Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
#1
||||||||||బే ఆఫ్ బెంగాల్||||||||||
నడి సముద్రంలో కంటైనర్స్ తో ఒక పెద్ద నావ, అందులో చివరన కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని సముద్రపు అలల వల్ల పడే తుప్పరని ఆస్వాదిస్తూ బీడీ తాగుతున్నాడు శీను


జగ్గు : అన్నా డీల్ వచ్చింది

శీను : ఏంటంటా

జగ్గు : రష్యా ఒప్పొనెంట్ మినిస్టర్ విక్టర్ ని లేపేయ్యమని

శీను : ఎంతా

జగ్గు : ఒక్క నిమిషం.. హలో హౌ మచ్.. ఆ.. మనీ.. మనీ........
ఆహా... వెయిట్ ఒక్క నిమిట్.. (ఫోన్ చెవిలో నుంచి తీసి శీనుని చూసాడు) అన్నా యాభై కోట్లు అంట.. చాలా చీప్..

శీను : రెండోందల యాభై కోట్లు అడుగు (అని కళ్ళు తెరవకుండానే పొగ వదులుతూ అన్నాడు)

జగ్గు : సునా.. రెండోందల యాభై కోట్లు.. దో సౌ ఫిఫ్టీ.. ఛీ దీనమ్మ.. టు హండ్రెడ్ పిఫ్టీ కోట్స్

శీను : హహహ...

జగ్గు : నో..నో.. నో డిస్కౌంట్స్.. నో కాష్ పేమెంట్.. ఓన్లీ బై హవాలా.. అది కూడా దుబాయి సే హి ఆనా పడేగా.. ఓకే.. డీల్.. డీల్.. అని ఫోన్ పెట్టేసి శీను వైపు చూసాడు..

శీను : అలా నిన్ను నువ్వు తిట్టుకొకపోతే భాష నేర్చుకోవచ్చుగా

జగ్గు : నీకేంటి అన్నా ఎన్నైనా చెప్తావ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకున్నా కాబట్టే ఈ మాత్రం అన్నా వచ్చింది.. లేకపోతే గోవిందా

శీను : భాష ఎవడికి కావాలిరా భావం ముఖ్యం.. వాడికి ప్రాణం కావాలి మనం తీసి పెట్టాలి.. అంతే

జగ్గు : అయినా ఆ విక్టర్ గాడిని నిన్న లేపేసే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాక్కుంది

శీను : అది నీకు నాకు తెలుసు వాడికి తెలీదుగా

జగ్గు : ఒక్క నిమిషం ఆగు బాబాయి ఫోన్ చేస్తున్నాడు.. (అని పది నిముషాలు ఫోన్ మాట్లాడి తిరిగి శీనుని చూసాడు)

శీను అయిపోవచ్చిన బీడీ ముక్కని సముద్రంలోకి విసిరేసి లేచి నిల్చొని ఒళ్ళు విరుస్తూ జగ్గుని చూసాడు.

జగ్గు : ఒకటి గుడ్ న్యూస్ ఇంకోటి బాడ్ న్యూస్ ముందు ఏది చెప్పమంటావ్

శీను : ఆ గుడ్డేదో ఏడువు

జగ్గు : విక్టర్ ని చంపినందుకు మూడువందల కోట్లు మన స్విస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి..

శీను : మరి బాడు

జగ్గు : చంపింది నువ్వే అని క్లియర్ గా అందరికి తెలిసిపోయింది.. మనకోసం వెతుకుతున్నారు.

శీను : ముందుకు ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళకి మళ్ళీ చేసి అడ్వాన్స్ గా వంద కోట్లు పంపించమను, సాయంత్రానికి డెడ్ బాడీ ఈ పడవలో వదిలేసి వెళ్ళిపోదాం.. అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి మిగతా అమౌంట్ పంపించాక లొకేషన్ పెట్టు

జగ్గు : అటు మూడు ఇటు రెండున్నర మొత్తం ఐదు వందల యాభై కోట్లు, ఇద్దరి దెగ్గర స్కాం చేసామని తెలిస్తే మనల్ని లేపేయ్యడానికి ఇంకెవరినైనా పెడతారేమో

శీను : మనల్ని ఎవడురా చంపేది, నా గురించి నీకు నీ గురించి నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు.. చంపితే నువ్వు  నన్ను, నేను నిన్ను చంపుకోవాలి.

జగ్గు : హహహ్..

శీను : ఇప్పుడు ఎక్కడికి

జగ్గు : మన సూర్యం బాబాయి ఒక ఫ్యామిలీని చూసాడు.. అమ్మాయి పేరు మీద ఐదు వందల కోట్ల ఆస్తి ఉందట కాని అమ్మాయికి పెళ్లి అయితే కాని ఆ ఆస్తి తన చేతికి ఆ పై తన వాళ్ళకి కాని రాదు. సో నువ్వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఆస్తి తన వాళ్ళకి ఇచ్చేస్తుంది మనకి కొన్నాళ్ళు హైడ్ అవుట్ కి ప్లేస్ దొరుకుతుంది. నాకెందుకో ఇది మంచి ఆప్షన్ అనిపిస్తుంది.

శీను : ఆ అమ్మాయి ఆస్తి వీళ్ళకి ఎందుకు ఇస్తుంది

జగ్గు : ఎందుకంటే అమ్మాయి ఎక్కువ రోజులు బతకదట, త్వరలోనే చచ్చిపోతుందట

శీను : ఎందుకు

జగ్గు : తెలీదు

శీను : వద్దులే ఇంకోటి ఏదైనా చూడు.. మరీ చచ్చేదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాం.. ఐడియా బానే ఉందనుకో కాని వద్దు

జగ్గు : వెళదాం అన్నయ్య.. ఇంకెన్ని రోజులు ఇలా బిట్లు చూసి పని కానిస్తాం.. నీకు వయసు మీద పడ్డా తెలియట్లా నాకు నవనాడులు ఇక్కడ అల్లకల్లోలం అయిపోతున్నాయి

శీను : నాకు ముప్పై రెండే

జగ్గు : నాకు ఇరవై తొమ్మిది.. ఇద్దరికీ పెళ్ళీడు దాటిపోయింది తెలుసా

శీను : సరే ఆ పెళ్లేదో నువ్వే చేసుకో

జగ్గు : అమ్మమ్మ... నన్ను ఇరికించంకయ్యో.. నువ్వంటే ఎలాగో పెళ్లి చేసుకొనని ఫిక్స్ అయ్యావ్ నేనలా కాదు..

శీను : సరే సరే పదా.. ఈ ఉప్పు నీళ్ల మధ్య ఉండి ఉండి బోర్ కొట్టేసింది ఒకసారి మన తెలుగోళ్లు ఎలా ఉన్నారో చూసోద్దాం పోనీ.. ఎప్పుడు ప్రయాణం..

జగ్గు : రేపే..

శీను ఇంకో బీడీ వెలిగించి.. ఒక కాలు పడవ సపోర్ట్ మీద పెట్టి పడవ వెనకాలే వస్తున్న డాఫిన్స్ ని చూస్తూ ఉన్నాడు.


చెప్పాలంటే శీనుకి ఊహ తెలిసేటప్పటికే చేతిలో తన తమ్ముడు జగ్గు తప్ప కనీసం అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలీదు. తమ్ముణ్ణి వేసుకుని ఒంటి చేత్తో ఎందరి బూట్లు నాకాడో ఎంత మంది కింద నలిగాడో ఎన్ని కష్టాలు పడ్డాడో శీనుకే తెలుసు.. కడుపు నింపుకోడానికి ఏం చెయ్యాలో తెలీక స్లంలో ఉంటూ అక్కడ స్మగిలింగ్ చెయ్యడం నేర్చుకున్నాడు..

ఆ తరువాత తమ్ముడి తెలివితేటలు తోడై ఒక్కో మెట్టు ఎక్కుతూ మెట్టు మీద ఈ రాజ్యం నాది అనే ఎంతో మంది డాన్ లని ఉచ్చ పోయించారు. అందరికి శీను అనే పేరు మాత్రమే తెలుసు.. ఎలా ఉంటాడో ఎలా చంపుతాడో అన్నకి తమ్ముడికి తప్ప వేరే కంటికి తెలీదు. చంపే ప్లాన్ అన్నయ్య వేస్తే ఎస్కేప్ ప్లాన్ తమ్ముడు చూసుకుంటాడు. అచ్చు అతడు సినిమాలో మహేష్ బాబు, సోను సూద్ లాగ.. కాని ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం.. వీళ్ళకి సమాజంలో మంచిగా బతికేందుకు అవకాశం కల్పించని మనుషులంటే అంతగా పడదు.. అందుకే ఎవరినైనా చంపేస్తారు.. కాకపోతే మంచివాళ్ళ జోలికి అందులోనూ ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్లరు.

అన్నయ్యకి హ్యుమర్ ఎక్కువ, తమ్ముడికి దూకుడు ఎక్కువ
అన్నయ్య ఆలోచిస్తే, తమ్ముడు అస్సలు ఆలోచించడు
అన్నయ్యకి సహనం ఎక్కువ, తమ్ముడికి ఆవేశం ఎక్కువ

ఇలాంటి భయంకరమైన రెండు జీవాలు రేపటి నుంచి మనుషుల మధ్య బ్రతకబోతున్నారు.. చూద్దాం.. Stay tuned...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
చాలా బాగుంది బయ్యా కంటిన్యూ
గంధర్వ వివాహం
https://xossipy.com/thread-50446.html
[+] 1 user Likes nikhilp1122's post
Like Reply
#3
Superb ji new story
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#4
Guru stories kondaru okka story rayadaniki kasya padutaru meeru stories tho ee site lo danday yatea chestunnaru

Hatsoff
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
[+] 5 users Like anilrajk's post
Like Reply
#5
డాన్ శ్రీను టైటిల్ భలే ఉంది
కథ లైన్ బాగుంది
[+] 4 users Like ramd420's post
Like Reply
#6
Nice start to story
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#7
వామ్మో ఇంకో కొత్త స్టోరీ నా.....దీనికి ఇంకా వేరే స్టోరీస్ దేనికైనా లింక్ వుందా బ్రో....ఇది ఎలాంటి స్టోరీ.... ఏ జోనర్ అనుకోవచ్చు????
Anyway all the best for new story..... Heart
[+] 1 user Likes Thorlove's post
Like Reply
#8
Modolettaru kothadi oka like vesukondi
[+] 2 users Like Venky248's post
Like Reply
#9
Nice update
[+] 1 user Likes mahi's post
Like Reply
#10
Story adhiripoyindhi bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#11
బాగుంది సూపర్
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#12
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#13
Nice update
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#14
Nice start
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#15
Superb start all the best
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#16
nice bro.. oka small suggestion. please close few of oldstories first and take care about ne stories bro...
[+] 3 users Like vg786's post
Like Reply
#17
Superb Start bro, waiting for next update
[+] 1 user Likes Freyr's post
Like Reply
#18
Nice super
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#19
Good start bro
[+] 1 user Likes Veerab151's post
Like Reply
#20
మంచి ఇతివృత్తం ఎన్నుకున్నారు మిత్రమా Takulsajal

ఈ జోనర్ మీకు కొట్టిన పిండే 

ముందు ముందు ఎన్ని మలుపులు, సంఘటనలు, వ్యక్తులు పరిచయమౌతారో Smile

ఒకే సారి ఇన్ని త్రెడ్స్ ఎలా నడపగలుగుతున్నారు?

మీ స్పష్టతకు జోహార్లు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply




Users browsing this thread: 34 Guest(s)