Posts: 2,333
Threads: 149
Likes Received: 7,690 in 1,563 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
577
నేను చదివిన ఓ ఆసక్తికరమైన కథ
మితృలకోసం ఇస్తున్నాను.
నచ్చితే చదవండి!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,333
Threads: 149
Likes Received: 7,690 in 1,563 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
577
'చిత్ర' కథ
- Bojja Rahul Reddy
అదృష్టమంతవైనవి నా ఊహలు..
గాలి గీతల చెరసాల లో బందీలు కావు..
పరిధులు లేని విశ్వం లో పక్షులై విహరిస్తుంటాయి.
‘మేఘ మలుపు‘ నగరం మధ్యలో.. నాలుగు అంతస్థుల ఆర్ట్ గ్యాలెరీ ‘చింతల శేషగిరి గ్యాలెరీ’ ప్రారంభ వేడుక అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ప్రముఖ చిత్రకారుడు, శిల్పి అయిన కీర్తి శేషులు నిలవనూరి రంగనాథం గారు గీసిన స్వాతంత్య్ర పోరాటపు చిత్రాలు ఆ ఆర్ట్ గ్యాలెరీలో ఉంచడమైనది. ఒకప్పటి మేఘ మలుపు వాస్తవ్యులు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడైన చింతల శేషగిరి గారి స్వాతంత్య్ర పోరాటపు సంఘటనలకు సంభందించిన చిత్రాలు అన్నింటిని గ్యాలెరీలో ఉంచారు. యువతరంలో స్ఫూర్తి నింపడానికి ఈ గ్యాలెరీ ఎంతో ఉపయోగపడుతుందని అందరి నమ్మకం. శేషగిరి గారి మనవడు, ఆ నియోజక వర్గ MLA, చింతల సురేంద్ర, గ్యాలెరీ ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గ్యాలెరీ ముందు ఉన్న ఖాళీ స్థలమంతా జనంతో కిటకిటలాడుతుంది. స్పీకర్లలో దేశ భక్తి పాటలు మారు మ్రోగుతున్నాయి. మధ్య మధ్యలో శేషగిరి గారి వీరత్వాన్ని చాటుతూ పాడిన పాటలు వస్తున్నాయి.
గ్యాలెరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో, ఇండిపెండెంట్ హౌస్ మీద సింగల్ రూమ్ పెంట్ హౌస్. రూమ్ అంతా చిందర వందరగా పడి వేసిన వివిధ చిత్రాలతో నిండి పోయి ఉంది. ప్రాంతీయ పత్రిక ‘నేటి ప్రపంచం’ లో కార్టూనిస్ట్, ఇరవయి ఎనిమిదేళ్ల నరహరి చిన్న అద్దం ముందు నిలుచొని పాట పాడుకుంటూ కంగారుగా ఒక చేత్తో చొక్కా తొడుక్కుంటూ, ఇంకో చేత్తో గ్లాసులో టీ పోసుకుంటున్నాడు. ఆ తొందర్లో టీ కాస్తా ఒలికి చొక్కా మీద పడింది. తొందరపాటుకు తనను తానే తిట్టుకుంటూ ఆ చొక్కా తీసేసి వేరే చొక్కా వేసుకున్నాడు. ఇంటి తాళం తీసుకొని ఏదో ఆలోచించుకుంటూ మెట్లు దిగుతూ బయల్దేరాడు. కింద సైకిల్ తీసుకొని బయల్దేరబోయేటప్పుడు జేబులో ఉన్న ఇంటి తాళం తగిలింది. తొందరలో ఇంటికి తాళం వేయడం మర్చిపోయి కిందికొచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ మెట్లెక్కి పైకెవరు వెళ్తార్లే అనుకొని తాళం పక్కనే ఉన్న పూల కుండీలో దాచి పెట్టేసి సైకిల్ మీద ఆర్ట్ గ్యాలెరీ వైపు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ కొద్ది దూరంలో రోడ్ పక్కనే ఉన్న ఇంటి వైపు దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. అది అతని గురువు నిలవనూరి రంగనాథం గారి ఇల్లు. తనకు చిత్ర లేఖనాన్ని పరిచయం చేసిన ఇల్లు. తనలో అల్లకల్లోలంగా ఎగిసి పడుతున్న ఊహలకు రూపం ఇవ్వడం నేర్పిన ఇల్లు. గురువు లేక బోసిపోయి ఉండడంతో ఆ ఇంటిని చూసి నరహరకి మనసులో బాధేసింది.
ఆయాసపడుతూ రోడ్ మీదున్న గుంతల మధ్యలో సైకిల్ తొక్కుతూ కొత్త ఆర్ట్ గ్యాలెరీ దగ్గరికి చేరుకునే సరికి స్టేజీ మీద MLA చింతల సురేంద్ర గారు మాట్లాడుతున్నారు. నరహరి గుంపులో స్టేజీ కి దూరంగా నిల్చొని చూడ సాగాడు. గ్యాలెరీ ఎంట్రన్స్ ముందు స్టేజి వేశారు. స్టేజీ చుట్టూరా స్వతంత్ర పోరాట యోధుల విగ్రహాలు.
"కాల గర్భంలో కలిసిపోయే కథలెన్నో ఉంటాయి. కానీ కాలం తనతో పాటే మోసే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆ కథలే మన ముందున్న ఈ అమర వీరుల జీవితాలు. ఈ అమర వీరుల్లో ఒకరు మన 'మేఘమలుపు' లో పుట్టిన మా తాత శేషగిరి గారు కావడం మనకందరికీ గర్వ కారణం.
ఆ మహానుభావుడు పుట్టి ఈ రోజుకు సరిగ్గా 110 సంవత్సరాలవుతుంది. నిలవనూరి రంగనాథం గారు తాత శేషగిరి గారి జీవితంలోని సంఘటనలకు రూపం ఇస్తున్నాడని తెలిసినపుడు చాలా ఆనందం వేసింది. ఆయన గీసే ఒక్కో చిత్రం ఎన్నో కథలు చెబుతుంది. ఈ గ్యాలెరీ ఓపెనింగ్ సమయానికి ఆ మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రంగనాథం గారి చిత్రాల ద్వారా ఆ రోజుల నాటి కఠినమైన పరిస్థితులు, ఆ పరిస్థితులకు ఎదురు తిరిగిన వీరుల పోరాటాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ మహానుభావుడికి రెండు నిమిషాలు మౌనం పాటించాక గ్యాలెరీ ఓపెన్ చేస్తాం..." అని మైకు దగ్గరి నుండి పక్కకు వచ్చి రెండు నిముషాలు మౌనం పాటించారు MLA చింతల సురేంద్ర గారు. అతనితో పాటే అక్కడ ఉన్న ప్రజలంతా శ్రద్ధ తో మౌనం పాటించారు. అక్కడ ఉన్న చాలా మందికి రంగనాథం గారెవరో తెలియదు. కానీ బ్రిటిష్ వారితో శేషగిరి గారి పోరాటలెన్నిటినో పుస్తకాలలో చదువుకున్నారు, పాటల ద్వారా విన్నారు. ఇప్పుడు చిత్రాల ద్వారా చూడబోతున్నారు. నరహరి కూడా శ్రద్ధతో కళ్ళు మూసుకున్నాడు. కానీ ప్రశాంతత లేదు. తన గురువు చివరగా గీసిన చిత్రాలు చూడబోతున్నాడు ఇప్పుడు తను. తెలియకుండానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి.
రెండు నిముషాలు అయిపోగానే ముందుగా MLA గారు రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లారు. అతని వెనకాలే జనమంతా తమ పాసులతో వరుసగా నిల్చున్నారు. నరహరి కూడా లైన్ లో నిల్చున్నాడు. ఎంట్రన్స్ దగ్గర ఒక చిత్రం నరహరికి బాగా నచ్చింది. అప్పుడే నాటు వేసిన పచ్చని పొలాల మధ్యలో ఎత్తైన వరాలపై ఆడవాళ్ళంతా పసుపు చీరల్లో నెత్తిన చిన్న కుండలు పెట్టుకొని నడుస్తున్నారు. ఆ కుండలో నీళ్ల మధ్యలో తేలుతున్న మట్టి చిప్పలో పసుపు గౌరమ్మ, గౌరమ్మ పక్కనే వెలుగుతున్న దీపం కనిపిస్తున్నాయి. ఒక చేత్తో నెత్తి మీద ఉన్న కుండను పట్టుకొని ఇంకో చేత్తో బరిసె పట్టుకొని ఏదో పాట పాడుతూ వరుసగా నడుస్తున్నారు. కింద ఆ చిత్రం ప్రాముఖ్యత రాసుంది. శేషగిరి గారు బ్రిటిష్ వాళ్లతో పోరాడుతూ గాయపడితే అతనికి వైద్యం జరుగుతున్న సమయంలో అతన్ని కాపాడుకోడానికి ఒక వైపు గౌరి దేవిని ప్రార్ధిస్తూ ఇంకో వైపు బరిసెలతో యుద్దానికి సిద్ధం అన్న సందేశాన్నిస్తున్న చిత్రమది.
ఆ చిత్రంలో పూర్తిగా లీనమైపోయాడు నరహరి. తన ముందే వాళ్ళు పాట పాడుతూ నడుస్తున్నట్లు ఉంది. అంత గొప్ప చిత్రకారుడు తన గురువు రంగనాథం గారు.
"చూసింది చాలు ముందుకు నడవ్వయ్య యలమంచి నరహరయ్య …. " వెనకనుంచి బూర మీసాల తాత అరుస్తున్నాడు.
తనను ఇంటి పేరు పెట్టి పిలిచేడి ఎవర్రా అని వెనక్కు తిరిగి చూసాడు నరహరి. తన ఇంటి ముందుండే తాత తను.
తన ముందు లైన్ ఖాళీ అయింది. నరహరి వేగంగా ముందుకు కదిలాడు.
"పాస్ సర్ " సెక్యూరిటీ గార్డ్ అడిగాడు చేయి చాపుతూ..
చొక్కా పై జేబులో నుండి పాస్ తీయబోయాడు నరహరి, కానీ లేదు. అది తన పాత చొక్కా జేబు లోనే ఉండిపోయింది.
మళ్ళీ తన తొందరపాటు తనాన్ని తిట్టుకుంటూ
"పాస్ ఇంటి దగ్గర మర్చిపోయా సర్. ఈ బొమ్మలన్నీ గీసింది మా గురువు గారే, లోపలికి పంపించండి సర్, కావాలంటే సాయంత్రం పాస్ తీసుకొచ్చి చూపిస్తాను.." బ్రతిమాలాడు నరహరి.
"అవన్నీ కుదరవు సర్, పక్కకు నిలుచోండి, వెనుక వాళ్లకు లేట్ అవుతుంది" విసుగ్గా అన్నాడు సెక్యూరిటీ అతను.
"పోనీ ఈ 100 తీసుకొని పాస్ ఇవ్వండి సర్ ప్లీజ్" 100 నోట్ ఇస్తూ అడిగాడు నరహరి.
"పాస్ 500 సర్ ఇప్పుడు. అయినా ఇవ్వాళ్టికి పాసులు అయిపోయాయి సర్, ఇబ్బంది పెట్టకుండా ఇంటికి వెళ్లి పాస్ తెచ్చుకోండి సర్, ప్లీజ్" అంటూ నరహరిని పక్కకు నెట్టాడు సెక్యూరిటీ గార్డ్.
ఇంక చేసేదేమి లేక సైకిల్ తీసుకొని ఇంటికి బయల్దేరాడు పాస్ తెచ్చుకుందామని. ఇంటికి చేరుకున్నాక సైకిల్ స్టాండ్ వేసి, కుండీలో పెట్టిన తాళం తీసుకొని మెట్ల పైకెక్కుతుంటే , మెట్ల మీద మొత్తం తాను గీసిన చిత్రాలన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. కాలనీలో పిల్లలు తలుపు తెరిచుందని చూసి చిత్రాలన్నీ బయటికి తీసుకువచ్చి చిందరవందరగా పడేసినట్లున్నారు. ఒక్కో చిత్రాన్ని పైకి తీసి, అన్నీ కలిపి రూం మధ్యలో కుప్పగా వేసాడు. టీ పడ్డ షర్ట్ జేబులో చూస్తే పాస్ లేదు. చుట్టూ వెతికాడు, ఎంతకూ పాస్ దొరకలేదు. అలసిపోయి మెల్లగా బాల్కనీ లో కూలబడి సిగేరేట్ వెలిగించాడు. అప్పుడే ఎదురుగా స్టాండ్ పై తెల్ల పేపర్ షీట్, పెన్సిల్, వాటర్ కలర్స్ కనిపించాయి. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా పేపర్ షీట్, పెన్సిల్, వాటర్ కలర్స్ ఒక కవర్ లో వేసుకొని, రూమ్ కి తాళం వేసి, సైకిల్ పై గ్యాలెరీ వైపు బయల్దేరాడు. దార్లో చిన్నగా చినుకులతో వర్షం మొదలైంది.
గ్యాలెరీ ముందు చెట్టు దగ్గర సైకిల్ ఆపి, చెట్టు కింద కూర్చొని కవర్లో నుండి పేపర్ షీట్ , పెన్సిల్ బయటికి తీసాడు. ఎదురుగా ఇంకో చెట్టు కింద ఇందాకటి సెక్యూరిటీ గార్డ్ , ఒక అమ్మాయితో కలిసి చినుకుల మధ్యలో టీ తాగుతూ, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నరహరి వేగంగా సెక్యూరిటీ గార్డ్, ఆ అమ్మాయి వర్షం మధ్యలో నవ్వుతూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నట్లు బొమ్మ గీసి, కలర్స్ నింపాడు. ఆ చిత్రం కింద ఆర్ట్ బై, రంగనాథం గారి శిష్యుడు నరహరి అని రాసాడు.
చిత్రం పూర్తవగానే నరహరి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి సెక్యూరిటీ గార్డ్, ఆ అమ్మాయికి ఎదురుగా నిలుచొని తను గీసిన చిత్రాన్ని చూపించాడు. ఇద్దరు ఆశ్చర్యంతో తమ చిత్రాన్ని చూసారు. చాలా బాగుంది. ఆ అమ్మాయి సంతోషంతో వెంటనే "థాంక్స్ బంగారం. ఐ లవ్ యు. బెస్ట్ గిఫ్ట్ ఎవర్.." అని సెక్యూరిటీ గార్డ్ ను ముద్దు పెట్టుకుంది.
సెక్యూరిటీ గార్డ్ నవ్వుతోనే నరహరికి థాంక్స్ చెబుతూ, కళ్ళతో లోపలికి వెళ్ళమని సైగ చేసి ఆ చిత్రాన్ని చేతిలోకి తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇచ్చాడు.
మాటలు వర్ణించలేని మధురమైన జ్ఞాపకాలను సైతం చిత్రాలు చూపించగలవు.
ఆనందంతో నరహరి గ్యాలెరీ లోపలికి అడుగుపెట్టాడు. జనాలు అప్పటికి పలుచగా ఉన్నారు. గ్యాలెరీ లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా నాలుగు అంతస్తులను కలుపుతూ ఉన్న విగ్రహం కనిపించింది. తల పైకెత్తి చూసాడు. చింతల శేషగిరి గారు చేతిలో నాగలి పట్టుకొని గంభీరంగా నిలుచొని ఉన్న విగ్రహం అది. నాగలి పై భాగంలో భారత జెండా రెపరెపలాడుతుంది.
అది చూడగానే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
ఒక్కో ఫ్లోర్ తిరుగుతూ ఒక్కో చిత్రం చూస్తూ తన గురువు గారిని పొగుడుతూ ఉన్నాడు నరహరి రోజంతా. ఒక్కో చిత్రాన్ని చూస్తుంటే నరహరిలో ఒక్కో అనుభూతి. వేరే ఎవరు వేసిన చిత్రాలు చూసినా అందులోని లోపాలు కనిపిస్తాయి నరహరికి , ఒక్క తన గురువు గారు వేసిన చిత్రాలలో మాత్రమే కనిపించవు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. గ్యాలెరీ క్లోజ్ చేస్తుంటే బయటికి వచ్చాడు నరహరి. సెక్యూరిటీ గార్డ్ కు మళ్ళీ థాంక్స్ చెప్పి ఇంటికి బయల్దేరాడు. పౌర్ణమి అవడంతో ఆ రోజు వెన్నెల నిండుగా ఉంది.
రాత్రి భోజనం చేసి, కవర్లో ఉన్న పేపర్ షీట్స్ స్టాండ్ కు తగిలించి బాల్కనీ లో చంద్రుణ్ణి చూస్తూ ఆనందంగా పడుకున్నాడు నరహరి.
కళాకారుని మనసు, సముద్రం ఒక లాంటివే, అల్లకల్లోలాలు ఉంటాయి, అలికిడి లేని ప్రశాంతత కూడా ఉంటుంది. అలసట మాత్రం ఉండదు.
పచ్చని పొలాల మధ్యలో వరాల మీద పసుపు పచ్చని చీరలలో నెత్తిన కుండ మోస్తూ చేతిలో బరిసెతో, పాట పాడుతూ నడుస్తున్నారు ఆడ వాళ్ళు. ఎదురుగా చింతల శేషగిరి గారు చేతిలో నాగలితో నిలుచున్న ఎత్తైన విగ్రహం. ఆకాశపుటంచుల్లో భారత జెండా రెప రెపలాడుతుంది.
ఆడవాళ్లు విగ్రహం దగ్గర కుండలు పెట్టి బరిసెలతో పక్కనే ఉన్న గది లోకి వెళ్లారు. వారి వెనకాలే నరహరి కూడా గది లోకి వెళ్ళాడు. గది అంతా గోడలమీద తన గురువు గారు గీసిన చిత్ర పటాలతో నిండి ఉంది. ఆడవాళ్ళెవరూ లేరు, అందరూ మాయమైపోయారు. నరహరి ఒక్కో చిత్రాన్ని గమనించ సాగాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. మొదటి సారి తన గురువు గారు గీసిన చిత్రంలో లోపం. ఒక్క చిత్రంలో కాదు, అన్ని చిత్రాల్లో ఏదో ఒక లోపం. భయమేసింది నరహరికి, ఉలిక్కిపడి నిద్ర లేచాడు. ఎండ మొహానికి గట్టిగా కొడుతుంది. చెమటలు పట్టేసాయి.
త్వరగా లేచి పెన్సిల్ తీసుకొని తాను కలలో గదిలో గోడల మీద చూసిన చిత్రాలన్నీ ఒక్కో షీట్ మీద గీశాడు. అన్నీ అమరవీరుడు శేషగిరి గారి చిత్రాలే. అవన్నీ తీసి గోడపై అతికించాడు. మధ్యలో మాత్రం ఏ లోపం లేని చిత్రం ఉంచి చుట్టూ లోపం ఉన్న చిత్రాలు అతికించాడు. అన్నింటిని గమనించాడు. ఒక్కో చిత్రం లో ఒక్కో లోపం. ఒక దాన్లో కళ్ళు తప్పుగా ఉన్నాయి, ఒక దాన్లో మీసం కట్టు తప్పుగా ఉంది, ఇంకో దాన్లో చెవులు తప్పుగా ఉన్నాయి. ఇలా ఒక్కో చిత్రంలో ఒక్కో అవయవం తప్పుగా ఉంది. ఆ అవయవాలన్నింటిని అలానే కలుపుతూ ఒక షీట్ పై గీశాడు. కొంచెం వెనక్కి వచ్చి ఆ చిత్రాన్ని చూసాడు. ఎవరో కొత్త వ్యక్తి మొఖం. ఎప్పుడూ చూడని మొఖం. నిండు ముఖం గంభీరమైన ముఖం.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,333
Threads: 149
Likes Received: 7,690 in 1,563 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
577
ఎవరయి ఉంటారా ? గురువు గారు కావాలని ఇలా గీశాడా లేక యాదృచ్చికమా అని ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న తులసి చెట్టు మొదట్లో కనిపించింది తాను పోయిందనుకున్న పాస్. దాని మీద డేట్ చూసాడు. ఇవ్వాల్టి వరకు వ్యాలిడ్ ఉంది. వెంటనే రెడీ అయి పాస్ తీసుకొని, మళ్ళీ గ్యాలెరీ కి వెళ్ళాడు.
గ్యాలెరీలో ఒక్కో చిత్రం చూస్తున్నాడు, ఎక్కడ తను చూసిన కొత్త మొఖం కనిపించలేదు. తనకు కలలో కన్పించిన రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ కూడా కొత్తగా ఏమి కన్పించలేదు. ఎవరు చూడకుండా తను గీసిన చిత్రాన్ని కూడా ఆ గది లోనే ఒక మూలకు అంటించాడు. ఆ చిత్రం కింద "నేను ఎవరు?" అని రాసి ఉంచాడు.
గ్యాలెరీ నుండి నేరుగా మేఘమలుపు నగర లైబ్రరీ కి వెళ్ళాడు నరహరి. అక్కడి నుండి స్వతంత్ర పోరాటానికి సంబందించిన పుస్తకాలు అరువు తెచ్చుకున్నాడు. అన్నిట్లోనూ తను చూసిన వ్యక్తి ఫోటో ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతికాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. అతను ఎవరై ఉంటాడా అన్న ఆసక్తి రోజు రోజుకు పెరగసాగింది నరహరికి. ఆ కొత్త వ్యక్తిని వెతకడం ఒక వ్యసనంలా మారింది. అప్పుడప్పుడు "అతను ఎవరు ?" అని తాను వేసుకున్న ప్రశ్నకు జవాబు ఏమి దొరుకుతుందో అని భయం కూడా వేయసాగింది. ఇంత వెతుకులాడి చివరకు ఆ చిత్రంలో ఉన్న అతను ఒక సాధారణ వ్యక్తి అనో లేదా అది ఉట్టి తన ఊహ చిత్రమో అని తేలితే ఎలా అని అనుకునే వాడు.
సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం పెంచుకొని రోజు గ్యాలెరీ కి వెళ్లి ఆ ఫోటో చూసే వాడు, ఎవరన్నా తన ప్రశ్నకు సమాధానం ఇస్తారేమో అని. 'నేటి ప్రపంచం' లో కూడా క్విజ్ సెక్షన్ లో ఆ ఫోటో పబ్లిష్ చేసాడు తెలిసిన వాళ్ళెవరైనా ఏమైనా చెబుతారేమో అని. రోజులు గడవ సాగాయి కానీ తన ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు.
నిద్ర పట్టక పోవడంతో "మేఘమలుపు మారాజు" పుస్తకం మళ్ళీ చదవ సాగాడు నరహరి. మేఘమలుపులో జరిగిన స్వతంత్ర పోరాటాల గురించి, అందులో శేషగిరి పాత్ర గురించి ‘రాయచూరు వెంకన్న’ రాసిన పుస్తకమది. ఆ పుస్తక కవర్ పై బీడు భూముల మధ్యలో నాగలి పట్టుకొని నిలుచున్న శేషగిరి గారి చిత్రం ఉంది.
ఎప్పటిలాగే మరుసటి రోజు మొహానికి ఎండ కొడుతుంటే నిద్ర లేచాడు నరహరి. తయారయి రంగనాథం గారి ఇంటి వైపు నమస్కారం చేసి గ్యాలెరీ కి బయల్దేరాడు. సెక్యూరిటీ గార్డ్ తో కాసేపు మాట్లాడి హాల్ లోకి అడుగు పెట్టాడు. నాగలి అంచున రెప రెప లాడే ఆ జెండా ను చూస్తే చాలు గుండెలో ఏదో చెప్పలేని గర్వం.
నరహరి ఎప్పటి లాగే మొదటి ఫ్లోర్ లో ఉన్న గది కి వెళ్ళాడు. మూలలో తాను అతికించిన చిత్రం ఎదురుగా నిల్చున్నాడు.
"నేను ఎవరు ?" అన్న ప్రశ్న కింద సమాధానం రాసుంది. నరహరి కలలో కూడా ఊహించని సమాధానం అది.
ఆ సమాధానం "యలమంచి వీర రాఘవులు".
"యలమంచి" నరహరి ఇంటి పేరు. ఆ పేరు కింద ఫోన్ నెంబర్ రాసుంది.
‘వీర రాఘవులు’ పేరు ఇంతకు ముందెప్పుడో పరిచయం ఉన్నట్లు అనిపించింది నరహరికి
నరహరి మెదడు లో ఆలోచనలు వేగంగా పరిగెత్తసాగాయి. ఎవరి నెంబర్ అయి ఉంటుంది. నిజంగానే చిత్రం లో ఉన్న వ్యక్తి బతికే ఉన్నాడా ? తన బంధువా ? తన కల్పన కాదా ? ఆ వ్యక్తి నెంబరే అయి ఉంటుందా ? తనతో ఎవరన్నా ఆడుకుంటున్నారా ? ఆ వ్యక్తి ఇంటి పేరు నిజం గా "యలమంచి" అయితే గురువు గారు తనతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు ? అసలేం జరుగుతుందో నరహరికి అర్ధం కాలేదు. ఆ నెంబర్ ను తన బుక్ లో రాసుకొని, ఎవరూ చూడకుండా గోడ మీద నుండి చిత్రాన్ని తొలగించి గ్యాలెరీ బయటికి వచ్చి కాయిన్ ఫోన్ నుండి ఆ నెంబర్ కు కలిపాడు.
"హలో"
"చెప్పండి"
"మీ నెంబర్ గ్యాలెరీ లో ఉంది."
"గ్యాలెరీ నా ? ఏం మాట్లాడుతున్నారు సర్ ? ఇది కిరాణం కొట్టు. హోమ్ డెలివర్ చేస్తాం. ఏమన్నా సరుకులు కావాలంటే చెప్పండి"
నరహరికి ఏమి అర్ధం కాలేదు.
"ఏం మాట్లాడారేంటి సర్ ?"
"మీ షాప్ ఎక్కడండీ ?"
"మేఘమలుపు నాలుగవ వీధి మూల మలుపులో.. రాజు కిరాణా కొట్టు"
"సరేనండీ" అని ఫోన్ పెట్టేసాడు నరహరి.
షాపుకు వెళ్లే సరికి అక్కడ కొద్ది మంది ఉన్నారు. కౌంటర్ దగ్గరికి వెళ్లి చాపత్త పొట్లం తీసుకున్నాడు నరహరి.
"మీకు యలమంచి వీర రాఘవులు తెలుసా ?" అందరికి వినపడేలా షాప్ అతన్ని అడిగాడు నరహరి.
"తెలియదండి. ఈ చుట్టు పక్కల ఆ పేరుతో ఎవరు లేరండి" అన్నాడు షాప్ అతను.
"సరే" అని చుట్టూ చూస్తూ చా పత్త తీసుకొని అసంతృప్తి తో విసుగ్గా ఇంటికి బయల్దేరాడు నరహరి.
టీ చేసుకొని తాగి బాల్కనీ లో కూర్చొని ఆలోచించ సాగాడు. అప్పుడు గుర్తొచ్చింది తాను 'వీర రాఘవులు' ఎక్కడ చదివాడో. రాయచూరు వెంకన్న రాసిన "మేఘమలుపు మారాజు" పుస్తకం లో చదివాడు. శేషగిరి గారి అన్న వీర రాఘవులు. బ్రిటిషు వారితో పోరాడుతున్నప్పుడు గాయాలతో ఉన్న తమ్ముణ్ణి వదిలేసి పిరికి వాడిలా పారిపోయిన వాడు వీర రాఘవులు. అంతకు మించి ఆ పుస్తకంలో ఎక్కడ అతని గురించి రాసి లేదు.
"ఆ పిరికి వాని బొమ్మ వేయాల్సిన అవసరం గురువు గారికెందుకొచ్చింది ? అదీ అంత గోప్యంగా."
"పైగా అతనికి తన ఇంటి పేరు ఉండటమేంటి ? కనీసం చింతల ఇంటి పేరయినా ఉండాలి కదా ?" నరహరి ఇలా ఆలోచిస్తుండగానే చీకటి పడిపోయింది. తిని పడుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం.. మొహానికి ఎండ కొడుతుంటే నిద్ర లేచాడు నరహరి. లేచి వళ్ళు విరుచుకుంటుంటే ఎదురుగా స్టాండ్ మీద తాను గీసిన వీర రాఘవులు చిత్రం. ఆ చిత్రం కింద "మేఘమలుపు మారాజు" పుస్తకం. ఎప్పటిదో పాత కాలపు పుస్తకం. తీసి చూసాడు. చేతి వ్రాత తో రాసిన పుస్తకం. చుట్టూ చూసాడు. ఎవరు లేరు. తాను పడుకున్నప్పుడు ఎవరో పెట్టి ఉంటారు.
ఆత్రుతతో పుస్తకం చదువ సాగాడు.
ముందు పేజీ లో ఒక చిట్టి ఉంది. తీసి చదవ సాగాడు.
" నా పేరు రాయచూరు బాలకృష్ణ. రాయచూరు వెంకన్న మా తాత. నాకు ఈ మధ్యనే ఈ పుస్తకం లభించింది. చదివి నమ్మాలో వద్దో అర్ధం కాలేదు. ఎందుకంటే మార్కెట్ లో ఉన్న పుస్తకం , ఈ పుస్తకానికి చాలా విషయాల్లో విరుద్ధం గా ఉంది. గ్యాలెరీ లో మీరు వేసిన చిత్రం చూసినప్పుడు కొంచెం నమ్మకం కలిగింది. అందుకే ఈ పుస్తకాన్ని మీకు ఇస్తున్నాను. నాకు ఈ పుస్తకంలో రాసింది నిజమో కాదో శోధించేంత సమయం, శక్తి లేవు. అలాగని ఈ పుస్తకాన్ని పూడ్చి పెట్టలేను. నాకూ నిజం తెలుసుకోవాలని ఉంది. ఆ నిజం మీ ద్వారా తెలుస్తుందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. "
వణుకుతున్న చేతులతో ముందు పేజీలు చదవ సాగాడు.
అప్పట్లో తాను ప్రత్యక్షంగా చూసినవి, ఊరి వాళ్ళు చెబితే తెలిసినవి కలిపి పుస్తకంగా రాసినట్లు ముందు మాటలో చెప్పాడు రాయచూరు వెంకన్న.
"
రాత్రి అవుతుంది. చలి కాలం అవడంతో అడవి అంతా పొగ మంచు కమ్ముకుంది. మధ్యలో కనిపించీ కనిపించని బాటలో జమీందార్ చింతల వెంకయ్య, కడుపుతో ఉన్న భార్య సుబ్బమ్మ గుర్రపు జట్కా బండిలో తమ ఊరు 'మేఘమలుపు' కు వెళ్తున్నారు.
అప్పుడే వారికి దారి పక్కన ఏడుపు వినిపించడంతో బండి ఆపారు. వెంకయ్య ముందుగా దిగి వెళ్లి చూసాడు. వెనకాలే సుబ్బమ్మ కూడా వచ్చింది. ఎదురుగా మంటల్లో కాలుతున్న బ్రిటిష్ జెండా. పక్కనే కూర్చొని ఏడుస్తున్న చిన్న పిల్లాడు. అతని పక్కనే చనిపోయి ఉన్న పిల్లవాడి నాన్న, ఆఖరి ప్రాణాలతో ఉన్న అమ్మ.
భారమైన శ్వాసలు తీస్తూ 'వీర రాఘవులు' అని పిలిచింది అమ్మ. ఆ బాబు ఏడుచుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అతన్ని సుబ్బమ్మ కు అప్పగించి కనులు మూసిందా జనని. ఆ రోజు నుండి సుబ్బమ్మ, వెంకయ్య రాఘవులును సొంత కొడుకులా చూసుకోసాగారు.
కొన్ని నెలల తరువాత సుబ్బమ్మ మగ పిల్లవానికి జన్మనిచ్చింది. అతనికి 'శేషగిరి' అని నామ కరణం చేశారు. రాఘవులు, శేషగిరి కలిసి, మెలిసి పెరగ సాగారు. రాఘవులు తమ జమిందారీ మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకునే వాడు. శేషగిరి చదువుపై ధ్యాస ఉంచే వాడు.
చిన్నప్పటి నుండీ తన తల్లి దండ్రులను చంపిన బ్రిటిష్ వారంటే ఉన్న కోపం పెరగడమే తప్ప తగ్గలేదు రాఘవులుకు. ఎక్కడన్నా బ్రిటిష్ సైనికులు కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా చూసే వాడు.
కదలకుండా కాలాన్ని పట్టుకు కూర్చోలేము కదా.. సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవులు, శేషగిరి యుక్త వయసుకు వచ్చారు. వివాహాలు కూడా జరిగిపోయాయి.
వర్షాలు పడ్డా వ్యవసాయం చేసుకోవడానికి సరిపడే నీరెప్పుడు ఊర్లో ఉండేది కాదు. పండే కొద్ది పంటలో శిస్తు కడుతూ ప్రజలు పస్తులుండేవారు. రాఘవులుకు రైతులు శిస్తు కట్టడం నచ్చేది కాదు. దీని గురించి ఎప్పుడూ జమీందారు వెంకయ్య తో గొడవ పడేవాడు. బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరగాలని చెప్పే వాడు. కానీ వెంకయ్య దానికి ఎప్పుడు ఒప్పుకోలేదు.
పెళ్లయిన రెండు వర్షాలకు రాఘవులుకు కొడుకు పుట్టాడు. ఆ తరువాత జమిందారి గడి నుండి బయటికి వచ్చి ఊరి చివరలో గుడిసెలో ఉంటూ వ్యవసాయం చేసుకునే వాడు రాఘవులు. శేషగిరి అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్లే వాడు.
రాఘవులు పక్క ఊర్లు తిరిగి తన నిజమైన అమ్మా నాన్నల గురించి తెలుసుకున్నాడు. ఆ వెతుకులాట లో తన ఇంటి పేరు 'యలమంచి' అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి ప్రజలు అతన్ని 'యలమంచి వీర రాఘవులు' గానే పలకరించే వారు... "
అది చదివి తెలియకుండానే నరహరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అక్షరాలు మసగ్గా కనిపించ సాగాయి.
"
వీర రాఘవులు ప్రతి విషయంలో బ్రిటిష్ వాళ్లకు ఎదురు తిరిగే వాడు. దాంతో ప్రజల్లో అతనికి ఆదరణ రోజు రోజుకు పెరగ సాగింది. అది శేషగిరికి నచ్చేది కాదు. నీళ్లు సరిగ్గా లేక బీడు పడున్న భూములను రోజూ చూసి బాధేసేది రాఘవులుకు. ఊరి ప్రజలతో కలిసి కాకతీయుల మల్లె చెరువు తవ్వ సాగారు. అక్కడక్కడా బావులు కూడా తవ్వడం మొదలు పెట్టారు.
చుట్టూ బీడు భూమి, మధ్యలో ఉన్న తుమ్మ చెట్టు పక్కన పూజ చేసి బావి తవ్వడం మొదలు పెట్టారు రాఘవులతో కలిసి ఊరి ప్రజలు. రోజులు వేగంగా గడవ సాగాయి. బ్రిటిష్ వాళ్ళు కూడా చూసి చూడనట్లు ఉండ సాగారు. తవ్వకాలు పూర్తయ్యాయి. బావిలో నీళ్లు ఊర సాగాయి.
ఒక రోజు పొద్దున్న నాగలి మోసుకుంటూ బావి దగ్గరికి వచ్చాడు రాఘవులు. అప్పటికే బ్రిటిష్ సైనికులు అక్కడ ఉన్నారు. శేషగిరి, వెంకయ్య కూడా ఉన్నారు. అక్కడున్న జనాలతో కాలువ తవ్విస్తున్నారు. పని చేయని వాళ్ళని కొరడాలతో కొడుతున్నారు.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,333
Threads: 149
Likes Received: 7,690 in 1,563 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
577
శేషగిరి వచ్చి
" తెల్లోళ్ళు ఉండే దగ్గర నీళ్లు సరిపోట్లే అంట అన్నయ్య. కొద్ది పాటి నీళ్లు మళ్లించడం కోసం మన వాళ్ళతో కాలువ తవ్వించుకుంటున్నారు." అని చెప్పాడు. శేషగిరి చెప్పిన విధానం బ్రిటిష్ వాళ్ళు తప్పుచేయట్లేదన్న భావన కలిగించేలా ఉంది. వెంటనే కోపం చిర్రెత్తుకు వచ్చింది రాఘవులుకు.
శేషగిరిని గట్టిగా వెనక్కు నెట్టాడు. ఆ బలానికి శేషగిరి ఎగిరి వెనక్కు పడ్డాడు.
కోపం తో బ్రిటిషు వాళ్లపై విరుచుకు పడ్డాడు యలమంచి వీర రాఘవులు. అక్కడున్న రైతులు కూడా రాఘవులతో జత కలిసి బ్రిటిష్ సైనికులపై విరుచుకు పడ్డారు. కాసేపటికే వాళ్లు కాళ్లకు పని చెబుతూ వెనక్కి తిరిగి చూసారు.
బీడు భూమి మధ్యలో నాగలిని పట్టుకొని గంభీరంగా నిలుచున్న వీర రాఘవులు. అతని వెనకాలే నిలుచొని 'మేఘమలుపు మారాజు' అంటూ జేజేలు కొడుతున్న ప్రజలు. వారికి కొద్ది దూరంలో ఆది శేషునిలా కోపంతో విషపు పళ్ళు కొరుకుతున్న శేషగిరి.
“””
నరహరి కి ఏమి అర్ధం కాలేదు. అంటే తాను ఇన్ని రోజులు నమ్మింది తప్పా ? ఆ రోజు బ్రిటిషు వాళ్ళని తరిమి కొట్టింది వీర రాఘవులా ? శేషగిరి కాదా ?
ఆలోచిస్తూ ముందు పేజీలు చదువ సాగాడు.
"
వర్షానికి చెరువులో నిండిన నీటితో, బావి నీటితో వ్యవసాయం చేసారు మేఘమలుపు గ్రామ ప్రజలు. క్రమం తప్పకుండా శిస్తులు కట్టే వారు. వీర రాఘవులు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి చిన్న పాటి సైన్యాన్ని తయారు చేసాడు. ఇంకో వైపు వీర రాఘవులును తుదముట్టించడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. డబ్బు, కీర్తి ఆశ జూపి శేషగిరిని బ్రిటిష్ వాళ్ళు తమ వైపు లొంగతీసుకున్నారు.
వ్యవసాయానికి వాడుతున్న నీటిపై అదనంగా శిస్తు వసూలు చేయడం మొదలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఇది తెలుసుకున్న వీర రాఘవులు తన చిన్నపాటి సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వారి కోట పైనే దాడి చేసి వారి జెండాను తగుల బెట్టాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ వీర రాఘవులును కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఊరి ప్రజలు. ఆడ వాళ్ళు సైతం పూజలు చేస్తూ బరిసెలు పట్టారు.ఆ రోజుతో బ్రిటిష్ వాళ్లకు వీర రాఘవులు ధైర్యమెంతో, బలమెంతో అర్ధమయిపోయింది. పై అధికారులకు అదనపు సైన్యం కోసం లేఖల మీద లేఖలు రాసారు. శేషగిరితో కలిసి వీర రాఘవులు అంతం చేయడం కోసం పథకాలు వేయసాగారు.
ఒక రోజు రాత్రి శేషగిరి, వీర రాఘవులు ఒంటరిగా వస్తుంటే బ్రిటిష్ వాళ్ళు దాడి చేసారు.
నేనూ ఆ సమయంలో వారితో పాటే ఉన్నాను. రాఘవులు వీరోచితంగా పోరాడి బ్రిటిష్ సైనికులందరిని చంపేశాడు. ఎప్పటి లాగే వాళ్ళ జెండాను కూడా తగుల బెట్టాడు. కానీ తన తమ్ముడే తనను చంపేస్తాడని మాత్రం ఊహించలేక పోయాడు. తన తమ్ముడి కత్తి పోటుకు చివరి ప్రాణం వదిలాడు. అప్పుడు నాకున్న డబ్బు ఆశకు, ప్రాణ భయానికి నేను కూడా శేషగిరి తో చేతులు కలిపాను. రాఘవులు శవాన్ని పూడ్చి పెట్టేసి, బ్రిటిష్ వారికి భయపడి పారిపోయినట్లు ఊరి ప్రజలను నమ్మించామ్. బ్రిటిష్ వారిని ఒంటరిగా శేషగిరి ఎదుర్కొని హతమార్చినట్లు చెప్పాను.
ఆ రోజు తరువాత నెమ్మదిగా శేషగిరి మీద గౌరవం పెరిగింది ప్రజలకు. తమను వదిలి పారిపోయిన రాఘవులును అసహ్యించుకునేవారు. రాఘవులు పారిపోయాడని నమ్మని వారు నెమ్మదిగా బ్రిటిష్ సైనికుల చేతుల్లో హతమయ్యేవారు.
అప్పటి నుండి శేషగిరి ని ఉపయోగించి ప్రజా ఉద్యమాలను అణగదొక్కే వారు బ్రిటిష్ వాళ్ళు. చరిత్రను తిరిగి రాసారు. శేషగిరి 'మేఘమలుపు మారాజు' అయ్యాడు. వీర రాఘవులు చరిత్రకు పట్టిన చెదల్లలో కలిసిపోయాడు.
కానీ జీవిత చరమాంకంలో నాకర్ధమైందేంటంటే "పాపానికి కూడా ప్రాణం ఉంటుంది. కాలంతో పాటు
దాని బరువు పెరుగుతుంది. అది ఇప్పుడు నా మనసు మోయలేనంత బరువు పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ పుస్తకం రాస్తున్నాను. చెదళ్లలో కలిపిన ఆ మహానుభావుని ముఖ చిత్రాన్ని నా స్వహస్తాలతో నేనే వేస్తున్నాను.
నేను ఇప్పుడు మొదలు పెట్టిన ఈ నిజం, సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్న అబద్దాన్ని అంతం చేయాలని ప్రార్ధిస్తున్నాను.
“
చివరగా బీడు భూముల మధ్యలో నాగలి పట్టుకొని నిలుచొని ఉన్న 'యలమంచి వీర రాఘవులు', వెనుకాల జేజేలు కొడుతున్న జనం చిత్రం ఉంది.
***
పుస్తకం చదవడం అయిపొయింది. తలెత్తి ఎదురుగా చూసాడు నరహరి. 'వీర రాఘవులు' చిత్రం.
గంభీరంగా తన వైపు చూస్తున్నట్లు అనిపించింది.
నరహరికి ఏం చేయాలో అర్ధం కాట్లేదు. తలంతా బరువెక్కింది. ఆ పుస్తకం అక్కడ పెట్టినతన్ని కలవాలని ఉంది. కానీ అతడే రాసాడు గా ఇందులో తల దూర్చడం తనకిష్టం లేదని.
ఈ పుస్తకం ప్రకారం చింతల శేషగిరి ఒక దేశ ద్రోహి, కానీ గొప్ప స్వాతంత్ర సమార యోధుడిలా చరిత్రలో మిగిలిపోయాడు. వీర రాఘవులను చరిత్ర మరిచిపోయింది. ఒక వేళ నిజంగా ఇది నిజమైతే, తనెలా ఆ నిజాన్ని అందరికి చెప్పగలడు.
"చింతల కుటుంబం రాజకీయం మొత్తం ఆధారపడి ఉంది 'శేషగిరి' చరిత్ర మీదే. ఆ చరిత్రే తప్పని చెబితే నన్ను బతకనిస్తారా ?... … అంటే ఈ నిజం తెలిసినందుకే రంగనాథం గారిని MLA మనుషులు చంపేసారా ? యాక్సిడెంట్ లో చనిపోలేదా ? " ఆలోచిస్తుంటే నరహరి కి చెమటలు పట్టేసాయి.
సిగేరేట్ వెలిగించాడు. కాలుస్తూ ఎదురుగా తాను గీసి గోడ మీద అతికించిన శేషగిరి చిత్రాల వైపు చూసాడు. అన్ని చిత్రాల కింద చిన్న లోగో. తాను గీస్తున్నప్పుడు అంత ధ్యాస పెట్టలేదు. నల్లని మేఘాల మధ్యలోనుండి గుడ్ల గూబ చూస్తున్నట్లు ఉంది. వెంటనే నరహరి కి ఆ స్థలం ఎక్కడుందో గుర్తొచ్చింది. ఆ చిత్రాలన్నీ, షీట్స్ అన్నీ మూట కట్టి సైకిల్ పై వేసుకొని వెంటనే గురువు రంగనాథం ఇంటి వైపు బయల్దేరాడు నరహరి.
రంగనాథం గారి సెల్లార్ కి దారి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు రంగనాథం అక్కడే చిత్ర లేఖనం చేసేవాడు. నరహరిని కూడా కొన్ని సార్లు తీసుకెళ్లాడు. ఆ ఎంట్రన్స్ లోనే ఇలా నల్లని మబ్బుల్లో నుండి చూస్తున్న గుడ్ల గూబ చిత్రం ఉంటుంది. దాని వెనకాల ఉన్న బీరువా లోనే మార్కెట్ లో ఉన్న 'మేఘమలుపు మారాజు' పుస్తకం, కొన్ని లెటర్స్ దొరికాయి నరహరి కి.
అవి బ్రిటిష్ కాలం నాటి లెటర్స్. కూర్చొని చదవ సాగాడు. మేఘమలుపు బ్రిటిష్ అధికారులు తమ పై అధికారులకు వీర రాఘవులను ఎదుర్కోవడం కోసం సైన్యాన్ని పంపించాల్సిందింగా కోరుతూ రాసిన ఉత్తరాలు. వాటిలోనే శేషగిరి తమకెలా సాయం చేస్తున్నాడో కూడా తెలిపారు.
"ఈ ఉత్తరాలు చాలు చరిత్రను తప్పని నిరూపించడానికి.." అనుకున్నాడు నరహరి. ఈ ఉత్తరాలలో ఎక్కడ 'యలమంచి' అని ప్రస్తావించలేదు. అందుకే గురువుగారి కి ‘యలమంచి' గురించి తెలిసుండదు.
ఇక తాను తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది "గురువు గారు చనిపోవడంలో MLA హస్తం ఉందా ? లేదా. ? " ఆలోచిస్తూ లెటర్స్ తీసుకొని ఇంటికి బయల్దేరాడు నరహరి.
అప్పటికే తన ఇంటి ముందు, చుట్టు పక్కల కొంత మంది మనుషులు తిరుగుతున్నారు. నరహరి కి అనుమానం వేసింది. 'కొంప తీసి తాను నేటి ప్రపంచం లో పబ్లిష్ చేసిన చిత్రం చూసి తనకు నిజం తెలిసిందని అర్ధమైపోయుంటుందా" అనుకుంటూ డబ్బా కొట్టు పక్కన దాక్కున్నాడు. అప్పుడే వాళ్లలో ఒకడు సిగెరెట్ కోసం డబ్బా కొట్టు వైపు రాసాగాడు.
వాణ్ణి పట్టుకొని నాలుగు పీకితే నిజం చెప్తాడు అనుకున్నాడు నరహరి. కానీ పట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. డబ్బా కొట్టుకు కొంచెం దూరంగా వెళ్లి ఆ వస్తున్న అతని బొమ్మ గీసి అతనికి కనిపించేలా గోడ మీద అతుకు పెట్టాడు. పళ్ళు కనిపించేలా నవ్వుతున్నట్లు గీశాడు ఆ బొమ్మ. ఏంటో చూద్దామని అటు వైపు వచ్చాడతను. చుట్టూ చూసి ఎవరూ చూడకుండా ఆ చిత్రాన్ని జాగ్రత్తగా తీసి దాచి పెట్టుకున్నాడు.
అక్కడికి కుడి వైపు చూస్తే ఇంకో చిత్రం కనిపించింది అతనికి. దగ్గరికెళ్లి చూస్తే అతను కళ్ళు బయటికొచ్చేలా ఏడుస్తున్నట్లు ఉన్న చిత్రం అది. వెంటనే కోపంతో చింపేయ బోయాడు ఆ చిత్రాన్ని. అంతలోనే వెనకనుండి అతని తల మీద గట్టిగ కర్రతో కొట్టాడు నరహరి. స్పృహ కోల్పోయిన అతన్ని తన సైకిల్ కడ్డీ పై ఎక్కించుకొని గురువు గారి సెల్లార్ లోపలికి సైకిల్ తో సహా తీసుకెళ్లాడు.
అతన్ని కట్టేసి మొహం మీద నీళ్లు కొట్టి లేపి నాలుగు తన్నితే అర్ధమయింది నరహరికి, తాను పట్టుకుంది MLA బావమరిది 'నాగ రాజు' నే అని. స్వతహాగా భయస్తుడైన అతను నరహరి పెద్దగా కష్ట పడకుండానే నోరు విప్పి నిజాలు చెప్పసాగాడు.
"రంగనాథం గారు ఒక రోజు తాను గీసిన చిత్రాలన్నీ గ్యాలెరీ కి అప్పగించి సురేంద్ర బావను కలవడానికి వచ్చాడు. ఆ రోజు ఎప్పటిలా అతని మోహంలో ప్రశాంతత లేదు. బావ అడిగితే అసలు నిజం చెప్పాడు.
మీ గురువు గారు 'మేఘమలుపు మారాజు' పుస్తకం చదివి, రాఘవులు బ్రిటిష్ వారికి భయపడి శేషగిరిని వదిలి పిరికివానిలా పారిపోతుంటే, శేషగిరి వీరోచితంగా పోరాడుతున్నట్లు ఒక చిత్రం గీద్దామని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి దగ్గరగా చిత్రం గీయడం కోసం వీర రాఘవులు ఎలా ఉంటాడో అని లైబ్రరీస్ లో, ఆర్కైవ్స్ లో వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఆ ప్రక్రియలో కాలం సైతం తనలో దాచుకున్న నిజం కనుక్కున్నాడు.
వీర రాఘవులు ఫోటో తీసుకొచ్చి సురేంద్రకు చూపించాడు. చింతల కుటుంబంలో అప్పటికే ఆ నిజం అందరికి తెలుసు, బయటకు వస్తే తమ రాజకీయ జీవితం అంతమవుతుందని భయంతో ఎప్పుడూ ఆ నిజాన్ని బయటికి రానివ్వలేదు. ఆ నిజం రంగనాథం నోట విన్న వెంటనే సురేంద్ర తాను ఆరా తీసి నిజా నిజాలు కనుక్కుంటానని మాట ఇచ్చి రంగనాథంను ఇంటికి పంపించాడు. ఆ రంగనాథం ఇంటికి కాకుండా పైకి చేరేలా మనుషుల్ని పురాయించాడు.
మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ‘నేటి ప్రపంచం’లో రాఘవులు బొమ్మ చూసాం. కనుక్కుంటే నువ్వు గీసావని తెలిసింది. ఆరా తీస్తే నువ్వు రంగనాథం శిష్యుడివని తెలిసింది. అందుకే గురు శిష్యులను ఏకం చేయడానికి వచ్చాము. నువ్వేమో నీ పిచ్చి బొమ్మలతో నన్నిట్లా పట్టుకున్నవు."
ఆగకుండా ఏక దాటిన చెప్పాడు నాగ రాజు.
ఆయాస పడుతున్న నాగరాజుకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు నరహరి. అవి తాగి మెల్లగా మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు నాగరాజు.
కావాల్సిన సమాధానాలన్నీ నరహరికి దొరికాయి. ఇక తాను చేయవలిసినవి రెండు పనులు. ఒకటి చరిత్రను సరి చేయడం. రెండు MLA ను హంతకుడని నిరూపించడం. రెండో పని నాగరాజు ను వాడొకొని చేయొచ్చు.
మరుసటి రోజు ఉదయం, రాయచూరు వెంకన్న మనవడు బాల కృష్ణ ఇంటి ముందున్న న్యూస్ పేపర్ ఎప్పటిలాగే తీసుకున్నాడు. మధ్యలో కర పత్రిక ఉంటె తీసి చూసాడు. 'యలమంచి వీర రాఘవులు' బొమ్మ. కింద "నేను ఎవరు?" అని రాసి ఉంది.
అతనికి నిజం ప్రయాణం ఇప్పుడే మొదలయిందని అర్ధం అయింది. నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
కొన్ని సంవత్సరాల తరువాత...
రంగనాథం హత్య కేసులో MLA ను అరెస్ట్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అప్పటికే తన దగ్గరున్న ఆధారాలతో శేషగిరి దేశ ద్రోహి అని, వీర రాఘవులు స్వతంత్ర సమర యోధుడని కోర్ట్ లో కూడా నిరూపించా
డు నరహరి. "చింతల శేషగిరి" ఆర్ట్ గ్యాలెరీ మూసి వేయాల్సిందిగా కోర్ట్ ఆర్డర్ పాస్ చేసింది. అదే స్థలంలో చరిత్ర మరిచిపోయిన 'వీర రాఘవులు' కోసం గ్యాలెరీ నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కొన్ని రోజుల తరువాత..
గ్యాలెరీ ముందు స్థలం లో 'వీర రాఘవులు' చిత్రాన్ని ఉంచారు. గ్యాలెరీ లో చిత్రాలు గీసే చిత్రకారుని కోసం పోటీ జరుగుతుంది. వందలమంది పాల్గొన్నారు. వారి మధ్యలో నరహరి వీర రాఘవులు బీడు భూమి మధ్యలో నిలుచొని నాగలి పట్టుకున్న బొమ్మ గీస్తున్నాడు.
*********
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,666
Threads: 0
Likes Received: 1,201 in 1,024 posts
Likes Given: 7,953
Joined: Aug 2021
Reputation:
10
Nice storie but inka storie vntey bagundedhi
•
Posts: 7,121
Threads: 1
Likes Received: 4,666 in 3,639 posts
Likes Given: 45,635
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 12,522
Threads: 0
Likes Received: 6,885 in 5,239 posts
Likes Given: 71,924
Joined: Feb 2022
Reputation:
88
Nice Story
•
Posts: 9,679
Threads: 0
Likes Received: 5,489 in 4,496 posts
Likes Given: 4,597
Joined: Nov 2018
Reputation:
46
•
Posts: 2,333
Threads: 149
Likes Received: 7,690 in 1,563 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
577
మిత్రులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|