Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్రనామ ఆహార నియమావళి
హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ అని వేదమే మాతృస్థానమును శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .
మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.
మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి -
మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
విశుద్ధి చక్రనిలయా,
రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా,
వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా,
పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా,
డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా,
శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా,
రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా,
స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా,
రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా,
వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా,
డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా,
గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా,
లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా,
చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా,
బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా,
కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా,
వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా,
సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా,
శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా,
హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా,
హాకినీ రూపధారిణీ || 108 ||
సహస్రదళ పద్మస్థా,
సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా,
శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా,
యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,உమతి,
ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||
పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది
మొదటి నెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.
రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.
మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.
నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.
ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.
ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు. ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.
ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.
ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం.
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
ఆశీర్వచనం ఎందుకు చేస్తారు.....?
ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం.....?
పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....?
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు.
విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని,
పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.
యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు "గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు" అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.
అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ?
తప్పకుండా ఫలిస్తాయి...
సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.
గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి...
అక్షింతల సంకేతం.....
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు.
ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం ?
అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ?
మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి ?
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట.
బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.
మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.
మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.
బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షింతలు మరీ పవిత్రమైనవి..
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
ఒక్క క్షణం
ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.
చాలా చక్కని వాక్పటిమ గలవాడు.
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.
ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు.
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు.
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు.
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.
కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి.
'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.
ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంత మంది తినటంలేదు?
నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?
ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.
దానికి ఆ కండక్టర్, "అయ్యా! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.
పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి
'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను...
నా అదృష్టం బాగుంది.
నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.
జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
సర్వనాశనం కావడానికి ఆ ఒక్క క్షణం చాలు.
ధర్మో రక్షతి రక్షితః
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
సత్యవ్రతుడు
కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.
ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.
"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.
మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.
ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.
"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.
అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.
"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.
"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.
"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.
'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.
"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.
రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.
సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.
"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.
మళ్లీ రాజ్యం కళకళలాడింది.
ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు....మిత్రమా!!
Posts: 137
Threads: 3
Likes Received: 67 in 49 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
1
23-08-2020, 12:31 AM
(This post was last modified: 23-08-2020, 12:40 AM by oxy.raj. Edited 3 times in total. Edited 3 times in total.)
గణపతిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు?
గొరంత పత్రికే కొండంత వరాలు గుప్పిస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు.. సర్వ విఘ్నాలకూ అధినాయకుడు మన విఘ్నేశ్వరుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం పుణ్య ప్రదం.. మోక్షదాయకం. సాధారణంగా ఏ కార్యం మొదలు పెట్టినా గణపతి పూజ చేయాలి. మిగిలిన సందర్భాల్లో పసుపు గణపతిని తీర్చిదిద్ది పూజ తంతు ముగిస్తారు. కానీ వినాయకచవితి రోజున మాత్రం మట్టితో చేసిన గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం అనాదిగా వస్తోంది.
21 రకాల పత్రులు సాధారణమైన ఆకులు కావు. అవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. ఇక నవరాత్రులు గణనాథుడిని పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వెనుకా ఓ కారణం ఉంది. వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో నీరు వచ్చి చెరువులు, బావులు, నదుల్లో చేరుతుంది. పైగా అది కలుషితమై ఉండటంతో దానిలోని క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి 21 పత్రాలకు ఉంది. ఆ పత్రాలు నీటిలో కలిసి బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్ స్థాయులను పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు.
మాచీ పత్రం: దీనిని తెలుగులో మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడేవారు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది.
బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. జీర్ణ, గుండె, చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు.
బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివుడికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందిగా చెబుతారు. డయాబెటిస్ నియంత్రణకు, డయేరియా, గ్యాస్టిక్ సమస్యలను నివారించగలదు.
దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం దీనికి ఉంది.
దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పని చేస్తుంది.
బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలదు.
అపామార్గ పత్రం: దీనిని ఉత్తరేణి అంటారు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. శివునికి ఇష్టమైన ఆకుగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా తులసి.
చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హిందూ కుటుంబాల్లో పండగ వాతావరణం కనిపించదు. రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లును తగ్గించడంతో పాటు, కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది.
విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఉపయోగపడుతుంది.
దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ ఆకు. దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణ చక్కగా పనిచేస్తుంది.
దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది.
మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు పనిచేస్తుంది.
సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తుంటారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు ప్రభావంగా పనిచేస్తుంది.
అర్క పత్రం: దీనినే జిల్లెడు అంటారు. ఈ చెట్టు ఆకులను తుంచితే పాలు వస్తాయి. శివుడి పూజకు తెల్ల జిల్లెడు ఆకులను వినియోగిస్తారు. చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తుంది.
జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్లు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణకు దివ్య ఔషధం
గండకీ పత్రం: దీనిని దేవ కాంచన అని కూడా అంటారు. శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. సీతాకోక చిలుక మాదిరి దీని ఆకులు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు.
శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. విజయదశమి రోజు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్, కుష్ఠు నివారణకు, దంత సమస్యలకు పనిచేస్తుంది.
అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. ఆలయాల్లో రావి, వేప చెట్లను పూజలు చేయటం మన సంప్రదాయం. రక్తశుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరకుండా చేసే ఔషధ గుణం కలిగినది.
అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు. అంతేకాదు, ఇది ఔషధ గుణాలను కలిగి ఉంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది.
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
అన్నదాతా సుఖీభవ
పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.
అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు.
"ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు.
అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది. ఇదేనా!! ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా, సన్యాసి అతనికొక సూది ఇచ్చి ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.
ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది.
ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.
ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు.
ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?
అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయాడు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.
సర్వే జనా సుఖినోభవంతు
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
27-08-2020, 09:57 PM
(This post was last modified: 27-08-2020, 10:04 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
పరిపూర్ణ సంతోషం
కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.
"చీమలను చంపకుండా ఎలా?"
అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.
సమస్య కొలిక్కి వచ్చింది.
ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.
"మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.
తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
ధర్మో రక్షతి రక్షితః
సర్వే జనా సుఖినోభవంతు
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
నమ్మకం
తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి
అందులో జీవనం కొనసాగిస్తుంది.....
చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...
కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు
ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....
అయ్యో ! నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి
ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....
మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా....
ఆ తామరరేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...
కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...లేక నన్నేదో బంధించింది అన్న భావనో దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావనను
నమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది...
అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...
మన జీవితంలో సమస్యలూ అంతే,
సమస్య బలమైంది కాదు....
మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం...
మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,
గుర్తించడమే, నమ్మడమే దాని బలం...
"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...
దాని బలం తామర రేకు అంత....
నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.
తెలుసుకో అదే.. జీవిత సత్యం.
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
![[Image: images?q=tbn:ANd9GcRnNueaVH23hVTh5s5mPMW...A&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcRnNueaVH23hVTh5s5mPMWqSN_NH3pFSojo3A&usqp=CAU)
గురు పాదాల విలువ
భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.
ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు.
“హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”
“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".
“పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేదనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్ సీరియస్‌గా.
స్వామీజీ చిన్నగా నవ్వి .....
“అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”
ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు నదిలోకి గాలాన్ని విసిరి చేపలు పడుతున్నారు.
నీళ్ళల్లో నిలబడి గాలానికి ఎర్రలను గుచ్చి దూరంగా విసురుతున్నారు.
గాలానికి చేపలు పడ్డాక, వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.
“ఆ గాలానికి ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా? లేక దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.
“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్ వినమ్రంగా.
“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని గాలం మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.
గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.
గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||.
Posts: 2,143
Threads: 246
Likes Received: 1,433 in 850 posts
Likes Given: 161
Joined: Nov 2018
Reputation:
68
20-03-2021, 08:50 AM
(This post was last modified: 20-03-2021, 08:51 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి?
.
.
.
ఇదే కదా అసలు సమస్య!
భగవంతుని మీద నమ్మకం అనేదే మొదటి మెట్టు, పూజ చెయ్యాలి అనేది తరువాతి మెట్టు.
ఈ పూజలో మనము సాధారణంగా అనేక రకాల పువ్వులను సమర్పిస్తుంటాము. కానీ స్వామి ఎప్పుడూ అలా కోరుకోడు కదా!
మరి ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి? అదే అసలు రహస్యం. రండి చూద్దాం
భగవంతుడు త్వరగా ప్రసన్నుడవటానికి శాస్త్రంలో ఎనిమిది విశేష పుష్పాలను సమర్పించాలని తెలపడం జరిగింది
అవి…
బిల్వమా? కాదు,
తుమ్మి పూలా? కాదు ....మల్లెలా?, సంపెంగలా ? ....మరి మొగలిరేకులా ......కాదు,కాదు, కాదు
మరి అవి ఏవిటి?
ఆలోచించకండి అలా చూడండి
శ్లోకం:
అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః |
సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషతం ||
జ్ఞానం పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైవచ |
సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరంభవేత్ ||
'అహింసా ప్రథమం పుష్పం' — అహింస అనేది మొట్టమొదటి పుష్పం
'పుష్ప మింద్రియ నిగ్రహః' — ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం రెండవ పుష్పం
'సర్వభూత దయాపుష్పం' — అన్ని ప్రాణులయందు దయకలిగి ఉండటం మూడవ పుష్పం
'క్షమాపుష్పం విశేషతం' — క్షమ (ఓర్పు) కలిగి ఉండటం నాల్గవది
'జ్ఞానం పుష్పం' —
జ్ఞానం అనే పుష్పాన్ని
'తపః పుష్పం' —
ఒకే విషయం మీద మనస్సు లగ్నం చేయటమే తపస్సు
'ధ్యాన పుష్పం' —
మనస్సు యందు స్వామిని మననం చేసుకొంటూ ధ్యానిస్తూ ఉండటం
'సత్యమష్ట విధం పుష్పం' —
సత్యము మాట్లాడటం అనే పుష్పం
ఇంతేకాదు,
హృదయ కమలం (మనస్సు)
అనబడే పుష్పాన్ని పూజలో సమర్పించడం వల్ల అమ్మవారు సంతుష్టురాలు అవుతుందని శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రస్తావించడం జరిగింది.
Posts: 137
Threads: 3
Likes Received: 67 in 49 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 12,652
Threads: 0
Likes Received: 7,041 in 5,349 posts
Likes Given: 73,432
Joined: Feb 2022
Reputation:
93
Good information
Thank you Sir
•
|