Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు పంచిన కంపెనీ
#1
క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు పంచిన కంపెనీ

బీజింగ్: గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంటి వార్తలు ఒకటి వింటున్నాం. చైనాలోను ఇలాంటిదే జరిగింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్‌గా ఏకంగా ఒక్కొక్కరికి రూ.62 లక్షలు ఇచ్చారు.


[Image: money-mountain-1-1548254637.jpg]

క్యాష్ మౌంటేన్
చైనాలో న్యూ ఇయర్ ఫెస్టివెల్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివెల్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాన్‌చాంగ్ పట్టణానికి చెందిన ఓ స్టీల్ ప్లాంట్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగుల కోసం ఏకంగా 300 మిలియన్ యువాన్లు ఖర్చు చేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.34 కోట్లు.
   [Image: money-mountain-2-1548254643.jpg]
ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు
ఈ మొత్తం డబ్బును కొండలా పేర్చి, ప్రదర్శించారు. కంపెనీలోని ఆఫీస్‌లో ప్రదర్శనగా ఉంచారు. ఈ కంపెనీలో దాదాపు ఐదువేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందించింది. దీనిపై ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు.
   [Image: money-mountain-3-1548254650.jpg]
గతంలో పరిమిత సమయంలో తీసుకెళ్లినంత డబ్బు
గతంలో ఇదే కంపెనీ ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చింది. కంపెనీలోని ఓ హాల్లో డబ్బు కట్టలను గుట్టలుగా పోసింది. ఒక్కో ఉద్యోగికి పరిమిత సమయం ఇచ్చి ఆ టైంలో ఎంత డబ్బును తీసుకెళ్లగలిగితే అంత తీసుకు వెళ్లమని చెప్పి బోనస్‌గా ఇచ్చింది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)