Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
(15-07-2020, 09:57 PM)mkole123 Wrote: మిత్రులారా ఒక మాట. కథను వదిలేసి వెళ్లిపోలేదు నేను. నిజంగా ఉద్యోగపరంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వున్నాను. చాలారోజుల తర్వాత ఇవాళే మళ్ళీ రాయడం మొదలెట్టాను. hopefully కొద్ది రోజుల్లో మీ ముందుకి కథతో వస్తాను. మీ ఓపికకి ధన్యవాదాలు.

Nammakamtho mi kosam wait chestham sir
Story ni miss chesukovali ani anukovadam ledhu
Love for u r amazing story
Love u bro❤️

@madhu97
[+] 1 user Likes ravali.rrr's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Love story la undhi bro amazing narration super plz continue cheyandi
Like Reply
Bhayya vunnara...
ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నం mi update kosam...
Eppudu istaru bro...
Please update..
Like Reply
అప్డేట్ plz
Like Reply
(15-07-2020, 09:57 PM)mkole123 Wrote: మిత్రులారా ఒక మాట. కథను వదిలేసి వెళ్లిపోలేదు నేను. నిజంగా ఉద్యోగపరంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వున్నాను. చాలారోజుల తర్వాత ఇవాళే మళ్ళీ రాయడం మొదలెట్టాను. hopefully కొద్ది రోజుల్లో మీ ముందుకి కథతో వస్తాను. మీ ఓపికకి ధన్యవాదాలు.

Mithrama meeru job tension lo padi katha ni marchipoledu kada...! 
Haha jus kidding... 
Thvaralone  oka pedda  update tho  maa munduku vastharu ani ashisthunnamu...
Like Reply
నెల రోజులు దాటింది మిత్రమా మీరు ఇక్కడ పలకరించి ఒక్కసారి హాయ్ ఐనా చెప్పండి మిత్రమా . మీ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం
Like Reply
ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపులు

ఎంతకాలమని ఈ నిరీక్షణ

దుర్భరం

ఒక్కసారి కనపడి వెళ్ళండి
సర్వేజనా సుఖినోభవంతు...
[+] 1 user Likes Mohana69's post
Like Reply
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
Like Reply
Awesome narration
Like Reply
Mkole గారూ, update కాస్త త్వరగా ఇవ్వండి...
Like Reply
update eppudu ?
Like Reply
Waiting for next update bro konchem tondaraga update pettandi broo
Like Reply
Please update......... Waiting for you bro........ Namaskar Namaskar
Like Reply
మిత్రులారా, ఈ బ్రేక్ అనివార్యమైనది. ఎందుకు ఇంత పెద్ద బ్రేక్ అనేది వేరొక సమయంలో చెప్పుకుందాం.

కథని పూర్తి చేస్తాను. టైమ్ లిమిట్ అడగకండి. ఒకవేళ పూర్తిగా రాయలేకపోయినా ముగింపు ఏమని అనుకుంటున్నానో synopsis ఐనా రాసి వెళ్తాను. చాలా చిన్న అప్డేట్ ఒకటి పెడుతున్నాను. మన కథలోని పాత్రలు ఒక చోటకి చేరుకునే సమయం వచ్చింది. మరుసటి భాగంలోనే సునయన రీఎంట్రీ. కావాలని కథని ఎప్పుడూ సస్పెన్స్ లో ఆపెయ్యలేదు. మరుసటి భాగం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను.
[+] 2 users Like mkole123's post
Like Reply
మాయ - 37

కిరీటి,మిత్రులు డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు పూర్తి చేశారు. వేసవి సెలవులు ప్రారంభం అవుతూనే ఎప్పట్లానే స్నేహితులు కలిసి చుట్టుపక్కన ఊర్లని, పట్టణాలని దున్నేసి వద్దామనుకున్నారు. కానీ కిరీటి మటుకు ఊరెళ్తున్నానని చెప్పి ఒక నెలరోజులపాటు ఎక్కడికో వెళ్ళాడు.


అలా వెళ్లే ముందు వాడికి, శైలుకి మరో కలహం వచ్చింది. శేఖర్ దగ్గరకి నెలరోజులపాటు వెళ్తున్నా అని చెప్పేసరికి భగ్గున మండిపడింది శైలు. ‘ఒరేయ్, కాలేజీలో రాసుకు పూసుకు తిరిగితే నేనేమీ అడగలేదు. ఇప్పుడు నెల్నాళ్లపాటు ఎందుకురా అతని దగ్గరికి’ అని నిలదీసింది కిరీటిని. కిరీటి నిట్టూర్చి ఆమెని సముదాయించి కూర్చోబెట్టాడు. ‘శైలూ, నేను ఎప్పటిదాకా ఈ వూళ్ళో వుండగలను, చదువు పూర్తయ్యాక నాకు ఇక్కడ ఏం వుద్యోగం వస్తుంది? మీ ఇంట్లోనో నా ఇంట్లోనో మన విషయం ఎత్తాలి అంటే నాకు ఏదో పిచ్చి వుద్యోగం వుంటే చాలదు కదా. బైట ఎలాంటి అవకాశాలు వున్నాయో తెలుసుకోవడానికి అతనివెంట తిరుగుతున్నాను’ అని వాడు చెప్పేసరికి కూల్ అయ్యింది.   
 
కిరీటి తిరిగొచ్చాక మళ్ళీ చెన్నపట్నం పోయి కిట్టిని కలిసివద్దాం అనుకున్నారు రంగ, గోరు. కానీ అనుకోకుండా వేరేచోటకు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనే మన సునయన కిరీటిని మళ్ళీ కలవబోతోంది.

కిరీటి పెంచలాపురం తిరిగొచ్చాక ఓ రోజు గోరు వాడి ఇంటికి వచ్చాడు. ‘మామా, మదరాసు బోయే కళ కనిపిస్తలేదురా ఈపాలి’ అన్నాడు. కిరీటి ప్రశ్నార్ధకంగా చూస్తే చేతిలో ఓ ఉత్తరం పెట్టాడు. ‘అక్క అందర్నీ ఓరుగల్లు రమ్మంటాంది. కాలేజీల ఏదో మెడల్ ఇస్తారంట అక్కకి. నిన్ను, శైలు మాడమ్ ని ఎంటబెట్టుకు రమ్మని మరీ మరీ సెప్పింది. నువ్వు బోయి ఆయమ్మిని పిల్చకరావాల’ అన్నాడు. ‘తనేమీ కరవదురా. నువ్వే పోయి చెప్పు’ అన్నాడు కిరీటి నవ్వుతూ. ‘ఊరుకోరా సామీ, ఆమె ఎప్పుడు శివాలెత్తుద్దో దేవుడికి కూడా తెల్వదు. నువ్వు ఎట్టనో గానీ కీలకం పట్టావు, నీమీద అరసట్లేదు గందా మాడమ్’ అన్నాడు.

శేఖర్ దగ్గర్నుంచి వచ్చాక కలవడం కుదరలేదు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి శైలుతో మాట్లాడి వద్దాం అని బయల్దేరాడు కిరీటి. పెదబాబు గారిల్లు ఎప్పట్లానే హడావిడిగా వుంది. కిరీటిని చూసి ప్రెసిడెంటు గారు ‘ఏరా, ఏందీ టయాన దిగబడ్డావు’ అన్నారు నవ్వుతూ. కిరీటి వచ్చిన విషయం చెప్పాడు. శైలుని రమ్మని నిక్కి రాసిన ఉత్తరం చేతికందించాడు. ‘నువ్వు శానా ఎనకబడి ఉండావురా. ఆ బిడ్డ నీలాగా పెద్దంతరం సిన్నంతరం తెల్వని కూతురనుకున్నవా? ఈ ఇషయం నాకు సొయానా ఉత్తరమ్ముక్క రాసి సెప్పిందిలే. ఇహనో ఇప్పుడో మీ బాబు సేత రైలు టిక్కట్ తీపిద్దామని అనుకుంటాండా. నువ్వు రొంత లోనకి బోయి మా ఇంటిదాని కాడ సొమ్ములు తీసుకోని శైలమ్మకి టిక్కట్ బుక్ చేసిరా పో’ అని పంపించారు.

లోపల శైలు, తన అత్త రుక్కు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాడిని చూడగానే ఆమె ముఖంలో వికసించిన వెలుగు రుక్కు కళ్ళు దాటిపోలేదు. వచ్చిన విషయం చెబితే డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్లింది. శైలు గబుక్కున వాడి చెయ్యి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. కిరీటికి లోపల భయంగా వున్నా మెల్లిగా శైలు వీపు నిమురుతూ వుండిపోయాడు. ఎప్పట్నించో వాడి మదిలో వున్న ఓ ఆలోచన అమల్లో పెట్టడానికి ఈ ట్రిప్ ఎంచుకున్నాడు. ‘ఏయ్ శైలూ, వరంగల్ లో ఒక రెండు రోజులు వుండి వస్తాను అని చెప్పు మీ ఇంట్లో’ అన్నాడు. ఎందుకన్నట్టు చూస్తే ‘నీకొక చిన్న surprise’ అన్నాడు.

గత కొద్ది వారాలుగా ఏ మూలో ఆమె మదిలో దాగున్న దిగులు ఆమె ముఖంలో ప్రతిఫలించేది. కిరీటి ఈ మాట చెప్పగానే శైలు ముఖం విప్పారింది. ‘చెప్పరా, సస్పెన్స్ లో పెడితే నాకు కోపం వస్తుందని తెలుసు కదా’ అని ఉడుక్కుంది. ‘ఊహూ, నీకు నచ్చుతుందో లేదో తెలీదు. ఇప్పుడే చెప్పేస్తే మజా వుండదు’ అన్నాడు నవ్వుతూ.

మొత్తానికి గోరు కుటుంబం, శైలు, కిరీటి వరంగల్ బయల్దేరి వెళ్లారు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కి వచ్చిన నిక్కి అందర్నీ చూసి దాదాపు ఏడ్చినంత పని చేసింది. తనైతే కన్నీళ్లు ఆపుకుంది కానీ ఆమె తలిదండ్రులు మటుకు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అందర్నీ కౌగిలించుకుంటూ వచ్చిన నిక్కి కిరీటిని హగ్ చేసుకొని మెల్లిగా వాడి చెవిలో ‘I missed you so much’ అని చెప్పింది. అందరిముందూ సమాధానం చెప్పలేక మెల్లిగా ఆమె చెయ్యి నొక్కి వదిలాడు కిరీటి. 

‘ఇంక వెళ్దామా’ అని రాజన్న అడిగితే ‘ఇంకొకళ్లు కూడా రావాలి’ అని ఆపేసింది నిక్కి. వీళ్ళు వచ్చిన బండిలోనే  AC కోచ్ లోంచి దిగాడు శేఖర్. అతను రాజా గారి అబ్బాయి అని పరిచయం చేసేసరికి నిక్కి కుటుంబం నిశ్చేష్టులైపోయారు. తడబడుతూ తమ కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే వారించి అందరితో కలిసి బయల్దేరాడు శేఖర్.

మెడల్ ప్రదానోత్సవం చాలా బాగా జరిగింది. నిక్కీ తన చదువు పూర్తికావడానికి సహాయపడ్డవాళ్ళకి పేరుపేరునా థాంక్స్ చెప్పింది తన స్పీచ్ లో. ఆనాటి సాయంత్రం ఊరినుంచి వచ్చిన అందరూ ఒక హోటల్ కి వెళ్ళి నిక్కి విజయాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు. శేఖర్ ను తప్పించుకు తిరిగింది చాలాసేపు శైలు. కానీ చివరకు కలవనే కలిశారు. శేఖరే మాట కలిపాడు. జంకుతూ పొడిపొడిగా మాట్లాడింది శైలు. వెళ్లిపోతూ శేఖర్ ‘మీరు చాలా లక్కీ. ఆ అబ్బాయి మీకోసం ఎంత కష్టపడుతున్నాడో నేను చూస్తున్నాను. మీ ఇద్దరూ బాగుండాలని నా విషెస్’ అంటూ కిరీటి వైపు చూపిస్తే శైలు ఉలిక్కిపడి చూసింది. శేఖర్ నవ్వి ‘అతను నాకు తప్ప ఎవరికీ చెప్పలేదు లెండి. అందుకే నేను మిమ్మల్ని విసిగించడం ఆపేశాను’ అన్నాడు.

ఓ క్షణం ఆగి ‘కాకపోతే మీరు ఇద్దరూ ఒక సంవత్సరం పాటు విడివిడిగా వుండాలి  అని తెలిసినా అతను తను అనుకున్న దారిలోనే ముందుకి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు చూడండి, అది చాలా brave డెసిషన్’ అంటే ఈ సారి హారర్ నిండిన కళ్ళతో చూసింది శైలు. తను చేసిన తప్పేంటో తెలిసొచ్చిన శేఖర్ ఆమె పక్కన కూర్చుని ‘సారీ శైలు గారు, మీకీ విషయం చెప్పే వుంటాడనుకున్నాను. మీ ఇద్దరి మధ్యన నా మూలంగా గొడవ రాకుండా వుంటే చాలు. అతన్ని పిలిచి మాట్లాడుతా’ అంటూ లేవబోతుంటే ఆపేసింది శైలు. ‘వాడేం చెప్తాడో, ఎప్పుడు చెప్తాడో వాడికే వదిలేస్తాను. మీరేమీ అనకండి’ అని వారించింది.

ఇక మిగతా సమయమంతా అన్యమనస్కంగా గడిపిండి శైలు. వీళ్ళు బస చేసిన హోటల్ కి వచ్చాక మర్నాడు చిన్న ప్రోగ్రాం వుందని, అందరూ ఉదయం ఏడింటికల్లా తయారుగా వుండాలి అని చెప్పి పంపించాడు కిరీటి.
Like Reply
నైస్ సూపర్ అప్డేట్ మీకు కుదిరినప్పుడల్లా ఒక చిన్న అప్డేట్ ఐనా ఇస్తారని ఆసిస్తున్నాం
Like Reply
Welcome back update super waiting for the next update
Like Reply
అప్డేట్ బాగుంది. ఇకనైనా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తున్నాము.
Like Reply
EXCELLENT AND GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
అప్డేట్ చేసినందుకు ధన్యవాదాలు
Like Reply




Users browsing this thread: 14 Guest(s)