Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా కడప....
#1
నా కడప....

నల్లరేగడి నేల,
నాపరాయి గని, 
మంగంపేట ముగ్గురాయి,
మేలిమి సున్నపురాయి, 
ప్రొద్దుటూరు బంగారం,
తుమ్ములపల్లి  యురేనియం, 
ఖనిజాల ఖిల్లా నా కడప జిల్లా... 

గండి అంజన్న,
దేవుని కడప వెంకన్న,
పొలతల మల్లన్న ,
వీరపునాయని పల్లె సంగమేశ్వరుడు, 
పుష్పగిరి చేన్నకేశవుడు, 
అల్లాడుపల్లె వీరభద్రుడు, 
అత్తిరాల పరశురాముడు, 
దేవుళ్ళు కొలువైన  నేల నా కడప జిల్లా... 

కాశినాయన నిత్యాన్నదానం, 
బ్రహ్మంగారి కాలజ్ఞానం, 
కోదండ రాముని కళ్యాణం, 
సౌమ్యనాథుని వైభోగం, 
ప్రొద్దుటూరు దసరా, 
పెద్ద దర్గా ఉరుసు, 
ఆధ్యాత్మిక శోభ నా కడప ప్రభ. 

పుల్లంపేట జరీచీర, 
మాధవరం నేత చీర, 
ముద్దనూరు కరెంటు, 
ఎర్రగుంట్ల సిమెంటు, 
పులివెందెల నిమ్మ తోట, 
కోడూరు మామిడి తోపు, 
పరిశ్రమల పురోగతి కడప గడపకు ప్రగతి. 

పెన్నేరు,
పాగేరు,
చెయ్యేరు,
సగిలేరు, 
కుందేరు, 
లంకమల, 
కలివికోడి, 
నల్లమల సందడి, 
శేషాచల చందన సిరి, 
పాపికొండల ఘరి, 
సహజవనరుల సీమ నా కడప సీమ. 

రాగిసంకటి - ఎర్రకారం, 
చిత్రాన్నం - చిట్లపొడి, 
నాటుకోడి పులుసు, 
నన్నారి షర్బత్తు, 
కొర్రన్నం, 
జోన్నరొట్టె, 
మమ’కారం’ దోశ, 
షడ్రుచుల విందు కడప గడపనందు. 

పెమ్మసాని వారి గండికోట, 
మాట్లిరాజుల సిద్ధవటం బాట, 
కడప నవాబుల ఏలుబడి, 
రాయలేలిన సీమ ఒడి, 
పాలెగాండ్ల పోరుభూమి, 
రాజసానికి రాచబాట, 
పౌరుషాల పురిటిగడ్డ నా కడప గడ్డ.

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
బాగుంది Smile
Like Reply
#3
SUUPERR BHAYYA
Like Reply




Users browsing this thread: 1 Guest(s)