ఎటు చూసినా మంచే.
తెల్లగా పరుచుకున్న ఆ మంచు మధ్య చలి ఎముకల్లోకి దిగుతున్నట్టుంది. గాలి తగిలిన ప్రతిసారి చర్మం కోసినట్టుగా మండుతోంది.
అయినా అతను ఆగకుండా పరుగెడుతున్నాడు.
shoes ఎప్పుడో పోయాయి. మంచులో పడుతున్న ప్రతి అడుగుతో అతని పాదాల నుంచి రక్తం కారుతూ ఎర్రటి ముద్రలు వెనుక మిగులుతున్నాయి. చలికి కాళ్లలో స్పర్శ కూడా దాదాపు పోయింది. అయినా ప్రాణాలు కాపాడుకోవాలనే ఒక్క ఆలోచనతో తనలో మిగిలిన శక్తినంతా కూడగట్టి ముందుకు పరుగెడుతున్నాడు.
కానీ ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించడం మానేస్తోంది.
అడుగులు క్రమంగా నెమ్మదించాయి.
శ్వాస అదుపు తప్పింది.
ప్రతి అడుగు ముందున్నదానికంటే భారంగా మారింది.
అతని వెనుక మాత్రం మరొక వ్యక్తి చాలా ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
పరుగెత్తడం లేదు.
తొందరపడడం లేదు.
ఎందుకంటే ముందు ఉన్నవాడు తప్పించుకోలేడని అతనికి ముందే తెలిసినట్టుంది.
కొన్ని క్షణాల తర్వాత ఆ యువకుడు పూర్తిగా ఆగిపోయాడు.
వెనుక నుంచి వస్తున్న అడుగుల శబ్దం మరింత దగ్గరైంది.
"నువ్వు ఎంత ప్రయత్నించినా... ఇక ఎక్కడికీ వెళ్లలేవు."
ఆ మాటలు విన్న అతని భుజాలు కాస్త వాలిపోయాయి.
తప్పించుకునే దారి లేదని అతనికీ అర్థమైపోయింది.
వెనుక ఉన్న వ్యక్తి ఇంకొన్ని అడుగులు ముందుకు వచ్చాడు.
"ఆ ring ఇచ్చి చస్తావా?"
కొద్దిసేపు ఆగి,
"లేక చచ్చాక నేనే తీసుకోవాలా?"
యువకుడు మెల్లగా వెనక్కి తిరిగాడు.
చూస్తే పదెనిమిదేళ్లు కూడా నిండాయో లేదో అనిపిస్తుంది. మొలకెత్తుతున్న పలుచని మీసాలు. చలితో రంగు కోల్పోయిన ముఖం. గోధుమవర్ణ చర్మంపై అతని ఆకుపచ్చ కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తాను బతికి బయటపడే అవకాశం దాదాపుగా లేదని అతనికి తెలుసు.
అయినా చేతివేలికి ఉన్న ఆ ring తీసి ఇవ్వాలనే ఆలోచన మాత్రం రావడం లేదు.
ఎందుకో అతనికే అర్థం కావడం లేదు.
దాన్ని వేసుకున్నప్పటి నుంచి అప్పుడప్పుడు వేలి చుట్టూ ఒక విచిత్రమైన వెచ్చదనం అనిపిస్తోంది. ఈ గడ్డకట్టించే చలిలో కూడా ఆ చిన్న వలయం మాత్రం చల్లబడలేదు.
అంతకంటే విచిత్రంగా—
దాన్ని తీసేయాలని ప్రయత్నించిన ప్రతిసారి లోపల ఎక్కడో ఒక అసహజమైన నిరాకరణ కలుగుతోంది.
అది భయం కాదు.
లోభం కూడా కాదు.
కానీ దాన్ని వదిలేయకూడదనే భావన మాత్రం మరింత బలపడుతోంది.
అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి, ఇక స్వచ్ఛందంగా ring ఇవ్వబోడని అర్థం చేసుకున్నాడు.
మరేం మాట్లాడలేదు.
తన దగ్గర ఉన్న gun బయటకు తీశాడు.
యువకుడు ఏం జరుగుతోందో పూర్తిగా గ్రహించేలోపే—
ఒక్క శబ్దం.
Bullet అతని తల వైపు దూసుకొచ్చింది.
ఆ క్షణంలో ప్రపంచమే ఒక్కసారిగా నెమ్మదించినట్టు అనిపించింది.
గాల్లో దూసుకొస్తున్న bullet అతని కళ్ల ముందే కనిపించినట్టైంది.
అది అతని నుదుటిని తాకబోతున్న క్షణంలో—
ఏదో జరిగింది.
అతని శరీరం చుట్టూ కంటికి కనిపించని ఒక పలుచని పొర క్షణంలో ఏర్పడింది.
Bullet అతన్ని తాకింది.
కానీ చర్మాన్ని చీల్చలేదు.
ఆ వ్యక్తి ముఖంలో మొదటిసారి ప్రశాంతత మాయమైంది.
అతను ఏం చూశాడో అర్థం చేసుకునేలోపే, యువకుడి చుట్టూ ఉన్న గాలి విచిత్రంగా వంగినట్టైంది.
మంచుపై ఉన్న అతని నీడ ఒక్క క్షణం కంపించింది.
తర్వాత—
అతను అక్కడ లేడు.
మంచులో మాత్రం అతని రక్తంతో పడిన అడుగుల ముద్రలు అక్కడితో ఒక్కసారిగా ఆగిపోయాయి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)