Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"ఎవరు ?" - 7
#1
"ఎవరు ?"
By SATYA PAVAN GANDHAM
 
అందరికీ నమస్కారం అండి !
చాలా రోజులు తర్వాత ఒక విభిన్నమైన స్టోరీ లైన్ ఎంచుకుని
"ఎవరు ?"
అనే ఒక సరికొత్త కథ ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
వాస్తవంగా జరిగిన సంఘటనలే కథకు ప్రామాణికంగా  తీసుకున్నప్పటికీ ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, ప్రాంతం అన్ని కేవలం కల్పితం మాత్రమే !
"ఎవరు ?" అనే కథ...
ఎవరిని ఉద్దేశించినది కాదు.
ఇక హైదరబాద్ లోని kphb అనే ప్రదేశం..
నాకు బాగా తెలిసిన ప్రదేశం కాబట్టి, కథకు మూలంగా ఎంచుకోవడం జరిగింది.
అంతే తప్ప ఒకరి ప్రాంతీయ అభిమానాన్ని దెబ్బతియ్యాలనే ఉద్దేశ్యం మాత్రం లేదు. దయచేసి సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తూ ...
మీ...
- సత్య పవన్

త్వరలో ఈ కథ ఆరంభం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అది హైదరాబాద్ నగరంలోని kphb కాలనీ.
ఆ రోజు శుక్రవారం !
నగరం నిద్రపోతున్న వేళ ...
అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కావస్తోంది.

ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ,
అసలే అర్ధరాత్రి, ఆపై హోరు గాలితో జోరుగా వర్షం పడుతుండడంతో ఆ రోడ్లన్నీ చాలా నిర్మానుష్యంగా మారాయి.

ఆ గాలి, వర్షం ధాటికి పవర్ కూడా వస్తూ పోతుంది.
రోడ్డు నెంబర్ 3 లో ఉన్న తన హాస్టల్ కి, ఆఫీసు పని ముగించుకుని సరిగ్గా అప్పుడే ఆఫీసు క్యాబ్లో వచ్చింది సరిత !
సరిత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. ఈ మధ్యనే మంచి ప్యాకేజీ తో క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా జాయిన్ అయ్యింది.

సరిత హాస్టల్ ...
అదే రోడ్డులోని ఒక చిన్న సందులో ఉండడంతో
ఆ క్యాబ్ లోపలికి వెళ్లదు..!

ఇక ప్రతిరోజూ తనే ఆ స్ట్రీట్ చివర క్యాబ్ దిగి హాస్టల్ వరకూ నడుచుకుంటూ వెళ్ళేది.
ఎప్పటిలానే ఆ రోజు కూడా అలానే క్యాబ్ దిగి, ఆ గాలి వానలో హాస్టల్ వరకూ నడుచుకుంటూ వెల్దాం అనుకుంది.
తను ఆ క్యాబ్ దిగగానే ఆ క్యాబ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

తను క్యాబ్ దిగినప్పుడు ఉన్న పవర్ ఆ క్యాబ్ వెళ్ళిపోయేసరికి పోయింది. రోడ్డు అంతా చాలా చీకటిగా ఉంది. పైగా గాలి వాన. చుట్టూ ఎవరూ లేరు. పైగా ఆ సందు అంతా వర్షపు నీటితో నిండిపోయింది.
దాంతో ఆ వీధి చివర్లో పక్కనే ఉన్న ఒక హాస్టల్ గోడకున్న షట్టర్ వద్ద నిలబడి, తన ఫోన్ తీసి, తన హాస్టల్ లోని రూం మేట్ అయినా ప్రియకు కాల్ చేసి "తాను వీధి చివర వర్షంలో ఇరుక్కుపోయానని, గొడుగు తీసుకుని రమ్మని" చెప్పింది సరిత !
ఇక ప్రియ తనకి సాయంగా ...
ఇంకో రూం మేట్ అయిన రవళిని తీసుకుని, గొడుగు పట్టుకుని సరిత చెప్పిన ప్రదేశానికి వెళ్ళింది.

కానీ, అక్కడ వారికి సరిత కనిపించలేదు.
ఆమె మాత్రమే కాదు, అసలు అక్కడ ఎవరూ లేరు ?
ఎటు చూసినా నిర్మాన్యుష్యమే !

దీంతో ప్రియ, తిరిగి సరిత నెంబర్ కి కాల్ చేసింది.
రింగ్ అవుతుంది...
కానీ, సరిత...
ప్రియ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.

మరొక సారి కాల్ చేయగా
ఈ సారి కాల్ కట్ అయ్యింది.
"సరిత కాల్ కట్ చేస్తుందేంటి ?" అని ప్రియ మనసులో అనుకుంటూ...
మళ్ళీ కాల్ ట్రై చేయగా...
ఇప్పుడు సరిత మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

"ఏమైంటుంది..?" అన్న సందేహంతో
అదే విషయం..
సరిత తనతో పాటు వచ్చిన రవళికి చెప్పింది .

దాంతో రవళి ...
"ఇక్కడ వర్షం పడుతుందని ఇక్కడెక్కడికైనా వెళ్ళిందేమో ?" అన్న డౌట్ పడింది.

ఇక రవళి అన్నట్టుగానే వారిద్దరూ ఆ చుట్టు పక్కల వెతికారు.
అయినా వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు.

అలా చాలా సేపు వాళ్ళు సరిత కోసం చూసినా...
ఏం లాభం లేకపోయింది.
అసలే పెద్దగా వర్షం...
ఆపై చిమ్మచీకటి...
పవర్ కూడా లేదు.
ఇక చేసేదేమీ లేక, అక్కడి నుండి హాస్టల్ కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ.

విషయం హాస్టల్ ఓనర్ కి చెప్దామ్ అని వాళ్ళు అతనికి కాల్ చేస్తే,
"ఎక్కడికో వెళ్లి వుంటుంది లేమ్మా... సరిగా చూడండి!
కరెక్టుగా పడుకున్న టైంలో నిద్ర చెడగొడతారు !" అంటూ అతను నిద్ర మత్తులో ఉన్న విసుక్కుంటూ సరిగా రెస్పాండ్ అవ్వలేదు.

వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా సరిత ఫోన్ స్విచ్ ఆఫ్ అని మాత్రమే వస్తుంది.
అలా ఎంతసేపు గడిచినా సరిత దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి,
వాళ్ళలో కొంచెం భయం స్టార్ట్ అయ్యింది!
సరిత రూం లో సరితతో పాటు వాళ్లిద్దరే ఉంటారు.

వాళ్ళలో కొంచెంగా మొదలైన భయం క్రమ క్రమంగా పెరిగిపోతుంది.
వేరే రూం లో ఉన్న మిగిలిన అమ్మాయిలను నిద్ర నుండి లేపి, విషయం చెప్పగా..
"ఈరోజు ఫ్రైడే కదా !
ఫ్రెండ్స్ తో కలిసి ఏ పబ్కో బయటకు వెళ్లి ఉంటుంది.
ఎంతైనా తను సాఫ్ట్వేర్ కదా!" అంటూ ఒకరు...

"ఏ బాయ్ ఫ్రెండ్ తోనో బయటకు వెళ్లి ఉంటుంది.
లేదా తన ఫ్రైండ్ రూం కి వెళ్లి ఉంటుంది !" అంటూ ఇంకొకరు లైట్ తీసుకోమంటూ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, ఆ ఇద్దరికీ మాత్రమే తెలుసు...
సరిత ఎలాంటి అమ్మాయో!

సరితతో తమకి పరిచయమయ్యి రెండు నెలలే అయినప్పటికి..
ఆమె గుణగణాలేంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు !

తను అలాంటిది కాదని,
చాలా సంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిందని.
తనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని.

ఇక ఎవరికీ చెప్పి ప్రయోజనం లేదని భావించిన ఆ ఇద్దరూ రూం లో కూర్చుని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు...
"సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లయింట్ ఇద్దామా ?
అంటూ ప్రియా తనకొచ్చిన ఐడియా చెప్పగా...

"అమ్మో సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లయింట్ ఆ !" అంటూ రవళి భయంతో  నోరెళ్ళబెట్టింది.
తను ఇలా అందో లేదో...
ప్రియ తన మొబైల్ తీసుకుని...
వెంటనే 100 కి కాల్ చేసి, విషయం చెప్పింది...
నిద్ర మత్తులోనే ఆ కాల్ రీసీవ్ చేసుకున్న కానిస్టేబుల్ కూడా సరిత హాస్టల్, ఆఫీసు అడ్రస్ లు మరియు వాళ్ల కాంటాక్ట్ డిటైల్స్  తీసుకుని ...
"సరే !
ఇప్పుడు బయట బాగా వర్షం పడుతుంది.
తగ్గిన తర్వాత మేము వెతికి పెడతాం.
మీరు ఏమి కంగారు పడకండి !" అంటూ భరోసా ఇచ్చాడు.

భరోసా ఐతే ఇచ్చాడు...
ప్రియ కాల్ కట్ చేయగానే తాను మాత్రం యధావిధిగా నిద్రలోకి జారుకున్నాడు.

ఇదంతా పక్కన నుండి గమనిస్తున్న రవళి
"అయినా ...
తన విషయంలో మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకుంటా...
బహుశా తను నిజంగానే ఎవరితోనైనా బయటకి వెళ్ళిందేమో ?
ఇందాక వాళ్ళు అన్నట్టు..." అంటూ నెమ్మదిగా ఒక పాజిటివ్ వే లో ఆలోచించడం మొదలు పెట్టింది.

"అలా ఐతే,
వీధి చివర ఉన్నాను ...
గొడుగు తీసుకు రమ్మని ఎందుకు అంటుంది తను ?
పైగా ఈ గాలి వానలో, అది కూడా ఈ టైం లో ...
ఎక్కడికో ఎందుకు వెళ్తుంది !
ఒక్కసారి ఆలోచించు !"
అంటూ ఆమె తనకున్న సందేహాన్ని చెప్పగా...

రవళి మళ్ళీ దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెడుతుంది.
అప్పుడే అంతకుముందు ఆ హాస్టల్ అమ్మాయిలు అన్న మాటల్లో ...
"ఎవరో తన ఫ్రెండ్ రూం కి వెళ్లి ఉంటుందన్న !" మాట గుర్తుకు వచ్చి,

"ఓహ్ అన్నట్టు మర్చిపోయాను...
మొన్న ఒకసారి ఇద్దరం కలిసి వెళ్తుంటే, ఆ పక్క స్ట్రీట్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న హాస్టల్ దగ్గర తన కాలేజీ మేట్ అంట... చూసి, గుర్తు పట్టి మాట్లాడింది. నాకు కూడా పరిచయం చేసింది!
ఆమె పేరు ...
ఆమె పేరు..." అంటూ
ఆమె పేరు గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా...
రవళికి ఏ మాత్రం గుర్తుకు రావడం లేదు !

"ఐతే, తను తన ఫ్రెండ్ హాస్టల్ రూం కి వెళ్లి ఉంటుంది అంటావా ?" అన్న ప్రియ ప్రశ్నకు
"అవును !
ఎందుకు కాకూడదు... ?
మనం వెళ్ళడం కాస్త లేట్ అయ్యింది, పైగా ఈ వీధి అంతా వర్షపు నీటితో నిండిపోయింది. పైగా పవర్ కట్ అవ్వడంతో... భయంతో సరిత అక్కడికి వెళ్లి ఉండొచ్చు గా..!" అంటూ సమాధానం చెప్తుంది రవళి

"మరి కాల్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు తను.
కాసేపటికి స్విచ్ ఆఫ్ అని కూడా వచ్చింది ?
కనీసం, తను సేఫ్ గా ఉన్నట్టు
ఒక మెసేజ్ అయినా పెట్టాలి గా...!
మనం కంగారు పడతాం అని కొంచెం కూడా లేదు తనకి " అని అంటూ ప్రియ తన అసహనాన్ని వ్యక్తపరుస్తుంది.

"అబ్బా...
ప్రియా ...
నువ్వు ఎప్పుడూ ఇంతే, అన్నీ ఇలా నెగటివ్ గానే ఆలోచిస్తావ్ !

ఏముంది మనం కాల్ చేసినప్పుడు..
వర్షంలో మొబైల్ తడిచిపోతుందని, తన బ్యాగ్ లో పెట్టీ ఉంటుంది. కాసేపటికి సరిగా చార్జింగ్ లేక మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది.
చార్జింగ్ పెట్టడానికి కనీసం ఈ ఏరియాలో పవర్ కూడా లేదు ఇప్పుడు. బహుశా అది కూడా కారణం అయ్యి ఉంటుందేమో ?" కంగారు పడకుండా నిదానంగా ఆలోచించు.

"అలా ఐతే తన ఫ్రెండ్ మొబైల్ నుండి మనకు చెయొచ్చుగా ..."
అంటూ ప్రియ అనగా ..

"ఒసేయ్ పిచ్చి మొహమా...
మన నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకుంది కానీ,
తన బ్రెయిన్ లో కాదు !
ఇంతకు మించి నువ్వేం ఎక్కువగా ఆలోచించకు...
నా బుర్ర తినకు !" అంటూ ప్రియపై చిరాకు పడుతుంది రవళి.

"నిజంగా ఇదే జరిగుంటుందంటావా ? "
అని ప్రియ మళ్ళీ ఏదో చిన్న సందేహాన్ని రేకిత్తించగా...

"సరిగ్గా ఇదే జరిగి ఉంటుంది.
రేపు మార్నింగ్ కల్లా తను రూం కి వచ్చేస్తుందిలే కానీ,
నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో !" అంటూ దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంటుంది రవళి

"అది కాదే రవళి!" అని ప్రియ ఆమెను మళ్ళీ లేపడానికి ప్రయత్నించగా...
"ఇదిగో ప్రియా !
నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావ్!
నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా ఏం ఆలోచించకుండా పడుకుంటే మంచిది!" అంటూ ఆమెపై కోప్పడడంతో...

ఇక చేసేదేమి లేక,
"అలా దీర్ఘంగా ఆలోచిస్తూనే పడుకుంటుంది ప్రియ !"

" రవళి చెప్పినట్టు సరిత సేఫ్ గానే ఉందా ?
లేక ప్రియ అనుమాన పడ్డట్టు తను ఏదైనా అపాయంలో ఉందా ?
అసలు సరిత ఆ కొద్ది గ్యాప్ లోనే ఎక్కడికి వెళ్లి ఉంటుంది ?"
తర్వాతి భాగం "ఎవరు ? - 2" లో చూద్దాం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#3
కథ మంచి ఇంటరెస్టింగా వుంది, చదువుతుంటే కళ్ళ ముందర వర్షం పడుతున్నట్లు, క్యాబ్ వెళ్ళిపోవడం, రవళి ముసుగుపెట్టి పడుకోవడం అన్నీ అలా కనిపిస్తున్నాయి (మొహాలు కాదు) అంటే కధనం అలా వుంది...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#4
(18-04-2026, 01:00 PM)Uday Wrote: కథ మంచి ఇంటరెస్టింగా వుంది, చదువుతుంటే కళ్ళ ముందర వర్షం పడుతున్నట్లు, క్యాబ్ వెళ్ళిపోవడం, రవళి ముసుగుపెట్టి పడుకోవడం అన్నీ అలా కనిపిస్తున్నాయి (మొహాలు కాదు) అంటే కధనం అలా వుంది...కొనసాగించండి.


ధన్యవాదములు ఉదయ్ గారు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#5
"ఎవరు ? - 2"



"ఎవరు ? - 1" కి
కొనసాగింపు...
అలా వాళ్ళిద్దరూ...
ఒకపక్క ప్రియ దీర్ఘ ఆలోచనలతో, మరొకవైపు రవళి ధైర్యంగా ఆ రోజు నైట్ పడుకున్నారు.

ఇక తెల్లారింది !
"నగరం నిద్ర పోయిన వేళ...
యువతిపై అత్యాచారం, ఆపై హత్య...!
నేరస్థుల కోసం సెక్యూరిటీ ఆఫీసర్ల వెతుకులాట ..."
అంటూ టీవీ లో న్యూస్ ఛానల్ లో హెడ్లైన్స్ వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి మంచం మీద కూర్చుంది ప్రియ !
హాస్టల్ రూం లో ఉన్న టీవీ వైపు చూడగా...
కానీ, అది ఆఫ్ చేసి ఉంది.

అంటే దానర్ధం ఆమెకు వచ్చింది కల అన్న మాట !
ఇంతలోనే మెలుకువ వచ్చి లేచిన రవళి,
తను కప్పుకున్న దుప్పటిని తీస్తూ ప్రియ వైపు చూసింది.

ప్రియ మొహం అంతా చెమటలు పట్టేసి ఉన్నాయి.
"ఏమైందే ప్రియా !" అంటూ అడిగింది రవళి.
దానికి ప్రియ...
"ఏం లేదు చిన్న పీడ కల !" అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గబగబా నీళ్ళు తాగింది.

"నువ్వు రాత్రంతా ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూనే కూర్చున్నావా ?
అందుకే ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నావ్ !
అయినా నైట్ చెప్పా కదా ...
ఏం ఆలోచించకుండా పడుకోమని
అయినా సరిత ఈపాటికే లేచి ఉంటుంది, ఒకసారి తనకు కాల్ చేసి చూడు..!" అంటూ రవళి, ప్రియకు సలహా ఇవ్వగా...

ప్రియ పక్కనే ఉన్న ఫోన్ తన చేతుల్లోకి తీసుకుంటుంది.
అప్పుడు సరిగ్గా టైం మార్నింగ్ 5.30 అవుతుంది.
అలా మొబైల్ తీసుకున్న ప్రియ,
సరితకు కాల్ చేస్తుంది.

"మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది.
దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి !"
అంటూ మళ్ళీ రాత్రి వచ్చిన రెస్పాన్స్ ఏ సరిత నుండి వచ్చింది ప్రియకు...

ప్రియ మొహంలో మళ్ళీ టెన్షన్ మొదలైంది.
"తన మొబైల్ ఇంకా స్విచ్ఛాఫ్ లోనే ఉంది!" అంటూ అదే టెన్షన్ తో రవళి కి చెప్తుంది ప్రియా...
"నైట్ ... లేట్ అయ్యింది కదా !
పైగా ఈ రోజు saturday , ఇంకా తను లేచి ఉండదు లె !"
అంటూ రవళి ప్రియకు నచ్చ చెప్తుంది.

ప్రియ మాత్రం ...
"పోనీ, ఆ హాస్టల్ వరకూ వెళ్లి వద్దామా ?
అదే నిన్న నువ్వు నాతో అన్నావ్ కదా...
సరిత వాళ్ల ఫ్రెండ్ ..." అంటూ కంగారు పడుతూ అడుగుతుంది.

"ఇప్పుడు టైం ఎంత ?" అని రవళి అడగ్గా...
" ఫైవ్ థర్టీ " అని బదులు ఇస్తుంది ప్రియ !
"ఇంత పొద్దున్నే వాళ్ల హాస్టల్ గేట్స్ ఇంకా ఓపెన్ చెయ్యరు కానీ,
కాసేపు ఆగి వెల్దాం లే !
నువ్వేం ఆలోచించకుండా కాసేపు పడుకో , నాకు నిద్ర వస్తుంది !" అని మళ్ళీ ముసుగు కప్పుకొని పడుకుంటుంది రవళి

ఇక ఫోన్ పక్కన పెట్టి...
తను కూడా పడుకుందాం అని దుప్పటి కప్పుకుంటుంటే,

"టిక్...
టిక్...
టిక్..."
అంటూ బయట నుండి డోర్ నాక్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది వాళ్ళకి.

వెంటనే ఇద్దరూ తమ బెడ్స్ పై నుండి లేచి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు.
అసలే టెన్షన్ తో ఉన్న ప్రియ ఆ డోర్ నాక్ శబ్దం ఒక్కసారిగా వినడంతో...
తన గుండెల్లో రైళ్లు పరిగెత్తునట్టు అయ్యింది.
అది రవళికి, ప్రియ మోహంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక డోర్ కి దగ్గర గా ఉన్న రవళి,
వెళ్లి ఆ రూం డోర్ తీస్తుంది.

అలా డోర్ తియ్యగానే ఆమెకు ఎదురుగా ఒక కానిస్టేబుల్ కనిపిస్తాడు. పక్కనే, ఆ హాస్టల్ లో పని చేసే ఆవిడ కూడా ఉంటుంది. సడెన్ గా వాళ్ళని చూసి షాక్ అవుతుంది రవళి.
"నైట్ మీరేనా మీ ఫ్రెండ్ మిస్ అయ్యిందని నాకు కాల్ చేసింది ?" అని అడుగుతాడు.
ఇంతలో ప్రియ ఆ మాటలు విని,
బెడ్ దిగి డోర్ దగ్గరకు వస్తూ ..
"అవును నేనే సార్ !" అంటూ భయం భయం గా సమాధానం చెప్తుంది.

"మీరొక్కసారి నాతో వస్తారా ?" అంటూ ఆ కానిస్టేబుల్ అడగ్గా...
"ఏ...
ఏ.. ఏమైంది సార్ !" అంటూ భయంతో తడబడుతూ వణుకుతున్న స్వరంతో అతన్ని అడుగుతుంది ప్రియ...

"ఏం లేదు !
ఒకసారి మీరు నాతో స్టేషన్ కి రావాలి !
మా S I గారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు !
మీరు కాస్త ఫ్రెష్ అయ్యి రండి !
నేను కింద రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తాను.." అని చెప్పి కిందకి వెళ్ళిపోతాడు.

ప్రియకే మాత్రమే కాదు ఈసారి రవళి కూడా ఒళ్ళంతా చెమటలు పడతాయి.
ఏమై ఉంటుందా అని ఇద్దరూ ఒకరికొకరు ఆలోచింకుంటూనే
15 నిమిషాలలో రెడీ అయ్యి కిందకి వెళతారు.
అప్పటికే, అక్కడికి ఆ హాస్టల్ ఓనర్ కూడా వచ్చి ఉంటాడు.

అతన్ని కొంచెం దూరం నుండి గమనించిన ప్రియ, రవళి...
"ఇదేంటి ?
ఈయన ఇంత పొద్దునే వచ్చాడు. ఎప్పుడూ రాడు కదా !" అంటూ తమలో తాము అనుకుంటారు.

అతన్ని కాల్ చేసి రప్పించింది ఆ కానిస్టేబుల్ ఏ
అలా ఆ ముగ్గురిని తీసుకుని కానిస్టేబుల్ వెళతాడు.
కట్ చేస్తే,
అది ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర లో
ఒక చిన్న పల్లెటూరు.
ఆ పల్లెటూరులో ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం శ్రీనివాస్ రావు గారిది. శ్రీనివాస్ కి చదువన్న, చదువుకునే వాళ్ళన్న ప్రాణం !

ఆ రోజు శనివారం...
ఉదయాన్నే లేచి, టీవీ లో వార్తలు చూస్తున్న శ్రీనివాస్ రావు కి...
" హైదరాబాద్ లో దారుణం
నగరం నిద్ర పోతున్న వేళ,
ఒక యువతిని అతి కిరాతకంగా రేప్ చేసి, చంపేసిన యువకుడు.
యువతి మృతి !
ఘటనా స్థలంలోనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ఆసుపత్రికి తరలించిన సెక్యూరిటీ ఆఫీసర్లు !" అంటూ ఒక భయంకరమైన న్యూస్ ఒకటి వచ్చింది.

"అబ్బబ్బా ..
ఏంటండీ పొద్దు పొద్దున్నే ఆ వెధవ న్యూస్ లు.
అది కూడా ఈ శనివారం పూట. ఏదైనా భక్తి పాటలు పెట్టొచ్చు కదా
ముందు ఆ వార్తలు కట్టి పడేసి. అమ్మాయికి ఫోన్ చెయ్యండి.

"నిన్నంతా పనిలో బిజీ గా ఉన్నాను, తర్వాత చేస్తాను "అని చెప్పి, కాల్ కట్ చేసింది. అయినా పిల్లను ఇంట్లోనే ఉంచుకుందాం అని చెప్తే విన్నారు కాదు. అది ఉద్యోగం చేస్తాను అనడం, మీరు దానికి సరే అని ఒప్పుకోవడం. ఏవైనా ఇలాంటి వార్తలు వింటుంటే గుండె ఆగినంత పని అవుతుంది." అంటూ శ్రీనివాస్ రావు భార్య అతనికి కాఫీ తెస్తూ చెప్పి, విసుక్కుంటూ వంట గదిలోకి వెళ్ళిపోతుంది.
శ్రీనివాస్ రావు ఎవరో కాదు ...
సరిత తండ్రే!
అవును ...
వాళ్ళు మాట్లాడుకునేది కూడా సరిత గురించే
శ్రీనివాస్ రావుకి చదువు అంటే ఇష్టంతో, కూతురిని చాలా కష్టపడి చదివించాడు. ఇక ఆమె బాగా చదువుకుని ఉద్యోగం చేస్తాను అంటే కూడా అడ్డు చెప్పలేదు.

ఇక శ్రీనివాస్ ఆ టీవీ ఆఫ్ చేసి,
గదిలో ఉన్న మొబైల్ తీసుకుంటుండగా...
సరిగ్గా అప్పటికే తన ఫోన్ రింగ్ అవుతుంది.

అది కూడా ఒక తెలియని నెంబర్ నుండి...
ఇక ఆ కాల్ లిఫ్ట్ చేసిన శ్రీనివాస్ రావు కి
"మాట్లాడేది శ్రీనివాస్ రావు గారా !" అంటూ అవతలి వైపు నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది.
"అవునండీ !
నా పేరు శ్రీనివాస్ రావు.
ఇంతకీ మీరు ఎవరండీ ?" అంటూ ఇటువైపు నుండి శ్రీనివాస్ రావు అతన్ని సందేహిస్తూ అడుగుతాడు.

"నేను హైదరబాద్ కూకట్పల్లి సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ నుండి
S I హరినాథ్ ను మాట్లాడుతున్నాను.
మీ అమ్మాయి పేరు సరితే కదా అండి !" అని అవతలి వ్యక్తి అనగానే,
శ్రీనివాస్ రావ్ కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

" అవును సార్...
సరిత మా అమ్మాయే
ఏమైంది సార్ ?" అంటూ కంగారు పడుతూ అడుగుతాడు అతన్ని...

" మీరేం కంగారు పడకండి...
రాత్రి ఆఫీసు నుండి వస్తుంటే, మీ అమ్మాయికి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది !
హాస్పిటల్ లో అడ్మిట్ చేశాం. ఇప్పుడు పర్వాలేదు !
మీరు వెంటనే బయలుదేరి రండి !" అంటూ కాల్ చేస్తాడు ఆ SI.

"ఆక్సిడెంట్ ఆ...
దెబ్బలేమైనా గట్టిగా తగిలాయా సార్ !" అంటూ అడుగుతాడు శ్రీనివాస్ కాల్ కట్ అయినా విషయం గమనించకుండా...

భర్త మాటలు విన్న శ్రీనివాస్ భార్య కంగారుగా వంటింటి నుండి వచ్చి,
"ఆక్సిడెంట్ ఏంటి అండి, ఎవరికి ?" అంటూ ఆరా తీస్తుంది.

దీంతో విషయం భార్యకు చెప్తాడు శ్రీనివాస్...
ఆమె లబోదిబోమంటూ ఏడుస్తుంది.
"చిన్న ఆక్సిడెంట్ ఏ అంట...
అబ్బా నువ్వేం కంగారు పడకు !" అంటూ ఆమెను ఓదార్చి తెలిసిన వాళ్ళ సాయంతో భార్యాభర్తలు హైదరాబాద్ కి ప్రయాణమవుతారు.

సీన్ కట్ చేస్తే,
అది గోదావరి జిల్లాలో...
తాడేపల్లి గూడెం దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు.
ఆ పల్లెటూర్లో ఓ మధ్యతరగతి కుటుంబం వెంకటేశ్వరరావుది.
అతనేం చదువుకోలేదు. కౌలుకు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాడు.
అదే రోజు శనివారం...
వెంకటేశ్వరరావు ఉదయాన్నే లేచి, టీవీ పెట్టీ..
అందులో భక్తి ఛానల్ లో పాటలు వింటూ ఉంటాడు.

అప్పుడే సరిగ్గా 6.30 కి అతని ఫోన్ రింగ్ అవుతుంది.
ఎవరా అని చూస్తే అదొక తెలియని నెంబర్ నుండి వస్తుంది. సాధారణంగా అతనికి తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ల దగ్గర నుండి ఎక్కువగా కాల్స్ రావు.

కానీ, ఆ రోజు తెలియని నెంబర్ నుండి, పైగా అంతా పొద్దున్నే కాల్ వచ్చేసరికి, ఆశ్చర్యపోతూనే ఆ కాల్ లిఫ్ట్ చేశాడు వెంకటేశ్వరరావు.
" మాట్లాడేది వెంకటేశ్వరరావు గారా ?" అంటూ అవతలి వ్యక్తి వెంకటేశ్వరరావు కాల్ లిఫ్ట్ చేయగానే అడిగాడు.
"అవును సార్..!
మీరెవరు అండి !" అంటూ అడిగాడు వెంకటేశ్వరరావు.

" నేను హైదరాబాద్ కూకట్పల్లి సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ నుండి S I ని కాల్ చేస్తున్నాను.
నా పేరు హరినాథ్...

కృష్ణా ..
మీ అబ్బాయే కదా !" అంటూ తనని తాను పరిచయం చేసుకుంటూ వివరాలు అడుగుతాడు ఆ S I, వెంకటేశ్వరరావుని.

ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయే వెంకటేశ్వరరావు...
ఎక్కడో హైదరబాద్ లో ఉన్న కొడుకు పేరు ఎత్తగానే, తనకు ఏమైందోనని విపరీతంగా టెన్షన్ పడుతూ...
"మా అబ్బాయే సార్..!
మా అబ్బాయే...
ఏమైంది సార్ మా అబ్బాయికి
ఏమైంది ?" అంటూ కంగారు పడుతూ అడుగుతాడు.

అతని కంగరూ అర్థం చేసుకున్న ఆ S I ..
" అరెరే !
ఎందుకయ్యా అంతలా కంగారు పడుతున్నావు...
నువ్వు బలె టెన్షన్ కాండిడేట్ లా ఉన్నావే " అని అంటూ ఉంటే

"ముందు ఏమైందో చెప్పండి సార్...
లేకపోతే మీరు ఈ టైం లో ఎందుకు కాల్ చేస్తారు ?
అది కూడా మా వాడి గురించి !" అంటూ అడుగుతాడు వెంకటేశ్వరరావు.

ఇక నాన్చడం ఇష్టం లేని ఆ S I
"అది ...
అది...
రాత్రి మీ అబ్బాయి వర్షంలో వస్తుంటే చిన్న ఆక్సిడెంట్ అయ్యింది !" అంటూ అతను కంప్లీట్ చేసేలోపు...

"ఏంటి ?
ఆక్సిడెంట్ ఆ " అంటూ మరింత భయపడిపోతాడు వెంకటేశ్వరరావు...

"అరెరే ..
ఏం కాలేదు లె అబ్బా...
చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.
ఇక్కడే దగ్గరలో ఒక హాస్పిటల్ లో జాయిన్ చేశాం.
మీకు ఇన్ఫమ్ చేయడం మా డ్యూటీ కాబట్టి, ఇన్ఫర్మ్ చేస్తున్నాం !" అంటూ వెంకటేశ్వరరావును కంట్రోల్ చేస్తూ కాల్ చేస్తాడు SI.

ఎలా ఉన్నాడు అని అడిగేలోపు కాల్ కట్ అవ్వడం తో
తిరిగి మళ్ళీ ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు వెంకటేశ్వరరావు.
కానీ, రెస్పాన్స్ ఉండదు.

ఇక చేసేదేం లేక, అక్కడే హైదరాబాద్ లో ఉన్న తన బంధువులకు విషయం చెప్పి, వాళ్ళని అక్కడికి వెళ్ళమని కోరి, వెంకటేశ్వరరావు కూడా ఇంటి నుండి హైదరాబాద్ కి ప్రయాణం అవుతారు.
అసలు సరితకు, కృష్ణ కి సంబంధం ఏమిటి ?
ఇద్దరికీ ఒకేసారి ఎందుకు ఆక్సిడెంట్ అయ్యింది. అది కూడా ఆ కూకట్పల్లి పరిధిలోనే ఎందుకు జరిగింది ?
ఇక ఆ అత్యాచారం, హత్య చేయబడ్డ యువతి ఎవరు ?
స్పృహలోని లేని ఆ యువకుడు ఎవరు ?

ఇంత మంది మధ్యలో నలుగుతున్న ఆ కథ ఏమిటి ?
తర్వాత భాగం...
"ఎవరు ? - 3" లో తెలుసుకుందా
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#6
"ఎవరు ? - 3"
"ఎవరు ? - 2" కి
కొనసాగింపు...


అలా సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు కృష్ణా పేరెంట్స్ కి మరియు సరిత పేరెంట్స్ కి వాళ్ళకి జరిగిన ఆక్సిడెంట్ గురించి ఇన్ఫామ్ చేసి వాళ్ళని హుటాహుటిన హైదరాబాద్ రమ్మన్నారు.
ఇక ఇక్కడ హైదరాబాద్ లో...
సరిత ఫ్రెండ్స్ అయిన ప్రియ, రవళి తో హాస్టల్ ఓనర్ ని కూడా తనతో తీసుకు వెళ్తున్న కానిస్టేబుల్ తో పాటు వెహికల్ లో వాళ్ల డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక హోంగార్డు మరియు ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు..

ఇక అతను అక్కడే kphb రోడ్డు నెంబర్ 1 వైపు గా తమ వెహికల్ ని పోనిస్తున్నారు.
"సార్...
ఇదేంటి సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ మెయిన్ రోడ్డు మీద ఉంది కదా...!
మీ హోంగార్డు ఏంటి వెహికల్ నీ రివర్స్ డైరెక్షన్ లో పోనిస్తున్నాడు.
(సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ వైపు కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్ వెళ్లడంతో, అనుమానం వచ్చి అడిగాడు ఆ హాస్టల్ ఓనర్ (ఆ ఏరియాలో చాలా ఏళ్లుగా అతను ఆ హాస్టల్ రన్ చేస్తున్నాడు, కాబట్టి ప్రతీది అతనికి తెలుసు ))

ఆ హాస్టల్ ఓనర్ అలా అడగ్గానే వారితో పాటు ఆ వెహికల్ లో ఉన్న ప్రియ మరియు రవళి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ షాక్ అయ్యారు. అసలే భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళలో ఆ భయం మరింత పెరిగింది. కానీ, ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్ గా కూర్చుకున్నారు.
ఇక హాస్టల్ ఓనర్ అడిగిన దానికి బదులుగా...
"హమ్...
కాసేపు ఆగండి..!
అంతా మీకే అర్థం అవుతుంది.
మరేం భయపడాల్సిన అవసరం లేదు !" అంటూ కానిస్టేబుల్ అతన్ని సముదాయించాడు.

దాంతో వారి ముగ్గురికి, అసలు విషయం ఏమిటో అర్ధం కాలేదు.
"సార్..
సార్...
సరిత ...
దొ...
దొరికిందా !" అంటూ తడబడుతూ అడుగుతుంది ప్రియ..

"హా...
అందుకోసమే మిమ్మల్నందరిని తీసుకుని వెళ్తున్నా...!" అంటూ ఆ కానిస్టేబుల్ ప్రియ అడిగిన దానికి సమాధానం ఇస్తాడు.

"తనకి ఏమైనా అయ్యిందా ?" అంటూ మెల్లగా రవళి భయంతో అడిగిన ప్రశ్నకు...
"కాసేపు వెయిట్ చేయండమ్మా, అన్నింటికీ ఆన్సర్ అదే దొరుకుతుంది!"
అంటూ ఆ కానిస్టేబుల్ కాస్త కసురుకున్నాడు.

ఇలా వాళ్ల ఆ చర్చలు పూర్తయ్యేలోపు...
అలా ఆ వెహికల్ రోడ్డు నెంబర్ వన్ లో ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వైపుగా వెళ్తుంది.
కానీ, కొంచెం దూరం నుండే అక్కడొక చోట అంతా జనం గుమిగూడి ఉండడం, వాళ్ళకి అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ వారు వాళ్ళని చల్లా చెదురు చేస్తుండడం,
పత్రికల వాళ్ళు ఫోటోలు తీసుకోవడం, అంబులెన్స్ కూడా అప్పుడే అక్కడికి రావడం అంతా ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళు గమనిస్తారు.

చూస్తుంటే వారికి అక్కడేదో "ఆక్సిడెంట్ ఏదైనా అయ్యిందా ?" అన్నట్టు అనిపిస్తుంది. ఇంతలో ఆ బండి ఆ ప్రదేశానికి దగ్గరలో వచ్చి ఆగింది.
హాస్టల్ ఓనర్, ప్రియ మరియు రవళికి కొంచెం కంగారు పుట్టింది.
ఆ కానిస్టేబుల్ వెహికల్ ఆగిన వెంటనే కిందకి దిగి, అక్కడే ఆ ఆగిన వెహికల్ కి దగ్గరలో ఉన్న తన పై ఆఫీసర్ కి వెహికల్ లోపలికి చూపిస్తూ అతనికేదో చెప్తున్నారు.
(అప్పటికే వీళ్ళల్లో అనుమానాలు మొదలయ్యాయి,
సరితకు ఏమైనా అయ్యిందేమో అని)

ఇక ఆ పై ఆఫీసర్ యేవో సైగలు చేయగానే ఆ కానిస్టేబుల్ మళ్ళీ వెహికల్ దగ్గరకు వచ్చి,
"అక్కడ మా SI గారు ఉన్నారు.
మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు !" అని చెప్తాడు.

దాంతో వాళ్లకు గుండెలు జారిపోతాయి.
అలా కంగారు పడుతూనే వెహికల్ దిగి ఆయన వద్దకు వెళ్ళగా...

గుమిగూడి ఉన్న ఆ జనాన్ని పక్కకి జరుపుతూ...
ఆ SI వాళ్ల ముగ్గురిని కొంచెం ముందుకు తీసుకుని వెళ్లి,
అచేతనంగా పడి ఉన్న ఓ రెండు డెడ్ బాడీస్ చూపించి,
"ఆమె మీ ఫ్రెండ్ సరితే కదా !" అంటూ వాళ్ళని అడుగుతాడు.

"పైన టాప్ మాత్రమే ఉండి, కింద ఆమె బట్టలు ఊడదీసి... మొహాన్ని గోళ్ళతో రక్కేసి, ఒళ్ళంతా గాయాలతో
చేతులు రెండూ విరిచేసి, కాలు రెండు వంచేసి..
కళ్ళల్లో రక్తం కారుతూ, నోట్లో గుడ్డలు కుక్కేసి
అత్యంత దారుణంగా మరింత పాశవికంగా ఆమెను రేప్ చేసి చంపేశారు. ఆమెను అలా చూస్తుంటే అక్కడున్న వారందరికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది."

ఇక ఆమెను ఆ స్థితిలో చూసిన ప్రియ వెంటనే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది.
నిన్న మధ్యాహ్నం వరకూ తమతో గడిపిన ఆమెను అలాంటి దారుణమైన స్థితిలో చూసి రవళి "సరితా" అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
రెండు రోజుల ముందే తనకి హాస్టల్ ఫీస్ కట్టిన అమ్మాయి అలాంటి స్థితిలో ఉండడం చూసి ఆ హాస్టల్ ఓనర్ షాక్ లో ఉండిపోయాడు.

ఆమె గత రాత్రి మిస్ అయిన సరితే అని ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.
స్పృహ తప్పి పడిపోయిన ప్రియను, ఏడుస్తూ కింద పడిపోయిన రవళిని ఆ లేడీ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ తీసుకుని సెక్యూరిటీ ఆఫీసర్ జీప్లో ఎక్కించారు.
ఇక అప్పటికే ఆ సంఘటనను కొందరు మొబైల్ లో, మీడియా వాళ్ళు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ వారు మాత్రం వాళ్ళని చెదరగొట్టే పనిలో ఉన్నారు.
ఇక మీడియా వాళ్ళు వచ్చి
"ఈ హత్యాచారం ఎలా జరిగింది ?
ఎప్పుడూ జరిగింది ?
దీనికి గల కారణం ఎవరు ?
అసలు ఆ రెండు డెడ్ బాడీస్ ఎవరివి ?
చూస్తుంటే ఒక అమ్మాయి , అబ్బాయి అని తెలుస్తుంది. కచ్చితంగా ఆ అబ్బాయి తనని రేప్ చేసి చంపేశారా ?" అంటూ మీడియా వాళ్ళు ఆ S I మీద ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

దానికి ఆ S I ...
"మాకు కూడా ఒక గంట క్రితమే ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఆ డెడ్ బాడీస్ నీ ఐడెంటిఫై చేసే పనిలో పడ్డాం.
దీనికి గల కారణాలు వెతికి పట్టుకుని మీకు అందిస్తాం.
దయచేసి ఈలోపు మా ఇన్వెస్టిగేషన్ కి అడ్డు రాకండి !" అంటూ వాళ్ళకి నచ్చజెప్పి,

అక్కడే ఉన్న హాస్టల్ ఓనర్ ని పక్కకు తీసుకుని వెళ్లి
"ఐతే ఆ అమ్మాయి మీ హాస్టెల్లోనే ఉంటుందన్న మాట !" అని అడుగుతాడు ఆ S I.

"అవును సార్ !" అంటూ చెమర్చిన కళ్ళతో మూసుకుపోయిన స్వరంతో మెల్లగా సమాధానం ఇస్తాడు హాస్టల్ ఓనర్.
"మరి ఆ అబ్బాయి ?" అని అడుగుతాడు S I
అతను కూడా ఒంటి నిండా గాయాలతో
చిరిగిన బట్టలతో, మొహం మీద రక్కేసీ,
వర్షం వలన బురదలో కూరుకుపోయిన బోర్లా పడిన సగం దేహంతో ఉంటాడు.

"తన గురించి ఐతే నాకు తెలీదు సార్ !" అని బదులు ఇస్తాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది...
" సార్ !
ఈ అబ్బాయి ఇంకా శ్వాస ఆడుతుంది." అంటూ ఆ SI కి చెప్తారు.

శ్వాస ఆడుతుంది కానీ, చలనం లేదు అతనికి.
అందుకే అతను కొన ఊపిరితో ఉన్నా ...
అప్పటివరకూ అక్కడున్న వాళ్ళెవరూ అతను బ్రతికి ఉన్నట్టు గుర్తించలేదు.

వెంటనే అతన్ని ముందు అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కు పంపిస్తారు.
"సార్ అక్కడేదో పర్స్ దొరికింది !" అంటూ కానిస్టేబుల్ ఆ S I కి తెచ్చి ఇస్తాడు.
అది ఓపెన్ చేసి చూస్తే, అది ఆ అబ్బాయిది. అందులో ఆ అబ్బాయి డిటైల్స్ కూడా ఉంటాయి.
అలా ఆ డిటైల్స్ బట్టి అతని పేరు కృష్ణా అని, అతనిది ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెం దగ్గర ఒక చిన్న ఊరు అని తెలిసి అందులో ఉన్న ఐడి కార్డ్స్ లోని అడ్రస్ ద్వారా వాళ్ల పేరెంట్స్ కు కాల్ చేస్తారు.
ఇక సరిత యొక్క డిటైల్స్ ఆ హాస్టల్ ఓనర్ దగ్గర తీసుకుని,
సరిత పేరెంట్స్ కి కూడా కాల్ చేసి ఇన్ఫాం చేస్తారు ఆ S I.

(అసలు విషయం చెప్తే, దూరందా ఉన్న పేరెంట్స్ ఎక్కడ కంగారు పడతారోనని వాళ్ళకి ఆక్సిడెంట్ అని మార్చి చెప్తాడు ఆ SI)
వాటి గురించి ఇప్పటికే మనం పార్ట్ 2 లో డిస్కస్ చేసేసాం.
అలా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫారం చేసేసారు.
ఇక బాడీస్ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.
వాళ్ల మొబైల్స్ కూడా వాళ్ల దగ్గర లేవు.

ఈ ఇద్దరికీ ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సెక్యూరిటీ ఆఫీసర్లు విచారణ చేపట్టారు.
కారణం వాళ్లిద్దరి నెగటివ్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం ఇంచుమించు దగ్గర్లోనే కాబట్టి.

మెల్లగా తేరుకున్న ప్రియను, రవళిని మరియు ఆ హాస్టల్ ఓనర్ నీ హాస్టల్ కి పంపించమంటూ...
"వీళ్ళు కుదుట పడ్డాకా స్టేషన్ కి తీసుకురండి.
విచారణ జరపాలి !" అంటూ అక్కడున్న కానిస్టేబుల్స్ కి చెప్పి,
వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు S I.

ఇంతలో మీడియాలో కథనాలు జోరందుకున్నాయి.
నగరం నిద్రపోయిన వేళ
హైదరాబాద్ kphb కాలనీ లో యువతి దారుణ హత్య !
అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపేసిన ప్రియుడు !
పక్కనే ఒక కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ ప్రియుడు !
అతనే ఆమెను చంపేసి, తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడా ?
వీటన్నింటికీ ప్రేమ వ్యవహారమే కారణమా ?
పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తేలనుంది.
సెక్యూరిటీ ఆఫీసర్లు ఈ కేసును త్వరితగతిన పరిష్కరిస్తారా ?
చూద్దాం ఏం జరుగుతుందో ..?
ఎక్స్లూజివ్ గా ఘటనా స్థలాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నా "xyz" న్యూస్ ఛానల్
మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని ఇప్పుడే మళ్ళీ వచ్చేద్దాం...
ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి మా "xyz" న్యూస్ ఛానల్...

అంటూ ఎవరికి నచ్చిన న్యూస్ ఛానెల్ వాళ్ళు ప్రసారాలు చేసుకుంటున్నారు.
ఇంతకీ సరితను ఎవరు చంపారు ?
కృష్ణకి ఆమెకు మధ్య సంబంధం ఏమిటి ?
ఆమెను అత్యంత దారుణంగా చంపాల్సిన అవసరం అతనికేంటి ?
సెక్యూరిటీ ఆఫీసర్లు, పత్రికల వాళ్ళు అనుమానుస్తున్నట్టు ఆమెను రేప్ చేసి చంపి అతను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా ?
దానికి వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే కారణమా ?
లాంటి విషయాలన్నీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో పాటు, నేను...
నాతో పాటు మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి...

లేదా తర్వాతి భాగం
"ఎవరు ? - 4" వరకూ దయచేసి కాస్త ఓపిక పట్టండి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#7
Waiting bhayya
Like Reply
#8
(03-05-2026, 11:50 PM)junior1972 Wrote: Waiting bhayya

అప్ఢేట్ ఇచ్చిన రోజే వైటింగ్ ఏంటి సోదరా

ముందు ఓ లైకు లేదా రేటింగ్ ఇయ్యి బ్రదర్
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#9
ఎవరు ? - 4
"ఎవరు ? - 3" కి
 
కొనసాగింపు...
 
 
ఘటనా స్థలం నుండి సెక్యూరిటీ ఆఫీసర్లు సరిత డెడ్ బాడీని,
 
కొన ఊపిరితో స్పృహలో లేని కృష్ణను హాస్పిటల్ కి తరలించారు.
 
ఈలోపు నగరంలో ఉంటున్న కృష్ణ బంధువుల అతను, తండ్రి వెంకటేశ్వరరావు మాట ప్రకారం kphb సెక్యూరిటీ ఆఫీసర్లకి కాల్ చేసి, అసలు విషయం ఏమిటో కనుక్కుని, ఘటనా స్థలానికి వచ్చాడు. ఇక అతన్ని వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్ళి విచారిస్తూ.. అక్కడ జరిగింది అంతా అతనికి సెక్యూరిటీ ఆఫీసర్లు వివరించడంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు.
 
"సార్...!
 
నేనొక ప్రాక్టీసు లాయర్ని. కృష్ణకి మావయ్య వరుస అవుతాను.
 
తను నాకు చిన్నప్పటి నుండి తెలుసు !
 
చాలా మృదు స్వభావి, పైగా మంచివాడు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు.
 
కచ్చితంగా ఈ పని ఐతే అతను చేసి ఉండడు !" అంటూ వివరిస్తాడు.
 
"కానీ, అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు !
 
అతను కాకుండా మరి ఎవరు చేసుంటారు ?
 
ప్రాథమిక అంశాలన్నీ మీ వాడికి ప్రతికూలంగా ఉన్నాయి.
 
అయినా చూద్దాం పోస్టుమార్టం రిపోర్టు రావాలి కదా !" అంటూ ఆ S I హరినాథ్ వివరిస్తాడు.
 
సరిగ్గా వాళ్ల చర్చలు జరుగుతున్నప్పుడే,
 
అక్కడికి...
 
సరిత ఫ్రెండ్స్ అయిన రవళి, ప్రియ మరియు ఆ హాస్టల్ వార్డెన్ లను సెక్యూరిటీ ఆఫీసర్స్టేషన్ కి తీసుకుని వస్తారు కానిస్టేబుల్స్.
 
"కృష్ణ మావయ్య యొక్క మాటలను బట్టి, అలాగే ఘటనా స్థలంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి, సరితకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా ?
 
లేక, ఆమె అతని ప్రేమను కాదన్నందుకు అతను ఉన్మాదిగా మారి తనను రేప్ చేసి మర్డర్ చేశాడా ?"
 
అన్న కోణాలలో కూడా దర్యాప్తు చెయ్యాలనుకున్నారు ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు.
 
విచారణలో భాగంగా సెక్యూరిటీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలు,
 
దానికి వాళ్ళు చెప్పిన సమాధానాలు...
 
ఇలా ఉన్నాయి.
 
S I హరినాథ్ :
 
"సరిత అసలు ఎలాంటి అమ్మాయి ?"
 
రవళి :
 
"ఆమె చాలా ఇన్నోసెంట్ !
 
ఎప్పుడూ ఎవరితో గొడవ పడేది కాదు. ఆఖరికి మాతో కూడా చిన్న గొడవ పడేది కాదు. ప్రతి విషయంలో తనకు సర్దుకు పోవడం అలవాటు !" అంటూ రవళి చెప్తుంటే,
 
ప్రియ కూడా తలాడిస్తుంది. ఎందుకంటే, తను మాత్రం ఇంకా షాక్ లోనే ఉంది.
 
ఇక ఆ హాస్టల్ ఓనర్ కూడా అదే నిజమన్నట్టు చెప్తాడు.
 
S I హరినాథ్ :
 
ఆమె నిన్న మధ్యాహం వరకూ మీతోనే ఉందని చెప్పారు. ఎప్పటిలాగే నైట్ వర్క్ అయిపోగానే వచ్చేసేదా ?
 
రవళి :
 
ఎప్పుడూ వచ్చేసేది సార్...
 
తను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేది కాదు !
 
నిన్న మాత్రమే అలా జరిగింది.
 
S I హరినాథ్ :
 
మరి ఎప్పుడూ జరగన్ని విధంగా నిన్న జరిగితే,
 
మీకేం అనుమానం రాలేదా ?
 
ఆమె ఎక్కడికి వెళ్ళింది?
 
ఏంటి ? అని
 
రవళి :
వచ్చింది సార్...

 
నిన్న నైట్ వర్షం కురుస్తున్న టైం లో తన నుండి ప్రియకు కాల్ వచ్చింది. బాగా వర్షం వస్తుంది. గొడుగు తీసుకుని రండి వీధి చివర హాస్టల్ దగ్గర ఉన్నాను. అని చెప్పింది. మేము అలా తీసుకుని వెళ్ళేసరికి తను అక్కడ లేదు. చాలా సేపు వెతికినా ఎక్కడా కనిపించలేదు. వర్షం ఎక్కువగా వస్తుండడంతో కాసేపు చూసి, భయంతో ఇద్దరం అక్కడి నుండి వచ్చేశాం.
 
అలా తను చాలా సేపు రాకపోయే సరికి, మిగిలిన హాస్టల్ మాట్స్ కి చెప్పాం. వాళ్ళు "ఎక్కడికో రిలేటివ్స్ ఇంటికి వెళ్లి ఉంటుంది." అని కొందరు...
 
"ఫ్రైడే కదా ...
 
ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ కి వెళ్లి ఉంటుందని!" మరికొందరు మాకు నచ్చజెప్పారు. కానీ మాకు మాత్రమే తెలుసు తను ఎలాంటిదో ..
 
దాంతో...దాంతో ...
 
(హాస్టల్ ఓనర్ వైపు చూస్తూ తడబడుతుంది రవళి)
 
S I హరినాథ్ :
 
హా...దాంతో...
 
దాంతో ..
 
ఏమైందమ్మ..?
 
ఎందుకు అలా చెప్పడానికి సంకోచిస్తున్నావ్ ?
 
నీకేం భయం లేదు చెప్పమ్మా...
 
రవళి :
 
దాంతో ఈ హాస్టల్ ఓనర్ కి కాల్ చేస్తే,
 
ఈయన కూడా నిద్ర మత్తులో పెద్దగా పట్టించుకోలేదు. అంటూ S I వైపు సూటిగా చూస్తూ చెప్పేస్తుంది.
 
ఇక S I కోపంగా ఆ హాస్టల్ ఓనర్ వైపు చూస్తే, అతను సిగ్గుతో తలదించుకుంటాడు.
 
S I హరినాథ్ :
మీ హాస్టల్ ఓనర్ పట్టించుకోలేనప్పుడు,

 
కనీసం స్టేషన్ కి అయినా కాల్ చేసి కంప్లయింట్ ఇవ్వచ్చు కదమ్మా !
 
రవళి :
 
అది కూడా చేశాం సార్ !
 
ఇక్కడ ఈ సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కే కంప్లయింట్ ఇచ్చాం!

(

ఈసారి ఏం భయపడకుండా ధైర్యంగా చెప్పేసింది రవళి)
 
S I హరినాథ్ :
"కంప్లయింట్ ఇచ్చారా ? ఏ టైం కి ? " అంటూ అతను అడుగుతుంటే,

 
అక్కడున్న నైట్ డ్యూటీ చేసిన ఓ కానిస్టేబుల్ :
 
"రిజిస్టర్ బుక్ లో నోట్ చేద్దాం అనుకుంటే, చిన్న కేసే కదా అని  నోట్ చేయలేదు సార్ !" అంటూ బదులు ఇస్తాడు.
 
S I హరినాథ్ :
 
ఏంటి ?
 
ఒక ఆడపిల్ల మిస్ అయితే, అది చిన్న కేస్ ఆ ?
 
ఓహో నీ దృష్టిలో పెద్ద కేసు అంటే ఏంటి ?
 
సెలబ్రిటీలు విడిపోవడమా ?
 
లేక రాజకీయ నాయకులు కొట్టుకు చావడమా ?"
 
అంటూ ఆ కానిస్టేబుల్ నీ మందలిస్తాడు.
 
మౌనంగా ఉండిపోయిన ఆ కానిస్టేబుల్ తో...
 
S I హరినాథ్ :
 
మరి వాళ్ళు కంప్లయింట్ ఇచ్చిన వెంటనే, పోనీ వెళ్లి ఎక్కడైనా సెర్చ్ చేశారా ?
 
కనీసం వాళ్ల హాస్టల్ వైపు వెళ్ళారా ? అంటూ ఆ కానిస్టేబుల్ నీ అడుగుతాడు.
 
ఆ కానిస్టేబుల్ :
 
అది... అది...
 
నైట్ వర్షం పడుతుందని,
 
S I హరినాథ్ :
 
నీకసలు బుద్దుందా....
 
ఎండా - వానా, రేయి - పగలు, తన - మన, ధనిక - పేద
 
అంటూ తేడా లేకుండా అందరికీ, ఎల్లవేళలా సమానంగా రక్షణ కల్పించడమేనయ్య మన ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగుల పని.
 
అలా కల్పించలేనప్పుడు...
 
నువ్వు నైట్ డ్యూటీ చేయడం ఎందుకు,
 
అసలు ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగం చేయడం ఎందుకు ?అంటూ అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు S I
 
కాసేపటికి శాంతించి, మళ్ళీ విచారణ మొదలుపెడుతూ...
 
S I హరినాథ్ :
 
"అసలు మీకు తనతో ఎన్నాళ్ల నుండి పరిచయం !" అంటూ అడిగిన మరో ప్రశ్నకు
 
రవళి :
 
"గత రెండు మూడు నెలలుగా !"
 
హాస్టల్ ఓనర్ :
 
"అవును సార్...
 
వీళ్ళు వచ్చి రెండు నెలలే అయ్యింది !
 
కానీ, తను మాత్రం దాదాపు ఇదే హాస్టల్ లో ఒక సంవత్సరం నుండి ఉంటుంది." అంటూ చెప్తాడు.
 
S I హరినాథ్ : 
 
తను ఎప్పుడైనా, ఎవరివల్లైయినా, ఏమైనా ఇబ్బంది పడుతున్నట్టు మీకు చెప్పిందా ?
 
లేదా కనీసం తన ప్రవర్తనలోనైనా ఎప్పుడైనా మీకది కనిపించిందా ?
 
రవళి :
 
అలాంటిదేం ఎప్పుడూ లేదు సార్ ! ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తనకి హాస్టల్ ఇంకా ఆఫీసు మాత్రమే ప్రపంచం!
 
సరదాకి బయటకి వెల్దామన్నా కూడా...
 
ఎప్పుడో కానీ తను మాతో రాదు. అది కూడా చాలా సేపు బ్రతిమాలితే తప్ప, మూవీస్, పార్కులు అలాంటివి తనకేం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కాలి ఉన్నప్పుడల్లా ఇంటికే కాల్ చేసి మాట్లాడుతూ ఉండేది.
 
హాస్టల్ ఓనర్ :
 
అవును సార్ !
 
ఎప్పుడూ తన మీద చిన్న కంప్లయింట్ కూడా రాలేదు. తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇతరుల విషయాల్లో కూడా పెద్దగా జోక్యం చేసుకోదు!
 
S I హరినాథ్ :
 
ఆమెకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా పరిచయస్తుల కానీ ఆ హాస్టల్ వైపు రావడం, ఆమెను కలవడం లాంటివి చేయడం మీరెప్పుడైనా చూసారా ?
 
హాస్టల్ ఓనర్ :
 
అలాంటిది ఏం లేదు సార్ !
 
మధ్యలో రవళి కల్పించుకుని...
 
రవళి :
 
సార్...!
 
పరిచయస్తుల అంటే గుర్తుకు వచ్చింది ! 
 
రీసెంట్ గా ఈ మధ్య మా హాస్టల్ పక్క స్ట్రీట్ స్టార్టింగ్ పాయింట్ లో ఒక హాస్టల్ ఉంది. ఒకసారి సరిత, నేను చిన్న పని మీద వీధి చివర్లో ఉన్న బుక్ షాప్ కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకసారి తన కాలేజ్ ఫ్రెండ్ అంట కలిసి మాట్లాడింది, తర్వాత తనను నాకు కూడా పరిచయం చేసింది.
 
S I హరినాథ్ :
 
ఆమె పేరు ?
 
రవళి :
 
ఆమె పేరు నాకు సరిగా గుర్తు లేదు సార్. మళ్ళీ ఎప్పుడూ తనని కలవలేదు కూడా..."
 
S I హరినాథ్ : 
 
ఆ హాస్టల్ ఎక్కడుందో మీకు సరిగా లోకేషన్ తెలుసా ?
 
హాస్టల్ ఓనర్ :
 
పక్క స్ట్రీట్ స్టార్టింగ్ పాయింట్ లో అంటే ...
 
హా ...
 
ఆ హాస్టల్ మా ఫ్రెండ్ వాళ్ళదే సార్...
 
S I హరినాథ్ :
 
అవునా !
 
హాస్టల్ ఓనర్ :
 
అవును సార్..!
 
S I హరినాథ్ :
 
ఓహ్ నీకతను బాగా తెలుసా !
 
హాస్టల్ ఓనర్ :
 
హా తెలుసు సార్ !
 
కాల్ చేసి ఇక్కడికి రప్పించనా ?
 
S I హరినాథ్ : 
 
మనకి కావాల్సింది హాస్టల్ ఓనర్ కాదు. ఆ అమ్మాయి ! నేను మా సిబ్బందిని పంపిస్తానులే అక్కడికి!
 
అంటూ S I హరినాథ్...
 
రవళిని మరియు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లను ఆ హాస్టల్ కి పంపిస్తుంటే,
 
ఈలోపు ఆ హాస్టల్ ఓనర్ కి గతంలో జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వస్తుంది.
 
హాస్టల్ ఓనర్ :
 
సార్ !
 
అన్నట్టు మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను.
 
మీరిందాక "ఆమెను ఎవరైనా పరిచయస్తులు కలవడం చూసారా ? " అని అడిగినప్పుడు...
 
మీకు జరిగిన ఒక సంఘటన చెప్పడం మర్చిపోయాను.
 
S I హరినాథ్ :
 
"ఏంటి ?
 
జరిగిన సంఘటన ?
 
ఏంటది." అంటూ ఆశ్చర్యంగా అడుగుతూనే, తన చేతి సైగలతో ఆ కానిస్టేబుల్స్ నీ మరియు రవళి నీ వెళ్లకుండా అక్కడే ఆపాడు.
 
హాస్టల్ ఓనర్ :
 
మా ఎదురుగా ఒక హాస్టల్ ఉంది. అది బాయ్స్ హాస్టల్!
 
వాళ్ళు మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనం తర్వాత హాస్టల్ బయట కూర్చుని అమ్మాయిలను కామెంట్ చేస్తూ ఉంటారు. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోరు.
 
ఆ బాయ్స్ హాస్టల్ ఓనర్ మరియు నేను కూడా చెప్పి చెప్పి విసుగెత్తి వదిలేశాం.
 
అలా ఒక ఆరు నెలల క్రితం...
 
ఇప్పుడు చనిపోయిన సరితను కూడా ఒక అబ్బాయి కామెంట్ చేశాడు అంట!
 
దానికి సరిత ఏం అనలేదు అంట కానీ,
 
ఆ కామెంట్ చేసిన అబ్బాయితో అదే హాస్టల్ కి చెందిన మరొక అబ్బాయి...
 
ఎందుకు ఆ అమ్మాయిని కామెంట్ చేసావని గొడవ పడ్డాడు అంట!
 
ఇక అలా ఆ గొడవ పడ్డ అబ్బాయి అంతకుముందే నుండే ఈ సరిత వైపు డైలీ చూడడం , ఫాలో అవ్వడం చేసేవాడు అంట!
 
కానీ, సరిత ఎప్పుడూ అతన్ని పట్టించుకునేది కాదట.
 
నాకు ఈ విషయం ఒకసారి అప్పట్లో సరితతో పాటు తన హాస్టల్ రూం లో ఉన్న అమ్మాయి చెప్పింది. ఇలాంటివి ఇక్కడ కామన్ కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొద్ది రోజులకే ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యి ఈ హాస్టల్ కాలి చేసి వెళ్ళిపోయింది.
 
S I హరినాథ్ : 
 
"అవునా !
 
మరి ఇంత సీరియస్ మ్యాటర్ నీ, మీరు ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదు !" అంటూ నిలదీస్తాడు ఆ S I
 
హాస్టల్ ఓనర్ :
 
"చెప్పాను కదా సార్ !
 
వాళ్ళకి చెప్పి చెప్పి విసిగిపోయామని,
 
అయినా ఇలాంటి మా హాస్టల్స్ ముందు సర్వసాధారణం!
 
పైగా సరిత కూడా తనకు తానుగా కంప్లయింట్ చేయలేదు!
 
అందుకే, నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు.
 
అదీ కాకుండా ఈ ఇన్సిడెంట్ షాక్ లో ఉండి, ఆ విషయం మీకు ఇందాకే చెప్పడం మర్చిపోయాను.
 
మీరు నొక్కి నొక్కి అడుగుతుంటే గుర్తుకు వచ్చింది!" అంటూ వివరిస్తాడు.
 
S I హరినాథ్ : 
 
వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా ? అదే కామెంట్ చేసిన వాడిని, గొడవ పడ్డ వాడిని ?
 
హాస్టల్ ఓనర్ :
 
హా గుర్తు పడతాను సార్ !
 
ఒకసారి ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ చూపించింది. అని అనగానే,
 
రవళి, సెక్యూరిటీ ఆఫీసర్లతో పాటు హాస్టల్ ఓనర్ నీ కూడా ఆ హాస్టల్స్ ఉన్న ఏరియా కి పంపిస్తారు.
 
అలా వెళ్లిన వాళ్ళకి సరిత ఫ్రెండ్ ఐతే దొరుకుతుంది కానీ,
 
ఆ ఎదురుగా ఉన్న హాస్టల్లో ఆ ఇద్దరు అబ్బాయిలు మాత్రం ఆ హాస్టల్ లో కనిపించరు. వారిలో ఒకడు(కామెంట్ చేసినవాడు) ఎప్పుడో ఆ హాస్టల్ కాళి చేసి వెళ్ళిపోయాడని ఆ హాస్టల్ ఓనర్ చెప్తాడు.
 
ఇంకొక వ్యక్తి మాత్రం నిన్న రాత్రి నుండి హాస్టల్ కి రాలేదని అక్కడున్న అతని రూంమేట్స్ చెప్తారు. ఇక అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంటుందని చెప్తారు.
 
ఇక దొరికిన సరిత చిన్ననాటి ఫ్రెండ్ నీ ఎంక్వైరీ చేయడానికి సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కి తీసుకువచ్చి,
 
ఇక ఆ బాయ్స్ హాస్టల్ లో వాళ్ళిద్దరూ లేరని చెప్తూ ..
 
వాళ్ల డిటైల్స్ ఐతే తీసుకుని వస్తారు.
 
అంటే, సరిత హత్యలో ఎదురుగా ఉన్న హాస్టల్ అబ్బాయిలకి ఏమైనా ప్రమేయం ఉందా !
 
అసలు వాళ్ళిద్దరూ ఏమైనట్టు ? అందులో ఒకరి మొబైల్ ఎందుకు స్విచ్ఛాఫ్ వస్తుంది?
 
సరితకు, కృష్ణకి మరియు ఆ హాస్టల్ అబ్బాయిలకి సంబంధం ఏమిటి ?
 
కృష్ణ ఆ హాస్టల్ అబ్బాయిలలో ఒకడా ?
 
ఒకవేళ కృష్ణ ఆ హాస్టల్ అబ్బాయి ఐతే, ఘటనా స్థలంలో హాస్టల్ ఓనర్ కానీ, రవళి కానీ, ప్రియా కానీ గుర్తుపడతారు కదా  ?
 
లేదా వాళ్ళు షాక్ లో ఉండి మరియు ఆ బాడీకి బురద అయ్యి, రక్తం కారుతుండడం వలన సరిగా గుర్తు పట్టలేకపోయారా ?
 
సరిత చిన్ననాటి ఫ్రెండ్ ఏం చెప్పబోతుంది ?
 
సెక్యూరిటీ ఆఫీసర్లనుతో పాటు నన్ను , మిమ్మల్ని సస్పెన్స్ కి గురి చేస్తున్న ఈ ప్రశ్నలకు మరియు లేవనెత్తుతున్న అనుమానాలకు
 
రండి...
 
సెక్యూరిటీ ఆఫీసర్లు మరియు నాతో పాటు ఇన్వెస్టిగేట్ చేసి,
 
అసలు వాస్తవాలు ఏంటో తర్వాతి భాగాలలో బయటకి తీద్దాం !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#10
"ఎవరు ? - 5"
"ఎవరు ? - 4" కి
కొనసాగింపు...
అలా బాయ్స్ హాస్టల్లో ఆ అనుమానితులు ఇద్దరూ దొరక్కపోయే సరికి,

దొరికిన సరిత చిన్ననాటి స్నేహితురాలిని ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు స్టేషన్ కి తీసుకుని వచ్చారు.
ఆమె కూడా తన స్నేహితురాలు మృతి చెందిందని చాలా దుఃఖంలో ఉంది.

ఇక స్టేషన్ కి వస్తున్నంత సేపు ఏడుస్తూన్న ఆమెను సెక్యూరిటీ ఆఫీసర్లు ఓదార్చి, విచారణకు సహకరించాల్సిందిగా కోరారు.

అలా కాసేపటి తర్వాత si హరినాథ్ ఆమెను విచారించడం మొదలు పెట్టాడు.

S I హరినాథ్ :
మీ పేరు ?

సరిత స్నేహితురాలు :
స్వప్న !

S I హరినాథ్ :
మీ ఫ్రెండ్...
అదే, సరిత మీకు ఎన్నాళ్లుగా తెలుసు !

స్వప్న :
తను, నేను కాలేజ్ డేస్ నుండి ఫ్రెండ్స్.

S I హరినాథ్ :
కాలేజ్ డేస్ నుండి ఫ్రెండ్స్ ఆ ..
అంటే ఇద్దరిది ఒకటే ఊరా ?

స్వప్న :
లేదు సార్ !
అది మా అమ్మమ్మ గారి ఊరు !
నేను నా స్కూలింగ్ అంతా అక్కడే చదివాను.
అప్పట్లో తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ !

S I హరినాథ్ :
అప్పట్లో అంటే, ఇప్పుడు కాదా ?

స్వప్న :
అంటే సార్ !
అది, నా స్కూలింగ్ అయినా తర్వాత, నేను నా ఫర్ధర్ స్టడీస్ కోసం మా ఊరికి దగ్గర్లోకి వచ్చేసాను.
అలా మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

S I హరినాథ్ :
అంటే అప్పటి నుండి ఇప్పటి వరకూ మధ్య మధ్యలో ఆమెను ఎప్పుడూ కలుసుకోవడం కానీ, మాట్లాడం కానీ జరగలేదా ?
అంటే, అది మీ అమ్మమ్మ వాళ్ల ఊరు అంటున్నారు...
కనీసం అప్పుడప్పుడైనా వెళతారు కదా అక్కడికి !

స్వప్న :
నేను అక్కడి నుండి వచ్చేసాకా...
ఆ తర్వాతి సంవత్సరమే మా అమ్మమ్మ, తాతయ్య కొన్ని రోజుల వ్యవధిలోనే చనిపోయారు. తర్వాత నేను పెద్దగా అక్కడికి వెళ్ళింది లేదు.
మొదట్లో మూడు నాలుగు సార్లు వెళ్ళినా ...
ఒకట్రెండు రోజులు ఉండి వచ్చేసేదాన్ని...
అప్పట్లో తనని కలవడం కుదిరేది కాదు.
ఒకవేళ కలిసినా ...
చాలా తక్కువ సమయం మాత్రమే మా ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి ఉండేది.

S I హరినాథ్ :
ఓహ్...
కాల్స్ ద్వారా...
అట్లీస్ట్ ఈ సోషల్ మీడియా ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వలేదా మీరిద్దరూ?
(అంటూ మరోసారి తనని ప్రశ్నించాడు హరినాథ్)

స్వప్న :
మా ఇద్దరి మధ్య కాల్స్ ఎప్పటి నుండో లేవు సార్ ...
ఇక సోషల్ మీడియా లో ఉన్నాం కానీ, తను పెద్దగా అవి యూజ్ చేయదు. అందువల్ల టచ్ లేం!
అంటూ బదులు ఇస్తుంది.

S I హరినాథ్ :
మరి సరితను ఇక్కడ ఎలా కలిశారు ?

స్వప్న :
నేను ఓ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుందామని, రీసెంట్ గానే ఇక్కడికి  వచ్చాను.

అలా ఓ రోజు అనుకోకుండా తను ఇక్కడ...
ఇదిగో ఈ అమ్మాయితో కనిపించింది.
(ఆ పక్కనే ఉన్న రవళి నీ చూపిస్తూ..)

తను ఇక్కడే హాస్టల్ ఉంటున్నాను అని చెప్పింది. తర్వాత నాకు ఇన్స్టిట్యూట్ లో coaching, తనకు జాబ్ వల్ల ఇద్దరికీ కలవడం కుదర్లేదు.
కానీ, ఇంతలోనే ఇలా...
(జరిగిన సంఘటన తలుచుకుని బాధ పడుతుంది.)

S I హరినాథ్ :
ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్(అంటూ ధైర్యం చెప్పి)

సరే!
తనూ మీరు కాలేజ్ డేస్ వరకూ కలిసి చదువుకున్నారు అని అన్నారు కదా ...
తను ఎలాంటి అమ్మాయి ?
కాలేజ్ లో ఎలా ఉండేది ?
I mean తన బిహేవియర్, కేరక్టర్ ?

స్వప్న :
తను చాలా తెలివైన అమ్మాయి, మంచిది !

చాలా బాగా చదివేది. Of, course కాలేజ్ లో టాపరు తను.
అలా అని అసలు గర్వం ఉండేది కాదు. టీచర్స్, స్టూడెంట్స్ అందరితో కొంచెం సఖ్యతగా, కలివిడిగా ఉన్నా . ...

అది కొంతవరకే చాలా సైలెంట్ గా, ఇన్నోసెంట్ గా ఉండేది.

S I హరినాథ్ :
ఇట్స్ ఓకే...
అప్పట్లో తనని ఎవరైనా ప్రేమ, గీమ అని ఏడిపించడం కానీ, ఆమె వెంట పడి బాధపెట్టడం కానీ చేశారా ?
మీకు తెలిసినంత వరకూ...

స్వప్న :
నాకు తెలిసి ...
జనరల్ గా తను అలాంటి వాటికి చాలా దూరం సర్..!
తనకి తన చదువు, పేరెంట్స్ మాత్రమే ప్రపంచం.
మేము సరిగ్గా టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి...
చదువులోనే కాదు, తను అందంగా ఉండడం వలన కూడా ఆమె వెంట చాలా మంది పడ్డారు. కానీ, తను ఎవరిని పట్టించుకునేది కాదు. తన పని తను చూసుకునేది.

కొంతమంది చిరాకుతో టైం వేస్ట్ అని ఆమె వెంటపడటం ఆపేసారు.
కొంతమంది ఆమె చెప్పినా వినకుండా వెంటపడి వేధించేవారు.

అయినా సరే, అలా అని వాళ్ల మీద టీచర్లు , పేరెంట్స్ కి కంప్లయింట్ కూడా ఇచ్చేది కాదు.
కంప్లయింట్ ఇవ్వమని మేము చాలా సార్లు ఆమెకు చెప్తే,
"ఈ ఏజ్ లో వాళ్ళకి ఏం తెలీదు !

పోను పోను వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు కంప్లయింట్ అది ఇది అని హడావిడి చేస్తే,
టీచర్స్ , పేరెంట్స్ దృష్టిలో చులకన అయిపోతారు. ఆ ఇంపాక్ట్ రేపు వాళ్ల కెరీర్ మీద పడి స్పాయిల్ అవుతుంది.
అదీకాక రేపు కోపంతో నా మీద పగ పెంచుకుంటారు.
ఇక్కడ ఉన్నంత కాలం అందరం హ్యాపీ గా ఉండడమే బెటర్. మళ్ళీ ఇవ్వన్నీ నాకు ఒక బ్యాడ్ మెమొరిలా మిగిలిపోకూడదు..."
అంటూ ఆ వయసులోనే తను చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది.

SI హరినాథ్ :
మరి మీ మధ్య ముచ్యువల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా ?

స్వప్న :
ఇప్పుడెవరూ కాంటాక్ట్ లో లేరు సార్ !

SI హరినాథ్ :
ఓహ్ దట్స్ ఓకే ..
ఇక మీరు వెళ్ళచ్చు...!
ఏమైనా అవసరం ఐతే, మళ్ళీ ఎంక్వైరీ కి పిలుస్తాము.
కొంచెం ధైర్యంగా ఉండండి...
(అంటూ స్వప్నతో పాటు, రవళికి, ప్రియకి కూడా జాగ్రత్తలు చెప్తాడు హరినాథ్).
"కానిస్టేబుల్...
వీళ్ళని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి రండి !" అంటూ అక్కడున్న కానిస్టేబుల్ కి చెప్తుండగా...

ఇంతలో స్వప్న
"సార్...
ఇందాకా...
మేము కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు...
తనని కొంతమంది వెంటపడి ఏడిపించారు అని చెప్పాను కదా...!"

దాంతో SI హరినాథ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ..
"హా అవును...
చెప్పారు...
ఏమైంది ?"

స్వప్న :
"అంటే అది, అంటే అది..."
అంటూ ఏదో చెప్పాలని చెప్పలేక నోట్లోనే నాన్చుతుంది.

SI హరినాథ్ :
ఏమైందో ధైర్యంగా చెప్పమ్మా ...!

స్వప్న :
"అది...
అదీ...
ఏం లేదు సార్ !
అప్పట్లో రవి అని ఒకబ్బాయి ఉండేవాడు. తను కూడా చదువులో topper. సరితతో పోటీ పడి మరీ చదివేవాడు.
అతను కూడా సరితను లవ్ చేస్తున్నాను అంటూ ఓ రోజు ఆమెకి చెప్పాడు.
"నువ్వు బుద్దిగా చదువుకో రవి !
ఇప్పుడు ఈ ఏజ్ లో ఇవన్నీ ఎందుకు ..
ఇవన్నీ వట్టి వ్యామోహాలు మాత్రమే.
వీటివల్ల కెరీర్ నాశనం అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఎప్పటిలానే ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందాం." అంటూ అతనకు నచ్చజెప్పింది.

కానీ, ఆ అబ్బాయి వినకుండా తన వెంటే పడేవాడు.
అలా చెప్పి చెప్పి విసిగిపోయిన సరిత, ఇక అతనితో మాట్లాడం కూడా మానేసింది.
రవిది కొంచెం సెన్సిటివ్ మైండ్సెట్ అవ్వడం వలన
డిప్రెషన్ తో ఆ ఇయర్ 10th class పరీక్షల్లో సరిగా కాన్సంట్రేట్ చెయ్యలేకపోయాడు.

ఇక ఆ ఇంపాక్ట్...
సరితతో పోటీ పడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అతను,
ఓ మోస్తరు మార్కులతో 1st క్లాస్ మార్కులతో మాత్రమే సరిపెట్టుకున్నాడు."
అంటూ కాలేజ్ లో జరిగిన ఓ సంఘటన వివరిస్తుంది.

SI హరినాథ్ :
సో, తర్వాత మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా ఆ రవి ఆమెను వేధిస్తున్నట్టు మీకెప్పుడైనా తెలిసిందా ?
ఆమె చెప్పిందా ?

స్వప్న :
"తను చెప్పలేదు సార్...
కానీ, రీసెంట్ గా అప్పట్లో మాతో చదివిన ఒక అబ్బాయి Instagram lo కాంటాక్ట్ అయ్యాడు!
అతని పేరు మణికంఠ
అతను నేను చాలా సేపు కాలేజ్ మెమోరీస్ గురించి మాట్లాడుకుంటే, మధ్యలో వీళ్ళ టాపిక్ వచ్చింది !

రవి గురించి చెప్తూ...
అతను సరితతో 10 th class అయ్యాక, తనని మార్చిపోలేకపోయాడు అంట.
3, 4 ఇయర్స్ తర్వాత కూడా మాట్లాడడానికి ట్రై చేసి, మళ్ళీ మళ్ళీ ప్రపోజల్ పెడితే సరిత ఎప్పటిలానే అతన్ని పట్టించుకోలేదు అంట..

ఒకానొక టైంలో అతను పిచ్చివాడిలా తయారు అయ్యాడని,
కానీ ఇప్పుడు హైదరబాద్ లోనే ఒక మంచి జాబ్ చేసుకుంటున్నా, అప్పుడప్పుడు లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ లు పెడతాడని, అవి తన వాట్సాప్ కి వస్తాయని చెప్పాడు.

రవి ఇంటికి వచ్చినపుడు..
మణికంఠ, రవిల మద్యలో

ఎప్పుడైనా లవ్, కాలేజ్ మేట్స్ అనే  టాపిక్స్ వస్తె మాత్రం సరితను తలుచుకుని రవి చాలా కోపంగా మాట్లాడతాడని చెప్పాడు.
మణికంఠ కూడా నన్ను సరిత గురించి అడిగాడు...
తను నాతో పెద్దగా కంటాక్ట్ లో లేదని చెప్పా...
ఇదంతా నాకు సరిత ఈ మధ్య కనిపించకముందు జరిగింది." అంటూ ఆమె వివరిస్తుంది.

S I హరినాథ్ :
మళ్ళీ మణికంఠ మీతో కాంటాక్ట్ అవ్వలేధా ?

స్వప్న :
లేదు సార్!
మళ్ళీ తను నాతో కాంటాక్ట్ అవ్వలేదు.
ఆరోజు మాట్లాడడమే అతనితో !


దాంతో

ఇక వాళ్ళని అక్కడి నుండి పంపించేసి,

"అంటే, రవి కూడా సరిత మీద కోపంతో ఉన్నాడు కాబట్టి,
ఈ హత్య లో తనకి కూడా భాగం ఉండొచ్చు ఏమో !
ఇంకో అనుమాణిస్తుడా ?
అసలు ఆమెను రేప్ చేసి చంపింది ఒక్కరు కాదని ఘటనా స్థలంలో ఆధారాలు బట్టి క్లియర్ గా తెలుస్తుంది.

కానీ, ఒకవేళ ..
వేరే వాళ్ళు ఆ కృష్ణ తో కలిసి ఆమెను చంపి ఉంటారేమో ?
కృష్ణతో కలిసి చంపిన వాళ్ళలో ఇప్పుడున్న అనుమానితులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ?
అసలు వాళ్ళకి కృష్ణకి ఎలా సంబంధం ?
ఒకవేళ కలిసి చేస్తే, మరి కృష్ణను అక్కడే వదిలి ఎందుకు వెళతారు ?
అబ్బా ఈ కేసులో ఏంటి ఇన్ని మెలికలు ఉన్నాయి.
ఇప్పుడెలా ?" అంటూ తలపట్టుకుని తనలో తను మదనపడుతూ ధీర్ఘాలోచనలో పడ్డాడు హరినాథ్ !

తన సిబ్బందికి చెప్పి, ఆ రవి గురించి, మరియు అతని ఫ్రెండ్ మణి గురించి కూడా ఎంక్వైరీ చేయమని చెప్తాడు.
ఇప్పటివరకూ మనకు దొరికిన అనుమానితుల అందరి ఫోన్ డేటా, కాల్ డేటా అలాగే కృష్ణా, సరిత మరియు తన ఫ్రెండ్స్ రవళి, ప్రియ మరియు స్వప్న ల కాల్ డేటా కూడా కావాలి అని అడుగుతాడు ఆ SI

ఈలోపు పలు వార్తా ఛానెల్లో కథనాలు జోరందుకున్నాయి.
ఇక సంఘటనను టీవీలో చూసిన నగరంలోని పలు మహిళా సంఘాలు, యువతులు, యువకులు రోడ్లపైకి వచ్చి తమ తమ నిరసన తెలియజేస్తున్నారు. అర్ధరాత్రి నగరంలో జరిగిన హేయమైన ఉదంతంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలనే వారి డిమాండ్ తారా స్తాయికి చేరుకుంది.
ప్రజాగ్రహంతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి.
ఎక్కడ చూసినా రాస్తా రోకోలు, ధర్నాలు, ర్యాలీలు.


ఇంకొంత మంది ఐతే నేరుగా వాళ్ళని చేర్చిన హాస్పిటల్ దగ్గరే నిరసన తెలియజేస్తున్నారు.
"అంతలా అఘాయిత్యం చేసిన దుర్మార్గుడికి ఇంకా వైద్యం చెయ్యాలా?
వాడిని మాకు అప్పగించండి, ఈ ప్రజల మధ్య నడి రోడ్డుపైనే శిక్షకు వేస్తాం !
అసలు అలాంటి వాడిని అక్కడే వదిలేసి ఉంటే మేము చూసుకుని ఉండేవాళ్ళం ! " అంటూ కృష్ణ నే అపరాధిగా భావించి, వాళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాసేపటికి నగర సీపీ ఒక ప్రెస్ మీట్ పెట్టీ,
ఇంకా నిందితుడి ఎవరనేది చెప్పలెం, విచారణ కొనసాగుతుందని. ఇప్పటికే బాధితురాలితో సంబంధమున్న వాళ్ళందరినీ పట్టుకుని విచారిస్తున్నామని, వీలైనంత త్వరగా నేరస్తులను పట్టుకుంటామని, అప్పటివరకూ ప్రజలంతా సహనంతో ఉంటూ సమన్వయం పాటించాలని ప్రజలకు, ముఖ్యంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

సీపీ స్టేట్మెంట్ తో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి.
"ప్రభుత్వం హంతకుడిని రక్షిస్తుంది !
ప్రభుత్వం తక్షణమే పడిపోవాలి

" అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పలు వార్తా ఛానెళ్లు ద్వారా కొద్ది వ్యవధిలోనే ఈ ఇష్యూ  దేశమంతా పాకింది.
ఇంతలో అక్కడ కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఆందోళన కారులను చెదర గొట్టే ప్రయత్నం చేస్తున్నా...
వారు మాత్రం ఏ మాత్రం లొంగకుండా తమ నిరసన తెలియజేస్తున్నారు..

రవి, మణి, హాస్టల్ బాయ్స్, కృష్ణా వీళ్ళ అందరిలో హంతకుడు ఎవరు ?
మణి స్వప్నతో చాట్టింగ్ లో సరిత గురించి ఎందుకు అడిగాడు ?
స్వప్న గురించి ఏం తెలీదు అనగానే,
మళ్ళీ మణికంఠ ఎందుకు తనతో కాంటాక్ట్ అవ్వలేదు ?

అసలేం జరిగి ఉంటుంది ?
సెక్యూరిటీ ఆఫీసర్లలతో పాటు నన్ను , మిమ్మల్ని సస్పెన్స్ కి గురి చేస్తున్న ఈ ప్రశ్నలకు మరియు లేవనెత్తుతున్న అనుమానాలకు
రండి...
సెక్యూరిటీ ఆఫీసర్లు మరియు నాతో పాటు ఇన్వెస్టిగేట్ చేసి,
అసలు వాస్తవాలు ఏంటో తర్వాతి భాగాలలో బయటకి తీద్దాం !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#11
Engaging narration
[+] 1 user Likes sunil879's post
Like Reply
#12
"ఎవరు ? - 6"


 
 
 
ఒక పక్క ధర్నాలు, రాస్తా రొకోలు, ప్రజల్లో ఆందోళనలు మరింత ఉదృతంగా మారడంతో...
 
విషయం పై అధికారులకు, ప్రభుత్వానికి అతి కొద్ది సమయంలోనే ఇప్పుడున్న మీడియా చానల్స్ ద్వారా చాప కింద నీరులా పాకేసిందీ.
 
సెక్యూరిటీ ఆఫీసర్లు హాస్పిటల్ దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
స్వయంగా ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి అధికారులను కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
 
తెలంగాణ ఐపీఎస్ అధికారి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ,
 
నగర సీపి దగ్గర తెలుసుకుని వారికి చేరవేస్తున్నారు.
 
మరొక పక్క విపక్షాలు సైతం దీన్ని ఒక రాజకీయ వ్యూహంగా వాడుకుంటూ మీడియా ముఖంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ...
 
ఉదృతంగా మారిన ప్రజా ధర్నాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
 
ఇక ఇది ఇలా జరుగుతుండగా...
 
బాయ్స్ హాస్టల్ లో మిస్ అయిన అబ్బాయిల ఇద్దరు వివరాలు సెక్యూరిటీ ఆఫీసర్ వారు కనుక్కున్నారు.
 
ఇక ఇద్దరిని అదుపులో తీసుకుని స్టేషన్ కి తీసుకు వచ్చి,
 
SI హరినాథ్ ముందు ప్రవేశపెట్టగా...
 
అతను ఇద్దరినీ విచారించడం ప్రారంభించాడు.
 
హరినాథ్ :
 
మీ పేర్లేంటి ?
 
"వాళ్లిద్దరూ శివ(అమ్మాయి వెంట పడ్డవాడు),
 
ప్రసాద్ (కామెంట్ చేసినవాడు)"అంటూ ఒక్కొక్కరిగా తమ పేర్లను చెప్పారు.
 
హరినాథ్ :
 
మీరు ఏం చేస్తుంటారు ?
 
మీ ప్రోపర్ ఎక్కడ ?
 
శివ :
 
మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం.
 
ఇక్కడికి జాబ్ సెర్చింగ్ మీద వచ్చి, ట్రైల్స్ వేస్తున్నాను.
 
ప్రసాద్ :
 
మాది కడప సార్ !
 
నేను కూడా ఇక్కడికి జాబ్ పని మీదే వచ్చాను. కానీ, ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ లో డెలివరీ బాయ్ గా ఈలోపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను.
 
హరినాథ్ :
 
ఓహ్ అవునా !
 
నిన్న నైట్ అంతా మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు ?
 
శివ :
 
నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను సార్ !
 
(భయపడుతూ..)
 
ప్రసాద్ :
 
నేను, మా ఫ్రెండ్స్... రూం లోనే ఉన్నాం సార్ !
 
(ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా ...)
 
హరినాథ్ :
 
మీకు రాత్రి జరిగిన ఘోరం తెలిసే ఉంటుంది గా...
 
I mean చనిపోయిన వ్యక్తి మీ హాస్టల్ ముందు ఉంటున్న సరిత...
 
మా వాళ్ళు మిమ్మల్ని తీసుకువస్తున్నప్పుడు చెప్పే ఉంటారు గా ?
 
ప్రసాద్, శివ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ...
 
తెలుసన్నట్టు తలాడిస్తూ కిందకి దించుకున్నారు.
 
హరినాథ్ :
 
Well...
 
ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడానికి గల కారణం...
 
గతంలో ఆ అమ్మాయి విషయంలో మీ ఇద్దరూ గొడవ పడడం.
 
పైగా నిన్న రాత్రి మీ ఇద్దరి మొబైల్స్ ఒకే సారి స్విచ్ ఆఫ్ లో ఉండడం...
 
ఈ కేసులో మిమ్మల్ని కూడా అనుమానితులుగా పరిగణించి, విచారించడానికి పిలిపించాం. ఒకవేళ మీరు నిర్దోషులు ఐతే వదిలేస్తాం !
 
శివ :
 
సార్...
 
ఈ కేసు తో నాకేం సంబంధం లేదు సార్.
 
నైట్ నా మొబైల్ చార్జింగ్ అయిపోయింది.
 
చార్జింగ్ పెట్టడం మర్చిపోయి అలానే పడుకున్నా...
 
మార్నింగ్ లేచి చూసే సరికి స్విచ్ఛాఫ్ లో ఉంది.
 
ఛార్జ్ పెట్టీ మొబైల్ ఆన్ చేసే సరికి,
 
మా హాస్టల్ రూం మేట్ కాల్ చేసి, జరిగిన విషయం చెప్పారు.
 
ఆ వెంటనే మీ కానిస్టేబుల్ కాల్ చేశారు.
 
అప్పటికప్పుడు మా బంధువులకు కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను.
 
(భయపడుతూ .. కంగారు పడుతూ..)
 
ప్రసాద్ :
 
సార్...
 
నాక్కూడా దీంతో ఎలాంటి సంబంధం లేదు.
 
నా మొబైల్ కూడా రాత్రి వర్షానికి తడిచి పోయింది.
 
దాంతో మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉండిపోయింది. మార్నింగ్ హాస్టల్ లో కొంతమంది ద్వారా మా రూమెట్స్ కి చెప్తే, విషయం తెలుసుకున్నాను.
 
ఈ లోపే మీ కానిస్టేబుల్ కాల్ చేసి, నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు.
 
హరినాథ్ :
 
ప్రసాద్ వైపు చూస్తూ...
 
నువ్వు ఎన్ని రోజులు అయ్యింది హాస్టల్ కాలి చేసి రూం కి షిఫ్ట్ అయ్యి,
 
ప్రసాద్ :
 
సుమారు ఆరేడు నెలలు అవుతుంది అనుకుంట సార్ !
 
హరినాథ్ :
 
నువ్వు హాస్టల్ కాలి చేసి రూం కి షిఫ్ట్ అవ్వడానికి ఏమైనా కారణం ఉందా ?
 
ప్రసాద్ :
 
పెద్దగా కారణమంటూ ఏమి లేదు సార్ !
 
హాస్టల్ ఫీజ్ ఎక్కువ ...
 
(తన మాటలెలా ఉన్నా...
 
అతని కళ్ళు మాత్రం అబద్ధం చెప్తున్నట్టు అనిపించింది హరినాథ్)
 
హరినాథ్ :
 
చేతిలోకి లాఠీ తీసుకుని,
 
"ఇప్పటివరకూ నాలో మంచోడినే చూసారు...
 
మీరు నిజాలు దాస్తే...
 
అప్పుడు నా లాఠీకి పనిచెప్పాల్సి వస్తుంది.
 
తర్వాత నాలో ఉన్న మూర్ఖుడిని చూస్తారు.."
 
అంటూ ఇద్దరినీ బెదిరిస్తాడు.
 
ప్రసాద్ :
 
అది ..
 
అది...
 
అసలు విషయం ఏంటంటే ...
 
హాస్టల్ ముందు అమ్మాయిలను ఆటపట్టిస్తూ ఉంటే,
 
ఒకసారి మా హాస్టల్ ఓనర్ తో గొడవ అయ్యింది.
 
అలాగే శివని చూపిస్తూ ..
 
ఇతనితో కూడా ఒకసారి పెద్ద గొడవ అయ్యింది.
 
అప్పుడు ఓనర్ అతనికే సపోర్ట్ చేశాడు.
 
అందుకే కాలి చేసి కోపంలో వెళ్ళిపోయా !"
 
అంటూ అసలు విషయం చెప్తాడు.
 
దాంతో హరినాథ్...
 
శివ వైపు చూస్తూ...
 
"అతను చెప్పేది నిజమేనా ?" అని అడుగుతాడు.
 
శివ..
 
"అవును !" అన్నట్టు తలాడిస్తూ...
 
ఇతను మా హాస్టల్ లోనే ఉండేవాడు సార్!
 
ఒకరోజు ఆ అమ్మాయిని(సరిత) టీజ్ చేస్తుంటే నేను ఇతన్ని కొట్టాను. ఇద్దరికీ పెద్ద గొడవ అయ్యింది!
 
మధ్యలో మా హాస్టల్ ఓనర్ వచ్చి, ఇతన్ని తిట్టాడు."
 
అంటూ జరిగిన విషయం చెప్తాడు.
 
వెంటనే ప్రసాద్ శివ వైపు చాలా కోపంగా చూస్తాడు.
 
ఆ గొడవ తాలూకా సంఘటనలు అతను ఇంకా మర్చిపోలేదు.
 
వెంటనే హరినాథ్...
 
"ఏంట్రా...
 
వాడిని అలా కోపంగా చూస్తున్నావ్...!
 
చంపేస్తావా ?" అంటూ అతని కళ్ళు పెద్దవి చేసి ప్రసాద్ ను బెదిరిస్తాడు.
 
ప్రసాద్ :
 
"అబ్బే...
 
అది కాదు సార్ !"
 
హరినాథ్ :
 
"నోరు ముయ్ ! " అంటూ ప్రసాద్ను తిడుతాడు...
 
(దాంతో ప్రసాద్ చేతులు కట్టుకుని తల దించుకుంటాడు.)
 
"అయినా నువ్వెంట్రా ఆ అమ్మాయిని కామెంట్ చేస్తే, కొట్టేస్తావా ?
 
అసలు ఆ అమ్మాయిని అంటే నువ్వెందుకు అంత ఫీల్ అయ్యావు...
 
అలా కామెంట్ చేసిన వాళ్ళందరినీ కొడుతున్నావా లేక ఆ అమ్మాయిని మాత్రమే కామెంట్ చేశాడని కొట్టావా...?
 
అయినా నీకు తనకి మధ్య రిలేషన్ ఏంటి ?" అంటూ అలా గట్టిగా అడిగితే కేసు గురించి విషయం ఏమైనా తెలుస్తుందని
 
అడుగుతాడు హరినాథ్.
 
దాంతో వణుకుతూ భయంతో తల కిందకి దించుకున్నాడు శివ.
 
హరినాథ్ :
 
"అయినా ఏంట్రా ?
 
ఒక అమ్మాయిని, అది కూడా మొన్నటి వరకూ మీ ముందే తిరిగిన అమ్మాయిని,  అంత దారుణంగా రేప్ చేసి చంపేస్తే ఇద్దరి కళ్ళలో భయం కానీ, బాధ కానీ ఏ కోశానా కనిపించడం లేదు.?" అని అడుగుతాడు
 
శివ :
 
"సార్...
 
ఆ అమ్మాయి వెంట పడి తిరగడం కేవలం టైం పాస్ కే సార్ !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#13
అలాంటి అమ్మాయి నాతో ఫ్రెండ్షిప్ చేస్తే, మా హాస్టల్ లో అబ్బాయిల ముందు కొంచెం బిల్డప్ కొట్టచ్చని,
 
అప్పుడు ఏదో తెలిసో తెలియక అలా తిరిగా...
 
కానీ అది వర్కవుట్ అవ్వకపోయే సరికి,  ఇక ఆమె వెంట పడడం ఆపేసా...
 
ఈ మధ్య ఆమె వైపు కూడా చూడడం లేదు.
 
నిజం సార్ ..
 
నన్ను నమ్మండి.
 
ఎప్పుడూ రమ్మంటే అప్పుడు,
 
నేను ఎలాంటి విచారణకు అయినా వస్తా...!
 
దయచేసి నన్ను నమ్మండి . నాకూ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు"
 
అంటూ భయపడుతూనే ప్రాధేయపడతాడు.
 
ప్రసాద్ :
 
తెలియక అప్పుడేదో ఆ అమ్మాయిని కామెంట్ చేసి తప్పు చేసాను సార్ ..!
 
ఇంకెప్పుడు చెయ్యను.
 
నిజంగా ఈ కేసుతో నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు.
 
ఏ టెస్ట్ కి అయినా నేను రెడీ...
 
అని ప్రసాద్ వేడుకుంటుంటాడు.
 
మధ్యలో ఒక కానిస్టేబుల్ వచ్చి,
 
హరినాథ్ ను పక్కకి పిలిచి
 
"సార్ !
 
ఇద్దరి ఫోన్స్ అండ్ సోషల్ అకౌంట్స్ చెక్ చేశాం !
 
అలాగే మన సైబర్ టీం కి వీళ్ళ డిటైల్స్ పంపించి, వాళ్ళని కూడా చెక్ చేయమన్నాం..
 
కానీ, ఆ అమ్మాయితో వీళ్లిద్దరూ మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు.
 
అలాగే వీరిద్దరి మధ్య ఆ హాస్టల్ లో తప్ప, ఫోన్స్ ద్వారా కాంటాక్ట్స్ లేనట్టు తెలుస్తుంది.
 
నాకు తెలిసి ఇద్దరికీ ప్రమేయం లేనట్టు ఉంది.
 
సో, వీళ్ళని అనుమానించాల్సిన అవసరం లేదు." అంటూ వీళ్ళద్దరి గురించి ఇన్విస్ట్గేట్ చేసిన కానిస్టేబుల్ హరినాథ్ కి చెప్తాడు.
 
ఇక హరినాథ్...
 
"సరే,
 
వీళ్ళ దగ్గర డిటైల్స్ తీసుకుని, ప్రస్తుతానికి వదిలేయండి.
 
తర్వాత అవసరం ఉంటె మళ్ళీ విచారణకు పిలుద్దాం! " అని ఆ కానిస్టేబుల్ కి చెప్పి,
 
మరలా శివ, ప్రసాద్ దగ్గరకు వచ్చి,
 
శివను చూస్తూ...
 
"అంటే నీకు టైం పాస్ చేయడానికి, మీ ఫ్రెండ్స్ ముందు ఫోజులు కొట్టడానికి అమ్మాయిలతో ప్రేమ, గీమా అని అంటూ నాటకాలు ఆడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తారా వెధవ ?
 
ఇంకెప్పుడైనా ఇలా రిపీట్ ఐతే..."
 
అని గట్టిగా అరుస్తూ...
 
అలాగే ప్రసాద్ ను చూస్తూ ...
 
"ఏరా !
 
రోడ్డు మీద ఆడపిల్ల కనిపిస్తే, కామెంట్స్ చేస్తావా ?
 
అదే నీ అక్కో చెల్లో ఐతే ఇలానే బిహేవ్ చేస్తావా ?
 
ఇంకొకసారి ఇలాంటి పనులు చేసినట్టు తెలిస్తే తాట తీస్తా .." అంటూ ప్రసాద్ మీద కోప్పడి తను అదే కేసు గురించి అక్కడున్న ఫైల్స్ తిరగేస్తాడు.
 
హరినాథ్ ఆవేశాన్ని చూసి ఇద్దరిలో వణుకు పుడుతుంది.
 
ప్రసాద్ లో భయం, శివ లో బాధ రెండూ ఒకసారి ఏర్పడతాయి.
 
ఇక అక్కడున్న ఒక కానిస్టేబుల్ వచ్చి,
 
ప్రసాద్, శివ లను పక్కకు పిలిచి, వాళ్ళని అక్కడి నుండి పంపించేస్తారు.
 
హరినాథ్ ఆ ఫైల్స్ తిరగేస్తూ...
 
ఇంకో కానిస్టేబుల్ నీ పిలిచి,
 
"ఆ మణికంఠ, రవి ల గురించి ఏమైనా update వచ్చిందా ?"
 
అని అడుగుతాడు.
 
దాంతో కానిస్టేబుల్...
 
"రవిని ట్రేస్ చేశాం సార్...
 
తను ఇక్కడే  హైదరాబాద్ లో ఉన్నాడు.
 
అతన్ని తీసుకురావడానికి మన వాళ్ళు వెళ్ళారు.
 
మణికంఠ మాత్రం వాళ్ల ఊరిలో ఉన్నాడు. అక్కడున్న ఆ ఏరియా పరిధి సెక్యూరిటీ ఆఫీసర్ల ద్వారా అతన్ని కూడా విచారించమని చెప్పి, వీలైతే ఇక్కడికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాం!" అని చెప్తారు.
 
"గుడ్...
 
ఒకవేళ అతనికి కేసు తో సంబంధం ఉన్నా లేకపోయినా...
 
అతన్ని విచారిస్తే, కేసు తో సంబంధం ఉన్న వాళ్ల గురించి అసలు విషయాలు బయట పడే ఛాన్స్ ఉంది!" అంటూ హరినాథ్ సలహా ఇస్తాడు.
 
మరో కానిస్టేబుల్ వచ్చి,
 
"సార్..!
 
మీరు చెప్పినట్టు అనుమానితులు మరియు బాధితురాలు కాల్ డేటా, సోషల్ అకౌంట్స్ డేటా చెక్ చేశాం.
 
దాన్ని బట్టి అర్థమయ్యింది ఏంటి అంటే ,
 
ప్రియ, రవళి మరియు స్వప్నలను పెద్దగా అనుమాంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వాళ్ళను విచారించినప్పుడు కానీ, వాళ్ల మొబైల్ డేటా చెక్ చేసినప్పుడు కానీ, పెద్దగా ఈ కేసు విషయంలో వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదు.
 
పైగా వాళ్ళు చెప్పిందంతా నిజమే !
 
అలాగే బాధితురాలు సరిత మొబైల్ లో కూడా ఏం లభించలేదు.
 
ఆమె ఇంట్లో వాళ్ళతో తప్ప ఆమె ఎప్పుడూ ఎవరితో పెద్దగా మాట్లాడలేదు.
 
ఇక కృష్ణా....
 
తన Instagram account చేస్తే, అతను ఒక రైటర్ మరియు ఆర్టిస్ట్ అని అర్థం అయ్యింది!
 
అతని సోషల్ అకౌంట్స్ అంతా Quotes, poets and stories మరియు ఆర్ట్స్ తో నిండిపోయింది.
 
రాయడం, బొమ్మలు గీయడం తన హ్యాబిట్ అనుకుంటా !"
 
అంటూ ఆ కానిస్టేబుల్ తను సేకరించిన సమాచారాన్ని హరినాథ్ కి ఇస్తూ ఉంటాడు.
 
దానికి హరినాథ్...
 
"అంటే కృష్ణకి ఈ కేసుతో సంబంధం లేదన్న మాట !
 
అతని బంధువు, అదే ఆ ప్రాక్టీసు లాయర్ చెప్పినట్టు అతను మంచివాడిలానే ఉన్నాడు." అని అంటాడు.
 
"లేదు సార్...
 
మనం ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాకూడదు.
 
ఎందుకంటే, కృష్ణని కూడా అనుమానించే ఆధారం ఒకటి లభించింది అతని Instagram అకౌంట్ చెక్ చేస్తుంటే" అంటూ కానిస్టేబుల్ అనుకొని సందేహాన్ని తెలుపుతాడు.
 
"అనుమానించే ఆధారమా?
 
ఇప్పుడే కదయ్యా...
 
అతను ఒక రైటర్, ఆర్టిస్ట్ అంటూ అతనికున్న మంచి, గొప్ప అలవాట్లు గురించి చెప్పావ్ ?" అంటూ హరినాథ్ ఆ కానిస్టేబుల్ నీ ప్రశ్నించగా
 
అక్కడే ఒక మెలిక ఉంది సార్...!
 
"అతను quotes, stories , poems రాస్తాడు.
 
arts and paintings వేస్తాడు.
 
కరెక్టే,
 
కానీ, అవన్నీ ఒక అమ్మాయి గురించే !"
 
అంటూ ఆ కానిస్టేబుల్ చెప్పగా
 
"ఏంటి ?
 
అమ్మాయి గురించా !"
 
నువ్వేం మాట్లాడుతున్నావ్ ?
 
నాకేం అర్థం కావడం లేదు !" అంటూ హరినాథ్ ఆశ్చర్యంగా కానిస్టేబుల్ ను ప్రశ్నించగా...
 
"అవును సార్...
 
తను ఎక్కువగా తన లవ్ ఫెయిల్యూర్ గురించే అందులో పోస్ట్ చేశాడు. అవి చూస్తుంటే అతను ఎవరినో డీప్ గా లవ్ చేసి, ఫెయిల్ అయ్యాడు. అందుకే డిప్రెషన్ తో అతని instagram పేజీ నిండిపోయింది.
 
ఆ అమ్మాయి ఈ సరితే ఎందుకు కాకూడదు ?
 
ఆమె ఒప్పుకోకపోయేసరికి అతనే ఇలా రేప్ చేసి ఎందుకు హత్య చేసి ఉండకూడదు ?"
 
అని కానిస్టేబుల్ తనకున్న అనుమానం చెప్పగా...
 
"కానీ, మన విచారణలో వాళ్ళిద్దరికీ అసలు పరిచయం ఉన్నట్టు ఎక్కడా తేలలేదే !" అంటూ హరినాథ్ చెప్తాడు.
 
"అదే మనం కనిపెట్టాలి సార్ !
 
మీరొకటి గమనించారో లేదో...
 
ఇందాక కృష్ణ బంధువు వచ్చి,
 
కృష్ణ మంచివాడు అని చెప్పాడు తప్ప,
 
తనకున్న ఈ హ్యాబిట్స్ గురించి బయట పెట్టలేదు.
 
Of course, తనకు ఈ అలవాట్లు ఉన్నాయి అన్న విషయం తెలియకుండా ఉంటుందా ?
 
అలాగే, అతను లవ్ లో ఫెయిల్ అయినా విషయం కూడా ...
 
కానీ, దీని గురించి మనకి చెప్పలేదు.
 
కారణం... ఎక్కడ విషయం బయటపడుతుందోనని
 
అతను ఈ విషయాలన్నీ దాచి, మనల్ని ఏమార్చి ఉండొచ్చు కదా !
 
అసలే లాయర్ బ్రెయిన్ ...
 
అది ఉపయోగించాడేమో ?
 
అంటూ ఆ కానిస్టేబుల్ చెప్తాడు.
 
హరినాథ్ కి కూడా కూడా కృష్ణనె అసలు దోషి అని తేల్చిచెప్పడానికి,
 
మరొక్క బలమైన ఆధారం దొరికింది !
 
కానీ, కేసు పూర్తిగా విచారించకుండా ఒక కొలిక్కి రాలేము అని అతను భావిస్తున్నారు.
 
హాస్టల్ బాయ్స్ కి ఈ హత్యలో ప్రమేయం లేదని తెలిసిపోయింది !
 
ఇక సరిత కాలేజ్ మేట్స్ లో మణికంఠ ఇక్కడ లేదు కాబట్టి,
 
తను కచ్చితంగా చేసి ఉండడు !
 
పైగా మరొక రవి ఫోన్ డిటైల్స్ , అతని విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉంది ?

అయినా

కృష్ణనే అసలు నిందితుడు అని చెప్పడానికి చాలా ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి...
 
సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమానిస్తున్నట్టు కృష్ణనే అసలు నిందితుడా ?
 
రండి...
 
సెక్యూరిటీ ఆఫీసర్లు మరియు నాతో పాటు ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో
 
అసలు వాస్తవాలు ఏంటో తర్వాతి భాగాలలో వెలికి తీద్దాం !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#14
"ఎవరు ? - 7"
 
"ఎవరు ? - 6" కి
కొనసాగింపు
హాస్టల్ బాయ్స్ అయిన శివ మరియు ప్రసాధ్ లకు ఈ కేసుతో
సంబంధం లేదని తెలిసిపోయింది.
ఇక అనుమానితుడిగా భావిస్తున్నా సరిత కాలేజ్ మేట్...
రవి ఒక్కడినే విచారించాల్సి ఉంది !

అప్పటికే  ఆ రోజు దాదాపు మధ్యాహ్నం అయ్యింది.
ఘటన జరిగి సుమారు 6 గంటలు పైనే కావొస్తోంది !

ఈలోపు సెక్యూరిటీ ఆఫీసర్లు రవిని కూడా పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వచ్చారు.
Si హరినాథ్ అతన్ని విచారించడం మొదలుపెట్టాడు.
హరినాథ్ :
నీ పేరు ?

రవి :
రవి సార్ !

హరినాథ్ :
నువ్వు ఏం చేస్తుంటావ్ ? ఎక్కడుంటావ్ ?
నీ అసలు ఊరు ఎక్కడ ?

రవి :
నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని సార్ !
ఇక్కడే మాదాపూర్ లో ఉంటాను.
నా నెగటివ్ ప్లేస్ వచ్చి, ఆంధ్రా ప్రదేశ్ లో భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు.

హరినాథ్ :
నీకు సరిత తెలుసా ?

రవి :
హా... తెలుసు సార్ !
ఇద్దరం చిన్నప్పుడు ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నాం !

హరినాథ్ :
కలిసి చదువుకోవడం వలన మాత్రమే తను పరిచయమా?
లేక ఇంకేదైనా కారణంతో ఆ పరిచయం ముందుకు వెళ్లి తను దగ్గరగా తెలుసా ?

రవి :
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.
తను నాకు ఒక కాలేజ్ మేట్ గా తెలుసు అంతే,
నేను mrng లేచేసరికి వాట్సాప్ లో మా 10th క్లాస్ మ్యాట్స్ గ్రూప్ లో ఎప్పుడూ లేని విధంగా చాలా మెసేజెస్ సర్క్యులేట్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటున్నారు.

ఏంట్రా అని చూస్తే,
నాకప్పుడు తెలిసింది...

సరిత చనిపోయిందని...
Sorry ...
చంపబడిందని "
అంటూ చాలా కూల్ గా సమాధానం ఇస్తాడు.

మా ఫ్రెండ్ మణికంఠ కూడా కాల్ చేసి చెప్పాడు.
ఆ విషయం గురించి...
అలా చెప్తూనే
"సెక్యూరిటీ ఆఫీసర్లు నిన్ను కలవాడినికి వస్తారు...
ఆమె గురించి ఇప్పటికే నన్ను కొన్ని డిటైల్స్ ఫోన్లో అడిగారు. బహుశా నువ్వు హైదరాబాద్ లో ఉండడం వలన, వాళ్ళు నిన్ను కూడా ఎంక్వైరీ చేస్తారని " చెప్పి, తను ఫోన్ పెట్టేసాడు.

అంతలోనే మీ కానిస్టేబుల్స్ నన్ను కాంటాక్ట్ అయ్యి, నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు.
హరినాథ్ :
ఓహ్... ఐ సి ...
అంటే  ఇక్కడికి రాక ముందే ఈ హత్య గురించి నీకు పూర్తి విషయాలు తెలుసన్నమాట...

రవి :
హత్య గురించి కాదు...
ఆమె చనిపోయిందన్న విషయం మాత్రమే తెలుసు ...!
(చాలా కూల్ గా)

హరినాథ్ :
అదెంటయ్యా ?
చనిపోయింది మీ కాలేజ్ మేట్,
చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. పైగా ఒకటే ఊరు.
అయినా ఆ అమ్మాయి అంత దారుణంగా చంపబడింది అని తెలిసి నీలో కొంచెం కూడా అసలు బాధ అనేది కనిపించడం లేదు.

ఏదో పరాయి వాళ్ళలా మనకెందుకు లె అన్నట్టు ఉన్నావ్...
ముక్కుమొహం తెలియని వాళ్ళు కూడా ఒక వ్యక్తి చనిపోతే "అయ్యో పాపం!" అనుకుంటారు.
అలాంటిది నువ్వేంటి కనీసం తెలిసిన అమ్మాయి చనిపోతే కనీసం జాలి , దయ లేకుండా ఉన్నావ్...

రవి :
ఎవరెవరి గురించో...
అనవసరమైన విషయాలు పట్టించుకుని నా టైం వేస్ట్ చేసుకోలేను సార్..!
అంత తీరిక, అవసరం నాకు లేదు.
మీరు విచారించడం అయిపోతే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నాకసలే అర్జంట్ పని ఉంది!
(అంటూ చాలా కఠినంగా మాట్లాడతాడు.)

హరినాథ్ :
"నీ కన్న అర్జంట్ పనులు నాకు చాలానే ఉన్నాయిలే కానీ,
ఆ అమ్మాయి పరాయిది, కేవలం నీ కాలేజ్మేట్ మాత్రమే ఐతే , మేము కూడా పెద్దగా నిన్ను విచారించకపోయే వాళ్ళం...

కానీ, కొన్నేళ్లుగా నువ్వు గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి కదా తను. అందుకే ఎన్ని అర్జంట్ పనులున్నా వదిలేసి,
నిన్ను వెతికి మరీ పట్టుకుని ఇక్కడికి తీసుకుని వచ్చారు మా వాళ్ళు..."
అంటూ హరినాథ్ అంటుంటే,

"ఛీ...
ఛీ...
అలాంటిది ఏం లేదు సార్ !" అంటూ...
అప్పటి వరకూ హరినాథ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సమాధానాలు చెప్పిన రవి తల కిందకి దించుకుని అటు ఇటు బిత్తర చూపులు చూస్తు బుకాయిస్తున్నాడు.

దాంతో హరినాథ్ కి అతను చెప్పేది అంత అబద్ధమని అర్థమవుతుంది.
హరినాథ్ :
నిజం చెప్పు...
ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదూ ?
"ప్రేమించు, ప్రేమించు ..!" అని ఆ అమ్మాయి వెంట పడి వేధించలేదూ ?
"మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు, ఇవన్నీ ఆపేసి
బాగా చదువుకుని లైఫ్ లో బాగా సెటిల్ అవ్వు!" అని ఆ అమ్మాయి నీకోసం చెప్తే నువ్వు వినలేదు.
తనని పదే పదే చాలా సార్లు విసిగించావ్ !
ఆ అమ్మాయి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని టార్చర్ చేశావ్...!

రవి :
"లేదు సార్ ..!
ఇదంతా అబద్ధం...
నన్ను ఇందులో ఇరికించాలని మీరు కుట్ర చేస్తున్నారు."
అంటూ రవి దించిన తలను పైకి ఎత్తకుండానే సమాధానం ఇస్తాడు.

హరినాథ్(కొంచెం కూల్ అయ్యి) :
సరే ,
నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం !
నువ్వు ఈ మధ్య ఆ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడవ్...?

రవి :
"అసలు ఆమెతో నేను కాంటాక్ట్ లోనే లేను సార్ !
నాకు తనకి పెద్దగా పరిచయం లేదు !
నేను చెప్పేది నిజం...
నన్ను నమ్మండి !"
అంటూ రవి నిజాన్ని దాస్తూ తనని తాను సమర్ధించుకుంటూ సెక్యూరిటీ ఆఫీసర్లకి సహకరించడం లేదు.

హరినాథ్ :
కానిస్టేబుల్...(అక్కడున్న కానిస్టేబుల్ ని పిలుస్తూ)
"మనం ట్రాక్ చేసిన ఇతని మొబైల్ డేటా...
అలాగే వాట్సాప్, Instagram చాట్ లిస్ట్ తీసుకురా...!"
అంటూ చెప్తాడు.

ఆ కానిస్టేబుల్ హరినాథ్ అడిగినవన్నీ తీసుకుని వచ్చి అతని ముందు పెడతాడు.
అందులో ...
ఒక రెండు సంవత్సరాల క్రిందట వరకూ...
రవి సరితకు కాల్ చేసిన కాల్ డేటా, పంపిన వాట్సాప్ అండ్ Instagram చాట్...
చాలా క్లియర్ గా ఆధారాలు ఉంటాయి.

అవన్నీ రవికి చూపిస్తూ ..
"ఇప్పుడు చెప్పు ఆమెకు నీకు మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ లేవని,
ఆమె ఎవరో తెలీదని ?
అంటూ అతన్ని ప్రశ్నిస్తుంటే

రవి మాత్రం ...
కాసేపు ఆ ఆధారాల వైపు, కాసేపు కిందకి చూస్తూ భయంతో
ఏం మాట్లాడకుండా... మూగబోయిన గొంతుతో నీళ్లు నములుతూ... టెన్షన్ పడుతూ ఉంటాడు.

విచక్షణ కోల్పోయిన హరినాథ్ కి కోపం కట్టెలు తెంచుకుని...
ఒకసారి ఎదురుగా ఉన్న రవి కాలర్ పట్టుకుని, అతన్ని కుర్చీలోంచి పైకి లేపి, రవి చెంపలను తన అరచేతితో వాయిస్తూ చెల్లుమనిపిస్తాడు.

"ఏరా !
నాకే అబద్ధాలు చెప్తూ కేసుని తప్పు దారి పట్టించాలనుకుంటావా ?
చేసిందంతా చేసి మా ముందు ఏమి తెలియనట్టు నటిస్తావా ?

చెప్పు ...
ఇప్పుడైనా అసలు నిజం ఏంటో చెప్పు...!

ఆమె ప్రేమించలేదని ఆ అమ్మాయిని చంపేసి,
ఏమి తెలియనట్లు నటిస్తున్నావ్ కదా...!

అసలు, ఆ కృష్ణ తో నీకు సంబంధం ఏంటో చెప్పు...!
ఇద్దరూ కలిసి దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి, నువ్వు తప్పించుకున్నావ్, వాడిని ఇరికించావ్ !.

చెప్పు ఇప్పటికైనా నిజం చెప్పు ..!" అంటూ హరినాథ్ అతన్ని కొడుతూ బెదిరిస్తాడు.
హరినాథ్ దెబ్బల ధాటికి కింద పడిపోయిన రవి...
నెమ్మదిగా పైకి లేచి,
ఏడుస్తూ....

"సార్...!
ఆమెను నేను గాఢంగా ప్రేమించిన మాట నిజమే !
మీరు నా ముందు పెట్టిన ఈ ఆధారాలు కూడా నిజమే !
కానీ, ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ !"
అంటూ చెప్తుంటే,

"సార్...
వీడిని ఇలా బెదిరిస్తే, ఒక్కొకటి నిజాలు బయటకు వస్తున్నాయి!
అదే వీడి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, అసలు నిజం దానంతట అదే బయటకి వస్తుంది." అంటూ కానిస్టేబుల్ ...
హరినాథ్ కి సలహా ఇస్తాడు.

హరినాథ్ కూడా రవి వైపు కోపంగా చూస్తాడు.
దాంతో రవి...
"సార్ !
మీరు థర్డ్ డిగ్రీ కాదు, నన్ను చంపేసిన నాకూ ఈ హత్యకు సంబంధం లేదు. కావాలంటే మీరు పెట్టే ఎలాంటి పరీక్షకైన నేను సిద్ధమే !

అందులో రెండు సంవత్సరాలు క్రితం వరకు తనని కాంటాక్ట్ అయ్యాను. అప్పట్లో తనకి నేను ఎన్ని calls చేసినా మాట్లాడేది కాదు. మెసేజెస్ చేసినా రిప్లై ఇచ్చేది కాదు.
ఆ డేటా అంతా మీ దగ్గరే ఉంది కాబట్టి...
కావాలంటే మీరే ఒకసారి డీప్ గా చెక్ చెయ్యండి !

అందుకే అప్పటి నుండి ఆమెను కాంటాక్ట్ అవ్వడం మానేసాను. రీసెంట్ గా ఏం లేదు.
అలాంటిది ఆమె హత్యతో నాకు ఎందుకు సంబంధం ఉంటుంది ?
దయచేసి నేను చెప్పేది పూర్తిగా నమ్మండి. నేను ఎలాంటి విచారణకైనా సహాకరిస్తాను." అంటూ ప్రాధేయపడతాడు.

హరినాథ్ కి రవి చెప్పిన దాంట్లో పాయింట్ కనిపిస్తుంది.
అతన్ని కూర్చోబెట్టి...

" చెప్పు...!
ముందు నువ్వు అసలు ఎందుకు అలా అబద్ధం చెప్పావ్ ?"
అని అడుగుతాడు హరినాథ్.

రవి :
సార్...
నేను సరితను ఇష్టపడ్డ మాట వాస్తవమే !
ఇష్టం కాదు, ప్రేమ.
తనని ఆ 10th class లోనే ప్రేమించడం మొదలు పెట్టాను. అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేస్తే, ఇవన్నీ నాకు నచ్చవు , బాగా చదువుకో అని నాకు నచ్చజెప్పింది.

నేను కూడా అందరిలాంటి వాడిని అనుకుని ఇలా చెప్తుందేమో...
నేను అలా కాదని, నా ప్రేమ స్వచమైనదని, ఆమెను నమ్మించే ప్రయత్నం, నా ప్రేమను తెలియజెప్పే ప్రయత్నం చేశాను.
కానీ, ఆమె ఒప్పుకోలేదు !

అయినా అలా దాదాపు 5 ఏళ్ళు ఆమెనే ఆరాధించాను. వేరే అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పట్లో బాగా చదివి మంచి మార్కులతో బాగుండాల్సిన నా జీవితం...
ఈ ప్రేమ అనే ఉచ్చులో చిక్కుకుని నాశనం అయ్యింది.

ఆమెను ఎంతలా ప్రేమించాను అంటే ,
నా కెరీర్ నీ పక్కన పెట్టీ మరీ తనతో జీవితాన్ని ఊహించుకునేంత !

అలా కెరీర్ , ఫ్యామిలీ నీ వదిలేసి ఆ అమ్మాయి కోసమే పిచ్చోడిలా తయారయ్యాను.
కానీ, తను మాత్రం అస్సలు నా గురించి ఆలోచించలేదు.

సరిగ్గా అప్పుడే నా లైఫ్ లోకి వెన్నెల వచ్చింది.
"వెన్నెల ఎవరు ?"
ఆశ్చర్యంగా అడిగాడు హరినాథ్...

వెన్నెల...!
చీకటి చుట్టేసి అస్తమిస్తున్న ఈ రవి లో...
పున్నమి వెలుగును ఉదయించిన నా జాబిల్లి ! అంటూ

ఆమె నా ఇంజనీరింగ్ క్లాస్మేట్...
చదువుకున్న రోజుల్లో పెద్దగా పరిచయం లేకపోయినా ...
దూరం నుండే తను నన్ను ప్రేమించిందట...
నా గతం తెలుసుకుని, తన ప్రేమ విషయం నాతో చెప్పలేకపోయింది!

చదువు పూర్తయి సరిత ధ్యాసలోనే ఉంటూ జీవితాన్ని పాడుచేసుకుంటున్న నాకు...
ఉద్యోగం ఇప్పించి, చివరికి తన ప్రేమ విషయం చెప్పింది !
ఆమె అన్నేళ్ళ ప్రేమ ముందు, నా ఇన్నేళ్ళ ప్రేమ చాలా చిన్నదనిపించింది. అందుకే సరిత మీద ప్రేమను మర్చిపోయి, ఈమె ప్రేమను ఒప్పుకోవడానికి నాకు ఎక్కవ టైం పట్టలేదు.

కొంతకాలానికి చాలా కష్టపడి ఇద్దరి ఇళ్ళల్లో ఒప్పించాం !
కొద్ది రోజుల్లోనే మా పెళ్లి !

సరిత మీద నేను పెంచుకున్న ప్రేమ నా జీవితాన్ని నాశనం చేస్తే,
వెన్నెల...
నా మీద పెంచుకున్న ప్రేమతో నాశనమైన నా జీవితాన్ని చక్కడిద్దింది.

అందుకే అసలు నా ప్రేమను పట్టించుకోని సరిత అంటే నాకు పరమ అసహ్యం !
అంతకుమించిన ద్వేషం...
మా 10th క్లాస్ మేట్ ఎప్పుడు కనిపించి ఆ టాపిక్స్ తీసినా... నాకు సరిత అంటే ఎక్కడ లేని కోపం వచ్చి, వాళ్ళని చిరాకు పడతాను.

ఇక వీటి వల్ల నేను ఈ కేసులో ఇరుక్కుని వెన్నెల పేరెంట్స్ వద్ద ఎక్కడ చెడ్డవానిగా మిగిలిపోతానో...
వెన్నెలను కూడా దూరం చేసుకుంటానోనన్న భయంతో
అసలు విషయాలు అన్నీ మీ దగ్గర దాచాను తప్ప, ఈ కేసును తప్పు దారి పట్టించాలని కాదు.

దానికి నన్ను క్షమించండి !
ఈ కేసు విషయంలో మీరు చేసే ఎలాంటి విచారణకైన నేను సిద్ధమే !
కానీ, నిరపరాది అయిన నన్ను ఈ కేసుతో ముడిపెట్టి
నా పేరు మీడియాలో, పత్రికల్లో వేస్తే
ఇప్పుడిప్పుడే గాడిన పడ్డ నా జీవితం, మళ్ళీ చెదిరిపోతుంది.

ఇక అప్పుడు నాకు చావే పరిష్కారం అవుతుంది !
ప్లీజ్ సార్...
దయచేసి అర్థం చేసుకోండి !" అంటూ వేడుకుంటాడు.

హరినాథ్ కి ...
రవి మాటల్లో నిజం, నిజాయితీ అర్థమవుతాయి.
అతని కళ్ళల్లో భయం, బాధ కనిపిస్తాయి.
అతని ఆలోచనల్లో బాధ్యత, భవిష్యత్తు తెలుస్తాయి.

ఇంకొన్ని వివరాలు సేకరించి
అతన్ని కూడా వదిలేస్తారు.

కాసేపటికి...
హరినాథ్ కి అతని పై ఆఫీసర్ నుండి కాల్ వస్తుంది !

"ఏంటయ్యా ?
ఒక పక్క మీ ఏరియా అంతా తగలడిపోతుందని
టీవీల్లో వేసిన న్యూస్ పదే పదే వస్తుంటే,
మీరు మాత్రం స్టేషన్ లో దర్జాగా కూర్చున్నారు ?" అంటూ ఆ పై ఆఫీసర్ హరినాథ్ ను తిడతాడు...

హరినాథ్..
"ఆ కేసు పని మీదే ఒక్కొకరిని స్టేషన్ కి పిలిచి,
చాలా లోతుగా ఈ కేసు గురించి విచారిస్తున్నాం సార్...!"
అంటూ రిప్లై ఇస్తాడు.

పై అధికారి :
ఐతే ,
"అసలు హంతకుడు దొరికాడా ?"

హరినాథ్ :
"ప్రస్తుతానికి లేదు సార్...!
ఆ పని మీదే ఉన్నాం...
దాదాపు అందరినీ విచారించేసాం !"

పై అధికారి :
"హా...
మీరు అదే పని మీద ఉండండి...
నేరస్తుడు మాత్రం దొరకడు...
ఇలానే మీరు హైదరాబాద్ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత దేశంలో ఉన్న వాళ్ళందరినీ విచారణ పేరుతో సంవత్సరాల తరబడి ఈ కేసుని సాగదీస్తూ కూర్చొండి...

తర్వాత నిన్ను, నన్ను మన జాబ్స్ నుండి పీకేస్తారు !
అయినా....
ఘటనా స్థలంలో అంతా క్లియర్ గా ఎవిడెన్స్ తో ఒకడు దొరికాడు కదయ్యా ...!
వాడే నిందితుడయ్యి ఉంటాడు కదా ?
ఇంకెందుకు ఎవరెవరినో విచారించడం...!"

హరినాథ్:
"సార్...
అతను కోమా..!" అంటూ చెప్తుంటే

పై అధికారి :
హా వాడు కోమాలో ఉంటె, వేరే వాడి మీద ఈ కేసుని నెట్టేస్తావా ?

హరినాథ్ ;
అది కాదు సార్...

పై అధికారి :
"ఏదీ కాదయ్యా...
ఈరోజు నైట్ లోపు ఏదోక విషయం తేల్చు ..!
లేదంటే, కేసులో అలసత్వం వహించినందుకు నిన్ను డిస్మిస్ చెయ్యాల్సి వస్తుంది జాగ్రత్త !
అసలే పైన ఈ పొలిటీషియన్స్,
కింద మీతో వెధవ తలనొప్పులు !"
అంటూ కాల్ కట్ చేస్తాడు.

"కాల్ లో ఎవరు సార్...?"
అంటూ అక్కడున్న సెక్యూరిటీ హరినాథ్ నీ అడగ్గా...

"హా...
ఇంకెవడు నా మొగుడు...!
కేసు ఏమైందని అడగ్గుతున్నాడు!
ఏదోలా తొందరగా క్లోజ్ చేయమని సారూ సలహా ఇచ్చారు?"అంటూ హరినాథ్ రిప్లై ఇస్తాడు.

అప్పుడు ఆ కానిస్టేబుల్ ..
"సార్...
మన పై ఆఫీసర్స్ ఈ కేసు గురించి అడిగిందే అడిగి చావ గొడుతున్నారు కదా..!
మీడియా, ప్రజల్లో కూడా సహనం నశించక ముందే ఈ కేసును మనం పరిష్కరించాలి !
ఎలాగో కృష్ణ ఈ అఘాయిత్యం చేశాడు అనడానికి అన్నీ ఆధారాలు అతనికి అనుకూలంగా ఉన్నాయి.

కాబట్టి...
అతనే అసలు నేరస్తుడు అని డిక్లేర్ చేసేద్దాం !
అలాగే ప్రజలు కూడా తొందరగా నమ్మేస్తారు.
ఎలాగో అతను కోమా లో ఉన్నాడు కాబట్టి,
అందులో నుండి అతను బయటకు రావడానికి టైం పడుతుంది.

అప్పటికి ఈ ప్రజలు , ప్రతిపక్షాలు చేసే ఆందోళనలు, నిరసనలు చల్లారిపోతాయి. కొన్ని రోజులకు అంతా మర్చిపోతారు.
ఆ తర్వాత అతను కోమా లో నుండి బయట పడ్డాకా నెమ్మదిగా విచారిద్దాం!" అంటూ సలహా ఇస్తాడు.

ఈ హత్యతో చివరి అనుమానితుడిగా భావిస్తున్న రవికీ కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిశాక ,
స్పాట్ లో ఉన్న కృష్ణనే అసలు నిందితుడా ?
అతనితో పాటు ఇంకెవారికైనా ఈ కుట్రలో భాగం ఉందా ?
అసలు వాస్తవాలు ఏంటో తర్వాతి భాగాలలో వెలికి తీద్దాం !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: