Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
27-02-2026, 06:43 PM
(This post was last modified: 24-04-2026, 08:47 AM by k3vv3. Edited 8 times in total. Edited 8 times in total.)
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 1
శ్రీ తాత మోహనకృష్ణ గారి ధారావాహిక
అది విశాలమైన విశాఖ సాగర తీరం. అక్కడే ఉన్న కాలేజీ లోనే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. వంశీ చాలా తెలివైనవాడు. ఎప్పుడు చదువు పైనే ధ్యాస ఉండేది. ఎప్పుడు మంచి మార్కులే వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఆడవారితో అసలు మాట్లాడే వాడు కాదు.
వంశీ చదువుతున్న కాలేజీ.. చాలా పేరున్న కాలేజీ. సిటీ లో ఉన్న వాటిల్లో చాలా పేరున్న కాలేజీ. ఐదంస్తుల పెద్ద భవనం. అన్నీ సౌకర్యాలు ఉన్న కాలేజీ అది.
ఎవరికీ ఏ కాలేజీ లో సీటు ఎందుకు రాసిపెట్టి ఉన్నదో ఎవరికి తెలుసు.
"ఏవండీ! మన అబ్బాయి బాగా చదువుతున్నాడు. పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతాడేమో.. "
"మన అబ్బాయిని కంప్యూటర్స్ లో బాగా చదివిస్తాను పద్మ! ఇప్పుడు కంప్యూటర్స్ కు బాగా డిమాండ్ ఉంది.. "
"ఏమండీ! ఇంకో విషయం.. ఇంట్లో ఫోన్ లేకపోతే ఎలా చెప్పండి.. అబ్బాయి పెద్దవాడు అయ్యాడు కదా.. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ కాస్త పెట్టించండి.. దేనికైనా ఉపయోగ పడుతుంది.. "
"అలాగే పద్మ.. !"
"ఆ డబ్బా టీవీ ఎప్పుడూ రిపేర్ వస్తుంది.. దానిని కాస్త బాగు చేయించండి. కేబుల్ వాడు ఇచ్చే ఆ నాలుగు ఛానల్స్ అయినా చూడాలి కదా.. ఇంతకుముందు ఒక్క దూరదర్శన్ ఒక్కటే ఉండేది.. మేడ మీదకు పోయి ఎప్పుడూ ఆ యాంటెన్నా తిప్పుకుంటూ, వచ్చే ఆ ఒక్క ఛానల్ చూసేవాళ్ళం. వారానికి వచ్చే ఆ ఒక్క తెలుగు సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళం కదండీ! ఇప్పుడు కొత్తగా ఈ కేబుల్ టీవీ రావడం.. రోజుకు రెండు సినిమాలు వస్తున్నాయి. ఆ టీవీ కి రిమోట్ కుడా లేదు. ఒక వెయ్యి కడితే.. రిమోట్ పెడతారంట.. అది కుడా పెట్టించండి.
పద్మ అండ్ పద్మానాభం ది ప్రేమ వివాహం. అందుకే.. ప్రేమ పెళ్ళికి ఎప్పుడూ వారు అడ్డు చెప్పేవారు కాదు. పద్మనాభం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఉదయం వెళ్లడం.. సాయంత్రం ఇంటికి రావడం.. మొత్తం ఇల్లంతా మేనేజ్ చేసేది పెళ్ళాం పద్మ మాత్రమే. ఇంటికి వచ్చిన భర్త అలా.. టీవీ పెట్టుకుని కుర్చీ లో కూర్చోవడం.. లేకపోతే న్యూస్ పేపర్ చదువుకోవడం. అప్పట్లో గవర్నమెంట్ జాబ్ అంటే, పిలిచి పిల్లని ఇచ్చేవారు. అలా.. పద్మనాభం కి పద్మని ఇచ్చి పెళ్ళి చేసారు. ఇంతా చేస్తే, ఇద్దరు కాలేజీ లో క్లాసుమేట్స్. బాగా పరిచయం ఇద్దరికీ. అదే వారి ప్రేమ వివాహానికి దారి తీసింది.
పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు. భర్త ఇంటి పనిలో సాయం చెయ్యక పోయినా.. తానే అన్ని పనులు చేసుకుంటూ.. సంసారం నెట్టుకుంటూ వస్తుంది. సరుకులు తెచ్చుకోవడం దగ్గర నుంచి.. ఇంట్లో వంట పని.. అన్నీ తానే చేసేది. వంశీ పుట్టినప్పటి నుంచి కాలేజ్ కు తీసుకుని వెళ్లడం.. అన్నీ తానే చుసుకునేది. అత్తగారు ఉన్నా.. ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. అత్తగారికి సేవలు చెయ్యడం ఒక పని అయిపోయింది పద్మ కు.
వంశీ కాలేజీ లో చేరిన తర్వాత.. టీనేజ్ భావాలకు లోనై, అమ్మాయిలతో మాట్లాడాలని అనిపించేది. ప్రేమంటే అసలు నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు వంశీ సెకండ్ ఇయర్ లోకి వచ్చాడు. అలాంటి సందర్భంలో.. డిగ్రీ మొదటి సంవత్సరం అమ్మాయిలు కాలేజీ కు రావడం జరిగింది. అందులో అతనికి నచ్చిన ఊహా సుందరి కనిపించింది. చూసిన మొదటి చూపు లోనే నచ్చేసింది. రేయి పగలు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయితో ఎలాగైనా స్నేహం చెయ్యాలని.. ఎంతో మాట్లాడాలని అనిపించేది. వంశీ తగిన టైం కోసం ఎదురు చూస్తున్నాడు.
వంశీ కి ఫ్రెండ్స్ కుడా చాలా తక్కువే. ఎప్పుడు ఫ్రెండ్స్ తో అమ్మాయిల విషయాలు ఏమి చెప్పేవాడు కాదు..
మర్నాడు, ఆ అమ్మాయిని తన ఫ్రెండ్స్ తో బస్టాప్ లో చూసాడు. ఆ మనోహర రూపం, అందమైన ఆమె చిరునవ్వు.. అతని మనసుని కట్టేసింది. ఆమె పై చెప్పలేని ప్రేమ, అభిమానం పుట్టించింది. కాలేజీ లో సీనియర్ స్టూడెంట్స్.. జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చెయ్యడం కామన్ అయిపోయింది. వెల్కమ్ పార్టీ అయ్యే వరకు సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేస్తారు.
వంశీ ఇప్పుడు సెకండ్ ఇయర్ సీనియర్ కావడం చేత.. ర్యాగింగ్ చెయ్యడం ఇష్టం లేకపోయినా.. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ని పరిచయం చేసుకోవడానికి అదే మంచి మార్గం అని అనిపించింది. సీనియర్ స్టూడెంట్స్ అందరూ ర్యాగింగ్ చెయ్యడం మొదలు పెట్టారు. తనకీ మంచి అవకాశం కలిసొచ్చింది.. ర్యాగింగ్ వరమిచ్చింది. ర్యాగింగ్ ని అవకాశంగా తీసుకుని.. బస్ స్టాప్ లో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. మనసార ఆమె పేరు కనుక్కుని.. తనని పరిచయం చేసుకున్నాడు. ఈ లోపు ఎన్నడు టైం కు రాని బస్సు రానే వచ్చింది. ఆ అమ్మాయి కాస్త బస్సు ఎక్కి వెళ్లిపోయింది. అబ్బాయి మనసు విలపించింది. ఆ అమ్మాయి పేరు చెప్పినప్పుడు వంశీ ఆనందానికి హద్దులు లేవు. ఇలా రోజూ ర్యాగింగ్ చెయ్యడం.. ఆ అమ్మాయికి తొందరగా దగ్గర అయ్యాడు వంశీ..
మర్నాడు కాలేజీ లో జూనియర్స్ కు వెల్కమ్ పార్టీ ఉంది. దానికి ఆ అమ్మాయి వస్తుందని తెలుసు. ఎంతో దర్జాగా డ్రెస్ చేసుకుని, ఆనందంగా ప్రేయసి చిరునవ్వే హారతిగా తలచుకుని.. పార్టీ కి వచ్చాడు. కానీ, విధి ఎంత విచిత్రమైనది. వంశీ కుర్చున్న చాలా వరుసల ముందు ఎక్కడో ఆమె కూర్చొని వుంది. తళ తళ లాడే ముఖ వచ్చస్సు తో, అప్పుడే విచ్చిన కలువ లాగ మెరిసే ఆమె అందం.. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆ పంజాబీ డ్రెస్. ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అమ్మాయిల దగ్గరకు వెళ్ళడానికి అసలు లేదు.
కొంతసేపటికి ఆ అమ్మాయి మళ్ళీ కనిపించలేదు. ఈ అందాన్ని మొత్తం అంతా వెతికాడు మన వంశీ. పార్టీ లాస్ట్ లో ఆ అమ్మాయి కనిపించింది. అంత మంది జనాలలో.. ఆమెను కనులారా చూసి.. మాట్లాడే అవకాశం లేకపోయింది. ఇంటికి చేరిన వంశీ విలపించిన తీరు చెప్పలేనిది.
మర్నాడు కాలేజీ లో ఆ అమ్మాయి వచ్చే టైం కు బయల్దేరాడు వంశీ. బస్సు దిగి కాలేజీ వైపు పరుగులు తీస్తున్నాడు. బస్ స్టాప్ కి, కాలేజీ కి ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది. అప్పుడు కనిపించింది ఆ అమ్మాయి. తన ఫ్రెండ్స్ తో ముందు నడుస్తోంది. వంశీ ఆ అమ్మాయి పక్కకు వెళ్లి అందరికీ 'హాయ్' చెప్పాడు.
"నీ పేరు తెలుసుకున్నాను లే స్వాతి! నా పేరు తెలుసా?" అని అడిగాడు
"గుర్తు లేదు.. " అని చెప్పింది
"నా పేరు వంశీ.. గుర్తు పెట్టుకో.. " అన్నాడు వంశీ..
మర్నాటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. రోజూ ప్రేమతో పలకరించుకుంటూ.. మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. స్నేహానికి పునాది పడింది. ఈ తరుణంలో కాలేజీ కు ఒక నెల రోజులు సెలవులిచ్చారు. కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అవకపోవడం చేత.. కంప్యూటర్ ల్యాబ్ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. ప్రాక్టీసు చేసుకోవల్సిన వారు ల్యాబ్ స్లాట్ బుక్ చేసుకుని.. వెళ్ళచ్చు. నెలలో మొత్తం అన్నీ స్లాట్లు ఇద్దరూ బుక్ చేసుకున్నారు. సెలవుల్లో కలుసుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదని అనుకున్నాడు వంశీ..
మొదటి రోజు ల్యాబ్ లో కలిసినప్పుడు.. విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన వంశీ కు జీవితాంతం గుర్తుండి పోయే విషయం. అదే రోజు వంశీ కన్నా, స్వాతి ముందుగా వచ్చి ల్యాబ్ బయట నిల్చొని ఉంది. వంశీ మెట్లు ఎక్కి వచ్చేసరికి స్వాతి తన అందమైన చిరునవ్వుతో " హాయ్.. వంశీ" అని అంది.
"హాయ్ స్వాతి!.. ఎప్పుడు వచ్చావు.. ?" అని వంశీ అడిగాడు
"ఇప్పుడే వచ్చాను.. "
"బయట ఉన్నావేమిటి.. ?"
"పవర్ లేదు.. లోపల గాలి లేదు.. " అంది స్వాతి
ఐనా.. వంశీ లోపలికి వెళ్దామంటే, ఇద్దరు లోపలికి వెళ్లారు. స్వాతి పక్కనే వంశీ కూర్చొని ఉన్నాడు. ఇద్దరికీ స్నేహం ఉన్నా, ఒకరి పర్సనల్ విషయాలు ఒకరికి తెలియవు. లోపల వెలుతురు తక్కువుగా ఉన్నా.. స్వాతి ముఖంలో వెలుగు.. రూమ్ కి మరింత వెలుగు తెచ్చింది.
"మీ ఇంటి పేరేమిటి.. ?" అడిగింది స్వాతి
"వంశీ తన బుక్ మీద రాసి చూపించాడు.. "
"ఓకే.. గ్రేట్.. "
"ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది.. ?" అడిగింది స్వాతి
" డిస్టింక్షన్ వచ్చింది.. "
"నాకైతే చూడు.. సెకండ్ క్లాసు వస్తుందేమో.. " అని మూతి తిప్పుతూ.. అంది స్వాతి
"జోకులు వద్దు స్వాతి!"
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 2
"జోకులు కాదు.. నేను నీ అంత తెలివైన దానిని కాదు. ఏదో అలా చదువుతాను అంతే!" అంది స్వాతి.
"పవర్ ఎలాగో లేదు. ఇంకా కాసేపు మాట్లాడొచ్చు కదా స్వాతి.. ఇంతకి మీ ఇంట్లో వారి గురించి చెప్పనే లేదు.. !" అన్నాడు వంశీ.
"మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్నగారు బిజినెస్ చేస్తారు. ఎప్పుడు చాలా బిజీ గానే ఉంటారు.. నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మా ఇంట్లో మా నాన్న మాట అందరూ వినాల్సిందే.. ”
ఇలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇంతలో పవర్ వచ్చింది. కంప్యూటర్ ల్యాబ్ లో వర్క్ చేసారు ఇద్దరు. వంశీ సీనియర్ అవడం చేత.. స్వాతి తనకున్న డౌట్స్ అన్నీ అడిగింది. వంశీ అన్ని విధాల సహాయం చేసాడు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదని వంశీకి తెలుసు.
ఇలాగే రోజులు గడుస్తున్నాయి. క్లాసులు అయిపోయిన తర్వాత, బస్సు స్టేషన్ లో చాలా సరదాగా మాట్లడుకునే వారు. కంప్యూటర్ ల్యాబ్ కు అనుకోకుండా వారం సెలవిచ్చారు. వారం రోజుల పాటు స్వాతి ని చూడకుండా వంశీ ఉండాలి. ల్యాండ్ ఫోనులో మాట్లాడాలి అంటే రిస్క్ అని.. స్వాతి నెంబర్ ఇవ్వలేదు. అందులో స్వాతి వాళ్ళ నాన్నగారికి ఇలాంటివంటే అసలు ఇష్టం ఉండదు.
ఈ టైం లో స్వాతి ఏం చేస్తుందో అని వంశీ ప్రతి రోజు ఆలోచించేవాడు.. స్వాతి కి ఇష్టమైన బెండకాయ కూర చెయ్యమని వంశీ అమ్మతో చెప్పేవాడు. వంశీ బెండకాయ కూర ఇష్టం లేకపోయినా.. ఇష్టం చేసుకున్నాడు. స్వాతి కి బ్లాకు కలర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.. అందుకే ఎప్పుడు బ్లాకు జీన్స్ వేసుకునేవాడు వంశీ..
సెలవులు అయిన తర్వాత.. మర్నాడు నీట్ గా డ్రెస్ చేసుకుని వంశీ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ తన అందాల రాణి ఇంకా రాలేదు. స్వాతి ఫ్రెండ్ కనిపించింది. స్వాతి ఎక్కడని ఆ అమ్మాయిని అడిగాడు. తనకి జ్వరమని, అందుకే కాలేజీ కి వాళ్ళ మమ్మీ పంపలేదని చెప్పింది. పది రోజుల వరకు స్వాతి కాలేజీకి రాలేదు. వచ్చిన వెంటనే విషయం తెలిసి చాలా బాధపడ్డాడు.
"హాయ్ స్వాతి! నువ్వు ఇన్ని రోజులు కాలేజీ కు రాలేదు.. నాకు ఏమి తోచలేదు. నీ ఫోన్ నెంబర్ కుడా నువ్వు ఇవ్వలేదు. నాకు ఫోన్ లో మాట్లాడడానికి లేదు"
"అబ్బాయిలు ఫోన్ చేస్తే, ఇంట్లో తిడతారు.. అందుకే ఇవ్వలేదు.. " అంది స్వాతి.
"ఇంతకీ నీ జ్వరం తగ్గిందా.. ?"
"మలేరియా ఫీవర్ అంట.. చాలా టైం పట్టింది తగ్గడానికి.. ఇప్పుడు ఇంకా చాలా నీరసంగా ఉంది.. క్లాసులు మిస్ అవుతానని వచ్చేసాను.. "
"నువ్వు ఏం కంగారు పడకు స్వాతి! నేను నువ్వు మిస్ అయిన క్లాసులు అన్నీ చెబుతాను.. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నన్ను అడుగు.. "
"ఓకే వంశీ!.. నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుంటాను.. ఏమైనా డౌట్స్ ఉంటే, అడుగుతాను"
మర్నాడు కాలేజీ కి వచ్చిన స్వాతి.. వంశీ కోసం 'ఫైవ్ స్టార్' చాక్లేట్ కొన్నది. అది వంశీ కి ఇచ్చింది. దాన్ని వంశీ తినకుండా అలానే దాచుకున్నాడు. ఎంత భద్రంగా దాచాడంటే, లోపల పదార్ధం అంతా పోయినా.. కవర్ మాత్రం రోజు చూస్తూ మురిసిపోయేవాడు. ఇది వంశీ మనసు లోపల ఉన్న తన ప్రేమ కు నిదర్శనం. ప్రతిరోజూ దానిని చూసుకుంటూ, దానిలో స్వాతి రూపాన్ని ఉహించుకుంటూ.. మురిసిపోయేవాడు పిచ్చి వంశీ..
ఒకసారి కాలేజీ కి వెళ్ళడానికి ఇద్దరు బస్ స్టాప్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకే బస్సు ఎక్కారు. బస్సు డ్రైవర్, కండక్టర్ టీ తాగుతున్నారు. వంశీ స్వాతి పక్కన వెళ్లి కూర్చున్నాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు..
"స్వాతి! నీకు ఏ చాక్లేట్ అంటే ఇష్టం.. ?" అని అడిగాడు.
"కిట్ కాట్ " అంది స్వాతి.
పక్కన ఉన్న స్వాతి చాలా దగ్గరగా.. ఇలా మాట్లాడుతుంటే, మనసులో ఎంతో ఆనందం ఉన్నా.. డ్రైవర్ ఇంకో వంద కప్పుల టీ తాగి వస్తే.. బాగున్ను అనుకున్నాడు వంశీ. కానీ.. డ్రైవర్ వెంటనే వచ్చేసాడు. బస్సు స్టార్ట్ చేసాడు డ్రైవర్. చుట్టూ ఉన్న జనాలు ఆనందంతో ఉన్నారు.. వాళ్ళ గమ్యానికి డ్రైవర్ శ్రీకారం చుడుతున్నందుకు. కానీ వంశీ కు మాత్రం ఆనందం లేదు. ఎంత సేపు చూసినా తనివి తీరని స్వాతి రూపం.. కొద్ది నిమిషాలలో దూరం కానుంది. ఒక్క నిమిషం స్వాతి దూరం అయినా.. ఏదో లాగ ఉండేది వంశీ కి. కొంత సేపటికి కాలేజీ స్టాప్ వచ్చింది. వంశీ వెనుక నుంచి.. స్వాతి ముందు నుంచి బస్ దిగారు.
ఆ సమయంలో ఆకుపచ్చ చిలక లాగ.. ఆమె బస్సు దిగుతుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు. వంశీ స్వాతి ని ముందు నడవమని.. పక్కన ఉన్న షాప్ కు వెళ్లి కిట్ కాట్ కొని తెచ్చాడు. కాలేజీ కి వెళ్ళగానే, స్వాతి కిచ్చి 'బై' చెప్పాడు. కిట్ కాట్ అందిచేటప్పుడు ఆమె చేతి వేళ్ళు తనకి తాకినప్పుడు వంశీ కి మల్లెపూలు తాకిన భావన కలిగింది.
"ఇప్పుడెందుకు ఇది వంశీ.. ?”
"నీకు ఇష్టమని చెప్పవు కదా.. తీసుకో.. "
స్వాతి దానిని తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో వేసేసింది. ఇద్దరు ల్యాబ్ లోకి అడుగు పెట్టారు. కొత్త జంట మొదటసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు గా.. దిష్టి, హారతి తక్కువగా తోచాయి వంశీకు. స్వాతి కి 'బై' చెప్పి.. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు వంశీ..
వంశీ స్వాతి ఆనందంగా ఉండడం చూసి.. తాను కుడా ఎంతో సంతోషపడేవాడు. కొన్ని రోజుల కిందట స్వాతి గుర్తుకొచ్చింది వంశీ కి..
****
స్వాతి పరిచయమైన కొత్తలో.. ఒక రోజు.. ఎంతో దీనంగా.. కంట్లో నీళ్ళు నింపుకుని.. వంశీకి కనిపించింది. అమాయకంగా ఉండి.. కాంతి తో ప్రకాశించే ఆమె కళ్ళలో నీరు చూసి వంశీ చాలా బాధ పడ్డాడు.
"ఏమిటి విషయం స్వాతి.. !.. "
స్వాతి ఏమీ మాట్లాడకుండా.. సమాధానం చెప్పకుండా.. వెళ్లిపోయింది. మళ్ళీ.. కొన్ని గంటల వరకు వంశీని కలవలేదు. ఆ తర్వాత గంటలో కలిసింది. వంశీ ఎంతో రిలీఫ్ పొందాడు.
"వంశీ! నాకు ఒక అబ్బాయి లవ్ లెటర్ రాసాడు. నాకు చాలా భయంగా ఉంది.. ! మా ఇంట్లో ఇలాంటివి అసలు నచ్చవు. మా నాన్నకు తెలిసిందంటే, చాలా ప్రమాదం.. "
ఇది విని.. వంశీ షాక్ అయ్యాడు. "ఇదిగో లెటర్.. " అని వంశీ కి ఇచ్చింది స్వాతి. అందులో అంతా కోడ్ లెటర్స్ లో రాసి ఉంది. కొంతవరకు 'ఐ లవ్ యు' అనే అనిపించింది. ఆ అబ్బాయంటే స్వాతి కి ఇష్టం లేదని తెలిసింది వంశీ కి.
"స్వాతి! నువ్వు ఇలా భయపడకూడదు. అందంగా ఉన్న అమ్మాయిలకి ఇటువంటి లెటర్స్ రావడం కామన్. వీటిని పట్టించుకోవద్దు.. నీకు నచ్చకపోతే, వెళ్లి ఆ అబ్బాయికి చెప్పు.. అంతే!” అని చెప్పాడు వంశీ.
"నేను అంత అందంగా ఉంటానా వంశీ.. ?" అడిగింది స్వాతి.
"నీకు ఏం తక్కువ స్వాతి! చాలా బాగుంటావు.. నీ డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా బాగుంటుంది.. "
తన మాటలకు ఆమె బాగా స్పందించిందని.. ఆ లెటర్ ని తిడుతూ ఆ అబ్బాయికి ఇస్తునప్పుడు తెలిసింది.. వంశీ కి..
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 3
వంశీ బీచ్ కు వెళ్ళినప్పుడల్లా.. "నా మీద ఆమె కు ఏ అభిప్రాయం ఉందో నని తెగ ఆలోచించేవాడు. ఉదయించే సూర్యుడిలా ఆమె ను ఉదయం చూసేవాడు..మళ్ళీ అస్తమించే సుర్యుడిలా సాయంత్రం వంశీ కళ్ళ ముందే అస్తమించేది. స్వాతి ఏ రంగు డ్రెస్ వేస్తే, అ డ్రెస్ కే అందం వచ్చేది. నలుపు, ఆకుపచ్చ రంగులలో ఆమె నిజంగా అప్సరసే అని చెప్పాలి. ఎంతో నెమ్మదైనా మనసు, అమాయకంగా చూసే ఆ చూపు, భూమి ని ముద్దాడి నడిచే ఆ హంస నడక.. వంశీ కు బాగా నచ్చిన విషయాలు.
ఒక రోజు బస్ స్టాప్ లో ఆమెను కలసినప్పుడు 'హాయ్' చెప్పగానే స్వాతి చిరునవ్వుతో పలకరించి తరువాత..
"వంశీ..నన్ను కొంత మంది కామెంట్ చేసారు" అని చెప్పింది. ఆశ చాక్లెట్ కొనడానికి వెళ్తే, ఆశ ఆశ అని ఏడిపించారని చెప్పింది. వాళ్ళు అక్కడ లేకపోయేసరికి...పట్టించుకోవద్దని చెప్పాడు వంశీ.
ఇలాగ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎప్పుడు తన ప్రేమ విషయం చెబుదామన్నా..ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు..ఒకవేళ వారి స్నేహం చెడిపోతే..వంశీ భరించలేడు. టైం వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాడు..
ఒకరోజు స్వాతి చాలా డల్ గా ఉండడం చూసి "ఏమైంది స్వాతి! ఏమైనా ప్రాబ్లం..? నువ్వు అలా ఉంటే..చూడడానికి బాగుండదు. ఎప్పుడు నవుతూ ఉంటే, చాలా బాగుంటావు.." అని వంశీ అన్నాడు..
ఈలోపు స్వాతి ఫ్రెండ్స్ అక్కడకి వచ్చారు. అప్పుడు వంశీ.." మీ ఫ్రెండ్స్ ని ఎప్పుడు నాకు పరిచయం చెయ్యలేదు స్వాతి..ఇప్పుడైనా చేస్తావా..?"
స్వాతి ఫ్రెండ్స్ ఎప్పుడు తనతోనే ఉంటారు. స్నేహ...అండ్ లైలా..కాలేజీ లో ఎక్కువ అందరూ కలిసే బయటకు వెళ్తారు. బర్త్ డే పార్టీలు... అన్నీ కలిసే చేసుకుంటారు.
స్వాతి తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది వంశీ కి...
"స్నేహ..ఇది నా కాలేజ్ ఫ్రెండ్. నాలాగ కాదు వంశీ..చాలా గడుసుది తెలుసా? ఇంకా ఇది..లైలా..ఇది చూడడానికే చాలా సైలెంట్ గా ఉంటుంది. కాని లోపల చాలా ఆలోచనలు దీనికి..."
వంశీ..అందరితోను కలిసిపోయేవాడు. ఎవరికి డౌట్స్ ఉన్నా..క్లియర్ చేసేవాడు. హెల్ప్ చేసేవాడు. స్వాతి అంటే ఎక్కడో సాఫ్ట్ కార్నెర్ మాత్రం ఉంది తనకి...
ఒకసారి కాలేజీ లో పిక్నిక్ ఏర్పాటు చేసారు. అందరూ పిక్నిక్ కు పేర్లు ఇచ్చారు. స్వాతి మాత్రం పేరు ఇవ్వలేదు.
"స్వాతి! కాలేజీ పిక్నిక్ కు రావట్లేదా..?"
"లేదు వంశీ..మా ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు..."
"ఎందుకు...?"
"మా ఫ్రెండ్స్ ఎవరూ రావట్లేదు..అందుకే.."
"ఎందుకు రావట్లేదు..."
"స్నేహ ఏమో తన బావ తో ఏదో ట్రిప్ ప్లాన్ చేసిందంట..లైలా ఏమో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని రాదంట..మా ఫ్రెండ్స్ రాకపోతే, నన్ను బయటకు పంపరు మా డాడీ..ఏం చెయ్యమంటావు..?"
"మీ ఫ్రెండ్స్ ని ఒకసారి పిలువు...మాట్లాడాలి.." అన్నాడు వంశీ
"వంశీ..! పిలిచావంటా..." అంది స్నేహ..
"ఏమిటి పిక్నిక్ కు రావట్లేదా..?"
"లేదు.. రావట్లేదు.."
"కాలేజీ లో పిక్నిక్ కు ఇయర్ కి ఒక్కసారే ఉంటుంది. పాపం చూడు.. మీ వల్ల స్వాతి కుడా రాలేకపోతుంది. మీ వల్ల తన ఎంజాయ్ చెయ్యలేకపోతుంది.."
"నిజమే...కానీ మా బావ..తో నేను ట్రిప్ కి వెళ్తున్నాను..."
"మీ బావ తో ట్రిప్ తర్వాత పెట్టుకో...లైలా, నువ్వు మీ ఇంట్ల ఫంక్షన్ తర్వాత పెట్టుకో..అంతే..!"
"నీకు నా బావ గురించి.. నా గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు వంశీ..?"
"నాకు నా బావంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇద్దరమూ కలిసి పెరిగాము. నేను పుట్టిన తర్వాత నుంచే బావ కు పెళ్ళాన్ని అని ఫిక్స్ అయిపోయారు ఇంట్లో అంతా..పెరిగిన తర్వాత నేను కుడా బావను చాలా ఇష్టపడ్డాను. బావకు కుడా నేనంటే చాలా ఇష్టం. నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళి చేద్దామని ఇంట్లో అన్నారు. మా బావ ఎప్పుడో మంచి జాబ్ లో సెటిల్ అయ్యాడు. మంచి జాబ్, శాలరీ. నా కోసమే..వెయిట్ చేసున్నాడు. మా బావ తలచుకుంటే, నా కన్నా మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని చేసుకోగలడు. కానీ, నేనంటే ఇష్టం కనుక.. వెయిట్ చేస్తున్నాడు. అలాంటి బావ ట్రిప్ కి పిలిస్తే, నేను వెళ్ళకపోతే ఎలా..?
మా బావ.. నేను..ఉహ తెలిసినప్పటినుంచి లవ్ లో ఉన్నాము. ప్రతి వాలెంటైన్స్ డే కి నాకు ప్రపోజ్ చేస్తాడు. షాపింగ్ కి కలిసే వెళ్తాము. నేను కుడా నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్ళి కి రెడీ గానే ఉన్నాను. త్వరలో మా ఎంగేజ్మెంట్ ఉంది. నేను నా బావ తో నా లైఫ్ ని చాలా గొప్పగా ఉహించుకున్నాను..ఈ పిక్నిక్ లు ఈవన్నీ నాకు ఎక్కువ ఏమీ కాదు.."
"అయినా లవ్ చేస్తేనే..తెలుస్తుంది ఆ ఫీలింగ్..లేకపోతే ఎలా తెలుస్తుంది?" అని అంది వంశీ తో..
"నిన్ను హర్ట్ చేసి ఉంటే, 'ఐ యాం సారీ'..అయినా ఎవరు ఎప్పుడు లవ్ లో పడతారో ఎవరు చెప్పగలరు చెప్పు? నేను అంటున్నది ఏమిటంటే, నెక్స్ట్ వీక్ మీ బావతో ట్రిప్ కి వెళ్ళొచ్చు కదా అని..నీ లవ్ ని నేను తక్కువ చెయ్యట్లేదు.." అన్నాడు వంశీ
"ఓకే...అలాగే..మా బావ తో చెప్పి.. నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో వంశీ, నాకు కొంచం కొంచం తెలుస్తున్నాది" అంది స్నేహ
"లైలా! నువ్వూ స్వాతి చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ కదా..స్నేహ నువ్వు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కదా...మీరందరూ తనతో పిక్నిక్ వస్తే, స్వాతి చాలా హ్యాపీ అవుతుంది.."
"వంశీ! మా కజిన్ సిస్టర్ బర్త్డే ఫంక్షన్ ఉంది..నేను ట్రై చేస్తాను..మా కజిన్ సిస్టర్ నేను చాలా క్లోజ్.."
"బర్త్డే ఫంక్షన్ కి రాత్రి వెళ్లి విష్ చెయ్యచు లైలా...నువ్వు పిక్నిక్ కి రావాలి.."
"అంతగా చెబుతున్నావు..వస్తాను వంశీ.." అంది లైలా..
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 4
“ఈ డిస్కషన్స్ అన్నీ వదిలేయండి. పిక్నిక్ కు ఇంకా చాలా టైం ఉంది.. దాని కన్నా ముందు స్వాతి బర్త్ డే వస్తుంది.. దానికి ప్లాన్ చెయ్యండి..”
స్వాతి బర్త్డే పార్టీ అంటే వంశీ కు పెద్ద పండుగే మరి. ఎప్పుడు ఆ రోజు వస్తుందో అని వేచి చూసాడు. తన కోసం ఒక గిఫ్ట్ కొని ఉంచాడు. ఫ్రెండ్స్ అందరూ రాత్రి విషెస్ చేస్తారని తెలుసు. అందరికన్నా తానే ముందు విష్ చెయ్యాలని ఒక మంచి కార్డు కొని.. ముందుగానే పోస్ట్ చేసాడు.
బర్త్ డే రోజు.. స్వాతి కాలేజీ లో కొత్త డ్రెస్ లో మెరిసిపోతుంది. లంగా వోణి లో అదిరిపోయింది.. గ్రీన్ కలర్ వోణి లో నిజంగానే చాలా బాగుంది. మార్నింగ్, అందరికన్నా ముందుగా తనకి విష్ చెయ్యాలని.. బస్ స్టాప్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం స్వాతి అక్కడకు వచ్చింది. దూరం నుంచి స్వాతి నవ్వుతు 'హాయ్' చెప్పింది..
"డ్రెస్ సూపర్.. " అని సైగ చేసాడు వంశీ. దగ్గరకు వెళ్లి.. విష్ చేసి.. “గిఫ్ట్ ఇచ్చాను.. "
"థాంక్స్.. " అని చెప్పింది..
"ఏమిటి ఈరోజు ప్లాన్స్.. ?" అని అడిగాడు వంశీ.
"మా ఫ్రెండ్స్ తో సాయంత్రం బయటకు వెళ్తాను.. "
"ఎక్కడికో తెలుసుకోవచ్చా.. ?"
"అలా సరదాగా.. వెళ్తాము.. పార్టీ అడిగారు.. నువ్వు కుడా తప్పకుండా రావాలి వంశీ.. "
"అలాగే స్వాతి.. సరే.. నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా.. "
సాయంత్రం పార్టీ కోసం స్వాతి ఒక బేకరీ లో అందరిని కలిసింది. ఆ రోజు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు.. కేకు కటింగ్ లో ఫస్ట్ పీస్ వంశీ కే తినిపించింది స్వాతి. ఆ రోజు చాలా హ్యాపీ గా గడచింది వంశీ కు..
ఆ రోజు రాత్రి స్వాతి.. అమ్మతో మాట్లాడుతున్నప్పుడు.. ప్రేమ, పెళ్ళి గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు.. ఈ ప్రేమలు అంటే.. ఇంట్లో నాన్నగారికి ఇష్టంలేదని టాపిక్ వచ్చింది..
"అమ్మా!.. ఏమిటమ్మా! ప్రేమిస్తే తప్పా.. ఎప్పుడూ నాన్న ఎందుకు ప్రేమంటే కోపంగా ఉంటారు.. ?"
"ప్రేమించడం తప్పు కాదు స్వాతి.. "
"మరి నాన్న కు ఎప్పుడూ భయపడుతూనే ఉండాలా అమ్మా!.. ?"
“మీ నాన్న ఎందుకు ప్రేమ అంటే అంత ద్వేషిస్తున్నారో నీకు తేలియదు. ఇప్పుడు ఇలాగ ఉన్నారే గానీ.. మీ నాన్న అందరిలాగా చాలా సాఫ్ట్ మనిషి. కాలేజీ రోజుల్లో మీ నాన్న కు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసారు. ఎవరి ప్రేమను ఆయన ఓకే చెయ్యలేదు. మీ నాన్న కాలేజ్ లో ఫస్ట్, కాలేజీ లో ఫస్ట్ గా ఉండేవారు. అతని తెలివితేటలు చూసి.. అమ్మాయిలంతా ఆయనతో స్నేహం చెయ్యాలని కోరుకునే వారు. కానీ, మీ నాన్న అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ కి, ప్రేమ కి 'నో' అనేవారు. దానికి కారణం తెలియాలంటే, నీకు మీ అత్త గురించి తెలియాలి స్వాతి..”
"నాకు ఒక అత్త కుడా ఉందా.. ?" అడిగింది స్వాతి.
"ఉండేది.. ఇప్పుడు లేదు స్వాతి.. "
"ఏమైంది.. అత్తకి.. ?"
"మీ అత్త చనిపోయింది.. "
"ఎలా?"
మీ అత్త అంటే, మీ నాన్న కు చాలా ఇష్టం. చెల్లి అంటే ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి మీ అత్త.. కాలేజీ లో చదువుతున్నప్పుడు తన క్లాసు మేట్ ని ప్రేమించింది. ప్రేమించిన విషయం చెబితే.. ఎక్కడ ఇంట్లో తిడతారో అని.. చెప్పలేదు. ఒక రోజు.. మీ అత్త కి కొన్ని అబ్బాయిల ఫోటోలు చూపించి, ఎవరు నచ్చరో మీ తాతగారు అడిగారు. ఏం చెప్పాలో తెలియని మీ అత్త.. ఏమి చెప్పలేక.. తర్వాత చెబుతానని చెప్పింది.
ఒకరోజు మీ అత్త ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. అందరూ ఇల్లంతా వెతికారు. కానీ ఎక్కడ కనిపించలేదు. కొన్ని రోజుల వరకూ చాలా చోట్ల వెతికించారు. కానీ, మీ అత్త జాడ ఎక్కడ తెలియలేదు. ఎక్కడున్నా.. హ్యాపీ గా ఉండే ఉంటుందనుకుని ఇంక వెతికే ప్రయత్నాలు చెయ్యలేదు.
చాలా రోజుల తర్వాత ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది మీ అత్త రాసింది. తన కోసం వెతకొద్దని.. తను హాపీ గానే ఉన్నానని చెప్పింది. అందరూ ఆ రోజు కోపంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం అందరూ మర్చిపోయారు.
కొన్ని రోజుల తర్వాత, ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు. ఏమిటని అడిగితే, మీ అత్త సూసైడ్ చేస్కుందని చెప్పారు. ఎందుకు అంటే, భర్త తో ప్రాబ్లం అని చెప్పారు. ఆ రోజు నుంచి మీ నాన్న కి ప్రేమ అంటే ఇష్టం, నమ్మకం పోయాయి. అప్పటినుంచీ.. మీ నాన్న ఇలా ఉన్నారు.
కాలేజీ లో ఎంత మంది ప్రపోజ్ చేసిన 'నో' అనేసారు. చాలా మంది అమ్మాయిలు తమని పెళ్ళి చేసుకోకపోతే, సూసైడ్ చేసుకుంటామని అన్నా.. మీ నాన్న కేర్ చెయ్యలేదు. తర్వాత నన్ను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. నేనూ.. మీ నాన్న చాలా హ్యాపీ గానే ఉన్నాము.
ఇప్పుడు నువ్వు ప్రేమించినా.. మీ నాన్న అసలు ఒప్పుకోరు. అర్ధం చేసుకో స్వాతి..
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 5
"నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి.అదే మీ పెదనాన్నగారు రవి గురించి. మీ పెదనాన్నగారిదీ లవ్ ఫెయిల్యూరే.అతనికి కూడా మీ నాన్న లాగే ప్రేమ అంటే చాలా ద్వేషం..." అంది తల్లి.
"అయితే, పెదనాన్నకు కుడా ఒక లవ్ స్టొరీ ఉందా..?"
"మీ నాన్న మా పెళ్ళైన కొత్తలో నాతో ఆ లవ్ స్టొరీ చెప్పారు..కావాలంటే నీకు చెబుతాను.."
"చెప్పు..వింటాను.."
కాలేజీ లో మీ పెదనాన్నగారు రవి,రమ అనే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ప్రతిరోజూ రవి, రమను కలవసాగాడు. వారిద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. ప్రేమిస్తున్న విషయాన్ని రవి రమతో సమయం వచ్చేవరకు చెప్పకూడదని భావించాడు. రమకు రవి పైన మంచి అభిప్రాయమే. మంచివాడని, బాగా చదువుతాడని గొప్ప నమ్మకం.
ఒకనాడు ఇద్దరూ కాలేజీ లో మాట్లాడుతుండగా,వారిద్దరిని రమ చిన్నాన్న చూసారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడం, తద్వారా రమ, నాన్నగారి చేత తిట్లు తినాల్సి వచ్చింది. నాన్నగారంటే రమకు చాలా భయం. ఈ విషయం అంతటితో ఆపక, లేని పోనివన్నీ ఉహించుకుని,రమను వేరొక ఊరికి పంపించి చదివించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రమ నాన్నగారికి ఈ ప్రేమలు అంటే నమ్మకం లేదు..పైగా అసహ్యం కూడా. ఒక ఆడ, మగ కలిసి మాట్లాడుకోవడం కూడా నచ్చదు.
జరిగిన సంఘటన తలచుకుంటూ రమ బాగా కృంగిపోయింది. రమ మొదటి నుంచి అమాయకురాలే కాదు, భయస్తురాలు కుడా. మానసిక బాధతో జ్వరం తెచ్చుకుంది. వారం రోజుల వరకు కాలేజీ ముఖం చూడలేదు. ఇన్నిరోజులు రమను చూడకుండా ఉండలేని రవి, ఎలాగైనా తనని కలవాలని రమ ఇంటికి వెళ్ళాడు. ఎవరూ చూడకుండా రమ గదిలోకి చేరుకున్నాడు. అది గమనించిన రమ, తలుపు తీసి, అలా వచ్చినందుకు రవిని తిట్టింది.
ఇద్దరూ బయటకు వస్తున్నప్పుడు రమ నాన్నగారు చూసి,చెలరేగిన కోపంతో రవిని కొట్టించారు.
మర్నాడు హాస్పిటల్ లో ఉన్న రవిని చూడడానికి రమ వచ్చింది. రవికి చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందంలో తన బాధను కూడా మర్చిపోయాడు. ఒంటి నిండా దెబ్బలు చూడగానే, రమకు కంట్లో నీరు తిరిగింది. రవి ఆమెను ఓదారుస్తూ,సరదాగా మాట్లాడాడు. "నేను ప్రేమిస్తున్నాను" అని తన మనసులో ఉన్న ప్రేమను రవి బయట పెట్టాడు. రవి అంటే కుడా రమకు ఇష్టమే. తన కోసం ఇన్ని బాధలు పడుతున్న రవి కి దగ్గరవ్వాలంటే, ఇంట్లో నుండి పారిపోవడమో,లేకపోతే ఇంట్లో తెలియకుండా పెళ్ళి చేసుకోవడమో చెయ్యాలి. పోనీ, ఇంట్లో ఒప్పిద్దామా అంటే, రమకు నాన్నగారిని ఒప్పించడం అంటే,ఆ బ్రహ్మకు కుడా సాధ్యం కాదని తెలుసు. అందుకే, రవికి బదులు చెప్పకుండా వెళ్లిపోయింది. నిజానికి, రమ కుడా ప్రేమ విషయం చెప్పడానికే రవి దగ్గరకు వచ్చింది.
మర్నాడు రమ ఊరికి బయల్దేరవలసి వచ్చింది. ఎప్పటిలాగే రవి రమ కోసం కాలేజీ లో ఎదురు చూస్తున్నాడు. రమ బస్సు సాయంత్రం బయల్దేరుతుంది. రవిని కలిసే అవకాశం ఉంది. కానీ ఒక పక్క తండ్రి మాట కాదనలేక, మరో పక్క తల్లిదండ్రులను విడచి లేచిపోవడం ఇష్టంలేక, రవిని ఇక బాధపెట్టడం ఇష్టం లేక, బయట చదవటం ఇష్టం లేకపోయినా,తల ఊపేసింది. ఒక పక్క రమ పిరికితనం బయటపడింది.
కొన్ని రోజుల తర్వాత రవికి, రమ ఊరు విడచి వెళ్లిపోయిందని తెలుస్తుంది. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లినందుకు, రవి చాలా బాధ పడ్డాడు. ఇంట్లో కాదనలేక వెళ్ళింది కానీ, తనంటే ఇష్టంలేక కాదని రవికి తెలుసు. ఏ ఊరు వెళ్లిందో తెలియకుండా చేశారు ఇంట్లో. ఎంత ప్రయత్నించినా, రమ అడ్రస్ దొరకలేదు. ఎప్పటికైనా వస్తుందేమోనని ఎదురు చూసాడు రవి. ఆ నిరీక్షణలో చదువు మీద ధ్యాస తగ్గింది. ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. రవి చదువును ఎలాగో నెట్టుకుని వచ్చాడు. ఇంట్లోవాళ్ళ, కొడుకు పెద్దచదువులు చదువుతాడన్న ఆశలు కల్లలైనాయి. పక్క ఊరిలో ఒక చిన్న జాబ్ లో చేరాడు రవి.
కొత్తగా వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవడానికి మేనేజర్ని కలవడానికి వెళ్ళాడు రవి. ఊహించని విధంగా అక్కడ రమను చూసాడు. నుదిటి మీద బొట్టు లేదు. ముఖం కళాహీనంగా ఉంది. చిరునవ్వుతో రమను పలకరించాడు రవి. రమ మాత్రం కంట్లో కన్నీటితో తన కథ మొత్తం చెప్పింది.
తనని చదివించడానికి కాకినాడ పంపించారని, ఒక ధనవంతునితో పెళ్లి చేశారని చెప్పింది. సంవత్సరం తిరగకుండానే,భర్త మరణించడంతో, రమ జీవితంలో అంతవరకు ఆనందం లేకపోగా విషాదం మటుకు చేరుకుంది. రమ భర్తకు లేని పాడుఅలవాటు అంటూ లేదు. ఎన్నడూ భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోలేదు. అటు ప్రేమించిన వాడిని దూరం చేసుకుని,ఇటు తన భర్తతో సుఖపడక, నరకయాతన అనుభవించింది రమ.
కథ వినగానే, రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలా బాధపడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా రమపై తనకి ఇంకా ప్రేమ, అభిమానాలు అలాగే ఉన్నాయి. ఏమాత్రం తగ్గలేదు. ధైర్యం చేసి,తనని పెళ్లి చేసుకుంటానని రమని అడిగేశాడు రవి. రవి ప్రేమించింది తన మనసునే కానీ, రమ గత జీవితంతో తనకి సంబంధం లేదని చెప్పాడు.
రమకు ఇప్పుడు అడ్డు చెప్పడానికి వాళ్ళ నాన్నగారు కూడా లేరు. రెండు నెలల క్రితమే తన కూతురు జీవితం ఇలా అయ్యిందని,మంచం పట్టి చనిపోయారు. రమ తాను రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపించలేదు. రవి ఇక అక్కడ పని చెయ్యలేక ఉద్యోగం వదిలి వచ్చేసాడు.
"మనింట్లో అందరూ "నేను ప్రేమిస్తున్నాను" అన్నారన్నమాట.." అంది స్వాతి.
మర్నాడు కాలేజీ బస్ స్టాప్ లో స్వాతి క్లోజ్ గా వంశీతో మాట్లాడడం, వాళ్ళ పెదనాన్నగారు చూసారు. ఆ విషయం ఇంట్లో చెప్పడం స్వాతి విన్నది.
"వంశీ! మొన్న మనం బస్ స్టాప్ లో మాట్లాడుకోవడం ఇంట్లో తెలిసింది. నాకు చాలా భయంగా ఉంది.." అంది స్వాతి.
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 6
[font=var(--ricos-font-family,unset)] [/font]
"ఇంతకీ మనల్ని బస్సు స్టాప్ లో ఎవరు చూసారో చెప్పనే లేదు.. ?"
"నిన్న బస్టాప్ లో మనం మాట్లాడుకోవడం మా పెదనాన్నగారు చూసి మా ఇంట్లో చెప్పారు. మా డాడీ ఊళ్ళో లేరు. అతనికి తెలిస్తే.. ఏం చేస్తారో అని భయంగా ఉంది. మా డాడీ కి ఇలాంటివి నచ్చవు.. "
"ఎందుకు అంత భయపడతావు స్వాతి.. ! ధైర్యంగా ఉండాలి.. "
"వంశీ! ఎన్నాళ్ళ నుంచో నీకొక విషయం చెబుదామని అనుకుంటున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. 'నేను ప్రేమిస్తున్నాను.. ' అని చెప్పి.. కౌగలించుకుని ఏడ్చింది. తన మనసులో ఉన్న టెన్షన్ ఇన్నాళ్లకు వీడిందని ఆనందపడ్డారు వంశీ. తాను కూడా మెల్లగా స్వాతి ని కౌగలించుకుని, మొదటసారి ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
"నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను స్వాతి.. నీ తోడు నాకు జీవితాంతం కావాలి.. నువ్వు తోడుంటే, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాను. నువ్వు నా జీవితం లోకి వస్తే, నేను చాలా లక్కీ అవుతాను.. "
ఆ రోజు రాత్రి వంశీ కి.. నిద్రపట్టలేదు. ఉదయం జరిగిన విషయాన్ని తలుచుకుంటే.. ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు. వెంటనే స్వాతి ని కలవాలనిపించింది. టైం చూస్తే, రాత్రి పదకుండు. బయటకు వెళ్తున్నవంశీ ని తల్లి ఎక్కడికని అడిగితే.. ఫ్రెండ్ దగ్గర కంప్యూటర్ నోట్స్ తెచ్చుకోవాలని చెప్పాడు.
తన బైక్ తీసి.. స్వాతి ఇంటికి బయల్దేరాడు. జనాలు లేని రోడ్ పై యాభై కి మించి స్పీడ్ లో దూసుకుపోయాడు వంశీ..
స్వాతి ఇంటికి చేరుకున్న వంశీ.. గేట్ దగ్గర బండి ఆపాడు. ఇంటి గేట్ మీద నుంచి మెల్లగా దూకి.. పైప్ సహాయం తో మేడ మీదకు చేరుకున్నాడు. వేసవికాలం కావడం చేత, కిటికీ తలుపులు తెరిచే ఉంచారు. కిటికీ లోంచి స్వాతి ని చూసాడు. నైటీ లో ఆమె అందం వర్ణించలేనిది. అందమైన పాదాలు, అటు ఇటు కదులుతున్నప్పుడు సవ్వడి చేసే పట్టీలు, చంద్రబింబం వలే ప్రకాశించే మోము, చక్కటి సౌందర్యం.. వంశీ మనసున అలజడి రేపాయి.
కిటికీ శబ్దం చేసి.. స్వాతి ని పిలిచాడు. స్వాతి నిద్ర లేచి.. కంగారు పడుతూ తలుపు తీసింది.
"వంశీ! ఇంత రాత్రి వేళ ఏంటి ఇక్కడ? ఎవరైనా.. చూసారంటే, ఏమవుతుంది.. ?"
"నిన్ను చూడాలనిపించింది.. వచ్చేసాను.. అంతే!"
"డాడీ కనుక లేచారంటే.. కొంప మునుగుతుంది.. "
"భయపడుతున్నావా.. ? డాడీ ఊరిలో లేరని చెప్పావు కదా! స్వాతి.. "
"నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అలా చెప్పను.. బాగానే రియాక్ట్ అయ్యావు.. డాడీ ఇంట్లో లేరంటే, ఇంటికి వచ్చేయ్యడమే.. ?"
"చిలిపి.." అని స్వాతి బుగ్గను గిల్లాడు వంశీ..
"స్వాతి! చాలా ఆకలి వేస్తుంది. నీ గురించే ఆలోచిస్తూ, భోజనం కుడా సరిగ్గా చెయ్యలేదు తెలుసా? గదిలో ఏమైనా తినడానికి ఉన్నాయ్యా.. ? నీ బ్యాగ్ తీసుకురా.. అందులో ఏమైనా ఉంటాయేమో.. "
వంశీ.. స్వాతి బ్యాగ్ తీసి, అందులో చూస్తే, తను ఇచ్చిన కిట్ కాట్ ఫ్యాక్టరీ ఉంది లోపల..
"నేను రోజూ ఇస్తున్న చాక్లెట్ తినట్లేదా.. ?
"దాచుకుని.. తింటాను.. కావాలంటే, నువ్వు కుడా తిను.. " అంది స్వాతి.
"చాక్లెట్ ఓపెన్ చేసి.. తినిపించు స్వాతి.. "
అలా వంశీ.. తన తలను స్వాతి వొడిలో పెట్టుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ముద్దు పెట్టుకోవాలనిపించినా.. ఎందుకో భయపడ్డాడు వంశీ. మెత్తటి ఆమె వొడిలో తలవాల్చి వంశీ.. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ.. మాట్లాడుతుంటే.. టైం తెలియలేదు. ఇద్దరు ప్రేమలోకం లో తేలియాడారు.
మర్నాడు కాలేజీ అయిపోయిన తర్వాత.. పార్క్ లో కలిసినప్పుడు స్వాతి తో వంశీ సరదాగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాత్రం సీరియస్ గా ఉంది. వంశీ అడిగితే కథ అంతా చెప్పింది స్వాతి..
వాళ్ళ డాడీ కి పెదనాన్నగారి ద్వారా మన విషయం తెలిసి.. తనని తిట్టారని, కొట్టారని చెప్పింది. ఇంకోసారి నీతో తిరిగితే తనని చంపేస్తానన్నారు. స్వాతి తన డ్రెస్ టాప్ కున్న జిప్ కిందకు దించి.. నున్నటి తన వీపు మీద దెబ్బలు చూపించింది. దెబ్బలు చూడగానే, వంశీ చాలా బాధపడ్డాడు. చాలా కోపం వచ్చింది. ఇంకో సారి మళ్ళీ ఇలాగ కలిస్తే, నిన్ను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారని చెప్పింది. వంశీ.. స్వాతి ని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అప్పుడే అనుకోకుండా.. ఆమె ను కిస్ చేసాడు.
"వంశీ.. ! నీ అంత ధైర్యం నాకు లేదు.. మా నాన్నతో నేను ఎదిరించలేను. ఏమైనా తేడా వస్తే, మా నాన్న నిన్ను కుడా వదలరు. నా వలన నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అసలే మా ఫ్యామిలీ లో మా అత్త కు జరిగిన దారుణం మా నాన్న జీవితం లో మర్చిపోరు. అలాగే.. మా పెదనాన్న తనను అమ్మాయి మోసం చేసిందన్న బాధా పోదు.. "
"ప్రేమ కోసం ఈవన్నీ తప్పవు స్వాతి.. "
"వంశీ.. నువ్వు బాగా చదువుతావు.. బాగా ఆలోచించు.. నా గురించి అలోచించి నీ జీవితం నాశనం చేసుకోకు.. "
"అంతా మర్చిపో.. అంతా బాగానే జరుగుతుంది.. బై స్వాతి.. " అన్నాడు వంశీ.
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 7
పిక్నిక్ కి వెళ్ళే రోజు వచ్చింది. అందరూ పిక్నిక్కి కాలేజీ బస్సు లో బయల్దేరారు. కాలేజీ లో సైన్సు స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్.. స్టాఫ్ అందరూ ఒక చోట కలిసారు. మొత్తం కాలేజీ అంతా పిక్నిక్ కు రెడీ అయ్యింది.
కాలేజీ లో ఉదయం ఆర్ట్స్ సెక్షన్స్ కి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి సైన్సు క్లాసులు స్టార్ట్ అవుతాయి. వంశీ, స్వాతి, ఫ్రెండ్స్ అందరూ సైన్సు గ్రూప్. పిక్నిక్ రోజు బస్సు లో స్వాతి పక్కన కూర్చోవాలని వంశీ అనుకున్నాడు. దాని కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టడానికి వారిని ఏదో గేమ్ లో బిజీ చేసాడు. ఇప్పుడు స్వాతి పక్క సీట్ ఖాళీ గానే ఉంది.
స్వాతి పక్కనే నిల్చున్న వంశీ.. ఆమె సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కొంతసేపటికి.. బస్సు స్టార్ట్ అయింది.. ఆ జర్క్ కి వంశీ పడబోతుంటే, ఆమె పట్టుకుని.. తన పక్క కూర్చోమంది. తన చేతి తో వంశీ చేయి పట్టుకున్నప్పుడు కలిగిన ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఆమె పక్కనే కూర్చున్న వంశీ అలా మాటలు కలిపాడు. బస్సు లో మిగిలిన వాళ్ళంతా.. ఎవరి హడావిడి లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాటలు పాడుతుంటే, మరి కొందరు చుట్టూ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పిక్నిక్ స్పాట్ కాలేజీ కి చాలా దూరం.. చాలా సేపు జర్నీ తర్వాత.. పిక్నిక్ స్పాట్ కు చేరుకున్నారు.
అక్కడ అందరూ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి వెళ్లారు. స్వాతి తన ఫ్రెండ్స్ తో కూర్చొని ఉంది.. వంశీ బ్రేక్ ఫాస్ట్ వేరే తన ఫ్రెండ్స్ తో చేస్తున్నాడు. స్వాతి వంశీ కు సైగ చేసి తమ తో జాయిన్ అవమని అంది. సిగ్నల్ అందిన వెంటనే, వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు వంశీ. అలా బ్రేక్ ఫాస్ట్ అయిన తరవాత అందరూ వాటర్ లో ఆడదానికి వెళ్లి ఎంజాయ్ చేసారు.
వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి స్లిప్ అయ్యి వాటర్ లో పడిపోయింది. హెల్ప్ అని అరుస్తుంటే, వెంటనే అక్కడ ఉన్న వంశీ.. తన ఫ్రెండ్స్ తో కలిసి.. ఆ అమ్మాయిని కాపాడారు. అమ్మాయిని ఒడ్డుకు తీసుకుని వచ్చి.. వంశీ ఫస్ట్ ఎయిడ్ చేసాడు.
"మీ పేరు ఏమిటి.. ?" అడిగాడు వంశీ.
"నా పేరు లక్ష్మి.. "
"కాలేజీ లో ఎప్పుడూ చూడలేదే.. ఏ సెక్షన్.. ?"
"నేను ఆర్ట్స్ సెక్షన్.. మార్నింగ్ కాలేజీ.. "
"ఓకే.. లక్ష్మి.. టేక్ కేర్.. " అని చెప్పి వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుంచి.. లక్ష్మి దృష్టిలో వంశీ ఒక హీరో..
పిక్నిక్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత.. సాయంత్రం అందరూ రిటర్న్ బయల్దేరారు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి ఆగిపోయింది. చెక్ చేసి, రిపేర్ కి ఎక్కువ సేపు పడుతుందని చెప్పడంతో.. అందరూ అక్కడే నైట్ స్టే చేయాల్సి వచ్చింది. చుట్టూ పక్కల అంతా అడవే.. ఏమి లేవు.. బాయ్స్ అందరికీ టెంట్స్ ఏర్పాటు చేయాల్సింది గా టీచర్స్ ఆర్డర్ వేసారు. వంశీ.. ఫ్రెండ్స్ అంతా కలిసి టెంట్స్ ఏర్పాటు చేసారు. తినడానికి స్నాక్స్ కుడా టౌన్ నుంచి తెచ్చారు. అన్నీటికీ వంశీ చేసిన హెల్ప్ కి అందరూ మెచ్చుకున్నారు.
ఇంత హెల్ప్ చేసిన వంశీ ని చూసిన లక్ష్మి, వంశీ లవ్ లో పడిపోయింది. బస్సు రిపేర్ అయ్యాక.. రాత్రి స్టార్ట్ అయ్యింది. అందరూ ఊపిరి పిల్చుకున్నారు. అందరూ ఇంటికి వెళ్లారు.
మర్నాడు కాలేజీ లో..
"స్వాతి! లైలా! ఒక గుడ్ న్యూస్.. నా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసారు.. నెక్స్ట్ వీక్ లోనే నా మ్యారేజ్.. అందరూ తప్పకుండా నా పెళ్ళికి రావాలి.. ఇంతకీ వంశీ ఎక్కడ.. ?" అంది స్నేహ.
"ఇంకా రాలేదు.. ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట.. బిజీ గా ఉన్నాడు.. "
"ఉండు.. నేను వెళ్లి పిలుస్తాను.. "
"వంశీ.. ! బిజీ గా ఉన్నావా.. ?"
"చెప్పు స్నేహ"
"నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది.. నువ్వు తప్పకుండా రావాలి అని కార్డు ఇచ్చింది.. ఐ విల్ బి వెయిటింగ్.."
"సరే.. స్నేహ.. "
మ్యారేజ్ రోజు ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ గా స్నేహ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు.. హడావిడంతా ఫ్రెండ్స్ దే ఆ రోజు. అందంగా అలంకరించిన కళ్యాణ మండపం.. ఫ్రెండ్స్, బంధువులతో చాలా హడావిడిగా ఉంది. స్నేహ తను ఎప్పటినుంచి కలలుకంటున్నా తన బావ తో పెళ్ళి చేసుకుంది. ఈవెనింగ్ రిసెప్షన్ లో అందరూ బాగా ఎంజాయ్ చేసారు..
"చూసావా స్వాతి! స్నేహ ఎంత ఆనందంగా ఉందో? లవ్ మ్యారేజ్ లో ఎంతో సంతోషం ఉంటుందంటే ఏమో అనుకున్నా.. చూస్తుంటే తెలుస్తుంది.. నచ్చిన మనిషి కోసం వెయిట్ చేసి.. పెళ్ళి చేసుకోవడం లో ఉన్న ఆ ఆనందమే వేరు.. "
"ఏమో వంశీ! అందరికి ఆ అదృష్టం ఉండొద్దు.. వాళ్ళ పేరెంట్స్ తన లవ్ కి ఎప్పుడో 'ఎస్' చెప్పారు.. అందరి పేరెంట్స్ అలా ఉండాలని ఏముంది చెప్పు.."
"ఇంతకీ మీ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్.. వంశీ?"
"లవ్ మ్యారేజ్ లాంటిదే.. మా పేరెంట్స్ కుడా కాలేజీ లో ఫ్రెండ్స్.. పెళ్ళి చూపులలో ఆ విషయం ఇద్దరికీ తెలిసింది.. "
"అయితే నువ్వు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటే, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారేమో.. !"
"ఒప్పుకున్నా.. లేకపోయినా.. మనకి కావాల్సిన లైఫ్ పార్టనర్ కోసం మనమే ఒప్పించాలి.. లేకపోతే పోరాడి సాధించాలి.. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి స్వాతి.. "
అంతా విన్న స్వాతి.. ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది..
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 8
పిక్నిక్ లో మనసు పారేసుకున్న లక్ష్మి.. అదే పనిగా వంశీ గురించి ఆలోచిస్తూనే వుంది.. క్లాసు లో టీచర్ చెప్పిన పాఠాలు ఏమీ మైండ్ కి ఎక్కట్లేదు. ఇంట్లో అమ్మ చెప్పిన పని చెయ్యట్లేదు. పడుకుంటే, నిద్ర రావట్లేదు. పోనీ, తినడానికి కూర్చుంటే, ఒక ముద్ద కూడా దిగట్లేదు. ఏమిటో ఈ ధోరణి అనుకుంది లక్ష్మి.
ఇదంతా తెలుసుకున్న తన క్లాసు మేట్ సంధ్య..
"ఏమిటి లక్ష్మి.. ! ఏమిటి ఈ ధోరణి.. సడన్ గా ఇలా అయిపోయావు.. ?"
"ఏమోనే.. ఆ రోజు పిక్నిక్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇలానే ఉంది.. "
"కొంపదీసి ప్రేమలో పడ్డవా ఏమిటి.. ?"
"ఇదేనా ప్రేమంటే.. ఇన్నాళ్ళు చదువు తప్పితే ఏమీ తెలియదు.. ఫస్ట్ టైం ఈ ఫీలింగ్స్ కలుగుతున్నాయి సంధ్య.. "
"అదేనే ప్రేమంటే లక్ష్మి.. ఎవరే ఆ లక్కీ హీరో.. ?"
"మొన్న పిక్నిక్ లో నా ప్రాణాలు రక్షించాడే.. అతనే వంశీ.. అతని స్పర్శ తగిలిన తర్వాత, నాలో ఈ ప్రేమ కలిగింది.. సంధ్య!"
"అయితే అతని దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చెయ్యలేకపోయావా.. ?"
"ఏమిటి చేసేది.. అతను నన్ను అసలు పట్టించుకోవట్లేదు.. "
"అయినా అతనిలో ఏమిటే అంతగా నచ్చింది నీకు.. ?"
"వంశీ చూడడానికి బాగుండడమే కాదే.. మంచివాడు.. సహాయం చేసే గుణం ఉన్నవాడు.. చదువులో ఎప్పుడు టాప్ లో ఉంటాడు.. "
"ఇన్ని లక్షణాలున్న అబ్బాయిని.. ఇప్పటికే ఎవరో అమ్మాయి లైన్ లో పెట్టే ఉంటుందే ఈ పాటికి.. " అంది సంధ్య.
"అలా జరగడానికి లేదు.. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నా.. నేను ఒప్పుకోను.. " అంది లక్ష్మి.
"అయితే త్వరగా నీ ప్రేమను అతనికి చెప్పు లక్ష్మి..
నువ్వేమో ఆర్ట్స్ గ్రూప్, అతను సైన్సు.. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుందే.. "
"ప్రేమకి గ్రూప్స్ తో సంబంధం ఏముందే.. చెప్పు !"
"నువ్వు మార్నింగ్ కాలేజీ కి వస్తావు.. వంశీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాడు. ఎలాగ ఇద్దరు కలిసేది.. ?"
"మనసుంటే మార్గం ఉంటుందే.. "
"అయితే, ఒక మంచి టైం చూసి.. వంశీ కు ప్రపోజ్ చెయ్యి లక్ష్మి.. "
"అలాగే! రేపు కాలేజీ అయిపోయిన తర్వాత.. మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి.. వంశీ కోసం చూస్తాను.. "
"ఆల్ ది బెస్ట్.. లక్ష్మి"
లక్ష్మి మర్నాడు వంశీ వచ్చే టైం కోసం వెయిట్ చేసింది. వంశీ కరెక్ట్ టైం కే కాలేజీ కి వచ్చాడు. లక్ష్మి ఎదురుగా వెళ్లి.. వంశీ కి 'హాయ్' చెప్పింది..
"హాయ్ వంశీ.. "
"మీరు.. ?.. ?.. ?"
"పిక్నిక్ లో నన్ను వాటర్ ఫాల్స్ దగ్గర కాపాడారు.. గుర్తొచ్చానా.. ?"
" 'ఎస్'.. మీ పేరు లక్ష్మి కదా,,,"
"ఎస్.. "
"ఎలా ఉన్నారు ఇప్పుడు.. "
"ఐ యాం ఫైన్ వంశీ.. "
"మీ క్లాసు లు అయిపోయాయి కదా.. ఇంకా ఇంటికి వెళ్ళలేదా.. ?"
"మీ కోసమే చూస్తున్నాను వంశీ.. "
"ఎందుకు. ?"
"మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి.. అలా బయటకు వస్తారా?'
"పదండి.. ఇప్పుడు.. చెప్పండి లక్ష్మి.. "
"మీరు అండి అనకండి.. 'నువ్వు' అనండి.. మీరు నా మనసుకు చాలా దగ్గర అయ్యారు.. " అంది లక్ష్మి
"అంటే.. "
"మీరు నాకు బాగా నచ్చారు.. మిమల్ని నేను ప్రేమిస్తున్నాను.. "
"మీ బదులు కోసం వెయిట్ చేస్తుంటాను.. ప్లీజ్ 'నో' అని మాత్రం అనకండి.. "
"లక్ష్మి.. ఐ యాం సారీ.. నేను ఇప్పటికే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. నేను ఇంక ఎవరినీ ఆ దృష్టితో చూడలేను.. నా మీద ఆశలు పెట్టుకోకండి.. "
"ఎవరా లక్కీ గర్ల్.. తెలుసుకోవచ్చా?"
"టైం వచ్చినప్పుడు తెలుస్తుంది.. నన్ను ఇంక ఇబ్బంది పెట్టకండి.. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి లక్ష్మి.. "
"మరి నన్ను ఎందుకు ఆ రోజు కాపాడారు?"
"మీ ప్లేస్ లో ఎవరు ఉన్నా నేను కాపాడతాను.. "
అలా చెప్పి వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
మర్నాడు మార్నింగ్ కాలేజీ లో అందరూ సీరియస్ గా ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు. వంశీ వచ్చి ఆ విషయం గురించి అడిగాడు.
"మన ఆర్ట్స్ అమ్మాయి లక్ష్మి.. నిన్న సూసైడ్ చేసుకోబోయింది.. ఇప్పుడు హాస్పిటల్ లో ఉంది.. ఏదో లవ్ మేటర్ అని అందరూ అంటున్నారు.. " అని అక్కడ అందరూ అనుకుంటున్నారు..
వంశీ గుండెలో రాయి పడినట్టు అయ్యింది.. ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది.. అందరితో పాటు హాస్పిటల్ కు వెళ్లి చూడాలని అనుకుని.. హాస్పిటల్ కు బయల్దేరాడు వంశీ. హాస్పిటల్ కి చేరుకున్న వంశీ.. డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడం విని ఊపిరి పీల్చుకున్నాడు.
"హాయ్ లక్ష్మి.. ఏమిటి ఈ పని.. ?" అడిగాడు వంశీ.
"నువ్వు నిన్న అలా అనేసరికి మనసు చాలా బాధ పడింది.. కిచెన్ లో కత్తి కనిపించగానే, చేతి పై కోసుకున్నాను.. అయినా, నా బాధ ఇంకా తగ్గలేదు.."
"నువ్వు నాకొక మాట ఇవ్వాలి లక్ష్మి.. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని.. "
"ట్రై చేస్తాను వంశీ.. "
వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..
'నిన్ను అంత ఈజీ గా వదులుకోలేను వంశీ.. చూడు ఏం చేస్తానో.. ' అని అనుకుంది లక్ష్మి..
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|