08-11-2019, 02:35 PM
(This post was last modified: 11-11-2019, 11:53 AM by dev369. Edited 2 times in total. Edited 2 times in total.)
Astrology books available soon
బ్రహ్మ జ్ఞానం
|
08-11-2019, 02:35 PM
(This post was last modified: 11-11-2019, 11:53 AM by dev369. Edited 2 times in total. Edited 2 times in total.)
Astrology books available soon
08-11-2019, 02:43 PM
రాశి చక్రంలో శనీశ్వరుని పై కుజుడు లేదా రాహు దృష్టి కలిగి, నవాంశలో శని స్థితి మేషం లేదా వృచ్చికం అయినచో శిశువు జన్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరముల లోపు మరణించడం జరుగుతుంది
08-11-2019, 02:44 PM
భవిష్య పురాణం ప్రకారం-----
పాడ్యమి అగ్ని దేవుడు ద్వితీయ బ్రహ్మ తృతీయ కుబేర చతుర్దశి వినాయకుడు పంచమి నాగరాజు షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి సప్తమి సూర్య భగవానుడు అష్టమి శివుడు నవమి దుర్గాదేవి దశమి యముడు ఏకాదశి విశ్వ దేవుడు ద్వాదశి విష్ణువు త్రయోదశి కామదేవుడు అధిపతులు చతుర్దశి శివుడు పౌర్ణమి చంద్రుడు
08-11-2019, 02:46 PM
మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే.. దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయించబడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు. ఫలితాలు: కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు. అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం. గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రంలో మొదటి ఇంట ప్రారంభం అయి 9వ ఇంట సమాప్తం అవుతుంది. ఫలితాలు: ఆర్ధిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు. వాస్తుకి కాలసర్ప దోషం: 2వ ఇంట మొదలయి 10వ ఇంట సమాప్తం. ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు. సంకాపాల కాలసర్ప దోషం: 3వ ఇంట మొదలై 11వ ఇంట సమాప్తం. ఫలితాలు: తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు. పద్మ కాలసర్ప దోషం: 4వ ఇంట ప్రారంభమై 12వ ఇంట సమాప్తం. ఫలితాలు: జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు. మహా పద్మ కాలసర్ప దోషం: 5వ ఇంట ప్రారంభం అయి 1వ ఇంట సమాప్తం. ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ. తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం. ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతంలో ఇబ్బందులు. కర్కటక కాలసర్ప దోషం: 7వ ఇంట ప్రారంభం 3వ ఇంట సమాప్తం. ఫలితాలు: భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు. శంఖ చూడ కాలసర్ప దోషం: 8వ ఇంట ప్రారంభం 4 వ ఇంట సమాప్తం. ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్థితి. ఘటక కాలసర్ప దోషం: 9 వ ఇంట ప్రారంభం 5వ ఇంట సమాప్తం. ఫలితాలు: వ్యాపార, ఉద్యోగ సమస్యలు. విషార కాలసర్ప దోషం: 10వ ఇంట ప్రారంభం 6వ ఇంట సమాప్తం. ఫలితాలు: ఆర్ధిక, వ్యాపార కష్టాలు. శేషనాగ కాలసర్ప దోషం: 11వ ఇంట ప్రారంభం 7వ ఇంట సమాప్తం. ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు. అపసవ్య కాలసర్ప దోషం: 12వ ఇంట ప్రారంభం 8వ ఇంట సమాప్తం. ఫలితాలు: ఆలస్య వివాహం. కాల సర్ప దోషం ఇవి మొత్తం 12 రకాలు : అనంత కాల సర్ప యోగము , కులిక లేక గుళిక కాల సర్ప యోగము, వాసుకి కాల సర్ప యోగము, శంఖ పాల కాల సర్ప యోగము, పద్మ కాల సర్ప యోగము, మహా పద్మ కాల సర్ప యోగము, తక్షక లేక షట్ కాల సర్ప యోగము, కర్కోటక కాల సర్ప యోగము, శంఖ చూడ లేక శంఖ నంద లేక షన్ చాచుడ్ కాల సర్ప యోగము, ఘటక లేక పాతక కాల సర్ప యోగము, విషక్త లేక విషదావ కాల సర్ప యోగము, శేష నాగ కాల సర్ప యోగము, కాలసర్ప యోగ ఫలితాలు జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట గర్భం శిశువు మరణించుట , వైవాహిక జీవతంలో అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట మరణించన శిశువును ప్రసవించుట, గర్భం నిలవక పోవుట, అంగ వైకల్యంతో సంతానం కలుగుట, దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట, మానసిక ప్రశాంత లేక పోవుట ప్రమాదాలు అవమానాలు, పర స్త్రీ సంపర్కం లాంటి ఫలితాలు కలసర్ప దోషాలు కాలసర్ప దోష యంత్రంను 40రోజుల పాటు 1,24,000 సార్లు జపం చేసి యంత్రములు ధరించుట వలన దోష నివారణ అవుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. వ్యక్తీ గతం కాదనీ, సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.
08-11-2019, 02:48 PM
12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు..
ఎలాంటి తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసా? ?శ్రీ? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!? 12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం.. 1. మేషం -? తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. 2. వృషభం -? తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. 3. మిథునం -? తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 4. కర్కాటకం-? తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. 5. సింహం -? తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. 6. కన్యారాశి -? తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. 7. తులారాశి-? తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 8. వృశ్చికం-? తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. 9. ధనుస్సు -? తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి. 10. మకరం -? తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి. 11. కుంభం -? తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 12. మీనం -? తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే..ఈ తాంబూలాన్ని..ఒక ముత్తైదువను పిలిచి ఆమెకు..బొట్టుపెట్టి ఇవ్వవలెను. స్వస్తి..!!? ఓం నమః శివాయ..!!? సర్వే జనా సుఖినోభవంతు..!? ?శ్రీ మాత్రే నమః?
08-11-2019, 02:50 PM
రాగల 13 సంవత్సరములలో సంభవించు సూర్య ,చంద్ర గ్రహణములు (2018నుండి2030వరకు )
31-01-2018 చంద్రగ్రహణము 15-02-2018సూర్య గ్రహణము 13-07-2018సూర్య గ్రహణము 27-07-2018చంద్ర గ్రహణము 11-08-2018సూర్య గ్రహణము 06-01-2019సూర్య గ్రహణము 21-01-2019చంద్ర గ్రహణము 02-07-2019 సూర్య గ్రహణము 16-07-2019 చంద్ర గ్రహణము 26-12-2019 సూర్య గ్రహణము 10-01-2020 చంద్ర గ్రహణము 05-062020 చంద్ర గ్రహణము 21-062020 సూర్య గ్రహణము 05-07-2020చంద్ర గ్రహణము 30-112020 చంద్ర గ్రహణము 14-12-2020సూర్య గ్రహణము 26-05--2021చంద్ర గ్రహణము 10-06-2021సూర్య గ్రహణము 19-11-2021చంద్ర గ్రహణము 04-12-2021సూర్య గ్రహణము 30-04-2022 సూర్య గ్రహణము 16-05-2022 చంద్ర గ్రహణము 25-10 -2022 సూర్య గ్రహణము 08 -11 -2022 చంద్ర గ్రహణము 20 -04 -2023 సూర్య గ్రహణము 05-05 -2023 చంద్ర గ్రహణము 14 -10 -2023 సూర్య గ్రహణము 28-10 -2023 చంద్ర గ్రహణము
08-11-2019, 02:52 PM
మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన ---తిథులు :
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది. మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం. సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది. తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను. కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి. ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు. యుధిష్టరుని జననం : ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో. సుమారు క్రీ పూ 15-8-3229. భీముని జననం : మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి . ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు. అర్జునుని జననం: శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి. భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు. నకుల & సహదేవుల జననం : భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం. అర్జునుని కన్నా 1సం 15రో చిన్నవాళ్ళు. శ్రీ కృష్ణ జననం : శ్రీముఖ నామ సం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి . అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం. దుర్యోధనుడి జననం : భీముని మరుసటి దినం. హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తారు. అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి దుశ్శల (సైంధవుని భార్య). పాండురాజు మరణం: సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి. అప్పటికి ధర్మరాజు వయసు 16సం 6నె 7రో. పాండవుల హస్తినపుర ప్రవేశం: సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి. పాండురాజు మరణాంతర 16 రో కు. యుధిష్టరుని పట్టాభిషేకం: శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి. అతని వయసు 31సం 5రో. అక్కడినుండి 5సం 4నె 20రో హస్తినాపురం లో ఉంటారు. వారణావ్రత ప్రవేశం : ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి. లాక్ష గృహ దహనం: కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము. ఘటోత్కచ జననం: సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ. పాండవులు ఏక చక్రపురం లో సాధారణ నామ సం చైత్ర శుక్ల విదియ నుండి ఆస్వీయూజ శుక్ల విదియ వరకు అనగా 6నెలలు ఉంటారు. బకాసుర వధ : సాధారణ నామ సం శుక్ల దశమి. పాండవులు ఏకచక్రపురం లో సాధారణ మార్గశిర బహుళ పంచమి వరకు అనగా ఇంకనూ 1నె10రో ఉన్న తర్వాత పాంచాల రాజ్యం కు బయలుదేరుతారు. ద్రౌపది స్వయంవరం: సాధారణ నామ సం పుష్య మాస శుక్లపక్ష దశమి. విరోధి నామ సం పుష్య పౌర్ణమి వరకు 1సం 15రో పాటు పాంచాల రాజ్యం లో వుంటారు. హస్తినాపురం రాజధాని గా 5సం 6నె పాటు అనగా విరోధి కృత నామ సం మాఘ శుక్ల విదియ నుండి పింగల శ్రావణ శుక్ల విదియ వరకు. ఈ కాలం లొనే ఇంద్రప్రస్థం నిర్మాణం జరుగుతుంది. అప్పటికి ధర్మజుని వయసు 45సం 9నె 27రో. ధర్మరాజు పట్టాభిషేకం : పింగళ ఆశ్వీయుజ శుక్ల దశమి. యధిష్టురుని వయసు 46 సం. అర్జునుని తీర్థయాత్రలు: కాలయుక్తి నుండి ప్రమోదూత వరకు. సుభద్ర తో పరిణయం: ప్రమోదూత వైశాఖ శుక్ల దశమి. ఖాండవవన దహనం : ప్రమోదూత శ్రావణ శుక్ల విదియ. మయసభ 1సం 2నె లో నిర్మితమవుతుంది. మయసభ ప్రవేశం : ప్రజోత్పత్తి ఆస్వీయుజ శుక్ల దశమి ధర్మజుని వయసు 60 సం 5 రో. ఇంద్రప్రస్థం రాజధాని గా సర్వజిత్ ఆస్వీయుజ శుక్ల దశమి వరకు అనగా 16 సం పాలిస్తారు. జరాసంధ వధ : సర్వజిత్ కార్తీక శుక్ల విదియ నుండి 14 వ రోజు వరకు పోరాడి సాయంత్రం న. రాజసూయ యాగం : సర్వధారి చైత్ర పౌర్ణమి. యధిష్టురుని వయసు 76సం 6నె 15రో. మాయాజూదం సర్వధారి శ్రావణ తదియ & సప్తమి నాడు. ధర్మజుని వయసు 76సం 10నె 2రో. కనుక మొత్తం 36 సం 6నె 20రో అనగా విరోధి కృతు మాఘ శుక్ల విదియ నుండి సర్వధారి శ్రావణ బహుళ సప్తమి. అరణ్యవాసం సర్వధారి శ్రావణ బహుళ అష్టమి నాడు ప్రారంభమౌతుంది. అప్పటికి యధిష్టురుని వయసు 76సం 10నె 18రో. 12సం అరణ్యవాసం శార్వరి శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది. 1సం అజ్ఞాతవాసం ప్లవ శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది. కీచక వధ : ప్లవ ఆషాఢ బహుళ అష్టమి. అతని సోదరురులు మరుసటి దినం మరణిస్తారు. ఇవన్నీ చాంద్రమానం ప్రకారం సం. వీటిలో ప్రతి 5 సం కు 2 అధిక మాసాలు మరియు 13 సం లలో 5 అధిక మాసాలు ,12 రోజులు అధికంగా ఉంటాయి. వీటి లెక్క తిథులలో సహా ధర్మజునికి & భీష్మునికి తెలుసు కాబట్టే ఉత్తర గోగ్రహణం నందు పాండవులు బయటకు తెలుస్తారు. కానీ దుర్యోధనుడు సూర్యమానం ప్రకారం ఇంకా అజ్ఞాతవాసం పూర్తి అవలేదని భ్రమ పడతాడు. అందుకే ఉత్తర గోగ్రహణం నందు బయటపడడానికి ముందు రోజే మొత్తం 13 సం కాలం పూర్తి అగుతుంది. ఇదంతా అర్జునుడు ఉత్తర కుమారునికి వివరిస్తూ తాను గాండీవం ను 30 సం ధరించానని ఇంకనూ 35 సం దరిస్తానని చెప్తాడు. బహుళ నవమి రోజు అర్జునుడు అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తాడు. అప్పటికి ధర్మజుని వయసు 89సం 10నె 9రో. పాండవులు ఉపప్లవ్యం లో 1సం 2నె 17ర ో ఉంట ారు. ఈ కాలం ల ొనే ఉత్తర&అభిమన్యుల వివాహం శుభకృత్ జ్యేష్ఠ మాసం లో జరుగుతుంది. ఆస్వీయుజ మాసం లో ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాలు రాబోయే కాలం లో జరగబోయే వినాశానికి హేతువులు గా చెప్తారు. శ్రీ కృష్ణ రాయబారం : కృష్ణుడు శుభకృత్ కార్తీక శుక్ల విదియ రేవతి నక్షత్రం నాడు ప్రారంభమై త్రయోదశి నాడు హస్తినపురం కు చేరతాడు.అక్కడి నుండి బహుళ అష్టమి వరకు శాంతి కాముకం గా రాయబారం నడుపుతాడు. అష్టమి రోజే విశ్వరూప సందర్శనం జరుగుతుంది. రాయబారం విఫలమైన తర్వాత అదే రోజు పుష్యమి నక్షత్రం నాడు తిరుగు ప్రయాణం అవుతూ కర్ణుడి తో ఈ విధం గా అంటాడు. వారం రోజులలో అనగా జ్యేష్ఠ నక్షత్రం పాడ్యమి నాడు కురుక్షేత్ర సంగ్రామం జరగపోతుంది. సిద్ధంగా ఉండండి అని ఉపప్లవ్యం కు బయలు దేరతాడు. మార్గశిర శుక్ల విదియ నుండి ద్వాదశి వరకు సైన్యాల మోహరింపు, యుద్ధ సరంజామా , సామర్ధ్య పరీక్షలు నిర్వహించ బడతాయి. యుద్ధ ప్రారంభం : శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల త్రయోదశి / చతుర్దశి భరణి నక్షత్రం మంగళవారం నాడు ప్రారంభమౌతుంది. అప్పటికి ధర్మరాజు వయసు 91సం 2నె 9రో . దీనికి ముందు రోజే అర్జునునికి భగవద్గీత ను బోధిస్తాడు. మార్గశిర బహుళ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్య పై చేరతాడు. అభిమన్యుని మరణం : మార్గశిర బహుళ దశమి తన 17 వ ఏట. అప్పటికి అతని వివాహం జరిగి 6నెలలు మాత్రమే. ఉత్తర 6నెలల గర్భిణీ. సైంధవ మరణం : మార్గశిర బహుళ ఏకాదశి. ద్రోణుడు ద్వాదశి నాడు కర్ణుడు చతుర్దశి నాడు శల్యుడు శుక్ల పాడ్యమి సాయంత్రం మరణిస్తారు. దుర్యోధనుడి మరణం : పుష్య మాస శుక్ల పాడ్యమ ఉపపాండవుల మరణం : పుష్య శుక్ల పాడ్యమి నాటి రాత్రి వేళ. ధర్మరాజు పట్టాభిషేకం : శుభకృత్ పుష్య పౌర్ణమి. అప్పటికి ఆయన వయసు 91సం 3నె 10 రో. పుష్య బహుళ విదియ నుండి అష్టమి వరకు భీష్ముని చే అనేక విషయాలు పాండవుల కు చెప్పబడతాయి.హస్తిన కు వెళ్లిన 15 రోజుల తర్వాత మళ్ళీ మాఘ శుక్ల అష్టమి నాడు మళ్ళీ కలుసుకుంటారు. అష్టమి నుండి పంచ ప్రాణాలలో రోజుకు ఒక్కొకటి చొప్పున భీష్ముడు విడిచారు అని దీనిని భీష్మ పంచకం అని అంటారు. భీష్ముడు మార్గశిర సప్తమి నుండి మాఘ ఏకాదశి వరకు 48 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నట్లు చెప్తారు. అశ్వమేధ యాగం : శుభకృత్ మాఘ శుక్ల ద్వాదశి. 15సం అనంతరం ధృతరాష్ట్రుడు వన వాసానికి కార్తీక మాసంలో వెళతాడు. 3సం తర్వాత పాండవులు పెద్ద వారు మరణించారని తెలుసుకుని వారిని చూడడానికి అడవులకు వెళ్తారు. ఒక నెల తర్వాత గాంధారి , ధృతరాష్ట్రుడు, కుంతి మొదలగు వారు అడవులలో అగ్నికి ఆహుతి అవుతారు. యుద్ధానంతరం 36 సం కు ద్వారక లో ముసలం పుట్టి యాదవులు వినాశనం జరుగుతుంది. ధర్మరాజు పాలన : శుభకృత్ పుష్య పౌర్ణమి నుండి బహుదారణ్య పుష్య పౌర్ణమి వరకు ధర్మరాజు 36సం 2నె 15రో పాటు పరిపాలిస్తాడు. కలియుగ ప్రారంభం : ప్రమాధి శుక్ల పాడ్యమి నాడు శ్రీ కృష్ణ నిర్యాణం తో కలియుగం ఆరంభం అవుతుంది. అది క్రీ పూ,... 20 - 2 - 3102. 2:27:30 AM 7 రోజుల అనంతరం ద్వారక సముద్రం లో మునిగి పోతుంది. యుధిష్టర శకం ఆయన పట్టాభిషేకం రోజునుండి మొదలవుతుంది. పాండవుల రాజ్య నిర్గమన ద్వారక నిమ్మజ్జన అనంతరం 6నె 11రో అనగా ధర్మజుని వయసు 127సం 6రో ఉన్నపుడు 36 సం పరీక్షిత్తు నికి రాజ్యాభిషేకం చేస్తారు. స్వర్గారోహణ గురించి పూర్తి వివరణ తెలియదు కాని అది 26 సం తర్వాత జరిగింది గా చెప్తారు. వ్యాసుడు గణపతి కి స్వర్గారోహణ తర్వాతే మహాభారతం చెప్తాడు అని అంటారు. పరీక్షిత్తు 60 సం రాజ్యపాలన అనంతరం మరణిస్తాడు. 25 సం జనమేజయుడు రాజు అవుతాడు. మహాభారత రచన అనంతరమే వేద వ్యాసుడు కలియుగం ప్రారంభమైన 60 సం కు భాగవత రచన చేశాడని చెప్తారు.
08-11-2019, 03:00 PM
(This post was last modified: 08-11-2019, 03:00 PM by dev369. Edited 1 time in total. Edited 1 time in total.)
జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు
జన్మపత్రిక ననుసరించి ఆయా జన్మ నక్షత్రకులకు సంబంధిత రుద్రాక్షలను ధరించటంవలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దిగువన జన్మనక్షత్ర పరంగా ధరించవలసిన రుద్రాక్షలు ఇవ్వబడినాయి. జన్మ నక్షత్రం రాశి అధిపతి ధరించవలసిన రుద్రాక్ష అశ్వని కేతు 9 ముఖి భరణి కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి కృత్తిక రవి 1 ముఖి మరియు 12 ముఖి రోహిణి చంద్రుడు 2 ముఖి మృగశిర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి ఆరుద్ర రాహు 8 ముఖి పునర్వసు గురుడు 5 ముఖి పుష్యమి శని 14 ముఖి ఆస్లెష బుధుడు 4 ముఖి మఖ కేతు 9 ముఖి పూర్వ ఫాల్గుణి శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి ఉత్తర ఫాల్గుణి రవి 1 ముఖి మరియు 12 ముఖి హస్త చంద్రుడు 2 ముఖి చిత్ర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి స్వాతి రాహు 8 ముఖి విశాఖ గురుడు 5 ముఖి అనురాధ శని 14 ముఖి జ్యేష్ఠ బుధుడు 4 ముఖి మూలా కేతు 9 ముఖి పూర్వాషాఢ శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి ఉత్తరాషాఢ రవి 1 ముఖి మరియు 12 ముఖి శ్రావణ చంద్రుడు 2 ముఖి ధనిష్ట కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి శతభిష రాహు 8 ముఖి పూర్వాభాద్ర గురుడు 5 ముఖి ఉత్తరాభాద్ర శని 14 ముఖి రేవతి బుధుడు 4 ముఖి
08-11-2019, 03:02 PM
నక్షత్రములు - ఆరాధన.
రత్నధారణ, పూజ, హవనం, యజ్ఞం వంటివి. నక్షత్రశాంతికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. వివిధ చెట్లను పూజించటంవల్ల నక్షత్ర-గ్రహశాంతి జరిగి వ్యక్తి జీవితంలోని సమస్యలు ఒకటొకటిగా తొలగిపోతాయి. అశ్విని నక్షత్ర వృక్షం : కుచల. ఈ నక్షత్రంలో జన్మించినవారు కుచల చెట్టును నిత్యం పూజించాలి. చెట్టువేరుకు నీరుపోసి, అక్షతలు చల్లి, ప్రదక్షిణ చేయాలి. భరణి నక్షత్ర జాతకులు ఉసిరిక చెట్టుని నిత్యం జలంతో తడిపి ప్రదక్షిణ చేయాలి. పొరపాటున కూడా ఈ చెట్టు దగ్గర మూత్రవిసర్జన వంటివి చేయకూడదు. కృత్తిక నక్షత్ర జాతకులు మేడివృక్షాన్ని నిత్యం నీళ్ళు, అక్షతలతో ప్రదక్షిణ చేయాలి. రోహిణి నక్షత్రంలో జన్మించినవారు నేరేడు చెట్టు మొదట్లో చెక్కర, బియ్యం లేదా గోధుమపిండి వేసి ఒక గ్లాసు నీరుపోసి ప్రదక్షిణ చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులు బుధవారంరోజు జలంతో రేగుచెట్టుని పూజించటం వల్ల సుఖ సమృద్ధి లభిస్తుంది. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినవారు కృష్ణకమలాన్ని పూజించటం లేదా దీంతో దేవతారాధన చేయటం వల్ల సుఖం కలుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులు తుమ్మచెట్టును ఆరాధించాలి. చెట్టు మొదట్లో నీరుపోసి పూజ చేయాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించినవారు రావిచెట్టుకు నీరుపోసి నిత్యం ప్రదక్షిణం చేయటం శుభకరం. ఆశ్లేష నక్షత్ర జాతకులు చంపా వృక్షానికి ప్రతిరోజూ నీరుపోసి పూజించాలి. మఖ నక్షత్రంలో జన్మించినవారుమర్రిచెట్టును పూజించినట్లయితే విశేష ఫలప్రదం లభిస్తుంది.. మర్రిచెట్టు సహజంగానే పూజనీయ వృక్షం. అందరూ పూజిస్తారు. పూర్వఫల్గుణి ( పుబ్బ )నక్షత్రంలో జన్మించినవారు అశోకవృక్షం ఆకులు ఇంటి ద్వారానికి కట్టుకోవటం, వృక్షాన్ని పూజించటం వల్ల సుఖం లభిస్తుంది. ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టును ( వేరును కానీ )పూజించాలి. సూర్య మంత్రం జపించాలి. 11 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి హస్త నక్షత్ర జాతకులు ఇంట్లో మల్లెచెట్టు నాటి పూజించటం మంచిది. దీనివల్ల వ్యాపారవృద్ధి చెందుతుంది. చిత్త నక్షత్రం లో జన్మించిన వారు మారేడు చెట్టును పూజించాలి.మారేడు చెట్టుకు ప్రదక్షిణలు, సూర్యోదయానే దీపారాధన చేయాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మద్ది చెట్టుకు పూజ, ప్రదక్షిణలు..నువ్వుల నూనె తో దీపారాధన రాహుకాలం లో చేయాలి విశాఖ నక్షత్రం లో పుట్టినవారు నంది వర్ధనం చెట్టు కానీ వేప చెట్టు ను కానీ పూజించాలి. సూర్యోదయానే దీపారాధన చేసి ఉడికిన శనగలు నైవేద్యం పెట్టాలి. గురు మంత్రం జపించాలి. అనురాధ నక్షత్ర జాతకులు మారేడు చెట్టును పూజించాలి.మారేడు చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి. వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినవారు వేపచెట్టుని రోజూ నీటితో మొదలు తడిపి సేవించాలి. ఆదివారం నువ్వులు, చెక్కెర మొదట్లో వేయాలి. మూల నక్షత్రం లో పుట్టినవారు వేగి చెట్టు కానీ, తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి ని కానీ పూజించాలి.. ఆవు నేతి దీపారాధన చేయాలి.గణపతి మంత్రం జపించాలి. పూర్వాషాడ, శ్రవణం..ఈ రెండు నక్షత్రాల జాతకులు జిల్లేడుచెట్టును సేవించాలి. బుధవారం చేసే పూజ అధిక ఫలప్రదం. ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షానికి ప్రతిరోజూ నీళ్ళు పోయాలి. ధనిష్ఠ నక్షత్రంలో జన్మించినవారు కొబ్బరిచెట్టును పూజించటం శుభం. కానీ, ఇది అన్నిచోట్లా లభించదు. కాబట్టి వీలులేనివారు పూజాగృహంలో కొబ్బరికాయను ఉంచుకుని పూజించాలి. శతభిష నక్షత్రంలో జన్మించినవారు మామిడిచెట్టును పూజించటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షాన్ని అక్షతలతో పూజించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు గోరింటచెట్టుని అక్షతలతో పూజించాలి. రేవతి నక్షత్రంలో జన్మించినవారు రేగుచెట్టుకి నీరుపోసి పూజించాలి.
08-11-2019, 03:03 PM
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతి!
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది. పాడ్యమి: అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి. విదియ: అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది. తదియ: అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం. చవితి: అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట. పంచమి: అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది. షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి. సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది. అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము. నవమి: అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది. దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి. ఏకాదశి: అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును. ద్వాదశి: అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును. త్రయోదశి: అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది. చతుర్దశి: అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం. అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం. పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి
08-11-2019, 03:04 PM
1. కరణం అంటే ఏమిటి?
చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని – ప్రారంభిస్తే సంపద, వారం వల్ల – ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కాబట్టి వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది. 2. కరణాలు – వాటిలో జన్మించిన వారి లక్షణాలు కారణాలను బట్టి ఆ కాలం లో జన్మించిన వారి లక్షణాలను చెప్పవచ్చు. అలాగే ఆ కరణ లక్షణాన్ని బట్టి అది ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా నిర్ణయిస్తారు. 3. బవకరణం బవ కరణం లో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులై ఉంటారు. వారికి అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అబద్ధాలకూ, అసాంఘిక కార్య కలాపాలకూ దూరంగా ఉంటారు. ఊహల్లో తేలకుండా నిజానిజాలను గమనిస్తారు. చాలా తెలివైన వారుగా ఉంటారు. అందరిచేతా గౌరవింపబడతారు ప్రేమింపబడతారు. 4. బాలవ ఈ కారణం లో జన్మించిన వారు దైవభక్తినికలిగి ఉంటారు. పుణ్యకార్యాసక్తులై ఉంటారు. జీవితం లో ఎక్కువ భాగం తీర్థ యాత్రలతో గడుపుతారు. వీరు ఉన్నత విద్యావంతులవుతారు. 5. కౌలవ ఈ కారణం లో జన్మించిన వారు సంఘజీవులుగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలకు వీరు చిరునామాగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేయడం స్నేహితుల నుండీ సహాయం పొందటం వీరి నిత్య జీవితం లో తరచుగా జరుగుతూ ఉంటాయి. వీరికి ఆత్మాభిమానం నిండుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరంగా మాట పడరు. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగే చోట ఉండరు. 6. తైతుల వీరు చాలా అదృష్టవంతులు. చాలా సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పెద్ద పెద్ద వ్యాపారాదులకూ, భవంతులకూ వీరు అధిపతులుగా ఉంటారు. ప్రేమ వీరి జీవితం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వీరు అందరితోనూ దయగా ఉంటారు. 7. గరజ ఈ కారణం లో జన్మించినవారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు శ్రమ జీవులు. బద్ధకం వీరి ఛాయలకు కూడా రాదు. అవసరమైన చోట, కావలసిన పనికొరకు వీరు ఎంతటి కష్టాన్నైనా పడతారు. శ్రామికులు, హాలికులు ఈ కోవకు వస్తారు. 8. వనజి ఈ కారణం లో జన్మించిన వారు అపారమైన జ్ఞానాన్ని, తెలివితేటలని కలిగి ఉంటారు. వ్యాపారాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తారు. ప్రయాణాలనీ విహారయాత్రలనీ ఎక్కువగా ఇష్టపడతారు. వీరి వ్యాపార దృష్టి అసమానమైనది. 9. విష్టి దీనినే విష్టి కారణం అనికూడా అంటారు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా దోషకరమైన కరణం. కానీ ఈ కారణం లో జన్మించిన వారు చాలా అనుమాస్పదంగా ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలలో, దోష కార్యాలలో పాల్గొంటారు. పాప చింతనను కలిగి ఉంటారు. పగబట్టే మనస్తత్వం వీరిది. ప్రతీకారం తీర్చుకోకుండా ప్రాణం పోయినా వాదలరు. 10. శకుని వీరు న్యాయబద్ధులై ఉంటారు. ఈ కారణం లో జన్మించిన వారు ఎక్కువగా జంతుప్రేమికులై ఉంటారు. మానవత్వాన్ని కలిగి ఉంటారు. గొడవలు జరిగే చోట వారి వాక్చాతుర్యం, తెలివి తేటలతో సంధి కుదురుస్తారు. వీరు వైద్యులు, లాయర్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. 11. చతుష్పాతు ఈ కరణం లో జన్మించినవారు మతధర్మాలను పటిష్టంగా ఉంచుతారు. సంస్కృతినీ సాంప్రదాయాన్నీ నమ్మి ఉంటారు. ఎంతటి క్రూర జంతువయినా వీరికి త్వరగా మాలిమి అవుతుంది. వీరు సమర్థవంతమైన పశువైద్యులు కాగలరు. 12. నాగవం జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ కరణం కూడా దోషకరమైనడి గా చెబుతారు. ఈకరణం లో జన్మించినవారు కొంత మేరకు దురదృష్టవంతులని చెప్పవచ్చు. వీర్ జీవితం గొడవలు, తగాదాలు, వివాదాల మయంగా ఉంటుంది. అత్యంత శ్రమ పడినా కొన్ని సార్లు వీరికి ఫలితం దక్కదు. ఈ కారణం లో జన్మించినవారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. 13. కింస్తుఘ్నం ఈ కారణం ల జన్మించినవారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. వీరికి శారీరక సామర్థ్యం అధికంగా, అసాధారణంగా ఉంటుంది. జీవితం లో అన్నిరకాల సంతోషాలనూ వీరు చవిచూస్తారు. చాలా సౌభాగ్యవంతమైన, సౌకర్య వంతమైన జీవితాన్ని వీరు పొందుతారు. మంచి విద్యావంతులయి ఉంటారు.
09-11-2019, 01:57 PM
దేవ్ గారు
మీరు చాలా మందికి పనికి వచ్చే విషయాలు ప్రస్తుతించారు. ఈ త్రెడ్ కు పేరు మార్చితే బాగుంటుందేమో! ఆలోచించండి. సూచన "పంచాంగ వివరాలు" లేదా జాతక సూచిక?
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
09-11-2019, 04:38 PM
good information dev 369 gaaru
09-11-2019, 05:00 PM
09-11-2019, 10:20 PM
బాలారిస్ట దోషం
లగ్నంలో శని లేదా తృతీయంలో గురువు లేదా చతుర్దంలో బుధుడు లేదా పంచమ రవి లేదా 6 లో శుక్రుడు లేదా సప్తమం లో కుజ లేదా అస్థమ చంద్రుడు లేదా భాగ్యంలో రాహువు లేదా ద్వాదశం లో కేతువు నిలిచిన బాలారిస్ట దోషం గా పరిగణించాలి. వ్యక్తి యొక్క జాతకంలో బాలారిస్థ దోషం ఉండి, రాశి చక్రంలో శనీశ్వరుని పై కుజుడు లేదా రాహు దృష్టి కలిగి, నవాంశలో శని స్థితి మేషం లేదా వృచ్చికం అయిన మరియు మృత్యు భాగ సంబంధం కలిగిన శిశువు జన్మించిన ఒకటి లేదా రెండు సంవత్సరముల లోపు మరణించడం జరుగుతుంది ఇది ఋషి ప్రోక్తం.
09-11-2019, 10:23 PM
K3VV3 GAARIKI, KAMAL KISHAN GAARIKI THANKS FOR UR SUPPORT
09-11-2019, 10:38 PM
ప్రదోషము
ప్రదోషమంటే అది ఒక కాల విశేషము . ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము . ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము . అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే , అప్పుడు ప్రదోషము అంటారు . కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది . అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి , మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది . అవి , చతుర్థి , సప్తమి , త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు . వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’ మహా ప్రదోషం ’ అంటారు . ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును . ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము . ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము . ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు . సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే . కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ , తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు . ( ఒక ఘడియ = 24 నిమిషాలు ) ఈ ప్రదోష దినము అనధ్యయనము . సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైనచో , కొన్ని అనుష్ఠానములు చేయ వలెను . మామూలుగా చతుర్థి , సప్తములలో ధ్యానము , గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు , కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము . మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వచ్చును . కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చును . దాని వెనుకటి రోజు త్రయోదశి లో మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది . శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు . ఆరోజు కూడా శివ పూజనే చేయవలెను . ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం . మనము రోజూ ఎన్నో పాప కర్మలు చేస్తుంటాము . వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని , మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము . మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను . ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము . పరమ శివుడు తన ప్రమథ గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది . మన పాప కర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి , మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును . ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ , సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు . ఇవి కాక , గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది . అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా , ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి . శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని శని ప్రభావము కూడా తొలగింపబడును . శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు . మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు . అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును . సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగును . సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది . ఆరోజు చేసిన శివపూజ సర్వ పాప హరము , సర్వ పుణ్యదము . ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే , ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి , విద్యాబుద్ధులు , సంపదలు కలుగుతాయి . గురువు వాక్పతి , బుద్ధిని ప్రేరేపించువాడు , మరియు ధన కారకుడు . జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినది. ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు , మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో , ఏకవార రుద్రాభిషేకమో , లఘున్యాస నమక చమక పఠనమో , ఉత్త పాలతో అభిషేకమో , మారేడు దళములతో అర్చననో , ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి . భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు , పొంగిపోతాడు , భోళా శంకరుడు . సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
09-11-2019, 10:40 PM
పంచకరహితం అంటే?
ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం. అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును. 2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి. 4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు. 6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి. 8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు. కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను. అయితే తప్పని సరి పరిస్థితులలో ..... చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్ అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి. మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు. ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం. ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం. తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి. 19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది. వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది. తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది. నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది. లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం. తిథి + వారము + నక్షత్రము + లగ్నము ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం 11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి. 9) 36 ( 4 36 ----- శేషం 0 ----- సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది.
09-11-2019, 10:48 PM
బ్రహ్మముహూర్తం..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. పురాణగాథ బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఏం చేయాలి..? ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు. చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
10-11-2019, 06:02 PM
బ్రహ్మయే ముహూర్తానికి
ముహూర్తకాలం అంటే 48 మినిట్స్ అంటే ఒక రోజు లో సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం ఉండే కాలం. సూర్యుడు ఉదయించే కాలం ఏదైతే ఉందొ ఆ సమయంలో ఉదయించే లేత కిరణాలు బాలా త్రిపుర సుందరి రూపం పరబ్రహ్మను పొందడానికి అంతకన్నా ముందు సమయాన్ని అంటే జీవుడు ఉత్థానం చెందక పూర్వం ఉన్న ఏదైతే సమయం ఉందొ అదే బ్రహ్మ.....బ్రహ్మణి ఇక్కడ సప్తమాతృకా స్వరూపం. మన శరీరంలో శక్తి పీఠాలు ఉంటాయండీ ఆ శక్తి పీఠాలని ఉత్థానం చెయ్యడం ఉద్దీపనం చెయ్యడం సుషుమ్న నాడిని ప్రేరేపించడం. మిత్రులారా...... దయచేసి కేవలం ఓంకారం మాత్రమే ఉఛ్చారణ చెయ్యకండి పక్కనే ఎదో ఒక మంత్రం మాట వరసకు ఓమ్ లేదా ఓం ఉచ్చరించి ఊపిరి తీసుకొంటూ......నమో భగవతే వాసుదేవాయ అను మంత్రం ఉచ్చరించవచ్చుఁ. ఎందుకంటే............ఒక పది రోజులు ఓంకారం మాత్రమే ఉచ్చరించి చూస్తే....మీకే అర్ధం అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండీ మీరు మంచి విషయాలను షేర్ చేస్తున్నారు. కీప్ it అప్. |
« Next Oldest | Next Newest »
|