27-11-2018, 11:34 PM
(This post was last modified: 27-11-2018, 11:36 PM by Vikatakavi02.)
ఇల్లు ఖాళీ చేయాలని పిల్లలను తల్లిదండ్రులు కోరవచ్చు : హైకోర్టు
Source : ABN-Andhrajyothi
న్యూఢిల్లీ : తల్లిదండ్రులు తమ పిల్లలను ఇల్లు ఖాళీ చేయాలని కోరవచ్చునని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. తమను పోషించని, సక్రమంగా చూడని పిల్లలను తమ ఇంటి నుంచి లేదా ఏదైనా ఇతర ఆస్తి నుంచి ఖాళీ చేయాలని కోరవచ్చునని పేర్కొంది. జస్టిస్ విభు భక్రు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
స్థిర లేదా చరాస్తుల నుంచి ఖాళీ చేయాలని తల్లిదండ్రులు తమ పిల్లలను కోరవచ్చునని ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం చెప్తోందని హైకోర్టు తెలిపింది. ఆ ఆస్తి ఆ తల్లిదండ్రుల పూర్వీకులదైనా, తామే స్వయంగా సంపాదించినదైనా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
రాజీవ్ బెహల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తనను, తన భార్యను ఇంటి నుంచి ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ తన తండ్రికి డివిజనల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారని, ఈ ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
డివిజనల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్లో రాజీవ్ బెహల్ తన తండ్రిని వేధించాడని, సక్రమంగా చూడలేదని, అందువల్ల ఆయన తండ్రి ప్రశాంతంగా తన ఆస్తిలో జీవించేందుకు వీలుగా ఆ ఆస్తి నుంచి పిటిషనర్ వెళ్ళిపోవలసి ఉంటుందని పేర్కొన్నారు.Source : ABN-Andhrajyothi
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK