Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(గుర్తుకొస్తున్నాయి)???
#1
(గుర్తుకొస్తున్నాయి)???

మార్చి లొనే మనల్ని వడియాల్లా వేయించేస్తున్న ఈ ఎండల్ని చూస్తుంటే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మునుపూ ఎండలు ఉన్నాయి. కానీ వాటికి మనం ఇంత భయపడింది లేదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొనేవారు. నాకయితే బాగగుర్తు. వేసవి కాలం వచ్చిందంటే మాఅమ్మమ్మ ,అమ్మ, చా లా బిజీ గా వుండేవారు. మాకు పరీక్షల హడావుడి వాళ్ళకి ,ఇంకొరకం హడావిడి. నులకమంచాలు, మడతమంచాలు, బైటవేసి, ఏడాదికి కొన్న పప్పులు ఎండబెట్టి, అన్ని డబ్బాలో పోసి అటకెక్కించడం, పెద్దపని. అది అవుతూనే,వడియాలు పెట్టె కార్యక్రమం మొదలు. గుమ్మిడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్ల మిరపకాయలు, పిండి వడియాలు, అబ్బో పెద్ద బృహత్తర కార్యక్రమం. నాలుగు ఎండలకే, వడియాలు, గలగల లాడుతూ ఎండిపోయేవి. మధ్యలో పచ్చివడియాలు, అన్నల్లోకి వేయించుకొని ,ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఈలోపు మాపరీక్షలు అయిపోయేవి. మళ్ళీ వూరగాయల కార్యక్రమంమొదలు. పప్పులడబ్బాలు, వడియాల డబ్బాలు, అన్ని వరసగా ఆటకకెక్కేవి. జాడీలు అన్ని బుద్దిగా కిందికి దిగేవి.  మళ్ళీ వూరగాయల కార్యక్రమం మొదలు. ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, ఎండబెట్టడం, పనివాళ్ళచేత ఇళ్లలోనే కుంది రోళ్లలో ఆవకాయ కారాలు కొట్టించడం, అన్నికొలతలుకొలుచుకొని, జాడీ లకెత్తించడం, మరునాడు, సొంత తోటలోంచికాని,లేదా వాడుగ్గా ఇచ్చే చెట్టునించి కానికాయలు కోయించి తేవడం వెంటనే కాయలు నీళ్ళల్లో వేసి కడగడం మావంతు. ముందురోజే మరకత్తి పీటని అటకమీంచిదించి ,కడిగి శుభ్రంచేసి,ఉంచేవారు. నాన్నగారు మరకత్తి పీటతో కాయలు తరిగితే, జీడీ మరియు పొర తీయడం మావంతు. అమ్మమ్మ పర్యవేక్షణలో అమ్మ ఆవకాయకలిపి జాడీలకెత్తి, ఆమహాయజ్ఞం జయప్రదంగా పూర్తి చేసేది.  మరునాడు మాగాయా తొక్కుడు పచ్చళ్ళపని.   
        
ముందురోజే ఆవకాయ కాయతోపాటు, మాగాయకికూడా మామిడికాయలు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచేవారు. తెల్లవారి లేస్తూనే అమ్మ పాతాదుప్పటి పరిచి రడీఐయ్యేది. మే మందరం కాయలన్ని తుడిచి పెడితే, ఇరుగు పొరుగు అత్తెయ్యాలందరూ కదనరంగానికి వచ్చే వీరన్నారుల్లా కత్తిపీటలువేసుకొని తయారై వచ్చేవారు. వదినా, అత్తయ్యగారు, పిన్నిగారు, అంటూ కబుర్లు చెప్పుకుంటూ అలవోకగా రెండువందలకాయల్ని, మాగాయకి, తొక్కుడుపచ్చడికి, తరిగేసి, కావాలంటే ఉప్పెసి ముక్కల్ని జాడికెత్తేసి, మరీ ఇంటి కెళ్లేవారు. ఒకరికి ఒకరు మే మున్నము మీకు, అన్నట్లు గా ఆరోజుల్లో వుండేవారు. పనిసాయం, మాటసాయం, ఆర్థికసాయం, చేసుకుంటూ ఒకరుకిఒకరు అండదండలుగా ఉండేవారు.
        
అవకాయలపర్వం పూర్తయ్యేసరికి, అత్తయ్యలు, పిల్లలు, వేసంగి సెలవలకి, అమ్మమ్మల ఇళ్ళకి రావడం మొదలయ్యేది. ఇంక వకటే సందడి. పెద్దలకి వాళ్ళ కబుర్లు, పిల్లలకి వాళ్ల ఆటపాటలతో వకటే సందడి.

సాయంత్రం అయ్యేసరికి మావీరమ్మ  పెరడంతా పేడనీళ్లతో   కళ్ళాపూజల్లి ముగ్గేసి అందరికి పట్టే మంచాలు, మడతామంచాలు, వేసి, పక్కలేసి వెళ్ళేది. ఆరుబయట హరికేన్ లాంతరు మధ్యలో పెట్టుకొని అందరం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ భోజనం చేసిన ఆరోజులు ఇప్పటికి నా కళ్ళకి కడుతున్నాయి. నాకే కాదు ,ఇలాంటి అనుభవం మీకందరికీ వుందేవుంటుంది. ముఖ్యంగా అమ్మమ్మ చేతి తరవాని వేసవిలో, దబ్బాకుల ఘుమ ఘుమ లతో కడుపు చల్లగా వుండేది. 
       
రెండురోజుల తరువాత కొత్తవకాయ, మామిడిపండు తో అన్నం తింటుటే, స్వర్గం బెత్తె డు దూరం లో ఉన్నట్టు ఉంటుంది. నాన్నగారు వేసవి వస్తూనే ఓ  పాతిక తాటాకు విసిన కర్రలు కొనేసి అందరి మంచాల దగ్గర పెట్టేసివారు. పెరట్లో మంచాలు వేసుకొని పడుకొంటే ఆవేపచెట్టు నుండి వచ్చే గాలి, కొబ్బరాకుల గలగలలు, ఆకాశం లో చుక్కలు, చంద్రుడు, వెన్నెల, చుక్కలిని చూపిస్తూ అమ్మమ్మ చెప్పే కబుర్లు, నిద్రఎప్పుడు పట్టింది తెలిసేదికాదు. ఇప్పట్లా ఫాన్, ఏసీ లు ఏమీ లేని రోజులు,అయినా ఏమీ కష్టం అనేపెంచేదికాదు.
       
ఆరోజులు ఈరోజులు పూర్తిగా అనుభవించిన తరంమనది. మన తరం కనుమరుగు అవుతే బహుశా ఇలాంటి అనుభూతులుని మన పిల్లలతో పంచుకొనే, పెద్దలు ఇంకోపదేల్లా తరవాత ఎవరువుండరు. అందుకే ఆనాటి ముచ్చట్లు మీతో  సరదాగా పంచుకుందాం అనిపించింది.

(గుర్తుకొస్తున్నాయి)???

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)