30-04-2019, 03:44 PM
(This post was last modified: 30-04-2019, 03:47 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆముదం—పరుగు
ఇప్పుడు మన తరానికి అంతగా తెలియదుగానీ, అప్పట్లో నెలకి ఒకసారి పిల్లలు, పెద్దలు ఆముదాన్ని త్రాగేవారు. అలా త్రాగితే పొట్టలో చెత్తంతా కదిలి మోషన్ బాగా అవుతుంది. మలబద్ధకం(Constipation), అజీర్ణ సంబంధమైన సమస్యలకి విరుగుడుగా ఈ ఆముదాన్ని త్రాగేవారు.
అయితే... చిక్కగా వుండి, ఏదోలా వాసన కొట్టే ఆముదం అస్సలు రుచించదు. అందుకే, పిల్లలు దాన్ని త్రాగకుండా తప్పించుకోవటానికి ప్రయత్నించేవారు. పెద్దలు వాళ్ళతో కుస్తీ పడి బలవంతంగా త్రాగించేవాళ్ళు.
అలాంటి ఓ సందర్భాన్ని ప్రతిబింబిస్తూ గీసిన చిత్రం మరియు వ్రాసిన పద్యం.
#తేటగీతి :
బాలు డొక్కడు తాతయు బామ్మ తండ్రి
తల్లి యంద రాముదమును త్రాగు మనుచు
నేడిపించుచు నున్నార నెక్కడికిని
పోగలడు దిక్కు తోచక ముక్కు మూసె
గర్ల్స్ హైస్కూల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK