23-12-2018, 07:49 AM
(This post was last modified: 23-12-2018, 07:51 AM by Vikatakavi02.)
ఇండోనేషియాలో వాల్కనో సునామీ విధ్వంసం.. 43 మంది మృతి.. 584 మందికి గాయాలు
సృష్టించింది. సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో 43 మందికి పైగా మృతి చెందారని, మరో 584మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని, పదుల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయని దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు సంభవించిన తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి చోటుచేసుకోవడమే ఈ సునామీకి కారణమై ఉంటుందని అధికారులు చెప్పారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పౌర్ణమి రోజు కావడం కూడా సముద్రంలో అలలు మరింత ఎగిసిపడేలా చేసి ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
సునామీ తర్వాత వీధులు జలమైనట్లుగా ఉన్న ఓ వీడియోను ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఒకదాని తర్వాత ఒకటి రెండు భారీ అలలు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షి ఓయిస్టన్ లండ్ అండర్సన్ బీబీసీకి చెప్పారు. సునామీ సంభవించిన సమయంలో ఆయన బీచ్‌కు సమీపంలోని హోటల్లో ఉన్నారు. మొదటి అల కంటే రెండోది మరింత బలంగా వచ్చి విధ్వంసం సృష్టించిందని ఆయన వివరించారు. అంతకు మందు భారీ పేలుడు శబ్దం కూడా వినిపించిందని తెలిపారు.
జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సండా స్ట్రెయిట్ ప్రాంతం జావా సముద్రం, హిందూ మహాసముద్రాలను కలుపుతుంది.
భారీ విలయాన్ని మరవకముందే
ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరులో ఇండోనేషియాలోని పాలు నగరంపై భారీ సునామీ విరుచుకుపడడంతో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి.
2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేషియా సహా 14 దేశాల్లో 2,28,000 మంది చనిపోయారు.
ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి.
అనక్ క్రకోటోవా (క్రకటోవాకు పిల్ల) అనే అగ్నిపర్వతం శుక్రవారం 2 నిమిషాల 12 సెకన్ల పాటు విస్ఫోటనం చెందింది. దాంతో పర్వతాల మీద దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడిందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
Source: BBC TELUGU

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK