23-09-2022, 07:25 PM
Superb story ji, keka
కధా స్రవంతి ❤️
|
13-11-2022, 05:55 PM
(23-07-2022, 06:48 PM)Vegetarian Wrote: Bro ee story malli start chesara Thankyou (23-07-2022, 08:39 PM)maheshvijay Wrote: Superb updateThankyou (23-07-2022, 09:12 PM)Iron man 0206 Wrote: Super update broThankyou (23-07-2022, 10:05 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది Thankyou
13-11-2022, 05:56 PM
13-11-2022, 05:56 PM
13-11-2022, 05:57 PM
13-11-2022, 05:57 PM
13-11-2022, 05:58 PM
13-11-2022, 05:58 PM
13-11-2022, 06:00 PM
(This post was last modified: 05-05-2023, 09:53 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
4
రాత్రి అయ్యింది అందరూ పడుకున్నాక నేను లేచి ఇంటి నుంచి బైటికి వచ్చి చుట్టూ చూసాను ఎవ్వరు లేరు. నవ్య : ఏంటి చూస్తున్నావ్ అర్జున్ : భయపడి చచ్చాను కదే, నువ్వు పడుకోలేదా నవ్య : బండి కీస్ నా దెగ్గరే ఉన్నాయి అన్నయ్యా.. ఇక ఇదా బ్యాగ్ కొన్ని అవసరం అయ్యేవి తెచ్చాను అర్జున్ : నువ్వే నాకు లగ్గేజీ మళ్ళీ నీకొక లగేజ్ సరిపోయింది. నవ్య : వెవ్వేవే.. అర్జున్ : వీటికేం తక్కువ లేదు పదా అని వెళ్లి చప్పుడు రాకుండా బండి తీసి ఎక్కాను.. చూస్తావేంటి నెట్టు నవ్య : నేనా ??? అర్జున్ : మరి వస్తా అన్నావ్ గా, వచ్చినందుకు ఏదో ఒక పని చెయ్యి నవ్య : నీ సంగతి తరవాత చెప్తా.. అని బండి ముందుకు తోసింది. కొంత దూరం వెళ్ళాక బండి స్టార్ట్ చేసాను నవ్య ఎక్కి కూర్చుంది. అర్జున్ : ఇదిగో ఈ రింగ్ తీసుకో నువ్వు నాకు డైరెక్షన్ ఇస్తూ ఉండు స్పీడ్ గా వెళ్ళొచ్చేద్దాం. నవ్య : చలో.. రైట్ రైట్.. ఇప్పటివరకు ఇలాంటి ఒక అడ్వెంచర్ చేసిందే లేదు అందులోనూ నా చెల్లితో, చుట్టూ చీకటి పేరుకే హైవే కానీ రవ్వంత వెలుగు కూడా లేదు. నాకే భయంగా ఉంది ఇక నా చెల్లెలి పరిస్థితి ఏంటో.. అది నాకోసమే వస్తుంది నాకేమైనా అవుతుందేమో అని భయపడుతుంది.. ఇన్ని రోజులు దీన్ని ఎంత ఏడిపించాను నాకే కొంచెం సిగ్గుగా అనిపించింది. నా చెల్లెలు కూడా నన్ను అంతే ఏడిపించేది అనుకోండి కానీ అవసరం వచ్చినప్పుడు నా వెంటే ఉంది కదా.. అయినా నాక్కూడా ఇదంతా రిస్క్ అనిపించింది, ఇప్పటికిప్పుడు ఎవరైనా మా బండి ఆపితే చేసేది ఏమి లేదు.. బండి వెనక్కి తిప్పుదాం అని ఆలోచిస్తుండగా నవ్య : అన్నయ్యా ఇక్కడే హైవే దిగి చెట్ల మధ్యలోకి వెళ్లు ఇప్పుడే బండి చెట్ల మధ్యలోకి దింపాను, కొంత దూరం వెళ్ళాక దట్టమైన అడవి ప్రాంతం వచ్చింది. బండి అక్కడే ఆపేసి ఇద్దరం దిగి నడుచుకుంటూ వెళుతుంటే నవ్య తన బాగ్ లోనుంచి టార్చ్ లైట్ తీసింది. అర్జున్ : ఇంటెలిజెంట్ ఫెల్లో నవ్య : మరి నీ చెల్లిని కాబట్టి నీలానే ఉంటాననుకున్నావా అని ఎడమ చేతిలో ఉన్న రింగ్ డైరెక్షన్ బట్టి నడుస్తుంటే తన వెనకే నడుస్తున్నాను. కొంత సేపటికి రింగ్ లైట్ పెరుగుతుంది అంటే దెగ్గరికి వచ్చేసామన్నమాట. నవ్య నన్ను పిలిచి అటు చూడు అనగానే పక్కకి చూసాను ఎవరో ఆఫీసర్స్ ట్రైన్ క్రాష్ గురించి ఇన్స్పెక్షన్ చేస్తున్నారనుకుంటా మా వైపు తిరిగేలోపే నవ్వని పక్కకి లాగేసి టార్చ్ ఆపేసాను. అర్జున్ : నవ్యా.. ఇక్కడే ఉండు, నాకు ఆ రింగ్ ఇవ్వు నేనెళ్ళి చూసొస్తాను నవ్య : జాగ్రత్త అంటూనే నా చేతికి రింగ్ ఇచ్చింది రింగ్ డైరెక్షన్ చూస్తూ చెట్ల వెనకాల దాక్కుంటూ ఎవ్వరి కంటా పడకుండా వెళుతుంటే చివరికి ఒక పొద దెగ్గరికి వచ్చేసరికి రింగ్ ఆగకుండా వెలుగుతూనే ఉంది అంటే దెగ్గరికి వచ్చేసాను. నాకు పన్నెండు అడుగుల దూరంలో ట్రైన్ పట్టాలు క్రాష్ ఐన ట్రైన్ ఇంజిన్ ఉన్నాయి.. ఈ వెలుగు ఎవరికైనా కనిపిస్తే ఇక అంతే కానీ దీన్ని ఎలా ఆపాలో అర్ధం కాలేదు అప్పుడే నా కాలికి ఏదో తగిలి కిందకి చూసాను మట్టిలో చిన్న లైట్ వెలుగుతుంటే.. అటు ఇటు చూసి ఎవ్వరికి కనిపించకుండా కిందకి వంగి మట్టి కొంచెం తవ్వితే అప్పుడు బైట పడింది... అదొక వాచ్.. ఏదో సింథటిక్ రబ్బర్ లాంటి బెల్ట్ మధ్యలో అర్ధం కానీ వెలుగులతో గడియారం మెషిన్ రింగ్ లైట్ పసుపు రంగులో అందరికి కనిపించేంత వెలుగుతుండేసరికి ఏం చెయ్యాలో తెలియక గబగబా రింగ్ ని వాచ్ మీద పెట్టి నొక్కాను అంతే పెద్ద వెలుగు ఒకటి వచ్చింది ఆ తరువాత ఎం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు ఎవరో నా చెయ్యిని గట్టిగా పట్టేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా నా పుట్టుక నుంచి అమ్మ దెగ్గర మొదటిసారి తాగిన పాల రుచి, నా బారసాల, నాన్నకి ఇచ్చిన ముద్దులు, చెల్లి పుట్టడం తనని ఏడిపించడం, మొదటి సారి కాలేజ్ కి వెళ్లడం, మొదటిసారి ఒక అమ్మాయిని చూడటం నుంచి కాలేజీ ఎగ్జామ్స్ లో చీటీ పెట్టి సర్ కి దొరికిపోవడం వరకు ప్రతీ ఒక్కటి నా కళ్ళ ముందు తిరిగుతున్నాయి, కళ్ళు తిరిగుతున్నాయి.. పడిపోయాను. ± ± ±
± ± ±
± ± ±
±
ఎవరో మొహం మీద నీళ్లు కొడితే లేచాను. చూస్తే ఇక్కడే ఆఫీసర్స్ కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్ రూంలో ఉన్నానని అర్ధం అయ్యింది. లేచి నిల్చున్నాను. సర్ ఈ అబ్బాయికి స్పృహ వచ్చింది అని ఒకతను కేక వెయ్యగానే ఎవరో ఒకతను లోపలి వచ్చి నన్ను చూసి ఇందాక పిలిచినాయనని బైటికి వెళ్ళమన్నాడు. ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అర్జున్ : సర్ అది నేను మా అన్నయ్య ట్రైన్ ఆక్సిడెంట్ అయిన తరువాత ట్రైన్ ఆగకముందే మా అన్నయ్య బైటికి దూకేసాడు నేను కూడా దూకాను కానీ అన్నయ్య కనిపించలేదు నేను వెతుకుతూ ఉండేసరికి అడవిలో దారి తప్పిపోయాను తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ లైట్స్ వెలగడం గమనించి వెతుక్కుంటూ వచ్చాను అని కొంచెం భయంగా చెప్పింది నమ్ముతాడా లేదా అన్న అనుమానంతోనే వణుకుతూ చెప్పాను ఎందుకంటే వీళ్ళ ద్వారా మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నా చాప్టర్ క్లోజ్.. అస్సలుకే చెల్లిని కూడా తీసుకొచ్చాను. రేయి ఇంత ఎత్తున్నావ్ నువ్వెలా తప్పిపోయావ్ రా అని నవ్వాడు, నేనేం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను. సరే సరే మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు వాళ్ళకి ఫోన్ చేస్తాను అన్నాడు. ఆమ్మో ఇంకేమైనా ఉందా.. వెంటనే పని చెయ్యని మా తాత పాత నెంబర్ చెప్పాను. నీ చేతికున్న వాచ్ బాగుంది ఎక్కడ కొన్నావ్ ?? అర్జున్ : చెయ్యి చూసుకున్నాను ఆ వాచి నా చేతికి ఉంది. ఇదెలా నా చేతికి వచ్చిందబ్బా అని ఆలోచిస్తూనే, ఇది మా అమ్మమ్మ గారింటి దెగ్గర జాతరలో కొన్నాను అని ఏదో నోటికి వచ్చింది చెప్పాను. టైం చూపించట్లేదే అర్జున్ : ఉత్తిదే ఆట బొమ్మ ఊరికే కొన్నాను ఆయన నన్ను చూసి నవ్వుతూ నా పేరెంట్స్ కి ఫోన్ చెయ్యడానికి లోపలికి వెళ్ళగానే లేచి అటు ఇటు చూసాను ఎవ్వరు లేరు అందరూ పనిలో ఉన్నారు ఇదే రైట్ టైం అని ఒక్క అడుగులో బైటికి పరిగెత్తి ఎవరో పిలుస్తున్నా వినకుండా పట్టాలు దాటి చెట్టు వెనక దాక్కున్నాను అర్జున్ : నవ్యా.. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి నవ్య : ఎంత భయం వేసిందో తెలుసా.. నీకేమైనా అయితే అని ఏడ్చేసింది అర్జున్ : వాళ్ళు చూడకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని నవ్య చెయ్యి పట్టుకుని బండి దెగ్గరికి పరిగెత్తాను, ఇద్దరం బండి ఎక్కి కిక్ కొట్టి గట్టిగా లాగితే గంటన్నరలో మళ్ళి ఇంటి దెగ్గర బండి ఆపి నెట్టుకుంటూ లోపల పెట్టేసి ఇంట్లోకెళ్ళి ఇద్దరం మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకునేవరకు మా ఇద్దరి గుండె చప్పుడి వేగం తగ్గలేదు. గోడకున్న గడియారం చూస్తే నాలుగున్నర అవుతుంది, ఇంకో అరగంటలో నానమ్మ లేచి కళ్ళాప జల్లుతుంది. నా టైం బాగుంది అని ఊపిరి పీల్చుకుని పక్కనే ఉన్న నవ్య చెయ్యి పట్టుకున్నాను.. నన్ను చూసింది అర్జున్ : పడుకో ఎలాగో ఇంకో గంటలో లేపుతారు అని మాట్లాడేసరికి, నన్ను చూసి అటు తిరిగి పడుకుంది, నేనూ కళ్ళు మూసుకున్నాను
14-11-2022, 07:12 AM
(13-06-2022, 06:33 PM)Takulsajal Wrote:Takulsajal garu! Sorry. I don't think this story is up to your level. Story is just a generic rescue act with sex..without background..For example the next story has sensitivity/concept to it...
14-11-2022, 07:16 AM
(14-06-2022, 09:15 PM)Takulsajal Wrote: Takulsajal garu! I thought in Sankellu story, hero Chinna is also from IIT...Did you study at IIT? (I started reading this story now only).
14-11-2022, 07:26 AM
14-11-2022, 07:43 AM
14-11-2022, 10:09 AM
14-11-2022, 10:09 AM
|
« Next Oldest | Next Newest »
|