16-07-2022, 12:02 AM
huuuuuuuuu................
okay okay
కధా స్రవంతి ❤️
|
18-07-2022, 06:14 PM
(14-06-2022, 09:28 PM)Takulsajal Wrote: నాకైతే నీ ఈ కవిత్వమ్ భలే నచ్చేసింది బాసు... అది కూడా నిజమే కదా. మనల్ని చిన్నప్పటి నుంచీ భయపెట్టే కదా పెంచుతారు పుస్తకాలకు కాళ్ళు తగిలితే దణ్నమ్ పెట్టుకోవాలి, లేకపోతే కళ్ళు పోతాయనే భయం రాత్రుల్లో బూచాడి భయం చెబితే ఏమంటారోనన్న భయం చెప్పకపోతే ఏమౌతుందోనన్న భయం....
: :ఉదయ్
21-07-2022, 10:09 PM
ఆరు చెంచాలు
4
విక్కీ కార్ ఎక్కి రోడ్ మీదకి ఊరికించాడు, సెక్యూరిటీ ఆఫీసర్లు వెనక పడ్డారు కానీ ఏం లాభం, విక్కీ కార్ నడిపితే రేసర్లే పట్టుకోలేరు ఇక మాములు సెక్యూరిటీ ఆఫీసర్లు వీళ్ళేంత... కానీ ఒక్క నల్ల స్పోర్ట్స్ కార్ మాత్రం విక్కీని ఫాలో అయ్యింది ఎవరో కాదు మిత్ర. సరదాగా డ్రైఫ్ట్ చెయ్యడం అత్యధిక వేగంలొ కారుని ఎలా కంట్రోల్ చెయ్యాలో విక్కీ దెగ్గరే నేర్చుకుంది మరీ.. విక్కీ తన డెన్ లోకి వెళ్ళగానే అక్కడనుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మిత్ర ఇన్ఫోర్మర్స్ ని పెట్టింది, ఒక రోజు విక్కీ కార్ తీసుకుని బైటికి వెళ్లడం గమనించి, ఒక్కటే కార్ తీసుకుని విక్కీ వాళ్ళ డెన్ కి వెళ్ళింది. అక్కడ మిత్రని చూసి అందరూ బెదిరిపోయారు, కిరణ్ మాత్రం తప్పించుకోడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. మిత్ర : భయపడకండి.. నేను ఒంటరిగా వచ్చాను, మీరు ఇక్కడున్నట్టు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. కిరణ్ : మమ్మల్ని పట్టుకోడానికి కాకపోతే మరి ఎందుకోచ్చావ్? మిత్ర : మీకు విక్కీ గురించి ఏం తెలుసో తెలుసుకుందామని వచ్చాను. మదన్ : విక్కీ ఎవరు? మిత్ర : ఒహ్ సారీ... మీకు తన అస్సలు పేరు కూడా తెలీదు కదా.. అదే మీ ఫ్రెండ్ విశ్వా.. తన అస్సలు పేరు విశ్వ కాదు విక్కీ.. తను మిమ్మల్ని వాడుకుంటున్నాడు అది చెపుదామనే వచ్చాను. రియా : తన గురించి నీకేం తెలుసు? మిత్ర : వాడి గురించి నాకేం తెలుసా... హహ.. నా మెడలో ఉన్న లాకెట్ చూసారా V అని ఉంటుంది, అది ఎవరు ఇచ్చారో తెలుసా నా భర్త విక్కీ.. అలియాస్ మీ ఫ్రెండ్ విశ్వా.. వాడు వచ్చింది మా నాన్న మీద పగతో వాడి పగ కోసం మిమ్మల్ని గొర్రెలని చేసి ఆడుకుంటున్నాడు. ముందే చెప్తున్నాను ఎవ్వరినీ వదలను, మా నాన్న వదలడు విక్కీ అంటే నా భర్త వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు కానీ మీ సంగతి.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో మీరే తెల్చుకోండి. అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదు, మిత్ర వెళ్లిపోయాక ఎవరికి వాళ్లు మౌనంగా కూర్చున్నారు, కొంత సేపటికి విశ్వ లోపలికి వచ్చాడు, విశ్వ అలియాస్ విక్కీ రాగానే అందరూ లేచి నిలబడ్డారు. విశ్వ : ఏంటి.. అందరూ అలా ఉన్నారు? కిరణ్ : IPS మిత్ర నీ భార్యా? మదన్ : నువ్వు సీఎం ని చంపడానికే ఇక్కడికి వచ్చావా? రియా : ఇదంతా నీ పర్సనల్ గొడవ, మమ్మల్ని వాడుకున్నావ్ కదూ.. విశ్వ : మిత్ర వచ్చిందా... అంటూ.. కుర్చీలో కూర్చుని అవును నిజమే ఇద్దంతా నా పర్సనల్ గొడవ మీరు చెప్పిందంతా నిజమే కానీ మిమ్మల్ని వాడుకోలేదు, ఇది మాత్రం నిజం. కిరణ్ : సారీ.. మోసగాడితో నేను ఇక పని చెయ్యలేను.. నన్ను వదిలెయ్యండి. రియా : అవును ఇదేదో పెద్ద రిస్క్ లాగా ఉంది.. నేను వెళ్లిపోతున్నాను. మదన్ : సారీ విశ్వా... నేను కూడా.. అని బైటికి నడిచాడు.. తన వెనుకే సుమన్ కూడా వెళ్ళిపోయాడు. విశ్వ : కావేరి నువ్వు కూడా వెళ్ళిపో... కావేరి : అది కాదు వి.. విశ్వ : వద్దు.. అందరం కలిసుంటేనే టీం.. అయినా ఈ యుద్ధం నాది.. ఎవరున్నా లేకపోయినా ఆగే ప్రసక్తే లేదు.. వాళ్ళతో కలిసి వెళ్ళిపో.. కావేరి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.. అక్కడే ఫ్రిడ్జ్ లో ఉన్న బీర్ తాగి సోఫాలో పడుకున్నాడు.. జరిగిందంతా మిత్ర తను పెట్టిన స్పై కెమెరాలో చూస్తుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కార్ తీసాడు.. అది కెమెరాలో చూసిన మిత్ర అలెర్ట్ అయ్యి సెక్యూరిటీ ఆఫీసర్లని అప్రమత్తం చేసింది. పొద్దున్నే పెళ్ళాం బర్తడే విషెస్ తో లేచిన సీఎం గారు.. రెడీ అయ్యి మధ్యాహ్నం వరకు అందరి దెగ్గర నుంచి విషెస్ బొకేలు అందుకుని కొన్ని మంచి పనులు చేసి ఇంకొన్ని వాగ్దానాలు చేసి.. ఆ తరువాత సాయంత్రం వరకు ఇంట్లో వాళ్ళతో గడిపి.. రాత్రికి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడు ప్రైవేట్ పార్టీకి వెళ్ళిపోయాడు... విశ్వ కార్ ఆక్సిలరేషన్ గట్టిగా నొక్కి.. వాకిటాకిలో స్టార్ట్ అన్నాడు... ఫస్ట్ గేర్ వేస్తూ.. విక్కి ఒక్కడే ఏం చేస్తాడులే అనుకుని రిలాక్స్ గా చూస్తున్న మిత్రకి ఎక్కడో తేడా కొట్టి.. విక్కీ డెన్ కి వెళ్ళింది.. అక్కడికి వెళ్లి చూస్తే.. తాను పెట్టిన స్పై కెమెరా ముందు.. ఆ రూమ్ ఫోటో ఒకటి తీసి రూమ్ కనిపిస్తున్నట్టుగానే కెమెరా ముందు అడ్జస్ట్ చేశారు.. పక్కనే ఉన్న గోడని చూసింది.. ఒక లాఫింగ్ భాఫోన్ బొమ్మ వేలాడ తీశారు.. మిత్ర కోపంగా.. వాకీటాకీ లో.. అలెర్ట్ అలెర్ట్ సీఎం థ్రెట్ అలెర్ట్ .. కంట్రోల్ రూమ్...సెక్యూరిటీ నీడెడ్ ఫర్ సీఎం ఎట్ హిస్ గెస్ట్ హౌస్.. మేక్ ఇట్ ఫాస్ట్.. ఓవర్. పార్టీలో అందరూ తాగుతూ అమ్మాయిలతో చిందులు వేస్తుండగా అక్కడున్న ప్రొజెక్టర్ల లో సడన్ గా వీడియో ప్లే అయ్యింది. అందులో హ్యాపీ బర్త్ డే సీఎం అని రాసి టైమర్ రెండు నిముషాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సడన్ గా అక్కడ వంట వండే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సీఎం తల మీద గన్ పెట్టింది చూస్తే ఎవరో కాదు రియా.. సెక్యూరిటీ అందరూ గన్స్ పైకి ఎత్తి కాల్చడానికి రెడీగా ఉన్నారు.. ఇంతలో రెండు నిమిషాల టైమర్ అయిపోయింది.. ఆ వెంటనే గోడని బద్దలు కొట్టుకుంటూ ఒక ట్రక్ వచ్చింది.. డ్రైవర్ ఎవరో కాదు మదన్ తన పక్కనే సుమన్.. ఆ వెనుకే రెండు కార్లు.. ఒకదాంట్లో విశ్వ ఇంకోదాంట్లో కిరణ్.. సెక్యూరిటీ ట్రక్ ని కాలుస్తుంటే.. సుమన్ వెంటనే స్మోక్ గ్రనేడ్స్ తీసి ఇష్టమొచ్చినట్టు విసిరేసాడు.. అంతా తెల్లటి పొగ కార్లు లైట్స్ ఆఫ్ చేశారు.. సౌండ్ రాకుండా ఇంజిన్ ఆఫ్ చేశారు... సరిగ్గా మూడు నిమిషాల వరకు ఎటువంటి సౌండు లేదు.. సెక్యూరిటీ వాళ్ళకి ఏం కనిపించనందు వల్ల ఏం చెయ్యాలో తెలీక నానావస్తలూ పడుతున్నారు.. సడన్ గా రెండు కార్లు ట్రక్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి..బంధారూ సౌండ్ విని ట్రక్ వైపు కాల్చడం మొదలు పెట్టారు.. ట్రక్ కి ఇరువైపులా లైట్స్ వెలిగాయి, సెక్యూరిటీ అవి కార్లు అని తెరుకుని కాల్చేలోపే రెండు కార్లు వెళ్లిపోయాయి.. చూస్తే సీఎం లేడు వచ్చిన వాళ్లు లేరు ట్రక్ లో వాళ్లు లేరు.. విశ్వ నడుపుతున్న కారులో వెనుక రియా సీఎం తలకి గన్ పెట్టి కూర్చుని ఆపిల్ తింటుంది.. వెనక కిరణ్ నడుపుతున్న కారులో మదన్ సుమన్ కూర్చుని ఉన్నారు.. వెనక సెక్యూరిటీ ఆఫీసర్లు తరుముతుంటే.. మిత్ర కూడా తన కార్ తీసి ఆక్సిలరేటర్ ని గట్టిగా తొక్కింది.. వెనకాల కిరణ్ కార్ లో ఉన్న సుమన్.. ఒక్కొక్క గ్రనెడ్ విసిరేస్తూ వస్తున్నాడు.. సెక్యూరిటీ ఆఫీసర్ల వెహికల్స్ గాల్లో ఎగుర్తున్నాయి.. కానీ ఒక్క కార్ మాత్రం తప్పించుకుంటూ ఫాలో అవుతుంది.. దాంట్లో ఉంది మిత్ర.. విశ్వ : కిరణ్ నువ్వు ముందుకు రా.. ఎదురుగా మూడు దార్లు కరెక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ ముందు స్మోక్ గ్రనెడ్స్ పిన్నులన్నీ పీకేసి కింద వెయ్యండి.. క్రాస్ కి ఇంకా రెండోందల మీటర్లు ఉందనగా.. కిరణ్ కారు ముందుకు వచ్చింది, విశ్వ గన్ తో మిత్ర కారు టైర్ ని షూట్ చేసాడు.. మిత్ర కారు వేగం తగ్గింది కానీ ఆగలేదు.. సుమన్ గ్రనేడ్స్ పిన్నులు పీకేసి బ్యాగ్ కింద పడేసాడు.. మొత్తం పోగ మిత్ర కారు స్లో అవుతుంటే.. విశ్వ కిరణ్ ల కార్లు దూసుకుపోయాయి.. ఎటు వెళ్లాలో తెలీక ఆగిపోయింది.. విశ్వ : ఫోన్ కలిపాడు.. కావేరి... మిత్ర నుంచి ఎక్కువ దూరం తప్పించుకోలేము.. ప్లేన్ స్టార్ట్ చెయ్యమని చెప్పు గెట్ రెడీ.. వచ్చేస్తున్నాం.. మిత్రకి ఆలోచించగా.. ఫస్ట్ రోడ్ కి వెళ్తే పాత రనవే ఉందని గుర్తొచ్చి తన వెనకాలే వచ్చి ఆగి ఉన్న ఇంకో కార్ తీసుకుని వేగంగా రన్ వే దెగ్గరికి వెళ్తుండగానే.. ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది.. గన్ తీసి కాల్చింది కానీ ఉపయోగంలేదు.. కిరణ్ సీఎం మెడ మీద కొట్టగానే.. స్పృహ తప్పి పడిపోయాడు.. విశ్వ వెళ్లి కావేరి పక్కన కూర్చుని రెడీనా.. అని అడిగాడు కావేరి : ఇదిగో అయిపోయింది.. ఎంటర్ నీ చేత్తో కొట్టేయి నీ పగ పూర్తిగా చల్లారినట్టే.. విశ్వ లాప్టాప్ లో ఎంటర్ బటన్ మీద వేలు పెట్టి.. తన అమ్మా నాన్నని తలుచుకుని నొక్కేసాడు.. «««««∞»»»»»
«««««∞»»»»»
«««««∞»»»»»
ఫ్లైట్ ఆమెజాన్ అడవుల మీదగా వెళ్తుండగా.. రేయ్ లేవరా.. నీ స్టాప్ వచ్చింది.. లేరా అని కిరణ్ సీఎం చెంప మీద కొట్టాడు.. విశ్వ : ఏంట్రా చూస్తున్నావ్ నన్ను గుర్తుపట్టలేదా.. నేనేరా విక్కీని గుర్తు పట్టావా.. నీకు తెలియని ఒక విషయం చెప్పనా.. నాకు పెళ్లయింది... నా భార్య పేరు.. మిత్ర.. అలా ఆశ్చర్యంగా చూడకు నీ కూతురే.. సీఎం : నన్ను వదిలేయ్.. నీ కాళ్ళు పట్టుకుంటాను.. తప్పులన్నీ ఒప్పుకుని ప్రెస్ మీట్ పెట్టి చెపుతాను.. విశ్వ : అవసరం లేదు.. కావేరి... కావేరి లాప్టాప్ లో న్యూస్ ఛానల్ పెట్టింది.. తన రంకు బాగోతాలు.. స్కాంలు.. స్కీమ్ లు ఎంత ఎంత నొక్కింది అన్నీ వివరాలు.. విశ్వ వాళ్ళ అమ్మ నాన్నని ఎలా మోసం చేసింది ఆడియో ఫైల్స్.. వీడియో ఫైల్స్ ప్రతీ ఒక్క ప్రూఫ్ అన్నీ సోషల్ మీడియా సైట్స్ లో అప్లోడ్ చేసింది కావేరి.. విశ్వ : నీకింకో బాడ్ న్యూస్ చెప్పనా... నువ్వు పార్టీకి పిలిచావే నీ కుక్కలు .. నీ దెగ్గర కొట్టేసిన డబ్బుని వాళ్ళకే పంచాను.. పిచ్చి నా కొడుకులు కాదు కుక్కలు.. మొత్తం కక్కేసారు.. సేమ్ ట్రీట్మెంట్ నువ్వు నన్ను నీ డబ్బుతో ఎలా నాశనం చేసావో.. నేను అలానే చేసాను కానీ ఇక్కడ డబ్బు కూడా నీదే.. కోప్పడకు ఇప్పుడు ఆ కుక్కలు బతికి లేవులే.. మా రియా.. అందులో విషం కలిపింది.. అక్కడున్న నీ యాభై కుక్కలు ఈ పాటికి చచ్చి ఉంటాయి.. ఇంకా న్యూస్ లో రాలేదు అంతే.. కిరణ్ ప్లేన్ డోర్ తెరిచాడు.. విక్కీ ఒక్క తన్ను తన్నాడు.. గాల్లో ఎగిరి కింద పడుతుండగానే విక్కీ సీఎం చెయ్యి పట్టుకుని.. వదిలేయ్యమన్నావ్ గా వదిలేస్తున్నాను అస్సలే రాత్రి పులులు సింహాలు చీతాలు దట్టంగా తిరిగే ప్లేస్ ఇదే జాగ్రత్త మరి.. సీఎం : నన్ను వదలద్దు.. వదలద్దు.. ప్లీస్ విక్కీ : ఇప్పుడే కదా వదిలేయ్యమన్నావ్ అప్పుడే మాట మారుస్తావే.. అస్సలైన రాజకీయ నాయకుడివి అనిపించావ్.. మా అమ్మా నాన్న గుర్తున్నారా.. వాళ్ళని లారీతో గుద్దిచ్చే ముందు.. వాళ్ళ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది.. అదేంటో తెలుసా.. హ్యాపీ జర్నీ.. అని చెయ్యి వదిలేసాడు.. కిరణ్ డోర్ క్లోజ్ చేసాడు... విశ్వ కింద కూర్చుని.. కళ్ళు మూసుకున్నాడు.. కావేరి పక్కనే కూర్చుంది.. కావేరి : నెక్స్ట్ ఎక్కడికి.. విశ్వ : నేనేం ప్లాన్ చెయ్యలేదు.. ఇక నుంచి నేను ఈ టీమ్ కి మెంబెర్ ని మాత్రమే.. లీడర్ షిప్ కిరణ్ చూసుకుంటాడు.. తననే అడగండి.. కిరణ్ ఆనందంగా మొహం వెలిగిపోవడం చూసి అందరూ నవ్వుకున్నారు.. రియా నడుచుకుంటూ వచ్చి..: నెక్స్ట్ ఎక్కడికి కెప్టెన్ ... అంది.. కిరణ్ నవ్వుతూ అందరినీ చూసి : పారిస్.. సమాప్తం
❤️❤️❤️
❤️
గాఢంగా ప్రేమించుకున్న విక్కీ మిత్రా కలుసుకుంటారో లేదో ఇక అది దేవుడి విధి లిఖితం. కథ నచ్చితే LIKE RATE COMMENT చెయ్యండి
21-07-2022, 10:31 PM
Super kani mitra kuda kalidi unte bagundi,and e missions lo thanu kuda unte bagundedi, just my opinion
21-07-2022, 11:23 PM
22-07-2022, 12:04 AM
ఫణి & మణి
(J1)
మణి : రేయ్ ఫణి.. అన్నయ్యా....కొంచెం చూపించరా. ఫణి : ఆగరా నన్ను ముందు రాయని.. ఓ.. దొబ్బుతున్నావ్ ఇందాకటి నుంచి. మణి : రాసింది చాలు చూపించు బె. ఫణి : నాలుగో ప్రశ్నకి ఆన్సర్ ఎంత వచ్చింది? మణి : నాకు లెక్కలు రావని తెలుసు కద రా. ఫణి : సరే ఇదిగో నాలుగోది ఇప్పుడే అయిపోయింది రాసుకో... (ఈ పాప ఎవ్వరో తెగ రస్తుంది)... ష్.. ఏయ్.. నిన్నే.... పాపా... ఓయి పచ్చ డ్రెస్సు.. నిన్నే. అమ్మాయి : ఏంటి? ఫణి : నాలుగోది ఆన్సర్ ఎంత వచ్చింది? అమ్మాయి : నాకు ఆ ప్రశ్న అర్ధం కాలేదు.. వదిలేసా. ఫణి : అలాగే లే.. రాసుకో... ఛీ.. ఇందాకటి నుంచి తెగ రస్తుంటే మనకంటే ఇంటెలిజెంట్ అనుకున్నా.. కాదు.. రేయ్ అయిపోయిందా. మణి : ఆ.. ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ యేనా? ఫణి : అదే అర్ధం కాట్లేదు.. ఇక్కడ నా కంటే తెలివైన వాళ్ళు ఎవ్వరు కనిపించడంలేదు. ఇంతలో లెక్కల మాస్టారు క్లాస్ లోపలికి వచ్చాడు. అమ్మాయి : సర్.. నాలుగోది.. నాకు అర్ధం కాలేదు. మాస్టారు : అందరూ వినండి.. నాలుగో ప్రశ్న.. అవుట్ ఆఫ్ సిలబస్.. వదిలెయ్యండి. ఫణి : అమ్మ నీయమ్మ.. అందుకేనా మూడు సార్లు చేస్తే మూడు ఆన్సర్లు వచ్చాయి. ఫణి చిన్నగా పళ్ళికిలించి నవ్వుతూ వెనక్కి తిరిగి మణి ని చూసాడు.. మణి కోపంగా ఫణినే చూస్తున్నాడు. ఫణి : సారీ యే... మణి : సారీ ఏంట్రా నీ యబ్బ. ఇన్విజిలేటర్ : ఎవడ్రా అక్కడా......
22-07-2022, 03:35 AM
(21-07-2022, 10:09 PM)Takulsajal Wrote: Super update bro but flight nundi kindha padithe paiki potharu kada. Any way ending kabati no problem. Mitra kuda kallisithe bagundedhi.
22-07-2022, 02:09 PM
THANKYOU ALL
సెక్స్ స్టోరీస్ కాకుండా ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ❤️
22-07-2022, 02:11 PM
(This post was last modified: 22-07-2022, 02:16 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
వీరభద్ర
జయదేవ్ : రేయ్ గుణ... ఎక్కడ్రా మీ అన్న... పదో తరగతి నాలుగో సారి రాయడానికి రెడీ అవుతున్న గుణ జయదేవ్ వైపు తిరిగి నవ్వుతూ... గుణ : అన్న ఆ si మణిని లేపడానికి పోయిండు... ఇంత పొద్దున్నే పోయిండంటే కచ్చితంగ నన్ను దింపడానికి కాలేజీ టైం వరకు వచ్చేస్తాడు నాన్నా.. జయదేవ్ : వాడి సంగతి సరే మరి నీ సంగతేంటి ఈ సారి అయినా పాస్ అవుతావా? గుణ : ఈ సారి కచ్చితంగా పాస్ అవుతా నాన్న.. నేను, పక్కనే అన్న, మమ్మల్నిద్దరినీ దీవిస్తున్నట్టు పైన మీరు ఆల్రెడీ బ్యానర్ కూడా చేపించినా....నేను ఎగ్జామ్ కి పోడం రాయడం ఆ తరువాత పాస్ అవ్వడం.... సిటీ మొత్తం మన బ్యానర్లతో ఊగిపోద్ది. జయదేవ్ : ఇంటర్ కి ఇంత బిల్డప్ అవసరమా? గుణ : మరీ, వీరా తమ్ముడంటే ఆ మాత్రం ఉండద్దు.. అస్సలే ఇవ్వాళ మన వీరన్నదీ వందో మర్డర్.... సాయంత్రం కేక్ కటింగ్ కూడా చేస్తున్నరు మనోళ్లు... అని ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకుని బైటికి పరిగెత్తి వాళ్ళ అన్న కోసం వెయిట్ చేస్తున్నాడు. జయదేవ్ : వీడు మారడు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు... ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ »»» పార్క్ «««
సూర్యుడు వచ్చి పది నిముషాలు అవుతుంది. వీరా : ఏం మణి పొద్దున్నే జాగ్గింగ్ చేస్తున్నావా? ఆ వాయిస్ లోని బేస్ విని మణి భయంగా చుట్టు చూసాడు... వీరా : నిన్ను ఎయ్యడానికి కూడా నాకు మనుషులు కావాల్నా? అని గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు... దానితో పక్కనే ఉన్న రిలాక్స్ బెంచ్ ముందు పడ్డాడు... వీరా వెళ్లి బెంచ్ మీద కూర్చున్నాడు తన కుడి చేతికి ఉన్న రుద్రాక్ష దండ సర్దుకుని, కాలు మీద కాలు వేసుకుని సిగిరెట్ వెలిగించాడు... ఇరవై ఆరెళ్ల వీరా హాఫ్ హాండ్స్ షర్టు, పైన రెండు బటన్స్ పెట్టుకోలేదు, గడ్డంతొ మెడలో సన్నటి చైను, కండలు తిరిగిన బాడీ...తన కుడి చేతికి రుద్రాక్ష మాల చుట్టుకుని సిగరెట్ వెలిగించిన వీరాని చూస్తే పెద్ద పెద్ద పొలిటిషన్స్ కే చెమటలు పడతాయి ఆఫ్టరాల్ si మణికన్నన్ ఎంత. మణి వెళ్లి వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు..."నన్ను వదిలేయ్ వీరా ప్లీజ్ మీ గురించి నిన్నే తెలుసుకున్నాను ఇక మీ జోలికి రాను పిల్లలు కలవాడిని" అన్నాడు. వీరా : అరెరే ఎంత మంది పిల్లలు ఏంటి నీకు.. మణి : ఇద్దరు... వీరా : అయ్యయ్యో నువ్వేం వర్రీ గాకు డ్యూటీలో చనిపోయినవ్ అని నీకు గవర్నమెంట్ నుంచి పైసలు ఇప్పిస్త. ఇక నీ పిల్లలకి ఏ లోటు ఉండదు... ఇక నీ పెళ్ళానికి నీలోటు లేకుండ నేను చూసుకుంట. మణి కోపంగా "వీరా" అన్నాడు. వీరా : నీకే అంత కోపమొస్తే, మా నాయన మీద సాక్ష్యాలన్ని రెడీ చేసినవ్, నా మర్డర్ కేసులన్ని బైటికి తోడినావ్, నా మనుషలని ముగ్గురిని లోపలిసినవ్ మరి నిన్నేం చెయ్యాలా? "మా నాన్న ఫైల్ ఎవ్వరికి తెల్వకుండా దాసినవ్, నా ఫైల్ దాసినవ్ గట్లనే ఈ కత్తి కూడా దాస్కో" అని కత్తి తీసి మణి గుండెల్లో గుచ్చాడు.... "నీ లక్ ఏందో తెలుసా ఇది నా వందవ మర్డర్, ఇంకేంది మరి నేను చెప్పాలషింది మొత్తం చెప్పినా ఇంకేమన్న చెప్పాలనా పోయిరా మరీ" అని కాలితో గుండె మీద ఉన్న కత్తిని తన్నాడు... కత్తి మొత్తం గుండెల్లోకి దిగింది... ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ »»»» ఇంటి బయట ««««
శంకర్ : "గుణ బాబు ఈ సారి ఎట్లైనా పాస్ అయ్యి వీరన్న పరువు నిలబెట్టాల" అని కత్తిని తన వేలితో కోసుకుని వీర తిలకం దిద్ది మెడలో దండ వేసాడు.. బైట రోడ్ మీద తెల్ల కార్ వెళ్తుండగా సడన్ గా జయదేవ్ ఇంటి ముందు ఆగింది... అందులోనుంచి వీరా మేనమామ రాజేందర్ తన ఇద్దరు కూతుర్లు పల్లవి, జానకి దిగారు... రాజేందర్ : అటు సూడండి వాడ్ని, ఎగ్జామ్ కి ఎలత్తన్నట్టు లేదు మేకపోతుని బలివ్వడానికి తీసుకెళ్తున్నట్టు ఉంది. దానికి పల్లవి, జానకి నవ్వారు.. అక్కడున్న గుణ ఇంకా రౌడీలు అందరూ కార్ ఆగిన వైపు చూసారు, అందరు ఒక్కసారి సైలెంట్ అయ్యారు.. ఎందుకంటే అక్కడ ఉన్నది వీరా మేనమామ కాబట్టి. "చుడండ్రా" అని ఎగ్జామ్ పాడ్ తో ఉన్న పల్లవిని చూపించి... "నా తల్లీ అన్ని ఫస్ట్ అట్టెంప్ట్ లే, ఈడు ఉన్నాడు మూడు ఏళ్ల నుంచి రాస్తూనే ఉన్నాడు".. శంకర్ : ఈ సారి పాస్ అవుతాడు, మరేం గుణ? (పొగరుగా) గుణ : మరే...కచ్చితంగా...(కాన్ఫిడెంట్ గా) రాజేందర్ : ఏడిసాడు ఎదవ... పదండి తల్లీ ఎందుకు ఇక్కడ టైం వేస్ట్... గుణ : ఎందుకు మామ అంత కోపం. ఈలోగ వీరా జీప్ లో స్పీడ్ గా వచ్చి డోర్ తీసి అందులోనుంచి దిగుతుండగానే, రాజేందర్ నోటి నుంచి "ఎవడ్రా నీకు మామ, నువ్వేమైన నా చెల్లికి పుట్టావా, కనీసం ఎవడికి పుట్టావో అదైనా తెలుసా" అని వినిపించింది... దానితో వీరా జీప్ డోర్ ని ఒక్క తన్ను తన్నాడు... ఆ సౌండ్ కి అక్కడున్న అందరికి జల్లుమంది. రాజేందర్ : చిన్నగా "పదండి పదండి వెళ్ళిపోదాం" అని తన ఇద్దరి కూతుర్లని ఎక్కించుకుని అక్కడనుంచి జారుకున్నాడు.. అప్పుడే వీరాకి చదువు చెప్పిన రాధా మేడం గేట్ లోపలికి వచ్చింది. రాధ : ఏంటి వీరా ఎలా ఉన్నావ్? వీరా : అర్రే రాధా మేడం మీరా? ఊర్లోకి ఎప్పుడొచ్చిల్లు అంతా బాగేనా?.... సారీ నిల్సొబెట్టే మాట్లాడుతున్న... రేయ్ తొందర కుర్చీ దేరా. వెంటనే గుణ కుర్చీ తీసుకొచ్చి వేసాడు.. రాధ : కుర్చీలో కూర్చుంటూ "బాగున్నాను వీరా, నీకోసమే వచ్చాను" అంది. వీరా : ఎదురు కుర్చీలో కూర్చుంటు "చెప్పండి మేడం నాతోని ఎమన్న పనిబడ్డదా? రాధ : లేదు వీరా అమ్మాయి పెళ్లి, నిన్ను పిలుద్దామని వచ్చాను. వీరా : ఓ అట్లనా.. చెల్లి పెళ్ళా? అప్పుడే అంత పెద్దదైపోయిందా చూసి చానా రోజులైతాంది, కత్చితంగ ఒస్తా. రాధ : ఒక్కడివే రా, ఈ మందని ఏసుకొని రౌడీలాగ రాకు, నా స్టూడెంట్ లా రా... అని లేచింది, పెళ్లి పత్రిక అందిస్తూ. వీరా : మా వృత్తే అది గద మేడం, నేనొక్కన్నే వస్తలే... రేయ్ గుణ మేడంకి కాఫీ పట్కరాపో రాధ : లేదు వీరా వెళ్ళాలి, పెళ్ళికి వస్తావుగా అక్కడ మాట్లాడుకుందాం. వీరా : మేడం ఆగుర్రి... రేయ్ సంజు కార్ తీస్కుని మేడం ఏడకి ఏడకి పోవాలనో దెగ్గరుండి తీస్కపో మల్ల బస్సు ఎక్కేదాంక దెగ్గరుండి చుస్కో పో. రాధ : ఎందుకు వీరా. వీర : ఇది మాత్రం కాదానకుర్రి, సంజూ బండి తీరా.... జీప్ తీసి రివర్స్ తీసాడు వీరా, గుణ ఎక్కి కూర్చున్నాడు ఎగ్జామ్ కి పోనిస్తుండగా శంకర్ "రేయ్ పొట్టేలు కొట్టండ్రా ఇవ్వాళ" అన్నాడు. వీర : "ఆగుర్రి ఆగుర్రి ఆ పొట్టేలుని అట్నే ఉంచండి" అని గుణ భుజం మీద చెయ్యి వేసి "వీడు ఈ సంవత్సరం పాస్ అయిండనుకో పొట్టేలు కొట్టండి, పాస్ గాలేదనుకో దాని స్థానంల వీణ్ణి పెట్టి కొట్టండి" అని ముందుకి పోనిచ్చాడు. ::::::::::+++::::::::::+++::::::::::
సాయంత్రం అన్నకి దావత్ ఇస్తుంటే పోయిన శంకరన్న వాళ్లు ఆల్రెడీ తాగి పడిపోయింరు, అంతా మందు వాసన... అన్నకోసం వెతుక్కుంటా పోయిన ఇంతలనే వెనక నుంచి ఒకటి పీకిండు అన్న. వీర : ఏం చేస్తున్నావ్ రా ఈడ? గుణ : అది నీకోసమే వచ్చిన అన్నా.. వీర : ఈడకి రావొద్దని చెప్పినా, ఒక సారి చెప్తే సమజ్ గాదా పో ఇంటికి పో. నిరాశగ కేకు తినకుండనే వచ్చిన అన్న ఎప్పుడు అంతే నన్ను తనతోని గల్వనియ్యడు ఎప్పుడు దూరం పెడుతుంటడు. ఇంటికి పోతుంటే జానకి వదిన కనిపించింది, స్కూటీ మీద పోతూ... జానకి : ఏరా గుణ ఇంటికేనా? దా బండెక్కు నిన్ను డ్రాప్ చేసి వెళ్తా.... వదిన బండి ఎక్కి వెనకాల కూర్చున్నా. జానకి : ఏంట్రా డల్ గా ఉన్నావ్ ఏమైంది? గుణ : ఏంలేదు వదినా పార్టీ జరుగుతాంది కేకు తిందమని పోయిన దానికే తిట్టిండు అన్న మస్తు బాధగున్నది. జానకి : వద్దని చెప్తే ఎందుకు వెళ్ళావ్ మరీ? గుణ : ఏమో అన్న పొద్దున్నుంచు కనపళ్లే చూద్దమని పోయిన. జానకి బేకరి ముందు ఆపి గుణాకి కేక్ తినిపించింది ఇంతలోనే పల్లవి కూడా బేకరీకి వచ్చి వీళ్లిద్దరిని చూసి దెగ్గరికి వచ్చి కూర్చుంది. జానకి గుణకి, పల్లవికి ఇద్దరికీ కేక్ ఇప్పించింది. గుణ : వదిన ఇంకెన్ని రోజులు ఇట్ల జల్ది నువ్వు అన్నా పెళ్లి చేసుకోర్రి మస్తు ఉంటది. వదిన : ఇదే ముక్క మీ అన్నకి చెప్పొచ్చు కదా? గుణ : అన్ననా....చెప్తే ఏమంటడో తెలుసా... "చిన్న పిల్లాడివి నీకెందుకురా ఇవన్నీ పో పొయ్యి చదువుకో పో" అంటడు. గుణ అలా వీరాని ఇమిటేట్ చేసేసరికి ఇద్దరూ పడి పడి నవ్వారు. గుణ : కానీ వదిన అన్న మస్తు మంచోడు అన్న మంచితనానికి చేసేటి పనికి అస్సల్ సంబంధంలే, నేనెవర్ని అన్నకి ఏం గాను అయిన కూడ నన్ను సొంత తమ్ముని లెక్క చూసుకుంటడు... అప్పుడప్పుడు అనిపిస్తుంటది అన్న ఈ దందాలు రౌడీసం వదిలేస్తే బాగుంటది అని అన్నకి ఏమైతదో అన్న భయం, వదిన నువ్వెట్లైన అన్నని షాది చేసుకొని అన్నని మార్చేయ్. వెనకే నిల్చుని ఉన్న వీరా "ఇచ్చిన సలహాలన్ని అయిపోయినయా ఇంకేమన్న ఉన్నయా?" గుణ : "ఆమ్మో అన్నోచ్చిండు" అని కుర్చీలోనుంచి లేచి జానకి వెనకాల దాక్కున్నాడు. అక్కడనుంచి గుణని తీసుకుని వీరా ఒకసారి జానకిని చూసి వెళ్ళిపోయాడు, జానకి తన చెల్లెలితో ఇంటికి వెళ్ళిపోయింది. ::::::::::+++::::::::::+++::::::::::
జోరుగా వర్షం పడుతుంది ఉరుములతో చెవులు నొప్పి పెడుతున్నాయి, కరెంటు పోయేసరికి లేచి చూసాను పక్కన అమ్మ లేదు అటు ఇటు చూసాను ఎక్కడా కనిపించలేదు, ఇంత పెద్ద పాలస్ లాంటి ఇంట్లో అమ్మని వెతకడం కష్టమయ్యి గట్టిగా భారతీ అని అరిచాను నేను అరిచిన చప్పుడు నాకే స్పష్టంగా వినిపించట్లేదు, పరిగెత్తుకుంటూ అన్ని రూమ్ లు వెతుకుతున్నాను సమయానికి నాన్న కూడా లేరు.... అలా వెతుకుతూ వెళ్తున్న నాకు ఇంటి వెనక డోర్ నుంచి అమ్మ బైటికి వెళ్ళటం కనిపించింది, తన చేతిలో బ్యాగ్ తొ. వీరభద్ర : భారతి ఎక్కడికి వెళ్తున్నావ్? నా మాట వినగానే అమ్మ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి నా నోరు మూసి అటు ఇటు చూసి "ష్.. చిన్నగా మాట్లాడు". వీరభద్ర : ఎటు వెళ్తున్నావ్ ఇంత వర్షంలో... చేతిలో ఆ బ్యాగ్ ఏంటి? భారతి : పని మీద వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను. వీరభద్ర : నేను వస్తాను. భారతి : నేనే వస్తానుగా నువ్వెళ్ళి పడుకో.. వీరభద్ర : నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా... నువ్వు వచ్చే వరకు నేను లేచే ఉంటా.. భారతి : ఆమ్మో అయితే త్వరగా వెళ్లి వచ్చేయాలి అని నా నుదిటి మీద ముద్దు పెట్టి వర్షంలో తడుస్తూ బైటికి వెళ్ళింది. నేను వెళ్లి మంచం మీద కూర్చున్నాను, భారతి కోసం ఎదురు చూస్తూ మూడు రోజులు దాటింది కంటి మీద కునుకు లేదు నా భారతి జాడ కూడా లేదు, ఇంట్లో పనివాళ్లంతా భోజనం చెయ్యమని బతిమిలాడుతున్నారు కానీ నాకు ఏడుపు, బాధ తప్ప ఇంక వేరే ఆలోచనలు రావట్లేదు. నాలుగో రోజు కూడా అలానే మంచినీళ్లు తాగి మళ్ళీ మంచం ఎక్కి కూర్చున్నాను, నాన్న ఊరినుంచి వచ్చి అందరి మీద అరిచాడు... "వెళ్ళండి ఎక్కడున్నా దాన్ని వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయ్యండి" అని అరవటం విన్నాను.... అంతే మెలుకువ వచ్చింది నా వాళ్లంతా చెమటలు... ఆరోజు భారతి వెళ్లిపోయిన దెగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ప్రశాంతంగా నిద్ర పోయిందే లేదు...
22-07-2022, 02:13 PM
(This post was last modified: 22-07-2022, 04:19 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
గుణ : అన్నా.. నేను కూడా వస్తనన్న పెళ్ళికి.
వీర : నువ్వు దేనికిరా.. గుణ : ఊరికే అన్న ఇక్కడ మస్తు బోర్.. నేను కూడా వచ్చి పెళ్లి చూస్త అన్న. వీర : సరే పో.. రెడీగా.. గుణ : యే... అనుకుంటూ రెడీ అవ్వడానికి బాత్రూంలోకి దూరాడు. ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ గుణ కార్ ఎక్కుతూ.. అన్నా పెళ్లి ఎక్కడా.. వీర : వైజాగ్.. బీచ్ దెగ్గర.. హోటల్లో. శంకర్ : వీరా... ఆ SI మణికన్నన్ గాడి ఫ్యామిలీని ఏం చేద్దాం.. వీర : వదిలెయ్యండి.. వాడు డ్యూటీలో ఉండగా పోయడానికి మేనేజ్ చేసి వాడి భార్యకి రావాల్సిన డబ్బు గవర్నమెంట్ నుంచి ఇప్పించండి.. ఎవ్వరు వాళ్ళ జోలికి వెళ్లొద్దు.. నేను వెళ్తున్నాను నాన్న జాగ్రత్త.. అని స్కోర్పియో ని ముందుకి పోనిచ్చాడు. బండి నేరుగా వైజాగ్ వెళ్లి ఆగింది.. హోటల్ కి వెళ్లి రూమ్ తీసుకున్నారు.. వీర : గుణా నువ్వు పడుకో నేనలా బైటికి వెళ్ళొస్తాను. గుణ : అలాగే అన్నా.. కొంత సేపటికి డోర్ చప్పుడుకి లేచి డోర్ తీసాడు.. గుణ : అన్నా... నువ్వేనా.. షేవింగ్ కటింగ్ చేస్కొని వచ్చినవా.. మస్తున్నవ్. వీర : అట్లనా... నువ్వు పక్కకి జరిగితే పొయ్యి స్నానం జెస్తా... అని గుణ తల మీద మొట్టికాయ వేసి లోపలికి వెళ్లి మంచం మీద కవర్ పడేసి వెళ్ళాడు. గుణ : అన్నా.. ఎంటివి.. డ్రెస్సులు.. అబ్బా మస్తున్నయి.. స్టైల్ గా.. మన ఇద్దరికా.. వీర : అవునురా.. ఇద్దరు రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకున్నారు .. గుణ : అన్నా.. హీరో లెక్కున్నవ్.. మస్తున్నవ్ అన్నా.. నిన్ను చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ గావాల్షిందే.. వీర : చాల్లే పదా.. ఇద్దరు రెడీ అయ్యి పెళ్లి దెగ్గరికి వెళ్లారు.. లోపలికి వెళ్ళగానే అందరూ కుర్చీల్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అక్కడ జానకి కనిపించింది. గుణ : అన్నా.. వదిన.. వీర : ఎక్కడా? గుణ : అదిగో.. వదినా.. వదినా... గుణ గొంతు గుర్తుపట్టి జానకి వెనక్కి తిరిగింది.. చాలా రోజుల తరువాత జానకిని చీరలో చూసి ఎలా వీరా స్టన్ అయ్యాడో అంత కంటే ఎక్కువగా వీరాని ఇలా కొత్త బట్టలు నీట్ గా చూసేసరికి మళ్ళీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయి.. జానకి : వీరా.. భలే ఉన్నావ్.. చూసి ఒక్కసారి నువ్వేనా అన్న డౌట్ వచ్చింది. వీరా : పదండి లోపలికి వెళదాం.. జానకి వీరాని కౌగిలించుకుని ఏడ్చేసింది.. జానకి : ఒక్క సరైనా... నవ్వరా.. నాకు నా పాత వీరా కావాలి.. ఎన్ని రోజులైందో నీ మొహం మీద నవ్వు చూసి.. అని గట్టిగా వాటేసుకుంది.. అది చూసి గుణ కూడా కళ్ళు తుడుచుకున్నాడు. ముగ్గురు లోపలికి వెళ్లగానే గుణని చూసిన తన పాత స్నేహితులు లేచి హత్తుకుని ఒక్కొక్కరు ఏం చేస్తున్నారని పలకరించుకున్నారు.. వీరా మాత్రం తన గురించి ఏం చెప్పలేదు.. అక్కడికి రాధ మేడం వచ్చి అందరినీ పలకరించి వీరాని చూసి ఆశ్చర్యపోయి.. రాధా : వీరా.. ఇలా రా.. ఎన్ని రోజులైందిరా.. నిన్ను ఇలా చూసి.. అని పెళ్లి కూతురు రూమ్ దెగ్గరికి తీసుకెళ్ళింది...చాలా బాగున్నావ్ వీరా.. నీకు గుర్తుందా.. టీచర్స్ డే రోజు నాకు ప్రపోస్ చేసావ్.. అప్పుడు చిన్నవాడివి కానీ ఇప్పుడు మళ్ళీ ప్రొపోజ్ చేస్తే నీకు పడిపోతానేమో. వీరా : ఊరుకోండి మేడం.. మీరు మరీ... ఎత్తేస్తున్నారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు.. అప్పుడేదో పనిలో ఉండి అడగటం మరిచిపోయాను. రూమ్ డోర్ తీసి.. లోపలికి తీసుకెళ్ళింది.. రాధా : ప్రణీత... అన్నయ్య వచ్చాడు. ప్రణీత లేచి వీరాని చూసి చుట్టు ఉన్న అందరినీ పక్కకి నెట్టి వెళ్లి వీరాని కౌగిలించుకుంది. ప్రణీత : అన్నయ్య... బాగున్నావా.. వీరా : సూపర్ గా ఉన్నావ్.. ప్రణీత : పో.. అన్నయ్యా.. ఎప్పుడు రమ్మన్నా రావు.. మమ్మల్ని దూరంగా పెట్టేసావు.. నా పెళ్లికైనా వస్తావో రావో అని భయపడ్డాను తెలుసా.. రాధా : వీరా.. రా పెళ్ళికొడుకుని పరిచయం చేస్తాను.. వీర : ఏం చేస్తుంటాడు.. రాధ : ముంబైలో అమ్మాయి ఆఫీస్ లో కొలీగ్.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. అందుకే.. అదిగో తనే.. పెళ్లి కొడుకు.. పేరు సుధీర్.. మన తెలుగు వాళ్లే కానీ ఎప్పుడో ముంబైకి వెళ్లి సెటిల్ అయ్యారట. మాట్లాడుతుండగానే.. సుధీర్ రాధా దెగ్గరికి వచ్చాడు.. రాధా : సుధీర్.. నేను చెప్పానే వీరా అని.. తనే మా వీరా.. సుధీర్ : హాయ్.. అండి.. మీ గురించి ప్రణీత చాలా చెప్పింది.. సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ కదా.. అంతలోనే అక్కడికి ఒకావిడ వచ్చింది... నవ్వుతూ సుధీర్ భుజం మీద చెయ్యి వేసింది.. రాధా : వీరా.. తను సుధీర్ వాళ్ళ అమ్మ... భవాని గారు.. అనగానే.. పలకరిద్దామని భవాని వీరాని చూసింది. వీరా కళ్ళలో నీళ్లు.. కోపం.. అన్నీ భవాని గమనించింది.. అన్నిటికంటే ఆ మొహం.. మర్చిపోలేని పోలికలు చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది... వీరా చేతికున్న రుద్రాక్ష తెగి కింద పడింది. సుధీర్ : ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉన్నాయి బ్రదర్.. అనగానే.. వీరా తెరుకుని సుధీర్ వైపు చూసాడు.. భవాని ఇంకా షాక్ లోనే ఉంది.. అయోమయంలో... వీరా : ప్రణీత నీకు అబద్ధం చెప్పింది.. వీరా మాటలు విన్న రాధ.. వీరా షర్ట్ పట్టుకుని లాగడం మొదలుపెట్టింది.. వీరా : నేనొక గుండాని.. సెటిల్మెంట్స్.. కబ్జాలు మర్డర్లు చేస్తుంటాను.. పైసలిస్తే ఎవరి గోంతైనా కోస్త.. అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పి.. తన అమ్మ భారతిని ఒకసారి చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు.. రాధ గమనించి వీరా దెగ్గరికి వెళ్తుంటే.. భవాని ఆపి... వదిన గారు ప్రణీత మిమ్మల్ని పిలుస్తుంది.. అని చెప్పి వీరా వెనకాల వెళ్ళింది.. భవాని : బాబు.. బాబు... అని పిలుస్తున్నా.. వీరా ఆగకుండా వెళ్ళిపోయాడు.. వీరా గుణ దెగ్గరికి వెళ్లి.. రేయి.. పదా వెళదాం.. జానకి : ఏమైంది.. ఎందుకు.. గుణ : ఏమైందన్నా.. వీరా : వస్తవా రావా.. గుణ : వస్తున్న.. బాయ్ వదినా. భవాని నేరుగా జానకి దెగ్గరికి వెళ్ళింది.. జానకి : హాయ్ ఆంటీ.. మీరు మా ప్రణీత అత్తగారు కదా.. భవాని : అవునమ్మా ... నిన్ను ఎక్కడో చూసినట్టుంది... నీతో ఇప్పుడు మాట్లాడిన ఆ అబ్బాయి పేరేంటి? జానకి : వీరా ఆంటీ.. మా బావ.. భవాని : అలాగా.. నీ పేరు? జానకి : జానకి ఆంటీ.. భవాని : (అమ్మ పేరు.. ) మీ నాన్న పేరు.. రాజేంద్ర? జానకి : అవును ఆంటీ.. మీకు మా నాన్న తెలుసా..? భవాని : అంటే వాడు.. భద్రా..? అని నోటి మీద చెయ్యి వేసుకుని ఏడ్చేసింది.. జానకి కంగారుపడుతూ.. ఆంటీ ఏమైంది.. అవును తన పూర్తి పేరు వీర భద్ర.. భవాని : జానకి.. నేను నీ అత్తని.. భారతి.. ఆమాట వినగానే భారతి చేతులు పట్టుకున్న జానకి కోపంగా వదిలేసింది.. అది భారతి చూసి.. భారతి : జానకి నన్ను వాడి దెగ్గరికి తీసుకెళ్ళు.. జానకి : అవసరంలేదు.. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు వదిలేయి వాడిని.. భారతి కళ్ళలో నీళ్లు చూసి మాట్లాడడం ఆపేసినా తన కోపం తగ్గలేదు.. భారతి కుర్చీలో కూర్చుని ఏడుస్తుంటే అది చూసిన రాధ దెగ్గరికి వచ్చింది ఏమైందంటూ.. భారతి జానకిని చూసి.. నా తప్పు లేదు పరిస్థితులవల్ల.. జానకి : అవును నీ జీవితం నీ ఇష్టం.. మావయ్య నిన్ను బలవంతంగా తీసుకొచ్చాడు.. నీకు నచ్చక నువ్వు వెళ్లిపోయావ్ ఇందులో నీ తప్పేం లేదు.. నేను నిన్ను ఏమనలేదు.. కానీ వాడిని కలవాలని అడగకు.. గొడవ జరుగుతుందని తెలుసుకున్న సుధీర్ ప్రణీత ఇద్దరు అక్కడికి వచ్చి.. జానకి తన అమ్మని తిడుతుంటే.. సుధీర్ ముందుకు వెళ్ళబోగా.. ప్రణీత ఆపి.. జానకి చెయ్యి పట్టుకుంది. ప్రణీత : వదినా.. ఏమైంది.. అన్నయ్య ఏడి..? ఇంతలో భారతి లేచి : ఒక్కసారి చూపించరా.. వాడికి నేను సంజాయిషీ ఇచ్చుకోవాలి.. జానకి ప్రణీత చెయ్యి వదిలించుకున : అవసరం లేదు.. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావ్.. నువ్వు వెళ్ళిపోయాక మావయ్య ఆయన జీవితం ఆయన చూసుకున్నాడు.. ఇంకో పెళ్లి చేసుకున్నాడు.. కానీ దాని వల్ల నష్టపోయింది నా బావ ఒక్కడే.. నువ్వెళ్ళిన దెగ్గరనుంచి ఒకటే ఏడుపట... అన్నం తినే వాడు కాదు.. నిద్ర పొయ్యేవాడు కాదట.. ఆ తరువాత కొన్ని రోజులు మా అందరి ముందు నవ్వుతూ కనిపించినా నాకొక్క దానికే తెలుసు వాడు నవ్వుతున్నాడో లేదో.. కాలేజీలో చేరాక నీకోసం పిచ్చి కుక్క లాగ వెతికాడు... నువ్వు దొరక్కపోయే సరికి కోపంతో పిచ్చెక్కి పోయేవాడు... నీ మీద కోపం పెంచుకుని.. కసిగా చదవడం మొదలు పెట్టాడు ఈ దేశం వదిలి పోడానికి.. కానీ మావయ్య వాడిని ఏమడిగాడో తెలీదు వారం తరువాత కత్తి పట్టాడు.. అందరినీ నరుకుతూ.. గొడవలు.. వాడి జీవితమే అల్లకల్లోలం అయ్యింది.. అదే నువ్వు వాడి పక్కన ఉంటే వాడి జీవితంలో ఇవన్నీ జరగనిచ్చేదానివా... ఇప్పుడు మళ్ళీ వాడిని కదిలించి.. వాడి మిగిలిన జీవితాన్ని కూడా నాశనం చెయ్యకు అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది. రాధ వెళుతున్న జానకి చెయ్యి పట్టుకుని ఆపింది.. జానకి వెనక్కి తిరిగి చూసింది. రాధా : జాను.. వీరా వాళ్ళ అమ్మా..? జానకి : మ్.. భారతి సుధీర్ ని వాటేసుకుని.. ఏడుస్తూ మాట్లాడుతుంది.. రాధా : జానకిని వెనక్కి లాగి.. జాను.. వాడి దెగ్గరికి తీసుకెళ్ళు.. జానకి : మేడం.. రాధా : తీసుకెళ్ళు.. వాళ్లిద్దరి బాధని ఒకేసారి తీర్చుకోనీ.. జానకి : ఇదే హోటల్లో రూమ్ నెం 112 లో ఉన్నాడు.. భారతి తన వెనకాలే సుధీర్ మరియు తన చెల్లెలు సుప్రియ భారతి వాళ్ళ ఆయన వెళ్లారు.. డోర్ కొట్టారు.. గుణ డోర్ తెరిచాడు.. అందరినీ చూసి.. అన్నా ఎవరో వచ్చారు.. వీరా.. బ్యాగ్ సర్దుతూ తల ఎత్తి చూసాడు.. ఎదురుగా భారతిని చూసి.. గుణా నువ్వు వదిన దెగ్గరికి పో.. నేను వస్తాను.. గుణ అలాగే అంటూ ఏడుస్తున్న భారతిని చూసి వెళ్ళిపోయాడు. భారతి లోపలికి వస్తూ.. వెనకున్న తన వాళ్ళని చూసి సైగ చేసింది అందరూ కిందకి వెళ్లిపోయారు.. భారతి : భద్రా.. వీరా : ఎలా ఉన్నావ్? భారతి ఏడ్చింది తప్పితే ఏం మాట్లాడలేదు.. వీరా : ఏడవకు.. నేను నిన్ను అర్ధం చేసుకున్నాను నా బాధంతా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక కనీసం నన్ను చూడటానికో.. లేక నువ్వు ఎక్కడున్నావో కూడా నాకు తెలియనివ్వలేదు.. నన్ను ఒక బరువు లాగ వదిలించుకుని వెళ్లిపోయావ్.. అందుకే నీ మీద కోపం.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు నాకు అది చాలు.. ఎలాగో మనం కలవలేం.. నువ్వు నాకు అవసరమైనప్పుడు నా దెగ్గర లేవు.. ఇప్పుడు నాకు అవసరం లేదు.. ఉన్నా నీకు ఉన్న బంధాలు మనల్ని కలవనివ్వవు.. నేను వెళ్తున్నాను.. వీరా.. వెళ్ళిపోతూ.. "భారతి.. నువ్వు నన్ను కనకుండా ఉండాల్సింది" అని వెళ్ళిపోయాడు.. వెనక భారతి ఏడుస్తూ కుప్పకూలిపోయింది.. వీరా బైటికి వచ్చి జానకి రాధా దెగ్గరికి వెళ్లి .. గుణని చూస్తూ.. వీరా : గుణా.. ఇక్కడ ప్రణీత అత్తగారింటికి వెళ్ళిపోయాక రాధా మేడం ఒక్కటే ఉంటుంది.. తనకి తోడుగా ఉంటావా.. నీకు ఒక అమ్మ దొరుకుతుంది అని రాధని చూసాడు.. రాధకి అర్ధమయ్యి గుణ చెయ్యి పట్టుకుంది.. గుణకి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి... జానకి చెప్పిందంతా విని.. గుణ : నువ్వు సంతోషంగా ఉంటే చాలన్నా.. అని కౌగిలించుకున్నాడు.. వీరా : జానకి పదా.. జానకి వీరా వెనుకే నడిచి.. గుణకి బాయ్ చెప్పి కార్ ఎక్కి కూర్చుంది. కార్ హైవే మీదకి ఎక్కే వరకు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. జానకి : బావ.. వీరా : చెప్పు.. జానకి : నీకు అవసరం అయినప్పుడు అమ్మా నాన్నా ప్రేమ దొరకలేదు.. కానీ నేనలా కాదు బావా.. చిన్నప్పటి నుంచి నీకోసమే నీతోనే ఉన్నాను.. నిన్ను వాళ్ళలా వదిలి వెళ్ళిపోను బావా చావైనా బత్తుకైనా నీతోనే.. నన్ను తీసుకుని.. ఈ గొడవలకి దూరంగా మనకి పరిచయం లేని పచ్చటి ఊరికి నన్ను తీసుకెళ్లిపో.. నీకు నేను.. నాకు నువ్వు అంతే.. అని వీరా బుగ్గ మీద ఏడుస్తూ ముద్దు పెట్టింది.. వీరా కార్ నడుపుతూనే.. హైవే మీద నుంచి దిగకుండా వేగంగా పోనిచ్చాడు.. జానకి బావా మనం వెళ్ళాల్సింది అటు అని చెప్తూనే.. ఎదురుగా కొచ్చి.. 1400 కిమీ.. అన్న బోర్డు చూసి.. వీరాని ప్రేమగా చూస్తూ గట్టిగా హత్తుకుపోయింది.. సమాప్తం
22-07-2022, 02:17 PM
22-07-2022, 04:17 PM
Super story bro , beautiful update, inka unda bro story
|
« Next Oldest | Next Newest »
|