Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కదంబం
#1
దంబం


నిఘంటు అర్థం — a mixture, a collection; మిశ్రమం, సముదాయము.

మిత్రులందరూ ఇక్కడ అన్ని రకముల విషయాలనూ, చిత్ర విచిత్రమైన, ఆసక్తికరమైన కథనాలనూ, అద్భుతాలు — ఆణిముత్యాలు అన్పించే పలుకులను అందరితో పంచుకోగలరు.

మీ
వికటకవి ౦2

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మనదేశానికి జీరో మైలురాయి ఎక్కడుందో తెలుసా..?
[Image: 636788316037895756.jpg]
మనం ఏదైనా తెలియని ప్రదేశానికి, నగరానికి వెళ్ళాలనుకుంటే, ఎంత దూరం, ఎలా వెళ్ళాలి అని గూగుల్‌ సెర్చ్‌ చేస్తాం. ఎన్ని మైళ్ళు, ఎన్ని కిలోమీటర్లని లెక్కలేస్తుంటాం. అలా చేయాలంటే ముందుగా జీరో మైలురాయినుంచే కదా లెక్కవేయాలి. అలా లెక్కలేయాలంటే మనదేశానికి జీరో మైలురాయి ఎక్కడుందో తెలుసుకోవాలిగా. ఇది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంది. దీన్ని బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలో 1907లో ఏర్పాటు చేశారు. దీనికి చిహ్నంగా అక్కడ ఓ స్తంభాన్ని నిర్మించారు. అలాగే నాలుగు దిక్కులను సూచించే విధంగా ఇక్కడ నాలుగు గుర్రాల బొమ్మలుంటాయి. బ్రిటీష్‌ వారి పరిపాలనా కాలంలో వారు నాగ్‌పూర్‌నే దేశానికి కేంద్రంగా భావించేవారు. అందుకే ఈ ప్రదేశంలోనే జీరోపాయింట్‌ మైలురాయిని ఏర్పాటుచేశారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
[Image: IMG-20181128-WA0003.jpg]

This is not a bride, but a cake.   Prepared by a Libyan chef who won a prize for the most beautiful cake in the world.
.
.
Which piece do you like to have? ;)

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#4
పొగడ దండలు

లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !


గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.


యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...


కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహస్రా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:



వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. ఆ రకమయిన పద్ధతులను గురించి విపులంగా పొగడ దండలు 2 టపాలో చూదాం.

స్వస్తి.


(ఇది xbలో సరిత్ బ్రో దారం నుంచి గ్రహించినది)

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
పొగడ దండలు — 2

భజంత్రీలు

పొగడ దండలు అనే టపాలో పొగడ్తల గురించి కొంత మాట్లాడు కున్నాం కదా ? 
ఇప్పుడు పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలు, 
మొహ మాటపు పొగడ్తలు, 
బలవంతపు పొగడ్తలు, 
బరి తెగించిన పొగడ్తలు,
ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు(తిట్లు) కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అని సొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడో, లేదో, చుట్టూ ఉన్న వాళ్ళు వహ్వా, వహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.

ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడో, కానీ,సొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.

డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినా, ఎలాగయినా వాయించు కో వచ్చును కదా.
సొంత డబ్బా సంగతి ఇలా ఉంటే, ఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తే, నీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.
నువ్వు నా వీపు గోకితే, నేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, పొగడ్తల రకాలు చూద్దాం .

మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.
బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.
బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని , నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటే, స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటే, నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూద్దాం :

పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు
ముద్దియలా హరికి గలరు ముగురందరిలో
పెద్దమ్మ నాట్య మాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.

తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు
నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ
నన్నా తిరుమల రాయుడు
కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.


కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోను, శుక్రాచార్యునితోను, మన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.
అయితే, ఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,

రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపం, రాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుక, ప్రభువులవారు ముక్కంటితో సమానం.
రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.
శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదు, ఒక కన్ను లేదు కానీ, ప్రభువు సాక్షాత్తు మదనుడేనట.
నగపతి పగతు పగతుని
పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా
జగ జట్టి యన్న తండ్రికి
దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు

అని !

నగపతి - ఇంద్రుడు
అతని పగతుడు (శత్రువు) - నరకుడు
అతని పగతుడు - శ్రీ కృష్ణుడు
అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)
అతని పగతుడు - భీముడు
అతని అన్న - ధర్మ రాజు
అతని తండ్రి - యముడు
అతని వాహనం - దున్న పోతు !


ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మఱియు, నందరు నందరు నందరందరే.
సభలోని వారందరినీ కుక్కలు, కోతులు,పందులు, దున్న పోతులు, గాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు
నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్
పిఱికి తనంబును లోభము
గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా


కవి గారు రాజుని పొగుడుతూ, ఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటే, పిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. ఈరప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారు, ఏమిచ్చారు ? అని అడిగేడు.


సూరప రాజు
‘‘జూపల్లె ధరాయం
డేపాటి ధనం బొసంగె ? నీరప రాజా ?’’
దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !

‘‘పాపాత్ముండెవ్వరికిని
చూపనిదే చూపెనయ్య, సూరప రాజా !’’
ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.


ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె
నిష్ట సంపన్నురాలిందిర భార్య యై
కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె
కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై
బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె
అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!


శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడు, బహు కుటుంబీకుడు, పతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడు, కోరిన కోరికలను తీర్చే వాడు, పెద్ద కుటుంబం కల వాడు, అన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితే, విష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలు, కుమారుడు, కుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదని, అతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇది, నిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటే, భరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా ? సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?

అదే విధంగా, అన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడు, పాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.
దామోదరుడు అంటే, దామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం. పద్మ గర్భుడు .
చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడు, దయా గుణము కల వాడు, శత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతి, స్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.

ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.
చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును
తగ నర్ధుల కీయ నట్టి త్యాగము, సభలోఁ
బొగిడించు కొనుచుఁ దిరిగెడి
మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్


వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు.

స్వస్తి.


(Xbలో సరిత్ గారి దారంలోంచి సంగ్రహించిన శీర్షిక)

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
వికవి గారూ..

నేను చిన్నప్పుడు దూరదర్శన్ లో భారవికి సంబంధించి ఓ నాటిక చూసాను .
అందులో భారవికి తండ్రి వేసే శిక్ష ఒక ఏడాది అత్తవారింట్లో ఉండడం కాకుండా... విస్తర్లో  వాళ్ళ అత్త పొసే మజ్జిగ విస్తరి దాటి వచ్చినంత వరకు అత్తగారింట్లో ఉండాలి  

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#7
@Raju , మీరన్నది సరైనదే.
ఆ వ్యాస రచయిత (పంతుల జోగారావు గారు #) అలా 'సంవత్సరం పాటు' అని ఇచ్చారు.
వేరే వ్యాసాలలో, పుస్తకాలలోనూ ఎక్కువగా సంవత్సరం పాటు అనే కనిపిస్తున్నది ...


[Image: afWSIYV.jpg]

ఇక్కడ మజ్జిగ కట్ట దాటేదాక అని ఇవ్వబడింది.

[Image: KNjMdnj.jpg]
Like Reply
#8
మాకు తెలీని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు మిత్రులారా...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#9
Nomophobia
Eenaadu Dt: 2018 Dec 01 Wrote:నోమోఫోబియా అంటే తెలుసా..?
‘పీపుల్స్‌ వర్డ్‌ ఆఫ్‌ 2018’గా ప్రకటించిన కేంబ్రిడ్జ్‌ డిక్షనరీ

[Image: hBf03UY.jpg]

లండన్‌ : కేంబ్రిడ్జ్‌ డిక్షనరీ 2018 సంవత్సరానికి ‘నోమోఫోబియా’ను ప్రజల పదంగా ఎంపిక చేసింది.
ఓటింగ్‌ నిర్వహించి ఈ పదాన్ని ‘పీపుల్స్‌ వర్డ్‌ ఆఫ్‌ 2018’ గా ప్రకటించింది.
ఇంతకీ ఈ నోమోఫోబియాకు అర్థం ఏంటో తెలుసా.. మొబైల్‌ ఫోన్‌ లేకుండా ఉన్న సమయంలో కలిగే ఆందోళన లేదా భయం.

డిక్షనరీ ఎడిటర్స్‌ సూచించే పదాలను సంక్షిప్తం చేసి కొత్త పదాన్ని సృష్టించాలని కేంబ్రిడ్జ్‌ డిక్షనరీ తన బ్లాగ్‌ రీడర్స్‌ను, సోషల్‌మీడియా ఫాలోవర్లను కోరింది.
అత్యంత ప్రజాదరణ, ఔచిత్యం ఉండే పదాలనే ఎంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా నడుస్తున్న విషయం తెలిసిందే.
స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో లేకుండా ఓ క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది మొబైల్‌ ఫోన్‌ ఫోబియాపైనే పదాలను సూచించారు.

‘రెండు మూడు పదాల కలయితో ఈ పదం ఏర్పడింది. నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా నుంచే నోమోఫోబియా అనే కొత్త పదం వచ్చింది’ అని కేంబ్రిడ్జి తన
బ్లాగ్‌లో వివరించింది. ఓటింగ్‌లో ‘జెండర్‌గ్యాప్‌’, ‘ఎకోసైడ్‌’, ‘నో ఫ్లాట్‌ఫామింగ్‌’ లాంటి పదాలను ఓడించి నోమోఫోబియా పదం విజయం సాధించిందని తెలిపింది.
Like Reply
#10
మాతృత్వం పరిమళించిన అపురూప సంఘటన!!

[Image: unnamed.jpg]
ఈ చిత్రం చూడటానికి జుగుప్సగా, అశ్లీలమైనదిగా మొదట భావన కలగవచ్చును. కానీ, ఈ చిత్రం వెనుక కళ్లు చెమర్చే వాస్తవ గాధ దాగివున్నది. ఆ కథ గురించి వింటే హృదయం ద్రవించక మానదు.
రోమన్ చారిటీ పేరుతో ప్రాచుర్యంలో వున్న అ కథలో సైమన్ (Simon) అనే వ్యక్తికి యూరప్ లో తిండి లేకుండా మరణించే శిక్షను (incarcerated and sentenced to death by starvation) విధించారు. కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి లేదు. కానీ ఆ వ్యక్తి కూతురైన పెరొ (Pero) ప్రతిరోజు తన తండ్రిని కొంతసేపు కలిసే విధంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నది.
ప్రతిరోజు అతన్ని చూడ్డానికి వచ్చేముందు అక్కడి కాపలాదారులు ఆమె ఎటువంటి తినే, త్రాగే పదార్థాలను ఆమె వెంట తీసుకెళ్ళకుండా క్షుణ్ణముగా తనిఖీ చేసి లోపలకు వదిలేవారు. తిండీ, నీరు లేక శరీరం శుష్కించి మరణానికి చేరువవుతున్న తన తండ్రిని చూడలేక తల్లడిల్లిపోయిన పెరొ తానే అతనికి తల్లిగా మారి తన స్తన్యాన్ని అతని నోటికందించింది. ఇలా రోజులు గడువసాగాయి. రెండ్రోజుల్లో చనిపోతాడనుకున్న సైమన్ ఇంకా బ్రతికే వుండటం ఆ జైలు అధికారులను విశ్మయానికి గురిచేసింది. అందుకు గల కారణాన్ని తెలుసుకొని ఆ తండ్రీ కూతుర్లిద్దరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. జరిగినదంతా తెలుసుకున్న న్యాయస్థానం మానవీయ కోణంలో తీర్పుని వెల్లడించి ఆ ఇద్దరినీ విడుదల చెయ్యాలని ఆదేశించింది.
ఇదీ... ఆ చిత్రం వెనుక దాగివున్న అసలు కథ.
ఈ కథకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు.

[Image: dsc-0019.jpg]

[Image: GA-Sirani-Caridad-romana.jpg]

[Image: 129266367573551548-b307eb20-a089-46e3-b5...03-570.jpg]

[Image: 220px-Mei-Bernardino-Caritas-romana-17th-century.jpg]

ఎనభైవ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర నటించిన 'సావాసగాళ్ళు' చిత్రంలో ఈ కథని రిఫర్ చేయటం జరిగింది.
[Image: Screenshot-20181130-231459.png]


గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#11
Quote:... మానవీయ కోణంలో తీర్పుని వెల్లడించి ఆ ఇద్దరినీ విడుదల చెయ్యాలని ఆదేశించింది
చరిత్ర పుటల్లో అలాంటి తీర్పులు, వాటి అమలు కనిపిస్తూఉంటాయి.
నేటి కాలంలో అలా చక్కటి తీర్పులని ఇవ్వడం అరుదు ;
సరైన తీర్పులు సరిగ్గా అమలు అవడమూ అరుదే banana
Like Reply
#12
తీర్పుల కన్నా వాయిదాలు ఎక్కువైనప్పుడు ఇంక న్యాయం స్థానాలు మారక ఏం చేస్తుంది?

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#13
AMAZING MATHEMATICAL CLOCK...

[Image: clock-1.jpg]

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#14
[Image: IMG-20181209-WA0001.jpg]

[Image: 4de5509f4f04214975b03439e96156e5.png]

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#15
^ ఒక ఆలోచన
సృష్టిలోని అనేక రకాల జీవరాశులలో మానవులకి మాత్రమే ఆలోచనలు చేయగల మెదడు పూర్తి స్థాయిలో ఉన్నదట.
సరైన ఆలోచనలని కలిగి ఉండి వాటిని సరిగ్గా ఆచరించగలిగే వారు కొందరే ఉంటున్నారు !

కొందరు తామే శక్తి సంపన్నులమని తమకి ఎదురే లేదని విర్రవీగి పేట్రేగిపోతూ వినాశనానికి పూనుకుంటారు ... banana
Like Reply
#16
మానవులు తలుచుకుంటే ఎమైనా చెయ్యగలరు. కానీ, ఏదైనా చేసేముందు అలోచించి చేస్తున్నారా అన్నది చూసుకోవాలి...
ఉదాహరణకు 'స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాంగాలే కూలిపోతాయి' అంటుంటారు. ఇది వారి సామర్థ్యాన్ని మాత్రమే కాదు వారి మొండి విధానాన్ని తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్యార్థులు చంచల స్వభావులు. వారికి దుడుకుతనం ఎక్కువ. ఏదైనా అనుకుంటే చేసెయ్యటమే తప్ప తర్వాత పరిణామాల గురించి పెద్దగా ఆలోచించరు. జస్ట్ మొండిగా దూసుకుపోవటమే!
అందుకే, 'రాజుకన్నా మొండివాడు బలవంతుడు' అంటారు...
అలాగని మొండివాడిని ఇక్కడ పొగుడుతున్నామని కాదు కదా...!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#17
^ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం 1960 దశకం చివరి సంవత్సరాలలో &
2010 కి ముందు , ఆ తర్వాత సం||లలో జరిగినది అదే అనుకుంటాను banana
Like Reply
#18
Photo 
ఈనాడు Dt:2018 Dec 10 Wrote:శతమానం భవతి - 94 ఏళ్ల నిఘంటు డాక్టర్‌!

తేదీల ప్రకారం అయితే ఆయన వయసు... 94  పలకరించి మాటకలిపితే మాత్రం... 30 దాటదేమో అనిపిస్తుంది!
అబ్బే అంతా అతిశయోక్తి అంటారా? అయితే ఇది చదవండి... డాక్టర్‌ ఓరుగంటి ఆంజనేయ శర్మ రాసిన వైద్య నిఘంటవుని
చదవకుండా ఏ తెలుగు వైద్యవిద్యార్థీ క్యాంపస్‌ దాటరనేది వాస్తవం. ఇప్పటికే 6 వైద్య నిఘంటువులు... 25 ఇతర పుస్తకాలు
రాసిన ఆయన  94 సంవత్సరాల వయసులోనూ మరో క్రతువులో పాలుపంచుకుంటున్నారు. తెలుగు భాషకు మణిదీపమనదగ్గ
మహానిఘంటువు రూపకల్పన కోసం రోజుకి 12 గంటలు కష్టపడుతున్నారు...

[Image: sJYbT3u.jpg][Image: evIjZCB.jpg]
ముఖం మీద చెరిగిపోని చిరునవ్వుతో, నిరాండబరమైన వ్యక్తిత్వంతో నిరంతరం జీవితాన్ని ప్రేమించే వ్యక్తులు కొందరు ఉంటారు.
అలాంటివాళ్లని చూస్తే వాళ్ల వయసు గుర్తుకురాదు సరికదా మనలో అంతవరకూ గూడుకట్టుకున్న నైరాశ్యం కూడా పోయి ఏదో
చేయాలనే హుషారు పుడుతుంది. ప్రొఫెసర్‌, డాక్టర్‌ ఓరుగంటి ఆంజనేయ శర్మని చూసినా మనకి అదే భావన కలుగుతుంది.
వైద్యుడిగా కెరీర్‌ని మొదలుపెట్టి తన సేవలతో తెలుగు రాష్ట్రాలని మొత్తం చుట్టేసి... రిటైర్‌ అయిన తర్వాత కూడా పాతికేళ్లపాటు
ఉచితంగా సేవలందించిన గొప్ప వైద్యుడాయన. ‘మీరు డాక్టర్‌ కదా.. నిఘంటువు, భాష వంటి పదాలు మిమ్మల్ని ఎలా
ఆకట్టుకున్నాయి?’ అని అడిగితే ఇలా చెప్పడం మొదలుపెట్టారు.
‘నేను డాక్టర్‌నే. నేనెళ్లిన ప్రతిచోటా మనుషులని మాత్రమే కాదు వాళ్ల భాషలని, యాసలని కూడా ప్రేమించడం మొదలుపెట్టాను.
నేను పుట్టింది విజయవాడలో. అప్పటికి మనకింకా స్వాతంత్య్రం రాలేదు. దాంతో మా బడుల్లో పూర్తిగా ఆంగ్లబోధనే జరిగేది.
అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మూడు వైద్య విశ్వవిద్యాలయాలు ఉంటే నాకు ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో చదువుకునే అవకాశం
వచ్చింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసి ఎంపికయ్యాను. ఓ పక్కన ఉద్యోగం చేస్తూనే మరో పక్క క్షయవ్యాధి
నిర్మూలనకు ప్రత్యేకంగా ఎండీ చదివాను. ఉద్యోగరీత్యా కరీంనగర్‌, అనంతగిరి, వరంగల్‌, తిరుపతి, హైదరాబాద్‌లలో పనిచేసిన
తర్వాత ఆయా ప్రాంతాల ప్రజలు, వాళ్ల భాషలు కూడా నాకు క్షుణ్ణంగా పరిచయం అయ్యాయి. అలా తిరగడమే నాకు తర్వాతి
కాలంలో నిఘంటువు రాయడానికి కావాల్సిన ముడిపదార్థాన్ని అందించింది అంటూ వివరించారు శర్మ.

అయితే శర్మ 50,000 పదాలతో ఉన్న వైద్యనిఘంటువు, ఎన్‌సైక్లోపీడియాని రాయడానికి మరో బలమైన కారణం కూడా ఉందట.

అదో కరదీపిక...
ఎర్రగడ్డలో ఛాతీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా రిటైర్‌ అయిన తర్వాత శర్మ సౌదీఅరేబియా ప్రభుత్వం నుంచి ఆ దేశంలో క్షయవ్యాధిని
రూపుమాపడానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ‘అలా ఆహ్వానం అందుకుని అక్కడకు వెళ్లిన వారిలో వివిధ దేశాలకు చెందిన
గొప్పగొప్ప వైద్య నిపుణులు కూడా ఉన్నారు. వారితోపాటు నాకూ గుర్తింపు రావడం సంతోషించదగ్గ విషయమే. అక్కడి ప్రజలు
ఎక్కువగా అరబిక్‌లోనే మాట్లాడేవారు. నాకు అరబ్‌ రాకపోయినా భాషాపరంగా ఎటువంటి ఇబ్బంది రాలేదు. అందుకు కారణం ఉర్దూ
మాట్లాడే తెలంగాణ ప్రజల మధ్య నేను పనిచేయడమే. మన సంస్కృతంలానే అరబిక్‌ కూడా చాలా భాషలకు తల్లిభాష. సౌదీ నుంచి
వచ్చిన తర్వాత నీల్‌కమల్‌ ప్రచురణ సంస్థకు చెందిన ఒకాయన వైద్యపదాలకు సంబంధించి  ఒక నిఘంటువు ఉంటే బాగుంటుందని
నాతో అన్నారు. ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగులో చదువుకున్న గ్రామీణ వైద్యవిద్యార్థులు ఒక్కసారిగా ఆంగ్లంలో వెల్లువెత్తే వైద్యపదాలని
అర్థం చేసుకోవడం అంతతేలికైన విషయం కాదు. దాంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో వైద్యనిఘంటువుని రూపొందించడం మొదలుపెట్టాను.
అలా సుమారు యాభైవేలపదాలతో కూడిన వైద్యశాస్త్ర నిఘంటువుని తయారుచేశా’ అంటూ వివరించారు శర్మ.

అన్నట్టు ఈ వైద్య నిఘంటువు 18వ సారి పునర్ముద్రితమవుతోంది.

గొంతులో నాగుబాము....
వైద్య నిఘంటువు, ఎన్‌సైక్లోపీడియా అనగానే  ఇది కేవలం వైద్యులకు మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు. దీన్ని సామాన్యులకు,
వృత్తినిపుణులకు, విలేకరులకు కూడా ఉపయోగపడేలా రాశారు శర్మ. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పుట్టకుండా చేసే కుటుంబ నియంత్రణ
శస్త్రచికిత్సని చిన్న ఆపరేషన్‌ అంటారు. గర్భసంచిని తొలగించడాన్ని పెద్ద ఆపరేషన్‌ అంటారు. అలాగే వ్యాధి ఉందని తెలిసినా డాక్టర్‌
దగ్గరకు రావడానికి చూపించే అలసత్వాన్ని ఉర్దూలో ‘మీఠాసా దర్ద్‌’ అంటారు. అలాని దానిని ‘స్వీట్‌పెయిన్‌’ అని ఆంగ్లంలోకి
అనువదించంలేం. అర్థం మారిపోతుంది. రాయలసీమ మాండలికంలో ఆయాసపడ్డాన్ని గసపోసుకోవడం అంటారు. అదే తెలంగాణలో
దమ్ము అంటారు. అలాగే డయేరియాకి కూడా వేర్వేరు మాండలికాల్లో దస్తులు అనీ పైఖానా అని ఇలా వేర్వేరు పదాలు ఉంటాయి.
అలాగే ఆస్త్మాతో బాధపడుతున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ గొంతులో నాగుబాము
ఆడుతున్నట్టుగా ఉంది సార్‌ అన్నాడు. మరొకావిడ ఉబ్బసంతో బాధపడుతూ గుండెలో చేటతో చెరిగినట్టుగా ఉందండీ అంది.
 
ఇవేమి శాస్త్రీయమైన పదాలు కాదు. వాడుక భాష. అంటే ఒక రోగి దృష్టిలో రోగలక్షణాలు ఇలానే ఉంటాయి. వాటిని వైద్యుడు అర్థం
చేసుకున్నప్పుడే సరైన వైద్యం అందించగలడు. రోగికి, వైద్యునికి మధ్య భాష అవరోధం కాకూడదు కదా అనిపించింది. ఇవన్నీ ఒక
వైద్యుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోగిభాష పూర్తిగా అర్థమయితేనే వైద్యుడు సరైన వైద్యం అందించగలడని
నాకు బలంగా అనిపించింది. అందుకే వేర్వేరు మాండలికాల్లో ఉండే పదాలని కూడా జోడించి ఎన్‌సైక్లోపీడియాని రాశా అనే శర్మగారు
పదాలకు యథాతథంగా కాకుండా చక్కని అనువాదాన్ని ఎంచుకున్నారు. సర్జికల్‌ టూల్స్‌ అంటే మేలుచేసే కత్తి, ఆపరేషన్‌ మార్క్స్‌కి
వైద్యుని సంతకం, క్యుటికిల్స్‌ అంటే గోరుఅంచు వంటివన్నమాట. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ వైద్యనిఘంటువుని అందించే పనిలో ఉన్నారాయన.

నిఘంటువులు మాత్రమేకాకుండా శాస్త్రవేత్తలకు సంబంధించిన, ఊబకాయం వంటి వ్యాధులకు సంబంధించి కూడా పుస్తకాలని అందించారు.
ప్రస్తుతం రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు మహానిఘంటువు నిర్మాణ బృందంలో ఆయన   కృషి చేస్తున్నారు.

ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే ఆయన చెప్పిన త్రిసూత్రావళి...

మితి హాయి... అతి హాని
జీవితంలో ఏదైనా మితంగానే ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో...  
50 ఏళ్ల వయసు నుంచి ఈ సూత్రాన్ని నా జీవితానికి ఆపాదించుకున్నాను.
ఎంత రుచిగా ఉన్నా తక్కువగానే తినడం నా అలవాటు.

చురుకు నడక
ఆరోగ్యానికి తినే ఆహారం ఎంత ముఖ్యమో, చేసే వ్యాయామం కూడా అంతే ముఖ్యం.
రోజూ క్రమం తప్పకుండా నడవడం నా అలవాటు.
వేగంగా నడవడం వల్ల శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి.
శారీరక, మానసిక దృఢత్వాన్నిస్తాయి.

కష్టంగా కాదు... ఇష్టంగా ఉండండి
విజ్ఞానం ఒక గని. దాన్ని సాధించాలి.
మనిషి సంపాదించిన డబ్బుతో తృప్తి పడాలి తప్ప నేర్చుకున్న జ్ఞానంతో కాదు.
జ్ఞానాభివృద్థి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది.
ఆ ఆనందం ఆరోగ్యానికి కారణమవుతుంది.
Like Reply
#19
సంవత్సరం పాటు స్మార్ట్ ఫోను వాడకుంటే బహుమతి !!
AndhraJyothy Dt: 2018 Dec 16 Wrote:న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా స్మార్ట్‌ఫోనే.
జీవితంలో ఓ భాగంగా మారిన స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 24X7 అయిపోయింది. చేతిలో ఫోన్ లేకుండా కనిపించేవారు ఇప్పుడు అరుదైపోయారు.
నిద్రపోతున్నా, తింటున్నా, నడుస్తున్నా, బైక్‌పై ఉన్నా, బస్సులో ఉన్నా, చివరికి వాష్‌రూములోనూ దానిని వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు
యువత ఇప్పుడు అంతగా బానిస అయిపోయింది. చార్జింగ్ అయిపోయి నిమిషం పాటు ఫోన్ స్విచ్ఛాప్ అయితే ఆక్సిజన్ అందని రోగిలా
విలవిల్లాడిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఏడాది పాటు స్మార్ట్‌ఫోన్ ముఖం చూడకుండా ఉండగలరా? ఉండే ధైర్యం ఉంటే
మాత్రం ఏకంగా రూ.72 లక్షలు సొంతం చేసుకునే అద్భుత అవకాశం మీ తలుపు తడుతోంది.

కోకోకోలా‌కు చెందిన విటమిన్ వాటర్ అనే కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. ‘స్క్రోల్ ఫ్రీ ఫర్ ఎ ఇయర్’ పేరుతో ఈ అమెరికన్ కంపెనీ ఓ పోటీ
నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేవారు ఏడాదిపాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి విటమిన్ వాటర్ సంస్థకు
చెందిన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్‌ లేకుండా సమయాన్ని ఏడాది సమయాన్ని ఎలా
గడపుతామనే విషయాన్ని హ్యాష్‌ట్యాగ్ #NoPhoneforaYear, #contest ఉపయోగించి పంపాల్సి ఉంటుంది. పోటీదారుడు ఇచ్చే సమధానంపై
సంతృప్తి చెందితే అతడిని ఎంపిక చేస్తారు. అనంతరం కాంట్రాక్ట్ పత్రాలపై సంతకం చేయించుకుంటారు.

పోటీదారులు కేవలం స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతోంది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను వాడుకునే వెసులుబాటు ఉంది.
అలాగే, వాయిస్ యాక్టివేటెడ్ డివైజ్‌లు అయిన గూగుల్ హోం, అమెజాన్ ఎకో వంటి వాటినీ వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కానీ, ట్యాబ్లెట్స్
మాత్రం నిషిద్ధం. అది మీదైనా, మరెవరిదైనా.

పోటీలో పాల్గొన్న వారు మొత్తం చివరి వరకు పోటీలో ఉండాలనేం లేదు. కనీసం ఆరు నెలలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా రూ.7 లక్షలు
ఇవ్వనున్నట్టు విటమిన్ వాటర్ సంస్థ పేర్కొంది. అయితే, ఇంట్లోవాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు మాత్రం 1996 నాటి ఫీచర్ ఫోన్‌ను
ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఇందులో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు ఉండదు. కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే ఇది పరిమితం.
మరెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయరాదూ!
Like Reply
#20
(16-12-2018, 08:01 PM)~rp Wrote: సంవత్సరం పాటు స్మార్ట్ ఫోను వాడకుంటే బహుమతి !!

ఇదేదో బాగుందే!!!!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)