Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఎవరు - 4
#1
Bug 
ఎవరు....? 

 (క్రైమ్ ధారావాహికం)

సురేష్ జోస్యభట్ల




ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు. లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు. . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.



స్వాతంత్ర్య దినోత్సవం తరువాత నుండి

*పాఠక మిత్రుల స్పందన లేకపోతే అప్డేట్లు ఆలస్యమౌతాయి
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(09-08-2026, 03:42 PM)k3vv3 Wrote: ఎవరు....? 

 (క్రైమ్ ధారావాహికం)

సురేష్ జోస్యభట్ల




ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం. ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని" ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ . చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.



స్వాతంత్ర్య దినోత్సవం తరువాత నుండి

*పాఠక మిత్రుల స్పందన లేకపోతే అప్డేట్లు ఆలస్యమౌతాయి
Nice start K3vv3 garu! (including original writer Suresh J )
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#3
ఎవరు....? - 1
 
[Image: Picture4.png]

-సురేష్ జోస్యభట్ల
 
Part - 1
ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం.
ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని"
ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. 
ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు.
లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. 
ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు.  .
చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.
"ఒకే పార్టీకి చెందిన సూర్యనారాయణ మరియు దేవేంద్ర రెడ్డి ఒకప్పుడు బద్ద శత్రువులు. ఒకరంటె ఒకరికి పడేదికాదు. పోయిన ఎన్నికల్లొ పార్టీ పెద్దలు పార్టీ ఆఫీసులొ మీటింగు పెట్టి ఈసారి సూర్యనారాయణకు కాకుండా దేవేంద్ర రెడ్డికి MLA టికెట్టు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం సూర్యనారాయణకి నచ్చలేదు దాంతొ ఆదె పార్టీ మీటింగులొ అందరిముందు దేవేంద్ర రెడ్డిని మరియు పార్టీ పెద్దల్ని అనరాని మాటలు అన్నాడు. 
ఇంకా కోపం తగ్గక దేవేంద్ర రెడ్డి పై చెయ్యి కూడా చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్న సూర్యనారాయణ అనుచరులు గొడవ మరీంత పెద్దది అవ్వకుండా తనని అక్కడనుంచి బయటకి తీసుకెళ్ళీపోయారు. కాని దేవేంద్ర రెడ్డి మాత్రం అందరి ముందు తనకి జరిగిన ఈ అవమానం తట్టుకోలేకపోయాడు. దాంతొ సూర్యనారాయణపై సెక్యూరిటీ ఆఫీసర్ కేసు పెట్టి తనని జైల్లొ పెట్టించి బెయిల్ కూడా రాకుండా చేస్తాడు. దీంతొ ఇద్దరి మద్యన వైరం మరింత ముదిరింది. 
ఎన్నికల్లొ దేవేంద్ర రెడ్డి MLA గా గెలిచాడు.  తరువాత దేవేంద్ర రెడ్డిని పిలిచి పోలీసూ కేసులు లాంటివి పార్టీకి అంత మంచివి కావని పార్టీ పెద్దలు చెప్పి ఒత్తిడి చేయడంతొ సూర్యనారాయణ పై పెట్టిన కేసుని వాపసు తీసుకున్నాడు. కాని దేవేంద్ర రెడ్డికి మాత్రం సూర్యనారాయణపై పగ ఇంకా పోలేదు. తనని ఎలాగైన పార్టీ నుండి గెంటెయ్యాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
అలా 1.5 సంవత్సరం గడిచింది. తరువాత ఏమైందొ ఏమో తెలియదు కాని ఇద్దరు పాత పగలు అన్నీ మర్చిపోయి మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి ఇళ్ళ మద్యన రాకపోకలు పెరిగాయి. నాలుగు నెలలు నుంచి ఎటువంటి గొడవలు లేకపోయెసరికి నిజంగానె ఇద్దరు మారిపోయారని ఇంక అంతా శుభమె అని అందరు అనుకున్నారు.
కాని ఈ రోజు మద్యాహ్నం భోజనానికి అని సూర్యనారాయణ తన ఇంటికి పిలవగా వెళ్ళిన దేవేంద్ర రెడ్డి ఇలా ఇప్పుడు శవమై క్రింద పడున్నాడు". 
ఫారన్సిక్ బృందం వాళ్ళు దేవేంద్ర రెడ్డి కంచంలొ వదిలేసిన ఆహారాన్నీ మరియు టేబుల్ పై ఉన్న మిగతా ఆహారాన్నీ కూడా సేకరించారు. దాంట్లొ ఎమైన విషం కలిసిందా అని పరిశీలించడానికి. తరువాత దేవేంద్ర రెడ్డి శవాన్నీ పంచనామాకి తరలించారు. 
సెక్యూరిటీ ఆఫీసర్లు CrPC 174 సెక్షన్ క్రింద అనుమానస్పద మరణంగా నమోదు చేసి. CrPC 41 సెక్షన్ క్రింద అనుమానితుడుగా సెక్యూరిటీ ఆఫీసర్లు సూర్యనారాయణని తమ అదుపులోకి తీసుకున్నారు. 
వివిధ వార్తా మాద్యమాల్లోని మరియు పత్రికల్లోని దేవేంద్ర రేడ్డి మరణం వెనుక సూర్యనారాయణ హస్తం ఉందంటూ అనె ప్రచారం జోరందుకుంది..
తరువాత సెక్యూరిటీ ఆఫీసర్లు ఇద్దరు మద్య ఎప్పటినుంచొ ఉన్న శత్రుత్వాన్నీ పరిగణలోకి తీసుకొని సూర్యనారాయణపై BNS సెక్షన్ 302 హత్య నేరం కూడా కలిపి  FIR నమోదుచేశారు. 
మరుసటి రోజు పోలిసులు సూర్య నారాయణని కోర్టు లొ హజరుపరిచారు. అక్కడ వాదప్రతివాదనలు మొదలయ్యాయి.
సూర్య నారాయణ ఇంట్లొ పని వాళ్ళందరితొ పాటు ఆ సమయంలొ అక్కడున్న దేవేంద్ర రెడ్డి కారు డ్రైవర్ ను కూడా కోర్టులొ లాయర్లు ప్రశ్నించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్. ముద్దాయి సూర్యనారాయణకి మరియు చనిపోయిన దేవేంద్ర రెడ్డికి మద్య చాలా కాలంపాటు పెద్ద వైరం నడిచింది. పోయిన ఎన్నికల్లొ తనని కాదని పార్టీ పెద్దలు దేవేంద్ర రెడ్డి కి MLA టిక్కెట్టు ఇచ్చారని కోపంతొ అందరి ముందు దేవేంద్ర రెడ్డిని తిట్టి, కొట్టడమె కాకుండా చంపేస్తానని కూడా సూర్యనారాయణ బెదిరించాడు అందుకు గాను సూర్యనారాయణ పై కేసు కూడా నమొదయ్యింది. తరువాత పార్టీ పెద్దల చొరవ వల్ల కేసు వాపసు తీసుకోవడం జరిగింది. నేరుగా దేవేంద్ర రెడ్డిని చంపడం కష్టం కాబట్టి పథకం ప్రకారం తనతొ స్నేహం నటించాడని. తనని నమ్మించి ఇంటికి పిలిచి భోజనంలొ విషం కలిపి హత్య చేశాడని మా అనుమానం. నిజానిజాలు రాబట్టడం కోసం 15 రోజుల పాటు ఇతనని సెక్యూరిటీ ఆఫీసర్వారి కస్టడిలోకి పంపించమని కోర్టు వారిని కోరుతున్నాం.
జడ్జి : డిఫెన్స్ లాయర్ మీ వాధనను వినిపించండి.
డిఫెన్స్ లాయర్ : సర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన దాంట్లొ దేవేంద్ర రెడ్డిని కొట్టినందుకు సూర్య నారాయణ పై కేసు పెట్టి తరువాత వాపసు తీసుకున్నంతవరకు వాస్తవమె. కాని తనని సూర్య నారాయణ చంపాడు అనేది మాత్రం అబద్దం. ఎందుకంటె విషం కలిపారు అని చెబుతున్న ఆ ఆహారాన్నె అందరితొ పాటు సూర్య నారాయణ కూడా తిన్నాడని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి ఆ ఇంట్లోని పని వాళ్ళు మరియు దేవేంద్ర రెడ్డి కారు డ్రైవరు కూడా చెప్పారు. వాళ్ళ సాక్ష్యాలను కోర్టువారు ఒక్కసారి పరిశీలించాలి.
జడ్జి : ఇరువర్గాల వాదలను విన్న తరువాత నిజానిజాలు తేలడం కోసం సెక్యూరిటీ ఆఫీసర్ వారు అడిగినట్టు సూర్య నారాయణని 15 రోజులు పాటు సెక్యూరిటీ ఆఫీసర్ కస్టడీకి కాకుండా వారం రోజులు పాటు జుడీశ్యల్ కస్టడికి మాత్రమె పంపించడానికి ఆదేశిస్తున్నాం. ఫారెన్సిక్ మరియు పంచనామ రిపోర్టులను వచ్చేంత వరుకు కేసును వచ్చే వారం ఏప్రిల్ 23వ తారీకు గురువారానికి వాయిదా వేస్తున్నాం.
తరువాత జుడీశ్యల్ కస్టడీలో ఉన్న సూర్యనారాయణని వారం రోజుల పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు విచారించారు. కాని వారు ఆశించిన నిజాలేమి రాలేదు. సూర్య నారాయణ తనకేం తెలియదనె చెప్పుకుంటూ వచ్చాడు.
ఈ లోపు ఫారన్సిక్ మరియు శవ పంచనామా రిపోర్టలు రెండు వచ్చాయి.
ఫారన్సిక్ రిపోర్టులొ దేవేంద్ర రెడ్డి తిన్న ఆహారంలొ గాని త్రాగిన నీళ్ళల్లొ గాని. మరియు ఆ టేబుల్ పై ఉన్న మిగతా ఆహారంలొ కూడా ఎటువంటి విషపూరితమైన పదార్ధం లేదు అని ఉంది.
శవ పంచనామా రిపోర్టులొ అయితె సడన్ కార్డియాక్ ఎరస్ట్ (Sudden cardiac arrest) అంటె హఠాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాడు అని ఎటువంటి విష ప్రయోగం జరగలేదు అని పైగా అతని ఒంటిపై ఎటువంటి గాయాలు గాని చిన్న గీతలు గాని లేవని ఉంది.
సెక్యూరిటీ ఆఫీసర్ విచారణ అధికారి : ఏంటీ గుండె పోటు వల్ల చనిపోయాడా? అది ఎలా సాద్యం. దేవేంద్ర రెడ్డికి బీ.పి, షుగరు లాంటివి ఏమిలేవు అతను చాలా ఆరోగ్యవంతుడు పైగా ఎటువంటి దురలవాట్లు లేని వ్యక్తి. అతనికి గుండెపోటు రావడం ఏంటి...?
వారం రోజులు తరువాత సూర్యనారాయణని కోర్టులొ తిరిగి హాజరు పరిచారు.
డిఫెన్స్ లాయర్ : సర్ వచ్చిన ఫారన్సిక్ మరియు శవ పంచనామ రిపోర్టుల ప్రకారం అతనిపై ఎటువంటి దాడి గాని విషప్రయోగం గాని జరగలేదు అని ఉంది. పైగా అతని చావుకి కారణం గుండెపోటు అని నిర్ధారించారు. కాబట్టి సూర్యనారాయణ కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని తేలిపోయింది. కాబట్టి అతనిపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరం ఆరోపణ తొలగించి బెయిల్ మంజూరు చేయవలిసిందిగా కోర్టు వారిని  కోరుతున్నాం.
జడ్జి : పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు మాట్లాడండి
పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్ దేవేంద్ర రెడ్డికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతనికి గుండె పోటు వచ్చె అవకాశం చాలా తక్కువ. పైగ మృతుడి శరీరాన్నీ బాగా పరిశీలిస్తె అది సహజ మరణంలా లేదు కచ్చితంగా అతనిపై హత్యాయత్నం జరిగింది. కాబట్టి నిజాలని వెలికితీయడం కోసం ఇంకొన్ని రోజులు సూర్యనారాయణని విచారించడానికి అనుమతి కావాలి అని కోర్టు వారిని కోరుకుంటున్నాం.
జడ్జి : వాదనులు మరియు అన్నీ రిపోర్టులు పరిశీలించాక సూర్యనారాయణె ఈ హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగని సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నట్లు దేవేంద్ర రెడ్డిది సహజ మరణం కాదనె అనుమానాలు ఉన్నాయి. పైగా దేవేంద్ర రెడ్డి చనిపోయింది సూర్యనారాయణ ఇంట్లొ కాబట్టీ అతనిని నిర్దోశిగాను పరిగణించలేము. అలాగని అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు.  కాబట్టి ప్రస్తుతానికి తనపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరాన్నీ కొట్టేస్తూ బెయిల్ మాత్రం మంజూరు చేస్తున్నాం. కేసు పూర్తయ్యవరకు అతను ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ లోపు సెక్యూరిటీ ఆఫీసర్ వారు వెంటనె దర్యాప్తు జరిపి తగు ఆధారలు సేకరించాల్సిందిగా ఆదేశిస్తున్నాం.
కోర్టు తీర్పుతొ సూర్యనారాయణకు కాస్త ఉపశమనం కలిగింది. కాని సెక్యూరిటీ ఆఫీసర్లకి మాత్రం అసహనం కలిగంది. 
వార్తల్లొ ఇంకా సూర్యనారాయణనె అనుమానితుడుగా చూపిస్తున్నారు. దేవేంద్ర రెడ్డి అనుచరులు కొంతమంది సూర్యనారాయణ ఇంటి పై రాళ్ళు వేస్తూ అతినికి నిరసన తన ఇంటి ముందు బేఠాయించారు. 
కాని సూర్యనారాయణ అంతకుముందె గన్నవరం దగ్గర ఉన్న తన ఫార్మ్ హౌస్ కి మకాం మర్చేశాడు.
దేవేంద్ర రెడ్డి శవాన్నీ విజయవాడ నగరం మీదుగా ఊరేగిస్తూ అంత్యక్రియలకి తీసుకెళ్ళారు. సెక్యూరిటీ ఆఫీసర్లు ఎటువంటి గొడవలు జరగకుండా ప్రభావిత ప్రాంతాలలొ కర్ఫ్యూ విధించారు. రక్షణ బలగాలను అంత్యక్రియలు అయ్యేంత వరకు ఊరేగింపుకి కాపలాగా ఉంచారు
ఈ సంఘటనలన్నీ ఒక వ్యక్తి తన ఇంట్లొ కూర్చోని ప్రశాంతంగా తన మొబైల్లొ చూస్తున్నాడు. తరువాత కుర్చిలోంచి లేచి ఎదురుగా గోడపై ఉన్న బోర్డుకి గుచ్చిన దేవేంద్ర రెడ్డి ఫోటోను తీసుకొని తన లైటర్ తొ ఆ ఫోటోను కాలుస్తాడు. ఆ వచ్చిన మంటపై సిగిరెట్ వెలిగించి కాలుతున్న ఫోటోను డస్టబిన్లొ పడేశి బిగ్గరగా నవ్వుతాడు.
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
ఎవరు....? - 2
Part - 2
 
దేవేంద్ర రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతని ఇంట్లొని కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలొ మునిగిపోయి ఉన్నారు.
సరిగ్గ అప్పుడె ఆ ఇంటి ముందు నలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ (Swift dzire) కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి 37 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు.
ఆతనిని చూడగానె దేవేంద్ర రెడ్డి ముఖ్య అనుచరులు ఇద్దరు అతని వద్దకు వచ్చారు.
శివ (దేవేంద్ర రెడ్డి అనుచరుడు) : నమస్తె సాగర్ సార్...
సాగర్ : నమస్తె ఎలా ఉన్నావు శివ...? మేడమ్ గారు ఉన్నారా?
శివ : బాగున్నా సార్. మేడమ్ గారు లోపలె ఉన్నారు రండి.
వివేక్ (దేవేంద్ర రెడ్డి ఇంకొ అనుచరుడు) : ఆ సంఘటన తరువాత మీకు కాల్ చేయడానికి ప్రయత్నించాం కాని మీకు కాల్ కలవలేదు.
సాగర్ : ముఖ్యమైన పని మీద నేను మారేడిమిల్లి అటవి ప్రాంతంలోకి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు ఉండవు అందుకె నీకు నా కల్ కలవలేదు.
శివా : వివేక్ వెళ్ళి ప్రియా మేడమ్ ని పిలు. సాగర్ సార్ వచ్చారని చెప్పు.
వివేక్ : అలాగె శివ.
శివ: మీరు ఇలా హాల్లొని సోఫాలొ కూర్చోండి సార్ మేడమ్ వచ్చేస్తారు.
సాగర్ : సరె..
కాసేపటికి దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ మరియు తన కొడుకు అరవింద్ ఇద్దరు సాగర్ ని కలవడానికి హాల్లోకి వచ్చారు. సాగర్ ని చూడగానె ప్రియకి దుఖం తన్నుకొచ్చేసింది.
ప్రియ : చూశావా సాగర్ ఏం జరిగిందొ. ఆయన మనల్ని వదలి పెట్టి వెళ్ళిపోయారు.  ఆయన గుండెపోటు వల్ల చనిపోయారంటె ఇప్పటికి నమ్మలేకపోతున్నా...
అరవింద్ : అవును అంకుల్ మా నాన్న చాలా ఆరోగ్యవంతుడు. తనకి బీ.పి, షుగరు లాంటివి ఏమి లేదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తాడు. ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. అలాంటిదీ ఆయనకు గుండెపోటంటె నమ్మశక్యంగా లేదు.
ప్రియ : ఇదంతా ఆ సూర్యనారాయణ పనె. నాకు అతనిపై మొదటి నుంచి నమ్మకం లేదు. నువ్వు వాళ్ళిధ్దరిని కలపకుండా ఉండాల్సింది సాగర్..
వీళ్ళు ఇలా మాట్లాడుకుటుండగా అక్కడున్న దేవేంద్ర రెడ్డి అనుచరులలొ గణేశ్ అనె 23 ఏళ్ళ కుర్రాడు శివ మరియు వివేక్ వద్దకు వచ్చి
గణేశ్ : శివ అన్న ఆయన ఎవరు.? ప్రియ మేడమ్ మరియు అరవింద్ సార్ ఆయనతొ అంత క్లోజ్ మాట్లాడుతున్నారు?
శివ : నువ్వు కొత్తగా పనిలొ చేరి నెల అవ్వడ వల్ల నీకు తెలియలేదు. ఆయన పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ కమీష్నర్ పేరు సాగర్ వర్మ ఐ.పీ.ఎస్. 2 నెలల క్రితం వరకు ఆయన విజయవాడలోనె ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రికి బదిలి అయ్యారు.
వివేక్ : దేవేంద్ర సార్ కి ఆయన కుటుంబానికి చాలా బాగా కావలసిన వ్యక్తి. 12 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ వయసున్న అరివింద్ సార్ ని కొంతమంది కిడ్నాప్ చేస్తె సాగర్ సారె తనని ప్రాణాలకు తెగించి కాపాడారు. అప్పటి నుంచె దేవేంద్ర సార్ కి ప్రియ మేడమ్ కి బాగా దగ్గరయ్యారు. ఈయన సలహాలనె దేవేంద్ర సార్ ఎక్కువుగా వింటారు.
గణేశ్ : ఇందాకల ప్రియ మేడమ్ అన్నారు సాగార్ సారె దేవేంద్ర సార్ ని సూర్యనారాయణ ని కలిపారు అని. నిజమా?
వివేక్ : అవును. సాగర్ సార్ వల్లె వాళ్ళిద్దరు పాత పగలు మర్చిపోయి స్నేహితులయ్యారు.
గణేశ్ : ఆయనెందుకు వాళ్ళిద్దరిని కలిపారు.?
శివ : ఎందుకంటె సాగర్ సార్ దేవేంద్ర సార్కి మాత్రమె కాదు సూర్యనారాయణకు కూడా బాగా కావలిసిన వ్యక్తి.
గణేశ్ : ఏంటి ఇద్దరికి స్నేహితుడా? అదెలా?
వివేక్ : ఎందుకంటె సాగర్ సార్ పరిచయమయ్యె సమయానికి దేవేంద్ర సార్ మరియు సూర్యనారాయణ అప్పటికె మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసె పెరిగారు. కాని 7 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరి మద్యన రాజకీయంగ గొడవలు పెరిగి అది వ్యక్తిగత గొడవలుగా మారి బద్ద శత్రువులయ్యారు.
శివ : కాని సాగర్ సార్ మాత్రం ఇద్దరిలొ ఏ ఒక్కరి స్నేహాన్నీ వదులుకోలేదు. ఇద్దరని ఎప్పడు కలపాలనె చూశారు. ఆయన చొరవ వల్లె 7 ఏళ్ళ తరువాత ఇద్దరు కలిశారు.
వివేక్ : కాని ఏం లాభం ఇప్పుడు దేవేంద్ర సార్ చినపోయారుగా ఆ సూర్య నారాయణ వల్ల. అసలు ఆయన ట్రాన్సఫర్ అయ్యి వెళ్ళకుండా ఉండుంటె ఈ ఘోరం జరిగేది కాదు.
గణేశ్ : ఓహో....
శివ : సర్లే పోయి కార్ తీసి ఉంచు ప్రియ మేడమ్ బయటకి వెళ్ళాలి.
గణేశ్ : సరె అన్న...
సాగర్ : మీరేమి బాధ పడకండి అసలు ఏం జరిగిందొ నేను కనుక్కుంటాను. నిజంగా ఆయన హత్య చేయబడితె ఆ చంపిన వాళ్ళని వదలను అది సూర్యనారాయణ అయిన సరె.
ప్రియ : ఠాంక్యు సాగర్ ఇప్పుడు ఉన్న పరిస్తితులలొ నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను.
సాగర్ : సరె మేడమ్ నేనిక బయలుదేరుతాను. అరివింద్ అమ్మని జాగ్రత్తగా చూసుకొ ఒంటరిగా వదలద్దు సరేనా. మీ నాన్న గారి పెద్ద కర్మ అయ్యేంత వరకు నేను ఈ ఊర్లొనె ఉంటా. ఈ లోపు నీకేమైన అవసరమయతె నన్ను పిలు.
అరవింద్ : సరె అంకుల్...
ప్రియ : భోజనం చేసి వెళ్ళొచ్చు కదా సాగర్.
సాగర్ : పర్లేదు మేడమ్ నేను మళ్ళి రేపు వస్తాను.
వాళ్ళకి ధైర్యం చెప్పి సాగర్ అక్కడనుంచి బయలుదేరి కారు ఎక్కబోతూ ఆగి..
సాగర్ : శివ ....
శివ : సార్ ....
సాగర్ : దేవేంద్ర సార్ కేసుని చూసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ ఎవరు..?
శివ : C.I మురళిధర్.....
సాగర్ : సరె... వాళ్ళని జాగ్రత్తగా చూసుకొ నేను మళ్ళి రేపు వస్తా...
శివ : సరె సార్...
తరువాత సాగర్ కారెక్కి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
------------------------------------------------------------------------
గన్నవరం ఫార్మ హౌసులొ ఉన్న సూర్యనారాయణ తన పరిస్థితి తలుచుకొని చాలా బాధ పడుతున్నాడు.
ఈ లోగా తనకి పార్టీ ప్రసిడెంట్ సాంబయ్య నుంచి ఫోనొచ్చింది. ఎత్తాడు.
సూర్యనారాయణ : హలొ! అన్న చెప్పండి...
సాంబయ్య : ఎక్కడున్నావు...? నీతొ చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నన్ను కలవడానికి అవుతుందా.?
సూర్యనారాయణ : తప్పకుండా అన్న. ఎక్కడికి రమ్మంటారు?
సాంబయ్య : ఇంతకి నువ్వు ఎక్కడున్నావు...?
సూర్యనారాయణ : గన్నవరం దగ్గర నా ఫార్మ్ హౌసులొ..
సాంబయ్య : అయితె అక్కడె ఉండు. నేనిప్పడె విమానాశ్రయం నుంచి బయలుదేరా. నేనె అక్కడికి వస్తా..
సూర్యనారాయణ : సరె అన్న..
సూర్యనారాయణ ఫోన్ పెట్టగానె తన ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఎవరా అని పైన బాల్కని నుండి చూస్తె ఆ వచ్చింది సాగర్...
తనని చూడగానె సూర్యనారాయణకి ప్రాణం లేచ్చొచ్చింది. వెంటనె క్రిందకి దిగి సాగర్ ని కలుసుకున్నాడు.
సూర్యనారాయణ : వచ్చేవా సాగర్. నీకు చాలాసార్లు కాల్ చేశాను కాని నీ ఫోన్ అస్సలు కలవలేదు.
సాగర్ : మారేడుమిల్లి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు లేవు. ఇంతకి మీరు ఎలా ఉన్నారు.?
సూర్యనారాయణ : చూస్తున్నావుగా. ఊళ్ళొ ఉంటె నా ఇంటిపై దాడి చేస్తున్నారు అని ఇక్కడ ఉంటున్న.
సాగర్ : అసలు ఏం జరిగింది సార్. మీ మీద హత్య నేరం ఆరోపించడం ఏంటి?
సూర్యనారాయణ : ఏమొ తెలియదు సాగర్. ఆ రోజు భోజనానికని తనని నా ఇంటికి పిలిచాను. కొంచెం తినగానె హఠాత్తుగా గుండె పట్టుకొని నేలమీద కూలబడ్డాడు. వెంటనె డాక్టర్ ని పిలిచెలోపు తను చనిపోయాడు.
సాగర్ : ఇంతకి సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎవరు చెప్పారు. ?
సూర్యనారాయణ : ఎవరు చెప్పారొ తెలియదు కాని 15 నిమిషాల్లొ అక్కడికి చేరుకున్నారు. కూడా పత్రికల వాళ్ళని తెచ్చారు.
సాగర్ : ఆయన చనిపోయిన 15 నిమిషాలకి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారా..? ఎక్కడొ తేడ కొడుతుంది.
సూర్యనారాయణ : నువ్వు అంటుంటె నాకు అలాగె అనిపిస్తుంది. చూస్తుంటె నన్ను ఎవరొ కావాలని ఇరికించినట్టుగా ఉంది.
సాగర్ : నాకు అదె అనుమానంగా ఉంది.
సూర్యనారాయణ : సాగర్ నువ్వె ఎలాగైన నన్ను ఈ కేసు నుంచి బయట పడేలా చూడు. నిన్ను తప్ప నేనింక ఎవ్వరిని నమ్మలేను.
సాగర్ : మీరేం కంగారు పడకండి నాకు వీలైనంత వరకు ప్రయత్నిస్తాను.
వీళ్ళిద్దరు హాల్లొ కూర్చొని మాట్లాడుకుంటుండగా. పార్టీ ప్రెసిడెంటు సాంబయ్య వచ్చాడు.
సూర్యనారాయణ : రండి అన్న...
సాంబయ్య : అరె సాగర్ నువ్వా...? ఎప్పుడొచ్చావు?
సాగర్ : ఇవాళ పొద్దున్న వచ్చాను..
సాంబయ్య : సరైన సమయానికి వచ్చావు. ఇప్పుడు నేను చెప్పబోయె విషయం నువ్వు కూడా వినాలి.
సాగర్ : ఏంటి సార్ అది.?
సాంబయ్య : ఇక్కడ కాదు పైన గదిలోకీ పదండి. మన ముగ్గురం మాట్లాడుకునేది ఎవరు వినకూడదు.
ముగ్గురు కలిసి పైన గదిలోకి పోయి తలుపేసుకున్నారు.
సూర్యనారాయణ : ఇప్పుడు చెప్పండి అన్న. ఏంటి అంత ముఖ్యమైన విషయం.?
సాంబయ్య : పార్టీ పని మీద ఢిల్లిలొ ఉన్న మన ఏం. పి (MP) రాఘవరావుని కలవడానికి వెళ్ళా. తనతొ మాట్లాడుతున్నప్పుడు నాకొ విషయం తెలిసింది.
సాగర్ : ఏంటది. ?
సాంబయ్య : ఒక విషయం చెప్పు సాగర్. ఇంత కాలం నిన్ను విజయవాడ లేద గుంటూరు చుట్టు ప్రక్కల తప్పించి వేరె ఇంకెక్కడికైన ట్రాన్సఫర్ అయ్యావా?
సాగర్ : లేదు నా మీద ఉన్న అభిమానంతొ దేవేంద్ర గారు సూర్యనారాయణ గారు కలిసి నన్ను దూరంగ వెళ్ళనియ్యకుండా ఈ చుట్టు ప్రక్కల ఉండేలా చేశారు.
సాంబయ్య : ఎవరి సాయంతొ?
సాగర్ : ఏం. పి (MP) రాఘవరావు గారు పలుకుబడితొ.
సాంబయ్య : ఆయన ఊరికనె వీళ్ళు చెప్తె చేస్తాడా?
సాగర్ : చెయ్యడు పార్టీ పెద్దలు లేదా ముఖ్యమంత్రి గాని హోమ్ మంత్రి గాని చెప్తె చేస్తాడు.
సాంబయ్య : ఎంత పార్టీ ప్రసిడెంట్నైనా. నేను ముఖ్యమంత్రికి చెప్పకుండా అయితె చెయ్యను. నీ వల్ల పార్టీకి లాభం ఉంది కాబట్టీ. ముఖ్యంగా విజయవాడ చుట్టప్రక్కల నియోజికవర్గాల్లొ ఇన్నేళ్ళు మన పార్టీయె గెలవడంలొ నీ పాత్ర కూడా ఉంది కాబట్టి నిన్ను దూరంగ వెళ్ళనియ్యకుండా కేంద్రంలొ మన పార్టీ పలుకుబడి ఉపయోగించి దగ్గరగా ఉంచాం.
సాగర్ : ఇప్పుడు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు.?
సాంబయ్య : ఇంతకాలం నిన్ను ఇక్కడ ఉంచిన వాళ్ళు చెప్పకుండానె నిన్ను రాజమండ్రికి ట్రాన్ఫర్ చేశారు అంటావా?
సాగర్ : అంటె మీ ఉద్దేష్యం ముఖ్యమంత్రి మరియు హోమ్ మంత్రి ఇద్దరు కలిసి నన్ను ట్రాన్సఫర్ చెయ్యాలనె నిర్ణయం తీసుకున్నారా?
సాంబయ్య : అవును..
సాగర్ : నేనింకా నా పై అధికారులకి దేవేంద్ర గారిని మరియు సూర్యనారాయణ గారిని కలిపినందుకు కోపంతొ ఇక్కడి నుంచి పంపించారి అనుకున్నానె. అంటె వాళ్ళ వెనకున్నది సీ.యం మరియు హోమ్ మంత్రా?
సూర్యనారాయణ : ఏంటి సాగర్ మా ఇద్దరిని కలిపినందుకు నిన్ను ట్రాన్సఫర్ చేశేరా? మరి మాకెందుకు చెప్పలేదు.?
సాగర్ : వాళ్ళ ఉద్దేష్యం ఏంటొ తెలుసుకుందామని ఆగాను. కాని వాళ్ళ వెనుక వీళ్ళద్దరు ఉన్నారని అనుకోలేదు. ఆయన వీళ్ళిద్దరు కలవడం పార్టీకి మంచిదెగా. అటువంటప్పుడు నా మీద ఎందుకు కోపం?
సాంబయ్య : ఎందుకంటె వీళ్ళు కలవడం వాళ్ళకిష్టం లేదు. వీళ్ళు విడిగా ఉంటూ గొడవ పడుతూ ఉండడమె వాళ్ళకి కావాలి.
సూర్యనారాయణ : ఎందుకు..?
సాంబయ్య : ఎందుకంటె మీరిద్దరికి ప్రజలలొ చాలా మంచి పేరు ఉంది. గత 20 ఏళ్ళుగా విజయవాడ మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాలని మీ గుప్పెట్లొ పెట్టుకున్నారు. ఏదొక రోజు కచ్చితంగా మీరు వాళ్ళనె మించిపోతారని.  అందుకె మీ బలం తగ్గించడం కోసం మిమ్మల్ని విడదీశారు..
సూర్యనారాయణ : అంటె దేవేంద్ర మరణం వెనుకు కూడా...?
సాంబయ్య : అదె నా అనుమానం..
సాగర్ : వాళ్ళు మాత్రమె కాదు…
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#5
ఎవరు....? - 3
Part - 3
 
సాయంత్రం 6 గంటలు ఆ సమయంలో ఒక గ్రామంలోని కొంతమంది ప్రజలు కలిసి ఒక కుటుంబాన్నీ కొట్టి వాళ్ళను ఇంట్లొ పెట్టి తాళం వేసి. ఆ ఇంటికి నిప్పు పెడతారు.
కొంచెం సేపట్లోనె మంటలు ఆ ఇంటిని కమ్మేశాయి. ఆ ఇంట్లొ బంధింపబడ్డ భార్య,భర్త, కూతురు ముగ్గరి ఆర్తనాదాలు ఆ గ్రామం అంతటా వ్యాపించాయి.
భర్త : దయచేసి నా భార్య బిడ్డనైన కాపాడండి. తలుపులు తెరవండి మీకు దణ్ణం పెడతాను.
భార్య : అయ్య అయ్య మీకు పుణ్యం ఉంటుంది మీకు దణ్ణం పెడతాను తలపులు తెరవండయ్యా...
కూతురు : అమ్మా....... మంటలు కాలిపోతున్న....
భార్య : అయ్యో... ఆఆఆఆఆఆఆ.. ఆఆఆఆఆ
భర్త : ఆఆఆఆఆఆఆఆ...... ఆఆఆఆఆ...
2 గంటల తరువాత వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆ ఇంటితొ పాటు ఆ ఇంట్లోని వాళ్ళు తగలబడిపోయారు.
--------------------------------------------------------‐---------------
కృష్ణా నది ఒడ్డున దేవేంద్ర రెడ్డి అస్తికలను తన కొడుకు అరవింద్ నదిలొ కలుపుతున్నాడు. ఆ సమయంలొ అక్కడ దేవేంద్ర రెడ్డి భార్య ప్రియ మరియు సాగర్ ఉన్నారు. వారితొపాటు వెనకాల దేవేంద్ర రెడ్డి అనుచరులు శివ, వివేక్ మరియు గణేష్ నించోని ఉన్నారు.
కార్యక్రమం పూర్తయ్యాక అందరు కారు ఎక్కుతున్నారు. ఈలోపు సాగర్ ప్రియ దగ్గరకు వచ్చి
సాగర్ : మేడమ్ మీతొ నేను ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
ప్రియ : ఇంటికి పద సాగర్ అక్కడ మాట్లాడుకుందాం.
సాగర్ : ఇది ఇంట్లొ మాట్లాడె విషయం కాదు. కార్లోనె మాట్లాడాలి.
అరవింద్ కారు నువ్వు నడుపు.
శివ మీ ముగ్గురు వెనకాల కారులొ రండి.
మీరు కారెక్కండి మేడమ్.
సాగర్, అరవింద్ మరియు తని తల్లి ప్రియ ఒకె కారులొ బయలుదేరారు. ఆ కారు అరవింద్ నడుపుతున్నాడు.
శివ, వివేక్, గణేష్ వెనకాల కార్లో వస్తున్నారు. ఆ కారుని గణేష్ నడుపుతున్నాడు.
ప్రియ : ఇప్పడు చెప్పు సాగర్. ఏంటి ఆ ముఖ్యమైన విషయం..?
సాగర్ : మేడమ్ దేవేంద్ర గారి కేసులొ ఎవ్వరిని నమ్మలేం. ఇందులొ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ప్రియ : ఏమంటున్నావు సాగర్ ?
సాగర్ : అవును మేడమ్ అంతా కలిసి కావాలనె నన్ను ఇక్కడి నుంచి రాజమండ్రికి ట్రాన్సఫర్ చేశారు. సీ.యం, హోమ మినిష్టర్ వరకు ఇందులొ ఉన్నట్టు నా అనుమానం. వాళ్ళె నన్ను ఇక్కడ నుంచి ట్రాన్సఫర్ చేయించారు.
ప్రియ : వాళ్ళకేంటి అవసరం ..?
సాగర్ : నా వల్లె దేవేంద్ర గారు సూర్యనారాయణ గారు మళ్ళి కలిసారు కాబట్టి. అది వాళ్ళకి నచ్చలేదు.
ప్రియ : వాళ్ళకెందుకు నచ్చలేదు.? వాళ్ళిద్దరు కలిసి ఉంటె వాళ్ళకేంటి సమస్య?
సాగర్ : వాళ్ళిద్ధరి మద్య గొడవ వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు పార్టీలొ విజయవాడ మొత్తం వీళ్ళ గుప్పెట్లొనె ఉండేది. వీళ్ళ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు పార్టీలొ చాలా మంది ఉన్నారు.
అరివింద్ : అందుకె వీళ్ళద్దరిని విడదీశారా?
సాగర్ : అవును. వీళ్ళిద్దరి మద్దతు పార్టీకి కావాలి కాని వీళ్ళు ఎదగకూడదు. అందుకె మీ నాన్నగారికి సూర్యనారాయణ గారికి మద్య గొడవలు పెట్టి విడదీశారు. తిరిగి వాళ్ళు మళ్ళి నా వల్ల కలిసెసరికి కోపంతొ నన్ను ఇక్కడ నుంచి పంపించేశారు.
ప్రియ : మరి ఆయన్ని చంపింది ఎవరు? సూర్యనారాయణ కాదా?
సాగర్ : కాదు ఆయన్నీ కేవలం బలి పశువుని చేశారు. హత్య చేశింది వేరే వాళ్ళని నా అనుమానం.
ప్రియ : ఎవరై ఉంటారు.?
సాగర్ : ఎవరు చేశారొ తెలుసుకోవాలంటె ముందు అసలు దేవేంద్ర గారిని ఎలా చంపారొ తెలుసుకోవాలి. అది జరగాలంటె ఈ కేసు దర్యాప్తు (Investigation) నా అద్వర్యంలొ జరగాలి.
ప్రియ : కాని నిన్ను రాజమండ్రికి బదిలి చేశారుగా. నువ్వు ఎలా ?
సాగర్ : దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తె చచ్చినట్టు ఈ కేసును నాకప్పగిస్తారు.
ప్రియ : చెప్పు సాగర్ ఏం చెయ్యాలొ? కచ్చితంగ చేస్తాను.
సాగర్ :
- ముందు మీరు కోర్టులొ సెక్షన్ CrPC 156 (3) ప్రకారం ఒక పిటిషన్ దాకలు చేయండి.
- చనిపోయింది ఒక అధికార పార్టీ ఎం.ఎల్.ఏ. కాబట్టి కోర్టు ఇదివరకు సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇచ్చిన రీ ఇన్వషటిగేషన్ తాలుకు ఆదేశాలు సరిపోవని చెప్పండి
- లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ల మీద నమ్మకం లేదని చెప్పండి.
చాలు మిగిలింది మన లాయర్ మరియు జడ్జి గారు చూసుకుంటారు.
ప్రియ : అలా చేస్తె నీకు ఈ కేసు అప్పగిస్తారా?.
సాగర్ : కోర్టు ఇవ్వదు కాని ఇలా చేస్తె కచ్చితంగా ఈ కేసు నా వద్దకు వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను.
ప్రియ : సరె సాగర్ నువ్వు చెప్పినట్టె చేస్తా.
అరవింద్ : అంకుల్ నాకొక డౌట్
సాగర్ : ఏంటది..?
అరివింద్ : మీరు ఇదంతా ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చుగా కార్లోనె ఎందుకు చెప్పాలన్నారు.?
సాగర్ : ఎప్పుడైతె ఈ కేసులొ ముఖ్యమంత్రి మరియు హోమ్ మంత్రులు కూడా ఉన్నారని తెలసిందొ. అప్పటినుంచె మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా నాకు అనుమానం మొదలైంది. అందుకె ఎవరికి తెలియకూడదనె కారులొ మాట్లాడాలి అన్నాను.
అరవింద్ : ఓహో...
సాగర్ చెప్పినట్టుగానె ప్రియ కోర్టులొ సెక్షన్ CrPC 156(3) క్రింద పిటీషన్ వేస్తుంది.
ప్రియ తాలుకు లాయర్ కోర్టులొ సాగర్ చెప్పినట్టు వాధించడం వల్ల జడ్జి సానుకూలత చూపించాడు
జడ్జి : వాదనలు విన్న తరువాత ఈ కేసును సాధారణ కేసులా కాకుండా ప్రత్యేకంగా చూడాలి కాబట్టి. ఈ కేసు దర్యాప్తును అనుభవజ్ఞుడైన ఒక స్వంతంత్ర సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి ఆద్వర్యంలొ జరగాలని కోర్టు ప్రభుత్వాన్నీ అదేశించడమైనది.
కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఒక స్వంతంత్ర సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి ఆద్వర్యంలొ ఒక ప్రత్యేక బృందం ఈ కేసుకై ఏర్పాటు చెయ్యాలి. కాని దానికి హోమ్ మంత్రి సంకోచిస్తున్నాడు.
ఈ కోర్టు ఆదేశాలు అప్పటికె వివిధ వార్తా మాద్యమాల్లొ వచ్చేసింది. దేవేంద్ర రెడ్డి అనుచరులు విజయవాడ నగర వ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
దీంతొ ప్రభుత్వంపై ఒత్తిడి రా సాగింది. దీంతొ చేసేది ఏం లేక వెంటనె ఒక స్వంతంత్ర అధికారిని నియమించి అతని అద్వర్యంలొ దర్యాప్తుని కొనసాగంచమని హోంమంత్రికి సీ.యం చెబుతాడు.
వెంటనె హోంమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులతొ ఒక సమావేషం ఏర్పాటు చేస్తాడు.
హోంమంత్రి : ఈ కేసుకి ఎవరిని నియమిస్తె సరిగ్గ ఉంటుందొ చెప్పండి. దాని వల్ల ప్రజలకు ఈ దర్యాప్తు మీద నమ్మకం కూడా కలగాలి.
డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ అధికారి) : సర్ ఈ కేసు చాలా సున్నితమైనది. కాబట్టి మనకి ఒక నిష్పాక్షికమైన మరియు సామర్ద్యం గల వ్యక్తి కావాలి.
హోంమంత్రి : అదె ఎవరా ఆ వ్యక్తి?
డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ అధికారి) : నా అభిప్రాయం ప్రకారం సాగర్ వర్మ ఈ కేసుకు సరైన వ్యక్తి సర్
హోంమంత్రి : అతనా...? అతన్నీ మనం ట్రాన్సఫర్ చేసేశాం కదయ్యా. అతను కాకుండా వేరే ఇంకెవరు లేరా...?
డీ.జీ.పి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ అధికారి) : కాని సర్ ఈ కేసుకు అతనె సరైన వ్యక్తి. అతనికి వీళ్ళద్దరి గురించి బాగా తెలుసు. గతంలో వాళ్ళ మధ్య జరిగిన ఎన్నో గోడవలని ఇతనె చాలా సమర్ధవంతగా అదుపు చేశాడు. మరియు అతని ట్రాక్ రికార్డ్ (Track record) కూడా చాలా బాగూంది.
అదనపు డీ.జీ.పి (లా అండ్ ఆర్డర్) : అవును సర్ డి.జీ.పి గారు చెప్పింది కరక్టె. ఎంతొ క్లిష్టమైన ఈ కేసును సాగర్ వర్మ మాత్రమె హ్యాండల్ చేయగలడు.
ఐ.జీ (ఇంటెలిజెన్స్) : అవును సర్ పైగా దేవేంద్ర రెడ్డి కి మరియు సూర్యనారాయణకి ఇద్దరికి సాగర్ వర్మ ఆప్తుడు. అతను ఆద్వర్యంలొ ఈ దర్యాప్తు సరైన దిశలోనె వెళుతుందని నా నమ్మకం.
కమీష్నర్ (విజయవాడ నగరం) : సర్ నగరంలొ జరిగె నిరసనలు ఆగాలన్న దేవేంద్ర రెడ్డి అనుచరులు శాంతించాలన్న వాళ్ళకి నమ్మకమైన వ్యక్తి ద్వారా ఈ దర్యాప్తు జరగాలి. కాని వాళ్ళకి మన లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్లుపై నమ్మకం లేదు. కాని సాగర్ వర్మని మాత్రం వీళ్ళందరు నమ్ముతారు. ఇతని చేతికి కేసు అప్పగిస్తె నిరసనలు కూడా ఆగుతాయి.
హాంమంత్రి : మ్మ్మ్మ... సరె మీరింత చెప్తున్నారు కాబట్టి సాగర్ వర్మని డిప్యుటేషేన్ మీద విజయవాడకు రప్పించి అతనికి ఈ కేసు అప్పగించండి..
డి.జీ.పి : సరె సర్.
మీటింగు ముగిసింది. అందరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. డీ.జీ.పి తన కారు ఎక్కి కొంత దూరం వెళ్ళాక. సాగర్ కి కాల్ చేశాడు.
డీ.జి.పి : హలొ సాగర్..
సాగర్ : చెప్పండి సర్. కేసు నా చేతికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఆ హోము..?
డీ.జీ.పి. : ఒప్పుకోక ఏం చేస్తాడయ్యా. నాతొ పాటు ఏ.డీ.జి.పి, ఐ.జీ, కమీష్నర్ కూడా వంత పాడేసరికి ఒప్పుకోకతప్పలేదు.
సాగర్ : హా.హా.హా.హా. ....
డీ.జి.పి : సరె రేపు నా ఆఫీసుకు రా మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.
సాగర్ : సరె సర్.
అనుకున్నట్టు గానె సాగర్ చేతికి దేవేంద్ర రెడ్డి హత్య కేసు వచ్చింది. అతను అద్వర్యంలొ ఒక ప్రత్యేక బృందాన్నీ (SIT) తయ్యారు చెసారు. అందులొ సాగర్ కాకుండా ఒక ఏ.సీ.పి, ఒక సి.ఐ, ఇద్దరు ఎస్.ఐ లు మొత్తం ఐదుగురు సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్లు ఉన్నారు.
హాంమంత్రి,  డి.జీ.పి మరియు సాగర్ కలిసి విలేఖరుల సమావేశం నిర్విహించారు. దేవేంద్ర కేసును సాగర్ కి అప్పింగించిన విషయం చెప్పారు. తరువాత మీడియా ముఖంగా నిరసనలు ఆపమని కోరారు.
అది విన్న దేవేంద్ర రెడ్డి అనుచరులు మరియు అతని అభిమానులు కేసు సాగర్ చేతికి వెళ్ళింది అని తెలిసి అతని మీద నమ్మకంతొ నిరసనలు ఆపేస్తారు. దాంతొ నగరంలొ లా అండ్ ఆర్డర్ అదుపులోకి వస్తుంది.
కాని ఈ వార్త తన ఇంట్లొ కూర్చొని టీ.వి లొ చూస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి లేచి సూర్యనారాయణ ఫొటోను తీసుకొని ఎదురుగా గొడపై ఉన్న బోర్డు కి గుచ్చి ఆ ఫొటో మీద ఎరుపు రంగు మార్కర్ తొ × మర్కు కొడతాడు.
తరువాత తన జేబు నుంచి ఒక సిగిరెట్ తీసి వెలిగించుకొని ఆ సిగిరెట్ పొగను సూర్యనారాయణ ఫొటో మీద ఊదుతూ గట్టిగా నవ్వుతాడు.…
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#6
ఎవరు....? - 4
Part - 4
 
సమయం అర్ధరాత్రీ 1 గంట…
ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స్ (industrial outskirts)
ఎక్కడికక్కడ ఖాళీగా రేకుల షెడ్డులు పడున్నాయి.
దూరంగా కుక్కలు మొరుగుతున్న శబ్దం…
సరిగ్గ ఆ సమయంలొ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వాహనం వచ్చి రోడ్డు ప్రక్కకు ఆగింది. అర్ధరాత్రి పూట అక్కడ పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మొత్తం చీకటిగా నిర్మానుష్యంగా ఉంది.
ఆ చీకట్లొని సెక్యూరిటీ ఆఫీసర్ బండి హెడ్లైట్స వెలుతురొ ఒక వ్యక్తిని చేతులు కట్టేసి బండ్లో నుండి బయటకి లాక్కోని వచ్చి
ఎదురుగా నిలబెట్టారు.
అదె సెక్యూరిటీ ఆఫీసర్ బండిలొ డ్రైవర్ ప్రక్కనున్న సీటు నుంచి 36 ఏళ్ళ వయసున్న ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) దిగాడు.
చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్ నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను వదిలేయండి సర్.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేరం చేసి పట్టుబడ్డ ప్రతి వాడు చెప్పె మాటెరా ఇది
అని తన రివాల్వర్ బయటకు తీసి అందులోకి బుల్లెట్సను ఎక్కిస్తున్నాడు.
రివాల్వర్ చూసిన ఆ వ్యక్తి భయపడుతూ..
చేతులు కట్టి ఉన్న వ్యక్తి : సర్... సర్... వద్దు సర్ నిజంగానె నేను ఏ తప్పు చేయలేదు సర్. దయచేసి నన్ను ఏం చేయద్దు సర్....
అని చేతులు జోడించి ఏడుస్తున్నాడు...
అప్పుడ అజయ్ అక్కుడున్న ఎస్.ఐ మనోహర్ (S.I Manohar) వైపు తిరిగి.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఏం మనోహర్ ఏం చేద్దాం.? చూస్తుంటె వీడు నిజం చెప్పేలా లేడు. నువ్వెం ఏం అనుకుంటున్నావు.?
ఎస్.ఐ మనోహర్ (S.I Manohar) : మనం కస్టిడిలోకి తీసుకొని విచారణ చేసి నిజం చెప్పిద్దాం సర్.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : అక్కడ వరకు అవసరం లేదు. ఇక్కడె ముంగించేద్దాం. వీడు ఎలాగొ నిజం చెప్పడు
తరువాత ఆ నేరస్తుడు వైపు తిరిగి. మౌనంగా తననె చూస్తున్నాడు. నిశ్శబ్దం. గాలి చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం..
భయంతొ ఆ నేరస్తుడు బిక్కు బిక్కుమంటు అజయ్ వైపె చూస్తున్నాడు.
నేరస్తుడు : సర్ నన్ను నమ్మండి సర్ నిజంగా నేనేం చేయలేదు సర్. నాకేం తెలియదు సర్.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె నిన్ను నమ్ముతున్న. కాబట్టి నీకొక అవకాశం. పారిపోయి బ్రతికిపో..
కానిస్టేబుల్స్ తన చేతికున్న సంకెళ్ళు తీసేయండి...
పోరా...
అతని చేతికున్న సంకెళ్ళు తీసేశారు. కాని అతను కదలకుండా అక్కడె నించోని ఏ.సీ.పి అజయ్ వైపె చూస్తున్నాడు..
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : వెళ్ళిపోరా. ఇంకా ఇక్కడె నించున్నావేం.
అజయ్ అలా అనగానె నెమ్మదిగా వెనుదిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక తను పరిగెట్టడం మొదలు పెట్టాడు.
పరిగెట్టిన కొంచెం సేపటి గన్ పేలిన శబ్దం వచ్చింది. ఆ నేరస్తుడి వెనక కుడికాలు తొడలొ గుండు దిగింది. అయినా సరె ఆగకుండా తను పరిగెడుతూ ప్రక్కన ఉన్న పొదల్లోకి దూరాలని చూశాడు.
మళ్ళి గన్ పేలింది ఈసారి తన కుడి వైపు మొల క్రింద తుంటి భాగంలొ గుండు దిగింది. అతను గట్టిగా అరుస్తూ రక్తం కారె చోట చేతులు అడ్డుపెట్టుకున్నాడు. ప్రక్కన ఉన్న రాయిని తీసి అజయ్ పై విసరబోయేంతలొ ఈసారి తన కుడి వైపు ఛాతిలొ ఇంకొ గుండు దిగింది. దాంతొ అతను నెల మీద కూలబడ్డాడు.
బాధతొ అతను గట్టిగా అరుస్తూ ఎడుస్తున్నాడు. "నన్ను వదిలేయండి" అంటూ ప్రాధేయపడుతున్నాడు. సరిగ్గ అదె సమయంలొ ఇంకొ గుండు పొదల వైపు నుండి వచ్చి తనకి కుడి వైపు తలలొ దిగింది. దాంతొ అక్కడికక్కడె అతను చనిపోయాడు.
ఆ బుల్లెట్ వచ్చిన వైపు పొదల్లో నుంచి సీ.ఐ ప్రవీణ్ (C.I Praveen) ప్రశాంతంగా నడుచుకుంటూ బయటకి వచ్చాడు. తరువాత తను ఎస్.ఐ మనోహర్ చేతి పైన మరియు అక్కడ ఉన్న ఓ ఇద్దరి కానిస్టేబుల్స్ కాళ్ళ పైన తన రివాల్వర్ తొ కాల్చాడు.
తరువాత గాల్లొ రెండు రౌడ్లు కాల్చి ఆ రివాల్వర్ ని చనిపోయిన నేరస్తుడి కూడి చేతిలొ పెడతాడు. అలా పెట్టేటప్పుడు తన వేలుని రివాల్వర్ ట్రిగ్గర్ పై ఉండేలా నొక్కి పెడతాడు.
తరువాత అజయ్ తన పై అధికారి డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ కి కాల్ చేస్తాడు
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ డ్రగ్స్ కేసులొ మనం వెతుకుతున్న వాడు పేరు కిషోర్ రావు అతని లోకేషన్ కనుకున్నాం…
ఇబ్రహీంపట్నం ఇండస్ట్రియల్ ఔటస్కర్ట్స (Ibrahimpatnam Industrial outskirts) లో అతన్నీ ట్రేస్ (trace) చేశాం.
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : అజయ్.. careful…
కస్టడి లోకి తీసుకోండి… ఎన్కౌంటర్ సిట్యువేషన్ (encounter situation) వద్దు...
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : కాని సర్ ......
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఏమైంది...?
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ కిషోర్ రావుని పట్టుకొని బండ్లొకి ఎక్కిస్తుంటె మన సీ.ఐ ప్రవీణ్ (C.I Praveen) యొక్క రివాల్వర్ లాక్కొని పరిగెత్తాడు సర్  
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : తన చేతికి మన ప్రవీణ్ రివాల్వర్ దొరకడమేంటి.? అయిన అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారయ్యా? వాడు అలా పారిపోతుంటె మీరేం చేస్తున్నారు.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : పట్టుకోవాలని చూశాం సర్ కాని మా మీదె కాల్పులు జరిపాడు దాని వల్ల మన ఎస్.ఐ మరియు ఇద్దరి కానిస్టేబుల్సుకి గాయాలు కూడా అయ్యాయి.
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మరి నువ్వేం చేస్తున్నావు.?
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : అది చూసి నేనూ కాల్పులు జరిపాను సర్. అతని రెండు తొడల్లొ రెండు బులెట్లు దిగాయి. కుడి వైపు ఛాతిలొ ఒక బులెట్టు దిగింది.
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మరి వాడు బ్రతికె ఉన్నాడా..?
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నేను కాల్చిన తరువాత వాడు బ్రతికె ఉన్నాడు సర్ కాని...
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : మళ్ళి కాని ఎంటయ్యా...?
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : గాయాలతొ నేలపై పడి ఉన్న అతన్ని తీసుకెళదామని అతని వద్దకు వెళితె. రివాల్వర్ తొ తనని తానె కుడి వైపు నుంచి తలపై కాల్చుకొని చనిపోయాడు సర్.
అరేస్టు చేసి కస్టడిలోకి తీసుకురావాల్సిన కిషోర్ రావు చినపోయాడు అని తెలియగానె. డీ.ఎస్.పి రాజ్ గోపాల్ కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సర్ లైన్లొ ఉన్నారా?
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఆ ఆ.. ఉన్నాను
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఇప్పుడు ఏం చెయ్యమంటారు సర్?
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా ఏం చెయ్యాలొ...
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సారీ సర్?
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : సరే జరిగిందేదో జరిగిపోయింది.
• ముందు మన వాళ్ళను త్వరగా హాస్పెటల్ కి తీసుకెళ్ళు.
• అక్కడ ఉన్న సీన్ ని డిస్టర్బ్ చెయ్యద్దు.
• పత్రికల వాళ్ళకి మరియు మీడీయా వాళ్ళకి ఈ వార్త తెలియకుండా చూడూ..
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్..
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఒక్క విషయం గుర్తుంచుకొ అజయ్. ఇది సరిగ్గా హ్యాండిల్ చేయకపోతె. అది ఎన్కౌంటర్ కాదు నీపై ఎంక్వైరి అవుతుంది.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్..
డీ.ఎస్.పి (DSP) రాజ్ గోపాల్ : ఎన్కౌంటర్ జరగడం కాదు. పై అధికారులకి ఎలా వివరంగా చెప్పాలన్నదె అసలు సమస్య. దానికి సంబందించి వివరంగ రిపోర్ట్ రెడి చెయ్యు..
అని చెప్పి డీ.ఎస్.పి ఫోను పెట్టేశాడు.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ప్రవీణ్ త్వరగా వీళ్ళని బండె ఎక్కించు. హాస్పెటల్ కి తీసుకెళ్ళాలి..
సీ.ఐ ప్రవీణ్ : మరి ఆ శవాన్నీ సర్....?
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : దాన్నీ అలానె వదిలసి ఫారన్సిక్ టీమ్ వాళ్ళకి సమాచారం ఇవ్వు. మిగిలింది వాళ్ళొచ్చి చూసుకుంటారు. అప్పటి వరకు ఇక్కడ ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ని శవానికి కాపలా పెట్టు..
సీ.ఐ ప్రవీణ్ అక్కడ ఓ ఇద్దరు కానిస్టబుల్స్ని కాపలా పెట్టి ఫారన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ చేస్తాడు. తరువాత ఏ.సీ.పి అజయ్ తొ కలిసి హాస్పటల్ కి వెళతాడు...
వారం రోజులు తరువాత ఏ.సీ.పి అజయ్ కు డీ.జీ.పి ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. దేవేంద్ర రెడ్డి హత్య కేసును దర్యాప్తు జరిపె ప్రత్యేక బృందం లొ (SIT) తనని తీసుకుంటున్నట్టు చెబుతారు..
అలా తను వెళ్ళి సాగర్ వర్మను కలుస్తాడు.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : గుడ్ మార్నింగ్ సర్
సాగర్ వర్మ : గుడ్ మార్నింగ్ Mr. అజయ్ రండి కూర్చోండి.. మీ ట్రాక్ రికార్డ్ చూశాను వేరి ఇంప్రెస్సివ్ (Very Impressive)
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఠాంక్యూ సర్...
సాగర్ వర్మ : ఇది దేవేంద్ర రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మీరు దీన్ని చదవండి.
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్...
సాగర్ వర్మ : ఈ కేసు దర్యాప్తుకు ఒక సి.ఐ మరియు ఇద్దరు ఎస్.ఐ లు కావాలి. మీకు తెలిసిన ఎఫీశ్యంట్ ఆఫీసర్స (efficient officers) ఎవరైన ఉంటె చెప్పండి..
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సి.ఐ ప్రవీణ్ అని నాతొ పాటు మాధక ద్రవ్యాల కేసులొ పని చేశాడు. అతనితొ పాటు వేరె కేసుల్లొ నాతొ పని చేసిన ఇద్దరు ఎస్.ఐలు కూడా ఉన్నరు. వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు సర్...  
సాగర్ వర్మ : మరి ఇంకేం వాళ్ళ ప్రోఫైల్సు నాకు పంపించండి నేనొకసరి చెక్ చేస్తాను..
ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్
అలా దేవేంద్ర రెడ్డి కేసులొ సాగర్ వర్మ తొ ఏ.సీ.పి అజయ్, సీ.ఐ ప్రవీణ్, ఎస్.ఐలు ఇద్దరు సుందర్ మరియు జాన్ బాబు
ఐదుగురు కిలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ (SIT) ఎర్పాటు చేశారు…
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)