21-11-2018, 06:53 PM
దేవిశ్రీప్రసాద్ ప్రేమలో పడ్డాడు.. వార్తల్లో నిజమెంత!
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న వార్త ఇది. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియదు కానీ, ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్, ఛార్మీ ప్రేమలో పడ్డారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున హల్ చల్ చేసాయి. అయితే ఆ వార్తలు నిజమవ్వలేదు. ఇంతకీ ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ ఎవరి ప్రేమలో పడ్డాడు… ఆ వివరాల్లోకి వెళితే… ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రేమికురాలిగా నటించిన పూజాత పొన్నాడ గుర్తుందా. ఆ అమ్మాయితోనే దేవిశ్రీప్రసాద్ ప్రేమలో పడ్డాడట. ఈ ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారని, పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేవి ప్రస్తుతం వరుసగా పెద్ద ప్రాజెక్టులతో ఫుల్‌బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న దేవికి ప్రేమించే తీరిక దొరికిందా.. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో గానీ సోషల్ మీడియాలో మాత్రం నిజాలతో సంబంధం లేకుండా వైరల్ అవుతున్నాయి.Source : newtelugunews.com
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK