Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే.. దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయించబడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు.
ఫలితాలు: కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం.
గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రంలో మొదటి ఇంట ప్రారంభం అయి 9వ ఇంట సమాప్తం అవుతుంది.
ఫలితాలు: ఆర్ధిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు.
వాస్తుకి కాలసర్ప దోషం: 2వ ఇంట మొదలయి 10వ ఇంట సమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.
సంకాపాల కాలసర్ప దోషం: 3వ ఇంట మొదలై 11వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు.
పద్మ కాలసర్ప దోషం: 4వ ఇంట ప్రారంభమై 12వ ఇంట సమాప్తం.
ఫలితాలు: జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు.
మహా పద్మ కాలసర్ప దోషం: 5వ ఇంట ప్రారంభం అయి 1వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.
తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతంలో ఇబ్బందులు.
కర్కటక కాలసర్ప దోషం: 7వ ఇంట ప్రారంభం 3వ ఇంట సమాప్తం.
ఫలితాలు: భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు.
శంఖ చూడ కాలసర్ప దోషం: 8వ ఇంట ప్రారంభం 4 వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్థితి.
ఘటక కాలసర్ప దోషం: 9 వ ఇంట ప్రారంభం 5వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార, ఉద్యోగ సమస్యలు.
విషార కాలసర్ప దోషం: 10వ ఇంట ప్రారంభం 6వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక, వ్యాపార కష్టాలు.
శేషనాగ కాలసర్ప దోషం: 11వ ఇంట ప్రారంభం 7వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
అపసవ్య కాలసర్ప దోషం: 12వ ఇంట ప్రారంభం 8వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.
కాల సర్ప దోషం ఇవి మొత్తం 12 రకాలు :
అనంత కాల సర్ప యోగము ,
కులిక లేక గుళిక కాల సర్ప యోగము,
వాసుకి కాల సర్ప యోగము,
శంఖ పాల కాల సర్ప యోగము,
పద్మ కాల సర్ప యోగము,
మహా పద్మ కాల సర్ప యోగము,
తక్షక లేక షట్ కాల సర్ప యోగము,
కర్కోటక కాల సర్ప యోగము,
శంఖ చూడ లేక శంఖ నంద లేక షన్ చాచుడ్ కాల సర్ప యోగము,
ఘటక లేక పాతక కాల సర్ప యోగము,
విషక్త లేక విషదావ కాల సర్ప యోగము,
శేష నాగ కాల సర్ప యోగము,
కాలసర్ప యోగ ఫలితాలు
జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట
గర్భం శిశువు మరణించుట ,
వైవాహిక జీవతంలో అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట
మరణించన శిశువును ప్రసవించుట,
గర్భం నిలవక పోవుట,
అంగ వైకల్యంతో సంతానం కలుగుట,
దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట
మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట,
మానసిక ప్రశాంత లేక పోవుట ప్రమాదాలు అవమానాలు,
పర స్త్రీ సంపర్కం లాంటి ఫలితాలు కలసర్ప దోషాలు
కాలసర్ప దోష యంత్రంను 40రోజుల పాటు 1,24,000 సార్లు జపం చేసి యంత్రములు ధరించుట వలన దోష నివారణ అవుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. వ్యక్తీ గతం కాదనీ, సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు
పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.
కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి.
(భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః))
శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।
మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥
చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।
మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।
అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥
వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...
1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము.
2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము.
3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము.
4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము.
5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము.
6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము.
7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము.
8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము.
9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము.
10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము.
11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Posts: 2,329
Threads: 149
Likes Received: 7,659 in 1,548 posts
Likes Given: 4,517
Joined: Nov 2018
Reputation:
576
సరైన పేరు పెట్టారు దేవ్
చాలా మందికి తెలియని, తెలుసుకోవల్సిన విషయాలు ప్రస్తుతిస్తున్నారు ;)
మరిన్ని వివరాలు, పుస్తకాలు, విషయాలు మీ నుండి ఆశిస్తూ
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
రాశులు ఆకార స్వరూపాలు
రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని,రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు.జాతక చక్ర విశ్లేషణలో జాతకుని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును.
మేషరాశి:-మేషమంటే గొర్రె.గొర్రెకు ఉండే తీవ్రత,కలహాశక్తి,ధైర్యం,బలం,వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం,దూకుడుతనం,న్యాయకత్వ లక్షణాలు,కొండను కూడా డీకొట్టగలననే నమ్మకం. ఆశ,సాహసం కలిగి ఉందురు.మోసాలకు లోనగుదురు.మానవులకు సహాయపడుదురు.
వృషభ రాశి:-వృషభరాశి అంటే ఎద్దు.స్ధిరత్వం కలిగి ఉంటుంది.పోషించే స్వభావం,ఎత్తైన భుజాలు,పెరిగిన కండలు,కాంతి కల కన్నులు,విశాలమైన ముఖం,గొడ్డు చాకిరీ చేయుదురు.ఓర్పు అధికం,ఇతరుల ఆదీనంలో ఉందురు.ఇతరులకు బాగా సహాయపడతారు.
మిధున రాశి:-పురుషుడు ఒక చేత్తో గధ,స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం.బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్నానాన్ని కలిగి ఉందురు.కుటుంబమును పోషించెదరు.మానవతా దృక్పదం కలిగి ఉంటారు.ఒకరి కోసం ఒకరు అనే భావన,వైవిధ్యం,కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత,కొంతకాలం ఆర్ధిక అనుకూలత,రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు.
కర్కాటక రాశి:-ఎండ్రకాయ(పిత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) కలిగి ఉంటారు.పురుగు స్వభావం,పట్టుదల,తప్పించుకొనే తెలివి తేటలు,స్వతంత్రత,అపకారం చేయుటకు వెనకాడక పోవటం,జల భూచరమైన ఆటుపోటులు,వృద్ధి క్ష్యయాలు,మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.
సింహారాశి:-సింహం .మృగ స్వభావం,బిగ్గరగా అరుచుట,గాండ్రించుట,భయం కలిగించుట,స్వేచ్ఛగా సంచరించుట,జంకు బొంకు లేకపోవుట,అందరిని మించిపోవాలనే స్వభావం,న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు.
కన్యారాశి:-సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం,ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ.కన్య పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు,సిగ్గు,లజ్జ,బిడియం,దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం,సభలో మాట్లాడుటకు భయం,పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు.స్త్రీకి ఉండే వాత్సల్యం,అభిమానం,బందు ప్రేమ.తన భాధను,శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు.
తులారాశి:-త్రాసు ధరించిన పురుషుడు.సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు.స్ధిర చిత్తమును కలిగి ఉంటారు.ధర్మా దర్మముల విచక్షణ,సమయోచితంగా ప్రవర్తించుట,ఇతరులకు సహాయ పడుట,అవకాశాలు,ధనం,కాలం,సాధనాలు సరిగా వినియోగించుట,చిన్న వస్తువులను,సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం.
వృశ్చికరాశి:-తేలు.తేలు కనపడితే జనం చంపుతారు.కనుక ఇతరుల నుండి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది.వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు.తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు,ఇతరులకు హాని కలిగించు మాటలు,పనులు చేయుదురు.వృశ్చిక రాశి వారికి పగ కలిగి ఉంటారు.
ధనస్సు రాశి:-నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి వీళ్ళు ధరించిన మానవ రూపం.ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత,కార్యదీక్ష,పట్టుదల కలిగి ఉంటారు.కదలిక లేని స్వభావం,ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు.
మకరరాశి:-లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి ఉన్న రూపం.లేడికి ఉండే సుకుమారం,లావణ్యత,నాజూకుతనం కలిగి ఉందురు.మొసలికి ఉండే పట్టుదల,పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం,ఏమి ఎరుగని మనస్తత్వం,సమయం చూసి పట్టు పడతారు.పట్టిన పట్టు వదలరు.
కుంభరాశి:-నీటి కుండను(ఖాళీ కుండ) ధరించిన మానవ రూపం.కొత్త నీరు,నవ జీవనం,బద్ధకస్తులు,చలనం లేక మొండిగా ఉండుట,ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు.సమర్ధులు,భద్ర పరుచుకుందురు.
మీనరాశి:-రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం.ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం,నీటి ప్రవాహంలో ప్రయాణం.సమయమును బట్టి వృద్ధి చెందగలరు.ఎరవేస్తే వలలో పడుతారు.ఆశ చూపిస్తే లొంగిపోతారు.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
గ్రహాలు పరిహారాలు
రవి గ్రహం:-‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు.
సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వారా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన రాగి జావ,క్యారెట్,ధాన్యం, గోధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. ఎముకలకు అధిపతి రవి. ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం. కంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినటం మంచిది. ఇలా రవి లక్షణాలు గల పదార్ధలు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
చంద్రుడు:-కాల్షియంకు ముత్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడధి దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముం దుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.
కుజుడు:-ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగడం కలిసిపోతుందని ఫ్రాన్స్ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.
బుదుడు:-బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెసలు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.
గురుడు:- గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్పడే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది. చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చంద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.
శుక్రుడు:-శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.
శని- వాత లక్షణం కలవాడు. చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.
ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎక్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి.వంశపారంపర్యంగా రోగాలుండేవి ఏడు తరాలు. శరీరంలోని కణాలన్నీ మారడానికి పట్టే కాలం ఏడు సంవత్సరాలే. సప్త గ్రహాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనంద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సామ్రాజ్యాన్ని మనమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,007 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
ఓం శ్రీ మాత్రే నమ:
ఓం శ్రీ గురుభ్యోనమః
మీ మేధస్సుని ప్రశ్నించే ఉద్దేశం లేదండీ......కానీ అనుభవాన్ని పంచడం అనేది పబ్లిక్ అవేర్నెస్ ఇస్తుందని ఈ సాహసం చేస్తున్నాను.
కాలసర్ప దోషాలు సంబంధించి నా అనుభవంలో అవి యోగాలుగా కూడా పరిణవించాయి. అలా అని కాల సర్పదోషం లేదని నేను అనలేను. వరాహమిహిరాచార్యుడు, శ్రీ పరాశర ముని వీరు కాలసప్రదోషాన్ని ప్రస్తావించలేదు. అయితే కాలసర్పదోషాలు మేలు చేశాయి అన్న విషయాన్ని బలపరచడానికి
ఉదాహరణకి sachin tendulkar గారి జాతకంలో కాల సర్పదోషం ఉంది. అయినా అఖండ భారతాన్ని ఒక ఊపు ఊపాడు.
అదే సమయంలో సాయంత్రం 7 గంటల సమయంలో అనుకుంటా పుట్టింది అందుకే సప్తమంలో శుక్రుడు, సూర్యుడూ ఉండి గురువు నీచలో ఉన్నాడు. ప్రేమ వివాహం అది కూడా తనకన్నా వయసులో పెద్ద ఆమెని చేసుకున్నాడు. ఆ తరువాతే కరియర్ end అయిపొయింది. DOB 24/04/1973, ముంబై;
నాకు తెలిసిన అమ్మాయికి కూడా కాలసర్పదోషం ఉంది. 37 వరకూ వివాహం కాలేదు. కానీ తెగ సంపాదించేసింది. ఆ తరువాత ఒక కుర్రాడు వయసులో చిన్నవాడు పరిచయం అయ్యాడు.
ఒక ఆమె ఉంది. ఆమెకి అందమైన సిద్ధార్థ మాల్యా అంతటి అందగాడు పరిచయం అయ్యాడు. పెళ్ళి జరగడానికి ప్రాబ్లెమ్ వచ్చింది.
అతను వెళ్ళి జాతకాలు చూసే పెద్దమనిషికి చూపించాడు. ఆయన, ఆయన మిత్రుడూ ఇద్దరూ చూసి "ఒక అమ్మాయి పరిచయం అయింది కదా.., ఆ అమ్మాయి అన్నగారు మీకూ, మీ ఇంటికీ ప్రాబ్లెమ్ అవుతాడు కుదిరితే లేపుకుని వెళ్ళి పెళ్లిచేసుకో" అని చెప్పారు. కానీ యితడు వినలేదు.
పెళ్లయింది. తరువాత జీవితం చిరిగిపోయిన అరిటాకైపోయింది.
కర్మ అనేది అనుభవం కావాలి అని రాసుంటే..........ఎవ్వడు ఏం చెయ్యగలరు?
బాలారిష్టాలు కూడా లగ్నాన్ని శుభ గ్రహం చూస్తూ ఉన్నట్లయితే మేలే జరుగుతోంది.
మీ వ్యవసాయం బాగుంది. నేను కూడా 'నక్షత్ర చింతామణి' download చేసుకున్నాను. చాలా ధన్యవాదాలు.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
కాల సర్ప దోషం అయినా, బాలారిష్టాలు అయినా గ్రహం నిలిచిన nakshatram చాలా ముఖ్యమైనది మరియు అది పుష్కరాంశ లో వున్నది లేనిది తదితర విషయ విచారణ చేయాలి, శుభ గ్రహ drusthi గమనించాలి.
ఈ సమూహంలో , విషయాలు అందరికీ తెలియాలి అనే భావనతో పంచుకోవడం జరుగుతోంది
ఏ విద్యా అయినా గురు ముఖంగా సందేహ నివృత్తి కాగలదు అని అభిప్రాయం
నక్షత్ర చింతామణి జ్యోతిష గ్రంధాలయంలో వుండదగిన పుస్తకం
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,007 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
(12-11-2019, 04:14 PM)dev369 Wrote: 300 ముఖ్యమైన యోగాలు.pdf
http://www.mediafire.com/file/gok5c1f96w...1.pdf/file
శ్రీ బెంగళూరు వెంకట్రామన్ గారు ఇంగ్లీష్ లో అందించారు. Combinations of Astrology ani peru sarigggaa gurtu ledu. ayinaa telugulo choostunte chalaa baagundi.
meekoo., mohan publications vaarikee abhinandanalu.
chalaa thanks andi.
•
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువు ని ఎంచుకోవడం ఎలా
మన రాసి నుంచి తొమ్మిదవ స్థానంలో సంపత్తార లేదా పరమమిత్ర తార నక్షత్ర జాతకులు మనకు గురవు అవుతారు.
ఉదాహరణకు శ్రీరాముని నక్షత్రం పునర్వసు, రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి నుండి భాగ్య స్థానం మీనరాశి అవుతుంది శ్రీరాముని గురువులు వశిష్ఠ మహర్షి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం .
ఈ విధంగా మన గురువు ఎవరో తెలుసుకోవచ్చు
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Navamsha Phalam - Jataka Parijata,
If a person be born in Navamsha of:
1) Surya - He will be evil minded, strong, prolific, rich tawny eyed and lustful.
2) Moon - He will be voluptuous, addicted to young women not his own, learned and rich in cows.
3) Mars - He will be addicted to cruel deeds, fickle minded, of wandering habits, afflicted with bilious complaints and avaricious.
4) Mercury - He will be liberal, impassioned, handsome and well known for his learning and good name.
5) Jupiter - He will have golden hair in his person and will eminent talented, beautiful, clever in counsel, speak learnedly, of cheerful mien and liked by emperors.
6) Venus - He will delight in the society of women not his own, be liberal, comfortably placed and learned.
7) Saturn - He will be evil- minded, indigent, with large teeth and afflicted with ailments.
Ref: - Jataka Parijata
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Rahuvu:
* అదనపు ధైర్యం
* * పంచేద్రియాలు నియంత్రణలో ఉండనివ్వదు.
- శని శుక్రులు, వీరికి మంచి మిత్రులు.
* రహస్య ఆలోచనలు
రాహువు మొదటి భావంలో: జాతకులు ఇతరుల సలహాలు తీసుకొనుట మంచిది. ఇతరులనుండి సహాయం ఆశించకునిన మంచిది.
రాహువు రెండవ భావంలో: మారక స్థానము. ధనం లేదా కుటుంబం, ఎదో ఒకటి మాత్రమే లభించును.
రాహువు మూడవ భావంలో: కపటి బుద్దులు & పనులు. నల్ల ధనం. స్మగుల్లింగ్. వెరీ పవర్ఫుల్. రెమెడీ అవసరం లేదు.
రాహువు నాల్గవ భావంలో: తన దగ్గర ఉన్నది అనుభవించక, మరొక దాని వైపు చూస్తారు.
రాహువు ఐదవ భావంలో: పితృ & నాగ దోషం. మొదటి సంతానం మరణం లేదా మొదటి సంతానంతో సరిగా ఉండక పోవడం.
రాహువు ఆరవ భావంలో: జీవితములో సమతుల్యత ఉండదు.శత్రువులను జయించుతారు. రాహువుకు బలమైన స్థానం. కాన్సర్ కారకం. అజీర్ణ సమస్య.
రాహువు ఏడవ భావంలో: croud లో ఉండాలంటే భయం. వ్యక్తి గత & వివాహ జీవితము ఇబ్బందికరం.జీవితములో రాజీ పడవలసి వస్తుంది. సొంత నిర్ణయాలు మంచిది.
రాహువు ఎనిమిదవ భావంలో: very powerful. search of life and secrets. భయాన్ని కొద్దీ కొద్దిగా జయిస్తారు. జీవిత పరమార్ధం తెలుసు కుంటారు.
రాహువు తొమ్మిదవ భావంలో: మంచిది కాదు. మాతాచారాల మీద భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు.పుట్టిన ప్రదేశానికి దూరముగా వెళ్లి జీవిస్తారు. 42 వ సం. నుండి అదృష్టం కలసివస్తుంది.
రాహువు పడవ భావంలో: గోల్డెన్ ఏజ్ 36 నుండి 42 తామున్న రంగములో రాణింపు & గుర్తింపు.
రాహువు పదకొండవ భావంలో: కోరికలను నెరవేర్చుకొంటారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
రాహువు పన్నెడవ భావంలో: ఆకస్మిక నష్టాలు & దగ్గరి లేదా తమవారిని కోల్పోవడం. ప్రకృతికి బలి అవ్వడం జరుగును.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
కృతేత్వాధానలగ్శశ్చ |
త్రేతా యాంతుజలోదయః|
శీర్షోదయోద్వాపరేతు|
కలౌభూపత సంస్కృతం||
కృతయుగంబున గర్భాదాన లగ్నం జన్మలగ్నమనియు
త్రేతాయుగమున జలోదయలగ్నమే జన్మలగ్నమనియు
ద్వాపరయుగంబున శీర్షోదయలగ్నమే జన్మలగ్నమనియు
కలియుగంబున భూపతన లగ్నమే జన్మలగ్నమనియు చెప్పబడియున్నది భూమిపై శిశువు పడినసమయమునే ప్రధానముగా గైకొని లగ్నం నిర్ణయం చేయాలి
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
అధి యోగం: చంద్రాత్తు, 6 7 8 స్థానాలలో గురువు బుధుడు & శుక్రుడు నిలిచిన అధియోగం కలుగును. ఈ యోగం కల జాతకులు అపర కుబేరుడు.
ఉదాహరణకు బిల్ గేట్స్
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
LESSON FROM AV SUNDARAM SIR
This one for Astro Researchers.
A littlle bird told me " the first six houses are Internal and the next six houses are External in a chart. lets look the first six houses and the native.
First house..........Sense of TOUCH (Skin)
Second house.....Sense of SIGHT (Eyes)
Thrid house.........Sense of SOUND (Ears)
Fourth house......Sense of SMELL(Nose)
Fifth house..........Sense of TASTE (Tongue)
Sixth house..........Sense of DISCREATION (the 6 th Sense).
The strength of the house and its lord can give an idea about the Natives approach.
for example..
=1 house strong the Native would like to Touch the Object before buying.
= 2 house strong the Native would like to See the object before buying.
= 3 house strong the Native would like to Hear about the Object before buying.
= 4 house strong the Native would like to Inspect closely before buying.
= 5 house strong the Native would like to experement before buying.
= 6 house strong the Native would over ride all the above before buying the Object.
THERE IS A LOT MORE ABOUT THE NATIVE IS THESE HOUSES.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?
మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.
నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు.
గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు.
రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.
దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.
పంచకరహితము
ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.
శూన్యమాసము
శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.
మూఢము లేక మౌఢ్యమి
రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.
కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?
కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.
త్రిజ్యేష్ట విచారణ
తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.
Posts: 133
Threads: 1
Likes Received: 120 in 100 posts
Likes Given: 1
Joined: Nov 2019
Reputation:
10
|