేను కంట్రోల్లో ఉండగలనా అస్సలు ఉండలేను..." అనుకుంటూ "నేను కట్టను... నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవే" అంటే
"సరే నేను ఇలాగే బయటికి వెళ్తున్న" అంటూ అడుగుల చప్పుడు చేస్తుంటే
రామ్ ఖంగారుగా కళ్ళు తెరిచి సీత ని చూస్తే తన మొహాన్ని రామ్ మొహానికి దగ్గరగా ఉంటుంది... సీతను అంత దగ్గరగా ఉండేసరికి తన కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోతాడు
సీత నవ్వుతూ "బావా చీర" అని గారంగా అడుగుతుంది
"ఇది కట్టకపోతే ఇలాగే వెళ్లేటట్టు ఉంది" అనుకుంటూ "సరే ఇవ్వు కడతాను" అని చెప్పి చీర తీసుకొని కళ్ళు మూసుకుని కడుతుంటే రామ్ చేతి వేళ్ళు సీత ఒంటిమీద ఎక్కడెక్కడో తగులుతుంటే
"అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ హహహ అంటూ నవ్వుతూ "బావ నువ్వు కితకితలు పెడుతున్నావు కళ్ళు తెరిచి కట్టొచ్చు కదా!!! ఇలా ఎక్కడపడితే అక్కడ ముట్టుకోపోతే" అని అంటుంటే
"ఏమ్ ఇలా కడితే కట్టించుకోవా???" అని చిరుకోపంగా అడుగుతాడు
"ఎందుకు కట్టించుకొను... నువ్వు ఎలా కట్టిన నాకు ఓకే కాకపోతే కళ్ళు మూసుకొని కడితే ఎక్కడెక్కడో పట్టుకుంటున్నవు... నీకు ఇష్టమైతే అలానే కట్టు" అని నవ్వుతూ అంటుంది
"ఇది నన్ను కంట్రోల్లో ఉండనిచ్చేలా లేదు" అనుకుంటూ అలాగే కడుతుంటే సీత నడుము, తన ఎత్తుపల్లాలు టచ్ అవుతుంటే కంగారుగా కళ్ళు తెరిచి సీతను చూసి అలానే చూస్తూ ట్రాన్స్ లో చీర కట్టేస్తాడు
సీత రామ్ ని చూసి నవ్వుతుంటే రామ్ సీత నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టేస్తాడు... సీత కూడా అతనికి సహకరిస్తూ రామ్ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తన వంతు సహకారం అందిస్తుంది..
ఐదు నిమిషాలకి రామ్ సీత ని వదిలి "ఎందుకే నన్ను ఇలా చేస్తున్నావు??? నన్ను కంట్రోల్లో ఉండనిచ్చేలా లేవు... ఇక్కడే ఉంటే ఏదేదో అయ్యేటట్టు ఉంది" అని వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడతాడు
సీతా గట్టిగా నువ్వుతూ "నీ ప్రేమ బయట పెట్టే వరకు నేను నిన్ను కంట్రోల్ తప్పేలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను బావ... గెట్ రెడీ ఫర్ దట్" అని నవ్వుతూ బయటికి వెళ్లి పోతుంది
"అమ్మో ఇది మామూలుది కాదు... రేయ్ రామ్ అది ఎంత ఇబ్బంది పెట్టిన నువ్వు మాత్రం కంట్రోల్ లోనే ఉండు... తను నీ ప్రేమ తెలుసుకునే వరకు ఇలాగే ఉండాలి..." అనుకొని ఒక గంట స్నానం చేసి వచ్చి రెడీ అయి బయటికి వస్తాడు
సీత హాల్లో కూర్చుని వస్తున్న రామ్ ని చూసి "బావ కాఫీ తెస్తా"అంటూ వయ్యారంగా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని ఈసారి నడుపు కనిపించేలా వయ్యారంగా నడుస్తూ రామ్ దగ్గరికి వస్తుంది
రామ్ వస్తున్న సీత ని చూసి తన నడుము కనిపిస్తుంటే సొల్లు కారుస్తూ అలానే చూస్తూ ఉంటాడు..
రామ్ ని అలా చూసి మాధురి సీత నవ్వుకుంటే
సీత "బావ కాఫీ" అంటూ కాఫీ ముందుకు పెడుతుంది
రామ చూపు తిప్పకుండా కాఫీ కప్ అందుకని అలాగే చూస్తూ వేడివేడి కాఫీ తాగే సరికి నాలుక కాలుతుంది... అప్పుడు స్పృహలోకి వచ్చి "ష్ కాలింది...దీనితో జాగ్రత్తగా ఉండాలి"అనుకొని కాఫీ తాగుతూ ఉంటాడు సైలెంట్ గా
కొంచెం సేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ "మమ్మీ నేను రేపు బెంగళూరు వెళ్ళిపోతున్న
నా లివ్స్ అయిపోయాయి... సీతని మీ దగ్గరే ఉంచుకోండి" అని సీతని ఓరగా చూస్తూ ఉంటాడు
సీత ఏడుపు మొహం పెట్టుకొని రామ్ ని చూస్తుంటే మాధురి కోపంగా "సీత ఇక్కడే ఉండటం ఏంటి??? ఇప్పుడు అది నీ పెళ్ళాం నీతో పాటు తీసుకోవెళ్లాలి... అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీలు లేదు 16 రోజుల పండుగ వరకు ఊరు దాటావంటే కాళ్ళు విరగకొడతాను... మూసుకొని పోయి లోపల పడుకో" అని చెబుతారు
ఇప్పుడు సీత నవ్వుతుంటే రామ్ ఏడుపు మొహం పెడతాడు...
"అదేంటమ్మా" అని దీనంగా అడిగితే
"అదంతే సాంప్రదాయం మూసుకొని టిఫిన్ చేసి పోయి పడుకో" అని కోపంగా అంటే
రామ్ వాళ్ళ నాన్న వైపు దీనంగా చూస్తాడు హెల్ప్ మీ అన్నట్టు... మహేశ్వర్ గారు నేనేం చేయలేను అని సైగ చేసి భుజాలేగరేస్తారు...
దాంతో రామ్ ఏం చేయలేక ఉసూరుమంటూ టిఫిన్ తిని లోపలికి వెళ్లి లాప్టాప్ తీసుకొని 16 రోజుల వరకు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ పెట్టుకుంటాడు...
రామ్ వెళ్లగానే మాధురి సీత ని తీసుకొని తన రూం కి తీసుకెళ్ళి 'ఏమంటున్నాడు నా కొడుకు" అని అడిగితే
"చాలా నిగ్రహంగా ఉన్నాడు అత్త... అసలు కరగటం లేదు" అని ఉదయం జరిగిందంతా చెప్తుంది
"నువ్వు అసలు వదలకు ఈ పదహారు రోజులు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయి... వాడు ఇక్కడ మారకపోతే బెంగళూరు వెళ్ళాక మార్చుకో" అని చెప్పి మోటివేట్ చేస్తుంది...
అలా ఆ రోజు నైట్ సీత రూమ్ లోకి రాగానే వర్క్ చేస్తున్నా రామ్ తలతిప్పి సీతను చూసి అలాగే చూస్తూ ఉంటాడు... సీత పల్చటి ఎల్లో కలర్ శారీ కట్టుకొని తన అందాలన్నీఆరబోస్తూ రూమ్ లోకి వస్తుంది... తనని అలా చూసి రామ్ గొంతు తడారిపోతుంది..
"ఏ ఏ ఏంటి ఈ చీర కట్టుకోవడం... ఇలా ఎవరైనా కట్టుకుంటారా???" గుటకలుమింగుతూ అడుగుతుంటే
"పెళ్లి అయిన అమ్మాయి భర్త దగ్గరికి ఇలాగే వెళ్లాలంట బావ... అత్త చెప్పి నన్నిలా రెడీ చేసింది.." అని అమాయకంగా చెప్తుంది
"అమ్మో అమ్మ ఈ రోజు నా నిగ్రహానికి పరీక్ష పెట్టింది..." అనుకుంటూ "సరే నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫా లో పడుకుంటా" అంటూ దిండు దుప్పటి తీసుకుంటుంటే
"ఏం బావా నా దగ్గర పడుకుంటే కంట్రోల్ పోయి నాతో కలిసి పోతానని భయమా!!!" అని అల్లరిగా అడుగుతుంది
"నాకు భయమా హ హ హ ఇక్కడ రామ్ అంత సీన్ లేదు నీకు" అని బింకంగా అంటాడు
"అయితే బెడ్ మీద నువ్వు పడుకో నేను పడుకుంటా!!!" అని చెప్పి సీత బెడ్ మీద వెల్లకిలా పడుకుంది...
అలా పడుకునే సరికి తన చీర నడుము దగ్గర చీర కొంచెం పక్కకి తొలగి నాభి అందమంతా కనిపిస్తూ ఉంటుంది... సీతని అలా చూసి రామ్ గుటకలు మింగుతూ " నీ నీ చీర అక్కడ పక్కకి పోయింది సరి చేసుకో" అని తడబడుతూ నడుము వైపు వేలు చూపించి నడుముని అలానే చూస్తూ ఉంటాడు..
"ఎక్కడ బావ???" అని అమాయకంగా అడుగుతూ తనవైపు తిరిగేసరికి తన ఎద భాగం దగ్గర కూడా చీర పక్కకి తిరిగే సరికి రామ్ గొంతు తడి ఆరిపోతుంటే "ఇది నన్ను ఈరోజు చంపేసేలా ఉంది" అనుకుంటూ బెడ్ కి ఒక చివర పడుకొని ఫుల్ గా దుప్పటి ముసుకు వేసుకొని కళ్ళు మూసుకుంటాడు...
రామ్ ని అలా చూసి నవ్వుకుంటూ సీత కూడా దుప్పట్లో దూరి "ఏంటి బావ అప్పుడే పడుకున్నావు?? నాతో కబుర్లు చెప్పు నాకు నిద్ర రావటం లేదు" అంటూ రామ్ చెయ్యిని తన నడుము మీద వేసుకొని రామ్ గుండెల మీద చేయి వేసి సున్నాలు చుడుతూ గారంగా అడుగుతుంది
సీత తన చేయిని తన నడుము మీద వేయగానే రామ్ శరీరమంతా జివ్వుమనిపించి నడుము దగ్గర తన పట్టుని బిగించి దగ్గరికి లాక్కుని నడుముని నలిపేస్తుంటే "బావ" అంటూ మత్తుగా మూలుగుతూ రామ్ చుట్టూ చేతులు వేస్తుంది...
"ఏంటే "అని మత్తుగా అంటూ తన చేయి కొంచెం కొంచెం పైకి తీసుకొని వస్తూ తన వీపు నిమురుతూ ఉంటే సీత రామ్ ని గాఢంగా హత్తుకుని తనే మొదట రామ్ పెదవులు అందుకుని కిస్ చేయటం స్టార్ట్ చేస్తుంది
రామ్ కూడా ఏదో మైకం కమ్మినట్టు అనిపిస్తుంటే తను కూడా సీత పెదవుల్ని వదలకుండా తన చేతితో సీత నడుముని సవరదీస్తూ ముద్దుని ఊపిరి అందనంత గాఢంగా మారుస్తాడు
సీత కూడా తనకి సహకరిస్తుంటే ఇంకా రెచ్చి పోయి సీత గట్టిగా తనకేసి అదుముకుని కిందపెదవిని కొరకి తన పెదవులని వదిలి సీత వైపు అల్లరిగా చూస్తుంటే
సీత సిగ్గుపడుతూ రామ్ గుండెల్లో వదిగిపోతుంది...
రామ్ నవ్వుతూ తనని గట్టిగా హత్తుకొని వీపు మీద జో కొడుతుంటే సీత చిన్నగా నిద్రపోతుంది
"రాక్షసి ఎలా ఉన్నా వాడిని ఎలా తయారు చేస్తున్నావు!!! నిన్ను చూస్తే నన్ను నేను కంట్రోల్ లో ఉంచుకోలేక పోతున్నా!!! ఇలాగైతే ఎలాగే" అనుకుంటూ సీత ని చూస్తూ తను కూడా నిద్ర పోతాడు
అలా అక్కడ ఉన్న 16 రోజులు సీత ఏదో ఒకటి చేసి రామ్ విగ్రహానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది... అయినా రామ్ తనని తాను కంట్రోల్ చేసుకొని కొంచెం దూరం పెడుతూనే ఉన్నాడు అలా 16 రోజుల పండుగ చేసుకొని బెంగళూరు వెళ్తారు
రామ్ డైరెక్ట్ గా తను ఉండే ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు... అది డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్...సీత మొత్తం చుట్టి నవ్వుతూ రామ్ వైపు చూస్తుంటే "బాగుందా???" అని ఆతృతగా అడుగుతాడు
సీత రెండు చేతులు బార్లా చాపి "ఇంత బాగుంది" అని నవ్వుతూ అంటుంది
"సరే ఇంట్లోకేంమేం కావాలో షాపింగ్ చేద్దాం లిస్ట్ రాసుకో" అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ బయటే టిఫిన్ చేసి షాపింగ్ కి వెళ్లి కావాల్సిన అన్ని కొనుక్కుని వస్తారు... రెండు రోజుల్లో సీత తనకి నచ్చినట్టుగా ఫ్లాట్ మార్చేస్తుంది...
ఆ రోజు నైట్ భోజనం చేశాక రామ్ సీత ని ఉడికించడానికి "నువ్వు ఈరూమ్ లో పడుకో నేను ఈ రూమ్ లో పడుకుంటా" అని నవ్వుతూ అంటాడు
"అదేంటి బావా!!! నేను ఎందుకు ఆ రూమ్ లో పడుకోవాలి???" అని అమాయకంగా అడుగుతుంది
రామ్ లోపల నవ్వుని దాచేస్తూ "నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను కదా!!! నిన్ను ఓన్లీ మరదలు గానే చూస్తానని... అందుకే ఇక్కడ మన ఇద్దరం సెపరేట్ గా ఉందాం. . ఇంటి దగ్గర ఆంటే అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఒకే గదిలో ఉన్నం... ఇప్పుడు అలా కాదు నువ్వు ఈ రూమ్ లో పడుకో నేను ఈరూమ్ లో పడుకుంటాను" అని చెప్పి వెళ్తుంటే
రామ్ నవ్వాపుకోవడం చూసి "బావ నాతోనే గేమ్సా!!! ఇప్పుడు చూడు" అనుకుంటూ రామ్ అడ్డంగా నిలబడి వయ్యారంగా నడుము పై చేయి పెట్టుకుని తల పక్కకి వంచి రామ్ ని ఓరగా చూస్తూ "అదేంటి బావా అలా అంటావ్!!! ఈ రెండు రోజులు నీతో నేను పడుకున్నా కదా!!! ఇప్పుడు పడుకుంటే నిగ్రహానికి భంగం కలుగుతుందని భయమా???" అని రెచ్చగొడుతుంటే
రామ్ సీత నడుమునే చూస్తూ "నేను అంత వీక్ కాదు అని నీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు మూసుకొని వెళ్ళి పడుకో" అని చూపు తిప్పకుండా అంటాడు
"ఇక ఇలా అంటే మాట వినడు" అని "నువ్వు అవునన్నా కాదన్నా మనిద్దరం మొగుడు పెళ్ళాలం... కాబట్టి ఇద్దరం ఒకే గదిలో పడుకోవాలి... నువ్వు వస్తే రా లేకపోతే లేదు" అనిచెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటుంది
రామ్ లోపలికి వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయంతో బయట సోఫా లో పడుకుంటాడు... అరగంట చూసినా రామ్ లోపలికి రాకపోయేసరికి సీత డోర్ తీసి బయటికి వచ్చి చూస్తే రామ్ సోఫాలో నిద్ర పోతున్నాడు... దాంతో కోపం వచ్చి లోపలికి వెళ్లి ఒక అరగంట బయటికి వచ్చి రామ్ పక్కనే సోఫాలో తనని హత్తుకుని పడుకుంటుంది...
రామ్ సీత వస్తున్నప్పుడే పట్టీల శబ్దం విని వచ్చిందని అర్థం అయ్యి కళ్ళు తెరవకుండా అంతే పడుకుని ఉంటాడు... కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో అని సీత వచ్చి పక్కన పడుకోగానే వెంటనే కంగారుగా తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని "పడిపోతావ్" అని అప్పుడు తనని పరీక్షగా చూసి గుటకలు మింగుతూ "ఎప్పుడూ లేనిది ఇలాంటివి వేసుకున్నవు ఏంటి??? అని అడుగుతుంటే
రామ్ మొహం లో మారుతున్న ఫీలింగ్స్ ని చూసి నవ్వుకుంటూ మత్తుగా "మొగుళ్ళు దగ్గర పెళ్ళాల కి ఇలాంటి బట్టలు కంఫర్ట్ గా ఉంటాయి అని అత్త చెప్పింది... అందుకే ఇక నుంచి ఇవే వేసుకుంటాను..." అని ఇంకా దగ్గరికి జరిగి రామ్ ని హత్తుకుని పడుకుంటుంది
"మా అమ్మ ఒకటి నా ప్రాణానికి" అనుకొని షోల్డర్ లెస్ నైటీ లో ఉన్న సీతను చూసి గుటకలు మింగుతూ "ఇక్కడ ఉండి ఏదో అయిపోయే లోపల బెడ్ పై పడుకోవటం మేలు" అనుకొని సీత మీద చేతులు తీసి లోపలికి వెళ్లి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు..
సీత నవ్వుకుంటూ "అది అలా రా దారికి లేకపోతే ఈ సీతతోనే ఆటల" అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రామ్ నిద్ర పోవడం చూసి తన పక్కన వెళ్లి పడుకొని రామ్ ని చూస్తూనే నిద్రపోతుంది
సీత నిద్రపోయింది అనుకున్నాక కళ్ళు తెరిచి "ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావ్ రాక్షసి... నిన్ను ముందుంచుకుని మడి కట్టుకొని కూర్చోవటం ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు... నువ్వు ఆ రోజు అలా అనకుండా ఉండి ఉంటే ఈ రోజు ఇద్దరం సంతోషంగా ఉండే వాళ్ళం... నీకు తెలియాలి కదా నా ప్రేమ విలువ" అనుకొని తన దగ్గరగా జరిగి "ఏం చేస్తున్నావే??? వీటిలో నిన్ను చూస్తుంటే గొంతు తడారిపోతుంది... ఇలా అయితే కష్టమే" అనుకుంటూ నగ్నంగా ఉన్న తన భుజం మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని తను కూడా నిద్ర పోతాడు
ఇంకా ఉంది
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
నెక్స్ట్ డే రామ్ తన ఫ్రెండ్స్ ని తీసుకొస్తా అని చెప్పేసరికి సీత నైట్ భోజనాలకి ఏర్పాట్లు చేస్తుంది... అలా నైట్ తన ఫ్రెండ్స్ అందరికీ సీతని తన వైఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాడు... "ఇంత సడన్ గా పెళ్లి ఎందుకు చేస్తున్నారు??? అది ఎవరికీ చెప్పకుండా??"అని అడిగితే
"తప్పని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది" అని అంటాడు... అలా సీతని అందరికీ పరిచయం చేస్తాడు... ఆ నైట్ కూడా సీతని దూరంగా ఉంచే నిద్రపోతాడు
నెక్స్ట్ డే సీత మాధురి కి ఫోన్ చేసి ఇక్కడ జరిగినవన్నీ చెప్పి "అత్త బావ కొంచెం కూడా కరగటం లేదు... ఇలా అయితే చాలా కష్టం" అని బాధగా అంటుంటే
మాధురి ఏదో ప్లాన్ చెప్తుంది... సీత నవ్వుకుంటూ "సరే అత్త" అని చెప్పి ఫోన్ పెట్టేసి "ఈ రోజేలా తప్పించుకుంటావో చూస్తా బావ!!!" అనుకొని నైట్ భోజనాల దగ్గర రామ్ కి వడ్డించి ఆతృతగా తనవైపే చూస్తుంటే
రామ్ విచిత్రంగా కూరలు వైపు చూసి సీత వైపు చూస్తుంటే "ఏంటి బావ అలా చూస్తున్నావు??? తిను" అని నవ్వుతూ అంటుంది
"ఈరోజు ఏంటి స్పెషల్ అన్ని మునక్కాయల తోనే చేశావు..." అంటూ తనకు వడ్డించిన మునక్కాయ కూర, మునక్కాయ ఇగురు , మునక్కాయ సాంబార్ చూసి "అన్ని ఒకే కూరగాయతో చేశావంటే???" అని డౌట్ గా చూస్తూ అడిగితే
"ఈరోజు ఒక స్పెషల్ ఉంది బావ... అందుకే చేశాను... తిన్న తర్వాత చెప్తాను ముందు నువ్వు తిను" అని చెప్పి తిన్నాక తన ఫ్లేట్లోనే సీత కూడా తిని సోఫాలో రామ్ పక్కన కూర్చుంటుంది
"ఇప్పుడు చెప్పు ఏంటి స్పెషల్" అని నవ్వుతూ సీత వైపు చూస్తూ అడుగుతాడు
"మునక్కాయ తింటే మగాడు ఆగలేదంట బావ... అత్త చెప్పింది... ఈరోజు నువ్వెలా నిగ్రహంగా ఉంటావో నేను చూస్తా!!!" అని నవ్వుతూ అంటే
"ఇలాంటి చిన్న చిన్న వాటికి ఈ రామ్ ఎప్పటికీ లొంగడు" అని తను కూడా తగ్గకుండా అంటాడు
"అయితే ఒక అరగంట నేను ఏమి చేసినా నువ్వు సైలెంట్ గా ఉండాలి... నన్ను ముట్టుకోకూడదు... అప్పుడు చెప్పు" అంటూ ఇప్పుడే వస్తా అని హాఫ్నవర్ లో పల్చటి చీర కట్టుకొని తన అందాలన్నీ ఆరబోస్తూ దగ్గరికి వచ్చి రామ్ ఒళ్లో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి తన మొహం లోకి మత్తుగా నవ్వుతూ చూస్తుంది
రామ్ కి సీత అలా తన ఒల్లో కూర్చొని పైగా తన అందాలని ఆరబోస్తూ ఉంటే కష్టంగా గుటకలు మింగుతూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ "ఏంటే ఇది ఇలాంటివి చేయొచ్చా!!!" అది కష్టంగా అడుగుతుంటే
"చెప్పా కదా బావ ఈ అరగంట నేను ఏం చేసినా నువ్వు సైలెంట్ గా ఉండాలి... నువ్వు నిగ్రహం కోల్పోకపోతే అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు నేను సైలెంట్ గా ఉంటాను" అని అంటుంది
రోజు ఈ కష్టాలు కంటే ఈ ఒక్క అరగంట భరించడం మేలనుకొని సరే అంటాడు
సీత తన చూపుడు వేలుతో రామ్ నుదిటి నుంచి చిన్నగా కిందికి వస్తూ ఫేస్ అంతా తన వేళితో రాస్తుంటే రామ్ ఏదో లోకం లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్నాడు..
రామ్ నుంచి ఆ రెస్పాన్స్ కి నవ్వుకుంటూ రామ్ నుదిటి మీద కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ పెదాలందుకుని కిస్ చేయటం స్టార్ట్ చేస్తుంది... సీత కిస్ చేయడం చూసి షాక్ అవుతాడు
రామ్ అలా షాక్ లో ఉండగానే సీత తన పెదాలను వదిలి రామ్ మొహమంతా ముద్దులు పెడుతూ టీ షర్టు లోపలకి చెయ్యి పెట్టి వీపు తడుముతుంటే రామ్ కళ్ళు మూసుకుని ఏదో లోకంలోకి వెళ్ళిపోతాడు
సీత రాముని గట్టిగా హత్తుకొని "బావ" అంటూ మత్తుగా పిలుస్తుంటే "ఏంటి" అంటూ భారంగా కళ్ళు తెరచి చూస్తే అడుగుతాడు
"బావ ప్లీజ్ మనం ఒకటైపోదాము... ఇలా నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది.. ప్లీజ్ బావ" అని అడుగుతుంటే
అప్పుడు స్పృహలోకి వచ్చి "నీ టైం అయిపోయింది ఇప్పుడు నేను దగ్గరికి వచ్చేంతవరకు నువ్వు ఇలా చేయకూడదు..." అని కోపంగా చెప్పి లోపలికి వెళ్లి "సారీ సీత... నీకు ఈమాత్రం డోస్ పడకపోతే కష్టం... లేకపోతే నన్ను నువ్వు అర్థం చేసుకోలేవు!!!" అనుకొని నిద్రపోతాడు.
సీత నైట్ ఏడుస్తూ అక్కడే నిద్రపోతుంది
ఆ తర్వాత సీత రామ్ ని అలా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కానీ రామ్ కి కావాల్సినవన్ని తానే చూసుకుంటూ ఉంటుంది...
ఒకసారి రామ్ వర్షంలో బాగా తడిచి ఇంటికి వస్తే
"ఏంటి బావ ఇలా తడిచి పోయావు??? వర్షం ఆగిపోయాక నిదానంగా రావచ్చు కదా!!! అంత తొందరెందుకు???" అని కోపంగా అంటూ కూర్చోబెట్టి టవల్ తో తల తుడుస్తుంది
తరువాత కిచెన్ లోకి వెళ్ళి పాలు వేడి చేసి పసుపు వేసి తీసుకొనివచ్చి ఇచ్చి తాగమని చెప్తుంది ఏం మాట్లాడకుండా నవ్వుతూ తాగేస్తాడు
తర్వాత ఇద్దరూ ప్రెస్ ఐ భోజనం చేసి నిద్ర పోతారు
తర్వాత రోజు కి రామ్ కి విపరీతంగా జ్వరం వచ్చి కళ్ళు కూడా తెరవలేక పోతుంటే సీతకి భయమేసి డాక్టర్ ని పిలిపించి చూపిస్తుంది...
డాక్టర్ "బాగా వర్షంలో తడవడం వల్ల జ్వరం వచ్చింది ఇంజక్షన్ చేశాను ఇప్పుడు పర్వాలేదు..."అని చెప్పే సరికి రిలాక్స్ అయ్యి రామ్ ని దగ్గరుండి చూసుకుంటుంది
రామ్ కి రెండు రోజుల తర్వాత జ్వరం తగ్గాక ఆఫీస్ కి వెళ్లి సీత గురించి ఆలోచిస్తూ "నేను అనవసరంగా తనని బాధ పెడుతున్నానా??" అనుకుంటూ బాగా ఆలోచించి నవ్వుకుంటూ ఇంటికి వెళతాడు
అలా ఒక వారం తర్వాత అర్దరాత్రి రామ్ ఫోన్ కంటిన్యూస్గా మోగుతుంటే విసుగ్గా నిద్రలేచి చూస్తే హాల్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయి... బయటికి వచ్చి హాలంతా చూసి షాక్ అవుతాడు...
అప్పుడే సీత వైట్ కలర్ సారీ లో రామ్ ముందుకు వచ్చి రామ్ చేతిని పట్టుకుని హాల్ మధ్యలోకి తీసుకుని వచ్చి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని "ఐ లవ్ యు బావ ఐ లవ్ యు సో మచ్... నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడి పెళ్లి ఆపేశాను... నీకు చేప్దాం అనుకున్నాను కానీ నువ్వు చెప్పే ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు" అని అంటూ తన చేసిందంతా చెప్తుంది
రామ్ దానికి షాక్ అయి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని సీతను కౌగిలించుకొని "నువ్వు కూడా వాడిని బ్రతిమిలాడా??" అని విస్మయంగా అడుగుతుంటే
సీతా రామ్ కౌగిలి నుంచి బయటికి వచ్చి "అంటే నువ్వు కూడా వాడి దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడవా బావ???" అని అడిగితే రామ్ చేసిందంతా చెప్తాడు...
అది విని సీత నవ్వుతుంటే రామ్ తన నవ్వుని మురిపెంగా చూస్తూ ఉంటాడు
రామ్ ని అలా తనని చూడటం చూసి "ఏంటి బావా అలా చూస్తున్నావు??? ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఇన్నాళ్ళు నువ్వు కావాలనే నాన్న, అమ్మ, అత్త వాళ్ళ చేత బ్రతిమిలాడించుకొని మరి పెళ్లి చేసుకొని నన్ను దూరం పెట్టావా???" అని చిరు కోపం గా అడుగుతుంటే
"మరి నువ్వేమో త్యాగమూర్తి లాగా మన ప్రేమని గోదాట్లో కలిపేద్దామన్నావు... నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేక వాడిని తప్పించైనా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యి అలా చేశాను... కానీ నీకు నా ప్రేమ విలువ తెలిసేంత వరకు దగ్గర అవ్వకూడదు అనుకున్నాను... అందుకే ఇన్నాళ్ల దూరం గా ఉంది... కానీ తెలుసా నువ్వు నాకు జ్వరం వస్తే అమ్మ లా చూసుకుంన్నావు కదా అప్పుడే ఫిక్స్ అయ్యాను ఈసారి నువ్వు దగ్గరగా వస్తే వదలకూడదు అని కానీ నువ్వు దగ్గరగా రాలేదు కదా!!!" అని నవ్వుతూ అంటుంటే
సీత రామ్ ని కోపంగా చూస్తూ "అంటే నీ మీద నాకు ప్రేమ లేదని నీ ప్రేమ విలువ నాకు తెలియదని అనుకున్నావా???" అని అడుగుతుంటే
"తెలిసి ఉంటే వేరే వాడిని చేసుకోవాలని అనుకోవు... నేను నీకు చెప్పినప్పుడే పెళ్లి క్యాన్సిల్ చేసేదానివి... నాకు తెలియదు కదా నువ్వు వాడి దగ్గరికి వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకున్నానని!!! అందుకే ఇన్నాళ్ల దూరం పెట్టాను... ఇప్పుడు ఏమి లేదు నువ్వు నేను ఒకటై పోవడమే"అని సీత ని తన మీదకి లాక్కుని ఇద్దరు పెదవులు ఒకటి చేస్తాడు... సీత ఎంత గింజుకున్నా వదిలిపెట్టకుండా అలాగే కొనసాగిస్తుంటే ఊపిరాడక రామ్ భుజాలమీద కొడుతూ ఉంటుంది... అప్పుడు సీత ని వదిలేసి నవ్వుతూ సీత ని చూస్తుంటే
సీత కోపంగా "ఇలా నా ముద్దు పెట్టుకునేది... ఊపిరి ఆడలేదు తెలుసా!!!" అని ఆయాసంగా అంటుంటే
"నా ప్రేమ కూడా నీకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది చూడు" అంటూ తనని దగ్గరకి లాక్కుంటే
"ఒక్క నిమిషం ముందు కేక్ కట్ చేద్దాం తర్వాత నీ ఇష్టం "అనగానే
"ఇప్పుడు కేక్ ఎందుకు???" అని అయోమయంగా చూస్తూ అడుగుతుంటే
"ఈ రోజు నీ బర్త్ డే బావ అందుకే ఈ డెకరేషన్ అంత" అంటూ హాల్ మొత్తం చూపించి(హలంత హార్ట్ షేప్ బెల్లున్స్ తో నిండిపోయి ఉంటుంది...చుట్టూ గోడలకి గులాబీ లతో డెకరేట్ చేసి ఉంటుంది)తనని కేక్ దగ్గరికి తీసుకువెళ్లి కట్ చేయించి రామ్ కి కొంచెం పెట్టి మిగిలింది ఫేస్కంతా రాస్తుంది...
సీత నవ్వుతూ చూస్తుంటే రామ్ కోపంగా ఇంకొక పీస్ తీసుకొని సీతకి రాయపోతుంటే సీత అది గ్రహించి రామ్కి దొరక్కుండా పరిగెడుతుంది... రామ్ సీత ని పట్టుకోడానికి పరిగెడుతుంటే సీత అలా ఒక చోట గోడ కి లాకై రామ్ కి దొరికిపోతుంది
రామ్ నవ్వుతూ"ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు??"అని సీతని చూస్తుంటే
" ప్లీజ్ బావ కేక్ రాయకు... నేను ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నాను ఇదంతా రాసి పాడు చేయకు" అంటే
" మరి నాకు రాసినప్పుడు తెలియదా???" అంటూ తన మొహం, మెడ ,నడుము అలా అలా చీర కవర్ చేయని ప్లేస్ అంతా రామ్ కేక్ రాస్తాడు
సీత చిరు కోపంగా చూస్తూ "ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి" అంటూ వెళ్లబోతుంటే
" అవసరం లేదు... ఇప్పుడే నాకు కేక్ కావాలి" అంటూ సీతని చిలిపిగా చూస్తూ తన మీదకు లాక్కుని అడుగుతుంటే
అదిగో అక్కడ ఉందిగా తిను నేను అంతేలో ఫ్రెష్ అయి వస్తా... అంటూ విడిపించుకోబోతుంటే "నాకు ఆ కేక్ కాదు ఈ కేక్ కావాలి" అంటూ తన పెదాల మీద ఉన్న కేక్ చూపించి తన పెదవులతో క్లీన్ చేసి సీత శరీరం మీద రాసిన కేక్ అంత తన పెదవులతో చూస్తాడు...
సీత కూడా తనకి సహకరిస్తూ గట్టిగా రామ్ నీ హత్తుకుంటుంది...
రామ్ కూడా తమకంగా తనని గట్టిగా హగ్ చేసుకొని రూమ్ కి వెళ్దాం సీత ప్లీజ్ అంటూ తనని ఎత్తుకుని తన రూమ్ కి తీసుకు వెళ్తుంటే "ఇక్కడికి కాదు అక్కడికి" అంటూ ఇంకో రూమ్ చూపిస్తుంది
రామ్ అయోమయంగా సరే అంటూ ఆ రూమ్ కి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపలంతా చూసి షాక్ అయ్యి సీత వైపు చూస్తే తన సిగ్గుపడుతూ రామ్ నే చూస్తూనే ఉంటుంది
"ఇదంతా ఎప్పుడు చేసావు???" అని అడిగితే
" నువ్వు నిద్రపో గానే అంతా చేసాను బావా... ఎలాగైనా నిన్ను ఒప్పించి నీ బర్త్ డే గిఫ్ట్ గా నన్ను నేనే ఇద్దామనుకున్నాను!!!" అని తలదించుకునే అంటుంది
రామ్ వెంటనే తనని కౌగిలించుకుని క్షణం ఆలస్యం చేయకుండా పెదవులు అందుకున్నాడు... అలా తనని వదలకుండా నిదానంగా తీసుకువెళ్లి పై బెడ్ పైన పడుకోబెట్టి తన పైకి చేరి పెదవులు వదిలేసి నుదుటి మీద ముద్దు పెట్టి చిన్నగా కిందికి వస్తూ కళ్ళు మీద, బుగ్గల మీద ముద్దులు పెట్టి, ఆపైన మరొకసారి పెదవులు అందుకని అమృతం రుచి చూసి చిన్న కిందకి దిగుతూ తన మెడ మీదుగా ముద్దు పెట్టాడు... సీత రామ్ కి సహకరిస్తూ తనకి తగినట్టుగా మారిపోతుంది... రామ్ చిన్నగా తన నుంచి చీరని వేరుచేసి నడుమున ముద్దాడి తన పంటి గాటుని గిఫ్ట్ గా ఇస్తాడు... సీత చిన్న బావ అని అరుస్తుంటే తన పైకి వచ్చి ఏంటి అంటూ మరొకసారి పెదవులను అందుకుని తమ నుంచి మిగిలిన వలువలు ను కూడా వేరుచేసి అప్పుడే పుట్టిన పాపాయిల లాగా మారి సీత ను పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు... సీత మనస్ఫూర్తిగా రామ్ కి తన సర్వస్వం అర్పిస్తుంది
అలా ఇద్దరు ఒకటిగా మారిపోతారు అలా చూస్తూ ఉండగానే ఆరు నెలలు గడిచిపోతాయి సంతోషంగా
సీత ఆరు నెలలకి తల్లి కాబోతున్న విషయం అందరికీ చెప్పగానే అందరూ సంతోషిస్తారు... తమ కూతురి జీవితం ఏమైపోతుందో అనుకున్న రాగిని, మణికంట ఇప్పుడు తన కూతురు తల్లి కాబోతుందని తెలిసి కాళ్ళు నేలపై అనలేదు...
అలా వాళ్ళు సీతను తీసుకు వెళతాను అన్నా రాంబాబు ఒప్పుకోకుండా తనే చూసుకుంటాను అని గొడవ చేసి మరి తనతోనే ఉంచుకున్నాడు... కూతురు మీద అల్లుడి ప్రేమ చూసి సీత తల్లిదండ్రులు మురిసిపోతారు... అలా రామ్ సీతని జాగ్రత్తగా చూసుకున్నాడు... అలా తొమ్మిది నెలల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది.... రామ్ సంతోషంగా పాపని చేతిలోకి తీసుకుని నవ్వుతూ సీత దగ్గరికి వెళ్లి థాంక్యూ ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని తన నుదిటిన ముద్దు పెడతాడు
వాళ్ళని అలా చూసి మిగిలిన కుటుంబం అంతా సంతోషంగా ఆనందభాష్పాలతో చూస్తూ ఉంటారు
ఇలా రామ్ సీత కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను...
సమాప్తం
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,593
Threads: 0
Likes Received: 1,261 in 989 posts
Likes Given: 1,627
Joined: Dec 2021
Reputation:
21
Posts: 744
Threads: 2
Likes Received: 735 in 499 posts
Likes Given: 597
Joined: Dec 2020
Reputation:
14
cute love story... chala bagundi
Posts: 4,719
Threads: 0
Likes Received: 3,938 in 2,919 posts
Likes Given: 15,045
Joined: Apr 2022
Reputation:
65
Posts: 87
Threads: 0
Likes Received: 64 in 41 posts
Likes Given: 11
Joined: May 2019
Reputation:
3
Posts: 3,256
Threads: 33
Likes Received: 41,390 in 2,196 posts
Likes Given: 8,681
Joined: Dec 2021
Reputation:
9,024
Nice story
Made me smile
Continuity chala bagundhi
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
|