Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కుమారి జనరల్ స్టోర్
#1
కుమారి 
జనరల్ స్టోర్
పాల పాకెట్లు
పుస్తకాలు 
సామాను
ఇచ్చట అన్నీ లభించును 
[+] 3 users Like Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
1

ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు పక్కనే పెద్ద వేపచెట్టు ఉంది. చెంగాపురం అనే బోర్డు ఆ వేపచెట్టుకి కట్టి ఉంది. ఈ ఊరికి బస్సు స్టాప్ కూడా అదే.. చెట్టు పక్కనే గవర్నమెంటు వారు కూర్చోవడానికి వేసిన సిమెంటు బల్ల ఉంది. ఇంకో బల్ల రోడ్డుకి అటు వైపు వేశారు. ఇంతకముందు మూడు గంటలకో బస్సు ఉండేది, ఇప్పుడు ప్రతీ గంటన్నరకి ఓ బస్సు తిరుగుతుంది. సాయంత్రం ఐదు కావొస్తుంది. బండి పిల్లలు, కాలేజీ పిల్లలతో పల్లెవెలుగు బస్సు నిండా తాగినోడికి మల్లే తూలుతూ వస్తుంటాయి. ఆదివారం మినహా సాయంత్రం ఐదు దాటితేనే ఊళ్ళో సందడి. సెల్ ఫోను అనే జబ్బు ఇంకా ఈ ఊళ్ళకి సోకలేదు. బండి పిల్లలకి రెండు ఊర్లు అవతల బళ్ళున్నాయి కానీ కాలేజీ పిల్లలు మాత్రం చదువుకోవాలంటే గుంటూరు పోవాల్సిందే. కొంతమంది అక్కడే హాస్టల్లో జాయిన్ అయితే ఇంకొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. మనం మాటల్లో ఉండగానే సాయంత్రం బస్సు రానే వచ్చింది. ముందు చిన్న పిల్లలు, తరువాత పెద్ద పిల్లలు అందరూ దిగాక ఆఖరిన దిగింది కుమారి. 

చెమట కంపుకి లోపల అందరినీ చీదరించుకుంటూ పైకి నవ్వుతూ బస్సు దిగగానే ఒంటికి తగిలిన గాలికి చల్లగా అనిపించి ఊపిరి పీల్చుకుంది. రాత్రి తన బట్టల కోసం ఇంట్లో జరిగిన గొడవకి పొద్దున్నే కోపంగా బైటికి వచ్చేసింది కుమారి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అందరి మొహాలు చూడాలి. ఊళ్ళోకి నడుస్తుంటే కిరాణా కొట్టు ముందు అట్టముక్క తగిలించి ఉంది. దానిమీద సహాయం కావలెను, మంచి జీతం ఇస్తాము అని రాసి ఉంటే తెలీకుండానే రోడ్డు దాటి కొట్టు ముందుకు వెళ్ళింది. కొట్టు ముందు పది మంది వరకు జనం గుమిగూడి ఉన్నారు. లోపల యుద్ధం జరుగుతుంది. పక్కనుంచి సందు కనిపిస్తే లోపలికి తొంగి చూసింది. గిరి ఒక్కడే కష్టపడుతున్నాడు. చాలా సేపు నిలుచున్నా అక్కడ ఖాళీ అవలేదు. రేపు మాట్లాడచ్చులే అని ఇంటికి నడిచింది. ఒక్కో వీధి నడుస్తుంటే గిరి గురించి ఆలోచన మొదలయింది. తనకంటే మూడేళ్లు పెద్ద గిరి. పదవ తరగతి కూడా కలిసే చదివారు. గిరి నాలుగోసారి కూడా పది ఫెయిల్ అయ్యేసరికి వాళ్ళ నాన్న చేసేది లేక తనవెంట పనికి తీసుకుపోయేడు. మధ్యలో ఎవరో అమ్మాయిని లేవతీసుకుబోయాడని టాక్ వచ్చింది. ఆ తరువాత గిరి చాలా రోజులు కనిపించలేదు. మళ్ళీ ఈ రోజే గిరి మొహం చూసింది. ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చేసరికి, సరే రేపు చూద్దాంలే అనుకుంది.

రాత్రి అన్నం తిన్న తరువాత మొదలయింది మళ్ళీ గొడవ. కుమారి అమ్మ మెల్లగా అందుకుంటే కుమారి నాన్న దాన్ని పెద్దది చేశాడు. తమ్ముడు పక్కన నిలబడి ఎంజాయి చేస్తున్నాడు. వాదించుకోవడం అయిపోయిన తరువాత చిన్నగా మాట్లాడింది కుమారి వాళ్ళ అమ్మ. — చూడవే కుమరీ.. పంజాబీ డ్రస్సులు కావాలంటే అడుగు కొనిస్తాను, లంగావోణి కావాలా కొనిస్తాను, జీన్సులు టీషర్టులు మిడ్డీలు అని గోల చేశావంటే మాత్రం కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోపెడతాను. కోపంగా చూసింది కుమారి. 

కుమారి వాళ్ళ అమ్మ లోపలికి వెళుతు నువ్వు ఎలా చూసినా అదే ఫైనల్ అని టీవీలో ఈ మధ్యే విన్న ఇంగ్లేషు ముక్క వాడేసి లోపలికి వెళ్ళిపోయింది.  కుమారి కోపంలో వేళ్ళు పిసుక్కుంటుంటే టీవీలో తమ్ముడు పెట్టిన పాట కరెంటు తీగ నుంచి పోతే పోనీ లేరా.. ఈ జీవితమెన్నడు అని వినగానే లేచి వాడి వీపు మీద నాలుగు వేసింది. వాడు ఏడుపు కేకలకి లేచాడు. అక్క ఎందుకు కొట్టిందో వాడికి అర్ధంకాలేదు. మా మీద కోపం వాడి మీద చూపిస్తున్నావా అని అరుస్తున్న అమ్మ మాటలు వినిపించకుండా ఇంటి పైకి ఎక్కింది.


***


కాలేజీకి రెడీ అయ్యి బ్యాగ్ భుజాన తగిలించింది కుమారి.

నేనేళుతున్న.. అని చెప్పేసి బైటికి వస్తుంటే ముక్కు మీద కోపం తగ్గించుకో అన్న అమ్మ మాటలు విని చిరాకుగా ఎల్లేహే అనుకుంది. గిరి వాళ్ళ కొట్టు అప్పుడే తీశారు. గిరి వాళ్ళ అమ్మ అనుకుంటా, కొట్టు ముందు ఊడుస్తుంది. 

ఆంటీ.. అంటే తల ఎత్తి చూసింది ఆవిడ. పని కోసం వచ్చాను అంటే నువ్వు చేసే పనులేవి లేవమ్మా ఇక్కడ అని తల దించి ఊడుస్తూనే చెప్పింది. అది కాదాంటి అని కుమారి దగ్గరికి వస్తుంటే అప్పుడే బైటికి వచ్చిన గిరి ఏమైంది అని అడిగాడు. ఏమి లేదు, నువ్వెళ్ళి పూజ మొదలెట్టు అంటే అక్కడే నిలబడి ఉన్న కుమారిని చూసి, ఏం కుమారీ.. బాగున్నావా అని గిరి నవ్వుతూ పలకరించాడు. చీపిరి తిరగేసి గిరి పిర్ర మీద కొట్టింది వాళ్ళ అమ్మ. అబ్బా.. అమ్మేయి అని అరుస్తుంటే లోపలికి పొమ్మని గదిమింది. గిరి వెళ్ళిపోతే నువ్వు  కూడా వెళ్ళు అన్నట్టు చూసింది కుమారి వంక. చేసేదిలేక బస్సు ఎక్కింది. అందరూ ఈ మధ్య కొత్తగా టాప్స్ వేస్తున్నారు. కింద జీన్స్ వేస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోను ఉంటుంది. మెడలో సన్నటి బంగారు గొలుసు, దానికి చిన్న లాకెట్ ఫ్యాషన్. స్టైలిష్ బ్యాగులు, ఖరీదైన చెప్పులు. ఇవన్నీ చూడగానే నాకు మాత్రమే ఎందుకు ఇలా అని మనసులోనే ఏడుస్తుంటే పక్క ఊళ్ళో బస్ ఎక్కిన పిల్లలు లోపలికి జరగమని అడుగుతుంటే ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది.

క్లాసులు మొదలయ్యాయి కానీ మనసింకా గిరి వాళ్ళ అమ్మ చుట్టే తిరుగుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో కుమారికి అర్ధంకాలేదు. సాయంత్రం బస్ దిగి నడుస్తుంటే గిరి కొట్టు దాటుతూనే అవసరం మనది తప్పదు అని మళ్ళీ రోడ్డు దాటి కొట్టులో తొంగి చూసింది. ఈ సారి గిరి కుమారిని చూసి, ఏంటి అని సైగ చేస్తే అట్టముక్క చూపించింది. కందిపప్పు పార్సెల్ చేస్తూ ఒక క్షణం ఆగిపోయాడు గిరి. వెంటనే తేరుకుని సాయంత్రం ఎనిమిది తరువాత రమ్మని చెపితే అలాగే అని వెళ్ళిపోయింది. ఇంటికెళ్లి ఫ్రెష్ అయ్యి చకచకా తినేసి ఫ్రెండు ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి గిరి ఇంటి వైపు పరిగెత్తింది. కొట్టు లోపల ఏవో సర్దుతున్న గిరిని చూసి పేరు పెట్టి పిలిస్తే ఎక్కడ వాళ్ళ అమ్మ వస్తుందోనని శబ్దం చేసింది. గిరి కుమారిని చూసి బైటికి వచ్చాడు.

హా.. ఇప్పుడు చెప్పు, నీకు పని చెయ్యాల్సినంత అవసరం ఏంటి. మీరు బాగ సంపద కలిగినోళ్లే గదా అని అడిగాడు గిరి. 

నా అవసరాలకి ఇవ్వట్లేదు అంది కుమారి. పార్ట్ టైం లాగ చేస్తాను అంటే గిరి నవ్వేడు.

ఇందులో అలా ఉండదు. ఉన్నా ఇది చాకిరీ పని. నువ్వు చెయ్యలేవు అని గిరి చెపుతుంటే ట్రై చేస్తా అంది కుమారి. మళ్ళీ తనే నువ్వైతే తెలిసినవాడివి, పైగా  నీ దగ్గర పని చెయ్యడం నాకు ఇబ్బంది ఉండదు అంది. అంతా విని మీ ఇంట్లో వాళ్ళు ఏమనాలేదా అని అడిగాడు 

ఇక్కడిదాక వచ్చాక ఈ కొంచెంలో పోతుందేమో అన్న భయంతో చెప్పాను అంది కుమారి.

మా దగ్గర అని చెప్పావా లేదా.. అసలే మాకు మీకు పడదు. మీ నాన్నకి నాకు అసలు పడదు.

ఎందుకు? అంది కుమారి 

నీకేం తెలీదా అని ఆశ్చర్యపోతుంటే బిక్క మొహం వేసింది కుమారి. గిరికి అనుమానం రాకముందే   తెలుసులే.. ఇంట్లో ఒప్పుకున్నారు అని అబద్దం చెప్పేసింది.

సరే.. నీ కాలేజీ అయిపోయాక ఐదు ఇంటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఇక్కడ చెయ్యాలి అంటే సరే అంది. ఆదివారం రోజంతా చెయ్యాలి. పొద్దున్నే వెళ్ళేటప్పుడు కొట్టు ముందు ఊడ్చి వెళ్ళాలి మరి అంటే సరే అంది అన్నిటికీ తల ఊపి. ఎప్పటి నుంచి వస్తావ్ అంటే రేపటి నుంచే వస్తాను అంది. గిరి సరే అన్నాడు.

ఇంటికి వెళ్ళగానే కాలేజీలో స్పెషల్ కోచింగ్ క్లాసులు ఉన్నాయని, ఫ్రీగానే చెపుతున్నారని అప్ప జెప్పేసింది.

ఏం క్లాసులు, ఎవరు చెపుతున్నారు. ఆ సార్ ఫోన్ నెంబర్ రాయి. ఏ టైముకి వస్తావ్ ?  వరుస ప్రశ్నలు ఎక్కుపెట్టి లాగి వదిలింది కుమారి మీద తన అమ్మ. కుమారి వాళ్ళ నాన్న ఇదంతా చూస్తున్నాడు.

చెప్పాగా స్పెషల్ క్లాసులు అని. తొమ్మిది గంటల బస్సుకు వస్తాను. సార్ నెంబర్ రేపు కాలేజీలో అడిగి నీకు రాసిస్తా అంది కుమారి. ఇంత కాంఫిడెంటుగా చెపితే అమ్మ నమ్మేస్తుందని అనుభవం కుమారికి.

సరే రేపు నాన్న కాలేజీకి వచ్చి మాట్లాడతాడు. ఎల్లుండి నుంచి వెళుదువు అంది కుమారి అమ్మ.

నువ్వు చెప్పినట్టు ఉండదు అక్కడ. అయినా నాన్న వస్తే నాకే మంచిది. నాన్నా ఇవ్వాళ ఇద్దరం కలిసి వెళదాం. కాలేజీలో అందరూ ఎలాంటి డ్రస్సులు వేసుకొస్తున్నారో నీకే తెలుస్తుంది. చూస్తే నువ్వే నాకు నాలుగు జతల జీన్స్ కొంటావ్ అంది అమ్మ వైపు కచ్చిగా చూస్తూ 

నాన్నా నేను రెడీ అని తమ్ముడు మాట వినిపించగానే వెళ్లి వాడి మాడు మీద ఒకటి పీకింది.

ఇప్పుడెందుకే వాడిని కొట్టావ్? అరిచింది కుమారి అమ్మ 

వీడిని మాత్రం బండి మీద డ్రాప్ చేస్తాడు. నన్ను మాత్రం బస్సులో పంపించారు అని కుమారి కోపంగా చూస్తుంటే కుళ్ళుబోతుదానా అని తిట్టింది వాళ్ళ అమ్మ. కుమారి బ్యాగ్ తగిలించుకుని నేనొచ్చేసరికి తొమ్మిది అవుతుంది టాటా అని పరిగెత్తింది. కుమారి వాళ్ళ అమ్మ ఏదో అనబోతుంటే కుమారి నాన్న లేస్తూ కాలేజీనేగా పోనీలేవే అనేసరికి ఇంకేం అనలేకపోయింది ఆవిడ.

కుమారి వేగంగా నడుస్తూ గిరి వాళ్ళ కొట్టు ముందుకు వెళ్లేసరికి అప్పుడే గిరి వాళ్ళ అమ్మ చీపిరి పట్టుకుని వచ్చింది. ఆమె చూస్తుండగానే బ్యాగు లోపల బెంచి మీద పెట్టి ఆమె చేతిలో చీపిరి లాక్కుంది. గిరి కూడా బైటికి వచ్చాడు. గిరి వాళ్ళ అమ్మ గిరిని కోపంగా చూస్తుంటే గిరి లోపలికి పారిపోగా కుమారి వైపు చూసింది.

కుమారి బుద్దిగా ఊడ్చి, చాటతో చెత్త ఎత్తి గిరి వాళ్ళ అమ్మ వంక చూస్తే చెత్త బుట్ట చూపించింది వేలితో.. అందులో చెత్త వేసేసి అక్కడే గోడకి ఉన్న ట్యాపుతో చేతులు కడుక్కుని బ్యాగ్ అందుకుని బస్టాండ్ వైపు పరిగెత్తింది.

గిరి వాళ్ళ అమ్మ కొట్టులో చూస్తే గిరి పూజ చేస్తున్నాడు. కడ్డీలు వెలిగించి షాపు అంతా తిప్పి దేవుడి పటం ముందు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. ఎంతకీ తెరవడే.. తను వెళ్లిపోయేదాకా గిరి కళ్ళు తెరవడని అర్ధమయ్యి నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒక కన్ను తెరిచి తొంగి చూసి హమ్మయ్యా అనుకుని కౌంటర్ తాళాలు తీస్తూ దణ్ణం పెట్టుకున్నాడు.
Like Reply
#3
2



పేరుకే కాలేజీలో ఉంది కానీ ధ్యాస అంతా ఊళ్ళో గిరి వాళ్ళ కొట్టు మీదే ఉంది. అన్నీ మాట్లాడుకుంది కానీ జీతం మాట్లాడుకోలేదు. అసలైంది వదిలేసానే అనుకుంది. ఇంకోవైపు ఎలాంటి పనులు చెపుతారో అన్న ఆలోచన. గిరి పర్లేదు కానీ వాళ్ళ అమ్మే మరీ శత్రువుని చూసినట్టు చూస్తుంది. ఈ గొడవ ఏంటో తెలుసుకోవాలి అని సాయంత్రం కాలేజీ అయిపోయేవరకు ఆలోచిస్తూనే ఉంది. ఐదు గంటలకి బస్సు దిగగానే గిరి కొట్టు సందులో తొంగి చూసింది. అప్పటికే కొట్టు ముందు కిటకిటలాడుతుంది. నా సామాను కట్టమంటే నా సామాను కట్టమని గోల. గిరీ.. అని పిలిస్తే లోపలికి రా అన్నాడు. తనని చూడకుండానే బ్యాగ్ లోపల పెట్టుకో అంటే కరటైన్ జరిపింది, లోపల గది నిండా సామాను, అదే వాళ్ళ ఇల్లు అని కుమారికి అర్ధమైంది. వెనక ఇంకా గదులు ఉన్నది గమనిస్తూనే బ్యాగ్ పెట్టేసి చున్నీ భుజం మీద నుంచీ నడుముకి కట్టుకుని గిరి ముందుకు వస్తే గిరి పక్కకి తప్పుకున్నాడు. నీకు ఉప్పు పప్పులు తెలుసా అని అడిగితే తెలుసు అని గిరి స్థానం లోకి వచ్చి తల ఊపింది.

కిలో పంచదార అన్నాడు గిరి. కుమారికి ఏం చెయ్యాలో అర్ధమైంది. కవర్ తీసుకుంటూనే పంచదార బస్తా చూసి వే మెషిన్ తూకం వేసి ప్యాక్ చేసి పిన్ కొట్టేసింది. అలా గిరి నెమ్మదిగా లిస్టులో ఒక్కోటి చెపుతూ అవి ఎక్కడ ఉంటాయో చెపుతుంటే మొదటి సామాను సంచి పూర్తి చేసింది కుమారి.

గిరిని చూస్తే అలాంటి లిస్టులు తన చేతిలో ఇంకా పదున్నాయి. కుమారి అవన్నీనా అని చూస్తుంటే గిరి నవ్వాడు. నువ్వు ఉప్పు పప్పులు ప్యాక్ చెయ్యి, నేను మిగతా సామాను సంచిలో వేస్తాను అంటే కుమారి పనిలో పడింది. ఇద్దరు కలిసి పని చేస్తుంటే గిరి వాళ్ళ అమ్మ కుమారిని గమనిస్తూనే సాయంగా కౌంటర్లో కూర్చుని డబ్బులు తీసుకుంటుంది. ఒకరి తరువాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఈ నెవెర్ ఎండింగ్ ప్రాసెస్ ఏంట్రా నాయనా అనుకుంటూనే కుమారి మొదటి రోజు ఉత్సాహం ప్రదర్శించింది. ఫలితం షాపు అంతా చిందర వందర.

రాత్రి ఎనిమిది దాటితే కానీ పని ఆగలేదు. ఆఖరి లిస్టు అయిపోగానే ఊపిరి పీల్చుకుని నడుము పట్టుకుంది. వామ్మో నా వల్ల కాదు. ఆ డ్రస్సులు వద్దు నా పాడే వద్దు. బుద్దిగా చదువుకుంటా అని బ్యాగ్ తగిలించుకుంది.

ఇంకా నీ టైం అయిపోలేదు. ఇవన్నీ సర్దవా అంటే కుమారి తూలిపోతూ దణ్ణం పెట్టేసింది. నా వల్ల కాదు, నన్ను ఒదిలేయి అంది బైటికి నడుస్తూ.. ఇదిగో అయితే ఈ రోజుకి అని రెండు వందలు తీసి చేతికి ఇచ్చాడు. రెండు వందలేనా అని దీనంగా చూసింది. అంతే అన్నాడు గిరి. ఏదో ఒకటిలే అని తీసుకుని ఇంటికి నడిచింది.

వాళ్ళ నాన్న మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేశాడంటే నీకు, ఆ సుబ్బరాజుకి ఇద్దరికీ ఉంటది నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చింది గిరి వాళ్ళ అమ్మ.


కుమారి ఇంటికి నడుస్తుంటే తన ఆశలన్నీ నీరు గారిపోయినట్టు అనిపించింది. ఏదో అనుకున్నాను. ఇంకేదో జరుగుతుంది. ఇంత పని చేస్తే రెండు వందలేనా.. నన్ను శ్రమ దోపిడీ చేశారు అమ్మా కొడుకులు ఇద్దరు. నాలుగు రోజులు పని చేస్తే గానీ ఒక జీన్స్ కొనలేనా.. ఇది మరీ ఘోరం. ఇంట్లోకి వెళుతుంటే ఎదురుగా ఉన్న బాబాయి ఇంటి ముందు లైట్ వేసి లేదు.

అమ్మని అడిగితే తెలీదంది. అలిసిపోయి మంచానికి అతుక్కుంటే ఇట్టే నిద్రపట్టేసింది. అమ్మ లేపి అన్నం పెడితే తినేసి మళ్ళీ పడుకుంది. నిజంగానే క్లాసుల వల్ల అలిసిపోయిందని అనుకున్నారు. తెల్లారి లేవగానే నిన్న పడిన కష్టం అంతా గుర్తుకువచ్చింది. నిన్న గిరి ఇచ్చిన రెండు వందలు చేతిలో చూడగానే ఏదో చిన్న ఆనందం. ఇంకో మూడు రోజులేగా ఒక్క జీన్స్ కొనుక్కుని ఆపేద్దాం అని రెడీ అయ్యి నిన్నటి లాగే కొట్టు ఊడ్చి బస్టాప్ దగ్గరికి వెళ్ళింది.

బస్సు రాగానే ఎక్కుతుంటే బాబాయ్ పిన్ని ఇద్దరు బస్సు దిగడం చూసి ఆగిపోయింది. బాబాయ్ చేతికి కట్టు చూసి బాబాయ్.. ఏమైంది అని అడిగితే ఇద్దరు కుమారి వంక చూశారు. మా కష్టాలు మీకెందుకు అన్న పిన్ని మాటలకి ఇంకేం మాట్లాడకుండా బస్సు ఎక్కి కూర్చుంది.

చెప్పాలంటే రెండు ఇళ్ళకి రాకపోకలు లేవు, మనుషుల మధ్య మాటలు లేవు. ఆస్తి పంపకాల్లో నిలువునా దోచేశాడని బాబాయ్ కంప్లైంట్. నేనేమి చెయ్యలేదు, వాడే ఏదో చేసి అన్నీ పోగొట్టుకుని నా మీద నా ఎదుగుదల మీదా ఏడుస్తున్నాడని నాన్న వాదన. ఎవరిది నిజమో ఎవరిది అబద్దమో తెలిసేలోపే సంవత్సరాలు దాటిపోయాయి. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఆడించిన బాబాయ్ అంటే కుమారికి అభిమానం. ఎప్పుడు ప్రేమగా పలకరిద్దామని వెళ్లినా పెద్దల మధ్య కోపాలు పిల్లల మీదకి పాకాయి. ఇంకోటి బాబాయ్ వాళ్లకి పిల్లలు ఇంకా లేరు. ఆ కోపం కూడా చూపిస్తున్నారేమో అనుకునేది కుమారి.

సాయంత్రం కొట్టులో అడుగు పెట్టి పని అందుకుంటుంటే, మళ్ళీ ఇటువైపు రానన్నావ్ అన్నాడు గిరి. ఇంకో మూడు రోజులు వస్తాను అంది కుమారి. రాత్రి ఎనిమిదిన్నర తరువాత నడుము నొప్పి పుట్టినా ఓపిక తెచ్చుకుని కొట్టు మొత్తం సర్ది లేచి బ్యాగ్ అందుకుంది. అలిసిపోయి డబ్బులు మర్చిపోయి పోతుంటే ఇదిగో పిల్లా అంది గిరి వాళ్ళ అమ్మ. కుమారి వెనక్కి తిరిగి చూసింది ఓపిక లేనట్టు. ఇదిగొ డబ్బులు అంటే వెనక్కి వచ్చి తీసుకుంది. రెండు వందల యాభై ఇచ్చింది గిరి వాళ్ళ అమ్మ. నిన్న మీ అబ్బాయి రెండు వందలే ఇచ్చాడు అంటే నిన్న మధ్యలోనే వెళ్ళిపోయావుగా మరి అంది గిరి వాళ్ళ అమ్మ.

ఓహ్.. థాంక్స్ అంది కుమారి.

ఎందుకు నీకు ఇదంతా.. బుద్ధిగా చదువుకుని పెట్టింది తినక అంటే రేపు కలుద్దాం అని చెయ్యి ఎత్తి బై చెపుతూ వెళ్ళిపోయింది. ఇంటికి నడుస్తూ ఇంకా రెండు రోజులు అనుకుంది. వెళ్తూ బాబాయ్ ఇంటి వైపు చూస్తే లైట్ వేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి పొద్దున చూసింది చెప్తే మనకెందుకులే అంది అమ్మ. కాసిన్ని మంచినీళ్లు తాగి టీవీ చూస్తూ తింటుంటే వంటింట్లో అంట్లు తోముతున్న అమ్మని చూసి రోజంతా పని చేస్తుంది జీతం లేకుండా, రేపు నా పరిస్థితి కూడా ఇంతేనా అన్న ఆలోచన మొదలయింది.

మరుసటి రోజు పొద్దున్నే వెళ్లి చీపిరి తీసుకుంటుంటే నేను ఊడుస్తాలే అంది గిరి వాళ్ళ అమ్మ. పర్లేదాంటీ అంటే వెళ్ళు అని తరిమేసింది. అప్పుడే గిరి కూడా బైటికి వచ్చాడు. ఎందుకు వద్దన్నావ్ అని గిరి ఆడటం వినిపించి గోడ పక్కన ఆగింది.

చదువుకునే పిల్ల చేతికి, మొహానికి దుమ్ముతో ఎందుకు కాలేజీకి. ఈ కొంచెమేగా నేను ఊడుస్తాలే.. పిల్ల పనిమంతురాలే అన్న గిరి వాళ్ళ అమ్మ మాటలు వినగానే కుమారి మొహం వెలిగిపోయింది. నవ్వుకుంటూ బస్టాప్ దగ్గరికి వెళ్ళిపోయింది.  బస్సు కదులుతుంటే పాట అందుకుంది కుమారి. ఎవ్వరికి వినిపించకుండా నోట్లోనే పాడుకుంటూ బైటికి చూస్తుంది.

పని మంతు, పని మంతు, పని మంతు రాలిని.. కష్టపడే జీవిని.
ఇంకొక్క రోజు పని చేస్తాను,
నచ్చిన జీన్స్ కోనేస్తాను.
కొన్నాక ఎక్కడ దాచాలో పెద్ద టాస్క్..
ఏం చేద్దాం ఏం చేద్దాం.
పని మంతు, పని మంతు, పని మంతు రాలిని. కష్టపడే జీవిని..

రాత్రి కొట్టులో పని అయిపోయాక ఇంట్లోకి వెళుతుంటే ఇంటి బయట పిన్ని ఏడుస్తూ కనిపించింది. కుమారి కనిపించగానే లోపలికి వెళ్ళిపోయింది. ఆలోచిస్తూనే నిద్రపోయింది కుమారి. ఈ రోజు అంత అలసటగా అనిపించలేదు. కానీ రాత్రిళ్ళు మేలుకుని ఉండే అలవాటు పోయింది. మంచిదే అనుకుందకు కుమారి వాళ్ళ అమ్మ.

పొద్దున్నే లేచి సంపాదించిన డబ్బు చూసుకుంటే ఏడు వందలు చేతిలో ఉన్నాయి. కుమారి మురిసిపోయింది. ఇంకో వంద అయితే జీన్స్ వస్తుంది, ఇంకో నూట యాభై చేతిలో మిగులుతాయి. నా మొట్ట మొదటి జీన్స్.

పని మంతు పని మంతు పని మంతు రాలిని
కష్ట పడే జీవిని.. గట్టిగా పైకే పాడేసింది కుమారి.

ఎవరమ్మా పనిమంతురాలు అని గడప దగ్గర అమ్మ నిలుచొవడం చూసి చేతిలో ఉన్న డబ్బు దాచేసింది. కాలేజీకి వెళుతూ ఊడుస్తున్న గిరి వాళ్ళ అమ్మని చూసి నవ్వుతూ పలకరించి వెళ్ళింది. రాత్రి కొట్టులో పని అయిపోయాక డబ్బు చేతిలో పడగానే ఎగిరి గంతేసింది కుమారి.

ఎందుకంత సంతోషం.. గిరి అడిగాడు. గిరి వాళ్ళ అమ్మ కూడా కుమారి ఏం చెపుతుందా అని చూస్తుంది.

జీన్స్ కొనుక్కోవడానికి డబ్బులు అయ్యాయి అంది సంతోషంగా కుమారి.

ఇదంతా జీన్స్ కోసమా.. మీ ఇంట్లో అడగచ్చుగా అన్నాడు గిరి. మా ఇంట్లో కొనిస్తే ఇన్ని తిప్పలు దేనికి అన్న కుమారి మాట వినగానే గిరి, వాళ్ళ అమ్మ ఇద్దరు కళ్ళు పెద్దవి చేస్తూ అంటే నువ్విక్కడ పని చేస్తున్నావని మీ ఇంట్లో తెలీదా అని అడిగారు. కుమారి నాలిక కరుచుకుని పళ్ళు బైటికి పెట్టి నవ్వింది. అయినా రేపటి నుంచి నేను రానులే, ఏం కాదు అంది కుమారి. బ్యాగ్ అందుకుని హుషారుగా వెళ్లిపోతున్న కుమారిని చూస్తున్న గిరి కళ్ళలో చిన్న నిరాశ గమనించింది గిరి వాళ్ళ అమ్మ.

రేపు ఆదివారం. పొద్దున్నే ఊరికి పోయి కూరగాయలు తేవాలి మర్చిపోయావా అని గుర్తు చేస్తే, గుర్తుంది అన్నాడు గిరి.

చీకటితోనే ఫస్టు బస్సుకి గుంటూరు పోయి మార్కెట్లో కూరగాయలు తెచ్చాడు గిరి. కొట్టు ముందే బల్లలు వేసి అక్కడే తూకం పెట్టుకుని కూర్చుంది గిరి వాళ్ళ అమ్మ. సరిగ్గా ఎనిమిదింటికి ఊడిపడింది కుమారి. తన మొహంలో నిరాశ. గిరి వాళ్ళ అమ్మ ఏమైంది అని అడిగితే కుమారి ఏమి చెప్పలేదు. మీ నాన్న అనగానే పరిగెత్తి కొట్టులో దాక్కుంది కుమారి. గిరి వాళ్ళ అమ్మ నవ్వుకుంటే లోపల కొట్లో పూజ చేసిన గిరి కుమారిని చూసి రానన్నావ్ అన్నాడు. కుమారి మొహంలో దిగులు కనిపించింది. ఇద్దరి మధ్యా కొంచెం చనువు ఉందని నమ్ముతూ ఏమయిందని అడిగితే గిరి వైపు చూసింది కుమారి.
[+] 15 users Like Pallaki's post
Like Reply
#4
3



పొద్దున్నే పళ్ళు తోముకుంటుంటే బాబాయ్ ఇంట్లో నుంచి పక్కింటికి వెళ్ళింది పిన్ని. ఆమె నడక సరిగ్గా అనిపించక పళ్ళు తోముతూనే వెళ్లి ఆ ఇంటి గోడ దగ్గర నిలబడింది. తెలిసిందేంటంటే బాబాయ్ మందులకి డబ్బులు లేవు. పిన్ని ఏడుపు చూడలేక చాలా రోజుల తరువాత బాబాయ్ ఇంట్లో అడుగుపెట్టింది కుమారి. మంచం మీద పడుకున్న బాబాయ్‌ని చూసి చుట్టూ చూసింది. ఇంట్లో ఏమి లేవు. అంతా డొల్లగా కనిపించింది. టేబుల్ మీదున్న మందుల చీటీ తీసుకుని బైటికి వచ్చేసింది. పిన్ని ఇంట్లోకి వెళ్ళాక కుమారి మళ్ళీ వెళ్ళింది. తలుపు చాటున వింటే తెలిసింది ఎవ్వరు అప్పు ఇవ్వట్లేదని, ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేవు. బాబాయ్ నేనొక అసమర్ధుడిని అని ఏడుస్తుంటే అలా అనొద్దని పిన్ని వాటేసుకుని తనూ ఏడుస్తుంటే అక్కడి నుంచి వచ్చేసింది కుమారి.

ఇంట్లో అమ్మకి నాన్నకి పరిస్థితి చెపితే మనకెందుకు అన్నారు. కుమారి గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తే కోపంగా ఓ చూపు విసిరాడు సుబ్బరాజు. కుమారి భయపడి ఇంకేం మాట్లాడలేదు. ఇదంతా గిరికి చెపుతూనే రెండిళ్ళకి మధ్య గొడవ కూడా చెప్పింది కుమారి. గిరి వాళ్ళ అమ్మ కూడా ఇదంతా విన్నది.

ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్ అని అడిగాడు గిరి.

మందుల షాపులో చీటీ ఇస్తే వెయ్యి డెబ్భై అవుతుందని చెప్పాడు. నా చేతిలో తొమ్మిది వందల యాభై ఉన్నాయి అంది కుమారి.

ఇంకో డెబ్భై కావాలా అని అడిగాడు గిరి.

డెబ్భై అని కాదు గానీ మందుల కోసం ఖర్చుపెడితే నేను జీన్స్ కొనలేను అంది కుమారి నిరాశగా.

ఓహ్ అదా నీ సమస్యా.. అర్ధమైనట్టు మొహం పెట్టాడు గిరి.

ఇప్పుడేం చెయ్యనూ అంది కుమారి. మళ్ళీ వెంటనే నువ్వు నా ప్లేసులో ఉంటే ఏం చేస్తావ్ అని అడిగింది.

నేనా.. గొడవలు పక్కన పెడితే అతను నా బాబాయ్ కాబట్టి అతని గురించే ఆలోచిస్తాను. నా వాళ్లయితే కాసింత త్యాగం తప్పదు కదా.. ఇంకో నాలుగు రోజులు పని చేస్తే మళ్ళీ జీన్స్ కొనచ్చు ఏమంటావ్ అన్నాడు కుమారిని చూసి.

అవునులే.. అయినా ఎందుకో బాధగా ఉంది, జీన్స్ కొనాలని చాలా ఆశపడ్డాను అంది కుమారి.

ఇదే బాధ నువ్వు మందులు కొన్నాక ఉన్నదంటే నేను నమ్మను అన్నాడు గిరి. అంతే అంటావా అంది కుమారి. నీకేది అనిపిస్తే అదే చెయ్యి. నీ కష్టం. నీ ఇష్టం. మందులే నీ నిర్ణయం అయితే ఇదిగో మిగిలిన డెబ్భై అని గిరి కౌంటర్ నుంచి తీసి చూపించాడు.

సరే అంది కుమారి. గిరి చేతిలో డెబ్భై తీసుకుని మందుల షాపుకి వెళుతూ ఇవ్వాళ నాది ఫుల్ డ్యూటీ గుర్తుపెట్టుకో అంటుంటే కుమారి మాటలు విన్న గిరి వాళ్ళ అమ్మ నవ్వుకుంది.

మందులు తీసుకుని నేరుగా బాబాయ్ ఇంట్లోకి వెళ్ళింది కుమారి. అప్పటికే పిన్ని మందుల చీటీ కోసం ఇల్లంతా వెతుకుతుంటే పిన్నీ అని పిలిచింది. బాబాయ్ పిన్ని ఇద్దరు కుమారి వైపు చూశారు. వెనక పెట్టిన చేతులు ముందుకు తెస్తూ తన చేతిలో ఉన్న మందులు కవర్ ముందుకు చాచింది. కుమారి పిన్ని ఆశ్చర్యంగా చూస్తూనే తన భర్త వంక చూసింది.

నాకేం అవసరం లేదు అన్నాడు కోపంగా..

ఇవి నాన్న డబ్బుతో కొనలేదు అంది కుమారి చిన్నగా

మరి! అడిగాడు బాబాయ్

పిన్ని చెయ్యి బాబాయ్ చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి మధ్యలో కూర్చుంది. నా డబ్బులుతో కొన్నాను అంది. తనే.. ఎవ్వరికి చెప్పద్దు. ఇంట్లో కాలేజీకి వెళ్లడానికి జీన్స్ కొనివ్వకపోతే కాలేజీ అయిపోయాక స్పెషల్ క్లాసు అని చెప్పి కిరాణా కొట్టులో పనిలో చేరాను. పార్ట్ టైం అంది గుసగుసగా

భార్య భర్తలు ఇద్దరికి కుమారి చెప్పే విధానం నవ్వు తెప్పించినా ఎందుకో ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. చెయ్యి చాచి తీసుకునేందుకు మనసు ఒప్పుకోలేదు.

ఇది నీ కష్టం అమ్మడు.. వద్దు అన్నాడు బాబాయ్.

ఎన్నేళ్లు అయ్యిందో బాబాయ్ ఇలా తనని అమ్మడు అని పిలిచి. నవ్వేసింది కుమారి.

మరి నాకు బొమ్మలు, చెక్క కుర్చీ, బట్టలు కొనిచ్చినప్పుడో అంటే అది వేరు ఇది వేరు అన్నాడు.

కుమారి బాబుయ్ మెడ మీద చెయ్యి వేసి నాకు మీ గొడవలు తెలీదు, మీ డబ్బులు తెలీదు.. కానీ నాకు నువ్వు తెలుసు బాబాయ్. అయినా మెడిసిన్ వాపస్ తీసుకోరు ఏం పిన్నీ అంటే అవును అంది పిన్ని నవ్వుతూ

ఇవ్వాళ ఆదివారం ఫుల్ డ్యూటీ.. నేను వెళ్లాలి అంది లేచి కుమారి.

నీ జీన్స్ అన్నాడు బాబాయ్

ఊరుకో బాబాయ్.. నువ్వు బాగైతే ఒకటికి రెండు కొనివ్వవా ఏంటి అంది బైటికి వెళ్ళిపోతూ

గిరి కొట్టు వైపు నడుస్తుంటే ఇందాక గిరి చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి. అవును చాలా సంతోషంగా ఉంది. నిజానికి నా మీద నాకే గర్వంగా ఉంది. మా బాబాయ్‌కి నా చేత్తో మందులు కొనిచ్చా, నైస్ ఫీలింగ్.

పని మంతు పని మంతు పని మంతురాలిని
కష్టపడే జీవిని
పని మంతు పని మంతు పని మంతురాలిని
ఆదుకునే దేవతని
నవ్వించే దూతని
బాయిలోని గిలకని.. ఛీ లిరిక్ బాలేదు. నవ్వించే దూత దగ్గర ఆపేద్దాం.

కొట్టులో పనిలో పడింది కుమారి. మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తే భాగ్య వాళ్ళ అమ్మ అన్నం పెట్టనందా నీకు అని అడిగింది కుమారి వాళ్ళ అమ్మ. దానికి కుమారి, ఏమో నీ వంట తప్ప ఇంకేది తిన్నా అంత రుచిగా అనిపించదు నాకు అంది. కుమారి వాళ్ళ అమ్మ సోల్ సాటిస్ఫైడ్. చదువుకోవడానికి భాగ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చెప్పి కొట్టుకి వెళ్ళిపోయింది కుమారి. రాత్రి ఎనిమిది దాటాక కొట్టు మూసేద్దాం అనుకున్నారు. కుమారి తనకి వచ్చే డబ్బు కోసం చూస్తుంది.

ఎంత ఇస్తున్నావ్ అని అడిగితే ఐదు వందలు చేతిలో పెట్టాడు గిరి. కుమారి లెక్కపెట్టుకుని ఇది మరీ ఘోరం, అన్ని పనులు చేశాను ఐదు వందలేనా అంటుంటే చేతిలో దాచిన ఇంకో వంద కూడా ఇచ్చాడు. కుమారి బుంగమూతి పెడితే అందం రెట్టింపు అవుతుంది. అందుకే దాచాడేమో గిరి ఆ వంద.

నీకు డెబ్భై ఇవ్వాలిగా కట్ చేసుకో.. అలాగే కొంచెం సామాను తీసుకెళ్తా అని రెండు కిలోల బియ్యం, కొంచెం కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్, కొన్ని టమాటాలు కొన్ని గుడ్లు, కావాల్సిన కొంత సామాను, పచ్చి మిర్చీ అన్నీ రెండు కవర్లలో నింపింది కుమారి. గిరి నవ్వుతూనే ఆశ్చర్యంగా చూశాడు. గిరి వాళ్ళ అమ్మ కూడా నవ్వుతుంటే కుమారి నేనేం ఎక్కువ తీసుకెళ్లట్లేదు, అన్నీ పోగా నాకే పదమూడు రూపాయలు వస్తాయి అంది ఖచ్చితంగా

కుమారి వెళ్లిపోతుంటే గిరి వాళ్ళ అమ్మ ఆపేసింది. అమ్మా కొడుకులు ఇద్దరు మూడు సార్లు లెక్కపెట్టినా పదమూడు రూపాయలు మిగులు వచ్చేసరికి ఆశ్చర్యపోతూ తన వంక చూస్తే మరేమనుకున్నారు అని కాలర్ ఎగరేసింది కుమారి.

కుమారి వెళ్ళిపోయాక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నాలుగు రోజుల్లో మొత్తం పట్టేసిందిరా ఆ అమ్మాయి అంటే నవ్వాడు గిరి.

బాబాయ్ ఇంటి తలుపు కొడితే పిన్ని తలుపు తీసింది. రెండు కవర్లు అంత దూరం మోసి చేతులు నొప్పి పుట్టాయి. తనే లోపల పెట్టింది. డబ్బులు ఇద్దామనుకున్నా పిన్ని కానీ నువ్వైనా మళ్ళీ కొట్టుకేగా వెళ్ళాలి. నేనక్కడే చేస్తున్నా కదా.. నీకెందుకు శ్రమ అని నేనే తెచ్చాను.

పిన్ని కళ్ళలో నీళ్లు చూడగానే.. ఎందుకో తనకి తెలీకుండానే పిన్నిని వాటేసుకుంది కుమారి.

పిన్నీ నేనెళ్ళనా.. అమ్మకి డౌట్ రాకూడదు.

రేపు ఇక్కడకి వస్తావా తినడానికి అంది పిన్ని. రేపు మండే, కాలేజీ ఉంది. రాత్రికి రానా అంటే పిన్ని కళ్ళు తుడుచుకుంటూ హా అంది. మీ ఆయన్ని త్వరగా రికవర్ అవ్వమను నాకు మూడు జీన్సులు బాకీ అంది అల్లరిగా

రెండే అన్నాడు వెనక నుంచి బాబాయ్

రెండు మూడయ్యిందిగా.. అని తుర్రుమంటే నవ్వుకున్నారు పిన్ని బాబాయ్ ఇద్దరు. మొగుడు దగ్గరికి వెళ్లి కుమారికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి మనం ఏమైనా చేసే స్థోమతలో ఉండాలి అంటే అలాగే అన్నాడు భార్యని ముద్దాడుతూ

తరువాత రోజు సాయంత్రం కొట్లో బాబాయ్ ఇంట్లో ఏం జరిగిందో కుమారి సంబరంగా చెపుతుంటే వింటున్నాడు గిరి. ఇద్దరినీ చూసిన గిరి వాళ్ళ అమ్మ, పని చేసేదేమైనా ఉందా లేక ముచ్చట్లేనా అంటే కుమారి బుంగమూతి పెట్టింది. గిరికి మాత్రమే కాదు వాళ్ళ అమ్మకి కూడా ముద్దొచ్చేసింది కుమారి. పోండి ఆంటీ అంటుంటే గట్టిగా బుగ్గ గిల్లి లోపలికి వెళ్ళిపోయింది.
Like Reply
#5
చాలా అంటే.. చాలా చాలా బాగుంది!!!
కుమారి జనరల్ స్టోర్ అనే టైటిల్ చూసి.. కొంచెం వేరే pre-assumption తో కథ చదవడం మొదలెట్టా..

But ఇది beyond expectations పల్లకి గారు!!
Awesome is a small word here!!
[+] 4 users Like ash.enigma's post
Like Reply
#6
Super update
[+] 2 users Like appalapradeep's post
Like Reply
#7
(27-08-2026, 02:55 AM)Pallaki Wrote: 3

తరువాత రోజు సాయంత్రం కొట్లో బాబాయ్ ఇంట్లో ఏం జరిగిందో కుమారి సంబరంగా చెపుతుంటే వింటున్నాడు గిరి. ఇద్దరినీ చూసిన గిరి వాళ్ళ అమ్మ, పని చేసేదేమైనా ఉందా లేక ముచ్చట్లేనా అంటే కుమారి బుంగమూతి పెట్టింది. గిరికి మాత్రమే కాదు వాళ్ళ అమ్మకి కూడా ముద్దొచ్చేసింది కుమారి. పోండి ఆంటీ అంటుంటే గట్టిగా బుగ్గ గిల్లి లోపలికి వెళ్ళిపోయింది.

Nice start to the new story, Pallaki!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
#8
ఏం చెప్పాలో తెలియడం లేదు, ఎలా రాస్తారండి ఇలా. చదువుతున్నంత సేపు కళ్ళ ముందు సినిమా చూస్తున్నట్టుంది. చెప్పాలంటే సినిమా కంటే బాగుంది. మమ్మల్ని కుమారి లోకంలోకి తీసుకెళ్లారు.

మీ విలువైన సమయాన్ని⌛, వెల కట్టలేని రచనల్ని ?మాకు ఉచితంగా ఇస్తున్న మీకు థాంక్స్ అనేది చాలా చిన్నదవుతుంది. అందుకే....

మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్న మీరు ఎప్పుడూ బాగుండాలి..మీరు కోరుకున్నవి జరగాలని...

మీ అభిమాని♥️♥️♥️
[+] 3 users Like murali99's post
Like Reply
#9
Good narrative story
[+] 2 users Like hemu4u's post
Like Reply
#10
Abha abha welcome back to new story pichaga iragandhisaru story ni meru yepudu hundhagane sagali bro Mee stories laga
Manoj thanks announce
[+] 3 users Like Manoj1's post
Like Reply
#11
Good story
[+] 2 users Like nagu65595's post
Like Reply
#12
కథ బాగుంది.

కానీ పల్లకి బ్రదర్, చాలా కథలు ఒకేసారి నడపటం కష్టం ఏమో ఒక్కసారి ఆలోచించు....వీలు ఐతే పాత కథలు ముగించేసేయి ముందు...
[+] 2 users Like sravan35's post
Like Reply
#13
(27-08-2026, 04:13 AM)ash.enigma Wrote: చాలా అంటే.. చాలా చాలా బాగుంది!!!
కుమారి జనరల్ స్టోర్ అనే టైటిల్ చూసి.. కొంచెం వేరే pre-assumption తో కథ చదవడం మొదలెట్టా..

But ఇది beyond expectations పల్లకి గారు!!
Awesome is a small word here!!

Same here andi
[+] 2 users Like James Bond 007's post
Like Reply
#14
అదరగొట్టేసారు...
[+] 2 users Like trimurtuluS's post
Like Reply
#15
Excellent and marvelous story
[+] 3 users Like utkrusta's post
Like Reply
#16
[Image: 763139560_z4sdfda.webp]-[Image: 763140436_z4sdfda0.webp]
[+] 5 users Like pixguru's post
Like Reply
#17
Ma pakkintlo jariginatlu undi Nice story
[+] 2 users Like ram123m's post
Like Reply
#18
You guys have always supported me
Thankyou
Nenedhi raasina bagundhani protsaahistharu. Thankyou very much andhariki
[+] 3 users Like Pallaki's post
Like Reply
#19
4



ఓ రోజు కొట్టు ఖాళీగా ఉంటే కుమారి లోపల ఇంట్లోకి వెళ్ళింది. గిరి వాళ్ళ అమ్మ జాకెట్ ఉక్సులు కుడుతుంటే తన పక్కన కూర్చుంది. ఆంటీ అంటే మ్మ్ అంది రాగం తీస్తూ.. మీ పేరేంటి అని అడిగితే చిన్నగా చూసి సుమలతా దేవి అంది. 


ఎందుకు మూడు పేర్లు పెట్టారు? సుమ, లత, దేవి అయినా బాగుందిలే అంటే అవునా అంది సుమ. బైట కొట్లో నుంచి గిరి కేక వినిపించగానే కుమారి లేచి పరిగెత్తడం చూసి నవ్వుకుంది. గిరి కుమారీల మధ్య రోజు రోజుకి చనువు పెరగడం సుమ గమనిస్తూనే ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు గానీ కుమారి మాత్రం తనకి నచ్చింది.

ఈ రోజుకి ఇంట్లో తెలీకుండా బాబాయ్ దగ్గర భోజనం చేసి మళ్ళీ ఇంట్లో తిన్నట్టు నటించి కొంచెం అన్నం లోపల కుక్కి కొంచెం అన్నం బైట కుక్కలకి కుక్కి, ఫుల్ టైట్ పొట్టతో ప్రెగ్నెంట్ లాగ అటు ఇటు తిరిగి నిద్రపోయింది. తరువాత నాలుగు రోజులకి వచ్చిన డబ్బులతో తనే ఓ జీన్స్ కొనుక్కుంది కుమారి. అది స్లిమ్ ఫిట్ బ్లు జీన్స్. చాలా ఇష్టంగా కొనుక్కుంది కుమారి. అనుకున్నది కొనింది కానీ తరువాత వచ్చే సమస్యలు మాత్రం జీన్స్ కొన్నాకే తట్టాయి. దీన్ని ఎక్కడ దాచాలో కుమారికి అర్ధంకాలేదు. అన్నీ ఆలోచించి చివరికి కొట్లోనే దాచింది. తరువాత రెండు రోజుల్లో ఒక టాప్, ఆ తరువాత రెండు రోజులకి  రెండు ఫ్లాట్స్ కొనుక్కుంది. అన్నీ కొట్లోనే..

కొట్లో సామాను కంటే నీ సామాను పెరుగుతుంది అంది సుమ. నాకోసం ఇంత చోటివ్వలేరా అని ఏడుపు మొహం పెడితే సుమకి ముద్దొచ్చి ముక్కు పట్టుకుని లాగింది. అలా పెట్టకు మొహం అంటే సరే సరే అంది కుమారి. ఇద్దరు నవ్వుకున్నారు. రాత్రి కుమారి వెళ్ళిపోయాక కొడుకు పక్కన కూర్చుంది సుమ. రేపు పెళ్ళికి వెళుతున్నాను అని గిరి వంక చూసింది.

గిరి వెళ్ళవే అంటే, కొట్లో ఉండేది నువ్వు కుమారి మాత్రమే అని గుర్తుచేసింది. నా మీద నమ్మకం లేదా అని ఆశ్చర్యపోయాడు గిరి.

అస్సలు లేదు. కుమారిని ఏడిపించినట్టు తెలిసినా, తనతో పిచ్చి పిచ్చి వేషాలేసినట్టు తెలిసినా బెల్టు తెగిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది సుమ.

అలాగే అమ్మ గారు అన్నాడు లేచి వంగుని. సుమ నవ్వితే గిరి కూడా నవ్వి, ఆ పిల్ల సుబ్బరాజు కూతురని మర్చిపోయినట్టున్నావ్ అంటే కుమారిని మెచ్చుకుంటూ మంచి పిల్లరా అంది.

తెల్లారి యాధావిధిగా కాలేజీ అయిపోగానే కొట్టుకి వచ్చిన కుమారికి సుమ ఆంటీ కనిపించకపోయేసరికి అడిగింది,.

ఆంటీ ఎక్కడా అంటే పెళ్ళికి ఊరు వెళ్ళింది అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడిగితే రెండు రోజుల్లో వస్తుందన్నాడు గిరి. ఎనిమిదిన్నర వరకు నడిచిన హడావిడి ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఇద్దరు సామాను మధ్యలోనే కింద ఎదురు కూర్చున్నారు.

అలిసిపోయావా అంటే నవ్వి లేదంది, ఇద్దరు కలిసి కొట్టు సర్దుతుంటే ఒకేసారి గదిలోకి వెళ్ళబోతూ ఒకరినొకరు తగులుకున్నారు. కుమారి మామూలుగానే నవ్వినా గిరికి మాత్రం ఒంట్లో ఏదో రాజుకుంది, ఇంకేదో కాదు భయం. అమ్మ చెప్పిన బెల్టు గుర్తుకు వచ్చి సారీ చెప్పాడు. కుమారి వెళ్లిపోయిన తరువాత ఒక్కడే కూర్చుని కుమారిని తలుచుకున్నాడు. తన చిలిపి మాటలు, నచ్చనప్పుడు పెట్టే బుంగమూతి, ఏదైనా తప్పు చేసినప్పుడు నాలిక బైట పెట్టడం అన్నీ గిరికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కుమారి అందమైన మొహం. చూడముచ్చటగా ఉండే తెల్లని మొహానికి పొడుగాటి నల్లని జుట్టు, పెద్ద కనుగుడ్ల కింద ఎర్రని దొండపండు పెదవులు, గుండ్రని చందమామ మొహానికి జీడీ గింజ లాంటి గడ్డం. పంజాబీ డ్రెస్సులో చున్నీ వేసుకున్నా లాఘవంగా కనిపించే శరీర సౌష్టవం కుమారిది. ఎద ఎత్తులు. వంగినప్పుడు పూరీలా పొంగే పిర్రలు, సన్నాని నడుముకి ఇంకాస్త అందం పెంచుతూ కనపడీ కనపడని పొత్తి కడుపు. ఎవరైనా తనకి ఫన్నీగా అనిపిస్తే వాళ్ళని మిమిక్రి చేసి వెక్కిరిస్తుంది. చాలా అల్లరిది. చాలా మంచిది. లేచి కొట్టు కట్టేస్తున్నాడు.

తెల్లారితే ఆదివారం రేపంతా కొట్లోనే ఉంటది కుమారి. ఇంకెవ్వరు ఉండరు. ఏమైనా ట్రై చేద్దామా అన్న ఆలోచనలు ఒకవైపు, కాలేజీ చదివే పిల్ల చదువు రాని మొద్దుని ఎందుకు ఇష్టపడతది అని ఇంకోవైపు తొలిచేస్తుంటే షటర్ కిందకి లాగేసి త్వరగా తినేసి ఆలోచనలు raakundaa బలవంతంగా కళ్ళుమూసుకుని నిద్రపోయాడు.

ప్రతీ వారం లానే ఫస్టు బస్సుకు పోయి కూరగాయలు తెచ్చుకుని ఒక్కడే పని మొత్తం కానించి బైట కూర్చుంటే కాసిన్ని పాల ప్యాకెట్లు, కొన్ని కూరగాయలు అమ్ముడు పోయాయి. ఎదురు బడ్డీ కొట్టు వాడికి సైగ చేస్తే టీ తెచ్చిచ్చాడు. టీ తాగుతుంటే రానే వచ్చింది కుమారి. టీ తాగుతావా అని అడిగితే వద్దంది. చున్నీ కట్టుకుని చీపిరి తీసుకుని ఊడుస్తుంటే గిరి చూసి చూడనట్టు చూస్తున్నాడు. అమ్మ చెప్పింది నిజమే ఇంత అందమైన మొహానికి దుమ్ము తగలడం అస్సలు బాలేదు. భార్యగా చీరలో తల స్నానం చేసి కొప్పు కట్టుకుని ఊడిస్తే ఎలా ఉంటుందో అని ఊహిస్తూ కుమారినే చూస్తుంటే సడన్‌గా గిరి వైపు చూసింది కుమారి. గిరి తడబడ్డాడు, ఏంటీ అని కళ్ళు ఎగరేసింది. గిరి లేచి కొట్టులోకి వెళ్లొచ్చేసరికి కుమారి ఊడ్చేసింది.

కుమారి.. ఇవ్వాళ వద్దులే, ఇంటికెళ్లిపో 

యే.. అంది ఎవరీ తింగ్ ఈజ్ ఫైన్ నొ అన్నట్టు 

నాకు ఉండాలని లేదు, కాసేపు కూరగాయలు అమ్మేసి కొట్టు కూడా మూసేస్తాను అన్నాడు గిరి.

ఇవ్వాళ బేరం ఎక్కువ ఉంటదిగా, ఆంటీ ఉన్నంతసేపేనా నీ నిజాయితీ అని నవ్వితే గిరి కూడా నవ్వి, ఇవ్వాళ పనులున్నాయి అందుకే అన్నాడు.

కుమారి కూడా ఆలోచించింది. రోజూ స్పెషల్ క్లాస్ అని ఇంటికి లేటుగా వెళ్తుంది. ఇప్పటికి రెండు ఆది వారాలు చదువుకుంటాననే చెప్పింది. మరీ ఇంట్లో ఉండకపోయినా అనుమానం వచ్చేస్తుందని గిరితో సరే అంది. వెళ్ళిపోతూ గిరి వైపు చూసి.. ఇవ్వాళ ఇంట్లో ఎవ్వరు ఉండరు, కొట్టు మూసేసి లవర్‌ని ఏమైనా పిలుచుంటావా అని వెక్కిరింపుగా నవ్వితే గిరి కోపంగా కొట్టడానికి వచ్చేసరికి అక్కడి నుంచి తుర్రుమంది.

ఇంట్లోకి వెళ్తూ బైట పిన్ని కనబడితే చెయ్యి ఊపి లోపలికి వెళ్ళింది. అమ్మ కిచెన్లోనుంచే ఎవరు అంటే నేనే అని సోఫాలో కూర్చుంది. 

భవ్య వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావ్ అంటే వాళ్ళు బైటికి వెళ్తున్నారు అని చెప్పింది.

గిరి వాళ్ళ కొట్టు దగ్గర నీకేం పనీ.. 

వోవ్వ.. తెలిసిపోయిందా అనుకుంది కుమారి. వంటింట్లోకి వెళ్లి అమ్మ పక్కనే నిలబడింది. ఇందాక తమ్ముడు చూశాడంట నువ్వు గిరి వాళ్ళ కొట్టు ముందు ఉండడం.

భవ్యతో పాటు వెళ్లాను అని ఒక రాయి వేసింది.

వాళ్ళ కొట్టుకెళ్లకు, మనకి వాళ్లకి గొడవలు అంది కుమారి అమ్మ. 

(అంటే ఇంకా మన సీక్రెట్ సీక్రెట్ గానే ఉంది. గుడ్ అనుకుంది)

ఎందుకు.. ఏమైంది అని అడిగితే పాత గొడవలే అంది కుమారి అమ్మ 

చెప్పవే అంది కుమారి 

మన కులపోళ్ళ అమ్మాయిని లేవతీసుకుబోయాడని గిరిని పట్టుకుని కొట్టారు, ఆ గొడవలో మీ నాన్న గిరి వాళ్ళ నాన్నని కొట్టాడు. మన ఊళ్ళో అప్పుడే రోడ్లు వేస్తున్నారు, మీ నాన్న నెట్టాడో కొట్టాడో గానీ ఆయన డాంబర్ తొట్టి మీద పడ్డాడు. ఆయన ఒళ్ళంతా కాలిపోయింది. దంబార్ తొట్టి ఆయన మీద పడి కాలుకి ఏదో అయ్యింది. ఆ గొడవ తరువాత కొన్నేళ్లు వాళ్ళు ఈ ఊళ్ళో కనిపించలేదు. పోయిన ఏడాది నుంచే కనిపిస్తున్నారు అని ముగించింది కుమారి అమ్మ.

గిరి వాళ్ళ అమ్మ కోపం కుమారికి ఇప్పుడు అర్ధమైంది. ఎంతసేపు గిరి, సుమ ఆంటీనే కానీ ఎప్పుడు గిరి వాళ్ళ నాన్న గురించి గానీ ఆయన ప్రస్తావన గానీ కొట్లో రాలేదు.

లేపుకుపోతే కొడతారా.. తెలీకుండానే అనేసింది కుమారి 

కొట్టరా మరీ.. పైగా మన కులం కూడా కాదు. తక్కువ కులం నా కొడుకులు మన ఇంటి అమ్మాయి మీద చెయ్యేస్తే నరికేస్తారు.

నీకెందుకు అంత కోపం.. అంది కుమారి 

నాకేం కోపం లేదు. అయినా ఇవన్నీ ఎందుకు నీకు. బుద్ధిగా చదువుకో, ప్రేమా దోమ అన్నావంటే మీ నాన్న గురించి తెలిసిందిగా.. ఎవరో అమ్మాయికే అంత గోల చేశాడు, ఇక నీ విషయం అయితే చంపేస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాసలుకో బైట అని హెచ్చరించింది.

హా.. సరే అని వచ్చేసింది. గదిలో చాలా సేపు  ఒంటరిగా కాళ్ళు మడుచుకుని కూర్చుంది కుమారి. ఇందాక అమ్మ చెప్పినవే మళ్ళీ  మళ్ళీ అప్పజెప్పినట్టు వినిపిస్తుంటే రేపటి నుంచి పనికి వెళ్లాలా వద్దా అన్న డౌట్ మొదలయింది. కొంచెం భయం కూడా వేసింది. 

సుమ ఆంటీ పైకి కోపంగా ఉన్నా చాలా మంచిది. తనకి ముద్దు వచ్చినప్పుడల్లా ముక్కు పట్టుకుని లాగడం, లేకపోతే బుగ్గ గిల్లడం గుర్తొచ్చి నవ్వుకుంది. కొంచెం జాగ్రత్తగా ఉందాంలే అనుకుంది చివరికి.

సాయంత్రం తమ్ముడు నాన్నతో బండి మీద తినడానికి పక్కూరికి వెళుతుంటే కొట్టు తీసే ఉండటం గమనించింది. కొట్టు ముందు హడావిడి ఉంది. బండి మీదే నిలుచుని చూస్తే లోపల గిరి ఒక్కడే పని చేస్తున్నాడు. మరి నాకెందుకు కట్టేస్తా అని చెప్పాడు, లవర్ హ్యాండ్ ఇచ్చిందేమో అని నవ్వుకుని సరిగ్గా కూర్చుంటుంటే బండి ఊగింది. సుబ్బరాజు సరిగ్గా కుర్చో అని విసుక్కుంటే బుంగమూతి పెట్టుకుంది. బుంగమూతి పెట్టినప్పుడల్లా గిరి, సుమ ఆంటీ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. వాళ్ళు ఇద్దరు నవ్వుకోవాలని మూతిని ఎన్నో వంకర్లు తిప్పడం తలుచుకుని నవ్వుకుంది.


తరువాత రోజు సాయంత్రం సుమ ఆంటీ కొట్లో కనిపించగానే పోయి వాటేసుకుంది. సుమకి కొత్తగా అనిపించినా కుమారి అమాయకత్వం తనకి తెలుసు కాబట్టి  నవ్వేసి ఊరుకుంది. పని అయిపోయాక వెళుతూ ఆంటీ రేపు నాకో సాయం కావాలి అంటే ఏంటి అంది సుమ. రేపు కాలేజీకి జీన్స్ వేసుకెళ్తా, ఇక్కడికి వచ్చాక బట్టలు మార్చుకుంటా మళ్ళీ కాలేజీ అయిపోయాక నా బట్టల్లోకి మారిపోతా 

సుమ కుమారిని కింద నుంచి పై వరకు చూసి వద్దని తల ఊపితే అబ్బా ప్లీజ్ అంది మెలికలు తిరుగుతూ..

ఆ ఇవన్నీ నా దెగ్గరొద్దు అంది సుమ. మీ నాన్నకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందొ తెలుసా అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని మోకాళ్ళ మీద కూర్చునేసరికి కుమారి గడ్డం పట్టుకుని అటు ఇటు తిప్పి ఇబ్బంది పెట్టేస్తున్నావే నన్ను, ఏదో ఒకటి చేసుకోపో అని వెళ్ళిపోయింది. 

కుమారి సంతోషంలో ఎస్ ఎస్ ఎస్ అనుకోవడం విని నవ్వుకుంది సుమ.
[+] 6 users Like Pallaki's post
Like Reply
#20
5



తెల్లారి చెప్పినట్టుగానే చకచకా లోపలికి వచ్చింది కుమారి. అప్పటికే గిరి పూజలో ఉన్నాడు. బ్యాగ్ పడేసిన శబ్దానికి కళ్ళు తెరిచి చూశాడు. కుమారి లోపలికి వెళ్లడం చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. లేత పసుపు రంగు చుడిధార్లో ఉన్న అప్సరస కనిపించగానే దేవుడి మీద లఘ్నం పోయింది. తప్పైపోయిందని రెండు లెంపలు వేసుకుని దిగి కౌంటర్ తెరిచి దణ్ణం పెట్టుకుంటూనే కుమారి బైటికి వస్తుందేమోనని తొంగి తొంగి చూస్తున్నాడు. కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తుంటే జీన్స్ వేసుకుని బైటికి వచ్చింది కుమారి. గిరికి పొలమారింది. దగ్గుతూనే లేచి నిలుచున్నాడు. కాళ్ళు చూస్తూ తల పైకి ఎత్తితే నడుము షేప్ కనిపించింది. కుమారి నడక వయ్యారి నెమలి నడక. నడుస్తుంటే ఊగుతున్న నడుము చూసి తల మళ్ళీ పైకి ఎత్తాడు. పైన పింకు రంగు టీషర్టు మాత్రం పొట్టిది అయిపోయింది. భుజాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంచులు సంకల్లోకి వెళ్లిపోవడమే కాకుండా లోపల వేసుకున్న బ్రా థ్రెడ్స్ కూడా బైటికి కనిపిస్తుంది. ఆంటీ అని పిలుస్తూనే గిరి ముందుకు వచ్చి ఎలా ఉన్నా అని అడిగింది. ఆ అడగడంలోనే కుమారి ఇబ్బంది తెలుస్తుంది. బాలేదని కుమారికి కూడా అర్ధమైపోయింది. అప్పుడే సుమ కూడా కొట్టులోకి వచ్చి కుమారి వేసుకున్న చెండాలం చూసి చిరాకుగా చూసింది. ఇదేమి ఫ్యాషన్, దిక్కుమాలిన ఫ్యాషన్.. ఇలాగే వెళ్తావా అని అడిగింది సుమ. కుమారి మొహం దిగాలు పడిపోతుంటే గిరి ఆగమని లోపలికెళ్లి తన టీషర్ట్ తెచ్చి ఇచ్చాడు. అది పసుపు రంగు ఫుల్ స్లీవ్ టీషర్ట్. ఇది ట్రై చెయ్యి అని ఇస్తే సుమ వంక చూసింది కుమారి. కొత్తదే.. ఒక్కసారి వేసుకున్నా అంతే, నీ జీన్స్ మీదకి ఇది బానే ఉంటుందనిపిస్తుంది నాకు అన్నాడు గిరి.

కానీ ఇది జెంట్స్‌ది కదా

అది నీకు నాకూ అమ్మకి తెలుసు. మీ కాలేజీలో చెప్తావా ఏంటి అని గిరి అంటే లేదులే అంది కుమారి. మరి వేసుకుని చూడు అంటే కుమారి లోపలికి వెళ్ళింది. సుమ ఆంటీ ఏమి అనలేదంటే అదే పర్మిషన్ అని లోపలికెళ్లి గిరి ఇచ్చిన టీషర్ట్ వేసుకుంది. చాలా ఫ్రీగా ఊపిరి ఆడినట్టు అనిపించింది. పైగా ఎక్కడా బ్రా బైటికి కనిపించే అవకాశం లేదు. ఇందాకటిది చేతులు ఎత్తితే నడుము బొడ్డు అన్ని కనిపించాయి. గిరి టీషర్ట్ అలా కాదు ఎంత ఎత్తినా ఏమి ఎత్తినా ఏమి కనపడవు. బైటికి వచ్చి చూపిస్తే సూపర్ అని వేళ్ళు చూపించాడు గిరి. సుమ వైపు చూసింది. సుమ ఏమి మాట్లాడకుండా లోపలికెళ్లి దువ్వెన తెచ్చి రమ్మంటే కుమారి దగ్గరికి వెళ్ళింది. అక్కడే బస్తా మీద కూర్చోపెట్టి జుట్టు తీసి బాగా దువ్వి వన్ సైడ్ వేసి అద్దంలో చూసుకోపో అంటే తల ఊపి లోపలికి వెళ్లింది. గదిలో లైట్ వెయ్యగానే వెనక గదిలో ఏదో చప్పుడు అయ్యింది, కుమారి అద్దంలో చూసుకుంటే తనకే కొత్తగా కనిపించింది. నవ్వుతూ బైటికి వస్తే అప్పటికే బొట్టుబిళ్ళ పట్టుకుని రెడీగా ఉంది సుమ. కుమారి దగ్గరికి రాగానే నుదిటి మీద బొట్టు పెట్టి బాగున్నావ్ అంది. కుమారి నవ్వుతూ తన వెనక్కి వెళ్లిపోతుంటే చెయ్యి పట్టుకుని వెలుతురు లోకి తెస్తూ బస్సు టైం అయ్యింది అని గుర్తు చేస్తే బ్యాగ్ అందుకుంది. గిరి కొత్త చెప్పుల టాగ్స్ తీయడం చూసి థాంక్స్ అని చెపుతూనే కొత్త ఫ్లాట్స్ వేసుకుని వెళ్ళిపోయింది. సుమ వెనకే వెళ్లి జాగ్రత్త అని చెపుతూ కొట్టులోకి వచ్చి కుమారి విడిచిన పాత చెప్పులు చేత్తో పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది.

కుమారి విషయంలో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు గిరి.  కుమారి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ సున్నితం అయిపోవడం ఇప్పటికి చాలా సార్లు చూశాడు. నిజంగా కుమారి అంటే ఇష్టమా లేక నాకోసం అలా ప్రవర్తిస్తుందా లేక నాన్నకి జరిగిన దానికి పగతో ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది గిరికి అంతు చిక్కని ప్రశ్న. అన్నీ లోపల పెట్టి బైటికి వచ్చిన అమ్మ వైపే చూస్తుంటే కొడుకు చూపులో అర్ధం అర్ధమైంది సుమకి. అప్పుడే ఎవరో వచ్చేసరికి బేరం అంది సుమ.. గిరి పనిలో పడ్డాడు.

సాయంత్రం కొట్టులోకి వస్తూనే కుమారి లోపలికి వెళుతుంటే జీన్సులో ఊగుతున్న గుద్దని సామాను కడుతూనే చూశాడు గిరి. ఆ నడకలో రెండు పిర్రలు జీన్సులో టైటుగా కనపడటం చూడగానే కాలేజీలో ఎంతమంది చూశారో అన్న ఆలోచన వచ్చింది. గిరి చేతిలో ఉన్న చెనగల పొట్లం కవర్ చినిగింది.

లోపలికెళ్లిన కుమారి సుమ కోసం వెతుకుతూ ఆఖరి గదిలోకి వెళ్ళింది. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా కాలేజీ మొత్తం స్టార్ అయిపోయింది కుమారి. అందరూ పొగడ్తలే అందరి నోటా కుమారి పేరే, పదికి పైగా లవ్ లెటర్స్. తన అందానికి అసూయపడిన స్నేహితులు. గర్వంతో తల ఎత్తి నడిచింది ఇవ్వాళ. ఆ సంతోషం సుమ ఆంటీని వాటేసుకుని తన ఆనందం పంచుకోవాలని వెళ్లిన కుమారికి మంచం మీద కూర్చున్న సుమతో పాటు పక్కనే పడుకున్న మనిషిని చూడగానే భయంతో కేక పెట్టింది కుమారి.

కుమారి అంత పెద్ద కేక పెట్టినా గిరి లోపలికి వెళ్ళలేదు. కుమారి ఆ కేక ఎందుకు పెట్టిందో గిరి గ్రహించాడు. సుమ లేచి నిలబడి కుమారిని బైటికి పంపించింది. కొట్టులోకి వెళ్ళకుండా మధ్య గదిలోనే గోడకి ఆనుకుని కూర్చున్న కుమారికి ఇందాక చూసిన భయంకరమైన రూపం కళ్ళ ముందు కనిపించగానే భయం, అసహ్యం, ఒకరకమైన చిరాకు కలిగాయి. సుమ ఆంటీ రావడం చూసి లేచి నిలుచుంటే ఆ గదిలోకి ఎందుకు వచ్చావ్ అని అడిగింది సుమ. నీకోసం వచ్చానంది.

ఆయన ఎవరు?

మా ఆయన, గిరి వాళ్ళ నాన్న అంది సుమ.

సారీ ఆంటీ.. సడెన్‌గా చూసేసరికి అని చెప్పబోతుంటే డ్రెస్ మార్చుకుని పని చూడమని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.

కుమారి మానసంతా అస్తవ్యస్తం అయినట్టు పెట్టింది మొహం. గిరి లోడ్ వచ్చిందని వెళ్ళిపోతే సుమ ఆంటీ బైటికి వచ్చి కౌంటర్లో కూర్చుంది. రాత్రి ఎనిమిది అవుతుంటే కొట్టు శబ్దం లేకుండా పడుకున్నట్టు నిశబ్దంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు సుమ నోటి నుంచి ఇటు కుమారి  నోట నుంచి ఒక్క మాట కూడా బైటికి రాలేదు. ఆంటీ అంటే చూసింది సుమ. నేను వెళతాను అంటే డబ్బు ఇచ్చి పంపించేసింది.

ఇంట్లో కుమారి మౌనంగా అన్నం తింటుంటే ఏమైంది అని అడిగింది అమ్మ. ఏమి లేదంది. అర్ధ రాత్రి నిద్రలో గిరి వాళ్ళ నాన్న మొహం గుర్తుకురాగానే ఉలిక్కి పడి లేచి కూర్చుంది. మళ్ళీ నిద్రపోలేదు.
[+] 5 users Like Pallaki's post
Like Reply




Users browsing this thread: kirankk, 2 Guest(s)