Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#41
40      

పొద్దున్నే తలుపు చప్పుడు కావడంతో మీనాక్షి లేచి కూర్చుంది, రాత్రి జరిగినవి ఏవేవో గుర్తుకొస్తున్నాయి.. సుశాంత్ లోపలికి వచ్చాడు.

మీనాక్షి : సుశాంత్ నన్ను పోనీ, టైం వేస్ట్ చేసుకోకు.. నీకు నేను దక్కడం ఇంపాసిబుల్.

సుశాంత్ : ఇవ్వాళ సాయంత్రం నీకు నాకు పెళ్లి, మధ్యాహ్నం డాక్టర్ వస్తున్నాడు నీ ప్రెగ్నెన్సీ కూడా తీసేస్తాడు. అప్పుడు ఆ తరువాత చూస్తావ్ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో

మీనాక్షి : ఛీ..

సుశాంత్ నవ్వుతూ వెళ్ళిపోయాడు.

మీనాక్షికి వెంటనే రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చి కొంచెం అనుమానంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నిమిరి

మీనాక్షి : బుజ్జి

అమ్మా..

ఆ మాట వినగానే మరొక్కసారి ఆశ్చర్యపోయింది

మీనాక్షి : బుజ్జి.. ఎలా ఇదంతా నాకు ఏం అర్ధం కావడం లేదు

ఇప్పటికైనా నమ్ముతావా లేదా అని కసురుకున్నట్టు మాట్లాడేసరికి

మీనాక్షి : ఆమ్మో.. నమ్ముతాను నమ్ముతాను.. కోప్పడకు అని నవ్వుకుంది

కడుపు దెగ్గర వెచ్చగా అయ్యింది.. మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసుకుని బుజ్జి అంటూ కంగారు పడింది

అమ్మా కంగారు పడకు, నేను కూడా నవ్వుతున్నాను

మీనాక్షి : బుజ్జి ఏంటిదంతా, ఇది ఎలా..

అవన్నీ ఎందుకు.. సాధ్యం అయ్యిందిగా, నాకు నాన్నని చూడాలనుంది

మీనాక్షి : నువ్వు చూడగలవా

నీ కళ్ళున్నాయిగా.. నీ శరీరాన్ని నేను వాడుకోగలను

మీనాక్షికి ఒకింత ఆశ్చర్యం ఒకింత సంతోషం కొంత భయం కూడా పట్టుకుంది.

అమ్మా.. భయపడకు, ముందు ఇక్కడినుంచి వెళ్ళిపోదాం.. నీకు నాన్నని చూడాలని ఎంత ఆశగా ఉందొ నాకు తెలుస్తుంది.

మీనాక్షి : కానీ ఎలాగ బుజ్జి, మనల్ని బంధించేసారు

నువ్వు ముందుకు వెళ్ళు, అనుమాన పడకు నన్ను నమ్ము ఆ తలుపుని ముట్టుకొనవసరం కూడా లేదు. వెళ్ళు అనగానే మీనాక్షి ముందుకు నడిచింది, తలుపు దెగ్గర ఆగింది కాని తన కొడుకు మళ్ళీ వెళ్ళమనేసరికి అడుగు ముందుకు వేసింది. ఆశ్చర్యం.. తలుపు లోనుంచే బైటికి వచ్చేసింది.

మీనాక్షి : (సంతోషంగా) బుజ్జి ఎలాగా

పదా వెళదాం..

మీనాక్షి : అక్కడ చాలా మంది ఉన్నారు

వాళ్ళు నిన్ను ముట్టుకోలేరు, ధైర్యంగా ముందుకెళ్ళు. ఇన్ని రోజులు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఇంకా బతికే ఉన్నావంటే నీకింకా అర్ధం కావట్లేదా

మీనాక్షి : అవును బుజ్జి నేనిది గమనించనేలేదు. సరే.. ఆ సుశాంత్ కూడా లేడు ఇదే మంచి టైం అని వేగంగా ముందుకు నడుస్తుంటే అక్కడే కాపలాగా ఉన్న వాళ్ళు మీనాక్షి దెగ్గరికి వచ్చారు

రేయి ఆవిడ బైటికి ఎలా వచ్చింది..
ఏమో ముందు ఆపండి, అన్న వచ్చాడంటే మనల్ని చీరేస్తాడు

అందరూ మీనాక్షిని పట్టుకోబోయరు కాని కనీసం మీనాక్షిని ముట్టుకోలేకపోయారు, మీనాక్షి మీద కనీసం చెయ్యి కూడా వెయ్యలేకపోయారు ఏదో శక్తి రెండు అడుగుల ముందే ఆపేసింది. మీనాక్షి అది చూసి తన పొట్ట మీద చెయ్యి వేసి బుజ్జి అంది.

నేను చెప్పాను కదమ్మా

మీనాక్షి : అవును బుజ్జి.. అక్కడ కారు ఉంది పదా వెళదాం అని అక్కడికెళ్లి చూస్తే తాళం దానికే ఉంది. వెంటనే స్టార్ట్ చేసి అక్కడనుంచి పోనించింది.

బైటికి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడుందో తెలుసుకుని, నేరుగా శివ ఇంటికి వెళ్ళింది కాని ఇంటికి తాళం వేసి ఉండటంతో కంపెనీ దెగ్గరికి వెళ్ళింది అక్కడ ఫోన్ తీసుకుని వెంటనే కావేరికి ఫోన్ చేసింది.

కావేరి : హల్లో అంది నీరసంగా

మీనాక్షి : అత్తయ్యా

కావేరి : మీనాక్షి.. మీను..

మీనాక్షి : ఎక్కడున్నారు అత్తయ్యా

కావేరి : ఇక్కడే లైఫ్ కేర్ హాస్పటల్

మీనాక్షి : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకుని హాస్పటల్ వైపు కారుని పరిగెత్తించింది.

హాస్పటల్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న శివ పక్కన కూర్చుని, మాట్లాడుతుంది కావేరి.

కావేరి : శివుడు.. నీ మీనాక్షి ఫోన్ చేసింది.. వస్తుంది నాన్నా

సందీప్ : మీనాక్షి వస్తుందా

కావేరి : అవును ఇప్పుడే ఫోన్ చేసింది, వస్తున్నానంది.

పావుగంటలో మీనాక్షి కారుని హాస్పిటల్ ముందే వదిలేసి లోపలికి పరిగెత్తింది. రిసెప్షన్ లో కనుక్కుని మూడో ఫ్లోర్ ఎక్కి శివ ఉన్న రూం దెగ్గరికి వెళ్లి డోర్ దెగ్గరే శివని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది.

కావేరి తల తిప్పి మీనాక్షిని చూసి లేచి వెళ్లి కౌగిలించుకొని ఏడ్చేసింది.

కావేరి : మీను.. ఎలా ఉన్నావ్.. ఏమైపొయ్యవ్ రా

మీనాక్షి : శివ..

కావేరి : అడుగో కోమాలో ఉన్నాడు అని వదిలేసారికి.. మీనాక్షి వెళ్లి శివని చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని శివ చెయ్యి అందుకుంది.

అమ్మా..

మీనాక్షి అటు ఇటు చూసింది, కంగారుగా

కంగారుపడకు నా మాటలు నీకు తప్ప ఇంకెవ్వరికి వినిపించవు. ముందు అందరినీ ఇక్కడ నుంచి పంపించేయ్యి.

మీనాక్షి : ఎందుకు

కావేరి : ఏంటి మీను..

మీనాక్షి : ఏం లేదు అత్తయ్య

ముందు పంపించేయ్యి.. నాన్నని లేపుదాం అనగానే శివ చేతిని పట్టుకున్న మీనాక్షి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది. ఆనందం వేసి

మీనాక్షి : సరే.. అని లేచింది

మీనాక్షి తన అత్తయ్య దెగ్గర కూర్చుని ఇన్ని రోజులుగా జరిగిందంతా వింటూ శివ ని చూస్తూ కూర్చుంది. ఇటు మీనాక్షికి కూడా అంతా అయోమయంగా ఉంది కడుపులో ఉన్న పిండం మాట్లాడడమేంటో ఎంత ఆలోచించినా పిచ్చి ఎక్కిపోతుంది కాని తన బిడ్డ వల్లే బయట పడి శివని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, కాని బిడ్డ అలా ఉండటంతో చాలా భాయంగా ఉంది. చిన్నగా ఎవ్వరికి కనిపించకుండా పొట్ట మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది, అక్కడ వెచ్చగా అయ్యేసరికి తన బిడ్డ ఆనందంగా ఉన్నాడని గ్రహించి నవ్వుకుంది.. ఇదంతా గమనిస్తున్న కావేరికి మాత్రం ఏం అర్ధం కాలేదు.. ఇన్ని రోజులు శివకి దూరంగా ఉంది కదా ఇప్పుడు ఈ స్థితిలో వాడిని చూసి పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందేమో అని తనకి తానే సర్ది చెప్పుకుని మీనాక్షి భుజం మీద చెయ్యి వేసింది. మీనాక్షి పొట్ట మీద చెయ్యి తీసేసి మాములుగా కూర్చుంది. కొంతసేపటికి సందీప్ లేచాడు

సందీప్ : అమ్మా రాత్రి కూడా ఏం తినలేదు, ముందు ఏమైనా తిందాం పదా

కావేరి : తిందాంలేరా

మీనాక్షి : అత్తయ్యా వెళ్ళండి, నేను వచ్చేసాను కదా.. మీరందరూ కూడా వెళ్ళండి. నాకు కొంత సేపు శివతో ఒంటరిగా గడపాలని ఉంది అని భరత్ చెల్లిని చూసింది.. అందరూ లేచి వెళ్లిపోయారు.

అందరూ వెళ్ళగానే మీనాక్షి లేచి డోర్ పెట్టేసి శివ దెగ్గరికి వచ్చి నిలుచుంది.

మీనాక్షి : బుజ్జి ఇప్పుడేం చేద్దాం, అని పొట్ట మీద చెయ్యి వేసింది

నాన్న తలని నాకు ఆనించు, అదే నీ పొట్ట మీద పెట్టుకొని పడుకోబెట్టుకో అనగానే, మీనాక్షి శివని పక్కకి జరిపి తన పక్కన పడుకుని చుడిధార్ పైకి లేపి శివని ఒళ్ళోకి తీసుకుని శివ తలని తన పొట్ట మీద ఆనించింది.

రెండు నిమిషాలకి మీనాక్షి కడుపు మొత్తం వెచ్చగా అవుతూ, ఏదో చిన్న వెలుతురు ఒకటి పొట్ట చీల్చుకుని వచ్చినట్టు అనిపించి మళ్ళీ మాములుగా అయ్యింది కాని మీనాక్షి పొట్ట ఎవరో కోసినట్టు పెద్ద గాటు ఒకటి ఏర్పడింది. శివ కళ్ళు తెరిచాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
41      

శివ కళ్ళు తెరిచి ఒక్క క్షణం అలోచించి లేచి చూసాడు, మీనాక్షి సంతోషంతో పిచ్చిది అయిపోయి ఆశ్చర్యంగా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ నవ్వేసింది.

మీనాక్షి : శివా అని ప్రేమగా పిలుస్తూ, ఒక వైపు పొట్ట మీద చెయ్యి వేసుకుని కొడుక్కి తన ఆనందం పంచుతూనే ఇంకో పక్క ఆగకుండా శివ మొహం మీద ముద్దులు పెట్టుకుంది.

శివ : మీను.. నీకు

మీనాక్షి : ముందు ఇటు చూడు అని శివ చెయ్యి పట్టుకుని తన కడుపు మీద వేసుకుంది

శివ : అవును కదా మర్చిపోయా, ఇవ్వాళ డేట్ ఎంతా

మీనాక్షి డేట్ చెప్పింది శివ, మీనాక్షి చెంప నిమురుతూ

శివ : అంటే మూడో నెల దాటింది.

మీనాక్షి : హ్మ్మ్ అవును

శివ : అంటే నేను ఇన్ని రోజులు ??

మీనాక్షి : కోమాలోనే ఉన్నావ్

శివకి జరిగింది మొత్తం గుర్తొచ్చింది, వెంటనే తన గాయాలని చూసుకున్నాడు, కాళ్లు చేతులు కదిలించి చూసాడు అంతా బాగుందనిపించింది. బాడీ మీద ఉన్నవన్నీ పీకేసి లేచి నిలుచుని చూసుకున్నాడు.. ఆ వెంటనే మీనాక్షికి ఏమైనా ఆపద తల పెట్టారా అన్న అనుమానం కూడా వచ్చింది.. అదే అడిగాడు. ఎలాగైనా శివ మొత్తం తెలుసుకుంటాడు లేదా ఎవరో ఒకరు చెప్తారని మీనాక్షి ఇప్పటి వరకు జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు చెపుతుంటే కూర్చుని మొత్తం విన్నాడు.

శివ : ఇదంతా నిజమేనా

మీనాక్షి : అవును నా కొడుకు నాతో మాట్లాడుతున్నాడు

శివ : నమ్మబుద్ది కావట్లేదు

మీనాక్షి : కావాలంటే చూడు ఇప్పుడు అక్కడ వెచ్చగా అవుతుంది అని శివ చెయ్యిని తీసుకుని తన పొట్ట మీద వేసుకుని.. బుజ్జి ఒక్కసారి నవ్వరా అనగానే అక్కడ వెచ్చగా అయ్యేసరికి శివ ఆశ్చర్యంగా చూసాడు.. నేను చెప్పానా

మీనాక్షి : నిన్ను కోమాలో నుంచి లేపింది మన బిడ్డే

శివ :  ఆకలిగా ఉంది మీను

మీనాక్షి : అయ్యో శివా.. నేను అస్సలు మర్చిపోయాను ఉండు ముందు డాక్టర్ జి పిలుచుకొస్తాను అని లేచి డాక్టర్ దెగ్గరికి వెళ్ళింది.

డాక్టర్ వచ్చి శివని తన హెల్త్ కండిషన్ని చూసి సంతోష పడి జాగ్రత్తలు చెప్పి కోకోనట్ వాటర్ తాగించమని, సాయంత్రం రెండు ఇడ్లీ మాత్రమే పెట్టమని చెప్పి వెళ్ళింది.

మీనాక్షి డాక్టర్ వెళ్ళొపోగానే అక్కడ వార్డ్ బాయ్ కి చెప్పి తెప్పిస్తుంటే బుజ్జి  మాట్లాడాడు.

అమ్మా నువ్వు తినక కూడా చాలా రోజులయ్యింది.. నాదొక విన్నపం

మీనాక్షి : ఆర్డర్ వెయ్యరా బుజ్జి

లేదు.. నీ కడుపుని నేను శుద్ధి చేసాను ఇక నుంచి నేను పుట్టేవరకు పళ్ళు, రసాలు, కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకోవాలి

మీనాక్షి : అంతే కదా ఓకే.. కాని ఎందుకో తెలుసుకోవచ్చా

నేను మాంసం ముట్టను..

మీనాక్షి : రేయి నువ్వింకా పుట్టనేలేదు అప్పుడే నీ రిక్వెర్మెంట్స్ చెబుతున్నావ్

అమ్మా అదీ...

మీనాక్షి : నీ ఇష్ట ప్రకారమే, మాటిస్తున్నాను సరేనా

అమ్మా ఇంకోటి నువ్వు అన్నం కూడా తినలేవు

మీనాక్షి : తినలేనా ఎందుకు

నేను లోపలికి రానివ్వను.. నీకు వాంతు అవుతుంది..

మీనాక్షి : ఆమ్మో.. అంటే నువ్వు నిర్ణయం తీసేసుకున్నావ్.. నన్ను అడగటం లేదు.. నాకు ఏం చెయ్యాలో చెపుతున్నావ్.. బుజ్జి.. మీనాక్షి పొట్ట బుజ్జి నవ్వుతో వెచ్చబడింది

ఇదంతా చూసిన వార్డ్ బాయ్, మీనాక్షిని పిచ్చి దాన్ని చూసినట్టు చూసాడు. మీనాక్షి తేరుకొని తనకేం కావాలో తెప్పించుకుంది.

అమ్మా మనం జాగ్రత్తగా ఉండాలి.. అందరికి తెలియడానికి లేదు

మీనాక్షి : అవును బుజ్జి.. అని వెళ్లి  శివ పక్కన పడుకుని తల గుండె మీద పెట్టుకుంది, శివ తల నిమురుతూ మాట్లాడుతున్నాడు

శివ : ఇంకా చెప్పు ఏమంటున్నాడు కొడుకు

మీనాక్షి : ఏమో ఇందాకటి నుంచి మౌనంగా నీ మాటలు వింటున్నాడు, ఏరా బుజ్జి.. బుజ్జి..

బుజ్జి : ఒకసారి నాన్న అరచెయ్యి పట్టుకో

మీనాక్షి : అలాగే అని శివ చేతిలో తన చెయ్యి వేసి పట్టుకుంది.

శివ : ఏంటట?

మీనాక్షి : నీ చెయ్యి పట్టుకోమంటున్నాడు

శివ : ఓహ్ అయితే నాకు మంచి కొడుకే పుడుతున్నాడు..
మీనాక్షి..

మీనాక్షి : హా

శివ : నిజంగానే నీకు వాడి మాటలు వినిపిస్తున్నాయా

మీనాక్షి : అవును శివ.. నాకేం పిచ్చి లేదు.. ఐయామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.. నువ్వు ఇంకా జస్ట్ ఆశ్చర్య పోయావు అంతే కాని నేను వాడి మాటలు విని కళ్ళు తిరిగి పడిపోయాను తెలుసా.. అదిగో నవ్వుతున్నాడు వెధవ అని శివ చెయ్యి పట్టుకుని మళ్ళీ తన పొట్ట మీద పెట్టుకుంది. వెచ్చగా తగిలింది.

శివ : భలే ఉందే.. వాడు నవ్వితే వెచ్చగా అవుతుంది ఒకవేళ ఏడిస్తే

మీనాక్షి : బుజ్జి.. బుజ్జి.. ఉమ్ ఉమ్.. ఏం మాట్లాడట్లేదు అని చెయ్యి ఊపింది.

బుజ్జి : నాకు మీ మాటలు వినాలని ఉంది

మీనాక్షి : మనం మాట్లాడుకుంటుంటే వినాలని ఉందట.

ఇద్దరు ఆనందంగా మాట్లాడుకుంటుంటే అప్పుడే మీనాక్షికి కూడా భోజనం తెస్తూ లోపలికి అడుగు పెట్టి మాటలు వినపడేసరికి, కావేరి తల ఎత్తి చూసింది. శివ కావేరిని చూసి లేచి నిలుచున్నాడు.. కావేరి చేతిలో ఉన్న బుట్ట అక్కడే కింద పడిపోయింది.. ఏడుస్తూ అలానే వెళ్లి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసి ముద్దులు పెట్టుకుంది.

శివ : అమ్మా

కావేరి : ఏడుస్తూనే శివని కౌగిలించుకుని కళ్ళు తెరిచింది, ఎదురుగా మీనాక్షి కూడా ఉండేసరికి దెగ్గరికి లాక్కుని ప్రేమగా కలుపుకుంది.

మీనాక్షి : డాక్టర్ వచ్చి చూసాడు.. కొంత సేపటికి రిపోర్ట్స్ వస్తాయట అన్ని ఓకే అయితే రెండు రోజులు అబ్సర్వేషన్ లో పేట్టి పంపించేస్తారట

కావేరి : సంతోషం అని వెంటనే తనకి తెలిసిన అందరికి ఫోన్ చేసి సంతోషంగా శివ లేచిన విషయం చెపుతుంటే, మీనాక్షి శివలు అలా చూస్తూ ఉండిపోయారు.

శివ : అమ్మా నీకొకటి చెప్పాలి.. నీ దెగ్గర ఒక విషయం దాచాను

కావేరి : ఏంటి నాన్నా

మీనాక్షి వెంటనే కావేరి చెయ్యి పట్టుకుని తన పొట్ట మీద వేసుకుని నిమిరింది. కావేరికి ఒక రెండు సెకండ్ల తరువాత కాని అర్ధం కాలేదు ఇద్దరు ఏం చెపుతున్నారో..

కావేరి : శివా..

శివ : అవును.. ఎప్పుడో చెపుదామనుకున్నాను కాని ఈలోగా ఇలా జరిగిపోయింది.

కావేరి : పోరా నువ్వు నాతో మాట్లాడకు.. నేను ఇరవై రోజులనుంచి ఏడుస్తుంటే కనీసం ఉలుకు లేదు పలుకు లేదు.. మీనాక్షి వచ్చి ఇక్కడ గంట కూడా కాలేదు లేచేసావ్.. పో

శివ : అమ్మా.. నిజంగానే నీ దెగ్గర దాచిపెడతానా చెప్పు.. నా తల్లి కదూ అలా అలిగితే ఎలాగా అని ఎత్తుకుని తిప్పాడు

కావేరి : రేయి దించు..

శివ : మేము ఎంత చేసినా, ఎంత దాచినా వాడు పొద్దున్నే లేసేది ఎవరి పక్కలో

కావేరి : నా పక్కలోనే

శివ : వాడికి స్నానం పొసేది ఎవరు

కావేరి : నేనే

శివ : వాడికి అన్నం పెట్టేది.   నిద్ర పుచ్చేది

కావేరి : నేనే

శివ : మరి మా దెగ్గర కంటే నీ దెగ్గరే ఎక్కువ ఉంటాడు, ఇంకా అలక దేనికి

కావేరి : ఇలాంటివి అయితే ఎన్నైనా చెప్తావ్

ఇంతలో మీనాక్షి ఇంటి నుంచి అందరూ వచ్చారు.. అది చూడగానే శివ తన అమ్మని కిందకి దించి వాళ్లందరిని కోపంగా చూసాడు. ముందుగా రాజేశ్వరి లోపలికి వచ్చి శివ ముందు నిలుచుంది.

రాజేశ్వరి : బాబు.. నన్ను క్షమించు.. తప్పు నాది, వాడిని సరిగ్గా పెంచలేకపోయాను.

మీనాక్షి : నాన్నా.. చందు ఎలా ఉన్నాడు

గగన్ : ఇంట్లోనే.. బానే ఉన్నాడు. జీవితాంతం చేతి కర్ర సాయంతోనే నడవాలని డాక్టర్ చెప్పాడు.. అని కళ్ళు తుడుచుకున్నాడు.

మీనాక్షి ఏడ్చుకుంటూ వెళ్లి తన నాన్నని కౌగిలించుకుంది, మీనాక్షి అమ్మ కూడా ఏడుస్తూ మీనాక్షి తల మీద చెయ్యి వేసింది. రాజేశ్వరి మీనాక్షి చెయ్యి పట్టుకునేసరికి చూసింది.

రాజేశ్వరి : వీలైతే క్షమించు.. అని బైటికి వెళ్లిపోతుంటే మీనాక్షి వెళ్లి వెనక నుంచి వాటేసుకుంది.

మీనాక్షి : అమ్మమ్మ.. ఎవరో చేసిన తప్పుకి మీరు క్షమాపణలు చెప్పకండి

రాజేశ్వరి ఇంకేం మాట్లాడలేదు.

మీనాక్షి : నాన్న తమ్ముణ్ణి చూడాలని ఉంది

గగన్ : పద వెళదాం

మీనాక్షి : ఈ రోజుతో మీరు కూడా నన్ను ఒక మాట మీద క్షమించండి.. నా భర్తని గాయ పరిచిన ఆ రాక్షసుడు ఉన్న చోట.. నా తమ్ముడు రక్తం చిమ్మిన ఇంట నేను ఇక నా జీవితంలో అడుగు పెట్టను అనేసరికి మీనాక్షి పొట్ట దెగ్గర వెచ్చగా అయ్యింది.

రజిత : ఏమండి నేను కూడా ఇక ఆ ఇంటికి వెళ్ళబోయేది లేదు, చందుని తీసుకొచ్చేయండి మన సామాను కూడా వేరే ఇంటికి మార్చేయండి.

మీనాక్షి, గగన్ ఇద్దరు కొంత సంతోషించారు కాని రాజేశ్వరి కన్నీటి పర్యంతం అయిపోయింది.

రజిత : అమ్మా క్షమించు.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డ చందు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఇన్నాళ్లు నేను ఎంత తప్పు చేసానో నాకు అర్ధమవుతుంది.. ఇన్ని రోజులు నా బిడ్డలు నా మీద ఎంత ప్రేమ చూపించినా నేను పట్టించుకోలేదు కాని ఇప్పుడు వాడు నాతో మాట్లాడకపోయేసరికి నాకు ఆ కడుపు కోత అర్ధమవుతుంది. వాడిని నా మీనాక్షిని నా భర్తని ఎంత బాధ పెట్టానో నేను తెలుసుకున్నాను.. ఇన్నేళ్లు నీతోనే ఉన్నాను కదా ఇక నుంచి నా కుటుంబంతోనే ఉంటాను.. దీవించు అమ్మా అని కాళ్లు పట్టుకుంది.

రాజేశ్వరి శివ మీనాక్షిలతో పాటు అక్కడున్న అందరినీ మనస్ఫూర్తిగా దీవించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

ఆ తరువాత అందరూ ఒక్కొక్కరిగా శివని పలకరించి వెళ్లారు, భారత్ వాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చి పలకరించి వెళ్లారు. చివరిగా రాత్రికి ఎప్పుడో సందీప్ వచ్చాడు.

శివ : చూడండి హీరో ఎప్పుడు వస్తున్నాడో.. అందరూ అయిపోయాక ఇప్పుడు తీరికగా వస్తున్నాడు.. కనీసం నాలుగు పళ్ళు కూడా పట్టుకురాలేదు.

సందీప్ వెళ్లి శివని కౌగిలించుకుని ఏడ్చేసాడు

శివ : రేయి ఏంట్రా ఇది.. అని నవ్వాడు

సందీప్ : అలవాటు అయిపోయావ్ రా మావ.. నీ మాట వినకుండా నిన్ను అలా చూసి తట్టుకోలేకపోయాను. ఈ ఇరవై రోజులు చాలా అంటే చాలా భారంగా గాడిచాయి.. అమ్మ మొదటి ఫోన్ నాకే చేసింది ఇదిగో నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇంత టైం పట్టింది.

శివ : ఏం తెచ్చావేంటి

సందీప్ : ఇస్తాను ఆగరా ఆత్రం.. మీనాక్షి ఇలా రా అని శివ పక్కన నిల్చోబెట్టి.. వాళ్ళ వెనక కావేరి అమ్మని నిల్చోబెట్టి జేబు లోనుంచి కీస్ తీసి ఇచ్చాడు.

శివ : ఏం కీస్ రా ఇవి

సందీప్ : అమ్మ కోసం నువ్వు కట్టిన ఇల్లు, అన్ని హంగులతో రెడీగా ఉంది

శివ : అబ్బా.. పిండేసావ్ రా.. పదండి వెళదాం

సందీప్ : మరి హాస్పిటల్..

శివ : డబ్బులు కట్టేసి వచ్చేయి.. మీను.. పద జంప్ అయిపోదాం.. ఆ ఇంకోటి.. గగన్ సర్..

గగన్ సర్ కోపంగా చూస్తుండేసరికి.. వెళ్లి ముందు నిలబడ్డాను.

శివ : సర్ సారీ.. అదీ

గగన్ : నీ ప్లేస్ లో నా స్టూడెంట్ శివ కాకుండా ఇంకెవరు ఉన్నా ఈ పాటికి చంపేసేవాడిని తెలుసా

శివ : సారీ

గగన్ శివని పక్కకి తీసుకెళ్లాడు..

గగన్ : ఎందుకురా అంత ఆత్రం.. మీ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను కదా అని చెవి మెలి తిప్పాడు.

శివ : నిజంగా సారీ

రజిత : పర్లేదు బాబు.. చాలా మంచివాడివి అని విన్నాను అదే చాలు

శివ : అంత మంచోన్ని కాదండి, వాడిని వదిలే ప్రసక్తే లేదు అనగానే రజిత మొహం మారిపోయింది.. మీనాక్షి శివ చెయ్యి పట్టుకుంది.. సర్ మీరంతా ఇంటికి వచ్చెయ్యండి అందరం కలిసే ఉందాం

గగన్ : లేదు శివా

శివ : కనీసం చందు ఫుల్ గా రికవర్ అయ్యే దాకా అయినా.. మీనాక్షి..

మీనాక్షి : అమ్మా నాతో ఉండరా.. అంతేలే

రజిత : హహ.. నవ్వుతూ కళ్ళు తుడుచుకుని గగన్ ని చూసింది

గగన్ ఒప్పుకున్నాడు.. శివ వెంటనే మీనాక్షి చెయ్యి పట్టుకున్నాడు బైటికి పరిగెత్తడానికి కాని మీనాక్షి ఆపేసింది.

శివ : ఏంటి?

మీనాక్షి : నాకొక ప్రమాణం చెయ్యి

శివ : చెప్పు

మీనాక్షి : ఆ సుశాంత్ జోలికి వెళ్లనని

శివ : అలాగే అని మీనాక్షి తల మీద ఒట్టు వేసి నవ్వాడు.. కాని ఒక చిన్న చూపు సందీప్ వైపు విసరడం ఎవ్వరు గమనించలేదు. ముందు సంతోష పడినా అడిగిన వెంటనే ఒప్పుకోవడంతో మీనాక్షికి డౌట్ వచ్చి మళ్ళీ ఆగింది.

శివ : మళ్ళీ ఏంటి?

మీనాక్షి : ఒక్క నిమిషం.. సందీప్ ఇలా రా.. నువ్వు కూడా నా మీద మీ ఫ్రెంషిప్ మీద ప్రమాణం చెయ్యి వాడి జోలికి వెళ్లనని

సందీప్ : సారీ మీనాక్షి నేను చెయ్యను

మీనాక్షి : సందీప్..

శివ : వాడిని ఊరికే వదులుతా అనుకుంటున్నావా

మీనాక్షి : నాకు మీరంతా కలిసిమెలిసి ఉండటమే కావాలి, ప్లీజ్ ఏ గొడవలు వద్దు పగలు ప్రతీకారాలతో నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోవడం నాకు ఇష్టం లేదు.. శివా వాడి జోలీ పొనని మన బిడ్డ మీద ఒట్టు వెయ్యి.

శివ : మీనాక్షి.. మీను.. మీను అని కోపంగా అక్కడున్న గోడని గట్టిగా గుద్దాడు దెబ్బకి అందరూ భయపడ్డారు.. సరే నేను కాని సందీప్ కాని నా నుంచి ఇంకెవరు వాడి జోలికి వెళ్లారు కాని.. కాని.. వాడు మళ్ళీ నా దారికి అడ్డొచ్చినా వాడి వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారని తెలిసినా డైరెక్ట్ లేపేస్తాను ఇది మాత్రం మన బిడ్డ మీద ఒట్టు అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన వెనుకే సందీప్ కూడా వెళ్ళిపోయాడు.

శివ కిందకి వెళ్లి చెట్టు కింద నిలుచునని అక్కడ ఉన్న ఒక బోర్డుని కాలితో గట్టిగా తన్నాడు కోపంగా

సందీప్ : నువ్వలా మాట ఇచ్చుండాల్సింది కాదు

శివ : బతకని.. ఆ నా కొడుకుని.. పదా ఇంటికి వెళదాం.. ఇలాంటి టైంలో వాడి గురించి ఎందుకు.. అని బైటికి నడిచాడు.

పైన ఉన్న మీనాక్షి, శివ కోపంగా వెళ్లిపోవడంతో కొంత బాధ పడింది కాని ఇదే మంచిదని సర్ది చెప్పుకుంది.. అందరూ మంచి పని చేసావని మీనాక్షిని మెచ్చుకున్నారు. గగన్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడ్డానికి వెళ్లగా కావేరి, రజిత సామాను సర్దే పనిలో ఉన్నారు.. మీనాక్షి వెళ్లి బెడ్ మీద కూర్చుని పొట్ట మీద చెయ్యి వేసింది.

మీనాక్షి : బుజ్జి..

అమ్మా...

మీనాక్షి : నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి

అలాగే

మీనాక్షి : ఎన్నడూ గొడవలకి పోననీ.. ఎప్పుడు అబద్ధం చెప్పనని.. ఏ తప్పు చెయ్యనని నాకు మాటివ్వు.

ఎప్పుడు గొడవలకి పోను.. ఒక్క అబద్ధం కూడా చెప్పను.. తెలిసినంత వరకు ఏ తప్పు చెయ్యను.. కాని నాన్నలా ఎవరైనా నా ముందుకోచ్చి నువ్వు తప్ప ఎవ్వరు లేరు అని సాయం అడిగితే మాత్రం ఆగలేను అది మంచికైతే అస్సలు ఆగలేను.. నీ మీద ఆన

మీనాక్షి : నువ్వు మీ నాన్న లానే.. ఒప్పుకున్నట్టే ఒప్పుకుని లేనిపోని తిరకాసులు పెడతావు అని నవ్వింది.. మీనాక్షి పొట్ట కూడా వెచ్చబడింది.

అందరూ ఇంటికి వెళ్లారు, శుభ ముహూర్తంలో మీనాక్షి, కొడుకు పెట్టిన ముహుర్తానికి పాలు పొంగించేలా చేసింది.. మీనాక్షి చందుని కలుసుకుంది.. అక్కా తమ్ముళ్లు చాలా ఏడ్చుకున్నారు చాలా మాట్లాడుకున్నారు, మీనాక్షి ప్రెగ్నన్సీ గురించి విని సంతోషించాడు.. బుజ్జికి చందుని నయం చేసే శక్తి ఉన్నా ఎందుకో మౌనంగా ఉన్నాడు. శివ కూడా చందుని పలకరించి, తను చేసిన పనికి మెచ్చుకుని మంచి చెడ్డలు మాట్లాడాడు.

కొత్త ఇల్లు అందులోనూ తన స్నేహితుడు కోమా లోనుంచి లేచిన ఆనందంలో సందీప్ వేసిన లైటింగ్ వల్ల ఇల్లు మొత్తం వెలిగిపోతుంది, అదే రాత్రి అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేస్తే మీనాక్షి మాత్రం నాలుగు అరిటి పండ్లు తిని గ్రేప్ జ్యూస్ తాగింది. కొత్త ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటుంటే మీనాక్షి మరియు శివలు ఇంటి ముందున్న గడ్డి మీద కూర్చున్నారు.

మీనాక్షి : మన బిడ్డకి అన్ని నీ పోలికలే..

శివ : అదేంటీ అలా అన్నావు

మీనాక్షి ప్రమాణం గురించి చెప్పింది

మీనాక్షి : నీలాగే అన్ని తీరకాసులు పెడతాడు.. అప్పటి నుంచి నిజం అయితే మాట్లాడుతున్నాడు.. అబద్ధం చెప్పాల్సి వచ్చిన చోట మౌనంగా ఉంటున్నాడు.. వాడు మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి అంతే అవసరం అయితేనే మాట్లాడతాడు లేదంటే మౌనంగా ఉంటాడు.. హాస్పిటల్లో కూడా అంతే నీ అరచెయ్యి పట్టుకోమన్నాడు ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పలేదు.

శివ : మరి నా కొడుకంటే అలానే ఉంటాడు.. ఏరా కన్నా

మీనాక్షి : నవ్వుతున్నాడు

శివ : పొట్ట వెచ్చగా అయ్యిందా.. అని చీర తప్పించి మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసి.. కన్నా ఇంకొంచెం నవ్వరా

అమ్మా.. నేను బుజ్జినా.. కన్నా.. నా..

మీనాక్షి : వాడు కన్ఫ్యూస్ అవుతున్నాడు, ఏమని పిలుచుకుందాం

శివ : నాకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఒక పేరు పెట్టాలని అనుకున్నాను.. కన్నా చెపుతున్నాను నచ్చితే నవ్వు లేకపోతే మార్చేద్దాం.. అని మీనాక్షి పొట్ట మీద తల పెట్టి అటు బిడ్డకి ఇటు భార్యకి వినిపించేలా అరణ్య అన్నాడు.. వెంటనే పొట్ట ఎన్నడూ లేనంత వెచ్చగా అయ్యింది.. మీనూ.. వీడికి నచ్చిందే

మీనాక్షి : అవును ఎన్నడూ లేనంత వెచ్చగా అయ్యింది.. ఆ పేరు నచ్చిందా బుజ్జి.. సారీ.. అరణ్య..

అరణ్య : చాలా అంటే చాలా

మీనాక్షి పొట్ట నిమురుతూ అరణ్య.. అరణ్య.. అరణ్య.. అని నవ్వుతూ వాడితో ఆడుకుంటుంటే శివ చూస్తూ ఉండిపోయాడు.

మీనాక్షిని ఎవరో పిలిస్తే లేచి లోపలికి వెళ్ళింది కొడుకుని ఆఖరిసారి పేరు పెట్టి పిలుస్తూ.. అరణ్య
Like Reply
#43
42       


కావేరి : శివా ఇప్పటికే లేట్ అయ్యింది పడుకుందురు రండి.

శివకి మీనాక్షికి కొంచెం అదోలా అనిపించి పక్కకి నిలబడ్డారు. అది ముస్కాన్ గమనించి నవ్వుతూ వెళ్లి శివ పక్కన నిల్చుంది.

ముస్కాన్ : భయ్యా

శివ : హా

ముస్కాన్ : ఎందుకు టెన్షన్ పడుతున్నావ్.

శివ : నువ్వింకా పోలేదా

ముస్కాన్ : హహ.. వెళుతున్నా లే.. ఇది చూసి పోదమనే ఆగాను అని నవ్వింది.

శివ : అంటే ఆదుకోవాలని ముందే ప్లాన్ చేసారు.. ముస్కాన్ చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది.

కావేరి : మీనాక్షి వెళ్లి పడుకో లేట్ అయ్యింది.. శివా నువ్వు కూడా అని ఎవ్వరికి కనిపించకుండా నవ్వుకుంది

ఇద్దరు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు, ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లి పడుకోవాలా లేదా కలిసి ఒకే రూంలోకి వెళ్లాలా ఏమి అర్ధం కాక అక్కడే ఆగిపోయారు. అందరికి అక్కడ ఉన్న పరిస్థితి అర్ధమయ్యి చిన్నగా ఇద్దరినీ ఆడుకోవడం మొదలు పెట్టారు.

ముస్కాన్ : ఏంటి వదినా

సందీప్ : మావా ఏమి ఇరుక్కుపోయావురా, నిన్ను చూస్తే జాలిగా ఉంది

గగన్ : గగన్ గట్టిగా నవ్వాడు, మీనాక్షి కాలు కదలక పోవడంతో

రజిత : ఊరుకోండి సిగ్గులేకపోతే సరి.. మీను.. ఆ రూం మీ ఇద్దరికే వెళ్ళండి అని నవ్వేసరికి మీనాక్షి సిగ్గుగా వాళ్ళ అమ్మ ఒడిలో దూరిపోయింది.

కావేరి : చేసినవన్నీ చేసేసి ఇప్పుడు రూంలోకి వెళ్ళమంటే ఆగిపోయాడు చూడు అని శివ పిర్ర మీద కొట్టింది.. శివ నవ్వాడు.

శివ, మీనాక్షిలు ఇద్దరు వాళ్ళ రూంలోకి వెళ్ళగానే అందరూ నవ్వుకుని.. భారత్, ముస్కాన్ కుటుంబాలు ఇంటికి వెళ్ళిపోగా సందీప్ కూడా రూంకి వెళ్ళిపోయాడు.

శివ : మీను.. భలే ఆడుకున్నారు మనతో

మీనాక్షి : హహ.. ఎక్కడ నీకు దూరంగా ఉంచుతారో అని తెగ భయపడ్డాను.

శివ : దేనికి అంత భయం

మీనాక్షి : ఏమో ఇప్పుడు నా లోకం మొత్తం నువ్వు నా బుజ్జిగాడే.. నా జీవితంలోనే ఇప్పుడు నేను ఉన్నంత సంతోషంగా ఎప్పుడు లేను.. లైఫ్ లాంగ్ ఇలానే నీతో ఉండాలని ఉంది ఏం బుజ్జి..?

అరణ్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు

శివ : ఏంటంట?

మీనాక్షి : ఏం మాట్లాడట్లేదు పడుకున్నాడేమో

శివ : ఏంటో ఇది.. నాకేం అర్ధం కావట్లేదు

మీనాక్షి : నను సంతోషంగా ఉన్నాను, మరి నువ్వు

శివ : నేను కూడా.. ఇల్లంతా సందడిగా ఉంది.. ముఖ్యంగా అమ్మ తన మోహంలో ఆ చిరునవ్వు.. మనసంతా ఏదో తృప్తిగా ఉల్లాసంగా ఉన్నట్టుంది. ఇంకో విషయం, నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కోట్లల్లో వాల్యూ చేస్తున్నాయి ఇప్పుడు. సొంత కంపెనీ స్టార్ట్ చెయ్యొచ్చు ఎవ్వరి దెగ్గర చెయ్యి చాచకుండా.. రేపు పొద్దున్నే అమ్మేస్తాను.

మీనాక్షి : నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, నేనిక ఎక్కడికి రాను

శివ : నీ ఇష్టం.. నీ కొడుకుతో మాట్లాడుకుంటావా

మీనాక్షి : అవును

శివ : పడుకో లేట్ అయ్యింది.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకుని దెగ్గరికి తీసుకుంటే హాయిగా నిద్రపోయింది నా మీనాక్షి, కొంతసేపటికి మీనాక్షి నిద్రపోయ్యాక లేచి తన పొట్ట మీద చెయ్యి వేసి వాడిని పిలిచాను.. అరణ్య అని పిలవగానే మీనాక్షి పొట్ట వెచ్చగా అయ్యేసరికి లేచే ఉన్నాడని గ్రహించాను. లేచి ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అన్నాను

అరణ్య : గుడ్ నైట్

శివ : అరణ్య.. నువ్వు ఇప్పుడు..

అరణ్య : నేనే మాట్లాడేది..

శివ : కాని అమ్మ చెప్పింది కదా నువ్వు మాట్లాడేది ఎవ్వరికి వినిపించదని

అరణ్య : అది నిన్నటి వరకు, నా శరీరంలో ప్రతీ కణం ఎదిగే కొద్ది నా శక్తులు నాకు అర్ధం అవుతున్నాయి.

శివ : నిజంగానే నీకు శక్తులు ఉన్నాయా

అరణ్య : ఉన్నాయి, కాని ఒక్క విషయం

శివ : చెప్పు నాన్నా

అరణ్య : నేను నీతో మాట్లాడుతున్నానని అమ్మకి చెప్పొద్దు

శివ : ఎందుకు

అరణ్య : అమ్మకి తెలిసిన మరుక్షణం నీతో మాట్లాడ్డం మానేస్తాను

శివ : ఎందుకు

అరణ్య : ఇది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, ఇంకో విషయం రేపు రోజు లేచే దానికంటే ఒక గంట ముందు లెగువు..

శివ : నేను అడిగిన వాటికి సమాధానం చెప్పవన్నమాట.. ఈ వెసలుబాటు నాకు మాత్రమేనా మీ అమ్మకి కూడా నా

అరణ్య : నీతో ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడతాను

శివ : సరే పొద్దున్నే లేస్తాను.. ఇంకా

అరణ్య : ఈరోజు నుంచి ఎప్పుడు అమ్మ మాట జవదాటొద్దు

శివ : ఓకే

అరణ్య : హాస్పిటల్లో నీ అర చెయ్యి పట్టుకోమన్నాను గుర్తుందా

శివ : అవును

అరణ్య : అమ్మ ఏమి చెప్పినా కాదనకు అది చిన్న పని అయినా సరే

శివ : సరే

అరణ్య : ప్రతీ పౌర్ణమి నాడు నా శక్తులు సన్నగిల్లుతున్నాయి, ఆ రోజు మొత్తం అమ్మా నువ్వు ఇద్దరు ఇంట్లోనే ఉండాలి

శివ : అరణ్య.. నువ్విలా మాట్లాడుతుంటే నాకు

అరణ్య : అడుగడుగునా గండాలే ఉన్నాయి.. నన్ను నమ్ము ఇరవై రోజులుగా కోమాలో ఉన్న నిన్ను చిన్ని స్పర్శ అదీ ముట్టుకోకుండానే లేపాను.. సంకోచించకు

శివ : మాకే ఎందుకిలా

అరణ్య : నా దెగ్గర సమాధానం లేదు, మనం మాట్లాడుకునే ఏ విషయం అమ్మకి తెలియకూడదు.. నేను అమ్మకి అబద్ధం చెప్పానని మాత్రమే మాట ఇచ్చాను. నిజాలు మాత్రం నువ్వు నీలోనే దాచుకో.. ఇంకా నన్ను నమ్మకపోతే ముప్పై రెండు సెకండ్లు లెక్కపెట్టు నానమ్మ ఇప్పుడు లోపలికి వస్తుంది.

శివ : అలా ఏం లేదు

అరణ్య : ఇప్పుడే లెక్కపెట్టు అనగానే శివ లెక్కించడం మొదలు పెట్టాడు, సరిగ్గా ముప్పై.. ముప్పై ఒకటి.. అనగానే కావేరి తలుపులు తీసుకుని లోపలికి వచ్చింది.. శివ వెంటనే కళ్ళు మూసుకున్నాడు.

కావేరి శివ నుదిటిన ముద్దు పెట్టి వెంటనే మీనాక్షి నుదిటిన ముద్దు పెట్టి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి.. మీనాక్షి పొట్టని నిమిరింది..

కావేరి : నిన్ను మర్చిపోయాను రా బుడ్డోడా.. సారీ అని ముద్దు పెట్టుకుని.. నీకోసం ఎదురుగా చూస్తున్నాను బంగారు.. నీతో ఎన్ని ఆటలు ఆడాలో.. నా శివ కొడుకు ఎలా ఉంటాడో.. నాకస్సలు ఆగట్లేదు. గుడ్ నైట్ అని మరొక్కసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది.

అరణ్య : ఇప్పటికైనా నమ్ముతున్నావా

శివ : నమ్ముతున్నాను

అరణ్య : ఇంకొక్క మాట

శివ : ఏంటి ?

అరణ్య : నా మీద ప్రేమ పెంచుకోకు

శివ : అదేంట్రా.. అరణ్య.. అరణ్య..

అరణ్య నుంచి ఎటువంటి సమాధానం లేదు, మీనాక్షి మాత్రం ప్రశాంతంగా నవ్వు మొహంతో పడుకుంది. శివకి నిద్ర పట్టలేదు దీర్ఘంగా ఆలోచిస్తూ అరణ్య మాట్లాడిన ప్రతీ మాటని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఎప్పుడో పడుకున్నాడు.


-----------------------------------------------------


శివ ఇంటి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక అమ్మాయి.. ఏడో నెల కడుపుతో పొట్ట పట్టుకుని రైలు పట్టాల మీద పరిగెడుతుంది, హోరేత్తిన వర్షంలో ఏడుస్తూ పరిగెడుతుంటే తడిచిన చీర తన వేగన్ని ఇంకా తగ్గిస్తుంది. వెనకాలే పది మంది కత్తులతో చంపడానికి వస్తున్నారు. ఎదురుగా నది దాని మీద కట్టిన వంతెన.. వంతెన మీదె పరిగెడుతూ ఎదురుగా ట్రైన్ రాకూడదని ప్రార్ధిస్తూ పరిగెడుతుంది.

ఆ అమ్మాయి గత నాలుగు రోజులుగా తిండి తిప్పలు సరిగ్గా లేకుండా ప్రాణ భయంతో పరిగెడుతూనే ఉంది, ఎవరి నుంచి ఎందుకు తప్పించుకుని తిరుగుతుందో తెలీదు తన శత్రువు ఎవరో కూడా తనకి తెలీదు కాని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు.

తన భర్తని, అమ్మానాన్నలని, ఏమి తెలియని తన అత్తామామని చిన్న పిల్లలని తన కళ్ళ ముందే నిర్ధాక్షిణ్యంగా పీకలు కోసి చంపారు, అస్సలు ఎందుకు బతికుండాలో కూడా అర్ధం కాని అయోమయ జీవితంలో తన కడుపులో ఉన్న చిన్న పిండపు ప్రాణం తన భర్త ప్రేమతో పొందిన ప్రతిరూపాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. ఇంతలో ఎదురుగా ట్రైన్ వచ్చేసరికి భయంతో ఆగిపోయింది.

వెనక పరిగెడుతూ వస్తున్న గుండాలు ఆగిపోయి నవ్వడం మొదలుపెట్టారు. వెనక్కి తిరిగి వాళ్ళని చూసింది, ఆ అమ్మాయే వెనక్కి వస్తుందిలే అని అక్కడే నిలబడ్డారు.

అటు ఇటు చూసి ఏం చెయ్యాలో తెలియక ఒక్క క్షణం ఆగి.. అన్నయ్యా.. భయంగా ఉంది.. ఎక్కడున్నావ్.. అని ఏడుస్తూ ట్రైన్ వచ్చే ముందే నీళ్లలోకి దూకేసింది.
Like Reply
#44
43     


పొద్దున్నే శివ లేచి అరణ్య చెప్పినట్టే వెళ్ళాడు ఎప్పుడు హడావిడిగా ఉండే రోజు ఇవ్వాళ ప్రతీ పని సజావుగా సాగిపోవడం ఆ వెంటనే తన షేర్స్ అమ్ముడు పోవడం అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు రావడంతో అరణ్య చెప్పిన అన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. త్వరలోనే మంచి రోజు చూసి అరణ్య చెప్పిన టైం బట్టి సొంత బిజినెస్ చెయ్యాలనుకున్నాడు.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

ఇంకోవైపు సుశాంత్ ఇంటికొచ్చాడు, లోపలికి అడుగు పెట్టగానే తన తల్లి ఏడుస్తూ వెళ్లి ఇంట్లోకి తీసుకొచ్చింది.

రాజేశ్వరి : ఆగిపో అక్కడే

అత్తయ్యా అది..

రాజేశ్వరి : ముందు వాడిని చేసిన పాపలకి లొంగిపొమ్మను

సుశాంత్ : నా మనిషి ఒకడు లొంగిపోయాడు, నాకు బుద్ధిచ్చింది.. ఇక నుంచి బుద్ధిగా మన బిజినెస్లు చూసుకుంటాను. కావాలంటే మీనాక్షికి క్షమాపణలు చెపుతాను

అత్తయ్యా విన్నారుగా, ఈ ఒక్కసారికి వదిలెయ్యండి

రాజేశ్వరి : నీ వల్ల ఇంకోసారి మీనాక్షి కుటుంబం ఇబ్బంది పడిందని నాకు తెలిస్తే ఊరుకునేది లేదు.. నేనేం చేస్తానో నాకే తెలీదు అని వాడి మొహం చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

సుశాంత్ : అలాగే అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు..

తన అమ్మ ఏమైనా తినమంటే తరవాత తింటానని చెప్పి లోపలికి వచ్చి డోర్ పెట్టేసి మోకాళ్ళ మీద కూర్చుని కోపంగా పక్కనే ఉన్న దిండ్లు అన్ని విసిరికొట్టి, ఫోన్ ఓపెన్ చేసాడు.. వాట్సాప్ లో ఇంకో వీడియో వచ్చింది. శివ ఇంటిని గమనించమని ఒక మనిషిని పెట్టి వచ్చాడు వాడు పంపించిన వీడియోలు చూస్తూ కూర్చున్నాడు.

వీడియోలో మీనాక్షి తన పొట్ట పట్టుకుని మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంటే అక్కసుతో చూడసగాడు.. శివ మీనాక్షి దెగ్గరయినప్పుడల్లా కోపంగా పక్కనే ఉన్న వస్తువులు విసిరికొట్టాడు. వీడియో అంతా చూసి ఫోన్ మంచం మీద విసిరేసి.. లేచాడు

సుశాంత్ : దాన్ని వదలను, వాడిని కూడా.. ముందు నా ఆస్తులు నా చేతికి రావాలి. ఒక మూడు నెలలు నటిస్తే చాలు అంతా నా కంట్రోల్లోకి వస్తుంది.. అప్పుడు.. ఆ తరువాత దాన్ని ఎలా దక్కించుకోవాలో చూస్తాను.. ఆ శివ గాడి అంతు చూస్తాను. అవును ఇలాగే చెయ్యాలి.. అని పిచ్చి పిచ్చిగా వాడిలో వాడే నవ్వుకుంటూ సంతోషంగా కిందకి వెళ్లి అందరితో మంచిగా ఉంటూ నటించడం మొదలు పెట్టాడు.


*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

మీనాక్షి : అరణ్య, చెప్పు ఇవ్వాళ మనం ఏం చేద్దాం

అరణ్య : ఎక్కడికైనా పచ్చటి వాతావరణం, చుట్టూ చెట్లు, చక్కటి గాల, పక్కనే చెరువు లేదా ఏదైనా జలపాతం లాంటిది అలాంటి ఒక చోటుకి వెళదాం అమ్మా

మీనాక్షి : నీకు కూడా మీ నాన్నలానే చెట్ల పిచ్చి ఉన్నట్టుందే

అరణ్య : అవును, నాన్న ఎప్పుడైనా చెట్లు నాటాడా

మీనాక్షి : చూపిస్తా పదా అని ఇంట్లో కావేరికి తన అమ్మ రజితకి చెప్పేసి చెప్తున్నా వినకుండా ఒక్కటే కార్ తీసుకుని ఆశ్రమానికి బైలుదేరింది, మూల మలుపు తీరుతుండగానే అమ్మా బ్రేక్ అని అరిచాడు అరణ్య.. వెంటనే మీనాక్షి బ్రేక్ నొక్కింది.. అప్పుడే రోడ్డు దాటుతున్న లారీ ఒకటి అదుపు తప్పి మీనాక్షి కారు ముందు నుంచి స్పీడ్ గా వెళ్లి అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ ని గుద్దింది.

మీనాక్షి : బుజ్జి.. వి ఆర్ వెరీ లక్కీ.. అని కారు తిప్పి పోనించింది..

అరణ్యతో మాట్లాడుతూ ఆశ్రమానికి అక్కడ శివ పెట్టిన చెట్లు తను పెరిగిన విధానం ఎలా ఆలోచిస్తాడు, కావరీకి శివకి ఉన్న బంధం.. ఎలా తను శివ కలుసుకున్నది.. శివ అస్సలు అమ్మ గురించి చెపుతుంటే అంతా వింటూ ఊ కొడుతున్నాడు అన్ని తెలిసినా.. ఆ తరువాత అక్కడ నుంచి పార్క్ కి వెళ్లి అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లి ఓన్లీ ఫ్రూట్స్ తినేసి జ్యూస్ తాగేసి తిరిగి ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే పిల్లలతో గడిపారు.

శివ : హలో మీనాక్షి, పొద్దుననంగా వెళ్ళావట.. ఎక్కడున్నావ్

మీనాక్షి : ఆశ్రమంలో, అరణ్యకి బాగా నచ్చింది.

శివ : అక్కడే ఉండు వస్తున్నాను, కలిసి వెళదాం.. ఇంట్లో మనకి చిన్న ఎంగేజ్మెంట్ సెటప్ చేసారంట..

మీనాక్షి : అవునా.. హహ.. అలాగే అని ఫోన్ పెట్టేసి అరణ్యా.. నాన్న వస్తున్నారు.. యే..


*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

చీకట్లో నీళ్లలోకి దూకిన ఆ అమ్మాయి ఎక్కువ లోతు లేనందున అరి కాళ్ళకి రాయి తగిలి కొంచెం కొట్టుకుపోయింది, పైనున్న గుండాలు ట్రైన్ వెళ్లిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడే ఎవరో వదిలేసిన చిన్న పడవ బహుశా రోజు బ్రిడ్జికి ఉన్న మెట్లు దిగి ఆ పడవలో వెళ్లి చేపలు పట్టుకుంటారేమో అది ఎక్కి తాడు తీసి తెప్ప సాయంతో అవతలి ఒడ్డుకి పోవడానికి తెప్ప కదిలించింది.

గూండాలు కిందకి దిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సగం దూరం వెళ్ళిపోయింది.

అన్నా ఇప్పుడు ఏం చేద్దాం

ఇంకో పడవ లేదు, మనం తిరిగి అటు వైపుకు వెళ్లేసరికి ఆ అమ్మాయి చేజారిపోతుంది. ఆ అమ్మాయి బతికుందంటే మనం బతికుండం

ఈ సుపారి అనవసరంగా ఒప్పుకున్నాము అన్నా

ఒప్పుకోకపోయినా మనల్ని చంపేసేవాళ్ళు.. వాడు చెప్పింది చెయ్యడం తప్ప మనకి ఇంకో దారి లేదు.. అటు వైపున మన వాళ్ళు ఉంటే ఫోటో పంపించి రెడీగా ఉండమనండి అని వెనక్కి మళ్ళాడు.

ఆ అమ్మాయి శక్తి లేకపోవడం వల్ల అటు వైపుకు వెళ్ళేవారికి తెల్లారింది, అక్కడ ఆల్రెడీ తనకోసం వెతుకుతున్నారని తెలిసి మధ్యలోనే ఆపేసి చిన్నగా వెళ్లి పిచ్చి చెట్లలో నుంచి బైటికి వచ్చి మట్టి రోడ్డు గుండా సిటీలోకి వెళ్ళింది.. మధ్యలో ముళ్ల చెట్లు ఉన్నాయేమో జాకెట్ దెగ్గర కొంచెం చినిగింది.

ఎవ్వరికంటా పడకుండా వెళ్లి బస్సు ఎక్కి కూర్చుంది, కండక్టర్ వచ్చి టికెట్ అడిగి ఆ అమ్మాయిని చూసి అనుమానంగా తన ఫోన్ కి వచ్చిన ఫోటో చూసుకున్నాడు.. ఆ అమ్మాయి వెంటనే ఏడుస్తూ కండక్టర్ కాళ్ళ మీద పడిపోయి తన మెడలో ఉన్న తాళి తీసి వాడి చేతిలో పెట్టి.. అన్నా కడుపుతో ఉన్నానన్నా దయ చూపించన్నా కావాలంటే ఈ కమ్మలు కూడా తీసుకో అని చెవులకి ఉన్న కమ్మలు కూడా తీసి వాడి చేతిలో పెట్టింది. వాడు ఇంకేం మాట్లాడకుండా చివరి సీట్లో కూర్చోమని చెప్పి టికెట్ కొట్టి తన చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు.

బస్సు బైలుదేరింది.. చిరిగిన జాకెట్ చూసుకుని చీర కొంగుని చుట్టూ కప్పుకుంది, జాకెట్ లో చెయ్యి పెట్టి తన అమ్మ ఇచ్చిన ఒక ఉత్తరం దానితో పాటు ఒక ఫోటో రెండు చేతిలో పట్టుకుని మరొక్కసారి చదివి.. ఏడుస్తూ చనిపోయిన అందరినీ తన అమ్మని తన భర్తని తలుచుకుని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

బస్సు హైవే మీదకి ఎక్కగానే కడుపులో తిండి లేక పరిగెత్తి పరిగెత్తి అరికాళ్ళ మంటలకి త్వరగానే అలిసిపోయి నిద్రపోయింది.. మళ్ళీ కండక్టర్ వచ్చి లేపాకే.. బస్సు దిగి బస్టాండ్ నుంచి బైటికి వచ్చి అందరినీ కావేరి ఆశ్రమం దెగ్గరికి దారి అడుగుతుంటే ఎవ్వరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు

పొద్దున్ననుంచి బేరం తగలక విసుగ్గా కూర్చున్న ఒక పిల్లోడు ఆటోలో కూర్చుని ఉన్నాడు, అస్సలు వాడికి ఆటో నడపడం అంటే ఇష్టంలేదు.. కాని ఇంటర్ ఫెయిల్ అయ్యేసరికి వాడి నాన్న ఆటో కొనిచ్చి తోలుకొమని ఇంటి నుంచి గెంటేసరికి తప్పక వేరే దారిలేక ఆటో నడుపుతున్నాడు.

ఆ అమ్మాయి నేరుగా వాడి దెగ్గరికే వెళ్ళింది. తమ్ముడు కావేరి ఆశ్రమం దెగ్గరికి తీసుకెళ్ళవా.

నూట యాభై అవుతుంది అన్నాడు చిరాగ్గా తన మొహం, రేగిపోయిన జుట్టు, వాళ్లంతా చమట చినిగిన జాకెట్ చూసి..

అక్కడికి వెళ్ళాక ఇస్తాను తమ్ముడు కొంచెం త్వరగా తీసుకెళ్ళవా అని ఎక్కి కూర్చుంది.

ఏయి ముందు ఆటో దిగు.. నీ వాలకం చూస్తుంటే నాకు డబ్బులు ఇచ్చేదానిలా ఉన్నావా.. దిగు.. అని కసిరాడు.. భయంగా ఆటో దిగింది.

ఇంతలో రెండు సుమోలు వచ్చి ఆగి అందులో నుంచి నాలుగు రోజలుగా అమ్మాయిని వెంటాడుతున్న ఆ పది మంది దిగి బస్టాండ్ లోపలికి పరిగెత్తారు.

తమ్ముడు నీకు దణ్ణం పెడతాను తమ్ముడు, చూస్తే చంపేస్తారు తమ్ముడు.. అని ఇష్టం లేకపోయినా తన కడుపు చూపించి.. ఒక్క దాని వల్ల కావట్లేదు తమ్ముడు.. కావాలంటే ఇది తీసుకొ అని చివరిగా తన ఒంటి మీద ఉన్న ముక్కు పుడక తీసి వాడికి ఇచ్చింది.. వాడి నాన్న అన్నాడు నువ్వు ఎందుకు పనికిరావని.. వాడి చెల్లి మాత్రమే చెప్పింది.. నిన్ను నువ్వు ఎప్పటికి వదులుకోవద్దని.. నీ స్వభావాన్ని మార్చకోవద్దని..

ముందుకు చాచిన చెయ్యిని అలానే పట్టుకుని గుప్పిట బిగించాడు వద్దని.. నా దెగ్గర చదువు లేనంత మాత్రాన మనసు లేదనుకోకు అక్కా.. పదా నేను దించుతాను అనగానే థాంక్స్ తమ్ముడు అని కళ్ళు తుడుచుకుని ఆటో ఎక్కుతుంటే అక్కడే ఉన్న సుమో డ్రైవర్ అది చూసాడు.

ఆటో నేరుగా ఎక్కడా ఆపకుండా వయసుకు మించిన దూకుడుతో కట్లు కొడుతూ ఆటోని కావేరి ఆశ్రమానికి చేర్చి గేట్ లోనుంచి లోపలికి పోనించి అక్కడ ఉన్న కారు ముందు ఆపాడు.

సాయంత్రాన చీకటి పడుతుండేసరికి శివ మీనాక్షిలు ఇద్దరు మాట్లాడుకుని ఇంటికి వెళదాం అని కారు ఎక్కుతుంటే అదే సమయానికి ఒక ఆటో వచ్చి అందులో నుంచి ఆ అమ్మాయి దిగి వేగంగా శివ వైపు నడిచింది.

ఆటో వాడు వెనకాల ఫాలో అవుతూ వచ్చిన సుమోలని చూసి బెదిరిపోయి ఆటో వేగంగా వెనక్కి తిప్పి పారిపోయాడు.

ఆ అమ్మాయి ముందుకు వస్తూనే శివా.. అంది

శివ : నేనే అన్నాడు ఆశ్చర్యంగా

పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేసింది అన్నయ్యా.. అంటూ

శివ అయోమయంగా ఆ అమ్మాయి వైపు, వెనకున్న గూండాల వైపు మీనాక్షి వైపు చూసాడు.

అరణ్య : అమ్మా.. ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యని కాపాడమని చెప్పు

మీనాక్షి : శివా..

శివ : వినపడింది.. మీనాక్షి అమ్మాయిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టు. అని పక్కనే శివ పోయిన నెల నాటిన కొబ్బరి చెట్టు మొక్కని పీకి వాళ్లకి అడ్డంగా నిలబడ్డాడు.
Like Reply
#45
44      


హలో అన్నా

సుశాంత్ : చెప్పరా

ఎవరో ఇక్కడ ఆశ్రమం దెగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, తన వెనక పడుతూ ఒక పది మంది కత్తులతో వచ్చారు. అందరూ శివ మీదకి వెళుతున్నారు.. ఏం చెయ్యమంటావ్

సుశాంత్ : నీకు వెళ్లి వాడిని కాపాడేంత సీన్ ఉందా

ఆమ్మో లేదన్నా

సుశాంత్ : మూసుకుని చెప్పింది మాత్రమే చెయ్యి.. వాడిని వేసేస్తే హ్యాపీ.. మన చెయ్యి పడకుండానే పోతాడు.. నాకు ఆ రౌడీల ఫోటోలు పంపించు మనకేమైనా ఫ్యూచర్లో ఉపయోగ పడతారేమో

అలాగే అన్నా అని ఫోన్ పెట్టేసాడు.

సుశాంత్ : శివని కత్తులతో వెంటపడి చంపేంత పగ పెట్టుకున్నది ఎవరు.. ఒకవేళ వాళ్ళతో కలిసి ప్లాన్ చేస్తే.. క్రైమ్ వాళ్ళ మీదకి వెళుతుంది, నా పగా తీరుతుంది.. ఎస్.. ఇదే కరెక్ట్.. ముందు వాళ్లెవరో.. ఎందుకు వీడి వెనక పడుతున్నారో తెలుసుకోవాలి.

ఇక్కడ శివ కొబ్బరి మట్టతో ఒకడు ముందుకు రాగానే వాడి తల మీద గట్టిగా కొట్టాడు.. మళ్ళీ ముగ్గురు ముందుకు రాబోతే దాన్ని తిప్పి కొబ్బరి ఆకులతో వాళ్ళ మొహం మీద కొట్టాడు.. అవి కోసుకుని మంట పుట్టి ఆగిపోయారు, ఇంతలో ఆ గుంపు వెనకాల ఉన్నవాడి తల పగిలి అరిచాడు గట్టిగా.. అందరూ అటు వైపు చూసారు.

శివ : రేయి ఎప్పుడు ఫోన్ చేసాను.. ఎప్పుడు వస్తున్నావ్

సందీప్ : నువ్వు మూడు రింగులకి కట్ చెయ్యగానే అమర్ జాన్సీ అని అర్ధమయ్యింది.. ఇదిగో ఈ రాడ్లు తెచ్చే వరకు లేట్ అయ్యింది అని ఒక రాడ్ శివ వైపు విసరగానే శివ అందుకుని ఎదురుగా ఉన్న వాడి మెడ మీద ఎగిరి కొట్టాడు.

శివ : అది అమర్.. జాన్సీ.. కాదురా... ఎమర్జెన్సీ..

సందీప్ : తెలుసు లేరా బాబు.. ఏదో జోక్ వేసాను.. నీకు కొంచెం హ్యూమర్ సెన్స్ ఉన్నా ఈ పాటికి నవ్వేవాడివి అంటూనే ఒకడి గుండె మీద తన్ని రాడ్ తో ఇంకొకడి తల పగలగొట్టాడు.

శివ : ఏంట్రా మావా.. తెగ ఇరగ్గొడుతున్నావ్ ఫైట్ సీన్..

సందీప్ : నీ మీద ఎటాక్ జరిగాక చాలా జాగ్రత్తలు తీసుకున్నానులే.. చాలా నేర్చుకున్నాను..

శివ : నేనంటే ఎంత ప్రేమరా నీకు.. లవ్ యు

సందీప్ : అంత లేదు నాన్నా.. నీ మీద ఎటాక్ జరిగితే అందరికంటే ముందు పారిపోడానికి.. అని కొడుతూనే మాట్లాడుతున్నాడు

శివ : ఒకడి చెయ్యి విరిచి ఇంకొకడిని తన్ని.. మిత్ర ద్రోహి

సందీప్ : సర్లేరా బాబు.. నిన్ను కాపాడుకోడానికే.. ఇలా కండలు పెంచాను సరేనా.. హ్యాపీయే గా

శివ : హహ.. అని చివరిగా ఉన్న వాడిని ఇద్దరం కలిసి వాడి గుండె మీద తన్నాము.. వెంటనే వాడి కాలర్ పట్టుకున్నాను.. ఎవడు పంపించాడు..

తెలీదు.. సుపారీ ఫోన్ లో వచ్చింది అని మాట్లాడుతుండగానే సందీప్ రాడ్ తో వాడి సెంటర్లో ఒకటి పీకాడు

శివ : ఎందుకురా

సందీప్ : వాడికేం తెలీదు వదిలేయి.. ఆమ్మో మర్చిపోయా.. మామా.. ఒక హెల్ప్

శివ : మామా అని ఇంత సాగిందంటే.. లవ్వే.. ఎవరు ?

సందీప్ : శ్రావణి

శివ : భరత్ చెల్లెలా.. ఎప్పుడు.. ఎలా రా

సందీప్ : నువ్వు కోమాలోకి పొయ్యి ఎవడికైనా మంచి జరిగిందంటే అది నా ఒక్కడికే.. నీ వెనక తిరిగి తిరిగి ఒక్కసారి నువ్వు లేకపోయేసరికి కొంత ఆడ గాలి సోకింది.. (నవ్వుతూ) హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతుంటే.. పిల్ల కొంచెం చనువు ఇచ్చింది.. అల్లుకుపోయా.. అని నవ్వుతుంటే

శివ : ఓయబ్బో.. ఇదంతా సిగ్గే..

మీనాక్షి : శివా.. ఈ అమ్మాయి స్పృహ కోల్పోయింది..

వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేసాము, గంట తరవాత డాక్టర్ బైటికి వచ్చింది.

డాక్టర్ : ఏడు నెలలు దాటిపొయ్యాయి.. ఇలాంటి టైంలో ఇంత వీక్ గా ఉంటే ఎలా.. తను సరిగ్గా తినక నాలుగు రోజులు అయినట్టుంది.. సెలైన్ ఎక్కించాము.. స్పృహ రావచ్చు.. జాగ్రత్తగా చూసుకోండి.. మీనాక్షి నువ్వు కూడా ఇంత వరకు చెకప్ కి రాలేదు.. వేరే డాక్టర్ చూస్తున్నారా

మీనాక్షి : ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు.. అయినా ప్రాబ్లెమ్ వస్తే మీ దెగ్గరికే కదా మేడం పరిగెత్తేది..

డాక్టర్ : (నవ్వుతూ) వెళ్లి చూడండి.. అని లేచింది..

బైటికి వచ్చాము.. సందీప్ బైట ఉంటే నేను మీనాక్షి ఆ అమ్మాయిని చూడడానికి లోపలికి వెళ్ళాము

మీనాక్షి : శివా.. తన చేతిలో ఈ చిట్టీ ఉంది అని పేపర్ అందించింది.

తీసుకుని తెరిచాను.. ఒక ఫోటో ఎవరో ఒక ఆవిడ చిన్న పిల్లాడిని ఎత్తుకుని దిగిన ఫోటో.. చాలా పరిశీలించి చూస్తే అప్పుడు అర్ధమయ్యింది అది నేనే అని.. స్పృహలో లేని ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూనే వెంటనే అమ్మకి ఫోన్ చేసాను హాస్పిటల్ కి రమ్మని. ఆ చీటీ తెరిచి చూసాను..

శివా.. నీకు నా మీద ఏ మూలనో చాలా కోపంగా ఉంటుందని నాకు తెలుసు, సారీ నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా.. నా పేరు అవంతి.. అవంతి IPS.. నిను కన్న అమ్మని.

నీ పూర్తి పేరు శివ కేశవ్, అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నా దెగ్గర ఉండటం కంటే బతికుంటే చాలని అనుకున్నాను అందుకే నిన్ను ఆ మహాతల్లి కావేరి గారి దెగ్గర విడిచిపెట్టాను. ఆవిడ నిన్ను ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేనేమో అనిపించింది.. ఏమి తెలియక పోయినా నీ పేరు నీకే పెట్టింది..

నా సమస్యలు తీరాక నిన్ను నాతో తీసుకెళదామని మళ్ళీ నీకోసం వచ్చాను కాని నిన్ను కావేరి గారిని చూసాక మిమ్మల్ని విడతీయడానికి నా మనసు ఒప్పుకోలేదు.. చాలా ఏడ్చాను కాని ఇన్నేళ్ల నా కడుపు కోతని మళ్ళీ తనకి ఆ బాధ మిగల్చకూడదని అనుకున్నాను అందుకే నిన్ను తన దెగ్గరే ఉండనిచ్చాను.

నీకు గుర్తుందా ఒకసారి నువ్వు కావేరి గారు గుడి మెట్ల మీద అడుక్కునే వాళ్ళకి బట్టలు పంచారు, అందులో నేను కూడా కూర్చున్నాను నీ చేతుల మీద తీసుకున్న చీర ఇప్పటికి నా దెగ్గర పదిలంగా ఉంది. నువ్వంటే నాకు అంత ప్రేమ కాని అప్పుడున్న పరిస్థితుల వల్ల మళ్ళీ నీ దెగ్గరికి రాలేకపోయాను.

ఇప్పుడు నీ దెగ్గరికి పంపించానే అది నీ చెల్లి.. పేరు కస్తూరి.. నిన్ను నేను కావేరి గారి చేతుల్లో పెట్టినప్పుడు అది నా కడుపులోనే ఉంది.. అది నీ రక్తం పంచుకుపుట్టిన నీ చెల్లి..

మీ నాన్న జయ కేశవ్.. ఒక పెద్ద బిజినెస్ కంపెనీలో పార్టనర్ గా ఉండేవాళ్ళు. దానికి సంబంధించిన చిన్న తప్పు ఒకటి మీ నాన్నకి దొరికింది దాన్ని నేను బైటికి లాగాను.. దాని వల్ల వాళ్ళ అస్సలు బాగోతం బైట పడింది.. ఇండియా లోనే బిగ్గెస్ట్ స్కాం బైటికి ఎక్సపోజ్ అయ్యింది.. వాడు తప్పించుకోలేక జైల్లోనే గుండె ఆగి చచ్చాడు దానితో వాడి కొడుకులు మా మీద పగ పెంచుకుని నాన్నని చంపేసి నన్ను ట్రాప్ చేసి శత్రుశేషం లేకుండా చెయ్యాలని నిన్ను నన్ను చంపాలని ప్లాన్ చేసారు.. అప్పుడే తప్పక నిన్ను కావేరి గారి చేతుల్లో పెట్టి వెళ్లిపోయాను.

అక్కడ నుంచి తప్పించుకుని కేరళ చేరాను, నా ఒంటి మీద గాయాలు కస్తూరి పుట్టిన సంవత్సరానికి గాను నయం అవ్వలేదు.. నిన్ను చూడాలని ఎంత తపించానో నాకే తెలుసు.. నీకోసం ఏడవని రోజంటూ లేదు.. కాని ఈలోపే నీ చెల్లెలు కస్తూరి పుట్టింది.. ఆ తరువాత గవర్నమెంట్ కి ఎక్సపోజ్ కాకుండా దాన్ని పెంచాల్సి వచ్చి చిన్న కాలేజ్లో టీచర్ గా జాయిన్ అయ్యాను.. నువ్వు నా పక్కన ఉండుంటే నా జీవితం ఇంకోలా ఉండేదేమో కాని లేవు కదా చాలా సంవత్సరాలికి చుట్టు ఉన్న అందరూ బలవంతంతో కస్తూరికి నాన్న అవసరం మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నాను.

ఇన్ని రోజులు బాగానే సాగాయి.. చెల్లికి నీ గురించి నేను ఏమి చెప్పలేదు తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను, నీ గురించి తెలిస్తే నిన్ను వెతుక్కుంటూ నీ జీవితంలోకి వచ్చి నన్ను కూడా నీ జీవితంలోకి లాగి నిన్ను డిస్టర్బ్ చేస్తుందని భయపడ్డాను.. అందుకే చెప్పలేదు వేరే ఉద్దేశం లేదు.. తన పెళ్లి నా ఫ్రెండ్ కొడుకుతో చేసాను..కాని పెళ్ళై తను వెళ్ళిపోయాక ఒక రోజు నీ ఫోటో చూస్తూ నాలో నేనే మాట్లాడుకుంటుంటే ఎప్పుడు వచ్చిందో చూసి నన్ను నిలదీసేసరికి చెప్పాల్సి వచ్చింది.. మొట్ట మొదట ప్రశ్న ఏమని అడిగిందో తెలుసా నా అన్నయ్య ఎక్కడా అని.. చెపుదామనుకున్నాను కాని ఎప్పుడు ఆ రాక్షసుల కంట బడ్డామొ తెలీదు చూడగానే వాడికి నా మీద పగే గుర్తు కొచ్చినట్టుంది మళ్ళీ మా పరుగులు మొదలయ్యాయి.

కడుపుతో ఉన్న నీ చెల్లిని నేను కాపాడగలనన్న నమ్మకం నాకు లేదు, అందుకే నీ దెగ్గరికి పంపిస్తున్నాను. నా శివ నేను అనుకున్నట్టే ఉంటాడని నమ్మి నీ దెగ్గరికి పంపిస్తున్నాను.. మీ నాన్నలోని మంచితనం నాలోని దూకుడుతనం రెండు నీలో ఉన్నాయని అనుకుంటున్నాను అందులోనూ నువ్వు పెరిగింది చాలా మంచి మనిషి చేతుల్లో పెద్దగా సందేహం పెట్టుకోలేదు.

ఒకవేళ నేను అనుకున్న నా శివ కేశవుడు అలానే ఉంటే నీ చెల్లిని కాపాడుకో.. ఒకవేళ అలా లేకపోతే తనని దాయి.. ఆ ధైర్యం కూడా లేకపోతే ఎక్కడికైనా దూరంగా పంపించేయి తన బతుకు తను బతుకుతుంది.. ఇక ఈ ఉత్తరం, నీ చెల్లెలు నీ దెగ్గరికి చేరేటప్పటికి నేను ఉంటానో లేదో నాకు తెలీదు ఎక్కడ దాక్కున్నా కనిపెట్టేస్తున్నారు. చివరి వరకు నా మొహం నీకు చూపించనేలేదు అందుకు నన్ను క్షమించు.

నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా, నా దురుదృష్టవశాత్తు నువ్వు నన్ను అసహ్యించుకున్నా నాకు బాధ లేదు.. నా పరిస్థితులు అలాంటివి మిమ్మల్ని బతికించుకోవాలన్న ఒకే ఒక్క ధ్యాసలో ఏదీ తోస్తే అది చేసుకుంటూ పోయాను.. కాని ఒక్కటి నువ్వు ఒక నిజాయితీ మరియు మంచితనం కలిగిన ఒక గొప్ప కుటుంబంలో పుట్టావని చాలా గర్వంగా చెప్పగలను.. వీలైతే నన్ను క్షమించు.. ఇంకో జన్మ ఎత్తితే ఒక తల్లిగా నీకు చెయ్యని సేవలు చేసుకోవాలని ఆశగా ఉంది. చెల్లెలి సంగతి.. మర్చిపోకు.. జాగ్రత్త..

కావేరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయ్యి...

లెటర్ మూసి జేబులో పెట్టుకున్నాను.. వెళ్లి కస్తూరి పక్కన కూర్చున్నాను..

అరణ్య : అమ్మా తన దెగ్గరికి వెళ్ళు

శివ : నాకు అరణ్య మాటలు వినిపిస్తున్నాయి కాని మీనాక్షికి తెలియకూడదని నటిస్తూనే లేచి నిలబడ్డాను.

మీనాక్షి కస్తూరి దెగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంది.

అరణ్య : తన పొట్ట మీద చెయ్యి పెట్టు

మీనాక్షి కస్తూరి హాస్పిటల్ డ్రెస్ పైకి అని తన పొట్ట మీద చెయ్యి వేసింది.

అరణ్య :

ఆడపిల్ల
అందమైన ఆడపిల్ల
కృష్ణ భగవానుడి భక్తురాలు
సంగీతం అంటే చాలా మక్కువ
ఏమి చదవనవసరం లేదు, చదువుల తల్లి.. అన్ని నేర్చుకునే అడుగు పెడుతుంది
అన్ని ఉన్నా ఏమి ఉండవు
మంచి చతురత కలది
గుణవంతురాలు
అరచేతిలో దిక్సూచితో పుడుతుంది


లేపుతున్నాను.. అని కస్తూరిని లేపాడు అరణ్య

శివ వెళ్లి తన చెల్లి పక్కన కూర్చుని చూసాడు.

కస్తూరి : అన్నయ్యా.. అని ఏడ్చేసింది..

శివ : కస్తూరి..  అమ్మ...?

కస్తూరి : ఎవ్వరు లేరు.. అందరినీ చంపేశారు.. అని వాటేసుకుని ఏడ్చేసింది.

శివ కళ్ళు మూసుకున్నాడు, కన్నీళ్లు జలజలా రాలాయి..

శివ : వాళ్ళ కార్యక్రమాలు ?

కస్తూరి : లేదు.. ఇంకా అక్కడే ఉన్నారు..

శివ : నువ్వు ఓకే నా.. ముందు ఏమైనా తిను

కస్తూరి : లేదు అన్నయ్యా.. నాకిప్పుడు బానే ఉంది.. ఇంతక ముందు కంటే ఇప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉన్నానని అనిపిస్తుంది.

శివ : నాకు తెలుసు, అని లేచి మీనాక్షి ముందు మోకాళ్ళ మీద కూర్చుని అరణ్యకి ముద్దు పెట్టి లేచి కస్తూరి వైపు తిరిగి.. వదిన అన్నాడు..

కస్తూరి చెయ్యి చాపగా మీనాక్షి ఆ చెయ్యి అందుకుని నిలబడింది.. ఇంతలో సందీప్ లోపలికి వచ్చాడు.

సందీప్ : శివా.. అమ్మ వచ్చింది.

శివ తన చేతిలో ఉన్న లెటర్ ఫోటో తీసుకుని బైటికి వెళ్లి కావేరికి చూపించాడు.

కావేరి : శివుడు.. అమ్మరా.. తనేరా నీ అమ్మ.. ఈ ఫోటో ఎక్కడిది..

శివ తన చేతిలో ఉన్న లెటర్ కావేరికి ఇచ్చాడు.. అంతా చదివి శివ వైపు చూసింది బాధగా..

కావేరి : ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావ్

శివ : ముందు కేరళ వెళతాను

కావేరి శివ చెయ్యి పట్టుకుంది గట్టిగా

కావేరి : ప్రమాదం అని తెలిసి..

శివ : ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అనగానే కావేరి పట్టుకున్న చెయ్యి వదిలేసింది.. నా చెల్లెలు లోపల ఉంది అనగానే కావేరికి అర్ధమయ్యింది శివ ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాడని.. కస్తూరిని చూడటానికి లోపలికి వెళ్ళింది.

డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంకెప్పుడు ఆహారం విషయంలో నెగ్లెక్ట్ చెయ్యొద్దని హెచ్చరించి డిశ్చార్జ్ చేసింది. అందరూ వెళ్లిపోతుంటే సందీప్ అయోమయంగా శివ వంక చూసేసరికి.. శివ మొత్తం వివరించాడు.

శివ : బైటికి నడుస్తూనే కళ్ళు తుడుచుకుంటూ నన్ను కన్న అమ్మలా ధైర్యంగా ఉండాలని నవ్వుతూ ఆలోచించాను.  సందీప్.. సంపాదించింది చాలు.. వాటికవే పెరుగుతాయిలే.. కేరళ వెళ్ళాలి ఏర్పాట్లు చెయ్యి

సందీప్ : ఓకే

శివ : విత్ గన్స్

సందీప్ : డబల్ ఓకే

ఇంతలో కస్తూరి బైటికి వచ్చి శివ చెయ్యి పట్టుకుంది.

శివ తన వంక చూసాడు..

కస్తూరి : అన్నయ్యా.. నేను నీకు బరువవుతున్నానా.. వాళ్ళు చాలా గోరంగా..

శివ : ష్.. నన్ను నమ్ముతున్నావా

కస్తూరి : నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు అన్నయ్యా

శివ : ఇప్పటి వరకు అమ్మతో ఎలా ఉన్నావో అంతే చనువుగా నాతోనూ ఉండు.. నిన్ను అమ్మలా చూసుకుంటాను..

కస్తూరి : నాకు తెలుసు

శివ : ఏం తెలుసు

కస్తూరి : అమ్మ చెప్పింది.. నువ్వు ఎలాంటి వాడివో ఎలా ఉంటావో

శివ : అంటే..

కస్తూరి : మాకు ఎవ్వరికి చెప్పకుండా దొంగతనంగా వచ్చి నిన్ను చూసుకుని వెళ్ళేదట.. అప్పుడే అమ్మని వాళ్ళ మనుషులు ఎవరో చూసి ఉంటారని అనుమాన పడింది కాని ఇప్పుడు అమ్మే లేదు

శివ : నువ్విలా బాధ పడితే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు.. మన చేతుల మీదగా వాళ్ళకి కర్మకాండలు జరిపిద్దాం. అని నా చెల్లెలి భుజం మీద చెయ్యి వేసి ముందుకు నడిపించాను.. వెనకాలే కావేరి చేతిలో ఉన్న ఉత్తరం చదువుతూ కన్నీళ్లతో కావేరి చెయ్యి పట్టుకుని ముందు వెళుతున్న అన్నా చెల్లెళ్ళని చూస్తూ ఉంది మీనాక్షి.

ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అందరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. కస్తూరి నాకు ఒక పక్కన, మీనాక్షి ఇంకో పక్కన కూర్చున్నారు.

శివ : అమ్మ గురించి చెప్పు.. తను నాకోసం వచ్చేదా

కస్తూరి : అవును.. అప్పుడప్పుడు నిన్ను దూరం నుంచి చూసుకునేదట

శివ : నన్ను ఒక్కసారి కలిసి ఉండొచ్చు కదా

కస్తూరి : అమ్మకి ఎప్పుడు ఒక అనుమానం ఉండేది, వాళ్ళు అమ్మ కోసం వెతుకుతూనే ఉంటారని.. ఎందుకంటే అమ్మ వల్ల వాళ్ల ఆస్తిని పేరుని వాళ్ల నాన్నని కోల్పోయారట.. మళ్ళీ నిన్ను కలిస్తే నీకు ప్రమాదమని నీకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంది..

శివ : కాని చివరికి నిన్ను నానా దెగ్గరికే చేర్చింది కదా.. అదేదో మనం ముందే కలిసుంటే.. అని కళ్ళు తుడుచుకున్నాను.

కస్తూరి : నాకొక సారి చెప్పింది.. నీకు తన గురించి తెలిస్తే వదలవని ఎంత దూరం అయినా వచ్చేస్తావని చాలా మొండివాడివని చెప్పింది.

మీనాక్షి : అవును మీ అన్నయ్య చాలా మొండోడు

కస్తూరి : భయంగా ఉంది అన్నయ్యా

శివ : నిన్ను సురక్షితంగా ఉంచే బాధ్యత నాది

కస్తూరి : అది కాదు అన్నయ్య.. నేను నీ దెగ్గరికి వచ్చింది వాళ్ళకి భయపడొ లేక ఇంకేదో అవుతుందనొ కాదు.. ఈ బిడ్డని బతికించుకోవాలనుకున్నాను..  అంతకంటే ఎక్కువగా నిన్ను చూడాలని చాలా గట్టిగా అనుకున్నాను.. కాని ఇప్పుడు నీకేమైనా జరిగితే..

మీనాక్షి : ఏమి జరుగుతుందో చూద్దాం.. నీకు తోడుగా మీ అన్న మాత్రమే కాదు.. నేను నా తో పాటు నా కొడుకు ఉన్నాడు అంతలోనే కవర్ చెయ్యడానికి ఉంటాడు అని ఆపేసింది.. మళ్ళీ ఏమి తెలియనట్టే ఏరా బుజ్జి అంది

అరణ్య ఏమి మాట్లాడలేదు..

వీడొకడు అప్పుడప్పుడు మాట్లాడతాడు అప్పుడప్పుడు అస్సలు లెక్కే చెయ్యడు.. అని మనుసులో అనుకుంటూనే బైటికి నవ్వుతుంటే అరణ్య కూడా నవ్వాడు.. మీనాక్షి కడుపు వెచ్చగా అవ్వగానే.. దొంగ అని అనుకుని నవ్వుకుంది..

ఫ్లైట్ కేరళలో ల్యాండ్ అయ్యింది.
Like Reply
#46
45     


అరణ్య : అమ్మా నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళమని అడుగు

మీనాక్షి : సరే.. శివా..

శివ : చెప్పు

మీనాక్షి : అదే అక్కడికి నేను కూడా వస్తాను

శివ సరే అని మీనాక్షి పొట్టని చూసి నవ్వాడు, ఆ వెంటనే మీనాక్షి పొట్ట కూడా వెచ్చగా అయ్యింది.

మీనాక్షి : ఏంటి ఇద్దరు ఒకేసారి నవ్వుకుంటున్నారు, ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యా నాకు తెలీకుండా.. అరణ్య.. వీడు మాట్లాడ్డు.. శివా చెప్తావా లేదా

శివ : లేదు నువ్వు వస్తా అనగానే నీకు అరణ్య చెప్పి ఉంటాడని గెస్ చేశా అందుకే వాడిని చూసి నవ్వాను.. వాడు ఎందుకు నవ్వాడో నాకేం తెలుసు

మీనాక్షి : అరణ్యా.. అంతేనా.. వీడు మాట్లాడట్లేదంటే అది నిజం కాదు.. ఏదో నడుస్తుంది.. కనిపెట్టాలి

శివ : చాల్లే పదా.. ముందు ఫ్లైట్ దిగు..

శివ సందీప్ ఇద్దరు కారులో ముందు కూర్చుంటే వెనకాల  మీనాక్షి, కస్తూరి దారి చెపుతూ కూర్చున్నారు. తన కన్న తల్లి ఇన్నేళ్లు ఉన్న ఇంటి గేట్ తెరిచే ఉంది లోపలికి అడుగు పెడుతూ చుట్టూ ఉన్న చెట్లు చూస్తున్నాడు.

కస్తూరి : అమ్మకి చెట్లంటే ప్రాణం అన్నయ్యా

గుమ్మం ఎదురుగా పగిలిపోయిన పూల కుండీలు, పగిలిన కిటికీ అద్ధాలు చూస్తూ లోపలికి వెళ్ళబోతే do not enter అన్న రిబ్బన్ కట్టి ఉంచారు. వంగి లోపలికి వెళ్ళాడు.. అంతా కాళీ బాడీ చుట్టూ ముగ్గు పోసిన గుర్తులు, టీ పాయి మీద ఉన్న రక్తపు గుర్తులు ఇంకా అలానే ఉన్నాయి, అంతా గమనిస్తూ అన్ని రూములు చూస్తున్నాడు.

కస్తూరి : అన్నయ్యా అమ్మ రూం అని చూపించిగానే శివ లోపలికెళ్లి చూసాడు గోడ నిండా ఒక వైపు కొన్ని కస్తూరి ఫోటోలు ఉంటే ఇంకో వైపు అన్ని శివ చిన్ననాటి ఫోటోలు.. పక్కనే తన అమ్మ ఫోటో ఒకటి చూసి వెళ్లి ఫోటోలో ఉన్న తన అమ్మ మొహాన్ని తడిమి చూసుకున్నాడు.. ఒక్కోటి చూస్తూ బీరువా తెరిచి చూసాడు. తన చీరలు.. గాజులు.. ఒక్కోటి చూస్తూ తన అమ్మని ఆ బట్టల్లో ఊహించుకుంటూ అన్ని చూస్తుండగా కవర్ లో ఒక సెక్యూరిటీ అధికారి డ్రెస్ కనిపించింది, తీసి చూస్తే చిన్న పిల్లలది.. కవర్ మీద రాసి ఉంది.. లవ్ యు కన్నయ్య అని.. తీసి చూసాను బహుశా నాకోసం చిన్నప్పుడు కొని నాకు ఇవ్వలేక పోయి ఉంటుంది.. అక్కడే ఒక డైరీ దాని మీద కన్నయ్య అని రాసి ఉండటంతో తీసి మంచం మీద కూర్చుని తెరిచాను.

మొదటి పేజీలో నా చిన్నప్పటి ఫోటో.. పేజీ తిప్పాను.. ముత్యాల్లాంటి రాత..

ఇవ్వాళ నా కన్నయ్యని వెతుక్కుంటూ వెళ్లాను, ఆ ఏరియా మొత్తం వెతికి తెల్లారి గుడికి వెళ్ళాను.. గుళ్లో మెట్ల మీద ఒకావిడ పిల్లోడితో కలిసి అందరికి బట్టలు పంచుతుంటే పిల్లాడు కేరింతలు కొడుతూ అందరికి వాడి చేత్తో బట్టలు పంచుతుంటే ఆ తల్లి చూస్తూ మురిసిపోతుంది. ఎవరా అని చూస్తే నేను బిడ్డని ఇచ్చిన ఆవిడ, చెప్పలేనంత ఆనందం వేసింది.. వాడు నా కొడుకేనా అని ఆశ్చర్యంగా దెగ్గరికి వెళ్లాను.. ఆ పిల్లాడి మొహం చూడగానే ఆగలేక పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను.. నా కన్నయ్యని ఎత్తుకుని తిప్పాలనిపించింది కాని అంతలోనే కన్నయ్య వెళ్లి ఆమెని కౌగిలించుకోగానే ఆవిడ ఎత్తుకుని సంతోషంగా తిప్పుతూ తృప్తిగా ప్రేమగా హత్తుకుంది వాడిని..

అది చూస్తూనే నా అడుగుల వేగం తగ్గిపోయింది.. అక్కడికి వెళ్లి నిలుచున్నాను.. కన్నయ్య నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూసాడు ఆవిడ నా దిక్కు చూడగానే కొంగు తలకి కప్పుకున్నాను.. వాడు తన సంక దిగి చీర తెచ్చి నా చేతిలో పెట్టాడు.. చీర తీసుకుంటూ వాడి చేతులు తడిమాను.. చెంపని ముట్టుకున్నాను.. ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ బెదిరి ఎక్కడ వెళ్ళిపోతాడో అని నా ఎదురుగా ఉన్నంత సేపు వాడిని చూసుకున్నాను.. నా కన్నయ్య కూడా నన్ను కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే ఏడుపు ఆపుకుని వాడిని చూసుకున్నాను. మళ్ళీ ఆవిడ పిలిస్తే గాని వెళ్ళలేదు, వెళ్లేప్పుడు కూడా నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు.. దానికి నేను పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు.

ఫాలో అయితే తెలిసింది తన పేరు కావేరి అని చాలా దయ గలది అని, నా బతుకు ఎలానో ఇలా అయిపోయింది కన్నయ్య నా దెగ్గర ఉంటే మళ్ళీ అలాంటి ఓ పరిస్థితి వస్తే అనవసరంగా వాడు అనాధ అయిపోతాడేమో అని భయం వేసింది.. నాకోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు.. ఇప్పుడు ఆ అమ్మని వదిలి రావాలంటే వాడికి కూడా బాదే.. అందులోనూ కావేరి ఉన్న పరిస్థితికి నా కన్నయ్య అవసరం తనకి ఉంది అందుకే ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి వచ్చేసాను.. నీ నాన్నని పోగొట్టుకున్నప్పుడు కూడా ఇంతగా ఏడవలేదు కన్నయ్య.. నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు.. లవ్ యు..

నా కంట్లో కన్నీరు వచ్చేసింది, పక్క పేజీ తిప్పుతుంటే కస్తూరి నా పక్కన కూర్చుని నా కన్నీళ్ళు తుడుస్తుంటే ఒక చెయ్యి తన మీద వేసి నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.. తను ఏడ్చేసింది..

శివ : మరేం పరవాలేదు.. నువ్వు అచ్చు అమ్మ పోలికే.. నీలో అమ్మని చూసుకుంటాను.. ఈ డైరీ నాతో ఉండని.. పద ముందు అమ్మని చూడాలి.. అని లేచాను.

అక్కడ నుంచి స్టేషన్ కి వెళ్లి అన్ని సెట్ చేసి బాడీస్ క్లెయిమ్ చేసుకుని, స్మశానానికి తీసుకొచ్చాం, చిట్ట చివరికి అమ్మ మొహం చూసానన్న నా కోరిక తీరింది.. అస్సలు తను ఎలా ఉంటుందో ఎందుకు నన్ను వదిలేసిందో.. బతికే ఉందా లేదా అన్న నాలోని ప్రశ్నలన్నిటికి సమాధాలు దొరికాయి.. డైరీలో తను రాసుకుంది గుర్తొచ్చింది.. తన నుదిటి మీద ముద్దు పెట్టాను తన బుగ్గ మీద ముద్దు పెట్టాను, స్మెల్ వస్తుంది ఎక్కువ సేపు ఉంచకూడదు అని అక్కడున్న వాళ్ళు చెప్పేసరికి.. అందరికి ఒకేసారి తల కొరివి పెట్టి ఆ కార్యక్రమం ముగించి అమ్మ అస్తికలని, కావేరి అమ్మకి ఇచ్చి అందరినీ పంపించేసాను.. ఇక మిగిలింది నేనూ సందీప్ మీనాక్షి కస్తూరి.

స్టేషన్ లో బాడీ క్లెయిమ్ చేసుకునేప్పుడే ఒకడు మమ్మల్ని అనుమానంగా చూస్తూ ఫోన్ చెయ్యడం గమనించాను, కస్తూరి ఏడుస్తుంటే మీనాక్షి తన చెయ్యి పట్టుకుంది. చుట్టు నాకు తెలియని బలమైన మనుషులు తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలుసు.. నా చెల్లి, నా భార్య ఇద్దరు కడుపుతో ఉన్నారు అయినా నాకు అంతగా భయం అనిపించలేదు.. అన్నిటికి సిద్ధమయ్యే రంగం లోకి దిగాను. జేబులో చెయ్యి పెట్టాను గన్ తీయడానికి.. ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో సందీప్ ముందే చేతిలో గన్ పట్టుకుని ఎవ్వరికి కనిపించకుండా చేతులు కట్టుకుని మా వైపు వస్తున్న మనుషులనే చూస్తున్నాడు.

అందులో ఒకడు కస్తూరి దెగ్గరికి వెళుతుంటే వెళ్లి వాడి భుజం మీద చెయ్యి వేసాను. నన్ను చూసి చెయ్యి తీయ్యాబోతే గట్టిగా పట్టుకున్నాను.

ఎవడ్రా నువ్వు

ముక్కు మీద ఒకే ఒక గుద్దు, చెయ్యి పెట్టుకుని చూసి రక్తం కారుతుంటే అలానే మోకాళ్ళ మీద పడిపోయాడు. వెంటనే ఒక ఆరుగురు నా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే గన్ తీసి ఒకడి కాలి మీద కాల్చి వెంటనే ఇందాక ముక్కు మీద గుద్దిన వాడి తల మీద పెట్టాను.. అందరూ ఆగిపోయారు..

శివ : ఎవడు పంపించాడు

మేము ప్రతాప్ సర్ మనుషులం

శివ : అంటే.. సుపారి నా లేక.. పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ సారెనా

మా సారె..

శివ : ఇక్కడే ఉంటాను.. ఇవ్వాల్టితో ఏ విషయం తెల్చుకుందాం రమ్మని ఫోన్ చెయ్యి

ఇంతలో వేరే ఒకడు వెనక నుంచి నన్ను కొట్టబోతే సందీప్ వాడిని కాల్చేశాడు.

అందరి ముందు బుల్లెట్ వాడి గుండెలో దించాను

శివ : చావడానికి కూడా అంత తొందరేంట్రా మీకు అనగానే అక్కడున్న వాళ్లలో మధ్యలో నిలుచున్న వాడు వెంటనే ఫోన్ చేసాడు.. వెంటనే వాడి దెగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకున్నాను.. అవంతి కొడుకుని మాట్లాడుతున్నాను.. మమ్మల్ని చంపాలని పిచ్చి కుక్కలా తిరుగుతున్నవట.. దా.. రేయి వీడికెవడన్నా అడ్రెస్ చెప్పండి అని ఫోన్ వాళ్ల మీద విసిరేసి వెళ్లి కస్తూరిని దెగ్గరికి తీసుకున్నాను.
Like Reply
#47
46     


శివ : రేయి మీ సర్ అదే వాడి పేరేంటి.. ప్రతాప్. వాడి గురించి చెప్పండి.

ఎవ్వరు ఏం మాట్లాడలేదు.

శివ : చూడండి మీరంటే నాకు కోపం లేదు, మీరు ఎవరో కూడా నాకు తెలీదు. ఇవ్వాల్టితో వాడో నేనో తెలిపోతుంది. మీకేం ప్రాబ్లమ్ లేదు వాడెవడో కూడా నాకు తెలీదు కొంచెం చెప్పండ్రా

ఒకడు ముందుకొచ్చాడు.. ప్రతాప్ అంటే ఒక్కడు కాదు, ఇద్దరు.. అన్న ప్రతాప్ తిరగడం, పనులు చూసుకోవడం ఎవరైనా తన దారికి అడ్డొస్తే లేపేయ్యడం ప్రతాప్ సర్ చూసుకుంటారు.. ఇక ప్రతాప్ సర్ బాడీ అయితే, బ్రెయిన్ ఆయన తమ్ముడు ప్రదీప్. బిజినెస్ నడపడం, కోర్టులు కేసులు అన్ని ఆయన చూసుకుంటాడు. ఇద్దరు అన్నదమ్ములు.. ప్రతాప్ సర్ ని ఎదిరించి నిలబడ్డ వాళ్ళని మేము ఇప్పటి వరకు చూడలేదు.

శివ : ఇప్పుడు చూస్తారులే.. నేను నిలబడి సలాం కొట్టడానికి రాలేదు, ఎక్కి తొక్కడానికి వచ్చాను

ఇంతలోనే అక్కడికి నాలుగు నల్లటి స్కార్పియోల మధ్యలో ఒక తెల్లని ఆడి కార్ తో వచ్చి అక్కడ ఆగాయి.. అందరి చూపులు అటు వైపు మళ్లాయి.. మనుషులు వెళ్లి డోర్ తీయగానే కారుకి అటు వైపు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు దిగి మావైపు నడుచుకుంటూ వచ్చారు. చిన్నగా వర్షం పడుతుంటే వాళ్ళిద్దరికీ గొడుగులు పట్టారు.

శివ : వీళ్లేనా ప్రతాప్, ప్రదీప్.. ప్రతాప్ ఎవడు

ప్రతాప్ : నేనేరా

శివ : అదే మమ్మల్ని చంపాలని ఊర కుక్కలా తిరుగుతున్నావు కదా అందుకే ఇక్కడే తెల్చుకుందాం రమ్మన్నాను

ప్రతాప్ : ఏంట్రా నువ్వు తెల్చేది అని గన్ తీసి శివ తలకి పెట్టగానే వెంటనే శివ కూడా గన్ ప్రతాప్ వైపు పెట్టాడు.. అక్కడున్న సందీప్ కూడా గన్ తీసి గురి పెట్టగా ఇంకో ముగ్గురు కూడా గన్స్ తీశారు. అందరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటున్నారు.

ప్రదీప్ : రేయి అనవసరంగా ఛస్తావ్

శివ : నా గన్ లో కూడా బుల్లెట్లే ఉండేది.. దమ్మున్న మగాడు అయితే కాల్చమను వీడిని..

అరణ్య : అమ్మా వెంటనే ఒక రాయి తీసుకుని నాన్నని గురి చూసి కొట్టు

మీనాక్షి : నాన్ననా...?

అరణ్య : ఇప్పుడే.. అనగానే మీనాక్షి రాయి తీసి శివ మొహం మీదకి విసిరేసింది.

అదే టైంకి బాడీ తప్ప ఆలోచన లేని ప్రతాప్.. ఏంట్రా నీకు భయపడేది అని కాల్చాడు అదే టైం కి శివ కూడా కాల్చాడు.. ప్రతాప్ కాల్చిన బుల్లెట్ కి మీనాక్షి విసిరిన రాయికి తగిలి శివకి ఏమి కాకపోగా శివ కాల్చిన బుల్లెట్ మాత్రం ప్రతాప్ గుండెలోకి దూసుకుపోయింది.

వెంటనే అందరూ కాల్చడం మొదలు పెట్టారు, సందీప్ మీనాక్షిని కస్తూరిని అక్కడే ఉన్న సమాధి వెనక దాచి అటు వైపు ఎవరు వచ్చినా కాల్చడం మొదలు పెట్టాడు. ఇంకో వైపు శివ చెట్టు వెనక దాక్కుని మిగిలిన ముగ్గురు గన్స్ తో కాలుస్తుంటే తప్పించుకుని తిరిగి కాలుస్తున్నాడు. ఒకడి తల కనపడుతుంది కాని షాట్ దొరకడం లేదు వెంటనే వాడి తల మీదకి ఒక చిన్న రాయి విసిరాడు దానికి కొంచెం కదలగానే షాట్ దొరికింది వెంటనే షూట్ చేసాడు. ఆ వెంటనే వాడి ప్లేస్ లోకి వెళ్లి మిగతా ముగ్గురిని లేపాడు.

ఇంతలో గన్ సౌండ్ విని అటు చూసేసరికి ప్రతాప్ పడుకునే సందీప్ ని కాల్చాడు అది సందీప్ చేతికి తగిలింది.. వెంటనే ప్రతాప్ అని అరిచాడు.. వాడు శివ వైపు తిరగగానే హెడ్ షాట్ కొట్టేసాడు నా కొడకా అని తిడుతూ..

మిగతా మనుషులు అది చూసి బెదిరిపోయారు.. ప్రదీప్ అక్కడనుంచి తప్పించుకుని పారిపోయాడు, వెంటనే సందీప్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లిపోయారు. అక్కడ నుంచి శివ తన అమ్మ జ్ఞాపకాలను చెల్లెలికి సంబంధించిన సామాను తీసుకుని మొత్తానికే ఇంటికి వచ్చేసారు.

కస్తూరికి కూడా తన అన్నయ్య ఇంట్లో ఉండటానికి జరిగింది మొత్తం తలుచుకుని తన తదుపరి జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. ఇంట్లో ఏదో ఒక మంచి పండగ వాతావరణం నెలకొలిపితే జరిగింది మర్చిపోయి అందరూ మళ్ళీ మాములు జీవితాలకి అలవాటు పడతారని శివ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఒక శుభముహుర్తాన శివకి మీనాక్షితో.. భరత్ ని ఒప్పించి సందీప్ కి శ్రావణితో పెళ్లి జరిపించారు. శివ రోజు రోజుకి ఎదుగుతున్నాడు.. తన జీవితంలో జరిగిన సంఘటనలన్ని తనని నిద్ర పోనివ్వడం లేదు. ఏ ఆపద ఎటు వైపు నుంచి వస్తుందో అని తన కొడుకు అరణ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు దానికి తగ్గట్టే శివ అందరినీ ముని వేళ్ళ మీద కాపాడుకోవాలంటే ఈ పవర్ సరిపోదని ముందు డబ్బులు సంపాదించాలని.. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంవత్సరాలుగా వచ్చే ఎదుగుదలని నెలల్లో చూపిస్తున్నాడు.. ఇందులో అరణ్య సూచనలు, తను పెట్టె ముహుర్తాలు శివకి చాలా ఉపయోగ పడ్డాయి.

రాత్రికి అందరూ తిని కుర్చున్నారు.. ఏమైందో కాని గత రెండు గంటలగా మీనాక్షి పొట్ట వెచ్చగానే ఉంది.. మీనాక్షి అందరూ మాట్లాడుతుండగానే లేచి వెళ్లిపోవడంతో శివ లేచి తన వెనకే వెళ్ళాడు.

శివ : ఏమైంది

మీనాక్షి : పొట్టంతా జిల పుడుతుంది.. ఇందాకటి నుంచి ఒకటే నవ్వుతున్నాడో మరి సంతోషంగా ఉన్నాడో తెలియట్లేదు కాని వెచ్చగా ఉంది.. అడిగితే ఇంకా వెచ్చగా అవుతుంది.. దేనికో తెగ సంబర పడుతున్నాడు.

శివ : ఏమై ఉంటుంది.. ఒకసారి అడిగి చూడు

మీనాక్షి : బుజ్జి.. మాకు చెపితే మేము కూడా ఆనందపడతాం కదా

అరణ్య : నాన్నని కార్ కీస్ రెడీగా పెట్టమని చెప్పు, ఈ రాత్రికి ఎవ్వరికి నిద్ర ఉండదు.. ఏ టైంలో అయినా హాస్పిటల్ కి వెళ్లాల్సి రావచ్చు

మీనాక్షి : ఏమైందిరా అలా మాట్లాడుతున్నావ్.. హిస్పిటల్ దేనికి

శివకి అర్ధమయ్యింది.. ఆనందం పట్టలేక పోయాడు.. కాని మీనాక్షి ముందు నటించాలిగా..

శివ : ఏమైంది హాస్పిటల్ ఏంటి

మీనాక్షి అరణ్య చెప్పిన విషయమే చెప్పింది

శివ : పిచ్చిదానా నీకింకా అర్ధం కాలేదా.. నా చెల్లి కస్తూరి.. అంటే ఇవ్వాళే డెలివరీ.. అని బైటికి పరిగెత్తుతుంటే

మీనాక్షి : ఇవ్వాళ కాదట.. రేపట అని తను కూడా ఆనందంగా బైటికి వెళుతు ఒక్కసారిగా ఆగిపోయి మంచం మీద కూర్చుంది.. పొట్ట మీద చెయ్యి వేసుకుని నిమురుతూ.. బుజ్జి ఈ విషయానికేనా అప్పటి నుంచి తెగ ఆనంద పడుతున్నావ్.. ఆ.. ఏంటి విషయం.. అని అడగ్గానే మీనాక్షి పొట్ట ఇంకా వెచ్చగా అవుతుంటే.. బుజ్జి ఇంకా వెచ్చగా అవుతే నేను మాడిపోతానురా.. అని నవ్వుతూ.. నీ దెగ్గర ఎన్ని వేషాలు ఉన్నాయో నువ్వు పుట్టక ముందే నాకు అన్ని చూపించేస్తున్నావ్ రా.. ఇక నువ్వు పుట్టాక నేను ఎన్ని చూడాలో అని నవ్వుతుంటే అప్పటివరకు వెచ్చగా ఉన్న పొట్ట ఒక్కసారిగా చల్లబడి పోయింది..

మీనాక్షి : బుజ్జి ఏమైంది నాన్నా.. అరణ్య.. అరణ్య..

అరణ్య ఏమి మాట్లాడలేదు.. మీనాక్షికి చిన్నగా ఏదో భయం అనిపించింది కాని ఇంకేమి మాట్లాడలేదు లేచి బైటికి వెళ్ళిపోయింది అందరూ మాట్లాడుకుంటుంటే కస్తూరి తన అన్నయ్య తల నిమురుతుంటే తన ఒడిలో పడుకుని హాయిగా చందు మరియు రజిత జోకులు వేస్తుంటే అందరి నవ్వులతో తన నవ్వుని కలిపింది.

ఇప్పటికే లేట్ అయ్యిందని కావేరి గుర్తు చేసేసరికి ఇష్టంలేకపోయినా అందరూ లేచారు..

శివ : కూర్చోండి.. రేపు ఎవ్వరికి పెద్దగా పనులు ఏమి ఉండవు

కావేరి : అదేంట్రా

శివ : రండి ఇవ్వాళ కూర్చుందాం.. కస్తూరి నిద్ర వస్తుందా

కస్తూరి : లేదు అని నవ్వింది..

మళ్ళీ అందరూ కూర్చున్నారు.. మీనాక్షి వెళ్లి తన తమ్ముడిని ఆనుకుని కూర్చుంది.. చందు కూడా మీనాక్షిని పడుకోబెట్టుకుని వాడి కాలేజీలో అమ్మాయిల గురించి వాడు వేసిన వేషాల గురించి చెపుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు.

రాత్రి ఒంటి గంటకో ఎప్పుడో అప్పటికే అందరూ ముచ్చట్లాడుతూ నవ్వుతూ పడిపోతుంటే కావేరి అందరినీ లేపి పడుకోమని లోపలికి పంపించింది.

కావేరి : శివా నువ్వు కూడా వెళ్లి పడుకో

శివ : మీనాక్షి ఏదీ

కావేరి : పడుకుంది

శివ : నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను.. అని తన ఒళ్ళో పడుకున్న కస్తూరిని చూస్తూ ఉన్నాడు.. అది చూసిన కావేరి శివకి కస్తూరికి ఇద్దరి నుదిటిన ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది.

రాత్రి రెండున్నరకో ఎప్పుడో కస్తూరికి మెలుకువ వచ్చి లేచింది, శివ అలానే గోడకి ఆనుకుని పడుకోవడం అన్నయ్య కాళ్ళ మీద తను పడుకోవడం చూసింది.. శివ చెయ్యి ఇంకా తన చెంప మీదె ఉంది.. చిన్నగా నొప్పులు మొదలయ్యేసరికి అన్నయ్యని లేపింది.

శివ : ఏమ్మా..

కస్తూరి : నొప్పిగా ఉందన్నయ్య.. నొప్పులు స్టార్ట్ అవుతూన్నాయేమో..

శివ లేచి కార్ కీస్ అందుకుని అమ్మని లేపాడు.

కావేరి : ఇంకా నొప్పులు మొదలవ్వలేదుగా

శివ : అయినా సరే.. ఏముంది.. ముందే వెళ్లి అడ్మిట్ అయితే మంచిదే కదా

ఇంతలోనే కస్తూరికి నొప్పులు మొదలవ్వటంతో రజిత కూడా నిద్రలోనే లేచి బైటికి వచ్చింది.. అందరూ హాస్పిటల్ కి వెళ్లారు. కొంత సేపటికి నొప్పులు తగ్గి మళ్ళీ మొదలయ్యాయి.

సరిగ్గా తెల్లారి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి, నవరాత్రుల  దుర్గా దేవిని పూజించే రోజున అరణ్య చెప్పినట్టే ఎర్రగా తలనిండా జుట్టు ఉండలు కట్టి అరచేతిలో గోరింటాకు పెట్టినట్టు నల్లని మచ్చతో పుట్టింది.

అందరూ సంతోషించారు.. కస్తూరి అయితే పాపని చూసుకుని ఏడ్చేసింది.

శివ : ఏంట్రా.. అని బుజ్జగిస్తూ.. చూడు నా కోడలు ఎంత అందంగా పుట్టిందో, ఈ టైములో నువ్విలా ఏడవచ్చా.. మన అమ్మే పుట్టిందేమో కదా

మీనాక్షి : ఎప్పుడో చనిపోవాలనుకున్నాను అన్నయ్యా.. దీని కోసమే చావుని అంచుల నుంచి తప్పించుకుంటూ పారిపోతూ వచ్చాను.. అవును అమ్మే పుట్టిందని అనుకుంటాను. అని శివని వాటేసుకొగా ఓదార్చాడు.

ఇంటికి ఆడ పిల్ల వచ్చిన వేళా విశేషమో ఏమో.. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది.. కస్తూరి మరియు శివ ఇద్దరు పాప పుట్టిన పది రోజుల తరువాత పాపకి మొదటగా స్నానం చేపించడానికి కావేరి అమ్మని పిలవగా.. ఏడ్చేసింది..

కస్తూరి : అమ్మా.. నిజంగా అమ్మ చెప్పినట్టు.. తన స్థానంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండలేరు.. అని చెయ్యి పట్టుకుంది.

కావేరి ఆనందబాష్పాలతో పిల్లకి స్నానం పోసి ఆడిస్తూ.. వెన్ను మీద తడుతూ.. ముక్కు నుదురు అన్ని సరిగ్గా వచ్చేలా నొక్కుతుంటే కస్తూరి పిల్ల ఏడుపుకి భయపడుతూ చూస్తుంది. స్నానం చేపించి కస్తూరికి అందంచగా ఒళ్ళు తుడిచి పక్కన పండేసుకుంది.. ఆ చిన్ని చిన్ని చేతులని చూస్తూ.. తను గుప్పిట పట్టిన వెళ్లాలోకి తన వేలిని పోనించి.

శివ : కస్తూరి.. అమ్మాయి చాలా ఆరోగ్యంగా పుట్టింది చాలా మంది పిల్లలని ఇంక్యుబేటర్ లో పడతారట కాని మనకి ఆ అవసరమే రాలేదంది డాక్టర్.. కంగారు పడకు.

రాత్రికి అందరూ పడుకున్నాక మీనాక్షి కూడా నిద్రపోయిందాక వేచి చూసి అప్పుడు మాట్లాడుకున్నారు తండ్రి కొడుకులు

శివ : అరణ్య.. నాకొక సందేహం.. నీకు చచ్చిపోయిన వాళ్ళని బతికించే శక్తి ఉన్నదా

అరణ్య : ఎందుకు అడుగుతున్నావు

శివ : లేదు నిన్ను అటువంటి కోరికలు నేను కోరను.. అది సృష్టి విరుద్దం అని నాకు తెలుసు

అరణ్య : ఇప్పటికి లేదు కాని ఒకవేళ ఉన్నా అది సాధ్యం కాదు, ప్రకృతికి ఎదురు వెళ్లినా వికృతికి ఎదురు వెళ్లినా అది తీవ్ర నష్టాన్ని కలగచేస్తుంది.

శివ : నాకు ఇంకా ఏమైనా చెప్పాలా

అరణ్య : నేను ఒకరిని చావుని కోరుకుంటున్నాను.. నా కోరిక తీరుతుందా

ఉలిక్కిపడ్డాడు శివ.. ఎవరు.. ఎవరిని..

అరణ్య : అందరి మంచి కోసమే అడుగుతున్నాను, నా కోరిక తీర్చుతావా నాన్నా

శివ : కచ్చితంగా బంగారు..

అరణ్య : మాట ఇవ్వు.. సమయం వచ్చినప్పుడు నేను ఎవరిని చంపమంటే వాళ్ళని ఆలోచించకుండా చంపుతానని.

శివ : కాని అదీ..

అరణ్య : అమ్మకి కాని నానమ్మకి కాని అత్తయ్యకి కాని ఏ హాని జరగదు.. నన్ను నమ్ము

శివ : మాటిస్తున్నాను.. అని మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసాడు.. ఆలోచించకుండా
Like Reply
#48
47      

కస్తూరి కూతురు పుట్టిన దెగ్గరి నుంచి అన్ని ఆనందాలే అన్ని సంతోషకరమైన వార్తలే.. ఈవెనింగ్ వాకింగ్లతో వీకెండ్ ఫ్యామిలీ పార్టీలతో అందరూ కొత్త జీవితాలు మొదలు పెట్టారు కానీ ఒకటే లోటు.. అందులో శివ లేడు.. ఎందుకు అంత గొడ్డులా కష్ట పడుతున్నాడో, అంతంత డబ్బు ఎవరికోసం సంపాదిస్తున్నాడో.. తన గురించి అన్నీ ప్రశ్నలే.. అంతా చూస్తున్న గగన్ కి కూడా అనిపించింది, ఏం చేసుకుంటాడు ఇన్ని డబ్బులు ఇంత ఆస్తి.. సరిపోదా.. డబ్బు పిచ్చిలో పడ్డాడా అంటే అదీ కాదు, శివ ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో గగన్ కి తెలియనిది కాదు.. ఎప్పుడు పక్కనే ఉండే సందీప్ కి కూడా అర్ధం కాలేదు.

మీనాక్షి మాత్రం శివని ఒక్క మాట కూడా అడగలేదు, కొంత సర్దుకుపోయింది కొంత అరణ్యతో సరిపెట్టుకుంది కాని ఎప్పుడు శివ విషయంలో జోక్యం చేసుకోలేదు. శివ మాత్రం తన పనిలో తాను ఉన్నాడు ఎప్పుడైనా కావాలంటే రోజంతా ఫోన్ ఆన్ లోనే పెట్టి మీనాక్షితో మాట్లాడుతూనే ఉన్నాడు కాని తన పని మాత్రం ఆపలేదు. ఈ ఒక్క విషయం తప్పించి అన్ని సంతోషాలే ఇంట్లో

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

కేరళలో స్మశానం దెగ్గర తప్పించుకున్న ప్రదీప్ అదే రోజు శివ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వెళ్లి తన తమ్ముడి బాడీ తీసుకెళ్లి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాడు.. రోజులు గడుస్తున్నా మనస్శాంతి లేదు. ఇద్దరిలో బలమైనోడు చచ్చిపోవడంతో అందరూ ప్రదీప్ మాట వినడం మానేశారు. వాళ్ళ క్రైమ్ బిజినెస్ దెగ్గర నుంచి హవాలా వరకు అన్నింట్లో లాస్ వచ్చేసింది.. ఇదంతా శివ వల్ల.. కాని ఎలా పగ తీర్చుకోవాలో తెలియదు.

ఆరోజు శివ గన్ తో అందరిని కాల్చుతుంటే అది చూసి తన గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇంకా షాక్ లోనే ఉన్నాడు ఆ సంఘటన పదే పదే గుర్తుకొస్తుంది దానితో పాటే కోపం ద్వేషం. ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు, అస్సలు రూంలో నుంచి బైటికి రావట్లేదు. మందు బాట్టిళ్ళు అయిపోతునే ఉన్నాయి. ఇలా ఉండగా ఒకరోజు ప్రదీప్ కి ఒక ఫోన్ వచ్చింది.

ప్రదీప్ : (మందు తాగుతూనే) హలో..

సుశాంత్ : హలో ప్రదీప్

ప్రదీప్ : అవును ఎవరు

సుశాంత్ : నేనెవరో నీకు అనవసరం.. నీకు ఆ శివ మీద పగ తీర్చుకోవాలని ఉందా లేదా

ప్రదీప్ : ఎవడ్రా నువ్వు..

సుశాంత్ వాడికి శివకి మధ్యలో ఉన్న గొడవ గురించి చెప్పాడు

ప్రదీప్ : ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్

సుశాంత్ : ఈ సారి కలిసి ప్లాన్ చేద్దాం.. ఒకటే షాట్.. ఏమంటావ్

ప్రదీప్ : ముందు నన్ను కలవు, నువ్వు ఎవరో నేను తెలుసుకోవాలి.. నాకు నీ మీద నమ్మకం కుదరాలి.

సుశాంత్ : అలాగే అని ఫోన్ పెట్టేసాడు.

ఫోన్ పక్కకి విసిరేసి ప్రదీప్ ఆలోచించసాగాడు.

వారంలో  సుశాంత్ తను కంపెనీ పని మీద బైటికి వెళుతున్నానని ఇంట్లో అందరినీ నమ్మించి, ఒక్కడే ప్రదీప్ ని కలవడానికి ముంబై వెళ్ళాడు. అక్కడ ప్రదీప్ ని కలుసుకున్నాడు.. ఇద్దరు చాలా మాట్లాడుకున్నారు చాలా తాగారు.. వాళ్ళ బాధలు పగలు పంచుకుని చివరికి ఇద్దరు ఒకటైపోయారు.

సుశాంత్ : ఈ సారి ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం

ప్రదీప్ : మిస్ అయితే మనం ఉండం.. ఇప్పుడు వాడు మామూలోడు కాదు.. మొన్నే ఫార్బ్స్ లిస్ట్ లోకి ఎక్కాడు.. మీడియా మొత్తం ఎప్పుడు వాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది.. ఏ మాగజిన్ లో చూసినా వాడే.. వాడు ఎంత బిజీగా ఉన్నాడంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే ఒప్పుకోలేదు.. అది వాడి రేంజ్.. అలాంటి వాడిని ముట్టుకోవాలంటే..

సుశాంత్ : అదే ప్లాన్ చెయ్యాలి.. వాడి దెగ్గరికి మనం వెళ్లడం కాదు.. వాడే మన దెగ్గరికి రావాలి.

ప్రదీప్ : నాకు వాడి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, వాడు షాపింగ్ ఎక్కడ చేస్తాడు.. ఇంట్లో వాళ్ళు.. వాళ్ళ అలవాట్లు ప్రతీ ఒక్క విషయం నాకు అన్ని తెలియాలి.

సుశాంత్ : అలాగే నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను.

సుశాంత్ వెళ్ళిపోయాక ప్రదీప్ తన రూంలో ఉన్న మందు బాటిళ్ళు మొత్తం బైట పారేసి, ప్లాన్ వెయ్యడానికి శివని ఫాలో చెయ్యడానికి అన్నిటికి రంగం సిద్ధం చెయ్యడం మొదలుపెట్టాడు

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

మీనాక్షి డెలివరీకి ఇంకా యాభై రోజుల సమయం ఉందనగా ఒకరోజు మీనాక్షి పడుకున్నాక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంటే మీనాక్షి నిద్రలోనే ఉంటూ వింటుంది.

ఎప్పటి నుంచో మీనాక్షికి ఒక అనుమానం ఉండేది, శివకి అరణ్యకి మధ్య ఏమైనా లింక్ ఉందా అని.. అందులోనూ ఇవ్వాళ అరణ్య పొద్దున నుంచి అదోలా ఉండడం.. సరిగ్గా మాట్లాడకపోవడం, ఏదో పొడి పొడిగా మాట్లాడడం, ఒక్కసారి కూడా పొట్ట వెచ్చగా అవ్వకపోవడం వల్ల మీనాక్షికి సరిగ్గా నిద్రపట్టలేదు.. నిద్రలోనే ఉన్నా చుట్టు పక్కల అన్ని వినిపిస్తూనే ఉన్నాయి.

అరణ్య : నాన్నా నేనొకటి అడుగుతానన్నాను గుర్తుందా

శివ : అవును.. ఈ విషయమే నన్ను చాలా రోజులుగా బాధ పెడుతుంది.. చెప్పు ఎవరిని చంపాలి

అరణ్య : నన్నే

శివ నిద్ర మొత్తం ఎగిరిపోయింది.. ఇదంతా వింటున్న మీనాక్షికి తెలివి వచ్చినా చిటికిన వేలు కూడా కదపలేదు, లేకపోతే అరణ్యకి తెలుస్తుందని మౌనంగా ఏం ఆలోచించకుండా తన శరీరంతో ఏ పని లేదన్నట్టు అరణ్య మాటలు వింటుంది.. అరణ్య కూడా తన అమ్మ మెలుకువతోనే ఉందన్న విషయం గమనించలేదు. చాలా రోజులుగా తీసుకున్న నిర్ణయం తన తండ్రితో పంచుకునే ధ్యాసలో పడి అమ్మ మీనాక్షి సంగతి మర్చిపోయాడు.

శివ : ఏంట్రా బుజ్జి నువ్వు మాట్లాడేది

అరణ్య : నన్ను చంపేయి లేదా అమ్మని మర్చిపో

శివ : అరణ్య..

అరణ్య : అవును.. నేను పుడితే అమ్మ చనిపోతుంది.. దానికంటే ముందే నన్ను చంపేయి.

శివ : ఎందుకు ఇలా.. అలానే జరుగుతుందని ఏంటి గ్యారంటీ.. ఏడుపుతో కూడిన స్వరంతో అడిగాడు.

అరణ్య : ఇప్పటి వరకు నేను చెప్పింది ఎప్పుడైనా తప్పిందా

శివ : ఇదంతా నీకు ముందే తెలుసా

అరణ్య : తెలుసు

శివ : నా వల్ల కాదు

అరణ్య : అయితే అమ్మ చనిపోతుంది.

శివ : అరణ్య.. ప్లీజ్.. ఇంకోసారి ఆ మాట అనకు

అరణ్య : నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను.. ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల ఉండాల్సొచ్చింది.. ఇక నుంచి మీకు జరిగే ప్రమాదాలు అన్ని నా వల్లే.. నన్ను వీలైనంత త్వరగా వదిలించుకో

శివ : నువ్.. నువ్వు..

అరణ్య : మధ్యలో వచ్చాను నాన్నా.. మధ్యలోనే వెళ్ళిపోతాను.. నీకు ముందే చెప్పాను.. నా మీద ప్రేమ పెంచుకోవద్దని.

శివ కళ్ళు తుడుచుకున్నాడు.. అవును.. చెప్పావు కానీ నీ అంత రాతి గుండె నాకు లేదు నేను ఒక మామూలు మనిషిని నా చుట్టు ఉండే పది మంది బాగుంటే చాలు నా వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకపోతే చాలు అనుకునే ఒక సాదా సీదా మనిషిను.. నువ్వు పిండం అయితే అది ఇంకోలా ఉండేదేమో.. కాని ఇన్ని రోజులు నా బిడ్డతో మాట్లాడుకుని.. వాడిని ఇంత ప్రేమించి ఇప్పుడు చంపెయ్యమంటే.. ఎవరి వల్ల అవుతుంది.. దీనికి ఏ తండ్రి ఒప్పుకోడు.

అరణ్య : ఒకటే నాన్నా.. నువ్వైనా నేనైనా మన ఇద్దరికీ కావాల్సింది అమ్మ సంతోషం.. నా తరవాత మీకు మళ్ళీ అబ్బాయే పుడతాడు.. నేను చూసాను.. అచ్చు నీలానే పుడతాడు.. కొన్ని రోజులకి అమ్మ సంతోషంగా..

శివ : చెప్పు.. సంతోషంగా ఉంటుందా

అరణ్య ఏం మాట్లాడలేదు.. కాని కొంత సేపటికి మళ్ళీ మాట్లాడాడు.

అరణ్య : ప్రతీ పౌర్ణమి రోజున నేను నా శక్తులని పనిచెయ్యకుండా ఆపగలను.. అప్పుడే ఏదో విధంగా నన్ను తొలగించు.

శివ : నా వల్ల కాదు.

అరణ్య : నన్ను చంపెయ్యి నాన్నా.. అమ్మ లేని లోకంలో నాకు పుట్టడం ఇష్టం లేదు.. ప్లీజ్ నాన్నా అని బతిమిలాడేసరికి శివ ఏడుస్తూ అక్కడనుంచి పారిపోయి ఇంటి బైటికి వచ్చి నిలుచున్నాడు.

ఆ రాత్రి శివ, అరణ్య ఇద్దరు నిద్రపోలేదు మీనాక్షి మాత్రం నిద్రపోయింది. తెల్లారి మీనాక్షి లేచింది..

అరణ్య : గుడ్ మార్నింగ్ మా..

మీనాక్షి ఏం మాట్లాడలేదు

అరణ్య : అమ్మా..

మీనాక్షి : నువ్వు నాకొక మాట ఇవ్వు..

అరణ్య : ఏమైంది మా

మీనాక్షి : ఇస్తావా లేదా

అరణ్య : ఇస్తాను

మీనాక్షి : నా మీద ఒట్టు పెట్టు

అరణ్య : ఏమైంది మా

మీనాక్షి : పెట్టావా లేదా

అరణ్య : పెట్టాను

మీనాక్షి : ఈ క్షణం నుంచి నువ్వు పుట్టేవరకు.. నాతో కాని నాన్నతో కాని ఇంకెవ్వరితోనూ మాట్లాడకూడదు.. నీ శక్తులని ఉపయోగించకూడదు.. నా శరీరాన్ని నువ్వు కంట్రోల్ చెయ్యకూడదు నా శరీరాన్ని వాడుకోకూడదు.. చెప్పు

అరణ్య ఏం మాట్లాడలేదు.

మీనాక్షి : ఒట్టు పెట్టావా లేదా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.. అని వంటింట్లోకి వెళుతూనే కత్తి తీసుకుంది.

అరణ్య అప్పటికే మాట ఇచ్చేసాడు.. అందుకే ఇంకేం మాట్లాడలేదు.. తన సమ్మతిగా ఒకసారి కడుపు వెచ్చగా అయ్యేసరికి మీనాక్షికి అర్ధమయ్యి ఊరుకుని కత్తి పక్కన పారేసింది.

ఈరోజంతా శివ ఎక్కడికి వెళ్ళలేదు.. మౌనంగా ఇంట్లోనే కూర్చున్నాడు. కావేరి గమనించినా ఆఫీస్ స్ట్రెస్ అయ్యి ఉంటుందిలే అని మామూలుగానే ఉంది. ఇటు మీనాక్షి కూడా మంచం మీద నుంచి లేవలేదు.. మధ్యానానికి లేచి ఫ్రూట్స్ తినేసి మళ్ళీ పడుకుంది.

సాయంత్రం లేచింది.. బిడ్డ మాటలు వినిపించకపోయేసరికి అదోలా ఉన్నా, తన బిడ్డని ప్రేమగా తడుముకుని లేచి హాల్లోకి వచ్చింది.. కస్తూరి, కావేరి ఇద్దరు టీవీ చూస్తున్నారు.

మీనాక్షి : శివ ఎక్కడా

కావేరి లేచి నిలబడింది..

కావేరి : ఏమైంది మీనాక్షి

మీనాక్షి : ఏం లేదు.. అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.

నాలుగు రోజుల తరువాత అందరూ హాల్లో కూర్చున్నప్పుడు, శివ మరియు మీనాక్షి పరధ్యానంగా ఉండడం గమనించి కదిలించింది.

కావేరి : ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యా

రజిత : నేనూ అదే అడగాలనుకున్నాను, గత కొన్ని రోజుల నుంచి మీనాక్షి ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడ్డంలేదు.

గగన్ : శివ కూడా.. ఆఫీస్ కి వచ్చి వారం అవుతుంది.. కనీసం అక్కడ ఉన్నప్పుడు మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ నవ్వుకునేవాడు. శివ ఏదైనా గొడవ పడ్డారా

శివ : లేదు..

మీనాక్షి : అలా ఏం లేదు.. అని లేచి శివ పక్కన కూర్చుంది.. మౌనంగా

శివ కొంత సేపు మీనాక్షి కళ్ళలోకి చూసి నుదిటి మీద ముద్దు పెట్టుకుని లేచి కార్ కీస్ తీసుకుని నేరుగా సందీప్ కొత్తగా కాపురం ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.

శ్రావణి : రా శివా.. అందరూ ఎలా ఉన్నారు, మీనాక్షి రాలేదా

శివ : బాగున్నారు.. అన్నయ్య ఎలా ఉన్నాడు.. నేను ఈ మధ్య ఆఫీస్ కి వెళ్లట్లేదు.

శ్రావణి : ఉండు కాఫీ తెస్తాను

శివ : లేదు ఇప్పుడేం వద్దు.. సందీప్ ని పిలువు

శివ మౌనంగా గొంతు తగ్గించి మాట్లాడేసరికి ఏదో జరిగిందని గ్రహించి వెంటనే పడుకున్న సందీప్ ని లేపి తను గమనించిన విషయం సందీప్ కి చెప్పింది.. సందీప్ లేచి బైటికి వచ్చాడు.

శివ : అలా బైటికి వెళదామా

ఇలా శివ ఎప్పుడు అడగలేదు.. ఏం ఆలోచించకుండా బైటికి వచ్చి శివతో పాటు కార్ ఎక్కి కూర్చున్నాడు. శివ ఊరి అవతల చెరువు దెగ్గరికి వెళ్లి.. తను ఉన్న చోటకి ఎవ్వరిని పంపించవద్దని సెక్యూరిటీకి డబ్బిచ్చి పంపించాడు.. వెళ్లి అక్కడ బెంచి ఒకటి ఉంటే కూర్చున్నాడు.. చాలా సేపయ్యింది కాని శివ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడంతో సందీప్ చొరవ తీసుకుని కదిలించాడు ఏం జరిగిందని.

శివ : మీనాక్షి ప్రెగ్నన్సీ తీయించేద్దాం అనుకుంటున్నాను

సందీప్ : ఏంటి.. ఎందుకు.. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందనీ.. ఇంతకీ మీనాక్షి ఏమంది.. తను ఒప్పుకుందా

శివ : లేదు తనకి తెలిస్తే ఒప్పుకోదు అంటూనే ఏడ్చేసాడు

సందీప్ దెగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఎందుకురా ఇదంతా.. దీని వల్లేనా నువ్వు ఆఫీస్ కి రావట్లేదు.

శివ : బిడ్డ వల్ల తల్లికి ప్రమాదమని అటు డాక్టర్లు ఇటు సిద్ధాంతులు ఇద్దరు చెపుతున్నారు.

సందీప్ : ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్

శివ : తెలీదు.. నువ్వు వెళ్ళిపో, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు.. నాకోసం కార్ పంపించు.. అని ఒక్కడే కింద పడ్డ రాళ్లు తీసుకుని నీళ్లలో విసిరేస్తూ ఆలోచిస్తుంటే కొంత సేపు చూసి సందీప్ అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు, ఇంటి నుంచి బైట నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినా ఎత్తలేదు. మీనాక్షి దెగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. చివరిగా ఒక నిర్ణయానికి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అబోర్షన్ టాబ్లెట్స్ తో ఇంటికి వెళ్ళాడు.

No comments please
Like Reply
#49
48     


శివ ఇంటికి వెళ్లి ఏం మాట్లాడకుండా కొంత సేపు సోఫాలో కూర్చున్నాడు, మీనాక్షి అది గమనించింది కానీ రూంలో నుంచి బైటికి రాలేదు. కొంతసేపు కూర్చుని లేచి మీనాక్షి దెగ్గరికి వెళ్లి టాబ్లెట్స్ తన పక్కన పెట్టి లేచాడు.

మీనాక్షి : ఏంటివి (కొంత గట్టిగానే అడిగింది)

శివ : నీకు అంతా తెలుసని నాకు తెలుసు, అవేంటో కూడా నీకు తెలుసు అని బైటికి వస్తుండగానే మీనాక్షి కోపంగా పక్కనే ఉన్న ఫోన్ విసిరి కొట్టింది. ఇంట్లో ఉన్న అందరూ బైటికి వచ్చారు.

మీనాక్షి : నువ్వు ఏమనుకుంటున్నావో అది నా ఖంఠంలో ప్రాణం ఉండగా జరగదు.. అని ఆ టాబ్లెట్స్ ని శివ మొహం మీదకి విసిరింది.

కావేరి : శివా.. మీనాక్షి.. ఏం జరుగుతుంది..

మీనాక్షి : మీ అబ్బాయినే అడగండి

అందరూ శివ వైపు చూసారు.. శివ వెళ్లి మీనాక్షి చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూసాడు. మీనాక్షి శివని చూస్తూనే తన కళ్ళలోనుంచి నీళ్లు జలజలా రాలిపోయాయి.. గట్టిగా శివని వాటేసుకుని ఏడ్చేసరికి శివ కూడా ఏడుస్తూ మీనాక్షిని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ కంగారుపడి ఇద్దరి చుట్టు చేరారు.

రజిత : మీను.. ఏమైంది తల్లి..

చందు : అక్కా.. బావా.. ఏమైంది..

గగన్ చూస్తూ ఉండిపోయాడు.. కావేరి శివ చెయ్యి పట్టుకుని అడిగింది..

శివ : బిడ్డ పుట్టడంతోనే మీనాక్షి చచ్చిపోతుందట అని చెప్తూ చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు,  కావేరిని కౌగిలించుకుని.

అందరికి ఏం మాట్లాడాలో తెలీలేదు, చందు అయితే ఏడ్చేసాడు. కావేరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు షాక్ అయిపోయింది.. గగన్ శివని చూసి మాట్లాడాడు

గగన్ : ఎంతో మంది సిద్ధాంతులు ఉన్నారు చూపిద్దాం, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు.. పూజలు యాగాలు చేపిద్దాం..

శివ : అన్ని కనుక్కున్నాను.. డాక్టర్స్ ని కూడా కలిసాను.. మీనాక్షి పొట్ట మీద ఒక గాటు ఉంటుంది అది కేవలం పైకి మాత్రమే కాదు లోపల కూడా ఉంది అక్కడ ఏర్పడ్డ కండరం వల్ల బిడ్డని బైటికి తీయడం చాలా కష్టం అని.. నొప్పులు మొదలవ్వకుండానే బైటికి చీల్చుకు రావచ్చని చెపుతున్నారు.. వాళ్ళు కూడా బిడ్డని లోపల నుంచే చ..

మీనాక్షి : శివా.. అరిచింది గట్టిగా ఏడుస్తూనే.. పోతే పోతాను అంతే కాని నా బిడ్డని తాకే ప్రయత్నం చేసినా వాడికి హాని తలపెట్టాలని చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు.. వీడు నా బిడ్డ.. నా బిడ్డగానే పుడతాడు.

మళ్ళీ శివ దెగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని గొంతు తగ్గించి మాట్లాడింది.. శివా మీ అమ్మ గారు నీకోసం.. నువ్వు బతికుండడం కోసం నిన్నే వదులుకుంది, ఇంకో అమ్మ నీకోసం అటు అత్తింటి కుటుంబాన్ని ఇటు పుట్టినింటి కుటుంబాన్ని వదులుకుంది. అలాంటి ఇద్దరు గొప్ప వాళ్ళకి కోడలిని అయిన నేను.. నేను బతికుండడం కోసం నా బిడ్డని చంపుకుంటానా

రజిత : మీను.. ఇందులో తప్పేముంది.. ఎంతో మందికి ఇలా పిండం ముందుగానే చచ్చిపోతుంది.. ఇవ్వాళా రేపు ఎంత మంది అబార్షన్ చేపించుకోవడం లేదు.. మళ్ళీ కనవా మళ్ళీ పుట్టడా

శివ : అవును మీనాక్షి.. నాకు వాడు చెప్పాడు మనకి మళ్ళీ కొడుకే పుడతాడు..

మీనాక్షి : మళ్ళీ వాడే పుడతాడని చెప్పాడా

శివ మౌనంగా ఉండిపోయాడు.

మీనాక్షి : నాకు నా అరణ్య మళ్ళీ పుడతాడని వాడితో చెప్పించు.. మళ్ళీ వాడే పుడతాడని మాట ఇవ్వమను.. నువ్వు చెప్పింది చేస్తాను

శివ మీనాక్షిని ఒప్పించలేక కింద కూలబడిపోయాడు.. అక్కడ మీనాక్షి మాట్లాడుతుంది ఎవ్వరికి అర్ధం కాకపోయినా, అందరూ బాధ అయితే పడుతున్నారు. మీనాక్షి వెళ్లి పక్కన కూర్చుని ఏడుస్తున్న శివ తల ఎత్తింది.

మీనాక్షి : శివా.. వాడిని నాకు దూరం చెయ్యాలన్న ఆలోచన నువ్వు ఎలా చేసావు.. నీకు బాధగా లేదా

శివ : వాడంటే నాకు కూడా ప్రాణమే కానీ నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను మీను.. అరణ్య చెప్పినట్టు మధ్యలోనే వచ్చాడు మధ్యలోనే.. అంటుండగానే మీనాక్షి శివ నోరు మూసేసింది.

మీనాక్షి : ఇందాక నువ్వు చెప్పావే.. నా కడుపు మీద గాటు.. అదెలా ఏర్పడిందో తెలుసా.. అరణ్య నిన్ను కోమా లోనుంచి లేపడం వల్ల.. ఇవన్నీ వాడికి ముందే తెలుసు కాని తెలిసి కూడా నిన్ను కాపాడుకోలేదా.. నువ్వు మాత్రం ఎందుకు ఇంత స్వార్ధంగా ఆలోచిస్తున్నావు.

శివ : నాకు అవన్నీ తెలీదు, నాకు నువ్వు క్షేమంగా ఉంటే అదే చాలు.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ చిన్న పిల్లాడిలా మారం చేసాడు.

అందరూ మీనాక్షి శివలు మాట్లాడుకుంటుంటే పరిష్కారం కూడా వాళ్ళే తెలుసుకుంటారు, ఏ విషయం వాళ్ళే తెల్చుకుంటారని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కోప్పడింది, బతిమాలింది, ఏడ్చింది.. కాని మొత్తానికి మీనాక్షి తన మాటే నెగ్గించుకుంది, ఆ రోజు ఎవరూ ఇంట్లో ముద్ద ముట్టలేదు.. శివ మాత్రం మీనాక్షిని తీసుకుని బైటికి తీసుకెళ్లి ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసాడు.. మీనాక్షి ఒప్పుకోకపోవడమే కాకా ఆ రోజు నుంచి మంచినీళ్లు కూడా తాగడం మానేసింది. తను తినకపోయినా అరణ్య చూసుకుంటాడని మీనాక్షికి తెలుసు, అరణ్యకి చెప్పింది చూసుకోమ్మని.. అరణ్యకి అమ్మ చెప్పింది చెయ్యడం తప్ప ఇంకేమి చెయ్యలేకపోయాడు.

రోజులు గడుస్తున్నాయి కాని అందరూ మౌనంగానే ఉంటున్నారు.. మీనాక్షి ఎవ్వరి మాట వినిపించుకోలేదు. ఈ విషయం రజిత ద్వారా రాజేశ్వరికి ఆ తరవాత సుశాంత్ కి తెలిసింది అది వెంటనే ప్రదీప్ కి చేరవేసాడు.

సుశాంత్ : వాడు ఇప్పుడు ఏ విషయం పట్టించుకునే స్థితిలో లేడు ఇదే రైట్ టైం.. ఏమంటావ్

ప్రదీప్ : అవును ఇంకో ఇరవై రోజుల్లో నా ప్లాన్, మనుషులు అన్నీ రెడీ అవుతాయి.. అప్పటి వరకు మానకొక వీక్ పాయింట్ కావలి.. ఆ శివ గాడి పక్కన ఎప్పుడు ఒకడుంటాడు సందీప్ వాడికి కూడా పెళ్ళైంది కదా వాడిని ఎత్తుకు రావాలి అది వాడికి డౌట్ రాకుండా

సుశాంత్ : వాడి మీద కూడా నాకు ఎప్పటి నుంచో ఉంది అలాగే అని మిగతా విషయాలు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసి సంతోషంతో పిచ్చి పిచ్చిగా ఎంజాయి చేసాడు.

వారం రోజులు ముభావంగా గడిచింది.. ఇంట్లో వాళ్లందరిని బాదించడం ఇష్టం లేక మీనాక్షి మళ్ళీ మాములుగా అయిపోయింది, శివని కూడా అటు ఓదార్చుతూ ఏదైతే అదే అవుతుందన్న మాట మళ్ళీ మళ్ళీ చెపుతూ వీలైనంతగా మొత్తం శివతో తిరుగుతూ గడుపుతుంది. కస్తూరి కూతురు నవ్వులని చూస్తూ శివ ఆలోచనలని మాన్పించే ప్రయత్నం చేసింది.. శివ కూడా పిల్ల ముఖం తన నవ్వు చూడగానే అన్ని మర్చిపోయేవాడు.. కాని మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బాధ పడేవాడు.. అస్సలు ఆఫీస్ కి వెళ్లడం మానేశాడు పనులన్నీ సందీప్ చూసుకుంటున్నాడు. పెద్ద విషయాలు కూడా శివ పట్టించుకోవట్లేదు సందీప్ కూడా అన్ని తానై చూసుకుంటున్నాడు.

మీనాక్షి తొమ్మిది నెలలు పూర్తి చేసుకుంది, ఇంతవరకు అరణ్య బైటికి వచ్చే జాడ కనిపించడం లేదు.. డాక్టర్లు కూడా ఏమి తెల్చాలేక చేతులు ఎత్తేశారు, ఇన్ని రోజులు మీనాక్షి నిద్ర పోయాక శివ ఎంత ప్రయత్నించినా అరణ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీనాక్షి కూడా అరణ్య మాటలు లేకపోవడంతో రోజు రోజుకి ధైర్యం కోల్పోతుంది అది శివకి తనకి ఇద్దరికీ మంచిది కాదని తనకి అనిపించింది.

అదే రోజు రాత్రి..

సుశాంత్ : నేనంతా సిద్ధం చేసాను.. మీ మనుషులు కూడా వచ్చేసారు ఇప్పుడే కలిసాను..

ప్రదీప్ : ఎటాక్ ఇక్కడ కాదు నేను మొత్తం మార్చేసాను

సుశాంత్ : అదేంటి

ప్రదీప్ : అవును నువ్వే చూద్దువు.. సప్రైస్.. ఇక్కడంతా రెడీ నువ్వు మొదలుపెట్టు

సుశాంత్ : అలాగే అని ఫోన్ పెట్టేసి ప్రదీప్ మనుషులకి సైగ చేసాడు.

పొద్దు పొద్దున్నే లేచి జాగ్గింగ్ కి వెళుతున్న సందీప్ ని రెండు వాన్లతో వచ్చి చుట్టూముట్టారు, సందీప్ కి జేబు లోనుంచి గన్ తీసే అవకాశం కూడా ఇవ్వలేదు వెంటనే కట్టేసి ఎత్తుకు పోయారు.. అరగంటలో శ్రావణికి ఫోన్ చేసారు.. సుశాంత్ ద్వారా ఏమి చెప్పాలో ఏమి చెయ్యాలో వేరే వాడి ద్వారా చెప్పించి సుశాంత్ పేరు బైటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు.

మీనాక్షి తెల్లారే లేచింది.. ఎందుకో ఇవ్వాలంతా తన మనస్సు ప్రశాంతంగా అనిపించింది.

మీనాక్షి : బుజ్జి.. అరణ్య.. ఇక చాలు నాన్నా.. నీ మాటలు వినకుండా నేను ఉండలేను.. మాట్లాడరా బంగారు.. ఇవ్వాళ అంతా హాయిగా ఉంది కాని ఏదో భయంగా ఉంది.. నీ మాటలు నాకు తోడుంటే చాలా ధైర్యంగా ఉంటుంది.

అరణ్య ఏమి మాట్లాడలేదు..

మీనాక్షి : అలిగావా బుజ్జులు.. నా బుజ్జి కదా.. నిన్ను నా చేతులతో ఎలా నాన్నా.. ఏ తల్లి అలా చెయ్యలేదు చిన్నోడా.. ఒకానొక సమయం దెగ్గర నుంచి నువ్వే నా సర్వస్వం అనుకున్నాను తెలుసా.. నాన్నని దాటి తనకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను.. అలక మాని నాతో మాట్లాడరా బుజ్జి..

అరణ్య : లవ్ యు అమ్మా

మీనాక్షి : అదీ.. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది.. బైట చూడు ఎవరివో తెలిసిన వారి మాటలలా ఉన్నాయి, అని లేచింది.

అరణ్య : ఒక మాట

మీనాక్షి : చెప్పు బుజ్జి

అరణ్య : ఇవ్వాళ నేను పుడుతున్నాను..

మీనాక్షి : బుజ్జి.. నిజంగా.. వావ్.. అని ఆనందంలో పిచ్చిది అయిపోయింది.. అరణ్య.. బుజ్జి.. నిన్ను చూడాలని నిన్ను నా చేతులతో ఎత్తుకోవాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక.. చందు మామ అయితే నిన్ను మొట్ట మొదటిసారి తనే ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు.

అరణ్య : అన్నీ మర్చిపోయావా

మీనాక్షి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.. అన్నీ నెమరు వేసుకుంది.. మెల్లగా మంచం కోడు పట్టుకుని కూర్చుంది.

మీనాక్షి : అంటే ఈ రోజే నేను కూడా..

అరణ్య : అవును..

మీనాక్షి : మరేం పరవాలేదు.. నాకేం బాధ లేదు.. కానీ ఒక్క విషయం.. ఈ విషయం నాన్నకి చెప్పకు.

అరణ్య : ఉమ్.. అన్నాడు అంతే

మీనాక్షి : బాధ పడుతున్నావా

అరణ్య : లేదు నేను ఇప్పటి వరకు దేనికి బాధపడలేదు, నేను బాధపడితే నువ్వు ఆ నెప్పి తట్టుకోలేవు

మీనాక్షి : నా కోసం బాధని కూడా దిగమింగుకుంటున్నావా బుజ్జులు.. నీ లాంటి కొడుకుని కన్న నా జన్మ ధన్యం.. చాలా సంతోషంగా ఉంది.. కానీ భయంగా ఉంది బుజ్జి.. నేను లేకుండా నువ్వు ఎలా.. అయినా నీకు శక్తులు ఉన్నాయిగా నాకు పెద్దగా బెంగ లేదు.. నిన్ను చూసే అవకాశం నాకు కలుగుతుందా బుజ్జి.. కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.

అరణ్య ఏమి మాట్లాడలేదు..

మీనాక్షి : బుజ్జి నొప్పిగా ఉంది.. బాధ పడుతున్నావా.. నిన్ను ఇంకేమి అడగనులే.. ఎనివే ఇవ్వాళ నీ బర్తడే కదా.. హ్యాపీ బర్తడే బుజ్జి.. పద ఇవ్వాళ మనం చాలా హ్యాపీగా ఉండాలి, నాన్నకి తెలియకుండా చాలా చెయ్యాలి అని లేచి బాత్రూంలోకి దూరి స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చింది.

శ్రావణి, కస్తూరి కూతురి దెగ్గర కూర్చోవడం చూసి మీనాక్షి వెళ్లి పలకరించింది..

మీనాక్షి : ఏం శ్రావణి.. అస్సలు ఇటు రావడం లేదు, సందీప్ ఎలా ఉన్నాడు తన మొహం చూసి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా.. ఒకసారి వచ్చి కనపడమని చెప్పు.. మొన్న ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసాడు అంతే మళ్ళీ అడ్రెస్ లేడు అని నవ్వింది.

శ్రావణి ముభావంగా నవ్వుతూ పలకరించి మళ్ళీ పిల్లని చూస్తుంది

మీనాక్షి : మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు

శ్రావణి సిగ్గు పడింది

మీనాక్షి వెళ్లి తన కోడలు పక్కన కూర్చుంది, కొంత సేపటికి పాప చిన్నగా కళ్ళు తెరిచి చూసింది..

మీనాక్షి : అమ్ములు తల్లీ.. గుడ్ మార్నింగ్.. నా ముద్దుల తల్లే ఇది అని ముద్దు పెట్టుకుంది.. కస్తూరి.. బుజ్జిది లేచింది పాస్ పోపించు..

శ్రావణి : నేను పోపిస్తాను.. అని ఎత్తుకొగానే పాప ఏడ్చింది.. కస్తూరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది.

మీనాక్షి : అమ్ములు.. మన శ్రావణిరా.. అందుకే అప్పుడప్పుడు వచ్చి మొహాలు చూపించాలనేది అని శ్రావణిని చూసి నవ్వింది.. రెండు నిముషాలు నిన్ను మొదట చూస్తుంది ఆ తరువాత వచ్చేస్తుందిలే అని లేచింది.

శ్రావణి : ఎటైనా వెళుతున్నావా

మేనాక్షి : కొంచెం పని ఉంది.. డ్రాప్ చెయ్యనా

శ్రావణి : లేదు కొంచెం సేపు కూర్చుని వెళతాను

మీనాక్షి బైటికి నడిచి డ్రైవర్ ని కార్ తీయమని వెనకాల కూర్చుంది.

మీనాక్షి : బుజ్జి ముందు కొంచెం తిని ఆ తరవాత కేక్ కట్ చేద్దాం.. నువ్వు నేను కలిసి సెలెబ్రేట్ చేసుకునే మొదటి ఆఖరి బర్తడే కదా.. అని పొట్ట నిమిరింది ప్రేమగా

నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి కొంత జ్యూస్ తాగి అరటిపళ్ళు తిని బైటికి వచ్చి చిన్న రూం ఒకటి బుక్ చేసి డ్రైవర్ తో చిన్న కేక్ తెప్పించి కట్ చేసింది ఆనందంగా..

మీనాక్షి : హ్యాపీ బర్తడే రా బుజ్జి.. నాన్న కూడా ఉండుంటే బాగుండు కాని ఉంటే భరించలేం అబ్బా.. కదిలిస్తే ఏడుస్తాడు.. చూడ్డానికే బలవంతుడు కానీ చాలా సున్నితం తన వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే అస్సలు తట్టుకోలేడు.. నీతో ఇంకా చాలా మాట్లాడాలి బంగారు.. నేను పోయాక.. ఒకవేళ నాన్న నీ మీద కోపం తెచ్చుకుంటాడేమో.. నేను పోయిన బాధని నీ మీద కోపంగా మార్చితే నువ్వు అస్సలు బాధ పడకూడదు.. సరేనా.. నిన్ను చూసుకోడానికి ఎంత మంది ఉన్నారో.. నానమ్మ నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది..

మీనాక్షి ఏవేవో మాట్లాడుకుంటుంటే అరణ్య మౌనంగా వింటున్నాడు ఇంతలో శివ దెగ్గర నుంచి ఫోన్ వచ్చింది.

శివ : మీనాక్షి ఎక్కడా

మీనాక్షి : ఊరికే కొంచెం గాలి కోసం బైటికి వచ్చాను, వస్తున్నాను.

శివ : అమ్ములు కనిపించటం లేదు

మీనాక్షి  బైటికి నడుస్తూనే బిల్ పే చేయ్యమని డ్రైవర్ కి చెపుతూ బైటికి వచ్చేసింది కారు ఎక్కుతూ అదేంటి.. అదెక్కడికి పోద్ది..

శివ : ఇందాక శ్రావణి ఎత్తుకుందట.. ఆడిస్తానని అటు ఇటు తిరుగుతుంటే పట్టించుకోలేదట..

మీనాక్షి : ఎటైనా తీసుకెళ్లి ఉంటుంది.. కంగారు పడకండి.. తనకి ఫోన్ చెయ్యండని కొంచెం కంగారు గానే చెప్పింది.

శివ : నేను ఫోన్ చేసాను స్విచ్ ఆఫ్ వస్తుంది, సందీప్ ఫోన్ కూడా కావట్లేదు ఎంగేజ్ వస్తుంది. వీడు ఎక్కడున్నాడో.. ఇవ్వాళ ఆఫీస్ కి కూడా రాలేదట.

మీనాక్షి : నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికి వచ్చేసింది..

అందరి మొహాల్లో కంగారు.. భరత్ కూడా ఇక్కడే ఉన్నాడు. మీనాక్షి వెళ్లి కస్తూరి పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుంది..

మీనాక్షి : కస్తూరి.. కంగారు పడకు.. మన శ్రావణినే కదా తీసుకెళ్ళింది.

కస్తూరి : లేదు వదినా.. వెతకడానికి అన్నయ్యతో పాటు అందరూ వెళ్లారు.. కంగారు ఏమి లేదు.. నెలల పిల్ల కదా.. ఇప్పటికే అది కనిపించక రెండు గంటలు అవుతుంది.. పాలకి ఏడుస్తుందేమో అని బైటకి అలా అనేసింది కానీ కస్తూరి చేతులు వణకడం చూసి మీనాక్షికి కూడా భయం పట్టుకుంది..


*   *   *   *   *   *


శివ కోడలిని ఎత్తుకొచ్చిన శ్రావణి నేరుగా సుశాంత్ దెగ్గరికి వెళ్ళింది బైట తన మనుషులు ఆపారు..

శ్రావణి : మీకు కావాల్సిన పాపని తీసుకొచ్చాను.. ప్లీజ్ మీ కాళ్లు పట్టుకుంటాను సందీప్ ని వదిలెయ్యండి.

సుశాంత్ మనుషులు లోపాలకి ఫోన్ కొట్టారు.

గోడౌన్ లో సీలింగ్ కి వేలాడదీసిన సందీప్ తో బాక్సింగ్ ఆడుతూ ఫోన్ వచ్చేసరికి ఆగి సందీప్ ని నవ్వుతూ చూసాడు.. సందీప్ రెండు కాళ్లు విరిచేసారు.. అది వీడియో తీసి శ్రావణికి పంపించే తనని లొంగదీసుకున్నారు.

సందీప్ : ఏరా.. అసాధ్యం.. అమోఘం అని ఏదేదో కూసావ్.. నీ పెళ్ళాం చూడు ఎలా తీసుకొచ్చిందో నా పార్సెల్ ని.. భయపడకు నేను చిన్న పిల్లలని చంపను.. ఆ పాపం నాకొద్ధు.. కానీ నీ పెళ్ళాన్ని మాత్రం విడిచి పెట్టను.. నన్ను కొడతావ్ రా నా కొడకా నువ్వు.. నువ్వెంత నీ బతుకేంత.. బస్తీ జనాలు బస్తీలోనే ఉండాలి కాదని ఇలా ఒక్కసారిగా కోట్లల్లో ఎదిగితే జీవితాలు ఇలాగే తగల బడతాయి.. పాపం నీ భార్య.. నా గురించి నిజం తెలియకపోయి ఉంటే వదిలేసే వాడిని కానీ ఈ సాక్ష్యాలు ఉన్నాయే చాలా పవర్ ఫుల్ అందుకే తప్పట్లేదు అని సందీప్ మొహం దెగ్గరికి వచ్చి నవ్వాడు.

సందీప్ కోపంగా చూస్తూ తన నోటి నుంచి కారుతున్న రక్తం మొత్తం తీసుకుని సుశాంత్ మొహం మీద తుపుక్కుమని ఉమ్మాడు..

సందీప్ : చేతగాని నా కొడకా.. పిల్లల్ని ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని పగ సాధిస్తున్నావ్.. ఆడంగి నా కొడకా

సుశాంత్ : నా కొడకా.. నీకింకా మదం తగ్గలేదు.. ఇదంతా వాడిని చూసుకునే కదా.. ఇవ్వాల్టితో వాడు కూడా చస్తాడు.

ఇంతలో శ్రావణి ఏడుస్తూ పాపతో లోపలికి వచ్చింది.. గాల్లో వేలాడుతున్న సందీప్ ని చూసి ఏడుస్తూ దెగ్గరికి వస్తుంటే సందీప్ ఆపేసాడు.

సందీప్ : అక్కడే ఆగిపో.. నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు

శ్రావణి : నేను ఇదంతా చేసింది నీ కోసమే

సందీప్ : ఇదంతా నీ స్వార్ధం.. నడి రోడ్డు మీద కనీసం మీ అమ్మ దేహాన్ని చూడలేని స్థితిలో ఉన్న మిమ్మల్ని చేరదీసిన దేవుడికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ప్రయాశ్చిత్తం లేని పాపం చేసావు.. నీకు ఇవ్వాళ ఉన్న చదువు, పేరు, బట్ట, తిండి ఆఖరికి నేను కూడా వాడు పెట్టిన భిక్ష.. వాడికి ద్రోహం చెయ్యాలని ఎలా అనిపించింది నీకు.. పాప వాళ్ల చేతిలోకి వెళితే శివని ఎలా ఆడిస్తారో.. శివని ఏం చేస్తారో నీకు తెలీదా.. నీకు ప్రతీ ఒక్క విషయం చెపుతూనే ఉన్నాను కదా.. అన్ని తెలిసే చేసావు.. నువ్వు వాడిని మాత్రమే కాదు నా నమ్మకాన్ని కూడా కోల్పోయావు..


*   *   *   *   *   *
Like Reply
#50
49    


*   *   *   *   *   *

కొంత సేపటికి శివ వాళ్ళు వచ్చారు.. కస్తూరి లేచి పరిగెత్తింది బండి సౌండు విని..


కస్తూరి : అన్నయ్య.. అది ఏదీ..

శివ : కంగారు పడకు.. కనిపించలేదు..

కస్తూరి : మావయ్యా.. అని గగన్ ని చూసింది.

గగన్ : శివా.. సందీప్ ఇవ్వాళ ఆఫీస్ కి కూడా రాలేదట.. శ్రావణి ఇంటికి కూడా వెళ్ళలేదు.

శివ భరత్ వైపు చూసాడు.

భరత్ : నాకు ఏమి అర్ధం కాకుండా ఉంది శివా.. మా ఇంటికి కూడా రాలేదని చెల్లి ఫోన్ చేసింది. నేనూ చెల్లితో తన ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి పంపించాను కానీ నొ రెస్పాన్స్.

మీనాక్షి : బుజ్జి.. ఏంటిదంతా..

ఇంతలో శివకి ఫోన్ వచ్చింది.. ఎత్తాడు

శివ : హలో

ప్రదీప్ : హలో.. శివా.. ఎలా ఉన్నావ్

శివ : ఎవరు?

ప్రదీప్ : ప్రతాప్ గుర్తున్నాడా

శివ : ప్రదీప్..

ప్రదీప్ : ఇంత టెన్షన్ లో కూడా నీ మైండ్ బాగా పనిచేస్తుంది.. యు ఆర్ గ్రేట్.. ఇంతకీ మీ ఇంట్లో ఎవరో కనిపించడం లేదని కబురొచ్చింది..

శివ : ఇది నీ పనే అని నాకు తెలిసిన గంటలో నీ తల నా ఇంటి గుమ్మానికి వేలాడదీస్తాను.. కోపంగా అరిచేసరికి అందరూ శివ చుట్టు నిలుచున్నారు

ప్రదీప్ : అవును ఎత్తుకొచ్చింది నేనే, ఏం చేస్తావ్.. అయినా నువ్వు నన్ను గంటలో చంపలేవు నేను ఇండియాలో లేను.. ఇక్కడుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు.. అందుకే మకాం కొలంబియాకి మార్చాను

శివ : ఏం కావాలి నీకు

ప్రదీప్ : నేనే నీకొక గిఫ్ట్ పంపించాను మీ ఇంటి బైట ఉంది చూడు అని కాల్ కట్ చెయ్యగానే శివ బైటికి పరిగెత్తాడు.

శివ వెనకే అందరూ వెళ్లారు.. గేట్ ముందు రెండు శవపేటికలు ఉన్నాయి, ఇంటి సెక్యూరిటీ వాటి దెగ్గరికి వెళుతుంటే శివ కూడా వెళ్లి ఓపెన్ చేసాడు.. మొదటి దాంట్లో సందీప్ ని చూసేసరికి ఏడుపు ఆగలేదు.. వాడిని పట్టుకుని ఏడుస్తూనే సెక్యూరిటీ ఇంకో పెట్టెని తెరిచి అందులో శ్రావణి ఉండటం చూసి బాధ పడ్డాడు.

శివ ఫోన్ మళ్ళీ మోగింది..

ప్రదీప్ : ఎలా ఉంది గిఫ్ట్.. బాగుందా.. ఇంకా అయిపోలేదు.. ఇక్కడ ఈ చిన్నది పాల కోసం ఒకటే ఏడుపు.. మా వాళ్ళు ఫ్లైట్లో తీసుకొస్తున్నారు.. నువ్వే బాలన్స్ వస్తున్నావా లేదా

శివ : వస్తున్నాను..

ప్రదీప్ : చనిపోయిన నా తమ్ముడి మీద ఒట్టు..  నువ్వు వస్తే పాపని నేను తాకను కూడా తాకను.. ఐ స్వేర్.. ఇంతకీ ఈ ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా నీ శత్రువు సుశాంత్.. అని నవ్వాడు.

శివ : (కోపం బాధ ఆగబట్టుకుంటూ ) వస్తున్నాను..

ప్రదీప్ : ఆ.. ఆ.. ఒక్కడివే కాదు.. నీ భార్య మీనాక్షిని కూడా తీసుకురా అని శివకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు.

శివ ఎదురుగా ప్రదీప్ మనుషులు నిలుచొని ఉన్నారు.. శివ కస్తూరి దెగ్గరికి వెళ్లి తల మీద చెయ్యి వేసి.. అమ్ములు ప్రాణానికి నా ప్రాణం అడ్డు.. తనకి ఏమి కాదని మాటిస్తున్నాను అని అందరినీ చూసి మీనాక్షిని చూసి చెయ్యి చాపాడు.. మీనాక్షి ఏడుస్తూ శివ చెయ్యి పట్టుకుంది..  ఇద్దరు వెళ్లి ప్రదీప్ పంపించిన కార్ ఎక్కి కూర్చున్నారు.

కారు నేరుగా ఎయిర్పోర్ట్ వైపు కాకుండా మూసేసిన ఒక పాత రన్ వే వైపు వెళ్లి ఆగింది, అక్కడ ఒక ప్లేన్ రెడీగా ఉంది చుట్టు ఇరవై మంది కాపలా ఉన్నారు. అంతా ఫారినర్స్.. వెళ్లి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు.

మీనాక్షి ఏడుస్తూ శివ భుజం మీద వాలిపోయింది. శివ ధైర్యంగా మీనాక్షి చెయ్యి పట్టుకుని ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చెపుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని పడుకొమ్మని తలని తన గుండె మీద పెట్టుకున్నాడు.

మీనాక్షి : బుజ్జి మాట్లాడట్లేదు

శివ : అరణ్య అస్సలు మనతో మాట్లాడడం లేదు కదా, నీకు మాట ఇచ్చాడు కదా

మీనాక్షి : లేదు పొద్దున ఆ మాటని తీసుకుని బుజ్జిని బతిమిలాడితే మాట్లాడాడు.. కానీ ఇందాకటి నుంచి ఏం మాట్లాడడం లేదు.

శివ : ఇవ్వాళ పౌర్ణమి.. తన శక్తులు పని చేయవని చెప్పాడు.

మీనాక్షి ఏడుస్తూనే కళ్ళు మూసుకుని పొద్దున్న అరణ్య మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి మౌనంగా కళ్ళు మూసుకుంది.

ఫ్లైట్ స్టార్ట్ అయ్యి రన్ వే మీద పరిగెడుతుంది.. శివ ఆలోచనలు కూడా అదే వేగంతో పరిగెడుతున్నాయి.. సందీప్ జ్ఞాపకాలు కూడా.. కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

సడన్ గా మెలుకువ వచ్చి చూసేసరికి శివ కళ్ళు తెరిచాడు, మీనాక్షి కూడా లేచింది.. పెద్ద పెద్ద శబ్దాలు.. ఫ్లైట్  దక్షిణ అమెరికా సరిహద్ధులు దాటి అమెజాన్ అడవుల మీదగా వెళుతుండగా అన్ని ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద శబ్దాలకి మీనాక్షి భయపడి శివ చేతిని గట్టిగా పట్టుకుంది.

లోపల కూర్చున్న ఎవ్వరికి ఏం జరుగుతుందో ఏమి అర్ధం కాలేదు, ఒక్కసారిగా అన్ని శబ్దాలు ఆగిపోయాయి.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. సడన్ గా ఏదో శక్తి.. శక్తి కాదది, పెద్ద మంట ఒకటి ఆగకుండా ఫ్లైట్ మీద పడి దాన్ని పేల్చేస్తూ సరిగ్గా మీనాక్షి కడుపు మీద పడింది. ఆ భాస్మపు మంటకి, ఆ వేడికి అప్పటికే అందులో ఉన్న అందరూ చనిపోయారు శివ, మీనాక్షిలతో సహా.. కానీ అరణ్య మాత్రం లోపలే ఉన్నాడు.

గత కొన్ని రోజులుగా అరణ్య తన అమ్మ కడుపులో నుంచి బైటికి వస్తే ఎక్కడ తను చనిపోతుందో అని వీలైనన్ని రోజులు లోపలే ఉండాలని తన శక్తులన్నీ ఏకం చేసి మీనాక్షి కడుపులోనే ఉండిపోయాడు.. కానీ ఇప్పుడు ఆ మంట ఆగకుండా అరణ్య మీద పడేసరికి ఆ శక్తికి తట్టుకోలేక ఒక్కరిగా పొట్ట చీల్చుకుని బైటికి వచ్చేసాడు.. ఫ్లైట్ నేల కూలుతుంది.. అరణ్య ఇంకా గాల్లోనే మంటతో పాటు దూరంగా విసిరి వేయబడ్డాడు.. ఇంకా కళ్ళు తెరవలేదు.. తనలో చలనం లేదు.. ఇంతలోనే ఒక పెద్ద శబ్దం అరణ్య చెవుల్లో మారు మ్రోగుతుంది.. శంఖపు శబ్దం అది.. దేవుళ్ళు తప్ప ఇంకెవ్వరు అంత గట్టిగా ఊదలేనటువంటి శబ్దం.  భూమి మొత్తం కంపించింది ఆ శబ్దానికి..

సరిగ్గా ఇంకో ఇరవై అడుగుల్లో కింద పడిపోతాడనగా అరణ్యలో చలనం వచ్చింది, కళ్ళు తెరవలేదు కానీ.. తను పడే చోట ఒక పెద్ద కమలం విచ్చుకుని ఆ మెత్తని రెక్కలలో అరణ్య పడిపోయాడు.. బిడ్డ మీదకి ఎండ పడకుండా ఆ కమలం తన రెప్పలని మూసేసింది.. ఆ అడవిలోని ఆ ప్రాంతం మొత్తం చెట్లతో వెలుగుని కప్పేసి భయంకరమైన చీకటితో చీమ కూడా దూరలేనంత దట్టంగా చెట్లతో చీకటితో అలుముకుపోయింది.

అరణ్య ముడుచుకుని పడుకుండిపోయాడు కానీ తన కళ్ళు ఇంకా మూసుకుపోయే ఉన్నాయి.. తన కంట్లో నుంచి కన్నీటి ధార కారుతూనే ఉంది...

❤️❤️❤️
❤️
Like Reply
#51
Namaskar    THANKYOU    Namaskar

ఇంతటితో అరణ్య ఆగమన అధ్యాయం ముగిసినది

ఇక అరణ్య-అరణ్య అను చివరి అధ్యాయం త్వరలో మొదలవుతుంది

కథ అందరికి నచ్చిందని ఆశిస్తూ...
నా కధని చదివి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు
~ takulsajal
(టక్కులసాజల్)

PLEASE AVOID COMMENTS IN THIS THREAD
ANY COMMENT PLEASE POST IN MY OTHER THREADS OR ARANYA COMMENTS THREAD BY PRINCE.
THANKYOU ONCE AGAIN
Like Reply
#52
అరణ్య
PART 2
[+] 5 users Like Pallaki's post
Like Reply
#53
50     

"అమ్ములు తల్లీ...."
"యే... కళ్ళు తెరిచిందీ....నా ముద్దుల తల్లీ ఉమ్మా..."
"ఇంద పాస్ పోపించు"
"వదినా... లేచిందా నీ అమ్ములు, ఇటివ్వు అంతే దిగ్గున నిద్ర లేచి మళ్ళీ తల పట్టుకుంటూ రగ్గు ముసుగేసుకుని పడుకుంది ఇరవై ఏళ్ల అప్సరస, తెల్లని మేని గల అమ్మాయి.

పని మనిషి ఆ అమ్మాయిని లేపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అందంగా అటు ఇటు బొర్లుతుంది. శిల్పానికే ప్రాణం పోస్తే ఇలాగే ఉంటుందా అనే అందం తనది కనిపించకుండా రగ్గుతో కప్పేసింది. పనిమనిషి చిన్నగా లాగుతుంటే ముందు మొహం బైటికి వచ్చింది అందమైన గుండ్రటి ముఖానికి అందమైన నుదురు, సన్నని పొడుగాటి ముక్కు.. వయసుతో పాటు వచ్చిన అందానికి గుర్తుగా నవ్వినప్పుడు ఎరుపెక్కే బుగ్గలు, పని మనిషి మాట విననంటూ కళ్ళు తెరిచి మూసుకుంది. ఆ నల్లని కళ్ళు చూస్తే అందమైన చేప కళ్ళే గుర్తుకొస్తాయి నేరుగా చూసే అవకాశం ఎవ్వరికి దక్కకపోయినా మనిషి లోతులకందని లోకమేలే కళ్ళు అవి. తెరిచి మూసిన కను రెప్పలు కావవి కను తెరలు అనొచ్చేమో. పువ్వులా మెరిసే ఆ పెదవుల శోభకి లొంగనివారు ఉండరు. ఎవ్వరూ కనీసం అందుకోలేని ఆ నలభై ఐదు కేజీల శరీరం ఒక్కసారి ఏ రక్షణా లేకుండా బైటికి వచ్చి ఒక్క క్షణం నిలుచున్నా చాలు ఆ తీయని పెదవుల చుట్టూ ముసిరే తేనెటీగలని ఆపడం ఒక దేశపు సైన్యం వల్ల కూడా కాదు. ఇక ఆ పెదవుల నుంచి వచ్చే ఆ నవ్వు ఆ ఇంటికే వెలుగు. క్రిందున్న ఆ మెడ తన సన్నని శరీర సౌష్టవానికి కనిపించి కనిపించని ఎముకల వరస వల్ల మెడ కింద చిన్న గుంట కూడా అందంగా అమరింది.


అమ్మగారు... అమ్మగారు... లేవండి.. పెద్దమ్మ గారికి మీరింకా లేవలేదని తెలిస్తే నా మీద కోప్పడతారు అని రగ్గు మొత్తం లాగేసింది. నిండా తెల్లని దుస్తులలో దేవకన్యలా నిద్ర మత్తులో మునిగినట్టు నటిస్తూ ఇందాక నిద్రలో వినిపించిన ఆ మాటలని పదే పదే తలుచుకుంటుంది. పనిమనిషి కూడా ఆపకుండా అదే పనిగా విసిగించడంతో కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతూ కసురుకుని లేచి కూర్చుంది.

రజిని : అమ్మాయిగారు రోజు రోజుకి మీ అందం అలా పెరిగిపోతుందమ్మా, మీ అందానికి సరితూగే మగాడు ఉన్నారంటారా

దానికి ఆ అమ్మాయి సిగ్గు పడుతుంటే ఆ మోహంలో నుంచి అందం ఇంకా ఉబికిందా అనిపించింది పనమ్మాయికి. ఇంకొక పొగడ్త మనస్ఫూర్తిగా విసురుతుంటే ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కరెక్ట్ టైంకి వచ్చింది ఆ ఇంటి యజమానురాలు ఉమ.

ఉమ : ఏంటి అరణ్య ఇంకా లేవలేదా, ఎన్ని సార్లు చెప్పాను నీకు పొద్దున్నే లెమ్మని, నిన్ను కాదు ఈ రజిని ని అనాలి, దీన్ని తీసేస్తే కానీ బుద్ధిరాదు.

రజిని : అమ్మ గారు తప్పయిందమ్మా... ఇంకోసారి జరగదు ఈ ఒక్కసారికి క్షమించండి.

ఉమ : వీటికేం తక్కువ లేదు, ఏమన్నా అంటే కాళ్ళ మీద పడతారు సిగ్గులేకుండా... అలగా జనం.. అని నసుగుతూ వెళ్ళిపోయింది.

రజిని మౌనంగా ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేదు, తన స్థానంలో ఇంకెవరున్నా చేసేది అలా మౌనంగా తల దించుకుని ఉండాల్సిందే లేకపోతే వారి జీవితాలు తలకిందులైపోతాయి.

అమ్మాయి మౌనంగా లేచి రజిని భుజం మీద చెయ్యి వేసింది.

రజిని : అమ్మాయిగారు

అరణ్య : క్షమించు రజిని, నా వల్లే..

రజిని : అయ్యో అమ్మగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి... లేవండి పెళ్లి పనులు మొదలెట్టేసారు పంతులుగారు, ఇందాకే వచ్చి మీ పెళ్లి రోజు నిర్ణయించారు ఈ నెల ఇరవైయ్యో తారీకే మీ పెళ్లి... అందుకే పెద్దమ్మగారు హడావిడి చేస్తున్నారు.

లేచి బాత్రూంకి వెళ్లాను, గీజర్ హాట్ వాటర్ వైపు తిప్పి షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకున్నాను ఇందాక నాకొచ్చిన కల కొంచమైనా ముందుకు జరిగి ఇంకొంచెం ఏమైనా తెలుస్తుందేమో అని నా చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నాకొచ్చే ఒకే ఒక కల, ఎవరో ఆడ గొంతు నన్నో కాదో తెలీదు కానీ ప్రేమగా అమ్ములు అని పిలవడం, కొన్ని మాటలు.. అంతే ఇంతకు మించి ఒక్క ముక్క కూడా కల ముందుకు జరగదు. రజిని చెప్పినట్టు ఇరవైయ్యో తారీకు నా పెళ్లి అంటే కరెక్ట్ గా ఇరవై రోజులు మాత్రమే ఉంది, ఈరోజే ఆఖరి పరీక్ష ఇదీ అయిపోతే ఇక కాలేజీ మొహం చూడాల్సిన అవసరం లేదు. నా మొహం అస్సలు నన్ను బైటికి రానిస్తే కదా, ఇవన్నీ తరువాత.

ఎవరో డోర్ కొడుతుంటే షవర్ ఆపాను.

రజిని : అమ్మగారు.. కొంచెం త్వరగా కానివ్వండి మీకు పుణ్యం ఉంటుంది, అవతల పరీక్షకి టైం అవుతుంది.

అరణ్య : వస్తున్నానే పరీక్ష నీకో నాకో అర్ధమే కాదు నాకు. అని తనకి వినిపించేలా అరిచి మళ్ళీ షవర్ ఆన్ చేసాను.

వేడి వేడి నీళ్లు పొగలు కక్కుతూ పొడుగాటి కేశాల నుంచి ఒంటి మీదకి, అటు నుంచి భుజాల మీదగా ఇంకా తన చెయ్యి కూడా పడని ఆ సంపద మీద నుంచి దారులు మళ్ళుతూ కిందకి జారుతూ చివరికి ఒకే చోట కలిసిపోయి కింద పడుతున్న ఆ శబ్దాలని ఆ నీళ్ల స్పర్శని ఆస్వాదిస్తూ ఇష్టం లేకపోయినా త్వరగా స్నానం కానిచ్చేసి బైటికి వచ్చింది అరణ్య.

అరణ్యకి తెల్లని దుస్తులంటే ఇష్టం అది చీర అయినా పంజాబీ డ్రెస్ అయినా చోలి అయినా తెల్లని బట్ట అయితేనే కడుతుంది దాని మీద ఇంకెలాంటి రంగు ఉండటానికి ఇష్టపడదు. బట్ట చేతుల నిండా ఉండాలంటుంది ఒకరకంగా పాత కాలపు జపనీయలు చైనీలు ఒళ్ళు కనపడకుండా నిండుగా ఉండే వస్త్రాలంకరణని అరణ్య బాగా ఇష్టపడుతుంది అందులోనూ తెలుపే అయ్యి ఉండాలి.

రెడీ అయ్యి కిందకి వెళ్లి అందరిని నవ్వుతూ పలకరించి తన అమ్మ ఉమకి చెప్పేసి బైట సెక్యూరిటీతో రెడీగా ఉన్న రోల్స్ రాయిస్ కారుని చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని చూస్తూ కొంత అసహనంగా ఎక్కి కూర్చుంది. రోజూ చూసేదే అయినా తనకి అలవాటే అయినా అరణ్యకి అదేదో దేశ ద్రోహిని నడిపించుకెళ్లినట్టు ఫీల్ అవుతుంది. అరణ్య ఎక్కడికెళ్తే అక్కడికి తన తోకలా వచ్చేస్తారు ఎవ్వరు తనతో మాట్లాడకూడదు తనూ ఎవ్వరితో మాట్లాడకూడదు. ఈ కట్టుబాట్లకి నియమాలకి అరణ్య చిన్నప్పటి నుంచి చూసి చూసి విసుగెత్తిపోయింది.

కారు ఎక్కి కూర్చున్నాను కొంత ప్రశాంతంగా అనిపించింది నేను ఎక్కడుంటే అక్కడ అందరూ నాతో మాట్లాడాలనుకోవడం నన్ను అదే పనిగా చూడటం చేస్తే నేను చాలా ఇబ్బంది పడతాను. అయినా ఇంకెంతలే ఈ ఒక్క రోజు అయితే అయిపోతుంది. ఇక నాకు ఎలాగో పెళ్లి అయిపోతుంది ఎలాగో అప్పుడు అస్సలు నేను ఇక బైటికి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఏంటో ఇరవై ఒకటి పడగానే అమ్మాయికి పెళ్లి చేసెయ్యాలా నా పుట్టిన రోజే నాకు పెళ్లి చేసెయ్యాలి అనుకుంటున్నారు నన్ను ఏంటో.. అనుకుంటూ వెళ్లి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాను.  క్వశ్చన్ పేపర్ ముందు పెట్టారు ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టి పొద్దున వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నాను.

అస్సలు నా చిన్నప్పటి నుంచి నాకు అన్నీ సందేహాలే, నా జీవితానికి సంబంధించిన ఒక్క విషయం కూడా నాకు నచ్చింది లేదు, అన్నిటికి నవ్వుతూ తల వంచుతూనే ఉన్నాను. ఇంతలో అరగంట పూర్తయ్యిందని ఇన్విజిలేటర్ చెప్పగానే దృష్టి పరిక్ష మీద పెట్టాను. త్వరగానే రాసేసి కూర్చున్నాను పరీక్ష అయిపోయిందని చెప్పలేదు చెపితే ఇంటికి తీసుకెళ్లిపోతారు అందుకే రాస్తున్నట్టు నటిస్తూ ఆలోచిస్తున్నాను.

నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చదవు ఇంకోటి సంగీతం ఆ తరవాత పక్షులు. ఇవే నా లోకం కాళీ పేజీ ఒకటి తీసుకుని నా మిత్ర బొమ్మ గీస్తున్నాను. నా పదవ పుట్టిన రోజున ఒకరోజు ఎగురుకుంటూ వచ్చిందీ హంస. అప్పటి నుంచి నాతోనే ఉంది. మిత్ర అని పేరు పెట్టుకున్నాను. నేనంటే తనకి చాలా ఇష్టం. ఆలోచిస్తు బొమ్మ గీస్తుంటే బెల్లు మోగింది రేపటి నుంచి కాలేజీకి కూడా రాలేను ఇవ్వాళ ఎలాగైనా నా స్నేహితులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.

ప్లీజ్ ప్లీజ్ అంటూ తన అరచేతిని కళ్ళకి ఆనించుకుంది, చిన్నప్పుడెప్పుడో జ్యోతిష్యం చెప్పే సాధువు చెప్పాడు అరణ్యకి.. అర చేతిలోనే నీ జీవితం.. జీవిత గమనం ఉందని ఏమి కావాలన్నా దాన్నే అడగమని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అరణ్యకి ఏమి కావాలనిపించినా ఏ బాధ వచ్చినా తన అర చేతిలో ఉన్న గోరింటాకు పెట్టినంత మచ్చని అడుగుతుంటుంది ఇప్పుడు అడిగినట్టు.
Like Reply
#54
52     

ఎగ్జామ్ రాసి బైటికి రాగానే గార్డ్స్ అరణ్య చుట్టూ రక్షణగా నిలబడ్డారు అరణ్య నిరాశగా కారు వైపు కదులుతుంటే మెయిన్ గార్డ్ వచ్చి అరణ్యతో మేడం మీ పెళ్లి అయ్యేంతవరకు నాన్న గారు మీకు ఫ్రీడమ్ ఇవ్వమన్నారు ఇక నుంచి నొ ప్రోటోకాల్స్ కానీ మీకు సెక్యూరిటీగా మాత్రం ఉంటాము అన్నాడు.

ఆ మాటలు వినగానే అరణ్య సంతోషం అంతా ఇంతా కాదు, తన అరచేతి మీదున్న మచ్చని ముద్దు పెట్టుకుని గాల్లోకి ఎగురుతూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ ఎగిరి గంతేసింది.. ఇంతలో తన ఫ్రెండ్స్ రావడంతో సంతోషంతో అటు వెళ్ళబోయి అనుమానంగా ఒకసారి వెనక్కి తిరిగింది, మెయిన్ గార్డ్ నవ్వుతూ వెళ్ళమన్నాడు.. అంతే.. నవ్వుతూ పంజరం నుంచి ఎగిరిపోయే చిలకలా పరిగెత్తుతూ తన స్నేహితుల దెగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తన స్నేహితులయితే ఆశ్చర్యంగా చూసారు. అందరూ ఒక్కసారిగా అరణ్య అని అరిచేసారు.

అరణ్య మాట్లాడుకుందాం అని నవ్వుతూ ముందుకు పరిగెత్తింది, తన వెనకే స్నేహితులు కూడా.. అందరూ వెళ్లి కాంటీన్ లో కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోతుంటే అరణ్య నోరు విప్పింది.

అరణ్య : నా పెళ్లి కుదిరింది, ఇంకో వారంలో పెళ్ళైపోతుంది అందుకే కొంచెం ఫ్రీగా వదిలారు

అమ్మాయి : కంగ్రాట్స్ అరణ్య
అబ్బాయి : కంగ్రాట్స్
అమ్మాయి : ట్రీట్ ఏమైనా ఉందా మళ్ళీ కనిపిస్తావో లేదో
అమ్మాయి : ఎన్ని రోజులు అయ్యిందే ఇలా మాట్లాడుకుని

ఆ పక్కనే ఉన్న కేశవ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అరణ్యనే చూస్తున్నాడు. గత మూడేళ్లుగా కేశవ్ అరణ్యతో మాట్లాడాలని చూస్తున్నాడు ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు, అందరికీ తెలుసు కేశవ్ కి అరణ్య అంటే ఇష్టం అని ఎప్పుడు అరణ్య చుట్టే తిరుగుతుంటాడు, గార్డ్స్ తో ఒకసారి అనవసరంగా దెబ్బలు కూడా తిన్నాడు, అప్పటినుంచి అరణ్య కేశవ్ ని దూరంగా పెడుతుంది. అరణ్య తన పెళ్లి గురించి చెప్పినా కేశవ్ ఇంకా అలానే చూస్తుండడంతో అరణ్యకి కొంచెం విసుగుపుట్టింది.

అరణ్య : కేశవ్.. నువ్వింకా మారలేదా.. అందని చందమామ కోసం ఎందుకు ఇంతలా ఆశపడుతున్నావో నాకు అర్ధం కావట్లేదు, ప్రాణాలు తీసేస్తారు.. ప్లీజ్.. నాకు ఇవ్వక ఇవ్వక ఫ్రీడమ్ ఇచ్చారు దయచేసి దాన్ని చెడగొట్టొద్దు అని చేతులు ఎత్తి దణ్ణం పెట్టి మళ్ళీ దూరం నుంచి తననే గమనిస్తున్న గార్డ్స్ ని చూసి చేతులు దించి నవ్వుతూ ఏం లేదన్నట్టు నటిస్తుంది.

అందరూ కేశవ్ ని కోపంగా చూసారు, ఎందుకంటే అస్సలు కేశవ్ అరణ్య వాళ్ళ గ్రూపులో ఉండేవాడు కాదు, కాలేజీలో కొంచెం లేటుగా జాయిన్ అయ్యాడు. తన వాలకం తన చూపులు అన్నీ అరణ్య మీదే.. అరణ్య కోసమే వాళ్ళ గ్యాంగులో జాయిన్ అయ్యాడని అందరికీ తెలుసు.. అరణ్యకి కూడా తెలుసు కానీ మంచివాడని మంచి ప్రవర్తన కలిగిన వాడని వాళ్లలో కలవనిచ్చారు.

అరణ్య : ప్లీజ్ కేశవ్, వెళ్ళిపో

కేశవ్ : ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అరణ్య, ఆ తరవాత నీకు జీవితంలో కనిపించను, ఈ ఒక్క నిమిషం నా భవిష్యత్తుకి నీ భవిష్యత్తుకి చాలా ముఖ్యమైనది.. ఒక్కటే నిమిషం ఇక కనిపించను అని బతిమిలాడాడు.

కేశవ్ కళ్ళలో నీళ్లు చూసి అరణ్య తన స్నేహితులని చూసింది.. వాళ్ళు అర్ధం చేసుకుని లేచి పక్కకి వెళ్లారు. కేశవ్ వెంటనే అరణ్య చేతులు పట్టుకునేసరికి అరణ్య కంగారు పడిపోయింది.. దూరం నుంచి చూసిన గార్డ్స్ లో ఇద్దరు కోపంగా అరణ్య వైపు కదిలారు.

అరణ్య : కేశవ్ ఏంటిది...?

కేశవ్ : అక్కా... అని ఏడ్చేసాడు

అరణ్య : ఏంటి...?

కేశవ్ : నేను నీ మేనత్త తమ్ముడి కొడుకుని, మీ అమ్మ ఉమాదేవి కాదు తన పేరు కస్తూరి, మీ మావయ్య పేరు శివ అత్తయ్య పేరు మీనాక్షి.. ఈ పేరు గుర్తుపెట్టుకో మీనాక్షి.. నీకు నీ గురించి నిజం తెలియాలంటే మీనాక్షి అనే పేరుని ఎవరికి డౌట్ రాకుండా మీ నాన్న ముందు ఎత్తు.. తరవాత నువ్వే నన్ను కలుస్తావు.. గుర్తుపెట్టుకో మీనాక్షి.. అంటుండగానే కేశవ్ జుట్టు పట్టుకుని లాగి కడుపులో గుద్దాడు ఒకడు. కేశవ్ కింద పడి కడుపు పట్టుకొగానే వెంటనే ఇద్దరు కలిసి ఎక్కడ పడితే అక్కడ తన్నడం మొదలుపెట్టారు.. అరణ్య ఆపబోతే కేశవ్ వద్దని సైగ చేసాడు.. గార్డ్స్ కేశవ్ ని ఈడ్చి అవతల విసిరేశారు.

అరణ్య : ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లి కారు ఎక్కి కూర్చున్నాను, అంతా అయోమయంగా ఉంది, తల పట్టుకున్నాను ఎంత ప్రయత్నించినా కేశవుడి మాటలు మెదడు లోనుంచి పోవడం లేదు. కేశవ నాతో ఇన్ని రోజులు మాట్లాడుకుంది ఈ మాటలా అంటే తను నన్ను ప్రేమించట్లేదా, నన్ను అక్కా అని పిలిచాడు.. తన కంట్లో ఆ కన్నీరు.. ఏది నిజం ఏది అబద్ధం.. నా అమ్మ పేరు కస్తూరి అన్నాడు కానీ మీనాక్షి అనే పేరుని గుర్తుపెట్టుకోమంటున్నాడు.. పైగా ఎవ్వరి దెగ్గరా ఈ పేర్ల గురించి అడగొద్దని చెప్పాడు.. నన్ను ట్రాప్ చెయ్యాలని చూస్తున్నాడా లేదు.. రెండు నిమిషాల్లో తనని పట్టుకుని చంపేస్తారని తెలుసు, అంత తెలివితక్కువ వాడు కాదు కేశవ.

కారు ఆగగానే అయోమయంగా ఇంట్లోకి వెళ్లిపోయాను అందరూ పలకరించినా పట్టించుకోలేదు.. పని మనిషి మాట్లాడినా ఏం మాట్లాడకుండా మౌనంగా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను. ఏంటిదంతా.. ఛ.. ఛ.. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నాను అని తనకి తానే సర్ది చెప్పుకుని లేచి ఫ్రెష్ అయ్యి తన వేణువు పట్టుకుని గార్డెన్ లోకి వెళ్ళింది. చెట్టు కింద కూర్చుని కృష్ణుడి లీలాగానం ఊదుతుంటే వయ్యారి నడకతో మైత్రి రెక్కలు ఊపుతూ వచ్చి అరణ్య పక్కన కూర్చుంది. మధ్యలో కేశవ మాటలు గుర్తురావడంతో వేణుగానం వేణువు తప్పి తన చేతిలోనుంచి కింద పడింది, తిరిగి తీసుకోబోతుండగా తనకి ఎప్పుడు కలలో వచ్చే ఆ మాటలు గుర్తురాగానే ఆగిపోయింది. కేశవ తన నాన్న ముందు మీనాక్షి పేరు ఎత్తమనడం గుర్తొచ్చి లోపలికి పరిగెత్తింది.

అరణ్య : అమ్మా.. నాన్న ఎక్కడా

ఉమ : ఏదో పని ఉందని వెళ్లారు, రావడానికి రెండు రోజులు పడుతుందట

అరణ్య : అలాగా ఎక్కడికి వెళ్లారు

ఉమ : అమెరికా.. అమెజాన్ ఫారెస్ట్.. ఏదో కాంట్రాక్టు పని అట

•  •  •  •  •  •

DEEP IN THE AMAZON FOREST
(దట్టమైన అమెజాన్ అడవులలో)

బేస్ నుంచి కమాండర్ : సోల్జర్స్ యు ఆర్ గుడ్ టు గొ

సోల్జర్ : ఎస్ సర్.. ఆన్ మై కమాండ్ అంటూ ముందుకు కదిలాడు సోల్జర్ గన్ భుజాన పెట్టుకుని పొజిషన్లో తన వెనకే అనుసరిస్తూ ఇంకో ఇరవై మంది అమెరికన్ సోల్జర్స్, అందరూ హెవీలీ ఆర్మడ్.

బేస్ లో : ఎవరి మీద ఎటాక్ చేస్తున్నాము

కమాండర్ : సర్ ఇది అమెజాన్ అడవి, ఇక్కడ కనిపిస్తున్న యెల్లో ఏరియానే మీరు తవ్వాలనుకున్న గోల్డ్ మైన్ ఉంది.. కింద ఒక పెద్ద బంగారపు కొండనే ఉంది.. కానీ మన వాళ్ళు ఎంత మంది వెళ్లినా తిరిగి రావడం లేదు, అందుకే ఇవ్వాళ ట్యాగ్ టీంని పంపిస్తున్నాం.. వాళ్ళు చూసేది మనకి కూడా ఆ స్క్రీన్ లో కనిపిస్తుంది.

బంగారపు కొండ ఉన్నది ఎల్లో ఏరియా అయితే దాని మీద థిక్ గ్రీన్ కలర్ ఏంటి అండ్ ఎందుకు దాని చుట్టు ఆ రెడ్ లైన్ గీశారు..?

కమాండర్ : ఆ దట్టమైన అడవి కిందే బంగారపు కొండ దాగుంది, మనుషులు వెళ్ళలేనంత దట్టమైన అడవి అది, దానిని సూచించేదే ఆ గ్రీన్ కలర్

మరి ఎలా తవ్వి తీద్దాం అనుకుంటున్నారు?

కమాండర్ : వేరే ఆప్షన్ లేదు సర్.. మొత్తం నాశనం చెయ్యడమే.. ఇక ఆ రెడ్ లైన్ అక్కడున్న తెగ ప్రజలకి సంబంధించినది.. ఆ దట్టమైన అడవిని వాళ్ళే కాపలా కాస్తున్నారు, మన మీద ఎటాక్ చేసేది కూడా వీళ్ళే.. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ దట్టమైన అడవి మధ్యలో దేవుడు ఉన్నాడని ఆ ప్రజల నమ్మకం.. అక్కడికి వెళ్లిన మన వాళ్ళు మాత్రం అక్కడున్న క్రూర జంతువులు మూకుమ్మడిగా ఎటాక్ చేస్తున్నాయని పిచ్చి కూతలు కూస్తునారు సర్ అని నవ్వాడు.. ఇవ్వాల్టితో ఆ గుట్టు రట్టవుతుంది.

బేస్ లో ఉన్న అందరి కళ్ళు స్క్రీన్ మీదె ఉన్నాయి, సోల్జర్స్ అడవి దాటి లోపలికి వెళ్లి తెగ ప్రజలు ఉండే చోటికి వచ్చారు, ఎవ్వరు కనిపించకపోవడంతో ఇంకా అలెర్ట్ గా ముందుకు వెళ్లి దట్టమైన అడవిలోకి వెళుతుంటే ఉన్నట్టుండి ఒక జింకపిల్ల ముందుకు దూకింది. అందరూ గన్స్ అటువైపు పెట్టారు.. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఏమి కనిపించడం లేదు.. ఇంతలో ఒక సోల్జర్ భుజం మీద నీళ్లు పడటంతో పైకి చూసాడు.. ఒక కోతి సుస్సు పోస్తూ సోల్జర్ ని చూసి నవ్వుతుంది.. దానికి సోల్జర్స్ అంతా వాడిని చూసి నవ్వారు.

కమాండర్ బి అలెర్ట్ గయ్స్ అనడంతో అందరూ పొజిషన్లో నిలబడ్డారు, ఉన్నట్టుండి చెట్ల మీద నుంచి బాణాల వర్షం కురిసింది, సోల్జర్స్ పైకి చూసి బుల్లెట్ల వర్షం కురిపించినా లాభం లేకపోయింది, పైనున్న ఆకుల వల్ల పెద్ద పెద్ద చెట్ల వల్ల ఏమి కనిపించడం లేదు.. నలుగురు సోల్జర్స్ చనిపోయారు, బాణాల వర్షం వల్ల అందరూ చెల్లా చెదురు అయ్యి విడిపడ్డారు.. అందరూ పైకి చూస్తుంటే దీనినే అద్దునుగా ఒక ఆడ సింహం గాండ్రిస్తూ మీదకి దూకి ఒకడి మీద వేటు వేసి ఇంకొకడి పీక పట్టుకుని తెరుకునే లోపే లాక్కేళ్ళిపోయింది. బేస్ లో అందరూ అది చూసి ఆశ్చర్యంగా లేచి నిలబడ్డారు.

ఇందాకటి కోతి ఇంకో సోల్జర్ మీదకి దూకి వాడి చేతిలో ఉన్న గన్ లాక్కుని పోయింది, అదే సమయంలో ఒక చింపాంజీ చెట్టు మీద నుంచి దూకి అడవి అదిరేలా గుండెల మీద బాదుకుంటూ ముగ్గురిని కొట్టి వాళ్ళ వీపుల మీద ధబా ధబా గుద్ది చంపేసింది. తెగ ప్రజలు ఓడలు పట్టుకుని శబ్దాలు చేస్తూ కిందకి దిగి మిగిలిన ఇద్దరిని బాణాలు వేసి చంపేస్తుంటే గుర్రాలు, ఏనుగులు, తోడేళ్లు జంతువులన్ని ఒకేసారి దాడి చేస్తూ సోల్జర్స్ ని భయ భ్రాంతులకి గురి చేసి అందరినీ చంపేసాయి.

ఒక సోల్జర్ కెమెరా ఇంకా పని చేస్తుంది, ఇందాక దూకిన ఆడ సింహం గాండ్రిస్తూ ముందుకు వచ్చి ఆ దట్టమైన చెట్లకి అడ్డుగా కూర్చుంది, అడవిలోని జంతువులన్నీ అక్కడికి వచ్చి ఆడ సింహం ముందు వినయంగా కూర్చున్నాయి వాటి వెనకే తెగ ప్రజలు కూడా మోకరిల్లి కూర్చున్నారు.. ఆడ సింహం ఎవరినో పిలిచినట్టు గాండ్రించగానే వెనక నుంచి ఒక పెద్ద గాండ్రింపు అడవితో పాటు అది వింటున్న బేస్ కూడా దద్దరిల్లింది.. తెగ ప్రజలు పాటలు పడుతుంటే పెద్ద జూలుతో ఉన్న ఒక మగ సింహం నడుచుకుంటూ వచ్చి ఆడ సింహం వెనక రక్షణగా నిలుచుంది.

ఆ మగ సింహాన్ని చూడగానే బేస్ లో ఉన్న వాళ్లకి చెమటలు పట్టాయి.. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన సింహం కొలతలు పదకొండు అడుగులు మాత్రమే కాని ఈ సింహం దాదాపు పదమూడు అడుగుల పైన మూడు వందల యాభై కిలోల పైన ఉంటుందని చూడగానే అక్కడున్న వాళ్ళు ఒక అంచనాకి వచ్చారు.

ఇంతలో ఫోన్ మొగగానే ఎత్తాడు

అరణ్య : నాన్న.. ఎక్కడున్నారు.. మీతో మాట్లాడాలి

రేపటి లోగా ఇంట్లో ఉంటాను

అరణ్య : అలాగే.. బై

అని కుర్చీ లోనుంచి లేచి స్క్రీన్ లో ఉన్న ఆ సింహాన్ని చూసాడు, ఆ సింహం చూపు ఎలా ఉందంటే చాలా క్రూరంగా ఇంకోసారి మా జోలీ రావద్దు అన్నట్టు ఒక బెదిరింపు ఇస్తున్నట్టుగా అనిపించింది.. వెళ్ళిపోతూ కమాండర్ ని చూసి అవి పిచ్చి కూతలు కావని ఇప్పటికైనా నమ్ముతారనుకుంటా.. మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు ఆ బంగారపు కొండ కావాలి.. అది కూడా రోజుల గడువులోనే అయిపోవాలి.. పని పూర్తి అయ్యిందని మీరు కన్ఫర్మ్ చేస్తే మా వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తారు అని సీరియస్ గా చెప్పేసి అక్కడి నుండి బైటికి వెళ్ళిపోయాడు.
Like Reply
#55
53      

రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉందనగా అందరూ షాపింగ్ పనులు పూర్తిచేసి కూర్చుని చీరలు చూసుకుంటుంటే మగవాళ్ళు అంతా ఒక పక్కన కూర్చుని ఆడాళ్ళ ముచ్చట్లు వింటూ అది బాగుంది ఇది బాగుంది అని చెపుతున్నారు.

ఉమ అక్కా నీ కొడుకు ఎక్కడా

అరణ్య : ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని నవ్వింది.. అందరూ నవ్వుతుంటే ఉమ అరణ్య వంక కోపంగా చూడటంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

మావయ్య వచ్చాడు అంటూ అరుస్తూ వెళ్ళింది పాప.. ఉమ కూడా అది విని లేచి నిలబడింది. అరణ్య తన నాన్న దెగ్గరికి వెళ్లి పలకరించి ఆయన కూర్చున్నాక తన పక్కనే కూర్చుంది.

సుశాంత్ ఇదెలా ఉంది చూడు అని సూట్ పట్టుకుని నిలబడ్డాడు అరణ్య వాళ్ళ తాతయ్య.

ఉమ : బాగుంది

సుశాంత్ : తరవాత చూస్తాను.. అని అరణ్యని పలకరించాడు.. తమ్ముడు ఎక్కడా

అరణ్య : నిన్న నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించలేదు నాన్న

అందరూ మాట్లాడుకుంటుంటే.. మాటల్లో మాటగా ఉమ తన ఆడబిడ్డ కూతురుని చూసి పాపకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు అని అడిగింది.. దానికి ఆవిడ ఇంకా ఏమి అనుకోలేదు ఒక మంచి పేరు చెప్పు వదినా అనడంతో అరణ్యకి ఇదే సరైన సమయం అనిపించింది..

అరణ్య : నేను చెప్పానా అత్తా మంచి పేరు

చెప్పురా

అరణ్య : హ్మ్మ్.. మీనాక్షి అని పెట్టు చాలా మంచిపేరు

అరణ్య నోటి నుంచి ఆ మాట రాగానే ఉలిక్కిపడ్డారు కొంత మంది. అందులో సుశాంత్ అమ్మా నాన్నా ఇద్దరూ ఉన్నారు.. అరణ్య తన పక్కనే కూర్చున్న సుశాంత్ ని చూసింది.. ఆయన కళ్ళలో ఆశ్చర్యం కాదది భయం.. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. నుదిటి నుంచి ఓ పక్కన చెమట పట్టడం కూడా అరణ్య గమనించింది.

అరణ్య : ఏమైంది నాన్నా

సుశాంత్ : హా.. ఏం లేదు.. ఈ పేరు ఎవరిది.. మీ ఫ్రెండ్స్ దా

అరణ్య : లేదు.. మొన్న ఏదో కధలో చదివాను.. ఏ నాన్నా

సుశాంత్ : లేదు.. ఏం లేదు.. అని లేచి లోపలికి వెళ్ళాడు.

అరణ్య వెంటనే తన అమ్మ మొహం చూసింది తన మొహంలో ఏ ఆశ్చర్యము లేదు. లేచి తన రూంలోకి వెళ్లి వేణువు మరియు తన ఫోన్ తీసుకుని చీకటిలోనే గార్డెన్ లోకి వెళ్ళింది.. లైట్లు వేసుకోకుండా వెళ్లి చెట్టు కింద కూర్చుని తరవాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ వేణుగానం ఆలపిస్తుంటే హంస అయిన మైత్రి అరణ్యని చూసి తన పక్కన నిలుచుంది.

ఎటు తెల్చుకోలేక తన  అరచేతిలో ఉన్న మచ్చని చూస్తూ ఏం అర్ధం కావట్లేదు నాకు దారి చూపించు అని వేడుకుంది అంతే ఆకాశంలో ఒక చుక్క ప్రకాశవంతంగా వెలిగేసరికి హంస గట్టిగా శబ్దం చేసింది.. అరణ్య తల ఎత్తి చూసేసరికి ఆకాశంలో వెలుగుతున్న చుక్క ఆగిపోయింది.. ఒక్క క్షణం అరణ్యకి ఏమి అర్ధం కాలేదు కానీ అది నమ్ముకుండా ఉండలేకపోయింది. చిన్నప్పటి నుంచి తన అరచేతిలో ఉన్న మచ్చని ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. అందుకే మళ్ళీ తన అరచేతిని చూసి దారి చూపించు అంది.. అంతే మళ్ళీ అదే నక్షత్రం ప్రకాశంగా వెలిగి మళ్ళీ ఆగిపోయింది.. అరణ్య ఆశ్చర్యంగా నిలుచుని ఈసారి ఏం మాట్లాడకుండా తన అరచేతిని ఆ నక్షత్రం వైపు పెట్టగానే అది మళ్ళీ వెలిగింది.. అరణ్య తన చేతిని మళ్ళీ కిందకి దించేవరకు అలా వెలుగుతూనే ఉందది.. అరణ్య నవ్వుతూ తన అరచేతిని చూసి మళ్ళీ ఏమనుకుందో ఏమో గట్టిగా పిడికిలి బిగించి కింద కూర్చుండిపోయింది.

చాలా సేపటి తరవాత తన ఫోన్ తీసి కేశవ్ కి ఫోన్ చేసింది.

కేశవ్ : హలో ఎవరు

అరణ్య : అరణ్య..

కేశవ్ : అక్కా.. నన్ను నమ్ముతున్నావా

అరణ్య : నీతో మాట్లాడాలి

కేశవ్ : నీకు అన్ని తెలియాలి అక్కా.. కానీ నీ ఫోన్ టాపింగ్లో ఉంటుంది

అరణ్య : రేపు KFC కి వచ్చేయి మాట్లాడుకుందాం.

కేశవ్ : అలాగే అక్కా, తప్పకుండా.. రేపు నువ్వు ఏ డ్రెస్ లో వస్తావ్

అరణ్య : దేనికి

కేశవ్ : కారణం ఉంది

అరణ్య : రేపు నీకు ఫోటో పంపిస్తాను

కేశవ్ : మీ సెక్యూరిటీ KFC లోపలికి రాకపోతే అదే చాలు

అరణ్య : రారు..

కేశవ్ : ఓకే బై

అరణ్య ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూనే ఇక అక్కడ నుంచి లేచి ఇంట్లోకి వెళుతుంటే కుటుంబ సభ్యులంతా బైటే నిలుచొని ఆకాశంలోకి చూస్తున్నారు.

అరణ్య : ఏమైంది

ఉమ : నువ్వు చూడలేదా.. ఆకాశంలో ఏదో వెలుగు.. భూమ్మీద ఏమైనా పడుతుందా లేక ఏలియన్స్ ఏమైనా వస్తున్నారా అని అనుకుంటున్నారు.

అరణ్య లోపలికి వెళుతు వెళుతూ ఒకసారి చెయ్యి పైకి ఎత్తి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.. అందరూ అదిగో అదిగో మళ్ళీ లైట్ వస్తుంది చూడండి చూడండి అని అరుస్తుంటే అరణ్య అది విని నవ్వుకుంది.

తెల్లారి లేచి రెడీ అయ్యి తన ఫోటో ఒకటి కేశవ్ కి పంపి కిందకి వచ్చింది అందరూ టీవీలో వార్తలు చూస్తున్నారు.. అరణ్య వెళ్లి తన అమ్మ పక్కన నిలబడింది.

అరణ్య : ఏంటి అంతా టీవీలో మునిగిపోయారు. అదీ న్యూస్ ఛానల్లో

ఉమ : రాత్రి ఆకాశంలో వెలుగు వచ్చింది కదా అది.. ఏలియన్స్.. ఉపగ్రహాలు కావట.. అదొక నక్షత్రం అట.. ఎందుకు అంతగా వెలిగిందో ఇంకా కారణాలు తెలియవని చెపుతున్నారు.

అరణ్య : ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు, వెళ్లి కొంచెం సేపు మాట్లాడి వస్తా అని చెప్పేసి బైటికి వెళ్ళింది.

కారు నేరుగా KFC ముందు ఆగింది.. ముందు సెక్యూరిటీ లోపలికి వెళ్లి అంతా చెక్ చేసాక అప్పుడు అరణ్యని లోపలికి వదిలారు.. అరణ్య సెక్యూరిటీని లోపలికి రావొద్దని చెప్పి తనోక్కటే లోపలికి వెళ్ళింది.. సెక్యూరిటీ అరణ్య వైపు చూస్తూనే ఉన్నారు.. అరణ్య వెళ్లి తన ఫ్రెండ్స్ తో కూర్చుంది.

కేశవ్ : ఆర్డర్ మామ్

అరణ్య : కేశవ్...?

కేశవ్ : మీ వాళ్ళు చూస్తున్నారు.. అక్కడ ఒక లావు వ్యక్తి ఉన్నాడు, తినడం అయిపోయింది. ఆయన డోర్ దెగ్గరికి వెళ్ళగానే అక్కా నువ్వు లేచి అక్కడ కిచెన్ లోకి వచ్చేయి నీ ప్లేస్ లో నా చెల్లెలు నీలాగే కూర్చుంటుంది.. నేను అక్కడ నిలబడి నీకు సిగ్నల్ ఇస్తాను.. అని చెప్పేసి గబగబా వెళ్ళిపోయాడు.

పావుగంటకి ఆ లావు వ్యక్తి లేచి వెళ్ళిపోతూ డోర్ దెగ్గరికి రాగానే కేశవ సిగ్నల్ ఇచ్చాడు వెంటనే అరణ్య లేచి కిచెన్ లోకి వెళ్లడం తన స్థానంలో కేశవ చెల్లెలు అరణ్య వేసుకున్న దుస్తుల్లోనే అచ్చు అరణ్య కూర్చున్నట్టే కుర్చుంది సెక్యూరిటీకి అనుమానం రాకుండా.. కిచెన్ లోకి వెళ్లిన అరణ్యని కేశవ వెనక వైపుకి తీసుకెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని చూపించాడు.

అరణ్య : ఎవరు ఆయన

కేశవ : మా నాన్న.. చందు.. నాన్నా అనగానే వాకింగ్ స్టిక్ తో ఇటువైపు తిరిగాడు చందు.

అరణ్య వెళ్లి నమస్కారం చెయ్యబోతే ఆపి.. టైం లేదంటూ.. తనతో ఇరవై నిముషాలు ఆపకుండా జరిగిన కధ మొత్తం వివరించాడు. అంతా విన్న అరణ్యకి ఏమి మాట్లాడాలో ఏం అర్ధం కాలేదు.

బైట సెక్యూరిటీ

రేయి ఇందాక ఒకడు అరణ్య దెగ్గరికి ఆర్డర్ మేడం అంటూ వచ్చాడు కదా

అవును బాస్

KFC లో సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది.. పదండి లోపలికి వెళదాం అని లోపలికి నడిచి డోర్ తీయబోతే చందు వాకింగ్ స్టిక్ అడ్డం పెట్టి వాళ్ళని అపాడు.. వాళ్ళని విధిలిస్తూ ఒక పది సెకండ్లు టైం వేస్ట్ చేసి బైటికి వెళ్ళిపోయాడు.. ఈ లోగా అరణ్య తన స్థానంలో కూర్చుంది.

సెక్యూరిటీ : మేడం ఇక వెళదాం.. ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అని మాట్లాడుతూనే ఇందాక చూసిన కేశవ కోసం వెతికాడు కాని కనిపించకపోవడంతో చుట్టు చూస్తుంటే అరణ్య లేచేసరికి వదిలేసి బైటికి నడిచాడు. అరణ్య కారు ఎక్కి కూర్చుంది.



[Image: FltknUmaMAE7bIo?format=jpg&name=900x900]
Like Reply
#56
54    

కారులో కూర్చున్న అరణ్య, చందు చెప్పిన ప్రతీ ఒక్క మాట నెమరువేసుకుంది. ఇన్నేళ్లు తన బతికిన బతుకు, తన అమ్మా, నాన్నా ఆఖరికి తన పేరు కూడా తనది కాదని తెలిసేసరికి ఏమి చెయ్యలేక చున్నీతో కళ్ళు తుడుచుకుంది.


చందు : మా అక్కా బావ చనిపోయాక వాడిని, వాడు చేసే చేష్టలని ఎవరు ఆపలేకపోయారు.. మా బావ ఫ్రెండ్ అయిన సందీప్ ని ముందే చంపేశాడు.. ఆయనే కనక ఉండుంటే వాళ్ళని కాపాడుకునేవాడు.. మా అమ్మా నాన్నని కూడా చంపేశాడు.. నేను మాత్రమే మిగిలాను.. ఇంకా వాడి నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాం.. మా అక్కా బావ ముందే వాళ్ళ ఆస్తులన్నిటిని వాళ్ళకి పుట్టబోయే బాబు పేరు మీదకి వచ్చేలా రాసేశారు, అలా ఎందుకు చేసారో ఎవ్వరికి తెలీదు.. కానీ బాబు పుడితే మీనాక్షి చనిపోతుందని మాత్రమే మాకు తెలుసు.. కోర్టుకి తప్పుడు సాక్ష్యాలు చూపించి, నువ్వు శివ కూతురువి అని తప్పుడు సాక్ష్యాలు పుట్టించి అందరినీ నమ్మించాడు.. కోర్టు శివ తరపున ఎవ్వరు లేరని నమ్మి ఆస్తులకి గార్డియన్ గా సుశాంత్ ని ప్రకటించింది.. ఎదురొచ్చిన మా అమ్మా నాన్నని మా అమ్మమ్మని కూడా వదల్లేదు.. శివ ఆస్తులు వాడికి కలిసి వచ్చాక ఎవ్వరికి అందనంత దూరానికి వెళ్ళిపోయాడు.. నేను ఒంటి కాలితో ఏమి చెయ్యలేకపోయాను.. అని కన్నీళ్లు తుడుచుకున్నాడు.

అరణ్య : మరి మా అమ్మ..?

చందు : కస్తూరి వదిన తన అన్నయ్యా వదినలు చనిపోయారని తెలిసిన మరుక్షణం మీ అమ్మ, కావేరి అమ్మమ్మ ఇద్దరు పిచ్చి వాళ్ళు అయిపోయారు.. మీ అమ్మ నీ కోసం వాడి ఇంటికి వెళ్ళింది మళ్ళీ తిరిగిరాలేదు.. వాడు చంపేశాడు.. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో కాదు ఆ ప్రదీప్ కొడుకు.. నీకు ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత నీ ఒక్క సంతకంతో శివ సంపాదించినవి ఇన్నేళ్లు వాటికవే పెరిగిన ఆస్తులు మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి.. అవన్నీ కాదు.. ఈ నీకు నిజం తెలియాలి.. నీ వాళ్ళు ఎవరో నీకు తెలియాలి.. నీ జీవితం మొత్తం అబద్ధం అని నీకు తెలియాలి.. ఇందులోనుంచి నువ్వు బైటికి రావాలని చెపుతున్నాను.

అరణ్య : మరి కావేరి అమ్మమ్మ ?

చందు : ఇంకా బతికే ఉంది.. పిచ్చి ఆసుపత్రిలో ఉంది.. ఇంకా శివ, మీనాక్షి, కస్తూరి ముగ్గురు బతికే ఉన్నారని నమ్ముతుంది.. తనలో తనే మాట్లాడుకుంటూ తనలో తనే ఏడ్చుకుంటూ ఉంటుంది.

అరణ్య నేను మా అమ్మని, మా మావయ్యని చూడొచ్చా అని అడగ్గానే చందు ఫోన్ లో ఉన్న అందరి ఫోటోలు చూపించాడు.. తనకి పంపించమని అడిగితే వద్దన్నాడు. బుర్ర అంతా ఆలోచనలతో ఉండగానే కారు గేట్ తీసుకుని ఇంటి ముందు ఆగింది.. అందరూ పిలుస్తున్నా పలకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.. మంచం మీద పడుకుని ఏడ్చేసింది.


ఏది నిజం ఏది అబద్ధం ఏమి అర్ధం కావట్లేదు. ఇన్నేళ్లు నేను నమ్మింది నేను చూసింది అంతా అబద్ధం అంటున్నారు.. ఎవ్వరికి లేని మచ్చ నా అరచేతిలో మాత్రమే ఎందుకు ఉంది.. ఎందుకు నేను దాన్ని ఏది కోరుకుంటే అది జరుగుతుంది.. అని అరచేతిని చూసుకుంది.

అరణ్య : నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఆనందం నువ్వే, నీతోటే నా కష్టాలు సుఖాలు అన్నీ పంచుకున్నాను.. నా దినచర్య మొదలయ్యేది నీతోనే ముగిసేది నీతోనే.. ఎవ్వరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా నిన్ను మాత్రం నమ్ముతాను. నా గురించిన నిజం నాకు తెలియని కధ మొత్తం నాకు చెప్పు అని మచ్చని తన కళ్ళకి అద్దుకుని ఏడ్చింది.. అరణ్య కళ్ళు చిన్నగా మసక మసకగా మూసుకుపోతూ మంచం మీదె స్పృహ తప్పి పడిపోయింది.

స్పృహలో మొదటగా తనకి కనిపించిన దృశ్యం చీకటిలో జోరు వర్షంలో పట్టాల మీద కడుపు పట్టుకుని పరిగెడుతున్న కస్తూరి.. మైకంలోనే అమ్మా అని కలవరించింది అరణ్య.

అప్పుడే అరణ్యతో మాట్లాడదామని తన రూంలోకి వచ్చిన పనిమనిషి రజిని మంచం మీద పడిపోయి ఉన్న అరణ్యనీ తన కళ్ళ నుండి కారుతున్న నీటిని చూసి దెగ్గరికి వెళ్లి లేపింది, కానీ ఎంతకీ అరణ్య లేవకపోవడంతో భయం వేసి బైటికి పరిగెత్తి అందరినీ పిలుచుకువచ్చింది.

ఇటు అరణ్య స్పృహలో.. మీనాక్షి కడుపులో అస్సలు అరణ్య పడటం.. తల్లీ బిడ్డా ఇద్దరు మాట్లాడుకోవటం నుంచి వాళ్ళ ఆనందాలు.. తన బిడ్డతో మాట్లాడుతూ ఆనంద పడుతుంటే ఇక్కడ అరణ్య కూడా నవ్వుతుంది. ఒక పిండం మాట్లాడడం చూసి ఆశ్చర్యపడుతుంది.. తను స్పృహలో చూస్తున్న కధ మొత్తం ఆ పిండం చుట్టూనే తిరుగుతుంది. శివ ఆ పిండానికి అరణ్య అని పేరు పెట్టడంతో అప్పుడు అర్ధమయ్యింది అస్సలు అరణ్య ఎవరో..

అరణ్య పిండపు దశలో ఉన్నప్పుడే తనకి ఎన్ని శక్తులు ఉన్నాయో తన అమ్మా నాన్నకి తెలియకుండా వాళ్ళని ఎన్నిసార్లు కాపాడుకున్నాడో చూస్తూ ఆశ్చర్యపోయింది.. శివకి మీనాక్షికి కూడా తెలియనివి తనకి కనిపిస్తున్నాయి.

కస్తూరి శివని కలుసుకోవడం.. మొదటి సారి కస్తూరికి కడుపు మీద మీనాక్షి చెయ్యి వేసినప్పుడు కడుపులో ఉన్న అరణ్య తన అమ్మ మీనాక్షితో చెప్పిన పోలికలు.. అరచేతిలో దిక్సూచితో పుడుతుందని చెప్పడం విని ఆశ్చర్యపోయింది.

ఇటు స్పృహ కోల్పోయిన అరణ్య చుట్టూ అందరూ చేరారు, ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా అరణ్యని లేపలేకపోయారు, అరణ్య మోహంలో కనిపిస్తున్న ముఖ కవళికలు చూసి అస్సలు అరణ్యకి ఏమైందో అర్ధం కాక చివరికి డాక్టర్ కి ఫోన్ చేశారు.

అక్కడ నుంచి ఆ కుటుంబపు సంతోషాలు చూస్తూ మీనాక్షి తన కొడుకు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంది.. కస్తూరికి పుట్టే పాప కోసం అరణ్య మీనాక్షి కడుపులో ఉక్కిరిబిక్కిరి అవడం.. మీనాక్షి తన కొడుకుతో పుట్టే పాప గురించి అరణ్యతో నవ్వుతూ మాట్లాడుతుంటే దానికి అరణ్య నవ్వుతుంటే, ఇదంతా చూస్తున్న అరణ్యకి సిగ్గేసింది.. (డాక్టర్స్ అరణ్య సిగ్గుపడటం చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.. ఇప్పటికే ఒకరోజు గడిచిపోయింది)

స్పృహ కోల్పోయిన అరణ్యకి ప్రతీ రోజూ కనిపిస్తుంది.. కావేరి అమ్మమ్మ తనకి మొదటి సారి స్నానం పొసే వేళ కన్నీటి పర్యంతమవడం చూసి ఇక్కడ స్పృహలో లేని అరణ్య కళ్ళలో తడి చేరింది (అరణ్య కంటి నుంచి కన్నీరు కారుతుంటే నర్స్ అది తుడిచిసింది).

మొదటి సారి అరణ్య తనని చంపెయ్యమని శివని వేడుకోవడం చూసి ఏడ్చేసింది.. కడుపులో నుంచి మాట్లాడుతున్న బిడ్డని, ఇంట్లో పుట్టి కళ్ళేదుట ఉన్న ఆడపిల్లని చూస్తూ ఆ కుటుంబం యొక్క సంతోషం వాళ్ళ నవ్వులని చూస్తూ గడిపేయాలని అనిపించింది అరణ్యకి.. దానితో పాటే తన శక్తులని దాచుకుంటూ తన అమ్మ కడుపు చీలకుండా పిండంలో ఉంటూ అరణ్య పడుతున్న కష్టం కూడా కనిపించింది.

మీనాక్షి పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కడుపులో ఉన్న అరణ్యకి ఆనించి.. బుజ్జి నీ మరదలు.. నువ్వు పుట్టక ముందే నీ పెళ్ళాన్ని చూసుకున్నావు కదరా.. ఎలా పుడుతుందో ఎలా ఉంటుందో కూడా చెప్పేసావు.. ఇదిగో నీ పెళ్ళాన్ని ముట్టుకో అని మీనాక్షి ఎగతాళి చేస్తుంటే ఇక్కడ స్పృహలో అది చూస్తున్న అరణ్యకి సిగ్గేసింది.

తొమ్మిది నెలలు దాటి ఎన్ని రోజులు అవుతున్నా తన శక్తులని ఉపయోగించి బైటికి రాకుండా ఉండటానికి చూస్తున్న అరణ్యని చూసి ఒకింత గర్వం ఇంకొంత ప్రేమ కలిగింది.. కానీ అంతలోనే కడుపులోనే ఉన్న పిల్లాడితో ప్రేమలో పడుతున్నానా అన్న ఆలోచన వచ్చి అరణ్య తనని తానే తిట్టుకుంటుంటే చూస్తున్న డాక్టర్స్ కి అస్సలు ఏం జరుగుతుందో అర్ధం కాక మతిపోతోంది. (అరణ్య స్పృహ కోల్పోయి ఇప్పటికే నలభై గంటలు దాటింది)

అన్నీ చూస్తున్న అరణ్యకి ఎవ్వరికి తెలియని రహస్యాలు కూడా చూస్తుంది.. అదే అరణ్య తన అమ్మా నాన్నా నిద్రలోకి వెళ్ళాక వాళ్ళని లేవకుండా చేసి ఎవరితోనో మాట్లాడడం.

అరణ్య : ఎందుకు వస్తున్నావ్.. ఇంతకముందే చాలా సార్లు మాట్లాడుకున్నాం.. నీ శక్తులని నా మీద ప్రయోగించకు.. నేను తట్టుకోలేకపోతున్నాను. దాని వల్ల మా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది.

విక్రమాదిత్య : ఇంకెంత కాలం, ఇలానే ఉంటావు.

అరణ్య : నా ఇష్టం

విక్రమాదిత్య : సరే జీవితాంతం కడుపులోనే ఉండగలవా.. మీ అమ్మని నీ నుంచి నువ్వే కాపాడుకోగలవా

అరణ్య : తెలీదు, కానీ నాకు కచ్చితంగా దారి దొరుకుతుంది.. వెళ్ళిపో నీ వల్ల నేను శక్తులని ఉపయోగించాల్సి వస్తుంది.. దాని వల్ల మా అమ్మ గర్భం చీలుతుంది.. దయచేసి వెళ్ళిపో

విక్రమాదిత్య : ఇదే ఆఖరు, ఇక నేను నీకోసం నీ స్పృహలోకి రాను.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. నువ్వు ఈ పాటికి ఈ భూమ్మీదకి వచ్చి ఉండాలి.

అరణ్య : నా చేతులతోనే నా తల్లిదండ్రులని చంపుకొమ్మని అడుగుతున్నావు.. అదే పని నువ్వు చెయ్యలేదే

విక్రమాదిత్య : నేను నా తండ్రిని నా చేతులతోనే చంపేసాను

అరణ్య : కానీ నా వల్ల కాదు.. నేను ఏ ప్రాణికి హాని తలపెట్టలేను.

విక్రమాదిత్య : నాకు తెలుసు.. అరణ్యా.. అన్నీ తెలిసినవాడవు.. బ్రహ్మ స్వరూపుడవు..  విజ్ఞానానికే పితామహుడవు.. ఓ హిరణ్యగర్భవా.. ఓ చతురనన.. ఓ కమలాసనుడా.. సర్వలోక జీవాదిపతి.. మేము కేవలం వారి అంశలం మాత్రమే కానీ బ్రహ్మవైన నీవే దిగి వచ్చితివి కదా.. సృష్టిని సరైన మార్గంలో నడిపించే నీవే దానికి విరుద్ధంగా పోరాడితే ఎలా.. దయచేసి నా మాట విను

అరణ్య : ఇక చాలు.. భరించలేకున్నాను.. వెళ్ళిపో అని అరిచినట్టు మాట్లాడగానే పడుకున్న మీనాక్షి ఎగిరి పడింది..  అరణ్య తన శక్తిని ఉపయోగించి విక్రమాదిత్యని తన స్పృహ లోనుంచి తీసేస్తుంటే చిన్నగా మీనాక్షి గర్భం చీలుతుంది.

విక్రమాదిత్య : క్షమించు.. నేను వెళ్ళిపోతున్నాను.. కానీ గుర్తుపెట్టుకో.. సృష్టిలో ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగి తీరుతుంది.. ఓ సృష్టికర్త.. ఇక నేను చెయ్యాల్సింది నేను చేస్తాను.. కలుద్దాం అని మాయమైపోయాడు.

అరణ్య పడుతున్న బాధ మొత్తం ఇక్కడ స్పృహ కోల్పోయిన అరణ్య పడుతుంటే తన కంట్లో నుంచి ఎడతెరపి లేకుండా నీళ్లు కారుతుంటే డాక్టర్స్ అరణ్యకి మెషిన్స్ తగిలించడం మొదలు పెట్టారు. ఆ తరవాత జరుగుతున్న సంఘటనలకి స్పృహ కోల్పోయిన అరణ్య ఏడుస్తూనే ఉంది..

విక్రమాదిత్య ద్వారా రుద్ర వదిలిన భస్మం మీనాక్షి గర్భం మీద ప్రయోగించినప్పుడు అరణ్య తన తల్లిని తండ్రిని కాపాడుకోవడానికి తన శక్తులని అడ్డుగా పెట్టడం.. శక్తులని అడ్డు పెట్టినా పిండపు దశలో ఉన్నందున ఆ శక్తి సరిపోక భస్మపు శక్తికి మీనాక్షి గర్భం చీలడం.. ఫ్లైట్ పేలడం.. అరణ్య అడవిలో నేరుగా పడిపోవడం.. అక్కడ ఆ అడివి దానికి స్పందించి గుబురుగా అల్లుకుని తనని దాయడం.. ఏళ్ల తరబడి అరణ్య ఏడుస్తూనే ఉండటంతో అరణ్య నిద్రలో ఉన్న కమలం చుట్టూ తన కన్నీటితో ఏర్పడ్డ సరస్సు అన్నీ కనిపించాయి.. సరస్సు చుట్టూ జంతువులు.. నిద్రలో ఉన్న అరణ్యని ప్రేమగా చూస్తున్న రెండు సింహాలు.. అంతే ఇంకేం కనిపించలేదు.

కొంతసేపటికి అరణ్య బాడీ దడదడమని కొట్టేసుకోవడంతో అందరూ కంగారు పడ్డారు.. రెండు నిమిషాలకి అరణ్యకి స్పృహ వచ్చి లేచి కూర్చుంది. డాక్టర్స్ అంతా చెక్ చేసి ఓకే అని కంఫర్మ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. అందులో సుశాంత్ కూడా ఉన్నాడు.. ఈ రెండున్నర రోజులు వాడు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు.. డాక్టర్స్ అందరూ ప్రశ్నలతో అరణ్య మీద పడ్డారు.

అరణ్య గారు.. మీరు ఇంతసేపు కోమాలోకి వెళ్లారు.. మీరు ఏదో చూసారు.. ఏం చూసారు.. మీకు ఏమి కనిపించింది.. మాకు అన్ని వివరాలు తెలియాలి.. చెప్పండి.. చెప్పండి అని అడుగుతుంటే అరణ్య చేతులు అడ్డుపెట్టుకుంది.. అంతా చూసిన సుశాంత్ డాక్టర్స్ మీద అరిచి వాళ్ళని పంపించేసాడు.

సుశాంత్ వెళ్లి అరణ్య పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు.

అరణ్య : బానే ఉంది

సుశాంత్ : అందరినీ కంగారు పెట్టేసావు.. ఇంకాసేపటిలో నీ ఎంగేజ్మెంట్.. ఆరోగ్యం అంతా బానే ఉంది అని డాక్టర్స్ చెప్పారు ఇంకే భయం లేదన్నారు.. నీకు ఓకే అంటే ముందుకు వెళదాం లేదంటే ఎంగేజ్మెంట్ ఇంకో రోజు పెట్టుకుందాం.. ఆ ఇంకోటి మర్చిపోయాను.. హ్యాపీ బర్తడే అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.

అరణ్యకి ఏమి అర్ధం కాలేదు, పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు పలకరింపులని సహించి అందరూ వెళ్ళిపోయాక పనిమనిషిని చూసి దెగ్గరికి రమ్మంది.

రజిని : ఏంటమ్మా అలా అయిపోయారు.. ఎంత భయం వేసిందో తెలుసా

అరణ్య : నేను పడుకుని అదే.. నేను కోమాలోకి వెళ్లి ఎన్ని రోజులు అవుతుంది.

రజిని : ఇవ్వాల్టికి మూడు రోజులమ్మా.. ఏంటి ఆశ్చర్యంగా ఉందా

అరణ్య : లేదులే కానీ కొంచెం సేపు పడుకుంటాను.. నువ్వెళ్లు

రజిని : అలాగే అమ్మగారు..

అందరూ వెళ్ళిపోయాక కొంతసేపటికి ఉమ వచ్చింది..

ఉమ : అరణ్యా.. ఇప్పుడు పరవాలేదా

అరణ్య : చేతిలో ఏంటవి

ఉమ : నాన్న నిన్ను వీటిలో సంతకం పెట్టమని పంపించారు

అరణ్య మనసులో అనుకుంది.. ఇవ్వాల్టితో నాకు ఇరవైరెండేళ్లు నిండిపోయాయి.. ఉమ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని చూస్తుంటే..

ఉమ : అవన్నీ ఏం అవసరం లేదు.. చివరి పేజీలో సంతకం పెట్టు అని కసిరింది.

అరణ్య పట్టించుకోండా పేపర్లని చదివింది అందులో శివ మీనాక్షిల పేర్లు ఇరవై సార్లు ప్రస్తావించబడి ఉండడం చూసి ఉమ వంక చూడగానే ఉమ కొంచెం జంకింది. అరణ్య గట్టిగా ఉమ చెయ్యి పట్టుకుని కోపంగా చూసింది.

అరణ్య : నువ్వు నా కన్నతల్లివి కాదని నాకు ఎప్పుడో తెలుసు.. ఒక్కసారి నిజం నీ నోటితో వినాలని ఉంది.. చెప్పు

ఉమ : అదీ

అరణ్య : భయపడకు.. నేను ఎవ్వరితో ఏమి అనను ఏమి చెప్పను.. చెప్పు

ఉమ అవును నేను నీ కన్నతల్లిని కాను.. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకోకముందే నువ్వు నెలల పిల్లవి.. నీ తమ్ముడు మాత్రమే నా కన్నకొడుకు అనగానే అరణ్య ఉమ చెయ్యి వదిలేసి.. తన చేతిలో ఉన్న పెన్ తీసుకుని సంతకం పెట్టబోతూ స్పృహ తప్పి పడిపోయింది.. కాదు స్పృహ తప్పినట్టు నటించింది.
Like Reply
#57
55     

స్పృహలో లేనట్టు నటిస్తున్న అరణ్యకి ఉమ మరియు సుశాంత్ మాటలు వినిపిస్తున్నాయి.

సుశాంత్ : ఎందుకిలా అవుతుంది

ఉమ : ఏమో ఎన్నడూ లేనిది మొన్న KFC కి వెళ్ళింది, అక్కడ ఏమైనా తినిందేమో..

సుశాంత్ : లేదు అరణ్య ప్యూర్ వెజిటేరియన్, పొరపాటున కూడా నాన్ వెజ్ ముట్టుకోదు.. అస్సలు అక్కడికి ఎందుకు వెళ్ళింది..?

ఉమ : ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని వెళ్ళింది

సుశాంత్ : ఇంతకీ సంతకాలు చేసిందా ?

ఉమ : ఇంకా లేదు

సుశాంత్ : పేపర్లు చూసిందా.. ఏమైనా అడిగిందా

ఉమ : లేదు

సుశాంత్ : డాక్టర్స్ కి ఫోన్ చేసాను వస్తున్నారు.

వీళ్ళ మాటలు వింటున్న అరణ్యకి చిన్నగా తనకి ఎప్పుడు కలలోకి వచ్చే ఆ మాటలు వినపడుతుంటే వాటి మీద శ్రద్ద పెట్టింది. అమ్ములు తల్లీ అనగానే అప్పుడు తెలిసింది అది తన అత్తయ్య మీనాక్షి గొంతని.. ఎంతగా ఆనందపడిందో అంతే బాధ పడింది. ఉమ మరియు సుశాంత్ వెళ్ళిపోగానే లేచి వెంటనే తన వేణువు అందుకుని బైటికి పరిగెత్తింది.. ఎవ్వరి కంటా పడకుండా గార్డెన్ లోకి చేరుకుని చెట్టు కింద ఉన్న కృష్ణుడి ముందు మోకరిల్లి దణ్ణం పెట్టుకుంది.

అరణ్య : కృష్ణా ఇక నుంచి నేను నిన్ను పూజించబోయేది లేదు, ఇక నా మనసులో నుంచి నిన్ను తీసేస్తున్నాను.. ఇక నుంచి నేను పూజించేది నా బావని మాత్రమే.. నేను లేని ఈ చోట ఎలా ఉంటావో ఏమో.. జాగ్రత్త అని లేచి నిలుచుంది తన వేణువు తీసుకుని నడుము దెగ్గర ఉన్న బొందుకి వేణువుని కట్టి, ఒకసారి తన అరచేతిలోని మచ్చని తన కళ్ళకి అద్దుకుని కళ్ళు మూసుకుంది.

అరణ్య : బావా నువ్వు ఇంతవరకు చెప్పులు తొడగనేలేదు కదా ఇక నుంచి నేను కూడా వేసుకోను.. వస్తున్నాను బావ అని నవ్వుకుని.. నాకు దారి చూపించు అని కళ్ళు తెరిచి చిన్నపిల్లలా నవ్వుతూనే గార్డెన్ నుంచి బైటికి పరిగెత్తింది.. ఇంకేదో లోకంలోకి వెళ్లిపోతున్నానన్న ఆనందం ఆ మొహంలో కనిపిస్తుంది.

ఇంట్లోకి పరిగెడుతూ ఎవ్వరి కంటా పడకుండా పెద్ద పెద్ద పిల్లర్ల వెనక దాక్కుంటూ ఇంటి నుంచి బైటికి వచ్చేసింది.. చూస్తే అందరూ బైటే ఉన్నారు, తెల్లని గుర్రం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఎవ్వరి మాట వినడంలేదు గార్డ్స్ ని ఎగిరి ఎగిరి తంతుంది.. అరణ్యకి అర్ధమయ్యి నవ్వుతూ పరిగెత్తింది.. అందరూ కంగారుగా చూస్తుండగానే వాళ్ళని దాటుకుని వెళ్లి గుర్రం ముందు నిలబడింది.. అంతే గుర్రం ఒక్కసారిగా శాంతించింది.. తెల్లని గుర్రం.. దాని వంటి మీద చిన్న మచ్చ కూడా లేదు.. బలమైన కాళ్లు.. రాజుల కాలం నాటి ఎత్తు.. తెల్లని జుట్టు.. అందాన్ని రాజసాన్ని పెంచుతూ ఉన్న తెల్లని పొడుగాటి తోక.

ఇంట్లో వాళ్లంతా బెదిరిపోయి వద్దని అరణ్య వైపు అరుస్తుంటే అరణ్య పట్టించుకోకుండా గుర్రపు నుదిటి మీద చెయ్యి వేసింది.. అదేంటో తనని ముట్టుకోగానే అరణ్యకి గుర్రం ఏం చెప్పాలనుకుంటుందో అర్ధమవసాగింది, గుర్రం ఒక్క క్షణంలో కిందకి ఒంగగానే అరణ్య బలాన్ని ఉపయోగించి వెంటనే ఎక్కేసింది.. గుర్రం అదే ఊపులో పైకి ఎగిరి రెండు కాళ్లు గాల్లోకి ఎత్తింది.. ఆ ఎగురుడుకి అరణ్య జుట్టు మొత్తం చెదిరి విరబూసుకుంది.. రెండో అంగలో గుర్రం ముందుకు దూకి అందరూ చూస్తుండగానే అక్కడనుంచి వెళ్ళిపోయింది.. అందరూ ఆశ్చర్యపోయారు.

చీకటిలో రోడ్డు మీద తెల్లని గుర్రం, దాని మీద ఒంటి నిండా తెల్లని దుస్తుల్లో గుర్రం వెళుతున్న వేగానికి విచ్చుకున్న అరణ్య పొడుగాటి జుట్టు గాల్లో అలలా ఎగురుతుంటే దేవతే భూమ్మీదకి వచ్చిందా అన్నట్టుంది..

గుర్రం పరిగెడుతున్న వేగానికి ఒక చెయ్యి గుర్రం జుట్టు మీద, కుడి చేత్తో గుర్రం మెడని గట్టిగా పట్టుకుని కూర్చుంది.. చాలా మంది ఫోన్లో వీడియో కూడా తీసుకున్నారు.. ఇంతలో వెనక నుంచి సెక్యూరిటీ కార్లలో తరుముతుంటే అరణ్య భయంగా గుర్రాన్ని గట్టిగా పట్టుకుంది. గుర్రం కూడా అర్ధంచేసుకున్నట్టే పావుగంటకి రోడ్డు దాటి కార్లకి అందకుండా అడవి మార్గం పట్టింది.. సెక్యూరిటీ మాత్రం కారు అడవిలోకి వెళ్లే అవకాశం లేక బైటే ఆగిపోయారు.

హలో సర్

సుశాంత్ : అస్సలు ఏం జరుగుతుంది, అరణ్య ఎక్కడా  ?

మేడం గుర్రంతో పాటు అడవిలోకి వెళ్ళిపోయింది సర్, మేము ఇక్కడ ఆగిపోయాము. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు

సుశాంత్ : అర్ధం కాకపోవడానికి ఏముందిరా ఫూల్.. వెతకండి ఇలా కాదు చాప్పర్స్ తీసుకెళ్లండి అని ఫోన్ పెట్టేసి వెంటనే ప్రదీప్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ తన రూంలోకెళ్ళి డోర్ వేసుకున్నాడు.

చీకటిలో అరణ్య గుర్రం మీద దూసుకెళుతుంది, భయపడుతున్నా కానీ గుర్రం వేగానికి కళ్ళకి ఎదురొచ్చే ఆకులకి, కొమ్మలకి తట్టుకోలేక కళ్ళు మూసుకుంది. ఒక అరగంట తరువాత గుర్రం వేగం తగ్గించి వెళుతుంటే అరణ్య కళ్ళు తెరిచి చూసింది. చిన్నగా లేచి సరిగ్గా కూర్చుంది కొంచెం భయం వదిలేసినట్టు.. కొంతసేపటికి గుర్రం తనంత తానే ఆగిపోగా అరణ్య కిందకి దిగి పక్కనే ఉన్న చిన్న నీళ్ల కుంట చూస్తూ గుర్రం ముందుకు వెళ్లి ముఖం పట్టుకుని చూసింది.

అరణ్య : నిన్ను మా బావే పంపించాడా అని నవ్వుతూ అడిగింది.. దానికి గుర్రం కేరింతలు కొడుతుంటే అరణ్య కూడా నవ్వి పక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కూర్చుంది.. గుర్రం నీళ్లు తాగడానికి వెళుతూ అరణ్యని చూసింది.. దానికి అరణ్య నవ్వుతూ నీ దాహం తీర్చుకో అని పంపి తన అరచేతిలో ఉన్న మచ్చని కళ్ళకి అద్దుకుని బావా నా మాటలు నీకు వినిపిస్తున్నాయా, నేను అరణ్య.. కాదు కాదు నాకు కూడా పేరుంది, అత్తయ్య పెట్టింది కదా.. అమ్ములు.. అని మాట్లాడుతుండగానే పైనుంచి హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తూ లైట్ పడేసరికి గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది, అరణ్య ఎక్కి కూర్చోగానే వేగం పుంజుకుని ముందుకు కదిలింది.

తెల్లతెల్లారి నాలుగు అవుతుందేమో గుర్రం అడవిని దాటి మళ్ళీ రోడ్డు ఎక్కింది, వెనకాల ఎవరైనా పడుతున్నారేమో అన్న భయంతో అరణ్య దిక్కులు చూస్తుంటే, గుర్రం తన పని తాను చేసుకుపోతుంది, ఉన్నట్టుండి గుర్రానికి ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోగా అరణ్యకి అర్ధమయ్యి, దారి చూపించమని చేతిలో ఉన్న మచ్చని కోరుకోగా తన కళ్ళేదురున్న ఆకాశంలో నక్షత్రం ప్రకాశంగా వెలిగింది అంతే గుర్రం ఇకిలిస్తూ ముందుకు కదలగా ఎక్కడి నుంచి వచ్చాయో నాలుగు కుక్కలు గుర్రానికి నాలుగు వైపులా పరిగెడుతూ గుర్రానికి దారి చూపిస్తూ ఇలా రోడ్డు మీద కాదని రోడ్డు నుంచి దూరంగా తీసుకెళతూ రైలు పట్టాల  మార్గాన తీసుకెళ్లి వదిలి అక్కడితో ఆగగా గుర్రం వేగం పెంచింది.

అరణ్య వెనక్కి చూస్తూ వాటికి ధన్యవాదాలు తెలిపి మళ్ళీ గుర్రాన్ని గట్టిగా పట్టుకుంది.. తెల్లారుతుంటే వెనక నుంచి ట్రైన్ కూత వినిపించగా అరణ్య తిరిగి చూసింది.. ట్రైన్ వేగంగా అరణ్యని దాటుకుంటూ వెళుతుంటే గుర్రం ట్రైన్ కి పోటీగా ఇంకా వేగం పెంచింది..

ఇటు రాత్రికి రాత్రి రోడ్డు మీద గుర్రంతో వెళుతున్న అరణ్యని ఎవడో ఫోటో తీసి ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసాడు #Angelonthehorse అన్న హ్యాష్టాగ్ తో.. పొద్దున్న కల్లా ఒక ప్రముఖ సెలబ్రిటీ రిట్వీట్ తో అది కాస్తా వైరల్ అయ్యి కూర్చుంది.. ఇప్పుడు ట్రైన్ లో వెళుతున్న ఒకడు ట్రైన్ తో పోటీగా పరిగెడుతున్న గుర్రాన్ని దాని మీదున్న అరణ్యని చూడగానే చిన్న వీడియో బైట్ ఒకటి తీసి దానికి హ్యాష్టాగ్ పెట్టేసి వదిలాడు.. సూర్యుడు వచ్చేలోపు ట్విట్టర్లో, న్యూస్ చానెల్స్ లో ఇదే మెయిన్ న్యూస్ అయ్యింది.. ఫోటో తీసిన లొకేషన్ వీడియో పోస్ట్ చేసిన లొకేషన్ వేరు వేరు అని ఎవడో గుర్తులు చెప్పాడు దానతో ఇప్పుడు అందరికీ ఆ గుర్రం మీద ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలయ్యింది. ఎక్కడ అరణ్య కనిపిస్తే అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ట్విట్టర్లో పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ అరణ్య మనసు మాత్రం తన బావని చూడాలన్న తన కోరిక మరియు ఆలోచనలు గుర్రం కంటే వేగంగా పరిగెడుతున్నాయి.
Like Reply
#58
56    

అరణ్యకి దారిపొడవునా జంతువులు తోడుగానే ఉన్నాయి, తనకి అవసరం వచ్చినప్పుడల్లా ఏదోరూపంలో సాయం చేస్తూనే ఉన్నాయి. కొంతసేపు కుక్కల రూపంలో కొంతసేపు పక్షుల రూపంలో ఇక అడవి మార్గల్లో అయితే ఒక అడవి నుంచి ఇంకో అడవి సరిహద్దు వరకు జింకలు, కుందేళ్లు, నెమళ్ళు ఇలా అన్ని జంతువులు సాయం చేస్తూనే ఉన్నాయి.

నిశితమైన అడవిలో బైట ఎండ విజృంబిస్తున్నా లోపల మాత్రం చల్లగా నీడగా ఉంది, గుర్రం వేగం తగ్గించి చిన్నగా నడుస్తుంటే అరణ్యకి ఆకలిగా అనిపించి చుట్టూ ఏదైనా తినడానికి దొరక్కపోదా అని చూస్తుంది.. కొంత దూరం వెళ్ళాక ఒకటి సపోటా చెట్టు కనిపించింది దాని నిండా పళ్లే కానీ పండలేదు, గుర్రం మాత్రం ఆపకుండా తినేస్తుంటే అరణ్య ఒకటి తీసుకుని తినగా చేదు కొట్టింది, అయినా తప్పక ఒక రెండు తినేసి చెట్టుకి ఆనుకుని సేద తీరుతూ కళ్ళు మూసుకుంది.

ఇంకోవైపు టీవీల్లో అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు అమ్మాయి ఎటు వెళుతుందా అని వీడియోల్లో తనకి కాపలాగా ఉంటున్న జంతువులని, అరణ్య వేగవంతమైన ప్రయాణాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది మాత్రం అందులో ఏముంది భూమ్మీద ఎంతో మంది ఉన్నారు ఇందులో ఆశ్చర్యం ఏముంది అని కొట్టివేశారు ఇంకొంతమంది అయితే అరణ్యని దేవత అని దైవ కార్యం కొరకు వెళుతుందని తనని వెంబడించడం ఆపమని కోప్పడ్డారు ఇలా ఎవరి స్పందన వారిది.

ఇంకో వైపు సుశాంత్ మరియు ప్రదీప్ కూడా ట్విట్టర్ ని, మీడియా ఛానెల్స్ ని ఫాలో అవుతూ అరణ్యని వెంబడిస్తున్నారు.. అరణ్యని ఆపే శక్తి తనని ఇంటికి తీసుకొచ్చే పవర్ రెండూ ఉన్నా అస్సలు అరణ్య ఎక్కడికి వెళుతుందా అన్న కుతూహలం మొదలయ్యి.. అరణ్య పరుగు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలుసుకుని ఆ తరవాత తనని ఇంటికి తీసుకురావడానికి అరణ్య వెళుతున్న వైపే తమ మనుషులని పంపించారు.

పెద్ద ఏనుగు ఒకటి ఘీంకరించేసరికి అటు గుర్రానికి ఇటు అరణ్యకి మెలుకువ వచ్చి లేచారు, అరణ్య పక్కన అరటి గెల ఒకటి పెట్టి వెళుతున్న ఏనుగుకి నమస్కరించి దానికి కృతజ్ఞతలు తెలిపింది.

రాత్రి వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని ఇద్దరు మళ్ళీ ఆకాశంలో మెరుస్తున్న తారని చూస్తూ ముందుకు వెళుతున్నారు. చీకటిలో వర్షం పడేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ఎక్కడుందో తనకే తెలీదు తను నమ్ముకుందల్లా ఆ గుర్రాన్ని, తన చేతిలో ఉన్న మచ్చని, బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తెలియని తన బావని.. గుడ్డిగా వెళుతుంది.. కొంత దూరం నడిచిందో ఏమో సున్నితమైన తన పాదాలు మంట పుడుతుంటే గుర్రం తన కాళ్ళని చూస్తూ పక్కనే నడుస్తుంది. అరణ్య అది గమనించి గుర్రంతో మాట్లాడుతూ తన మీద చెయ్యి వేసి నిమురుతూ వర్షంలో తడుస్తూ వెళుతుంటే అరటి చెట్లు కనపడ్డాయి.. పెద్ద పెద్ద ఆకులని తన ఒంటి మీద కప్పుకుని ఇంకో ఆకు తన తల మీద పెట్టుకోగా గుర్రం కూర్చోమని వంగింది.. అర్ధమైన అరణ్య ఎక్కి కూర్చుని అరటి ఆకులని గట్టిగా గొడుగులా పట్టుకొగా గుర్రం నెమ్మదిగా పరిగెడుతూ ఉంది.

ఐదు రోజుల ప్రయాణం తరవాత అర్ధరాత్రి మిణుగురు పురుగుల సాయంతో అడవిలోనుంచి బైటికి వచ్చి చూస్తే దూరం నుంచి సముద్రం కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రం మాత్రం వెలుగుతూనే ఉంది.ఇంత వరకు అరణ్య తన బావతో మాట్లాడ్డమే కానీ ఒక్కమాట కూడా అటు వైపు నుంచి వినపడలేదు.

మెయిన్ రోడ్డు దాటి బీచ్ వైపు కాకుండా గుర్రం సముద్రం వైపు అడుగులు వేస్తుంటే అరణ్యకి ఏమి అర్ధంకాక గుర్రం మీద కొడుతూ అడుగుతుంటే గుర్రం మాత్రం పట్టించుకోకుండా వెళుతుంది. అప్పటికే అరణ్యని చాలా మంది చూసేసారు.. వెంటబడి ఫోటోలు వీడియోలు తీస్తుంటే గుర్రం వేగం పెంచి అక్కడ నుంచి పారిపోయి మనుషులు లేని చోట ఇసుకలో సముద్రం వైపు నడుచుకుంటూ వెళుతుంది.
Like Reply
#59
Where is update bro
Like Reply
#60
57    

టీవీ న్యూస్ :

ఇప్పుడే అందిన తాజా వార్త భూకక్ష లోకి వచ్చి భూమ్మీద పడుతున్నది ఆస్టరాయిడ్స్ అనుకున్నాం మనమంతా కానీ ఆకాశంలో ఏదో స్పేస్ షిప్ రెండు ముక్కలుగా అగ్నిగోళంలా భూమ్మీదకి విరుచుకుపడుతుందని.. NASA కి సిగ్నల్ అందిందని అందులో ఉన్నది భూవాసి అని ఇప్పుడే సమాచారం అందింది.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని భూ కక్షలోకి వస్తే గాని పూర్తి సమాచారం విడుదల చేయలేమని అమెరికా స్పష్టం చేసింది..

అదే రోజు రాత్రి..

సుబ్బు కొడుకు, అక్షిత కూతురు, విక్రమ్ ఆదిత్య వాసుల సంతానం పిల్లలంతా కాలేజీ వయసువారే అర్ధరాత్రి దాటినా ఎవ్వరు పడుకోలేదు కారణం విక్రమ్ కొడుక్కి ఆదిత్య కూతురుకి పెళ్లి జరుగుతుంది.. అందరూ పనులు చేసి అలిసిపోయి తలో దిక్కు పడ్డారు.. పెద్దవాళ్లంతా ఒకదిక్కు చిన్నవాళ్ళంతా ఒక దిక్కు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు..

అమ్మా ఇది చూసావా అంటూ ఫోన్ పట్టుకుని వచ్చాడు అఖిల కొడుకు..

అక్షిత : ఏంట్రా అని వాడి పక్కన నిలుచుంది.. పిల్లలు వారితోపాటే పెద్దలు అందరూ ఫోన్ చూస్తుంటే అఖిల కొడుకు వీడియో ప్లే చేశాడు.

అరవింద్ : ఎవరు

ఎవరో తెలీదు నాన్నా కానీ కొన్ని వందల కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణిస్తుంది చెప్పులు కూడా లేవు.. తన చుట్టూ జంతువులు, పక్షులు కూడా వెళుతున్నాయి..

అక్షిత : తన డ్రెస్సింగ్ విధానం చూడండి.. ఏదో సాధువులా ఉంది

మానస : ఎంతో సంతోషంగా వెళుతుంది, గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది వీడియో

సుబ్బు : గుర్రం చాలా బాగుంది, చాలా వేగంగా వెళుతుంది.

ఆదిత్య : వీడు అమ్మాయి గురించి వదిలేసి గుర్రం గురించి మాట్లాడుతుంటే చూడ్డానికి బాలేదు రా

విక్రమ్ : హ్మ్మ్..

రక్ష : ఏంటి మీరిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు

ఆదిత్య : అదీ.. పెద్దమ్మ ఏం లేదు.. ఇద్దరు జంప్

రక్ష : వయసు పెరిగి కొడుకు కూతుర్ల పెళ్లి జరుగుతున్నా ఆలోచనలు మాత్రం అక్కడే ఆగిపోయాయి.. అందరూ.. వెళ్లి పనులు చూడండి.. అని అక్షితని పక్కకి లాక్కేళ్ళింది... చిన్నా నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా

అక్షిత : ఇంకా లేదు.. అనుమాన పడకు నా మొగుడు చావలేదు.. బతికే ఉన్నాడు.. ఆయన్ని చంపడం ఎవ్వరి వల్లా కాదు.. కచ్చితంగా ఏదో ఒకరోజు నా కోసం వస్తాడు అని కళ్ళు తుడుచుకుంది..

రక్ష అక్షితని ఓదారుస్తూ తన కూతురు వంక చూసింది.. సుబ్బు తనతో మాట్లాడుతున్నాడు.

రక్ష : అమ్మాయి...?

అక్షిత : పాపం దానికి వాళ్ళ నాన్నని చూడాలని ఎంత ఆశగా ఉందొ.. ఎవ్వరిని అడగాలో తెలీదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు అలా ఉంటుంది.. చిన్నా గాడు వచ్చేవరకు మాకివి తప్పవులే

రక్ష : చిన్నా బతికే ఉన్నాడని అంత నమ్మకంగా ఎలా ఉండగలుగుతున్నావ్

అక్షిత : నాకు తెలుస్తుంది.. వాడు బతికే ఉన్నాడు.. వాడి కూతురు ఎలా ఉందొ చూసుకోవడానికైనా కచ్చితంగా వస్తాడు.

సుబ్బు అక్షిత మరియు రక్ష మొహాలు చూడగానే చిరంజీవిని గుర్తు చేసుకుంటున్నారని తెలిసి అక్షితా.. ఇలా రా అని అరవడంతో ఇద్దరు తేరుకుని మళ్ళీ పనుల్లో పడ్డారు.

సుబ్బు మాత్రం అందరూ అలిసిపోయి పడుకున్నాక ఒంటరిగా కారు తీసుకుని తన ఫోన్ కి వచ్చిన కొ ఆర్డినేట్స్ మరొక్కసారి చూసాడు అవి కచ్చితంగా చిరంజీవి పంపినవే అని తన గట్టి నమ్మకం.. ఇంతక మునుపు కూడా ఇలాంటివి జరిగాయి అందుకే ఎవ్వరికి చెప్పలేదు ఒంటరిగా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.

`•´ `•´
`°´

జన సమూహం నుంచి దూరంగా సముద్రపు ఇంకో వైపుకి వచ్చాక గుర్రం శాంతించి చిన్నగా నడుస్తుంటే అరణ్య గుర్రం దిగి తనని స్పృశిస్తూ ఎందుకలా ఆవేశ పడిపోయావు, ఎవరినైనా చూసి భయపడ్డావా అని అడగ్గా గుర్రం ఏమి లేదన్నట్టు ఇకిలిస్తూ ముందుకు నడవగా అరణ్య చెదిరిన తన జుట్టుని వీచే గాలికి బలంగా సర్దుకుంటూ ముందుకు నడుస్తు అలలని చూస్తుంది.. చిమ్మ చీకటి నుంచి తెల్లారే చీకటికి మారే సమయం అది..

అలల హోరు సంగీతంలా వినపడుతుంటే తన నడుముకి కట్టిన వేణువు తీసి సన్నని నాట్యంతో కూడిన వేణుగానం ఆలపిస్తుంటే వెనకాల నిలుచుని చూస్తున్న గుర్రం కూడా చిన్నగా నాట్యమాడుతుంది, ఇంకో నిమిషానికి పక్షులు వచ్చి చేరాయి.. కొన్ని పాడుతుంటే కొన్ని రెక్కలు వేగంగా కొడుతూ అరణ్య వేణుగానానికి హంగులు జోడిస్తున్నాయి.

ఉన్నట్టుండి గుర్రం ఒక్కసారిగా అరవడంతో అరణ్య వెనక్కి తిరిగింది, ఎక్కడినుంచి వచ్చారో మిలిటరీ సోల్జర్స్ వేగంగా గన్స్ తో వచ్చి అరనిమిషంలో గుర్రాన్ని ఇంకో క్షణంలో అరణ్యని అదుపులోకి తీసుకున్నారు.. గుర్రం మీద వల వేశారు, ఆరుగురు కలిసి పట్టుకున్నా గుర్రం అదుపు కాకపోవడంతో ఆఫీసర్ గన్ తీసి రెండు సార్లు షూట్ చేసాడు.. అరణ్య గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగిపడిపోయింది.. గుర్రం విలవిలలాడుతూ పడిపోతుంటే కారుతున్న రక్తంతో గందరగోళంగా తయారు అయ్యింది అక్కడి వాతావరణం.. ప్రకృతికి కూడా కోపం వచ్చిందేమో ఉన్నట్టుండి అలల తీవ్రత ఎక్కువయ్యింది.. గాలి వేగం అదుపు తప్పింది.. హోరు వర్షం కురుస్తుంటే అరణ్యని వాహనంలోకి ఎక్కించారు.. అరణ్యకి తెలివి వచ్చి కిటికీ లోనుంచి గాయపడిన గుర్రాన్ని చూస్తూ ఏడుస్తుంటే గుర్రం రెండు నిమిషాలకి మౌనంగా పడిపోయింది.. గుర్రాన్ని ఆ స్థితిలో చూడగానే అరణ్యకి తల తిరిగిపోయింది.. వెంటనే స్పృహ కోల్పోయింది..

సోల్జర్ 1 : ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తారు

సోల్జర్ 2 :  ముందు విచారిస్తారు.. ఆ తరువాత తెలీదు, ఆ అమ్మాయికి ఆనిమల్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకోవాలట.. తను ఎక్కడికి వెలితే అక్కడికి పక్షులు ఎలా వస్తున్నాయి అని సైంటిస్ట్ లకి అనుమానాలు ఉన్నాయి.. నేను పూర్తిగా వినలేదు.. ఏంటి నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తున్నావ్ అంటూ గాల్లోకి చూసాడు.. ఆకాశం నుంచి ఏదో స్పేస్ షిప్ రెండు ముక్కలుగా అగ్నిగోళంలా చాలా వేగంగా కింద పడుతున్నాయి..

అరణ్యని గాయపడిన గుర్రాన్ని అక్కడినుంచి తరలించి ఇన్ఫర్మేషన్ అందించారు.. అప్పటికే ప్రెస్ వచ్చేసింది.. స్పేస్ షిప్ సముద్రంలో పడింది.. ఆ ప్రాంతంలో అప్పటికే అందరూ వచ్చేస్తున్నారు.

అరణ్యని గుర్రాన్ని ఆ విధంగా నిర్ధయగా తీసుకెళతున్నా అక్కడే దూరంగా ఉండి అంతా చూస్తున్న సుబ్బు మాత్రం ఏమి చెయ్యలేదు, స్పేస్ షిప్ కింద పడగానే సుబ్బు దాని దెగ్గరికి వెళ్ళిపోయాడు.. అది చూసిన నేవి వాళ్ళు సుబ్బుని మైకులో వారిస్తూనే తన వెనకాలే షిప్స్ లో వెళుతున్నారు.. సుబ్బు అదేమి పట్టించుకోలేదు వేగంగా వెళ్ళిపోయాడు.. అంతా మంటలు.. లెక్కచేయకుండా వెళ్ళాడు.. రెండు నిమిషాలకి స్పేస్ షిప్ నుంచి విరిగిన పెద్ద ముక్క డోర్ తెరుచుకుంది చిన్నగా.. చిరంజీవి గాయాలతో బైట పడ్డాడు.. వెంటనే విజిల్ వేయగానే షిప్ లోపలనుంచి విశ్వ అండ్ టీం వచ్చింది.. విశ్వ మరియు కిరణ్ కిందకి దూకి చిరంజీవిని తీసుకొస్తుంటే సుమన్ మరియు రియా వచ్చే నేవికి ఎవ్వరికి కనిపించకుండా స్మోక్ గ్రనెడ్స్ వేస్తున్నారు..

కావేరి : విశ్వ వచ్చేస్తున్నారు.. త్వరగా రావాలి

వెంటనే సుమన్ చిరంజీవిని పైకి లాగేయడం.. విశ్వ మరియు కిరణ్ బోట్ ఎక్కడంతో సుబ్బు అక్కడి నుంచి ఇంకో వైపుకి షిప్ ని తీసుకెళ్ళిపోయాడు..

అదే రోజు సాయంత్రానికి.. మరో రెండు భయంకరమైన వార్తలు, ఒకటి తుఫాను వల్ల ప్రాణ నష్టం అయితే ఇంకోటి భూ గ్రహం పక్కన ఉన్న ఒక నక్షత్రం నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది..

ఈ విశ్వ అండ్ టీం ఎవరో తెలుసుకోవలనుకుంటే.. దానికి సంబంధించిన కధ లింక్ పెడుతున్నాను.. వీలైతే చదవండి.

ఆరు చెంచాలు : https://xossipy.com/thread-47610-post-48...pid4852201
Like Reply




Users browsing this thread: