Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Sugar (white poison)
#1
*చక్కెర*- *వైట్‌ పాయిజన్‌*
చక్కెర  అంటే తెల్లటి విషం అంటున్నారు చాలామంది  ఆహారనిపుణులు.
చక్కెరతో తయారైన పదార్థాలు వాళ్లకు ఇవ్వడం అంటే చేజేతులారా సిగరెట్‌ లేదా మద్యం కంటే హానికరమైన పదార్థాలు వాళ్లకు సాక్షాత్తూ పెద్దలే అందించడం లాంటిది అంటున్నారు ప్రముఖ బయోకెమిస్ట్‌ రేమండ్‌ ఫ్రాన్సిస్‌. ఆయన రాసిన *‘నెవర్‌ బి సిక్‌ అగైన్‌*’ (ఇంకెప్పుడూ జబ్బుపడకండి) అనే పుస్తకం చాలా ప్రఖ్యాతి పొందింది. చక్కెర గురించి ఆయన చెబుతున్న విషయాలివి... 

‘‘చక్కెర తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించే ఒక తియ్యటి విషం. చాలారోజుల కిందట నేను జబ్బుపడ్డాను. స్వతహాగా బయోకెమిస్ట్‌ను కావడంతో ఆహారపదార్థాలు, అవి తినగానే మనలో జరిగే జీవరసాయన చర్యలపై నాకు అవగాహన ఉంది. దాంతో నా ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్త వహించాను. అంటే నా ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం, ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వంటి నియమాలు పాటించాను. దాంతో కిందటి సారి జబ్బు పడి కోలుకున్న తర్వాత గత 26 ఏళ్లలో మళ్లీ నేను కనీసం ఎప్పుడూ చిన్న జ్వరానికి కూడా గురికాలేదు. కాకపోతే ఒక్కసారి మాత్రం నాకు జలుబు చేసింది. దానికి కారణం కూడా నాకు తెలుసు ఒక సారి నేను చక్కెరతో చేసిన పదార్థం తినడమే ఇందుకు కారణం’’ అంటారాయన. 

చక్కెర ఎందుకు, ఎంత ప్రమాదం...
మనం జీవితంలో ఎప్పుడూ జబ్బుపడకుండా ఉండాలంటే కేవలం చక్కెర తీసుకోకుండా ఉంటే చాలంటారు రేమండ్‌ ఫ్రాన్సిస్‌. ఆయన రాసిన ‘నెవర్‌ బి సిక్‌ అగైన్‌’, ‘నెవర్‌ బి ఫ్యాట్‌ అగైన్‌’, నెవర్‌ ఫియర్‌ క్యాన్సర్‌ అగైన్‌’, ‘నెవర్‌ ఫీల్‌ ఓల్డ్‌ అగైన్‌’, ‘ద గ్రేట్‌ అమెరికన్‌ హెల్త్‌ హోక్స్‌’... పుస్తకాలన్నీ జనాదరణ పొందాయి. ఆయన చెబుతున్న ప్రకారం కేవలం ఒక టీ స్పూన్‌ చక్కెర తీసుకుంటే చాలు.. రెండు గంటల్లో... అది మన దేహంలోని జీవ రసాయన చర్యల్లోని అసమతౌల్యత కలగజేస్తుంది. దాంతో మన వ్యాధి నిరోధక సామర్థ్యం 50 శాతం తగ్గుతుంది. ఈ లెక్కన ఏదైనా వ్యాధికారక క్రిములతో మనకు ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలప్పుడు రెండు రెట్లు పెరుగుతాయి కదా. అలా మనం జబ్బు పడే అవకాశాలు ఎక్కువ అంటారు రేమండ్‌ ఫ్రాన్సిస్‌. ఇక ఆయన కోలా సాఫ్ట్‌డ్రింక్స్‌ను ఎంతగా నీరసిస్తారంటే... కేవలం ఒక టీ స్పూన్‌ చక్కెరతోనే ఇంత ప్రమాదం ఉందంటే... ఒక సాఫ్ట్‌డ్రింక్‌లో 10 – 12 టీస్పూన్ల చక్కెరకు తక్కువ ఉండదు. అలాంటిప్పుడు అదెంత హానికరమో ఆలోచించండి... అంటారు.

- రేమండ్‌ ఫ్రాన్సిస్, బయో కెమిస్ట్, ‘నెవర్‌ బి సిక్‌ అగైన్‌’ పుస్తక రచయిత

చక్కెర ఎందుకు హానికరమంటే... 
కేవలం రేమండ్‌ ఫ్రాన్సిస్‌ చెప్పడం మాత్రమే కాదు... చక్కెర హానికరం అని చెప్పే పరిశోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అనేక అధ్యయనాలను బట్టి ఆరోగ్యకరమైన బెల్లం, తేనె వంటి స్వీటెనర్లతో పోలిస్తే చక్కెర ఎందుకు హానికరమో చెప్పడానికి ఒక దృష్టాంతమిది...  

చక్కెరను ప్రాసెస్‌ చేసే ప్రక్రియలో గంధకం (సల్ఫర్‌) ఒక ప్రధానమైన రసాయనం. అంటే మనం బాణాసంచాలోనూ, టపాకాయల్లోనూ ఉపయోగించే రసాయనాన్నే చక్కెర ప్రాసెసింగ్‌లో ఉపయోగిస్తున్నామన్న మాట. కేవలం గంధకం మాత్రమే కాకుండా... మానవులకు హానికరమైన మరో 23 రసాయనాలను చక్కెర ప్రాసెసింగ్‌లో వాడతారు

చక్కెర తెచ్చే అనర్థాల్లో కొన్ని ప్రధానమైనవి... 
∙చక్కెరతో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ పాళ్లు పెరుగుతాయి. తద్వారా అది గుండెజబ్బులకు తావిస్తుంది. 
∙చక్కెర వినియోగం పెరిగితే అది ఊబకాయాన్ని కలిగిస్తుంది. ఊబకాయంతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావన్నది తెలిసిందే. 
∙ఊబకాయం పెరగడం వల్ల వచ్చే అనర్థాల్లో ముఖ్యమైనది అధికరక్తపోటు. అంటే పరోక్షంగా చక్కెరతో మనం హైబీపీని తెచ్చిపెట్టుకుంటున్నామన్నమాట. 

∙ఒక్కోసారి మరణానికి... లేదా మరణం తప్పినా జీవితాంతం వైకల్యంతో బాధపడేలా చేసే పక్షవాతానికి ప్రధాన కారణం చక్కెర. 
∙చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ రాకపోయినా... ఒకసారి డయాబెటిస్‌ వచ్చాక చక్కెర తినడం ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలిసిన విషయమే. 

∙చాలామంది పచ్చళ్లు, వంటకాల్లో మితిమీరిన కారం లేదా మసాలాలు మాత్రమే కడుపులోని అల్సర్లకు కారణం అనుకుంటారు. కానీ చక్కెర కూడా కడుపులో అల్సర్స్‌ వచ్చేందుకు అంతే సమానంగా దోహదం చేస్తుంది. 

నిపుణులు చెప్పే మాటలివి... 
‘సెయింట్‌ విత్‌ స్టెతస్కోప్‌’ అంటూ ఆదరంగా పిలుచుకునే కేరళకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ పి.వి. గంగాధరన్‌తో పాటు చాలామంది క్యాన్సర్‌ చికిత్సా నిపుణులు చక్కెర గురించి చెప్పే మాటలివి... 
∙మీరు చక్కెరకు దూరంగా ఉండగలిగితే చాలు... క్యాన్సర్‌ కణం దానంతట అదే నశిస్తుంది. 
∙ ప్రతిరోజూ కాస్తంత గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మకాయ పిండుకొని పరగడుపున తాగండి. అది కీమోథెరపీ కంటే 1000 రెట్లు ప్రభావవంతమైనది. ఇది మేరీల్యాండ్‌ కాలేజీ నిపుణుల అధ్యయన ఫలితాలు తేల్చిన వాస్తవం. 

మరి చెక్కెర లేకపోతే జీవితంలో తియ్యదనం ఎలా? 
తియ్యదనానికి చక్కెర ఒక్కటే కేరాఫ్‌ అడ్రస్‌ కాదు. దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మంచి పరిశుభ్రమైన బెల్లం, తేనె వంటివి. వాటితో పాటు మరికొన్ని స్వీటెనర్లూ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఆ స్వాభావిక, ప్రాకృతిక తీపి పదార్థాలు ఇవి కొన్ని మాత్రమే... 

ఉన్నాయిగా మనకు స్వాభావిక స్వీటెనర్లు... 
స్టీవియా : ఈ తీపి పదార్థాన్ని స్టీవియా రెబౌడినా అనే మొక్క నుంచి సేకరిస్తారు. ఇది స్వాభావికమైన చక్కెరతో పోలిస్తే 290 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. దీన్ని స్వాభావిక చక్కెర (సుక్రోజ్‌)తో కలిపి మనకు వాణిజ్య ప్రయోజనాలకోసం ‘సీఎస్‌ఆర్‌ స్మార్ట్‌’ పేరిట  మార్కెట్‌లో లభ్యమయ్యేలా చూస్తున్నారు. 

సార్బిటాల్‌ : దీన్నే గ్లూసిటాల్‌ అంటారు. ఇది కొన్ని రకాల పండ్లను పాకం పట్టినప్పుడు చక్కెర పాకంలా తయారైన పదార్థాం నుంచి సేకరిస్తారు. స్వాభావిక చక్కెరతో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్తంత తక్కువ.  

స్వీటెనింగ్‌ ఆపిల్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌: ఇక కొన్ని ఆపిల్స్‌ నుంచి తీసే పదార్థాలు (ఆపిల్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌) నుంచి సేకరించిన పదార్థాలు స్వాభావికం కావడంతో ఇవి తియ్యదనాన్ని, రుచినీ, ఆరోగ్యాన్నీ ఒకేసారి ఇస్తాయి. 

స్వాభావిక తీపి పదార్థాలతో ప్రయోజనాలు :  ∙స్టీవియా తీపి పదార్థం మొక్క నుంచి సేకరిస్తారు కాబట్టి అది హానికరం కాదు. ఆ తీపి వల్ల రక్తంలోని చక్కెర పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్‌ రోగులకు స్టీవియా మంచిది. 

అగేవ్‌ నెక్టర్‌ : ఇది మెక్సికోలో పెరిగే ఒక రకం మొక్క నుంచి సేకరించే పాకం. దీనిని తినడం వల్ల సాధారణ చక్కెర తీపి తిన్నప్పటికంటే తక్కువ తీపి శరీరంలో విడుదలవుతుంది. అందుకే రక్తంలో షుగర్‌ పాళ్లు పెరగవు. కాబట్టి డయాబెటిస్‌ రోగులు తినే తీపి పదార్థాలకు ఇది చక్కెర కంటే మంచి ప్రత్యామ్నాయం. 

డేట్‌ షుగర్‌ : దీని ఉపయోగం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. డేట్‌ షుగర్‌ అంటే మరేదో కాదు. ఎండబెట్టిన ఖర్జూరాలను పొడిలా చేసి, తీపిని ఇచ్చేందుకు  దాన్ని పంచదారలా వాడుకోవచ్చు. అయితే ఇది వేడి పదార్థాలలో కరగదు. ఉదాహరణకు వేడి వేడి టీలో దీన్ని చక్కెరలా వేసుకోవడం సాధ్యం కాదు. అయితే బేకింగ్‌ ఉత్పాదనలకు స్వీటెనింగ్‌ అడిటివ్‌లా మాత్రం వాడుకోవచ్చు. 

తేనె : తీపిని ఇచ్చేందుకు వాడే పదార్థంగా దీని ప్రాధాన్యం, ప్రాచుర్యం అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఒక రుచిని ఇచ్చే ఆహారంగానే కాక...  ఔషధ గుణాలు కలిగి, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా దీని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పరిమిత మోతాదులో దీన్ని ఎంతకాలమైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

► అందుకే ఇకపై చక్కెరకు బదులు ఈ స్వాభావికమైన తీపి పదార్థాలు వాడుకోండి.

Internet nundi sekarinchinadi( source:Internet)
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Sarit garu,

Internet(what's up) lo appudappudu health tips vastu untayi, ila post cheyavavaccho Leda teliyadu. Health tips Andaru arogyamu koraku manchidi ani post chesinanu, idi tappo vappo teliyayadu meeku tappu anipiste delate cheyandi.
Like Reply
#3
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని పంచుకోవడం పట్ల అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను Smile
Quote:Google : చక్కెర+అంటే+తెల్లటి+విషం+అంటున్నారు+చాలామంది+ఆహారనిపుణులు
Like Reply
#4
చక్కెరకు బదులు... తేనె, పటికబెల్లం వాడటం మంచిది. పటికబెల్లం అంటే గడ్డలాగా (కలకండ) వుండేది వాడాలిగానీ చిన్న చిన్నగా పలుకుల్లాంటివి కావు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
Pyna cheppina vidhananga stevia powder available in Amazon lo dorakutundi leka pothe Patanjali stores lo Tati bellam dorakutundi. Mameluke bellam ayina manchide.
Like Reply
#6
నిజమే... బెల్లం కూడా చాలా మంచిది. అందుకే, దాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కానీ, బెల్లం శరీరంలో ఉష్ణాన్ని కలుగజేస్తుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: