02-12-2018, 02:29 PM
(This post was last modified: 02-12-2018, 02:30 PM by Vikatakavi02.)
‘అత్తారింటికి దారేది’ రీమేక్ టీజర్ చూశారా?
చెన్నై: తెలుగు సూపర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘వంత రాజవంతాన్ వరువేన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శింబు ఇందులో పవన్ కల్యాణ్ పాత్రను పోషిస్తున్నారు. మేఘా ఆకాష్, కేథరిన్ కథానాయికలు. శింబు అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. సి సుందర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దాదాపు రీమేక్‌లోని సన్నివేశాల్ని ఇందులో కూడా చూపించారు. శింబు నటన హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రచార చిత్రానికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే దాదాపు 10 లక్షల వ్యూస్ దక్కించుకుంది. 82 వేల మంది టీజర్ నచ్చిందని లైక్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
శింబు ఇటీవల ‘చెక్క చీవంత వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితిరావు హైదరి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు. సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా విమర్శకులతోపాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు రాబట్టింది.
Source : Eenadu.net

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK