Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#1
Heart 
విజ్ఞప్తి

అందరికీ నమస్కారం,
నేను మొదలుపెట్టబోయే ఈ అరణ్య అనే థ్రెడ్
ఒక దారావాహికము
త్వరలోనే మొదలు పెడతాను

మీ అందరికి విజ్ఞప్తి ఏమనగా
దయచేసి నా ఈ ఒక్క థ్రెడ్ లో మాత్రం కామెంట్స్ చెయ్యకండి. 

ఒక వేళ ఎవరైనా కామెంట్స్ చేసినా వాటిని తొలగించవలసిందిగా అడ్మిన్ గారిని కోరుతున్నాను.

LIKE & RATE ముద్దు
కామెంట్ మాత్రం వద్దు
దయచేసి అర్ధం చేసుకోండి
ధన్యవాదాలు
~టక్కులసాజల్
❤️❤️❤️
❤️
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
1     

తెల్లవారక ముందే లేచి కూర్చున్నాను, అస్సలు రాత్రంతా నిద్ర పడితే కదా ఒకటే భయం, ఇవ్వాల్టితొ నా ఈ ప్రపంచంలోనుంచి బైటికి వెళ్తున్నాను, వెళ్ళాలి. నా పేరు శివ, ఈ అనాధ ఆశ్రమం నడిపే కావేరి పెద్దమ్మ పెట్టింది నాకా పేరు.

ఈ ఆశ్రమం మొదలయ్యింది నాతోనే, నేను తనకి దొరికాకే పెద్దమ్మకి అనాధ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. పెద్దమ్మ చేతుల్లోనే పెరిగినా తన ఇంట్లో ఉండలేక బైటికి వచ్చేసాను. అందరికంటే నన్ను కొంచెం ముద్దు చేసినా అందరికంటే పెద్దవాణ్ని అవటం వల్ల పనులు, బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉండేవి.

ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనుంచి బైటికెళ్లే సమయం వచ్చింది, ఇప్పటికే ఇక్కడ వందకు పైగా పిల్లలు ఉన్నారు. పెద్దమ్మకి ఇప్పటికే చాలా కష్టంగా ఉంది ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అందుకే నిన్నే వెళ్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేరాను, ఆ కాలేజీ పక్కనే ఉన్న హోటల్లో పని కూడా దొరికింది.

ఆయన పేరు ఖాసీం, నా వృత్తాంతం అంతా ఆయనకి వివరిస్తే ఒప్పుకుని నన్ను పనిలో పెట్టుకున్నాడు. ఉండటానికి చిన్న హాస్టల్ కూడా చూసుకున్నాను, నెలకి మూడు వేలకి చిన్న రూమ్ ఇచ్చారు. రూములో నాతో పాటు ఇద్దరు, భోజనం వాళ్లదె, ఆదివారం మాత్రం మధ్యాహ్నం చికెన్ రాత్రికి మాములు భోజనం విత్ స్వీట్. పెద్దమ్మ దెగ్గర తీసుకున్న ఐదు వేలలో మూడు వేలు కట్టేసి జాయిన్ అయ్యాను.

మెలుకువ వచ్చి కళ్ళు తెరవగానే ఇవే నాకు గుర్తొచ్చిన నిన్నటి విషయాలు. లేచి పక్క మడతేసి, చెట్లకి నీళ్లు పట్టి అలానే కొన్ని కొత్త మొక్కలు నాటి శుభ్రంగా స్నానం చేసి పెద్దమ్మ రాకకోసం ఎదురు చూస్తున్నాను.

ఎనిమిదింటికల్లా పెద్దమ్మ వచ్చింది, నన్ను చూసి నా దెగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసి టిఫిన్ చేసాం.

పెద్దమ్మ : వెళుతున్నావా?

శివ : అవును పెద్దమ్మ.

పెద్దమ్మ : నా మాట వినవా నువ్వు, నువ్వు లేకుండా 

శివ : లేదు పెద్దమ్మ ఇప్పటికే నీకు చాలా కష్టంగా ఉంది నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఇప్పుడు ఈ ఆశ్రమానికి ఇంకో చెయ్యి అవసరం ఉంది, ఆ చెయ్యి నేనే కావాలని ఆశీర్వదించు పెద్దమ్మా అంటూ కాళ్ళు పట్టుకున్నాను.

పెద్దమ్మ : ఆయుష్మాన్భవ అంటూ నన్ను ఆశీర్వాదించి జాగ్రత్త అంటూ నా నుదిటి మీద ముద్దు ఇచ్చింది.

పెద్దమ్మ కళ్ళలో నీళ్లు చూడలేక ఇక అక్కడ నుంచి సెలవ తీసుకుని పిల్లలందరికి చివరి సారి జాగ్రత్తలు, వాళ్ళు చెయ్యవలసిన పనులు అన్నీ చెప్పి బైటికి బైలుదేరాను చిన్న బ్యాగుతొ.

ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉన్న పిల్లలు కదా కొంచెం బాధ పడ్డారు, అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చి ఆశ్రమం నుంచి మొదటి అడుగు బైటికి వేసాను అలానే ఒక సారి వెనక్కి తిరిగి కావేరి అనాధ ఆశ్రమం అన్న బోర్డు చూస్తూ.
Like Reply
#3
2     
ఆశ్రమం నుంచి హాస్టల్ పది కిలోమీటర్ల దూరం,
బస్సు ఎక్కి హాస్టల్ కి వెళ్లి ఓనర్ ని కలిసి రూం లోపలికి వెళ్లాను. మొన్న చూడలేదు లోపల ఇద్దరు నా వయసు వారే. చదువుకుంటున్నారు, నన్ను చూసి పలకరించారు ఇద్దరినీ పరిచయం చేసుకున్నాను ఒకరి పేరు సందీప్ ఇంకొకరి పేరు రాజు, కొంచెం సేపు కూర్చుని బట్టలు కొనడానికి బైటికి వెళ్ళాను కాలేజీ కోసం, పెద్దమ్మ ఇచ్చిన వాటిలో ఇంకా రెండు వేలు మిగిలి ఉన్నాయి.

ఒక షాప్ లో వెయ్యికి మూడు జీన్స్ అంటే వెళ్లి తీసుకున్నాను, పక్కనే ఇంకో హోల్సేల్ షాప్ లో వంద రూపాయల టీ షర్ట్లు ఒక ఐదు తీసుకుని, మిగిలిన ఐదు వందల్లో బ్రష్షు పేస్ట్ ఒక ప్లాస్టిక్ బకెట్ ముగ్గు ఒక ఒంటి సబ్బు ఒక బట్టల సబ్బు ఒక స్టీల్ ప్లేట్ ఒక స్టీల్ గ్లాస్ కొని తిరిగి రూమ్ కి వచ్చాను.

మధ్యాహ్నం వరకు ఏవేవో ఆలోచనలు ఆతరువాత సందీప్ రాజు ఇద్దరు భోజనానికి వెళదాం రమ్మంటే  ప్లేటు గ్లాసు తీసుకుని లేచి రూమ్ నుంచి బైట హాల్లోకి వెళ్లి లైన్లో నిలుచుని కొంచెం అన్నం బెండకాయ కూర పప్పుచారు వేసుకున్నాను.

పక్కనే మామిడికాయ పచ్చడి ఉంటే కొంచెం వేసుకుని రూమ్ లోకి వచ్చి నాకు ఇచ్చిన మంచం మీద కూర్చుని తినేసి సింకులో ప్లేటు కడిగేసి నిద్రకి ఉపక్రమించాను.

ఒక రెండు గంటలు పడుకుని లేచి సందీప్ తొ మాట్లాడగా వారు కూడా నేను చదివే కాలేజీలోనే మొదటి సంవత్సరం అని తెలిసింది సందీప్ నేను తీసుకున్న గ్రూప్ mpc తీసుకున్నాడు, రాజు మాత్రం cec తీసుకున్నాడు అని చెప్పాడు.

సాయంత్రనికి హోటల్ దెగ్గరికి వెళ్లి ఖాసీం గారిని కలిసాను.

ఖాసీం : హా బేటా ఆవో.

శివ : ఖాసీం గారు రేపటి నుంచి పనిలోకి వస్తాను.

ఖాసీం : అరే బేటా..ఉతనా రెస్పెక్ట్ కైకు.. ఇక్కడ అందరూ నన్ను ఖాసీం చాచా అని పిలుస్తారు నువ్వు కూడా అలానే పిలువు.

ఇక నీ పని పొద్దున్నే ఐదు గంటలకిరా ఎనిమిదింటి వరకు టీ సెక్షన్ నడుస్తుంది అది చూసుకుని కాలేజీకి వెళ్ళిపో మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వచ్చి పది గంటలకు హోటల్ మూసే వరకు ఉండాలి దీనికి నీకు పది వేలు ఇస్తాను ఇష్టమైతే రేపటి నుంచి వచ్చేసేయి.

శివ : అలాగే చాచా కానీ నా వల్ల మీకు ఇబ్బంది రాదుగా, ఎందుకంటే మీ దెగ్గర పని చేసేవాళ్లంతా '' వాళ్లే... అని ఇంకేదో చెప్పబోతుండగా

ఖాసీం : అరే బేటా.. కైకు సోచ్రే వయిసా.. దేవుడు అందరికీ ఒకటే బేటా నాకు అల్లాహ్ అయితే నీకు శివుడు, కష్టం వస్తే ముందుగా తలుచుకునేది దేవుడినే కదా.. లక్ష్మీ.. లక్ష్మీ

లోపలనుంచి ఒకావిడ బైటికి వచ్చింది. తనని చూపించి చూడు బేటా తనే నా బేగం నామ్ హై లక్ష్మీ, నీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే మీ వాళ్లు కూడా ఇక్కడున్నారు ధైర్యంగా పనిచేసుకోవచ్చు.

శివ : అలా కాదు చా

లక్ష్మీ : మీరు ఊరుకోండి చూడు బాబు నీ పేరు

శివ : శివ

లక్ష్మీ : ఆ చూడు శివ మాకు ఆ పట్టింపులేవి ఉండవని నీకు ఈ పాటికే అర్ధం అయ్యి ఉండాలి, బుద్ధిగా పని చేసుకో అలాగే మంచిగా చదువుకో లేకపోతే ఈయన లాగే టీ కొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది.. అని నవ్వింది.

ఖాసీం : ఏంటి... టీ కొట్టా??... ఖాసీం చాచా కా అడ్డా హై యే... ఖాసీం హోటల్

లక్ష్మీ : హా సరేలే అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

ఖాసీం : అదిగో బేటా నీ ఇష్ట ప్రకారమే అక్కడ సాయిబాబా పఠం ఉంది దణ్ణం పెట్టుకుని రేపటి నుంచి పనిలోకి వచ్చేయి..

ఖాసీం చాచా దెగ్గర సెలవు తీసుకుని హాస్టల్ వైపు నడుస్తుండగా నాకు గొప్ప జ్ఞానోదయం కలిగింది, అప్పటి వరకు ఒక రకంగా ఆలోచిస్తున్న నాకు ఖాసీం చాచా కనువిప్పు కలిగించాడు, బైట ప్రపంచం నాకు జీవితం అంటే ఏంటో నేర్పించడం మొదలుపెట్టింది అది మంచిగానే నన్ను తీర్చిదిద్దాలి అని పరమశివుడికి మొక్కుకుంటూ హాస్టల్ లోపలికి నడిచాను.
Like Reply
#4
    3      


సాయంత్రనికి మెలుకువ వచ్చింది కొంసేపు అలా బైటకి వెళ్లి పబ్లిక్ గార్డెన్ లో గడ్డి మీద కూర్చుని వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాను, మానసంతా ఒంటరిగా ఉండి ఉండి అలవాటు అయ్యిందేమో చిన్న పిల్లలని చేతపట్టుక్కుని వెళ్తున్న వాళ్ళ అమ్మా నాన్నా తాతయ్యాలని చూస్తూ ఉండాలనిపించి అలానే చీకటి పడే వరకు ఉన్నాను.

వాచ్మాన్ విజిల్ విని లేచి బైటికి నడిచి కొన్ని షాపులు చూసుకుంటూ రేపటికి కాలేజీకి వెళ్ళడానికి రెండు పుస్తకాలు కొని హాస్టల్ లోపలికి వెళ్లిపోయాను.

 పేరుకే తిని పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు, ఇప్పుడు నాకన్ని బాధలేం లేవు కానీ ఎందుకో నా మనసింకేదో కోరుకుంటుంది దానికి సమాధానం చెప్పే జవాబు నా దెగ్గర లేదు బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.

పొద్దు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి బైటికి నడిచాను చలికాలం వల్ల మంచు పేరుకుపోయింది, చలి ఇరగేస్తుంది అలానే రెండు చేతులు కట్టుకుని కుక్కల అరుపులు వింటూ నడుచుకుంటూ హోటల్ కి వెళ్లాను.

ఖాసీం చాచా టీ పెట్టడానికి స్టవ్ ఎలిగిస్తున్నాడు వెళ్లి పలకరించి చీపిరి తీసుకుని అంతా ఊడ్చాను, చిన్నగా అందరూ రావడం మొదలు పెట్టారు పొద్దున్నే ఐదు గంటల నమాజ్ చేసే ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చారు వారితో పాటే లారీల మీద పనికి వెళ్లే ఆడ మగ పనివాళ్లు కూడా అందరూ టీ తాగేసి లారీ ఎక్కి వెళ్లిపోతున్నారు.

ఆరున్నర వరకు నేను చాచా ఇద్దరం టీ సెక్షన్ చూసుకున్నాం ఆ తరువాత నుంచి నన్ను టీ దెగ్గర నిలబెట్టి మిగతా పని వాళ్లు వస్తే వాళ్ళతో టిఫిన్ చేయించడానికి వెళ్ళిపోయాడు.

ఒక అరగంట కాళి దొరికింది ఆ తరువాత మొదలయింది యుద్ధం, హోటల్ కి ఒక వంద మీటర్ల దూరంలోనే అడ్డా ఉందట అంతా కూలి పనులకి వెళ్లే వాళ్లు, మేస్త్రి పనివాళ్ళు, అమాలి వాళ్లు, పొద్దున్నే ఆఫీసుకి వెళ్లే ఉద్యోగులు ఒకటేమిటి ప్రతీ ఒక్కరు హోటల్ లో టిఫిన్ చేసి టీ తాగానిదే ఒక్కరు కూడా కదలట్లేదు అడ్డా నుంచి, అప్పుడే అర్ధమైంది ఖాసీం చాచా హోటల్ అంటే ఎంత ఫేమస్సో.

తొమ్మిదింటికి చాచా వచ్చి టీ దెగ్గర నిలబడి నన్ను టిఫిన్ చేసి వెళ్ళిపోమన్నాడు, ఇడ్లి తినేసి చక చకా హాస్టల్ కి నడిచాను.

గంటల తరబడి నిలబడటం అలవాటు లేనందువల్ల కాళ్ళు కొంచెం నొప్పిగా అనిపించాయి రూమ్ లోకి వెళ్ళాను అప్పటికే సందీప్ వాళ్లు రెడీగా ఉన్నారు వాళ్ళకి రెండు నిముషాలు అని చెప్పి స్నానం చేసి రాత్రి కొన్న రెండు పుస్తకాలతొ బైలుదేరాను కాలేజీకి.

గేట్ లోపల అడుగుపెట్టి నేరుగా ప్రిన్సిపాల్ ఆఫీస్ కి వెళ్లి వారిని కలిసి మళ్ళీ క్లర్క్ ఆఫీస్ కి వెళ్లి TC సబ్మిట్ చేసి మా క్లాసులు కనుక్కుని వెళ్లి కూర్చున్నాం.

మొదటి రోజు అంతగా ఏం చెప్పలేదు కానీ అటెండెన్స్ డెబ్భై శాతం లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని మాత్రం చాలా గట్టిగానే చెప్పారు ఎందుకంటే చాలా మంది మధ్యాహ్నం వరకు ఉండరట గవర్నమెంట్ కాలేజీ అవ్వటం వల్ల ఎవ్వరు పట్టించుకోరు అందువల్ల అందరూ మధ్యాహ్నమే ఎగ్గొడతారని సందీప్ చెప్పాడు అందుకే సార్లందరూ ఇంత కోపంగా ఉన్నారు స్టూడెంట్స్ మీద.

మధ్యాహ్నం బ్రేక్ లో హాస్టల్ కి వెళ్లి తినేసి మళ్ళీ కాలేజీకెళ్ళి కూర్చున్నాం, పీరియడ్ మొదలయింది మొదటగా సార్ వచ్చి ముందుగా తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు.

"అందరికీ నమస్కారం నా పేరు గగన్ అండి మీకు మాథ్స్ చెప్పడానికి వచ్చాను, ఫ్రమ్ చెన్నై IIT,  మాథమాటిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ని అండి మీకు బాగానే చెప్తాను, కొంచెం ఫాస్ట్ గా చెప్తాను అండి మీరు ఆ స్పీడ్ అందుకోవాల్సిందె తప్పదు 1+1=2 అని చెప్తూ సాగ దీయను డైరెక్ట్ గా రెండనే రాసేస్తాను, ఎవరైనా స్లో గా ఉంటే లైబ్రరీలో గైడ్ ఉంటుంది చూసుకోండి, పీరియడ్ లాస్ట్ లో పది నిమిషాల ముందు క్లాస్ ఆపేస్తాను అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక ప్రతీ పదినిమిషాలకి ఒకసారి వాటర్ టాయిలెట్ అని లేవద్దండి నన్ను అడగకుండానే వాటర్ తాగొచ్చు, లేచి బైటికి వెళ్లొచ్చు నేను పట్టించుకోను అందరికీ ఓకే అంటే క్లాస్ మొద్దలేడదాం" అని ఆపేసాడు.

అప్పటి వరకు ఈగల్లా ముసురుతుండే క్లాస్ సైలెంట్ అయిపోయింది. మాథ్స్ క్లాస్ మొదలయింది.
Like Reply
#5
4     


పేరుకే క్లాస్ జరుగుతుంది కానీ ఎవ్వరికీ అర్ధంకావట్లేదని క్లాస్ మొదలైన ఐదు నిమిషాలకే నాకు అర్ధమైపోయింది. సార్ చాలా ఫాస్ట్ గా చెపుతున్నారు ఆయన చెప్పే విధానం బట్టే తెలుస్తుంది సబ్జెక్టులో ఆరితేరిన వాడని. ఎక్కడో ఉండాల్సిన వాడు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాలేదు.

అరగంటలో క్లాస్ చెప్పేసి ఎవరైనా డౌట్స్ అడుగుతారేమో అని ఒక రెండు నిముషాలు చూసి బైటికి వెళ్ళిపోయాడు. సార్ బైటికి వెళ్ళగానే ఒక్కొక్కరు ఊపిరి పీల్చుకోడం మొదలెట్టారు. పక్కనే కూర్చున్న సందీప్ ని చూసాను సుబ్బరంగా నిద్ర పోతున్నాడు కదిలిస్తే లేచాడు.

సందీప్ : క్లాస్ అయిపోయిందా?

శివ : ఏంటి సందీప్ అలా పడుకున్నావ్?

సందీప్ : మరింకేం చేయమంటావ్ ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.

చిన్నగా నవ్వాను ఇంతలో బెల్ మోగింది, క్లాస్ లోకి వేరే మేడం వచ్చి ఇంగ్లీష్ క్లాస్ మొదలు పెట్టింది. సందీప్ మళ్ళీ పడుకున్నాడు అంతగా మమ్మల్ని పట్టించుకోట్లేదు, కాలేజీ మూడింటి వరకు అయిపోయింది.

సందీప్ తొ కలిసి హాస్టల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఒక గంట నడుము వాల్చి, నాలుగు అవుతుండేసరికి లేచి హోటల్ కి వెళ్లాను.

నాలుగింటి నుంచి ఆరింటి వరకు కాళిగానే ఉంటుందట, అయినా మీల్స్ వడ్డించడానికి మనుషులు ఉన్నారు. ఆరింటికి మళ్ళీ టీ మొదలు, ఒక గంట తరువాత హడావిడి తగ్గిపోయింది. ఎనిమిదింటి నుంచి మీల్స్ బిర్యానీ తెగ నడిచాయి సరిగ్గా మూసే సమయానికి ఎవరో సామానుతొ ఆటోలో వచ్చాడు.

ఖాసీం చాచా అతన్ని తన బావ కొడుకు, అల్లుడు అని పరిచయం చేసాడు పేరు లతీఫ్. ఇద్దరం కలిసి సామాను కిచెన్ లో సర్ది నేను హాస్టల్ కి వెళ్లిపోయాను.

ఒక రోజు గడిచింది.

పొద్దున్నే లేవడం హోటల్, తరువాత కాలేజీ మళ్ళీ హోటల్ తిరిగి హాస్టల్ కి రావడం శనివారం రాత్రి వరకు ఇదే జరిగింది.

ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి ఆశ్రమానికి బైలదేరాను, బస్సు ఎక్కి కూర్చున్నాను చేతిలో చిల్లి గవ్వ లేదు ఒక్క వంద రూపాయల నోటు తప్పితే ఉన్నవాటితోనే టికెట్ తీసుకుని బస్సు కిటికీ లోనుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూస్తూ ఉన్నాను అంతలోనే పక్క నుంచి ఒకటే హారన్ కొట్టడంతో పక్కకి చూసాను ఒక ఎర్ర కారు వేగంగా వస్తూ బస్సుకి సైడ్ ఇవ్వమని హారన్ కొడుతున్నాడు ఆపకుండా. బస్సులో కూర్చున్న మా అందరి చెవులు చిల్లులు పడుతున్నాయి.

కార్ లో చూసాను ఎవరో ఒకమ్మాయి టీ షర్ట్ జీన్స్ వేసుకుని ఉంది పక్కన ఉన్నవాడు కారు వేగంగా నడుపుకుంటూ బస్సుకే జెర్కులిస్తుంటే ఆ అమ్మాయి వద్దు అని వారిస్తూ భయంగా చూస్తుంది.

ఆ సౌండ్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని అటు ఇటు చూస్తూ ఒక్క సారి తల పైకి ఎత్తింది ఒక్క క్షణం నా కళ్ళలోకి చూసి మళ్ళీ పక్కకి చూసి మళ్ళీ నా కళ్ళలోకి చూసి చూడనట్టు ఒక చూపు విసిరి కారు నడుపుతున్నవాడిని మెల్లగా వెళ్ళమని బతిమిలాడుతుంది. రెండు సెకండ్లలో రెండు సార్లు తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాను.

బస్సు డ్రైవర్ కి చికాకు వచ్చి బూతులు తిట్టుకుంటూ సైడ్ ఇచ్చాడు, ఇంతలో నా స్టాప్ వచ్చేసరికి దిగి ఆశ్రమం లోపలికి నడుచుకుంటూ వెళ్లాను. పెద్దమ్మ ఎవరితోనో మాట్లాడుతూ నన్ను చూసి ఎదురు వచ్చి కౌగిలించుకుంది.

పెద్దమ్మ : ఎలా ఉన్నావురా?

శివ : ఇదిగో  ఇలా ఉన్నాను.

పెద్దమ్మతొ మాట్లాడి తన ఆరోగ్యం గురించి తెలుసుకుని మధ్యాహ్నం అక్కడే పిల్లలతొ కలిసి భోజనం చేసాను.

పిల్లలు మాకు ఏం తెలేదా అని అడిగేసరికి కొంచెం బాధ వేసినా ఎప్పుడో అప్పుడు ఆ రోజు కూడా వస్తుందని వాళ్ళకి నాకు సర్ది చెప్పుకున్నాను.

సాయంత్రం వరకు పెద్దమ్మతొ గడిపి చిన్న చిన్న పనులు ఉంటే చేసేసి తిరిగి హాస్టల్ కి బైలుదేరాను. వద్దన్నా కూడా వినిపించుకోకుండా పెద్దమ్మ నా చేతిలో ఐదు వందలు పెట్టింది, తీసుకుని మళ్ళీ బస్సు ఎక్కాను.

హాస్టల్ దారిలో ఇందాక చూసిన ఎర్ర కారు స్పాట్ ఆ రోడ్ వచ్చింది, ఎందుకో ఆ అమ్మాయి మొహం ఒకసారి గుర్తొచ్చింది. నేను మొట్ట మొదటసారి ఒక అమ్మాయిని ఒక క్షణమైనా కళ్ళలో కళ్ళు పెట్టి చూసాననేమో ఇంకా ఆ అమ్మాయి మొహం గుర్తుండిపోయింది.

అందమైన నుదురు దానికి తగ్గట్టే ఉన్న ముక్కు, భయంతొ చిన్నగా వణుకుతున్న పెదాలు, కారు వేగానికి తను కళ్ళు మూసుకోడం ఆ ఎదురోచ్చే గాలికి విరాబూసిన జుట్టు ఎగిరిపడటం, అంత పెద్ద జుట్టు ఏమి కాదు కానీ తక్కువా కాదు ఎంత ఉండాలో అంత ఉంది.

ఒక్కసారి నా చెంప మీద నేనే కొట్టుకున్నాను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అని. నా పక్కన కూర్చున్న ఒక అంకుల్ అది చూసి నన్ను ఒకసారి ఎగాదిగా చూసి వేరే సీట్ లో కూర్చున్నాడు, చిన్నగా నవ్వుకున్నాను.

హాస్టల్ కి వెళ్లి కొంత సేపు కూర్చున్నా, ఆ అమ్మాయి మొహం ఒకసారి అలా నా మైండ్ లో కనపడింది, మళ్ళీ పొద్దున్నే హాస్టల్ కి వెళ్లాలని గుర్తొచ్చి పెందలాడే తినేసి పడుకున్నాను.
Like Reply
#6
5     


రోజులు గడుస్తున్నాయి, బుద్ధిగా పని చేసుకుంటూ క్లాసులు వింటూ ఆదివారాలు ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండేవాడిని తప్ప అనవసరమైన విషయాలు, గొడవల జోలికి అస్సలు వెళ్ళేవాడిని కాదు.

లెక్కలు బాగా చెయ్యగలడం వల్లేమో గగన్ సార్ తో కొంచెం చనువు ఏర్పడింది, అప్పుడప్పుడు మాట్లాడేవాడిని.

ఖాసీం చాచా కూడా బాగా చూసుకునే వాడు, హాస్టల్ లో సందీప్ వాళ్లందరూ చనువుగానే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం డబ్బుకి ఇబ్బంది పడ్డా నా కష్టం ఎవ్వరికీ తెలియనివ్వలేదు.

ఎన్నో సార్లు బైట అందరిలా తిరగాలని, సినిమాలకి వెళ్లాలని బైట తినాలని అనుకునేవాడిని కానీ డబ్బులు లేక నోరు కట్టేసుకునేవాడిని. రోడ్డు మీద వెళ్లే పెద్ద పెద్ద కార్లు చూసి అస్సలు ఏం చేస్తారు వీళ్ళు అంతంత డబ్బు ఎలా సంపాదిస్తారు అనుకునేవాడిని. అలా నా ఆలోచనల్లోనే నెల దాటింది ఖాసీం చాచా మొదటి నెల జీతంగా ముందు చెప్పినట్టే పదివేలు చేతిలో పెట్టాడు. ఒక రోజు సెలవ అడిగాను.

ఖాసీం : చూడు బేటా.. ఇలా చెపుతున్నాని తప్పుగా అనుకోకు అందరూ జీతం రాగానే పని ఎగ్గొట్టి ఎంజాయ్ చెయ్యాలని చూస్తారు అని చెప్తుండగానే మధ్యలో దూరాను 

శివ : లేదు చాచా, నేను సెలవ అడిగింది బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో వెయ్యడానికి అలానే ఇందులో ఐదువేల ఐదు వందలు ఆశ్రమంలో ఉన్న పెద్దమ్మకి ఇవ్వాలి. ఇంత డబ్బు నా చేతిలో పట్టుకోడం ఇదే మొదటి సారి అందుకే భయం వేసి బ్యాంకులో వేద్దామని.

ఖాసీం : అలాగా,  అయితే తీసుకో బేటా. ఎలాగో ఈ నెలలో నువ్వు ఒక్క సెలవ కూడా పెట్టలేదు.

తెల్లారే కాలేజీకి కూడా వెళ్ళలేదు బ్యాంకుకి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసి మూడు వేలు అందులో డిపాజిట్ చేసాను మిగిలినవి తీసుకొని ఆశ్రమానికి వెళ్లి పెద్దమ్మకి ఇవ్వాల్సిన డబ్బులు వద్దని వారించినా తన చేతిలో పెట్టాను.

మిగిలిన పదిహేను వందల్లో ఐదు వందలు డొనేషన్ బాక్స్ లో వేసి వెయ్యి నా ఖర్చులకి ఉంచుకున్నాను ఒక ఐదు రోజులకి మిగిలిన ఆ మూడు వేలు కూడా విత్ డ్రా చేసి రెంట్ కట్టాను మళ్ళీ బ్యాంకు అకౌంట్ కాళీ. నిరాశగా అనిపించినా వచ్చే నెల నుంచి ఐదువేలు దాచి పెట్టొచ్చని గుర్తొచ్చాక కొంచెం ఊరట కలిగింది.

ఒకరోజు ఖాసీం చాచా పని మీద బైటికి వెళ్తూ నన్ను కౌంటర్ చూసుకోమని చెప్పి వెళ్ళాడు, నేను కౌంటర్ లో కూర్చున్నాను కొంత సేపటికి లతీఫ్ వచ్చాడు నన్ను చూసి కొంచెం కోపంగా "శివా కౌంటర్ నేను చూసుకుంటాను నువ్వెళ్ళి పని చేసుకో" అన్నాడు.

కొంచెం బాధేసినా నాకు నేనే సర్దిచెప్పుకుని పనిలో పడ్డాను, రాత్రి హోటల్ కట్టేసేటప్పుడు రోజూ లాగే ఖాసీం చాచా లెక్క చూసుకున్నాడు రెండు వేలు తేడా వచ్చింది.

పిలిచి అడిగాడు. భయం వేసింది, నా మొహం చూసి నేను భయపడుతున్నానని అర్ధం చేసుకుని ఏం జరిగిందో తెలుసుకోడానికి cc కెమెరా ఫుటేజ్ చూసి నన్ను చూసాడు.

ఖాసీం : అనుకున్నాను ఇది వీడి పనే అని. చూడు బేటా నేను నీకు కౌంటర్ అప్పగించింది నిన్ను చూసుకోమని అంతే కానీ వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు. లతీఫ్ రాగానే ఎందుకు పక్కకి వెళ్లిపోయావ్ ఆ మాత్రం ఆలోచన నాకు లేకా అంతెందుకు ఇంట్లో నా ఆడది లేదు అయినా నిన్నెందుకు కూర్చోపెట్టాను?

బాధ పడకు లతీఫ్ ఇంతక ముందు కూడా ఇలానే చేసాడు ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. రేపటి నుంచి కౌంటర్ లో కూర్చుని లెక్కలు చూస్తూ అన్నీ పనులు చేపించు, నువ్వే చూసుకో నేను బిర్యానీ వండేసి వెళ్ళిపోతాను.

శివ : అదేంటి చాచా?

ఖాసీం : వేరొక చోట కొత్త హోటల్ మొదలెట్టబోతున్నాను ఇక్కడ నువ్వు చూసుకో అక్కడ కొత్త కాబట్టి నేను చూసుకుంటాను. (నేనేమి మాట్లాడకపోయేసరికి) ఓకే నా  బేటా?

శివ : ఇంకోసారి మీ నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకొను చాచా.

ఖాసీం : ఖుషి కా బాత్.. సరే వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయ్యింది.

హాస్టల్ కి నడుచుకుంటూ వెళ్తున్న నాకు కొంచెం గర్వంగా కొంచెం బాధగా అనిపించింది, అస్సలు ఇవన్నీ పక్కకి పెడితే ఎందుకో నాకొక ఫ్యామిలీనో ఒక ఫ్రెండో ఏమో    ఏమి కావాలో తెలియడంలేదు కానీ మనసు ఒక తోడు కోరుకుంటుంది. పెద్దమ్మ దెగ్గరికి వెళ్ళిపోదాం అనిపించింది.
Like Reply
#7
6     


చాచా కొత్త హోటల్ చూసుకుంటున్నాడు రోజు మధ్యాహ్నం పూట ఒకసారి వచ్చి బిర్యానీ చేపించి వెళ్ళిపోతున్నాడు. నా స్థానంలో ఇంకొక అబ్బాయిని పెట్టుకున్నాను. ఏమైనా సందేహాలున్నా ఏమైనా జరిగినా చాచా వచ్చినప్పుడు ఆయనకి చెప్పి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.

చాచాకి కేటరింగ్ పనులు, పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు కూడా చేద్దాం అని చెప్పించి ఒప్పించాను, దానికి ఆయన నువ్వు కష్టపడతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను అని మాత్రమే అన్నాడు.

నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మాత్రం లక్ష్మి గారు కౌంటర్ మీద కూర్చుంటుంది, తను కూడా నన్ను చాలా నమ్ముతుంది ఏదైనా పెద్ద కాంట్రాక్టు వచ్చినా పెళ్ళికి ఆర్డర్స్ కేటరింగ్ వచ్చినా తాను సొంతగా నిర్ణయం తీసుకోకుండా నన్నే మాట్లాడమని ప్రోత్సాహిస్తుంది.

ఈ ఒక్క నెలలోనే కస్టమర్స్ తొ ఎలా మాట్లాడాలి తోటి పనివారితో ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, సామాను ఎక్కడనుండి తెచ్చుకోవాలి వారితో ఎలా మాట్లాడితే మనకు లాభం చేకూరుతుంది అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను.

రెండో నెల జీతంగా పదిహేను వేలు ఇచ్చాడు, కానీ నేను ఒప్పుకోలేదు.

ఖాసీం : చూడు బేటా.. మెయింటనెన్స్ మారిన మొదటి నెల ఎవరికైనా లాస్ వస్తుంది అది సహజం అదొక ఆనవాయితీ లాంటిది కానీ నీ కష్టంతొ లాస్ రాకుండా చేసావ్, బిల్లులు కూడా గమనిస్తున్నాను. లతీఫ్ వెళ్ళినప్పటి కంటే నీ ఫోన్ ద్వారానే మనకి సరుకులు తక్కువ పడుతున్నాయి.

నాకు అర్ధమైంది నువ్వు బిసినెస్ బాగా చేయగలవు మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి నీ దెగ్గర,  ఇలానే కష్టపడు నువ్వు చాలా పైకి వెళ్తావ్, అల్లా తేరేకు అచ్చా కరేగా. ఇక ఈ పదిహేను వేలు ఈ నెల జీతం మాత్రమే వచ్చే నెల నుంచి నీకు పార్టనర్ గా ఎంత రావాలో అంతా ఇస్తాను, ఇక నువ్వేం మాట్లాడకు సంతోషంగా ఉండు.


జీతం తీసుకుని హాస్టల్ కి వెళుతుంటే భలే ఆనందం వేసింది ఖాసీం చాచా మాటలకి, స్వార్థంగా ఇలానే నా కింద పనిచేసుకో అనలేదు మనస్ఫూర్తిగా నువ్వు కత్చితంగా పైకి వస్తావ్ అన్నాడు. ఆ మాటలకి నాకు నా మీద నమ్మకమొచ్చింది.

పని నేర్చుకుని మేనేజ్ చేసే పోస్టులో అలవాటు అయినా ఒక పది రోజులకి రోజులాగె హోటల్ కౌంటర్ మీద బిజీగా ఉన్నాను సరిగ్గా అదే టైంలో లతీఫ్ వచ్చాడు, నన్ను చూసి నా దెగ్గరికి వచ్చాడు.

లతీఫ్ : శివా కౌంటర్ నేను చూసుకుంటాను నువెళ్లి మిగతా పనులు చూసుకో.

శివ : అన్నా, మీది నూట పది అయ్యింది, gpayనా అక్కడుంది చూడండి.  షరీఫ్, సార్ బిల్లెంతా?

లోపల నుంచి షరీఫ్ : రెండు ఫుల్ బిర్యాని ఒక చికెన్ 65..మూడు పుల్కా

లతీఫ్ అసహనంగా చూడటం గమనించాను.

శివ : అన్నా పదిహేను వందల యాభై అని చెప్పి కాష్ లెక్కపెట్టి కౌంటర్ లో వేస్తూ   అన్నా మీకు ఫుల్ మీల్స్ కదా కూర్చోండి ఒక్క ఐదు నిమిషాలు పార్సెల్ చేస్తున్నారు, ఆ రఫీక్ భాయ్ సలాం వాలేకుం. శ్రీను, భాయ్ కొ ఏక్ స్పెషల్ చాయ్.


ఆ లతీఫ్ చెప్పు ఏంటి విశేషాలు?

లతీఫ్ : ఏంటి కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావ్?

శివ : ఏ నా వయసు వాడివేగా పిలిస్తే తప్పేంటి.. ఏంటి ఇటోచ్చావ్?

లతీఫ్ : నా మామ హోటల్ కి నేను రాకూడదా?

శివ : ఏమైనా తింటావా లతీఫ్?

లతీఫ్ : ఇంకా నయ్యం నన్ను బిల్లు కట్టమనలేదు.

శివ : నువ్వు కడతానంటే నేను వద్దంటానా, సరే ఆ గ్యాస్ కొంచెం లోపల పెట్టెయ్.

లతీఫ్ : నేనా, అది నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలా?

శివ : అదేంటి లతీఫ్ అలా అంటావ్ మీ మామా హోటలే కదా ఆ మాత్రం సహాయం చెయ్యలేవా అని మాట్లాడుకుంటూ లేచి గ్యాస్ భుజాన ఎత్తుకుని కిచెన్ లో పెట్టాను.

నేను బైటికి వచ్చేలోగా లతీఫ్ కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు డ్రా కీస్ కోసం చూసాడు, కీస్ నా దెగ్గరే ఉన్నాయి నా చేతి వేలుకి రింగ్ తోడిగి తన ముందే వేలు  తిప్పుతూ కౌంటర్ దెగ్గరికి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే నెలసరి కిరాణా సామాను పంపించే సేట్ వచ్చి కౌంటర్ దెగ్గర నిలబడ్డాడు.

శివ : నమస్కారం రాఘవ గారు, ఎలా ఉన్నారు?

రాఘవ : ఏంటి శివ, చాలా బిజీగా ఉన్నట్టున్నావ్. ఈ మధ్య సామానుకి కూడా రావట్లేదు.

శివ : బిల్ ఎంత అయ్యింది అన్నా.

రాఘవ : పద్దెనిమిది వేలు.

లతీఫ్ : పద్దెనిమిది వేలా? (ఆశ్చర్యంగా)

రాఘవ : అవును ఈ ఏరియా మొత్తంలో ఖాసీం చాచా హోటల్ ని కొట్టే హోటలే లేదు. నేను కూడా వింటున్నాను ఈ మధ్య మీల్స్ లో కూరలు అదిరిపోతున్నాయట మొన్న ఖాసీం భాయ్ కూడా కలిసి చెప్పాడు శివ గురించి తన కంటే చాలా బాగా మైంటైన్ చేస్తున్నావట, నిన్ను చాలా మెచ్చుకున్నాడు శివా.

శివ : అదంతా ఖాసీం చాచా మంచితనం. లతీఫ్ ఇలా రా.

లతీఫ్ : కీస్ ఇవ్వు నేనిస్తాను డబ్బులు.

శివ : ఇప్పుడు మీ మామా డబ్బులు మాత్రమే కాదు నావి కూడా కలిసి ఉన్నాయి, కీస్ ఇవ్వడం కుదరదు మర్యాదగా బైటికి రా. అని ఒక విధంగా అరుస్తున్నట్టే వార్నింగ్ ఇచ్చాను, షాక్ అయ్యి దెబ్బకి చైర్ లోనుంచి లేచి బైటికొచ్చాడు. రాఘవ గారిని చూసి నవ్వుతూ కౌంటర్ డ్రా తెరిచి డబ్బులు లెక్కపెట్టి తనకి ఇచ్చేసి బిల్లు తీసుకున్నాను.


తెల్లారి కాలేజీలో గగన్ సర్ ని డౌట్ అడుగుదామని మాథ్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి ఆయన రూమ్ లోకి వెళ్తుండగా  ఒకమ్మాయి నవ్వుతూ బైటికి వచ్చింది, నేను బస్సు కిటికీలో నుంచి చూసిన అదే అమ్మాయి, ఇప్పుడు స్పష్టంగా నా ఎదురుగా అదే నవ్వు మొహం కనిపించేసరికి ఏమైందో తెలీలేదు కానీ నా అడుగులు తడబడడం నాకు తెలుస్తుంది. నన్ను ఒకసారి చూసి దాటుకుని వెళ్ళిపోయింది.

రూమ్ లోపలికి వెళుతూనే నాకు తెలియకుండా నా అడుగులు తన వెనక పడ్డాయి తను ఆ చివరి వరకు వెళ్లి మెట్లు దిగే వరకు అలా చూస్తూ ఉండిపోయాను, సార్ పిలుస్తున్నా పట్టించుకోలేదు తను వెళ్లిపోయిన రెండు నిమిషాలకి కానీ తెరుకోలేదు నేను ఎక్కడున్నానో అని వెనక్కి తిరిగి చూసాను గగన్ సార్ నన్నే కోపంగా చూస్తున్నాడు, తల దించుకుని ఆయన ముందుకు వెళ్లి నిలబడ్డాను
Like Reply
#8
7    


గగన్ : శివా..

సార్ పిలవగానే నేను ఎక్కడున్నానో ఎందుకు వచ్చానో గుర్తొకొచ్చింది వెంటనే తల దించుకుని సర్ ముందుకు వెళ్లాను.

గగన్ : చెప్పు శివ.

సర్ కి నా డౌట్ చెప్పి ఆ ప్రాబ్లెమ్ చెప్పించుకుని వెనక్కి తిరిగాను క్లాస్ కి వెళ్ళడానికి.

గగన్ : శివా, ఇలా రా.

సర్ దెగ్గరికి వెళ్లాను, కుర్చీలో కూర్చోమన్నాడు ఇబ్బందిగానే కూర్చున్నాను.

గగన్ : ఆ అమ్మాయి నచ్చిందా?

లేచి నిల్చున్నాను భయంగా.

గగన్ : లేదు, ఏదో కాజువల్ గా అడిగాను. నీకు ఇబ్బంది అయితే వద్దు. కూర్చో, కొంచెంసేపు నాకు బోర్ కొడుతుంది, ఎలాగో క్లాస్లు కూడా లేవు కదా.

మళ్ళీ కూర్చున్నాను.

శివ : అలా ఏం లేదు సర్, కానీ తనే నేను చూసిన మొదటి అమ్మాయి.

గగన్ : అంటే నువ్వు చూసిన మొదటి అమ్మాయి తనేనా?

శివ : అలా కాదు సర్, అస్సలు అమ్మాయిలని చూడలేదని కాదు, ఒక అమ్మాయిని చూడగానే నా బాడీ పార్ట్స్ నా మాట వినడం ఆపేసాయి ఇందాక అలా చూస్తూ ఉండిపోయాను కదా అలాగ.

గగన్ : లవ్ ఎట్ ఫస్ట్ సైటా?

శివ : ఏమో నాకు తెలీదు, కానీ ఇప్పుడు కాదు పది రోజుల క్రితం బస్సులో వెళ్తుండగా చూసాను. ఆరోజు     మళ్ళీ ఈ రోజు అంతే.

గగన్ : అలాగా, ఇంకేం తెలుసు తన గురించి?

శివ : ఇంకేం తెలీదు సర్.

గగన్ : కనీసం పేరు?

శివ : తెలీదు.

గగన్ : ఇలా అయితే ఎలా శివా, ఇవ్వాళా రేపు ఎలా ఉన్నారు చూస్తే చాలు వెంటపడిపోయి అన్నీ తెలుసుకుంటున్నారు.

శివ : వద్దులెండి సర్. ముందు నేను అనుకున్నది సాధించాలి ఆశ్రమాన్ని పెద్దమ్మ నడపలేకపోతుంది వీలైనంత త్వరగా నేను తనకి సహాయం చెయ్యాలి అప్పటివరకు వీటికి కొంత దూరంగా ఉంటేనే మంచిది. అని లేచి వెళ్ళడానికి వెనక్కి తిరిగాను.

సర్ ని అడుగుదామనుకున్నాను ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని కానీ ధైర్యం చాల్లేదు..రూమ్ లోనుంచి బైటికి వస్తుండగా సార్ గొంతు వినబడింది.

గగన్ : తన పేరు మీనాక్షి.

వెనక్కి చూడకుండా ముందుకు నడిచాను.
Like Reply
#9
8     


హోటల్ నుంచి హాస్టల్ కి వెళ్లి పడుకున్నాననే గాని ఇంకా కాలేజీలో కనిపించిన తన మొహమే కనిపిస్తుంది, సార్ చెప్పాడు తన పేరు మీనాక్షి అని ఎంత బాగుంది పేరు కూడా తన లాగే.

తను వెళ్లిన కార్ చూస్తుంటే చాలా ఉన్నోళ్ల లాగ ఉంది, మరి ఈ కాలజీలో తనకేం పని కొంపదీసి సర్ వాళ్ల బంధువులు అయితే కాదు కదా. అలా తన ఊహలతో వారం గడిచింది కానీ తనని మర్చిపోలేదు తన జాడ కూడా లేదు తన గురించి సర్ ని అడిగేంత ధైర్యము నాకు లేదు.

పొద్దున్నే లేచి హోటల్ కి వెళ్ళాను చాచా కలిసాడు కానీ లతీఫ్ గురించి ఏం మాట్లాడలేదు నేను మౌనంగానే ఉన్నాను, నాకు దాని గురించి మాట్లాడాలని లేదు.

కాలేజీకి వెళ్లాను ఇవ్వాళ క్లాస్ కి గగన్ సర్ రాలేదు కానీ కాలేజీకి వచ్చాడని విన్నాను. గత మూడు రోజులుగా సర్ దిగులుగా ఉండటం గమనించాను ఏమైందో వెళ్లి కనుక్కుందామని వెళ్ళాను కానీ రూమ్ దాకా వెళ్లేసరికి ఇలా తన ప్రాబ్లెమ్స్ గురించి అడిగితే సార్ అవమానంగా ఫీల్ అవుతారేమో అనిపించి ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను.

సాయంత్రం హోటల్ కి వెళ్లి కౌంటర్ లో కూర్చున్నాను ఇంతలో లక్ష్మి గారు వచ్చారు.

లక్ష్మి : వచ్చావా శివ, నేను వెళ్తున్నాను.

ఇంతలో షఫీర్ వచ్చాడు.

శివ : ఏంటి షఫీర్ చాలా హుషారుగా ఉన్నావ్ ఏంటి సంగతి?

షఫీర్ : నా నీఖా పక్కా అయ్యింది భయ్యా, వచ్చే నెలే షాది.

శివ : అందుకేనా మొహం వెలిగిపోతుంది, కంగ్రాట్స్. అవును పక్కన ఏంటి చాలా మంది ఉన్నారు?

షఫీర్ : పక్క వాళ్లు స్థలం అమ్ముతున్నారు భయ్యా అందుకే కొలతలకి వచ్చారు.

శివ : అవునా నువ్వు చూసుకో, ఇప్పుడే వస్తాను.

బైటికి వెళ్లి చూసాను హోటల్ పక్కనే ఆనుకున్న స్థలం అది, వాళ్ల దెగ్గరికి వెళితే వేలం వేస్తున్నారని తెలిసింది అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఒక ముసలాయన. వెంటనే ఖాసీం చాచాని రమ్మన్నాను.

పావుగంటలో చాచా వచ్చి, ఆ ముసలాయన తన ఫ్రెండ్ వాళ్ల నాన్న అని తన ఫ్రెండ్ ఆక్సిడెంట్ లో చనిపోయాక ఇప్పుడు కూతురు దెగ్గర ఉంటున్నాడని చెప్పి తనని పలకరించడానికి వెళ్ళాడు. నాకో ఆలోచన వచ్చింది వెంటనే చాచా దెగ్గరికి వెళ్లాను. ఆ ముసలాయనని ఓదారుస్తున్నాడు, చాచాకి సైగ చేస్తూ పిలిచాను, నన్ను గమనించి లేచి నా దెగ్గరికి వచ్చాడు.

ఖాసీం : ఏంటి శివ?

శివ : చాచా మీ దెగ్గర డబ్బులుంటే ఆ స్థలం మీరే తీసుకోండి చాచా మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకి కూడా అవసరం పడుతుంది.

ఖాసీం : కానీ

శివ : నన్ను నమ్మండి చాచా, పెద్ద హోటల్ కడితే చాలు క్యూ కడతారు మన హోటల్ ముందు.

ఖాసీం : డబ్బులు ఉన్నాయి కానీ అవి నా కూతురు పెళ్లి కోసం దాచినవి, ఇప్పుడు అలోచించి చెప్పు నువ్వు ఊ అంటే ముందుకు వెళదాం.

శివ : పెట్టండి చాచా,  చెల్లి పెళ్లి మీరు అనుకున్నదానికంటే  అంగరంగ వైభవంగా చేద్దాం.

చాచా ఇంకేం మాట్లాడలేదు, అప్పటికప్పుడు ఎవరికో ఫోన్ చేస్తే డబ్బు తెచ్చిచ్చారు అక్కడ సాయంత్రం వరకు బ్యాంకు వాళ్ళకి సెటిల్ చేసి ఇప్పుడు ఈ ఏరియా ల్యాండ్ రేట్ ఎంత పలుకుతుందో అంతా ఇచ్చాడు.

తిరిగి హోటల్ కి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ నమ్మకానికి నేను ఇంకా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
Like Reply
#10
9     

రాత్రంతా హాస్టల్లో మంచం మీద కూర్చుని తరువాత ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని కాలేజీ నోట్స్ తీసి అన్నీ పాయింట్ల ప్రకారం రాసుకుని పడుకున్నాను.

పొద్దున్నే ఐదు గంటలకే మెలుకువ వచ్చింది లేచి రెడీ అయ్యి హోటల్ కి వెళ్లిపోయాను, అందరూ పనులు చూసుకుంటుంటే కౌంటర్ దెగ్గర లైట్ వేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని మనసులో శివుడిని తలుచుకుని కౌంటర్ తాళం తెరిచాను.

డెస్క్ కింద ఉన్న హోటల్ డాకుమెంట్స్ తీసి వాటి లింక్ డాకుమెంట్స్ అన్నీ ఒక్కొకటి వెతికి సర్దే సరికి ఎనిమిది అయ్యింది, నన్ను కదిలించకుండా మెయింటనెన్స్ బాధ్యత షఫీర్ తీసుకున్నాడు.

అన్ని డాకుమెంట్స్, చాచా ప్రూఫ్ డాకుమెంట్స్, నేను వచ్చిన దెగ్గర నుంచి హోటల్ ఖర్చులు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి అని లెక్కలు రాస్తున్నాను వాటికి సంబంధించిన అకౌంట్స్ పుస్తకం అన్నీ తీసుకుని చాచాతో పాటు పదకొండు గంటలకి బ్యాంకుకి వెళ్లాను.

అక్కడ వాళ్లు చాచాని చూడగానే పలకరించి వచ్చిన పని తెలుసుకుని ఆనంద పడ్డారు. కావలసిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చిన తరువాత మాములు లోన్ కాకుండా మోర్ట్ గేజ్ లోన్ పెట్టుకోమన్నారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఒక్క రోజే అవుతుంది త్వరగా పని అయిపోతుందంటే ఒప్పుకున్నాం.

నేను అకౌంట్స్ మైంటైన్ చెయ్యడం మంచిదయింది, అక్కడే ప్రాసెస్ అన్నీ చూసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ సంతకాలు చేయించేసరికి నాలుగు రోజులు పట్టింది, లోన్ రాడానికి కనీసం రెండు నెలలన్నా పడుతుంది అన్నారు.

ఇప్పటికే కాలేజీకి వెళ్ళక నాలుగు రోజులవుతుంది  తెల్లారి కాలేజీకి వెళ్లాను అందరినీ పలకరించి క్లాస్ లో కూర్చున్నాను రెండో పీరియడ్ లో గగన్ సర్ వచ్చాడు, మమ్మల్ని చదువుకోమని చెప్పి ఆయన కళ్ళు మూసుకుని ఏదో అలోచించడం గమనించాను, ఎందుకో డల్ గా ఉన్నారనిపించింది. నేను ఆయన్ని కదిలివ్వలేదు అంత చనువు నాకు ఉందొ లేదో నాకు ఇంకా అర్ధం కాలేదు.

సాయంత్రం హోటల్ కి వెళ్లాను చాచా కౌంటర్ మీద కూర్చుని ఉన్నాడు, వెళ్లి తన ముందు నిల్చున్నాను.

ఖాసీం : ఏంటి బేటా ఏదో ఆలోచిస్తున్నావ్?

శివ : ఏం లేదు చాచా మా సార్ ఎందుకో వారం రోజులనుంచి డల్ గా ఉంటున్నాడు ఎందుకో తెలియడం లేదు అడుగుదామంటే ఆయన ఇబ్బంది పడతాడేమో అని ఆగిపోతున్నాను, ఎప్పుడు హైపర్ ఆక్టివ్ గా ఉండే ఆయనని అలా చూస్తుంటే బాలేదు.

ఖాసీం : నిన్ను అంత ప్రియం అనుకుంటే నీకు కచ్చితంగా చెప్తారులే.  ఇదిగో డబ్బు నిన్న సంఘంలో ఐదు లక్షలు తీసుకున్నాను, లోన్ వచ్చేవరకు ఇవి వాడు ఆ తరువాత ఇది మూసేద్దాము.

శివ : డెస్క్ లోనే ఉంచండి చాచా, అవసరమైనప్పుడు వాడతాను.

అటు నుంచి అటు అడ్డా మీదకి వెళ్లి హోటల్ కి రోజూ వచ్చే టాపి మేస్త్రిని ఒకాయనని కలిసాను, రోజు ఆయనతో రెండు నిముషాలు మాట్లాడడం వల్ల కొంత మంచివాడని తెలుసు, ఆయన దెగ్గర నెంబర్ తీసుకుని మట్టి గురించి మాట్లాడాను.

ఒక రెండు గంటల తరువాత నేను మాట్లాడిన అతను వచ్చి ల్యాండ్ చూసుకున్నాడు, కొంచెం గుంట ప్రదేశం అవ్వడం వల్ల మట్టి ఎక్కువ పడుతుందన్నాడు కనీసం మూడొందల ట్రిప్పులు ఈజీగా అవుతాయి అనే సరికి రేట్ మాట్లాడుకుని మొదలెట్టమని చెప్పాను.

రాత్రి హోటల్లోనే భోజనం చేసేసి షాప్ కెళ్ళి నాలుగు బుల్బులు పది మీటర్ల వైర్ కొనుక్కొచ్చి,  స్థలంలో గునపం తీసుకుని నాలుగు రంధ్రాలు చేసి గుంజలు పాతి బుల్బులు కట్టి వైర్ కనెక్షన్ ఇచ్చి చిన్న బుక్, పెన్ తో లారీల కోసం ఎదురుచూస్తున్నాను.

మొదటి టిప్పర్ లారీ రానే వచ్చింది లారీ నెంబర్ రాసుకుని పక్కన ఒక గీత గీసాను అలా ఒకటేమ్మట ఒకటి లారీ వస్తుంటే నెంబర్ రాసుకోడం వాటి పక్కన ప్లస్ వన్ అని రాసుకుంటూ పోతున్నాను.

రాత్రి పదకొండు అవుతుండగా ఏదో కార్ ఒకటి హోటల్ ముందు ఆగింది అందులోనుంచి ఖాసీం చాచా ఎవరో అమ్మాయితో దిగి బ్యాగ్ తో లోపలికి వెళ్ళాడు.

పొద్దున నాలుగింటి వరకు మట్టి పొయ్యడం అయిపోయింది, మూడొందలు అనుకున్నది మూడొందల ఎనభై ట్రిప్పులు అయ్యింది, మధ్యలో లారీ డ్రైవర్లు ఒక్కొక్క ట్రిప్ ఎక్కువ పోసాం అని గొడవ చేసినా వాళ్ళతో గొడవ పడినా మొత్తానికి అనుకున్నట్టుగా ఎగుడు దిగుడు లేకుండా పని పూర్తి చేసాను.

కాళ్ళు పీకుతున్నాయి, నిద్ర ఆగడం లేదు ఒక్కసారిగా లారీల మోత ఆగిపోవడంతో చెవులకి ప్రశాంతంగా ఉంది, హోటల్ కి వెళ్లి అక్కడే బెంచ్ మీదే పడుకుండిపోయాను.
Like Reply
#11
10    

పొద్దున్నే లేచి చూసేసరికి హోటల్లొనే ఉన్నాను, కళ్ళు నలుపుకుంటూ నిల్చున్నాను, ఎదురుగా ఒక అమ్మాయి నిల్చొని ఉంది.

"భయ్యా  ఇదిగో బ్రష్ పేస్ట్ అని నా చేతికి కొత్త బ్రష్,  పేస్ట్  ఇచ్చింది"

తీసుకుని "మీరు?" అన్నాను.

వెనకాలే తన భుజం మీద చెయ్యి వేస్తూ ఖాసీం చాచా వచ్చాడు.

ఖాసీం : శివా తిను నా బేటి, నేను చెప్పలే ఊరికి వెళ్లిందని.

శివ : ముస్కాన్ కదా?

ముస్కాన్ : అవును భయ్యా (అని షేక్ హ్యాండ్ ఇస్తూ) మీ గురించి అబ్బా చాలా చెప్పారు ముందు నమ్మలేదు కానీ రాత్రి మిమ్మల్ని చూసాకే తెలిసింది, మీ గురించి అబ్బా చెప్పింది మొత్తం నిజమేనని, మీకు ఫ్యాన్ అయిపోయాను భయ్యా.

చిన్నగా నవ్వి, మొహమాటంగా పేస్ట్ బ్రష్ అందుకుని వాష్ రూమ్ కి పరిగెత్తాను, ఫ్రెష్ అయ్యి హోటల్లొ టిఫిన్ చేసి చాచాకి చెప్పి రూమ్ కి వచ్చాను.

నిద్ర వస్తుంటే ఒక గంట పడుకుని    లేచి స్నానం చేసి మళ్ళీ హోటల్ కి బైలదేరాను. నేను వెళ్లేసరికి చాచా కౌంటర్ లొ కూర్చుని ముస్కాన్ తో ఏదో మాట్లాడుతున్నాడు లేదు వాళ్లు వాదించుకుంటున్నారు. నన్ను చూసి చాచా రమ్మని సైగ చేస్తే వెళ్ళాను.

ఖాసీం : శివా ముందు బోర్ పాయింట్ పెట్టి బోర్ వేసాక మట్టి తొలతారా లేక మట్టి తొలాక బోర్ వేస్తారా?

శివ : (నవ్వుతూ) ఇంతకీ ఎవరు దేని మీద ఉన్నారు?

ఖాసీం : మట్టి తొలాకా బోర్ అని నేను కాదు ముందు బోర్ ఆ తరువాతే మట్టి అని ముస్కాన్.

శివ : అయితే మీరు ఓడిపోయారు చాచా అని నవ్వాను, లేదు ఇద్దరు గెలిచారు రెండు చెయ్యచ్చు కానీ చాలా మంది ముందు బోర్ వేసుకున్నాకే మట్టి తొలిస్తారు.

దానికి ముస్కాన్ "నేను చెప్పానా " అంది.

ముస్కాన్ : భయ్యా మరి మీకు ఇంత తెలిసి ఎందుకు ముందు బోర్ ఏపించలేదు?

శివ : మనకెందుకు బోర్ ఆల్రెడీ ఉంటే.

ఖాసీం : ఇందాక నేను ముస్కాన్ వెళ్లి చూసాము, మాకు కనిపించలేదే.

శివ : ఉంది రాత్రి లారీ వాడు చూసుకోకుండా తగిలించాడు ఆ పైప్ విరిగింది, నీళ్లు పుష్కళంగా ఉన్నాయట ఇంకో బోర్ అవసరం లేదు అన్నాడు మేస్త్రి.

అలానే నేనొకసారి కాలేజీకి వెళ్ళొస్తాను, ప్లంబర్ వాళ్లు వస్తే నేను వచ్చేదాకా ఆగమానండి, వచ్చేటప్పుడు మోటర్ తీసుకొస్తాను.

ఖాసీం : అలానే.

ముస్కాన్ : ఏ కాలేజీ భయ్యా?

శివ : పక్కదే  గవర్నమెంట్ కాలేజీ.

ఖాసీం : ముస్కాన్ కూడా నీతో పాటుదే శివ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కామర్స్ తీసుకుంది, మల్లికాదేవి డిగ్రీ కాలేజీలొ చదువుతుంది.

శివ : ఓహ్, చాలా మంచి కాలేజీ. సరే చాచా నేను వెళ్ళొస్తాను.

రెండు క్లాసులు విని గగన్ సర్ కోసం వెతికాను, తన డెస్క్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు.

శివ : సర్?

గగన్ : రా శివా ఈ మధ్య కనిపించడంలేదు.

శివ : ఖాసీం చాచా కొత్త హోటల్ కట్టిస్తున్నాడు ఆ పని మీద తిరుగుతున్నాను.

గగన్ : అలాగా, ఖాసీంని కలిసి చాలా రోజులు అవుతుంది, అడిగానని చెప్పు.

శివ : సర్ నేను మీతో కొంచెం మాట్లాడాలి.

గగన్ : చెప్పు శివా.

శివ : కొన్ని రోజులుగా మీరు చాలా మూడిగా ఉంటున్నారు, ఎందుకో బాధ పడుతున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నాతో పంచుకుంటారా? మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను.

గగన్ : (నన్ను ఆప్యాయంగా చూసి) రా కూర్చో.
Like Reply
#12
11    


సర్ పిలవగానే వెళ్లి ఆయన ముందు కూర్చున్నాను.

గగన్ : నాకొక సమస్య వచ్చి పడింది శివ, ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు, అది నీకు సగం సగం చెప్తే అర్ధమయ్యేది కాదు పూర్తిగా చెప్పాలి, వినే టైం ఉందా?

శివ : చెప్పండి సర్, ఇంకా సస్పెన్స్ నేను తట్టుకోలేను.

గగన్ : నేనొక అనాధని శివ, నేను నీ లాగే చిన్నా చితకా ఉద్యోగం చేసుకుంటూ కాలేజీలొ చదివే రోజుల్లో నాకు పరిచయం అయ్యింది, తనే నా భార్య రజిత.

రజిత నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని వాళ్ల నాన్నని అడిగితే, ఆయన మంచి మనసుతో మా పెళ్ళికి ఒప్పుకున్నాడు, కానీ పెళ్లయ్యాక కూడా ఇల్లరికం ఉండమన్నాడు.

మీ జీవితాలు మీవి, మీ కష్టం మీది, నా కూతురు నా కళ్ళ ముందు ఉంటుందన్న ఆశ తప్ప వేరే దురుద్దేశం లేదు. నీకు కుటుంబం లేదు కదా, ఈ కుటుంబాన్ని నీ కుటుంబంగా చేసుకోలేవా అని ఆయన అడిగినదానికి కరిగిపోయి ఒప్పుకున్నాను.

రజిత వాళ్ళకి చాలా ఆస్తులు కంపెనీలు ఉన్నాయి, అలాగే చాలా పెద్ద కుటుంబం కూడా రజితకి ఇద్దరు అన్న దమ్ములు, జులయిగా తిరగడం తాగడం తప్ప ఏమి తలియదు.

ఆయన ఉన్నంత వరకు బానే గడిచింది, పోయిన ఏడాది ఆయన కాలం చేసాడు, అప్పటి నుంచి మొదలయ్యింది కథ.

రజిత అన్నలు ఇద్దరు ఆస్తులని కరిగించడం మొదలు పెట్టారు, అమ్మాయిలు తాగుళ్ళు అడ్డమైన తిరుగుళ్ళకి అలవాటు పడ్డారు, వాళ్లిద్దరికి చెరొక్క కొడుకు కూతురు ఉన్నారు.

నాకు ఇద్దరు కవలలు కొడుకు కూతురు మొన్న చూసావు కదా మీనాక్షి తనే.

పోయిన వారం మా మావయ్య గారి సంవత్సరికం జరిగింది అందులో భాగంగానే మాకు ఆస్తులు పంచడానికి మా అత్తయ్య పూనుకుంది.

ఆస్తులు,  మంచి లాభాలు వచ్చే కంపెనీలన్ని వాళ్లు తీసుకుని, అప్పుల్లో కూరుకుపోయిన టెక్సటైల్ కంపెనీ కొంత ఆస్తిని మాత్రం మీనాక్షి పేరు మీద రాస్తున్నారు, అది కూడా మా అత్తయ్య మీనాక్షిని తన ఇద్దరు మనవళ్లలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చెయ్యాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసింది, నాకు అది ఏ మాత్రం ఇష్టం లేదు, ఇందులో మాకు మిగిలింది ఏమి లేదు.

బైటికి వచ్చేద్దామంటే నా భార్య ఒప్పుకోవడం లేదు, సుఖలకి అలవాటు పడ్డ నా కొడుకు కూడా ఒప్పుకోవడం లేదు, కళ్ళేదుటే మోసం చేస్తున్నా వాళ్ళకి ఏం అర్ధం కావడంలేదు   అర్ధం చేసుకునే ప్రయత్నము చెయ్యడంలేదు.

ఇక పేరుకే నా అల్లుళ్ళు, ఆ ఇద్దరు ఎందుకు పనికిరాని రౌడీ వెధవలు, వాళ్ళకి లేని అలవాట్లు లేవు  వాళ్ళకి తోడు ఆ కోతి మూకలు, వాళ్లలో ఎవరికీ మీనాక్షి నిచ్చి పెళ్లి చెయ్యడం నా వల్ల కాదు. అదే ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు.

ఇంతలో డోర్ శబ్దం అయితే ఇద్దరం అటువైపు చూసాము, మీనాక్షి నిల్చొని ఉంది.

గగన్ : రా తల్లీ. శివా తనే మీనాక్షి.    మీనాక్షి నీకు చెప్పానుగా నా స్టూడెంట్ శివ అని తనే.

మీనాక్షి వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. తను అలా నడుస్తుంటే సర్ ఇప్పటిదాకా చెప్పిందంతా మర్చిపోయాను నా కాళ్ళు ఆటోమేటిక్ గా నిలబడుతుంటే తేరుకుని కూర్చున్నాను వాళ్ళు గమనించక ముందే.

మీనాక్షి : ఇప్పుడేం చేద్దాం డాడీ.

ఆ మూడు ముక్కలలొనే విన్నాను తన గొంతు, అంత మంచి గొంతు కాకపోయినా పరవాలేదు బానే ఉంది అని నవ్వుకున్నాను, ఎదురుగా ఉన్న ఇద్దరు నన్నే చూస్తున్నారు.

శివ : సారీ సర్.

మీనాక్షి : మీ గురించి డాడీ చెప్పారు, నైస్ టు మీట్ యూ.

శివ : ఐ లవ్ యూ.

ఇందాకటి నుంచి అనుకుంటున్నా సడన్ గా నోట్లో నుంచి ఎలా వచ్చిందొ, సరిదిద్దుకోకుండా చాలా క్లియర్ గా గట్టిగా ఐ లవ్ యూ చెప్పేసాను.

శివ తెరుకునేలోపే మీనాక్షి ఆశ్చర్యంగా, కోపంగా లేచి నిలబడింది. పక్కనే ఉన్న గగన్ అంతగా ఆశ్చర్యపోలేదు కానీ తన ముందే శివ అలా చెప్తాడని ఊహించలేదు.


గగన్ : మీనాక్షి, నువ్వు ఇంటికి వెళ్ళు నేను శివతో మాట్లాడాలి.

మీనాక్షి విసురుగా నన్ను ఒక చూపు చూసి వెనక్కి తిరగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది, నేను సర్ ని చూస్తూ తల దించుకుని నిలబడ్డాను కానీ నాకు తప్పు చేశానని అనిపించలేదు , అలానే నిల్చుండిపోయాను తరువాత ఏం జరుగుతుందా అని.
Like Reply
#13
12    

మీనాక్షి వెళ్ళిపోగానే నేను సర్ ని చూసాను, నన్నే చూస్తున్నారు.

శివ : సారీ సర్, కావాలని చెయ్యలేదు.

గగన్ : నాకు మొన్న నీ వాలకం చూసినప్పుడే అర్ధంఅయ్యింది కానీ మరీ ఇలా నా ముందే చెప్తావ్ అనుకోలేదు.

నేను ఇంకేం మాట్లాడలేదు.

గగన్ : తనకి కూడా నీ మీద అదే ఫీలింగ్ అనిపిస్తుంది నాకు.

నేను తల ఎత్తి చూసాను.

గగన్ : ఈ పది రోజులు నువ్వు కాలేజీకి రాలేదు కదా, నాతో పని లేకపోయినా నాలుగు సార్లు వచ్చింది ఈ కాలేజీకి. వచ్చినప్పుడల్లా నిన్ను పరిచయం చెయ్యమని అడిగేది.

శివ : సర్ మీరు ఏమనుకోనంటే, నేనొక సలహా ఇవ్వనా?

గగన్ : చెప్పు శివా

శివ : మీరు ఆ కంపెనీ తీసుకోండి.

గగన్ : తీసుకుంటాను, నాకు వేరే దారి లేదు కానీ నాకు నీ సహాయం కావాలి శివా, నువ్వు తోడుగా ఉంటావా?


శివ : ముందు తీసుకోండి, తరవాత సంగతి తరువాత ముందు ప్రాసెస్ అయ్యాక ఒకసారి వెళ్లి చూసి వద్దాం.

గగన్ : అలాగే.

శివ : సరే సర్ నేను వెళ్తాను, అస్సలే ఇవ్వాళ జీతం వచ్చే రోజు.

గగన్ నవ్వి సరే వెళ్ళు అని శివని పంపించేసాడు, శివా వెళ్ళిపోయాక చాలా ఆలోచించాడు శివ మీనాక్షిల గురించి తనకీ తన కూతురుని శివకి ఇచ్చి చెయ్యాలని ఉన్నా తన అత్తయ్య భార్య గుర్తొచ్చి నీరస పడ్డాడు, సరే చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నాడు.

కాలేజీ నుంచి ఆటో మాట్లాడుకుని నేరుగా షాప్ కి వెళ్లి 1.5hp మోటార్ ఒకటి తీసుకుని హోటల్ కి వెళ్లి ప్లంబర్ ఆయనకి ఫోన్ చేసాను.

కౌంటర్ మీద ముస్కాన్ కూర్చుని ఉంది. నన్ను చూడగానే లేచి నిలబడి పక్కకి వచ్చింది తనని కూర్చోమని సైగ చేసాను.

దెగ్గరుండి కావలసిన సామాను తెప్పించి బోర్ ఫిట్ చేయించి, వాళ్ళకి ముస్కాన్ తో డబ్బులు ఇచ్చి పంపించాను.

శివ : ముస్కాన్, డెస్క్ లొ లాస్ట్ లొ ఒక బుక్ ఉంటుంది తీయ్.

ముస్కాన్ బుక్ తీసిన తరువాత వేటి వెతికి ఎంత ఖర్చు అయ్యింది అన్ని లెక్కలు తనతోనే రాయించాను.

తెల్లారి మేస్త్రితో మాట్లాడి ఇవ్వాళ బెడ్ పోపించి గుంతలు తవ్వించమని చెప్పి కాలేజీకి వెళ్ళాను, గేట్ దెగ్గరే మీనాక్షి కనిపించింది. బ్లూ జీన్స్ వైట్ టీ షర్ట్ లో ఉంది.

నా కోసమే చూస్తున్నట్టుంది, నన్ను చూడగానే ఒకసారి నావైపు చురుగ్గా చూసేసరికి తన దెగ్గరికి వెళ్లాను.

మీనాక్షి : నీతో మాట్లాడాలి బైటికి వెళదాం  అని తను ముందు నడుస్తుంటే తన వెనకాలే వెళ్ళాను.

నేరుగా బస్ స్టాప్ లొ బస్సు ఎక్కింది, అప్పటికే కాలేజీ టైమింగ్స్ అయిపోవడం వల్ల సిటీ బస్సులొ రష్ తగ్గి సీట్లు కొంచెం కాళిగా ఉండటంతో తను కూర్చోగానే తన వెనుక సీట్లో కూర్చున్నాను.

పబ్లిక్ గార్డెన్ దెగ్గరకి రాగానే తను లేవడంతో నేను వెనుక వైపు నుంచి బస్సు దిగి తన వెనకాలే పబ్లిక్ గార్డెన్ లోపలికి వెళ్ళాను.

అక్కడ పక్కనే బెంచ్ మీద కూర్చుంది, నేను తన ముందు నిలబడ్డాను, కూర్చోమని సైగ చేసింది. బెంచ్ కి ఇటువైపు చివరికి కూర్చున్నాను.

మీనాక్షి : నీకు బుద్ధుందా, అలా మా నాన్న ముందే ఐ లవ్ యూ చెప్తావా,   అంత ధైర్యం ఉందా నీకు?

శివ : సారీ, అలా జరుగుతుందనుకోలేదు అస్సలు నా నోరు దాటి ఎలా వచ్చిందో కూడా నాకు ఇంకా అర్ధం కావట్లేదు.

మీనాక్షి : మా నాన్నతో కంపెనీ తీసుకోమని చెప్పావట?

శివ : అవును తీసుకోండి.

మీనాక్షి : అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ అది దానితో ఏం చెయ్యగలం, తేడా కొడితే మనమే ఎదురు కట్టాల్సి వస్తుంది అప్పుడు మేము నిండా మునుగుతాము.

వేరే దారి ఉండదు మా అమ్మమ్మ కాళ్ళు పట్టుకోవడం తప్ప దానికి బదులుగా ఆ ముసలిది నన్ను తన మనవడికి ఇచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతుంది, ఇది మా అమ్మ అమ్మమ్మ కలిసి వేసిన ప్లాన్, నువ్వు చెప్పినట్టు చేస్తే ఇదే జరుగుతుంది.

శివ : సరే తీసుకోకండి అప్పుడు మీ అమ్మమ్మ మిమ్మల్ని వదిలేస్తుందన్న నమ్మకం ఉందా?

మీనాక్షి : లేదు.

శివ : నేను ఆలోచించాను, మీరు ఆ కంపెనీ అయితే చేజిక్కించుకొండి ఏదో ఒక దారి దొరక్కపోదు.

మీనాక్షి : నీ నెంబర్ ఇవ్వు.

శివ : నాకు ఫోన్ లేదు.

మీనాక్షి : సరే కొనిస్తా పదా.

శివ : వద్దు నాకు జీతం ఇవ్వాళో రేపో వస్తుంది నేనే తీసుకుంటాను.

మీనాక్షి : పర్లేదు ఎలాగో నువ్వు నా ఫస్ట్ ఎంప్లొయి వి కదా, రా కొనిస్తాను.

శివ : సరే పదండి, కానీ ఒక్క విషయం అవి మీ డబ్బులు అయితేనే కొనివ్వండి.

మీనాక్షి : అన్నీ నా డబ్బులే పదా.

శివ : అలా కాదు, మీ సొంతగా మీరు సంపాదించిన డబ్బులు అయితే పదండి ఇప్పుడే ఆనందంగా కొనుక్కుంటాను.

నేను అలా అనగానే మీనాక్షి బెంచ్ మీద కూర్చుండిపోయింది.

శివ : ఇక వెళదామా?

మీనాక్షి : చెయ్యివ్వు.

నా చెయ్యి ముందుకు చాపాను, నా చెయ్యందుకుని లేచింది. మొదటి సారి నేను ఒక అమ్మాయి చెయ్యి పట్టుకోడం. నేను అలానే చూస్తుండడం చూసి

మీనాక్షి : ఏమైంది?

శివ : ఏం లేదు, మీ నెంబర్ ఇస్తారా అని జేబులో నుంచి పెన్ తీసాను. నా చెయ్యి పట్టుకుని నవ్వుతూ అరచేతి మీద తన నెంబర్ రాసింది. మనసులో ఆనంద పడుతున్నా ఈ సారి బైటికి కనపడనివ్వలేదు

మళ్ళీ ఇద్దరం బస్సు ఎక్కి కాలేజీ దెగ్గర దిగి ఎవ్వరి దారిన వాళ్ళం వెళ్లిపోయాము. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి "నువ్వు నాకు నచ్చావు" అనేసి వెళ్ళిపోయింది.
Like Reply
#14
13    

నేను హోటల్ కి వెళ్ళాను, పక్కన పని జరుగుతుంది హోటల్లో తినేసి సలాకు రేట్ మాట్లాడదామని మేస్త్రిని తీసుకెళ్లి కావాల్సినవన్నీ తీసుకుని హోటల్ కి బైలుదేరాను.

కౌంటర్ లో బుక్ తీసుకుని ఇవ్వాల్టి ఖర్చులు రోజు వారి కూలీ ఖర్చులు.. కూలి పని వారు ఎవరెవరు వస్తున్నారు వారి అటెండెన్స్ అన్నీ రాస్తుంటే ముస్కాన్ నా పక్కన నిలబడి అన్నీ నేర్చుకుంటుంది.

శివ : నువ్వు త్వరగా నేర్చుకోవాలి, నాకింకా చాలా పనులున్నాయి త్వరగా హోటల్ ని రన్ చెయ్యడం నేర్చుకో కావాలంటే హోటల్ మేనేజ్మెంట్ బుక్స్ కొని చదువు ముస్కాన్.

ముస్కాన్ : అదేంటి భయ్యా అలా అన్నావ్?

శివ : మరి, కొత్తగా కడుతున్న హోటల్ కి ఓనర్ నువ్వే. రాత్రి నేను చాచా మాట్లాడుకున్నాం. నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను ముస్కాన్. నా గోల్ నా గోల అంతా వేరే.

ముస్కాన్ : భయంగా ఉంది భయ్యా.

శివ : నేను ఇక్కడ ఉండలేను అన్నాను కానీ అస్సలు ఉండను అని చెప్పలేదు కదా నీకు అందుబాటులోనే ఉంటాను, నిన్ను నమ్మి ఇంత పెద్ద హోటల్ నీ చేతుల్లో పెడితే ఏమన్నా ఉందా అమ్మో.

వెనకాలే ముస్కాన్ భుజం మీద చెయ్యి వేసి, ఏంటి శివా నీ చెల్లిని భయపెడుతున్నావా అని నవ్వాడు.

ముస్కాన్ : పోండి బాబా, నేను అంత తెలివితక్కువ దాన్ని ఏం కాదు, భయ్యా దెగ్గర అన్నీ నేర్చుకుంటున్నాను.

చాచా కౌంటర్ మీద కూర్చుని డబ్బులు లెక్కపెట్టి నా చేతికి ఇచ్చాడు, ఎప్పుడూ లెక్కపెట్టను కానీ నోట్లు ఎక్కువ ఉండేసరికి అనుమానం వచ్చి లెక్కపెట్టాను.

నా అనుమానం నిజమే అందులో ఇరవై వేలు ఉన్నాయి, చాచా వైపు చూసాను తీసుకోమని సైగ చేసాడు. ఎలాగో చెప్తే వినడు అందుకే ఇంకేం మాట్లాడకుండా జోబులో పెట్టుకున్నాను.

శివ : చాచా ఇంకేమైనా పనులున్నాయా?

ఖాసీం : ఆశ్రమనికా?

శివ : అవును చాచా, పెద్దమ్మని చూసి చాలా రోజులైంది అలానే ఒక ఫోన్ కొనాలి.

ముస్కాన్ : వావ్, మంచి స్మార్ట్ ఫోన్ తీసుకో భయ్యా పదా నేను వస్తాను.

శివ : లేదు ముస్కాన్, మాములు బటన్స్ ఫోన్ చాలు.

ఖాసీం : అదేంటి శివా అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటే నువ్వేమో ఇంకా డొక్కు ఫోన్ వాడతా అంటున్నవ్, డబ్బుల దెగ్గర ఆలోచిస్తున్నావేమో. బేటి భయ్యకి మంచి ఫోన్ తీసుకో ఎంత అయినా పరవాలేదు.

ముస్కాన్ : అలానే బాబా.

శివ : చాచా అలా కాదు, స్మార్ట్ ఫోన్ నేను వద్దాన్నా నా దెగ్గరికి వస్తుంది అది కొనిచ్చే వాళ్లు వేరే ఉన్నారు.

ఖాసీం : ఎవరు పెద్దమ్మ?

శివ : కాదు.

ముస్కాన్ : మరీ.

నేను సిగ్గుపడడం చూసి ముస్కాన్ కి అర్ధం అయినట్టుంది.

ముస్కాన్ : ఎవరు మా భయ్యాని ప్రేమించే ఆ అమ్మాయి.

ఖాసీం : వాహ్, శివా నిజంగానా. బేటి అచ్చి బాత్, ఖుషికా బాత్. శివా మాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్?

శివ : వీలైనంత త్వరగా తీసుకొస్తాను చాచా కానీ కొంత సమయం పడుతుంది, ఇవ్వాలే కంఫర్మ్ అయ్యింది.

ముస్కాన్ : ఓహ్ కంగ్రాట్స్ భయ్యా.

ఖాసీం : అరే షరీఫ్, బేకరీకి వెళ్లి కేక్ తీసుకురా.

షరీఫ్ : హా, భాయి. అని పరిగత్తాడు ఆనందంగా.

అక్కడే షరీఫ్ కి కూడా పెళ్లి కుదిరిన సందర్బంగా ఇద్దరం కేక్ కట్ చేసి, ఫోన్ కొనడానికి బైటికి నడిచాను.

ఖాసీం : శివా, బండి తీసుకెళ్ళు అని కీస్ విసిరాడు.

ముస్కాన్ : బాబా నేనూ వెళ్తాను, ఒకసారి ఆశ్రమం చూసి వస్తాను.

చాచా నన్ను చూసాడు, ముస్కాన్ ని రమ్మన్నాను.

ఇద్దరం వెళ్లి రెండు వేల ఐదు వందలకి మాములు ఫోన్ ఒకటి తీసుకుని, సిం కార్డు ఒకటి కొని అందులో వేసి మొట్ట మొదటగా నా అరచేతిలో ఉన్న మీనాక్షి గారి నెంబర్ సేవ్ చేసి తనకి కాల్ చేసాను.

మీనాక్షి : హలో

శివ : హలో మీనాక్షి గారు నేను శివా. ఇది నా నెంబర్ మీరు సేవ్ చేసుకుంటారని చేసాను.

మీనాక్షి : అలాగే, ఇంకా?

శివ : నేను బైట ఉన్నాను మళ్ళీ చేస్తాను.

మీనాక్షి : ( నవ్వుతూ) సరే అయితే బాయ్.

నా తత్తరపాటు మాటలకి తన నవ్వుతుంటే నాకు నవ్వు వచ్చింది, ముస్కాన్ గుర్తొచ్చి పక్కన చూసాను.

ముస్కాన్ : (నన్ను చూసి నవ్వుతూ ) సో క్యూట్.

నేను సిగ్గు పడ్డాను, అక్కడనుంచి ముస్కాన్ ని తీసుకుని ఆశ్రమానికి బైలుదేరాను.

పెద్దమ్మకి పరిచయం చేసి, అక్కడే పది వేలు డొనేషన్ బాక్స్ లో వేసాను.

ముస్కాన్ : భయ్యా, నీకు జీతం వచ్చిందే ఇరవై అందులో పది ఇక్కడ వేశావు. అక్కడ ఫోన్ రెండు వేల ఐదు వందలు ఎలా సరిపోతాయి?

శివ : మూడు వేలు హాస్టల్ రెంట్ పోయినా ఇంకా నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి, బిందాస్ గా బతికేస్తాను. నేను నా జీతం ఇచ్చింది నా అమ్మకే.

ఎలాగూ ఫుడ్ మన హోటల్లోనే కదా. అవును మీరు మా కొత్త ఓనర్ కదా నేను భోజనం హోటల్లో చేయొచ్చా మేడం?

ముస్కాన్ : భయ్యా  నిన్నూ, ఉండు అని నా వెంట పరిగెడుతుంటే నేను పిల్లల దెగ్గరికి వెళ్ళాను.

పిల్లలతో కొంత సేపు ఆడుకుని, తనకి ఆశ్రమం ఎలా రన్ అవుతుంది అన్నీ చెప్పి చూపించి తిరిగి హోటల్ దెగ్గరికి వచ్చేసాము.
Like Reply
#15
14    


వారం రోజుల్లోనే బెడ్ పోసి పిల్లర్లు కూడా పొసేశారు అంతా సజావుగానే సాగుతుంది మీనాక్షి అప్పుడప్పుడు నా కోసం ఫోన్ చేస్తుంది తనతో ఇంకా ధైర్యంగా మాట్లాడలేక పోడంతో నా మాటలు వింటూ నవ్వుతుండేది నేను ఆ నవ్వులు వింటూ ఆనంద పడేవాడిని.

ఇంకో రెండు రోజుల్లో చెక్క కట్టేసారు ఆ తరువాత నాలుగు రోజులు గాడిచాయి ఇవ్వాళ స్లాబ్ పోస్తారు, పన్నెండు గంటలకి మొదలవుద్ది.. ఇంతలో నాకు ఫోన్ వస్తే చూసాను మీనాక్షి.

మీనాక్షి : కలుద్దామా?

శివ : వస్తున్నాను.

నేను పార్క్ దెగ్గరికి వెళ్లిన పది నిమిషాలకి తను కూడా వచ్చి నా పక్కన కూర్చుంది.

శివ : చెప్పండి మీనాక్షి గారు, గగన్ సర్ ఎలా ఉన్నారు?

మీనాక్షి : ఇంకెన్ని రోజులు గారు గీరు అని పిలుస్తావు పేరు పెట్టి పిలవచ్చు కదా, ఇంకెంత చనువు కావాలి నీకు అని తన భుజంతో గుద్దింది.

ఆ స్పర్శకే నాకు ఎలాగో అయిపోయింది, అది గమనించిన మీనాక్షి గారు

మీనాక్షి : ఏమైంది?

శివ : ఏం లేదు.

మీనాక్షి : (నవ్వుతూ) నిజంగా?

శివ : మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారండి.

మీనాక్షి : అవునా థాంక్ యు, అని నా దెగ్గరికి వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నా భావాలు మొహంలోకి కనిపించకుండా మొహం బిగ పట్టాను తనకి అర్ధమైయ్యిందో ఏమో గట్టిగా నవ్వుతూ, నా మెడ మీదగా తన పెదాలు తీసుకొచ్చి చిన్నగా రాస్తూ బుగ్గ మీద ముద్దు ఇచ్చింది. అంతే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యి వెనక్కి పడిపోతుంటే మీనాక్షి నా కాలర్ పట్టుకుంది.

మీనాక్షి : ఏమైంది అని అడిగింది నవ్వుతూ.

శివ : ఏం లేదు.

మీనాక్షి : ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడడం కానీ ఇలా చెయ్యడం కానీ చెయ్యలేదా?

శివ : నేను కన్నెత్తి చూసిన మొదటి అమ్మాయి మీరు, రెండు నిముషాలు ఒక అమ్మాయితో మాట్లాడానంటే అది మీరే, ఫోన్లోనూ అంత సేపు మాట్లాడింది మీతోనే. నాకు మీరు కావేరి పెద్దమ్మ కొత్తగా ఒక చెల్లెలు ముస్కాన్ తప్ప ఇంకెవ్వరు తెలీదు.

మీనాక్షి : నాకు తెలుసు, అందుకే నువ్వంటే నాకిష్టం అని ముందుకొచ్చి నా కళ్ళలోకి చూసి ఇంకొక బుగ్గ మీద కూడా ముద్దు పెట్టింది నేను వెనక్కి వాలిపోయాను తను మళ్ళీ పట్టుకునే లోపే కింద పడ్డాను. లేచి నన్ను చూసి నవ్వుతూ చెయ్యిచ్చింది.తన చెయ్యి పట్టుకుని లేచాను.

మీనాక్షి : ఎందుకలా పడిపోతున్నావ్?

శివ : ఏమో, కళ్ళు తిరిగినట్టు ఒకలా అనిపించింది మీరు అలా చేస్తుంటే.

ఒక్కసారిగా నన్ను హత్తుకుని మెడ మీద ఆపకుండా ముద్దులు పెడుతుంటే కళ్ళు మూసుకుని గట్టిగా వాటేసుకున్నాను, నా కంట్లో నీళ్లు తన మెడకి తగిలాయో ఏమో ముద్దులు పెట్టడం ఆపి నన్ను చూసింది.

మీనాక్షి : ఏమైంది శివా? నీకు నచ్చలేదా?

ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాను.

శివ : ఇలాంటి ఒక కౌగిలి కోసం ఒక తోడు కోసం ఒక అమ్మ కోసం  చిన్నప్పటి నుంచి తపించిపోయేవాడిని ఇప్పుడు దొరికేసరికి ఆపుకోలేకపోయాను, సారీ అంటుండగానే ఇంకా గట్టిగా హత్తుకుంది.. రెండు నిముషాలు అలానే ఉండి, ఇంక చాలు నాకు నిద్ర వస్తుంది. అన్నాను.

మీనాక్షి : (నవ్వుతూ ) నిద్ర వస్తుందా ఈ టైంలో రావాల్సింది నిద్ర కాదు.

నాకు సిగ్గేసి దూరం జరిగాను.

మీనాక్షి : హోటల్ కనస్ట్రక్షన్ దెగ్గరికి తీసుకెళ్ళు నేను వస్తాను. అని ఇదిగో స్కూటీ కీస్ అంది.

మీనాక్షి గారిని తీసుకెళ్లి కింద నుంచే హోటల్ ఎలా కట్టించాలనుకుంటున్నానో నా ప్లాన్ అంతా చెప్పాను, ఇక్కడ అది వస్తుంది అక్కడ ఇది వస్తుంది అని చెప్తుంటే నన్ను చూస్తూ వింటుంది.

శివ : అలా చూడకండి, నాకు సిగ్గుగా ఉంది.

మీనాక్షి : నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు.

శివ : థాంక్స్, అలా ఎలా చెప్తున్నారు ?

మీనాక్షి : ఏమో, అలా అనిపించింది. నాకు నమ్మకము కూడా ఉంది.

మీనాక్షి గారికి చాచాని ముస్కాన్ ని పరిచయం చేసాను, కొంత సేపటికి తను ఇబ్బంది పడకూడదని ఇంటికి వెళ్ళమని చెప్పాను, వెళ్ళిపోతుండగా లక్ష్మి గారు మీనాక్షిగారికి చీర పెట్టి పంపించారు.

రాత్రి ఎనిమిదింటి వరకు స్లాబ్ వేసి ఏటోళ్ళు అటు కూలి తీసుకుని అందరూ హోటల్లో భోజనం చేసి వెళ్లిపోయారు, మేస్త్రి వాళ్లు మాత్రం దావత్ కోసం డబ్బులడిగితే చాచా రెండు వేలు ఇచ్చి పంపించాడు.

నిల్చొని కొంచెం కాళ్ళు నెప్పులు పుడుతుండడం వల్ల నేను కూడా హాస్టల్ కి వెళ్లి త్వరగానే నిద్రలోకి జారుకున్నాను, మీనాక్షి ఇవ్వాళ పెట్టిన ముద్దులను మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఆ పెదవుల స్పర్శని నా మెడ మీద అనుభవిస్తూ, ఏంటో అంతా కొత్తగా పిచ్చిగా ఉంది.

తను పెట్టిన ముద్దులు అలానే ఉండాలని స్నానం కూడా చెయ్యలేదు నేను, నా ఈ పిచ్చి చేష్టలకి నాకే నవ్వొస్తుంది కానీ అది బాగుంది నాకు తెగ నచ్చింది.
Like Reply
#16
15    

నలభై ఐదు రోజుల్లో మూడు ఫ్లోర్ ల స్లాబులు పోపించేసాను, అటు ఆ పని జరిపిస్తూనే కింద గోడలు కూడా మొదలుపెట్టించాను.

లోన్ కూడా ఇంకో ఇరవై రోజుల్లో వచ్చేస్తుందని బ్యాంకు మేనేజర్ గారు చెప్పారు.. ఆలోచిస్తూనే కాలేజీకి బైలుదేరాను.

గేట్ దెగ్గర మీనాక్షి కనిపించింది, నన్ను చూడగానే ముందుకు వచ్చింది ఆనందంగా.

శివ : మీనాక్షి గారు మీ వల్ల నేను క్లాసులు మిస్సవుతున్నానండి.

మీనాక్షి : అబ్బో  శివ గారు జోకులు కూడా వేస్తారా?

శివ : మీకూ ఎటకారం ఎక్కువేలేండి.

మీనాక్షి : ఇందాకే కంపెనీ నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది, ఒక పక్క ఆనందంగాను ఉంది కానీ బాధగాను ఉంది ఎక్కడ మేము ఇరుక్కుపోతామో అని.

శివ : తరువాత బాధ పడుదురు లేండి, ట్రీట్ ఏమైనా ఇస్తారా నన్ను లోపలికి వెళ్ళమంటారా?

మీనాక్షి : పదండి శివ గారు వెళదాం.

శివ : అదేంటండీ అలా గారు అంటున్నారు.

మీనాక్షి : మరి, మీరు అంతగా మర్యాదగా పిలుస్తున్నప్పుడు నేను అగౌరవంగా ఎలా మాట్లాడను, మీరు నన్ను పేరు పెట్టి పిలిచేంత వరకు నేనూ ఇలానే మిమ్మల్ని గారు అని పిలుస్తాను.

శివ : అది కాదండి.

మీనాక్షి : పదండి వెళదాం.

ఇంకేం మాట్లాడకుండా తన వెనకాలే వెళ్ళాను, ఇద్దరం పెద్ద హోటల్ కి వెళ్లి ఎదురెదురుగా కూర్చున్నాం. మీనాక్షి బిర్యానీ చెప్పింది సరే ఇంత వరకు మనం తిన్నది చాచా బిర్యానీ మాత్రమే కదా చూద్దాం బైట బిర్యానీ ఎలా ఉంటుందో అని మౌనంగానే కూర్చున్నాను.

సడన్ గా మీనాక్షి నవ్వుతూ గ్లాస్ నీళ్లు నా మీదకి విసిరినట్టుగా గ్లాస్ ఎత్తింది.

శివ : మీనాక్షి వద్దు.

మీనాక్షి : చూసావా, ఇప్పుడు నన్ను గారు అనలేదే. నీ మనసులో నన్ను మీనాక్షి అనే అనుకున్నావు కానీ అది బైటికి వచ్చేసరికి నా పేరు పక్కన గారు చేరుతుంది. ఎందుకలా?

తన చెయ్యి పట్టుకున్నాను ప్రేమగా. నా చేతి మీద తన ఇంకో చెయ్యి వేసింది.

శివ : మీరంటే నాకు చాలా ఇష్టం, పొరపాటున మీతో చనువు పెంచుకుని ఏదైనా తప్పుగా మాట్లాడితే దాని వల్ల మీకు కోపం వచ్చినా బాదేసినా, నా నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో అన్న భయం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోడానికి నేను సిద్ధంగా లేను అందుకే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మెలుగుతున్నాను.

మీనాక్షి కొంచెం ముందుకు జరిగి నా చెయ్యి తన మొహానికి ఆనించుకుంది.

మీనాక్షి : చూడు శివ, అలా భయపడితే నన్ను ప్రేమగా ఎలా చూసుకుంటావ్. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు తిట్టాలి కదా రేపు పెళ్ళైతే నీ భార్యని అవుతాను అప్పుడు కొట్టాలి కూడా.

శివ : ఆమ్మో, కొట్టడమా?

మీనాక్షి : అవును శివా, కొట్టడమంటే బాది పారేయమని కాదు, చిలిపిగా ప్రేమగా కొట్టడం. ప్రేమికుల మధ్య అయినా భార్య భర్తల మధ్య అయినా గిల్లి కజ్జాలు ఉంటే సరదాగా ఉంటుంది, నువ్వు నన్ను ఏడిపించాలి నేను అలిగితే నన్ను బతిమిలాడుకోవాలి, నిన్ను నా చుట్టు తిప్పుకోవాలి ఇంకా బోలెడన్ని ఉన్నాయి. నువ్విలా ఉంటే ఆ సరదాలు ఎలా తీర్చుకుంటాం చెప్పు.

ఒక వేళ గొడవ అయ్యిందే అనుకో, నువ్వు నా కోసం ఎంత తపిస్తావో నేను అంతే నీ కోసం ఎదురు చూస్తుంటాను. చివరికి తప్పు నాదైనా సరే నన్ను నువ్వు వదిలేయ్యకూడదు, కొట్టినా తిట్టినా అన్నీ నీ దెగ్గరే నీ కౌగిలి లోనే అంటూ కళ్ళు మూసుకుని శివ చేతిని ముద్దు పెట్టుకుంది.

ఇంతలో వెయిటర్ బిర్యానీతో వచ్చేసరికి ఇద్దరం విడిపడ్డాము. బిర్యానీ సెర్వ్ చేసి వెళ్ళిపోయాక మీనాక్షి తన ప్లేట్ తీసుకుని నా పక్కకి వచ్చి కూర్చుంది.

ముద్ద నోట్లోకి తీసుకుంటుండగా మీనాక్షిని చూసాను, నన్ను చూసి చిన్నగా నవ్వుతూ నోరు తెరిచింది. అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా అని నా చేతిలో ఉన్న ముద్దని తన నోటికి అందించాను.

నములుతూనే నా బుగ్గకి తన బుగ్గ ఆనించి తన ప్లేట్ లోనుంచి ముద్ద కలిపి నాకు తినిపించింది, నా పెదం చివర ఒక మెతుకు ఉంటే తన పెదాలు దెగ్గరికి తీసుకొచ్చి ఆ మెతుకుని తన పెదాలతో పట్టుకుని నవ్వింది.

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఇంకొకరం చూసుకుంటూ తినడం మర్చిపోయాం, ఇంతలో ఎవరో ఫ్యామిలీ మా పక్క టేబుల్లోకి వచ్చి కూర్చున్నారు. ఇద్దరం తెరుకుని చక చకా తినేసి బిల్లు కట్టి బైటికి వచ్చాము.

మీనాక్షి నా కళ్ళలోకి చూస్తూ కొంచెం తడబడుతూనే ఉంది.

మీనాక్షి : మరి నేను వెళ్తాను, హ్మ్ ?

శివ : అలాగే.

మీనాక్షి : నేను కాల్ చేస్తాను బాయ్. అని అక్కడనుంచి పరిగెత్తింది.

మీనాక్షి వెళ్ళిపోయాక గాని నా గుండె వేగం తగ్గలేదు, తను నా చేతి మీద ముద్దు పెట్టిన చోట నేను ముద్దు పెట్టుకుని నవ్వుకుంటుంటే, మీనాక్షి పిలిచింది.

తల ఎత్తి చూసాను, నేనేం చేస్తున్నానో చూసి నవ్వింది. చెయ్యి కిందకి దించేసి సిగ్గుతో తల దించుకున్నాను.

మీనాక్షి : ఐ లవ్ యూ చెపుదామని వచ్చాను కానీ మీరు చాలా బిజీగా ఉన్నారు కదా.


నేనేదో చెప్పేలోపే నా చెయ్యందుకుని నేను ముద్దు పెట్టిన చోటే ఇంకో ముద్దు పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. నేను అలానే చూస్తుండిపోయాను.
Like Reply
#17
16    

తెల్లారి గగన్ సర్ నుండి ఫోన్ వస్తే కాలేజీకి వెళ్లాను, గగన్ సర్ మీనాక్షి ఇద్దరు నా కోసం వెయిటింగ్. నేను రాగానే సార్ కార్ స్టార్ట్ చేసాడు మీనాక్షి నన్ను చూసి నవ్వింది కానీ నేను మామూలుగానే ఉన్నాను.

ముగ్గురం టెక్సటైల్ కంపెనీకి బైలుదేరాము, చూడటానికి బాగానే ఉంది రిచ్ గా. గగన్ సర్ ఆఫీస్లో కూర్చున్నాడు నేను మీనాక్షి మిగతా గోడౌన్ మెషినరీ చూడడానికి వెళ్ళాము.

మీనాక్షి నాకు ఒక్కొక్క దాని గురించి చెప్తుంది కానీ నా చూపు తను చెప్తున్న వైపు లేదు అక్కడ పని చేస్తున్న వారి మీదే ఉంది, ఎవ్వరికీ రెస్పెక్ట్ లేదు భయం బాధ్యతలు లేవు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పనిచేస్తున్నారు ముఖ్యంగా మేము వాళ్ళని దాటేటప్పుడు వాళ్ల దొంగ చూపులు, గుసగుసలు వింటూనే ఉన్నాను.

గోడౌన్ కి వెళ్ళాక మీనాక్షి కంపెనీలో మెయిన్ మేనేజర్ ని అసిస్టెంట్ మేనేజర్ ని పరిచయం చేసింది, వాళ్లిద్దరూ తేడాగానే ఉన్నారు. మీనాక్షిని వెళ్ళమని చెప్పి వాళ్లతొ మాట్లాడుతూ గంట గడిపాను.

ఆ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు బావ బామ్మర్దుల వరస అని తెలిసింది, ఇద్దరు కలిసి కంపెనీకి బానే బొక్క పెట్టారు వాళ్ల అలవాట్లకి వాళ్లు వాడే వస్తువులకి,  కార్లకి వాళ్లు మాట్లాడే వ్యవహారిక భాషకి అస్సలు సంబంధం లేదు.

వాళ్లతోనే భోజనం చేసి,  అక్కడ నుంచి వర్కర్స్ తొ కలిసి పనిలోకి  చేరాను, కొంత సేపటికి మీనాక్షి ఫోన్ చేసింది.

శివ : చెప్పు

మీనాక్షి : భోజనానికి రాలేదు, ఆకలేస్తుంది.

శివ : మీరు తినేయ్యండి, నేను ఆల్రెడీ తినేసాను ఇక్కడే మెషినరీలో పని చేస్తున్నా రావడానికి కొంచెం టైం పడుతుంది.

మీనాక్షి : సరే, అక్కడే ఉండు మేమూ తినేసి వస్తాము.

ఫోన్ పెట్టేసి పనిలో పడిపోయాను, కాదు అందరినీ గమనించడం మొదలు పెట్టాను. కొంత సేపటికి నేను పనిచేస్తుంటే మీనాక్షి, గగన్ సర్  ఇద్దరు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ బైటికి నడిచాను.

గగన్ : ఏంటి శివా, వచ్చిన రోజే పనిలో చేరావు. ఆ మేనేజర్ చెప్పాడు చాలా ఆరాలు తీసావట.

శివ : అవును సర్  మెషినరీ లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఆ మేనేజర్ ని అసిస్టెంట్ మేనేజర్ ని దేవుడిలా కొలుస్తున్నారు. చాలా మందిని వాళ్లే జాయిన్ చేసుకున్నారట ఇంకా పై పెచ్చు అందులో చాలా మంది వాళ్ల బంధువులే ఇంకా కొన్ని తెలిసాయి.

రేపటి నుంచి ఇక్కడ కొన్ని రోజులు పని చేస్తాను అప్పుడు నాకు ఇక్కడ అస్సలు ఏం జరుగుతుందో అన్న అవగాహన వస్తుంది, దాన్ని బట్టి ముందుకు పోదాం, అని మీనాక్షి వైపు చూసాను ఏమంటావ్ అన్నట్టు.

గగన్ : ప్రౌడ్ అఫ్ యు శివా.

మీనాక్షి చెప్పట్లు కొడుతుంటే సిగ్గుతో నవ్వి ముగ్గురం అక్కడ నుంచి బైటపడి నన్ను హోటల్ దెగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయారు. హోటల్ కి వెళ్ళాక ఇక్కడి పనులు చూసుకోడం మొదలు పెట్టాను.

ముస్కాన్ కూడా అన్నీ చిన్నగా చూసుకుంటుంది, ప్రతీ ఒక్క విషయం తనకి ఓర్పుగా నేర్పుతూ వస్తున్నాను, పని వాళ్ళని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఒక పక్క చురకలు అంటిస్తూనే ఇంకో పక్క వాళ్ళ భోజనాలకి, టీ కి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. తన పద్ధతి బాగా నచ్చింది.

పనులన్నీ చూసుకుని పెందలాడే హాస్టల్ కి వెళ్లి నడుము వాల్చాను, నిద్ర పట్టేసింది.
Like Reply
#18
17    


ఇవ్వాళ కార్పెంటర్ పని జరిగింది రాసిచ్చిన సామాను మొత్తం తెచ్చాను అయినా నన్ను వాడు అది రాలేదు ఇది రాలేదు అని తెగ తిప్పాడు, అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అలిసిపోయి హోటల్లో తినేసి హాస్టల్ కొచ్చి బెడ్డెక్కాను.

ఈ వారం రోజులు టెక్సటైల్ కంపెనీలో పని చేసాను, ఈ లోగా ఖాసీం చాచాకి లోన్ కూడా వచ్చేసింది అటు హోటల్ కి ఇటు టెక్సటైల్ కి ఏ ఆటంకం లేకుండా పనులు జరిగిపోతున్నాయి.

కంపెనీ పేరు మీనాక్షి టెక్సటైల్స్ అని మార్చేశాడు గగన్ సర్, ఓపెనింగ్ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు అంతా అయిపోయాక మీనాక్షి ఫోన్ చేసింది.

శివ : అయిపోయిందా

మీనాక్షి : నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది

శివ : తిన్నావా ఏమైనా

మీనాక్షి : హహ

శివ : ఏమైంది

మీనాక్షి : నా గురించి కేర్ తీసుకుంటుంటే కొత్తగా బాగుంది.

శివ : రేపు కలుద్దాం, గగన్ సర్ ని కూడా తీసుకురా మాట్లాడదాం.

మీనాక్షి : అలాగే

శివ : ఉంటా మరి

మీనాక్షి : అంతేనా

శివ : ఇంకేముంది, ఏమైనా మాట్లాడాలా

మీనాక్షి : ఎప్పుడు పని మీద తప్ప, సరదాగా నా కోసం నాతొ మాట్లాడడానికి ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యవు.

శివ : మీ ఇంట్లో ఉంటావు, ఎక్కడ ఏ పరిస్తుతుల్లో ఉంటావో ఎందుకు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టడం అని

మీనాక్షి : లవ్ యూ

శివ : ..............

మీనాక్షి : చెప్పు

శివ : ఏమని

మీనాక్షి : లవ్ యూ టూ అని

శివ : హహ

మీనాక్షి : ఎందుకో ఆ నవ్వు

శివ : ఏమో నేను అలా చెప్పలేను

మీనాక్షి : ఆమ్మో, నిన్ను చాలా మార్చుకోవాలి

శివ : నీకు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకో

మీనాక్షి : ఒక నాలుగు రోజులు వీలు చూసుకో ఎటైనా వెళదాం

శివ : ఇంట్లో ఏమని చెప్తావ్, మీ అమ్మమ్మ అడిగితే

మీనాక్షి : నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే, నీకు ఓకే నా

శివ : అవసరమంటావా

మీనాక్షి : మూసుకుని చెప్పింది చెయ్యి

శివ : హహ వామ్మో

మీనాక్షి : సారీ

శివ : నాకు బానే ఉంది, థాంక్స్

మీనాక్షి : దేనికి

శివ : నాతో నువ్వు నీలానే ఉంటున్నందుకు, నా మీద నువ్వు పెత్తనం చూపిస్తుంటే ఒక ఇంట్లో ఉన్నట్టు నేను నీ సొంతం అయినట్టు అనిపిస్తుంది, ఇప్పటి వరకు ఇలాంటి సంతోషాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు

మీనాక్షి : (నవ్వుతూ) అయితే నువ్వు నన్ను చాలా భరించాలి

శివ : జీవితాంతం భరిస్తాను

మీనాక్షి : ఉమ్మా

శివ : ఆమ్మో

మీనాక్షి : హహ    బై.

శివ : ఆ.. బాయ్

మీనాక్షి : ఏమైంది.

శివ : ఏం లేదు

మీనాక్షి : ఇంకొంచెం సేపు మాట్లాడనా?

శివ : మ్

మీనాక్షి : సరే చెప్పు ఏం చేస్తున్నావ్

శివ : ఏం లేదు, సరే నేనే మళ్ళీ చేస్తాలే బాయ్

మీనాక్షి : సరే అయితే

మీనాక్షి ఫోన్ పెట్టేసి సంతోషంగా ఫోన్ ని గుండెలకి హత్తుకుని సంబరపడిపోతుంటే ఇటు శివ కూడా అదే అలజడిలో ముసి ముసిగా నవ్వుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు.

పొద్దున్నే శివ గగన్ మీనాక్షి ముగ్గురు చెరువు గట్టున కలుసుకున్నారు.

గగన్ : చెప్పు శివ, ఏదో మాట్లాడాలి అన్నావట

శివ : అవును సర్, నేను మీకు సహాయం చెయ్యాలి అంటే నాదొక షరతు.

గగన్ : ఏంటి?

శివ : ఇవ్వాల్టి నుంచి కంపెనీలో నేను ఏది చెప్తే అది ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా చెయ్యాలి. అలా అయితేనే నేను మీకు సహాయం చెయ్యగలను.

గగన్ : కాన్...

శివ : కారణం చెప్పను, కానీ నా మీద నమ్మకం ఉంచి ముందుకు వెళదాం అంటే ఓకే లేదంటే నేను ఇక్కడితొ ఆగిపోతాను.

గగన్ : నీ మీద నమ్మకం లేకపోతే నా కూ.. అని మీనాక్షిని చూసి ఆగిపోయాడు.  
సరే నువ్వేది చెప్తే అదే చేస్తాము.

శివ : అయితే రేపు ఆఫీస్ లో కలుద్దాం. టైం టు ప్రొగ్రెస్. కంపెనీ నుంచి వచ్చే లాభాలు ఏం చెయ్యాలో తెలీక మీకు పిచ్చెక్కిపొద్ది.

శివ నుంచి అంత కాన్ఫిడెంట్ గా వచ్చిన మాటలు విని మీనాక్షి గగన్లు ఆశ్చర్యంతొ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు.

మీనాక్షి ఏదో మాట్లాడాలనుకున్నా అక్కడ తన నాన్న ఉండటంతొ మౌనంగానే శివని ఒకసారి  చిరుకోపంగా చూసి కొంటెగా నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయింది.
Like Reply
#19
18    


అక్కడనుంచి హోటల్ కి వెళ్ళిపోయాను.

శివ : ముస్కాన్ అంతా ఓకేగా?

ముస్కాన్ : సూపర్.

శివ : ఆల్రెడీ ఎక్కడ ఏది రావాలి అన్నీ స్కెచ్ గీసి ఈ నోట్స్ లో రాసి ఉంచాను, కరెంటు పాయింట్స్, వాటర్ పాయింట్స్ అన్నీ కరెక్ట్ గా చేపించు.. నీకు నచ్చినట్టుగా మార్పులు చేపించుకో ఏ డౌట్ వచ్చినా ఒక్క ఫోన్ కొట్టు.

ముస్కాన్ : అలాగే భయ్యా మాకేం పర్లేదు అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి, కానీ నువ్వు జాగ్రత్త వాళ్లంతా పెద్ద పెద్ద వాళ్ళు.

శివ : అలాగే.. బాబా ఎక్కడా?

ముస్కాన్ : లతీఫ్ వాళ్ళ అమ్మా నాన్న వస్తే మాట్లాడుతున్నాడు, పిలవనా?

శివ : వద్దులే నేను తరువాత మాట్లాడతా, సరే బై.

ముస్కాన్ : అప్పుడప్పుడు ఇటు వస్తూ ఉండు, మొత్తానికే మర్చిపోతావేమో.

శివ : చాచా బిర్యానీ తినకుండా రెండు రోజులు కూడా ఉండలేను మీ దెగ్గర పని చెయ్యట్లేదు అంతే, సాయంత్రానికి వస్తాను నాకొక సింగల్ పక్కకి పెట్టండి అని నడుచుకుంటూ వెనక్కి తిరక్కుండా నవ్వుతూ చెప్పి వచ్చేసాను.

కాలేజీకి వెళ్లి గగన్ సర్ పేరు చెప్పి మా ప్రిన్సిపాల్ తొ మాట్లాడి కాలేజీ సీనియర్స్ లిస్ట్ తీపించి హాస్టల్ కి వచ్చి కూర్చున్నాను, నా ఫోన్ మోగింది,  కావేరి పెద్దమ్మ నుంచి.

శివ : పెద్దమ్మా బాగున్నావా

కావేరి : మేము బానే ఉన్నాం, నువ్వే అస్సలు కనిపించడం లేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది డబ్బులు పంపిస్తే సరిపోద్ది అనుకుంటున్నావా

శివ : కొంచెం పని మీద ఉన్నా పెద్దమ్మ రేపు వస్తాను, అందరూ ఎలా ఉన్నారు.

కావేరి : బాగున్నాము రా, పోయిన సారి నువ్వు పంపించిన డబ్బుతొ ఇక్కడ పిల్లలకి చదువు చెప్పించి నవోదయ ఎగ్జామ్ రాపించాను ఏడుగురుకి ఫ్రీ సీట్స్ వచ్చాయి ఇంటర్ వరకు ఫుడ్ బెడ్ చదువు మొత్తం వాళ్లే ఆ తరువాత ఎలాగో వాళ్ళ చదువులు, జీవితాలు వాళ్లు చక్కదిద్దుకుంటారు.


శివ : సంతోషం పెద్దమ్మ.

కావేరి : చికెన్ వండుతున్నా వచ్చి తినెళ్ళు.

శివ : పెద్దమ్మా అది..

కావేరి : ఆశ్రమానికి రాకపోయినా అమ్మ కోసం అయినా రారా, నువ్వు తప్పించి నాకెవరున్నారు చెప్పు, ఇంకేం మాట్లాడకుండా వచ్చేయి అలానే ముస్కాన్ ని కూడా తీసుకురా

శివ : హా   అలాగే.. అని కాల్ కట్ చేసి కూర్చున్నాను, నా క్లాస్మేట్ కం రూం మేట్ సందీప్ వచ్చాడు.

సందీప్ : ఏంట్రా ఇవాళ త్వరగా వచ్చావ్, నీ పనే బాగుంది రా, కాలేజీకి రాకపోయినా మార్కులు వస్తాయి ఎప్పుడు చదువుతావురా అస్సలు నువ్వు.

శివ : సరేలే ఎలా జరుగుతున్నాయి క్లాసులు.

సందీప్ : అదే గోల

శివ : ఇవ్వాళ కాలేజీకి వచ్చాను, ప్రిన్సిపాల్ చెవుల నిండుగా తిట్టాడు కాలేజీకి రావట్లేదాని.

సందీప్ : ఆయన అలానే అరుస్తాడులే, నాకో హెల్ప్ కావాలిరా

శివ : ఏంటి?

సందీప్ : ఇంట్లో కొంచెం కష్టంగా ఉందని నాన్న ఫోన్ చేసాడు, కాలేజీ మానేసి పనికెళతావా అన్నట్టు మాట్లాడాడు ఇన్నేళ్లగా అలాంటి మాటలు ఆయన దెగ్గర నుంచి వినలేదు, చాలా బాదేసింది ఏదైనా జాబ్ చూస్తావా

శివ : ఒక జాబ్ ఉంది, కానీ చాలా కష్టం మరి.

సందీప్ : పర్లేదు చూపించు చేస్తాను.

శివ : సరే అయితే.


ఇంతలో మళ్ళీ ఫోన్ వస్తుంటే చూసాను మీనాక్షి.

శివ : హలో

మీనాక్షి : ఏంటి దొరవారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు.

శివ : అలా ఏం లేదు, అవును పొద్దున్న ఎందుకు నన్ను కోపంగా చూసి వెళ్ళావ్

మీనాక్షి : మరి మాకు అలా షాకులు ఇస్తే, నువ్వు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు చెప్పాలి కదా

శివ : అయితే నీకు బోలెడన్ని చెప్పాలి

మీనాక్షి : చెప్పు, నేను అదేగా నిన్ను అడిగేది ఎన్ని ముచ్చట్లయినా చెప్పు ఓపికగా వింటాను.

శివ : ఇంకా

మీనాక్షి : చెప్పాలి నువ్వే, ఏంటి ఈ రోజు ప్లాన్స్.

శివ : హే మర్చిపోయా, పెద్దమ్మ భోజనానికి రమ్మంటుంది వెళ్ళాలి.   వస్తావా?

మీనాక్షి : పిలిస్తే ఎందుకు రాను, నాకు చూడాలనే ఉంది, మీ పెద్దమ్మకి నన్ను పరిచయం చెయ్యి. నువ్వు పుట్టి పెరిగిన ఆశ్రమం చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.

శివ : సరే అయితే హోటల్ దెగ్గర కలుద్దాం ముస్కాన్ కూడా వస్తుంది.

మీనాక్షి : సరే కార్ తీసుకొస్తాను

శివ : అలాగే వచ్చేటప్పుడు ఒక కెమెరా తీసుకురా

మీనాక్షి : దేనికి?

శివ : ఫోటోలు తీసుకుందాం

మీనాక్షి : హహ సరేలే

వెంటనే ముస్కాన్ కి కాల్ చేసాను.

ముస్కాన్ : చెప్పు భయ్యా

శివ : పెద్దమ్మ భోజనానికి పిలిచింది వస్తావా

ముస్కాన్ : ఐదే ఐదు నిముషాలు రెడీ అవుతాను.

శివ : తొందర ఏం లేదు ఆరింటికి వస్తాను రెడీగా ఉండు, చాచాకి చెప్పు

ముస్కాన్ : అవసరం లేదు, ఫోన్ స్పీకర్ లో ఉంది వింటున్నాడు

శివ : చాచా..!

చాచా నవ్వుతూ పెట్టేసాడు.

సందీప్ నన్నే చూస్తున్నాడు, నేను చాచాతొ జాబ్ గురించి మాట్లాడతానేమో అని ఫోన్ పెట్టేసి సందీప్ వైపు చూసాను.

శివ : సందీప్ నా దెగ్గర ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా నీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను కాని హామీ ఇవ్వలేను.

సందీప్ : పర్లేదు రా చూపించు.

శివ : రోజు కాలేజీ అయిపోయాక నాకు ఫోన్ చెయ్యి, అక్కడ నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి టైమింగ్స్ ఉండవు మరి, జీతం కూడా ఏం చెప్పలేను కానీ నువ్వు ఎదుగుతావు అది మాత్రం చెప్పగలను.

సందీప్ : అంతకంటే అదృష్టమా, నీ కష్టం చూస్తూనే ఉన్నాను నెలకి కొంచెం నీకు వీలైనంత ఇస్తే చాలు ఇంట్లో వాళ్ళని అడక్కుండా నా ఖర్చులు నేనే భరిస్తాను. ఏమైనా మిగిలితే నాన్నకి పంపిస్తాను.

శివ : సరే అయితే, ఇవ్వాల్టి నుంచి జాయిన్ అయినట్టేగా

సందీప్ : జాయిన్ ఐపోయా

శివ : సరే ఆ సెల్ఫ్ లో రిజిస్టర్లు ఉన్నాయి, నీకు ఫోన్ ఉందిగా?

సందీప్ : ఉంది.

ఆ రిజిస్టర్లు అందుకో ఇందులో......................................................................................... తీసేసి మిగతా అందరినీ ఫిల్టర్ చెయ్యి, కన్ఫ్యూస్ అవ్వొద్దు మొత్తం నాలుగు రిజిస్టర్లు ఒకటి నువ్వు తీసుకో ఇంకోటి నాకు ఇవ్వు సాయంత్రం ఆరింటిలోపు అయిపించేద్దాం మిగతా రెండు రాత్రికి కంప్లీట్ చేద్దాం సరేనా.


సందీప్ : అలాగే.

ఇద్దరం స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేస్తూ గడిపి రెండు అయిపోయేసరికి ఆరున్నర అయ్యింది, పక్కకి పెట్టి ఫోన్ తీసుకుని చూస్తే మీనాక్షి నుంచి రెండు ముస్కాన్ నుంచి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి.

మీనాక్షికి ఫోన్ చేసాను.

మీనాక్షి : ఏమైపోయావ్?

శివ : రెండే రెండు నిముషాలు వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి లేచి మొహం కడుక్కుని వచ్చాను.

శివ : షర్ట్ వేసుకుంటూ సందీప్ పదా భోజనానికి వెళదాం అన్నాను

సందీప్ : వెళ్లిరా, నేనిక్కడ చేసేస్తాను.

శివ : పర్లేదురా  అస్సలే చికెన్    
అనగానే లేచి నిల్చున్నాడు నవ్వుకుని పదా అన్నాను. ఇద్దరం చాచా హోటల్ కి బైలుదేరాము వేగంగా నడుస్తూ.
Like Reply
#20
19    


హోటల్ ముందుకి కి వెళుతుండగానే మీనాక్షి కి మిస్డ్ కాల్ చేసాను,  ఇద్దరు బైటికి వచ్చారు.

శివ : వెళదామా

ముస్కాన్ : నీదే లేట్ భయ్యా

శివ : చిన్న పని అయిపోయింది, ఇదిగో తను నా ఫ్రెండ్ సందీప్ అని పరిచయం చేసాను, మీనాక్షి డ్రైవింగ్ సీట్లో పక్కన ముస్కాన్ వెనక నేను సందీప్ కూర్చున్నాం. కారు బైలుదేరింది.

ముస్కాన్ : భయ్యా లతీఫ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారాని చెప్పా కదా

శివ : హా

ముస్కాన్ : నన్ను లతీఫ్ కి అడగడానికి వచ్చారు, బాబా ఆలోచించి చెప్తా అన్నాడు.

శివ : ఇందులో ఆలోచించడానికి ఏముంది వద్దని చెప్పక, (మళ్ళీ వెంటనే తెరుకుని) సారీ ముస్కాన్ ఏదో అలా వచ్చేసింది సారీ, ఇంతకీ నువ్వేం అనుకుంటున్నావు?

ముస్కాన్ : పర్లేదు భయ్యా, నాకూ వాడంటే పడదు

శివ : వద్దులే ముస్కాన్, అది నీకు నీ మెంటాలిటీకి, నీ మంచితనానికి ఆ సంబంధం సెట్ అవ్వదు అనుకుంటున్నాను, అయినా చాచా అన్నీ ఆలోచించే చేస్తాడు కదా

ముస్కాన్ : ఇక్కడే భాభీ, లోపలికి పోనివ్వు.

ముస్కాన్ కార్ లోపలికి పోనిచ్చింది, పెద్దమ్మ ఆఫీస్ ముందే చెట్ల దెగ్గర ఎవరితోనో మాట్లాడుతుంది, నలుగురం దిగి ముందుకు వెళ్ళాము. మమ్మల్ని చూసి నవ్వి తిరిగి వాళ్ళతో మాట్లాడుతుంది.

ముందు ముస్కాన్ ఆ వెనుక సందీప్ ఆశ్రమం చూసుకుంటూ వెళుతుంటే మీనాక్షి నాతొ పాటు నడుస్తుంది.

మీనాక్షి : నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి.

శివ : దేనికి?

మీనాక్షి : ఎప్పటికైనా అవసరం పడుతుంది కదా, అదీకాక మనం ఎటైనా ట్రిప్ కి వెళదాం అనుకున్నాంగా దానికి నేను ఒక్కదాన్నే వెళుతున్నా అని ఇంట్లో  మా అమ్మని ఒప్పించాలంటే చాలా పెద్ద పని నిన్ను డ్రైవర్ గా పరిచయం చేపిస్తాను.

శివ : ఇవన్నీ గగన్ సర్ కి తెలుసా

మీనాక్షి : ట్రిప్ అని అది అని ఇది అని చివరికి నీ పేరు చెప్పా ఆయనకి అర్ధం అయ్యింది మా ఇంట్లోనే ఒప్పించాలి.

శివ : అవసరమా మరి

మీనాక్షి : అవసరమే ప్లీజ్ ప్లీజ్ వెళదాం.

శివ : చూద్దాంలే

ఇంతలో కావేరి పెద్దమ్మ మాట్లాడుతున్న వాళ్ళని పంపించేసి మా వైపు వచ్చింది, ముస్కాన్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ

కావేరి : ముస్కాన్ బాగున్నావా, శివా   ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చారు

ముస్కాన్ : బాగున్నా పెద్దమ్మ

కావేరి : తను..?

శివ : నా ఫ్రెండ్ పెద్దమ్మ, పేరు సందీప్

కావేరి : నమస్కారం బాబు

సందీప్ : నమస్తే అమ్మా

శివ : తను (అని మీనాక్షి చెయ్యి పట్టుకున్నాను)

కావేరి : ఆగాగు, మీనాక్షి కదా

శివ : అవునండి

కావేరి : నీ గురించి చెప్పాడు మీనాక్షి, చెప్పినట్టే కుందనపు బొమ్మల ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావ్.

మీనాక్షి సిగ్గుపడింది.

ముస్కాన్ : మరి నేనో

కావేరి : నువ్వు కూడా అచ్చా హే ప్యారా ఔర్ కితనా కూబ్ సూరత్ లడ్కి హో

ముస్కాన్  షుక్రియ అని సలాం చేసింది. అందరం నవ్వుకున్నాం

కావేరి : శివా చికెన్ తెప్పించా ఇంట్లోనే ఉంది, నీ చేత్తో వండవూ

ముస్కాన్ : ఏంటి భయ్యాకి వంట వచ్చా

కావేరి : హా వచ్చు, చాలా బాగా చేస్తాడు

ముస్కాన్ : మరి కనీసం ఒక్కసారి కూడా హోటల్లో గరిట పట్టుకోలేదు!

నేను నవ్వి  సందీప్ తొ పాటు పక్క సందులో ఉన్న పెద్దమ్మ  ఇంటికి వెళ్లాను.

మీనాక్షి : ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది, అన్నీ చాలా బాగా చేసారు, మీకు చెట్లంటే ఇష్టమా?

కావేరి : నాకు ఇష్టమే కానీ శివకి చెట్లంటే ప్రాణం. పచ్చదనం, వాగులు చెరువులు జలపాతాలు ఎక్కడ పచ్చదనం ఎప్పుడు వాటి గురించే మాట్లాడతాడు తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం చెట్ల గురించి మట్టి గురించి ఎంతసేపైనా మాట్లాడతాడు, ఇక్కడున్న ప్రతీ ఒక్క చెట్టు శివ పెట్టిందే, చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు కూడా బైటికి అలానే కనిపిస్తాడు కానీ చిన్న పిల్లోడి మనస్తత్వం.

మీనాక్షి : అమ్మా..    శివ గురించి చెప్తారా ఎక్కడ పుట్టాడు ఇక్కడికి మీ దెగ్గరికి ఎలా వచ్చాడు తన గురించి మీకు తెలిసిందంతా నాకూ తెలుసుకోవాలని ఉంది, తనని అడిగితే నవ్వాడు కానీ ఏం చెప్పలేదు.

కావేరి : చెప్తాను కానీ మళ్ళీ వాడికి గుర్తు చెయ్యడం లాంటివి చెయ్యకండి, బాధ పడతాడు.

ముస్కాన్, మీనాక్షి : చెప్పము
Like Reply




Users browsing this thread: 1 Guest(s)