Thread Rating:
  • 4 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మిక చింతన
#21
సప్త జ్ఞాన భూమికలు.....

సూర్యుడి నుండి వచ్చే ఏడు కిరణాలు ను సప్త జ్ఞాన భూమికలు అంటారు...

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటిని సప్త జ్ఞాన భూమికలు అంటాం...

1) శుభేచ్ఛ
2) విచారణ
3) తనుమానసం
4) సత్త్వాపత్తి
5) అసంసక్తి
6) పదార్ధభావని
7) తురీయం

..అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

1) శుభేచ్ఛ...

నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

2) విచారణ...

బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి.. అన్న మీమాంస "బ్రహ్మజ్ఞాన" ప్రాప్తి విధానమే.. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

3) తనుమానసం...

ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే "తనుమానసం"

4) సత్త్వాపత్తి...

శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే...

     "తమోగుణం" అంటే సోమరితనం,
     "రజోగుణం" అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

5) అసంసక్తి...

దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

6) పదార్ధభావని

అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

7) తురీయం...

ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే "బుద్ధుడు" అంటాం. ఇదే "సహస్రదళకమలం".

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా "సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది". ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

"తురీయం" అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం. అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి...


|| ఓం నమః శివాయ ||

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.
 
తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.
ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య M. S. Subbu Lakshmi గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో, ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.

అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలుపెట్టినా, గుడి కి వచ్చిన ప్రతిసారి ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది.

కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహం లో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.

ఇంతలో గుడి లో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి, నవ్వి, నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడి లో చూడలేదుకదా అన్న సందేహం తో కూడిన ఒక నవ్వు నవ్వాను.

కొత్త పూజారి గారు: నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఎమన్నా ఉంటే చెప్పు పర్లేదు.

నేను ఎప్పుడూ చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి
నేను: అబ్బే అలాంటిది ఏమి లేదండి.

 కొత్త పూజారి గారు: మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి ముయ్యడానికి ఇంకా సమయం ఉంది బాబు. పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను.

ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.

నేను: పెద్దవాళ్ళు, గుడి కి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి. నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.

కొత్త పూజారి గారు: (గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరు లో ఉన్నావు. కాని ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుసా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.
భగవంతుడిని నాన్న అమ్మ తో పొల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.

నేను: భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడి కి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరు ?

కొత్త పూజారి గారు: నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరం గా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్ లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా?కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.

నేను: కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?

కొత్త పూజారి గారు: నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందం లో మీ కుటుంబ సభ్యులకి ఎదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఎదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దెవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ క్రిష్ణుడు.
నేను: ఎదైనా పని మొదలు పెట్టే ముందు, దెవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దెవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఎమంటారు?

కొత్త పూజారి గారు: నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ,ఎకాగ్రతతో ఆలోచించి,పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ,నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా?నిజానికి కాఫీ, నిశబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దొహదపడ్దాయి అంతే. దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దొహదపడేది కాదంటావా?
నేను: మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?
కొత్త పూజారి గారు: మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమా కి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపం తో తిడతారా లేదా ? అలా ప్రేమగా కొప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?
ఇవన్ని విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.

తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వం తో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.

ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడి కి వెళ్లాను కాని ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.

నేను: పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా ?
గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు: కొత్త పూజారి గారా ? ఎవరు బాబు ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబు గుడిలో. నాతో పాటు ఇంకో పూజారి ఎవరు లేరు బాబు.

నేను: లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా.
అని అంటూ, ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం ఉందని అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా.
ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.

అమ్మ: ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?

 నేను: హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#23
కర్మ బంధం - శరీరానికా, ఆత్మకా ?

కర్మ ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు అని చెప్తున్నారు.

మరి కర్మ ఫలితం ఎవరిని బంధిస్తుంది, శరీరాన్నా, ఆత్మనా? సరైన సందేహమే కదా! దీనికి దాదాశ్రీ ఇలా సమాధానం చెప్పారు.
అసలు శరీరం అంటేనే కర్మ ఫలితం కదా, ఇక దాన్ని మళ్ళీ బంధించడం ఏముంటుంది? ఉదాహరణకి ఒకరు జైల్లో ఉన్నారనుకో, బంధనం దేనికి, జైలుకా లేక లోపలున్న వ్యక్తికా? అలాగే ఈ శరీరమే కారాగారం అయితే, ఆ లోపలున్న వ్యక్తికే బంధనం అన్నమాట! అయితే ఈ వ్యవహారంలో ఆత్మకు ఏ సంబంధం ఉండదు. అది స్వేచ్చగా, స్వతంత్రంగా ఉంటుంది. కానీ అపోహల ద్వారా పుట్టే అహంకారం – ఇగో ఉంటుందే, అది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నువ్వే పరిశుద్ద పరమాత్మవు అయి వుండి కూడా సుబ్బారావనో, సుబ్బమ్మ అనో అనుకుంటూ ఉంటావే అది అహంకారం.

ఇదిగో ఆ అహంకారమే కర్త్రుత్వానికి దారి తీసి, కర్మ ఫలితం అనుభంవించేలా చేస్తుంది. ఆ అహంకారం వీడినప్పుడు నువ్వు మళ్ళీ యధాస్థితికి వెళ్తావు, ఇక బంధనం ఉండదు.
అసలు కర్మ కి – ఆత్మకి ఉండే సంబంధం ఎలాంటిది ?
కర్తృత్వం లేక పొతే రెండూ వేరు పది పోతాయి. దేని స్థానంలో అది ఉంటుంది. కర్తృత్వం లేకుండా కర్మ లేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. నువ్వు కర్తవు కానప్పుడు నువ్వేం చేసినా నువ్వు కర్మకు బద్దుడవు కావు. ఆత్మా, కర్మ వేరుగా ఉన్నప్పటికీ ఈ కర్తృత్వం అనేది వాటిని కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ చేసే ‘నేను’ లేకపోతె రెండూ వేర్వేరు గానే ఉంటాయి.
మనకి బయటి ప్రపంచంలో కనపడి జరిగే ప్రతి విషయం ఫలితమే.

కర్మ ఎప్పుడో జరిగిపోయింది. దాని ఫలితమే మనం చూస్తున్నాం. ఉదాహరణకు మీరు పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశారు. ఇక ఫలితం రావడమే తరువాయి. పరీక్ష పేపర్ ఇచ్చాం అంటే ఏదో ఫలితం రావాల్సిందే కదా – ఇక దాని గురించి దిగులు ఎందుకు? అంటే మనం ఫలితం ఒకలా రావాలని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం అన్నమాటేగా! ప్రపంచం మొత్తం ఇలాగే ఫలితాల గురించే మధన పడుతోంది.

కర్మ, ఫలితాల ఈ చక్రానికి మరి ఆది ఏది? ఇది ఎలా మొదలైంది ?
ఓ పూసల దండ ఉంది, దానికి ఆది ఏది,తుది ఏది? అలాగే ఈ చక్రంలో మొదలు, తుదలు లేదు. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ మొదలైంది అంటే ఎప్పుడు వివేకం లేదా ప్రజ్ఞ మొదలైందో అక్కడ మొదలైంది, ప్రజ్ఞ ముగిసినప్పుడు ఇది కూడా ముగుస్తుంది. అలా కాదంటే దీనికి మొదలే లేదు. ప్రజ్ఞ ఉన్నప్పుడే నేను చేశాను అన్న భావన, దాన్ని బట్టి కర్మ, దాన్ని బట్టి ఫలితం.

జన్మాంతరాల నుంచి చేసిన ఈ కర్మలన్నీ ఒకే జన్మలో ఫలితం ఇవ్వవు కదా – అంటే వీటిని జన్మజన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నామా? ఈ కర్మలన్నీ ముగిస్తేనే కదా మోక్షం?
ఒక జన్మలో ఫలితాలన్నీ అనుభవించేసాక ఆ శరీరం పతనం అవుతుంది.

కానీ ఈ జన్మలో చేసిన కర్మలు మళ్ళీ బంధిస్తాయి కదా – మరింక మోక్షం ఎక్కడిది? ఎప్పుడు కర్తృత్వం అంతమై, నేను పరిశుద్ధ ఆత్మను అనే అపరిమితమైన ఆనందం పొందగాలుగుతామో అప్పుడు ఈ కర్మ – ఫలితాల చక్రం నుంచి బయటకు వస్తాం. ఆలా కాక నేను చేశాను అని అనుకున్నంతసేపూ ఆ ఫలితాలకు బాధ్యత వహించి జననమరణాల చక్రంలో తిరుగాడుతూనే ఉంటాం!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#24
మనసా... వాచా... కర్మణా...[Image: IMG-20191201-081855.jpg]

త్రికరణశుద్ధి అంటే ఏమిటి?
త్రికరణాలు అంటే ఏమిటి?

1. మనసా ( మన ఆలోచన, సంకల్పం )
2. వాచా ( వాక్కు ద్వారా, చెప్పినటువంటిది )
3. కర్మణా (కర్మ, చేతల ద్వారా )

మనలో చాలామందికి మనస్సులో
ఒక సంకల్పం ఉంటుంది.
అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక
మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా
మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక,
చెప్పిన పని చెయ్యలేము.
మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము.
అది ఏది పడితే అది ఆలోచించి మాట్లాడి
చేసెయ్యడం కాదు.
ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన,
అందరికీ ఉపయోగి పడే కర్మ ఉండాలని
శాస్త్రం చెబుతుంది.
అదే త్రికరణశుద్ధి.

త్రికరణశుద్దిగా చేసిన పనులకు..
దేవుడు మెచ్చును లోకము మెచ్చును”
అని హెచ్చరిస్తాడు అన్నమాచార్యుడు.
ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి. మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి
ఇది తెలిసి ఉండదా?

ఒకసారి పురందరదాసులవారిని ఎవరికీ తెలియకుండా అరటిపండు తినమని వారి గురువుగారు చెప్పగా, దేవుడు లేని ప్రదేశం కానీ, అంతరాత్మ చూడని చోటు కానీ తనకు కనబడలేదని చెప్పగా గురువుగారు
ఎంతో సంతోషించి ఆశీర్వదించారు.

ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే కర్మ.
అది మనకోసమే కదా.
అనుకున్నది చేప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం
అభ్యాసం మీద కానీ రాదు.
అన్నీ మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం.

ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం.
చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు అని చిన్న బొమ్మలను అందరూ చూసి ఉంటారు.
ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు
మూడు ఉంటాయి.
సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు. పైన ఒక చిన్న రంధ్రంనుండి మనం పైసలు లోపలకు వేస్తాము. చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి
వీలు ఉంటుంది.
మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం
కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము. దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకున్టున్నట్టు మనం ప్రోది చేసుకుంటూ ఉంటాము.
అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక,
ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు.
ఎప్పుడైతే ఈ మూడు సరిగ్గా సరిపోతాయో
అప్పుడు ఆ గని తెరువబడి దైవానుగ్రహం అనే
సుధాధార మనమీద వర్షిస్తుంది.

మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము.
ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం, చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం.

ఇంతేకాదు ఆది కాయిక మరియు మానసిక సంఘర్షణకు లోను చేసి ప్రశాంతతను ఇవ్వదు.
సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది.
కానీ ఇవి హాని కలిగించే పాపాలు కావున
వీటిని త్యజించి మనలో ఎల్లప్పుడూ కేవలం
సుకర్మలు మాత్రమె శుద్ధిగా జరిపించాలని
త్రికరణశుద్ధిగా ఆ భగవంతుని
వేడుకుంటూ ఉండాలి.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#25
శివుడు నవ్వుతున్నాడు![Image: 06c5c84c66311d08c2d7449a4cb01b5c.jpg]


శ్రావణి రొట్టెలు చేస్తూ చేస్తూ ‘ఓం నమశివాయ’ అని జపం చేస్తున్నది. విడిగా పూజ కోసం సమయం వెచ్చించటం కుదరట్లేదు పాపం ఆమెకు. అందువల్ల పని చేస్తూ చేస్తూ శివనామాన్ని తలుచుకునేది.
ఇంతలో ఒక్కసారిగా ధబ్బుమని గట్టిగా శబ్దం వచ్చి పెద్దగా బాధాకరమైన అరుపు వినిపించింది. ఆమె ఇంటి ప్రాంగణం వైపు పరుగుపెట్టి చూసేసరికి గుండె ఆగిపోయినంత పనైంది... తన ఎనిమిదేళ్ళ బాబు రక్తంతో తడిసి పడి ఉన్నాడు. గట్టిగా అరిచి ఏడవాలి అనిపించింది. కానీ ఇంట్లో ఆమె తప్ప ఎవరు లేరు. ఏడ్చి మాత్రం ఎవరిని పిలవగలదు? ఇటు బాబును కూడా చూసుకోవాలి కదా. పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళి బాబుని చూసింది. సగం స్పృహలో “అమ్మ... అమ్మ...” అని కలవరిస్తున్నాడు. ఆమె లోపల మాతృవాత్సల్యం కళ్ళలో నుండి జాలువారి తన అస్తిత్వాన్ని తెలియచెప్పింది.
పదిరోజుల క్రితం చేయించుకున్న అపెండిక్స్ ఆపరేషన్ ను కూడా పట్టించుకోకుండా, ఎక్కడినుంచి అంత శక్తి వచ్చిందో మరి, బాబును భుజాన వేసుకుని, ఆ వీధిలోనే ఉన్న వైద్యాలయానికి పరుగు పెట్టింది. దారి అంతా మనసారా భగవంతుని తిట్టుకోసాగింది.
“ఓ భగవంతుడా! నీకు ఏమి అన్యాయం చేశాను? నా పిల్లవాడికి ఇంత గతి పట్టిస్తావా?” అని ఉక్రోషంతో ధుమధుమలాడింది.
సరే, అక్కడ డాక్టర్ కలిశాడు, వేళకు చికిత్స అందింది. దెబ్బలు ఎక్కువ లోతుగా తగలలేదు. బాబుకి కూడ నయమైపోయింది. అందువల్ల ఎక్కువ ఇబ్బంది కలగలేదు..
రాత్రికి ఇంటిదగ్గర అందరూ టీవీ చూస్తున్నారు. అప్పుడు శ్రావణి మనస్సు ఉద్విగ్నంగా ఉంది. భగవంతుడంటే విరక్తి కలగసాగింది. ఒక తల్లి మమకారం భగవంతుని ఉనికిని ఎదిరిస్తోంది. ఆమె బుర్రలో ఆరోజు జరిగిన ఘటనాక్రమం అంతా చక్రంలాగా తిరగింది.
బాబు ఇంటిముందు ఎట్లా కిందపడ్డాడో- తలుచుకుంటే అంతరాత్మ కంపించింది. నిన్ననే పాత మోటరు పైపు ప్రాంగణం నుండి తీయించివేశారు. సరిగ్గా అదే స్థలంలో బాబు కిందపడ్డాడు. ఒకవేళ నిన్న మేస్త్రీ రాకపోయి ఉంటే? ఆమె చేయి ఒక్కసారి తన పొట్ట దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఆ చోట కుట్లు పచ్చిగానే ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది.! ఆమె 20-22 కిలోల బాబును ఎట్లా అరకిలోమీటరు దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. బాబు పువ్వు లాగా తేలికగా అనిపించాడప్పుడు. ఆమె బట్టల బొక్కెనను పట్టుకుని మిద్దెదాకా తీసుకొని వెళ్ళలేక పోతుందే మామూలుగా అయితే.!.
మళ్ళీ ఆమెకు గుర్తుకు వచ్చింది--డాక్టర్ గారు రోజూ రెండు గంటల వరకే ఉంటాడు. ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు మూడు గంటలు దాటింది. ఆమె వెళ్ళంగానే చికిత్స జరిగింది. ఎవరో ఆయనను ఆపి పెట్టినట్టుగా ఆయన ఉన్నాడక్కడ..
అప్పుడు భగవంతుని చరణాలపై ఆమె తల శ్రద్ధగా వాలింది. ఇప్పుడామెకు మొత్తం ఆట అంతా అర్థమయింది. మనస్సులోనే పరమాత్ముని తన తప్పుడు మాటలకు క్షమాపణ కోరింది. టీవీలో ప్రవచనం వస్తున్నది-

భగవంతుడు ఇట్లా అంటున్నాడు- “నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను. కానీ నీకు దానిని సులువుగా దాటటానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చేయగలను. కేవలం ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. అంతే!"
శ్రావణీ ఇంట్లో దేవ మందిరం వైపు చూసింది- 'శివుడు నవ్వుతున్నాడు.'


సర్వేజనా సుఖినోభవంతు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#26
కృతజ్ఞత.....


“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరిక సంస్కారం...

వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు. రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం.. ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.

మహా భారతంలో.. దగ్ధమైన లాక్షాగృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో .. “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.

“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”.. అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.

ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా, దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది. దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి.. "ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటి పెట్టుకున్నావెందుకు..?" అని అడిగాడు.

అపుడాశుకం "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా!" అంది. తాను మానుషరూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకో గలిగిందని ఆశ్చర్య పోయి.. "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు. అపుడా మహాశుకం "ఈ వృక్షానికి మేలు చెయ్యి చాలు" అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.

ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు, ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#27
మాలిన్యం
[Image: IMG-20191208-211730.jpg]

ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది.
అతను ఎన్నోతీర్థయాత్రలు చేసాడు.
ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు.

కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు.

భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.

ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు

మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూసాడు.” ఓ సూర్యుడా! నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. దేవుడు ఎక్కడ దాక్కున్నాడు? అన్నిచోట్లా ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు” అన్నాడు.

ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు.

ఆ మనిషి నిట్టూరుస్తూ ” ఎప్పటికైనా నేను దేవుడిని చూడగలనా?” అని అడిగాడు.

నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు.

కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు.
” ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేసారు?” అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. “ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది.

ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు.

ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.

నాచు నీటిలో నుండే వచ్చింది కాని అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు.

అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు.

అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది.

పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు, నిప్పు, సూర్యుడు ఇంతకుముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు. కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.

స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది....

ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరచిపోతున్నాడు. ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి తన హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాము.

ఆ దేవదేవుడు ఎక్కడో లేడు మనలోనే వున్నాడు. కనుక, ఎక్కడెక్కడో వెతక్కుండా నీ మనసుని తరచి చూడు.
ఆ భగవత్సాక్షాత్కారం తప్పక లభిస్తుంది.
      

సర్వేజనాః సుఖినోభవంతు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#28
గమ్మత్తైన పద్యం!

[Image: IMG-20191212-102600.jpg]
                
      పూర్వం ఒక విష్ణు భక్తుడికి రామచంద్ర ప్రభువంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు కూడా ఎత్తేవాడు కాదు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని.

సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.

"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో..." అంటూ.

ఆ పద్యం ఈ విధంగా వుంది...

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥


ఆ రామభక్తుడు ఆశ్చర్యపోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది?

పరమేశ్వరః నః పాయాత్  అని.

అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం .

తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలే...
ఇప్పుడు ఆ పద్యం అర్ధం చూద్దాం,
'గవీశపాత్రః'... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

'నగజార్తి హారీ'... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.  

'కుమారతాతః'... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

'శశిఖండ మౌళి:'... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడు, అంటే శివుడే!

'లంకేశ సంపూజిత పాద పద్మ:'... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడు

'అనాదిః' ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడు,

అటువంటి 'పరమేశ్వరః నః పాయాత్'.... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతిపోయింది ఆ విష్ణు భక్తుడికి.

వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.
కానీ, ఆ పండితుడు అగుపించలేదు.

చివరికి మరో పండితునికి ఆ పద్యాన్ని మార్చమని చూపిస్తే, "ఇది విష్ణువుని కీర్తించేదే నాయనా... ఏమీ అనుమానం లేదు" అని అతడితో అన్నాడు.

ఇది మరో ఆశ్చర్యం.

'అనాది' అనే మాటలో ఉంది కిటుకు అంతా... చూడండి.

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.

ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.  

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక    అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి.

సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు.

సర్వదేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  

అలాగని శివుడు, విష్ణువు వేర్వేరు కాదు.

శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః


అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు.
శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు కొలువైవుంటారు — అని వేదం చెబుతుంది. ఇక్కడ భగవంతుడు ఒక్కడే కానీ అతని రూపాలు అనేకం అని మనం గ్రహించాలి!


~~~


ఇది మన భారతీయ కవితా వైభవము.

  లోకా సమస్తా సుఖినోభవన్తు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#29
యమధర్మ రాజుల వారికీ 
తప్పలేదు శాపం!
[Image: 220px-Dharmaraj_and_animandavya.jpg]

పిల్లలు ఒక వయసుకి వచ్చేవరకూ, వారికి మంచిచెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది. అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లనీ చూడలేం. కానీ 'ఎంతవయసు వరకూ ఓ పొరపాటుని బాల్యచాపల్యంగా భావించాలి?' అన్న ప్రశ్నకు మహాభారతంలోని ఓ కథ స్పష్టమైన సమాధానం చెబుతుంది.
పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టినవాడు, సకల పుణ్యక్షేత్రాలనూ దర్శించినవాడు. అలా సకలతీర్థాలనూ సందర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాండవ్యుడు. ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు.
మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు. ధనాగారానికి కన్నం వేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని వెంబడిస్తూ వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు.
రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటువెళ్లారంటూ, భటులు మాండవ్యుని అడిగారు. మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో, శీర్షాసనంలో ఉండటంతో దొంగల గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్తా, అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇటు మాండవ్యుని దాటుకుని ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులకు అక్కడ రాజుగారి సంపద యావత్తూ కనిపించింది.
మాండవ్యుని ఆశ్రమంలో సంపదని చూసిన రాజభటులకు అతను కూడా ఆ చోరీలో భాగస్వామే అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆ సొత్తునీ, మాండవ్యునీ కట్టగట్టి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కారు. తన కోశాగారాన్నే దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారు మరణదండనను విధించారు. వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు.
తనకు శూలదండన విధించినప్పటికీ మాండవ్యుని తపోనిష్టలో ఎటువంటి మార్పూ రాలేదు. కారాగారంలో నరకయాతనను అనుభవిస్తున్న మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు. శూలం గుచ్చుకుని కూడా చనిపోకుండా తపోనిష్టని కొనసాగించడం, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి... మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కలిగింది.
మాండవ్యుని వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. అపార్థంతో తను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకున్నాడు. అయితే మాండవ్యుని నుంచి శూలాన్ని తీసే సమయంలో దాని మొన (అణి) మాత్రం ఆయన గొంతుకలో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయనను అణిమాండవ్యుడు అని పిలవసాగారు.
‘ఇదంతా నా ప్రారబ్ధ కర్మ ఫలితమే!’ అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు. యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు, యమధర్మరాజుని కలుసుకోవడం తటస్థించింది.
‘యమధర్మరాజా! నాకు తెలిసి నేను ఏ తప్పునూ చేయలేదు. మరి అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపమేమిటి?’ అని యముడిని అడిగాడు మాండవ్యుడు.
యముడు ‘మాండవ్య మహర్షీ! మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్లు గుచ్చి ఆనందించేవారు. ఆ తప్పుకి ఫలితంగానే శూలదండనని అనుభవించారు,’ అని వివరించాడు యమధర్మరాజు.
ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ- ‘యమధర్మరాజా! చిన్న పిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా! అలాంటివాని తప్పులకు తీవ్రమైన శిక్షలను విధించడం ఎంతవరకు భావ్యం? ఇక మీదట 14 ఏళ్లలోపు పిల్లలు తప్పుచేస్తే దానిని పెద్దమనసుతో క్షమించాల్సిందే! అలా కాదని వారికి పెద్దలతో సమానంగా శిక్ష విధిస్తే.... అలా శిక్ష విధించినవారికే ఆ పాపం చుట్టుకుంటుంది. అంతేకాదు! నేను తెలిసీతెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకుగాను నువ్వు మానవజన్మనెత్తుదువుగాక!’ అని శపించాడు.
అప్పటినుంచీ హైందవ సంప్రదాయం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతున్నారు. ఇక మాండవ్యుని శాపం వల్ల యమధర్మరాజు, విదురునిగా జన్మించాడు. 

నిన్నమొన్నటి వరకూ భారతీయ శిక్షాస్మృతిలో 18 ఏళ్లలోపు వారినే బాలనేరస్తులుగా పరిగణించేవారు. కానీ నిర్భయ హత్య తర్వాత ఆ వయసుని 16 ఏళ్లుగా కుదించారు. అది కూడా సరిపోదనీ.... 14 ఏళ్లు దాటినవారు ఎవరైనా తీవ్రమైన అపరాధం చేసినప్పుడు, కఠినదండనకు అర్హులే అని చాలామంది మేధావులు వాదిస్తున్నారు. కానీ ఎప్పుడో మహాభారతకాలంలో ఎవరు బాలనేరస్తులు, ఎవరు కారు అన్న విషయంలో ఓ స్పష్టత ఉండటం గమనార్హం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#30
జీవ పరిణామ దశావతారాలు
[Image: DYtcK5jVoAElbhl?format=jpg&name=small]

ఒక తల్లి తన నిత్యపూజలు పూర్తిచేసుకున్న తర్వాత విదేశాల్లో వుంటోన్న తన కుమారునికి వీడియో చాట్ చేసి అతను ఖాళీగా ఉన్నాడా లేడా అని కనుక్కుని అతనితో వీడియో చాట్ లో జరిపిన సంభాషణలు మీ--మన కోసం.
 తల్లి: నాయనా! పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు: అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో... మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను ఈ పూజలు అవి అంటే... ఏం బాగోదు.
తల్లి (మందహాసంతో): కన్నా! నాకు కూడా ఆ డార్విన్ గురించి కొద్దిగా తెలుసు. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా....
కుమారుడు (వ్యంగ్యంగా): అలాగా అమ్మ నాకు తెలీదే...!
అని అనటంతో అపుడు ఆ తల్లి — 'నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను' అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.  
'నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....'
కొడుకు నిర్లిప్తంగా 'అవును, తెలుసు.  దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం?' అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి, 'హా... సంబంధం ఉంది. ఇంకా నువ్వు, నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.
    మొదటి అవతారం మత్స్య అవతారం. అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.?'
 కొడుకు కొంచెం అలెర్ట్ అయ్యాడు. 'ఔన'ని తలూపి ఆసక్తిగా వింటున్నాడు.
  'తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
ఇక, మూడవది వరాహ అవతారం. అంటే పంది. ఇది అడవి జంతువులను, అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.
 ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామనుడు... అంటే పొట్టివాడు, అయినా ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో ఎరక్టస్ (homo erectes) మరియు హోమో సేపియన్స్ (homo sapiens) అని వున్నారు అని. వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.'
కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
తల్లి కొనసాగిస్తూ 'కన్నా ... ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు, గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచనపరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలను ఆచరించి చూపి సమస్త కుటుంబ బంధుత్వానికి నిర్వచనమైన ఆది పురుషుడు.
ఇక ఎనిమిదవది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ సుఖ-దుఃఖ లాభ-నష్టాలు అన్ని నేర్పినవాడు.'
కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు. ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ—
'తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం.
ఇక వచ్చేది కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికై వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.'
కొడుకు తన తల్లి మాటలకి అవాక్కయి ఆనంద భాష్పాలతో 'అమ్మ... సనాతన  ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం' అని అన్నాడు.

ఆత్మీయులారా !!!
మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్త్రీయత తో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి. రుషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం. మనం మారుదాం యుగం మారుతుంది...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#31
మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
ఈ సందర్భంగా ఒక చిన్న కథ మీకోసం.

అనగనగా ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బాల్టీని నోటితో కఱుచుకుని వెళ్తోందట... పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని ఆ నక్క ముందు వాలి, ఆ ఎరలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను. కానీ కొంత వెల అవుతుంది అన్నదట. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలీ, ఎంతవ్వాలి అని అడిగితే, నీ రెండు ఈకలు ఇస్తే, నేను ఒక ఎరను ఇస్తాను అని నక్క అన్నదట.గ్రద్ద 'ఓస్ అంతేనా!' అనుకొని తన రెండు ఈకలను పీకి ఇచ్చిందట.నక్క వాటిని తీసుకుని ఒక ఎరను తీసి ఇచ్చిందట. దాన్ని తింటూ 'ఆహా! ఎంత రుచిగా ఉంది. మళ్ళీ ఇంకొకటి తిందాం' అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట. అలా ఎరల రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎరలను కొంటూ వచ్చిందట ఆ గ్రద్ద.
చివరికు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి.అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకొని, నిజం తెలుసుకొనే లోగా తన ఈకలన్ని ఊడి, పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్ద పైబడి చీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని, దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద. 

సరిగ్గా మన జీవితంలో కూడా, మనల్ని ఆకర్షించి, ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను, భగ్నం చేసే  పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే  ఉంటాయి, ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణలు, ప్రలోభాల రూపంలో ఎదురవుతుంటాయి, ఎదుర్కోని తీరాల్సి వస్తుంది...

తాత్కాలిక సంతోషాలకోసం నూరేళ్ళ జీవితాన్ని పణంగా పెట్టకుండా ఏది శాశ్వతమో గ్రహించి అందుకోసం నిరంతరం ఏకాగ్రతతో పాటుపడితే జీవితం పరిపూర్ణమవతుంది.

సమస్త లోకా సుఖినోభవంతు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 4 users Like Vikatakavi02's post
Like Reply
#32
Some Common Superstitions in Indian Culture and the Real Facts Behind Them

1 No Haircut on Tuesday
[Image: main-qimg-98e8d39df802548cc18ebf80dfd117ce]



2 Bath after attending a funeral ceremony

[Image: main-qimg-fb49da2ca09be23c4b32ab34bb2d159a]



3 Don't look in a broken mirror

[Image: main-qimg-e0004fedd796c1439ee02e0c2f3551e5]



4 Sweeping the floor during the evening brings bad luck

[Image: main-qimg-b9a8508a57e8d4786b7c43c444e36ecf]



5 Crush the snake head after killing it .

[Image: main-qimg-70333a355081650e6ec2cf580ff03333]



6 Don't cut nails after Sunset .

[Image: main-qimg-e535256aaa0a840cd2e2fb88b4f92571]



7 Don't step out during an Eclipse

[Image: main-qimg-7ffe42da4106d7aca59002e4ea7c5cdf]



8 Swallow tulsi leaves never chew them

[Image: main-qimg-7b35c4c7ee748df9dd816e0394ffa22b]



9 Eat curd and sugar before heading out for good luck

[Image: main-qimg-626151aaf87cb3f7b4f1897c4749f6b8]



10 Don't go near a tree in the night

[Image: main-qimg-4c5168ea363c6a5a1b4f0993a9acfb24]



గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#33
11 Girl not allowed to work during menstruation

[Image: main-qimg-ba0730e56ab3adc7850cf52bcf8c0105]



12 Pregnant women not allowed to go out in Eclipse

[Image: main-qimg-c08c11854afbf9dc6ff30d0c01af393f]



13 Plastering floor With Cow Dung

[Image: main-qimg-16991dcbbd2721db69ad529216f8a43b]



14 Do not Sleep with your head Facing the north

[Image: main-qimg-35ea620b3e88d3b3419cc957e40de150]



15 Using lemon and green chilies

[Image: main-qimg-c934ce922d0c625d81072e2059195726]

These are some common superstitions in India that are followed blindly. We need to spread awareness about this things that we are using without knowing the purpose of it. And to make our future generations aware of this precious remedies that are gifted from our Parents.

Hope you Share these with Your friends and family as well to make them more knowledgeable rather look dumb and ignorant.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#34
awesome Content ever found in xossipy history sir
Like Reply
#35
పరమౌషధం

అనారోగ్యంతో ఉన్నప్పుడుగానీ ఆరోగ్యం విలువ తెలియదంటారు అనుభవజ్ఞులు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పడితేగానీ డబ్బు విలువ తెలియదంటారు.

మనిషి అన్నీ బావుంటే నేలమీద నడవడు. నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహిస్తుంది. ఏవి  నిషిద్ధమో అవే ఆచరిస్తాడు. ఫలితంగా చిక్కులు తప్పవు.

ఆరోగ్యం, ఆర్థిక పుష్టి మనిషికి రెండు చేతుల్లాంటివి. ఏది బలహీనంగాఉన్నా ప్రగతి కుంటువడుతుంది. ఆరోగ్యం బావుండి ఆర్థిక సమస్యలున్నా, అలాగే ఆర్థికంగా బావుండి ఆరోగ్య సమస్యలున్నా ఆ జీవితంలో సుఖశాంతులుండవు.

మనిషి మనసెప్పుడూ సుఖశాంతులనే కోరుకుంటుంది. అందుకోసం మనిషిని ప్రోద్బలం చేస్తుంది. సుఖశాంతులు శాశ్వతం కాదు. అవి మనిషితో దోబూచులాడుతుంటాయి. మనిషి జీవితంలో అధికభాగం సుఖశాంతుల వేటలోనే గడిచిపోతుంది. సుఖం సిరిసంపదల్లో ఉందనిపిస్తుంది. శాంతి ఆనందంలో ఉంటుందనిపిస్తుంది. కానీ, అవి రెండూ భ్రమలే.

సుఖశాంతులు తృప్తిలో నిక్షిప్తమై ఉంటాయి. రాక్షసుడి ప్రాణం చిలుకలో ఉందన్నట్లుగా తృప్తి అనే నిత్యానందం మనసులోనే ఒక మూల మౌనిలా నిశ్చలంగా ఉంటుంది. దాని ఉనికి తెలియనంతమేరకు మనిషికి తిప్పలు తప్పవు.

తృప్తి అంటే తనకు ఉన్నదానితో సంతుష్టి చెందడం. గొంతువరకు తిని ఇక చాలనుకోవడం తృప్తి కాదు. ఎందుకంటే, కడుపు ఖాళీకాగానే మళ్ళీ అంతకు అంత తినాలని ఆరాటపడతారు.

యుక్తాహార విహారాలే ఆరోగ్యానికి, ఆయుష్షుకు ఆలంబనాలు. అమితాహారం ఆరోగ్యభంగం. ఆయుష్షుకు హాని చేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని అనారోగ్యం పాలుచేసుకుని, ఔషధాలతో గడపడం జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది.

మన సంప్రదాయంలో వివిధ సందర్భాల్లో ఉపోషాలు పాటిస్తారు. దీనినే ‘ఉపవాసం’ అని వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే ‘ఉపవాసం’ దైవ సన్నిధిలో వసించడం. ఆరోగ్యపరంగా చూస్తే ఆయుర్వేదం చెప్పిన ‘లంఖణం పరమౌషధం’గా ఆరోగ్యరక్షణ చేస్తుంది.

ఆహారం నియమిత వేళల్లో, మితంగా తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. శరీరాన్ని రక్షించినా, శిక్షించినా జీర్ణవ్యవస్థదే ప్రధాన పాత్ర.

శరీరం బావుంటేనే ధర్మాచరణ సాధ్యపడుతుంది. యోగసాధనలన్నీ శరీర రక్షణతోపాటు, మనసునూ బలోపేతం చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలు మనసులోని తృప్తిని జాగృతం చేస్తాయి. ‘సత్యదర్శనం అయ్యాక పూజలతో పనిలేదు’ అంటారు శ్రీరామకృష్ణులు. మనిషి క్రమంగా ఆ స్థాయికి ఎదగాలి.

‘ఔషధం’ అంటే సాధారణ రుగ్మతలకు వాడేది. ‘పరమౌషధం’ అంటే ప్రాణాంతక వ్యాధులను నివారించేది. 

మనిషి స్వయంకృతాలన్నీ ప్రాణాంతక పర్యవసానాలకే దారితీస్తాయి. వాటికి పనికొచ్చే పరమౌషధాలను మనమే వెతుక్కోవాలి!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#36
ప్రాణదీపం
[Image: images?q=tbn%3AANd9GcSIqqihxArPK0jH7dbuK...p4C4TtLSYM]

 సూర్యాస్తమయం అయింది. వెలుగు రేఖలు అంతరించాయి. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఒక సాధువు ఆ చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేతిలో దీపం ఒకటుంది. అది గాలికి అప్పుడప్పుడూ అటు ఇటు కదలుతోంది. ఆ దారినపోతున్న యువకుడు సాధువును ఇలా ప్రశ్నించాడు- స్వామీ! మీరు పట్టుకున్న దీపంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నదో చెప్పండి’. సాధువు సమాధానం చెప్పకుండా నిర్వికారంగా తన దారిన తాను పోతున్నాడు. యువకుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ఇంతలో గాలి విసురుగా వచ్చింది. సాధువు చేతిలోని దీపం టపటప కొట్టుకొని పుటుక్కున ఆరిపోయింది. సాధువు ‘నాయనా! ఈ దీపం వెలుగు ఇప్పుడు ఎక్కడకు వెళ్లిందో చెప్పగలవా? అది నువ్వు చెప్పగలిగితే వెలుగు ఎక్కడ నుంచి ఎలా వచ్చిందో చెప్పగలుగుతా’ అని సమాధానమిచ్చాడు.

 దోసపాదు పెద్ద ఆకులతో పూలతో పిందెలతో ఎదుగుతుంది. ఒక పిందె అనతికాలంలోనే కాయగా మారుతుంది. మరికొంత కాలంలోనే ‘దోసపండు’ సిద్ధమవుతుంది. దోసపండును ఎవరూ తుంచనక్కరలేదు. చెట్టు నుంచి అదే ఊడిపోతుంది. ఈ క్రమం అంతా అత్యంత సహజంగా జరుగుతుంది. మానవుడికి మరణం అలా సిద్ధించాలని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. కాలం ప్రాణులను పక్వం చేస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోయేటప్పుడు సైతం కాలం మేలుకొనే ఉంటుంది. కాలమహిమను ఎవరూ అతిక్రమించలేరు.
 తెలుగులో ‘కాలం చేయడం’ ఒక జాతీయం. అర్థం ‘మరణించడం’. కాలాన్ని ఎవరూ దాటిపోలేరు కాబట్టి మరణాన్నీ ఎవరూ తప్పించుకోలేరు. జీవన పోరాటంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో ఆ దేవుడికే తెలియాలి. ఆరాటమే తప్ప పోరాటం, ప్రయత్నం అసలు చేయని బలహీనులు; ఎంతో కాలం పోరాటం చేసి అలసిసొలసిన బలవంతులు... అందరూ కాలం చేయవలసిందే! చివరి క్షణాల్లోనైనా భగవంతుడు గుర్తుకు వస్తే అదృష్టవంతులే! ‘బలం కొంచెం కూడా లేదు, అవయవాలు పనిచేయడం లేదు,ప్రాణాలు ఉంటాయా ఊడతాయా అన్నట్లుంది. శరీరం పూర్తిగా అలసిపోయింది, ఇప్పుడు నా మనసునిండా దేవుడొక్కడే నిండి ఉన్నాడు. ఈ దీనుడిపై దయ చూపాలి! రావే ఈశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!’ అని గజేంద్రుడిలా ఆ జగద్రక్షకుని ప్రార్థించి మోక్షం పొందవచ్చు. ఆ జగద్రక్షకుడు ఎవరో, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహకు అందవు. అయినా ఫరవాలేదు. ‘సర్వేశ్వరుడు భక్త రక్షకుడు. ఆపదుద్ధారకుడు, ఏం జరిగినా ఆయనే దిక్కు నాకు’ అనే భావన కలిగితే చాలు, వాళ్ళు అదృష్టవంతులే! ఇక మరణ భయం ఉండదు! హరి నామస్మరణ తప్పక ముక్తినిస్తుంది. పూర్వం ఖట్వాంగుడు అనే రాజు దేవతలను ‘నా ఆయువు ఎంత?’ అని అడిగాడు. ‘నీ ఆయుష్షు ఇంకా ఒక్క ముహూర్తకాలం మాత్రమే’ అన్నారు దేవతలు. వెంటనే రాజు తన సంపదను దానం చేసి, వైరాగ్యంతో శ్రీహరిని మనసులో నిలుపుకొని ముక్తిని పొందాడు.
 ప్రాణం ఒక దీపం. అది ఎప్పటికైనా ఆరిపోక తప్పదు. ఈ సంగతి మనసులో స్థిరంగా ఉంటే- లోకంలో ఇన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఉండవు. ఈ ఆరిన దీపం పోయి పరమేశ్వరుడి పాదాల దగ్గర వెలుగునిస్తుంది. తెలుగు భాగవతం పన్నెండో స్కంధంలో వెలిగందల నారయ మహాకవీంద్రుడు శుకయోగితో చెప్పించిన మాటలు- సర్వమానవాళికి సర్వకాలాలకు పనికివచ్చే రతనాల మూటలు...

‘ఓ రాజా! మరణిస్తానేమో అనే భయాన్ని మనసులో నుంచి వదిలిపెట్టు! పుట్టుకగల మానవజాతికి చావూ తప్పదు. కాబట్టి హరిని నిత్యమూ స్మరిస్తూ ఉండు. ఇక మళ్ళీ భూమిపై జన్మ అంటూ నీకు ఉండదు! వైకుంఠంలో సుఖంగా ఉంటావు!’

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#37
వృద్ధాప్యానికి ఆహ్వానం


చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకంలో ఒకచోట -ఈ విచిత్రమైన కోరిక ఉంది. ''వృద్ధం చమే, వృద్ధిశ్చమే'' అని. ఇదేమిటి? నాకు వృద్ధినియ్యి అన్నంతవరకూ బాగానే వుంది. నాకు వృద్ధాప్యాన్ని యివ్వమని అడుగుతాడేమిటి? అని ఆశ్చర్యం. కోరికలనుంచీ, ఈ జీవితంలో సుఖాల నుంచీ బయటపడలేని జీవుడు -అలా బయటపడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామీ -అంటూ ఆ కోరికల వెల్లువలోనే ఒక విచిత్రమైన కోరికని జతచేశాడు. అన్ని కోరికలనుంచీ విముక్తం చేసే -లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు -అని వేడుకోవడం బహుశా ఏ మతంలోనూ ఏ భక్తుడూ ఏ దేవుడినీ యింత పరిణతితో, యింత గంభీరమైన కోరిక కోరలేదేమో!

''ఈ మనస్సు కోతి స్వామీ! దానికి ఉన్న చాపల్యాలుల అన్నీ తీర్చు. తప్పదు. చేసేదీ లేదు. కాని ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటినీ వదులుకొనే దశనీ, స్థాయినీ, వయస్సునీ -వృద్ధాప్యాన్ని ప్రసాదించు'' అంటున్నాడు జీవుడు.

వృద్ధాప్యం ఒక మజిలీ. ప్రతీ వ్యక్తీ కోరుకు న్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.
ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.
వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు.

అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.
''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.

వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం.
జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.

దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు? మృత్యువు తరువాత ఏమవుతుంది? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద''ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం.

ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.

ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ 
-అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు.   

కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. 
జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక 
జీవితం.
'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో - ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం.

చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా  పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం.
 అదీ వృద్ధాప్యం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#38
అమ్మ.... నాన్న .....కన్నీళ్లు


 మనిషి జీవితంలోనూ
అమ్మా నాన్న అనే అనుబంధం
మరపురాని మహోన్నత బంధం
సృష్టికి మూలం భగవంతుడు అయితే 
మన జీవితానికి మూలం అమ్మానాన్నలు.

మనం అందరూ కూడా అనేక సందర్భాలలో అమ్మానాన్నలను చాలా చాలా కష్ట పెట్టి ఉండవచ్చు
వారు పడ్డ కష్టాలు మనల్ని జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకు రావటానికి వారు చేసిన కృషి వారు చేసిన త్యాగాలు ఎన్నో ఎన్నో అవి మనం తెలుసుకో లేక పోవచ్చు మనకు అందులో పదో వంతు కూడా గుర్తు ఉండకపోవచ్చు

వారి త్యాగాలను కష్టాలను గుర్తుంచుకోవటం లేకపోగా పైగా వారిని ఎన్నో విధాల మనమే బాధపెట్టి ఉండవచ్చు
ఎలాగూ వారు చేసిన త్యాగాలలో మనం తిరిగి వారికి పదో వంతు సేవలు కూడా చేయలేము

తల్లి తండ్రుల చేత మన కన్నీరు పెట్టించ కూడదు 
మనం చేసే ప్రేమ పూర్వకమైన పనుల ద్వారా 
చిన్న చిన్న త్యాగాలు ద్వారా వారి కళ్ళల్లో ఆనందబాష్పాలు వచ్చేలా చేయాలి
మన తల్లితండ్రులు మనం చేసే చిన్నచిన్న 
సేవల ద్వారా ఎంత ఆనందంగా ఉంటారో చూడండి

ఏరోజైనా మీ తల్లిదండ్రుల పాదాలను 
సుతిమెత్తగా తాకారా.... 
వాటిని మృదువుగా నొక్కారా ఈ రోజే 
ఆ పాదాలను తాకిండి సుతిమెత్తగా ఒత్తండి
మీరు చేసిన తప్పులకు మనసులోని క్షమాపణ కోరుకుంటూ మీ తల్లిదండ్రుల పాదాలకు
మీ కన్నీళ్లతో అభిషేకం చేయండి

ప్రతి ఒక్కరూ ముందు తల్లిదండ్రుల జీవితాన్ని అధ్యయనం చేయండి వారు చేసిన త్యాగాలను 
అన్నిటినీ గుర్తించండి..... ఎన్ని కష్టాలు పడి మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చారో తెలుసుకోండి.

కాలం కరిగిపోయాక లోకం విడిచి వెళ్ళాక
ఇక తల్లితండ్రులు రమ్మన్నా రారు
అప్పుడు మనం ఎంత బాధ పడ్డా 
ఎంత ప్రేమను వ్యక్తపరచాలి అనుకున్నా
తల్లిదండ్రులు మనకు అందరు
ఆ అమూల్యమైన గడియలు ఇక రానే రావు.

అమ్మ హృదయం ఎంత త్యాగమయమో 
ఎప్పుడైనా చూశారా... తెలుసుకున్నారా 
ఎన్నో కష్టాలకోర్చి మనల్ని గొప్పగా తీర్చిదిద్ది 
బండ భారిపోయిన నాన్న చేతులను 
ఏనాడైనా పరీక్షగా చూశారా
తన కష్టాలను మనసు విప్పి చెప్పుకోలేని 
మూగజీవి నాన్న

తల్లిదండ్రులను హీనంగా చూసేవారు 
ఎన్ని పూజలు చేసినా..... భగ వంతునికి 
చేరువ అవటానికి ఎంత ప్రయత్నించినా
మన ప్రయత్నం నిస్ప్రయోజనం అవుతుంది
తల్లి తండ్రుల మించిన దైవాలు లేదని
మన వేదాలలోనూ పురాణాలలోనూ కూడా 
చెప్పబడింది

ముందుగా తల్లిదండ్రుల దీవెనలు అందుకోక పోతే 
మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళలేము
ఎవరైతే తల్లిదండ్రులను ఉన్నతంగా చూసుకుంటారో
ఎవరైతే తల్లిదండ్రులకు మంచి సేవలు చేస్తారో
వారికే భగవంతుని కరుణ కటాక్షాలు కూడా లభిస్తాయి
మనలో ఎవరైనా సరే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా తల్లిదండ్రుల దీవెనలు తీసుకోండి

పండరి పురాణంలో పుండరీకుని కథ తెలుసుకుంటే
తల్లిదండ్రులు సేవలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పుండరీకునికి భగవంతుడు ప్రత్యక్షమైతే కూడా నా తల్లిదండ్రులు సేవలు అయిన తరువాతే నీ చెంతకు వస్తాను స్వామి అంటాడు 
భగవంతుడు ప్రత్యక్షమైతే కూడా తల్లిదండ్రుల సేవలు పూర్తి అయిన తరువాతే భగవంతుని దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆ పుండరీకుని గొప్పతనం పాండురంగడు గుర్తించి ఎంతో మెచ్చుకుని తరువాత ఎన్నో వరాలను ఇస్తాడు... పండరీకుని పేరుమీద పాండురంగని 
దివ్య క్షేత్రం పండరీపురం వెలుస్తుంది

మనం తల్లిదండ్రులకు చేసే సేవలను 
గుర్తించి భగవంతుడు ఎంతో మెచ్చుకుంటాడు
ఎన్నో వరాలను మనకు కానుకగా ఇస్తాడు
అందరూ తల్లితండ్రులను గౌరవించండి..
పూజించండి... సేవించండి... సేవలు చేయండి.
తల్లిదండ్రుల సేవ భారతీయ సాంప్రదాయాల లోనూ భారతీయ ధర్మలలోనూ ప్రముఖమైనది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#39
Lightbulb 
మల్లాది వెంకట కృష్ణమూర్తి చిన్న కథలు నుండి మీ కోసం ఒక చిట్టి కథ

ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. 

అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.

ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.
"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".

"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.

ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.
"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."

ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు.

 ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. 

గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. 

అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.
"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."
చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.

"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...."
అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.

" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..."
దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. 

అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.

"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.

'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.

"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. 

కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు..

 ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది.
 కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."

ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు..
                  
జై శ్రీరామ్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#40
ముక్తి ఎలా లభిస్తుంది???

సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది.. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు.. అని.

అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు.. సామాన్యంగా.

మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు.

 శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, 

యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా,

 సత్కర్మలు, పుణ్య కార్యాలు ఎన్ని చేసినా, 

దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు. 

వంద మంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు.. అని.

" ఆత్మైక్య బోధేన" ... నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు. 

పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, 

వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. 

అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించ వలసిందే.

అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా.. చేయకూడదా.. అంటే చేయాల్సిందే. ...

అయితే ఎలా చేయాలి.. ఎందుకు చేయాలి.. 

మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.

వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువును సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు, గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధి సూక్ష్మత శిష్యునికి ఉండాలి.

 అలా ఉండాలంటే అప్పటికే అతడు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్ట దేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించే ఉండాలి.

అయితే ఆ కర్మకాండను విడిచిపెట్ట లేకుండా దానికే అతుక్కుపోయి ఉండకూడదు. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మ బుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి.

 తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: 9 Guest(s)