Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
ఈ కాలంలోనే గిడుగు రామమూర్తి తెలుగు సాహిత్యాన్ని మామూలు పండితులకు కూడా సాధ్యం కానంత సూక్ష్మదృష్టితో అధ్యయనం చేశారు. ఆయన జ్ఞాపకశక్తి చాలా గొప్పది. ఎక్కడెక్కడ ఏ మూల ఏ కవి వాడిన పదస్వరూపాలనయినా క్షణమాత్రంలో గుర్తుకు తెచ్చుకుని ఉదాహరణగా చూపించగల సామర్థ్యం ఆయనకి ఉండేది. చాలా జాగ్రత్తగా ఆయన చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం వున్న భాషకి; పూర్వపు తెలుగు కవులు వాడుతూ వచ్చిన భాషకి; వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులు మొదలైన వాళ్లు లాక్షణికం అనుకున్న భాషకి, తేడాలున్నాయని గమనించారు. పూర్వకవులు వాడిన భాష కాలక్రమాన మారుతూ వచ్చిందని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం సాధించదగిన భాష ఇంకొక కొత్తరకమయిన భాష అని, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడినది ఇంకొక రకమైనదని గమనించారు. వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టకుండా కావ్యాల్లో వాడిన భాష నిజమైన గ్రాంథికమని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసేది దక్షిణాది తెలుగు అని (దీని గురించి కొంతసేపట్లో వివరిస్తాం); కొక్కొండ వెంకటరత్నం పంతులు, వీరేశలింగం పంతులు వాడే భాష కృతక గ్రాంథికమని; నిర్దేశించారు.
ఆయన దృష్టిలో ఏ కాలం లోనూ ఎవరూ కూడా తమ కాలంలో వాడుకలో వున్న భాషని వ్యతిరేకించి దాని ప్రభావం తమ మీద పడకుండా రాయడం అసాధ్యం. అంచేత లాక్షణిక భాష రాస్తున్నాం అనుకునే వాళ్లందరూ చిన్నయ సూరి వ్యాకరణాన్ని అనుకరించలేదనీ, వ్యవహారంలో వున్న మాటలకే కృతక రూపాలు కల్పించి అదే లాక్షణికం అనే భ్రమలో రాస్తున్నారనీ ఆయన వందల కొద్దీ వుదాహరణలతో చూపించారు. చిన్నయ సూరి వ్యాకరణానికి లొంగని, చిన్నయ సూరి గమనించని, పూర్వ కవి ప్రయోగాలు ఉన్నాయని ఆయన సోదాహరణంగా చూపించారు. అంచేత ఆయన వాదం ప్రకారం లాక్షణిక భాష ఎవరూ రాయలేరు. ఆఖరికి చిన్నయ సూరి కూడా రాయలేడు.
ఆ రోజుల్లో మద్రాసులో వున్న తెలుగు పండితుల్లో ఉత్తరాదివాళ్లు, దక్షిణాదివాళ్లు అనే తేడాలు ఉండేవి. చిన్నయ సూరి, వేదం వెంకటరాయరావు దక్షిణాదివాళ్లు. వీళ్ల తెలుగుకి అరవ తెలుగు అని గిడుగు రామమూర్తి పేరు పెట్టారు. ఆ తెలుగునే చిన్నయ సూరి తన వ్యాకరణంలో ఉద్దేశించి దానికే వ్యాకరణం రాశాడని ఆయన వాదన. అంచేత ఆయన దృష్టిలో ఈ తెలుగు గ్రాంథికం కాదు.
డానియల్ జోన్స్ (Daniel Jones) ఓట్టో యెస్పర్సన్ (Jens Otto Harry Jespersen), ఫిలిప్ హార్టోగ్ (Philip Hartog) రాసిన పుస్తకాలు, వాళ్ల ఆలోచన విధానం దానితో పాటు భారతీయ భాషల్ని ఆర్య భాషలు, ద్రావిడ భాషలు అంటూ విడదీస్తూ రాబర్ట్ కాల్డ్వెల్ చేసిన సిద్ధాంతాన్ని గిడుగు రామమూర్తి పూర్తిగా ఒప్పేసుకున్నారు. దానితోపాటు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించి భారతీయ సాహిత్యాల గురించి చాలా అభిప్రాయాలను చెప్పిన జార్జ్ గ్రియర్సన్ అభిప్రాయాలు పూర్తిగా ఆయన అంగీకరించారు. అయితే, ముఖ్యంగా వ్యాకరణం అనే భావానికి అర్థం మారుతోందని ఆధునికుల దృష్టిలో వ్యాకరణం భాషని శాసించేది కాదని భాషని అనుసరించేదని గిడుగు రామమూర్తి పాశ్చాత్య ప్రభావం వల్లే గ్రహించారు.
ఆ కాలంలో ఇంగ్లీషు విద్యావంతులకు విక్టోరియన్ నైతిక దృష్టి ప్రభావం వల్ల అశ్లీలమనే కొత్త భావం ప్రవేశించి తెలుగు సాహిత్యంలో చాలాభాగం అశ్లీలంగా కనిపించింది. ఈ వాదానికి బలం చేకూర్చినవారు ఇద్దరు: కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి. ఆ దృక్పథాన్ని గిడుగు రామమూర్తి నిరభ్యంతరంగా అంగీకరించారు. ఆయన దృష్టిలో ముద్దుపళని బజారు వేశ్య. కేవలం రాజుల మెప్పు కోసం మాత్రమే స్త్రీల అంగాంగవర్ణనలు చేస్తూ తెలుగు కవులు చవకబారు వర్ణనలు చేశారు. అందుచేత విద్యార్థులచే చదివించే పాత తెలుగు పుస్తకాలని జాగ్రత్తగా పరిశీలించి అశ్లీల భాగాలని పరిహరించాలని రామమూర్తి పంతులు గట్టిగా వాదించారు. వీటివల్ల గిడుగు రామమూర్తి మీద వలసవాద భావాల ప్రభావం ఎంత బలంగా వుందో గమనించవచ్చు.
దాదాపు ఈ కాలంలోనే రాసిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజంలో గిడుగు రామమూర్తి గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చిన్నయ సూరి కూడా రాయలేదనే ప్రతిపాదనకి ఎక్కువ వివరంగా ఉదాహరణలు ఇచ్చారు. ఆయనే తరువాత సంకలనం చేసిన గద్యచింతామణిలో పూర్వం వచనం రాసిన వాళ్లనించి కొల్లలుగా ఉదాహరణలు ఇస్తూ అదంతా వ్యావహారికమేనని వాదిస్తూ, వ్యావహారికం పూర్వకాలం నుంచి తెలుగులో చాలామంది రాశారని చూపించారు. ఇది దాదాపుగా గిడుగు రామమూర్తి వాదన యొక్క సారాంశం.
రామమూర్తి పంతులుకి పండితులంటే అభివృద్ధి నిరోధకులని, కొత్త ఆలోచనలకు అడ్డొచ్చేవారని, ప్రపంచంలో వున్న జ్ఞానం యేదీ తెలుగులోకి రాకుండా వాళ్ల పట్టుదల వల్లే ఆగిపోతోందని తీవ్రమైన అభ్యంతరం వుంది. అయితే పండితుల్లోనే ఆయనకు మంచి స్నేహితులున్నారని, తన అభిప్రాయాలను ఆమోదించిన వారున్నారని రామమూర్తి పంతులు మనకి జ్ఞాపకం చేస్తారు.
గురజాడ 1915లో పోయారు. ఆయన మరణం వ్యావహారికవాదులకి పెద్ద దెబ్బ అయ్యింది. గిడుగు రామమూర్తి దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన దాదాపు 25 ఏళ్ళపాటు ప్రభుత్వాన్ని, యూనివర్శిటీ సిండికేటు వాళ్ళ సభల్ని వదిలిపెట్టి ఊరూరా తిరిగి వీలున్నంతమంది పండితుల్ని వ్యక్తిగతంగా కలుసుకుని వాళ్ళతో వాదించి వ్యావహారిక భాష గురించి తన అభిప్రాయాలని వాళ్ళు ఒప్పుకునేట్లు చేసి అలా ఒప్పుకున్నట్లు కాగితం మీద రాయించి పుచ్చుకున్నారు. తన వాదనలు ఒప్పుకోని పండితులనుంచి తాము ఒప్పుకోవడం లేదన్న సంగతిని కూడా కాగితం మీద రాయించి తీసుకున్నారు. ఈ రకంగా ఆయన పండితుల అభిప్రాయాన్ని ఒకరొకరుగా ఎదుర్కున్నారు. ఈ పని పట్టుదలగా చేయడంవల్ల ఆయన వాదాన్ని పండితులు కూడా లోపల ఒప్పుకున్నా లేకపోయినా పైకి కాదనగల పరిస్థితి లేకుండా పోయింది. అంతకన్నా ముఖ్యంగా ఆయన సభల్లో గట్టిగొంతుకతో పుంఖానుపుంఖాలుగా ఉదాహరణలిస్తూ గ్రాంథికవాదాన్ని చితకకొడుతూ వ్యావహారికాన్ని సమర్థించడం వల్ల ఆయనకి పండితలోకంలో అసామాన్యమైన పేరు వచ్చింది. ఆయన సూర్యరాయాంధ్ర నిఘంటువుని విమర్శిస్తూ అందులో లోపాల్ని పరమ సమర్థంగా చూపించేవారు. అంచేత గ్రాంథికం అనే మాటకి క్రమక్రమంగా బలం తగ్గి ఈయన ప్రతిపాదించిన వ్యావహారికం అనే మాట నిత్యవ్యవహారం లోకి వచ్చింది.
తెలుగుభాషకి గ్రాంథికత్వం చిన్నయ సూరి వల్లే వచ్చిందని, రామమూర్తి పంతులు వ్యతిరేకిస్తున్న కృతక గ్రాంథికానికి చిన్నయ సూరే కారకుడని ఒక సామాన్యాభిప్రాయం తెలుగులో కొత్తగా రాసేవారందరిలోను ఏర్పడింది. భాషని పాడు చేసింది చిన్నయ సూరే అని, దానికి లేనిపోని సంకెళ్లు తగిలించి ఎవరూ రాయలేనంత క్లిష్టంగా ఎవరికీ అర్థం కానంత కష్టంగా చిన్నయ సూరే తెలుగుని తయారు చేశారని, ఒక అనాలోచితమైన అభిప్రాయం కొత్త రచయితల్లో బలపడింది. ఈ ప్రవాహంలో చిన్నయ సూరి చేసిన పనిని సమర్థంగా బోధపరుచుకునే పని ఎవ్వరూ చేయలేదు. అంతకన్నా ముఖ్యంగా చిన్నయ సూరి రాసింది అందమైన భాష అని ఒక్క గురజాడ తప్ప ఎవరూ గుర్తించలేదు. ఈ కారణాలవల్ల క్రమంగా లాక్షణికము, గ్రామ్యము అనే మాటలు పోయి గ్రాంథికము, వ్యావహారికము అనే మాటలే ప్రచారంలోకి వచ్చాయి.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
గురజాడ అప్పారావు
(గురజాడ అప్పారావు జీవితచరిత్ర దాదాపుగా తెలిసినదే కనుక ఆ వివరాలలోకి మేము వెళ్ళటం లేదు.-ర.)
జయంతి రామయ్య పంతులు రాసిన రిపోర్టును (A Defense of Literary Telugu) కాదంటూ గురజాడ అప్పారావు, గ్రాంథికవాదుల వాదాలు ఎలా తప్పో చూపిస్తూ, నన్నయ కాలం నుంచి కూడా కావ్యేతరమైన భాషలో ‘చున్న’ బదులు ‘స్తున్న’ (వచ్చుచున్న , వస్తున్న) ఎలా వాడుకలో వుందో చాలా వివరంగా ఉదాహరణలు ఇస్తూ, ఒక 152 పేజీల వ్యాసం (Minute of Dissent) రాశారు. ఆ తరవాత రామయ్య పంతులు తమ రిపోర్టులో ఆర్కయాక్ (archaic), కరెంట్ (current) అనే విభజన చూపించలేదని; చాలా మాటలు పాతబడి పోయినవి, కేవలం అలంకార సౌందర్యం కోసం వాడినవి, నిత్య వ్యవహారంలో అవసరం లేదని; కావ్యేతర వ్యవహారంలో వున్న భాష వర్ణక్రమాన్ని సోదాహరణంగా వివరించారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో పై తరగతి విద్యావంతులు మాట్లాడే భాష ఆధునిక వ్యావహారిక భాష అవ్వాలని వాదించారు. చిన్నయ సూరి నీతిచంద్రికలో నిజంగా అందమైన వచనం రాయగా కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం దాన్ని అనుకరించబోయి భయంకరమైన, గొడ్డు గ్రాంథికభాష రాశారని; ఇలాంటి వచనమే కాలేజీ పిల్లలకి తెలుగు వచనం పేరుతో బోధిస్తున్నారని; చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చేసే సంధులు తెలుగులో పండితులు కూడా నిత్యం వాడ్డంలేదని; ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రాచరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు ఈ గ్రాంథికవాదుల దృష్టికి రాలేదని చూపించారు.
చిన్నయ సూరి రాసిన వచనం గ్రాంథికమైనా అందమైనదని గుర్తించినందుకు గురజాడ అప్పారావుని మెచ్చుకోవలసి వుంది.
తెలుగులో కళ, ద్రుతప్రకృతికము అనే తేడా చాలా కాలంగా పోయిందని చిన్నయ సూరి ఆ విభాగాన్ని బతికుంచడానికి ప్రయత్నం చేసినా గ్రాంథికవాదులు కూడా ఆ తేడాని పాటించలేక పోతున్నారని ఉదాహరణలతో సహా నిరూపిస్తారు గురజాడ అప్పారావు. అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే తెలుగులో బ్రిటిష్వాళ్లకి పూర్వం అందరికీ పాఠం చెప్పే బడులు లేవు; సర్వత్రా నేర్పబడుతున్నది గ్రాంథిక భాష కాదు;, గ్రాంథిక భాష అనేది పూర్వం లేదు; అసలు పూర్వం ఎప్పుడూ గ్రాంథిక భాష అనేది పాఠంగా చెప్పబడలేదు; ఈ గ్రాంథిక భాష బ్రిటిష్‌వాళ్లు తమ విద్యాశాఖ ద్వారా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా, టెక్స్ట్ బుక్ కమిటీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు; కాని, ఇవాళ వ్యావహారిక భాష పిల్లలకి చెప్పాలని వాదిస్తున్నారని; గురజాడ అప్పారావు రాసిన ఈ మినిట్ ఆఫ్ డిసెంట్ వ్యాసం పరిశీలనగా చూస్తే ఆయన వాదన ఎంత సహేతుకమైనదో, గ్రాంథికమే ఎందుకు కృతకమైనదో, ఛందస్సుల్లో ఉన్న కావ్యాల్లో లేని భాష–ఎంత విస్తృతంగా వ్యవహారంలో వుందో తెలుస్తుంది.
ఇంత శ్రమ పడిన తరువాత కూడా గురజాడ ఆధునిక రచనా భాషకి కొన్ని కట్టుబాట్లు అవసరమని, నిజానికి ఇప్పుడు కావలిసింది ఒక ‘కొత్త గ్రాంథికం’ అని స్పష్టంగా చెప్పలేదు. అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష మీద దాని ప్రభావాన్ని ఆయన గుర్తించారు. పూర్వకాలంలో వున్న రకరకాల వ్యావహారికాలకు ఆయన బలమైన ఉదాహరణలు చూపించినా అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారాలకి వాడబడుతుందని, అయినా గ్రంథప్రచురణకర్తలు భాషా స్వరూపాన్ని సమర్థంగా నిర్ణయించరని, వాళ్ళు అచ్చు పుస్తకాల్లో వాడే భాష వ్యహారంలో వుండే తెలుగుకి దగ్గరలో వుండేదే కానీ ఇది అక్షరాలా ఎవరూ మాట్లాడే తెలుగు కాదని, గురజాడ అప్పారావు గుర్తించలేదు. అందుచేత ఆయన వ్యాసం అంతా గిడుగు రామమూర్తి పంతులు పద్ధతిలో గ్రాంథిక భాషని కాదనడానికే ఉపయోగపడింది కానీ ఆధునిక తెలుగు ఎలా వుండాలో నిర్ణయించడానికి ఉపయోగపడలేదు.
చివరి మాటగా చెప్పాలంటే ఈ వివాదాల వల్ల గ్రాంథిక భాష ఎందుకు పనికిరాదో చెప్పడానికి బలం యేర్పడింది కాని ఆధునిక తెలుగు ఏ రూపంలో వుండాలో చెప్పడానికి మంచి రచనలు తయారవలేదు.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
జయంతి రామయ్య పంతులు
జయంతి రామయ్య పంతులు 1860 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో పుట్టారు. పుట్టిన ఇరవయ్యొకటో రోజున దత్తతకు వెళ్లారు. ఆయన అక్షరాభాస్యం వీధి బళ్లో సాంప్రదాయిక పద్ధతిలో జరిగింది. అప్పుడు రాయడానికి పలకలు బలపాలు వుండేవి కావు. నేలమీద ఇసకలో గుంట ఓనమాలు దిద్దటం నేర్చుకున్నారు. తరవాత కంఠోపాఠంగా బాలరామాయణం, అమరకోశం చెప్పించుకున్నారు. 1870లో ఆయన చదివే కాలేజీ గ్రాంట్-ఇన్-ఎయిడ్ (Grant in aid) పాఠశాలగా మారింది. 1874లో రామయ్య పంతులుకి ఆయన అన్నయ్య ద్వారా ఇంగ్లీషు విద్యలో ప్రవేశం కలిగింది. ఆ ఇంగ్లీషు త్వరగా నేర్చుకుని హైకాలేజీ చదువు పూర్తి చేసి 1877లో మెట్రిక్యులేషన్ పరీక్ష, తరవాత ఎఫ్.ఎ. కూడా మొదటి తరగతిలో ప్యాసయ్యారు. కాలేజ్‌లో ఉపాధ్యాయుడిగా వుద్యోగం చేద్దామనుకున్నారు కానీ అప్పటి కాలేజి ప్రిన్సిపల్ మెట్కాఫ్ (Metcalfe) సలహా మీద బి.ఎ.లో చేరి లాజిక్, ఫిలాసఫీ, ఎథిక్స్, మెటాఫిజిక్స్ చదివారు. రామయ్య పంతులు మొదట్లో పిఠాపురం లోని మహారాజావారి హైకాలేజ్లో హెడ్మాస్టరుగా పనిచేసి 1886లో ఆ ఉద్యోగం వదిలేసి ఆపైన న్యాయశాస్త్రం చదివి బి.ఎల్. డిగ్రీ తెచ్చుకున్నారు.
ఆ తరవాత రెవెన్యూశాఖలో వుద్యోగంలో చేరి క్రమక్రమంగా డెప్యూటీ కలెక్టరు అయ్యారు. ఆ రోజుల్లో డెప్యూటీ కలెక్టరు వుద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రెవెన్యూ శాఖలో భారతీయులు పొందగలిగిన అతి పెద్ద ఉద్యోగం అదే. ఆ పైస్థానంలో వుండే కలెక్టరు ఎప్పుడూ తెల్లవాడే వుండేవాడు. ఇంగ్లీషు చదువుకుని రెవెన్యూ శాఖలో వుద్యోగం చేస్తూ ఆఫీసు ఫైళ్లలో తలమునకలుగా వుండే రామయ్య పంతులు ఎప్పుడు నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో సమాచారం లేదు గాని ఆయనకి తెలుగు కావ్యాల మీద, సంస్కృత భాష మీద ఒక పెద్ద పండితుడికి ఉండదగినంత సామర్థ్యం వచ్చింది. ఆయన లాక్షణిక భాషావాదాన్ని సమర్ధిస్తూ రాసిన పెద్ద వ్యాసం (A defense of literary Telugu) చదివితే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు ఆంధ్ర సాహిత్య పరిషత్తు నిర్మాణం లోను, గ్రాంథికవాదుల్ని కూడగట్టుకుని వారి వాదానికి జమిందారుల ప్రాపకం సంపాదించడం లోను, సూర్యరాయాంధ్ర నిఘంటువు సంపాదకత్వం తన చేతులోకి తీసుకోవడం లోను ఆయన రాజకీయంగా కూడా చాలా బలమయిన మనిషి అని కూడా తెలుస్తుంది.
దాదాపుగా తన చివరి రోజుల్లో (1934లో) ఆయనిచ్చిన ఉపన్యాసాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసవైఖరి పేరుతో 1937లో అచ్చు వేశారు. ఆ పుస్తకం చదివితే ఆయనకి ఆధునిక తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి ఉన్న అభిప్రాయాలు ‘ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు’ రోజులనుంచి చాలా మారాయని, ఎక్కువ ఉదారంగా తయారయ్యారని మనకి అనిపిస్తుంది. అంతే కాకుండా సాహిత్య విమర్శ గురించి ఆయన అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా ఆ ఉపన్యాసాలలో ఆయన చిన్నతనంలో తెలుగు చదువులు ఎలా వుండేవి, బళ్లలో ఏ పుస్తకాలని ఎలా చెప్పేవారు అనే వాటి గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చారు.
ఆయన అభిప్రాయంలో వర్తమాన కాలంలోనే వచనగ్రంథాలు వచ్చాయి. అంతకుముందు ఉన్నవన్నీ పద్యగ్రంథాలే! తెలుగులో వచనయుగాన్ని మొదలుపెట్టినవాడు చిన్నయ సూరి. రామయ్య పంతులు దృష్టిలో చిన్నయ సూరి వచనం గొప్ప వచనం. ఆ తరవాత ఆయన మెచ్చుకున్నవాళ్లలో ముఖ్యుడు వీరేశలింగం పంతులు. రామయ్య పంతులుకి తంజావూరు, మధుర రాజ్యాలలో తెలుగు పుస్తకాలు చాలా వచ్చాయని తెలుసు. ఆ కాలంలో వచ్చిన యక్షగానాలు, వచనగ్రంథాలు ఆయన చదివారు, అయినా ఆ యక్షగానాలు ఆ కాలానికి ప్రేక్షకులకి ఆనందం కలిగించేవే కానీ అవి మంచి రచనలు కావని ఆయన నమ్మకం. తరవాత వీరేశలింగం, ఆయనను అనుసరించి చిలకమర్తి లక్ష్మీనరసింహం, రాసిన నవలల్ని కూడా ఆయన తన ప్రసంగాలలో కొంత ప్రశంసాపూర్వకంగానే ప్రస్తావించారు. ఆధునిక కాలంలో తెలుగులో నాటకనిర్మాణం సంస్కృత నాటకాలకి ఇంగ్లీషు నాటకాలకి అనువాదంగా వచ్చిందని ఆయన వివరించారు.
అప్పటికి తెలుగులో వచ్చిన పుస్తకాలన్నిటినీ దాదాపుగా పూర్తిగా చర్చించిన ఈ వ్యాసంలో ఆయన గుర్తించినవి, మెచ్చుకున్నవి అన్నీ లాక్షణికభాషలో రాసినవే. దీనితో పాటు ఇంగ్లీషులో చదివి ఆ విషయాలు తెలుగులో చెప్పాలనే కోరికతో రాసిన శాస్త్రగ్రంథాలను గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగులో ఆధునిక శాస్త్ర విషయాలు చెప్పడానికి కావలసిన పరిభాషాపదాలు లేవు కాబట్టి కొత్తగా తయారుచేసుకోవలసిన అవసరం వుందని కూడా ఆయన గుర్తించారు. పాశ్చాత్యదేశాల్లో శాస్త్ర పరిభాషాపదాలన్నీ గ్రీకు నుంచి లాటిన్ నుంచి తెచ్చుకున్నట్టుగా మనం కూడా భారతీయ భాషలన్నిటికీ సమానంగా సంస్కృతం నుంచి పరిభాషా పదాలు తయారు చేసుకోవాలని, ఇవి అన్ని భారతీయ భాషలకి సమానంగానే పనికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నిఘంటువులు దగ్గరికి వచ్చేసరికి ఆయన శబ్దరత్నాకరాన్ని ప్రత్యేకంగా ప్రశంసించి, అయినా అది సమగ్రం కాదు కాబట్టి పిఠాపురం మహారాజావారి డబ్బుతో తయారవుతున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు గురించి ప్రస్తావించారు.
కొమర్రాజు లక్ష్మణరావు మొదలుపెట్టిన ఆంధ్ర విజ్ఞానసర్వస్వం మూడు సంపుటాలు వచ్చాయని, ఇటువంటి పుస్తకాలు పూర్వం తెలుగులో లేవు కాబట్టి ఇంగ్లీషునుంచి తెచ్చుకున్నప్పటికీ ఇవి మనకు అవసరమని రామయ్య పంతులు గుర్తించారు. చరిత్రకు సంబంధించినంత వరకు సంస్కృతంలోను, తెలుగులోను కూడా చాలా సమాచారం దొరుకుతుంది కానీ అందులో అనేక అతిశయోక్తులు, కొంత సత్యము కలిసిపోయి ఉంటాయని ఆయన గమనించారు: ‘న్యాయమూర్తియైన ధర్మాధికారి వాది ప్రతివాదులు తెలుపు విషయములఁ బరిశీలించి సత్యమును గని పెట్టునట్లు–ఐతిహాసికుడు కూడా సామగ్రిని మధ్యస్థభావముతో నిష్పక్షపాతముగఁ బరిశీలించి సత్యమును గనిపెట్టవలయును, గాని, వేగిరపాటుతో నపసిద్ధాంతము చేయఁగూడదు.’
రాజమండ్రిలో చిలుకూరి వీరభద్రరావు నాయకత్వంలో స్థాపించిన ఆంధ్రా హిస్టారికల్ సొసైటీని గురించి కూడా రామయ్య పంతులు ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఇంగ్లీషులో జాన్సన్ రాసిన లైవ్స్ ఆఫ్ పొయట్స్ లాంటివి తెలుగులో వస్తున్నందుకు సంతోషిస్తూ, ఆ విషయంలో గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం మొదలుపెట్టిన పనిని గురించి కూడా ప్రస్తావించారు. తెలుగులో స్వీయచరిత్రలు లేవన్న విషయం గుర్తించి వీరేశలింగం స్వీయచరిత్ర, ఇంకా ఇతర స్వీయచరిత్రలు, ముఖ్యంగా చెళ్లపిళ్ల వెంకటరావు జాతకచర్య గురించి వివరంగా చర్చించారు. కావ్యవిమర్శలో కూడా మృదువైన పద్ధతిని అనుసరించాలి కాని ఒకరినొకరు తిట్టుకునే పద్ధతి కూడదని సూచించారు. ఆధునిక కాలంలో అప్పటికి ఉన్న సాహిత్య సమాచారమంతా సేకరించి వాటిగురించి చాలా వివరంగా చెప్పిన ఉపన్యాసాలు ఇవి.
మొత్తం మీద ఈ ఉపన్యాసాలన్నీ చదివితే తెలుగు ఆధునికీకరించబడాలని, తెలుగులో లేని ప్రక్రియలు అవసరమయినంత వరకు తెచ్చుకోవాలని రామయ్య పంతులు స్పష్టంగానే చెప్పారని బోధపడుతుంది. ఐతే, భావకవిత్వాన్ని గురించి ఆయనకి అంత మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. రవీంద్రనాథ్ టాగోరుని అనుసరించి, ఇంగ్లాండులో షెల్లీ, కీట్స్ మొదలయిన కవుల ప్రభావాన్ని అంగీకరించి, తెలుగులో భావకవిత్వం వచ్చిందని చెప్తూ ‘భావకవిత్యమందుఁ బెక్కుమందికి స్పురించుచున్న పెద్ద దోషము భావాభావము.’ అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. అనంతపంతుల రామలింగస్వామి రాసిన శుక్లపక్షము ఆయనకి చాలా నచ్చింది. ఇక తెలుగు భాష పరిస్థితికి వచ్చేసరికి వ్యవహారంలో వున్న భాష ఒక ప్రాంతంవారి భాష ఇంకో ప్రాంతంవారికి అర్థం కాదని, ఒక కాలంలో రాసిన భాష ఇంకొక కాలంవారికి అర్థం కాదని, విద్యావంతులైన బ్రాహ్మణులు మాట్లాడే భాష కూడా ప్రాంతంనుంచి ప్రాంతానికి మారుతుందని, ఇలాంటి భాషలో రచనలు చెయ్యకూడదని ఆయనకు గట్టి నమ్మకం. అందుచేత లాక్షణికమైన భాషే రచనల్లో వాడాలని ఆయన అభిప్రాయం. తెలుగులో కవిత్రయంవారి మహాభారతం చదువుకోని పల్లెటూరివాళ్లకి కూడా అర్థం అవుతుందని, కేవలం ప్రబంధాలే పండితులకు మాత్రమే అర్థమయ్యే పుస్తకాలని రామయ్య పంతులు వివరించారు:
Quote:‘భారతము మొత్తముమీఁద ప్రౌఢగ్రంథమేకదా! ఆ గ్రంథము పల్లెటూళ్లలోఁ బురాణముగాఁ జదువు నాచారము చిర కాలమునుండి యున్నది. ఒకరు పుస్తకము చదువుట యింకొకరర్థము చెప్పుట యాచారము. ఇంచుమించుగా గ్రామములో నున్న వాఱందరును వచ్చి యాపురాణము విందురు. స్త్రీలు ముఖ్యముగా వత్తురు. చదువువాని కంటె నర్థము చెప్పువాఁడు గట్టివాఁడుగా నుండవలయును గదా! వ్రాలుచేయనేరని వారు శ్రుతపాండిత్యముచేతనే భారతమున కర్థము చెప్పుట నే నెఱుఁగుదును. ప్రతిపదార్థముతో నన్వయించు సామర్థ్యము లేకున్నను సభ్యులలో ననేకులకు పద్యము చదువఁగనే దాని ముఖ్య భావము బోధపడును.‘
లాక్షణిక భాషలో రాసినా వీరేశలింగం పుస్తకాలు, అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన గయోపాఖ్యానం కొన్నివేల ప్రతులు అమ్ముడు పోవటం గుర్తించారు. లాక్షణిక భాష కూడా చిన్నయ సూరి రాసినట్టే కాకుండా అవసరమైన చోట విసంధి పాటిస్తూ రాయాలని ఆయన అభిప్రాయం: ‘ఏమార్పులు చేసినను నియమములకు లోఁబడి యుండవలెను గాని విచ్చలవిడిగా నుండరాదు.‘ ఈ నమ్మకమే గ్రాంథిక భాషావాదంగా పేరుపడ్డ ఉద్యమానికి ఊపిరి.
ఇంతకీ, విశ్వవిద్యాలయాలల్లోను, పాఠశాలల్లోను దేశభాషలు ప్రవేశ పెట్టాలి, దేశభాషల్లో ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు రాయించాలి అన్న లార్డ్ కర్జన్ ఆలోచన తెలుగుదేశం దాకా వచ్చేసరికి లాక్షణిక, గ్రామ్య భాషావిభేదాలుగా పరిణమించింది.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
జయంతి రామయ్య పంతులు మొదలైన వారిని గ్రాంథిక భాషావాదులు అని గిడుగు రామమూర్తి పెట్టిన పేరు ఒప్పేసుకోకుండా వాళ్ల వాదన ఏమిటో నిశితంగా పరిశీలించినవారు ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ భాషావాదాలని గురించి బూదరాజు రాధాకృష్ణ, అక్కిరాజు రమాపతిరావుల దగ్గరి నుంచి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు కృష్ణమూర్తి వరకు గ్రాంథికము, వ్యావహారికము అన్న మాటలనే వాడుతూ వచ్చారు. నన్నయ కాలంలోనే నన్నయ తన భారతంలో రాసిన భాషకి, ఆ కాలంలో శాసనాల్లో వున్న భాషకి తేడా వుందని కృష్ణమూర్తి గమనించారు. కానీ నన్నయది ప్రాచీన (Archaic) భాష అని కృష్ణమూర్తి అన్నారు. ఈ మాట తప్పు. ఏ భాషలో అయినా కావ్యాలలో ఉపయోగించే భాష ఒకటి, లౌకిక వ్యవహారంలో ఉపయోగించే భాష ఒకటి, రెండు వేర్వేరు భాషలు ఉంటాయి. నన్నయది ఛందస్సు బలం వల్ల ఏర్పడిన కావ్యభాష. ఈ భాష ఛందస్సు బలం వల్లే, ఛందస్సు ఒప్పుకున్న చిన్న చిన్న మార్పులతో, దాదాపు 900 సంవత్సరాలపాటు కొనసాగిందనీ ఇంతకు ముందే చెప్పాం. అంచేత ఇది ఆర్కయాక్ భాష కాదు, కావ్యభాష.
వ్యవహారంలో వచనం రాయవలసిన అవసరం అచ్చుయంత్రం వచ్చిన తరవాత 19వ శతాబ్దం ఆరంభంలోనే కలిగింది. లౌకిక వ్యవహారంలో వున్న తెలుగు అనేక రూపాల్లో ఒక స్థిరమైన వర్ణక్రమం లేకుండా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్లు రాసేవారు. ఇలాంటి తెలుగే మనకు పండితులు రాసిన వ్యాఖ్యానాల్లో కూడా కనిపిస్తుంది. పాటల్లో అయితే ఆ పాటలు పాడేవాళ్ల స్థాయిని బట్టి–అన్నమయ్య దగ్గరనుంచి దంపుళ్ల పాటలు పాడే ఆడవాళ్లవరకు– వాళ్ల వాళ్ల ఛందస్సులకి అనువైన పద్ధతిలో మాటలు వాడేవారని, వీటన్నిటికి కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టడం వల్ల చాలా గందరగోళం ఏర్పడిందని, ఇది ఒక వ్యావహారికం కాదు, అనేక వ్యావహారికాలు అని గుర్తించాలి అని, మేము ఇంతకు ముందు చెప్పివున్నాం.
గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారని మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే ఎవరు? గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమై కూర్చుంది. వీళ్లల్లో గురజాడ అప్పారావు నిజంగా ఆలోచనాశీలి అయిన మనిషి. ఆయన కూడా తాను రాసిన పుస్తకాలలో ఎక్కడా శిష్ట వ్యావహారికం అంటే ఏమిటో ప్రదర్శించి చూపించలేదు. ఆయన రాసిన కన్యాశుల్కం వ్యావహారిక భాషలో రాసిన మొదటి సాహిత్య గౌరవం గల రచన అని అందరూ అనడం మొదలు పెట్టారు. కానీ జాగ్రత్తగా చూస్తే కన్యాశుల్కంలో భాష రామమూర్తి పంతులు అడిగిన శిష్టవ్యావహారికం కాదు. అందులో వున్న భాష పాత్రోచితంగా రాసిన భాష. ఏ పాత్ర ఏ కులానిదో, సమాజంలో ఏ స్థాయిదో గమనించి వాళ్ళు ఉచ్చరించే పధ్ధతి జాగ్రత్తగా అనుసరించి రాసిన నాటకం కన్యాశుల్కం. ఒకే పాత్ర తాను ఎవరితో మాట్లాడుతున్నది అనే దాన్ని బట్టి ఉచ్చారణని మారుస్తుంది అని కూడా గమనించి ఆ ఉచ్చారణ అచ్చులో చూపించడానికి అవసరమైన అక్షరాలు లేకపోతే వాటిని సూచించడానికి ప్రత్యేకమైన మార్గాలు అనుసరించి రాసిన పుస్తకం కన్యాశుల్కం. కన్యాశుల్కం తర్వాత తర్వాత అచ్చు వేసిన కొంతమంది ఈ విశేషాలని గమనించలేక ఆయా మాటల వర్ణక్రమాన్ని మార్చేశారు కూడా.
ఇకపోతే అప్పారావు స్వయంగా రచయితగా రాయవలసి వచ్చిన ఉపోద్ఘాతం, అంకితం మొదలైనవన్నీ ఇంగ్లీషులో రాశారు. నాటకం లోపల పాత్ర ప్రవేశాన్ని, అంకాన్ని, రంగాన్ని సూచించే భాష కేవలం గ్రాంథికం, అంటే చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసినది. ఆయన రాసిన వ్యాసం (Minute of Dissent) ఇంగ్లీషులో రాశారు, తన సొంత డైరీలు ఇంగ్లీషులో రాశారు. చాలా వ్యక్తిగత విషయాలయిన తన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టరుకి రాసిన సమాచార పత్రం కూడా ఇంగ్లీషులోనే రాశారు. ఇవన్నీ చూస్తే అప్పారావు ఆలోచించే భాష ఇంగ్లీషా, తెలుగా అని అనుమానం కలుగుతుంది. ఆయన వ్యావహారికవాదే కానీ వ్యావహారిక భాషలో వచనం ఎలా ఉంటుందో రాసి చూపించలేదు. నీలగిరిపాటల దగ్గరనించి ముత్యాలసరాల వరకు పాటలో వుండే సాహిత్యంలో తెలుగు ఎంతో అందంగా పట్టుకోగలిగిన అప్పారావు; నిత్య వ్యవహారంలో రకరకాల సందర్భాలలో రకరకాల మనుషులు మాట్లాడే తెలుగు అంత స్పష్టంగానూ పట్టుకోగలిగిన అప్పారావు; ఆధునిక వ్యవహారానికి ఆలోచనలు, శాస్త్ర విషయాలు, చరిత్ర, విమర్శ చెప్పగలిగే వచనం ఎందుకు రాయలేదో మనం ఊహించలేము. కళింగదేశ చరిత్ర రాస్తానని ఒప్పుకున్నారని తెలుస్తుంది; అందుకు కావలసిన పుస్తకాలు,శాసనాలు సంపాదించారని కూడా అంటున్నారు కానీ ఆయన ఆ పుస్తకం కనీసం మొదలు పెట్టినట్టు కూడా రుజువులు లేవు. ఆయన రాతప్రతులు అన్నీ ఏమైపోయాయో తెలియదు/ అవి ఎక్కడికి వెళ్ళాయో, ఎవరి దగ్గర ఉండేవో పరిశోధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మాకు తెలిసినంత వరకు తార్నాకలో (హైదరాబాదు) వున్న ఆర్కయివ్స్‌లో భద్రపరచపడిన కాగితాలే అందరికీ దొరికేవి.
ఆయన రాతప్రతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు మనకు తెలిసినవాళ్ళు అవసరాల సూర్యారావు, పురాణం సుబ్రహ్మణ్య రావు, నార్ల వెంకటేశ్వరరావు, మరీ ముఖ్యంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వాళ్ళు. తార్నాక ఆర్కయివ్స్కి చేరిన ఆ కొన్ని కాగితాలూ ఎవరు వాళ్లకి ఇచ్చారో ఆచూకీ తెలియదు. గురజాడని మహాకవి అని, యుగకర్త అని పొగిడిన కమ్యూనిస్టులు, ఆయనకి విగ్రహాలు వేయించిన ఆధునికులు, ఆయన కాగితాలని భద్రపరచడంలో కానీ ఆయన పుస్తకాలని అచ్చు వేయించడంలో కానీ కొంచెం కూడా శ్రద్ధపెట్టలేదు. ఇక విశాలాంధ్ర సంస్థ గురజాడ పుస్తకాలని తమకి తోచినంత గందరగోళంగా, లెక్కలేనన్ని అచ్చుతప్పులతో ప్రచురించిన తీరు చూస్తే గురజాడని మావాడు అని చెప్పుకోవటంలో వున్న ఆసక్తి, పట్టుదల ఆయన పుస్తకాల పట్ల, పుస్తకాల ప్రచురణ పట్ల లేదని స్పష్టమవుతుంది.
ఇక గురజాడ పరిస్థితి ఇలా ఉండగా గిడుగు రామమూర్తి రాసిన తెలుగు, పేరుకి వ్యావహారికమే కానీ నిజానికి గ్రాంథికానికే దగ్గరగా ఉంటుంది. ఇంతకన్నా చమత్కారమైన విషయం ఇంకొకటి ఏమిటంటే ఈ వ్యావహారిక భాషావాది తన సొంత విషయాలు తన భార్యకు రాసిన ఉత్తరాలలో చక్కని పద్యాల్లో రాశారు. ఆయన భార్య కూడా అంత చక్కని పద్యాల్లోనే సమాధానం రాశారు. పద్యాల్లో సొంత ఇంటి సంగతులు భార్యాభర్తలు మాట్లాడుకోడానికి పనికి వచ్చినప్పుడు, ఇతర లౌకిక వ్యవహారాలకి ఎందుకు పనికిరాదని ఆయన అనుకున్నారో చెప్పడం కష్టం. ఇది ఇలా ఉండగా రామమూర్తి పంతులు చిన్నయ సూరి నీతిచంద్రికలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చూపించి ఆ భాష చిన్నయ సూరి కూడా వాడలేదని; అందుచేత ఆధునిక వ్యవహారానికి పనికిరాదనీ వాదించారు. కానీ చిన్నయసూరే స్వయంగా హిందూధర్మశాస్త్రసంగ్రహం అన్న పుస్తకంలో ఆధునిక న్యాయవ్యవహారాన్ని గ్రాంథిక భాషలో రాసి చూపించాడని రామమూర్తి పంతులు గుర్తించలేదు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్క రామలింగారెడ్డి వంటి ఆధునికుడు ఆధునిక సాహిత్యవిమర్శకే మూలగ్రంథమని అందరూ అనే కవిత్వతత్త్వవిచారము, ఎవరూ పట్టించుకోకపోయినా నిజంగా పట్టించుకోవలసిన అర్థశాస్త్రము గ్రాంథిక భాషలోనే రాశారు.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
స్థూలంగా చెప్పాలంటే, భాషలో రకరకాల శైలులు వున్నాయి. సాహిత్యంలో వాడే భాష ఒక రకం, శాస్త్ర విషయాలు, ఆలోచనలు చెప్పటానికి వాడే భాష ఇంకొక రకం, ఈ రెండురకాల భాషలకి మధ్య తేడా ఉంది. మొదటి దాంట్లో ఏం చెప్పాలి అనే అనే విషయం మీద కాకుండా ఎలా చెప్పాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, రెండవ దాంట్లో స్పష్టతకు, తార్కికతకి, సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కానీ చెప్పే విషయం అందంగా ఉందా లేదా అన్న విషయం మీద దృష్టి ఉండదు. ఇలా విడదీసి చూస్తే గ్రాంథికవాదులకి మూలమైన చిన్నయ సూరి రెండు రకాల శైలుల్లోనూ పుస్తకాలు రాశాడని, వ్యావహారికవాదులు ఆ పని చేయలేదని చెప్పొచ్చు.
గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం అంతా కూడా పదాలు, వాటి వర్ణక్రమాలు, మరీ ముఖ్యంగా క్రియా పదాలు ఎలా ఉండాలి అనే. దీని తరువాత వ్యావహారికవాదులు ముఖ్యంగా చర్చించిన విషయం సంధులు ఎక్కడ విడతీయొచ్చు, ద్రుతప్రకృతికాలు, కళలు వీటిని పాటించాలా వద్దా, సరళాదేశాలు, గసడదవాదేశాలు పాటించి తీరాలా, అరసున్నాలు వాడకపోతే వచ్చిన నష్టమేమిటి–ఇలాటివి. తెలుగులో వచనం అప్పుడప్పుడే అలవాటు లోకి వస్తోంది కాబట్టి అందంగా వుండే వచనం, స్పష్టంగా వుండే వచనం, ఈ రెంటి మధ్యా ముఖ్యమైన తేడా ఉండాలి అన్నది ప్రధానంగా చర్చకు రాలేదు. సాహిత్య వచనం రకరకాల అలంకారాలతో, చమత్కారాలతో ఉండేది సరే. కానీ విషయం ప్రధానంగా వుండే వచనంలో స్పష్టత కావాలి కానీ అందం కోసం ప్రయత్నం అక్కర్లేదు అన్న విషయాన్ని విడదీసి చర్చించిన దాఖలాలు కనిపించవు. ఉదాహరణకి ‘మీ వుత్తరం అందింది, సంతోషించాను’ అని రాయవలసిన అవసరం వచ్చినప్పుడు ‘అమందానందకందళిత హృదయారవిందుడనైతిని’ అని రాయక్కర్లేదు. ఈ తేడా గ్రాంథికవాదులు ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. వ్యావహారికవాదులు కూడా మాటల విషయంలో పేచీపడ్డారు కానీ, స్పష్టతకు ఉపయోగపడే వచనం రాసి చూపించలేదు.
ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. మన వ్యాకరణాలన్నీ పదస్వరూపాన్ని నిర్ణయించేవే. అంటే ఒక పదానికున్న సాధుత్వ, అసాధుత్వాలని నిర్ధారించేవే. ఏదైనా ఒక వ్యాకరణం ప్రకారం సాధించడానికి వీలు లేకపోతే ఆ పదం అసాధువు. అంటే అన్నీ సాధు పదాలే వాడి వాక్యాన్ని గజిబిజిగా రాయవచ్చు అనే ఊహ వాళ్ళు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఉదాహరణకి గ్రాంథిక భాషకి ప్రామాణికంగా పనికొచ్చే బాలవ్యాకరణంలో ఒక సూత్రం వుంది చూడండి:
ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వ పదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపంజను (కారక పరిఛ్ఛేదము 37).
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపందగును – ఏనిప్రభృతిశబ్దములు కొన్ని నియమసాపేక్షంబు లయియుండు –
గాలి చల్లగా వీచెను –
వీచెను జల్లగా గాలి –
చల్లగా గాలి వీచెను –
వీచెను గాలి చల్లగా –
గాలి వీచెను జల్లగా –
చల్లగా వీచెను గాలి.
అని వాక్య నిర్మాణాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ఊరుకున్నాడు చిన్నయ సూరి. నిజానికి వాక్యనిర్మాణాన్ని గురించి ఇంత తేలికగా చెప్పి వూరుకోవడానికి తెలుగు భాష ఒప్పుకోదు. తెలుగు వాక్యనిర్మాణంలో ఇన్ని రకాల క్లిష్టతలు ఉన్నాయి. వాక్య నిర్మాణానికి రచనలో ఎంత శ్రద్ధ కావాలి అన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం అన్న పుస్తకం చదివితే తెలుగు వాక్యనిర్మాణానికి ఉన్న కొన్ని నియమాలైనా బోధపడతాయి. తెలుగు సాంప్రదాయక వ్యాకరణం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం పదస్వరూపాన్ని గురించిన చర్చలతోటే ఆగిపోయింది.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
భిన్న స్వరాలు
టేకుమళ్ల కామేశ్వరరావు భారతి పత్రికలో (1936) రెండు వ్యాసాలు ప్రచురించి వాటి ద్వారా వ్యావహారిక భాషకి కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలా అన్న విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని పత్రికలు, శిష్ట వ్యావహారిక భాష అనే ఒక రకమైన భాష రాస్తున్నాయి. చాలామంది రచయితలు కూడా శిష్ట వ్యావహారికంలో కథలు, వ్యాసాలు రాస్తున్నారు. కానీ పద్యాలు మాత్రం (ఇంతకుముందే చెప్పినట్లు ఛందస్సు బలం వల్ల) లాక్షణిక భాషలోనే వస్తున్నాయి. ఈ భాషలో రకరకాల పదాలు, రకరకాల వర్ణక్రమాలు ఉన్నాయని గమనించిన మండపాక పార్వతీశ్వరరావు భాషని నాలుగు రకాలుగా విభజించవచ్చునని చూపించారు (Archaic, Classical, Standard, Dialectical). అందులో ‘స్టాండర్డ్’ అని ఆయన నిర్దేశించిన పదాలతో వున్న భాషని ప్రమాణీకరించి అదే వాడాలని చెబితే ఇంగ్లండులోని కింగ్స్ ఇంగ్లిష్ లాగా ఒక ప్రామాణికమైన తెలుగు భాష ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం. అయితే ఆయన రాసిన రెండు వ్యాసాలు చాలా చిన్నవి కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ వివరంగా అనేక ఉదాహరణలతో ఆయన వివరించలేదు. ఆ రకమైన తెలుగులో ఏకత వుంటుందని కావ్యభాషలో అలాంటి ఏకత వుంది కాని దానిలో జీవం లేదని, వ్యావహారిక భాషలో జీవం వుంది కాని ఏకత లేదని, ఇటు జీవము అటు ఏకత వున్న ఒక మధ్య మార్గమొకటి కావాలని పార్వతీశ్వరరావుగారి వాదన. (అయితే ఈ వ్యాసాలు రెండూ కూడా లాక్షణిక భాషలోనే రాశారు అన్నది గమనించవలసిన విషయం.)
Quote:‘వాడుక భాషలో ఏకత కలిగింపవలసినదని నా ఉద్దేశము కాదు. కావ్యభాషకు నానాత్వము కలిగింపవలసినదని రామమూర్తిపంతులుగారి ఉద్దేశమును కాదు. విశ్వవిద్యాలయము, శాసన సభలు — ఈ సంస్థలలో ఉపయోగింపవలసిన భాష, ఈ సంస్థలతో సంబంధించిన వచనరచనలలో ఉండవలసిన భాష – కేవల కావ్యములు మాత్రమే కాదు, చరిత్ర, గణితము, భౌతికాదులగు శాస్త్రములు, కళలు, వీటితో సంబంధించిన రచనలు, ఉపన్యాసములు — వీటిలోని భాష — ఈ భాషలో ఒక ఏకత ఉండవలసి ఉన్నదనిన్నీ, ఈ ఏకతయే ఆంధ్రత్వమును నిలుపగలదనిన్నీ, ఈ నూతనాను శాసనము ప్రాచీనాంధ్రమునకున్ను, అభినవాంధ్రమునకున్ను కొంతకొంత భేదించి ఉన్నను ఈ రెంటిని కలుపగలిగిన అనుసంధానమై యుండవలసినదనిన్నీ దానికి వర్తమానాంధ్ర మనవలసియున్నదనిన్నీ నా అభిప్రాయము.’
పార్వతీశ్వరరావు వర్తమానాంధ్రభాష అన్నప్పుడు ఆయన ఉద్దేశించినది ఆధునిక రచనాభాషనే. దీన్ని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాం. పార్వతీశ్వరరావు చెప్పిన దానికన్నా ఎక్కువ వివరంగా, ఎక్కువ స్పష్టంగా టేకుమళ్ల కామేశ్వరరావు వాడుక భాష: రచనకి కొన్ని నియమాలు పుస్తకంలో చెప్పారు.అందులో అప్పటి కాలంలో తాము రాస్తున్నది వ్యావహారికం అనే అభిప్రాయంతో తెలుగు రాస్తున్న వాళ్ల ప్రచురణల్లోని మాటలనే ఉదాహరణలుగా చూపించి వాటిలో ఏకత్వం వుండటానికి, స్పష్టత ఉండటానికి కొన్ని సూచనలు చేశారు. అందులో ఉన్న సూచనలు ఇప్పటికీ అనుసరణ యోగ్యంగానే వున్నాయి.
ఈ పుస్తకానికి పీఠిక రాసినది గిడుగు రామమూర్తి పంతులే. ఆ పీఠికలో ఆయన కామేశ్వరరావు వ్యాసాలనే కాకుండా పార్వతీశ్వరరావు వ్యాసాలను కూడా ప్రసక్తికి తీసుకువచ్చి తమ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పారు. ఈ పీఠికలో రామమూర్తి పంతులు సౌజన్యము, తన వాదన మీద పట్టుదల రెండూ కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే గిడుగు రామమూర్తి అభిప్రాయంలో వ్యావహారిక భాషకి ఏ నియమాలు అక్కరలేదు. కాలక్రమాన భాష మారుతూ వుంటుంది, కుదుటపడుతూ వుంటుంది. అంచేత ‘వ్యవహారిక భాషారచన చక్కగా అభ్యసించినవారు మంచి పుస్తకములు వ్రాసి ప్రకటిస్తే అవి సామాన్యులకు ఆదర్శములుగా ఉపచరిస్తవి.‘ అని చెప్తూ మర్యాదగా కామేశ్వరరావు సూచనలని, పనిలోపనిగా పార్వతీశ్వరరావు సూచనలని, రెండింటినీ తిరస్కరించారు.
[ఈ పుస్తకపు పీఠిక, ఈ సంచికలో చదవగలరు. పూర్తి పుస్తకపు పిడిఎఫ్ ప్రతి. వి. ఎస్. టి. శాయి, గుంటూరు గ్రంథాలయం లైబ్రేరియన్లకు కృతజ్ఞతలతో – సం.]
ఏ దేశంలోనూ మాట్లాడే భాషే మాట్లాడినది మాట్లాడినట్టుగా రాయరని, రాయడానికి వేరే భాష ఉంటుందనీ గిడుగు రామమూర్తి గుర్తించలేదు. ఇంగ్లీషులోనే వాట్ డిడ్ యూ డూ (What did you do), అనే నాలుగు పదాలు, ఉచ్చారణలో వాజ్జిజ్యుడూ అని వినిపిస్తాయనీ, అయినా వాళ్లు రాతలో అలా రాయరనీ ఆయన గ్రహించలేదు. నిఘంటువులూ, నిక్కచ్చిగా నిర్దేశించిన వ్యవహార నియమాల గ్రంథాలూ (Books on usage) వ్యవహర్తలు రాసేటప్పుడు అనుసరించవలసిన రచనా నియమాలని సూక్ష్మాతిసూక్ష్మంగా నిర్దేశిస్తాయని, ఈ పనిలో పత్రికలూ, ప్రచురణ సంస్థలూ పట్టుదలగా పనిచేస్తాయనీ గమనించలేదు. గాలికి వదిలేసిన వ్యవహారంలో వున్న భాష దానంతట అది రచనా భాష అయిపోదని ఆయనకి బోధపడలేదు.
టేకుమళ్ల కామేశ్వరరావు తమ దృష్టిలో వ్యవహారిక భాషకి వుండవలసిన నియమాలు రాసేనాటికే గిడుగు రామమూర్తి పంతులుకి చాలా పెద్ద పేరు వచ్చింది, ఆయన సభల్లో పెద్దగొంతుకతో గర్జించేవారట. ఇంతకుముందే చెప్పినట్టు ఆయనకి గొప్ప జ్ఞాపక శక్తి వుండేది. కొన్ని వందల గ్రంథాలనుంచి కొన్ని వేల మాటలు దేనికైనా ఉదాహరణగా తడుముకోకుండా ఆయన చూపించేవారు. దీనికి తోడు ఆయనకు విపరీతమైన చెముడు కారణంగా ఎవరు ఏమి మాట్లాడినా వినిపించేది కాదు. ఆయన అనర్గళమైన ఉపన్యాస ధోరణికి, పుంఖానుపుంఖాలుగా యిచ్చే ఉదాహరణల ప్రవాహానికి శ్రోతలందరూ ముగ్ధులైపోయేవారు. అంత పేరున్న మహా పండితుణ్ణి ఎదుర్కోగలిగిన శక్తి టేకుమళ్ల కామేశ్వరరావు వంటి యువకులకి ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఆంధ్ర సాహిత్య పరిషత్తు 1911లో ఏర్పడి అందులో వున్న పెద్ద పండితులంతా ఎందుకంత పట్టుదలగా లాక్షణిక భాషనే వాడాలి అని అంటున్నారో కొంతసేపు సానుభూతితో చూసి వుంటే గిడుగు రామమూర్తి వాదన అంత వ్యతిరేకంగా కాకుండా కొంత సానుకూల దృష్టితో వుండి వుండేది. గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, వాళ్లందరూ రాసేది వ్యవహారంలో వున్న మాటలకి కృతకరూపంలో తయారు చేసిన మాటలతో ఒక కృతక గ్రాంథికం మాత్రమే అని గిడుగు రామమూర్తి బలంగానే వాదించారు. సరిగ్గా ఆ పనే అంతకన్నా సున్నితంగా గురజాడ అప్పారావు చేశారు. అసలు గ్రాంథికమనేది స్కూళ్లలో తెలుగు పండితులు తయారు చేసిన భాష అని, అది అంతకు ముందు లేదని ఆయన గట్టిగానే చెప్పారు. అయితే వీళ్లిద్దరూ గమనించని విషయం ఒకటి వుంది. వీళ్లు చెప్పే వ్యావహారానికి ఏ నియమాలు అక్కరలేదా, ఎవరికి తోచిన వర్ణక్రమంతో వాళ్లు మాటలు వాడుతుంటే అవన్నీ రచనలో ఉపయోగపడాలా, వాటన్నిటినీ ఒప్పుకోవాలా? ఈ ప్రశ్నని వాళ్లు వేసుకోనూ లేదు, దానికి సమాధానం వెతకనూ లేదు.
లాక్షణిక భాష నిర్బంధంగా నేర్పకపోతే మన పాత పుస్తకాలు చదివి అర్థం చేసుకునేవాళ్లు ఎవరూ వుండరని, భాషకు ఒక నియమం లేకపోతే అవ్యవస్థ పాలవుతుందని పండితుల వాదన. నిజానికి ఉభయులూ పూనుకుని–
1. అవును. భాషకి నియమం కావాలి, నిత్య వాడుకలో భాష ఎన్ని రకాలుగా వున్నా రచనలో ఒక నియమితమైన భాషే వుండాలి.
2. వచనం ఇప్పటి వైజ్ఞానిక అవసరాలకు పనికొచ్చేది కావాలి. కాబట్టి, ఒక ఆధునిక రచనా భాషని మనం తయారు చేసుకోవాలి. అంటే ఆధునిక గ్రాంథికం కావాలి.
3. మాట్లాడేటట్లుగా ఏ భాషా ఎవరూ రాయడానికి ఉపయోగించరు; అనే సంగతులు ప్రతిపాదనకి తెచ్చి ఒక అంగీకారానికి వచ్చివుంటే ఏ రకమైన సమస్య వుండేది కాదు.
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం.
తెలుగు ఎప్పుడైనా రాజభాష అయిందా అంటే (నిడదవోలు వెంకటరావుగారి మాట నమ్మాలంటే) ఒక్క నాయక రాజుల కాలంలోనే అయ్యింది. ఆ కాలంలోనే రాజ్యవ్యవహారాలు తెలుగులో నడిచాయి. అంతకుముందు సంస్కృతం రాజభాష. ఆ తరవాత పర్షియన్ రాజభాష. కృష్ణదేవరాయల కాలంలో ఏది రాజభాషో మనం నిక్కచ్చిగా చెప్పలేం. కృష్ణదేవరాయలు తను తెలుగులో కావ్యం రాసినా చాలా శాసనాలు నాలుగు భాషల్లో వేశాడు; సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం. కృష్ణదేవరాయల కాలంలో మనం గొప్పగా చెప్పుకునే పెద్దన్న, తిమ్మన్న తెలుగు కావ్యాలే రాసినా, కృష్ణదేవరాయలది తెలుగు సామ్రాజ్యం అని మనం చెప్పుకున్నా, రాయలు ఆముక్తమాల్యద తెలుగులోనే రాశాడు కాబట్టి ఆయన తెలుగువాడే అని మనం పొగుడుకున్నా, కన్నడులు అంత గట్టిగాను కృష్ణదేవరాయలు కన్నడిగుడే అని నమ్ముతారు. ఆయన సామ్రాజ్యం కన్నడ సామ్రాజ్యమే అనుకుంటారు. అంచేత నిక్కచ్చిగా నాయక రాజుల కాలంలోనే తెలుగు భాష రాజభాషగా వర్ధిల్లిందని వెంకటరావు ఊహ. ఆ కాలంలోనే కవిత్వం ఒక్కటే కాకుండా తెలుగులో శాస్త్రగ్రంథాలు వచ్చాయి. ఖడ్గలక్షణ శిరోమణి, అశ్వశాస్త్రం, ఔషధ యోగములు, ధనుర్విద్యా విలాసము, ఇంకా ఇలాంటివి. తెలుగులో కవిత్వమే కాకుండా విజ్ఞానం అందించేవి కూడా వచ్చాయి అని వెంకటరావు సరిగానే గుర్తించారు.
ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఎలా వుండేదో మనం చెప్పలేం కాని దీనికి ఇంగ్లీషువాళ్ళు అధికారంలోకి రావడంతో పెద్ద అడ్డొచ్చింది. వాళ్ళు వచ్చిన తొలి రోజుల్లో తెలుగు నేర్చుకుని తెలుగులోనే పరిపాలన చేయాలి అని అనుకున్నారు. కాని పరాయి వాళ్ళకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి తెలియలేదు. వాళ్ళు ఈ తెల్లవాళ్ళకి తెలుగు నేర్పడం పేరుతో నన్నయభట్టీయం (ఆన్ధ్రశబ్దచింతామణి) నేర్పేవాళ్ళు. కచేరీలలో పరిపాలనకి ఎందుకూ పనికిరాని ఈ భాషతో ఏమి చెయ్యాలో తెలియక, ఇంక ఏ దారీ బోధ పడక, వాళ్ళు తమకి కావలసిన వ్యాకరణాలు తామే రాసుకున్నారు; కావలసిన నిఘంటువులు వాళ్ళే తయారు చేసుకున్నారు–విలియం క్యారీ, ఎ. డి. క్యాంప్‌బెల్, సి. పి. బ్రౌన్, ఆర్డెన్, మొదలైనవాళ్ళు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు పరిపాలనా భాష అయి వుండేది. తెలుగులో వివిధ విషయాల మీద వచన గ్రంథాలు వచ్చి వుండేవి. అప్పటికే ప్రచారం లోకి వచ్చిన అచ్చు యంత్రం సహాయంతో తెలుగు కొత్త పుంతలు తొక్కేది.
అన్యాయంగా ఈ పురోగమనానికి తీవ్రంగా అడ్డొచ్చినవాడు మెకాలే. అప్పటినుంచి ఇంగ్లీషు ప్రభావం ఫలితంగా మనలో ఒక ఆత్మన్యూనతాభావం మొదలయింది. మన పాతభాషని నిలబెట్టుకోడానికి వ్యాకరణాల పేరుతో గిరి గీసుకుని కూర్చోవడం మొదలయింది. విశ్వవిద్యాలయాలు ఇంగ్లీషు నేర్పుతూ వుంటే మన మేధావులు ఎంతో హాయిగా నేర్చుకుని తెలుగు తమకి రాదని, రానక్కర్లేదని పట్టుదలగా కూర్చున్నారు. మన మేధావులంతా కేవలం ఇంగ్లీషే నేర్చుకుని అందులోని విషయాలనే–హిస్టరీ, జాగ్రఫీ–మొదలైనవి జ్ఞానపరమావధిగా భావించారు. లార్డ్ కర్జన్ ఇలా ఇంగ్లీషు చదువుకున్నవాళ్ళు తమ భాషలకి ఏ ఉపకారమూ చెయ్యటం లేదని గమనించి ఒక సభ పెట్టి విశ్వవిద్యాలయాలలోనూ, ఇతర కాలేజీల్లోనూ, హైస్కూళ్ళల్లోనూ తెలుగు నేర్పాలనీ, ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం ఒక ప్రధాన విషయం చెయ్యాలనీ అనుకోవడం ఆచరణలోకి వచ్చేసరికి తెలుగులో అతని అసలు ఉద్దేశం పక్కకు పోయి లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక వివాదంగా పరిణమించిందని మనం చూశాం. ఒక పక్క తెలుగు పండితులూ, తెలుగులో మిగిలిన ఒకరో ఇద్దరో మేధావులూ ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ వుంటే బయట అందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారనీ, అందులోని విజ్ఞానమే నిజమైన విజ్ఞానం అని అనుకుంటున్నారని మనం మర్చిపోకూడదు. ఈ పండితుల వాదప్రతివాదాలు కూడా ఇంగ్లీషులోనే జరిగాయనీ మనం మరీ గుర్తించాలి.
ఈ వరసలో సామినేని ముద్దునరసింహం నాయుడు లాంటి తెలివైన వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పండితులు గిరి గీసుకుని వాళ్ళ గొడవలను అదే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళ పత్రికల్లో ఒకపక్క రాసుకుంటూ వుంటే,ఇంకోపక్క చివరికి టేకుమళ్ళ కామేశ్వరరావు, మండపాక పార్వతీశరావు లాంటి వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరూ ఉపయోగించుకోలేదు. చిన్నయ సూరి కూడా అంత పట్టుదలగా కావ్యభాషకి వ్యాకరణం రాసి దాన్ని వచనంలో కూడా వాడచ్చని హిందూ ధర్మశాస్త్రంలో ఉపయోగించి చూపించాడని మనం మెచ్చుకున్నాం సరే. కానీ లోకంలో కళ, దృతప్రకృతికాలు, గసడదవాదేశాలు జ్ఞాపకం లోంచి పోయాయని ఆయన గుర్తించి ఉంటే నిజంగా బాగుండేది. అతని దృష్టిలో చిన్న పిల్లలు కూడా క్లిష్టమైన పదాలని తగిన వర్ణక్రమంలో నేర్చుకోవడమే ప్రధానం. చివరికి ఇన్నాళ్ళుగా సాగిన ఇన్ని చర్చలూ తెలుగు భాష అభివృద్ధికి నిజంగా ఉపయోగించలేదు. ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు. దీన్ని గురించి ఇంకొన్ని వివరాలు వచ్చే భాగంలో రాస్తాం.
(సశేషం)
Posts: 3
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 2
Joined: Jun 2019
Reputation:
0
మహానుభావులైన సరిత్ గారికి నమస్కారాలు
ఏదో కుతి, క్షణికానందం కోసం వచ్చే మా లాంటి వారికి తెనుగు బాష ఆధునిక చరిత్ర తెలియ పరుస్తునందుకు కోటి ధన్యవాదాలు. తెలుగు ని మృత భాష చేయటానికి ఈనాటి రాజులు కంకణం కట్టుకుని ఉన్న కాలం లో మన తెనుగు వారమందరం సంఘటితం కావాలి. మన భాషను, మన జాతి ఉనికిని కాపాడుకోవాలి.
మీ అభిమాని,
ఒక హస్త ప్రయోగి.
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,004 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
తెలుగు ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే మాటకి
పూటకూళ్ళమ్మ, పూటకూళ్ళు అని మనం వింటూ ఉంటాం. Hotel అనుకోవచ్చు.
అక్కడ భోజనం పెడతారు. డబ్బులు తీసుకుంటారు.
బానే ఉంది. ఈ పూటకూళ్ళమ్మ, వంటలక్క అనుకుందాం. మరి ఈ మాట ఏంటి మనకు అర్ధం కావట్లేదు. అంటే
పూట అనగా ఒక పొద్దు కూడు అనగా కూడూ గుడ్డా అని చెబుతారు అది అంటే షడ్రసోపేతమైన భోజనం కాదు కేవలం కూడు తినగలిగే అన్నం తిన్నంత అన్నం డబ్బులు తీసుకుని పెట్టే వాళ్ళు.
పెళ్లి కుమారుడు
పెండ్లి కుమారుడు
పెండ్లి - పెళ్లి - పెళ్ళి - పెల్లి
ఏది కరెక్ట్?!
•
Posts: 356
Threads: 0
Likes Received: 624 in 237 posts
Likes Given: 4,552
Joined: Nov 2018
Reputation:
23
*చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*
భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
*చదివే సమయంలో పెదవులు తగలనిది*
శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా
*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*
*అంటే పెదవి తగలనిది, తగిలేది*
దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా
*కేవలం నాలుక కదిలేది*
సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా
*నాలుక కదలని (తగలని) పద్యాలు*
కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా
*నాలుక కదిలీ కదలని పద్యం*
ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా
?ఈ పద్యాలు రచించిన మహా కవులకు తెలుగు జాతి ఋణపడి వుంటుంది. ఎవరికైనా వారి పేర్లు తెలిస్తే చెప్పండి.
? *పద్య భాషాభిమానులకు జోహార్లు*.
?
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *
సర్వేజనా సుఖినోభవంతు...
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3
మేము ఇంతకు పూర్వం రాసిన రెండు భాగాలలోని సమాచారం ఇంగ్లీషువాళ్లు మన దేశానికి వచ్చి, దేశాన్ని దాదాపుగా ఆక్రమించుకుని పరిపాలన చేయడం మొదలుపెట్టిన తరవాత కాలానికే వర్తిస్తుంది. ఇంగ్లీషువాళ్లు మన దేశానికి రాకముందు తెలుగు పరిస్థితి ఏమిటి, అది ఎలా వాడబడేది, రాయబడేది అనేదాన్ని గురించి మేము ఏమీ చర్చించలేదు. అంటే మేం రాసిన రెండు వ్యాసాలకి వెనకాతల ఇంగ్లీషు పాలకుల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వున్నదన్నమాట. చిన్నయసూరి బాలవ్యాకరణం రాసినా, ఉదయగిరి శేషయ్య, తా. వెంకయ్య లాంటివాళ్లు వాళ్ల వ్యాకరణాలు రాసినా వీటి మీద ఇంగ్లీషు పరిపాలనా ప్రభావం వుంది. స్కూళ్లల్లో తెలుగు చెప్పడంలో చెప్పించుకోవడంలో ఇంగ్లీషువాళ్లు తిన్నగానో అడ్డంగానో ప్రవేశించారు.
ఇంగ్లీషువాళ్ల పరిపాలనా కాలాన్ని మేము రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించాం. ఒకటి: మెకాలేకి ముందు కాలం. రెండు: మెకాలేకి తరువాతి కాలం. మెకాలేకి ముందు కాలంలో ఇంగ్లీషు పాలకులు తెలుగువాళ్లని తెలుగులోనే పాలించాలి అని పట్టుదలగా అనుకున్నారు. అందుకని వాళ్లు, అంటే అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తెలుగు నేర్చుకోవడానికి తెలుగు పండితుల దగ్గరికి వెళ్లారు. అంతకన్నా ముఖ్యంగా ఇంగ్లండులో వుండగానే అంతో ఇంతో తెలుగు నేర్చుకుని ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ విషయం గతంలో బ్రౌన్ గురించి రాసిన వ్యాసంలో చెప్పాం. కాగా అంత పట్టుదలగా తెలుగు నేర్చుకోవాలని వచ్చిన ఇంగ్లీషువాళ్లకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి తెలియలేదు. తెలుగు రెండవ భాషగా విదేశీయులకు నేర్పడం ఎలాగో మనకి అప్పటికీ, ఇప్పటికీ తెలియదు. తెలుగు పండితులు తమ దగ్గరికి వచ్చిన ఇంగ్లీషువాళ్లకి నన్నయ భట్టీయం నేర్పారు. ఈ సంగతి వివరంగా పూర్వం మా వ్యాసంలో చెప్పాం. అది వాళ్ళకి పనికొచ్చే తెలుగు కాదని గ్రహించిన ఇంగ్లీషువాళ్లు తమకి కావలసిన వ్యాకరణాలని తామే రాసుకున్నారనీ, తమకు కావలసిన నిఘంటువులని కూర్చుకున్నారనీ కూడా చెప్పాం. ఆ తరవాత ఇంగ్లీషువాళ్లు పెట్టిన స్కూళ్లలో ఎలాటి తెలుగు నేర్పాలి అన్న సమస్య మీదే తెలుగు మీద చర్చ అంతా జరిగిందని కూడా ఇంతకు ముందు చెప్పాం. ఆ సందర్భంలోనే గిడుగు, గురజాడ, జయంతి రామయ్యపంతులు గురించి కూడా చెప్పాం. అంతకు ముందే సామినేని ముద్దునరసింహం నాయుడు రాసిన ఆలోచనాపూర్వకమైన, అభివృద్ధికారకమైన హితసూచిని గురించి కూడా రాశాం. అది ఎలా మూలబడిపోయిందో చెప్పాం కూడా.
తరవాతి కాలంలో వచ్చిన పరిణామాలని ఈ మూడవ భాగంలో చర్చిస్తున్నాం.
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
ఇంగ్లీషు బళ్లలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో లాక్షణిక భాషావాదులకి, వ్యావహారిక భాషావాదులకి వచ్చిన వివాదాల ఫలితంగా చివరికి లాక్షణిక భాషావాదులే–వీళ్లకే గ్రాంథిక భాషావాదులు అన్న పేరు స్థిరపడింది–గెలిచారు. ఈ సందర్భంలో అప్పట్లో కాలేజీ పిల్లలకి ఏ పుస్తకాలు చెప్పేవారు, ఏ రకమైన భాష నేర్పేవారు అనే ప్రశ్న వేసుకోవడం అవసరం. ఈ సందర్భంగా అందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేది పెద్దబాలశిక్ష. ఈ పుస్తకం రకరకాల అవతారాలు ఎత్తి చాలాకాలం పాటు అచ్చవుతూ వచ్చింది. దీని మొదటి పేరు బాలశిక్ష అనే. దీని మొదటి ముద్రణ 1832లో ఏదో ఒక రూపంలో ఈ పుస్తకాన్ని చాలా సంవత్సరాల పాటు బళ్ళల్లో చేరిన పిల్లలకు పాఠాలు చెప్పడానికి వాడారు.
అయితే బడిలో చేరని పిల్లలు కూడా చాలామంది ఉండేవారు. మాకు అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు, మేము కరణీకం పనులు చేయాలా, వ్యాపారాలు చేయాలా అనుకునే చిన్న కులాలవాళ్ళు, అందులో కొందరు బాగా పొలమున్న మోతుబరులు కూడా, పిల్లల్ని కాలేజీకి పంపేవారు కారు. పెద్ద కులాల్లో పెళ్ళిచూపుల్లో మా అమ్మాయి పెద్దబాలశిక్ష చదువుకుంది అని చెప్పేవారు. ఒక సొంత విషయం చెప్పాలంటే ఈ వ్యాసం రాస్తున్న మా యిద్దరిలో నారాయణరావు పెద్దబాలశిక్ష చదువుకునే కాలేజీకి వెళ్ళాడు. అతని మీద ఆ పుస్తకం ప్రభావం ఎంత ఎక్కువ అంటే అందులో కథలు, నీతులు, లెక్కలు, శ్లోకాలు, పద్యాలు ఇప్పటికీ అతనికి కంఠతా వచ్చు. ఉదాహరణకి పెద్దబాలశిక్షలో లెక్కలు చెప్పేటప్పుడు ఒక పద్యం వుండేది.
ఖర్జూర ఫలములు గణికుండు గొనితెచ్చి సగపాలు మోహంబు సతికి నిచ్చె
నందు నాలవ పాలు ననుగుతమ్మునకిచ్చె నష్టభాగంబిచ్చె నతనిసతికి
దగ తొమ్మిదోపాలు తనయున కిచ్చెను తనచేత నాల్గున్ను దల్లికిచ్చె
మొదట దెచ్చిన వెన్ని మోహంబు సతికెన్ని భ్రాత కెన్ని వాని భార్య కెన్ని
తనయుకెన్నియిచ్చె దడయకదల్లికి
నాలుగెట్టులాయె నయము తోడ
గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి
యడుగవలయు దేవ యవసరముగ
అలాగే పిడుగు పడినప్పుడు పఠించవలసిన శ్లోకము:
అర్జునఃఫల్గునఃపార్థఃకిరీటీశ్వేతవాహనః
భీభత్సుర్విజయః కృష్ణస్సవ్యసాచీధనంజయః
మందు వేసుకునేటప్పుడు పద్యం:
శరీరే జర్ఝరీభూతేవ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరిః
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
ఇవన్నీ నారాయణరావుకి ఇప్పటికీ గుర్తున్నాయి. దాంతో పాటు పెద్దబాలశిక్షలో రకరకాల నీతి కథలు, నీతి వాక్యాలు, పురాణాల్లో వుండే షట్చక్రవర్తులు, అష్ట దిక్పాలకులు, వాళ్ళ భార్యల పేర్లు–ఈ వ్యవహారమంతా వుండేది. శచీదేవి అంటే ఎవరు? ఇంద్రుడి భార్య. స్వాహాదేవి అంటే ఎవరు? అగ్నిదేవుని భార్య. ఇలాటి సమాచారం వుండేది. ఉత్తరాలు ఎవరికి ఎలా రాయాలి? వైదికులైన బ్రాహ్మణులకు ఎలా రాయాలి; శూద్రులకు రాసేటప్పుడు ఎలా రాయాలి; శూద్రులకు బ్రాహ్మలు రాసేటప్పుడు ఎలా రాయాలి, లాంటి వివరాలు చాలా యెక్కువగా వుండేవి. ఈ పుస్తకంలో అర్జీలు రాసే పద్ధతి ఉండేది. కొద్దిగా ఛందస్సు కూడా ఉండేది. భూగోళశాస్త్ర విషయాలు, భారతదేశంలో ఇతర ప్రాంతాల పేర్లు ఉండేవి. చిట్టచివర ఒక స్తోత్రం, దండకంతో బాలశిక్ష పూర్తయ్యేది. మొత్తం మీద ఈ పుస్తకం పూర్తిగా చదువుకున్న పిల్లలకి తమ ప్రాంతంలో బతకడానికి అవసరమైన విద్యాబుద్ధులు నిండుగా దొరికేవి. ఈ పుస్తకంలో భాష అవసరాన్ని బట్టి మారుతూ వచ్చింది కాని చిన్నయసూరి చెప్పిన గ్రాంథికము, గిడుగు రామమూర్తి చెప్పిన వ్యావహారికము అనే మాటలు లేవు. మనకి అలవాటైన మాటల్లో చెప్పాలంటే రకరకాల గ్రాంథికాలు, రకరకాల వ్యావహారికాలు దీనిలో ఉండేవి. ఇది తెలుగుదేశంలో నిజమైన వ్యవహార భాష. ఈ భాష మాట్లాడుతూనే రాస్తూనే చదువుకున్నవాళ్ళందరూ పెరిగారు.
గురజాడ అన్నట్లు బ్రిటిషువాళ్ళు వచ్చి బడులు పెట్టిన తరువాతే గ్రాంథికం అన్న భాష, ఆ నియమాలు ఏర్పడాయి. ఇది 20వ శతాబ్దంలో వచ్చిన సమస్య.
క్రిస్టియన్లు తమ స్కూళ్ళల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కొన్ని రీడర్లు తయారు చేశారు.అందులోని భాష మొత్తం అంతా ఒకే శైలిలో ఉంటుంది. ఆ శైలి చదువుకున్నవాళ్ళు మాట్లాడేదానికి దగ్గరగా ఉంటుంది. వాక్యాలు తగినంత విరామాలతో అందంగా అచ్చు వేసిన పుస్తకాలివి. అందులోని విషయాల దగ్గరికొస్తే, పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో, పేజీల మీద చేతులు వేస్తే అవి మరకలు పడిపోకుండా ఎలా చూసుకోవాలో, చదవడం అయిపోయిన తరువాత పుస్తకాన్ని మూసి ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో, ఇలాంటి విషయాలు మొదటి పాఠం. రెండవ పాఠంలో దేవుడిని గురించి. దేవుడు ఆకాశంలో ఉంటాడని, లోకానికంతటికీ ఆయనే కర్త అని, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. తరవాత రాతి బొమ్మలలో దేవుడు ఉండడని ఆ రాళ్ళని పూజిస్తే అవి పలకవని, ఇంకో మాటలో చెప్పాలంటే విగ్రహారాధన తప్పని చెప్పే వాక్యాలు ఉంటాయి. మొత్తం మీద ఈ పుస్తకాలు అందంగా అచ్చు వేశారు. అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. భాషా శైలిలో చెప్పుకోతగ్గ ఏకత్వం ఉంది. వీటిలో కూడా లాక్షణిక భాష, గ్రామ్య భాష ఇలాంటి మాటలు లేవు. ఈ పుస్తకాల్లో ఇంతకుముందు చెప్పిన బాలశిక్షలో మల్లే లెక్కలు, ఉత్తరాలు రాసే పద్ధతులు, లౌకికమైన నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి ఏమీ లేవు. అంచేత ఈ పుస్తకాలు కేవలం క్రైస్తవ మత ప్రయోజనాలకి మాత్రమే పనికొచ్చాయి.
తరవాత కాలంలో వచ్చిన వ్యావహారిక భాషావాదంలో గిడుగు రామమూర్తిగారు బాలశిక్షలోనూ, క్రిస్టియన్ పుస్తకాల్లోనూ వున్న భాషా విశేషాలను పట్టించుకోలేదు. అంచేత భాషా విషయకమైన చర్చల్లో ఈ పుస్తకాలకి ఏ రకమైన ప్రాముఖ్యం లేకుండా పోయింది.
ఇదిలా వుండగా ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ వుంటే, తెలుగు తప్ప మిగతా ఆధునిక విషయాలన్నీ–చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం మొదలైనవన్నీ–ఇంగ్లీషులోనే చెప్తూ వుంటే, పై చదువుల్లో తెలుగు గూడుకట్టుకుపోయింది. తెలుగులో ఏ పుస్తకాలు చదివినా జీవితంలో పనికొచ్చే కొత్త విషయాలేవీ తెలియవు, కావలసిందల్లా ఇంగ్లీషే అన్న అభిప్రాయం క్రమక్రమంగా బలపడింది. స్కూళ్ళలో ఇంగ్లీషు నుంచి అనువాదం కోసం వాడే తెలుగు భాష నిర్జీవంగా ఎవరికీ పట్టనట్లు తయారయింది.
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
జస్టిస్ పార్టీ ఆవిర్భావం
తెలుగులో వ్యాకరణాలు రాసినా, పెద్దబాలశిక్ష లాంటి పిల్లల పాఠాలు రాసినా, దస్తావేజులు రాసినా, అర్జీలు రాసినా, ఉత్తరాలు రాసినా, ఏ రాత పనైనా బ్రాహ్మణులే చేశారు. అంచేత వ్యావహారిక వాదం అనే మాట బలపడ్డ తరవాత కూడా బ్రాహ్మణ వ్యావహారికమే ఈ వ్యావహారిక వాదుల మనసుల్లో వుంది. ఒక చిన్నయ సూరి మినహా గ్రాంథిక భాషకి వ్యాకరణం రాసినవాళ్ళు కూడా అందరూ బ్రాహ్మణులే. చిన్నయ సూరి బ్రిటిష్ ప్రభుత్వపు ఉద్యోగాల్లో, లేదా ఇతర వ్యాపారాల్లో సంపన్నులైన అబ్రాహ్మణుల ప్రాపకం వల్లే పైకొచ్చాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతను వ్యావహారికం రాస్తే ఎలాంటి వ్యావహారికం రాసేవాడో మనకి తెలియదు. మాట్లాడేటప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అతను ఎలాటి భాష వాడేవాడో ఊహించుకోవాలి గాని సమాచారం దొరకదు. ముఖ్యంగా అతను మాట్లాడేటప్పుడు, ఉపన్యసించేటప్పుడు క్రియా పదాలు ఎలాంటివి వాడేవాడు! వచ్చితిని, వెళ్ళితిని, చేయుదును, ఇలాంటి వ్యాకరణ సమ్మతమైన క్రియా పదాలే వాడేవాడా? బ్రాహ్మణ వ్యవహారంలో వుండే రాస్తున్నాను, చేస్తున్నాను, మాట్లాడాను, వస్తాను ఇలాంటి క్రియా పదాలు వాడేవాడా? ఈ విషయమై మనకు ఏ రకమైన సమాచారమూ లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో జస్టిస్ పార్టీ ఏర్పడిన తరవాత బ్రాహ్మణులతో ఉద్యోగాలలో పోటీపడి చాలామంది అబ్రాహ్మణులు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా, కాలేజీల్లో అధ్యాపకులుగా చాలామంది అబ్రాహ్మణులు ఉండేవారు. తెలుగు కాని మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లీషులోనే చెప్తూ ఉండడం బట్టి వాళ్ళు ఆ పాఠాలు ఇబ్బందిలేకుండా హాయిగా చెప్పేవారు. కానీ సభల్లో ఎక్కడైనా మాట్లాడవలసివచ్చినా, పదిమందితో కబుర్లు చెప్పవలసివచ్చినా, ఇంగ్లీషే మాట్లాడేవాళ్ళు. చివరికి పత్రికలు కూడా ఇంగ్లీషు పత్రికలే చదివేవాళ్లు. వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడేవారు. అందుచేత వాళ్ళ పలుకుబడిలో అబ్రాహ్మణత్వం బయటపడవలసిన అవసరం వుండేది కాదు. అంతే కాకుండా సమాజంలో పైకి రావాలనుకునేవాళ్లు ఇంగ్లీషు మాట్లాడటం అవసరం. అందువల్ల వాళ్ల స్థాయి పెరుగుతుంది. ఆ కారణం చేత బ్రాహ్మణులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడేవారు.
నిత్యవ్యవహారానికి ఇంగ్లీషు వాడేవాళ్ళు విద్యావంతులు, కేవలం తెలుగే వాడేవాళ్ళు అయితే పండితులు, లేకపోతే వాళ్ళ తక్కువ కులాన్ని వ్యక్తపరిచే తెలుగు మాట్లాడే సామాన్యులు. జస్టిస్ పార్టీలోనే వున్న కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని రామస్వామి ఇందుకు మినహాయింపు. రామలింగారెడ్డి అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడేవారు. అవసరమైతే చక్కని పాండిత్య స్ఫోరకమైన తెలుగు మాట్లాడగలిగినా తరచు ఇంగ్లీషే మాట్లాడేవారు. త్రిపురనేని రామస్వామి గొప్ప పండితుడు. ఆయనకి ఇంగ్లీషు బాగా వచ్చును. కానీ పాండిత్య స్ఫోరకమైన తెలుగే మాట్లాడేవారని ప్రతీతి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రారుగా పనిచేసిన కె.వి. గోపాలస్వామి నాయుడు ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే ఇంగ్లీషుకి ఎంతో గౌరవం ఉండేది కూడా.
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
తెలుగు పాఠాలలో తరవాత పరిస్థితి
కాని తెలుగు పాఠాలు మాత్రం ఇంకా ఆ గూడుకట్టుకున్న భాషలోనే వుండేవి. నాన్-డిటెయిల్డ్ స్టడీ (Non-Detailed Study) అనే పేరుతో ఏదో ఒక వచన గ్రంథం ఉండేది. ఇది కూడా తెలుగు సాహిత్యంలో పేరున్న రచయితల వచన గ్రంథం కాకుండా చిన్నయసూరి వ్యాకరాణనికి లోబడి రాయబడిన వచన గ్రంథం అయి వుండేది. తరవాత తరవాత గ్రాంథికమైన తెలుగులో మంచి వచన రచనలు కనిపించకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయం నవలల పోటీలు పెట్టి ఆ పోటీలలో బహుమానాలు వచ్చిన పుస్తకాలనే నాన్-డిటెయిల్డ్ స్టడీగా పెట్టేవారు. ధూళిపాళ శ్రీరామమూర్తి గృహరాజు మేడ, మల్లాది వసుంధర–తంజావూరి పతనము, సప్తపర్ణి, వంటి పుస్తకాలే ఉండేవి! అలాగే మోడర్న్ పొయెట్రీ (Modern Poetry) అనే విభాగం కింద ఏదో ఒక పుస్తకం నిర్ణయించబడేది. అంతే కాని, తెలుగు సాహిత్యంలో వస్తున్న పెద్ద మార్పులు గమనించి కాని, నిజంగా ఆధునికులు కవులు అయినవాళ్ల పుస్తకాలు పరిశీలించి కాని, టెక్స్ట్ బుక్ కమిటీవాళ్లు పుస్తకాలు పెట్టేవాళ్లుకాదు.
ఆధునిక సాహిత్యంలో గొప్ప రచయితలయిన శ్రీశ్రీ, పఠాభి, చలం, కుటుంబరావు, గోపీచంద్, కృష్ణరావు, ఇలాంటి వాళ్ల పుస్తకాలేవీ విద్యార్థులు చదివేవాళ్లుకారు. చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసిన, అంత పెద్ద పేరు లేనివాళ్ల పుస్తకాలు ఆధునిక కవిత్వం పేరుతో పాఠం చెప్పబడేవి. క్రమంగా తెలుగు శాఖల్లో నేర్పే తెలుగుకి బయట లోకంలో తయారవుతున్న తెలుగుకి ఏ రకమైన సంబంధం లేని ఒక పెద్ద అగాధం యేర్పడింది. ఇది కేవలం భాషకి సంబంధించిన విషయమే కాదు. భాషలో చెప్పే ఆలోచనలకి, విజ్ఞానానికి, సృజనాత్మకతకి సంబంధించిన విషయం. తెలుగు పాఠం చెప్పే పండితులు కేవలం చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అరసున్నలు, బండి ర(ఱ)లు ఉన్నాయా? సంధులు యడాగమాలు ఉన్నాయా? సరళాదేశాలు గసడదవాదేశాలు పాటింపబడ్డాయా? అనే చిన్న చిన్న విషయాలు మాత్రమే ప్రధానంగా చూసి దిద్ది వ్యాస రచనల్ని తిరిగి విద్యార్థులకి ఇచ్చేవారు. లాక్షణిక భాష అన్న పేరుతో భాష లోకానికి దూరమైపోవడం మూలంగా వచ్చిన దుస్థితి ఇది.
గిడుగు రామమూర్తి ఆంధ్రపండిత భిషక్కుల భాషా భేషజం చూస్తే ఆయన వాదనంతా చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అసాధువులు అని చెప్పిన మాటలు తిక్కన మొదలుకొని పూర్వ కవులు అందరూ వాడారని రుజువు చేయడమే. ఆ మాటకొస్తే చిన్నయ సూరి కూడా తన వ్యాకరణం ప్రకారం తానే రాయలేకపోయాడు. అందుచేత శిష్టవ్యావహారికం వాడటం భాషకి మంచిది. ఇదీ రామమూర్తిగారి వాదం. ఈ సంగతి సూచనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం.
కాకపోతే వ్యావహారికం అనే మాటని రామమూర్తిపంతులు చాలా ఉదారంగా వాడారు. ఆయన వ్యావహారికానికి చూపించే ఉదాహరణల్లో ఒకే రకమైన వ్యావహారికం లేదని, అనేక రకాలైన వ్యావహారికాలు వున్నాయని ఆయన పట్టించుకోలేదు. అన్నమయ్య పాటల్లో ఒక రకమైన వ్యావహారిక భాష ఉంటుంది. సారంగపాణి పాటల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. పండితులు రాసే వ్యాఖ్యానాల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. కరణాలు రాసే దస్తావేజుల్లో మరొక రకమైన వ్యావహారికం వుంటుంది. ఈ వ్యావహారికాలు వాడేవాళ్లు అందరూ శిష్టులే అయినా వాళ్ల భాషలు వేరువేరుగా వుంటాయి. వీటినన్నిటీ కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టటం వల్ల చిన్నయసూరి వ్యాకరణానికి విరుద్ధమైనది వ్యావహారికం అనే అభిప్రాయం బలపడింది. ఇన్ని రకాల వ్యావహారికాలకి వాటి వాటి సందర్భాలలో ఏకత్వం వుందని, ఆ ఏకత్వాలకి ఒక నియమం వుందని, వాళ్లందరూ శిష్టులే అయినా శిష్ట వ్యావహారికం అంటూ ఒకటి లేదని అది అనేక రకాలుగా వుందని రామమూర్తి గమనించారు కానీ వాటిని గురించి చర్చించలేదు. శిష్టులంటే ఎవరు అని ఎన్నిసార్లు అడిగినా ఆ మాటని కూడా ఆయన నిర్ధారించలేదు.
•
Posts: 14,666
Threads: 250
Likes Received: 18,191 in 9,569 posts
Likes Given: 1,889
Joined: Nov 2018
Reputation:
379
తెలుగు మీద సర్ ఆర్థర్ కాటన్ ప్రభావం
గిడుగు రామమూర్తిగారు శిష్టులు అంటే ఎవరో వివరించకపోయినా ఒక విచిత్రమైన రాజకీయ, సామాజిక కారణాల వల్ల శిష్టత్వం అనుకోకుండా యేర్పడింది. ఆధునిక కాలంలో తెలుగు భాషకి నన్నయకన్నా, చిన్నయసూరికన్నా, సర్ ఆర్థర్ కాటన్ ఎక్కువ కారణమయ్యాడని చెప్పాలి. కాటన్ గోదావరి మీద, కృష్ణ మీద ఆనకట్టలు కట్టకముందు ఆ ప్రాంతానికి ఆర్థికంగా ఇప్పుడున్న బలం లేదు. ఆ కాలంలో రాయలసీమ ఆర్థికంగా కృష్ణా, గోదావరి జిల్లాల కన్నా ముందుండేది. అక్కడ వున్న చెరువుల పద్ధతి వల్ల నీరు సమృద్ధిగా అంది పంటలు పుష్కలంగా పండేవి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఒక డెల్టా భాగాన్ని మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో పంటలు కేవలం వర్షాల మీదే ఆధారపడేవి. బ్రిటిష్‌వారి పుణ్యమా అని రాయలసీమలో చెరువులు ధ్వంసం అయిపోయాయి. అంచేత రాయలసీమ కరువు ప్రాంతమయింది. ఈ లోపున కాటన్ కట్టిన ఆనకట్టల వల్ల కృష్ణా, గోదావరి జిల్లాలు పంటలు పండే నేలలయ్యాయి. తాము రైతులకి కౌలుకిచ్చిన భూములవల్ల వచ్చిన డబ్బుతో అక్కడి బ్రాహ్మణ కులాలవాళ్లు మొట్టమొదట ఇంగ్లీషువాళ్లు పెట్టిన స్కూళ్లలో చదివి పై చదువులకు మద్రాసు వెళ్లి ఆధునిక విద్యావంతులయారు. పై చదువులు చదివినా చదవకపోయినా మద్రాసులో వుండే వావిళ్లవారి వంటి ప్రచురణాలయాల కారణంగాను, కొత్తగా పెట్టిన భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికల కారణంగాను బ్రాహ్మణులు చాలామంది మద్రాసు చేరారు. వీళ్లు పత్రికల్లోను, ఆ తర్వాత ఏర్పడిన రేడియోలోను ఉద్యోగాల్లో చేరారు. రేడియో వచ్చిన తరువాత, పత్రికల ప్రచారం పెరిగిన తరువాత, పత్రికల భాష బ్రాహ్మణ వ్యావహారిక భాషకు దగ్గరకాక తప్పలేదు. అంటే చదువుకున్న బ్రాహ్మణులు మాట్లాడే భాషకీ సరళ గ్రాంథికానికీ మరీ దూరం కాని మధ్యస్థాయిలో పత్రికల భాష, రేడియో భాష వుండేది. పత్రికల్లో ఇంగ్లీషులో టెలీప్రింటర్ మీద వచ్చిన వార్తలు అనువాదం చేయవలసిన అవసరం వల్ల సంస్కృత పదాల ఉపయోగం ఒక పక్క పెరుగుతూ వచ్చినా క్రియాపదాలు మాత్రం బ్రాహ్మణ వ్యవహారంలో వున్నవే వుండేవి. ఈ రకంగా ఒక ఆధునిక రచనాభాష తయారయింది.
ఈ ఆధునిక రచనాభాషలో కూడా అలవాటు బలిమి వల్ల ‘వ్రాయు’ వంటి గ్రాంథిక వర్ణక్రమాలు, ‘చెప్పవలెను’,’ఏతెంచిరి’ లాంటి క్రియాపదాలు వాడుతూనే వచ్చారు. 1947 సంవత్సరంలో ఆంధ్రపత్రిక చూస్తే ఒక పక్క సరళ గ్రాంథికం, ఇంకొక పక్క బ్రాహ్మణ వ్యావహారికం రెండూ కనిపిస్తాయి. మేము సరిగా తైపారు వేసి చూడలేదు కానీ నార్ల వెంకటేశ్వరరావుగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రభ పూర్తిగా బ్రాహ్మణ వ్యావహారిక భాష వాడుకలోకి తెచ్చిందని మా అంచనా. కాని ఇదే సమయంలో అదే ఆంధ్రప్రభ వాడుకలో ఎప్పుడూ లేని పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు (ఉదా. సప్తతిమ జన్మదినోత్సవం), సంస్కృత వ్యాకరణం వొప్పుకోని ‘విలేఖరులు’ వంటి పదప్రయోగాలు వ్యావహారిక రచనాభాష లోకి పట్టుకొచ్చింది. ఈ రకంగా వ్యావహారికం అనే భాష నిజంగా వ్యవహారంలో పూర్తిగా లేదని, రచన కోసం ఏర్పడిన ఒక కొత్త రకమైన భాష అని, అయినా దీన్ని వ్యావహారికం అంటున్నారని బోధపడుతుంది.
ఇది ఇలా వుండగా వ్యావహారిక భాషకి ఏ రకమైన నియమాలు లేవు, ఎవరికి తోచినట్లు వాళ్లు రాయొచ్చు అనే అభిప్రాయం బలంగా అందరిలోనూ వేళ్ళూనుకుంది. ఇందువల్ల తెలుగు పత్రికల స్థితి క్రమేణా ఎలా అయిందో చూడడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తెలుగులో అంతో ఇంతో పాండిత్యం వున్నవాళ్లే సబ్-ఎడిటర్లుగా చేరేవారు. భారతిలోను, ఆంధ్రపత్రికలోను పనిచేసిన వాళ్లందరూ తెలుగు బాగా చదువుకున్నవాళ్లే. వీళ్లందరూ ఏ రోజుకారోజు తెలుగు వార్తలు రాయడానికి ఇంగ్లీషులో వున్న మాటలకి కొత్త అనువాదాలు సృష్టించి అవి పత్రికల్లో హెడ్లైన్లుగా (పతాక శీర్షిక అనే మాట ఈ కాలంలోనే అమలులోకి వచ్చింది) పెట్టినందుకు గర్వపడుతూ వుండేవాళ్లు. ఆల్ ఇండియా రేడియో కూడా ఇదే సమయంలో కొత్త కొత్త మాటలు, భాషలో కొత్త అలవాట్లు సృష్టించింది: నిలయ విద్వాంసులు, ఆకాశవాణి, ఇలాంటి మాటలు ఆల్ ఇండియా రేడియో కల్పించినవే. తెలుగు వార్తలు ఢిల్లీ నుంచి వచ్చేవి. ఢిల్లీ నుంచి ఉదయం, సాయంత్రం ఏడు గంటలకి చదివే వార్తలు ఇంగ్లీషులోనుంచి అప్పటికప్పుడు అనువాదం చేసేందుకు అక్కడి ఆకాశవాణి స్టూడియోలో తెలుగు సంపాదకులు కొందరు పనిచేసేవారు. వీళ్లందరి ఉమ్మడి ప్రయత్నం ఫలితంగా ఆధునిక తెలుగు రచనాభాష పైకి చెప్పబడని కొన్ని నియమాలతో, కాగితం మీద ఎక్కడా రాయని కొన్ని కట్టుబాట్లతో తయారవుతూ వస్తూ వుండేది.
గురజాడ అప్పారావుగారు తమ కన్యాశుల్కం రెండవ ముద్రణకి ఇంగ్లీషులో రాసిన ఉపోద్ఘాతంలో ఆధునిక తెలుగు వచన నిర్మాణానికి పుట్టబోయే మహాకవులు దారి చూపిస్తారని అని రాశారు. (‘A great writer must write and make it. Let us prepare the ground for him.’) ఆయన అప్పట్లో ఊహించినా, ఊహించకపోయినా ఆధునిక తెలుగు భాషని తయారు చేసినది గొప్పరచయితలు కారు. తెలుగు పత్రికల్లో వార్తలు రాస్తున్నవాళ్ళు, సంపాదకీయాలు రాస్తున్నవాళ్ళు, వ్యాసాలూ రాస్తున్నవాళ్ళు.
చిన్నయ సూరి సూత్రములఁ జిక్కి కృశించి, విషాదమొందుతూ
వున్న తెనుంగు, శృంఖలము లూడి, సుఖంబుగ మేడమీదఁ గూ
ర్చున్నది; నూత్నకాంతి గనుచున్నది, హాయిగ నేడు సంచరి
స్తున్నది, రామమూర్తి విబుధోత్తమ! నీ శ్రమకున్ ఫలంబుగాన్
అని భోగరాజు నారాయణమూర్తి కాస్త గ్రాంథికంలోను, కాస్త వ్యావహారికంలోను పద్యం రాసి (గ్రాంథిక రూపాలు లేకుండా పద్యాలు రాయడం కుదరదని ఇంతకు ముందు చెప్పాం.) గిడుగు రామమూర్తి పంతులుని ఎంత మెచ్చుకున్నా, ఆధునిక వ్యావహారిక భాష తయారయ్యింది రేడియోల వల్ల, పత్రికల వల్ల మాత్రమే. అయితే గిడుగు రామమూర్తిగారి గంభీరమయిన ఉద్యమం వల్ల ఒక గొప్ప మార్పు జరిగింది. తెలుగులో రాసేవాళ్లకి వ్యాకరణం అంటే భయం పోయింది. వ్యాకరణ విరుద్ధం అని పాత తెలుగు పండితులు అనే మాటకి గౌరవం పోయింది. పత్రికలలో రాసే తెలుగుకి గౌరవం వొచ్చింది.
కాలక్రమేణా పండితులు తగ్గి ఆధునిక కవులు, అంటే పాండిత్యంతో సంబంధం లేనివాళ్లు పత్రికల్లో చేరారు. వాళ్లకి ఏ రకమైన జర్నలిస్టు తర్ఫీదు వుండేది కాదు. అది కేవలం ఉద్యోగంలో చేరిన తరవాత నేర్చుకున్నదే అయివుండేది. కాని వచన పద్యంలో అయినా, గేయంలో అయినా, కేవలం వచనంలో అయినా సమర్థంగా భాషని వాడగల శక్తి వాళ్లకి వుండేది.
నార్ల వెంకటేశ్వరరావు దగ్గరనించి, నండూరి రామమోహనరావు దాకా, ముళ్లపూడి వెంకటరమణ దగ్గరనించి పురాణం సుబ్రహ్మణ్యరావు దాకా అప్పటికి పెద్ద పేరు లేకపోయినా అసాధారణ ప్రతిభావంతులు తెలుగు పత్రికల భాషకి ఒక గొప్ప గౌరవాన్ని కలిగించారు. కాని, వాళ్ల తరం ఒక పదిహేనేళ్లలో అయిపోయింది.
•
|