Thread Rating:
  • 8 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాయ
#1
మాయ -1వ భాగం
ప్రస్తుతం...

సమయం రాత్రి 11 గంటల 25నిమిషాలు.....

శనివారం కావటంతో పబ్ కి వెళ్లి లేట్ గా వచ్చాడు హృతిక్, ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తూ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి కబోర్డ్ లో ఉన్న టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు.

తను వెళ్ళిన 30 సెకన్లకు....

చిరు చిరు చిరు చినుకై కురిసావే...

మరుక్షణమున మరుగై పోయావే...

అంటూ మొబైల్ రింగ్ అవుతుంది. అవతల వ్యక్తి హృతిక్ ఎంతకీ కాల్ కి ఆన్సర్ చేయకపోవడంతో ప్రయత్నిస్తూనే ఉంటారు.అలా ఎన్నిసార్లు మొబైల్ మోగిందో తెలియదు. ఇక హృతిక్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవతలి వ్యక్తి ప్రయత్నించడం ఆపేస్తారు.

హృతిక్ బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మొబైల్ ని తన చేతుల్లోకి తీసుకుని చూసేసరికి అందులో 20 మిస్స్ డ్ కాల్స్. ఎవరు అని చూసేసరికి “శ్రీనిధి” ఒక్కసారిగా అతనిలో వెయ్యి సూర్యులు ఏకమైతే ప్రజ్వలించే కాంతి ఒక్కసారిగా తన ముఖములో ఆవిర్బవించినట్లు, తనకు తెలియకుండానే చిరుమందహాసాలు తన పెదవులపై నర్తించసాగాయి.

క్షణం కుడా ఆగకుండా “శ్రీనిధి” కి డైల్ చేసాడు, కాని తననుండి ఎటువంటి సమాదానం లేదు. తనకి కోపం వచ్చింది అని హృతిక్ కి అర్ధం అయింది. తన కోపం క్షణికమని హృతిక్ కి తెలుసు మళ్లీ ప్రయత్నించాడు.రింగ్ అవ్తుంది ఇక తను మాట్లాడదు అని అనుకుంటూ కాల్ కట్ చేద్దాం అనుకునేలోగా “హెల్లో” అన్న శబ్దం తనకి వినిపించింది. దేవదానవులు అమృతం కోసం యుద్దాలే చేసారని అందరికి తెలుసు కాని తన మాటలు విన్నాక తన స్వరం కూడా అమృతానికి ఏమాత్రం తగ్గదు అనిపిస్తుంది. తన స్వరం కోసం దేవదానవులు సైతం అమృతాన్ని వదిలి తన అర్చన చేయడం తథ్యం అనుకుంటూ హృతిక్ అన్న పిలుపుకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.

ఎన్నిసార్లు చేయాలి... ఏం చేస్తున్నావు...ఇంకా తమరి సురాపానీయం సేవించే పని అయిపోలేదా…. తమరి కోసం ఇక్కడ ఒకరున్నారు అన్న విషయం గుర్తు ఉందా?? తనకు మాట్లాడే అవకాశం లేకుండా చిరుతపులిలా విరుచుకుపడుతోంది శ్రీనిధి. తను అలా తిడుతున్నా హృతిక్ కి అది వేణువుపై సప్తస్వరాలు పలికించినట్లే అనిపిస్తుంది.

సారీ...అన్న ఒక్క పదం హృతిక్ నోటివెంట వచ్చాకగాని మాటల తూటాలను సందించడం ఆపలేదు శ్రీనిధి. ఇప్పుడు చెప్పు శ్రీ ఏంటి అన్నిసార్లు ఫోన్ చేసావ్ ? ఏమిటి నన్ను అంతగా మిస్ అవ్తున్నావా ఒక్కరోజు కనిపించనందుకే?

చాలు “తమరి ఊహలు కోతులు కూడా ఎక్కలేని కొండలను దాటుతున్నాయి” కొంచెం నింగిలో కాక నేల మీదే ఉంటె బాగుంటుంది అసలే తమరు మందులో ఉన్నారు కిందపడిపోతారు మరి.

హృతిక్ కి నవ్వు ఆగలేదు ఇంత కోపంలోను తను అలా ఆటపట్టించడం తనకి బాగా నచ్చింది.సరే నేలను గట్టిగ పట్టుకున్నాలే చెప్పు ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పలేదు?

“తమరి కుశల సమాచారాలు తెలుసుకుందామని” హృతిక్ గారు.

ఏంటి శ్రీ సారీ చెప్పానుకదా ఇంకోసారి ఇలా జరగనివ్వను చెప్పు అంటూ బ్రతిమాలాడు హృతిక్.

హృతిక్ చిన్నపిల్లాడిలా అలా అనడంతో నక్షత్ర కాంతులు తన కళ్ళలోనే ఉన్నాయేమో అనేంతగా శ్రీనిధి కళ్ళు మెరిసాయి. సరే ఇప్పుడు కాదు రేపు ఉదయం నా ఫ్లాట్ కి రా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి ఎందుకు అనే నీ చత్త ప్రశ్నలు ఆపి పడుకో సురులు నిదురించే సమయం దాటి అసురులు సంచరించే సమయం కుడా మొదలైంది అంటూ ఫోన్ పెట్టేసింది శ్రీనిధి.

తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అనుకుంటూ మొబైల్ ని పక్కన పెడుతూ టైం చూసుకున్నాడు.

సమయం రాత్రి 11 గంటల 55 నిమిషాలు..

సెకన్లు నిమిషాలై నిమిషాలు గంటలై రేపటి పొద్దును ఇంకా మందగించేయసాగాయి..

తన ఉహాలు సమయానికి వ్యతిరేకదిశలో ప్రయానిస్తునాయి...

*****

2013 వర్షాకాలం….

హృతిక్ B.tech పూర్తి చేసుకొని ఉద్యోగవేటలో హైదరాబాద్ విస్తీర్ణాన్ని కొలిచి ఇక కొలవడానికి ఏమి లేదేమో అనేంతగా తిరిగి తిరిగి అలిసిపోయాడు.అందరు అంటూ ఉండేవాళ్ళు హైదరాబాద్ ఒక గజిబిజి పరుగుల నగరం, ఇది మందు-మగువ-మనీ విలువలను ప్రతి ఒక్కరికి గుణపాటాలుగా నేర్పిస్తుందని తనకి మందు-మనీ విలువలు ఉద్యోగవేటలో బాగానే పరిచయమయ్యాయి. ఇక మగువ అంటారా జీవితం కధనరంగం ఎప్పుడు చస్తామో ఎప్పుడు విజయాన్ని పొందుతామో తెలియదు అలాగే మగువ కూడా ఎప్పుడు ఎలా జీవితంలోకి వస్తుందో చెప్పడం కొంచెం కష్టమే.

ఇన్ఫోసిస్ ప్రముఖ ఐటి కంపని...

హృతిక్ ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ కి వెళ్ళడం ఇది రెండవసారి ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని దృఢ సంకల్పంతో వచ్చాడు.అనుకున్నట్లుగానే అన్ని రౌండ్స్ క్లియర్ చేసాడు ఇక హెచ్ ఆర్ రౌండ్ మాత్రమె మిగిలి ఉంది.అలా ఎదురు చూస్తున్న హృతిక్ కి శ్రీనిధి అన్న పిలుపు వినపడింది.

కదిలివచ్చే దేవకన్యలా ఆకుపచ్చ చుడిదార్ లో నడుస్తూ వస్తోంది ఒక అమ్మాయి. చిరు జల్లులు గుండెను తాకుతున్నట్లు, ఆమె నవ్వులో అలలు ఎగసి పడుతున్నట్లు, ఆమె చక్కిలి పై సప్తస్వరాలు నాట్యమాడుతున్నట్లు, ఉహకందని రూపం కళ్ళకి కనిపించినట్లు హృతిక్ ఒక్క క్షణం ఆగి తన కళ్ళను తానే నమ్మలేనట్లు కళ్ళను తుడుచుకున్నాడు..

****

ప్రస్తుతం…

ఉదయం 6 గంటల 05 నిమిషాలు…

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు హృతిక్. ఉదయాన్నే రమ్మని చెప్పిన శ్రీనిధి మాటలు చెవిలో వినిపిస్తున్నాయి. హృతిక్ లేచి రెడీ అయి శ్రీనిది ఫ్లాట్ కి వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేసాడు. శ్రీ ఇలా ఎప్పుడు హృతిక్ ని తన ఫ్లాట్ కి రమ్మని పిలవలేదు అదీ ఏదో ముఖ్యమైన విషయం అంటుంది ఏంటి ఏమయి ఉంటుంది అంటూ ఆలోచనల్లోనే శ్రీనిది ఉన్న అపార్ట్ మెంట్ కి వెళ్ళాడు.

లక్ష్మి అపార్ట్ మెంట్:

బైక్ పార్కింగ్ ఏరియా లో పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కడానికి లిఫ్ట్ దగ్గరకి వచ్చాడు.కాని లిఫ్ట్ పనిచేయకపోవడంతో నిరాశతో మెట్లు ఎక్కుతూ థర్డ్ ఫ్లోర్ కి చేరుకున్నాడు.అప్పటికే డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇంత త్వరగా లేచారా మహారాణిగారు? అనుకుంటూ లోపలి అడుగు పెడ్తూ అక్కడ అప్పటికే చాలా మంది ఉండడం తో ఏమైందో తనకి అర్ధం కాలేదు. అందరు హృతిక్ ని చూస్తున్నారు తను అలా నడుస్తూ ఉంటె తనకి దారి ఇస్తూ అందరు పక్కకు జరుగుతున్నారు. అలా ఒక గదిలోకి వెళ్ళాడు హృతిక్.

ఒక్కసారిగా హృతిక్ గుండెల్లో వేయి అగ్నిపర్వతాలు ఒకేసారి పేలినట్లు గుండె అతివేగంతో కొట్టుకుంది. జ్ఞానేంద్రియాలు ఒక్కసారిగా పనిచేయడం ఆపేసాయి చుట్టూ ఉన్న వాళ్ళు తనకి కనిపించడం లేదు, నిశబ్దం ప్రళయ తాండవం చేస్తుంది. తన పాదాలు స్పర్శను కోల్పోయి అగాధంలోకి జారిపోతున్నట్లు ఒక్కసారిగా నేలపై వాలిపోయాడు.కన్నీళ్లు జలపాతాల్లా రాలుతున్నాయి ఆ దృశ్యం చూసాక.

హృతిక్ తల పైన వేలాడుతున్నాయి పాదాలు, అవి ఎవరివో కాదు తన ప్రేమ సామ్రాజ్య పట్టపురాణి “శ్రీ” వి. ఒక్కసారి తల ఎత్తి పైకి చూసాడు ఉరి కి వేలాడుతున్న తన ప్రేమ దీనంగా హృతిక్ ని చూస్తుంది. ఆకుపచ్చ రంగు చీర శ్రీ మెడచుట్టు బిగుసుకుని ఉంది. ఆ మరు క్షణం కనులు నెమ్మదిగా మూత పడుతూ హృతిక్ స్పృహతప్పిపోయాడు...
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నైస్ స్టార్ రైటర్ గారు..!!!


మరో కొత్త కథ, ఆరంభం అదిరింది.
కొంచెం భాద గ అనిపించినా, ఎం జరిగుంటుంద అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

మీ నెక్స్ట్  అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#3
ఇంకో కొత్త కథ మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు Annepu గారు.
Like Reply
#4
అన్నెపు గారు కథ చాలా బాగుంది కొంచెం శ్రుంగారం కూడ కలిపి అందించండి
Like Reply
#5
Woow nice ga start chesaru... chala bagundi story... thoraga ivvandinext update..
Reply
#6
స్టార్టింగ్ లోనే గుండెను పిండేసే బాధ మన హీరో కి... What is the reason.. what is the suspense.?

Keep posting...
Like Reply
#7
గుడ్ స్టార్ట్ సార్
Like Reply
#8
ఈ కథ ను పెండింగ్ లో ఉంచుతున్నా .. .....ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న కొన్ని కథలు అయిపోయాక ఈ కథ ను మొదలు పెడ్తా .... అన్ని కథలు ఒకేసారి నడపటం మూలాన కాంఫుసే అవుతున్నాం అంటున్నారు ...అందుకే ఆ కథలు కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అప్డేట్ స్టార్ట్ చేస్తా
Like Reply
#9
Storie was simply superub
Like Reply
#10
Annepu Garu story continue cheyyandgi
Like Reply
#11
Nice start broo update pettandi konchem regular ga
Like Reply
#12
Update pettandi broo
Like Reply
#13
Update plzz
Like Reply
#14
అప్డేట్ ప్లీజ్ గురూజీ
Like Reply
#15
(12-11-2018, 10:37 AM)annepu Wrote: ఈ కథ ను పెండింగ్ లో ఉంచుతున్నా ..  .....ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న కొన్ని కథలు అయిపోయాక ఈ కథ ను మొదలు పెడ్తా .... అన్ని కథలు ఒకేసారి నడపటం మూలాన కాంఫుసే అవుతున్నాం అంటున్నారు ...అందుకే ఆ కథలు కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అప్డేట్ స్టార్ట్ చేస్తా

Please ee story Ni continue cheyyandi
Like Reply
#16
Story mali start cgeyandi
Like Reply
#17
Super story bro waiting for next update
Like Reply
#18
Ee story Chala bagundi please update pettandi
Like Reply
#19
Story telugu varana super.
Suspense loo apparru continue cheyandi author garu
Like Reply




Users browsing this thread: