10-11-2018, 04:21 PM
super ga undi ANNEPU garu, super super...........mee story ni evarina cinema gao chooste 100 days guaranty...............
Romance "అతి"మధురం
|
10-11-2018, 04:21 PM
super ga undi ANNEPU garu, super super...........mee story ni evarina cinema gao chooste 100 days guaranty...............
10-11-2018, 05:04 PM
అప్డేట్ లు చాలా బాగున్నాయి
10-11-2018, 08:26 PM
Nice updates brother and nice story
11-11-2018, 10:47 AM
దయచేసి అప్డేట్ ఇవ్వగలరు.
12-11-2018, 10:13 AM
21.ఫ్లాష్ బ్యాక్
ఆ రిపోర్ట్ పట్టుకుని రొడ్డు పై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంది రియా....తనకి ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు.....ఒక్కసారి గతం లోకి వెళితే.... **** గతం...... సినిమా కి వెళ్ళి ఆటో డ్రైవర్ బలవంతం చేస్తే అభి వచ్చి కాపాడిన రోజు కి దగ్గరికి వెళ్తే... "రా....."అని చెయ్యి పట్టుకుని లాకెళ్తున్న అభి ని అలానే చూస్తుండిపోయింది రియా..... అభి తనని తన బైక్ పార్క్ చేసిన చోటుకి తీసుకుని వెళ్ళి...బైక్ స్టార్ట్ చేసి...."ఎక్కు ...."అన్నాడు తన వైపే వింతగా చూస్తున్న రియా ని వుద్దేశించి.... "నడిచి వెళ్దామా....?"అడగాలా వద్దా అని ఆలోచిస్తూనే అడిగేసింది రియా వింతగా తన వైపు చూసిన అభి....."బైక్ వున్నప్పుడు నడవడం ఎందుకు,...?"అర్థం కానట్టు అడిగాడు అభి మారు మాట్లాడకుండా బైక్ ఎక్కి కూర్చుంది రియా.....ఒక్క కుదుపు తో బైక్ స్టార్ట్ అయ్యిందో లేదో.......రియా తన చుట్టూ చేతులు వేసి అభి ని గట్టిగా హత్తుకుంది..... ఒక్కసారిగా ఆ స్పర్శ లో అంతులేని ప్రేమ ,నువ్వు లేపోతే నేను లేననే నిస్సహాయత కనిపించాయి అభి కి....... ఒ 20 నిమిషాల తర్వాత..... వాళ్ల ఇల్లు చేరిన అభి....."రియా...?" అని పిల్చాడు.... రియా పలకలేదు......తనని గట్టిగా హత్తుకుని నిద్రపోతుంది....."రియా...?"అని మళ్ళి ఒకసారి పిలవడం తో.....ఈ సారి లేచిన రియా....బండి దిగి.....అభి కి దగ్గరాగా వచ్చింది......"అభి.....అది..."అంటూ ఆగింది "చెప్పు రియా....ఏమైంది...?"అడిగాడు అభి.... "ఏం లేదు...."అని ఇంట్లోకి వెళ్ళిపోయింది.... తన డైరి ఓపెన్ చేసి రాయసాగింది.... "అభి నీకు నేనెంటే ఎందుకంత ఇష్టం నీకు....?నీ కేరింగ్ ఎలా వుంటుందో తెల్సా.....నాన్న తన కూతురిని ఎంత జాగ్రత్తగా చూస్కుంటాడో అంత జాగ్రత్తగా నన్ను నువ్వు చూస్కుంటావ్...నాకే కష్టం రానివ్వవు...సినిమాల్లో హీరోలు అన్నట్టు ఏ కష్టమైన నా దరి చేరాలంటే అది నిన్ను ముందు దాటాలి అనేలా వుంటావ్......నీ ప్రేమ ని నేను తట్టుకోలేకపోతున్నాను...ఆ రోజు నువ్వు యూ.ఎస్ వెళ్ళాలంటే నీకో ప్రామిస్ చెయ్యాలి అని చెప్పి అణ్దరి ముందు నిశ్చితార్థం అని చెప్పేసరికి చాలా హర్ట్ అయ్యాను....కనీసం నా ఒపీనియన్ పట్టించుకోవా అని అనుకున్నాను....కాని నాకిప్పుడు అనిపిస్తుంది నువ్వు చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని...నువ్వు నన్నెంత కోరుకుంటున్నావో అని.....నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గ్రహించిన క్షణం నుంచి నేను నేనులా లేను....నీతో వుండాలని నీతో మాట్లాడాలాని చాలా అనిపిస్తుంది...బహుశా ఆరోజు నన్ను చూడ్డానికి నువ్వు చేసిన పని నేనిప్పుడు చెయ్యాలేమో...."అని డైరి మూసి....వాళ్ళింటి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి అభి వాళ్ళ ఇంటి టెర్రస్ మీదకి దూకి అభి రూం కి చేరి.....అభి నిద్రపోతుంటే రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయింది....... అలా రెండు గంటలు గడిపిన తర్వాత...చిన్నగా లేచి మళ్ళి తన రూం కెళ్ళి నిద్రపోయింది.... ఆ మరుసటి వుదయం.....అభి ఏదో పని వుండి బయటకి వెళ్ళడానికి రెడి అవుతున్నాడు అభి రెడి కిటికి లోంచి చూసిన రియా "అభి ...అభి..."అని పిల్చింది అభి కి వినపడలేదు..... అరిచింది అయినా వినపడలేదు .....ఇలా కాదని పేపర్ బాల్ చేసి విసిరింది జస్ట్ లో అభి కి తగలకుండా మిస్ అయ్యింది.....ఇంకో బాల్ విసిరింది అభి పట్టించుకోలేదు.......ఈ సారి ఇంకోటి విసిరింది అభి చూస్కోలేదు......చిరాకొచ్చిన రియా పక్కనున్న నైట్ ల్యాప్ ని ఎత్తింది కోపం లో.......అప్పుడు కానీ అభి చూడలేదు...........అభి చూసాడన్న సంతోషం లో నైట్ ల్యాప్ ని పడేసింది....అది కింద పడి డ్యామేజ్ అవ్వడమే కాదు రియా కాలిని కూడా డ్యామేజ్ చేసింది......"అమ్మా...అని పెద్దగా అరిచి కాలు పట్టుకుని బెడ్ పై కూర్చుండి పోయింది......ఒక 2 నిమిషాలు గడిచి వుంటాయేమో.....తన పక్కన ప్రత్యక్షమయ్యాడు....రియా కాలిని తన చేత్తో పట్టుకుని అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని కట్టు కట్టసాగాడు...."ఆ నైట్ ల్యాంప్ నిన్నేం చేసింది.....దాన్నెందుకు ఎత్తావ్ అస్సలు...?పిచ్చా నీకేమైనా...? "నాకు పిచ్చి కాదు నీకు చెవుడు ఎన్ని సార్లు పిల్చాను...కాదు కాదు అరిచాను కనీసం చూశావా.....పేపర్ బాల్స్ కూడా వేసాను నువ్వే చూడలేదు.....అందుకే కోపమొచ్చి దీన్ని ఎత్తి కింద పడెస్తే చూస్తావానుకున్నా కానీ ఇది నా కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు..."అంది రియా "అవునా ఎందుకు పిలిచావ్...?"అడిగాడు అభి "ఎక్కడికి వెళ్తున్నావ్...?"అడిగింది రియా "పనుంది బయటకి వెళ్తున్నా..."చెప్పాడు అభి "నేనూ వస్తా..."అంది ఎక్సైట్ అవుతూ రియా "ఏంటి ఈ అవతారం లోనా...?ఏం అక్కర్లేదు....కనీసం బ్రష్ అన్నా చేశావంటే.,,,,?"అడిగాడు అభి "లేదు...కానీ గివ్ మీ ఫైవ్ మినిట్స్ రెడి అయిపోతా....."అంది రియా నమ్మకంగా "ఏం అక్కర్లేదు......నాకు టైం అవుతుంది...బై..."అని వెళ్ళడానికి లేచాడు అభి "అభి ప్లీస్ రా....ప్లీస్...నేనూ వస్తా.....నాకొక్క ఐస్ క్రీం ఇప్పించు చాలు ప్లీస్...."అంది వేడుకొలుగా "సరే....ఏడ్వకు.....నేను కింద వెయిట్ చేస్తుంటాను వచ్చేయి......"అని కిందకి వెళ్ళబోతుండగా...ఆపేసింది రియా "ఏంటి కిందకి వెళ్తావా..?ఇంకేమైనా వుందా...అమ్మకి గోడ దూకి వచ్చావని తెల్సిపోతుంది.....ఇక్కడె కూర్చో.....ప్లీస్...."అంది రియా "నేను మా ఇంట్లో వుంటాను...నువ్వు రెడి అయ్యాక కాల్ చెయ్యి వస్తాను..."అని చెప్పాడు అభి "అరే కూర్చుంటే నీ సొమ్మేమన్నా పోతుందా....?కూర్చో...."అంది రియా "ఏంటె...తేడాగా మాట్లాడుతున్నావ్...?ఏం అక్కర్లేదు రెడి అవ్వగానే కాల్ చెయ్యి..."అని లేచి వెళ్ళిపోయాడు అభి.... "ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను..."మనసులో నవ్వుకుంది రియా రియా కాల్ చెయ్యడం తో ఇంటి బయటకి వచ్చి నిల్చున్నాడు అభి..... ఎదురుగా వస్తున్న రియా చూసి......నోరెళ్ళబెట్టాడు...... రెడ్ కలర్ శారి లో దేవకన్య లా వుంది తను.....ఒక టైం లో దేవకన్యలకి డ్రెస్ కోడ్ వైట్ నుంచి రెడ్ కి మార్చారా అని కూడా అనిపించింది తనకి.....అభి తననే చూస్తు వుండిపోయేసరికి రియా కి ఏదో లా వుంది... "ఓయ్...దిష్టి పెట్టకు...."అంది రియా "ఏంటె...ఈ కాస్ట్యూమి పెళ్ళికి కాని వెళ్తున్నావా ఏంటి...?"అడిగాడు అభి "కాదు గుడికి........"అంది రియా "మిట్ట మధ్యాహ్నం గుడి ఏంటి తల్లి....అయినా కొత్తగా ఈ భక్తి ఏంటి...?"అడిగాడు అభి "అవును కదా...సరేలే నువ్వేళ్ళు..రేపు నేను గుడికి వస్తాను...."అనేసరికి..."ఐస్ క్రీం కావాలి అన్నావ్ కదా రా....కొనిస్తాను"అన్నాడు అభి "ఆర్ యీ స్యూర్...?"అడిగింది రియా "హా రా "అన్నాడు అభి ఐస్ క్రీం పార్లల్ కి వెళ్ళిన ఇద్దరూ ఒక సీట్లో సెటిల్ అయ్యాక.... "ఏమ్ కావాలి...?"అడిగాడు అభి రియా చెప్పిన లిస్ట్ చూసి కళ్ళు తేలేశాడు...........!!!! *****
12-11-2018, 10:15 AM
22.మెమొరీస్
"ఏంటి...?ఇవన్ని తింటావా...?ఆర్ యూ ష్యూర్...?"అడిగాడు అభి "సర్లే వద్దులే......"అని మూతి ముడుచుకుంది రియా "ఐ లవ్ యూ...."అన్నాడు అభి తన వాలు కన్నులోకి చూస్తూ..... అంతే.....!!!ఫర్ ద ఫస్ట్ టైం ఏదో ఫీలింగ్ రియా ని చుట్టుముట్టింది.... ఇద్దరు ఐస్ క్రీం తిని బయటకి వచ్చారు..... అలా అభి తన పని చూస్కుని తిరిగి వాళ్ళిద్దరు ఇంటికి పయనమయ్యారు.... "అవును....ఏం పని మీద వచ్చావ్...?"అడిగింది రియా "అదా....యూ ఎస్ వెళ్తున్నాను కదా పాస్ పోర్ట్ పని మీద వచ్చాను లే....."అన్నాడు అభి "అభి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా...?"మనసులో అనుకున్న మాట తెలియకుండానే రియా నోట్లోంచి వచ్చేసింది అంతే సడన్ గా బండి ఆగింది....వెంటనే వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి విస్మయంగా చూశాడు అభి "వెళ్ళొద్దా రియా..?"ఆశగా అడిగాడు అభి "అయ్యొ...అదేం లేదు...ఏదో ఆలోచిస్తూ అనేసాను అంతే....నువ్వెళ్ళకపోతే ఎలా అభి...."అంది రియా వెంటనే.... "నిజం చెప్పు రియా.....నిజంగా నీకు నేను వెళ్ళడం ఇష్టమా...?"అడిగాడు అభి "వుండమని చెప్పలేను...అలా అని నువ్వెళ్తుంటే తట్టుకోలేను..."అని మనసులో అనుకుంది రియా "నువ్వు వెళ్ళాలి అభి......"అంది రియా మారు మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు అభి.....ఇల్లు రాగానే బైక్ దిగిన రియా....."బై....అభి"అంది భారంగా.... అభి అదేమి పట్టించుకోలేదు...కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి....అభి చెయ్యి పట్టుకుని"ఏమయ్యింది రా...?ఎందుకలా వున్నావ్...?"అడిగింది రియా తల అడ్డంగా వూపాడు అభి....."అభి....నా ముఖం చూడు...."అంది రియా బాధగా....తన వైపు చూసిన అభి కళ్ళలో నీళ్ళు...... "నాకు తెల్సు అభి....నువ్వు నీ కలనైనా వదులుకుంటావేమో గానీ నన్ను వదులుకోవు అని...కాని ఏం చెయ్యను వుండమని నేను చెప్పలేను..."అని మనసులో అనుకోని.....అభి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీస్కోని అతని నుదిటి మీద ముద్దు పెట్టింది రియా *** ఉదయం 6:30 "రేయ్...లే రా...!"అని అభి వాళ్ళమ్మ నిద్ర లేపడం తో..."అబ్బా...ఏమయ్యిందమ్మా...పొద్దున్నే ఈ నస ఏంటి నాకు...?"అన్నాడు అభి చిరాకుగా "రాత్రి కి నిశ్చితార్థం వుంది...నువ్వింకా డ్రెస్ తెచ్చుకోలేదు...లే లేచి రెడి అవ్వు...."అంది వాళ్ళమ్మ "నిశ్చితార్థమా...?ఎవరిది...?"అయొమయంగా అడిగాడు అభి "ఇంకెవరిది నీదే రాత్రే గా వచ్చి చెప్పాను.....అప్పుడె ఫిక్స్ అయ్యారు...ఇవాళ నిశ్చితార్థం అని...?"అంది వాళ్ళమ్మ దెబ్బకి నిద్ర మత్తు వదిలిపోయింది అభికి.."ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా....?"నమ్మలేనట్టుగా అడిగాడు అభి "అబ్బాబ్బా..నువ్వు ముందు లేరా....ఇప్పుడు బయలు దేరితే గాని సాయంత్రానికి నీ నిశ్చితార్థం అవ్వదు..."అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోయింది అంతా కలలా తోచింది అభి కి.....ఈ లోపు తననెవరో పిలుస్తుండటం తో అలర్ట్ అయిన అభి అటు ఇటు చూశాడు......పక్కింట్లోంచి రియా పిలుస్తుంది... "ఏంటి...?"అన్నాడు అభి "బ్లూ కలర్ షర్ట్ తెచ్చుకో నీకు బాగా సూట్ అవుతుంది" అంది రియా "నువ్వు రావా...?"అడిగాడు అభి "వస్తానన్నాను...కాని అమ్మ వద్దంది....మెహంది పెట్టించుకోవాలంట......ఫెషియల్ కూడా చెయ్యిస్తుంది అంట...సో నేను రావట్లేదు..."అంది డీలా పడుతూ రియా "అవును సడన్ గా ఈ నిశ్చితార్థం ఏంటి...?"అడిగాడు అభి "ఏమో....నాకు తెలీదు....అమ్మ పిలుస్తుంది...బై....లవ్ యూ"అని చెప్పి వెళ్ళిపోయింది రియా తను విన్నది నిజమేనా...అని ఒకసారి తన మాటలు రివైండ్ చేస్కున్నాడు అభి.......అంతే......ముఖం మీద చెప్పలేనంత ఆనందం క్షణాల్లో వచ్చి చేరింది.... *** రియా తిరిగి రూం కొచ్చి తలుపు వేద్దామని వెనక్కి తిరిగే సరికి తలుపు వెనక వున్నాడు అభి... "హే నువ్వేంటిక్కడ...?"అరిచింది రియా "ఇందాక నువ్వేం చెప్పావ్...?"అడిగాడు అభి "ఏం చెప్పాను బ్లూ షర్ట్ తెచ్చుకో అన్నాను..."అంది రియా "బై చెప్పిన తర్వాత ఏం చెప్పావ్....?"అడిగాడు అభి రియా కి అర్థం అయినా కానట్టు...."ఏమో...ఏం చెప్పాను ఇంతకి....?"అని అడిగింది "వేషాలు వెయ్యకు రియా....చెప్పు..."అన్నాడు అభి "ప్లీస్ రియా చెప్పు..."అన్నాడు బతిమాలుతూ "అరే....నాకు గుర్తులేదు....నువ్వు ముందు షాపింగ్ కి పో.....లేట్ అవుతుంది "అంది రియా "లేదు నువ్వు చెప్పాల్సిందే....నేను కదలను లేకపోతే...."అన్నాడు అభి "నిజంగా గుర్తులేదు రా బాబు...సరే వేరే ఏమైనా ఆప్షన్ వుందా...?"అడిగింది రియా కొంటెగా "లేదు...ఏ ఆప్షన్ లేదు....చెప్పు..."అన్నాడు అభి "ఉష్....ఏ ఆప్షన్ లేదా అభి.....ఆలోచించూ...."అంది దగ్గరికి జరుగుతూ అభి కి హింట్ ఇస్తూ బాగా ఆలోచించిన అభి....ఒక ఆప్షన్ ఇచ్చాడు....అది విన్న రియా కళ్లు తేలేసింది!!!!!!!
12-11-2018, 10:16 AM
23.ఐ నీడ్ యూ
"వేరే ఆప్షన్ లేదా....బాగా ఆలోచించు...."అని దగ్గరికి జరిగింది రియా బాగా ఆలోచించిన అభి....భారంగా ఊపిరి వదిలి...."కెన్ ఐ కిస్ యూ...?"అని అడిగాడు మొహమాట పడుతూ "అమ్మా....పర్లేదు బానే డెవలప్ అయ్యావ్....నువ్వు కూడా....."అంది రియా "యస్ ఆ నో ఆ...?"అనుమానంగా అడిగాడు అభి "నువ్వేమనుకుంటున్నావ్...?"ఆరాగా అడిగింది రియా "డెఫినెట్లి ఒప్పుకోవు...సో నువ్విందాక ఏం చెప్పావో అది ఇప్పుడు చెప్పు...."అన్నాడు అభి కళ్ళెగరేస్తు "ఆహా...అలానా...సరే నేను ఒప్పుకుంటున్నా....ముద్దు పెట్టు..."అంది రియా కన్నుగొడుతూ "నిజంగా రియా నిజంగా పెడతాను...."అన్నాడు అభి బెదిరిస్తూ "పెట్టమనే గా నేనూ చెబుతుంది..."అంది కొంటెగా "నిజంగా పెడతాను....చెబుతున్నా...."అన్నాడు అభి "ఉష్...పెట్టు...."అంది రియా "పెట్టెస్తున్నా......"అన్నాడు అభి....మరునిమిషం అభి బుగ్గ పై గట్టిగా ఒక ముద్దిచ్చింది రియా షాక్ అయ్యి చూస్తుండిపోయాడు అభి...."ఏంటి అలా పెట్టెసావ్....?"నమ్మలేనట్టుగా అడిగాడు అభి "నువ్వు ఇవ్వట్లేదు గా...అందుకె....సరే ఇంక పో...."అని రూం లోంచి అభి ని బయటకి తోసింది.... ఆ రోజు సాయంత్రం...... అప్పటికే రియా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు......ఇంతలో రియా రానే వచ్చింది....దివి నుంచి దిగి వచ్చిన తారక లా......ఆమెని చూస్తుంటే అందమే అసూయ పడుతుందేమో అన్నట్లుంది.....అందరి సమక్షంలో కన్నుల పండుగగా వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగింది........ వారం తర్వాత.....అభి యూ ఎస్ కి వెళ్ళె టైం రానే వచ్చింది...అతని ఫ్లైట్ రాత్రికి అనగా......ఆ రోజు వుదయం.... ఎవరో తన భుజం తట్టి లేపడం తో ఉలిక్కి పడి నిద్ర లేచాడు అభి....ఎదురుగా రియా "హే...నువ్వేంటిక్కడ...అదీ ఈ టైం....లో....?"అని గడియారం 4:30 గంటలు చూసి అడిగాడు అభి "నువ్వు ముందు రా...."అని చెయ్యి పట్టి బాల్కని లోకి తీసుకెళ్ళింది రియా "దిగు....."అని నిచ్చెన చూపించింది...."బయటకి వెళ్ళాలి అంటే ఇలానే వెళ్ళాలా...?డోర్ నుంచి వెళ్ళొచ్చు కదా...?"చలికి వణుకుతూ అడిగాడు అభి "నువ్వు దిగుతావా...?లేక నన్నేల్లి పోమంటావా...?"కన్నెర్ర చేస్తూ అడిగింది రియా "సారీ...పద వెళ్దాం..."అని నిచ్చెన దిగి ఆ తర్వాత రియా ని అనుసరించి కార్ ఎక్కాడు అభి.... "ఎక్కడికి వెళ్తున్నాము....అదీ ఇంత పొద్దున్నే...?"అడిగాడు అభి "కాసేపు నోరు మూస్కో...."అంది రియా సీరియస్ గా...మూతి ముడుచుకుని కూర్చున్నాడు అభి "అభి.....అలా కాదు రా..."అంది బుజ్జగిస్తూ రియా అభి ఏం మాట్లాడలేదు.......కార్ సడన్ గా ఆపి.......అభి చెయ్యి పట్టుకుంది రియా....రియా కళ్ళలోకి చూశాడు అభి.... "అభి....."ఆగింది రియా "ఏంటి...?"అన్నాడు అభి.... "అది......అది"అంది రియా "ఏంటది...?"అడిగాడు అభి తన సీట్ బెల్ట్ తీస్తూ.....అభి ముఖన్ని తన చేతుల్లోకి తీస్కుంది రియా.....అనుమానంగా చూశాడు అభి....ముందుకు వంగి....అభి ని గట్టిగా హగ్ చేస్కుంటూ...చెవిలో మెల్లగా "ఐ లవ్ యూ...."చెప్పి బుగ్గ పై ఒక ముద్దిచ్చింది రియా.....ఒక 2 నిమిషాల కౌగిలి తర్వాత......వెనక్కి తగ్గి...అభి కళ్ళ లోకి సూటిగా చూస్తూ...."రా...."అని డోర్ తీసి బయటకి నడిచింది...తనని అనుసరించాడు అభి..... బయటకి వస్తూనే అభి చేతిని తన చేతిలోకి తీస్కొని....అతని భుజం మీద తల వాల్చి.....అప్పుడె వస్తున్న సూర్యుడ్ని చూస్తూ......మళ్ళి...అభి ని గట్టిగా కౌగిలించుకుంది....."ఈ క్షణం ఇలా గడిచిపోతే...ఎంత బాగుండొ...."అని మురిసిపోయింది..... 2 గంటలు మాటలు లేని మౌనం లో....మనసులతో మమేక మైపోయిన పిమ్మట....ఇద్దరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు....ఆ సాయంత్రం.....మనసు సహరించకున్న విమానం ఎక్కేసి యూ ఎస్ వెళ్ళిపోయాడు అభి.... 2 నెలల తర్వాత....... రియా ప్రాజెక్ట్ పని లో పడి అభి తో మాటలు తగ్గించింది....మాట్లాడాలని మనసు పరితపిస్తున్న ఏమి చేయలేని నిస్సహయాతలో......తనతో మాట్లాడలేకపోయింది.....ఫైనల్ గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన మరుక్షణం.......అభి కి కాల్ చేసింది........ రియా:అభి........... అభి చాలా నీరసంగా వున్నాడు రియా:ఏమయ్యింది రా అలా వున్నావ్...? అభి:నేనిక్కడ వుండలేను.....వచ్చేస్తాను.......ఐ బ్యాడ్లీ నీడ్ యూ...నా వల్ల కావటం లేదు...ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్..... రియా:అలా అంటె ఎలా కన్నా....?ఇంకొన్ని నెలలే కదా....ప్లీస్ అలా అనకు.... అభి:నా వల్ల కాదు రియా ఇంతలో అభి వాళ్ళ రూమ్మెట్ వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు..... "అన్నా ఏమయ్యింది...?టాబ్లెట్స్ ఏంటి....?"అడిగింది రియా జరిగింది చెప్పాడు అభి వాళ్ళ రూమ్మెట్......రియా కి చాలా కోపమొచ్చి వీడియో కాల్ కట్ చేసింది...ఆ తర్వాత అభి ఎన్ని సార్లు చేసినా రియా రిప్లయ్ ఇవ్వలేదు..... 2 రోజుల తర్వాత...... బెంచ్ పై కూర్చుని రియా కి కాల్ చేస్తున్నాడు అభి...ఎంతకి కాల్ కలవట్లేదు........బాధ గా తన ఫోన్ లో వున్న రియా ఫోటొలు చూస్తున్నాడు.....ఫోటొలు ఏమి చూశావ్..డైరక్ట్ గా చూడు....అనెసరికి తల ఎత్తి చూసిన అభి షాక్.......ఎదురుగా రియా తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు.... "ఓయ్....ఏంటింకా లేట్...గివ్ మీ ఏ హగ్....."అంది రియా చేతులు చాపుతూ...... అంతే రియా ని గట్టిగా చుట్టెసిన అభి ఏడ్చేశాడు....."ఐ మిస్ యూ...ఎ లాట్......ఐ లవ్ యూ....."అంటూ ఏడుస్తూనే వున్నాడు...... రియా అభి ని ఒక కార్నర్ కి తీసుకెళ్ళి అక్కడెవరూ లేరని నిర్థారించుకున్నాకా....అభి ని పట్టుకుని ఏడ్చేసింది...."ఈవెన్ ఐ మిస్డ్ యూ ఎ లాట్...."అని కళ్ళలోకి చూసింది....వెంటనే అతని పెదవులని అతని పెదవులతో మూసేసింది........They kissed like there was no tommorow......!!!! ఆ మరుసటి రోజు వుదయం....ఎయిర్ పోర్ట్ "చూడు.....ఇంకొసార్ నిన్ను నువ్వు హర్ట్ చేస్కుంటే బాగోదు చెబుతున్నా....ప్రామిస్ మీ ఇంకొసారి ఇలా చెయ్యి కోసుకోవడాలు లాంటివి చేయనని..."చెయ్యి ముందుకి చాపుతూ అడిగింది రియా "ఐ ప్రామిస్ యూ రియా....ఐ లవ్ యూ..."అన్నాడు అభి "కన్నా.....ఆ రోజు ఎంత భయపడ్డానో తెల్సా......ప్లీస్ సీరియస్ గా చెబుతున్నా ఇంకొసారి ఈ పిచ్చి పనులు చెయ్యకు నేను తట్టుకోలేను...."మళ్ళి చెప్పింది రియా "హా సరే...ఐ యాం సారి...."అన్నాడు అభి...ఇంతలో అభి కి విజయ్ నుంచి కాల్ వచ్చింది.....అభి కాల్ మాట్లాడెసిన తర్వాత.... "ఎవరు...?నేను నిన్న పిక్స్ లో చూసాను కదా మీ సీనియర్ తనేనా...?"అడిగింది రియా "హా అవును....."అన్నాడు అభి "నీకోటి చెప్పనా....నీ సినియర్ చాలా బావున్నాడు....నాకు సెట్ చేయ్యొచ్చు గా...."కన్ను కొడుతూ అడిగింది రియా వెంటనే అభి బుంగమూతి పెట్టడం చూసి అతని బుగ్గ కి ఒక ముద్దిచ్చి..."డార్లింగ్ జోక్ చేశాను లే....రా..."అని నవ్వేసరికి అభి కూడా నవ్వేశాడు...... *** అమెరిక నుంచి వచ్చిన వారం తర్వాత రియా కి ఒంట్లో బాలేక హాస్ప్టల్ కి వెళ్తే......టెస్ట్ లు చేసి తను ఎక్కువ కాలం బతకదు అని చెబుతారు..... అది విన్న రియా తన వల్ల అభి బాధపడకూడదని అభి తో మాటలు తగ్గించేస్తుంది......అభి కూడా ఏదో స్ట్రెస్ లో వుండి ఆ విషయం పట్టించుకోడు....వీలున్నప్పుడల్లా తనతో మాట్లాడుతూనే వుంటాడు ఆ తర్వాత అభి నుంచి దూరంగా వచ్ఛేస్తుంది...... బై ద వే తను వచ్చేటప్పూదు అభి కి కోసం తన డైరి ని కూడా వదిలేసి వస్తుంది.... **** ఆ డైరి లో తను వేరొకర్ని లవ్ చేస్తున్నానని కావాలని రాస్తుంది.....అప్పటి దాకా తను చూపించిన కేర్ తనకి చిరాకు తెప్పించిందని అసలైన ప్రేమ తన ప్రేమిస్తున్న వారి కళ్ళలో చూశానని రాస్తుంది.... ***** అమెరికా నుంచి వచ్చిన అభి రియా కోసం ఎదురు చూస్తే.....రియా డైరి తన చేతికి వచ్చింది ....అది చదివిన అభి మొదట నమ్మక పోయినా......రియా తనని ఈ సంవత్సర కాలం దూరం పెట్టడం...అది కాక ఆ డైరి లోని రియా మాటలు తన నమ్మకాన్ని ముబ్బు కమ్మినట్టు కమ్మేసాయి.....!!! ****** ఇది గతం...... రియా మళ్ళి అభి ని చేరుకుందా లేదా...?అభి తన మాటలు నమ్మాడా లేదా...?ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే...నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వేచి చూడాలి...... ****
12-11-2018, 11:11 AM
సుపర్ చెప్పటానికి మాటలు చాలవు,, రియా తన వల్ల అభి బాధపడటం ఇష్టం లేక ఇలా చేస్తుంది అని క్లారిఫికేషన్ ఉచ్చారణ.
12-11-2018, 11:28 AM
అప్డేట్ లు చాలా బాగున్నాయి.
Waiting for your next update
12-11-2018, 11:39 AM
(This post was last modified: 12-11-2018, 11:41 AM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఎక్సపెక్ట్ చేశా బ్రో రియా కావాలనే అభి కి దూరంగా ఉండాలని అనుకుంటుంది అని., అంతలా ప్రేమిస్తున్నాడు అని తెలిసి వదిలివచ్చేయటానికి రియా అంత తెలివి తక్కువైనది కాదు అని. చాల మంచి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటో అని ఆసక్తిగా వుంది. రియా & అభి ల ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమ సముద్రంలా పొంగి పొర్లింది. ఇప్పుడు ఇద్దరు ఎలా కలుసుకుంటారో, విజయ్ ఎలా దానిని తీసుకుంటాడో చూడాలి. చాల ఆతృతగా వెయిట్ చేస్తున్న వాళ్ళ కలయిక కోసం. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... మీ =>విక్కీ<=
12-11-2018, 11:40 AM
Super update
12-11-2018, 01:58 PM
Bhayya chala bhindi update please continue cheyyandi
12-11-2018, 02:30 PM
SUPER, WAITING FOR NEXT UPDATE
12-11-2018, 10:07 PM
24.నిజం..?
"ఈ రోజు విజయ్ వచ్చేస్తాడు.....తనెకెలాగైనా ఈ విషయం చెప్పాలి...లేదు ముందు అభి ని చూడాలి...అభి తో మాట్లాడాలి......."అని అనుకుంటూ ఆఫీస్ చేరింది రియా లోపలికి అడుగుపెట్టడం ఆలశ్యం.....అభి క్యాబిన్ వైపు పరుగు తీసింది.......అభి ముందెవరో అమ్మాయి కూర్చుని వుంది.....ఆ అమ్మాయెవరో కనిపించడం లేదు కాని అభి మాత్రం తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు....ఇంతలో ఆ అమ్మాయి...తనతో పాటు అభి కూడా లేచాడు.... అభి కొంచెం ముందుకి వచ్చి...తనని హగ్ చేస్కున్నాడు....ఒక్కసారిగా గుండెల్లో అగ్ని పర్వతాలు పేలాయి రియా కి ఆ షాక్ లో వుండగానే....ఆ అమ్మాయి ముఖం కనిపించి..ఇంకో షాక్ తగిలింది....ఆ అమ్మాయెవరో కాదు అభి క్లాస్ మెట్ షాలిని....తనకి అభి అంటే చాలా ఇష్టం....తనకి ఇక్కడేం పని....?అభి తనని ఎందుకు హగ్ చేస్కున్నాడు....?మెదడు ప్రశ్నలతో హీట్ ఎక్కిపోతోంది........ ఇంతలో డోర్ తెరుచుకుంది షాలిని బయటకి వచ్చింది........రియా తనకి కనపడకుండా పక్కకి తప్పుకుంది...తను బయటకి వచ్చేసిన తర్వాత...అభి క్యాబిన్ లోకి తుఫాన్ లా ప్రవేశించింది రియా "అభి....నీతో నేను మాట్లాడాలి......"అంది రియా "కాల్ మీ సార్......"కోపంగా అన్నాడు అభి "నేను మన విషయం మాట్లాడాలి..."మాటకి మాటా చెప్పింది రియా "మీ పర్స్ నల్ విషయాలు మాట్లాడాలి అంటే ఇప్పూడు కాదు ఆఫీస్ అయిపోయిన తర్వాత...నౌ యూ మే గో...."అన్నాడు అభి "లేదు నేనిప్పుడే మాట్లాడాలి"అంది రియా "ఒకే ఫైన్ ఆఫీస్ అయిన తర్వాత కూడా నేను మీతో మాట్లాడను...."అన్నాడు అభి "ఫైన్.....అఫీస్ తర్వాతే మాట్లాడతాను..."అని వెళ్ళిపోయీంది రియా 6 గంటలు ఎప్పుడెప్పుడవుతుందా అని వాచ్ చూస్కుంటూనే వుంది........6 కి సరిగ్గా పది నిమిషాలు వుందనగా.....తన కళ్ళ ముందే....షాలిని తో కలిసి నవ్వుతూ బయటకి వెళ్ళిపోయాడు అభి.,,.... వెంటనే మ్యానేజర్ దగ్గరికి పరుగు తీసింది రియా "సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి..."అని అంది రియా "ఇంకో పది నిమిషాలే కదమ్మా...."అన్నాడాయనా "లేదు సార్.....చాలా సీరియస్ ఇష్యూ నా లైఫ్ కి సంభందించిన మ్యాటర్ ప్లీస్ సార్..."అంది రియా "లేదమ్మా......."అని ఆయన కారాఖండిగా చెప్పేశాడు....ఒక రెండు నిమిషాలు బతిమాలి......ఇక ఆయన వినడని వెళ్ళిపోతుండగా....ఆయన పిల్చేసరికి వెనక్కి తిరిగి చూసింది... "6 అయ్యింది అమ్మా...నువ్వెళ్ళొచ్చు..."అన్నాడాయన మనసులో తిట్టాల్సినవన్ని తిట్టుకుని...బయటకి పరుగు తీసింది రియా....పార్కింగ్ లాట్ లో నవ్వుతూ తుళ్ళుతూ మట్లాడుకుంటూ కనిపించారు షాలిని-అభి....వాళ్ళిద్దరిని అలా చూసి ఒళ్ళు మండిపోయీంది రియా కి........... నేరుగా అభి దగ్గరికి వెళ్తుండగా....అభి షాలిని తో పాటు కార్ ఎక్కి తన ముందే వెళ్ళిపోయాడు....పళ్ళు పట పటా కొరికింది రియా....వెంటనే ఫోన్ కలిపింది....ఎన్ని సార్లు చేసినా అభి ఎత్తకపోయే సరికి చాలా చిరాకొచ్చింది.... రాత్రి 8:30.... ఎయిర్ పోర్ట్ కి ఆటోలో చేరుకుంది రియా....."ఇవాళ ఎలాగైనా విజయ్ కి విషయం చెప్పేయాలి...."అని ధృడంగా నిశ్చయించుకుని.....లోపలికి అడుగుపెట్టింది......అప్పటికే అక్కడికి అభి వచ్చున్నాడు....బ్లూ షర్ట్ లో....అది చూడగానే రియా కి వాళ్ల నిశ్చితార్థం అయిన రోజే గుర్తొచ్చింది....వెంటనే నేనున్నా అంటూ కన్నీళ్ళు కూడా వచ్చాయి...... ఇంతలో విక్కి....అన్న పిలుపు వినపడి అటు వైపు చూసిన ఇద్దరికి చెయ్యి వూపుతూ కనిపించాడు విజయ్ వాళ్ళిద్దరి దగ్గరికి రాగానే రియా ని గట్టిగా హగ్ చేస్కున్నాడు విజయ్......ఒకేసారి ఇద్దరు(అభి-రియా) ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.... "ఐ మిస్డ్ యూ ఏ లాట్....రియా..."అన్నాడు అభి కౌగిలిని విడిచేస్తూ.... "ఐ మిస్డ్ యూ టూ అభి..."అసంకల్పితంగా వచ్చిన మాటలకి విజయ్-అభి ఇద్దరు షాక్ అయ్యారు.....కాని విక్కి కలగజేసుకుంటూ...."రా రా..."అని బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచాడు....విజయ్ రియా చేతిని పట్టుకుని వెనక అనుసరించాడు.... "విజయ్ నీతో కొంచెం మాట్లాడాలి..."పక్కకి జరుగుతూ చెప్పింది రియా "హా చెప్పండి మ్యాడం...ఐ యాం ఆల్వేస్ యువర్స్ "అన్నాడు విజయ్ అభి డ్రైవ్ చేస్తున్నాడు....వాళ్ళిద్దరూ వెనక కూర్చున్నారు...."విక్కి...మమ్మల్నిక్కడ డ్రాప్ చేసేయి.....మేము వచ్చేస్తాం...."అని అన్నాదు విజయ్ రియా కి విజయ్ మీద చాలా కోపమొచ్చింది....కాని ఇప్పుడు కోప్పడే టైం కాదని ఊరుకుంది కాని ఒకసారి కార్ దిగాక కోపం పట్టలేక అనేసింది..."విజయ్ నువ్వు విక్కి తో అలా చెప్పడం ఏం బాలేదు....తనమైనా అనుకుంటే...?" "వాడేం అనుకోడులే...రియా...నువ్వేదో మాట్లాడాలన్నావ్...చెప్పు...."అన్నాడు విజయ్ "అది ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు.....ఐ యాం రియల్లి సారి విజయ్....దిస్ ఈస్ నాట్ మెండ్ టు హర్ట్ యూ.....నీకు నేను నా గతం ఒక ఫేస్ వరకే చెప్పాను...అసలు కధ చెప్పలేదు.....నీకు చెప్పినట్టు....నేను అభి ని ద్వేషించలేదు....ఇన్ ఫాక్ట్ ప్రాణం కన్నా ప్రేమించాను.....తన కోసం అమెరికా కూడా వెళ్ళాను...అప్పుడే నిన్ను చూశాను...నేను అభి కి దూరం అవ్వాలి అంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి అని అనిపించింది అందుకే నేను నిన్ను లవ్ చేయకపోయినా చేశాను అని చెప్పాను...కాని ఆ తర్వాత నేను చేస్తున్న పని నాకు నచ్చలేదు అందుకే.....నీ దగ్గర మరలా లవ్ టాపిక్ తీసుకు రాలేదు....కాని ఇంతలోపే నువ్వు నన్ను లవ్ చెయ్యడం ప్రపోస్ చెయ్యడం...విధి లేని పరిస్థితిలో నేను నీకు ఒకె చెప్పడం వెను వెంటనే జరిగిపోయాయి....కాని నీకు వెంటనే నేను చెబుదామనుకున్నాను కాని ఇంతలోపే నువ్వు ప్రాజెక్ట్ కోసం వెళ్ళిపోయావ్....ఈ విషయాన్ని కలిసి చెబితేనే నీకు అర్థమవుతుంది అని ఇన్ని రోజులు ఆగాను...ఐ యాం రియల్లి సారి..."అని వెనక్కి తిరిగి చూసేసరికి విజయ్ కళ్లలో నీళ్ళు.... "విజయ్...ఐ యాం సారి నా వల్ల నువ్వు..." ఆపమన్నట్టు చెయ్యి చూపించాడు విజయ్....ఏం చెబుతాడా అని టెంషన్ తో విజయ్ వంక చూస్తుంది రియా...!
12-11-2018, 10:44 PM
అప్డేట్ చాలా బాగుంది భయ్యా ప్లీస్ కంటిన్యూ
12-11-2018, 11:32 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల ఇంరెస్టింగ్ ఫేజ్ లో ఇప్పడు కథ ఉంది, ఈ అప్డేట్ చాల ఫాస్ట్ గ నడిచింది. రియా కూడా డొంకతిరుగుడు గ కాకుండ సూటిగా సుత్తిలేకుండా డైరెక్టుగా చెప్పేసింది. నిజంగా హర్ట్ అయ్యేలా మొహం మీద చెప్పింది ఎందుకు విజయ్ లవ్ ని ఒప్పుకుందో. విజయ్ కన్నీరు చెబుతుంది తాను హర్ట్ అయ్యాడో లేదో అని. ఇప్పుడు విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆసక్తి తో కూడిన అతృతతో వెయిట్ చేస్తున్న. అభి రియా విషయం తెలిసి ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... మీ =>విక్కీ<=
12-11-2018, 11:44 PM
super
13-11-2018, 08:14 AM
అప్డేట్ బాగుంది.
తరువాత విజయ్ ఏమి చెప్తాడో చూడాలి.
13-11-2018, 11:54 AM
25.మోసం..
"ఏం మాట్లాడుతున్నావ్....రియా....నువ్వు చెప్పిందంతా అబద్దం అని చెప్పు...నేను కలగంటున్నానని చెప్పు...."అని తన భుజం పట్టుకుని కన్నీళ్ళు దిగమింగుకుంటూ అడిగాడు విజయ్ "ఐ యాం సారీ విజయ్..."అతి కష్టం మీద చెప్పింది రియా ఆ మాట వినడం తోనే అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు విజయ్.....వెంటనే అతని వద్దకు పరుగుతీసింది రియా...."వద్దు నా దగ్గరికి రావొద్దు......"అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.....వెనకనే అతన్ని అనుసరించింది రియా... ఒక్క వుదుటున వెనక్కి తిరిగి....."డోంట్ ఫాలో మి...."అని అన్న విజయ్...వడి వడి గా ముందుకు అడుగులు వేశాడు.... వెంటనే రియా అభి కి కాల్ చేసింది..."ద నెంబర్ యూ ఆర్ కాలింగ్ ఈస్ కరెంట్లి బిసి..ప్లీస్ ట్రై ఎగైన్ లేటర్..."అని రావడం తో.....వెంటనే ఒక మెసేజ్ పెట్టింది..."కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ..." షాలిని తో ఫోన్ మాట్లాడుతున్న అభి తన మెసేజ్ చూసినా కూడా పట్టించుకోలేదు... గంట తర్వాత....ఫోన్ పెట్టెసిన అభి కాల్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు......ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది.... "నీతో మాట్లాడాలి,...మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నా...నువ్వు రా...."అని చెప్పి ఫోన్ కట్ చేసింది రియా ఒక అరగంట గడిచాక కిందకి వెళ్ళాడు అభి.....చలిలో అక్కడున్న ఫుట్ పాత్ పైన కూర్చుని వుంది రియా....అభి రావడంతోనే...లేచి నిల్చుంది....." "ఏంటి...?"అడిగాడు అభి....అభి లేట్ గా వచ్చాడన్న కోపమున్నా.....తమాయించుకుని...."నేనొక పని చేశాను...దాని వల్ల ఏం జరుగుతుందో నాకర్థం కావట్లేదు..."అంది రియా ఆందోళనగా "ఐతే నేనేం చెయ్యాలి..."చిరాకుగా ముఖం పెట్టి అడిగాడు అభి ఒక్క నిమిషం షాక్ అయ్యి....మరు నిమిషం తేరుకుని..."ఐ హోప్ యూ విల్ స్టాండ్ బై మై సైడ్..."అంది అతని కళ్ళలోకి చూస్తూ...చేతులు కట్టుకుని చూస్తున్నాడు అభి "నేను విజయ్ కి చెప్పాను.,....తనంటే నాకు లవ్ లేదని...దానికి కారణం...."అని చెప్పబోతుండగా ఇంట్లోంచి గావు కేక వినపడటంతో.....పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు అభి...ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే ఆగిపోయింది రియా.....సరిగ్గా 5 నిమిషాల తర్వాత....కార్ లో బయల్దేరిన అభి ని చూసి రియా కి ఏం అర్థం కాలేదు......."ఏమై వుంటుంది ...?"అని ఆలోచిస్తు వుండిపోయింది.... ఆ మరుసటి వుదయం 4:20 కి అభి నుంచి రియా కి కాల్ రావడం తో....వెంటనే ఫోన్ ఎత్తింది రియా "హలో...."అంది రియా "కేర్ వెల్ హాస్పిటల్ కి రా నువ్వు అర్జెంట్ గా"అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభి....హుటాహుటిన హాస్పిటల్ చేరిన రియా అక్కడ కనిపించిన దృస్యానికి నిశేష్టురాలై నిల్చుండిపోయింది.....బెడ్ పై విజయ్ స్పృహ లో లేడు అతని చేతికి కట్టు వుంది.....రియా ని చూసిన అభి.....రియా ని పక్కకి లాకెళ్ళి.,..."అసలు ఏం చేశావ్...వాడ్ని...? ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే తప్పకుండా నీ హస్తం వుండే వుంటుంది ఏమయ్యింది చెప్పు...?"నిలదీశాడు అభి తల వంచుకున్న రియా...మెల్లగా తల ఎత్తి...."తనని నేను లవ్ చెయ్యట్లేదని చెప్పాను...."అంది ఏడుస్తూ "నువ్వెందుకే ఏడుస్తావ్...నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను-నీ కోసం ప్రాణాన్నే తీసుకోవాలనుకున్న వాడు ఏడ్వాలి...ఏమ్మా నీకు ఇంకా రాక్షసానందం చావలేదా...?ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావ్...?ఈ సారి ఎవరు దొరికారు నీకు...?"అడిగాడు అభి అభి మాటలు గునపాలై గుండెల్లో గుచ్చుకోగా......"అది కాదు అభి...."అని సర్ది చెప్పబోతుండగా..... "అది కాదు అభి.....నేను ఇదంతా చేసింది నీకోసం నీ ప్రేమ కోసం...."అని జరిగిన విషయమంతా చెప్పింది.....రియా "నోర్మూయ్...ఇదింకో నాటకమా..."అని తన చెంప చెళ్ళుమనిపించాడు అభి ఆ దెబ్బ నిజంగా తగిలిందేమో...అన్నట్టు నిద్ర నుంచి మేల్కుంది రియా....టైం చూస్తే 7:30 ఇంకో అరగంట లో విజయ్ ఫ్లైట్ దిగుతాడు......అని అంచనా వేసి...వెనువెంటనే ఎయిర్పోట్ కి బయలుదేరింది రియా
13-11-2018, 11:55 AM
తన కలలో మాదిరిగానే అభి వాళ్ళ నిశ్చితార్థపు షర్ట్ వేసుకున్నాడు...అతన్నే చూస్తుండగా విజయ్...."హాయ్..."అంటూ అభి దగ్గరికి వచ్చాడు....కాని రియా ని కౌగిలించుకోలేదు....కార్ లో వెళ్ళేటప్పుడు
"రియా....నువ్వు నాతో ఏదో మాట్లాడాలి అన్నావ్ గా...చెప్పు"అన్నాడు విజయ్ "అది.....అది..."అని నాంచింది రియా "విక్కి మమ్మల్నిక్కడ వదిలేసేయి...నువ్వింటికెళ్ళిపో...."అని చెప్పి విక్కి ముఖం వైపు చూశాడు.....విజయ్ చెప్పిన ఆ మాటకి విక్కి ముఖం లో నవ్వు మయమయ్యింది..... విక్కి వాళ్ళిద్దర్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత... "చెప్పు రియా...."అన్నాడు విజయ్ "అది...అది..."అంది రియా చెప్పాలా వద్దా అన్న సంశయం లో..... "నన్నెందుకు మోసం చేశావ్ రియా...?"అన్న విజయ్ మాటతో.....చిరుక్కున విజయ్ వైపు చూసింది రియా |
« Next Oldest | Next Newest »
|