Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఇచ్ఛారూపధారి...!!! Mega trailer
#61
(03-01-2023, 09:45 AM)Takulsajal Wrote: ఈ టైటిల్ చదివినప్పుడే అనుకున్నా కొత్తగా ఉంటుందేమోనని
అనుకున్నట్టుగానే చాలా బాగా రాసారు, ఇలాగే అందరినీ మీ కథనంతో ఆకట్టుకుంటూ ముందుకుపోవాలని ఆశిస్తూ.. తదుపరి update కోసం వేచి చూస్తాను

ధన్యవాదాలు సాజల్ జి.. Namaskar

అలాగే belated Happy New year..

Plz support me till the end...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
దైవ భూమి గా పిలవబడే కేరళ రాష్ట్రం.పైగా కార్తీక మాసం అందులోనూ శివునికి ఇష్టమైన మాసం కావడం తో త్రిస్సుర్ లో ఉండే ప్రజలు పూజకు కావలసిన కొన్ని వన సామాగ్రి కోసం        ఎప్పటి లాగే  అక్కడి అడవి లోకి వెళ్లారు.చలి కాలం కావడం తో మంచు విపరీతంగా కురుస్తుంది,పక్కనే ఉన్న మనుషులను కూడా సరిగ్గా చూడలేకపోతున్నారు. మంచు అంత దట్టంగా పడుతుంది.
 
వెట్ట కురువన్,ఉరాలి కురువాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్లో వాళ్ళతో పాటు అడవి లోకి వెళ్ళారు. వీళ్ళు చిన్న చిన్న అడవి జంతువులను వేటాడి వాటి మాంసం ఇంకా చర్మం అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మాంసం వంటివి ముట్టుకోకూడదు కదా అందుకే ఈ పూజ సామాన్లు అమ్ముకొని డబ్బులు సంపాదించాలి అని భావించి వచ్చారు.

అలా వన సామాగ్రి ( పత్రి,మూలికలు,కొన్ని రకాల అడవి పూలు) వాటిని సేకరిస్తూ ముందుకు వెళ్తున్నారు . తమకు కావలసిన సామగ్రి కుడబెట్టుకొని మరి కాస్త లోపలికి వెళ్దాం అని మాట్లాడుకుంటున్నారు..అలాగే లోపలికి వెళ్తున్న వెట్ట కు గాలి లో వేలాడుతు ఏదో తగిలింది , అది ఏమిటి అనేది సరిగా గుర్తు పట్టలేక ఏదో అడవి జంతువు అయ్యి ఉంటుంది అని భావించి ఉరాలి ని పిలిచాడు..

వెట్ట... ఉరాలి""" ఎంటెయి ఇవిటేయుంట్ "" ( ఇక్కడ ఏదో ఉంది అని పిలిచాడు).

ఉరాలి దగ్గరకు వచ్చి ఏమి ఉంది అని చూస్తూ చేతితో తాకుతున్నాడు. ఉరాలి దాన్ని దగ్గరగా చూసి ముక్కు తో వాసన పీలుస్తూ వెట్ట నీ చూస్తూ ఏయ్ ""కట్టుపన్ని"" ( అడవి పంది) రా ఇది చాలా పెద్దది .ఉచ్చు లో పడి చనిపోయింది అని అన్నాడు.. ఉరాలి చెప్పింది విని వెట్ట నిజమా అంటూ దానికి కాస్త దగ్గర గా వెళ్ళి పరిశీలన గా చూస్తూ ఒక్క సారి గా వెనక్కి పడ్డాడు. వెట్ట ను చూసి ఉరాలి హేయ్ ఏమైంది అని అడిగాడు. 

వెట్ట...అది ఏమి అడవి పంది కాదు ,వేరే జంతువు కాదు ,ఒక మ.. మనిషి శవం అంటూ దాని వైపు వేలు చూపించాడు.. ఉరాలి కి కూడా భయం మొదలైంది..

ఇద్దరు అక్కడే బొమ్మల లాగా నిలబడిపోయారు..ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆ శవాన్ని చూస్తూ ఏమి చేద్దాం రా అని వణుకుతున్న గొంతు తో ఇద్దరు ప్రశ్నించుకున్నారు .

వెట్ట...వెళ్ళి సెక్యూరిటీ అధికారి లకు చెప్దామ అని అన్నాడు .

ఉరాలి...వద్దు సెక్యూరిటీ అధికారి లకు చెప్తే మళ్ళీ మనమే చేసాము అని అంటారు . వెళ్ళి పురహితన్ కి చెప్డాం ఆయనే ఏదో ఒకటి చేస్తాడు అని వెట్ట తో చెప్పాడు..

వెట్ట... మరి ఎందుకు ఆలస్యం పద అని అక్కడ నుంచి కదిలాడు. ఉరాలి కూడా వెట్ట తో పాటు పురహితన్ నీ కలవడానికి ఊర్లో కి వచ్చాడు. ఇద్దరు కలిసి గురువాయూర్ దగ్గర కి వచ్చి చూసింది మొత్తం తడబడుతూనే చెప్పారు..

గురువాయూర్... అయిన మీకు అడవిలో పని ఎంటి అసలు ఎందుకు వెళ్ళారు రా అని అడిగాడు.

ఉరాలి... బిల్వపత్రలు తీసుకొని రావడానికి వెళ్ళాము.లోపలికి వెళ్తే అడవి పూలు దొరుకుతాయి అని వెళ్ళాము అప్పుడు వెట్ట నే ఇది చూసాడు అని చెప్పుకొని వచ్చాడు.

గురువాయూర్ సరే అని ఇంకా కొంత మంది నీ వెంట తీసుకొని అడవిలోకి వెళ్ళాడు.. అక్కడ ఒక నిద్రగన్నేరు చెట్టు కి శవం వెలాడుతు ఉంది. ఆ శవం వొంటి మీద బట్టలు బాగా చిరిగిపోయి ఉన్నాయి . తల మీద జుట్టు కూడా కాలిపోయి శరీరం నల్లగా తయారయి ఉంది . అది చూసి గురువాయూర్ కూడా భయ పడి వెనక్కి వెళ్ళాడు.. తర్వాత తనే కాస్త ధైర్యం తెచ్చుకొని శవం దగ్గర కు వెళ్లి దిక్షణం గా చూస్తున్నాడు.. ఆ శవం మెడ లో పులి గోరు ,అలాగే కిందకు వేలాడుతున్న చేతులకి బంగారు ఉంగరాలు,చేతికి కడియం దాని మీద గజేంద్ర నాయర్ అని పేరు చూసి గురువాయూర్ అల చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లిగా నోరు విప్పి గజేంద్ర అని అన్నాడు..

గజేంద్ర అని పేరు వినగానే అక్కడ ఉన్న జనం అంతా గుసగుసలు మొదలుపెట్టారు.. ఎవ్వరికీ ఏమి అర్ధం కాలేదు.నిజంగా జమీందారు దద్వార్ గారి పెద్ద కొడుకు గజేంద్ర నా అని అందరి మొఖాల్లో ఏదో భయం. 

గురువాయూర్ అందరి నీ మాట్లాడకుండా ఉండమని 
వెట్ట ఇంకా ఉరాలి తో చెట్టు ఎక్కి శవాన్ని కిందకు దించమని చెప్పాడు..ఇద్దరు మేమా అన్నట్టు గురువాయూర్ నీ చూస్తూ భయపడుతూనే చెట్టు ఎక్కారు.. శవాన్ని కిందకు దించడానికి దాని కాళ్ళు పట్టుకోని లాగడానికి చూసాడు వెట్ట. అప్పుడు వెట్ట చేతికి ఆ శవం కాలి దగ్గర చర్మం ఇంకా మాంసం ఊడి వచ్చింది.

వెట్ట భయపడుతూ తన చేతిలో చూసుకున్నాడు, తన చేతిలో ఉన్న మాంసం నుండి పురుగులు వస్తున్నాయి.దాంతో వెట్ట భయపడిపోయి గట్టిగా అరుస్తూ శవాన్ని కాలి తో కొట్టాడు. అలా కొట్టేసరికి శవం చెట్టు నుండి విసికొట్టినట్టు వచ్చి కింద పడింది.
 
చెట్టు మీద నుండి కింద పడిన గజేంద్ర శవం కాళ్ళు చేతులు శరీరం నుండి వేరు గా తెగి పడ్డాయి, మెడ కూడా ఎవరో సాగదీసినట్టు అడుగు బారు సాగింది..

గురువాయూర్ వెంటనే హవేలీ కి వెళ్లి ఈ విషయం చెప్పి రండి అని కొంతమందికి చెప్పాడు. 

...హవేలీ...

మీనా ఉదయాన్నే లేచి చన్నిల్లతో స్నానం చేసి గుడి కి బయలుదేరింది.. 

మీనా హవేలీ లో నుండి బయటకు వస్తుంటే అప్పుడే తనకు ఎదురుగా గురువాయూర్ పంపించిన మనుషులు వచ్చి నిలబడి రొప్పుతూ అమ్మ అక్కడ అడవి లో అంటూ అడవి వైపు చేతులు చూపిస్తూ గజేంద్ర బాబు గారు అని అన్నారు.. మీనా కి వాళ్ళు చెప్పింది ఏమి అర్ధం కాలేదు ఏమి జరిగింది సరిగ్గా చెప్పండి అని అడిగింది. అప్పుడే నిద్ర లేచిన దేవరాజ్ కిటికీ లో నుండి బయటకు చూస్తూ వదిన ఎవరితో మాట్లాడుతుంది అని కిందకు వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు .

దేవరాజ్ నీ చూసినా ఊరి జనం అతని దగ్గరకు వచ్చి అయ్యా మీ అన్నగారి శవం అక్కడ అడవి లో చెట్టు కి వేలాడదీసి ఉంది అని చెప్పారు  .. ఆ మాట వింటూనే మీనా తన చేతిలో ఉన్న పూజ సామాన్లు కింద పడేసి ఏవండీ అని గట్టిగ అరిచింది, వాళ్ళు చెప్పింది విన్న దేవరాజ్ కోపం తో ఒకడి గొంతు పట్టుకోని గాల్లోకి లేపి విసిరి పక్కకి వేసాడు ..

దేవరాజ్...వదిన నువ్వు ఏమీ కంగారు పడకు మనమక్కడికి వెళ్లి చూద్దాం అంటూ హవేలీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాసేపటికి బయటకు వచ్చాడు.తనతో పాటు హేమరాజ్ కూడా వచ్చాడు .

దేవరాజ్ కార్ లో ఎక్కి కార్ స్టార్ట్ చేసాడు.ఇద్దరు కార్ ఎక్కి మీనా ను కూడా ఎక్కించుకొని అడవి లోకి వెళ్ళారు.. అక్కడికి వెళ్లిన తర్వాత గురువాయూర్ వాళ్ళని చూసి మీనా దగ్గరకి వచ్చి విషయం చెప్పాడు. మీనా బాధ తో కుమిలిపోతూ ఉంది..

హేమరాజ్ వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసాడు. కాసేపటికి సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు . సెక్యూరిటీ ఆఫీసర్లు విచారణ మొదలు పెట్టారు.. SI మీనా దగ్గరకు వచ్చి గజేంద్ర గురించి వివరాలు అడిగాడు.. గజేంద్ర ఎప్పుడు బయటకు వెళ్ళాడు,వెళ్లిన తర్వాత ఏమైనా ఫోన్ చేశాడా అని..

మీనా తనకు తెలిసిన విషయమే చెప్పింది,SI కూడా మీనా నీ ఇంకేమి అడగలేదు ఆ కుటుంబం లో ఆడవాళ్ళకు ఎంత మర్యాద ఇస్తారో అతనికి తెలుసు . SI అక్కడే నిలబడి ఉన్న గజేంద్ర తమ్ముళ్ళ దగ్గరకు వెళ్ళి ఇంకొన్ని విషయాలు సేకరించాడు.. formalities పూర్తి అయ్యాక శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించి పోస్ట్ మార్టం కి తీసుకొని వెళ్ళారు.. దేవరాజ్ ఈ విషయాన్ని ఫోన్ లో మహేంద్ర ఇంకా అభీర్ కి తెలియజేశాడు.మహేంద్ర వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పాడు . అభీర్ మాత్రం ఆరోజు సాయంత్రం ఫ్లైట్ కి వస్తాను అని అన్నాడు.. అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయం లేకుండా మనుషులను పెట్టీ ఏమి జరిగిందో తెలుసుకోమని చెప్పాడు..

దేవరాజ్ ఇంకా హేమరాజ్ తమ వదిన ను తీసుకొని హవెలికి బయలుదేరారు. అక్కడ ఉన్న జనం కూడా వెళ్ళిపోయారు. గురువాయూర్ దగ్గరలో ఉన్న సెలయేరు లో స్నానం చేసి తన బట్టలు కూడా జాడించి వొంటికి చుట్టుకొని గుహ లో ఉన్న శివుని విగ్రహం దగ్గర కు వచ్చి శివలింగానికి నమస్కరించి  అంతు చిక్కని ప్రశ్న కి జవాబు కోసం నీ దగ్గరకి వచ్చాను. జవాబు చూపిస్తావో లేదా మరొక ప్రశ్న లాగా వదిలేస్తావో నీ ఇష్టం అంటూ తన దివ్య దృష్టితో చూడటం మొదలు పెట్టాడు..

గురువాయూర్ నిన్న రాత్రి గజేంద్ర వెళ్తున్న కార్ లో వెనుక సీట్ లో కూర్చున్నాడు. గజేంద్ర దారి లో ఒక అమ్మాయి చూసి కార్ ఆపడం తనని కార్ ఎక్కించుకోవడం ఇదంతా గురువాయూర్ కి తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంది..గురువాయూర్ అలాగే ధ్యానం లో కూర్చొని ఏమి జరుగుతుందో చూస్తున్నాడు..

                  ..... జరిగిన సంఘటన కూలంకుషగా.....

గజేంద్ర ...అయిన ఏంటండీ మీరు అసలు భయం వేయాలేదా ఇలా వొంటరిగా రావడానికి అని అడిగాడు . గజేంద్ర అడిగినదానికి మృదుల నవ్వుతూ నేను ఏమైనా కలగన్ననా చెప్పండి , కార్ లో వచ్చి కార్ లో వెళ్ళడమే కదా అని అనుకున్నాను ,దారిలో ఇలా జరిగింది అని చెప్తూ కార్ కిటికీ అద్దం కిందకు దించుతుంది.. 

ధ్యానం లో ఉన్న గురువాయూర్ అక్కడ కార్ లో ఉన్న మృదుల ను చూసి కంగారు పడుతున్నాడు.

మృదుల... ఓహో అంతటి చేతకారి నా మీరు అయితే ఏమి చేస్తారు ఎంటి నన్ను అంటూ తన కాలిని గజేంద్ర బుగ్గ దగ్గర పేట్టి అడుగుతుంది . ఆ రతి దేవుడు చేసిన మిమ్మల్ని రమించే భాగ్యం ఈ రతి దాసుడికి ఇవ్వండి , మిమ్మల్ని నా రాణి గా నిత్యం సేవ చేసుకుంటాను అని చెప్తూ గజేంద్ర తన చేతిలో మృదుల కాలు పట్టుకోని ముద్దు పెట్టుకుంట మీదకు రమ్మని చెప్పాడు.

ఇదంతా గురువాయూర్ ధ్యానం లో నుండి చూస్తున్నాడు. మృదుల వచ్చి గజేంద్ర వొడి లో కూర్చొని తన నోటి నుండి నాలుక బయట  కు తీసి తన పెదాలను తడి చేసుకుంటూ ఉంది. ఆ చీకటి లో కూడా నాలుక చివరి రెండు కొసలు గురువాయూర్ కి చాలా చక్కగా స్పష్టం గా కనిపిస్తున్నాయి.మృదుల తన నాలుక మొత్తం బయట పెట్టీ తన అసలు రూపం లోకి రెప్పపాటు కాలం లోకి వచ్చి మళ్ళీ మాముల్గా అయింది.అది చూసిన గురువాయూర్ ఒక్క సారి గా అదిరిపడి కళ్లు తెరిచి శివుణ్ణి స్తుతిస్తూ విగ్రహం వెనుక ఉన్న పుట్ట వైపు చూస్తూ ఇంకా నీ కోపం చల్లారలేదా తల్లి నీ కుటుంబానికి జరిగిన దారుణానికి ఆ కుటుంబం లో పెద్ద దిక్కు అయిన ఆర్య నాయర్ ను చంపేసావు ,ఇప్పుడు వాళ్ళ పిల్లలను కూడా వదలవ అంటూ
అని కన్నీళ్లు పెట్టుకుంటు మళ్ళీ ధ్యానం లోకి వెళ్ళాడు.. 

గురువాయూర్ ధ్యానం లోకి వెళ్లిన తర్వాత అక్కడ కార్ చెట్టుకు గుద్దుకుని ఉండటం మాత్రమే కనిపించింది . వీళ్లిద్దరూ కనిపించలేదు . గురువాయూర్ తన శక్తి తో గజేంద్ర ఎటు వైపు వెళ్ళాడో గుర్తించి తను కూడా అటు వెళ్ళాడు. నిశీధి రాత్రి చుట్టూ చీకటి కీచురాళ్ళ చప్పుళ్లతో భయం పుట్టిస్తుంది.గజేంద్ర లాంటి వాడే భయపడుతూ మెల్లిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఆ చీకటి కి మెల్లిగా అలవాటు పడిన గజేంద్ర కళ్లు తనకు కొద్దిగా దూరం లో ఉన్న మృదుల ను చూస్తూ అటుగా నడక సాగించాయి.. అయితే ఇంతలో బురద లో పడిన గజేంద్ర ను ఎవరో పట్టుకోని లాగినట్టు అనిపించింది.అది ఎంటి అని గజేంద్ర భయపడుతూ చూసాడు,తన మెడ లో ఉన్న చీర ఒక చెట్టు కొమ్మ కు గుచ్చుకొని ఉంది,గజేంద్ర అది చూసి నవ్వుతూ ఉఫ్ఫ్ దీనికి కూడా భయపడుతున్న నేను మృదుల ఎక్కడ ఉన్నవ్ అంటూ పైకి లేచి వెళ్తున్నాడు. ఇదంత చూస్తున్న గురువాయూర్ కి ఉన్నట్టుండి గజేంద్ర 
భయం తో అరుస్తూ రావడం పరిగెత్తడం చూసాడు,అతని వెనుక సగం మానవ దేహం సగం సర్ప రూపంతో ఉన్న ఒక నాగం గజేంద్ర నీ వెంటాడుతూ ఉంది . వాళ్ళిద్దరినీ చూస్తూ వెనకే వెళ్తున్నాడు గురువాయూర్ .

ఆ నాగం గజేంద్ర నీ వెంటాడుతూ తన తోక తో గజేంద్ర ను చుట్టేసి లాక్కొని వెళ్తూ అక్కడ ఉన్న ఒక్క చెట్టు కు వేసి అతన్ని బలంగా విసిరింది.గజేంద్ర ఆ చెట్టు కు గుద్దుకోడం తో అతని నడుము భాగం పూర్తిగా విరిగిపోయింది .అతను ఇప్పుడు నడిచే స్థితిలో లేడు నొప్పి కి అల్లాడిపోతు అరుస్తున్నాడు .  అయిన కూడా ఆగకుండా అతన్ని మళ్ళీ మళ్ళీ చెట్టుకు వేసి విసిరేస్తు ఉంది. గజేంద్ర నొప్పి తో అరుస్తూ తనని వదిలేయమని చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. ఆ నాగం భయంకరంగా నవ్వుతూ ఆరోజు నా కుటుంబం లోని వాళ్ళు కూడా ఇలాగే ప్రాధేయపడి ఉంటారు కదా మీ ముందు అప్పుడు మీ అన్నదమ్ములు ఉరుకున్నరా లేదు కదా ఊర్లో మంచి వాళ్ళుగా చెలామణి అవుతూ ఆ రోజు మీరు చేసిన పాపం మర్చిపోయారా అప్పుడు నుండి ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న . హా ఇప్పుడు మీ అన్నదమ్ముల వంతు అంటు అతన్ని తోక తో కొట్టింది.దాంతో గజేంద్ర స్పృహ కోల్పోయాడు. ఇదంత చూస్తున్న గురువాయూర్ కి ఇక్కడ చెమటలు పడుతున్నాయి.

మృదుల మానవ రూపం లోకి మారి గజేంద్ర మెడ లో ఉన్న చీర ను తీసి అతని కాళ్ళకి కట్టేసి చెట్టుకు వేలాడదీసింది.

(వెంటాడుతూ వచ్చింది మృదుల అని అందరికీ తెలుసు కదా అందుకే కాస్త వివరంగా గురువాయూర్ చూస్తున్న విధంగా రాయడం జరిగింది )

గజేంద్ర కి స్పృహ వచ్చిన తర్వాత చూస్తే అతను చెట్టుకు వేలాడదీసి ఉన్నాడు.. తన దగ్గరకి వచ్చిన మృదుల ను చూసి మొదట మృదుల వచ్చావా నన్ను కాపాడు అని ప్రాదేయ పడ్డాడు. కానీ మృదుల ను సరిగ్గా గమనించి నువ్వా వంచకి ఎంత మాయ చేసావు ,అసలు ఎవరు నువ్వు ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు.. అప్పుడే మరొక వైపు నుండి ఎవరో నడుచుకుంటూ రావడం చూసి గజేంద్ర అరుస్తూ తమ్ముడు నువ్వా వచ్చావా నన్ను కాపాడు అని పిలుస్తున్నాడు.అక్కడే ఉన్న గురువాయూర్ తమ్ముడా ఎవరు అతను అని వచ్చిన మనిషి మొఖం చూడటానికి అతని వైపు తిరిగాడు. ఇంతలో ఇక్కడ గుడి దగ్గర ఎవరో గురువాయూర్ నీ పురోహితన్.అంటూ పిలిచి ధ్యానం నుండి బయటకు వచ్చేలా చేశారు..

గురువాయూర్...అక్కడ కి వచ్చిన వారిని విషయం ఏమిటి అని అడిగాడు.వారు అభిషేకాలకు సమయం అవుతుంది అని చెప్పారు .. 


... హాస్పిటల్...

గజేంద్ర శవాన్ని పోస్ట్ మార్టం కి తీసుకొని వెళ్ళారు . అక్కడ హాస్పిటల్ లో గజేంద్ర శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి అభీర్ పంపించిన డాక్టర్లు వచ్చారు.. 

ఒక 2 గంటల తర్వాత గజేంద్ర శవాన్ని దేవరాజ్ కి అప్పగించి పోస్ట్ మార్టం వివరాలు అభీర్ గారికి మెయిల్ ద్వారా పంపిస్తాను అని అన్నారు డాక్టర్లు. దేవరాజ్ చేసేది ఏమి లేక బాడీ నీ అంబులెన్స్ లో హవేలీ కి తీసుకొని వచ్చాడు...

గజేంద్ర మరణ వార్త విని అతని బంధువులు, వ్యాపార భాగస్వాములు అందరూ వచ్చి గజేంద్ర పార్థీవ దేహాన్ని దర్శించుకొని వెళ్ళారు.. అదే రోజు సాయంత్రం కల్ల అభీర్ ఇంకా మహేంద్ర రావడం తో మిగిలిన పనులు కదా దేవరాజ్ ఇంకా హేమరాజ్ పూర్తి చేశారు . వచ్చిన బందువులు అందరూ వెళ్ళిపోయారు..

మరుసటి రోజు ఉదయాన్నే అన్నదమ్ములు అందరూ ఒక గది లో సమావేశం అయ్యారు...

మహేంద్ర...అసలు ఎంటి ఇదంతా ఏమి జరిగింది అన్నయ్య అని దేవరాజ్ నీ అడిగాడు.

నాకు తెలీదు పొద్దున ఊర్లో వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వెళ్ళి చూస్తే గజేంద్ర బాడీ ఉంది,నువ్వు చెప్పినట్టే సెక్యూరిటీ ఆఫీసర్లను నోరు విప్పొద్దు అని చెప్పాను, వాళ్ళు ఎంక్వైరీ ఏమీ చేయరు , మన మనుషులు అడవి మొత్తం జల్లెడ వేశారు కానీ ఏమి దొరకలేదు.. అభీర్ అని దేవరాజ్ అన్నాడు..

ఆధారాలు దొరికాయి అంటూ అభీర్ పోస్టు మార్టం రిపోర్ట్ వాళ్ళ ముందు వేసాడు.. మిగిలిన ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏమి ఉంది అందులో తమ్ముడు అని అడిగారు..

అభీర్...అన్నయ్య బాడీ లో పాయిజన్ ఉంది అని అన్నాడు..

అవునా అన్నట్టు ముగ్గురు ఒకే సారి అన్నారు..

అభీర్...అవును అన్నయ్య బాడీ లో పాయిజన్ ఉంది.అది కూడా మోస్ట్ డేంజరస్ పాయిజన్ , పోస్టు మార్టం రిపోర్ట్స్ వచ్చిన దగ్గర నుండి దాదాపు 30 మంది సైంటిస్ట్ లు రీసెర్చ్ చేశారు అది ఏమి పాయిజన్ అని తెలుసుకోవడానికి ,కానీ ప్రపంచం లో ఎక్కడ దీని ఆనవాలు లేవు అంటూ రిపోర్ట్ నీ చూస్తున్నాడు.

మహేంద్ర.. అంటే నువ్వు చెప్పేది అన్నయ్య నీ పాము కరిచిందా ఎంటి. అని అడిగిన దానికి అభీర్ జవాబు ఇస్తూ ఏమో తెలీదు పాము కరిచిందా లేక ఎవరైన కావాలని అతని బాడీ లోకి ఎక్కించారా అనేది తెలీదు..

హేమరాజ్...గోడ కు ఆనుకొని నిలబడి అంటే ఇది హత్య అని అంటావా నువ్వు అని అభీర్ నీ అడిగాడు..

అభీర్...హా అవును చాలా పాశవికంగా చంపారు అంటూ గజేంద్ర ఫోటో నీ చూస్తున్నాడు...

ఇది తరాల నుండి వెంటాడుతున్న పగ లేకా వీళ్ళు చేసిన స్వయంకృతం అనేది చూద్దాం..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#63
మాకో సస్పెన్స్ థ్రిల్లర్ రుచి చూపిస్తున్నారు.

మొదట్లోనే చాలా ట్విస్టులు పెట్టి ఆసక్తిని రేకెత్తింవేలా ఉందీ కథనం.

మొత్తానికి ఓ మాంచి కథ అన్న మాట congrats
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#64
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#65
ఇప్పుడేఅ వీళ్ళు అభిషేకానికి రావాలా, ఆ మిగిలిన ముగ్గురిలో మారురూపం లో ఉన్నదెవరో తెలిసేది...బావుంది జాని బ్రో, కాస్త చిన్నదిగా అనిపించింది అప్డేట్...ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఒకరి పై ఒకరు అనుమానం తో కొట్టుకు చస్తారు..నాకైతే మారురూపంలో ఉన్నది అభీర్ అని అనిపిస్తోంది అన్న చనిపోయిన వార్త వినికూడా తీరిగా సాయంత్రపు ఫ్లైట్ కొచ్చాడు, ఎక్కడ కంగారు, ఆదుర్దా చూపక పక్కా ప్లాన్ చేసి తనకే రిపోర్ట్ పంపేలా చేసుకుని...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#66
(05-01-2023, 01:44 PM)Uday Wrote: ఇప్పుడేఅ వీళ్ళు అభిషేకానికి రావాలా, ఆ మిగిలిన ముగ్గురిలో మారురూపం లో ఉన్నదెవరో తెలిసేది...బావుంది జాని బ్రో, కాస్త చిన్నదిగా అనిపించింది అప్డేట్...ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఒకరి పై ఒకరు అనుమానం తో కొట్టుకు చస్తారు..నాకైతే మారురూపంలో ఉన్నది అభీర్ అని అనిపిస్తోంది అన్న చనిపోయిన వార్త వినికూడా తీరిగా సాయంత్రపు ఫ్లైట్ కొచ్చాడు, ఎక్కడ కంగారు, ఆదుర్దా చూపక పక్కా ప్లాన్ చేసి తనకే రిపోర్ట్ పంపేలా చేసుకుని...

హాయ్ మిత్రమా... 

ముందుగా కథను చదివినందుకు ధన్యవాదాలు, ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్స్ మీద ఒక సారి పరిశీలన చేద్దాం..

మనం చేసే పనిలో ముఖ్యమైంది దేవుని నీ మనసుతో పూజించడం.. మరి ఆయన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళు ఆ పని అసలు పక్కకు జరపలేరు..

అభీర్ మీద అనుమానం దాని గురించి చెప్పను గా.. 

ఆశ దోశ అప్పడం వడ...

Update చిన్నది హా అవును మిత్రమా కారణం సేవ్ బదులు పోస్ట్ నొక్కేసా..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
#67
(05-01-2023, 01:32 PM)k3vv3 Wrote: మాకో సస్పెన్స్ థ్రిల్లర్ రుచి చూపిస్తున్నారు.

మొదట్లోనే చాలా ట్విస్టులు పెట్టి ఆసక్తిని రేకెత్తింవేలా ఉందీ కథనం.

మొత్తానికి ఓ మాంచి కథ అన్న మాట congrats

ధన్యవాదాలు మిత్రమా.. 

అలాగే నాకు మీ ...ఆకాశంలో సగం రుద్ర... చదివిన మొదటి అప్డేట్ కే ఫిదా అయ్యాను.. మీరు చాలా సీనియర్ plz support us till the end... Namaskar

Naa మిగిలినా కథలను చూడండి.. ఒక్కోటి ఒక్కో జోనర్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని భావిస్తూ..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#68
Excellent update. Every story of your's is just amazing. Brilliant writing's.
[+] 1 user Likes Sai_lucky29's post
Like Reply
#69
(05-01-2023, 03:33 PM)Sai_lucky29 Wrote: Excellent update. Every story of your's is just amazing. Brilliant writing's.

Thank you so much మిత్రమా.. keep read my stories..  Namaskar


 
Support me with your compliments..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#70
Super update
[+] 1 user Likes Happysex18's post
Like Reply
#71
Wooow good
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#72
గజేంద్ర చావు చాలా భయంకరం గా ఉంది
శవం చెట్టు కి వేలాడుతున్నప్పుడు కిందకి దించేందుకు చేసిన ప్రయత్నం బాగా భయం కలిగింది

అప్డేట్ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#73
Who is the body double person? that's the one in that night in forest and it's quite interesting because this revange drama

Hats off to you and your imagination world

All the best
yourock  congrats
[+] 1 user Likes Muralimm's post
Like Reply
#74
(05-01-2023, 10:49 PM)ramd420 Wrote: గజేంద్ర చావు చాలా భయంకరం గా ఉంది
శవం చెట్టు కి వేలాడుతున్నప్పుడు కిందకి దించేందుకు చేసిన ప్రయత్నం బాగా భయం కలిగింది

అప్డేట్ బాగుంది

కొన్ని సంఘటనలు బయట చూసినప్పుడు లేదా సినిమాల్లో కనిపించే త్రిల్ చదివేటప్పుడు రాదు, కానీ ఆ థ్రిల్ రావాలి అని గజేంద్ర చావు అల చూపించాను మిత్రమా..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#75
(05-01-2023, 10:52 PM)Muralimm Wrote: Who is the body double person? that's the one in that night in forest and it's quite interesting because this revange drama

Hats off to you and your imagination world

All the best

అడవి లో ఉన్న మరో వ్యక్తి ఎవరు అనేది నేను చెప్పకుండా మీరే కనిపెట్టేయోచ్చు , తదుపరి అప్డేట్ లో ఇంకా కాస్త సస్పెన్స్ తో ఇంకొంచం వైల్డ్ గా వస్తాను మిత్రమా..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#76
మిత్రమా మార్నింగ్ చూసా but ఇప్పుడే చదివాను. 

నువ్వు ఒక ప్రొడ్యూసర్ ని వేతుక్కో. 

No words man.

వాయున మహేంద్ర అనుకుంటున్న. అనుకుంటున్న.

Eagerly waiting for next one.
[+] 2 users Like Haran000's post
Like Reply
#77
(06-01-2023, 12:09 AM)ITACHI639 Wrote: మిత్రమా మార్నింగ్ చూసా but ఇప్పుడే చదివాను. 

నువ్వు ఒక ప్రొడ్యూసర్ ని వేతుక్కో. 

No words man.

వాయున మహేంద్ర అనుకుంటున్న. అనుకుంటున్న.

Eagerly waiting for next one.

Gd morning bro..

నీ అభిమానానికి కృతజ్ఞతలు సోదర .. ప్రొడ్యూసర్ ఎవరు అవసరం లేదు.. మీరు నాకు చివరి వరకు సపోర్ట్ ఇవ్వండి అదే నాకు ఎంతో ఇష్టం...

Read S.T.A.L.K.E.R pervious update... Namaskar
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply
#78
(06-01-2023, 07:34 AM)Jani fucker Wrote: Gd morning bro..

నీ అభిమానానికి కృతజ్ఞతలు సోదర .. ప్రొడ్యూసర్ ఎవరు అవసరం లేదు.. మీరు నాకు చివరి వరకు సపోర్ట్ ఇవ్వండి అదే నాకు ఎంతో ఇష్టం...

Read S.T.A.L.K.E.R pervious update... Namaskar


Take it as a compliment bro. 

మిత్రమా stalker మీద నాకు కాస్త interest రావడం లేదు. ఎప్పుడైనా free గా కూర్చొని ఒకేసారి చదువుతా. అంటే ఆ concept నాకు కొంచెం నచ్చట్లేదు అనుకుంటా but I'll read definitely.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#79
మిత్రమా నువ్వు ఈ update చాలా exciting గా రాసావు, గురువాయూర్ కి కాదు , నా కళ్ళ ముందు జరిగినట్టు అనిపించింది తెల్సా. But ఒకటి చెప్పాలి, కొంచెం కొత్తగా అనిపించలేదు. Next time ఇలాంటివి రాస్తే కాస్త uniqueness add చెయ్.

Hope you take care of it in future updates.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#80
(05-01-2023, 12:10 PM)Jani fucker Wrote: దైవ భూమి గా పిలవబడే కేరళ రాష్ట్రం.పైగా కార్తీక మాసం అందులోనూ శివునికి ఇష్టమైన మాసం కావడం తో త్రిస్సుర్ లో ఉండే ప్రజలు పూజకు కావలసిన కొన్ని వన సామాగ్రి కోసం        
Good Story/Update Jani garu!!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)