Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*** సరిత్ సాగరం ***
#1
సరిత్ సాగరం

- ఇక్కడ నేను సేకరించిన అన్ని రకాల గ్రంధాలు పంచుకుంటాను.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
శ్రీ గాయత్రీ మంత్రార్థము


[Image: sgm.jpg]

https://mega.nz/#!e2QlAI6L!My2yZm1iu-ZnN...4Pz1P1-AJU

Gayatri Mantrarthamu.pdf   2.6 MB
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#3
అమర కోశము

[Image: amk.jpg]





Amarakosamu.pdf  30.6 MB
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#4
'అమరం చదవనివానికి నే నమరను' అని సరస్వతీదేవి పరంగా వినిపించే ప్రచారమూ అమరకోశానికి ఉండే ప్రాముఖ్యం తెలియచేస్తుంది.
'అష్టాధ్యాయీ జగన్మాతా అమరకోశో జగత్పితా '

పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే.. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు 'యస్య జ్ఞాన దయాసింధో' అని గురువుగారు ప్రార్థన మొదలుపెట్టగానే 'గొడదాటితే అదే సందో' అంటూ గోడ దూకి పారిపోయేవారుట. సరదాగా అనుకునేందుకేగానీ ఈ 'అమరకోశం' ప్రథమ కాండం స్వర్గవర్గంలోని మొదటి
ప్రార్థనా శ్లోకానికి సంస్కృత వాఙ్మయంలో చాల కథే ఉంది.  
'యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః।
సేవ్యతా మక్షయో ధీరాసశ్రియైచా మృతాయ॥'
ఇదీ  శ్లోకం పూర్తి పాఠం.
'ఓ! విద్వాంసులారా  జ్ఞానానికి, దయకు  ఆశ్రయభూతుడు, గంభీరుడు దేవుడు. ఆయన గుణాలు, రాగాది దోషాలు లేని నాశనరహితుడు.  ఆ దేవుణ్ణి సంపద, మోక్షాల కోసం సేవించాలి!’ ఇది పరమాత్మ పరమైన అర్థం.

దోషరహితమైన రత్నాలకు ఆలవాలమైన అగాధం సముద్రం. విష్ణువుకు నివాసం. లక్ష్మి(సంపద) కోసం, అమృతం(చిరాయువు) కోసం సముద్రుణ్ణి సేవించాలి' అని మరో అర్థం చెప్పుకోవచ్చు. 

బౌద్ధ విశ్వాసి అమరకోశ కర్త అమరసింహుడు. హిందూవిశ్వాసుల ఇష్టదేవతలను సేవించమని  మంగళాచరణ శ్లోకం ఎందుకు పఠిస్తాడు? అనే సందేహం సహజంగానే వస్తుంది. అమరకోశానికి  వ్యాఖ్యానం రాసిన క్షీరస్వామి తన 'అమరకోశోద్ఘాటనవ్యాఖ్య'లో ఇదే శ్లోకానికి బుద్ధ పరమైన వ్యాఖ్యానం అందిస్తూ.. పై సందేహానికి సమాధానం ఇచ్చాడు. 'గ్రంథారంభేభీప్సిత సిద్ధి హేతుం జిన మనుస్మృత్య ఇత్యాది వాక్యాణి’ అన్నాడు.  బౌద్ధమంటే గిట్టని హిందూవిశ్వాసులు తన గ్రంథాన్ని దూరం పెట్టకూడదన్న ఆశతో హింధువుల ఇష్టదేవతలను ప్రార్థించాడు- అని ఆయన జవాబు. (సర్వానంద విరచిత ‘టీకాసర్వస్వవ్యాఖ్య’ వివరణలో కూడా  'బౌద్ధదర్శన విద్వేషిణి ఇహ ప్రవృత్తి ర్న స్యా దతో-త్ర బుద్ధపదోపాదానం కృతం కవినా' అన్న సమర్ధన కనపడుతుంది).

అమరసింహుడికి హిందూమతంతో ఏ సంబంధం లేదంటే నమ్మబుద్ధికాదు నిజానికి.  అమరకోశంలో ఆయన వివరించిన పదాలన్నీ ఒక నిష్ణాతుడైన హిందూపండితుడి అవగాహనకు సైతం అందనంత ఉన్నతంగా ఉండడమే అందుకు కారణం. తనతో వాదంలో ఓడిన నిస్పృహలో అమరసింహుడు స్వీయవిరచిత గ్రంథాలన్నీ పరశురామప్రీతి చేస్తున్నట్లు విని శంకరుడు ఆ ప్రయత్నం విరమింపచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిన ఈ ఓక్క అమరకోశం ప్రాశస్త్యాన్ని భగవత్పాదులే ‘అమరకోశం చాలా గొప్ప గ్రంథం. హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పేర్ల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ప్రతిపాదించింది. స్మృతులు, పురాణాలు తీరులోనే తాత్త్విక అంశాల నామధేయాలను, విషయాలను, వాటి అర్థాలను అమరకోశం ప్రతిపాదించింది' అని శ్లాఘించినట్లు ఒక కథ.
షోలాపూర్ దాస్ రావ్ జీ సఖారామ్ దోనీ తన అమరకోశం పీఠికలో  అమరసింహుడు జినుడని చాలా ఉదాహరణలతో నిరూపించే ప్రయత్నం చేసాడు. లేఖక ప్రమాదాల వల్ల సుమారు వంద శ్లోకాలు కనిపించడం లేదని.. అందులో 'యస్య జ్ఞాన..' శ్లోకానికి ముందు మరో రెండు శ్లోకాలున్నాయని వాటిని బహిరంగపరిచాడు.
'జినస్య లోకత్రయవందితస్య ప్రక్షాళయేత్ పాదసరోజయుగ్మం।

నఖప్రభాదివ్యసరిత్ప్రవాహైః సంసారపంకం మయి గాఢలగ్నమ్॥(1)

'నమః శ్రీశక్తినాథాయ కర్మారాతివినాశినే।

పంచమ శ్చక్రిణాం యస్తు కామస్తస్మై జినేశినే॥' (2).. ఇవీ ఆ రెండు విస్మృత శ్లోకాలు.
లింగయసూరి 'యస్య జ్ఞాన .. ' శ్లోకానికి దైవపరంగా వ్యాఖ్యానం చేస్తే.. మల్లినాథుదు 'సశైవానాం శివః వైష్ణవానాం విష్ణుః జైనానాం జినః బౌద్ధానాం బుద్ధ:’ అంటూ సాధారీకరణం చేసి అందరి సమస్యలు ఒక్క దెబ్బతో తీర్చేసాడు.
ఏదేమైనా
 అమరకోశం మిగతా కోశాలన్నింటికీ మార్గదర్శకంగా మిగిలింది. మరీ కావ్యాలు రాయడానికని కాదు కానీ.. హిందూ సంస్కృతి పారిభాషికా పదాలతొ పరిచయం పెంచుకుంటే సంస్కృతమే కాదు.. తెలుగు పదసంపద మీదా మరింత పట్టు పెరుగుతుందన్న మాట అతిశయోక్తి కాదు.

కాబట్టి కవి కావాలనుకున్న యువకులు మరీ గతంలోలాగా బట్టీయం వేయకపోయినా ఒకటికి పదిసార్లు  ఆ అమరకోశం పుటలు తిరగేస్తే పోయేదేమీ ఉండదు.. అజ్ఞానం తప్ప!
-కర్లపాలెం హనుమంతరావు
25 -05 -2018
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#5
సామ్రాట్ విక్రమాదిత్య

చరిత్ర తెలిస్తే మన పూర్వుల ప్రతిభ గుర్తించుతాము. నాటి ఆచార వ్యవహారాలు ఆకళింపు చేసుకోగలుగుతాము. మన దేశ ఔన్నత్యమును గ్రహించగలుగుతాము. మన భావి దిశా నిర్దేశము చేసుకోగలుగుతాము. తదుపరి తరములకు ఆ గొప్పతనాలను పంచగలుగుతాము. తప్పులెక్కడ కలిగినాయో తెలుసుకోగలుగుతాము. ఆ తప్పులు తిరిగీ చేయకుండా జాగ్రత్త పడుతాము. నీతి నియమావళి తెలుసుకొన గలుగుతాము. మన పూర్వుల ఆవిష్కరణలను తెలుసుకోగలుగుతాము. అపుడు మన మేధస్సునుపయోగించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతాము. చరిత్రను వక్రీకరించి అనేక భారతీయ చక్రవర్తులను, శాస్త్రజ్ఞులను చరిత్ర నుండి చెరిపివేసి, వారు కేవలము ఊహాజనితులని మనల నమ్మించి మనలను తప్పుదారి పట్టించిన బూటకపు చరిత్రకారుల  ఆట కట్టించగలుగుతాము. పై పెచ్చు నిరాఘాటముగా పరిపాలించిన మన రాజ చరిత్రలను తెలుసుకోగలుగుతాము. అన్నిటికీ మించి మనతో వాదమునకు దిగిన వారికి సహేతుకముగా బుద్ధి చెప్పగలుగుతాము. మరి ఇన్ని ప్రయోజనులు కలిగియున్నపుడు చరిత్రను గతము అని కొట్టివేయుట సమంజసమా! మన విద్యాలయములలోని చరిత్ర పుస్తకములలో ముస్లీములు మరియు బ్రిటీషువారిని గూర్చి తెలిపినంత ప్రముఖముగా మన రాజులు, చక్రవర్తులు, శాస్త్రజ్ఞులను గూర్చి తెలిపిన పాపమున పోయినదిలేదు. నీతి శాస్త్రము, అర్థ శాస్త్రము మరియు అఖండ భారతమును గూర్చి ఆలోచించిన మహానుభావుడగు చాణక్యుని గూర్చి ఆ గ్రంథములలోని విషయములగూర్చి మన స్వాతంత్ర్యానంతర పాలకులు మాచే చదివించిన పాపమున పోయినదిలేదు. 70 సంవత్సరముల క్రితము అట్లుంటే మరి నేటి విద్యావిదానమును గూర్చి చెప్పనే అవసరము లేదు. ఇప్పటికయినా యువత కన్ను తెరుస్తారన్న కాంక్షతో కష్టమునకోర్చి, అట్టి మహనీయులలో ఒకడైన నాటి అసమాన అప్రతిహత అవక్ర పరాక్రముడైన విక్రమార్కుని గూర్చి తెలియజేయ సాహసించుచున్నాను. ఆ మహానుభావుని గూర్చి మనకు తెలిసినది తక్కువ అనుటకంటే మనకు కుహనా చరిత్రకారులు ఆయన ఉనికినే తెలియనీయకుండా చేసినారు. ఇక లంకెతో బాటూ కళ్ళు తెరచి చదవండి.
నాటి వాస్తవమును తెలియజేసే, నేను వ్రాసిన ఈ పద్యముతో నా రచనను మీకు పరిచయం చేస్తాను.
పుట్టుకతోనె గిట్టుటయు పుట్టుక గల్గునటన్న సత్యమున్
దిట్టముగా మనంబునది దివ్య వచస్సుగ పాదుగొల్పుచున్
గట్టిగ భూమిపై యశము కప్పుర వీవెనలీన భారతిన్
పట్టముతోడ రాజులతి పట్టుగ జేసిరి రాజ్య పాలనల్ 
నాటి రాజులు ధనము కన్నా యశోధనమే గొప్పదని నమ్మినవారు. అట్టివారిలో కూడా అగ్రగణ్యులు కొందరు. వారిలో కూడా, సూర్యుడు దినకరుడైనట్లు విక్రమార్కుడు భరతభూమి యశోవిభాకరుడు. నాకు తెలిసినంత, నేను తెలుసుకోగలిగినంత,  తెలియజేయగలిగినంత ఆ మహనీయుని గూర్చితెలిపే ప్రయత్నము చేస్తాను. అసలు ఆయన అంత గొప్పవాడు కావుననే ఆయన తదనంతరము అనేక రాజులు చక్రవర్తులు ఆయన పేరును తమ బిరుదముగా తగిలించుకొన్నారు. తెలిసిన విషయముల పుష్ఠి జేయుటకు ఇటువంటి రచనల విషయములో ఎంతో శ్రమపడవలసి వస్తుంది. ఆదిలోనే దానిని అర్థము చేసుకొన్న పాఠకులు విషయమును అత్యంత శ్రద్ధతో చదువుతారని నా నమ్మకము. నేను తెలిపినది కాక మీకు తెలిసినది తెలియజేసిననూ స్వీకరించుటకు సిద్ధముగా వున్నాను.           
   విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు అంటూనే మనకు ఎన్నో కథలు, కల్పనలు గుర్తుకొస్తాయి. నేను ఆ విషయములను గూర్చి వ్రాయబోవుటలేదు.అసలు ఆ పేరుగల చక్రవర్తి ఈ దేశమును ఏలినాడా? అన్న విషయమును నాకున్న పరిధిలో వ్రాయుటకు సంకల్పించి ఈ కార్యమునకు గడంగినాను.
   తన పేరుతో విక్రమశకమే ఉన్నపుడు ఆయన ఉనికి కల్పితము అని కొట్టిపారవేయుట సమంజసమేనా! ఈ మాటను ప్రాతిపదికగా తీసుకొని కొంత తర్కము, కొంత చారిత్రిక ఆధారముల ఆలంబనతో నేను ఆశక్తుడనని తెలిసినా,  తెలిసిన మేరకయినా తెలియజేయు ఉత్సాహముతో ఈ పనికి పూనుకొన్నాను.
విక్రమార్క శకం
శకము అన్నది ఒక మహాపురుషుని గౌరవసూచకంగా ఆయనకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమయిన ఘట్టమును గ్రహించి ఆ దినము లగాయితూ ఆ మహాపురుషుని పేరుతో ఆ శకము ప్రారంభమౌతుంది. ఎవరి పేరుతో ఆ శకము ఏర్పడుతుందో వారిని శకకర్తలని, యుగపురుషులని పిలుచుట ఆనవాయితీ. శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలి ఈ భూమి మీద ప్రవేశించుటతో ధర్మరాజు తన వానప్రస్థ స్వర్గారోహణ సమయము ఆసన్నమైనదని, రాజ్యము మనవాడు అభిమాన్యునికి ఒప్పజెప్పి సతీ,సహోదర యుతుడై బయలుదేరా సమాయత్తమౌతాడు.  అప్పటినుండి యుదిష్ఠిరుని పేరున ఆ శకము గుర్తింపబడింది. తరువాత విదేశీయులగు శకులు మనదేశమునేలి వారు శకయుగములను వారివారి పాలనా కాలముననుసరించి వేరు వేరు శకయుగములను ఏర్పరచుకొన్నారు. యుధిష్ఠర శకం 3044 సంవత్సరాలు గడిచిన పిదప , ఆ తరువాత ఈ అఖండ భారత దేశాన్ని ఏకీకృతం చేసి పాలించిన రాజు విక్రమాదిత్యుడు, శకులను ఎల్లలు దాటించి అఖండ భారత సామ్రాజ్యమును విస్తరించిన  విక్రమాదిత్యుని పేరుతో విక్రమార్క శకము ఏర్పడింది. విక్రమాదిత్యుని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచిందని, వైదిక ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి సంస్కృతమును రాజ్యభాషగా గావించినాడు విక్రమాదిత్యుడు.
 पूर्णे त्रिम्श्चश्चते वर्षे कालौ प्राप्ते भयंकरे शकानांच
विनाशार्थं आर्यधर्म विवृद्धये जातः शिवाज्ञया
Bhavishya Maha Purana (3-1-7-14,15 verses)
विक्रमादित्य नामानां पिटा कृत्वा मुमोदहसबालोपि 
महाप्रजानाः पितृ मात्रु प्रियंकरः  ( Bhavishya Maha Purana 3-1-7-16)
पंचावर्षे वयः प्राप्ते तपसार्ठे वनं गतः
द्वादशाब्दाम प्रयत्नेन विक्रमेण कृतं तपः (Bhavishya 3-1-7-17)
पश्चाद्यम्बवाटिं दिव्यम्पुरिम यथाः श्रीयान्वितः दिव्यं सिम्हासनं द्वात्रिम्शन मूर्ति संयुतम्
                                       (Bhavishya 3-1-7-18)  
భవిష్యపురాణము ప్రకారము ప్రమర వంశములో శివుని ఆదేశానుగ్రహములతో పుట్టిన వాడు విక్రమాదిత్యుడు. 5 సంవత్సరముల వయసులోనే అడవులకుపోయి 12 సంవత్సరములు ఘోరతపమాచరించి పరమేశ్వరానుగ్రహమును బడసి సింహాసనమధిష్ఠించినాడు.  అతడు మ్లేచ్ఛులను తరిమికొట్టి, అమ్మవారిని ఉపాసించి (ఉజ్జయినికి పూర్వ నామమే అంబావతి)ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని రాజ్యము చేసినాడు. పార్వతిదేవి ఆదేశము మేరకు శివభూతగణములయందలి భేతాళుని విక్రమాదిత్యునికి రక్షగా ఉంచుట జరిగినది. విక్రమార్కుడు అశ్వమేధ యాగము చేసి ధర్మాన్ని సుస్థిరం చేసి సింధూనది, బదరి, కపిల రాజ్యము, సేతుబంధన(రామేశ్వరము) హద్దులుగా రాజ్యం చేసినాడని భవిష్య పురాణ వచనము. ఈశ్వర ప్రసాదిత 32 కళలున్న (సింహాసన ద్వాత్రింశిక) సింహాసనం మీద ఆసీనుడై జనరంజకంగా రాజ్యం చేసాడని ఐతీహ్యం. మహర్షుల ప్రేరణ మీద అయోధ్యను కలియుగంలో కనుగొన్నాడని చెబుతారు. ఏ ప్రదేశంలో ఆవు తనంతట తాను పాలు ధారగా కురిపిస్తుందో అదే అయోధ్యగా గుర్తేరగమని పంపగా విక్రమాదిత్యుడు నేటి అయోధ్యను కనుగొని పూజలు చేసినాడని చెబుతారు. ఈ శకం 135 సంవత్సరాలు అని అటుపై కూడా వైదీకులు ఈ శకాన్ని ప్రామాణికంగా పాటిస్తారని వుంది. (57 BCE ). ఈ విషయములన్నీ కాళీదాస విరచితమైన జ్యోతిర్విదాభరణము 22  భాగములు కలిగి 1474 శ్లోకములు కూడిన పుస్తకమున చూడవచ్చును. ఇది రాజ్యము యొక్క ఎల్లలు, పారిపాలనావిధానము రాజాస్థాన విద్వాంసులు మొదలగు విషయములనెన్నియో ఎరుక పరచుచున్నది. దీనిని 3068 కలిశకము(33 BC), వైశాఖములో మొదలుపెట్టి కార్తీకములో ముగించినట్లు తెలియజేసినాడు.
నవరత్నములు 
ఆయన కాలమును గూర్చి చర్చించుటకు ముందు విక్రముని ఆస్థాన నవరత్నముల గూర్చి, మరియు వారేమయినా తమ గ్రంధములలో ఆయన ప్రస్తాపన చేసినారా అన్న విషయమును చూతము. అసలు ఆయన ఆస్థానములోని నవరత్నములు ఎవరు అన్నమాటకు ఈ శ్లోకమును వ్రాసినదెవరో తెలియకున్నా ఇది తప్ప వేరు ఏశ్లోకము కానీ, ఆధారము కానీ లేనందువలన, మరియు ఈ శ్లోకము పండిత పామర జనుల స్మృతిలో నేటికీ మెదలుచున్నందువలన ఈ శ్లోకమును మనము గ్రహించవలసి వస్తుంది. ఆ శ్లోకమును తిలకించండి.
"శ్లో|| ధన్వంతరి, క్షపణ కామరసింహ,శంకు, బేతాళ భట్ట, ఘటఖర్ప, కాళిదాసాః|,
ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచిర్నవ విక్రమస్య|| "
అను ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని ప్రసిద్ధి చెంది ఉన్నారు. నా పరిధిలో వీరిని గూర్చి తెలియజేయుటకు ప్రయత్నిస్తాను.
1. ధన్వంతరి:
ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
ధన్వంతరులు మనకు బ్రహ్మవైవర్త, భాగవతాది పురాణాలలో కాశీ ఖండము వంటి కావ్యములలో కనిపించినా విక్రమార్కుని ఆస్థాన నవరత్నములలో ఒక యుందినమాట కాదన్నవారు కనిపించలేదు.లేదని నేను వినలేదు. పైపెచ్చు  ఈయన "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించినాడని కూడాఒక అభిప్రాయము లోకముననాడు ప్రచలితము. అసలు ఈయన విక్రమార్కుని సేనకు శస్త్ర మరియు వైద్య చికిత్స చేసేవాడని తెలియవస్తూవున్నది. ఈయన శరీరమునకు కృత్రిమాంగములు అమర్చుటలో సుప్రసిద్ధుడనికూడా తెలియవచ్చుచున్నది. మరి యుద్ధములో సేనకు ఇటువంటి వైద్యుడు అత్యవసరము కదా!
2. క్షపణకుడు:
జైన సాధువులలో ఈ పేరు కలిగినవారు అధికముగా వుంటారు.
జైనము లోని దిగంబర జైనులు నగ్న క్షపణకుడు అన్న నామముతో వ్యవహరించుతారు. అంటే విక్రముని కాలములో జైనము ప్రాచుర్యములో వున్నట్లు మనకు తెలియవస్తూవుంది. అంతేకాక ఆయన మత సహనము కూడా అర్థమౌతూ వుంది.
3. అమరసింహుడు:
అమరసింహుడు ఒక్క అమరకోశము తోనే అమరుడైనాడు. ఆయన తానూ వ్రాసిన 3 కాండల గ్రంధమునకు నామలింగానుశాసనము అని ఉంచినా ఆ నిఘంటువునకు అమరమన్న పేరే లోకమున ప్రఖ్యాతి గాంచినది. అమరము చదవని వానికి నేనమరను అన్న మాట మా కాలములో పిల్లలకు పెద్దలు చెప్పి తప్పనిసరిగా అమరమును నేర్పించేవారు. కడప రాయలు & కొ వారి సంపూర్ణ అమరకోశమునకు పండిత ప్రకాండులగు శ్రీ జనమంచి సుబ్రహ్మణ్యరావు గారు ముందుమాట వ్రాయుచు, కొందఱ మతమున క్రీస్తు శకమునకు బూర్వము విక్రమాదిత్యుడుండుటచే తత్సభారత్నముగ అమరసింహుడు కూడా ఉండుటవలన తత్కాలికుడని ఎన్నుదురు. అమర సింహుడు తన పదకొశమును యస్య జ్ఞాన దయాసింధో... అని ప్రారంభించుతాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పుకొనవలసి వస్తుంది. ఇందు ఏమతమును గానీ ఏ దైవమును గానీ పేర్కొనలేదు. తానున్నది ఒక హిందూ రాజు ఆస్థానములో! ఆ కాలమునందు జగద్గురువు శంకరులవారి ప్రభావమువల్ల జైన, బౌద్ధ మతములు కొన్ని మెట్లు దిగవలసి వచ్చింది. ఇది ఒక కారణముగా చెప్పుకోనవచ్చును. అయినా ఆయన ఆ శ్లోకమునందు నిగూఢముగా ఎవరైతే జ్ఞానమునకు, దయకు సముద్రము వంటివాడో ఎవరైతే జితేంద్రియుడో ఆయనను అంటే గౌతమ బుద్ధుని సేవించమంటున్నాడు. విక్రమార్కుని మహానీయతకు అటు జినుడగు క్షపణకుని, ఇటు బౌద్ధుడగు అమరసింహుని నవరత్నములలో స్థానమోసగి తన ఔన్నత్యమను కిరీటమునకు మరియొక మణిని పొదిగినాడు. ఒక నిఘంటువును ఛందస్సులో ఇముడ్చుటకన్న వేరు ఉత్తమోత్తమ పాండితీ ప్రకర్షను మనమెందునూ చూడలేము.
4. శంకుడు:
ఈయన నవరత్నములలో ఎంతో ప్రాధాన్యత గలిగినవాడు.ఈయనను గొప్ప విద్వాంసునిగానూ, జ్యోతిశ్శాస్త్రవేత్త గానూ చారిత్రిక గ్రంధములందు చెప్పబడినది. ఈయన ప్రాముఖ్యత విక్రముని ఆస్థానములో ఏమిటి అన్నది తెలిసివచ్చుటలేదు, కానీ కాళీదాసు వ్రాసిన జ్యోతివిదాభారణము లో ఈయన కవిగా కూడా ప్రశంశింప బడినాడు.
5. బేతాళ భట్టు:
భేతాళకథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు గుణాడ్యుడి సంకలనం ద్వారా మనకు తెలుస్తోంది. ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని పరిపాలించేవాడు. తన పరిపాలనదక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకొంటాడు విక్రమార్కుడు. శాప వశాత్తున శవమైయున్న భేతాళుని తనవద్దకు మోసుక రమ్మంటాడు ఒక మోసపు సన్యాసి, ప్రజాహితముకోరి తనను నమ్మిన విక్రమునితో! ఆ విధముగా భేతాళ కథలు మొదలై, విక్రముడు భేతాళుని మనస్సు జయించుటచే మోసగాదయినా సన్యాసిని చంపించి శాపము తీరుటచే,తాను రాజునకు ఆపదలు వచ్చినపుడు కాపాడుతూ ఆయనతో ఉండిపోతాడు. మహా పండితుడగు బ్రాహ్మణుడగుటచే భేతాళ భట్టుఅయినాడు.
6. ఘటకర్పుడు:
ఈయనను గూర్చి కూడా కొంచెమే తెలియవస్తూవున్నా ఈయన మహాకవిగా విక్రముని ఆస్థానములో గుర్తింపబడినాడు. ఈయన కవితానైపుణ్యము కాళిదాసు వలననే సిద్ధించినదని చెబుతారు. యమాకాలంకార కవిత్వములో తనను ఓడించినవాని యింట పగిలిన కుండ పెంకులతో నీరు తెచ్చి నింపుతానన్నాడట. ఎంతటి ఆత్మవిశ్వాసమో చూడండి. అందుకే ఆయన నవరత్నములలో ఒకడై ఉంటాడు.
7. కాళీదాసు:
విక్రమార్కుని నవరత్నములలో ఒకడైన ఈయన వేద, వేదాంగ, పురాణ, దర్శన, ధర్మశాస్త్ర, సంగీత, ఆయుర్వేద, జోతిష మొదలగు వివిధ శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. అందుకే ఆయన నవరత్నములలో కూడా తలమానికము. ఒక ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి యొక్క పేరును తాము కలిగియుండుట మనము నేటికినీ ఎందరిలోనో చూస్తాము. కావున ఈయనను ఇతరులు అనుకరించినారేగానీ ఈయన ఇతరులను అనుకరించలేదు. ఈయన అన్నింటా ఆద్యుడే! కావున కాలీదాసులు ఎందఱో వున్నా, విశేష ప్రఙ్ఞ కలిగిన కాళిదాసులు మనకు ముఖ్యముగా చరిత్రలో ఇద్దరే కనిపిస్తారు. ఒకరు విక్రముని ఆస్థాన నవరత్నములలో ఒకరు, ఇంకొకరు భోజుని ఆస్థాన మహా కవి పండితుడు. దండి భవభూతి ఈయన కాలము వారు. విక్రముని ఆస్థాన రత్నమగు కాళిదాసు రచించిన అనేక కావ్య నాటకములలో  విక్రమోర్వశీయము, జ్యోతిర్విదాభారణమును కూడా ఉన్నవి. జ్యోతిర్విదాభరణ రచనము కొంత వివాదమునకు హేతువై వున్నది. ఇది ఆయన వ్రాసినదేనని కొందరు పండితుల మాటైతే, అందులో వ్యాకరణ దోషములున్నాయని, అందువల్ల ఆయన వ్రాసియుండక పోవచ్చునని మరికొందరి మాట. తర్కము అన్నది 1. ప్రత్యక్ష, 2. అనుమాన,3. ఉపమాన మరియు 4. శబ్ద అన్న 4 అంగములపై ఆధారపడి వుంటుంది.
మరి తర్కము యొక్క రెండవ అంగము ప్రకారము తప్పులున్న తాళపత్రములు ప్రక్షిప్తములు కావచ్చు కదా!
ఆ గ్రంథములో వున్న అనేక విషయములు విక్రమార్కునికి సంబంధించినవి. కాదు అన్న ఒక్క మాటతో మొత్తము రచననే బేఖాతరు చేస్తే మరి విషయ సంగ్రహణ ఎక్కడనుండి చేయగలము. ఆసలు ఆయన పుట్టిన ప్రాంతమే వివాద భూయిష్టము, కాశ్మీరు, వంగదేశము, విదర్భ, మిథిల, విదిశ మొదలగు ప్రాంతములుగా వేరువేరు చారిత్రకులు తెలిపిన విషయమును నేను తెలుపుచున్నాను. 
పురా కవీనాం గణన ప్రసంగే కనిష్టికాధిష్టిత కాళిదాసా
అద్యాపి తత్తుల్య కవేరభావాదనామికా సార్థవతీ బభూవ
ఈ శ్లోకము ఎవరు చెప్పినారో తెలియని చాటువు. కానీ ఇందులోని వాస్తవముపై ఎవరికీ సందేహము లేదు. అలాగే తన రచనలలో ప్రత్యేకముగా తన కర్మ భూమియగు  ఉజ్జయినిని గూర్చిన వర్ణనలు ఆయనకు ఆ పురముపై ఎంత మక్కువ ఎక్కువ అన్న విషయము తెలుపుతుంది. అదే విధముగా విక్రముని గూర్చి ఆయన తెలిపిన అనేకములగు విషయములను అన్య రాజన్యులకు అన్వయించుట సబబా! ఆయన రచనలలో విక్రమార్క బిరుదాంకితుడగు రెండవ చంద్రగుప్తుడు అన్న పేరును గానీ విక్రమార్క బిరుదాంకితుడగు, ఆయన మనుమడు స్కందగుప్తుని పేరును గానీ ఎక్కడా చూడము. కాళిదాస కవయో నీతా విక్రమో శకారాతిన అన్న ఈ శ్లోక పాదము ప్రకారము ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన, శకులకు శత్రువగు విక్రముని ఆశ్రయమున తానున్నట్లు మనకు విదితమగుచున్నది.
8. వరాహమిహిరుడు:
వరాహమిహిరుని గూర్చి తెలుపుట సామాన్యము కాదు. కానీ నవరత్నములను గూర్చి తెలుపుతూ ఆయనను గూర్చి తెలుపక పోవుట సాధ్యము కాదు. చాలా క్లుప్తముగా ఆయనను గూర్చి తెలుపుతాను. దానికి ముందు ఉజ్జయినీ వాస్తవ్యుడు, జ్యోతిషమునందు అనన్య సామాన్య పండితుడు, ప్రభుత్వముచే పద్మభూషణ్ బిరుదాంకితుడు నగు పండిత్ సూర్యనారాయణ్ వ్యాస్, వరాహమిహిరుడు ఉజ్జయినిని ఏలిన విక్రమార్కుని ఆస్థాన నవరత్నములలో ఒకడని వక్కాణించినాడు. వ్యాస్ గారి ప్రతిభ ఎంతటిదంటే మన స్వతంత్ర భారత దేశమునకు అంటే 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి ముహూర్తము పెట్టినది ఆయన, వల్లభాయి పటేల్ మరణము 16 డిసెంబరు 1950 న జరుగుతుందని ఎంతో ముందు తెలిపినది ఆయన. లాల్ బహదూర్ రావు తాష్కెంట్ వెళ్ళుటయే గానీ తిరిగి రాడని చెప్పినదీ ఆయనే. 1990 తరువాత నుండి అభివృద్ధి చెందుతూ 2020 కల్లా భారత దేశ యశోవిభవము ఆకసమును అంటుతుందని చెప్పినవాడు ఆయన. స్వాతంత్ర్య యోధుడు, కవి, పండితుడు చరిత్రకారుడు అయినటువంటి ఈయన, వరాహమిహిరుడు ఉజ్జయిని ని రాజధానిగా చేసుకొని ఏలిన విక్రమార్కుని ఆస్థాన నవరత్నములయందొకడని నిర్దారించినాడు. కాలాంతరములో వరాహమిహిర అన్న పేరుతో ఇతర రాజులవద్ద ఎవరయినా వుండినారేమో!
ఇక వరాహ మిహిరుని విషయమునకు వస్తే ఆయన పేరు మిహిరుడేనని వరాహ అన్న పదము విక్రమార్క ధ్వజ చిహ్నమగుట చేత ఆ ధ్వజమునకు వరాహ మిహిరునికీ లంకె ఉండుటచే ఆయన వరాహమిహిరుడైనాడని ఒక సంఘటన మిక్కిలి ప్రాచుర్యములో వుంది.
వరాహ మిహిరుడు ఉజ్జయినికి దగ్గరగా వున్నా కపిత్థ అన్న ప్రాంతములో జన్మించినాడు. తన తండ్రి ఆదిత్యదాసు అని తాను రచించిన బృహజ్జాతకములో  స్వయంగా చెప్పుకొన్నాడు. ఆదిత్యదాసు అన్న పదమునకు సూర్యోపాసకుడు అన్న అన్వయమును కూడా మనము తీసుకోవచ్చు. ఆకాలములో దాసు అన్న మాటను పెరుచివర ఉపయోగించేవారా అన్నది కూడా పరిశీలించవలసిన విషయమే! తండ్రివద్దనే విద్య గరిపినట్లు కూడా ఆయన ఆ గ్రంథములో చెప్పుకొన్నాడు. అశేష పండిత్యముతో విశేష వ్యక్తిగా గుర్తింపబడి
విక్రమార్కుని ఆస్థానమున నవరత్నములలో ఒకనిగా స్థానమును సంపాదించగలిగినాడు. ఆయనకు జోతిషీ రత్నముగా ఆస్థానమున ఎంతో పేరు వుండేది. విక్రమార్కునకు పుత్రోదయము జరిగినపుడు జాతకచక్రము వ్రాయించ ఆయన మిహిరునికి ఇచ్చినాడు. ఆయన ఆపని చేయగా, రాజు జాతక ఫలితము తెలుసుకొన గోరినాడు. మిహిరుడు జాతకము పరీక్షించి ఆ బాలునికి క్రీడాసక్తత కలిగిన వయసులోనే వరాహముచే మరణించుతాడని చెప్పినాడు.
మిహిరుని మాటపై సంపూర్ణ విశ్వాసము గల్గిన విక్రముడు తన కుమారునికి ఆ వయసు రాగానే అంతఃపురములోని చివరి అంతస్తులో ఆబాలుని , అతనికి తోడుగా తనయీడు పిల్లలను జతజేసి, అన్నపానాలను అచటికే పంపు ఏర్పాటుచేసి అన్నివిధములా ఆనందముగా వుండజేసినాడు.
ఒకరోజు పిల్లలు అంతా కలిసి దాగుడు మూతలు ఆడుతూ వుండినారు. రాకుమారుడు తనను ఎవరూ కనుగొనగూదదని తలచి మాడీ పైభాగము చేరుకొన్నాడు. అచట రాజ్య దారుకధ్వజము(కొయ్య స్తంభమునకు కట్టిన జెండా) ప్రతిష్ఠింపబడి యుండినది.
ఆ స్తంభమునకు ఎమయినదో ఏమో (బహుశ పుచ్చియుండవచ్చును) విరిగి ఆ బాలునిపై పడింది. అదికూడా రాజ్య చిహ్నమగు వరాహమును కలిగిన జెండా, ఆబాలుని ముఖము కప్పివేసినది. అంతటి స్తంభము పడిన పిదప బాలుడు బ్రతుకుటెట్లు? ఆతడు వరాహ కారణముగానే మరణించినాడు. క్రింద రాజభవనములో విక్రమార్కుడు తాను బాలునికొరకు ఏర్పరచిన రక్షణ వలయమును చూపించి, మీరు చెప్పిన సమయము ముగిసినది, నేను ఏర్పరచిన రక్షణచే నాకుమారుడు వరాహము బారినుండి రక్షింపబడినాడు, అని తెలపగా మిహిరుడు ఎంతో ఆత్మవిశ్వాసముతో బాలుడు తానూ చెప్పిన సమయమునకే బాలుడు వరాహ కారణముగా మరణించి ఉంటాడు అని నొక్కి చెప్పుటతో రాజు పై అంతస్తుకు పోయి చూచి బాలుని కానక మాడీ ఉపరితలము చేరగా దుంగ మీదబడి, పతాకముచే కప్పబడిన బాలుని చూసి పరితపించినాడు కానీ మిహిరుని జోతిషీ ప్రతిభను అర్థముచేసుకొని ఆ సంఘటన జ్ఞాపకార్థము నాటినుండి మిహిరుని వరాహ మిహిరునిగా పిలువసాగినారు.
9. వరరుచి:
ఈతని నిజనామము కాత్యాయనుడు అని తెలియవస్తూ వున్నది. ఈ విషయమును 11 వ శతాబ్దములో కతాసరిత్సాగారమును ఉద్ధరించిన సోమదేవుని రచనలో మనము చూడవచ్చును. పాణిని వ్యాకరణ సూత్రములకు వార్తీకము (Commentary) వ్రాసినది యీయనే! ప్రాకృత ప్రకాశ అన్న వ్యాకరణ గ్రంథమును ఈయన ప్రాకృతమునకు వ్రాసినాడు. అదికాక ఆయన పత్ర కౌముది. ఈ కావ్యారంభాముననే ఆయన, తాను విక్రమార్కుని ఆస్థానమున ఉండినట్లు చెప్పినాడు. పైగా ఈ గ్రంధమునే గాక,విద్యాసుందర మను మరొక గ్రంధమునుగూడా విక్రమార్కుని ఆదేశానుసారముగా వ్రాసినట్లు చెప్పుకొన్నాడు.
ఇంతవరకూ నేను తెలియజేసిన విషయములు విక్రమార్కుడను చక్రవర్తి ఈ భూమిని ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని పాలించినట్లు మనకు తెలియుట లేదా! ఇక ఆయన పూర్వీకులేవారు, ఆయన ఏ కాలమువాడు అన్నది పరిశీలింతము.
ప్రమర రాజులు
ఈ దిగువన ప్రమర రాజ్య వ్యవస్థాపకుని మొదలు విక్రమార్కుని వరకూ ఆయా రాజుల పరిపాలనా కాలము ఈ దిగువన ఇవ్వబడినది.
Name of King                                       Years
Pramara (Paramar) 2710 – 2716 Kali Yuga; 392 – 386 BC
Mahamara                                       386 – 383 BC
Devapi                                           383 – 380 BC
Devdatta                                        380 – 377 BC
Sakas defeated next kings, 
who left Ujjain                                377 – 182 BC
And fled to Srisailam                                                                                                                   
Gandharvasena (1st time)                    182 – 132 BC
Sankharaja (son of Gandharvasena) 
went to forest for meditation and 
died without a child                         132 – 102 BC
Gandharvasena (2nd time) returned from exile and took over the throne again                       102 – 82 BC                                                                             
Vikramaditya (2nd son of Gandharvasena born in 101 BC i.e. 3001 kali Yuga)                          82 BC – 19 AD
మన చరిత్ర పుస్తకములలో ఈ వంశానుక్రమణిక చదవము. ఇంత నిర్దుష్టముగా ఉన్న విషయము అసంబద్ధము, అసంగతము కాలేదు కదా!
విక్రమాదిత్యుని రాజ్యపు ఎల్లలు:
పశ్చిమే సింధునద్యంతే సేతు బంధేని దక్షిణే l
ఉత్తరే బదరీస్థానే పూర్వేచ కపిలాంతికే ll
భవిష్య పురాణములోని ఈ శ్లోకము ఈవిధముగా మనకు తెలియజేయుచున్నది. పడమట సింధూ తీరము వరకు, దక్షిణమున సేతు బంధనము అనగా రామేశ్వరము వరకు తూర్పున బదరికావనము  వరకూ, ఉత్తరమున కపిలవస్తు వరకు ఈయన రాజ్యము వ్యాపించియుండెడిదట.
ముస్లీముల కాబా గా మార్చబడిన ఆ కట్టడము ఒకనాటి మఖేశ్వరాలయము. అందు గోడకు అరబ్బీ  భాషలో ' శాయర్ - ఉల్ - ఓకుల్' అంటే దాని అర్థము 'చిరఃస్మరణీయము"అని, ఒక బంగారు రేకు పై వ్రాయబడిన కవిత తగిలింపబడి ఉండెడిదట. ఇప్పటికి కూడా అది టర్కీ దేశపు రాజధానియైన  ఇస్తాంబుల్ నగరములోని 'మాక్తాబ్ -ఏ - సుల్తానియా' అన్న జగత్ప్రసిద్ద గ్రంథాలయము నందున్నదని ప్రసిద్ధ చరిత్రకారుడు P.N. ఓక్ గారు Was the Kaaba Originally a ***** Temple? అన్న  గ్రంధములో తెలిపినారు. మఖేశ్వరాలయమున ఉన్న ఆ కవిత ' అబూ అమీర్ ఆసామి' అన్న 'హారూన్-అల్-రషీద్' ఖలీఫా గారి ఆస్థాన కవీశ్వరుడు, ఇస్లాంకు ముందు వ్రాసిన కవిత్వము ఇది. తరువాత బనీ- ఉమ్- మయ్యా వంశపు అంతము వరకు, అక్కడినుండి హారూన్ గారి కాలము వరకు 3 భాగములుగా సంకలనము చేసి ఆయన తిరిగీ సంపుటీకరించినాడు. అందులోని 315 వ పుటలో ప్రమర వంశజుడైన  విక్రమాదిత్యుని గూర్చిన ప్రశంస వున్నది. ఈ 'శాయర్ - ఉల్ - ఓకుల్' కలిగియున్నది ఆ విక్రమార్కుని ప్రశంసయే! ఈ కవిత లోని భావము లోక కల్యాణమును పరమావధిగానెంచి అరబ్ దేశీయులలో భక్తీ భావమును పెంచిన విక్రమాదిత్యుని శాసన కాలములో నుండిన ప్రజలెంత అదృష్టవంతులు ' అని సాగుతుంది.    
వేదవీర్ ఆర్య గారు సాధికారికముగా రచించిన 'Chronology of ancient India ~ Victim of concoctions and distortions" చదివితే మనకు ఈ విషయము తెలియగలదు.
"ఉజ్జయిని పాలకుడగు గంధర్వసేనుని కుమారుడగు విక్రమాదిత్యుడు క్రీ.పూ. 1 శతాబ్దమునకు చెందినవాడు. నవరత్నములు ఈయన ఆస్థానము లోనివారే!. ఈనాటికీ 5 లక్షల పైచిలుకు గ్రామాలలో పాటించే విక్రం సంవత్ పంచాంగము  ఈయన కాలము నుండియే ఆరంభమైనది. ఇది ఆయన పాలనా కాలములో శకులను జయించిన పిదప క్రీ.పూ.57 న మొదలయినది.
స్వస్తి.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#6
డౌన్లోడ్ కావడం లేదు సరిత్ భయ్యా...లింక్ వేరే పెట్టగలరు.
Like Reply
#7
Nice info
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#8
sarith garu , mee vast library lo nunchi , 90s lo vachina Swathi weekly books unte share cheyagalaru....
Like Reply
#9
(05-04-2019, 07:55 PM)sarit11 Wrote:
అమర కోశము

[Image: amk.jpg]





Amarakosamu.pdf  30.6 MB

Sarit gaaru, link not working andi, please correct.  thanks
Like Reply
#10
Suryadevara rammohanrao novels petandi
Like Reply
#11
(21-05-2020, 11:38 PM)meeabhimaani Wrote: Sarit gaaru, link not working andi, please correct.  thanks

link not working
Like Reply




Users browsing this thread: 1 Guest(s)