23-02-2019, 10:17 AM
ఆధునిక అష్టమ వ్యసనం
వ్యభిచారం, జూదం, మద్యపానం, వేట (అతి జీవహింస), పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, డబ్బు దుబారా చేయడం... వీటిని సప్త వ్యసనాలని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు అష్టమ వ్యసనం ముందుకొచ్చింది. సప్త వ్యసనాలను మించిపోయిందీ అష్టమ వ్యసనం. అదే స్మార్ట్‌ఫోన్ వ్యసనం. ఈ స్మార్ట్‌ఫోన్ వ్యసనంలో రకరకాల వ్యసనాలున్నాయి. వాటిలో- అస్తమాను సోషల్ మీడియాలో కామెంట్లు, లైక్‌లు చెక్ చేసుకోవడం, అనుకున్నన్ని లైక్‌లు, కామెంట్లు రాకపోతే నిరుత్సాహపడటం, హరర్, రేసింగ్ వంటి గేమ్స్‌కు దాసోహం కావడం, టైమ్‌తో నిమిత్తం లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండడం, వాట్సప్, మెసెంజర్ చాటింగ్‌లతో పాటు పోర్న్ వీడియోలు చూడటం వంటివి. వీటిలో ముఖ్యంగా పోర్న్ వీడియోలు చూడటమనేది ఆడ, మగ తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యసనంగా తయారైంది. అసలు సిసలైన అష్టమ వ్యసనం ఇది అంటున్నారు నిపుణులు.
స్మార్ట్‌ఫోన్ మనిషి నిత్యజీవితంలో భాగమై పోయింది. కేవలం సమాచార మార్పిడికే పరిమితం కావాల్సిన సెల్‌ఫోన్... అది ఒక్క క్షణం చేతిలో లేకపోయినా భరించలేని స్థాయికి చేరుకున్నాం. నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్ఫోన్లతోనే కాలక్షేపం. జీవితంలోనే ఒక భాగమై, చివరకు అది నేడొక వ్యసనం (Nomophobia) స్థాయికి చేరింది.
అయితే స్మార్ట్‌ఫోన్ వల్ల సాంకేతికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతకంటే ఎక్కువ ముప్పే పొంచి ఉంది. స్మార్ట్ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల తలెత్తే రకరకాల సిండ్రోమ్‌లతో శారీరక, మానసిక రుగ్మతలకు గురికావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్' సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా షావోమి, వన్ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్-16 జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి, వన్‌ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. షావోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐఏ 1, వన్‌ప్లస్ 5టీ స్మార్ట్ఫోన్లు ఈ వరుసలో ముందున్నాయి. షావోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 7 నిలిచింది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల రేడియేషన్ కూడా అత్యధికంగానే నమోదైందని రిపోర్టు చేసింది. మరోవైపు అతి తక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ డివైస్‌లు నిలవడం గమనార్హం. ఎల్జీ, హెచ్‌టీసీ, మోటో, హువావే, హానర్‌కు చెందిన కొన్ని ఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని నివేదించింది. గంటల తరబడి ఈ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పోర్న్ వీడియోలు దేశంలో పెద్ద సమస్యగా మారాయి. పోర్న్ వీడియోలు చూసేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. నెట్లో అశ్లీల వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వల్ల కూడా కావడం లేదు. పోర్న్ చూసే వాళ్లలో 30 శాతం మంది మహిళలు కూడా ఉంటున్నారనే ఆశ్చర్యపరిచే నిజాలు ఒక అధ్యయనంలో తేలాయి. ఈ వీడియోలు చూడటం కోసం గంటల తరబడి మొబైల్‌కు అతుక్కుపోవడం వల్ల మానసిక రుగ్మతలకు గురవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఫోన్‌కు బానిసలైపోవడం మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తోందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ వ్యసనాల నుంచి బయటపడలేక పోతున్నవారు రకరకాల పద్ధతులను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. మన ఆలోచనలను, అవసరాలను జ్ఞాపకం ఉంచుకుని, సమయానికి వాటిని గుర్తుచేస్తూ మళ్లీ ఈ స్మార్ట్ఫోనే వ్యక్తిగత సహాయకుడి పాత్రనూ పోషిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ మన ఫోన్ వాడకం పర్యవేక్షణలో సాయపడగల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిద్రపోవాల్సిన సమయం కాగానే, ఇక ఫోన్ వాడొద్దని అవి మనకు సూచిస్తాయి. ఇందులో iOS 12 స్క్రీన్ టైమ్ డిఫాల్ట్‌గా ఆన్ అయ్యే సదుపాయంతో వచ్చింది. రాత్రి 10 గంటలు కాగానే ఫోన్లోని అప్లికేషన్లన్నీ డిమ్ అయిపోతాయి. స్క్రీన్ మీద క్లిక్ చేయగానే అవర్ గ్లాస్ ప్రత్యక్షమైIgnore Screen Time for 15 minutes అనిగానీ, Ignore it for the day అనిగాని ఆప్షన్ ఇస్తుంది. 'స్క్రీన్ టైమ్'లో రోజువారీ, వారంవారీ ఫోన్ వాడకం నివేదిక ఉంటుంది. పైగా ఇది 'సోషల్ నెట్ వర్కింగ్, ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ' విభాగాలుగా వర్గీకరించబడి ఉంటుంది. అత్యధికంగా వాడిన యాప్స్, ఓ గంటలో ఎన్నిసార్లు పోన్ వాడిందీ, నోటిఫికేషన్ల ఫ్రీక్వెన్సీ తదితరాలన్నీ ఉంటాయి. వీటన్నింటి ఆధారంగా 'డౌన్‌టైమ్' సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు - రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు డౌన్‌టైమ్ సెట్ చేస్తే, రాత్రి 10 గంటలకు ఐదు నిమిషాల ముందే డౌన్‌టైమ్ మొదలు కాబోతోందన్న మెసేజ్ చూపుతుంది. అది మొదలయ్యాక మనం అన్‌చెక్ చెయ్యని యాప్స్ తప్ప మిగిలినవన్నీ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మనం స్వయంగా ఏదైనా యాప్ ఓపెన్ చేసి ignore Downtime ను సెలెక్ట్ చేస్తే తప్ప ఏ నోటిఫికేషన్లూ రావు.
ఈ ఆధునిక అష్టమ వ్యసనం నుంచి బయటపడటానికి స్వతహాగా సిద్ధపడలేని వారు ఈ అప్లికేషన్లు కొంతవరకైనా సాయం చేస్తాయి. వీటిని ఉపయోగించుకొని క్రమంగా స్మార్ట్‌ఫోన్ బానిసత్వం నుంచి బయటపడొచ్చు. ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఏదీ లేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK