Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 404
Threads: 2
Likes Received: 54 in 46 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
7
Next update epudu prasad gaaru. Waiting..
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(12-12-2018, 11:46 AM)Bubbly Wrote: Next update epudu prasad gaaru. Waiting..
రెడీ చేస్తున్నాను బబ్లి గారు.....తొందరగనే ఇస్తాను....
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
కాలం నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా రాము ఎం మారలేదు, చక్కగా సునీతా తో ఎంజాయ్ చేసాడు. అది కాకుండా తిరిగి వచ్చి సునీతా తో నెల రోజులు గడుపుతానని చెప్పాడు. రాము ముంబై వెళ్లిపోతుంటే సునీతా కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే ఏంటో ఇద్దరి మధ్య కామం తో పాటు ఇంకా ఎదో బంధం మొదలయ్యినట్టుంది. సింపుల్ గానే ఒక్క లైన్ లో ముంబై లో రాము వారం రోజుల జర్నీ పూర్తి చేసారు, ఇక మీద ఎలా ఉంటుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. రేణుక ఫామిలీ తో కలిసి ఉంటాడా లేదా అనేది చూడాలి. నేను బాగా ఎక్సైట్ గ ఫీల్ అవుతున్న, అనిత & శ్యామల లతో రాము ఎలా అలరిస్తాడా అని, అలాగే వాళ్ళు ఈ కథలో వుంటారా లేదా అనికూడా తెలియటం లేదు. రాము జీవితం ఎలా సాగుతుందో చూడాలి, కొత్త మగువలు వేటలో పడతాడా పడితే వారు ఎవరు అవుతారు అని కూడా వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 681
Threads: 0
Likes Received: 544 in 256 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
3
ప్రసాద్ గారు సూపర్ అప్డేట్ ఇచ్చారు .నెక్స్ట్ ప్రెసెంట్ లో ఏమిఅవుతుందో అని ఎదురుచూస్తున్నాము
మీ
జాక్
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(12-12-2018, 12:16 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
కాలం నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా రాము ఎం మారలేదు, చక్కగా సునీతా తో ఎంజాయ్ చేసాడు. అది కాకుండా తిరిగి వచ్చి సునీతా తో నెల రోజులు గడుపుతానని చెప్పాడు. రాము ముంబై వెళ్లిపోతుంటే సునీతా కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే ఏంటో ఇద్దరి మధ్య కామం తో పాటు ఇంకా ఎదో బంధం మొదలయ్యినట్టుంది. సింపుల్ గానే ఒక్క లైన్ లో ముంబై లో రాము వారం రోజుల జర్నీ పూర్తి చేసారు, ఇక మీద ఎలా ఉంటుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. రేణుక ఫామిలీ తో కలిసి ఉంటాడా లేదా అనేది చూడాలి. నేను బాగా ఎక్సైట్ గ ఫీల్ అవుతున్న, అనిత & శ్యామల లతో రాము ఎలా అలరిస్తాడా అని, అలాగే వాళ్ళు ఈ కథలో వుంటారా లేదా అనికూడా తెలియటం లేదు. రాము జీవితం ఎలా సాగుతుందో చూడాలి, కొత్త మగువలు వేటలో పడతాడా పడితే వారు ఎవరు అవుతారు అని కూడా వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
ఎప్పటిలాగే మీ రివ్యూ చాలా బాగున్నది....
కొత్త మగువుల వేట ఎప్పటిలాగే కొనసాగుతుంది.....
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 314
Threads: 5
Likes Received: 70 in 58 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
2
WAiting 4 Anitha Zareena n Pragathi Syamala
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
adbhutam prasad garu......flashback episode ni chala baaga....inkaa convinient ga....complete chesaru......inka next katha ni ela naduputaro chudali
•
Posts: 831
Threads: 4
Likes Received: 328 in 247 posts
Likes Given: 570
Joined: Nov 2018
Reputation:
6
Sare itcheyandi update marii
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(12-12-2018, 01:54 PM)BukkaaReddy Wrote: WAiting 4 Anitha Zareena n Pragathi Syamala
నేను కూడా అంతే ఆత్రంగా ఉన్నాను బుక్కారెడ్డి గారు......
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(12-12-2018, 01:54 PM)annepu Wrote: adbhutam prasad garu......flashback episode ni chala baaga....inkaa convinient ga....complete chesaru......inka next katha ni ela naduputaro chudali
చాలా థాంక్స్ అన్నెపూ గారు.....
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(12-12-2018, 02:42 PM)Loveizzsex Wrote: Sare itcheyandi update marii
ఇస్తాను loveizzsex గారు.....
•
Posts: 76
Threads: 1
Likes Received: 24 in 19 posts
Likes Given: 20
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
12-12-2018, 04:09 PM
(This post was last modified: 07-08-2019, 03:14 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 23
గుడి లోనుండి బయటకు వచ్చేంత వరకు రేణుక రాము చేతిని పట్టుకునే ఉన్నది.
పూజ అయిపోయిన తరువాత అందరూ బయటకు వచ్చారు.
(ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది)
మొత్తం చెప్పడం పూర్తయిన తరువాత రాము తన వాళ్ళందరి వైపు చూసి, “ఇదిరా జరిగింది…..” అన్నాడు.
రాము జరిగింది చెప్పడం పూర్తి అయిన తరువాత అందరూ అక్కడే ప్రశాంతంగా నిద్ర పోయారు.
ఆ తరువాత వారం రోజులు రాముకి తన కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళతో ఆనందంగా గడిపాడు.
ఆ వారం రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో రాముకే అర్ధం కాలేదు.
ఎప్పుడు ఫ్యాక్టరీకి సెలవు పెట్టని శివరామ్ కూడా ఆ వారం రోజులు రాముతో పాటే ఉన్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే ఒబరాయ్ ఫ్యామిలీ మొత్తం వారం రోజుల పాటు వెకేషన్ లో ఉన్నారనే అనుకోవాలి.
ఆ వారం రోజులు అందరు తమకు నచ్చింది చేస్తూ….రాముతో జోకులు వేస్తూ….ఆడుకుంటూ చాలా ఆనందంగా గడిపారు.
తరువాత రోజు రాము ఫోన్ లో మెయిల్స్ చెక్ చేసుకుంటుండగా సివిల్స్ రిజల్ట్ రావడం….తాను IPS కి సెలక్ట్ అవడం చూసి చాలా ఆనందపడిపోయాడు.
తను IPS కి సెలక్ట్ అయిన విషయం ఇంట్లో అందరికి చాలా ఆనందంగా చెప్పాడు.
దాంతో ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడిపోయారు.
విశ్వ అందరికీ స్వీట్లు పంచాడు…..కంపెనీలో అందరికీ ఒక నెల జీతం బోనస్ అనౌన్స్ చేసాడు.
కంపెనీలో ఎంప్లాయిస్ కూడా చాలా ఆనందపడిపోయారు…..విశ్వ తన కంపెనీల్లో, మీడియాకు రాముని తన కొడుకుగా శివరామ్, రాము ఇద్దరూ కవలపిల్లలని….చిన్నప్పుడే అనుకోకుండా తప్పిపోయి…ఇప్పుడు కలిసాడని అందరికీ పరిచయం చేసాడు.
అంతా హడావిడి అయిపోయిన తరువాత రాము తన గది లోకి వెళ్ళి ట్రైనింగ్ కి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ నెట్ లో పూర్తి చేసి…తన సర్టిఫికేట్లు స్కాన్ కాపీలు మొత్తం అప్ లోడ్ చేసాడు.
మొత్తం పని పూర్తి అయిన తరువాత రాము తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఈ న్యూస్ విన్న ఆయన కూడా చాలా ఆనందపడిపోయాడు.
రాము అలా రిలాక్స్ కాగానె విశ్వ, శివరామ్ ఇద్దరూ రూమ్ లోకి వచ్చి….
విశ్వ : ఏంటి నాన్నా….చాలా హుషారుగా ఉన్నారు….
రాము : అవునురా విశ్వ…..నాకు చాలా ఆనందంగా ఉన్నది….IPS అవ్వాలన్న కల ఇన్నాళ్లకు తీరుతున్నది.
విశ్వ : నాన్నా…..శివ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు….
ఆ మాట వినగానే రాము శివ వైపు తిరిగి…..
రాము : ఏంటిరా…నా దగ్గర నీకు దాపరికం ఏమున్నది…..చెప్పు…..
శివరామ్ : తాతయ్యా….మిమ్మల్ని అలా పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది….పెదనాన్న ఎలాగూ మిమ్మల్ని నా అన్నగా పరిచయం చేసారు కాబట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తాను…..
రాము : అలాగే…..నీకు నచ్చినట్టు పిలువు….అయినా ఇది అడగటానికి నీ పెదనాన్నను వెంట బెట్టుకుని వచ్చావు….
శివరామ్ : లేదు అన్నయ్యా….విషయం వేరే ఉన్నది….అది మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
రాము : ఏంటి అంత సీరియస్ మ్యాటరా……
శివరామ్ : సీరియస్ ఏం లేదు అన్నయ్యా….(అని చిన్నగా నవ్వుతూ) ఇంట్లో అందరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాము….ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను….
రాము : ఏంటిరా…అది….నీకు పెళ్ళి ఏమైనా ఫిక్స్ చేసారా…..లేక ఎవరినైనా లవ్ చేసావా….
రాము అలా అనగానే విశ్వ పెద్దగా నవ్వుతూ శివ వైపు చూసి….
విశ్వ : వీడు ఫ్యాక్టరీకి వెళ్తేనే అన్నం తినాలన్న సంగతే మర్చిపోతాడు….ఇక వీడికి లవ్ కూడానా…..
రాము : అయితే ఇంతకు విషయం ఏంటి…..
శివరామ్ : ఏం లేదు అన్నయ్యా….మనకు చాలా కంపెనీలు ఉన్నాయి కదా….మీరు ఇక జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి… అది కూడా ఒకరికింద పని చేయడం మాకు ఇష్టం లేదు….అందుకని మీరు కూడా మాతో పాటు మన కంపెనీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాము…..
రాము : నువ్వు చెప్పింది బాగానే ఉన్నది శివ….కాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి IPS అవ్వాలన్నది నా కల….
శివరామ్ : అది కాదు అన్నయ్యా…..
అని శివరామ్ ఏదో చెప్పబోతుండగా రాము అతని మాటలను మధ్యలోనే తుంచేస్తూ…..
రాము : అరేయ్ శివా….నా మాట విను….నేను మీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు….చాలా ఆనందంగా ఉన్నది….నువ్వు చెప్పినట్టు నేను కూడా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాను….(ఆ మాట వినగానే విశ్వ, శివరామ్ ఇద్దరూ ఆనంద పడ్డారు….) కాని నాదో చిన్న షరతు….(అనగానే వాళ్ళిద్దరూ ఏంటి అన్నట్టు రాము వైపు చూసారు) నా కల నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా…..అందుకని కొద్దికాలం జాబ్ చేసిన తరువాత మీతో పాటు జాయిన్ అవుతాను…..
శివరామ్ : అది కాదు అన్నయ్యా…..
రాము : ప్లీజ్ రా….ఇంకేం మాట్లాడొద్దు….కొద్దికాలం నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటి చేయాలి….ఆ సరదా తీర్చుకోనివ్వండి…..
రాము అంత గట్టిగా అనడంతో విశ్వ కాని, శివరామ్ కాని ఏం మాట్లాడలేకపోయారు.
కాని శివరామ్ ఏదో ఆలోచించిన వాడిలా రాము వైపు చూసి….
శివరామ్ : కాని మీరు కూడా మా మాట ఒకటి వినాలి…..
రాము : ఏంటో చెప్పు…..
శివరామ్ : డ్యూటీలో జాయిన్ అయిన తరువాత కూడా మీరు మాతో పాటే….ఇక్కడే ఉండాలి….
రాము : అది ఎలా కుదురుతుందిరా…..నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో నాకే తెలియదు….అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటాను….
శివరామ్ : అదంతా నేను చూసుకుంటాను అన్నయ్యా….మీరు ట్రైనింగ్ అయిపోయిన తరువాత మీకు ఇక్కడే పోస్టంగ్ వచ్చేలా అంతా నేను చూసుకుంటాను…..
రాము : అరేయ్….ఇది IPS రా…..ఎలా మ్యానేజ్ చేస్తావు…..
శివరామ్ : నాకు చాలా మంది మంత్రులు తెలుసు అన్నయ్యా…నేను పార్టీ ఫండ్స్ కూడా చాలా ఇస్తుంటాను….అయినా ఆ విషయం నాకు వదిలేయండి….
దాంతో రాము కూడా ఇక చేసేది లేక సరె అని తల ఊపాడు.
శివరామ్ : ఇంతకు ట్రైనింగ్ ఎక్కడ….
రాము : డెహ్రాడూన్……
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
శివరామ్ : ఎప్పుడు బయలుదేరాలి…..
రాము : దాదాపు నెల రోజులు పట్టొచ్చు…..మళ్ళీ మెయిల్ వస్తుంది….
శివరామ్ : సరె…..ఈ నెల రోజులు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి…..
అంటూ తన wallet లోనుండి ఒక కార్డ్ తీసి రాముకి ఇచ్చాడు.
రాము ఆ కార్డ్ తీసుకుని ఎందుకు అన్నట్టు చూసాడు.
శివరామ్ : ఇది International Credit Card…..మీరు ఎక్కడకు కావాలంటె అక్కడికి….మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి…..
రాము : ఎన్నో ఏళ్ళ తరువాత మిమ్మల్ని అందరినీ కలిసారా….మీ అందరితో ఉన్నంత ఎంజాయ్ మెంట్ నాకు బయట ఒక్కడినే ఉన్నా కూడా నాకు దొరకదు….ట్రైనింగ్ డేట్ వచ్చేదాకా మీ అందరితో ఉంటాను….
అంటూ తన చేతిలో ఉన్న కార్డ్ శివరామ్ కి ఇవ్వబోయాడు.
కాని శివరామ్ ఆ కార్డ్ తీసుకోకుండా….
శివరామ్ : సరె….ఇక్కడే మాతోనే ఉండండి….కార్డ్ కూడా మీ దగ్గరే ఉంచుకోండి….అవసరం అయినప్పుడు వాడుకోండి…..
వాళ్ళు ముగ్గురూ అలా మాట్లాడుసుకుంటుండగా కరుణ వచ్చి అందరిని భోజనాలకు రమ్మని పిలిచింది.
దాంతో అందరూ కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోజనం చేసారు.
అలా రాము కళ్ళు మూసి తెరిచేలోగా ఇరవై రోజులు అలా గడిచిపోయాయి…..తరువాత వారం రోజుల్లో డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అటెండ్ అవమని మెయిల్ రావడంతో రాము ఇక అంతా సర్దుకుని బయలుదేరడానికి సిధ్ధమయ్యాడు.
కాని ఇంట్లో వాళ్ళు రాముని ఆపుతూ….
రఘు : అదేంటి నాన్నా….ట్రైనింగ్ ఇంకా వారం రోజులు ఉన్నది కదా….ఇప్పుడు ఎక్కడికి….
రాము : ఏంటిరా…నేను కూడా మా నాన్నను చూసి చాలా రోజులు అవుతుంది…..ఒకసారి వాళ్లను కూడా కలిసి వారం రోజులు వాళ్లతో కూడా గడిపిన తరువాత ట్రైనింగ్ కి వెళ్తాను…..తరువాత ఎలాగూ పోస్టింగ్ ఇక్కడే వేయిస్తానని శివరామ్ చెప్పాడు కదా…..
శివరామ్ : అది కరెక్టే అన్నయ్యా…..అసలు మీ నాన్నగారిని….అందరిని ఇక్కడకు తీసుకువస్తానంటె ఎందుకు వద్దన్నారు…..చక్కగా ఇక్కడె అందరం కలిసి ఉండే వాళ్ళం కదా…..
రాము : ఇప్పుడు అందరూ ఇక్కడకు ఎందుకు లేరా….అయినా అక్కడ వాళ్లకు వ్యాపారాలు ఉన్నాయి కదా…అవన్నీ వదిలేసి ఎలా వస్తారు…..
శివరామ్ : ఇందుకా మీరు వద్దన్నది….
రాము : అవును…..
శివరామ్ : భలేవారే అన్నయ్యా…..వాళ్ళ వ్యాపారాలు అన్నీ మనం టేకోవర్ చెయ్యొచ్చు కదా….అవన్ని మన కంపెనీలో కలిపేద్దాం….అప్పుడు అందరం ఇక్కడే ఉండొచ్చు కదా….
రాము : నువ్వు చెప్పింది కరెక్టేరా శివా….నాకు ఆలోచన రాలేదు….
శివరామ్ : అయినా ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏం లేదు…..మీరు ఇప్పుడు వెళ్ళిన తరువాత తాతయ్యకు, నాయనమ్మకు….అదే మీ అమ్మ, నాన్నలకు విషయం చెప్పి…..మీరు ప్రశాంతంగా ట్రైనింగ్ కి వెళ్ళండి….నేను అంతా చూసుకుంటాను….మీరు ట్రైనింగ్ నుండి వచ్చేసరికి అందరు ఇక్కడ ఉంటారు….సరేనా…..
రాము : నువ్వు ఇంతలా చెప్పిన తరువాత నేను ఎందుకు కాదంటాను….నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు…..
అంటూ అక్కడనుండి రాము అందరికీ బై చెప్పి తన ఊరికి వచ్చాడు.
అక్కడ తన నాన్నకు రేణుక వాళ్ల గురించి పూర్తిగా చెప్పకుండా వ్యాపారాలను వాళ్ళ కంపెనీల్లో కలిపేందుకు ఒప్పించాడు.
ఆ తరువాత రాము ట్రైనింగ్ కి డెహ్రాడూన్ వెళ్ళిపోయాడు…...ట్రైనింగ్ పది నెలలు అయిపోయిన తరువాత శివరామ్ తన పలుకుబడిని ఉపయోగించి రాముకి ముంబాయ్ లోనే డైరెక్ట్ గా DCP గా పోస్టింగ్ వచ్చేలా చేసాడు.
కాకపోతే రాము ఒక ఏడాది పాటు probationary period ఉంటుంది.
రాము ట్రైనింగ్ నుండి తిరిగి వచ్చేలోపు శివరామ్ తన తమ్ముళ్లను రాము వాళ్ల నాన్న, బాబాయిల దగ్గరకు పంపించి వాళ్ల వ్యాపారాలు మొత్తం తమ కంపెనీల్లో కలిపేస్తున్నట్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి అక్కడ ఎంప్లాయిస్ ని రిక్రూట్ చేసి అందరినీ ముంబై కి తీసుకువచ్చేసారు.
రాము వాళ్ల అమ్మ, నాన్న, బాబాయ్ లు అందరూ ముంబై వచ్చిన తరువాత రాముకి ఒబరాయ్ ఫ్యామిలీతో ఉన్న సంబంధం విన్నతరువాత అచ్చు గుద్దినట్టు తన కొడుకులా ఉన్న శివరామ్ (ముని మనమడు) ని చూసి వాళ్లకు ఆనందంతో నోట మాట రాలేదు.
అందరూ ఆనందంగా ఉన్నారు కాని రాము వాళ్ల అమ్మా నాన్నల మనసుల్లో మాత్రం రేణుక గురించి బెంగ పట్టుకున్నది.
వాస్తవానికి రేణుక తమ కన్నా పెద్దది…..కాని రాము కాలంలో వెనక్కు వెళ్లి ఆమెని పెళ్ళి చేసుకోవడంతో ఆమె తమకు కోడలు అయింది.
అంత ముసలామెను కోడలుగా అంగీకరించడానికి వాళ్లకు మనసు రావడం లేదు.
దాంతో రాము వాళ్ల నాన్న తన వాళ్లతో, “ఈ విషయం గురించి రాము వచ్చిన తరువాత మాట్లాడదాం….అప్పటి వరకు అందరితో హ్యాపిగా ఉండండి,” అనడంతో అందరు సరె అని తల ఊపారు.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా రేణుక వాళ్ల దగ్గరకు వస్తూ మాట్లాడుకుంటున్నది విన్న ఆమె తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ రాము వాళ్ల అమ్మ వైపు చూసి, “అత్తయ్యా…..ఇలా బంధాల్లో మీరు పెద్దవారయినా…నేను మీకంటే పెద్దదాన్ని….మీరు రాము గురించి ఏం బాధపడొద్దు…..రాముని నా కొడుకు అదే మీ మనవడు విశ్వ అందరికీ రాము, శివరామ్ ఇద్దరూ కవల పిల్లలని తన తమ్ముడు రఘు కొడుకులని….చిన్నప్పుడు తప్పిపోయాడని పరిచయం చేసాడు….రాము ట్రైనింగ్ నుండి రాగానే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసేద్దాం…..మన బంధాలు బయట వాళ్లకు చెబితే ఎవరూ నమ్మరు…అందుకని రాముని మీ కొడుకుగానే పరిచయం చేద్దాము…అలాగే పెళ్ళి చేద్దాము...” అన్నది.
|