Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నష్టాల్లోనూ లాభాలు
#1
Wink 
నష్టాల్లోనూ లాభాలు...
[Image: 15busi2a.jpg]
"షేర్లలో డబ్బులు పెడితే చేతులు కాల్చుకున్నట్లే..’’
సాధారణంగా స్టాక్‌ మార్కెట్‌పై చాలా మందికి ఉండే అభిప్రాయం ఇది. అందుకే షేర్ల జోలికి రావాలంటేనే భయపడుతుంటారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లో నష్టాలకు ఎంత అవకాశం ఉందో.. లాభాలు ఆర్జించేందుకూ అంతే అవకాశం ఉంది. అయితే ఇది మనం తీసుకునే నిర్ణయం, అనుసరించే వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. అంతెందుకు.. మన నిర్ణయం సరైనది కాకుంటే స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఉన్నా మనకు నష్టాలు రావొచ్చు. అదే సమయంలో సరైన వ్యూహంతో ముందుకెళితే నష్టాల మార్కెట్లోనూ లాభాల పంట పండించొచ్చు. అదెలాగంటే..


పిట్టకథ

ఒక రోజు ఓ కాకి ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ అలసిపోయింది. వేసవికాలం కూడా కావడంతో దాహం కూడా బాగానే వేస్తోంది. దాహం తీర్చుకునేందుకు అక్కడా ఇక్కడా వెతికింది. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు, కుంటలే కనిపించాయి. ఆఖరుకు ఓ ఇంటి పెరటిలో ఓ కడవను చూసింది. వెంటనే ఎగురుతూ వెళ్లి ఆ కడవపై వాలింది. తాగుదామని అందులోకి తొంగిచూడగా నీళ్లు సగం వరకే ఉండటంతో దానికి అందలేదు. తీవ్ర నిరాశ ఓ వైపు.. నీళ్లను తాగక తప్పని పరిస్థితి మరోవైపు. ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఆ పెరట్లోనే ఆ చెట్టుపైకి ఈ చెట్టుపైకి తిరగడం మొదలెట్టింది. అలా ఎగురుతూ ఎగురుతూ ఓ గోడపై వాలింది. అప్పుడే పెరట్లో ఓ మూల గులకరాళ్లను చూసింది. దాంతో దానికి ఓ ఉపాయం తట్టింది. ఆ రాళ్లను ఒక్కోటిగా తీసుకొచ్చి కడవలో వేసింది. కాసేపటికి ఆ రాళ్లు కడవలో సగానికి చేరడంతో అందులోని నీళ్లు పైకి వచ్చాయి. అది చూడగానే కాకికి ప్రాణం లేచివచ్చింది. హమ్మయ్య అనుకొని ఆ నీళ్లను గడగడ తాగేసి దాహం తీర్చుకుంది. కడవలో అందకుండా ఉన్న నీళ్లను చూసి ఇక తాగడం సాధ్యం కాదులే అనుకొని వెనుదిరిగితే ఆ కాకికి దాహం తీరేదే కాదు. నీళ్లు పూర్తిగా లేకుంటే తర్వాత సంగతి... ఎన్నో కొన్ని ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు. అందుకే ఉపాయంతో ఆలోచించి ప్రతికూలతలోనూ సానుకూలతను వెతుక్కుంది. దాహాన్ని తీర్చుకుంది. 

మార్కెట్‌ కథ

శంకర్‌ స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం మార్కెట్‌ బాగా జోరుమీదున్నప్పుడు షేర్లు కొనేంతలోపే మళ్లీ మార్కెట్‌ పడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కొనాలంటే ఇంకెంత పడుతుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నాడు. మరోవైపు శంకర్‌ స్నేహితుడు రవి రెండేళ్లుగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాడు. స్టాక్‌ మార్కెట్‌ పడటంతో రవి బాగానే నష్టపోయి ఉండొచ్చని ఓరోజు పలకరించేందుకు అతని ఇంటికి వెళ్లాడు శంకర్‌. రవిని చూసి ‘రెండ్రోజులుగా నీ గురించే ఆలోచన. షేర్లలో ఎంత నష్టపోయి ఉంటావోనని నాకు నిద్ర కూడా పట్టలేదు. అందుకే ఓ సారి కలిసిపోదామని వచ్చాన’ని చెప్పాడు. దానికి రవి బదులిచ్చే లోపే మళ్లీ తనే మాట్లాడుతూ ‘నీకు ముందే చెప్పాను కదరా. స్టాక్‌ మార్కెట్‌ పడుతుంది.. షేర్లు అమ్మేయమని. నా మాట విని అప్పుడే అమ్మేస్తే ఇప్పుడు ఇంత బాధ పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా’ అని అన్నాడు. అది విన్నాక ‘సరే.. నా సంగతి తర్వాత మాట్లాడుదాం. ముందు నువ్వు స్టాక్‌ మార్కెట్లో అడుగుపెట్టే విషయం ఎక్కడి దాకా వచ్చిందో చెప్పు’ అని రవి అడిగాడు. ‘రెండేళ్లుగా నువ్వే చూస్తున్నావు. మార్కెట్‌ కొన్ని రోజులు పెరుగుతుంది. మళ్లీ కొన్ని రోజులకు వెనక్కి వస్తోంది. అందుకే మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని అతను బదులిచ్చాడు. ‘నువ్వు అలా ఎదురుచూస్తూ ఉంటే ఎప్పటికీ అడుగుపెట్టలేవు. నష్టమో.. లాభమో ముందుకు దూకేయాలి. ఆ తర్వాత పరిస్థితి తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవాల’ని రవి సలహా ఇచ్చాడు. ‘ఎందుకు ఇప్పుడు నీలా నష్టపోవడానికా. నాకంత ధైర్యం లేదని’ అతని సలహాను కొట్టిపారేశాడు. ‘నాకు నష్టం వచ్చిందని నీకెవరు చెప్పారు. నువ్వు ఊహించుకుంటున్నది తప్పు. నాకు చాలా లాభం వచ్చింది. నా కళ్లలో ఆ ఆనందం నీకు కనిపించడం లేదా’ అని అన్నాడు. అవునా.. నేను నమ్మను అని శంకర్‌ అన్నాడు. దాంతో అతను తన ఫోర్ట్‌పోలియో చూపించాడు. అది చూసి శంకర్‌ కంగుతిన్నాడు. ఇదెలా సాధ్యం మార్కెట్‌ నష్టాల్లో ఉంది కదా.. నీకెలా లాభం వచ్చిందని అడిగాడు. ’మార్కెట్‌ లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్నా మనం లాభాలు ఆర్జించొచ్చ’ని అతను బదులిచ్చాడు. అదెలా కాస్త వివరంగా చెప్పమని శంకర్‌ అడిగాడు. ‘రెండేళ్ల క్రితం నేను రూ.3,00,000 పెట్టి షేర్లు కొన్న విషయం నీకు తెలుసు కదా. ఆ తర్వాత ఆ షేర్లు బాగా పెరగడంతో రూ.లక్షన్నర వరకు లాభం వచ్చింది. దాంతో నా పెట్టుబడి విలువ రూ.4,50,000కి చేరింది. ఎందుకైనా మంచిదని ఇందులో రూ.1,50,000 వరకు షేర్లను అమ్మేసి.. ఆ డబ్బులతో అవే షేర్లును ఫ్యూచర్స్‌లో షార్ట్‌ చేశాను. షార్ట్‌ చేసినప్పుడు షేరు ఎంత పడితే అంత లాభమొస్తుంది. అటువైపు ఇటువైపు షేర్లు ఉండటంతో ఏమి జరిగినా ఇబ్బంది ఉండదని నిశ్చింతగా ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు షేరు ధర పడటంతో షార్ట్‌ చేసిన షేర్లపైనా లాభమొచ్చింది. ఆ వచ్చిన లాభంలో ముందుకొన్న షేర్లను మరికొన్నింటిని కొని యావరేజ్‌ చేశాను. అలా షేరు ధర పెరిగినప్పుడు.. పడినప్పుడు లాభం సంపాదించాను. అదే సమయంలో నా పెట్టుబడిని కూడా కాపాడుకున్నాన’ని వివరించాడు. అది విని ‘నువ్వు కొన్నాక షేర్లు పెరిగినందున అలా చేశావు. అదే ముందే పడితే ఏం చేసేవాడివని’ శంకర్‌ అడిగాడు. దానికి రవి బదులిస్తూ ‘మన చేతిలో ఉన్న పెట్టుబడిని పూర్తిగా వాడకుండా కొంత మొత్తంతోనే షేర్లు కొనాలి. ఒకవేళ కొన్నాక పడితే.. కంపెనీ పరిస్థితి చూసి తిరిగి షేరు పెరుగుతుందని భావిస్తే తగ్గిన ధర దగ్గర మరికొన్ని షేర్లు కొనాలి. మన అంచనా నిజమై షేరు పెరిగితే మన పెట్టుబడికి ఢోకా ఉండదు. లాభాన్నీ ఆర్జించొచ్చ’ని చెప్పాడు. తన మిత్రుడు చెప్పిందంతా విని ఇన్ని రోజులు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నందుకు శంకర్‌ లోలోపల బాధపడ్డాడు. స్టాక్‌మార్కెట్‌లో ప్రతికూలతలు, సానుకూలతలను ఎలా వాడుకోవాలో అర్ధమయ్యేలా వివరించినందుకు తన మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

నీతి

పిట్టకథలో కాకి అసాధ్యాన్ని ఉపాయంతో సుసాధ్యం చేసుకుంది. మార్కెట్‌ కథలో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలను కూడా అవకాశంగా మల్చుకొని శంకర్‌ లాభాలు ఆర్జించాడు. తద్వారా మార్కెట్‌ పడినా కూడా పైచేయి సాధించేందుకు అవకాశం ఉందని నిరూపించాడు.

Source : Eenadu.net

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)