Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కధలు
#1
ఆకాశంలో సగం
రుద్రా
గవర్నమెంట్ హాస్పిటల్, గద్వాల్
ఒక అంబులెన్సు కేకపెడ్తూ వచ్చి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ముందు ఆగింది.  
“ఎమర్జెన్సీ” అని గట్టిగ అరుస్తున్నాడు బండి నుండి దిగుతూనే కంపౌండర్. స్ట్రెచర్ మీదకు ఒక అమ్మాయి శరీరన్నీ చేర్చారు. ఆమె చేతి మణికట్టు, కటయ్యి రక్తం స్రవిస్తోంది. దారిపొడుగునా అది చుక్కలు చుక్కలుగా కారుతుంది. వెంటనే ఒక నర్స్ దూదిని తీసి ఆ గాయం మీద గట్టిగా వత్తి పట్టుకుంది. 
రెండు నిముషాల్లో డాక్టర్ వచ్చి, ఎమర్జెన్సీ ఓటీరూంలోకి తీసుకెళ్లమని ఆదేశించాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనడానికి ప్రతీకగా ఎర్రబుల్బ్ వెలుగుతోంది. 
ఈ లోపే పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు న్యూస్ కోసం ఎగబడ్డారు.
”ప్రేమ విఫలమై ప్రాణాలు తీసుకున్న యువతీ”, “ప్రేమోన్మాది చేతిలో మరో ప్రాణం బలి” ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టి, జరిగిందేమిటో కూడా తెలియకుండా ఇష్టానుసారం జనాల బుర్రలోకి విషాన్ని నింపడం స్టార్ట్ చేసారు.
రెండు గంటలు గడిచాక, డాక్టర్స్ బృందం బయటకి వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారోనని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి కొన్ని కెమెరా కళ్ళు. ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్ మైకులకు దగ్గరగా వచ్చి నిలబడి
“ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో వివరాలేమీ ప్రస్తుతానికి తెలియలేదు. ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు. ఇక ఆమె హెల్త్ విషయానికి వస్తే, తన పరిస్థితి విషమాంగానే ఉంది. శరీరంపై ఉన్న గాయాలనుబట్టి ఎవరో కావాలనే ఆమెను కొట్టారు, సెక్సువల్ అస్సల్ట్ కి సంబందించిన గాయాలేమి లేవు, కానీ ఆమె ఔటర్ బాడీపై మాత్రం గోళ్ళతో రక్కిన గాయాలు, పళ్లతో కొరికిన గాయాలు మాత్రం ఉన్నాయ్. పైగా ఆమెకు న్యూరోకానైన్, ఇంకా ఆండ్రీలిన్ అనే రెండు రకాల డ్రగ్స్ పొడి ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరిగింది.
“సర్ ఒక సందేహం. ఎవరో ఆమెకు ఇచ్చారని ఎలా చెప్తున్నారు?? ఆమె తీసుకుని ఉండొచ్చు కదా???” అని అన్నాడు ఒక విలేకరి
“నో కచ్చితంగా ఆమెకు ఎవరో ఇచ్చారు,  కారణం ఆమె స్పృహ తప్పాక కూడా, ఆమె ముక్కులో, గొంతులో ఈ పొడిని గుప్పించారు. అంతే కాదు ఈ డ్రగ్స్ ఇంజెక్ట్, డైరెక్టుగా చెయ్యకూడదు. కానీ ఆమె చేతిమీద ఉన్న సన్నటి రంద్రాలు ఇంజెక్షన్స్ కి సంబంధించినవే. అవి ఆమె లంగ్సుని, ఇంకా మెదడు వ్యవస్థని పూర్తిగా ఆక్రమించింది.
“దీని పర్యవసానం ఏమవుతుండొచ్చు డాక్టర్” అని మరో విలేకరి ప్రశ్నించాడు
“ఏదైనా జరగొచ్చు, ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని టెస్టులు చేసి తేలుస్తాం. కానీ ఆమె పరిస్థితి మాత్రం అంచనా వెయ్యలేకపోతున్నాం. ఇప్పుడే ప్రాణాలు వదిలేయొచ్చు లేదా ఒక నెల బతకొచ్చు. కోమాలోకి వెళ్లిపోవచ్చు, లేదా బయటకి రావొచ్చు. కానీ ఏదైనా సరే ఆమె బ్రతకడం కష్టం” అని అన్నాడు చెమటలు తుడుచుకుంటూ.
ఇది జరుగుతుండగానే, ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఆమె శరీరం, ఎగిరెగిరి పడుతోంది, బీపీ, పల్స్ పూర్తిగా తగ్గి, తిరిగి అమాంతం పెరిగిపోతున్నాయనడానికి సూచికగా ఆ మెషినులు వింత శబ్దం చేస్తున్నాయి. ఆమె ఒంట్లో ఎదో ఒక రసాయన ప్రక్రియ జరుగుతోంది. తెగిపోయేలా ఆమె నరాలలో రక్తం విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ ఆమె గుండె వేగాన్ని అమాంతం 250 బీపీఎంకు పెంచేస్తోంది. ఇది చిరుత పులి వేటాడే సమయంలో పెరిగేంత గుండె వేగం. ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. చుట్టూ చూసింది. కానీ ఆమె కళ్ళలో భయం కానీ బాధ కానీ లేవు. చాలా తీక్షణంగా దేనికోసమో వెతుకుతోంది. ఆమె మెదడు ఒక కంప్యూటరుల పనిచేస్తోంది. ఆమెకు కావాల్సిన మందులు టాబ్లెట్స్, కత్తులు, కత్తెరలు ఇంజెక్షన్స్ తీసుకుంది. వాటిని ఒక పేపరులో చుట్టుకుని, పక్కరూంలో ఉన్న నర్స్ డ్రెస్ వేసుకుని చక్క నడిచి బయటకి వెళ్ళిపోయింది.
పేషెంట్కి కాపలాగా ఉన్న నర్స్ వచ్చేసరికి ఆమె లేకపోవడంతో పరుగుపరుగున వెళ్లి డాక్టర్స్ కి విషయం చెప్పింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తరవాత: అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, అక్కడ ఒక్క పదంతస్థుల బిల్డింగ్ సగం కట్టి ఆపేసారు.ఎనిమిదో అంతస్థులో ఉన్న చిన్న పోర్టాబుల్ టీవిలో
“సిటీలో నలభై ఐదు మంది కొన్ని నిముషాల వ్యవధిలోనే కనిపించకుండా పోయారు. కనిపించకుండపోయిన వాళ్ళందరి ఇళ్లలో ఒక లెటర్ మాత్రం దొరికింది, అందులో “ఆకాశంలో సగం - రుద్రా ” అని రాసి ఉంది. వీళ్లంతా ఎవరు?? ఒకరితో ఒక్కరికి సంబంధం ఏమిటి??? అనే కోణాల్లో సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో విశేషమిటంటే అందరు మగవారే అయుండడం, అది కూడా అందరు చిన్నచితక సెలబ్రిటీస్ నుండి పెద్ద, పెద్ద బిగ్ షాట్స్ పిల్లలు, వాళ్ళ బంధువులు అయుండడం. వయస్సుతో నిమిత్తం లేకుండా 17 ఏళ్ళ బాలుడి నుండి 75 ఏళ్ళ ముసలివాళ్ళు కూడా ఉండడం మరో విశేషం” అని అదేదో పెళ్లి వార్తల పళ్ళికిలిస్తూ చదువుతున్నాడు న్యూస్ రీడరు. ఆ న్యూస్ చూస్తూ, వేడి వేడి టీని సిప్ చేస్తోంది ఆ అమ్మాయి.
ఎదో గుర్తొచ్చినదానిలా లేచి లాప్టాప్ లో ఎదో సమాచారం కోసం వెతికింది. అది దొరకగానే, ఆమె మోహంలో చిన్న సంతృప్తి కనపడింది. వెంటనే లేచి జుట్టుని గట్టిగ పైకి ముడి వేసింది. చున్నీని తలపాగాల చుట్టి దాన్నే మాస్క్ లాగా మొహానికి కట్టింది.మాములుగా అప్పటిదాకా కట్టుక్కున నల్ల చీరను పైకి మడిచి దోతిల వెనక్కి దోపింది. కొంగుని గట్టిగ నడుము చుట్టూచుట్టి ముడివేసింది. ఆమెకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుని మరో వస్త్రంలో మూటకట్టి భుజానికి వేసుకుంది.
చూస్తుండగానే ఆమె గోడలను పట్టుకుని పదంతస్తుకు చేరుకుంది. అక్కడ నలభై ఐదు మంది తప్పిపోయినవారు తాళ్లతో బంధించి ఉన్నారు. ఎవ్వరు కూడా స్పృహలో లేరు. ఒక్కొక్కరిగా వారిని చూస్తున్న ఆమె కళ్ళలో అసహ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడే ఉన్న మోటార్ ఆన్ చేసి పైపుతో నీళ్లను వాళ్ళ మొహాలకేసి కొట్టింది. ఒక్కొక్కరిగా అందరు స్పృహలోకి వచ్చారు. వారి కళ్ళలో భయం, ప్రాణాలపై తీపి, ఊపిరి పోతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. రుద్రకి నవ్వొచ్చింది.
అందులో ఒకడు “ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా బంధించావు??” అని అడిగాడు భయంగా.
ఇంకోకడు “ఎవడ్రా నువ్వు, ఇడిసెయ్యి లేదా సంపూత నిన్ను ఈడే “ అని బెదిరించాడు.
ఆ అమ్మాయి అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీని లాక్కుని కూర్చుంటూ “ఇంకా” అని అంది .
అందరి మొఖాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆ పైనే హేళన భావం కనిపించింది.
“ఏయ్ ఒక ఆడదానివైయుండి, ఇంత మంది మగాళ్లని కిడ్నప్ చెయ్యడానికి ఎంత ధైర్యమే” అని అడిగాడు ఓకడు
"రుద్రా........  నా పేరు రుద్రా" అని అన్నది ఆ అమ్మాయి 
“ఇది దీని పనయుండదు బ్రో?? ఖచ్చితంగా దీని వెనక ఎదో పెద్ద నెట్వర్క్ ఉంది” అని అన్నాడు పక్కన ఉన్నావాడు .
“ప్లీజ్, అక్క నన్ను వదిలేయ్. నేనేమి చేశాను? నన్నెందుకు తీసుకొచ్చారు?” అని సెంటిమెంట్ ప్రయోగించాడు ఒక భయస్తుడు.
“ఏంట్రా?? మిమ్మల్ని వదిలేయాల?? సరే వదిలేస్తా. ఇక్కడి నుండి కిందకి వదిలేస్త, మీ ప్రాణాలు మీరే పైకి వదిలేస్తారు.” అని అంటున్న రుద్రా గొంతులో కఠినత్వం తాండవిస్తోంది.
“ఏవాతివే నువ్వు లం ..... “ అని అంటున్న ఒకడి మాట బయటకి రాకుండానే రుద్రా ఎగిరి గాలిలోనే పల్టీ కొడ్తూ ఒక్కటి వాడి గొంతు మీద కాలితో తన్నింది. అంతే.....  వాడు అలాగే నెలకు ఒరిగి చచ్చిపోయాడు.
ఆ ప్రదేశమంతా హాహాకారాలతో హోరెత్తిపోయింది. అప్పటిదాకా ధైర్యంగా జబ్బలు చరిచిన వాళ్లంతా ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు. తడిసిన వారి శరీరాల్లో వణుకు ఆమెను మరింత బలవంతురాలిగా మార్చింది.
అరుస్తున్న వారి ఆర్తనాదాలు వింటూన్నా ఆమెకు అలౌకిక ఆనందం కలిగింది.
“అరవండి, అరవండి ఇంకా అరవండి. మీరెంత అరిచినా కాపాడే వారు లేరు, రారు కూడా” అని అంటున్న రుద్రా మొహంలో పైశాచిక చిరునవ్వు ఆ ముసుగులో కలిసిపోయింది.
“అమ్మ, వదిలేయమ్మ నీకు దండం పెడతాను, నీకు తండ్రిలాంటి వాడిని” అని అన్నాడు ఒక 50 ఏళ్ళ వాడు.
“అమ్మ నాకు నీ వయసంత మనవరాలు ఉంది తల్లి నన్ను కూడా వదిలెయ్యమ్మ” ప్రాధేయపడ్డాడు ఒక 75 ఏళ్ళ మరో వృద్ధుడు.
కానీ రుద్ర ఏమాత్రం కూడా తొణకలేదు. పైగా గట్టిగ నవ్వేస్తూ “అయ్యో మీ కోట మీకు ఉండనే ఉంది. వీళ్లందరికన్నా మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా, తొందరెందుకు” అని అంటున్న రుద్రా కళ్ళు నిప్పు కనికల్లా మారాయి. ఆమె నరాలు పొంగి, గుండె వేగం పెరిగింది. ఆమె కళ్ళు డేగ కళ్ళకన్నా తీక్షణమైన చూపుగా మారింది. వెంటనే ఆమె తిరిగి 8వ అంతస్తులోకి దూకింది. లాప్ టాపులో సెక్యూరిటీ అధికారి హెడ్ క్వాటర్స్ నెట్వర్క్స్ ని హ్యాక్ చేసి, ఒక కెమెరాను తీసుకుని ఆ 44 మందిని లైవ్లో ప్రసారం చేసింది.
ఇది జరగడానికి కొన్ని గంటల ముందు: 
సెక్యూరిటీ అధికారి హెడ్క్వాటర్స్ హైదరాబాద్: 
అన్ని ఫోనులు ఒకేసారి మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. నలభై ఐదు మంది ప్రముఖుల పిల్లలు, బంధువులు, స్నేహితులు కిడ్నపుకి గురికావడం అది ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే అవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు తలలు పట్టుకున్నారు. అత్యవసర మీటింగు ఆరెంజ్ చేసారు. IGతో పాటు రాష్ట్ర హోమ్ మినిస్టర్ మందిర నాయుడు కూడా ఆ మీటింగుకి అటెండయ్యింది. కారణాలు వెతికే పనిలో పడ్డారు మిగతా సెక్యూరిటీ ఆఫీసర్లు.ఈ కేసును అసిస్టెంట్ కమీషనర్ సూర్యకి అప్పచెప్పింది హోమ్ మిస్టర్. ఆయన టేకప్ చేసిన ఏ ఒక్క కేసు కూడా సాల్వ్ అవకుండా పెండింగులో లేదనే టాక్ ఉంది. అందుకే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ని కాదని, ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
“చుడండి సూర్య, మీకు ఎంత బ్యాకప్ కావాలన్నా తీసుకోండి కానీ ఐ వాంట్ దట్ బాస్టర్డ్స్ ఇమ్మీడియేట్ల్య్ “ అని అన్నది మందిర
“డెఫినెట్ల్య్ మేడం, 24 అవర్స్ లో వాళ్ళ ఎజెండా ఏమిటో కనుక్కుంటాను” అని సెల్యూట్ చేసి బయటకి వస్తుండగా, ఒక కానిస్టేబుల్ కంగారుగా పరిగెడుతూ వచ్చాడు. “ఏమిటన్నట్టు”గా చూసాడు సూర్య.
“సర్ మీరొక్కసారి కంట్రోల్ రూముకి వస్తారా ???” అని అడిగాడు.
అతని కళ్ళలో భయం అర్థంచేసుకున్న సూర్య కంట్రోల్ రూమ్ వైపు పరిగెత్తాడు. ఆ వెనకే మందిరతో పాటూ అందరు వెళ్లారు. టీవిలో రుద్రా నలభై నాలుగు మందిని బంధించిన వీడియో క్లిప్ చూపిస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్లకు చెమటలు పట్టాయి. నోరెళ్ళ పెట్టి చూస్తున్న అందరిని అలెర్ట్ చేసాడు సూర్య. ఆ కంప్యూటర్ IP అడ్రెస్స్ కనిపెట్టమని పురమాయించాడు. మందిర జాగ్రత్తగా ఆ వీడియో చూస్తోంది.
అంతే ఒక్కసారిగా, అన్ని ఫోన్లు రింగ్ అయ్యి , ఒకేసారి కట్ అయ్యాయి. ఆలా మూడు సార్లు చేసింది రుద్రా. నాలుగోసారి ఒక్క ఫోన్ మాత్రమే ఆగకుండా మోగింది.
సూర్య ఎత్తగానే,
రుద్రా “హలో సార్ బాగున్నారా??” అని అడిగింది. అంతే సెక్యూరిటీ ఆఫీసర్లతో పాటు మందిర కూడా ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెతుకుతున్న క్రిమినల్ ఒక లేడీ అవడం వాళ్ళకి దిమ్మ తిరిగినట్టయింది.
రుద్రా కొనసాగించింది. “అనుకున్నాను ఈ కేసు మీ దగ్గరకే వస్తుందని. కానీ మీ ట్రాక్ రికార్డులో సాల్వ్ అవ్వని ఒక కేసుగా మిగిలిపోతుంది. మీ బ్యాడ్ లక్” అని అన్నది రుద్రా
“చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్, మర్యాదగా “ అని మాట్లాడుతున్న సూర్యని మధ్యలోనే ఆపింది రుద్రా.
“సారు..... నేను మాట్లాడడానికి జేసినా. మీరు చెప్తే విననికి కాదు” అని అన్నది రుద్రా. సూర్య ఫోన్ ట్యాప్ చెయ్యమని సైగ చేసాడు.
“ఓకే మీకు కావాల్సింది, ఈ 44 మంది ప్రాణాలతో మీకు అప్పజెప్పడం, అంతేకదా. అయితే మనం ఒక డీల్కి వద్దాం. నేను ఈ 44 మందిని వదిలేస్తాను, కానీ మీరు 450 మందిని చంపాలి. అది కూడా మీరేం కష్టపడక్కర్లేదు. వాళ్ళ ఫోన్ నంబర్లు, లొకేషన్స్ తో సహా మీకు మీ స్టేషనుల పరిధిలోకి వచ్చే కేసుల లిస్ట్ పంపిస్తాను.  మీరు చేయవలసిందల్లా వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యడమే” అని అన్నది రుద్రా.
ఆమె కళ్ళలో ఏ బెరుకు లేదు, గొంతులో గాంబీర్యం ఉట్టి పడింది.
వింటున్న అందరికి ముచ్చెమటలు పట్టాయి.
“వాట్?? ఏమాట్లాడ్తున్నావో నీకైనా అర్ధమవుతుందా??? 45 మంది కోసం 450 మందిని చంపాలా ?? అది సెక్యూరిటీ ఆఫీసర్లే ఎన్కౌంటర్ చెయ్యాలా??? ఇంపాసిబుల్. మేము చెయ్యం” అని అన్నాడు సూర్య తల పట్టుకుంటూ.
రుద్రా “మీ ఇష్టం సార్, మీరు చంపకపోతే నేనే చంపేస్తా, నాకది మ్యాటరే కాదు. ఎందుకైనా మంచిది మీకైతే లిస్ట్ పంపిస్తున్న చుడండి. మనలో మన మాట, ఈ ముచ్చట మీకు నాకు మధ్యనే ఉండనివ్వండి” అని చెప్పి కాల్ కట్ చేసి, లిస్టులు పోలిస్ స్టేషన్లకు పంపింది.
“IP అడ్రెస్స్ ట్రేస్ అవట్లేదు సార్. కారణం ఆమె ఉపయోగిస్తున్న శాటిలైట్ మనది కాదు, ఇజరయిల్ దేశానిది. అది మనం హాక్ చెయ్యలేం. ఇక ఆమె ఫోన్ కూడా ట్యాప్ చెయ్యలేం ప్రతి సెకనుకి లొకేషన్ మారిపోతుంది సర్” అని అన్నాడు కమ్యూనికేషన్స్ ఆఫీసర్.
సార్ లిస్టు వచ్చింది. మన పరిధిలోకి 15 మంది పేర్లు, అడ్రెస్సులు ఉన్నాయి” అని అంటూ ఒక SI కొన్ని పేపర్లు చూపించాడు.
“మై గాడ్. ఓకే ఈ పదిహేను మంది ఇన్ఫర్మేషన్ తియ్యండి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రి డీటెయిల్స్ అబౌట్ థెం” అని అన్నాడు సూర్య. వైట్ బోర్డు మీద ఎదో రాసుకుంటూ.
కాసేపటికి "మరో 12 మంది కిడ్నప్" అన్న వార్త కలకలం రేపింది. మీడియా, పత్రికలూ మండిపడ్డాయి. చేతకాని సెక్యూరిటీ ఆఫీసర్లంటూ దుమ్మెత్తి పోశాయి. ఆ 12 మంది ఆమె ఇచ్చిన లిస్టులో ఉన్నవారే వేరు వేరు స్టేషన్ల పరిధిలోకి వస్తారు.
రుద్రా ఫోన్ చేసింది. అప్పటిదాకా సూర్య గొంతులో వినిపించిన కాన్ఫిడేన్స్ తగ్గింది.
రుద్రా “సార్, నేను చెప్పింది చెయ్యడం తప్ప మరో గత్యంతరం లేదు మీకు” అని అన్నదిఎగతాళిగా
“షట్ అప్.....  ధైర్యం ఉంటె నా ముందుకొచ్చి మాట్లాడు, ఇలా దొంగలగా దాక్కొని కాదు.  మీరెంత మంది ఉన్నా, మిమ్మల్ని నేనొక్కడినే పట్టుకుని కటకటాల వెనక్కి నెడతాను. అస్సలు ఇది ఎవరు నిన్ను చెయ్యమన్నారో వాళ్ళకు చెప్పు ?? గంటలో 12మందిని కిడ్నప్ చేశావంటే చాలా నెట్వర్క్ ఉంది నీకు” అని అన్నాడు సూర్య అసహనంగాఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు.
ఆమె మెదడు పాదరసంలా పనిచేస్తోంది. ఎంతవరకు వాళ్లకు చెప్పాలో, ఏది చెప్పాలో ముందే ఆమె నిశ్చయం చేసుకుంది. “హ.... హ .....హహ...... నా వెనక ఎవరో ఉన్నారా ?? 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఎందుకు ఆలా అనుకుంటున్నారు ?? ఆడదాన్ని, అశక్తురాలిని, అబలను అనేగా. ఆడదాని శక్తి యుక్తుల ముందు అస్సలు  మీరెంత మీ బలగమెంత?? ఒక మగువ తలుచుకుంటే రాజ్యాలేలగలదు. శ్రీకృష్ణుడంతటి వాడికే నరకాసురుని చంపడానికి సత్యభామ అవసరం అయ్యింది. శివుని విల్లుని ఆ సీతమ్మ ఎత్తి, అది ఎత్తగలిగిన రాముడిని పెళ్లాడింది. దేవదేవుళ్లే ఆడదాని ముందు మోకరిల్లారు ఇక మీరెంత?? అయినా  నా నెట్వర్క్ పక్కన పెట్టండి. మీ నెట్వర్క్ మీకుంది కదా. అదే దమ్ము మీకు ఉంటె, 24 గంటల్లో నన్ను పట్టుకోండి లేదా ఇంకెప్పుడు నన్ను పెట్టుకోలేరు” అని గట్టిగా నవ్వింది రుద్రా
“నోరుముయ్యి, యు బిచ్, నాటకాలాడుతున్నావా ?? నువ్వు చెప్పిందల్లా చెయ్యడానికి నువ్వేం నా ఉంపుడుగత్తేవ ??” అని ఫైర్ అయ్యాడు సూర్య.
రుద్రా కాల్ కట్ చేసింది.
ఈ లోపు ఆ 15 మంది ట్రాక్ రికార్డ్స్ చెక్ చేసారు సెక్యూరిటీ ఆఫీసర్లు. అందరి మీద కేసులు ఉన్నాయ్, కానీ అందులో ఉన్న కామన్ పాయింట్ ఆడది. వాళ్లంతా అమ్మాయిలపై అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడ్డ వారే. ప్రేమించలేదని ఆసిడ్ పోసిన వాడి దగ్గర నుండి అమ్మాయిలను విదేశాలకు అమ్మేసే బ్రోకర్లు, రేప్ చేసి చంపేసిన వెదవల దాక ఉన్నారు.
ఈ 15 మందే కాదు, ఆమె ఇచ్చిన 450 మందికి ఇలాంటి నేర చరిత్రే ఉంది. కానీ వాళ్లెవరు జైళ్లలో లేరు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు కారణాలు చాలానే ఉన్నాయ్. మన రాజ్యాగంలో ఉన్న లొసుగులు, చట్టాల్లో బొక్కలను ఉపయోగించుకుని బయట తిరుగుతున్నారు.
అప్పటికి కానీ అర్ధం కాలేదు సూర్యకి ఆమె అజెండా ఏమిటో.
ఇంతలో టీవిలో న్యూస్ కిడ్నపైన పన్నెండు మంది దారుణ హత్యకు గురయ్యారని వారి శరీరాలపై ఆకాశంలో సగం - రుద్రా” ఆన్నా లేఖ ఉందన్నా” వార్త మళ్ళి రాష్టాలను కుదిపేసింది. స్వయంగా హోమ్ మినిస్టరే రుద్రతో మాట్లాడాలనుకుంది.
ఆలా ఒక గంట తరువాత రుద్రా ఫోన్ చేసింది
“సార్ ఎలా ఉంది నేనిచ్చిన బహుమతి??” అని అడిగింది రుద్రా పైశాచికంగా నవ్వుతు.
టెంపర్ లాస్ అయినా సూర్య "ఏయ్ నువ్వు అస్సలు ఆడదానివేనా?? మనుషులను పిట్టల్ని చంపినట్టు చంపుతున్నావ్?? నువ్వు నాకు దొరికిన రోజు నిన్ను నీ చావు ఇంతకన్నా గోరంగా ఉంటుంది రాసిపెట్టుకో" అని తిడ్తున్న అతని చేతిలోనుండి రిసీవర్ లాక్కుంది మందిర 
“రుద్రా నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న. మీ అజెండా నాకు అర్థమైంది. ఒక మహిళగా నువ్వు చేస్తోంది సమర్థిస్తాను కానీ ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ గా మాత్రం నేను సమర్ధించలేను. నువ్వు చేస్తోంది తప్పు, వాళ్ళని వదిలి లొంగిపో, నేను హామీ ఇస్తున్న నీ ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టనివ్వను” అని అన్నది మందిర.
“నా ప్రాణానికి హామీ మీరే కాదు మేడం, ఆ దేవుడు కూడా హామీ ఇవ్వలేడు?? అయినా సరే, మీరడిగినట్టే చేస్తా కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పింది మీరు చేసాక” అని అన్నది రుద్రా స్థిరంగా.
“ఆలా అమాయకులను చంపడం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం??” అని అడిగింది మందిర తీవ్ర స్వరంతో
“అమాయకుల? ఎవడు మేడం?? నేను చంపినా 12 మందిలో ఏ ఒక్కడు కూడా మనిషి కాదు, జనారణ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నా మానవమృగలు. అభం, శుభం తెలియని ఆడపిల్లల్ని, మేకపిల్లల్ని అమ్మినట్టుగా అమ్ముతుంటాడు ఒకడు. ఆ ఆడపిల్లలకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చి, 9 ఏళ్ల పిల్లని కూడా పెద్దమనిషిని చేసి, ప్రాస్టిట్యూటుగా మార్చి డబ్బులు దండుకుంటాడు, మరొక్కడు. వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి, వాడు పాడుచేసేదే కాకా ఫ్రెండ్లకి ప్రసాదం పంచినట్టు పంచి, అమ్మాయిని 6 నెలలుగా అత్యాచారం చేసేవాడు మరొక్కడు” అని అంటున్న రుద్రా గొంతు జీరా పోయింది.తిరిగి ఆమె “ఈ12 మందే కాదు 450 మందికి కూడా ఇలాంటి చరిత్రే ఉంది. మీరు వదిలిపెట్టిన, వాళ్ళను నేనొదిలిపెట్టను. ఒక్కొక్కడిని వెతికి, వేటాడి, వేంటాడి చంపుతాను. ఆడదాని ప్రాణంతో, మానంతో ఆటలాడే ప్రతి ఒక్కడిని, వంతుల వారీగా లెక్కలేసి మరి చంపుతాను” అని గట్టిగా పళ్ళు కొరుకుతూ చెప్పింది రుద్రా.
“రుద్రా నేను అర్ధం చేసుకోగలను. కానీ మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం, కొన్ని చట్టాలు చేసుకున్నాం. వాటిని మనం మన చేతుల్లోకి తీసుకోలేము. నా మాట విను, కచ్చితంగా ఆ క్రిమినల్స్ అందరికి శిక్ష పడేలా నేను చూస్తాను” అని అంటున్న మందిర మాటను పూర్తికాకుండానే
రుద్రా "శిక్ష..... శిక్ష?? ఒక అమ్మాయిని సాక్షాత్తు రాజధానిలో నగరమంతా తిప్పుతూ అత్యాచారం చెయ్యడమే కాకా ఆమె ప్రాణాలుపోడానికి కారణమైన వాడిని, వయస్సు తక్కువని 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి, బయటకి పంపడమా మీరు వేసే శిక్ష. 17 సంవత్సరాల అడ్డగాడిద అత్యాచారం చేస్తే, వాడు బాలుడా?? ఇదేనా మీరు చెయ్యబోయే న్యాయం. ప్రేమించలేదని అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోస్తే, ఈవ్ టీసింగ్ కేసు కింద FIR రాసి, వాడిని మూడు నేల్లకే వదిలేయడమా, మీరు చేసే చట్టం?? మీరు చెప్పిన అదే సమాజంలో తప్పుచేసిన వాడు తలెగరేసి తిరుగుతుంటే, ఆ తప్పుకు బలైపోయిన ఆ అమ్మాయి మాత్రం, మొహానికి ముసుగేసుకుని, అవమానాలను భరిస్తూ, ఆ మచ్చను జీవితాంతం మొయ్యాలి. అలంటి అమ్మాయిలకు జరిగిందా మీరు చెప్పిన న్యాయం?? సగటున ప్రతి పదిమంది అమ్మాయిల్లో, ఇద్దరమ్మాయిలు ఇలాంటి అకృత్యాలకు, అఘాయిత్యాలకు బలవుతున్నారంటే మీరు పుట్టించాల్సింది 'చట్టాలు' కాదు, తప్పు చెయ్యాలనే ఆలోచన వచ్చిన ప్రతి మగవాడి ఒంట్లో 'భయాన్ని', చంపాల్సింది ఈ 'మృగాల'నే కాదు, ఆడపిల్లలకు న్యాయం జరగదనే 'అభిప్రాయా'న్ని” అని అంటున్న రుద్రా మాటల్లో నిజాన్ని గ్రహించింది హోమ్ మినిస్టర్ మందిర
“సరే నువ్వు అంటోంది నిజం కానీ నువ్వు అడుగుతోంది మా చేతుల్లో లేనిది?? ఎన్కౌంటర్ 450 మందిని ఒకేసారి చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలియంది కాదు. హ్యూమన్ రైట్స్ అని, కోర్ట్స్ అని మా నెత్తి మీద ఉన్నాయి కదా” అని అడిగింది మందిర.
“మీరేం భయపడకండి.  దీనికి కూడా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. నేను చెప్పినట్టు చేస్తానంటే వాళ్ళందరిది నాచురల్ డెత్ లాగా క్రెయేట్ చేయొచ్చు” అని అన్నది రుద్రాచెవిలో ఉన్న బ్లూ టూత్ ని సరిచేసుకుంటూ
“ఎలా?” అని అడుగుతున్న మందిర వైపు చూస్తూ సైగ చేసాడు సూర్య.
“నో మేడం ఇది చెయ్యడానికి మీరు ఒప్పుకుంటున్నారా ?? “ అని అడిగాడు
“ విందాం ఎం చెప్తుందో" అన్నట్టుగా సైగ చేసింది మందిరపక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్లు రెండు గుటకలు వేసి
రుద్రా “సింపుల్ మేడం వాళ్ళను షూట్ చెయ్యడమో లేక కత్తితో చంపడమొ కాకుండా నేను చెప్పే ఒక డ్రగ్ కంపొజిషన్ మెడ వెనక భాగంలో ఇంజెక్ట్ చెయ్యండి అంతే హార్ట్ ఎటాకనో, లేక కార్డియాక్ అరెస్టనో అంటారు. పోస్ట్ మార్టంలో కూడా కనిపెట్టలేరు” అని అన్నది చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ
“బ్రిలియెంట్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుని చెప్తాను. ఒక అరగంట తరువాత ఫోన్ చెయ్యి” అని మందిర పెట్టేసింది
“మేడం ఏంటిది ?? ఆమె చెప్తోంది మనం చెయ్యలేం. అది మీకు కూడా తెలుసు” అని అన్నాడు సూర్య
“ఐనో ఎవరిథింగ్ సూర్య. నేను వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయించాను. ప్రతి వాడు క్రిమినలే. అలంటి వాళ్ళు చచ్చిన దేశానికి వచ్చిన నష్టంమేమి లేదు. పైగా అలంటి వాళ్ళని చంపితే అలంటి మృగాళ్లకు కూడా బుద్దొస్తుంది, ఆలోచించండి. మనకు ఆమె చెప్పినట్టు, చెయ్యడం తప్ప మరొ మార్గం లేదు. అవసరమైతే నేను సీఎంతో మాట్లాడతాను మీరు ఆ పనిలో ఉండండి.” అని అంటూ "అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, ఫైల్ నా టేబుల్ మీదకి పంపించామ"ని ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయింది.
సూర్య మెల్లిగా లేచి నిలబడ్డాడు. "చెప్పండి టీం, ఏంచేద్దాం. మీ అభిప్రాయాలూ చెప్పండి"  అని అడిగాడు.
"సర్, రాజకీయ వత్తిళ్లకు లొంగి, పై అధికారుల మాటలకూ దడిచి మా డ్యూటీ మేము చెయ్యలేదు. కానీ ఇప్పుడు మనల్ని ఆపె వాళ్లే లేరు." అని అన్నది ఒక లేడీ SI
"లేదు సర్ దీనివల్ల మనం చాలా సమస్యలు ఎదురుకోవాలి. ఈ నిజం బయటకి వస్తే  మన తప్పు లేకున్నా ట్రాన్స్ఫర్లు చేస్తారు, సస్పెండ్ చేస్తారు ఒక్కోసారి ఉద్యోగమే పోవచ్చు. అప్పుడు మనం మన ఫామిలీస్ తో రోడ్డుపైకి వస్తాం" అని అన్నాడు మరో SI
"అమ్మాయిల పై అఘాయిత్యాలకు పాల్పడే వారిని మనం ఎం చేయగలిగాము సర్? నాకు 13 ఏళ్ల  అమ్మాయి ఉంది. అది రోజు కాలేజ్కి సిటీ బస్సులో వెళ్లివస్తోంది. ఒకడు ఆమె చెప్పుకోలేని చోట గోర్లు దిగేలా గాయం చేస్తే, వచ్చి చెప్పుకుని ఏడ్చింది. కానిస్టేబుల్ ఐన నేనే కేసు పెడితే, వాడు ఒక 'రౌడి'.  కేసు వాపసు తీసుకోకపొతే మా ఇంట్లో ఆడవాళ్ళని బజారులో చూసుకుంటానని బెదిరించాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయత కేసు వాపసు తీసుకున్నను. సెక్యూరిటీ ఆఫీసర్ కూతురుకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య జనానికి ఎలా జరుగుతుంది ?? అప్పుడు నా బిడ్డ పడ్డ కష్టం చిన్నదయుండొచ్చు కానీ ఆమె మనసుకు తాకిన గాయం ఎప్పటికి మానదు. ఇప్పుడు అలంటి కుక్కలని వీధిలో నిలబెట్టి కాల్చే అవకాశం వచ్చింది" అన్నాడు ఆవేశంగా ఏడుస్తూ. అక్కడ అందరి కళ్ళు చెమ్మర్చాయి.
"ఈ ఆపరేషనులో ఎంతమంది నాతో ఎస్ అంటున్నారు" అని అడిగాడు సూర్య
అందరు చేతులు లేపారు.   
“టీంని అలెర్ట్ చెయ్యండి, అందరిని మనం చంపేస్తున్నాం. అండర్గ్రౌండ్ కాప్స్ కూడా ఇవాళ ఆన్ డ్యూటీలో ఉండమనండి. గంటకు 30 మంది చొప్పున 15 గంటల్లో పని పూర్తవ్వాలి. అప్పటిదాకా నో రిలాక్సేషన్” అని చప్పట్లు చరుస్తూ పని పురమాయించాడు సూర్య.
15 గంటలు గడిచేసరికి మొత్తం 450 మంది వివిధ ప్రాంతాలలో ఒకే విధంగా చచ్చారు. ఈ విషయం ఎక్కడ మీడియాలో రాలేదు. కారణం లేకపోలేదు. ఒక్క చిన్న క్లూ కూడా వాళ్లకు దొరకలేదు, దొరికిన చెప్పే ధైర్యం చెయ్యలేదు.
రుద్రా ఫోన్ చేసే సమయానికి పని పూర్తయింది. “చాలా థాంక్స్, సూర్యగారు. నాకు తెలుసు మీరు ఈ పని చేస్తారని” అని అన్నది.
'రుద్రా..... ఆ నలభై ఐదు మందిని విడిచి పెట్టి, ఇప్పటికైనా నువ్వు కూడా లొంగిపో" అని అన్నాడు సూర్య.
"సారీ సర్ 44 మందే ఉన్నారు, ఒక్కడిని ఆల్రెడీ చంపేసాను" అని అంటు రుద్రా లాప్టాప్ మూసింది
"ఎక్సపెక్ట్ చేశాను రుద్రా..... అస్సలు నువ్వు ఆ 45 మందిని ఎందుకు కిడ్నప్ చేసావో నాకు తెలుసు" అని అన్నాడు సూర్య
" మీరు ఉహించగలరని, అతడి సమర్థులని కూడా నాకు తెలుసు. వీళ్లంతా నేరాలు చేసినవాళ్ళే కానీ ప్రముఖులు, వారి పిల్లలు, బంధువులు వీళ్ళలో మీ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళను అడ్డంపెట్టుకుంటే నాకు రెండు పనులు జరుగుతాయి. ఒకటి వీళ్లకోసమైన నేను చెప్పింది మీరు చేస్తారు. రెండోది, నేను ఇచ్చిన లిస్టులో ఇలాంటి బిగ్ షాట్స్ ఉంటె మీరు వాళ్ళకి మినహాయింపు ఇస్తారు. అందుకే అలాంటోళ్ళనే ఏరి కోరి కిడ్నప్ చేశాను" అని అంది నవ్వుతు
"మరి వాళ్ళనేం చెయ్యబోతున్నావ్??" అని అడిగాడు సూర్య
రుద్రా ఏమి మాట్లాడకుండా మిన్నకుండిపోయింది.
"సరే చెప్పొద్దూ..... ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు, వీళ్లందరి డేటా నీ  దగ్గరకు ఎలా వచ్చింది?? నువ్వు ఎలా సంపాదించావు ?? నీకు ఎవరు సహాయం చేస్తున్నారు ?? ప్లీజ్ చెప్పు ??" అని అడిగాడు సూర్య
"తప్పు చేసిన వాడు చట్టం నుండి, న్యాయం నుండి తప్పించుకోవచ్చు కానీ వాడి 'కర్మ' నుండి తప్పించుకోలేడు. ఆ కర్మ 'నేనే'" అని చెప్పి ఫోన్ పెట్టేసింది రుద్రా.
ఆలా పెట్టేసిన గంట తర్వాత న్యూస్లో 45 మందిని కిరాతకంగా హత్య చేసారని న్యూస్ వచ్చింది. సూర్య బాధ్యత తీసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి, పదవికి రాజీనామా చేసాడు. "ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏవైనా, ఈ కేసు సాల్వ్ చేయనందుకు నేనేమి బాధపడట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని అన్నాడు సూర్య. 
 కేరళలో ఆకాసత్ పక్కుతి - రుద్రా అన్న లేఖతో పాటు 45 మంది కిడ్నప్ అయ్యారని వార్త చదివిన సూర్య, వెంటనే లేచి ఆకాశంవైపు చూస్తూ సెల్యూట్ చేసాడు.
రుద్రా ఒక పాడుబడ్డ బంగ్లా టెర్రస్ పై నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని, చీకటిలో వెలిగిపోతున్న నగరన్నీ చూస్తూ చిరునవ్వు నవ్వింది. 
 
సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 10 users Like k3vv3's post
Like Reply
#3
❤️❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
#4
takulsajal gaaru cheppinattu
chala manchi kadhani andhinchaaru
nice one
[+] 1 user Likes Tammu's post
Like Reply
#5
Superb story keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#6
Nice story brother
Keep going
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 1 user Likes Chutki's post
Like Reply
#7
Excellent story
[+] 1 user Likes Raj Ranjith's post
Like Reply
#8
వ్యాఖ్యానం చేసి మిత్రులందరికీ కృతజ్ఞతలు. రెగ్యులర్గా చదువుతున్నారు కాబట్టి అన్నీ ఇక్కడే పొందు పరుస్తాను.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#9
హత్యా రచన
జి కృష్ణ
 
మళ్ళీమళ్ళీ చూడాలన్పించే అందం చందన సొంతం.
ఐదు అడుగుల ఎత్తు, ఎత్తుకు తగిన బరువు.
చక్కని ముఖవర్ఛస్సు.తన వయసు ముప్ఫై రేండేళ్ళు కానీ ఇరవై రెండేళ్ళ అమ్మాయిలా కనిపిస్తుంది.
ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు..
 
ఎంత అందమో అంత మంచి వ్యక్తిత్వం..
వందమందినైనా నడిపించగల చలాకీతనం, మాట‌లో నేర్పు కలిగింది..ఆ ఎర్రని పెదవులపై చిరునవ్వు చెదరడం ఎవరూ చూసుండరు.
తనున్నచోట‌ వాతావరణం అంతా ఆహ్లాదంగా తోస్తుంది ఎవరికైనా.
 
అలాంటి అమ్మాయిని బాధించాలని కూడా ఎవరికీ అనిపించదు కాని ప్రవీణ్ కి మాత్రం ఆమెను చంపాలన్నంత కోపం, ద్వేషం కలిగింది.
 
పరాయి స్త్రీ గా అలాంటి అమ్మాయి ఏ తప్పు చేసినా క్షమించే వాడే.. కాని తనకు భార్యగా ఉన్న స్త్రీ ఆ తప్పు చేయడాన్ని తప్పుగా కాకుండా ద్రోహంగా భావించాడు. అందుకే సహించలేకపోయాడు..
 
చంపాలన్నంత కోపం కలిగింది..
చావాలన్నంత విరక్తి తనపై ,తన జీవితం పై కలిగింది.
తనని చంపి, తానూ చావాలని కూడా అనుకున్నాడు.
 
కానీ తన ఇద్దరు పిల్లల నవ్వులు చూసి, తను గానీ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ పసి పిల్లల మొహంలో ప్రవేశించే విషాదాన్ని తలుచుకొని ఆ ప్రయత్నాలు వదిలేశాడు..
 
చందనచేయాలనుకున్న తప్పును వాయిదా వేయించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసంకష్ట‌మైనా తన బార్యా పిల్లల్ని కొంతకాలం వాళ్ళ అమ్మగారింటికి పంపాడు. రిటైర్మెంట్ తీసుకుని ఇంట‌్లో ఉండే తన బార్య తల్లిదండ్రులే సరైన కాపాలాదారులు అనుకున్నాడు.కూతుర్ని ఎంత ప్రేమించినా పెళ్ళయ్యాక తప్పు చేస్తుందంటే ఏ తల్లిదండ్రులూ సహించరు..
 
అందుకే లేని మద్యం అలవాటు తెచ్చిపెట్టుకుని తాగుబోతులా నటిస్తూ చందనను చిత్ర హింసలు పెట‌్టి, తనంతట తాను వాళ్ళమ్మ గారింటికి వెళ్ళేలా చేశాడు.
 
అప్పటినుంచీ తాగుడే లోకం అయింది తనకు.
బయటకు చెప్పుకోలేని బాధను మందు కొట‌్టి మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
 
మద్యానికి ఒక మహాత్మ్యం ఉంది.
అదేంట‌ంటే తాగితే మర్చిపోవాలన్న విషయాన్ని తప్ప అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది.
 
ప్రవీణ్ విషయంలో కూడా అదే జరిగింది..
బార్యా పిల్లల సోయీ, ఇంటి సోయితో పాటు ఓంటి సోయి కూడా మర్చిపోయాడు.
 
మూడు నెలలుగా కటింగ్ షేవింగ్ లేదు..
 
ఏ రెండు రోజులకో ఒకసారి స్నానం చేయడం.
ఎప్పుడూ మాసిపోయిన డ్రెస్ లతో ఊరంతా తిరుగుతూ ఉండడమే..
 
జనాల్లో మద్యం కోసం ఎంత పనైనా చేసే ఒక తాగుబోతు లా తయారయ్యాడు.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ టైంపాస్ కు పనికొచ్చే జోకరతను..
అవారా గాడు, సంసారం యావ లేనోడు..
పనికి మాలిన వెధవ. అబద్దాల కోరు.
 
చులకన చూపులు, హేళనలు నిత్యకృత్యం అయ్యాయి రోజువారి జీవితంలో..
 
తోటివారి పలకరింపులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి..
 
ఇప్పుడు తను ఒంట‌రివాడు..
 
ఇలాంటి ఒంట‌రి తనంలో కూడా శశిధర్ రూపంలో ఒక ఫ్రెండ్ ను నిలుపుకున్నాడు. ఇద్దరు కలిసి నిలుపుకున్నారు అంటే బాగుంటుందేమో.. అలా నిలిపి ఉంచుకోవడానికి ఎవరి స్వార్థం వారిది..
 
ప్రవీణ్ పూటుగా తాగి పడిపోయినప్పుడు శశిధర్ తనని ఇంటికి తీసుకెళ్తాడు. తాగినమైకంలో ప్రవీణ్ఏదైనా తప్పు చేస్తే అందరికీ సర్ది చెప్తాడు.
 
శశిధర్ చెప్తే ఊర్లో తిరుగుండదు.
ఊర్లో అందరికి మంచిచెడులకు అందుబాటులో ఉంటాడు.దుందుడుకు స్వభావం కలవాడిగా పేరు..
ల్యాండ్ సెటిల్మెంట‌్ లు చేయడం లో దిట‌్ట‌..
తన్నడానికైనా, తన్నించుకోవడానికైనా సిద్దంగా ఉంటాడు.
 
ఇలాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు అతన్ని లోకల్ పొలిటిషియన్ గా మార్చేశాయి..
 
అలాగని శశి మొరటుగా ఉంటాడు అనుకోకండి..
ఆరడుగుల పొడుగు, తగిన బరువుతో ఆజానుబాహుడిలా ఉంటాడు.. చంద్రుడి వంటి మొఖంతో అచ్చం హీరోలా పదిమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు..
 
అతని నవ్వుకు పడిపోని యవతి లేదు ఆ ఊర్లో..
 
కాని తను మాత్రం తనకు నచ్చిన అమ్మాయినే దగ్గరకు రానిస్తాడు.
ఒక స్త్రీ నచ్చిందంటే ఆమె పొందుకోసం ఎంతవరకైనా వెళతాడు..
అతని పొందుకోసం అమ్మాయిల ను ఎంత దూరం అయినా రప్పించగలిగే చతురత అతని మాట‌ల్లో ఉంటుంది..
ఆ చతురతకే....
ఆ అందానికే...
ప్రవీణ్ బార్య చందన కూడా పడిపోయింది..
అతనికోసమే హైదరాబాదులో ఉన్న కాపురాన్ని ప్రవీణ్ తో పోరి ఊర్లోకి మార్పించింది..
ఆ విషయం తెలిసిన మరుక్షణం అతనికి ఆవేశం కట్టలు తెంచుకుంది. నేను మోసపోతున్నాననే బాధ అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. ఇన్నాళ్ళూ జాబ్ మీద ప్యాషన్ తో బార్యాపిల్లలను పట‌్టించుకోలేదు.
 
ప్రొఫెషన్లో ఉండే కిక్ వెనుక పడి అందమైన బార్యను నిర్లక్ష్యం చేశానని కుమిలి పోయాడు.
 
ముందు చందనను మునుపటి లా ప్రేమించి, తనను ప్రేమించేలా చేసుకోవాలి...
అందుకు కొంత టైమ్ కావాలి..
అప్పటివరకూ ఇద్దర్నీ ఇంకా దగ్గర కాకుండా దూరంగా ఉంచాలి...
అందుకే చందనను తల్లి గారింటికి పంపి తాను తాగుడుకి బానిసలా మారాడు..
 
ఎంత తాగినా శశిని అనుదినం గమనిస్తూ ఉండడానికి అతనితో ప్రవీణ్ అంటిపెట‌్టుకుంటూ ఉన్నాడు..
 
చందనను ప్రవీణ్ మల్లీ తీసుకొని వస్తే ఉపయోగంగా ఉంటుందని ప్రవీణ్తో స్నేహం నటిస్తున్నాడు శశీధర్.
 
అందుకే తన బాబాయ్ బార్య కళావతితో ప్రవీణ్ ఎంత గొడవ పడినా పట‌్టించుకోనట‌్టు ఉంటున్నాడు..
 
నిజానికి కళావతి మీద తన పిన్నీ అనే ఆపేక్ష ఏం లేదు శశిధర్కీ. కళావతికి పిల్లలు లేరు. భర్త ఎప్పుడో మరణించాడు.ఆమే చస్తే తనకున్న ఆస్తి మొత్తం శశిధర్ వశమవుతుంది..
 
అంతకంటే గొప్ప అనుబంధం ఏం లేదు ఆమెతో..
 
ఆ ఆస్తి కళావతికి హక్కు గా వచ్చిందేం కాదు. ప్రవీణ్ వాళ్ళ నాన్నను తన అందచందాలతో బుట‌్ట‌లో వేసుకొని, వారికున్న ఆస్తినంతా అప్పనంగా తన పేరు మీద రాయించుకుంది..
 
దాని ప్రభావం ప్రవీణ్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి మీదకంటే ప్రవీణ్ ఆమ్మగారి మీద ఎక్కువ చూపించింది..
 
' భర్త తనను ప్రమించేలా, ఆకర్షించేంతగా లేనే' అనీ, కనీసం సాదింపు పనులతోనైనాఅదుపు చేయలేక పోతున్నాననే బాధతో తనలో తానే కమిలిపోయి మంచం పట‌్టి చనిపోయింది..
 
ఆ తర్వాత రెండో ఏట‌నే వాళ్ళ నాన్నగారు కూడా మరణించారు.
ఇదంతా పది సంవత్సరాల క్రితం జరిగింది.
 
అందరూ మర్చిపోలేదు గాని మరుగున పడిపోయింది.
 
ఇన్ని సంవత్సరాల తర్వాతపూటుగా తాగిన మైకంలో మళ్ళీ తిరగతోడుతున్నాడు ప్రవీణ్..
"నా ఆస్తి అంతా దొబ్బి తింటున్నవ్ కదే తిరుగుబోతు దాన" అంటూ ప్రతీ రాత్రి కళావతి తో గొడవకు దిగుతున్నాడు.
 
కొంత కాలం అందరూ విననట‌్టు ఉన్నా ,ప్రవీణ్ ప్రవర్తన మితిమీరుతుంటే ఒక్కొక్కరూ అడ్డు చెప్పడం మొదలైంది..
 
తాగిన మైకంలో కళావతి ని చంపడానికి కత్తితో రాత్రంతా ఇంటి మీదకు పోయిన రోజులు ఉన్నాయి.
 
పక్క పక్కనే ఇళ్ళు అవడంతో ఏ రాత్రి ఏం చేస్తాడోఅని నలుగురు మనుషుల్ని కాపలా పెట‌్టుకొని కంటిమీద కునుకు లేని రాత్రిళ్ళు ఎన్నో గడిపింది కళావతి..
రాత్రంతా తాగి కళావతి మీద తైతక్కలాడ్డం ఉదయమే పెద్దలలో ఆమెకు క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది.ఆడదాన్ని క్షమాపణలు అడిగే అసమర్దుడిగా, రోషం లేని మగాడిగా ముద్రవేయించుకున్నాడు.
ఊరు ఊరంతా ఒకటే ఫిక్స్ అయిపోయారు,
ఎప్పటికైనా కళావతి ప్రాణాలు ప్రవీణ్ గాడి చేతిలోనే పోతాయని.....
ఇవన్నీ తెలుసుకుంటున్న చందనలో ఏ చలనం లేదు.. అల్లుడి తీరు అర్థం కాని ప్రవీణ్ మామగారు ఎన్నోసార్లు స్వయంగా వచ్చి, కూతురిని తెచ్చుకో, లేదా మాతో పాటు ఉండడానికి రమ్మని అడిగి చూశాడు. ఊరి వాళ్ళతో అడిగించాడు కూడా..
వారిలో శశిధర్ ఒకడు.
ప్రవీణ్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోయే సరికి వెనుదిరిగి పోవడం తప్ప మరేమీ చేయలేక పోయాడు.....
కానీ ఈ సారీ వాళ్ళ మామగారు ఒక స్థిరమైన నిర్ణయంతోనే వచ్చారులా అనిపించింది..
"అయ్యా ప్రవీణూ.. పది నెలలుగా ఒంట‌రిగానే ఉంటున్నావు. నీ పిల్లల్ని అయినా చూడాలి అనిపించట‌్లేదా.. ఇన్నాళ్ళూ హైదరాబాదులో ఉండి సంపాదించుకున్న పేరును, ఈ పది నెలల్లో రోజు రోజుకూ దిగజార్చుకున్నావు.. మగాడు ఉన్నతంగా జీవిస్తేనే స్త్రీలు చెప్పు చేతుల్లో ఉండరు బాబూ.. అలాంట‌ది నువ్వు ఇలా పది మందిలో పలుచన అయితే ఎలా చెప్పు..
అంతా ఆలోచిస్తే నా గుండెలో రాయి పడ్డట‌్టు అనిపిస్తుంది..
నా కూతురు తప్పు చేస్తే నువ్వు ఇలా అయ్యావా?
నువ్వు ఇలా తయారయ్యావని నా కూతురు తప్పు చేస్తుందా? వాస్తవం తెలుసుకొని తట‌్టుకునే శక్తి మా ముసలి గుండెలకు లేదయ్యా.." అంటూ భోరున ఏడ్చాడు చిన్నపిల్లాడిలా..
మామయ్యకి అంతా అర్థం అయ్యిందనిపించింది.
అతని పక్కన కూర్చుని ఊరుకోమన్నట‌్లుగా భుజం తడుతూ " శశిధర్ తరుచూ వస్తున్నాడా మామయ్య" అని అడిగాడు..
ఆందోళన పడిపోతూ "తరుచూ కాదు బాబూ..
మొన్ననే మొదటిసారి చూశాను. అదే చివరి సారీ...
 
నేనూ మీ అత్తయ్య ఎప్పుడూ బయటకు వెళ్ళం..
 
ఆ రోజు చందన
'ఎంతకాలం ఇలా ఇంట్లోనే ఉంటారు నాన్నా..
మన చుట‌్టాల ఇంట్లో శుభకార్యం ఉందిగా...
రెండు రోజులు వెళ్ళి రండి..
కొంచెం రిలీఫ్ గా ఉంటుంది' అని బలవంతం చేస్తే బయలుదేరాం. ఆటో ఎక్కి ముందుకు కొద్ది దూరం పోగానే శశిధర్ బండి పై ఎదురయ్యాడు...
అతనా కాదా అని ఆటో ఆపి దిగి చూస్తే బండి నేరుగా మన ఇంట‌్లోకే వెళ్ళింది..
వెనుకకు తిరిగి ఇంటికివెళ్ళి చూస్తే ఇద్దరూ అభ్యంతరకర రీతి లో మాట‌్లాడుకుంటున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేక పోయా..
అంతే...
 
ఈ చావుదలకు వచ్చిన వయసులో ఒక్కగానొక్క కూతురి వివాహ జీవితం నాశనం అయితే చూసి తట‌్టుకోగలమా? "
 
కంటిలో నుండి ఏకధాటిగా కారుతున్న నీళ్ళను తుడ్చుకుని మళ్ళీ చెప్పాడు.
 
పెళ్ళయిన దంపతుల్లో ఒకరు, పరాయి వాళ్ళ నుంచి సుఖం ఆశిస్తున్నారంటే... ఇంకొకరు జీవిత భాగస్వామిగా నిర్వర్తించవలసిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించనట‌్టే..తప్పు ఎవరిదున్నా సరిదిద్దుకొని మళ్ళీ కలిసి జీవించాలి.
 
మా ముసలి వాళ్ళ కోసం కాకపోయినా అభంశుభం తెలియని మీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఒక్కటి కండి..
కావాలంటే నీ కాళ్ళు పట్టుకునిమొక్కుతా" అంటూ కాళ్ళమీద పడబోతున్న మామయ్యను ఆపి
"నేను అనుకుంది జరిగే సమయం వచ్చింది మామయ్యా.. త్వరలోనే నేను చందనను, పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవడానికి అక్కడికి వస్తాను.. మీరు నిశ్చింతగా వెళ్ళండి" అని చెప్పి బస్స్టాండ్ దాక దిగబెట్టాడు..
 
అక్కడి నుండి నేరుగా వైన్స్ కు వెళ్ళి అందరూ చూస్తుంటే ఫుల్ బాటిల్ మందు తీసుకుని ఇంటికి వచ్చాడు..
బాటిల్ ఓపెన్ చేసి ఒక గ్లాస్ లో కొద్దిగా వంపుకొని
దానిని పైకెత్తి స్మెల్ చూశాడు..
"ఛీ ఛీ.. కంపుకొడుతుంది..సీసాలు సీసాలు ఎట‌్లా తాగుతున్నారు రా బాబూ " అంటూ కింద పెట‌్టేశాడు.
బాటిల్ తీసుకొని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి అందులోంచి సగం పైగా లిక్కర్ ని బేసిన్ లో వంపేశాడు. మిగిలిన దాన్ని పక్కన పెట్టి సిస్ట‌మ్ ముందు చెయిర్ లో కూర్చున్నాడు..
అందులో సీసీ కెమెరాల లైవ్ వీడియోలు చూసి, నైట‌్ టైమ్ లో క్యాప్చర్ చేసిన వీడియోలను కూడాఒకసారి చెక్ చేసి సంతృప్తిగా టేబుల్ పై రెండు చేతులతో దరువేశాడు..
"అమావాస్య నడిరేయి దీపాలు లేని వేళ కూడా కళావతి ఇంటికి వచ్చేదెవరో ఈజీ గా తెలిసి పోతుంది" అనుకున్నాడు..
ఈ అంతటికీ గంట‌న్నర సమయం పట‌్టింది..
మరో గంట‌ ఆగి శశికి ఫోన్ చేశాడు..
ఎప్పటిలా ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు..
పది నిమిషాల తరువాత మళ్లి చేసినా జవాబు లేదు..ఐదు నిమిషాల తరువాత మళ్లి ట‌్రై చేసినా అవతలి నుంచి ఫోన్ సమాధానం లేదు.
అరగంటలో మొత్తం పది కాల్స్ చేస్తే అప్పుడు లిఫ్ట్చేశాడు శశిధర్.
‌"ఏంట‌న్న బిజీగా ఉన్నప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఎలా చెప్పు" కొద్దిగా అసహనాన్ని కనబరుస్తూ మెల్లగా, మెత్తగా మందలించాడు..
ప్రవీణ్ నోట్లో పెన్ క్యాప్ ఉంచుకుని
" అన్నయ్యా.. ఒక క్వార్టర్ ఇప్పించవా ప్లీజ్..." అని ధీర్ఘం తీస్తూ రిక్వెస్ట్ గా అడిగాడు..
మాట‌ల్లో తేడా గమనించి "ఆల్రెడీ తాగినవ్ కదరా..
ఇంకేం చాలు గాని ఆపు..." అన్నాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#10
" బ్రదర్ ఒక క్వార్టర్ ఇప్పించు సరిపోతది.. నీకు రేపే తిరిగి ఇచ్చేస్తాను "
" వద్దు బ్రదర్.. మనీ కాదు నువ్వు ఓవర్ అయితే ఆ కళావతితో కలిసి రచ్చ చేస్తవ్. "
" చేయను అన్న.. ఇంకో క్వార్టర్ తాగి రిలాక్స్ గా బజ్జుంటా..నీ మీద ఒట‌్టు" పిల్లాడిలా బతిలాడుకున్నాడు..
"నేన్నమ్మను బ్రో..నీకు దక్కాల్సిన ఆస్తినంతా కొట‌్టేసింది..నీ ప్లేస్ లో ఎవరున్నా చేసే పని అదే"
వద్దని చెప్పినట‌్లు లేదు. రెచ్చగొడుతన్నట‌్టుగా ఉంది.. ప్రవీణ్ కి కావాల్సింది కూడా అదే..
"మరి కాదా... పది ఎకరాల మెట‌్ట‌పొలం బ్రదర్.మొత్తం నాకేసింది..ఆ టక్కులాడి మీద కోపం ఉండదా..నా బాధ అర్థం చేసుకునే మనసున్న మనిషే లేడు బ్రదర్.. హ .హ...." అని ఏడుపు రాగం అందుకున్నాడు ప్రవీణ్..
శశిధర్ అనునయిస్తున్నట్టు నటిస్తూ "నాకు తెలుసు ప్రవీణ్.. అందుకే నీవు ఎంత గొడవ పడినా నేను పట‌్ట‌్టించుకోనిది.. ఇంకెంతైనా చెయ్.. నా సపోర్టు నీకే ఉంటుంది.. ఇప్పుడైతే రవి గానికి చెప్తున్నాను వెళ్ళి క్వార్టర్ తెచ్చుకో...క్వార్టర్ చాలా హఫ్ కావాలా?" అన్నాడు.
 
"హఫ్ అయితే అన్నీ మరిచిపోయి హాపీగా నిద్ర పోతాను అన్నయ్యా.. హఫ్ చెప్పు.." అన్నాడు ఉత్సాహంగా..
 
"సరే... షాపుకు వెళ్ళు. నేను రవికి చెప్తాను "
అంటూ ఫోన్ కట‌్ చేశాడు..
 
ప్రవీణ్ కు శశిధర్ తన దారిలోనే ఉన్నాడు అనిపించింది.
'నాకు కళావతి మీద చంపాలన్నంత పగ,ద్వేషం ఉన్నాయి అని శశిధర్ నమ్మేలా చేశాను. అతనికి కొత్తగా చేయగలిగే బిజినెస్ ఐడియాలు ఇచ్చి డబ్బు అవసరాన్ని సృష్టించగలిగాను. నాకు లిక్కర్ ఇప్పించి పరోక్షంగా కళావతి పైకి రెచ్చగొడుతున్నాడంటే నేను అనుకునే పని త్వరలోనే చేసేలా ఉన్నాడు'అని ఆలోచిస్తూ, పారబోయగా బాటిల్లో మిగిలిన లిక్కర్ను షర్ట్ మీద ప్యాంటు మీద కొంచెం కొంచెం పోసుకున్నాడు.మిగిలిన మొత్తాన్ని వాష్ బేసిన్ లో వంచాడు.
 
గ్లాసులో పోసుకొని పక్కకు పెట్టిన లిక్కర్ కి కొన్ని నీళ్ళు కలిపి ఒకేసారి మొత్తం లేపేశాడు..
 
ఖాళీ బాటిళ్ తీసుకొని తూలుతూ ఇంట‌్లోనుండి బయటకు వచ్చాడు, బాగా తాగిన వాడిలా....
 
ఇంటి గుమ్మానికి ఎదురుగా వున్న విధ్యుత్ స్థంభానికి చేతిలో ఉన్న బాటిల్ని కసిగా విసిరికొడుతూ "దీనమ్మ....మందు పాడుగాను... ఎంత తాగినా ఎక్కి చావట్లే " అని అందరికి వినిపించేలా అరిచాడు.. ఆ బాటిల్ వేగంగా వెళ్ళి పగిలి ముక్కలు ముక్కలుగా అయింది. అయినా, చూస్తేఫుల్ బాటిల్ అని ఇట్టే తెలిసిపోతుంది.
 
అందరూ చూస్తుండగా, తూలుతూనే తన టూ వీలర్ తీసి ఒక్కసారిగా స్పీడ్ పెంచి రోడ్లమీద దూసుకుపోయాడు.
చూసినవాళ్ళు 'ఈ రోజు కళావతికి గొడవ తప్పదేమో'అనుకున్నారు.
 
అప్పుడు సమయం రాత్రి ఎనిమిది అయింది..
 
వైన్స్ కి వెళ్ళి రవిని అడిగితె హఫ్ ఇచ్చాడు.
వాట‌ర్, గ్లాసు తీసుకుంటున్న ప్రవీణ్ కి రవి, శశిధర్ కు ఫోన్ చేయడం తెలిసి పోతుంది.
 
వాళ్ళ సంభాషణ వింటున్న ప్రవీణ్ 'ఇదేదో ఈ రోజే కొలిక్కి వచ్చేలా ఉంది. ఇవ్వాళ కాకపోతే పోతే రేపు. కాకుంటే తర్వాత రోజు. ఒక రోజు లేటైనా మిషన్ పక్క సక్సెస్..' అనుకుని లోలోపలే విజయ గర్వంతో నవ్వుకున్నాడు.
 
అందరి ముందే తీసుకున్న లిక్కర్ మొత్తం తాగేసి,రెండు గంటల తర్వాత తన బండి అక్కడే వదిలి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి పదినుండి నడిరేయి వరకు ఎప్పటిలాగే కళావతితో కయ్యానికి కాలు దువ్వాడు కానీ కళావతి ఇంట‌్లో నుండి బయటకు రాలేదు..
అరిచి అరిచి ఈ రోజుకు చాలని తన ఇంట్లోకి వెళ్ళి ముసుగు కప్పుకుని పడుకుంటాడు...
 
************
 
ఉదయమే ఎవరో తలుపులు తడుతున్నట్టు బయట‌ నుండి అలజడి వినబడింది. బద్దకంగా లేచి కాలకృత్యాలు ముగించుకొని, అద్దం ముందు నిల్చుని శుభ్రంగా షేవింగ్ చేసుకుంటూంటే, బయట అలజడి ఇంకా ఎక్కువైంది.
 
కళావతి ఇంట‌్లో నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.
"అత్తయ్యో...అత్తయ్యా..." అని..
ఆ దుఃఖంలో నిజాయితీ ఉంది.ఆ గొంతు శశిధర్ బార్యది. ఆమె దుఃఖానికి కారణం తన భర్తే అని తెలిస్తే ఏం చేయగలదు పాపం‌.
"అరేయ్ ప్రవీణ్ గా, డోర్ ఓపెన్ చెయ్యరా.. ఈ రోజు నీ చావు కళ్ళ చూడందే వదలన్రా.."
 
" ఏయ్ ఎవరైనా సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు ఫోన్ చేశారా"
శశిధర్ గొంతు స్పష్ట‌ంగా వినిపించింది. తప్పు చేసిన వాడే ఎగిరి పడుతున్నాడు.
 
కాలం గడుస్తూ ఉంటే జనాలు ఎక్కువ అవుతూ ఉన్నారు.తలుపులకు లోపల వైపు ఇంటి లోపల బ్రష్ చేసుకుంటూ ప్రవీణ్ అంతా వింటూనే ఉన్నాడు.
గుంపులో నుండి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.' హైదరాబాద్ నుంచి ఆమె గండానికే వచ్చాడేమో' అని ఒకరు,'పాపం కళావతి' అంటూ కళావతి మీద సానుభూతి మరొకరు చూపిస్తున్నారు.
'తల్లి కి చేసిన ద్రోహానికి పగతో ఇది చేసి ఉంటాడు' అని కొంతమంది అనుకుంటున్నారు ఇంటి బయట‌...
 
ప్రవీణ్ స్నానం ముగించుకొని వచ్చి, డ్రెస్ అప్ అయ్యేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేశారు.
 
శశీధర్ వాళ్ళను ముందుగా రీసీవ్ చేసుకొని ఎస్.ఐ. కి కంప్లయింట్స్ స్టార్ట్ చేశాడు.
"తాగుబోతు సార్ వాడు. ఊరందరికీ తెలుసు...అడగండి ఎవరైనా చెప్తారు. చంపుతానని రోజూ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. చివరికి వాడు అనుకున్న పని చేసి చూపించాడు.ఇప్పుడు ఇంట‌్లో నుండి బయటకు రావట‌్లే.. ఖచ్చితంగా వీడే చంపాడు.. " అనిచెప్పుకుంటూ పోతున్న శశిధర్ ని ఆపమన్నట్టు సైగ చేసి డోర్ దగ్గరకు వెళ్ళి " ప్రవీణూ.. నేను యస్.ఐ విక్రమ్ ని.. డోర్ తీసి బయట‌కు రా.. లేకపోతే ఈ హత్య నువ్వే చేశావు అనుకోవాల్సి ఉంటుంది.... వింట‌న్నవా ప్రవీణ్.. " అని గట‌్టిగా చెప్పాడు.
 
డోర్ దగ్గరే నిలబడి ఉన్న ప్రవీణ్, " సార్ నాకూ ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు.. మీరు ఒక్కరే లోపలికి వస్తే వివరంగా చెప్తాను. "అన్నాడు.
 
'సరే అయితే డోర్ ఓపెన్ చెయ్' అన్నాడు యస్.ఐ..
 
" మీ పై నమ్మకంతో తీస్తున్న సార్" అని మెల్లగా, కొంచెం ఓపెన్ చేయగానే యస్.ఐ. తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఫోర్స్ గా లోపలికి వెళ్ళారు.
 
వెళ్తూనే ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు చెరో చేయి పట్టుకుని వెనక్కి మడిచారు. మూడోవాడు వెనుక వైపు కాలర్ పట్టుకున్నాడు.
యస్.ఐ కంప్లీట‌్ గా డోర్ తెరవబోతుంటే "సర్ సర్ సర్.. ఈ హత్య చేసింది ఎవరో నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్.. టూ మినిట్స్ టైమ్ ఇస్తే మీకిస్తాను" అన్నాడు రిక్వెస్ట్ గా..
ఏంట‌వి? ఎక్కడున్నాయని అడిగాడు యస్.ఐ. డోర్ క్లోజ్ చేస్తూ..
 
"నా కంప్యూటర్ లో సార్.. అది అక్కడ ఉంది "అని కంప్యూటరు వైపు చూపించాడు.
'పద చూపించు. వదలండి వాన్ని. ఇంతమందిలో తప్పించుకోలేడు' అని ఆర్డర్ వేశాడు.
 
ప్రవీణ్ కంప్యూటర్ ముందు చెయిర్ లో కూర్చునిసీసీ కెమెరాల వీడియోలు తీసి చెక్ చేస్తుంటే " ఏం చేస్తుంటావ్ నువ్వు.. సీసీ కెమెరాల అవసరం ఏమిటి నీకు"అని యస్.ఐ. అడుగుతాడు.
 
ప్రవీణ్ ఆ టేబుల్ డ్రాయర్ లోనుండి తన ఐడీ కార్డు తీసి యస్సై కి ఇస్తూ
"సార్ నా పేరు ప్రవీణ్ పగడాల. నేను eye detective and private investigation లో ఏజెంటుగా చేసేవాడిని. కరోనా వల్ల పని లేక ఊర్లోనే ఉంటున్నా" అని చెప్పి కూర్చోడానికి తన పక్కనే చెయిర్ చూపించాడు..
 
యస్సై కంప్యూటర్లో చూస్తూ కూర్చున్నాడు.
 
ప్రవీణ్తాను కళావతి ఇంటి ముందు అరవడం ఆపి ఇంటికి వెళ్ళిన పన్నెండు గంటల తర్వాత నుండి రికార్డ్ అయిన వీడియో చెక్ చేస్తాడు. ట‌ైమ్ మూడున్నర కావస్తూండగా ఒక పెద్ద ఆకారం చుట్టూ పరికిస్తూనేరుగా కళావతి ఇంట‌్లోకి వెళ్తుంటే ముఖం క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ వీడియోను ఫ్యూజ్ చేస్తాడు..
యస్సై విక్రమ్ ఆ వ్యక్తిని బాగా పరీక్షించి చూసి "ఇతను బయట ఉన్నాడు కదా"అని అడిగాడు కానిస్టేబుల్స్ ని.
 
వాళ్ళు కూడా బాగా చూసి 'అవును సర్' అన్నారు.
 
యస్సై కానీయ్ అన్నట్టు సైగ చేయగానేప్లే బటన్ నొక్కాడు ప్రవీణ్..
వీడియోలో శశిధర్ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి ఆరు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. కుడివైపు తిరిగి ప్రవీణ్ఇంటి గేటుదాటి లోపలకు వచ్చాడు.
గేటు దాట‌గానే కుడివైపునున్నతులసి మొక్క కుండీలో ఏదో పెట‌్టి, బయటకు నడిచాడు.
 
తిరిగి కళావతి ఇంట‌్లో కి వెళ్ళి, ఒక నిముషం తరువాత బయటకు వచ్చి ఎడమ వైపు తిరిగి నేరుగా వెళ్ళి పోయాడు..
 
ఇదంతా రెండు కెమెరాలలో రికార్డ్ అయింది.
 
యస్సై "నువ్వు డిటెక్టివ్ వి కదా. ఏం జరిగింది అనుకుంటున్నావు చెప్పు" అన్నాడు ప్రవీణ్తో.
 
ప్రవీణ్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి,
"సార్ శశిధర్ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి గాఢనిద్రలో, ప్రతిఘటించలేని స్థితిలో వున్న ఆమెను హత్య చేశాడు. అందుకోసం వాడిన ఆయుధాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో దాచాడు.. నేరం నా పైకి రావడానికి. మళ్ళీ కళావతి ఇంట‌్లో కి వెళ్ళి డెత్ కన్ఫర్మ్ చేసుకొని బయటకు వచ్చి అతని ఇంటికి వెళ్ళాడు.."
అనిఆగి యస్సై వైపు చూసి
"అంతే కదా సర్" అన్నాడు.
 
యస్సై దీర్ఘంగా ఆలోచిస్తూ ' కరెక్టే.. కానీ నువ్వు పెట్టిన సీసీ కెమెరాలు బయట ఎక్కడా కనిపించలేదు. ఎందుకలా కనిపించకుండా పెట‌్టావ్' అని అడిగాడు.
"మన టౌన్లో రెండు మూడు చోట‌్లోనే ఉన్నాయి సర్. అవి కూడా పబ్లిక్ ప్లేసుల్లో.. అలాంట‌ది నా ఇంటి ముందు పర్సనల్గా నేనే ఏర్పాటు చేసుకున్న అంటే జనాలు నవ్వి పోతారని... అది ఇంకా మనవాళ్ళకి అలవాటు కాలేదు కదా సర్ అందుకే ఎవరికి తెలియకుండా ఉంచాను" అంటూ నసిగాడు ప్రవీణ్.
 
'అవునా? సరే.' అని కానిస్టేబుల్స్ వైపు తిరిగి 'మీరెళ్ళి శశిధర్ ని జీపెక్కించండి. అలాగే ఆ ఎవిడెన్స్ ను కూడా. అదే తులసి కోట‌లోని కత్తిని. నేను ఈ వీడియోను నా మెమరీ కార్డ్ లోకి ఎక్కించుకునివస్తా' నన్నాడు మెమరీ కార్డ్ ప్రవీణ్ కు ఇస్తూ.
ప్రవీణ్ కార్డ్ రీడర్లో మెమరీ కార్డ్ ఉంచి, కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వీడియోను కావాల్సినంత సెలక్ట్ చేసే పనిలో పడ్డాడు ఉత్సాహంగా.
 
యస్సై, ప్రవీణ్ ను తీక్షణంగా చూస్తూ "ప్రవీణ్.. నేరం చేసిన వాడికంటే, నేరానికి ఉసిగొల్పిన వాడికే శిక్ష ఎక్కువ ఉంటుంది. ఆ విషయం తెలుసా?"అన్నాడు.
"తెలుసు సార్. నాకెందుకు చెబుతున్నారు" కంప్యూటర్ లో పని చూస్తూనే బదులిచ్చాడు ప్రవీణ్.
"ఏం లేదు... ఈ హత్య మోటివేట‌్ చేయడం వల్ల జరిగిందని నా అనుమానం"
ప్రవీణ్ సన్నగా నవ్వాడు.
ఎడిట‌్ చేసిన వీడియోను మెమరీ కార్డ్ లోకి సెండ్ చేసి, కార్డ్ తీసి యస్సై కి ఇస్తూ
"మీరు మీ సెక్యూరిటీ అధికారి బ్రేయిన్ తో అతిగా ఆలోచిస్తున్నారు సర్. మీరు ఊహించినట‌్టు ఏం జరగలేదు ఇక్కడ" అన్నాడు ప్రవీణ్.
"నేనేం ఊహిస్తున్నానో నువ్వెలా చెప్పగలుగుతున్నావ్....
ఇక్కడ జరిగిందే నేను ఊహిస్తున్నా. కానీ ఊహలను సాక్ష్యాధారాలు గా న్యాయస్థానం అంగీకరించదు. ఇక్కడ నేరానికి ప్రేరేపించారని , ప్రేరేపించిన వాడికి మాత్రమే తెలుసు. వాడే సాక్షి. వాడంతట‌ వాడు నేరాన్ని అంగీకరిస్తేనే శిక్ష పడుతుంది. కానీ వాడు అంగీకరించడం జరగదు. కాబట‌్టి అసలు నేరస్థుడికి కాకుండా అమాయకుడికిశిక్ష పడుతుంది. నేరస్తులు చట‌్ట‌ం, సెక్యూరిటీ ఆఫీసర్ల బారినుండి తప్పించుకోవచ్చు. కానీ తన అంతరాత్మ నుండి తాను ఎప్పుడూ తప్పించుకోలేడు.. ఎప్పుడో ఒకప్పుడు అదితప్పకుండా శిక్షిస్తుంది. బీ కేర్ ఫుల్.."అంటూ ఇంట్లో నుండి గుమ్మం వైపు నడిచాడు.
 
ప్రవీణ్ కు అంతరాత్మ గురించో, ఆకుకూర గురించో ఆలోచించే టైం లేదిప్పుడు.
మునుపటిలా చందనను ప్రేమించాలి. చందన తనను ప్రమించేలా చేసుకోవాలి. అదే ఇప్పుడు తన లక్ష్యం..
.
 
హత్యారచన ముగిసింది.
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
#11
Superb ji
Like Reply
#12
జ్ఞాపిక
చిరంజీవి వర్మ
వారానికి ఒకటి రెండు సార్లయినా మా ఫ్రెండ్ ప్రశంస వాళ్లింటికి వెళ్తుంటాను. కానీ వాళ్ల డాడీ గదిలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. సంక్రాంతి దగ్గరపడుతోంది. ఆంటీ ఫ్లాటంతా దులిపి శుభ్రం చేసుకుంటూ వుండడంతో, ఇన్నాళ్ళకి నాకు ఈ అవకాశం దొరికింది.
టెరేస్ మీది ఆ విశాలమైన గదిలో ఓ పెద్ద రాతబల్ల. దానివెనక గిర్రున తిరిగే కుర్చీ. బల్లమీద ఓ లేప్‌టాప్. దాని పక్కనే కొట్టొచ్చినట్టు కనపడుతోంది ‘అది’! చూడ్డానికి సగం కోసేసిన ప్లవర్ వాజ్‌లా వుంది. దాని నిండా రకరకాల సైజుల్లో చెక్కేసిన రంగురంగుల పెన్సిళ్ళు, బ్లాక్ కలర్ క్రేయాన్స్ వున్నాయి. అది నలుపా? లేక నాచు రంగా? అదీ కాకపోతే ముదురాకుపచ్చా? ఇదీ అని చెప్పలేని అదేదో రంగుతో వున్న ‘దాన్ని’ ముందు ఏదో పింగాణీ వస్తువు అనుకున్నాను. చేతిలోకి తీసుకొనేటప్పటికి చాలా తేలికగా వుంది. వేలితో కొట్టి చూస్తే దృఢంగా వుండి టంగ్ టంగ్‌మంటోంది. అది ఏ లోహమో నాకు అర్థం కాలేదు.
గదిలో, ఎత్తయిన తెల్లటి గోడలనిండా చిన్నపిల్లలు గీసినట్టు నాలుగు వైపులా నల్లటి అల్లిబిల్లి బొమ్మలు.
“ఇదేంటే, ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు! నువ్వూ మీ అన్నయ్యా చిన్నప్పుడు పోటీపడి గీసి పారేశారా?”
“ష్ ఇవి, మా డాడీ గీసుకున్న భావ చిత్రాలు!” చెప్పింది ప్రశంస లేప్‌టాప్ ఆన్ చేస్తూ.
“చిత్రాల్లో బావచిత్రాలు, మరదలిచిత్రాలు కూడా వుంటాయా?”
“నీ మొహం! బావ చిత్రాలు కాదు, భావ చిత్రాలు. బా-ని వత్తి పలుకు
ఏ యాంగిల్లోంచి చూసినా నాకు ఆ భావచిత్రాలు అభావంగానే కనిపిస్తున్నాయి.
“నేనింకా మేధావినవ్వలేదేమోనే. అందుకే ఈ ఆర్టేంటో అర్థంకావడంలేదు. ఇదేదో ఇది కొంచెం కొబ్బరిచెట్టులా కనిపిస్తోందే!” అన్నా, ఓ బొమ్మ దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తూ.
“అవును. అది గోదావరి గట్టున కొబ్బరిచెట్టు. గోదావరి ఆ గోడవతలవుంది. నిజంగానే వుందనుకొని వెళ్ళేవు గనక, జారిపడి చస్తావు!”
“బాప్‌రే! ఇదేంటిది? ఈ తెల్ల సున్నాలో నల్ల మచ్చ!”
“అదా ఓహ్! అది గైడీమపాసాగారి పిల్లి గెడ్డం. అలా చూడు నీ వెనక తుపాకీలా వుంది. అది అదెవరబ్బా? కథయ్యేలోపు గోడమీది తుపాకీ పేలాలంటారు చూడు, ఆయన. ఇదిగో ఈ షేడ్ కింద కొశ్చన్ మార్క్‌లా కనపడుతోందే? ఈ బొమ్మ! ఈయనేమో ఓ’హెన్రీ గారు. ఒక్కొక్క మహానుభావున్నీ ఇలా వెతుక్కోవాలన్నమాట!”
“ఏంటే, గారూ గీరూ అంటూ అంత మర్యాద? వాళ్ళేదో మీ తాతయ్యో మావయ్యో అయ్యినట్టు!”
“ఇదే రాజుల మర్యాదంటే! మా డాడీని మన్నించకపోయినా ఫర్వాలేదు. కానీ, వారిని అలా గౌరవించకపోతే ఆయనకి మహా మండుద్ది!”
“అమ్మో! ఈ మర్యాదలు గిర్యాదలు మన వల్లకాదు. బుర్ర బద్దలైపోతుంది” చేతిలో వున్న’దాని’తో నెత్తి మీద సరదాగా కొట్టుకున్నా. ‘టంగ్’మంది. ఒకటే నొప్పి. బొప్పి కూడా కట్టినట్టుంది.
“ఇదేంటిది? అల్లాద్దీన్ అద్భుతదీపంలా వుంది!” అడుగుతూ నా చేతిలో వున్న ‘దాన్ని’ టేబుల్ మీద పెట్టాను.
“ఒకలా చెప్పాలంటే అలాంటిదే
“అవునా! ఆం బ్రూం బిష్ ” అంటూ మళ్ళీ దాన్ని చేతిలోకి తీసుకొని, నోటికొచ్చిన మంత్రం చదివాను.
“మనం మంత్రం చదివితే రాడు అల్లాద్దీన్, చదివేవాళ్ళు చదవాలి
“ఇంతకీ ఏం మెటీరియలే ఇది? దీని షేప్ ఏంటీ ఇలా వుంది? ఎక్కడ కొన్నారిది? బాగుంది!”
“కొన్నది కాదది. తయారుచేసింది. చెప్పాలంటే అదో పెద్ద కథ. దాని వెనక అంతులేని ఆవేదన వుంది. హృదయాంతరాలలో అది ఘనీభవించి, ఎప్పటికీ పొంగని లావాలా కుతకుతలాడిపోతా వుంది!” ప్రింటర్‌లో అడ్డుపడ్డ పేపర్ని తీస్తూ నాటకీయంగా చెప్పింది ప్రశంస.
“అర్థమయ్యేలా చెబుదూ వెధవ బోడి కవిత్వం నువ్వూనూ!”
“మెంతిబుట్ట అంటారు దీన్ని!”
“యాం బ్బుటా? మెం.తిబు..టా!”
“యస్! మెంతిబుట్ట.”
“ఏదోసారి గూగుల్ చెయ్యి.”
“దాని తయారీ, గూగుల్‌కి కూడా తెలియని ఓ నిగూఢ రహస్యం!”
ఇటీవలే చిరంజీవి ఐదోతరగతి ఉత్తీర్ణుడయాడు. ఊరిలో వున్న ఏకోపాధ్యాయ పాఠశాలతో వాడికి ఋణం తీరిపోయింది. ఉన్నత విద్యనభ్యసించడానికి అతగాడు గ్రామాంతరమవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయి. మేడిశెట్టి చంటిగాడు, బీర రామచంద్రంగాడిలాంటి అనుంగుమిత్రులొచ్చి ‘చినరారు’ కొచ్చిన ఈ హైకాలేజ్ అగత్యం గురించి రోజుకోసారైనా వగచుచున్నారు. ‘అంతా దైవ సంకల్పం! విధి విలాసాన్ని ఎవ్వరు తప్పించగలర’ని బరువైన డైలాగులు చెప్పుకుంటూ కళ్లూ ముక్కూ కంబైండ్‌గా తుడుచుకుంటున్నారు.
“బావుగారు తోడు లేకుండా నేనొక్కన్నే బళ్ళోకెలా ఎల్లగలన్రా? అందుకే నేను బడి మానేత్తనాను!” తీవ్రనిర్ణయం తీసుకొని త్యాగానికొడిగట్టేడు చంటిగాడు. ఆ బండెదవ రెండో తరగతి మూడో సంవత్సరం చదువుతున్నాడు.
“అదే మంచిదండి చంటిగారు. ఇక్కడొక మేట్టారి మొట్టికాయలతోనే తల పులిసిపోతంది. ఐసుకూలులో ఐతే రోజుకైదారుగురు మేట్టార్లు వళ్లంతా చీరేత్తారు. అందులో ఒకలో ఇద్దరో పంతులమ్మలు కూడా ఉంటారంట. ఆళ్లకి కోపం వత్తే మంచేత పేలు కూడా చూబించేసుకుంటారంట. బాబుగారెలా తట్టుకుంటారో పాపం! మా బాబొప్పుకోడు కానీ లేపోతే నేనూ బడి మానేసి ఇంచక్కా దూళ్ళు మేపుకుందును.” చంటిగాడికున్న స్వతంత్రం తనకి లేనందుకు చింతించాడు రాంగాడు. ఆ బక్క సన్నాసి, బళ్లో తక్కువా గోళీలాటదగ్గర ఎక్కువా సంచరిస్తుంటాడు.
“అన్నీ ఇంటనాను. ఇచారించింది చాలుకానీ, సిరంజీబారు మీరా డిటేటివు ఉగందర్నందుకోండి. నిన్న సగం సదివొదిలేసారు. ఆ మడ్డరెవరు చేసారో ఏటాని రాత్రి నిద్రోలేదు!” అన్నాడు బొంతు సూరిగాడు అరుగుమీద కూర్చుంటూ.
“బేగా తెండి బాబూ తెండి. మేవూ అందుకోసవే వచ్చేం!” అన్నారు రాంగాడూ చంటిగాడూ ముక్తకంఠంతో.
చిరంజీవి, కొమ్మూరి సాంబశివరావు ‘ప్రాక్టికల్ జోకర్’ పుస్తకం తెచ్చి పైకి గట్టిగా చదవడం మొదలెట్టాడు.
వాళ్ళతో పాటూ దారంటా పోయేవాళ్ళంతా ఆగి, మైమరచిపోయి మరీ వింటున్నారు. ఇంక ఆ పుస్తకం అయిపోయీదాకా వాళ్లు మరి కదలరు.
‘కావ్కావ్
పెరట్లో కరివేపాకు చెట్టుమీద వాలిన కాకి అదే పనిగా అరుస్తోంది.
నాలుగూళ్ళూ తిరిగి, వేసవి సెలవలని ఎంజాయ్ చేసొచ్చిన చిరంజీవి అరుగు మీదనుంచి కాకి అరుపుని సొగబుగా వింటున్నాడు. పెదలంకలో కాకిభాష వాడికి తెలిసినట్టు ఇంకొకడికి తెలీదు.
కాకికి ఆకలేస్తే ‘కావో కావో’ అని, దాహమేస్తే ‘కాహో కాహో’ అని, దానికేదన్నా యాతనొస్తే ‘కేవ్ కేవ్’ అని, అదేమన్నా మనకి చెప్పాలనుకుంటే ‘కకాక్ క్కాక్’ అని, అరుస్తూ వుంటుంది. ఇలా సందర్భాన్నిబట్టి దాని స్లాంగూ, మాడ్యులేషన్నీ మారుస్తూ వుంటుంది. ప్రస్తుతం ఆ వాయసరాజం ‘కకాక్ క్కాక్, కకాక్ క్కాక్’ అని అరవడం చిరంజీవి గమనించాడు. అంటే ఈ కాకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటోందన్నమాట! కామన్‌గా కాకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చుట్టాలొస్తారనే. అందుకే, దాన్నే కన్ఫర్మ్ చేసుకున్నాడు.
“అమ్మమ్మా ఎసరెట్టేసారా? ఇంకో సోలడు బియ్యం ఎక్కువ పొయ్యండి. చుట్టాలొస్తున్నారు. మళ్ళీ అప్పటికప్పుడు వండిపెట్టాలంటే మీకే యాతన!” విజయచిత్రలో వర్ధమాన నటుడు చిరంజీవి బొమ్మని ఆరాధనగా చూస్తూ, చెప్పాడు.
“జానకమ్మా, ఇంకో తలగొట్టి తవ్వెడు బియ్యం కడుగు!” బంగారమ్మగారు చిరంజీవి మాటకి విలువిచ్చి పనిమనిషికి పురమాయించారు.
చుట్టాలొచ్చారంటే భలే సరదా చిరంజీవికి. వుట్టి చేతులతో కాకుండా వస్తా వస్తా ఏదో మిఠాయి పొట్లాం తెచ్చి చేతిలో పెడతారు.
ఇప్పుడు చుట్టాలొస్తే ఎవరొస్తారంటావు? కత్తిపూడి నుంచి తాతయ్యా? రాచపల్లి నుంచి హరిగాడా? భూపాలపట్నం నుంచి పెద్దమ్మమ్మా? ఇలా పరిపరివిధాల ఆలోచిస్తున్న వాడు, రామచంద్రపురం నుంచి వెంకన్నయ్యొస్తే బాగున్ను అనుకున్నాడు.
వెంకన్నయ్యొస్తే, పొట్లాలతోపాటూ బోలెడు పుస్తకాలు తెస్తాడు. అదీ వాడి ఆశ. కానీ వెంకన్నయ్య చుట్టం కాదే! ఇంట్లో వాళ్ళు కూడా చాలాకాలం తర్వాత వస్తే చుట్టాలకిందే లెక్క, అని సరిపెట్టేసుకోవడమే కాకుండా వచ్చేది వెంకన్నయ్యేనని గట్టిగా తీర్మానించేసుకున్నాడు కూడా.
“వెంకన్నయ్యొస్తున్నాడు. చిట్టొడియాలూ కోడిగ్రుడ్లూ కూరొండండి. నేనలా తోట చివరకెళ్ళి ములక్కాడలు కోసుకొస్తాను,” చెప్పేడు చిరంజీవి పుస్తకం మూసేసి.
“అలాగని నీకుత్తరం రాసి పడేశాడా? నీకు తినాలనుందని చెప్పొచ్చుగా పోరంబోకని
“ఉట్టిదయితే చూడండి” అని చెప్పి తోటలోకి పోయాడు వాడు.
“సరే. నువ్వు చెట్టెక్కకు. ములగ చెట్టసలే అల్పం, ఉట్టినే విరిగిపోద్ది!” వెనకనుంచి హెచ్చరించారు బంగారమ్మగారు.
కోసుకొచ్చిన ములక్కాడలు వంటపాకలో పడేసిన చిరంజీవి, అబ్బడంగా ఏరుకొచ్చిన తాటిపువ్వారాన్ని మాత్రం వసారాగదిలోకి పట్టుకుపోయాడు. బల్లమీదున్న పిల్లంక పెట్టెల్లోంచి పుస్తకాలని ఒబ్బిడిగా తీసి, ఏ రకానికారకం పొందికగా పేర్చాడు. అవి వాడి క్లాసు పుస్తకాలు కాదు. వెంకన్నయ్య ఊరినుంచి వచ్చినప్పుడల్లా ఇక్కడి వాళ్ళ కాలక్షేపం కోసం తెచ్చిపడేసిన పుస్తకాలు. సినిమారంగం, విజయచిత్ర లాంటి సినిమా పత్రిలతోపాటూ రకరకాల వార, పక్ష, మాస పత్రికలు, కథలు, కవిత్వం, నవలల కలగాపులగం. ఎక్కువగా కొమ్మూరి, కృష్ణమోహన్, టెంపోరావు, భయంకర్, కొవ్వలి, జంపన, గిరిజశ్రీభగవాన్ వంటి వారి డిటెక్టివ్ నవలలే. అన్నిటికీ మించి వాడికిష్టమైన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటివి వందా నూటేభై దాకా వున్నాయి. అన్నిటినీ ఓపిగ్గా తెరచి, అందులో వున్న నెమలి ఫింఛాలకి తాటిపువ్వారాన్ని ప్రేమగా వడ్డించాడు. నెమలి ఫింఛాలేమన్నా పిల్లలని పెట్టాయేమోనని ఆసక్తిగా పరిశీలించి, ఒక పిల్లా పుట్టకపోవడంతో నిరాశతో పుస్తకాలన్నీ మళ్ళీ పెట్టెల్లో సర్దేశాడు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడే ఆ చివర్నుంచి ఈ చివరికి వాడెప్పుడో చదివేశాడు.
జాడీల్లోవున్న ఆవకాయ తీయటానికి ఆ గదిలోకి గిన్నెపట్టుకొని వచ్చిన బంగారమ్మగారు, “ఆ పుస్తకాలన్నీ నియ్యేనేట్రా?” అని ఆశ్చర్యంగా అడిగారు, జాడీకి కట్టున్న గుడ్డని విప్పుతూ.
“నాయీ పూర్ణయ్యీ రామన్నయ్యీ వెంకన్నయ్యీ నర్సిమూర్తియ్యీ, అందరియ్యీని. రెండో మూడో మియ్యి కూడా వున్నాయి లెండి. కార్తీకపురాణం, లలితాసహస్రనామం లాటియ్యి.”
“ఊఁహూఁ. ఎలకలు కొట్టేస్తా ఎక్కడపడితే అక్కడే దొళ్ళీయి. ఏమయిపోయాయా అనుకున్నాను. పెట్టెల్లో పదిలంగానే దాచేవురా ఎదవ సన్నాసని!” అభినందనగా అన్నారావిడ.
ఇంతలోకీ, వీధిలోంచి “సిరంజిబారు, ఆ జగజ్జాన్నిలా పట్రండే మతోగొట్టేత్తంది!” అరిచాడు బొంతు సూరిగాడు.
అది పట్టుకొని సూరిగాడితో పాటూ లంకలోకి పోయిన చిరంజీవికి వెంకన్నయ్య ఇంటికి రావడం తెలియదు.
పొద్దోయాకా ఇంటికొచ్చిన చిరంజీవికి వాకిట్లో కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుబ్బన్నయ్య, రామన్నయ్య, వెంకన్నయ్యలు కనిపించారు. వెంకన్నయ్యనీ వెంకన్నయ్య ఎప్పట్లాగే తెచ్చిన పుస్తకాలనీ చూసి ఎగిరి గంతేశాడు.
అందరి మాటల మధ్యా రాంపురం రాజగోపాల్ థియేటర్లో వర్ధమాన నటుడు చిరంజీవి నటించిన మనవూరిపాండవులు సినిమా ఆడుతోందని తెలిసి, మర్నాడు వెంకన్నయ్య కూడా రామచంద్రపురం బయలుదేరి పోవటానికి బట్టలు సర్దేసుకున్నాడు.
ఆ ప్రయాణం తనకి అంతులేని వేదనని మిగులుస్తుందని, ఆ క్షణం వాడికి తెలియదు.
అదే కనుక తెలిస్తే ఈ కథే వుండేదికాదు. అవును. నిజంగాన్నిజ్జం!
బంగారమ్మగారి ఆదేశాల మేరకి ఉదయం ఆరుగంటలకే జానకమ్మ, ఇంకో మనిషిని తోడు తీసుకొని వచ్చేసింది. గత రాత్రే పంచలో వున్న చింతపిక్కల బస్తా విప్పి వాటిని నీటిలో నానబెట్టేశారు. జానకమ్మా దాని అసిస్టెంటూ కలిసి, బంగారమ్మగారు చూపించిన పిల్లంక పెట్టెల్లోని పుస్తకాలన్నీ తీసి, వాటిని ఏ పేజీకి ఆ పేజీ పీకి పాకంపెట్టి పిన్నులన్నీ ఏరిపారేశారు.
ఆ పుస్తకాల్లో కనపడ్డ కార్తీకపురాణం, లలితా విష్ణు సహస్రనామాలని తీసుకొని బంగారమ్మగారు భద్రపరుచుకున్నారు.
“అట్టలన్నీ తీసి పక్కన పెట్టండే” బంగారమ్మగారు డైరెక్షన్ ఇచ్చారు.
రంగురంగుల అట్టలని పక్కన పెట్టి, ఇద్దరూ కాగితాలని ఖండ ఖండాలుగా చేసేసి రెండు బకెట్లలో నానబెట్టేశారు. ఇద్దరూ చెరో రుబ్బురోలు దగ్గరికీ పోయి ఒకళ్ళు కాగితం ముక్కలనీ, ఇంకొకళ్లు చింతపిక్కలనీ శుభ్రంగా రుబ్బి పారేశారు. బంగారమ్మగారు వంటపనిలో మునిగి తేలుతూ, మధ్యమధ్యలో వాళ్ళని అజమాయిషీ చేస్తూ, వాయకోసారి ఆ రోట్లో గుప్పెడూ ఈ రోట్లో గుప్పెడూ మెంతులు వేస్తూ వచ్చిన జిగురుని పరీక్షిస్తున్నారు. విడివిడిగా రుబ్బుడు పని ముగిశాక ఆ రెండు ముద్దలనీ కలిపి, చెరో రోట్లోనూ వేసి ఇంకోసారి కసాపిసా రాచిరంపాన పెట్టేశారు.
“హమ్మయ్య, సగం పనైపోయింది!” హాయిగా ఊపిరి పీల్చుకున్న బంగారమ్మగారు, కాసేపు వాళ్ళకి విరామం ప్రసాదించారు.
నాలుగేసి రొట్టిముక్కలు తేనెపాకంలో ముంచుకొని ముగ్గురూ దొబ్బి తినేశారు. తీపి ఇరగడానికి ఒకో మాగాయ పెచ్చు నమిలేసి, కాసిన్ని టీ నీళ్లతో వేడివేడిగా గొంతు తడుపుకొని, కొత్త శక్తిని పుంజుకొని రెండో అంకానికి తెరలేపారు.
ఓ బిందెని బోర్లించి, దాని చుట్టూ చింతపిక్కా కాగితంముక్కా మెంతుల మిశ్రమాన్ని అమరశిల్పి జక్కమ్మల్లాగా దట్టంగా మెత్తడం మొదలుపెట్టారు.
అదయ్యాకా, ఓ బుట్టకీ ఇంకో తట్టకీ మరో కూర దాకకీ మొత్తం మెత్తేసి, నకళ్ళు తీసేసి, వాటిని ఎండలో ఆరబెట్టేశారు. అసలే రోహిణి కార్తె ఎండలవడంతో మెంతి బుట్టలు వెంటవెంటనే ఆరడం మొదలెట్టాయి.
“అమ్మగారు, మరా అట్ట కాయింతాలేం చేద్దావండే” అడిగింది జానకమ్మ.
“ఓ సోలడు చింతపిక్కలు, గిద్దడు మెంతులూ ఏసి మెత్తగా రుబ్బెయ్యి. సిరంజీబాబు కనికిలూ పెన్నులూ పెట్టుకోడానికి చిన్న బుట్టేసి పారేద్దాం. సంబరపడతాడు ఎర్రెధవ.”
ఆ పాళ్ళు రడీ అయ్యేటప్పటికి బంగారమ్మగారు లోపలనుంచి ఓ మరచెంబు తెచ్చి సిద్దంగా వుంచారు.
అసలే ఆ అట్టలు త్రివర్ణ వర్ణ చిత్రాలేమో, ఆ మిశ్రమం కూడా వింత వర్ణంతో దిగింది. దానితో మెంతి మరచెంబు కడు సుందరంగా ముస్తాబయ్యింది.
“హమ్మయ్య తొందరగానే తెమిలిపోయిందే పని. చేతులు కడుక్కుని రండి. భోజనాలు చేసి కాస్సేపు నడుంవాలుద్దురుగాని.” అలసిన ఆ ఇద్దరు కళాకారిణుల మీదా కరుణ చూపించారు బంగారమ్మగారు.
రెండురోజులు తిరిగేసరికి, మెంతిబుట్టలు దట్టంగానూ దిట్టంగానూ బంగారురంగులో మెరిసిపోతూ వాటికవే ఊడొచ్చేశాయి.
వారంరోజులపాటూ రామచంద్రపురాన్ని ఉద్ధరించిన చిరంజీవి, వన్ ఫైన్ మార్నింగ్ ఊరిలోకి దిగాడు. ఇంటికి వస్తూ వస్తూ దారిలోనే కాస్త తాటిపువ్వారం ఏరుకొచ్చి, సరాసరి వసారాగది లోకి పోయాడు. విచిత్రమైన కంపేదో ముక్కుని పలకరించింది. అదేమీ పట్టించుకోకుండా, పిల్లంకపెట్టి తెరిచి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆందోళనగా ఇంకో పెట్టీ ఇంకోపెట్టీ తెరిచి కొయ్యబారిపోయాడు. గుండె ఆగినంత పనయ్యింది. పుస్తకం కాదు కదా! చిన్నకాగితం ముక్కకూడా కనిపించకపోవడంతో కాళ్ళకింద భూమి కృంగినట్టూ, ఆకాశం విరిగి మీదపడినట్టూ తల్లడిల్లాడు. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వాడి నోటినుంచి అమ్మమ్మా!! అన్న ఓ ఆక్రందన వెలువడింది. అది తోటంతా ప్రకంపించింది.
“తుళ్లిపడ్డాను! ఆ కేకలేంటి? తేలేమన్నా కుట్టిందా?” అంటూ అక్కడకి వచ్చారు బంగారమ్మగారు.
“నా పుస్తకాలేం అయ్యాయి?” పాపం ఏడుపొక్కటే తక్కువ వాడికి.
“అయ్యా! వాటితో ఇంచక్కా కాగితం బుట్టలేయించాను. ఇక్కడే వున్నాయి. చూడెంతందంగా వున్నాయో!” సంబరంగా చెప్పారు.
ఆ బుట్టలని చూసిన వాడు నిలువునా నీరయిపోయాడు. ఒకవేళ ఎక్కడన్నా పెట్టారేమో? ఆప్యాయంగా కళ్ళారా చూసుకుందామన్న వాడిలోని ఆశ ఆవిరైపోయింది.
“ఎదవ కంపూ ఇయ్యీ వీటికోసం బంగారం లాంటి నా పుస్తకాలు నాశనం చేస్తారా? నాకు నా పుస్తకాలు కావాలి. ఏంజేత్తారో నాకనవసరం.”
కోపంతో చిరంజీవి మొహం కందగడ్డలా మారింది. కాలితో విసురుగా ఆ బుట్టలని ఒక్క తన్ను తన్నాడు. ఓ మూలకెళ్ళి పడిందోబుట్ట. వాడికంత కోపం వస్తుందని బంగారమ్మగారు అస్సలు ఊహించలేదు. ఎలా అనునయించాలో తెలీక నోటమాటరాక నిలబడిపోయారు. వాడి ఆవేదనని గ్రహించి అక్కడనుంచి మెల్లగా నిష్క్రమించారు.
కాస్సేపటికి కొంచెం తెప్పరిల్లిన చిరంజీవి, ఆ బుట్టలని ఓసారి చేత్తో తడిమి చూసుకున్నాడు. వీటిలో కొమ్మూరి ఎక్కడున్నారో? కొవ్వలి ఎక్కడున్నారో? చలం ఎక్కడ? చాసో ఎక్కడ? శ్రీశ్రీ ఎక్కడ? ఎంతోమంది నేరస్తులని ఒంటి చేత్తో మట్టికరిపించిన ఆ డిటెక్టివ్ యుగంధర్ రుబ్బురోట్లో నలిగిపోతుంటే పాపం ఎంత యమయాతన పడ్డాడో! అయ్యో అయ్యో ఆ క్రిజ్లర్ కారు ఎలా పచ్చడయిపోయిందో! విక్రమార్కుడి భుజంమీది ఆ భేతాళుడన్నా చెట్టెక్కి తప్పించుకున్నాడా! లేకపోతే వాడూ రోట్లో పడి పచ్చడయిపోయేడా! ఇలా ప్రతి రచయితనీ ప్రతి పాత్రనీ తలుచుకొని తలుచుకొని కాస్సేపు కుమిలిపోయాడు. మంచం మీదపడి వెక్కి వెక్కి ఏడ్చాడు.
“అదీ జరిగింది.” చెప్పింది ప్రశంస.
విన్న నా హృదయం బరువెక్కింది. ‘అది’ నా కంటికి నిజంగానే ఓ అద్భుతంలా కనిపించింది.
“కాకి భాషని కూడా కంఠతాపట్టిన అంకుల్, అమ్మమ్మ ఆలోచనలని పసిగట్టలేకపోవడం చాలా పిటీ కదా! తర్వాతేమయ్యింది?” ఆత్రంగా అడిగాను.
“ఏమవుతుంది? కాలమే అన్ని గాయాలనీ మానిపింది. ఒకట్రెండురోజులు విలపించి విలపించి తైలవర్ణ చిత్రాలతో తనకోసం కళాత్మకంగా తయారైన ఈ మెంతి మరచెంబులో ఆ రచయితలనీ ఆ పాత్రలనీ ఆ సాహిత్యాన్నీ చూసుకుంటూ గుండెని బండ చేసుకొన్నారు. ఆ తర్వాత మెంతి బుట్టతోపాటూ హైకాలేజ్లో చేరడానికి ఇంకో ఊరు వెళ్లిపోయారు.” చెప్పిన ప్రశంస మరో వైపు తిరిగింది.
అదే అదనుగా నేను వెంటనే ‘దాన్ని’, అదే ఆ మెంతిబుట్టని, గుట్టు చప్పుడు కాకుండా నా షోల్డర్ బ్యాగ్‌లోకి తోసేశాను. అంతా నన్ను దొంగముండ అని అనుకుంటే అనుకోనీ అంతగా తెచ్చిమ్మని అడిగితే, అప్పుడు చూసుకుందాంలే అనుకున్నా.
ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ జ్ఞాపిక! ప్రశంస వాళ్ళ డాడీ పేరేమో చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు. పెద్ద పేరున్న రచయిత! కావాలంటే ఆ పేరులో వున్న అక్షరాలు లెక్కేసుకోండి. ఏకంగా ఇరవై ఒక్కటి!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#13
క్రూర మృగాలు
ఆదోని బాషా
‘‘మేడమ్‌, ఇక్కడి నుంచి దట్టమైన అరణ్యం మొదలవుతుంది. అడవిలో క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరుగాడుతుంటాయి. ఇంకా ముందుకెళ్ళటం ప్రమాదం’’ రీటాని హెచ్చరించాడు గైడ్‌. ఆ మాటల్ని పట్టించుకోకుండా టాప్‌ లేని ఆ జీపులో నిల్చుని బైనాక్యులర్స్‌తో అడవిని వీక్షిస్తోంది రీటా.మనోహర దృశ్యమది! ఆకాశాన్ని కమ్మేసినట్టు ఎత్తయిన వృక్షాలు, భూమిని కప్పేస్తూ అల్లుకు పోయిన తీగలు - ఎటు చూసినా పచ్చదనంతో సృష్టికర్త గీసిన పెయింటింగ్‌లా వుందది. చెట్లపై కిలకిల రావాలతో స్వాగతం పలుకుతున్న వివిధ రకాల పక్షుల్ని చూసి రీటాలో ఉత్సాహం వురకలేసింది.‘‘ఎస్‌. నేను వెదుకుతున్న అడవి ఇదే! నాక్కావల్సిన పక్షి, కీటక జాతులు ఇక్కడ కన్పించే అవకాశముంది. ఇంకాస్త ముందుకెళతావా?’’ రీటా మాటలు విన్న డ్రైవర్‌ ఆమెను ఎగాదిగా చూశాడు.‘‘మేడమ్‌, ముందు దారి లేదు. బలవంతంగా వెళితే చెట్లమధ్య ఇరుక్కుపోతాం. అప్పుడు వాపసు వెళ్ళటానికి జీపు తిప్పుకోవాలన్నా సాధ్యం కాదు’’ అన్నాడు. డ్రైవర్‌ చెప్పింది నిజమే! అడవి లోపలికి మనుషులు వెళ్ళగలిగే స్థలం కూడా లేదు. జీపు ఎలా వెళ్ళగలదు?‘‘ఓ.కె. మీరిక్కడే వుండండి. నేను అడవిలో కెళ్ళి నా పని చేసుకొస్తాను. సాయంత్రం కల్లా తిరిగొస్తాను’’ అంటూ రెండు బ్యాగుల్ని తీసుకుని జీపు దిగింది రీటా. జీపు డ్రైవర్‌, గైడ్‌ ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు ఆశ్చర్యంగా చూశారు.‘‘మేడమ్‌, ఈ అడవిలోకి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అడవిలో అడుగు పెట్టగానే మీరు తప్పిపోతారు. అడవిలో దారి అంటూ వుండదు.
ఎక్కడ చూసినా చెట్లే కన్పిస్తాయి. దాంతో మీరు వెళ్ళిన దారిలోనే వెళుతూ అక్కడే తిరుగుతూ ఉండిపోతారు. ఈ అడవి క్రూరమృగాలకు నిలయం. ఒంటరి మనిషిని చూడగానే అవి దాడి చేస్తాయి. పైగా అడవుల్లో హఠాత్తుగా వర్షం కురుస్తుంది. కుంభవృష్టి కురిస్తే మీకు తల దాచుకునే చోటు కూడా దొరకదు. ఇక్కడ సెల్‌ఫోన్లు కూడా పని చెయ్యవు’’ గైడ్‌ రీటాకి వివరంగా చెప్పాడు.‘‘థ్యాంక్స్‌ ఫర్‌ యువర్‌ కైండ్‌ ఇన్ఫర్మేషన్‌. ఇంతకన్నా ప్రమాదకరమైన ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లో రీసెర్చి చేసిన అనుభవం నాకుంది. నేను పుట్టి పెరిగిందే అమేజాన్‌ అడవుల్లో. నా బాల్యమంతా జంతువుల సహవాసంలోనే గడిచింది. కాబట్టి మీరు నా గురించి బెంగపడొద్దు. నేను అడవిలోంచి తిరిగొస్తాను. ఒక వేళ చీకటి పడేలోగా నేను రాకపోతే మీరు వాపసు వెళ్ళిపోండి’’ అంటూ రీటా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి బ్యాగులు మోసుకుని అడవిలోకి దూరి క్షణాల్లో మాయమైంది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ వారిద్దరూ నిశ్చేష్ఠులై పోయారు. అప్పుడు సమయం ఉదయం పది కావస్తోంది.
రీటాకి పాతికేళ్ళుంటాయి. తల్లి బ్రెజిలియన్‌. తండ్రి ఇండియన్‌. యూరప్‌లో చదువుకుంది. ఆమెకు బాల్యంనుంచీ అడవులన్నా, వన్య మృగాలన్నా ఇష్టం. అందుకే ఆమె చదువంతా బయాలజీలోనే కొనసాగింది. పి.జి అయ్యాక జీవ వైవిధ్యంపై రీసెర్చి చేస్తూ ప్రపంచంలోని పలురకాల అడవుల్లో గల జంతుజాలంపై పరిశోధనలు సాగిస్తోంది. శీతల, సమశీతోష్ణ, ఉష్ణమండల అడవుల తర్వాత రుతుపవన అడవుల రీసెర్చి కోసం తండ్రి జన్మస్థానమైన ఇండియా కొచ్చింది. తూర్పు కనుమల్లోని దండకారణ్యాన్ని తన పరిశోధనకు అనువైన ప్రదేశంగా ఎన్నుకుంది. ఆమెకు తోడుగా ఆమె కజిన్‌ రాబర్ట్‌ కూడా ఇండియాకి వచ్చాడు. కాని రెండ్రోజులుగా అతను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. అందువల్ల రీటా వెంట రాలేకపోయాడు. చివరికి ఆమె ఒంటరిగానే అడవిలోకి అడుగు పెట్టింది.రీటా భుజాలకు వేలాడుతున్న రెండు బ్యాగుల్లో ఒకదాంట్లో ఆమెకు అడవిలో ఉపయోగపడే పలురకాల వస్తువులున్నాయి. రెండో బ్యాగులో ఆమె రీసెర్చికి అవసరమైన కెమెరా, ల్యాప్‌టాప్‌, కంపాస్‌ తదితర పరికరాలున్నాయి. అడవిలోకి ప్రవేశించగానే ఆమె బ్యాగులోంచి ఒక పరికరం తీసింది. బటన్‌ ఎత్తగానే ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్కర్లను అతికించే పరికరమది. ఆ స్టిక్కర్లపై రేడియం పూతతో సీరియల్‌ నంబర్లు ముద్రించి వుంటాయి.
రీటా తను నడుస్తున్న మార్గంలో ప్రధానమైన చెట్ల కాండాలకు ఆ స్టిక్కర్లను అతికిస్తూ ముందుకు సాగుతోంది. తిరిగొచ్చేటప్పుడు ఇవే స్టిక్కర్లు అడవిలోంచి బయటపడే మార్గం చూపిస్తాయి. ఒకవేళ చీకటిగా వుంటే టార్చి వేస్తే రేడియం పూత వల్ల అవి మెరుస్తాయి.స్టిక్కర్ల ధ్యాసలో పడి రీటా నేలపై ఆకుల కింద దాగివున్న ఓ పాము తోకని తొక్కేసింది. ఆ పాము బుస్సుమంటూ లేచి ఆమె పాదాన్ని కరిచి పారిపోయింది. అయితే రీటా మోకాళ్ళ వరకూ రక్షణ నిచ్చే జంగిల్‌ షూస్‌ ధరించి వుండటంతో ఆమెకేం కాలేదు. ఇలా మరోసారి జరక్కూడదని ఆమె బ్యాగులోంచి ఓ వస్తువుని బయటకు తీసింది. జానెడు పొడవున్న ఫోల్డింగ్‌ స్టిక్‌ అది. దాని లాక్‌ తియ్యగానే అది నాలుగడుగుల వాకింగ్‌ స్టిక్‌లా మారిపోయింది. దానితో నేలపై చప్పుడు చేస్తూ ముందుకు సాగింది.సుమారు మూడు గంటల అన్వేషణ తర్వాత రీటా వెదుకుతున్న అరుదైన పక్షి ఆమె కంటపడింది. ఇంతకుముందు ఇలాంటి పక్షిని ఆమె అమేజాన్‌ అడవుల్లో మాత్రమే చూసింది. దాంతో ఇది అంతరిస్తున్న జాతి పక్షిగా భావించింది. ఇప్పుడది భారత అడవుల్లో కన్పించటంతో ఆమెకెంతో ఆనందం కలిగింది. ఆ పక్షిని పలుకోణాల్లో ఫొటోలు తీసి ముందుకు కదిలింది. మరో చోట ఇంకో అరుదైన పక్షి కన్పించింది. తర్వాత రెండు కొత్తజాతి కీటకాలు దర్శనమిచ్చాయి. వాటిని ఆమె ఇంకెక్కడా చూడలేదు. ఆమె ఉత్సాహంగా వాటన్నిటి ఫొటోలు తీసి ల్యాప్‌ట్యాప్‌లో వివరాలు నమోదు చేసింది.
అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయాక ఇక వెనుదిరగాలనుకుంది. ఆకలిగా వుంటే ఓ చెట్టు కింద కూర్చుని బ్యాగులోంచి డ్రై ఫ్రూట్స్‌ తీసి తిని మినరల్‌ వాటర్‌ తాగింది. అంతలో చెట్టు వెనక నుంచి ఓ నల్లటి ఆకారం తనని గమనించటం చూసింది. నిప్పురవ్వల్లాంటి దాని కళ్ళను చూడగానే అది ఎలుగుబంటి అని ఇట్టే పసిగట్టింది. రీటా బెదరలేదు. ఎలుగుబంట్లని చూడ్డం ఆమెకిదే కొత్త కాదు. తెల్లటి ధృవపు ఎలుగుబంట్లు, గోధుమరంగులో వుండే అలస్కా ఎలుగుబంట్లని దగ్గరినుంచి చూసిన అనుభవముంది. అయితే నల్ల ఎలుగుబంటి కళ్ళని చూడగానే అది బాగా ఆకలిమీద వుందని అర్థమైంది. ఈ స్థితిలో అది తనపై దాడి చేసే అవకాశం ఉండటంతో వెంటనే బ్యాగుల్ని తీసుకుని అక్కడ్నుంచి కదిలింది. ఎలుగుబంటి ఆమె వెంటపడింది.రీటా భయంతో పారిపోలేదు. అలా చేస్తే అది మరింత ధైర్యంగా దాడి చేస్తుంది. తన ప్రత్యర్థి బలశాలి అనీ, ఎదురుదాడి చెయ్యగలదనీ దాన్ని నమ్మించాలి. అప్పుడది వెనక్కి తగ్గుతుంది. రీటా ఇదే సూత్రం పాటిస్తూ గట్టిగా అరిచి ఎదురుదాడి చేస్తున్నట్టు నటించింది. ఎలుగుబంటి ఒక్క క్షణం వెనకడుగు వేసింది. తర్వాత హఠాత్తుగా రీటాపైకి దూసుకొచ్చింది. అందుకు సిద్ధంగా వున్న రీటా మెరుపులా పక్కకి జరిగి చేతిలోని బ్యాగుతో దాని మూతిపై గట్టిగా బాదింది. అది తేరుకునేలోగా బ్యాగులోంచి ఓ బాటిల్‌ తీసి ఎలుగుబంటి మూతిపై పడేలా స్ర్పే చేసింది. దానివల్ల కళ్ళు మండటంతో ఎలుగుబంటి కీచుగా అరుస్తూ చిందులేసింది. దాని శరీరం తగిలి రీటా చేతిలోని బాటిల్‌ ఎక్కడో పడిపోయింది.
ఆ కెమికల్‌ ప్రభావం తగ్గేలోగా ఎలుగుబంటికి దూరంగా వెళ్ళిపోవాలని రీటా వెంటనే పరుగు లంకించుకుంది. కాస్సేపు పరిగెత్తాక ఆమెకు స్టిక్కర్ల సంగతి గుర్తుకొచ్చింది. తను స్టిక్కర్లు అంటించిన చెట్లకు దూరంగా వచ్చేసిందని ఆమెకు అర్థమైంది. ఇప్పుడీ అడవిలో తానొచ్చిన దారి వెతుక్కోవటమంటే గడ్డి వాములో సూదిని వెదకటం లాంటిదే. స్టిక్కర్‌ వేసిన ఒక్క చెట్టు కనపడినా చాలు దాని సీరియల్‌ నంబర్‌ని బట్టి దారి కనుక్కోవచ్చు. కాని వేల సంఖ్యలో వున్న చెట్ల మధ్య స్టిక్కర్‌ వేసిన చెట్టు కన్పిస్తుందన్న నమ్మకం లేదు. దాన్ని వెతకటం కన్నా వేరే మార్గంలో అడవినుంచి బయటపడే ప్రయత్నం చెయ్యటం మేలనుకుంది రీటా.అప్పుడే తన భుజం దగ్గర మంటగా అన్పించి చేత్తో తడిమి చూసింది. ఎలుగుబంటి దాడి చేసినప్పుడు దాని గోళ్ళు తగిలి భుజం మీది చర్మం గీరుకుపోయింది. ఆమె వెంటనే తన బ్యాగులోంచి మెడికల్‌ కిట్‌ తీసి గాయాలకు మందు పూసి టేప్‌ అతికించింది. యాంటీ సెప్టిక్‌ మాత్రలు వేసుకొని మళ్ళీ నడక మొదలెట్టింది.
్‌్‌్‌రీటా సాయంత్రం వరకూ నడిచినా అడవినుంచి బయటపడలేదు. బయల్దేరిన చోటికే తిరిగి వస్తున్నట్టనిపించింది. ఇక ఆ రాత్రి అడవిలోనే గడపక తప్పదనుకుంది.చీకటి పడకముందే అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలి. అడవిలో త్వరగా చీకటి పడుతుంది. అందుక్కారణం ఆకాశం కనపడకుండా దట్టంగా చెట్లు ఉండటమే. చీకటి పడగానే క్రూరమృగాలు వేటకు బయల్దేరతాయి. విష సర్పాలు, పురుగు, పుట్ర స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయి. వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది.వీటన్నిటి నుంచీ రక్షణ నిచ్చే వస్తువును తన బ్యాగుంలోంచి బయటికి తీసింది రీటా. ఓ ఇటుక అంత చిన్నగా మడిచి ఉన్న ఓ ప్లాస్టిక్‌ గుడారమది. దీనికున్న పైపులోకి గాలి వూదితే పది నిమిషాల్లో ఓ మనిషికి సరిపోయే చిన్న గుడారంగా మారుతుంది. కింది భాగం మెత్తటి పరుపులా వుంటుంది. దీనికి నాలుగువైపులా ఉండే ట్వైన్‌ దారాలతో దీన్ని కదలకుండా చెట్లకు కట్టొచ్చు. లోపలికి దూరి దీని జిప్‌ వేసేస్తే పురుగు పుట్రా లోపలికొచ్చే అవకాశమే ఉండదు. గాలి ఆడటానికి చిన్న చిన్న రంధ్రాలుంటాయి.రీటా అడవిలో రెండు చెట్ల మధ్య ఎత్తుగా వున్న ఓ ప్రదేశం చూసి ఈ గుడారం వేసింది. మరోసారి డ్రైఫ్రూట్స్‌తో కడుపు నింపుకుని బ్యాగులతో సహా టెంట్‌లోకి దూరి నిద్రకు ఉపక్రమించింది. తీవ్రమైన అలసట వల్ల పడుకోగానే ఆమెకు నిద్ర పట్టింది.అర్థరాత్రి వేళ హఠాత్తుగా మేల్కొంది. ఉరుములు, మెరుపులతో కుండపోత కురుస్తోంది. టార్చి వెలిగించి చూసింది. టెంట్‌కి అటుపక్క వర్షపు నీళ్ళు వరదలా పారుతున్నాయి. టెంట్‌ మిట్ట మీద కాకుండా పల్లంలో వేసి వుంటే ఈపాటికి వరదలో కొట్టుకు పోయేది.
అంతలో అనూహ్యంగా ఆమె పక్కన గల చెట్టుపై పిడుగు పడి చెట్టుకి నిప్పంటుకుంది. ఆ వేడికి గుడారం మైనంలా కరిగిపోయింది. క్షణాల్లో రీటా తడిసి ముద్దయింది.అదృష్టవశాత్తూ కాస్సేపట్లోనే వర్షం ఆగిపోయింది. అయితే ఓ పక్క చలి, మరో పక్క పురుగు పుట్రా రీటాని రాత్రంతా ఇబ్బంది పెట్టాయి. తెల్లవారగానే తడి బట్టలు విప్పేసి బ్యాగులోని పొడి బట్టల్ని ధరించింది, ఆకలేస్తుంటే మిగిలిన డ్రైఫ్రూట్స్‌ తినేసి బయల్దేరింది. దారిలో చూస్కోకుండా ఓ చెట్టు కొమ్మను తాకటంతో దానిపై చుట్ట చుట్టుకొని వున్న నాగుపాము కాటేసింది. నొప్పి తాళలేక చెయ్యి పట్టుకుని వున్నచోటనే కూలబడింది. వెంటనే మెడికల్‌ కిట్‌ తీసి యాంటీ వీనమ్‌ మందుని బాడీలోకి ఇంజెక్ట్‌ చేసుకుంది. కాస్సేపటి తర్వాత నొప్పి తగ్గింది. మెల్లగా లేచి నడక మొదలెట్టింది.ఆకలేస్తే తినటానికి తిండి లేదు. చీకటి పడితే పడుకోవటానికి టెంట్‌ లేదు. అందువల్ల ఎలాగైనా ఆ రోజు అడవిలోంచి బయటపడాలనుకుంది. కాని సాయంత్రం వరకూ నడిచినా నిరాశే మిగిలింది. ఇక మరోరాత్రి అడవిలోనే గడపక తప్పదనిపించింది రీటాకి.
ఆకలికి తట్టుకోలేక ఓ చెట్టుకు కాసిన అడవి పళ్ళు భుజించింది. అవి చేదుగా వున్నా ఎలాగోలా కడుపు నిండింది. ఓ సెలయేటి నీళ్ళు తాగింది. చీకటి పడేలోగా పడుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంది. బ్యాగులో వున్న కత్తితో చిన్న చెట్ల కొమ్మలు నరికి ఓ మిట్టమీద చిన్న గుడిసె లాంటిది కట్టుకుంది. వర్షపు నీరు కిందికి జారిపోయేలా పైభాగాన్ని ఆకులతో కప్పేసింది. జంతువులు, పురుగు పుట్రా దగ్గరికి రాకుండా, గుడిసె ముందు ఎండు కట్టెలతో మంట వేసింది. మంట మండుతుంటే ధైర్యంగా గుడిసెలో నడుం వాల్చింది.అర్థరాత్రి తర్వాత వర్షం పడటం వల్ల రీటా మేల్కొంది. మంట ఆరిపోయింది. వర్షం ఆగాక ఆమె మళ్ళీ మంట పెట్టాలని బయటికి రాబోయి హఠాత్తుగా ఆగిపోయింది. ఎవరో మెల్లగా అడుగులేస్తూ గుడిసెను సమీపిస్తున్నారు. ఆమె గుండె దడదడలాడింది. గుడిసెలోంచి తొంగి చూసింది. చీకట్లో రెండు కళ్ళు మెరిశాయి. ఆ కళ్ళు చిరుతపులివని ఇట్టే గ్రహించింది. వెంటనే టార్చి అందుకుని వెలిగించింది. హఠాత్తుగా వెలుతురు చూసిన చిరుత ఓ అడుగు వెనక్కేసింది. తన పాచిక పారినందుకు సంతోషిస్తూ రీటా వెలుతురు సూటిగా చిరుత కళ్ళపై పడేలా టార్చిని పట్టుకుంది. అడవి జంతువులు సామాన్యంగా రాత్రిపూట వెలుతురు చూసి భయపడతాయి. ఇప్పుడూ అదే జరిగింది. చిరుత దూరంగా వెళ్ళిపోయింది. కాని టార్చి ఆర్పేస్తే అది మళ్ళీ వస్తుందని రీటాకి తెలుసు. అందువల్ల మళ్ళీ మంట పెట్టాలనుకుంది. కాని కట్టెలు బాగా తడిసి పోవటం వల్ల లైటర్‌తో మండించినా అంటుకోలేదు.
రీటా గత్యంతరం లేక టార్చిని అలాగే ఉంచింది.ఓ గంట తర్వాత బ్యాటరీ డౌన్‌ కావటంతో టార్చి ఆరిపోయింది. కాస్సేపటి తర్వాత చిరుత మళ్ళీ వచ్చింది. రీటాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అంతలోనే ఆమె తలలో ఫ్లాష్‌ వెలిగింది. వెంటనే కెమెరా తీసుకుని చిరుతపై ఫోకస్‌ చేసి చకచకా క్లిక్‌ చెయ్యసాగింది. జిగేల్మంటున్న ఫ్లాష్‌ కె మెరా మెరుపులకి బెదిరిన చిరుత అక్కడినుంచి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగిరాలేదు. రీటా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అయినా ఆ రాత్రి మళ్ళీ పడుకోలేదు.తెల్లవారక ముందే మరో ఆపద ముంచుకొచ్చింది. దగ్గిర్లోంచి పులి గాండ్రింపు వినపడింది. దాంతో అడవిలో కలకలం రేగింది. ఒక్కసారిగా జంతువులన్నీ చెరో దిక్కుకు పరుగెత్తసాగాయి. పులి తను వున్న వైపే వస్తోందని రీటాకి అర్థమైంది. ఒక్కక్షణం ఆలస్యం చెయ్యకుండా అన్నీ వదిలేసి తనూ ఓ జంతువులా చీకట్లో గుడ్డిగా పరుగు దీసింది. దాంతో కాళ్ళకు తీగలు అడ్డుపడటంతో నేలపై పడిపోయింది. అక్కడ భూమి ఏటవాలుగా వుండటంతో దొర్లుకుంటూ ఓ లోయలోకి జారిపోయింది. భయంతో ఆమెకు స్పృహ తప్పింది.
్‌్‌్‌ముఖం మీద ఎండ పడి చురుక్కుమనేసరికి స్పృహలోకి వచ్చింది రీటా. అదొక చిన్న లోయ. ఎదురుగా ఓ కాలువ ప్రవహిస్తోంది. రీటా లోయలోకి జారిన దారి అంతటా మెత్తటి గడ్డి మొలిచి వుండటంతో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. తాత్కాలికంగా పులి ప్రమాదం నుంచి బయట పడినా తనింకా అడవిలోనే వుంది, అడవి నుంచి బయటపడితేనే తనకు మోక్షం అనుకుంది.ఇప్పుడామెకు ఆకలితో కడుపు నకనకలాడుతోంది. కాలువ వొడ్డున పలురకాల పురుగులు, కీటకాలు కన్పించాయి. ఆమె సహచరులైతే ఇలాంటి స్థితిలో ఆ పురుగుల్ని చంపి పచ్చిగానే తినేసి ప్రాణం నిలబెట్టుకుంటారు. కాని రీటా శాఖాహారి. జీవహింసను ఇష్టపడదు. పైగా ఆమె తండ్రి ఓ సాంప్రదాయవాది. ఆమెపై తండ్రి ప్రభావం కూడా ఉంది. కానీ ఇప్పుడున్న స్థితిలో ఆమె బతికి వుండాలంటే ఏదో ఒకటి తినక తప్పదు. ఆమె అడవిపళ్ళు కోసం వెదికింది. కాని అక్కడ అలాంటి చెట్లేవీ కనపడలేదు. చివరికి కాలువ ఒడ్డున మొలచిన ఓ రకం గడ్డిని సేకరించింది. దాన్ని నీళ్ళతో శుభ్రంగా కడిగి తినేసింది. అక్కడ వున్న ఓ రకం ఆకుల్ని కూడా భుజించింది.ఎలాగోలా కడుపు నింపుకున్నాక కర్తవ్యం గురించి ఆలోచించింది. జేబులు తడుముకుంటే వెనక జేబులో లైటర్‌ వుందని తెలిసింది. ఒంటిమీది బట్టలు కాకుండా ఇప్పుడామె వద్ద మిగిలివున్న వస్తువు అదొక్కటే.
ఆమె వెంటనే లేచి కాలువ ప్రవహిస్తున్న దిక్కులో నడక మొదలెట్టింది. ప్రతి కాలువ ఏదో ఒక నదిలో కలుస్తుంది. నది వెంబడి ప్రయాణిస్తే అడవి దాటవచ్చు. ఇదే ఆశతో ఆమె వడివడిగా నడుస్తూ మధ్యాహ్నానికి నది దగ్గరికి చేరుకుంది. కాని ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డు కూడా ఎత్తుగా ఉంది. నదిలో మొసళ్ళు తిరుగాడుతున్నాయి. ఆ నదిలో ఈదటమంటే కొరివితో తల గోక్కోవటమే అన్పించింది.రీటా నిరాశగా వెనుదిరిగి ఓ చెట్టు కింద కూర్చుని విరక్తిగా ఆకాశం కేసి చూడసాగింది. అప్పుడే ఆకాశంలో ఓ విమానం వెళుతూ కన్పించింది. వెంటనే ఆమెకొక విషయం స్ఫురించింది. తను అడవిలో తప్పిపోయి రెండ్రోజులైంది. ఈపాటికి తనకోసం అన్వేషణ మొదలై వుంటుంది. ఏదైనా హెలికాప్టర్‌ తనని అన్వేషిస్తూ ఇటువైపు రావచ్చు. తను ఇక్కడున్న సంగతి వాళ్ళకు తెలియాలంటే తను ఏదో ఒక రకంగా వాళ్ళ దృష్టి నాకర్షించాలి. ఈ ఆలోచన రాగానే రీటా లేచి ఎండుపుల్లలు, కట్టెల్ని సేకరించి కుప్పగా పోసి లైటర్‌తో నిప్పంటించింది. తర్వాత ఆ మంటపై పచ్చి ఆకుల్ని కప్పింది. దాంతో పెద్ద ఎత్తున పొగ లేచి ఆకాశం వైపు సాగిపోయింది. దట్టమైన అడవులు, నిర్జన దీవులు, కొండలు, ఎడారుల్లో తప్పిపోయిన వారు ఇలాగే చేస్తారు. హెలికాప్టర్లలో, బైనాక్యులర్స్‌ ద్వారా అన్వేషిస్తున్న వారికి ఎంతో దూరం నుంచి ఈ పొగ కనబడుతుంది. ఇప్పుడు రీటా కూడా అదే ఆశతో పొగబెట్టి హెలికాప్టర్‌ కోసం ఆశగా ఎదురు చూడసాగింది.
హెలికాప్టర్‌ రాలేదు. చీకటి పడేవరకూ ఆమె పొగబెడుతూనే ఉంది. ఆమెలో ఓపిక నశించింది. మరో ఆలోచన లేకుండా ఉన్నచోటనే పడుకుని నిద్రపోయింది. రాత్రంతా దోమలు కుట్టాయి. పురుగులూ, కీటకాలు సతాయించాయి. అడవిలోని జంతువులు అరుపులు, నక్కల ఊళలు, పులి గాండ్రింపులు విన్పించాయి. అయినా ఆమె భయపడలేదు. దేవునిపై భారం వేసి అలాగే పడుకుంది. అర్థరాత్రి దాటాక నిద్ర పట్టింది. తెల్లవారినా మెలకువ రాలేదు.ఎవరో ఎండుటాకులపై నడుస్తున్న చప్పుడు విన్పిస్తే మేల్కొంది రీటా. తనని రక్షించటానికి ఎవరో వస్తున్నారని ఆశగా కళ్ళు తెరిచి చూసింది. కాని వస్తున్నది మనిషి కాదు, ఓ పెద్ద పులి!రీటా గుండె ఆగినంత పనయింది. పారిపోయే అవకాశం లేదు. పులిని ఎదుర్కోవటం అసాధ్యం. కనీసం దాన్ని భయపెట్టే చిన్న ఆయుధం కూడా తనవద్ద లేదు. అడవిలోకి ప్రవేశించకముందే తన రివాల్వర్‌ని అధికారులకు అప్పగించింది. ఇప్పుడు తన పని ముగిసినట్లే. ఇంతా చేసి చివరికి తనొక పులికి ఆహారం కాబోతోంది. ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. రాబర్ట్‌ గుర్తొచ్చాడు. తన గురువు గుర్తొచ్చాడు. ఆయన మాటలు గుర్తొచ్చాయి. ‘క్రూర జంతువులు ఆహారం కోసం లేదా రక్షణ కోసం మాత్రమే దాడి చేస్తాయి, మనిషిలాగ వినోదం కోసం దాడి చెయ్యవు. చలనం లేని మనిషిని సామాన్యంగా అవి ముట్టుకోవు’రీటా చప్పున కళ్ళు మూసుకుంది. ఊపిరి బిగబట్టి నిశ్చలంగా వుండిపోయింది. పులి ఆమెను సమీపించి వాసన చూసింది. ఆమెలో కదలిక లేకపోవటంతో తన కాళ్ళతో ఆమె శరీరాన్ని తట్టింది. పక్కకి దొర్లించింది. అయినా రీటా కదల్లేదు. పులికి ఏమనిపించిందో గాని ఆమెకి కొద్దిదూరంలో నేలపై కూర్చుంది.
అటూ ఇటూ చూస్తూ మధ్యలో రీటాని గమనిస్తోంది. కనురెప్పల సందుల్లోంచి ఇదంతా చూసిన రీటాకి తను ఏమాత్రం కదిలినా పులి తనమీద దాడి చేస్తుందని అర్థమైంది.సరిగ్గా అప్పుడే ఆకాశంలో హెలికాప్టర్‌ ఎగురుతున్న చప్పుడు వినిపించింది. ఉద్వేగంతో రీటా గుండె వేగంగా కొట్టుకుంది. అది ఖచ్చితంగా తనని అన్వేషిస్తున్న హెలికాప్టరే. అది అడవిపై చక్కర్లు కొడుతోంది. కాని తనొక చెట్టుకింద వున్నందువల్ల హెలికాప్టర్‌లోని వారికి కన్పించదు. తను ఇక్కడున్న సంగతి వారికి తెలియాలంటే ఆకాశంలోకి లేచేలా మళ్ళీ పొగబెట్టాలి. నిన్న పెట్టిన మంట ఆరిపోయింది. మళ్ళీ పెట్టాలి. కాని తను కదిల్తే చాలు పులి కబళించటానికి సిద్ధంగా వుంది. ఇప్పుడెలా? తన పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. ఈ పులి త్వరగా వెళ్ళిపోతే బావుణ్ణు అని రీటా మనసులోనే దేవుణ్ణి వేడుకుంది.
ఆమె మొర దేవుడు విన్నాడు. హెలికాప్టర్‌ శబ్దానికి విసుగు పుట్టిందేమో పులి లేచి మెల్లగా అడవి లోపలికి వెళ్ళిపోయింది. కాని అదే సమయంలో హెలికాప్టర్‌ కూడా వెనుదిరిగింది. అది గమనించిన రీటా దిగ్గున లేచి నిల్చుంది. హెలికాప్టర్‌లోని వారి దృష్టి నాకర్షించాలని వెంటనే తను ధరించిన చొక్కా విప్పి గాలిలో వూపుతూ గట్టిగా అరిచింది.‘‘హెల్ప్‌... హెల్ప్‌... ఐయామ్‌ హియర్‌... నన్ను కాపాడండి’’ అంటూ ఆమె పిచ్చి పట్టినట్టు అరుస్తున్నా హెలికాప్టర్‌లోని వ్యక్తులు ఆమెను చూడలేదు. అయితే ఆ కేకలకు అడవిలో కెళ్ళిన పులి మాత్రం తిరిగొచ్చింది. రీటాని చూసి భీకరంగా గాండ్రించింది.రీటా ఇక ఆలోచించలేదు. చావో రేవో తేల్చుకోవాలని పులికి వ్యతిరేక దిశలో వేగంగా పరుగు తీసింది. పులి ఆమెను వెంటాడింది. స్వతహాగా రన్నింగ్‌ ఛాంపియన్‌ అయిన రీటా తన శక్తినంతా కూడదీసుకుని పరిగెడుతోంది. ఆమెకీ పులికీ మధ్య దూరం క్షణక్షణానికీ తగ్గుతోంది. ఇక పులి తనను దొరకబుచ్చుకుంటుందన్న క్షణంలో ఆమె హఠాత్తుగా యు టర్న్‌ తీసుకొని వెనక్కి మళ్ళింది. పులులు వున్నఫలాన వెనక్కి మళ్ళలేవని ఆమెకు తెలుసు. ఆమెలాగ వేగాన్ని నియంత్రించి వెనక్కి మళ్ళలేకపోయిన పులి బ్యాలెన్స్‌ తప్పి ఓ చెట్టుకు గుద్దుకుంది.పులుల కన్నా వేగంగా పరుగెత్తలేని కుందేళ్ళు ఇలా హ ఠాత్తుగా వెనుదిరిగి పులిని బోల్తా కొట్టిస్తాయి. బ్రెజిల్‌లో తన గురువు వద్ద నేర్చుకున్న ఈ విద్య ఇప్పుడు రీటాకి ఉపయోగపడింది. కాని ఇంకా గండం గడవలేదు. ఖంగుతిన్న పులి భీకరంగా గాండ్రిస్తూ రీటామీదికి దూసుకొచ్చింది. అయితే అప్పటికే నది ఒడ్డుకు చేరుకున్న రీటా పులి తనని అందుకునేలోగా నదిలోకి దూకేసింది.
ఆ నదిలోకి దూకటమంటే పెనం మీంచి పొయ్యిలోకి దూకటమేనని రీటాకి తెలుసు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నది నుంచి ఒడ్డుకు చేరటం కష్టం. పైగా అందులో ప్రమాదకరమైన మొసళ్ళున్నాయి. అయినా రీటాకి మరో దారిలేదు. చావో రేవో ఆ నదిలోనే తేలిపోవాలి. ఆమె ఈదటానికి ఎంత ప్రయత్నించినా తన ప్రమేయం లేకుండా వరదలో కొట్టుకు పోసాగింది. అది చాలదన్నట్టు ఓ మొసలి ఆమె వెంట పడింది. అది రీటాని పట్టుకోబోయినప్పుడల్లా ప్రవాహ ఉధృతి ఆమెను దాని నోటికి చిక్కకుండా చేస్తోంది. అయితే ఇలా ఎంతోసేపు తను సురక్షితంగా వుండలేనని రీటాకి తెలుసు. అంతలో ఆమె భయపడిందే జరిగింది. మొసలి ఆమె ఎడం కాలును పట్టుకుంది. రీటా తన శక్తినంతా కూడదీసుకుని కుడికాలితో దాని మూతిమీద కొట్టింది. మొసలి పట్టు వదిలింది. అప్పుడే ఓ పెద్ద అల రీటాని ఒడ్డుకి దగ్గరగా విసిరేసింది. ఆమె వెనకనే మొసలి వుంది. ఆ ప్రవాహంలో ఒడ్డెక్కటం అసాధ్యం. కాని ఒడ్డుమీంచి నదిలోకి వంగి ఉన్న ఓ చెట్టు కొమ్మ రీటాకి కన్పడింది. ప్రాణాలతో బయటపడడానికి ఆమెకదే చివరి ఆధారం. కొమ్మ దగ్గరికి రాగానే తనలో మిగిలి వున్న శక్తినంతా వుపయోగించి నీటిలో నుంచి కొమ్మవైపు ఎగిరింది. ఆమెను అందుకోవటానికి మొసలి కూడా ఎగిరింది. అరక్షణం తేడాలో మొసలి గురి తప్పింది. రీటా కొమ్మని పట్టుకోగలిగింది. వెంటనే ఉత్సాహంగా కొమ్మనుండి చెట్టుపైకి కోతిలా ఎగబాకింది. తర్వాత మెల్లగా చెట్టు దిగి నేలపైౖ కాలు మోపింది. కాని మొసలి ఎడమకాలుని గాయపర్చినందువల్ల నేలపై నిలబడలేక పాక్కుంటూ ముందుకు వెళ్ళసాగింది.
అరగంట అలా పాక్కుంటూ వెళ్ళాక ఓ చోట ఆమె చేతులకు మట్టిరోడ్డు తగిలింది. సంతోషంతో ఆమెకు ఎగిరి గంతెయ్యాలన్పించింది. అక్కడ రోడ్డు వుందంటే అది అడివి కాదు, మనుషులు తిరుగాడే ప్రాంతం. తను అడవి నుంచి బయటపడింది. ఇక తన ప్రాణాలకేం ముప్పులేదు అని నిశ్చింతగా గాలి పీల్చుకుంది.అప్పుడే దూరం నుండి ఎవరివో మాటలు విన్పించాయి. మనుషుల గొంతు వినపడగానే ఆమెలో వుత్సాహం వురకలేసింది. వెంటనే మోకాళ్ళపై లేచి నిల్చుని ‘‘హలో.. ఐయామ్‌ హియర్‌... నన్ను రక్షించండి’’ అంటూ కేకలేసింది. అది విని ముగ్గురు వ్యక్తులు అక్కడికొచ్చారు. దుస్తుల్ని బట్టి వాళ్ళు అటవీ శాఖకు చెందినవారని తెలుస్తోంది. వాళ్ళామెను ఆశ్చర్యంగా చూశారు
. రీటా సంతోషం పట్టలేక ఏడుస్తూ తను ఎలా క్రూరమృగాలతో పోరాడి అడవి నుంచి బయటపడిందో వారికి వివరించసాగింది. కాని వాళ్ళు ఆమె మాటల్ని వినకుండా ఆమెకేసి ఆకలిగా చూడసాగారు. వాళ్ళ చూపులు ఎక్కడున్నాయో గ్రహించిన రీటా రెండు చేతుల్తో తన ఎదను కప్పుకుంది. ప్రాణాలతో బయట పడ్డాననే సంతోషంలో తన ఒంటిపై చొక్కా లేదనే సంగతి కూడా ఆమె మర్చిపోయింది. లోపల ధరించిన బనియను సైతం చిరిగిపోయింది.ఆ ముగ్గురు యువకులు ఒకరివైపొకరు చూసుకుని వెకిలిగా నవ్వుకున్నారు. వాళ్ళ ధోరణి రీటాకి అంతుబట్టలేదు. ముగ్గురూ ఆమెను సమీపించారు.
వారేం చెయ్యబోతున్నారో రీటా అర్థం చేసుకునేలోగానే ఇద్దరు ఆమె రెండు చేతుల్ని ఒడిసి పట్టుకున్నారు. మూడోవాడు ఆమె ఎదపై మిగిలివున్న బనియన్‌ని లాగి దాన్ని ఆమె నోట్లో కుక్కేశాడు. తర్వాత ముగ్గురూ ఆమెపై విరుచుకు పడ్డారు. రీటా పెనుగులాడింది. ఒకేసారి తనపై ఎలుగుబంటి, పులి, మొసలి కలిసి దాడి చేసినట్టు విలవిల్లాడింది. మొదటిసారి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల రాలాయి. నోరు లేని క్రూర జంతువులతో పోరాడి గెలిచిన ఆ ధీర వనిత నోరున్న క్రూరమృగాల చేతిలో బలైపోయింది. తమ పాశవిక వాంఛల్ని తీర్చుకున్న తర్వాత ఆ ముగ్గురు దుర్మార్గులు ఆమె మెడలో వున్న బంగారం చైను గుంజుకున్నారు. చేతి వేలికున్న డైమండ్‌ రింగ్‌ బయటికి రాకపోతే వేలు నరికి తీసుకున్నారు. ఆమె ప్రాణాలతో వుంటే తమ బండారం బయట పెడుతుందని ఆమెను గొంతు పిసికి చంపేశారు. తర్వాత ఆమె ఆనవాళ్ళు కూడా చిక్కకూడదని రీటా శరీరాన్ని నదిలోని మొసళ్ళకి ఆహారంగా పడేశారు.తర్వాత అన్వేషకులకు ఆమె అవశేషాలు కూడా చిక్కలేదు. ఆమె అడవిలోని క్రూరమృగాలకు బలై వుంటుందనుకున్నారంతా.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#14
వసుధ
శ్రవన్ కుమార్ రాజా
అభివృద్ధికి,నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ఆ గ్రామం లో పెళ్లయి సంవత్సరం లోపు సంతానం కలగని ఆడపిల్లని ఆ ఊరి లో ఉండే పెద్ద జమీందారు కు సేవకురాలిగా పంపుతారు.
అలా వెళ్లిన అమ్మాయి ఆ జమీందారు కుటుంబానికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండాలి సేవలు అనడం కన్నా బానిస అనడం ఎంతో అర్థవంతం. సంవత్సర కాలం బానిసగా ఉంటూ ఆ ఆడపిల్ల తన భర్తతో సంతానం పొందే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పటికీ.. సంవత్సరం బానిసత్వం చేసిన కాలం లో కూడా ఆ ఆడపిల్లకి సంతానం కలగకపోతే ఆ అమ్మాయిని జమీందారు కుటుంబం లోని మగవాళ్ళకి తాళి కట్టకుండానే భార్యగా చేసేస్తారు.
అలాపెళ్లయి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సంతానం కలగని వసుధని ఆ ఊరి జమీందారు కుటుంబానికి సేవ చెయ్యడానికి పంపించారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కి కాకుండా మరో కుటుంబానికి చెందిన మగవాళ్ల మధ్యలో రాత్రియంబవళ్ళు ఉంటూ ఆ కుటుంబానికి బానిసల బ్రతుకుతూ ఉంది వసుధ
ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అలా పరాయి మగవాళ్ల మధ్యలో విడిచేసినప్పటి నుండి శేఖర్ మనసులో మనసు లేదు.రోజు ఉదయాన్నే వెళ్లి రాత్రి పడినాక ఇంటికి తిరిగొచ్చే భార్యని చూసి శేఖర్ బాధపడేవాడు.ఇప్పటి కాలం లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్న గ్రామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.
బానిసత్వం అనుభవిస్తున్న కాలం లో ఒక రోజు జమీందారు గారి పెద్ద కొడుకు ఆనంద్ మద్యం మత్తులో తన ఇంటిలో పనిచేస్తున్న వసుధని అత్యాచారం చేస్తాడు..వసుధ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఆ మదమెక్కిన కామాంధుడి చేతిలోంచి తప్పించుకోలేకపోతుంది.
ఆరోజు రాత్రి ఇంటికి చేరుకున్న వసుధ తనను ఎంతగానో ప్రేమించే భర్తకి జరిగిన విషయం చెప్పలేకపోతుంది దానికి కారణం మగాడైనా తన భర్త ఆవేశం తో చేసే పని వాళ్ళిద్దరికీ మంచిది కాదని.మరుసటి రోజు పనికి వెళ్లని వసుధను పనిలోకి తీసుకెళ్లడానికి బంగళా నుండి మనుష్యులు వస్తారు.వసుధ భర్త ఎందుకుపనిలోకి వెళ్లలేదని ప్రశ్నించగా వసుధ తడబడుతూ మరేం లేదు కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉండే అందుకే ఆలస్యమయింది వెళ్తాను అని బయలుదేరుతుండగా,శేఖర్ నీరసంగా ఉంటె వెళ్ళకు అని ఆపబోయేలోపే వసుధ వెళ్ళిపోతుంది.
జమీందారు బంగళాకు చేరుకున్న వసుధని అప్పుడే మత్త్తు వీడి లేచిన ఆనంద్ చూస్తాడు,తూలుతూ నడుస్తూ వచ్చి నిన్న రాత్రి జరిగిన దానికి నేను చాలా చాలా ఆనందపడుతున్నాను,నిన్న జరిగింది ఈరోజు,రేపు ఆ రేపు జరుగుతూనే ఉంటుంది.ఒక విషయం ఆలోచించు వసుధ.. నా ఒక్కడికి సుఖాన్ని ఇవ్వడం మంచిదా లేకపోతే సంతానం కలగకుండా ఉండిపొయ్యి మా కుటుంబంలోనిమగాళ్లందరికి పడకమీద బొమ్మ లాగ ఉండడం మంచిదా నువ్వే ఆలోచించుకో అంటాడు.
నాతో ఈ సంవత్సర కాలం పాటు సంసారం చేస్తే నీకు ఒక బిడ్డను ఇస్తాను నిన్ను బానిసత్వం నుండి కాపాడుతాను అంటాడు..జమీందారు కొడుకు నీచపు ఆలోచనకు వసుధ కుంగిపోతుంది.వంట గదిలో ఒక మూల కూర్చొని తనకు,తన భర్త శేఖర్ కు మధ్య జరిగిన ప్రేమ సన్నివేశాలను నెమరువేసుకుంటుంది ఏడుస్తూ.
అలా ఆలోచిస్తూ కూర్చున్న వసుధకి జమిందారీ కొడుకు చెప్పన మాటలు పదే పదే గుర్తొస్తుంటాయి.."నా ఒక్కడికే భార్యగా ఉండి సంతానాన్ని పొందు"అన్న మాట వసుధకి పదే పదే గుర్తొచ్చి ఆలోచించడం మొదలుపెడుతుంది.
పెళ్లయి సంవత్సరకాలం అయినా తనకు తన భర్త శేఖర్ చేత సంతానం కలగలేదు ,ఇప్పుడు జమీందారు ఇంటికి వచ్చి మూడు నెలలు అవుతుంది తన భర్త చేత సంతానం పొందలేకపోతే తాను ఎంత గానో ప్రేమించిన శేఖర్ కి దూరం అవ్వడంతో పాటు తాను ఆ జమీందారు కుటుంబానికి ఎల్లకాలం పడక సుఖాన్ని ఇచ్చే వేశ్యగా ఉండిపోవాల్సిందే అనుకుంటుంది.
ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లి రాత్రంతా ఎంత గానో అలోచించి మరుసటి రోజు ఉదయం బంగళా కు చేరుకుంటుంది వసుధ..టీ తీస్కొని ఆనంద్ ఉన్న గదిలోకి వెళ్తుంది వసుధ..వసుధ రావడాన్ని గమనించిన ఆనంద్ బెడ్ మీద నుండి లేచి ఓ మహారాణి వచ్చేసావా నిన్న రాత్రి నేను వచ్చేలోపే నువ్వు జారుకున్నావ్ నిన్న పొద్దున్న నేను చెప్పిన మాటలు నీకు అర్థం అయ్యాయా లెవా అంటాడు వసుధ శరీరం మీద తన చేతులను అసభ్యంగా తాకుతూ.
వసుధ,ఆనంద్ చేతులని తన శరీరం నుండి తీసేసి ఆడదాని కడుపులో బిడ్డను పుట్టించిన మాత్రాన మగాడు కాలేడు ఆడదాని మనసుని గెలిచిన వాడే మగాడు అంటుంది..దానికి ఆనంద్ సరే సరే నీ మొగుడు నీ మనసుని గెలిచాడు కానీ ఏమయ్యింది నీకు ఈ బానిసత్వం వచ్చింది.నన్ను నీ శరీరాన్ని గెలవనివ్వు బానిసత్వం నుండి విముక్తి చేస్తా అని వసుధని లోబర్చుకుంటాడు.
కొన్ని రోజులకి వసుధ గర్భవతి అవుతుంది..ఈ విషయం తెలిసిన శేఖర్ ఎంతో సంబరపడుతాడు.ఊరంతా మిఠాయిలు పంచిబెడతాడు.అలా మిఠాయిలు పంచుతూ ఆ ఊరిలోని ఒక చిన్నపాటి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లి తన భార్య కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతాడు,ఆ డాక్టర్ అన్ని జాగ్రత్తలు శేఖర్ కి వివరించి పంపుతాడు.ఒకసారి మీ భార్యని సాయంత్రం పంపించు శేఖర్ అని చెప్తాడు.అలాగే అని బయలుదేరుతాడు శేఖర్
సాయంత్రం వసుధని డాక్టర్ దగ్గరికి తీసుకొనివస్తాడు శేఖర్,డాక్టర్ వసుధని చెక్ చేసి శేఖర్ ని బయట కూర్చో మంటాడు
డాక్టర్:ఎంతో అమాయకంగా ఉండే నువ్వు ఇంతటి నెరజానవని అనుకోలేదు
వసుధ:డాక్టర్ గారు మీరేమి మాట్లాడుతున్నారు
డాక్టర్:వసుధ నేను... నీకు,శేఖర్ కి ఆర్నెల్ల నుండి వైద్యం చేస్తున్నాను శేఖర్ కి సంతానం కలిగే అవకాశమే లేదు మరి ఈ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అంటాడు డాక్టర్
డాక్టర్ మాటలకు ఆశ్చర్యపోయిన వసుధ మీరెప్పుడు శేఖర్ కి బిడ్డలు పుట్టరని చెప్పలేదే అంటుంది దానికి డాక్టర్ చూడు వసుధ కొన్నేళ్లు వైద్యం చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందేమో అని నేనే చెప్పలేదు కానీ ఇంత త్వరగా శేఖర్ ఆరోగ్యం లో మార్పు వచ్చేప్రసక్తే లేదు అంటాడు
వసుధ వెంటనే డాక్టర్ కాళ్ళమీద పడి తన తప్పును తన భర్తతో చెప్పొద్దు అని వేడుకుంటుంది.....డాక్టర్ గదిలోంచి బయటికి వచ్చిన వసుధని తీస్కొని ఇంటికి వెళ్తూ శేఖర్ వసుధతో చాలా పెద్ద తప్పుచేసావ్ వసుధ నీకు సంతానం కలగకపోతే ఇంత నీచమైన పనికి సిద్ధపడతావా అని అంటాడు
వసుధ ఆశ్చర్యంతో ఏమి మాట్లాడుతున్నావ్ శేఖర్ అని అనగానే నేను మొత్తం విన్నాను అంటాడు శేఖర్
నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను దానికి బదులుగా నువ్వు నాకిచ్చిన బహుమానం ఇదా అని శేఖర్ అనగానే
అవును ఇదే నాకు ఈ సంవత్సరం లో సంతానం కలగకపోతే జీవితాంతం నేను ఆ కుటుంబం లోని మగాలందరితో వాళ్లకి కోరిక కలిగినప్పుడల్లా సంసారం చెయ్యాలి ఒక కుక్క కన్నా హీనంగా నేను బతకాలి అప్పుడు నువ్వేమి చేసేవాడువి అని ప్రశ్నిస్తుంది లలిత
అంతవరకు వస్తే మనం ఈ ఊరి నుండి పారిపొయ్యేవాళ్ళం లేదా చచ్చిపొయ్యేవాళ్ళం కానీ నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటాడు శేఖర్ ఏడుస్తూ
శేఖర్ ఒక్క మాట చెప్తా విను నేను నీతోనే జీవించాలి అని అనుకోని నేను ఆ ఆనంద్ తో కలిసాను,చచ్చిపోవాలని నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు,చచ్చిపోయేంత ధైర్యం నీకు ఉంది కదా అదే ధైర్యం తో ఈ కాలం లో కూడా ఇలాంటి ఆచారాలను పెట్టి మనలాంటి మామూలు మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న ఆ జమిందారీ కుటుంబముని చంపు అని శేఖర్ తో కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది వసుధ.
మర్నాడు ఉదయం యధావిధిగా వసుధ బంగళాకు పనిలోకి వెళ్తుండగా.. శేఖర్, ఇంకా ఎందుకు వెళ్లడం అని ఆపుతాడు. నా కడుపులో ఒకరికి ప్రాణం పోసిన వాడికి నేను తీర్చుకోవాల్సిన ఋణం బాకీ ఉంది అని వెళ్ళిపోతుంది
ఆరోజు మధ్యాహ్నమే ఇంటికి తిరిగొచ్చేస్తుంది.మర్నాడు ఉదయం ఊరంతా గొడవ గొడవగా ఉంటుంది ఊరిలోని జనాలందరూ బంగళా వైపుకుపరిగెత్తుకుంటూ వెళ్తుంటే అందులోని ఒకడిని ఆపి జరిగిన విషయం ఏంటో చెప్పమని అడగ్గా జమీందారు కుటుంబానికి ఎవరో విషమిచ్చి చంపారంట అని చెపుతాడు.వెంటనే ఇంటికి తిరిగొచ్చి శేఖర్ జరిగిన విషయం చెప్పమని వసుధని అడుగుతాడు దానికి వసుధ వెటకారం గా నవ్వి అవును ఈ పని చేసింది నేనే అంటుంది.నా జీవితం తోనే కాకుండా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఆ కుటుంబాన్న్ని,ఆ ఆనంద్ ని నేనే చంపేసాను అంటుంది.
ఇద్దరు మాట్లాడుకుంటూఉండగా డాక్టర్ చేతిలో రిపోర్ట్ లను పట్టుకొని శేఖర్ ఇంటికి వస్తాడు.శేఖర్,శేఖర్ అని గుమ్మం బయట నుండి పిలవగా వసుధ,శేఖర్ బయటికి వస్తారు .వసుధ కి దగ్గరగా వెళ్లి నేను నీతో నిన్న తప్పుగా మాట్లాడాను శేఖర్ రిపోర్ట్ లు మారిపోవడం వల్ల నేను శేఖర్ కి సంతానం కలగదేమో అనుకున్నాను. కానీ శేఖర్ రిపోర్టులు జమిందారీ కొడుకు ఆనంద్ రిపోర్ట్ లు ఒకరివి ఒకరికి మారాయి.నీ కడుపులో పుట్టబోతున్న బిడ్డకు తండ్రి శేఖరే అనుమానించినందుకు నన్ను క్షమించు అని వెళ్ళిపోతాడు డాక్టర్.
వాళ్ళను చంపి తొందరపడ్డావు వసుధ అని అంటాడు శేఖర్..దానికి వసుధ ఆ కామాంధుడి బారి నుండి ఆ కుటుంబం బారి నుండి నేను చాలా మంది ఆడపిల్లలని కాపాడాను,ఒక ఆడదానిని తన ఇష్టం లేకుండా పొందే వాడికి ఈ శిక్ష తప్పదు అంటుంది వసుధ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#15
[Image: Vijaya-dasami.jpg]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#16
Nice fantastic stories  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: