Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama సాగర సమీరం
#1
సాగర సమీరం  
Surekha A Shakti
     
"సమయం సాయంత్రం 6 గంటలౌతోంది.  సాగర్ సముద్రతీరాన నుంచొని ఉప్పెనగా ఉప్పొంగుతున్న కన్నీటి కడలిని అతికష్టం తో అడుకట్ట వేస్తూ, దుఃఖాన్ని దిగమింగి అక్కడ నుండి కదిలాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతోంది.  
“హలో సార్ ! సమీరా గారిని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసాము.  ఏంటి సార్ పేషెంట్ దగ్గర ఎవరూ లేరు.  ఇలా అయితే ఎలా సార్ ఎవరో ఒకరు ఉండాలి కదా. మేము జాగ్రత్తగా చూసుకున్న కూడా పేషెంట్ కి మీరు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది కదా . ఇప్పటి వరకు ఐ సి యూ లో ఉండడం వల్ల మీ అవసరం లేదు. ఇకపై ఆమెకు దైర్యం చెప్పవలసింది మీరే అని మర్చిపోయారా. త్వరగా రండి సార్. హడావుడి చేసింది నర్స్.    
అలాగే మేడం అని కళ్ళు తుడుచు కుంటూ ఫోన్ కట్ చేసి హాస్పిటల్ కి బయల్దేరాడు సాగర్. అడుగు ముందుకు వేసే లోగా మళ్ళీ ఫోన్ రింగ్ అయింది.    
హలో! సాగర్ ,ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. సమీరా కి ఎలా ఉంది రా అంటూ అడిగింది సాగర్ అక్క సౌమ్య. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అక్క, జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు సమీరా ని.
అదేంటి సాగర్ నువ్వు హాస్పిటల్ లో లేవా , ఇలాంటి సమయంలో సమీరాని ఒంటరిగా వదిలేస్తే తను డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు త్వరగా వెళ్లి అక్కడ చూసి నాకు ఫోన్ చేసి చెప్పు సమీరా ఎలా ఉందో.  అమ్మ గురించి నేను చూసుకుంటాను నువ్వు ఏం కంగారుపడకు. చెప్పింది వాళ్ళక్క. సరే అక్కా...!    
కాసేపటికి హాస్పిటల్ కి చేరుకున్నాడు సాగర్.సాగర్ ని చూసి మొహం తిప్పేసుకుంది సమీరా. సాగర్  బెడ్ దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని సమీరా  నన్ను చూడడం కూడా నీకు ఇష్టం లేదా, నన్ను క్షమించు అంటూ సమీరా చెయ్యి పట్టుకున్నాడు.    
సమీర ముఖం తిప్పేసుకుని అతని చేతిని విదిలించి పక్కకి తిరిగింది. నీకు పదేపదే సారీ చెప్తున్నా అని అలుసై పోయానన్నమాట అన్నాడు సాగర్. తప్పంతా చేసేసి ఒక్క మాట సారీ అని నోటి చివరినుండి చెప్పి, జరిగింది మరిచిపో అంటే ఎలా మరిచిపోవాలి సాగర్ బుగ్గలమీద కన్నీటిని కూడా తుడుచుకునే ఓపిక లేక అలాగే పడుకుంది.    
అలా కాదు సమీరా.. నువ్వు నా పరిస్తితి కూడా అర్దం చేసుకో అతని మొహం లో చిరాకు కనిపిస్తోంది. అర్దం చేసుకున్నాను కాబట్టి మీరు ఇలా నా ప్రాణాలతో చెలగాటం ఆడినా మౌనంగా నాలో నేనే కుళ్ళిపోతున్నాను తప్ప మిమ్మల్ని మీ అమ్మగారిని పల్లెత్తుమాట అనలేకపోతున్నాను అంతే రోషంగా చెప్పింది సమీర.    
అయ్యో! సమీరా నువ్వు అలా మాట్లాడకు నేను భరించలేను. అమ్మ మొండిగా తిండీ తిప్పలూ మానేసి, తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది కదా, నీకు అది అర్థం కావట్లేదూ అతని మోహంలో కోపం ఛాయలు కనిపిస్తున్నాయి. హ...! అవునూ....! ఆవిడా ఆడదే కదా. అమ్మతనంలో మాధుర్యం ఏమిటో ఆవిడకు తెలీదూ. నా కడుపు లోని బిడ్డని బయటికి రాకుండా అడ్డుకున్నది ఆవిడకాదూ, ఆవిడ మీద ప్రేమతోనే కదూ మీరు నా ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఎవరిచ్చారండీ మీకు అధికారం. నేను నోరుమూసుకోబట్టే కదా మీరు ఇలా చేసారు సమీర కోపం చూసి అతను మరింత రెచ్చిపోయాడు.     
అవునే, నాకు అమ్మంటే ప్రాణం. అమ్మతరవాతే ఎవరైనా. అమ్మకిష్టం లేదు కాబట్టే నీకు అబార్షన్ చేయించాను చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా!! అంటే మీ అమ్మ సంతోషం కోసం  నాకు ఈ కడుపుకోత సృష్టించారన్నమాట నీరసనగా భర్త మోహంలోకి చూసింది. చాల్లే ఇంకా నోర్ముయ్యి, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు సాగర్    
ఆడదానికి అడదే శత్రువు అని అంటే ఏంటో అనుకున్నా. మీ అమ్మలాంటి వాళ్ళని చూసే అలా అని ఉంటారు. ఇప్పుడు అర్దం అవుతుంది నా అమ్మతనాన్ని అడ్డగించిన అత్తగారిని తలుచుకుంటే ఆ మాట నిజమే అని అనిపిస్తుంది.        
అత్త అనే అహంకారానికి నిలువెత్తు నిదర్శనం ఆవిడ.  నా అపరంజి బొమ్మ , నా చిట్టి తల్లిని తన స్వార్ధంకోసం బలిచ్చింది. అంతేలెండి, నా చిట్టి పాపాయి ఒక విధంగా అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది. నాలాగా ఇంకో ఇంటికి కోడలుగా వెళ్లి నాలాగా కడుపుకోత భరించక్కర్లేకుండా మీలాంటి వారు పెట్టె బాధలు పడకుండా నా కడుపులోనే కరిగిపోయింది . నాకు ఇంతటి కడుపుకోత బహుమతిగా ఇచ్చిన మిమల్ని, మీ అమ్మని నేను నా మరుజన్మలో కూడా మరువను అలాగే మన్నించలేను కూడా.   
సమీరా, నువ్వు ఇంత అవేశపడడం మంచిది కాదు. అమ్మ మొండితనం, నీ మూర్ఖత్వం వల్ల  నాకు మనః శాంతి కూడా మాయమైపోయింది. అది చాలదని ఇద్దరు కలిసి నాపై మాటల తూటాలతో దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది అని ఇంత గొడవ చేస్తున్నావు. మూడు నెలలు నీ కడుపులో ప్రాణం పోసుకున్న  బిడ్డ దూరమైతే నీకు ఇంత బాధగా ఉంది. మరి 30 సంవత్సరాలు నన్ను మా అమ్మ ఇంతే ప్రేమగా పెంచింది  కదా. మరి అమ్మ దూరం అవుతాను అంటే నేను ఎంత బాధ పడాలిఅన్నాడు.     
చాలా బాగుందండి. నన్నే ముర్ఖురాలు అని అంటారా. ఆవిడా ఆడదే కదా, సాటి ఆడదాని ఆవేదన అర్థం చేసుకోలేని ఆవిడ గురించి బాధపడుతున్నారు మీరు మాటలు చాల పదునుగా వస్తూ ఉంటే సాగర్ కి మతిపోతోంది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను నన్ను నమ్ము సమీరా.    
చాలండీ... చాలు, మీకోదణ్ణం, ఆవిడకో వేళ దండాలు అంటూ విసురుగా దణ్ణం పెట్టి కళ్ళు తుడుచుకుంది. ఇక్కడే ఉంటే మళ్ళీ ఇలాగే ఇంకోసారి అవ్వదని ఎలా నమ్మాలి మిమల్ని. అప్పుడైనా నాకు ఆవేదన తప్పదు కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చానుఅంది సమీర. ఏమిటది అడిగాడు. మీకోసం, మీ అమ్మ  నేనేందుకు రాజీ పడాలి. మీకు ఇష్టమైతే మనం కలిసి ఉందాము.కేవలం మనిద్దరమే. మనతో ఇంకెవరూ ఉండకూడదు. లేదంటే జరిగిందొక పీడకల అని ఎవరి దారిన వాళ్ళం బతుకుదాం.    
సమీరా బాగా ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావో అర్థమౌతోందా? ఆవేశం లో తీసుకునే పిచ్చినిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని అరిచాడు సాగర్. మీకు నామీద అరిచే హక్కు, చెప్పే అధికారం లేవు సాగర్. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి కఠినంగా హెచ్చరించింది సమీర.    
నాశనం అయ్యేది నా ఒక్కదాని జీవితం మాత్రమే కాదు, మీది  కూడా. నేనేమీ విడాకులు ఇచ్చి  వెళ్ళిపోను. నా కడుపులో కరిగిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నా. దీనికి కారణమైనవాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడినా, నేను క్షమించను. కసిగా అంది సమీర.     
మనం ఒకే ఇంట్లో ఉన్నా మన మధ్య ఏమీ ఉండదు. కనీసం మాటలు కూడా అని హెచ్చరించింది. మీకు కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. ఇంట్లో పనులు మీరే చెయ్యాలి. మీరు, ఆవిడా కలిసి చేసిన కుట్రకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, ఆమె మాటల్లో కసి అర్థమౌతోంది. నేను ఇంత చెప్పిన అర్దం చేసుకోకుండా ముర్ఖంగా మాట్లాడితే నేనేమీ చేయలేను. అయినా ఇదేమి పెద్ద విషయం కాదు సమీరా. మా అక్క కి ఏడు సార్లు అబార్షన్ జరిగింది అయిన తను సంతోషంగా ఉంది. మరి నువ్వెందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నావు. రూపం తెలియని పాప కోసం కనిపెంచిన అమ్మని కొల్పోమంటావా, అడిగాడు. నా కోసం మీరు మారలేనప్పుడు  నా నిర్ణయం కూడా మార్చుకోలేను. వెళ్ళండి ఇక్కడినుండి. ఇంక రావద్దు.అంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, వెళ్లిపోతున్నా అని చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్. ఫోన్ రింగ్ అయింది. సాగర్  , సమీరా ఎలా ఉంది రా, ఆత్రుతగా అడిగింది వాళ్ళక్క. 
తనకేంటి అక్క చాలా బాగుంది, కోపంగా అన్నాడు. అదేంటి సాగర్ నువ్వు ఏమైనా తనతో గొడవపడ్డావా అడిగింది ఆమె. నేను కాదు అక్క తనే నన్ను నోటికొచ్చినట్లు అంది. మహా పొగరు తనకిఅన్నాడు. చాల్లే.. ఆ పరిస్థితి లో ఏ అమ్మాయి అయినా అంతే అంటుంది అంది ఆమె.    
అక్క నువ్వు కూడా నాదే తప్పు అన్నట్లు నాపై అరుస్తావ్ ఏంటి. చిరాగ్గా అన్నాడు.  అవును సాగర్ తప్పంతా నీదే. మన అమ్మ ప్రాణాల కోసం తన కడుపులో ప్రాణం పోసుకున్న పసికందును త్యాగం చేసింది సమీర. మన అమ్మ ప్రాణాల్ని కాపాడిందనే చెప్పొచ్చు. 
ఆ బాధలో తన ఏం మాట్లాడినా మనం పడాలి. కానీ నువ్వేం చేసావు తనకి? ఇష్టానుసారంగా మాట్లాడావు ఆమెతో ఇది తప్పుకాదా! అంది ఆమె.   
అక్క అదేమీ గొప్ప విషయం కాదు లే నీకు ఏడు సార్లు అబార్షన్ జరిగింది అని అమ్మ చెప్పింది.అయిన కూడా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మరి తానెందుకు అలా గొడవ చేస్తుంది అడిగాడు.     
నా పరిస్థితి వేరు సమీర పరిస్థితి వేరు. నన్ను ఆమెను పోల్చడం తప్పు తమ్ముడు. మీ బావ లాంటి తాగుబోతు మనిషితో నేను అడ్జస్ట్ అవుతున్నాను ఇంకా పిల్లలు కూడా నాలాగే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను.     
ఒక్క కణం కి రక్తమాంసాలు జత చేసి, ప్రాణం పోసి తన ప్రాణాలని ఫణంగా పెట్టి కాపాడుకునే బాధ్యత తల్లిది అలాంటి తల్లి తనని తాను త్యాగం చేయడం మామూలు విషయం కాదు. తన వాళ్లందరిని మనలో చూసుకుంటూ, మనల్నినమ్ముకొని ప్రేమని పంచే అమ్మాయికి నువ్వూ అమ్మా కలిసి ఏం అన్యాయం చేసారో అర్థమౌతోందా. దైర్యం చెప్పవలసిన నువ్వే తనపై అరవడం తప్పు రా తమ్ముడూ.    
నన్ను క్షమించు అక్క! నువ్వు చెప్పింది నిజమే నేను అమ్మకి నచ్చ చెప్పలేకపోయాను అది ఒప్పుకోకుండా సమీర మీద  కోపడ్డాను. తాను బాధగా మాట్లాడితే పొగరుపట్టింది అనుకున్నానుఅన్నాడు.    
క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, ముందు తన దగ్గరకి వెళ్ళి తనకి ఏదైనా తినిపించు. ఆమెకు క్షమాపణ చెప్పుకో. నీమీద ప్రేమ కలిగేలా ప్రవర్తించు నెమ్మదిగా హితబోధ చేసింది వాళ్ళక్కయ్య. సరే అక్కా ఉంటాను, అంటూ అక్కడి నుండి సమీర దగ్గరకి బయలుదేరాడు.    
చూసావా అమ్మ...నీ మొండితనం  తమ్ముడు కాపురంలో చిచ్చు రాజేసింది.వాళ్ళ సొంత విషయాల్లో కల్పించుకుని ఇద్దర్నీ విడదీసావు. అయినా నీకేమి హక్కు ఉందని వాళ్ళ విషయంలో కలుగ చేసుకున్నావు. సమీరా బాగా చదువుకున్న అమ్మాయి అయిన కూడా నిన్ను తన తల్లిలా చూసుకుంది. నువ్వు ఏం చేశావు తనకి. ఎంతైనా ఆత్తగారి దర్పం చూపించావు. అత్త ఎప్పటికీ అమ్మ అవలేదు అని నిరూపించావు . ముప్పైఏళ్ళు వచ్చిన ఇంకా నీ కొడుకుని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నావు. ఇటు నీకు అటు సమీరా కి సర్ది చెప్పలేక సతమతం అవుతున్నాడు సాగర్ .    
ఏంటే సౌమ్యా, నన్ను ప్రశ్నించే అంత పెద్దదానివి అయ్యావా. అయినా ఇదేమి పెద్ద విషయం కాదు . మనకేమి ఆస్తులు లేవు ఇద్దరు పిల్లల్ని పోషించి వాళ్ళకి అన్ని సమకూర్చడానికి. పెద్దరికం తో చెప్తే వాళ్ళు పెడచెవిన పెట్టి ఇదిగో ఇలా నా ప్రాణాల మీదకు తెచ్చారు మొండిగా వాదించారు ఆవిడ.    
అమ్మా, మీ అత్తగారు కూడా ఇలా చేస్తే నువ్వు మమ్మల్ని కనేదానివా! నీకో న్యాయం, నీ కోడలికో న్యాయమా? నీ కాలికింద చెప్పులా నీ అత్తగారుండాలి, మరి నీ కోడలి కాలికింద, నువ్వు అలా ఉండవెందుకు? మనం ప్రేమతో ఎదుటివారి మనసులో స్థానం సంపాదించుకోవాలి. అధికారంతో కాదు. మా అత్తగారు నిన్ను చూడ్డానికి వెళ్లొద్దు అని నన్నంటే ఇప్పుడు నిన్నెవరు చూసుకునే వాళ్ళు? అడిగింది.    
అమ్మా, నీకు ఇంత జరిగిన తర్వాత కూడా విషయం అర్థం కాకపోతే ఎవ్వరం ఏమీ చేయలేము.పెద్దరికం అంటే పంతం పట్టి సాధించుకోవడం అని అనుకుంటున్నావా. రేపు తమ్ముడు నీ బుద్ధి అర్దం చేసుకుంటే నిన్ను అమ్మ అని కూడా పిలవడు అప్పుడు నీవెంట ఉండేది ఎవరో గుర్తు చేసుకో.   
వాడు నా కొడుకు. ఎప్పటికీ అలా  మారడు లే. నీ శాపాలు నాపై పనిచేయవు వెళ్లి నీ పని చూసుకో అందావిడ. సరే, నేను వెళ్తున్నా, నీకొడుకు చేతే పనులు చేయించుకో అంటూ గదిలోంచి బయటికి వచ్చింది ఆమె.    
ఒరేయ్, తమ్ముడూ, నువ్వూ అమ్మా మారరు అని అర్థమైంది. అమ్మ దగ్గర నేనుండి చూసుకోను. నాకూ సంసారం ఉంది. నాకు మా ఆయన కావాలి. నీలా కుటుంబాన్ని వదిలేసుకోలేను నేను అంది సౌమ్య. అక్కా, నేనొచ్చినదాకా, ఉండు. సమీర తో మాట్లాడుతూ ఉన్నా. అమ్మకి నేను చెప్తాను ప్లీజ్ ఉండు అంటూ బతిమాలాడు.    
చెప్పినట్లే ఒక గంటలో అక్కడికొచ్చి, నేను అమ్మతో గట్టిగా మాట్లాడుతాను. నువ్వు అడ్డుకోకు. తల్లి బెడ్ దగ్గరికి వెళ్తూ చెప్పాడు. సరే తమ్ముడూ నేను ఆవిడతో మాట్లాడలేను. ఆవిడ పరిస్థితి ఏంటో నువ్వే చూసుకో అంది సౌమ్య.    
అమ్మా, అంటూ పిలిచాడు సాగర్. వచ్చావా నాయనా, మీ అక్క చూడు నన్నిలా వదిలేసి పోయింది అందావిడ భారంగా. నేనొచ్చేసాను లే అమ్మా, సమీర కూడా నన్ను రావద్దు అంది. ఇంక మనిద్దరం  ఉండొచ్చుఅన్నాడు. అదేంట్రా, ఏమైంది అంది ఆవిడ. నీ మాటల వలన తాను నన్నోదిలేసింది. విడాకులు కూడా ఇవ్వను అని చెప్పింది. పోతే పోనివ్వు అన్నాడు.      
నాకోసం మీరు విడిపోతారా, వద్దురా నాన్నా. నేనేదో బుద్ధిలేక మిమ్మల్ని బాధ పెట్టాను. నేనే వెళ్ళి కోడల్ని బతిమాలి తెచ్చుకుంటానుఅంది ఆవిడ. అమ్మా, నువ్వుంటే తాను ఉండను అంది. అందుకే నిన్ను ఎక్కడైనా వృద్దాశ్రమంలో చేర్చుదామని అనుకుంటున్నా. అన్నాడు సాగర్. బాబూ, నేను అమ్మనిరాఅందావిడ. నువ్వు అమ్మవే, కానీ ఇప్పుడు నా సంసారం నీవల్లనే కదా ముక్కలైంది. మనపరువు ఏంకావాలి అడిగాడు.      
తప్పు నాదేరా నాన్నా. ఇంట్లో ఒకమూల పడుంటాను. నన్ను అలా బయటికి పంపెయ్యకు, కళ్ళు తుడుచుకుంటూ అందావిడ. అమ్మా సమీర నీకోడలు గా కాకుండా బిడ్డగా చూసుకో అమ్మా, అందరం సంతోషంగా ఉంటాముఅన్నాడు. నిజమేరా అబ్బాయ్, నాకు ఒంట్లో శక్తి వచ్చింది. ఇవాళ సాయంత్రమే మనం కోడలు దగ్గరికి వెళదాం అది నా కళ్ళు తెరిపించింది. నేను తనని నా కన్నబిడ్డలా చూసుకుంటానుఅందావిడ.     
అమ్మా, నీలో మార్పు రావాలనే నేను వెళ్లిపోతున్నా అన్నాను. నిన్నోదిలి ఎలా వెళతాను అంది సౌమ్య. అల సాగర్ సమీర మళ్ళీ ఒక్కటయ్యారు. పెద్దరికం అంటే పట్టుపట్టి సాధించడం కాదు. అనుభవాలు పంచి ప్రేమని పెంచడం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)