Posts: 3,389
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
కథ ప్రారంభం చాలా ఆహ్లాదకరoగా ఉ ఇద్దరి అక్క చెల్లెల అనుబంధం తో చాలా బాగుంది.అలాగే మొదట్లో మీ పరిచయం చాలా బాగా నచ్చింది ముందు ముందు ఈ సైట్ లో అందరికి ఎప్పటికి గుర్తుకు వచ్చేలా ఉండాలి అని కోరుతున్న ప్రస్థానం గారు..
Chandra
•
Posts: 3,389
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
కథ ప్రారంభం చాలా ఆహ్లాదకరoగా ఉ ఇద్దరి అక్క చెల్లెల అనుబంధం తో చాలా బాగుంది.అలాగే మొదట్లో మీ పరిచయం చాలా బాగా నచ్చింది ముందు ముందు ఈ సైట్ లో అందరికి ఎప్పటికి గుర్తుకు వచ్చేలా ఉండాలి అని కోరుతున్న ప్రస్థానం గారు..
Chandra
•
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
•
Posts: 2,397
Threads: 2
Likes Received: 2,837 in 1,122 posts
Likes Given: 7,438
Joined: Nov 2019
Reputation:
308
sisters casual discussion in night time....
very good writer ji,
keep rocking
•
Posts: 235
Threads: 0
Likes Received: 91 in 83 posts
Likes Given: 21
Joined: Jun 2019
Reputation:
1
Posts: 15
Threads: 0
Likes Received: 6 in 5 posts
Likes Given: 0
Joined: Jun 2019
Reputation:
1
•
Posts: 1,348
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
14
Prasthanam garu,
Good Going sir.
mm గిరీశం
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(02-06-2020, 10:22 AM)Hapl1992 Wrote: ఇద్దరు ఎదిగిన ఆడ పిల్లల ఆలోచనల తో బాగా రాసారు
(02-06-2020, 11:03 AM)Gopi299 Wrote: ఎంత బాగా రాస్తున్నారు అండి సూటిగా సుత్తి లేకుండా ఒక విధమైన వడిలో లో లో వెళ్లిపోతుంది కథ,
శుభం
అనేక మలుపులు తిరుగుతూ
చాలా అద్భుతంగా ముందుకు సాగాలని
(02-06-2020, 12:12 PM)paamu_buss Wrote: On point .... Super
(02-06-2020, 12:56 PM)The Prince Wrote: sisters casual discussion in night time....
very good writer ji,
keep rocking
(02-06-2020, 02:04 PM)Gsyguwgjj Wrote: Nice update
(02-06-2020, 02:09 PM)superifnu Wrote: Nice start..
(02-06-2020, 05:12 PM)Okyes? Wrote: Prasthanam garu,
Good Going sir.
మీ అభిప్రాయం తెలియచేస్తున్నందుకు థాంక్స్. రెండు రోజుల్లో తరువాత అప్డేట్ ఇస్తాను.
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
ఎపిసోడ్ 3
ఆ విషయమై తరువాత రెండు రోజులు బాగా ఆలోచించింది. తల్లి తండ్రుల ప్రోత్సహం, మద్దత్తు తన కెప్పుడు ఉంటుంది. కెరీర్ పరంగా తనను సపోర్ట్ చేసేవాడు వస్తే ఇంకా ఎదురు చూడ్డం అనవసరమని పించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చినా మనస్సులోనే దాచుకుంది.
ఒక వారం తరువాత భార్య సమక్షంలో కూతుర్ని మరోసారి కదిపాడు,"ఏమి ఆలోచించావమ్మా, పెళ్లి గురించి."
"నాకు ఏమి చెయ్యాలన్న దాని మీద స్పష్టత లేదు నాన్న. నా నిర్ణయాలకు సహకరించే వారు దొరికితే నాకు ఓకే."
"అలాగేనమ్మా. చెప్పానుగా నీకు నచ్చితేనే అని. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఒక స్పష్టత రావచ్చు. నీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటే, నాకు గాని అమ్మకు గాని చెప్పు."
"నాకు ప్రత్యేకంగా ఏమి లేవు నాన్న. మీరు ఫిజికల్ కేరక్టర్స్, చదువు, ఉద్యోగం, సంపాదన అలాంటి వాటి మీద వెదక కలరు కాని, అతని నడవడిక, మనస్తత్వం తెలియవు కదా నాన్న."
కూతురి మెచ్యూరిటీ కి ఆనందపడిన రాజారావు, "లేదమ్మా. మనకి ఒక అభిప్రాయం వస్తే తెలిసిన వాళ్ళ ద్వారా వాకబు చేయించవచ్చు." అలా అన్నాడే కాని, కూతురు చెప్పిన దాంట్లో ఉన్న నిజం తెలుసు. ఎంత వాకబు చేసినా కాని, కొన్ని విషయాలు కలిసి ఉంటేనే కాని తెలియవు.
ఆ క్షణం నుంచి రోజులో వీలయినంత సమయం భార్య, భర్త లిద్దరూ కూతురి పెళ్లి గురించే ఆలోచించ సాగారు. ముందుగా తమ చుట్టాల్లో కావ్యకు సరి పడే వారు ఉన్నారా అని చూసారు. డబ్బు లేకపోయినా సరే బాగా చదువుకొని మంచి ఈడు, జోడు అయితే చాలు అని అనుకున్నా, అలాంటి వారు ఎవ్వరు కనపడక పోవడంతో బయటి సంభందం చేయాలని నిశ్చయించారు.
సౌమ్య కాలేజ్ కి వెళ్లిన తరువాత, కావ్య ఒక్కతే మిగిలింది. ఊరికే ఉండటం ఎందుకని కావ్య తండ్రి కంపెనీలోనే ఫైనాన్సియల్ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్ గా చేరింది. రోజు ఉదయం నాలుగు గంటలు పనిచేయడం, మధ్యాహ్నం ఇంటికి రావడం ఏమైనా మ్యాగజైన్స్ చదువుతూ పగటి కలల్లో తేలిపోవడం పరిపాటి అయ్యింది. మధ్యలో స్నేహితుల పెళ్లిళ్లు జరిగితే వెళ్లి వచ్చింది. ఆ పెళ్లి వ్యవహారం చూసిన కొద్దీ ఊహలు మరింత ఎక్కువయ్యాయి. ఎవరిదైనా సంసారంలో పొరపొచ్చాలు లేక డివోర్స్ లాంటి విషయాలు తెలిస్తే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేది, తన కెలాంటి వాడు వస్తాడో అని. కాని అంతలోనే ఒక పిచ్చి నమ్మకం కలిగేది, మంచి వాడే వస్తాడని. పగలే వెన్నెల, జగమే ఊయల అన్నట్టుగా మధుర మైన తీపి ఊహలతో ఒక రంగుల ప్రపంచంలో తేలి పోసాగింది.
******************
దిగితే కాని లోతు తెలియదు అన్నారు. దేవుడి దయవల్ల అన్ని వున్నతమ కూతురికి పెళ్లి సంభంధం తేలిగ్గా కుదుర్చు కోవచ్చు అనుకొన్న వారికి అది మరీ అంత సులభతరం కాదని తొందరగానే అవగాహన అయ్యింది. సరదాగా ఒకటి రెండు సంవత్సరాలు అయితే అమెరికా ఓకే కాని, అక్కడ స్థిర పడడం ఇష్టం లేదని కావ్య నిష్కర్షగా చెప్పడంతో, అమెరికా లో స్థిర పడిన వారి సంభందాలు, గ్రీన్ కార్డు ప్రాసెస్ లో వున్న వారివి వదులు కొన్నారు. ఒకందుకు వాళ్లిద్దరూ సంతోష పడ్డారు. కూతురు తమకు దగ్గరలోనే ఇండియా లో ఉండబోతున్నందుకు. వాళ్లకు జాతకం పై అంత నమ్మకం లేకపోయిన, అవతల వాళ్ళ నమ్మకాల వలన జాతకాలు కలవక కొన్ని ముందుకు నడవ లేదు. కొన్ని ప్రైవేట్ గా వాకబు చేయిస్తే, కుర్రాళ్ళ మీద చెడ్డ అభిప్రాయలు వ్యక్తం కావడం తో డ్రాప్ చేసుకొన్నారు.
అంత కాసి వడ పోసిన తరువాత రెండు, మూడు సంబంధాలు పెళ్లి చూపుల వరకు వచ్చాయి. మొదటి సంభందం బిజినెస్ లో తమ కంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్న స్నేహితుడి కొడుకు. అబ్బాయి అందగాడు, తండ్రి బిజినెస్ చూస్తున్నాడు. హైదరాబాద్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపుల తర్వాత అబ్బాయి, అమ్మాయితో కలసి మాట్లాడు తానంటే, తమకు అలాంటి ఆలోచన ఉండటంతో సరే అన్నారు. సాయంకాలం కుర్రాడు BMW కారులో ఇంటికి వచ్చి పిక్ అప్ చేసుకొని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళదాం అని కావ్య అభిప్రాయం అడక్కుండా నేరుగా ఒక పబ్ కు తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాలెట్ పార్కింగ్ లో అతన్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసి అతను అక్కడ రెగ్యులర్ అని అభిప్రాయ పడింది. అతని మీటింగ్ ప్లేస్ ఛాయస్ తోనే ఒక నెగటివ్ ఇంప్రెస్సును తో ఉన్న కావ్య కు, పబ్ లోపల అతన్ని కలిసిన ఫ్రెండ్స్ 'బ్రో, హూ ఈజ్ దిస్ న్యూ బేబ్' అని అడగడం, అలాగే కొంత మంది అమ్మాయిలు మందు తాగుతూ హలో చెప్పడాలు చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. తన తండ్రి అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడు. డ్రింకింగ్ అలవాటుతో ప్రాబ్లెమ్ లేకపోయినా, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవాల్సిన ఆ సందర్భానికి అతను ఎంచుకున్న ఛాయస్, అతని ఫ్రెండ్స్ సర్కిల్ చూసి డిసైడ్ అయిపొయింది. ఇంక అక్కడ ఉండటం ఇష్ట లేక, కొంచెం సేపట్లో అతను డ్రాప్ చేస్తానన్నా తనతో తిరిగి వెళ్లడం ఇష్టం లేక గుడ్ బై చెప్పి క్యాబ్ లో ఇంటికి వచ్చేసింది.
అంతా విన్న తండ్రి, "మంచి పని చేశావమ్మా. సారీ ఇలా అవుతుందనుకోలేదు", అని ఆపాలేజిటిక్ గా అన్నాడు.
"నువ్వెందుకు నాన్న బాధ పడటం అతను అలా చేస్తే", అని సర్ది చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది. పెళ్లి తలంపు వచ్చిన తరువాత మొదటి సారి అన్య మనస్కంగా ఆలోచిస్తూ నిదుర పోయింది.
కూతురు చేసినా దాంట్లో తప్పేమి లేకపోయినా అవతలి వారికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డ రాజారావుకు అతని స్నేహితుడు నుంచి 11 పీఎం కి కాల్ వచ్చింది.
"ఇప్పుడే మా వాడు ఇంటికి వచ్చాడు. వాడు చాలా ఫాస్ట్. మంచి అమ్మాయి కోడలుగా రాబోతుందని సంతోష పడ్డాము. కాని వాళ్ళిద్దరికీ కంపాటబిలిటీ లేదు. సారీ. విష్ యు అల్ ది బెస్ట్ విత్ యువర్ సెర్చ్", అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు.
******************
రెండో సంభందం అబ్బాయి వాళ్ళు ధనికులే కాని ఒక సంవత్సరం క్రితం వ్యాపారం లో దెబ్బ తిన్నారు. ఎంత నష్టం జరిగిందో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినా, వాళ్ళ సర్కిల్ లో విన్నది ప్రకారం చాలా దెబ్బ తిన్నారని తెలిసింది. అయినా పట్టించుకోలేదు. అబ్బాయి బాగా చదువు కున్నాడు, సహాయం చేస్తే పైకి లాగొచ్చు అన్న అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. పెళ్లి చూపుల్లో అబ్బాయి బాగా మాట్లాడటంతో బాగుంది అనుకొన్నారు. బయట మొదటి సారీ వాళ్లిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కొంచెం సేపు మాములుగా మాట్లాడిన, తరువాత అతని మాటలన్నీ తను బిజినెస్ ఎలా పైకి తీసుకు రావాలనుకుంటున్నాడో, తన ఫైనాన్స్ బాక్గ్రౌండ్తో అతనికి తను ఎలా సపోర్ట్ చేయవచ్చో చెబుతుంటే కొంచెం సెల్ఫ్ సెంటర్డ్ అనిపించింది. ఎందుకైనా మంచిదని తండ్రి సహాయంతో రెండో సారీ అతన్ని కలిసింది. రెండో మీటింగ్ లో కూడా తన భవిషత్తు పధకాలు, ఎలా తను స్వల్ప వ్యవధి లోనే ఒక బిజినెస్ టైకూన్ అయి తమ పేరు నిలబెట్టు కోవాలనుకుంటున్నాడో అన్న దాని మీదే సంభాషణ నడిచింది. తను చదివిన చదువు వల్ల ఒక్క విషయం మాత్రం స్పష్టం అయ్యింది తనకి, ఆ అబ్బాయి వ్యాపార పథకాలన్నీ తమ వివాహం ద్వారా రాబోయే కట్నం, ఆ తరువాత నాన్నగారి ఫైనాన్సియల్ సపోర్ట్ మీద ఆధార పడ్డవేనని. జీవన గమనంలో భార్య సహాయం ఆశించడంలో తప్పు లేదు కాని, తన ఇష్టమేమిటో తనతో చర్చించిక పోవడం కూడా రుచించ లేదు. తల్లి తండ్రులతో తన ఎనాలిసిస్ చెప్పి ఆ సంభందం కూడా రిజెక్ట్ చేసింది.
తమ సర్కిల్ లో వెదికిన సంభందాల్లో చాలా వరకు డొనేషన్లతో లేక డబ్బులతో విదేశాల్లో చదివి తండ్రి వ్యాపారాల్లో చేరిన వారు కావడంతో, ఆర్ధిక స్తోమతు వున్న స్వతహాగా తెలివితేటలు లేకపోతె కష్టం అని రాజారావుకి పూర్తిగా నచ్చక కొన్ని వదులు కొన్నారు.
కాల క్రమంలో రెండు నెలలు పైగా గడిచి పోయాయి. కాని భార్య, భర్త తొందర పడ తల్చుకోలేదు. అలాగే వచ్చిన ప్రొపొసల్స్ ని రిజెక్ట్ చేస్తున్నా కూతురి మీద కూడా ఏ మాత్రం వత్తిడి తేలేదు. మధ్య వర్తుల ద్వారా సంభందాలు చూస్తూనే ఉన్నారు. అన్ని రకాలుగా నచ్చితే కాని కూతురితో డిస్కస్ చేయకూడదనుకొన్నారు. అలాంటి సమయంలో మధ్యవర్తి కాకినాడ నుంచి ఒక సంభందం తీసుకు వచ్చాడు. అబ్బాయి తండ్రి జూనియర్ కాలేజీ లో మాథ్స్ లెక్చరర్. అబ్బాయి ఐఐటీ చెన్నయి లో బి.టెక్. కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికా లోని కోర్నెల్ యూనివర్సిటీ లో MS చేసాడు. మూడేళ్ళపాటు బే ఏరియా లోని ఒక స్తార్ట్ అప్ కంపెనీ లో పని చేసి, ఒక సంవత్సరం క్రితమే ఇండియా కు తిరిగి వచ్చి ఆ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో పెట్టిన బ్రాంచ్ లో టెక్నికల్ లీడ్ గా పని చేస్తున్నాడు. ముప్పై ఐదు లక్షల ప్యాకేజి. ఫోటో లో కూడా కుర్రాడు చూడ్డానికి బాగుండటం తో చాలా ఇంప్రెస్స్ అయ్యారు భార్య భర్త లిద్దరు. మధ్య తరగతిలో పుట్టి పేరెన్నిక గన్న ఆ రెండు యూనివర్సిటీలలో చదివాడు అంటేనే ఆ కుర్రాడి మేధో సంపత్తి మీద ఒక అంచనా కు వచ్చాడు. ఎందుకనో గాని మనస్సులో ఫిక్స్ అయ్యాడు, ఈ సంభందం ఖాయం అని. మధ్యవర్తి వారి ఆర్థిక పరిస్థితి మీద డీటెయిల్స్ చెబుతున్నపెద్దగా ఎక్కించుకోలేదు. డిన్నర్ తరువాత అబ్బాయి ఫోటోతో పాటు బయోడేటా కూతురికి ఇచ్చి మరుసటి రోజు తన అభిప్రాయం చెప్పమన్నాడు.
అతని బయో చదివిన కావ్య, తండ్రి లాగే చాలా ఇంప్రెస్స్ అయ్యింది. ఐఐటీ, కోర్నెల్ లాంటి టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడమే చాలా కష్టం. చాలా తెలివైన వాడు అయ్యుండాలి అనుకొంది. అమెరికాలో దిగిన ఆ రెండు ఫోటోలు చూసి బాగున్నాడు అనుకొంది. అప్పటికే జరిగిన పెళ్లి చూపుల అనుభవంతో చూద్దాం ఇది ఎక్కడ దాకా పోతుందో అనుకొంది. పడుకో బోతు అతని పేరు ఏమిటా అని పేపర్ మళ్ళా చూసింది.
"శ్రీరామ్… సౌండ్స్ గుడ్", అని మనస్సులోనే అనుకొని, "గుడ్ నైట్ శ్రీరామ్"అని పైకి అంటూ దుప్పట్లో దూరింది.
Posts: 1,348
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
14
ప్రస్థాణం గారు......
సూపర్బ్ నరేషన్ boss.....
You bave a distinct style......
మద్యలో ఆపరూ అనే విశ్వాసం తో.....
మీ.....
mm గిరీశం
•
Posts: 235
Threads: 0
Likes Received: 91 in 83 posts
Likes Given: 21
Joined: Jun 2019
Reputation:
1
•
Posts: 2,190
Threads: 23
Likes Received: 10,898 in 1,973 posts
Likes Given: 2,029
Joined: Dec 2018
Reputation:
368
May be pure adultery.....
•
Posts: 2,397
Threads: 2
Likes Received: 2,837 in 1,122 posts
Likes Given: 7,438
Joined: Nov 2019
Reputation:
308
•
Posts: 3,389
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
కావ్య వాళ్ళ తల్లిదండ్రులు మనస్తత్వం మెచ్చుకోవాలి చాలా బాగుంది
Chandra
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
06-06-2020, 01:02 PM
(This post was last modified: 06-06-2020, 01:04 PM by prasthanam. Edited 1 time in total. Edited 1 time in total.)
(05-06-2020, 08:51 AM)Okyes? Wrote: ప్రస్థాణం గారు......
సూపర్బ్ నరేషన్ boss.....
You bave a distinct style......
మద్యలో ఆపరూ అనే విశ్వాసం తో.....
మీ.....
(05-06-2020, 01:25 PM)Gsyguwgjj Wrote: Super update bro
(05-06-2020, 04:35 PM)will Wrote: May be pure adultery.....
(06-06-2020, 04:00 AM)Chandra228 Wrote: కావ్య వాళ్ళ తల్లిదండ్రులు మనస్తత్వం మెచ్చుకోవాలి చాలా బాగుంది
కామెంట్స్ తో ప్రోత్సహిస్తున్న మీ అందరికి ధన్యవాదములు.
గిరీశం గారు, ఉపోద్ఘాతం (మొదటి పోస్ట్) లో వాగ్దానం చేసిన ప్రకారం, కధ పూర్తి చేయడం ఖాయం.
ఇద్దరు మిత్రులు మెసేజ్ చేశారు, ఈ కధలో శృంగారం లేదా అని. కధ ప్రకారం కావ్యకు పెళ్లి అయితే కానీ అవకాశం లేదు. వ్యక్తుల స్వభావాలు పూర్తిగా రాయకుండా ఏదో తొందరగా ముందుకు తీసుకు వెళతామంటే కధకు న్యాయం చేసినట్టు కాదు. ఇంకో మూడు ఎపిసోడ్స్ ఓపిక పట్టమని మనవి.
రేపు అప్డేట్ పెడతాను.
Posts: 2,290
Threads: 0
Likes Received: 1,091 in 868 posts
Likes Given: 7,339
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(06-06-2020, 04:29 PM)Venrao Wrote: good thought
Thank you sir
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
ఎపిసోడ్ 4
మరుసటి రోజు కావ్య కూడా సరే అని అనడంతో తల్లితండ్రులిద్దరు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ రోజు సాయంత్రమే మధ్యవర్తిని పిలిచి ఆయన చేతిలో ఖర్చులు కుంచండి అంటూ పది వేలు ఇచ్చి, తాము ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఇంకెవరికి ఈ సంబంధ విశేషాలు చెప్పొద్దూ అంటూ కూతురి ఫోటోలతో పాటు, తమ డీటెయిల్స్ ఉన్న కాగితాలు ఇచ్చి కాకినాడకు ఆ రోజే పంపించాడు. మరుసటి రోజు మధ్యవర్తి అబ్బాయి పేరెంట్స్ కు అమ్మాయి డీటెయిల్స్, ఫోటోలు అంద చేశానని అప్డేట్ ఇచ్చాడు. వారికి అమ్మాయి బాగా నచ్చిందని తన ముందే అనుకున్నారని, అబ్బాయికి తన ముందే మొబైల్ లో ఫోటోలు తీసి WhatsApp లో షేర్ చేశారని, వారాంతంలో అబ్బాయితో ఫోన్ చేసి ఏ విషయం చెబుతామని అని చెప్పటంతో సంతోషించాడు రాజారావు. భోజనాల టేబుల్ దగ్గర ఏదో భార్యకు అప్డేట్ ఇస్తున్నట్టు చెప్పాడు,"మన అమ్మాయి వాళ్లకు బాగా నచ్చిందట. ఆదివారం లోపు అబ్బాయితో కనుక్కొని చెబుతా మన్నారు". ఈ సంభందం అంటే తండ్రికి చాలా ఇష్టంగా ఉందని ఆయన మాటల ద్వారా పసిగట్టింది.
శనివారం వచ్చింది. మధ్య వర్తి ఫోన్ గురించి ఎదురు చూడ సాగారు. తన రూమ్ లోనే వున్న ఎందుకో తండ్రి సెల్ మోగుతుంటే అక్కడి నుంచేనా అని. కాని అడగలేని పరిస్థితి. రాజారావు కూడా తన మనస్సులోని ఆలోచనల అలజడిని బయటకు కన్పించకుండా కూల్ గా డాడీ కూల్ అన్నట్టున్నాడు. రెండు దశాబ్దాలకు పై బడిన సంసారంలో భర్త మనస్సు తెలిసిన జానకి తనలోనే నవ్వుకుంటూ, కాని ఏమి తెలియనట్టు ఇంటి పనిలో నిమగ్నమయ్యింది. శనివారం వెళ్ళింది ఆదివారం వచ్చింది. సాయంత్రం నాలుగు వరకు ఫోన్ రాక పోవడంతో, మధ్య వర్తికి తానె ఫోన్ చేసి కనుక్కొందామా అనుకొన్నాడు. కాని తన ఆత్రం భార్య, కూతురికి తెలిసి పోతుందని మిన్నకున్నాడు. వంట మనిషి ఉన్న అప్పుడప్పుడు జానకి కూడా వంట చేస్తుంది. పకోడీలు చేసి తండ్రి, కూతుళ్ళనిద్దరిని డైనింగ్ టేబుల్ వద్దకు పిలిచింది. పకోడిలు తింటుండగా సెల్ ఫోన్ మోగింది. తింటున్న పకోడీ శబ్దం రాకుండా నములుతూ, ఒక చెవి తండ్రి మాటల మీద కేంద్రీకరించింది కావ్య.
"చెప్పండి... వెరీ గుడ్... వెరీ గుడ్ న్యూస్... నేను ఇప్పుడే మాట్లాడతాను… హ.. అలాగే. తప్పకుండా. మీరు రావటానికి ప్రయత్నించండి. దాన్ని గురించి మీరేమి వర్రీ కాకండి. ఐ విల్ టేక్ కేర్... థాంక్స్…" అంటూ పెట్టేసారు.
అవతలి వారి సంభాషణ వినపడకపోయిన విషయం అర్ధం అయ్యింది అక్కడే ఉన్న తల్లి కూతుళ్ళ కిద్దరికి.
అయినా ఆయన చెబితే వింటే బాగుంటుంది అన్నట్టు,"ఏమని చెప్పారు" అని అడిగింది జానకి.
అప్పటివరకు కుడి చేతిలో ఉన్న పకోడీని నోట్లో పెట్టుకొని తొందరగా నమిలి తిని చెప్పాడు,"అబ్బాయి కూడా ఓకే అన్నాట్ట. నన్ను ఫోన్ చేసి వారితో డైరెక్ట్ గా మాట్లాడమన్నారు"
ఆ వార్త నింపిన ఆనందంతో ఇక పకోడీలు తినకుండా, టీ తాగి వాళ్లతో మాట్లాడతా అంటూ పైనున్న తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. పెళ్ళికొడుకు తండ్రి ప్రసాద్ రావు కు ఫోన్ చేసి, పెళ్లి చూపులకు రమ్మని ఆహ్వానించాడు. మంచి రోజు చూసుకొని వస్తామని అంటే, అలా ఫోన్లో మాట్లాడుతూ క్యాలెండరు చూసి పది రోజుల్లో దశమి బాగుంది అంటే ఓకే చేసాడు. ఉదయం పది గంటలకు వర్జము ముగియడంతో పదిన్నర తర్వాత కలిసేట్టు నిర్ణయించుకొన్నారు.
కొడుకుతో మాట్లాడి శనివారం వాళ్లిద్దరూ హైదరాబాద్ చేరుకునేట్టు, మంగళ వారం సాయంకాలం విజయవాడ చేరుకొని మరుసటి రోజు పెళ్లి చూపులకు వెళ్లొచ్చు అని డిసైడ్ చేసుకుని ట్రైన్ రిజర్వేషన్స్ చేసుకున్నారు. మరుసటి రోజే రాజారావుకి ఫోన్ చేసి కంఫర్మ్ చేయడంతో స్టేషన్ కు కారు పంపిస్తానని ఆఫర్ చేసాడు. "వద్దండి. అబ్బాయితో కోఆర్డినేట్ చేసుకొని మేము వచ్చేస్తాము.", అని సున్నితంగా తిరస్కరించాడు ప్రసాద రావు.
ఆ వారం రోజుల్లో శ్రీరామ్ పని చేసే కంపెనీ గురించి, అతని గురించి వాకబు చేయటానికి ప్రయత్నించాడు రాజారావు తన మేనేజర్ ద్వారా. ఇలాంటి విషయాల్లో సిద్దహస్తుడైన ఆయన Microsoft కంపెనీ లో పనిచేస్తున్న శ్రీరామ్ జూనియర్ బ్యాచ్ అబ్బాయి ద్వారా కొన్ని వివరాలు లాగాడు. శ్రీరామ్ పని చేస్తున్నకంపెనీ స్టార్ట్ అప్ కావడంతో అది చాలా మందికి తెలియదు. కాని ఆ కంపెనీ సెక్యూరిటీ సంస్థ ఎంప్లాయ్ ద్వారా కొన్ని విషయాలు సేకరించాడు. మొత్తం మీద శ్రీరామ్ గురించి తెలివైన వాడని, కంపెనీలో మంచి పేరుంది అన్న ఫీడ్ బ్యాక్ రావడంతో అదే విషయం ఆనందంగా భార్యకు, కూతురికి చెప్పాడు. అందరూ బుధవారం గురించి ఎదురుచూడ సాగారు.
కానీ ఆ శుక్రవారం ఒక బెంగుళూరు కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ కొనడానికి ఎవాల్యూయేట్ చేయాలన్న రిక్వెస్ట్ US హెడ్క్వార్టర్స్ నుంచి రావడం తో, శ్రీరామ్ టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ కావటంతో వాళ్ళ కంపెనీ సీఈఓ తనతో బెంగుళూరు రమ్మని అడిగాడు శ్రీరామ్ ని, సోమవారం నాడు. రెండు రోజుల తర్వాత పెళ్లి చూపులు, అమ్మాయి వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాం ఎలా అని ఆలోచించి చివరకు అది మంచి అవకాశం అని వెళ్ళడానికే డిసైడ్ అయ్యాడు. సోమవారం మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లి గురువారం ఈవెనింగ్ ఫ్లైట్ కి వచ్చేలా రిజర్వేషన్స్ చేశారు కంపెనీ వాళ్ళు.
శనివారం ఉదయం శ్రీరామ్ స్టేషన్ కు వెళ్లి తల్లి తండ్రులను పిక్ చేసుకొని గచ్చిబౌలి లోని తన అపార్ట్మెంట్ కి తీసుకు వచ్చాడు. శ్రీరామ్ ఆ త్రిబెడ్ రూమ్ ప్లాట్ కొనుక్కొని ఆరు నెలలు అయ్యింది. ఎవరో కొనుక్కొని ఇంటీరియర్స్ చేయించుకొని, ఆ అపార్ట్మెంట్లోకి మారుదామనుకొనే లోపల అమెరికా వెళదామని డిసైడ్ అవ్వటంతో అమ్మేశారు. అంతా వైట్ మనీ కావాలి అంటే అపార్ట్మెంట్ కొనే వేటలో ఉన్న శ్రీరామ్ మంచిరేటుకు వస్తుందని కొంత తన సేవింగ్స్ తో, మిగిలింది లోన్ తీసుకొని కొనేసాడు. తమ చేతుల మీదుగానే గృహ ప్రవేశం చేయించారు. దాని తరువాత వాళ్ళు రావడం ఇప్పుడే. ఇల్లంతా లగ్జరీ గా కాకపోయినా డీసెంట్ గా ఫర్నిష్ చేసుకొన్నాడు. తాము వస్తామని తెలిసి అన్ని రెడీ గా పెట్టాడు, పాలతో సహా. వీడిని చేసుకునే పిల్ల అదృష్టవంతురాలు అని మనసులోనే అనుకొంది లలిత. తను తెచ్చిన పచ్చళ్ళు అవి తీసి వంట గదిలో సర్ది, స్నానాలు చేసి దోశలు తిని, కాఫీ తాగి కూర్చున్నారు.
కంపెనీ పని వల్ల తను రావడానికి వీలు కావట్లేదు అని, "మీరు చూసి రండి. నచ్చితే తర్వాత నేను వెడతాను" అని చెప్పాడు. అనుకున్నట్టుగా కొడుకు కూడా తమతో వస్తే బాగుంటుంది అనుకున్నా, కొడుకు చెప్పాడంటే అది ముఖ్యమైన పని అయ్యుంటుంది అని అలాగే అన్నాడు.
Posts: 1,348
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
14
గిరీశం గారు, ఉపోద్ఘాతం (మొదటి పోస్ట్) లో వాగ్దానం చేసిన ప్రకారం, కధ పూర్తి చేయడం ఖాయం.
ఇద్దరు మిత్రులు మెసేజ్ చేశారు, ఈ కధలో శృంగారం లేదా అని. కధ ప్రకారం కావ్యకు పెళ్లి అయితే కానీ అవకాశం లేదు. వ్యక్తుల స్వభావాలు పూర్తిగా రాయకుండా ఏదో తొందరగా ముందుకు తీసుకు వెళతామంటే కధకు న్యాయం చేసినట్టు కాదు. ఇంకో మూడు ఎపిసోడ్స్ ఓపిక పట్టమని మనవి.
మీ హామీ కి( రెండవ సారి) దన్యవాదాలు....
మరేం లేదు సర్ మంచి కథలు , చాల మంది మంచి రచయితలు మద్యలో ఆపేసి మిస్సింగ్ అవుతున్నారు ఆ బయం అంతే.....
ఇక రెండవది మీ రచన తీరు సూపర్ ఎక్కడ ఏం కావాలో అదే రాస్తున్నారు లైక్ ఆడపిల్ల పెళ్లి ఒక తండ్రికి ఎంత టెన్షన్ ఇస్తుందో అది చాల సూపర్ గా రాసారు...... ఇక సెక్స్ ....... ఆ శాంతిముహుర్తం కొరకు మేము ఎదురు చూస్తున్నాము సర్.....
mm గిరీశం
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
•
|