04-12-2019, 10:57 AM
ఆరోజు సోమవారం. ఎప్పటిలాగే పొద్దున్నే లేచి రెడి అయ్యి కాలేజ్ కి బయల్దేరాడు అభి.అభి ఇప్పుడు పడవ తరగతి.పాపం చదివేది పదే అయినా మనోడు సన్నగా ఉండి ఏ 8వ తరగతి అన్నా నమ్మేస్తారు.ఇదొక బాధ అభి కి అందరూ తనను సన్నగా ఉన్నాడని ఏడిపిస్తారని.తనకి ఇదే కాక ఇంకొక భాధ కూడా ఉందండోయ్. అది ఏదో అనుకునేరు. అది మాత్రం కాదు.అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది.అభి టిఫిన్ తినేసి కాలేజ్ బస్ కోసం బస్టాండ్ కి వెళ్ళాడు.బస్ రానే వచ్చింది. ఎప్పటిలాగే అది ఫుల్, అక్కడినుండి తన కాలేజ్ కి ఒక 15 నిమిషాలు.రోజు అలాగే నిలబడి వెళ్తాడు.కానీ ఆ రోజు ఫుల్ అనుకోని ఎప్పటిలాగే వెనుక తన ఫ్రెండ్స్ ఉంటే వెల్దామని ముందుకు కదిలి బస్ బ్రేక్ వేయడంతో ముందుకు తుళ్ళి పక్కనే ఉన్న సీట్ అంచుని పట్టుకొని ఆగాడు.అదే సీట్లో ఒక అమ్మాయి కిటికీలో చూస్తూ పాటలు వింటోంది ,తన పక్కన సీట్ ఖాళీగా ఉంది. అభి కూర్చుందాం అనుకున్నాడు. కానీ అది అమ్మాయి పక్కన సీట్.అమ్మాయి అయితే ఏంటి కూర్చోవచ్చు కదా అనుకున్నారు కదా అక్కడే పప్పులో కాలేశారు.అక్కడ కూర్చున్నది సౌమ్య. ఆ అమ్మాయి అంటే మన హీరోకి చచ్చేంత ఇష్టం .అయితే ఇంకేం వెళ్లి కూర్చోవచ్చు గా అనుకున్నారు కదా.మనోడుకి ఆ అమ్మాయి అంటే ఎలా చచ్చేంత ఇష్టమో అలాగే మాట్లాడాలి అన్నా కనీసం కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడాలన్న చచ్చేంత భయం. దాంతో అలాగే లేచి ఆ సీట్ పక్కనే సౌమ్యని దొంగ చూపులు చూస్తూ నించున్నాడు.కాసేపటికి సౌమ్య కిటికి నుండి ఇటు వైపు తిరిగి చెవిలో earphones తీసి "హాయ్ అభి,ఏంటి సీట్ ఖాళీగా ఉంటే నించున్నావ్.కూర్చోవచ్చు కదా"అని అడిగింది.దానికి అభి "పర్లేదు లే సౌమ్య ఇలాగే బాగుంది."ఓయ్ ఏమి కాదు ,నేను అమ్మాయినని కూర్చోడానికి ఆలోచిస్తున్నావా ఏమైనా,అలా ఏం అనుకోకు మనం ఫ్రెండ్స్ గా, వచ్చి కూర్చో లేకుంటే నేను నీతోపాటే నించుంటా.సరేనా"అంటూ లెవబోయింది. దాంతో అభి"వద్దు లే సౌమ్య,నువ్వు లేవకు లే, నేనే కూర్చుంటా లే "అని మనోడు సిగ్గుగా ఒక పక్కాగా కూర్చున్నాడు.అది చూసి సౌమ్య నవ్వుకుంటూ కిటికిలో చూస్తూ ఎదో సాంగ్ ప్లే చేస్కోని వింటోంది.