Thread Rating:
  • 244 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)Running

ఇక వీరసేనుడికి తనపై ఆశ వుంది. తాను కనులెర్ర చేయడంతో కొంత భయపడి ఆగాడు. అతనిని వశపరచుకుని వీతిహోత్రులకు వార్త పంపటం ఎలా ఉంటుందని మాహేశ్వరి ఆలోచిస్తూ వుంటుంది. ఈలోపే మునీకుడు ఒక చిత్రమైన వ్యూహం పన్ని వీతిహోత్రులలో తొమ్మిదిమంది రాకుమారులు చనిపోయేలా చేస్తాడు. అసలీ మునీకుడి కథ ఏమిటంటే అతను చిన్నప్పుడే యింటి నుండి పారిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి ఏవో క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు. ఒక పిశాచ దేవతని ప్రత్యక్షం చేసుకుని తాను రాజు కావాలని కోరుకుంటాడు. ఆమె “నువ్వు సేనాపతివి అవుతావు. నీ కొడుకు ఒక రాజకుమార్తెని పెళ్ళాడి రాజవుతాడు.” అని చెప్తుంది. అప్పుడతడు మధుర చేరి ప్రస్తుత మగధ రాజైన రిపుంజయుని తాతగారైన సత్యజిత్తు కాలంలో మగధ సేనలో చేరతాడు.
అప్పటినుంచి యిప్పటివరకు అతడే మహాసేనాధిపతి! మునీకుడు దుష్టుడు. కాని అతని కొడుకు ప్రద్యోతనుడు తన సుగుణములతో ప్రజల అభిమానాన్ని పొందినవాడు. ఇంతకీ యిపుడు మునీకుడి కోరిక తన కొడుకుని రాజుని చేయాలని. పాతికేళ్ళ క్రితం అతనికి పెళ్ళి చేయాలనుకున్నపుడే ఎవరైనా రాకుమార్తెని యిచ్చి చేసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు.

ఇపుడు రిపుంజయుడికి పురుష సంతానం లేదు కనుక అతని కూతురైన తులసీ దేవి ప్రద్యోతనుడినిని పెళ్ళాడితే ప్రద్యోతనుడు రాజవుతాడు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తాడు మునీకుడు. అది చాలావరకు నెరవేరుతుంది కూడా. యాభైఏళ్ళ ప్రద్యోతనుడికి, అతని కూతురి సమవయస్కురాలైన తులసీదేవికి మధ్య ప్రేమ చిగురించడం, రాజు రిపుంజయుడు అనారోగ్యానికి గురి చేయబడడం, ఆ తర్వాత మరణించడం అంతా మునీకుడి వ్యూహం ప్రకారం జరుగుతుంది. రాజు చనిపోయాడు. అంతా మునీకుడి వ్యూహం ప్రకారం జరిగింది అన్నాం కదా! అంటే ఏమిటి? రాణి ఓడిపోయిందా? కాదు. రాణి మాహేశ్వరి ఆఖరి క్షణంలో అంతకు మించిన వ్యూహరచన చేస్తుంది. అప్పటివరకూ ఏ ప్రాధాన్యతా లేని గంధవాహుడు, విశ్వపతి లాంటి పాత్రలన్నీ ఉన్నట్లుండి బయటకి వచ్చి మాహేశ్వరి ఆధ్వర్యంలో అద్భుతమనిపించే సమర్థతని కనపరుస్తాయి. అంటే మాహేశ్వరిది పైచేయి అవుతుందా! అదీ కాదు.
మరేమవుతుంది?

ఒక ప్రక్క మునీకుడి వ్యూహం బయట పడుతుండగానే కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది. మునీకుడు, మాహేశ్వరి, వింధ్యగిరిస్వామి, ప్రద్యోతనుడు, తులసి, గంగాధరరావు, గంధవాహుడు – చిన్న పాత్రలూ, పెద్ద పాత్రలూ కూడా ఒకదాన్ని మించి ఒకటి వామనుడిలా పెరిగిపోతాయి. ఏ పాత్ర చూస్తే ఆ పాత్ర ఇక ఇదే మిగతా కథని తన చేతుల్లోకి తీసుకుని నడిపించేస్తుందేమోననిపిస్తుంది. ఒక కథానాయకుడు, ఒక ప్రతినాయకుడు.. స్పష్టమైన రెండు పక్షాలు.. అంతకంటే స్పష్టంగా కనబడే ఆ రెండు పక్షాల సంబంధాలు, ద్వేషాలు, ప్రేమలు – ఇలాంటి మామూలు కథలకి అలవాటు పడిన మనం ఎవరు నాయకుడు? ఎవరు ప్రతినాయకుడు? ఎవరు బలవంతుడు? ఎవరు బలహీనుడు? మునీకుడే పక్షం? ఏ కొడుకుని రాజుని చేయాలని మునీకుడు సర్వవ్యూహాలూ రచిస్తున్నాడో ఆ కొడుకు ప్రద్యోతనుడే పక్షం? మాహేశ్వరి ఏ పక్షం? ఏ కూతురి క్షేమం కోసం ఆమె వింధ్యగిరి స్వామి అంతటి వాడిని ఎదిరించడానికి సిద్ధపడిందో ఆ కూతురు తులసి ఏ పక్షం? ఎవరు ఎవరికి శత్రువులు? ఎవరు ఎవరికి మిత్రులు? – వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సులభంగా సమాధానం చెప్పలేని విధంగా పాత్రలనీ, సంఘటనలనీ, సన్నివేశాలనీ, సంభాషణలనీ సృష్టించి, నడిపించిన రచయిత మాయలో నిజంగా వూపిరయినా తీసుకోకుండా కొట్టుకుపోతాం.

చివరికి ఏమవుతుంది? అన్న ప్రశ్న అసలు ముఖ్యమే కాదనిపిస్తుంది. అయినా సమాధానం చెప్పుకోవాలంటే ప్రద్యోతనుడు తులసిని పెళ్ళాడి మగధ రాజ్యాధిపతి అవుతాడు. మునీకుడు గంధవాహుడి చేత, గంధవాహుడు, మాహేశ్వరి వింధ్యగిరిస్వామి చేత యుద్ధంలో చంపబడతారు. వింధ్యగిరిస్వామి (జయద్రథుడు) తానూ శారీరకంగా నిర్వీర్యుడై చితి పేర్చుకుని చితారోహణము చేస్తాడు. ఆ చితిలో నుంచి పైకెగసిన నాస్తికధూమములు ఉలూక, త్రిగర్త, కాంభోజ, గాంధార మత్స్య, కుంతిభోజ, మాగధ, నిషధ, హైహయ, వంగ, ఆంధ్ర, ద్రావిడ, పుండ్రాది సర్వదేశములకు సాగుతాయి. కొన్ని పొగలు సముద్రములు దాటిపోతాయి. తెల్లవారేసరికి పక్షుల కిలకిలారావాలతో పాటు ఒక భక్తుడు వదిలిపెట్టిన చిలుక చండీ విగ్రహము శిరస్సు మీద కూర్చుని “కృష్ణా” అంటూ వుంటుంది. అదీ కథ!

 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పిన విషయాలూ, వ్యూహాలూ నవలలో చాలా గొప్పగా ఉద్విగ్నభరితంగా చిత్రీకరించబడినాయి. మాహేశ్వరి మనసులోని భావాలనీ, ఆమె ఆలోచనలనీ చాలా చక్కగా చిత్రిస్తారు రచయిత. స్వామితో తనకున్న సంబంధమేమిటో అర్ధమయ్యి భర్త తనతో మాట్లాడటం మానివేశాక, ఒక ప్రక్క కూతుర్ని అప్పగించమంటూ స్వామి వత్తిడి, మరొక ప్రక్కన తన కొడుకుని రాజుని చేసేందుకు మునీకుడి వ్యూహాలు – వీటన్నిటినీ ఎదుర్కునే సమయంలో ఆమె పాత్రని చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా వుంటుంది.

భర్త వింధ్యగిరి స్వామి దర్శనానికి వెళ్ళేందుకు అనుమతినీ అందుకు కావలసిన ధనాన్నీ మంజూరు చేయలేదు. ఆవిషయమై అతనితో మాట్లాడేందుకు వెళ్ళడమా అనుకుంటుంది. ‘కులీనురాలయిన రాజు భార్య, తనతో మాటలు మానిన భర్త వద్దకు తానెప్పుడును పోదు. తాను కులీనయా?’ అని ప్రశ్నించుకుంటుంది.
తన భర్త ఒక రాజు. రెండు వేల ఏళ్ళనుండి అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఉపరిచరవసు వంశోత్పన్నుడు. అతను వింధ్యగిరి స్వామి కన్నా తీసిపోయాడా? స్వామి తనని అనరాని మాటలు అనడం లేదా? ఆ స్వామి దగ్గరికి వెళ్ళడంలో లేని అమర్యాద అతని దగ్గరకు వెళ్ళేందుకు అనుమతి కోరేందుకు గాను రాజు దగ్గరికి వెళ్ళడం లో వుంటుందా! అనుకుంటుంది.

ఆ స్థితిలో వున్న పాత్ర అచ్చంగా ఇలాగే ఆలోచిస్తుందేమో అనుకునేట్లు వుంటుంది ప్రతి వాక్యమూ. అవి చదువుతుంటే ఆమె ఉద్వేగాన్నీ, భయాన్నీ, బాధనీ మనమే అనుభవిస్తున్నట్లుగా వుంటుంది. ఆమె గుండె చప్పుడు మనం స్పష్టంగా వింటున్న అనుభూతికి లోనవుతాం. అప్పుడు ఆమె తన పరిచారికలలో అన్నపూర్ణ అనే ఆమెకు విషయమంతా వివరించి రాజు దగ్గరకు పంపుతుంది. ఆమె వల్ల కాకపొతే అపుడు స్వయంగా తానే వెళ్ళాలనుకుంటుంది.
ఆ అన్నపూర్ణ మరొక ఆసక్తికరమైన పాత్ర. చాలా సాధారణ పాత్ర అనుకుంటాం మొదట ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ గురించి. పరిచయం చేసేటపుడే రచయిత కొన్ని విశేషణాలు చెప్తారు. అయితే ఆ పరిచయాన్ని బట్టి మనం వూహించుకున్న దాన్ని మించిపోతుంది ఆ పాత్ర. ఆమె మాట్లాడే మాటలు.. ఆమె తెలివితేటలు.. మునీకుని వ్యూహం మొత్తాన్నీ కనిపెట్టే ఆమె చాకచక్యం చదివి నివ్వెరపోతాం.

అంతే కాదు. రాజుపై కుట్ర నడుస్తోందని అర్ధమైన రాత్రి మాహేశ్వరి, అన్నపూర్ణల మధ్య సంభాషణ, రాణి అన్నపూర్ణ మెడను కౌగిలించుకుని ఏడవడం.. తాను సేవకురాలనీ, రాణి రాణి అనీ మర్చిపోయి అన్నపూర్ణ కూడా రాణిని కౌగిలించుకుని ఏడవడం. వాళ్ళిద్దరూ అన్ని ప్రమాదాలనీ, కష్టాలనీ కాసేపు మర్చిపోయి ఒక చిత్రమైన అనుభూతికి లోనవడం, తల్లీకూతుళ్ళ వలె ఆ రాత్రంతా చర్చించుకోవడం, ఆ సాన్నిహిత్యంలో నుంచి వచ్చే ఒక ధైర్యం – ఆ అధ్యాయం వివరించడానికి వీలవనంత బాగుంటుంది.

అంతఃపుర రక్షక సైన్యానికి సేనాని అయిన గంధవాహుడు. అదింకొక అబ్బురపరిచే పాత్ర. మునీకుడు మహాసేనాని. గంధవాహుడు అతని క్రింది ఉద్యోగి. కానీ రాణి మర్యాద కాపాడటానికి అతను చూపే శౌర్యం, మునీకుడు అమర్యాదగా ప్రవర్తించబోయినపుడు అతనిని ఎదిరించడం- ఆ అధ్యాయమంతా కూడా ఊపిరి బిగపట్టి చదివేంత ఉత్కంఠగా వుంటుంది.

అన్నపూర్ణ, గంధవాహుడు, వాళ్ళతో రాణి ప్రవర్తన – యిదంతా ఎంత అబ్బురంగా సాగుతుందంటే చివరికి అంత దుష్టుడైన మునీకుడు కూడా గంధవాహుడితో యిలా అంటాడు “ఓయీ! .. నీవంటి వాని గౌరవమునకు పాత్రురాలయిన యామె, అమర్యాదకును పాత్రురాలు కాదు. నీవు కూడ వీరసేనుని వంటి వాడవైనచో నేనామెను నిస్సందేహముగా నమర్యాద పరచి యుండెడివాడను. ఆమె నీయందు సర్వదా రాణితనమే నెరపెను. ఈ అన్నపూర్ణమ్మ గారియందును రాణితనమే నెరపెను. ఆమె కొందరియందింత రాజ్ఞీత్వము నిలువబెట్టు కొనెనని నేననుకోలేదు. ఆటవికురాలు. గ్రామీణురాలు. వింధ్యగిరిస్వామికి చెప్పుక్రింద తేలు. ఈమె వలన రాజ్యమునకు మర్యాద లేదనుకున్నాను. ఆమె వలన రాజ్యమునకు మర్యాద యున్నదని మీరిద్దరును నాకు రుజువు పరచినారు.” అంటాడు.

 horseride  Cheeta    
Like Reply

నిజాయితీ, నిబద్ధత వున్న సేవకుల వల్ల యజమాని గౌరవమర్యాదలు ఎలా పెరుగుతాయో రచయిత వివరించిన తీరు చూసి ముగ్ధులమవకుండా ఉండలేము. అంతే కాదు అటు రాణి ప్రవర్తన లోని మార్పు, అప్పటివరకూ పైకి గౌరవించినా లోలోపల ఒక శీలం లేని వ్యక్తి అన్న చులకన భావనతో ఉన్న సేవకులూ శత్రువులూ కూడా ఆమె రాజ్ఞీత్వాన్ని చూసి నివ్వెరపోవడం – ఆ మలుపు అద్భుతంగా వుంటుంది. ఆ పాత్ర పట్ల సానుభూతి చూపాలన్న వూహ అయినా అంతవరకూ లేని పాఠకులు ఒక్కసారిగా ఆమె పక్షమై పోతారు.

రాజు మరణించిన వెంటనే మహాసేనాని మునీకుడు కోటని తన అధీనం లోకి తీసుకోకుండా నిలువరించాలనీ, తమ రాజభక్తిని నిరూపించుకోవాలనీ ఆదేశిస్తూ రాణి మిగిలిన సైనికాధికారులతో మాట్లాడే సన్నివేశం, ఆ అధ్యాయం చాలా ఉద్విగ్నభరితంగా వుంటుంది. ఆ అధ్యాయం లో చివరి వాక్యాలు ఇవి:
“రాణి నోటివెంట వచ్చిన చివరి మాటలతో ఆ సేనాపతులు కదలాడిపోయిరి. భయపడిరి. ఒక మహాయాజ్ఞ వచ్చి తమ్ము మొగముపైన కొట్టినట్లయ్యెను. ఇంత యాజ్ఞ వారిదివరకెరుగరు. ఇదివరకు వారెరిగిన యాజ్ఞ తమ ఉద్యోగమునకు సంబంధించినట్లుండెను. ఈ యాజ్ఞ తమ యాంతరము లందున్న రాజభక్తి రాణి రూపమున యెట్టయెదురుగా నిలుచుండి – భయము, గౌరవము, ప్రేమ, భక్తి, రాజ్యరక్షణము, దుష్టశిక్షణము, స్వధర్మ నిర్వహణము మొదలగు సర్వభావముల ఏకీకృతిగ భాసించెను.”

అలాగే గంధవాహుడు మునీకుడితో కత్తియుద్ధం చేసే సందర్భం ఒకటుంటుంది. గంధవాహుడికి మునీకుడి పై గౌరవమూ, అభిమానమూ ఏమీ లేవు. యుద్ధంలో అతనిదే పై చేయి అవుతుంది. మునీకుడిని చంపగల అవకాశమూ వస్తుంది. కానీ చంపకూడదు. చంపితే కథ వుండదు. అయిపోతుంది, లేదా మారిపోతుంది. మరో రచయిత మరోరచయిత అయితే ఇక్కడ ఎలాంటి కల్పన చేసి మునీకుడు బ్రతికి పోయినట్లు వ్రాస్తారో తెలియదు కానీ.. విశ్వనాథ చేసిన పని మాత్రం ఇంకెవవరూ చేయలేరనిపిస్తుంది. ఈ క్లిష్ట సన్నివేశంలో నుంచి ఒక ధర్మసూక్ష్మం చెప్తారు మనకి. మనసు ఎంత చిత్రమైందో అది ఎటువంటి అనూహ్యమైన ఆలోచనలు చేస్తుందో చెప్తారు. ఆ పని చేస్తూ, దానినే కథ తనకి కావలసిన మలుపు తిరిగడానికి వీలుగా వాడుకుంటారు. అదెలా చేస్తారో చూడండి.

యుద్ధంలో మునీకుడిని సంహరించ వలసిన క్షణంలో గంధవాహుడు “ఇతన్ని సంహరించి నేను మహావీరుడనవుతాను నిజమే కానీ తర్వాత రాజ్యమేమవుతుంది? రాజ్యాన్ని ముంచినా, తేల్చినా అందుకు సమర్ధుడు మునీకుడే కదా! తనకు ఆ సమర్థత లేదు కదా!” అనుకుంటాడు. ఆ ఆలోచనతో మునీకుడిని వదిలేస్తాడు.
ఆ ఆలోచనలో పొరపాటు తర్వాత అర్ధమవుతుందతనికి. తాను ఒక వీరుడిలా, సాహసికుడిలా ప్రవర్తించ లేదనీ, ఒక మంత్రిలా, రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించాడనీ అది తప్పనీ తెలుస్తుంది. తాను చాలా వివేకంగా ప్రవర్తించాననుకున్నాడు కానీ అది వివేకం కాదని కోపంతో ఎర్రబడిన రాణి కన్నులు చూసినపుడు కానీ అతనికి స్ఫురించదు. రాణి అంటుంది అతనితో “ఓయీ! నీ ధర్మము నీవు నెరవేర్చలేదు. నీ కవసరము లేని ఆలోచన నీవు చేసినావు. … ఆలోచన భటుని ధర్మము కాదు. భటుని యొక్క ధర్మము కత్తి నుపయోగించుట. ఆలోచన సేనాపతి చేయును. యుద్ధమంత్రి చేయును. రాజు చేయును. నీ యుద్యోగమును నేను తీసివేయుట లేదు. నీవు మా ఎదుటి నుండి పొమ్ము. సింహద్వారమును రక్షించుచుండుము…..” అని.

నాకు చమత్కారంగా అనిపించిన మరొక సంభాషణ వుంది. తనతో చనువుగా వుండేందుకు ప్రయత్నిస్తున్న తులసీదేవిని ప్రద్యోతనుడు తమ యిద్దరి మధ్య వున్న తేడాలు చెప్పి వారిస్తాడు. మన యిద్దరికీ ఈడు కాదు అంటాడు. అపుడు అతన్ని ఒప్పించేందుకు చాలా అంశాలు చెప్తుంది తులసీదేవి. వింధ్యగిరి స్వామి లాంటి వృద్ధులకి చిన్న పిల్లలైన స్త్రీలతో వున్న సంబంధాల గురించి చెప్పి “.. ఆ యధర్మమైన సంగమము చేయుటకు స్త్రీలకు వయసు మీరిన వారు పనికివత్తురా! వివాహము చేసికొనుటకు పనికిరారా!” అని ప్రశ్నిస్తుంది. వయసులో తేడా పెళ్ళికి అభ్యంతరకరం కాదంటూ ఏవేవో ఉదాహరణలు చెప్తుంది. ఇంకా అతను సందేహిస్తుంటే అంటుంది.. “కలి మరి నాలుగువేల యేండ్లు దాటిన తర్వాత మాటాడెడి మాటలు మాటాడకుము.” అని. అదీ రచయిత చమత్కారం! ఇప్పటి విమర్శలకి అప్పటి పాత్ర ద్వారా సమాధానం చెప్పించడం!
*****

 horseride  Cheeta    
Like Reply

ధూమరేఖ- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

[Image: Nht3vn9w_o.jpg]

పురాణవైర గ్రంథమాలలో ఇది మూడవ నవల.
రెండవ నవల నాస్తికధూమములో మగధరాజ్యం ప్రద్యోత వంశం వారి చేతిలోకి వెళ్ళడం చెప్పబడింది. ఈ మూడవ నవలలో శిశునాగ వంశం రాజ్యానికి రావడం చెప్పబడుతుంది.

ప్రద్యోత వంశము కలియుగమున పదకొండువందల నలభై నాలుగేళ్ళ వరకు రాజ్యం చేసింది. ప్రద్యోతులు అయిదుగురు. ప్రద్యోతులలో చివరివాడు నందివర్ధనుడు. అతని తర్వాత కలిలో పదకొండువందల నలభై నాలుగేళ్ళ నుంచి పదిహేనువందల నాలుగు వరకు గిరివ్రజపురం రాజధానిగా శిశునాగ వంశం రాజ్యం చేసింది. శిశునాగ వంశంలో చివరివాడు మహానంది. మొదటివాడు శిశునాగుడు.
ఈ నవల మొదట్లో ఇద్దరు యువతుల మనఃప్రవృత్తి వర్ణింపబడుతుంది. వారిలో మాయ అన్న ఆమె బుద్ధుని తల్లి. ఈ నవలలో బుద్ధుని కథ లేదు. దానికి సూచన వుంది. దానికి పునాదిగా ఈ నవలలోని కథ వ్రాయబడింది అంటారు విశ్వనాథ పీఠికలో. పురాణవైర గ్రంథమాల లోని మొదటి మూడు నవలలలో అభౌమకత (super natural) విషయము వర్ణింప బడింది. తక్కిన నవలలో ఆ ప్రసక్తి వుండదు అని చెప్తారు.


 horseride  Cheeta    
Like Reply

కథలోకి వెళ్తే …

శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు పురుష సంతానం లేదు. ఒక్కతే కూతురు. ఆమె పేరు వేదమరీచి. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. తల్లిదుఃఖమును మరచిపోవడానికి కాశీరాజు ఆమెని కాశీ నగరానికి తీసుకెళ్ళాడు.. (ఇక్కడ ఒకచోట కాశీరాజు భార్య నందివర్ధనుడికి వదినగారని వ్రాశారు. కాశీరాజు భార్య అంటే శిశునాగుడి తల్లే కదా! శిశునాగుడి తల్లి నందివర్ధనునికి వదినగారు కాదు, పెదతల్లి. నవలలో అన్ని చోట్ల అలాగే చెప్పారు. ఇక్కడ ఒక్క చోట వదినగారు అని వ్రాయడం పొరపాటు కావచ్చు.) అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరు ఇష్టంగా వుంటారు. మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.

యుగపురుషులు నిత్యులు. ఎవనికి వీలైనప్పుడు వాడు విజృంభించును. కలిపురుషుడు మొదట జయద్రథుని యందు తాను కొంత సంక్రమించెను. కానీ తాను విస్తరించటానికి నాడు కాలం అనుకూలంగా లేదు. శిశునాగుని నాటికి కలిపురుషునికి కొంత బలం వచ్చింది. జయద్రథుడు తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. (పురాణవైర గ్రంథమాలలోని మొదటి పుస్తకం – భగవంతుని మీది పగ – లో జయద్రథుని గురించీ, ఆ వంశం వారి పగ గురించీ చెప్పబడింది.)

ప్రతిమనిషికీ పుట్టుకతోనే ఒక సంస్కారం వుంటుంది. అది ధర్మం కావచ్చు. అధర్మమూ కావచ్చు. శిశునాగునిలో అలాంటి అధర్మమైన సంస్కారం వుంది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు కాశీనగరం లోనే వుంది. అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూ వుంది. భార్యని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోలేదు. వేదమరీచి తమ మహారాణి అనీ, ఆమె మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు.

ఈ నేపథ్యంలో మగధ రాజ్య మంత్రులలో వృద్ధులైన ఇద్దరు కాశీనగరానికి వచ్చి “నీవు రాక తప్పదు” అని బతిమాలి బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు. వేదమరీచికి కూడా వెళ్ళి తన రాజ్యం తాను సంబాళించుకోవాలని వుంటుంది. అది శిశునాగుడికి యిష్టం లేదనీ ఆమె గ్రహిస్తుంది. అయినా వెళ్ళిపోతుంది. వేదమరీచి వెళ్ళిపోయాక శిశునాగుడు బాధతో, కోపంతో ఆ రాత్రి కోట నుంచి కాలినడకన బయటికి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్తున్నాడో గమనించుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్ళాక చీకట్లో దూరంగా ఏదో నిప్పు వెలుగుతూ ఆరుతూ వుండడం గమనించి అటు వైపు వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు… పిశాచం లా ఉన్నవాడిని. వాడు ఒక కర్ర లోనుంచి వస్తూన్న పొగని ఒక గొట్టముతో పీలుస్తూ వుంటాడు. శిశునాగుడు వెళ్ళి వాడి ఎదురుగా నిల్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక బలిష్టమైన నక్క వచ్చి ఆ వ్యక్తిని చూసి బెదిరి పారిపోతుంది.

శిశునాగుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితుడై ‘నేను నీదగ్గరే వుండి పోతాను’ అంటాడు. అతను ‘వద్దు, నువ్వు కోటకి వెళ్ళు. నేనే నిన్ను చూడటానికి కోటకి వస్తాను. నువ్వు వుండమంటే అక్కడే వుండిపోతాను.’ అంటాడు. శిశునాగుడి చేత ‘నేను నీ శిష్యుడిని’ అనిపిస్తాడు. తన చేతిలో వున్న కట్టెని శిశునాగుడికి యిచ్చి అతని చేత కూడా ధూమపానం చేయిస్తాడు. ఆ ధూమపానం చేయగానే శిశునాగుడిలో ఒక మార్పు వస్తుంది. వేదమరీచితో తనకున్న సంబంధం పాపము అనిపించదు. అది సహజమైనదేననిపిస్తుంది.

 horseride  Cheeta    
Like Reply

తెల్లవారేసరికి రాజభటులు శిశునాగుడిని వెతుకుతూ వచ్చి కోటకు తీసుకువెళ్తారు. తల్లి చంద్రమతీ దేవి అతనిలోని మార్పుని గుర్తిస్తుంది. శిశునాగుడిని తీసుకువచ్చిన పరిచారకులలో ఒకడిని పిల్చి రాత్రి శిశునాగుడు ఎక్కడికి వెళ్ళాడని ఆరా తీస్తుంది. ఆ పరిచారకుడి పేరు చిత్రశిఖండి. అతను అది మహానగరానికి దూరంగా నాలుగు స్మశానాల మధ్యలో వున్న ప్రదేశమనీ అక్కడ పది పొదలున్నాయనీ, అవేమిటో తనకి అర్థం కాలేదనీ, పగటివేళ వెళ్ళి మళ్ళీ పరీక్షించాలనుకుంటున్నాననీ చెప్తాడు. నిజానికి అవి పొదలు కావనీ, దుబ్బులు అనీ, వృక్షాల గురించి బాగా తెలిసిన తనకే అవి ఏమిటో అర్థం కాలేదనీ అంటాడు. అలాగే అక్కడ యువరాజువి కాక మరొక మనిషి కాలిగుర్తులు, నక్క కాలిగుర్తులు కూడా కనిపించాయని చెప్తాడు. అవి నక్క కాలిగుర్తులన్న విషయం అందరూ గుర్తించలేరనీ ఏదో భయంకర జంతువు కాలిగుర్తుల్లా ఉన్నాయనీ అంటాడు.

వృద్ధరాజు, అంటే శిశునాగుడి తండ్రి ఆరోజునుంచీ మంచాన పడతాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి పలకరించమనీ, మాట్లాడమనీ చంద్రమతీ దేవి వత్తిడి చేస్తే శిశునాగుడు ఆయన దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి మాట్లాడతాడు. అపుడు రాజు మొహం లోకి కొత్త ప్రకాశం వస్తుంది. శిశునాగుడి మాటలని ఆయన ముక్కుతో పీలుస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్లుగా కనిపిస్తాడు “యువరాజా, నా పని అయిపోయింది. నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నీ శత్రువులని దండించు. ప్రతీకారం తీర్చుకో.” అంటాడు.

రాణి ఆశ్చర్యపోతుంది. ప్రతీకారం ఎవరిమీదో ఆమెకు అర్థం కాదు. వేదమరీచి మీదా! మగధ రాజ్యం మీదా? ఎందుకు? ఆమె ఇలా అనుకుంటుంది. “ఈ కాశీ మహాక్షేత్రము యొక్క పవిత్రత వల్ల, శక్తి వల్ల వేదమరీచి యొక్క జీవుడు పరిశుద్ధుడవుతాడనీ, మగధ రాజ్య పాలనాపటిష్టుడవుతాడనీ వేదధర్మ ్రతిష్టాపనాచార్యుడవుతాడనీ అనుకుని వేదమరీచిని ఇక్కడికి తెచ్చాను. ఈ మగధ రాజ్యం కర్మమేమిటో! వాళ్ళెప్పుడూ శ్రీకృష్ణ విరోధులే. ప్రద్యోతనుడి కూతురు పద్మావతిని పాండవుల వంశంలోని ఉదయనుడికి యిచ్చినా ఆ సంబంధం అక్కడితోనే అయిపోయింది. ఆ తర్వాత ఈ నూట ముప్పై ఆరేళ్ళ నుంచీ శ్రీకృష్ణ విరోధమే నడుస్తోంది. బార్హద్రథవంశం వున్నన్నాళ్ళు చండీ పూజ పరంపరగా సాగింది. ప్రద్యోతనులు అది కూడా మానేశారు. నందివర్ధనుడు శూన్యవాది. ఇక ముందు ఏమవుతుంది? నందివర్ధనుడి తర్వాత ప్రద్యోత వంశం అంతరించి మరొక వంశం మగధని ఆక్రమిస్తుందని వదంతి వుంది. కానీ మగధ మీద దండెత్త గలిగినంత పెద్ద రాజ్యం ఇంకొకటి లేదు. తర్వాత ఏమవుతుంది? శిశునాగుడికి ప్రతీకారం ఎందుకు? దాన్ని అతను ఎలా తీర్చుకుంటాడు?” ఇలాంటి సందేహాలన్నీ కలిగి రాణి రాజు దగ్గరకు వెళ్ళి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. “శిశునాగుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్తారా?” అని అడుగుతుంది.

“అతడు రాజైన తర్వాత నేను ఆ ప్రతీకార మార్గాన్ని బోధిస్తాను.” అంటాడు రాజు. రాణి నివ్వెరపోతుంది. ఒక హఠాత్స్ఫురణగా తనకే తెలియకుండా అనాలోచితంగా “నువ్వెవరు?” అని ప్రశ్నిస్తుంది. “నేను జయద్రథుడిని” అంటాడు రాజు. అంతే. ఆ జవాబు తర్వాత ఇంక రాణి ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పడు. నగరంలో పరాశరరావు అనే వృద్ధ పండితుడు ఉంటాడు. నిత్య తపస్వి. యోగానిష్టాపరుడు. జ్యోతిష్యము, సాముద్రికము తెలిసిన వాడు. చిత్రశిఖండి ఆ పరాశరరావుని కలిసి, ఆయన్ని తీసుకుని తాను శిశునాగుడిని చూసిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఆయన ఆ ప్రదేశాన్ని పరీక్షిస్తాడు. ఆ దుబ్బులలో ఏదో రహస్యముందని గ్రహిస్తాడు. అక్కడ వున్న నాలుగు దుబ్బులను త్రవ్వించి, రోటిలో రుబ్బించి ఆ పిండిని గంగానదిలో కలిపిస్తాడు. రాణి కూడా ఆయనతో సంప్రదిస్తుంది. రాజుని జయద్రథుడు ఆవహించాడని అర్థం చేసుకుంటారు.

ఆంధ్రరాజు కుమార్తెతో శిశునాగుడి వివాహం చేయాలనుకుంటారు. కాశీనగరం నుంచి ఆంధ్రదేశం వెళ్ళి మాట్లాడి రావడానికి ఒక నెల రోజుల పైనే పడుతుందనీ, అయినా తను వెళ్ళి మాట్లాడి వస్తాననీ అంటాడు పరాశర రావు. ఆ తర్వాత ఆయన జపంలో కూర్చుంటే వింధ్య పర్వత శ్రేణుల్లో ఇదంతా మొదలయిందని అర్థమవుతుంది. అక్కడ కూడా అలాంటి దుబ్బులు వుండడం, వాటి క్రింద వున్న కాష్ఠములను చేత బూని నల్లని దుస్తులు ధరించిన ఒక పురుషుడు అక్కడినుంచి ఏదో దూరదేశానికి ప్రయాణించడం, అక్కడ ఒక రాజసౌధం, తోట, తోటలో రాకుమారి కనిపిస్తారు. ఆమె శిశునాగుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్న ఆంధ్ర రాజదుహిత అనీ అర్ధమవుతుంది. ఆమె తోటలో నిద్రిస్తుండడం, ఆ పురుషుడు తన చేతిలోని కాష్ఠములకు నిప్పు ముట్టించి, ఆ పొగ అంతా ఆమె చేత ఒక వేయిసార్లు పీల్పించడం కనిపిస్తుంది. అదంతా నిద్రలో వున్న ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. ఆ ఆంధ్ర రాజకుమార్తె పేరు వంకజాబిల్లి. అమిత సౌందర్యవతి.

 horseride  Cheeta    
Like Reply

తర్వాత పరాశర రావు ఒక సందర్భంలో ఆమెతో ఇలా చెప్తాడు.

“ఓ తల్లీ! నీ సౌందర్య మేమి? నీ గర్భము నందా దుష్టుడు ప్రవేశపెట్టిన ధూమ రజ్జు సంతానమేమి? నీవు నిదురపోవుచుండగా – నిన్నింకొక రీతిగా తన వైపునకు త్రిప్పుకోలేని వాడై – వాడు నీ గర్భమునందొక నాస్తిక ధూమరేఖా రజ్జు సంతానమును ప్రవేశ పెట్టినాడు. నీకా సంగతి తెలియదు. నిదుర లేచిన తర్వాత నీకు వానిని కాదను శక్తి పోయినది. అనగా వాడు నిన్ను శరీరము నందు బంధించినాడు. నీ మనస్సునకు, నీ శరీరము మీద నధికారము లేకుండ చేసినాడు. నీ మనస్స్వాతంత్ర్యము నపహరింప లేక పోయినాడు. నీ తండ్రి యొక్కయు, నీ భర్త యొక్కయు మనస్స్వాతంత్ర్యములను కూడ హరించినాడు. వారి జీవులకంటె నీ జీవుడుత్తముడు. అధిక స్వచ్ఛత కలవాడు. ఎక్కువ వెలుగు కలవాడు. అందుచే నీ మనస్సు వానికి స్వాధీనము కాలేదు. కాకపోవుటవలన నొక లాభమున్నది. నీ సంతానము వాడనుకొన్నంత తుచ్ఛమైనది కాదు. నీకు కుమారుడుదయించును. వానికి కుమారుడుదయించును.

ఇట్లు పదితరములు సాగును. … రెండు మూడు తరముల వరకు నష్టము లేదు. తరువాతివారు నాస్తికులగుదురు. నాస్తికులయినను నీ ఈ మనోలక్షణము చేత వారి నాస్తికత్వము నీ గురువు వాంఛించిన నాస్తికత్వము కాదు. .. వాని పని సగము మేర ఫలించును. వైదిక మతమునకు వాడు విరోధి. వైదిక కర్మమునకు వాడు విరోధి. ఆ విరోధము మాత్రము సాగును. వాడాత్మలక్షణములను నిర్మూలింపలేడు. దయ, అహింస, శమ దమములు, వైరాగ్యము మొదలయిన యాత్మ లక్షణములను వాడు చెరపలేక పోవుచున్నాడు. దానికి కారణము నీ మనస్స్వచ్ఛత. నీ జీవ సంస్కార విశేషము. శ్రౌత కర్మాభిరతి. వేద కర్మాభిమానము. ఇవి తత్సాధకములైన బహిరంగములు. వానిని వాడు, నీ గర్భ కోశమునందు తద్దుష్ట ధూమమును వ్యాపింపజేసి నీ సంతానమునందు లోపించెడునట్లు చేసినాడు…”
అదీ విషయం. అలా శిశునాగుడికీ ఆంధ్రరాజ పుత్రిక వంకజాబిల్లికీ వివాహం జరుగుతుంది.

మరొకప్రక్కన అక్కడ వేదమరీచి రాజ్యంలో వృద్ధరాజు నందివర్ధనుడు, వృద్ధ మంత్రి మయూరరావు, అజాతశత్రుడనే పేరు గల వీరుడు – వీరిని గురించిన కథ కొంత.
అజాతశత్రుడు మాళవ రాజకుమారుడు. సుక్షత్రియ వంశీయుడు. తల్లిదండ్రులు చిన్నతనం లోనే చనిపోగా జ్ఞాతులు అతని సిరిసంపదలు కైవశం చేసుకుని అతన్ని దేశం నుంచి వెళ్ళగొట్టగా అతను మగధకు వచ్చి అక్కడ రాజోద్యోగిగా వుంటాడు. రాజుకీ, మంత్రికీ అత్యంత సన్నిహితుడు. వేదమరీచితో అతని వివాహం జరిపించి అతనినే మగధకు రాజును చేస్తారేమోననేంత సాన్నిహిత్యం. అయితే కాశీ నుంచి తిరిగి వచ్చిన వేదమరీచి ఆ ముగ్గురితోను తన రహస్యం చెప్పేస్తుంది. ముగ్గురూ నిశ్చేష్టులవుతారు. రాజు వేదమరీచితో పాటు తానూ దుఃఖించి ఆమె వివాహానికి సుముఖంగా లేదన్న విషయం మాత్రం ప్రజలకు తెలియచేసి ఊరుకుంటాడు.
అయితే శిశునాగుడి వివాహం జరిగాక కొన్నాళ్ళకి వృద్ధమంత్రి, రాజు మరణిస్తారు. ఆ తర్వాత కొంత ఆలోచించి వేదమరీచి, అజాతశత్రువు వివాహం చేసుకుంటారు.
అప్పటికి వంకజాబిల్లికీ శిశునాగుడికీ పుట్టిన కొడుకు కాకవర్ణుడు ఆరేళ్ళ వాడు.

వేదమరీచి వివాహ వార్త విని రగిలిపోతున్న శిశునాగుడితో వంకజాబిల్లి మీ పగ నేను సాధించిపెడతానంటుంది. అన్నంత పనీ చేస్తుంది కూడా. మగధతో యుద్ధం చేస్తే గెలవలేని చిన్న రాజ్యమైన కాశీరాజ్యపు రాజు శిశునాగుడు మగధకు రాజయ్యేలా చేస్తుంది. చుట్టరికం ఆధారంగా శిశునాగుడు, చంద్రమతీ దేవి, వంకజాబిల్లి మగధలో అడుగుపెడతారు. అలా అడుగుపెట్టడానికి కావలసిన పరిస్థితులు కల్పించ బడతాయి. అందుకు పరాశర రావు కొంత ఉపయోగపడితే, కాశీరాజుని ఆవహించిన జయద్రథుడు – అతనికి కావల్సిందీ అదే కనుక – మరికొంత ఉపయోగపడతాడు. వేదమరీచిని హత్య చేసి, ఆ నేరం అజాతశత్రువుపై మోపి అతన్నీ హత్య చేసి, మగధ ప్రజల దృష్టిలో అతన్ని నేరస్తుడిని చేసి, శిశునాగుడు మగధకి రాజవుతాడు. అదీ నవలకి ముగింపు.

 horseride  Cheeta    
Like Reply

ఈ నవలలో కథకుడు నేరుగా చెప్పిన, పరాశర రావుతో సంభాషణల రూపంలో చెప్పించిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.

ఒక ఉదాహరణ : “జీవలక్షణ పరిజ్ఞానము విచిత్రముగా నుండును. ఆ పరిజ్ఞానము కలవారు యోగులు కానక్కరలేదు. ఆ పరిజ్ఞానము తమకు కలదని వారికి వారికే తెలియును. వారి మాటల చేత, వారి క్రియల చేత వారి కా పరిజ్ఞానము కలిగినట్లు తెలియును. మానవులలో నెట్టి పరిస్థితులలోనైన నొకానొకడు సర్దుకొని పోవును. ఒకడు ప్రతి చిన్న విషయమునందు వివాదము పెంచుకొనును. ఆ సర్దుకొని పోయెడివానిని సత్పురుషుడందుము. సత్పురుషుడనగా జీవలక్షణ పరిజ్ఞానము కలవాడని అర్ధము. జీవలక్షణ మనగా నిత్యమైన వస్తువు యొక్క వస్తుత్వము.”

అలాగే వేదమరీచి శిశునాగుడితో తనకున్న సంబంధం గురించి చెప్పినపుడు తండ్రి నందివర్ధనుడి స్పందన, ఆమె దుఃఖం, ఆయన దుఃఖం, ఆమె బాధని ఒక తండ్రిలా కాక తల్లిలా ఆయన అర్థం చేసుకోవడం.. ఆ సన్నివేశం బాగా వ్రాస్తారు రచయిత. ఆతర్వాత మరణించే ముందు నందివర్ధనుడి మనసులో మెదిలే కొన్ని ఆలోచనలు ఇలా ఉంటాయి. “.. ఒక క్రియ జరుగుటలో జరుగుటకే ప్రాధాన్యము గాని అది ఎందుకు జరిగినదనుటకు ప్రాధాన్యము లేదు. ఆ క్రియకు కర్త వాడు. కర్తృత్వము వానియందున్నది. కర్తృత్వజ్ఞానము వానికున్నదా లేదా యన్న ప్రశ్న లేదు. వాడు పసివాడైనను, వాని నా కార్యమునకు కర్తగా లోకమెంచుట వలన తత్కర్తృత్వాభిమానము వాని జీవలక్షణము నందున్నదని లోకమంగీకరించుచున్నది. లోకము జీవునినంగీకరించుచున్నది. లోకజ్ఞానము క్రమముగా వచ్చును. రాదు! కర్తృత్వజ్ఞానము జీవనిష్టమై యున్నదన్నమాట! అయ్యో! వానికి లౌకికజ్ఞానము కుదురక ముందే వానియందీ కర్తృత్వము నారోపించుట న్యాయము కాదనగా, లోకజ్ఞానము కుదురకముందే వానియందు సౌఖ్యభావన దుఃఖభావనయు నున్నది గదా! వాడు భావించు సౌఖ్యము వానికి లోకజ్ఞానము రాకముందే భావించుచున్నాడు గదా! లోకమునందు చేసెడి కార్యములకు సుఖదుఃఖములు ఫలితములు. కార్యము నందలి కర్తృత్వాభిజ్ఞానము తెలియక ముందే తత్కార్యఫలితమైన సుఖాశ ఎట్లు కలిగినది? ఇది ప్రశ్న. అందుచేత జీవుడు తాను చేసెడి పనికి తాను బాధ్యుడు! వాడు తెలిసి చేయవచ్చును. తెలియక చేయవచ్చును. అనగా లోకమునందు కర్మకు ప్రాధాన్యమున్నదని అర్ధము. ఇట్టి స్థితిలో వేదమరీచి యందు దోషము లేదని చెప్పుట ఎట్లు? ఉన్నది. తత్కర్తృత్వము తజ్జీవగతమై యున్నది. అది బాల్యదశ. అందుచేత నామెను దూషింప రాదన్నచో బాల్య యౌవన కౌమారములు శరీరదశలు. శరీరమునకున్న ఈ దశలను బట్టి జీవుడు వర్తించునా? జీవుడు తానెప్పుడు శరీరమును స్వీకరించెనో దానికి సహజమైన దశలను, తత్తత్కాలముల యందు చేసిన కార్యములను సర్వము నంగీకరించెననియే యర్ధము.”

*****

 horseride  Cheeta    
Like Reply

Birthday treats to heroines
story pdf vunte send cheyandi sarith garu
Please
Like Reply

ఫలితాన్ని ఆశించకుండా తన పని తాను చేసుకొని పోవడమే నిజమైన మనిషి లక్షణం. వేరేవాళ్ళ పోగడ్తలకు, సొంత కృషికి లింక్ పెట్టుకొనివుంటే, మనకు ఇంత మంది కవులు దొరికేవారు కాదు, ఇన్ని కధలు ఉండేవి కాదు.

ఫలితాన్ని ఆశించకుండా తన వంతు కృషి చేస్తున్న ప్రతివక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ముందు ముందు కూడా మీరు మీ చేతనైనంత వరకు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

జెస్సికా రాణి

బావ సహాయంతో లేదా బావకు తెలికుండా అక్కను దెంగే కధలు రాయండి. చాలా కసిగా ఉంటాయి. 
Like Reply

నందోరాజా భవిష్యతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

[Image: hPm62Ywg_o.jpg]

ఇది పురాణవైర గ్రంథమాలలో నాలుగవ నవల.
శిశునాగ వంశపు రాజులు పదిమంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యము చేసింది. తరువాత నందుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు. నందుడు మహానందికి శూద్ర స్త్రీ యందు పుట్టిన కొడుకు.

నందుడి మంత్రి రాక్షసుడు. ఆ రాక్షసుడి ప్రతిభ ఎలాంటిదో, అతడు నందుడికి రాజ్యం ఎలా సంపాదించి పెట్టాడో, మగధరాజ్యములో శిశునాగ వంశము పోయి నందవంశము ఎట్లా ఆక్రమించిందో చెప్తారు విశ్వనాథ ఈ నవలలో.
నవలాకాలం నాటికి బౌద్ధమత ప్రభావం బాగా వుంటుంది. (అప్పటికి బుద్ధుడు పుట్టి 200 ఏళ్లయింది. మరణించి 120 ఏళ్ళయింది.) క్షత్రియులందరూ బౌద్ధ మతాభిమానంతో వుంటారు. అయినా మళ్ళీ శూద్రుడైన నందుడిపై ద్వేషంతోనూ, క్షత్రియులే తప్ప శూద్రుడు రాజవకూడదన్న భావంతోనూ వుంటారు. ఆ క్షత్రియుల యొక్క బాధలకు గురైన వారంతా నందుడి పక్షంలో వుండి నందుడు రాజవ్వాలని కోరుకుంటూ వుంటారు. నందుడి ప్రతిష్ట ఒక్క మగధకే పరిమితం కాదు.
అయోధ్యని పాలిస్తున్న ఇక్ష్వాకులు, పాంచాలాన్ని పాలిస్తున్న పాంచాల రాజులు, హస్తిన ప్రాంతం లోని కౌరవులు, ఇంకా హైహయులు (మహిష్మతీ నగరం), కాలకులు, ఏకలింగులు, శూరసేనులు, మైథిలులు మొదలైన క్షత్రియులు పాలిస్తున్న పది రాజ్యాలలోనూ క్షత్రియ దౌర్జన్యం సాగుతూ వుంటుంది.

 horseride  Cheeta    
Like Reply

ఒక్కొక్క రాజ్యం గురించి ఒక్కొక్క అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు రచయిత.

మొదటిది రేవా నదీ తీరంలో వున్న మహిష్మతీ రాజ్యం. దానిని హేహయ రాజు అర్జునుడు పాలిస్తూ వుంటాడు. అతడు బ్రాహ్మణ ద్వేషి. ఆ అధ్యాయం ముగిసేసరికి అతనిని ముక్కూ మొహం తెలియని ఒక బ్రాహ్మణ యువకుడు సంహరిస్తాడు.

తర్వాత కౌరవ రాజ్యం. భారత యుద్ధములో కౌరవులందరు నశించారు. ధర్మరాజు రాజయ్యాడు. అంతకు ముందు దుర్యోధనాదులని కౌరవులనీ, యుధిష్టరాదుల్ని పాండవులనీ అన్నా, ధర్మరాజు రాజయినప్పటినుండీ వారే కౌరవులు. ఆ కౌరవ వంశంలో యుధిష్టరుని మనుమడు జనమేజయుడు. అతని కొడుకు శతానీకుడు. ఈ శతానీకుడు తన రాజధానిని హస్తినాపురము నుండి కౌశాంబికి తరలించాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు కొన్నాళ్ళు హస్తినలో, కొన్నాళ్ళు కౌశాంబిలో వుంటూ వచ్చారు.

ఈ కథాకాలం నాటి కౌరవరాజు పేరు క్షేమకుడు. క్షేమకుడు కౌశాంబియందు రాజ్యం చేస్తున్నాడు. కౌశాంబీ నగరం ప్రయాగ క్షేత్రమునకు దగ్గర. యమునా నది గంగానదిలో కలవక మున్న కొంత దవ్వున నెగువ నీ కౌశాంబి యున్నది. అచ్చము యమున యొడ్డున లేదు. ప్రయాగ రెండు నదులు కలిసిన చోట వుంటే, కౌశాంబి నదులు కలిసిన ఎగువ పంగలో వుంది.

క్షేమకుని కొడుకు నిరమిత్రుడు. అతడు వైదిక మతానికి వ్యతిరేకి. అతను కూడా మహిష్మతీ రాజు అర్జునుడి లాగా కౌశాంబిని గగ్గోలుకు తెచ్చేవాడే. కానీ తండ్రి క్షేమకుడు అందుకు అడ్డుగా వుంటాడు. వృద్ధుడైన క్షేమకుడు మరణించి తాను రాజయితే తన ప్రతాపం చూపించాలని వేచి వుంటాడు నిరమిత్రుడు.

అతడు గదావిద్య లో ప్రవీణుడు. అతనిని జయించగలవారు ఎవరూ లేరన్న అహంకారం. అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు కూడా. అయితే ఎక్కడో హిమవత్పర్వతములో నేపాళ దేశమునకు వెనుక పర్వతములలో ఈ విద్యనభ్యసిస్తున్న ఒక ఆటవికుడు తనని లెక్క చేయడని విని అతడిని జయించాలని బయలుదేరతాడు.

తండ్రితో బదరీ నారయణుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వెళ్ళి అక్కడ అడవులలో ఆ అనామకుడైన ఆటవికుడితో యుద్ధం చేసి మరణిస్తాడు. ఆ వార్త విని క్షేమకుడూ తక్షణమే ప్రాణం విడుస్తాడు.

 horseride  Cheeta    
Like Reply

తర్వాత పాంచాల రాజ్యం. భారత యుద్ధములో త్రిగర్త కాంభోజాభిసార మద్ర కేకయాధిపతులు వధించబడ్డారు. ఇంచుమించుగా ఆ రాజ్యాలన్నీ పాంచాల దేశంలో కలిశాయి. శకుని వధతో గాంధార దేశం ప్రాబల్యమూ తగ్గిపోయింది. దశార్ణ దేశములు రూపుమాసి పోయాయి. పాంచాలరాజ్యమొక్కటే పెద్ద రాజ్యం. భారత యుద్ధం తర్వాత దృష్టద్యుమ్నుడి వంశం వారు దాన్ని పాలిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళ తర్వాత అంటే దాదాపు 1500 ఏళ్ళ తర్వాత బాహ్లిక దేశంలోని నలగిరి అనే జనపదం నుంచి వంశధరుడు అనే వాడు నేను పాంచాల రాజ్యానికి అసలైన వారసుడిని అంటూ వస్తాడు.

దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ద్రుపదుడికి పుట్టలేదనీ, అగ్ని లోనుంచి వచ్చారనీ తన పూర్వీకుడు ద్రుపదుడికి ఒక స్త్రీ వలన పుట్టినవాడు కనుక తనకే రాజ్యం దక్కాలనీ అంటాడు. వాడికి ఎక్కడినుండో వత్తాసు దొరుకుతుంది. వాడు సభాభవనంలోకి వచ్చి సవాలు విసిరితే పాంచాల రాజు కత్తి దూసి వాడి మీదకి వెళ్తాడు.

తులాయుద్ధంలో నా సేనాపతిని గెలిస్తే నేను వెళ్ళిపోతానంటూ ఎవరో మహావీరుడిని చూపిస్తాడు వంశధరుడు. రాజు తులా యుద్ధం చేస్తాడు. వధించబడతాడు. వంశధరుడు రాజవుతాడు.

తర్వాత మిథిలా నగరం. దాని రాజు ఉశీనరుడు. వేదవేదాంగాలు చదివినవాడు. జ్ఞాని. ఆయనకు సంతానం లేదు. ఆయన తరువాతి సంగతేమిటన్నది ప్రశ్న.
మరొక పక్కన కొంచెం వెనక్కి వెళ్తే, బుద్ధుని కాలంలో కోసల రాజైన ప్రసేనజిత్తు భార్య శాక్య రాజుల ఆడుబిడ్డ. అతని కొడుకు విదుధవుడు. శాక్య వంశ క్షత్రియులకి బుద్ధుడు తమ వంశంలో పుట్టాడు కనుక తాము అధికులమన్న భావన. ఒకప్పుడు కృష్ణుడిని చూసుకుని యాదవులు గర్వించినట్లు. కనుక వారొకసారి తమ యింటికి వచ్చిన విదుధవుడ్ని అవమానిస్తారు. ఆ కోపంతో అతడు కపిలవస్తు నగరంలోని సర్వరాజవంశాన్ని సంహరిస్తాడు. విదుధవుడి అన్నగారు కాహుద్రకుడు. అతని కొడుకు కుందకుడు. అతని కొడుకు సురధుడు. సురధుని కుమారుడు సుమిత్రుడు. ఈ సుమిత్రుడు కథాకాలం నాటి కోసల రాజు.

శ్రావస్తి, కపిలవస్తు, కాశీ నగరము, గిరివ్రజము మొదలైన సర్వభాగముల యందున్న బౌద్ధులు వజ్జిభిక్షుకులని పిలవబడతారు. కోసలములోని బౌద్ధులు తాము వజ్జిభిక్షుకుల కంటే అధికులమని అనుకుంటారు. సుమిత్రుడిదీ అదే అభిప్రాయము.

కోసల రాజు సుమిత్రుడు, మిథిల రాజు ఉశీనరుడూ తలపడతారు. నిజానికి యుద్ధం చేయాలన్న ఆలోచన వారికేమీ వుండదు. అయితే దానికి పథకం ఎవరి చేత రచించబడిందో, అదంతా ఎలా జరిగిందో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మధ్య యుద్ధం జరిగిపోతుంది. సుమిత్రుని సేనలు భల్లట, ఉశీనర రాజ సైన్యములను వధిస్తాయి.

ఆ తర్వాతి అధ్యాయంలో కాలక, ఏకలింగ, శూరసేన రాజ్యములు మూడూ ఒకేసారి క్షత్రియకుమారుడన్న వాడు మిగలకుండా సమసి పోతాయి. ఆ అధ్యాయం, పథక రచన అంతా క్లుప్తంగా చెప్పడానికి కుదరనంత అద్భుతంగా వుంటుంది. ఆ తర్వాత మిగిలింది అటు కోసల రాజు సుమిత్రుడు. ఇటు మగధ మహారాజు మహానంది కొడుకయిన కాలాశోకుడు.

 horseride  Cheeta    
Like Reply

చివరి అధ్యాయాలలో వాళ్ళిద్దరితో రాక్షసుడి సంభాషణా, వాళ్ళిద్దరినీ ఇక ఏమీ చేయలేని ఇరకాటంలోకి నెట్టేసే చమత్కారం చాలా బాగుంటాయి. చదివి తీరవలసినదే. ఆసరికి కాలాశోకుడికి విషయం చాలావరకూ అర్ధమవుతుంది. కానీ తన చేతుల్లో ఏమీ మిగలదు. అప్పటికే చేయి దాటిపోతుంది.

చివరికి మహానంది కుమారులైన రిపుంజయుడు, కాలాశోకుడు, విధుసారుడు వీళ్ళు ముగ్గురూ కూడా చిత్రమైన పరిస్థితులలో మరణిస్తారు. ఎలా చనిపోయారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. చివరికి మహారాజు మహానంది మరణమూ అలాగే జరుగుతుంది. రకరకాల కథలు వినిపిస్తాయి. నందుడు రాజవడం తనకి యిష్టమేనని చనిపోయేముందు మహారాజు చెప్పినట్లుగా సాక్ష్యాలు పుడతాయి.

నందుడు రాజవుతాడు!!
ఇలా ఆద్యంతమూ ప్రతి అధ్యాయమూ చాలా ఉత్కంఠభరితంగా నడుస్తుంది కథ.
నవలలో ఆసక్తికరంగా అనిపించిన సంఘటనలు, సంభాషణలు చాలా వున్నాయి. ఒకటి రెండిటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను.

మిథిల రాజు ఉశీనరుడి గురించి చెప్తూ సర్వ బౌద్ధమత సిద్ధాంతాలనీ ఆయన విమర్శిస్తాడనీ, అయితే ఆయనంతట ఆయన వాని విమర్శకు పోడనీ, ఎవరైనా అర్హతులు వెళ్ళి ఆయన్ని కదిలిస్తే మాత్రం ఆయన చెప్పే వాదనలకి సమాధానం చెప్పలేక తిరిగి వస్తారనీ అంటారు రచయిత.

బౌద్ధమతము యొక్క ప్రధమ సిద్ధాంతము కార్యకారణ చక్రము. అజ్ఞానము క్రియగా పర్యవసించును. అది విజ్ఞానమగును. నామరూపములు వహించును. షడింద్రియములు, స్పర్శ, అనుభూతి, ఆశ, గ్రహణము, పరిణామము, జన్మము, దుఃఖము – నిట్లు మారుచుండును. దుఃఖమును చంపినచో అజ్ఞానము నశించునని వారి ప్రధమ సిద్ధాంతము. దీనిని బౌద్ధులయిన అర్హతులు చెప్తే విని ఉశీనరుడు చిరునవ్వు నవ్వుతాడు.

కొంత చమత్కారంగా ఒక ఉదాహరణ చెప్తాడు. మొట్టమొదట జిహ్వ మీద రుచి అనేది ఉన్నది కనుక కూర చేసుకోవాలి అనే సంకల్పం పుడుతుంది. దానినుండి ఒక శాకము, దానిని ముక్కలుగా తరుగుట, కడుగుట, వేడి చేయుట, తిరుగమూత, లవణాది మిశ్రమమును కలుపుట, – యివన్నీ పుట్టాయి. జిహ్వయందలి రుచి నుంచి యివన్నీ పుట్టాయి. కాబట్టి లవణాది మిశ్రమమును తొలగించినచో రుచి నశించును. – ఈ వాదన విని చర్చకు వెళ్ళిన అర్హతుడు వెలతెల పోతాడంటారు విశ్వనాథ.

అయితే ఇలా హాస్యంగా తేల్చేయడం సరైన వాదనా పధ్ధతి కాదని అంటూనే కాని ప్రతిస్పర్ధి యొక దుష్టసిద్దాంతమును ప్రతిపాదించి నపుడు, పాత వస్తువునే కొత్తవస్తువుగా దీపింపచేయబోయినపుడు పండితుడైన వాడేమి చేస్తాడు? అని అడుగుతారు.

“అజ్ఞానము, కర్మ, దుఃఖము యివన్నీ వేదాల్లో వున్నాయి. ఉపనిషత్తులలో వున్నాయి. శాస్త్రాల్లో, పురాణాలలో వున్నాయి. అవి ఏవో కొత్త విషయాలుగా అర్హతులు తెచ్చి ఉశీనరుడి దగ్గర చెప్తే మరి అతనేం చేస్తాడు?” అని ప్రశ్నిస్తారు. నిజమే కదా అనిపించింది నాకు.

మరొక చోట చెప్తారు. సృష్టిలో యిద్దరుంటారట. ఒకడు విద్య ప్రదర్శించెడి వాడు. రెండవవాడు ఆనందించెడి వాడు. “విద్యా ప్రదర్శనము చేసెడి వాడు స్వాహంకార నిష్ఠుడు. విద్యను చూచెడి వాడు స్వానందనిష్ఠుడు. వీరిద్దరిని మించి సృష్టి లేదు. సర్వసృష్టియు వీరినాశ్రయించియే జరుగుచున్నది. వీరిద్దరిలో స్వానందనిష్టుడు నిష్క్రియుడు. వాడు చేసెడిదేమియు లేదు. ఆ స్వానందనిష్టతా లక్షణము భిక్షుక లక్షణము, సన్న్యాసి లక్షణము! స్వాహంకారనిష్టతా లక్షణము సంసారి లక్షణము. స్త్రీ ధనాధికార వాంఛాదుల లక్షణము! మానవుడు స్వానందనిష్టతా లక్షణము నందు వ్యగ్రుడు కాడు. స్వాహంకారనిష్టతా లక్షణము నందు వ్యగ్రుడు. ఇదియే లోకమునకు పరలోకమునకు భేదము. …. ఈ ధర్మములు భిన్నములుగా కనిపించినను ఒక్కొక్కప్పుడొక్కడే పురుషుడు స్వాహంకారనిష్టుడు, మరియొకవేళ స్వానందనిష్టుడు! స్వానందనిష్టత యందుకంటె స్వాహంకారనిష్టత యందు మానవులకు నభిరుచి ఎక్కువ. లోకముయొక్క కీడంతయు నచ్చటనున్నది.”
*****

 horseride  Cheeta    
Like Reply

ఇన్సెస్ట్ కధలు తెలుగు లో, ఇంగ్లీషులో తక్కువగా వున్నాయి. హిందీ లో చాలా ఎక్కువ గ వున్నాయి. కారణం?

బావ సహాయంతో లేదా బావకు తెలికుండా అక్కను దెంగే కధలు రాయండి. చాలా కసిగా ఉంటాయి. 
Like Reply

(18-02-2019, 04:41 PM)Jessicaranihorny Wrote:  ఇన్సెస్ట్ కధలు తెలుగు లో, ఇంగ్లీషులో తక్కువగా వున్నాయి. హిందీ లో చాలా ఎక్కువ గ వున్నాయి. కారణం?

నేను కూడా గమనించాను కానీ ,ఎందుకో నాకూ అర్ధం కాలేదు.

 horseride  Cheeta    
Like Reply

(18-02-2019, 10:27 AM)sarit11 Wrote:  తర్వాత పాంచాల రాజ్యం. భారత యుద్ధములో త్రిగర్త కాంభోజాభిసార మద్ర కేకయాధిపతులు వధించబడ్డారు. ఇంచుమించుగా ఆ రాజ్యాలన్నీ పాంచాల దేశంలో కలిశాయి. శకుని వధతో గాంధార దేశం ప్రాబల్యమూ తగ్గిపోయింది. దశార్ణ దేశములు రూపుమాసి పోయాయి. పాంచాలరాజ్యమొక్కటే పెద్ద రాజ్యం. భారత యుద్ధం తర్వాత దృష్టద్యుమ్నుడి వంశం వారు దాన్ని పాలిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళ తర్వాత అంటే దాదాపు 1500 ఏళ్ళ తర్వాత బాహ్లిక దేశంలోని నలగిరి అనే జనపదం నుంచి వంశధరుడు అనే వాడు నేను పాంచాల రాజ్యానికి అసలైన వారసుడిని అంటూ వస్తాడు.

...............................
...............................


ఆ తర్వాతి అధ్యాయంలో కాలక, ఏకలింగ, శూరసేన రాజ్యములు మూడూ ఒకేసారి క్షత్రియకుమారుడన్న వాడు మిగలకుండా సమసి పోతాయి. ఆ అధ్యాయం, పథక రచన అంతా క్లుప్తంగా చెప్పడానికి కుదరనంత అద్భుతంగా వుంటుంది. ఆ తర్వాత మిగిలింది అటు కోసల రాజు సుమిత్రుడు. ఇటు మగధ మహారాజు మహానంది కొడుకయిన కాలాశోకుడు.

ఇవన్నీ మీరే టైప్ చేస్తున్నారా బావగారూ...
Like Reply

^ లేదండీ. ఆసక్తి ఉన్న మిత్రులకి ఉపయోగపడతాయని ఇక్కడ పొందుపరుస్తున్నారు :)
Like Reply

చంద్రగుప్తుని స్వప్నము – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

[Image: uDIwwjL7_o.jpg]


వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
******
ఈ నవల పీఠిక లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇది అయిదవ నవల.

దీనికి ముందరిదైన “నందోరాజా భవిష్యతి” లో రాక్షసుడు అనే బ్రాహ్మణుడు నందునికి రాజ్యాన్ని సంపాదించి పెట్టడం, సర్వ భారత దేశాన్ని అతనికి వశం చేసి పెట్టడం వుటుంది. నందవంశం 100 ఏండ్లు పాలించిన తర్వాత మౌర్య చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు క్రీ.పూ 1534 లో. ఆయన మంత్రి చాణుక్యుడు. ఈ నవలలో చాణుక్యుడు నందవంశాన్ని ఎలా నిర్మూలించాడో చెప్పబడింది.
పాశ్చాత్య చరిత్రలో గ్రీకు రాజైన అలెగ్జాండరు, మౌర్య చంద్రగుప్తుడు రాజ్యము చేస్తుండగా భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడని వ్రాయబడి ఉంటుంది. అది అభూతకల్పన! అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినది క్రీ.పూ 327 ప్రాంతాలలో. మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజ్యాన్ని పాలించినది క్రీ.పూ 1534 నుండి 1500 వరకు. అతని కొడుకు బిందుసారుడు. ఆ బిందుసారునికి శిశునాగ వంశము లోని బింబిసారునికి సంబధము లేదు.


 horseride  Cheeta    
Like Reply

ఈ చంద్రగుప్తుడు ఆ చంద్రగుప్తుడు కాడు. ఇది చంద్రగుప్తుడన్న పేరు చూసి పాశ్చాత్యులు చేసిన కల్పన! ఈ సంగతి స్పురింపచేయడానికి ఈ నవల చివర్లో మౌర్య చంద్రగుప్తుడు తన తరువాత 1300 ఏండ్లకు జరుగబోవు అలెగ్జాండరు దండయాత్రని స్వప్నం లో చూశాడన్న కల్పన వుంటుంది.

ఈ కాలములో ధృడముగా నమ్మబడుతున్న ఈ విషయం నిరాలంబమైన కాలంలో వెనుకగా తట్టి, చంద్రగుప్తునికి కలగా వచ్చిందని కల్పన. పైన చెప్పినవన్నీ ఈ నవల పీఠిక లోని విషయాలే. ఈ విషయాన్ని అచ్చంగా విశ్వనాథవారి మాటల్లో చెప్పాలంటే.. “కాలము నిత్యమైనది, ప్రవాహమువంటిదని అర్ధము. సముద్రము పోటు పొడిచినచో, అది కొన్ని మైళ్ళ దూరము ఉప్పునీరగును కదా! ఆ రీతిగా చంద్రగుప్తునకు స్వప్నము వచ్చెను.”

ఈ నవలలో కథ తక్కువే. నందుడికీ ముర అనే శూద్ర స్త్రీకి పుట్టినవాడు చంద్రగుప్తుడు. అతను కాక నందుడికి మరొక ఎనిమిది మంది పుత్రులు.. ఎనిమిది మంది క్షత్రియ స్త్రీల ద్వారా పుట్టినవారు వుంటారు. పెద్దవాడు సుమాల్యుడు. అయితే అతని తల్లి పట్టమహిషి కాదు. ఏ రాణికీ పట్టమహిషి హోదా వుండదు.

నందుడికి ముర మీద, చంద్రగుప్తుని మీద ప్రేమ వున్నప్పటికీ, క్షత్రియ స్త్రీల ద్వారా పుట్టిన అతని ఇతర సంతానానికి చంద్రగుప్తుడితో శత్రుత్వం వుంటుంది. అందువల్ల దుర్భేద్యమైన కారాగారంలో చంద్రగుప్తుడిని పద్నాలుగేళ్ళపాటు బంధించి పెడతారు.

ఆ కారాగారం నుంచి చంద్రగుప్తుడు తప్పించుకోవడంతో కథ మొదలవుతుంది. రాజుకి శత్రువు కనుక ఆ క్షణంలో అతనికి రాజ్యంలో వున్నవారంతా శత్రువులే. అయితే చంద్రగుప్తుడు తన చిన్ననాటి స్నేహితుడయిన వసుమిత్రుడు తనకి సహాయం చేయవచ్చునని వూహించి ఎవరి కంటా పడకుండా అతని యింటికి చేరతాడు. అతను వూహించినట్లే వసుమిత్రుడతనిని ఆదరించి, ఆశ్రయమిస్తాడు. కలాలి అనే మరో చిన్ననాటి స్నేహితుడినీ కలుపుతాడు. రాజ్యంలోని పరిస్థితులన్నీ వివరించి చంద్రగుప్తుడిని రాజుని చేయగలవాడు విష్ణుగుప్తుడు (చాణుక్యుడు) ఒక్కడేనని చెప్పి అతని దగ్గరకి తీసుకువెళ్తాడు.

విష్ణుగుప్తుడు బ్రాహ్మణుడు. ఆ రోజులలో ఇంకే బ్రాహ్మణుడూ చదవని పాణినీయం అనే వ్యాకరణ శాస్త్రాన్ని ఆయన చదివాడు. ఆయన దృష్టిలో పాణినీయం చదివినవాడే పండితుడు. పాణిని అనే మహర్షి తాను రచించిన ఆ గ్రంధంలో అనంతమైన సంస్కృత భాషా శబ్దాల స్వరూపాన్ని ఎనిమిది అధ్యాయాలలో బిగించి పట్టాడట. విష్ణుగుప్తుడు పాణినీయం లోనే కాక జైమినీయ సూత్రాలలోనూ పారంగతుడు. వ్యాసుడు వ్రాసిన బ్రహ్మసూత్రములందూ నిష్ణాతుడట.

దేశంలో అందరూ పండితులే కానీ వికృతమై భ్రష్టములైన పాళీ భాష లోని శబ్దాలు ఆనాటి బ్రాహ్మణులు వాడుతూ వుండేవారు. విష్ణుగుప్తుడు వాళ్ళందరినీ పరిహసించే వాడు. ఆయన ముందు ఎవరూ నిలవలేక పోయేవారు.

రాజ్యంలోని పరిస్థితుల గురించి, నందుడి గురించి వసుమిత్రుడు చంద్రగుప్తుడికి వివరంగా చెప్తాడు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)