Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అయస్కాంతాలు
#1
Read, Like, Comment your review.  Heart


Note:- ఈ కథలో ఉన్నదంతా fantasy, ఎవ్వరినీ ఉద్దేశించింది, ఎవ్వరినీ కించపరచడానికి కాదు. కథ కోసం కొన్ని నిజం location, companies, institutions ని వాడుకోవడం జరుగుతుంది. Not inspired from any incident, purely fictional.
[+] 1 user Likes ITACHI639's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
హ్మ్మ్... ! 



పేరు శశాంక్. సికంద్రాబాద్ బస్సు కరీంనగర్ బస్టాండ్ లో ఆగింది. ఇక్కడ ఐదు నిమిషాలు ఇంజన్ ఆఫ్ చేస్తాడు డ్రైవర్, నాకుడా కొకకోలా తాగి బ్లాడర్ నిండిపోయింది. అలా దిగి పోయి ఉచ్చపోసుకొని తిరిగి బస్సు ఎక్కాను. 

వెళ్ళేటప్పుడు నా నల్ల లెదర్ బ్యాగు పక్క సీటు ఖాళీగానే ఉంది కదా అని పెట్టి పోయాను. ఇప్పుడేమో నేను కూర్చున్న చోట నా బ్యాగు ఉంది, పక్కనేమో ఎవరో అమ్మాయి కురుల్లో క్లిప్పు పెట్టుకుంటుంది. 

అబ్బ నా పక్కన ఎవరో అమ్మాయి పడింది, దేవుడున్నాడు అనుకున్న.

అప్పుడే ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ముందుకి పోయి, “ కొంచెం జరగుతారా ” అని అడిగాను అమ్మాయిని. 

అప్పుడు తాను జుట్టు వెనక్కి వేసుకొని క్లిప్పు బిగించి మోకాళ్ళు పక్కకి జరుపుతూ నాకు దారిచ్చింది.

కూర్చున్న వెంటనే ఒక తాజా పెర్ఫ్యూమ్ సువాసన వచ్చింది. ఏదో నా పక్కన గులాబీ తోట కూర్చున్నట్టుగా. 

నేను అమ్మాయి వైపే మొహం తిప్పుకొని ఉన్నా మరుక్షణం తను నన్ను చూసింది. 

దయ్యం.

అవే చిన్ని మెరుపు కళ్ళు, అవే చిన్ని గులాబి పెదాలు, ముద్దొచ్చే చిట్టిచామంతి చెంపలు, నిండు పున్నమిలా కలలో వెలుగులు నింపే మొహము. తన కన్నుల మీద వాలే సిల్కు ముంగురులు అంటే ఇష్టం. 

ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ అడ్డు పడుతున్న ముంగురులు కుడి చెవి వెనక్కి తోసి, 
“ నువ్వా మబ్బుమొహంగా.... ” అని అసహ్యించుకుంది. 

అలా తిట్టడం దానికలవాటు లేండి. 

“ ఎటు పోతున్నావే దయ్యం మెహమ ”

ఇది నాకలవాటు.


ఉష్ దేవుడున్నాడు. అందుకే ఇప్పుడు ఈ నసను నాకంటగట్టాడు. దీనితో ఇంకో మూడు లేదా నాలుగు గంటలు ప్రయాణం చెయ్యాలా?

పేరు: శ్రీహిత. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం.


-

ఎండ కిటికీ నుంచి మొహం మీద పడుతుంది. బస్సు కరీంనగర్ ప్రాంగణం దాటి హైదరాబాదు హైవే ఎక్కింది. 

కొన్ని నిమిషాల ముందు, 

“ ఎటు పోతున్నావే దయ్యం మొహమ ” అని దానికి ఎదురుచెప్పగానే గుడ్లప్పగించి చూసి టక్కున ముక్కు విరుచుకొని మొహం అటు తిప్పుకుంది. 

“ నీకెందుకు చెప్పాలి. సప్పుడేక అటు చూసుకుంటా కూర్చో లేకుంటే పండు. నన్ను గెలలకు. ”

పసుపు రంగు చుడీదార్ చున్నీ మెడ వరకు కప్పుకుంది. నేనేదో అక్కడ చూస్తున్నట్టు. 

“ నేనేమి చూస్తలేను... ఓ కప్పుకోకు...” అంటూ నవ్వాను. కావాలనే తనని పొడుస్తూ. “అయినా అక్కడేమంత ఉన్నాయని... ”

ఎడమ చేత్తో నా తొడ మీద గుద్దింది.

“ ఇందుకే అటు తిరుగు అన్నాను. ” మొహం తిప్పేసుకుంది. “ పోదా నీకు ఆ నోటి దూల? ” అనడిగింది. 

“ పోయిందనే అనుకున్నాను, నువు వచ్చావు కదా, ఇక మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. ” అన్నాను.

“ ఐతే మూసుకొని కూకో. నువు కిటికీలో కనిపిస్తే అసలు బస్సే ఎక్కేదాన్ని కాదు. ”

“ అవునా... మరి దిగు. బొచ్చడి బస్సులు ఉన్నాయి బస్టాండ్ లో. ”

“ టికెట్ తీసుకున్న కదా. తప్పుద్దా? ” అని తల పట్టుకుంది. 

నేను మందహంగా తన ముడుచుకున్న గులాబీ పెదవులు చూసి తన ముద్దుతనాన్నీ చూసి నాకదో తృప్తి. 

“ అయినా బస్సు దిగి ఎటు పోయావురా? ” అంది నన్ను చూసి.

“ ఉచ్చకి పోయినా. ”

నా మీద చిరుకోపంతో, “ అస్సలు అస్సలు కొంచెం కూడా మారలేదు. చి... వాష్రూం పోయా అనొచ్చు కదా. ” 

“ నేను చేతులు కడుక్కోడానికి పోలేదే. ఉచ్చ పోసుకోడానికి పోయిన. పోసి చేతులు కడుక్కొని వచ్చిన. ”

“ ఈ.... చ...! చాలాపు. ఇల్లొదిలి చాలా రోజుల తర్వాత బయటకొస్తే నువ్వే తగలాలా నాకు. ” 

“ అంత చికాకేందుకే. సర్లే మూసుకుంటాను. ” అన్నాను కాసేపు విరామం ఇద్దాం అని. 

-

బస్సు హైవే ఎక్కింది. అలా కిటికీ లోంచి చూస్తూ కూర్చున్న. 

గాలి మా వైపు వీస్తుంటే తన కురులు  నా ముక్కు మీద ఎందుకు ఊసులాడుతున్నాయో అర్థం కాలేదు. తన సువాసన మాత్రం ఆహా... ! 

అలా అలుగునూర్ దాకా పోయినాక, ఊరుకుంటుందా మొగ ప్రాణం, తెలీకుండానే మత్తుగా తన మెడ మీద గడ్డం వాల్చేశాను. 

సట్క్ అని చెంప మీద కొట్టింది. 

ఉలిక్కిపడి చుట్టూ చూసాను ఎవరైనా చూసారా అని, అందరూ మొహాలు ఫోనులో పెట్టేసారు. 

ఏం బతుకు ఐపోయింది, స్మార్ట్ఫోనులు వచ్చాక పక్కకి ఉన్న వాళ్ళతో మాటలే కరువయ్యాయి. ఎక్కడ ఏమి జరుగుతుందో ముచ్చటలో తెలీకుండా కథలకు కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి అసలు.

ఉష్... చిన్న కళ్ళు ఒకేసారి పెద్దగా ఎలా అవుతాయో తనవి. నా ముక్కు పచ్చడి చేసేలా చూస్తుంది. 

నేను తుంటరిగా, “ ఆడవాసన చూసి చాలా రోజులైందే ” అన్నాను పల్లెక్కిస్తూ. 

మళ్ళీ మొహం మీద చిన్నగా ఒక్కటి పీకింది. “ నీ మబ్బుమోహానికి అదొక్కటే తక్కువ. ” అని జుట్టు సరిచేసుకుంది. 

బస్సులో మంది ఉంటారు కదా, కెమెరా మాత్రం మా ఇద్దరి మీదే ఉండేంటి అనుకుంటున్నారా? 
భూమ్మీద ఎనిమిది వందల కోట్ల జనం ఉన్నారు, వాళ్ళందరి గురించీ పట్టించుకుంటామా. ఇదీ అంతే. 


పసుపు రంగు చుడిదార్, ఎర్రని సన్నగాజులూ, చిన్న టిక్లీ, చిన్న నెమలి ఆకారం స్టోన్ కమ్మలు, అవన్నీ నాకిష్టం. 

మా ఇంటర్ మొదటి ఏడాది, బతుకమ్మ పండక్కి కరీంనగర్ మార్కెట్, ఎస్... బీ... ఐ... బ్యాంకు దగ్గర బండీల మీద అమ్మే జూలరీ, చూసి నచ్చాయంటే నా దగ్గరున్న రెండు వందలూ పెట్టి కొనిచ్చాను. ఇంకా అవి పెట్టుకుంటుంది. అవి ఇష్టం కానీ నేను కాదు. 

నన్ను చూస్తూ కళ్ళెగరేసింది. మొహం అడ్డంగా ఊపి ఏం లేదని ఊరుకున్నాను.

“ బాగున్నానా ” అనడిగింది నా భుజం దువ్వుతూ. 

“ ఎప్పుడూ అలాగే ఉంటావులే దయ్యం ” అన్నాను నాలో నెను నవ్వుకుంటూ. 

మోకాళ్ళు నాదిక్కు తిప్పి, “ ఇంటర్ అయిపోయినప్పుడు పోయావు కరీంనగర్ వదిలి మీ వూరికి. మళ్ళీ ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలేం చేసావు? ” అని ప్రశ్నేసింది. 

తన మోకాళ్ళనే చూస్తూ, “ డిగ్రీ హైదరాబాద్ ఉస్మానియాలో చేసాను. ” 

చిన్నగా, వ్యంగ్యపు నవ్వుతో, “ ఏంటి నీకు ఉస్మానియాలో వచ్చిందా? ”

సూటిగా చూసాను. నవ్వాపింది. 

“ వచ్చింది. ” అన్నాను ఖచ్చితంగా. 

“ నీకంత సీన్ అనుకోలేదు. ” అనింది. 

“ ఊ ” అని బదులిచ్చి కిటికీ దిక్కు చూసాను. 

ఎండా, చెట్లూ, పొలాలు, దూరంగా కొండలూ ఒకసారి బస్సు ముందు వైపు చూడగా అక్కడెక్కడో కారు మేఘాలు ఉన్నట్టుగా అనిపించింది. 

వర్షం గాని కురుస్తుందా ఏంటి అనుకున్న. 

“ శశీ... ” అని తియ్యగా పిలిచింది. 

తను ఊరికే పిలిచినా నాకలాగే అనిపిస్తుందిలేండి.

“ చెప్పు... ” అన్నాను మొహం తిప్పకుండా. 

“ డిగ్రీ పాస్ అయ్యావా అసలు? ” అనేసింది కావాలనే. 

తన భుజం గిచ్చి, “ ఇంకోసారి చదువులో డౌట్ పడితే కిటికీలోంచి నూకేస్తాను బక్కముండ. ” అని కొంచెం గట్టిగా అనేసాను. 

నన్ను గుడ్లప్పగించి చూసి, “ ఏంట్రా ఎక్కువ అవుతున్నాయి మాటలు ” అని కొట్టింది. 

ఆ నిండు జాబిలి మొహంలో, ఒక నిమిషం నెమలి కళ్ళు, మరు నిమిషం గుడ్లగూప కళ్ళు ఎలా పెడతాదో అసలు.

“ నేను నిజమే చెప్తున్న, నాకు నేనేమి డబ్బా కొట్టుకుంటలేను. సరేనా…. నువు ఊకె నన్ను ప్రతీదానికి ఫెయిల్ అయినట్టు చూడకు. ” 

“ సరేలే.... ”

ఆ తరువాత, “ ఇంతకీ నీసంగతేంటే ” అనడిగాను. 

గాజుల చేతి వేలు చూపి, “ నీకస్సలు చెప్పను ” అని విసుక్కుంది. 

“ ఒసేయ్ నువ్వు అడిగితే నేను చెప్పలేదా? ”

“ నువు వెళ్ళిపోయినప్పుడు నీకు చెప్పాలనిపించలేదు. ఇప్పుడు నాకు చెప్పాలని లేదు. చెప్పను అంతే... ” అంటూ మూతి ముడుచుకుంది. 

తెలుసు, మన గురించే పట్టించుకునే వారికి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కోపం రాదా. ఇక్కడ కూడా అదే పొరపాటు జరిగింది. 

అయస్కాంతాల గోల ఇది. దూరంగా నెట్టే తప్పులున్నా, మరో దిక్కు దగ్గర చేసే జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.

తన చేతు పట్టుకోబోతే అటు పెట్టేసుకుంది.

“ శ్రీహా.. చెప్పు.  ఏం చేసావు? ”

“ MBBS చేసాను. చాలా. ” అంది.

పూర్తిగా ఒళ్ళు తన దిక్కు తిరిగింది. 

“ ఇది చెప్పడానికి ఎందుకు విసుక్కుంటావు మరి? ”

“ ఏం లేదు... ”... అంటూ చేతులు కట్టుకుంది.

తనని చూస్తూ ఉండిపోతాను. అది తనకి కూడా తెలుసు. చూడలేక ఇటు చూడదు అంతే. 

“ నేనేమి కావాలని చెప్పకుండా పోలేదు. ” .... కొద్దిగా తన కుడి చూపుడు వేలు ముట్టుకున్న. “ ఎందుకు పోయామో తెలుసా? ”

నా చేతిని కొట్టింది తీయమ్మంటూ. “ తెలుసు... రవి చెప్పాడు. మీ నాన్నమ్మ చనిపోయిందంట కదా. ”

“ హ... మా తాతని మేమే చూసుకుంటూ అక్కడే ఉండిపోయాము. ”

చప్పుడు చెయ్యలేదు. 

మూడేళ్ళు ఫోను లేదు, ఫోటో లేదు. నెంబర్ కూడా తీసుకోలేదు. చామంతి చెంపలను ఊహించుకుంటూ ఉండిపోయాను.

మళ్ళీ చెయ్యి ముట్టుకున్న, ఈసారి ఏమి అనలేదు.

“ అక్కడ ఎలా ఉంది మరి. కొత్త పరిచయాలు ఏమైనా అయ్యాయా ” అనడిగింది. 

“ హ్మ్మ్... గోదావరిఖనిలో అమ్మాయిలైతే బాగున్నారే... ”. నవ్వి, “ నీలాంటి దయ్యం మొహాలైతే లేవులే అక్కడ. ”

కొట్టింది. దూరం జరిగిన. 

“ నేను అమ్మాయిల గురించి అడగలేదు. ” నా మాటలో అర్థం దానికర్థమయ్యే ఉంటుందిలే. “ ఏదో కొత్తగా ఫ్రెండ్స్ గురించి అడిగాను అంతే. ”

“ తరువాత నేనున్నది ఎక్కువ హైదరాబాదులోనే. అక్కడేం ఉన్నా. అంతా మాములులే. ”

“ మరి హైదరాబాదులో? అంది. నన్ను సూటిగా చూస్తూ తన కళ్ళు చిన్న అనుమానంగా అనిపించాయి. “ అదే ఉస్మానియా అన్నావు కదా. ”

మొహం ముందుకు పొడిచి, “ నీకెందుకు ” అన్నాను పొగరుగా. 

“ అవునులే... నాకెందుకు ” అని టక్కున మొహం తిప్పుకుంది నీకే ఉందా పొగరు అన్నట్టు.

మౌనంగా కూర్చున్నాము. తను ఫోను తీసి చూస్తూ కూర్చుంది.

బ్యాగులోంచి ఎయిర్పోన్స్ తీసి పెట్టుకుంది. 

ఇక నేనేమి మాట్లాడేది ఉంది. కళ్ళు మూసుకొని వెనక్కి ఒరిగాను.

-
[+] 5 users Like ITACHI639's post
Like Reply
#3
పదేళ్ళ క్రితం, బడిలో మాకు సైన్స్ ఫేర్ ఉంటే, తను మా క్లాస్ టాపర్ కదా. ఏదో చేద్దాం అనుకుంది. 


రేపు సైన్స్ ఫేర్ అనగా ముందు రోజు నేను సాయంత్రం మా పక్కింట్లోకి పోయాను. ఇంటి రేకుల కింద, శ్రీహిత బంక మట్టిని చార్ట్ పేపరుకి అద్దుతూ దాన్ని ఒక వట్టముక్కుపై నిలబెట్టాలని చూస్తుంది. 

“ ఏం చేస్తున్నావే ” అని నేనడిగితే, “ వొల్కానో (అగ్నిపర్వతం) చేస్తున్న. ” అని చెప్పింది. 

అప్పట్లో మన థమ్సప్ డెక్కనుతోని కొవ్వొత్తి కరిగించి నీళ్ళు పోస్తే బుస్సనీ పొంగేది.

తన ఆలోచన ఏంటి అంటే మట్టి అధిమిన పేపరుని చిప్పలా నిల్చోపెట్టి దాని మధ్యలో అలా పొంగించాలి అని. 

అప్పట్లో బడుల్లో అన్నీ సరిగ్గా చెప్పేవారు కాదు. ఇదే అగ్నిపర్వతం లాంటివి ఎన్నో చేసేవాళ్ళు. ప్రతీ సంవత్సరం చేసేవాళ్ళు. దాని సంబరానికి ఆది చేసుకుంటుంది. 

నన్ను సహాయం పట్టిమంది. సర్లే అని రెండు గంటల పాటు అంతా సిద్ధం చేసాము. 

నా నోటి దూల ఉంది కదా అది ఊకుంటుందా.

“ శ్రీహితా... ఒకసారి ఇక్కడ చేద్దాం. మళ్ళీ రేపు మనం బడిలో చేసినాక అది రాకపోతే వేస్ట్ అవుతాది. ” అన్నాను. 

తను ఒప్పుకుంది. ఇద్దరం కలిసే లోపల డెక్కన్ పెట్టాము. కింద క్యాండిల్ పెట్టాము. 

తనని దూరంగా ఉండమని చెప్పి నేను నీళ్ళు పోసాను. అనుకున్నట్టే పైకి పొగలు లేచి పొంగింది. 


తరువాత రోజు ఇంటి నుంచి బయల్దేరుతూ పట్టుకొమ్మని చెప్తే పట్టుకునాను. 

బడికి పోయాము. మా క్లాసులో నలుగురూ నాలుగు రకాలు చేసారు. 

అసలు సమయానికి వచ్చేసరికి శ్రీహిత కొంచెం భయపడింది నీళ్ళు పోసాక వెనక్కి జిల్లితే ఎలా అని. 

తనని పక్కకి తప్పించి నేనే అంతా చేసాను. 

ఏదో పిల్లల సంతోషమని అందరూ చప్పట్లు కొట్టి, ప్రిన్సిపాల్ గారు నాకు అభినందనలు చెప్పారు. 

ఇంటి నుంచీ తీసుకొచ్చింది నేను, అందరూ నన్నే చూసారు. నేను చేసాను అనుకున్నారు. వాళ్ళ ముందు ప్రదర్శన చేసింది కూడా నేనే. 

ప్రిన్సిపాల్ అందుకే నన్నే మెచ్చుకున్నాడు. కానీ నేను కాదు అని చెప్పేద్దాం అనుకుని చెప్పకుండా ఆగిపోయి పొరపాటు చేసాను. 

సాయంత్రం వరకూ మాములుగానే ఉంది. ఇంటికి పోయాక వెనక నుంచి నన్ను దొబ్బితే నేను గేటు దగ్గర పడి నా మోచేతికి దెబ్బ తగిలింది. 

నొప్పిలో కోపం వచ్చి లేచి శ్రీహిత చెంప మీద ఒక్కటి సరిచాను. 

ఏడుస్తూ ఇంట్లోకెళ్లింది.

మా కోపం మా పేరెంట్స్ దాకా వెళ్ళింది. మా నాన్న, వాళ్ళ నాన్న కూడా. మీ అబ్బాయిదే తప్పు అని ఆయన అంటే, నీ  కూతురిదే తప్పు అని మా నాన్న. 

నాన్న నాతో శ్రీహితతో స్నేహం వొద్దన్నాడు. పైగా తన పని నేనెందుకు చేసాను అని తిట్టాడు. 

వాళ్ళ నాన్న కూడా సహాయం ఎందుకు తీసుకున్నావని తిట్టే ఉంటారు. 

కొన్ని రోజులు మేమిద్దరం దూరంగా ఉన్నాము.

అది నాతో మాట్లాడట్లేదు. ఎంత పొగరు అనుకున్నాను. కావాలనే దాని జీబుంబా పెన్సిల్ దొంగతనం చేసాను. 


సాయంత్రం ఇంట్లో పెన్సిల్ తో రాసుకుంటుంటే అది వచ్చి చూసింది. 

నా దగ్గరనుంచి లాక్కుంటూ గొడవ పడ్డాము. పెన్సిల్ విరిగింది.

కొన్ని రోజులకు ఎగ్జామ్స్ అయ్యాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి. 

ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకొని, “ మబ్బుమొహమా రోజూ పందిలా నిద్రపోతాడు ” అని వెక్కిరించింది.

నేను “ దయ్యం ” అని కొట్టాను. 


“ ముప్పైకి రెండు... ముప్పైకి రెండు... లేత కంకులు... ముప్పైకి రెండు...  బాబు... ” అని అరుపుకి నిద్రలేచాను. 

ప్రజ్ఞాపూర్ వచ్చింది. ఇక్కడ బస్టాప్ దగ్గర కంకులూ, చిప్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతారు.

శ్రీహితని చూస్తే పాటలు వింటూ ఉంది. 

సర్లే అని నేను ముప్పై ఇచ్చి రెండు వేడివేడి కంకులు తీసుకున్నాను. 

తన ఎడమ చెవిలో ఒక bud తీస్తే చూసింది. కంకి తీసుకోమని ఇస్తే,  “ నాకేం వద్దు నేను కొనుక్కుంటాను. ” అంది. 

కిటికీ దగ్గరున్న ఆవిడని పిలిచి ఇంకోటివ్వమంది. నేను వద్దని సైగ చేసాను. 

శ్రీహిత కోపంగా, “ నేను తీసుకోనన్నానా? నువ్వెధిచ్చినా నేను తీసుకోను. ” అని చెప్పి హ్యాండ్బాడ్ నుంచి ఇరవై నోటు తీసి నా చేతిలో పెట్టి, కుడి చేతిలో కంకి తీసుకుంది.

“ నాకేమొద్దు నీ పైసలు. తీస్కో. ” అని మళ్ళీ ఇచ్చేసాను. 

కొరికి ఎంగిలి చేసిన కంకి నాకిచ్చేసింది. 

ఇంత బెట్టెందుకే. ప్రతీ సారీ నీకు సహాయం చేయాలనే కదా అనుకునేది.

మా ఎదురు సీటులో ఉన్న పెద్దాయన మమ్మల్ని చూసి చిన్న నవ్వు నవ్వడం చూసాను. 

శ్రీహిత మొండికేస్తూ ఏర్ఫోన్స్ పెట్టేసుకుంది. ఒకటి లాగేసాను. 

చికాకు నటిస్తూ, “ ఏంట్రా నీ బాధ... నువిస్తే నేను తీసుకోను. ” అంటూ మొహం తిప్పుతూ నిట్టూర్చింది. 

ఆడవాళ్ళు మన కళ్ళలోకి సూటిగా చిరునవ్వుతో చూస్తూ ఊరించే కన్నులకంటే, చికాకుగా మొహం తిప్పుకొని విరిచే పెదవుల్లో వెన్నెల చాలా ముద్దుగా ఉంటుంది.

క్షమించండి కన్నులారా ఈసారి పెదవులకు వాటా ఇచ్చేద్దాం.

మనసులో నవ్వొచ్చింది, ఈ బుంగ మూతి అల్లరి సుందరిని దయ్యం అని ఎలా పిలుస్తున్నానా అని.

పెదవుల్లో చిక్కని చిరునవ్వుతో కొంటెగా కన్నెత్తి తానిచ్చిన కంకిని చూస్తూ, గులాబీ పెదవులు కొరికి వేసిన గాటు మీద కొరకబోతుంటే టక్కున చేతిలోంచి లాగేసుకుంది.

ముసిముసిగా నవ్వేసాను. 

“ ఏంటే వద్దన్నావు, ఇటువ్వు? ” అన్నాను ఆటపట్టిస్తూ. 

తను సూటిగా చూడలేక, కంకిని చూస్తూ, “ ఇప్పుడు కావాలి. అయినా ఇప్పటికీ నాకెన్నో కొనిచ్చావు. ఇది కూడా ఒకటి అనుకుంటానులే. ” 

నోరు ఆగదు. మాట్లాడుతూనే తినేస్తుంది.

తన చెవిలో, “ అంటే నా మీద కోపం లేదంటావు? ” అని చిలిపిగా అంటుంటే నా చెంప మీద తుంటరిగా కొట్టేసింది. 

“ కొనుక్కున్నావు కదా తిను. మాట్లాడకు. ” అంది నములుతూ. 

తన చిన్ని పెదవుల చుట్టూ పేరుకున్న కంకి మసి పొడి చూసి నవ్వొచ్చింది.

నేను నవ్విన అని చున్నీతో మూతి తుడుచుకుంది.

ఇక నా కంకి ఒలుచుకొని తినడం ప్రారంభించాను. 

-

మా తొమ్మిదో తరగతిలో, వర్షాకాలం,

 బడి గంట కొట్టాక ఇంటికి వెళుతుంటే, బొమ్మెంకన్న వీధి మూలకు పానీపూరీ బండి పక్కన వేడి వేడి కంకులు బొగ్గుల మీద కాలుస్తూ, అక్కడ నుంచి బడి దగ్గరదాకా మసి వాసన వీస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో.

వర్షం వెలసిన పచ్చి రోడ్డు మీద మట్టి వాసనకి సామ్రాణి తోడైనట్టు కంకుల వాసన అటుగా అడుగువేసేలా చేసింది. 

జేబులో చూస్తే రెండు ఐదు రూపాయిల బిళ్ళలు ఉన్నాయి. హమ్మయ్య అనుకోని అటు పోయాను. 

ఐదు రూపాయలు ఇచ్చి ఒకటి కొనుక్కున్నాను.

అప్పుడు నా భుజం మీద తడుతూ, “ నాకోటి కొనివ్వు ” అని అడిగింది ఈ దయ్యం.

“ ఇంటికి పోయి, పైసలు తెచ్చుకొని కొనుక్కో.” అనేసి దూరం జరిగాను. 

చేతిలో కంకి లాక్కొని కొరికేసి, తెలివిగా, “ నేనిది ఎంగిలి చేసాను. నువ్వింకోటి కొనుక్కో”  అంది.

“ పిచ్చి దయ్యం, తిండి బోతుదానా, నాది గుంజుకుంటావా... పైసలు ఇవ్వు. నేను ఇంకోటి కొనుక్కోవాలి. ” అన్నాను కొద్దిగా మండిపోతూ.

కంకిని ఉడతలా కొరికేస్తూ, “ నా దగ్గర లేవు. కావాలంటే సగం సగం చేసుకుందామా? ” అని చెప్పింది.

నాకలా పంచుకోవడం నచ్చకపోయేది. “ నీ ఎంగిలి నాకేం అవసరం లేదు. ” అంటూ మొహం విరుచుకొని ఇంకో ఐదు రూపాయలు ఇచ్చి మరో కంకి కొనుక్కున్నాను.

“ దొంగ గాడివి, పైసలు లేవు అన్నావు. ”

“ నువ్వు గుంజుకుంటావని తెలుసా. దయ్యం మొహమా ”

“ దయ్యం అనకు మబ్బుమొహమా. ” అంటూ కంకిని కొరుక్కొని తింటుంది. 

కంకి ఒలుచుకుంటూ, “ కోతి లెక్క తింటావు తిండిబోతా ”

“ నువ్వేరా తిండిబోతువి రోజూ ఏదో ఒకటి కొనుక్కొని తింటావు. పంది. ” అని తిట్టింది. “ అయినా అలా ఒలుచుకుంటే వేళ్ళు నొస్తాయి. అందుకే కొరుక్కొని తింటే తొందరగా తినచ్చు. ”

“ నువ్వో పెద్ద యువరాణివి, నీకు అస్సలు నొప్పే రావద్దు మరి. ”

“ పోరా... నేనెలా తింటే నీకెందుకు. తిండిలో తప్ప క్లాసులో ఏమైనా అడిగితే చెప్తావా నువ్వు? ”

“ నీలెక్క రాత్రి దయ్యంలా కూసోని చదువుతే నేను కూడా తెచ్చుకుంటాను మార్కులు ”

“ అబ్బో మబ్బుమొహం. క్లాసులో కూడా నిద్రపోతావు. ”


దయ్యం అన్నందుకు తను చెంప మీద కొట్టడం, మబ్బుమొహం అన్నందుకు తిరిగి మొట్టికాయ వెయ్యడం. అలా చిర్రుబుర్రులతో మా సాయంకాలం గడిచేది. 

-

శ్రీహిత తినడం అయిపోయాక కిటికీ నుంచి బయట పడేసింది. నేను వొలుచుకుంటూ తింటూ ఉన్నాను.

“ వాటర్ ఉన్నాయా ” అని అడిగింది. 

నేను నవ్వుతూ, “ కొకకోలా ఉంది ” అని చెప్పాను. 

“ దానిలో ఏమైనా కలిపావా? ” అనడిగింది ఎందుకో అనుమానంగా చూస్తూ. 

నాకు ఆశ్చర్యం వేసింది. అలా ఎందుకు అడిగింది. అంటే ఏదో ఒకటి అనాలి వీడిని అనే నెపంతో అంటుందా.

నోట్లో ఉన్నది నమిలి, “ అంటే ఏంటే నువ్వు అడిగేది? ”. నాకు నచ్చలేదు, అలా అడగడం. “ ఏమనుకుంటున్నావే నువు? ”

కళ్ళు చిన్న చేసుకొని, “ ఏమో, మూడేళ్లలో ఏం అలవాటు చేసుకున్నావో ” అని గులిగింది. “ అయినా నాకేమైనా తెలుసా. ”

నాకు చిరాకేసి ఒక్క మొట్టికాయ వేసాను.

మళ్ళీ ఆ కుందేలు మూతి పెట్టుకొని, “ ఆ...ష్ ” అని అరిచింది. 

ముందు సీటు పైన ఒక తల బయటికొచ్చి, ఆమె మా ఇద్దరినీ కొంచెం కోపంతో చూస్తూ, “ ఏ.... ఏంటి మీ అల్లరి. అప్పటి నుంచి గుసగుసలు. ” అనడిగింది.

మేమిద్దరం మౌనంగా ఉన్నాము. ఆవిడ ఇక అటు తిరిగారు. ఇద్దరికీ ఒకేసారి నవ్వొచ్చి ముసిముసిగా నవ్వుకున్నాము.

“ ఇంకోసారి కొట్టావో చెయ్యి విరిచేస్తారా నీది. ” అంది శ్రీహిత.

కుదురుగా కూర్చుని, “ సర్లే... నేనేమి అలవాటు చేసుకోలేదే. తాగుతావా? ” అన్నాను.

ఇవ్వమని తలూపితే, బ్యాగు లోంచి సగం తాగిన కొకకోలా ఇచ్చాను. 

చిన్ని పెదవులు తడుపుకుంటూ రెండు గుటకలు తాగి ఆగింది. 

“ కూల్ పోయిందిరా ” అని చెప్పింది మింగుతూ. 

“ నేనేమైనా ఫ్రిడ్జులో పెట్టి తీసానా చల్లగా ఉండడానికి, తింగరి. ” అన్నాను వెక్కిలి నవ్వుతో. 

చెయ్యి గిల్లింది చిరు కోపంగా.

ఇంకొంచెం తాగ బాటిల్ మూత పెట్టింది. 

ఓరకంట తన పెదవులు చూస్తూ కూర్చున్న. 

చూడడం గమనించి చిన్నగా నా చెంపను నెట్టింది. 

తన ముక్కు మీద కోపం చూస్తే నా పెదవుల్లో కొంటె నవ్వు పుడుతుంది.

కిటికీ బయట, చూసే ధ్యాస రావట్లేదు.
మేఘాలను ఏమని చూడను, 
అవి ఆకారం చేసుకున్న ఆవిరే కదా.
పక్షులను ఎందుకు చూడడం, 
అవి ఏనాడైనా పలకరించాయా.
వెళ్ళే రోడ్డును ఏముందని చూడనూ, 
అది ధూళి కప్పుకున్న బొంత కాదా.
మనము కదులుతున్నా, ఒకేచోట ఉన్నట్టు అనిపించే గ్రానైట్ కొండలను చూసి ఏం లాభము, 
మనుషుల భవంతులకు అద్దాలు అద్దుతూ ఇంకొన్నేళ్ల తరువాత అవి ఉంటాయా.
మరి ఎదురొచ్చే మనుషులనేమని చూడాలి, చిరునవ్వు కూడా స్వార్థంతోనే చేస్తున్నారు. 
ముసుగు వెనక మసకబారుకున్న మనసుకి మసి ఎన్నడు తొలిగేనో తెలీదు కదా.



నా మీద విశ్వమంత కోపం ఉన్నా, భూమంత ప్రేమ లేకపోదా.

ఆమె చిలిపి ప్రేమ చూపిస్తూ చిన్ని పెదవులు ముద్దుగా నాకు రుచి చూపించబోదా అనే ఆశతో, 
శ్రియకాంతి నిండిన శ్రీహిత మోమును చూస్తూ కూర్చున్న.

నావైపు చూడకుండా, “ ఇంతకీ ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడికీ? ” అనడిగింది. 

“ ముందు నువ్వు చెప్పు ” అన్నాను ఈసారి.

చిన్నగా నిట్టూర్చి, “ పెళ్ళిచూపులకి ” అంది. 

బస్సు దేన్నైనా గుద్దుకుందా, లేక నేను బస్సులోంచి బయటకి పడిపోయానా. 
ఏమో ఒక్కసారిగా నా ఒక్కడికే భూకంపం వచ్చినట్టు అనిపించింది. 

“ ఎన్... ఎన్... ఏంటీ? ” అన్నాను అవాకవుతూ.

ఇంతలో, ఇంకో వాక్యం, “ కానీ.. నాకిప్పుడపుడే పెళ్ళి చేసుకోవాలని లేదురా. ” అని నన్ను చీల్చుకున్న భూమిలో పడిపోకుండా ఆపింది. “ నాకూ doctor చెయ్యాలనుంది. నాకొచ్చే జీతంతో ఎక్కడికైనా టూర్ కి వెళ్లిరావాలని ఉంది. ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, ఏమో. ”


వయసుకొచ్చాక, చదువు అయిపోతే, ఆడవాళ్ళ మీద పెళ్ళి అనే స్టిక్కర్ ని అంత తొందరగా అంటించాలని ఎక్కువ శాతం తల్లితండ్రులు, ముఖ్యంగా మన మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు చూస్తాయో తెలీదు. 

ఒప్పుకుంటాను, ఇరవై దాటాక పెళ్ళి చేసుకోవడం మంచి ఆలోచన. కాకపోతే అది అందిరికీ ఒకేలా ఉండదు కదా. ఎవరి కలలు వాళ్ళకి ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు శ్రీహితకి ఉన్నట్టే. 

ఆడది తనకంటూ ఒక స్వేచ్ఛ కోరడంలో తప్పులేదు, అలాగని వచ్చే భర్త తన స్వేచ్ఛకు అడ్డు పడతాడు అనుకోవడం తప్పవుతుంది కదా.

ఇద్దాం ఆడవాళ్ళకి గౌరవంతో పాటు, రెక్కలు ఇద్దాం.  రెక్కలతో ఎగరనిద్దాం, అవే రెక్కలకి మోయగలిగే బాధ్యతనిద్దాం.

మగాడిగా మనము వాళ్ళ స్వేచ్ఛకి సంకెళ్ళు వేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త అంటూ ధైర్యంగా భుజం తడితే చాలు. వాళ్ళ భయానికి ఒక కౌగిలినిస్తే చాలు. 

మగాడి తోడు ఆడదానికి దీపం పెట్టే గూడు అవ్వాలి కానీ బంధించేసే పంజరం అవ్వకూడదు. 

హా.. ఎక్కడున్నాం. ఏమో నేను బయటకు చూడట్లేదు కానీ, శ్రీహితని చూస్తే తనెందుకో ఇంట్లో చెప్పల్కపోతుందని అనిపించింది. 

ఆలోచిస్తే సివిల్స్ చదువబోతున్న బుర్రకి ఒక పాత సినిమాల ఆలోచన వచ్చింది. 

సూటిగా చూస్తూ, “ ఒకపని చేద్దామా ”. తను ఏంటో అన్నట్టు చూసింది. “ నేను నీ లవర్ ని. ” అన్నాను. 

క్షణమాగకుండా, మొహం మీదే, “ అది ఈ జన్మ, వచ్చే ఏ జన్మలో జరగదు. ” అనేసింది. 

“ అబ్బా నేను చెప్పేది వినవే ” అని చెప్పబోతుంటే అనుమానం వచ్చింది. “ అవునూ పెళ్ళిచూపులైతే వాళ్ళు నిన్ను చూసుకోడానికి రావాలి కదా? ”

“ వాళ్ళుండేది హైదరాబాదులో, మా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడే కదా ఉండేది. అమ్మానాన్న పోయిన వారం బాబాయ్ ఇంటికి వచ్చారు. ఇప్పుడేమో సడెన్గా మొన్న రాత్రి ఇలా నాకు ఫోను చేసి విషయం చెప్పి, ఇవాళా రామన్నారు. రేపు పెళ్ళి చూపులు. బాబాయ్ వాళ్ళింట్లో. ” అని సమాధానం ఇచ్చింది. 

హ్మ్మ్ తర్కమే... 

“ ఏదో చెప్తున్నావు ” అనడిగింది. 

“ అదేనే నేను నువ్వూ లవర్స్ అని మీ పేరెంట్స్ దగ్గరికి పోయి చెప్పేద్దాము. ఉద్యోగం వచ్చే దాకా ఆగి చేసుకుంటామని చెప్తాము. ” అని అదే పాత సినిమాల తొక్కలో సలహా ఇచ్చాను.

మొహం ముడుచుకుని, “ అట్లా చెప్తే మా నాన్న అక్కడికక్కడే పెళ్ళి చేస్తాడు. ” అనింది.

“ అవునా నేనంటే ఇష్టమేనా మీ నాన్నకి. ” అన్నాను లోపల ఆశ ఆపుకోలేక.

“ నీతో కాదురా, వాడితో. నిన్ను లవ్ అని చెప్తే మా నాన్న క్షణం కూడా ఆగకుండా వేరే వాడికిచ్చి చేసేస్తాడు ”. నన్ను విసుగ్గా చూసి మొహం తిప్పుకొని, “ అయినా నేను నిన్ను లవ్ అని చెప్పడం ఏంటి. చి... ”

బతుక్కి... కనీసం నాటకం కూడా దిక్కులేదన్నమాట. 

మొహం మీద వాలుతున్న కురులు వెనక్కి దువ్వుకుంటూ, రెచ్చగొడుతూ, “ సర్లే వదిలేయ్. నా ఇష్టం లేకుండా మావాళ్ళు ఏం చేయరుగాని. నువ్వు చెప్పు ఏంటి సంగతి ” అంది. 

తనతో ఎలా చెప్పాలో అని కంగారు పుట్టింది. సివిల్స్ అని చెప్తే నీ మొహానికి సివిల్స్ ఆ అంటుందేమో అనే అనుమానం కలిగింది.

గాలి మింగుతూ, తనని సూటిగా చూడలేక, “ ఐ.పీ.ఏస్... అవుదామని సివిల్స్ కోసం వెళ్తున్న. ” అంటూ మెల్లిగా బదులిచ్చాను. 

తన కోమలమైన అరచేత నా చెంప పట్టుకొని, మొహం అటు తిప్పించి, సున్నితంగా బుగ్గ నిమురుతూ దీర్ఘంగా, నిశ్చలంగా కళ్ళలోకి చూసింది. 

“ నీవల్ల అవుతుంది అనుకుంటున్నావా? ” అనడిగింది సూటిగా.

ఆశ్చర్యం వేసింది తనేమీ అలా చేయలేదు.

“ నా ప్రయత్నం నేను చేస్తానే ” అనన్నాను ఖచ్చితంగా కొంత ధైర్యం చూపిస్తూ.

మూడు క్షణాలు మా చూపులు విడుచుకోలేదు.

“ ఆల్ ది బెస్ట్ రా ” అని కళ్ళలోకి నొక్కి చూసింది. “ సీరియస్ గా ఉండు. ”

“ ఉంటాను. ” 

ఆమె కన్నుల్లో నాకు కావలసినది, నానుంచి దాచేస్తున్నది, అది ఏదో, దాని నీడలు కనిపిస్తున్నాయేమో అనిపించింది.

కొంత ముందుకు జరిగాను ఆమె పెదవుల పలుకుల శ్వాసలు కోరుతూ. 

నా వెచ్చని శ్వాసకు తాను గడ్డకట్టుకుపోతూ చిన్న ఇష్టంగా చూస్తోంది.

మా ముక్కూ ముక్కూ తగిలింది. ఏదో మైకం కమ్మింది. 

లోకం మాయం అవబోతుంది అనుకునేలోపు, నన్ను నెట్టేసింది లేని కోపం నటిస్తూ. 

ఆమె ఊహలు మసకబారుకున్న కన్నులను కిటికీ దిక్కు తిప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాను.

-

మా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం,

ఫెబ్రవరీ నెలలో ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, జనవరీ ఆఖరి వారం రికార్డ్స్ రాసి సబ్మిట్ చెయ్యాలి.

మూడు రోజులుగా శ్రీహిత కాలేజీకి రాలేదు. కారణం తనకి టైఫాయిడ్ వచ్చింది. మా ఇళ్ళు వాళ్ళిళ్ళు పక్కపక్కనే అని మా క్లాసులో అందరికీ తెలుసు.

ఆరోజు శుక్రవారం మా కెమిస్ట్రీ సారు నన్ను పిలిచి శ్రీహిత గురించి అడిగాడు. తనకింకా జ్వరం తగ్గలేదని చెప్పాను. 

శ్రీహితకి ఇవ్వాల్సిన రికార్డు పుస్తకాలు నా చేతిలో పెట్టి, “ ఇవి శ్రీహిత వాళ్ళింట్లో ఇచ్చి ఎవరితోనైనా రాపించుకొమ్మని చెప్పు ” అని నాకు అప్పజెప్పారు. 

అయినా ఎవరి రికార్డు వాళ్ళు రాసుకోవడానికే బద్ధకం చూపిస్తారు. శ్రీహా రాసే స్థితిలో లేదు. 

పుస్తకాలు పట్టుకొని ఇంటికి పోయి, శ్రీహాకి చెప్పకుండానే, నా రికార్డుల నుంచి కాపీ కొట్టి, తన రికార్డులో కొన్ని అంకెలు మార్చి రాసాను. 

అలా శనివారం అర్థరాత్రి పన్నెండు దాకా రోజంతా రాస్తూ కూర్చున్నాను. 

మూడు పుస్తకాలు రాయడం పూర్తైంది. హాయిగా ఊపిరి పీల్చుకొని కూర్చుంటే శ్రీహా గుర్తొచ్చి, ఒక తెల్ల కాగితం మీద లవ్ సింబల్ దించి అందులో శ్రీహా లవ్స్ శశీ అని రాసి నాలో నేను మురిసిపోతుంటే నిద్రవచ్చేసింది.

పుస్తకాలు సర్ది, నిద్రపోయాను. 


ఆదివారం ప్రొద్దున్నే లేచి, శ్రీహితకిచ్చాను. థాంక్స్ కూడా చెప్పింది. 


సోమవారం, కాలేజీకి పోయాక, కాస్త ఆలస్యంగా తను కూడా రికార్డులు సబ్మిట్ చేయడానికి వచ్చింది. 

అందరం ఫిజిక్స్ రికార్డులు వరుసలో పెడుతూ ఉండగా, శ్రీహిత రికార్డు పెట్టబోతుంటే అందులోంచి ఒక కాగితం కింద పడింది. 

అందరూ చూసారు. అది నేను శనివారం రాత్రి రాసుకున్న కాగితం. 

అందరూ నవ్వారు. 

వాడెవడో, “ ఆహా... శశీ... అందుకేనా రికార్డులు రాసిచ్చావు... ” అని హేళనగా కూతలు కూశాడు.

శ్రీహిత ముందు నాకు మొహం చాలలేదు. 

ఫిజిక్స్ సారు కూడా, పిల్లలు ఇప్పుడే ఈ పనులు ఏంటీ అన్నట్టు చూసాడు.

విషయం మా క్లాసులోనే ఉండిపోయింది, ఇంటి దాకా పోలేదు. 

సాయంత్రం ఇంటికి పోయాక, నేను ఇంటి వెనక, జరిగిన దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. శ్రీహిత వచ్చింది. 

“ అది కాదు శ్రీహా... అది నేను తీసేయడం మరచిపోయాను. ” అని సంజాయిషీ చెప్పుకునే లోపు, గాజుల చేత్తో నా చెంప చెఢేలుమనిపించింది. 

“ కావాలనే చేసావు నాటకాలు ఆడకు, యెదవ. ” అని కోపంతో ఏడుస్తూ, ఆపకుండా నా చెంపల మీద కొడుతూనే ఉంది. పగిలిన గాజు గడ్డానికి గుచ్చుకున్నా ఆపలేదు.


నేనేమీ చెప్పలేకపోయాను. పొరపాటు నాదే, తప్పు నాదే. దురదృష్టం. తనకి సహాయం చేద్దాం అనుకునే ప్రతీసారి నా చేతులారా నేనే ఏదో పెంట చేసుకుంటాను.


-


సమయం కూడా ఆలోచనలలాగే పరుగులు పెడుతుంది. 

జూబ్లీ బస్టాండ్ వచ్చేసింది.

ఇద్దరమూ మా బ్యాగులు పట్టుకొని బస్సు దిగాము. 

సెకండ్ ఎంట్రన్స్ దాకా కలిసే నడిచాము.

మొహం చూడకుండా, “ బై రా ” అని చెప్పి వాళ్ళ బాబాయ్ కారు దిక్కు అడుగులేసింది. 

“ బై.... దయ్యం ” అని కష్టంగా నవ్వుతూ చెప్పాను.

కారు ఎక్కింది. నానుంచి తన ఊసు దూరం అయ్యింది అనుకుంటుంటే, కారు అద్దం తెరుచుకుంది. 

చెయ్యూపుతూ, “ కలుద్దాం రా... మబ్బుమొహం పెట్టుకోకుండా బాగా చదువుకోరా... ” అని నిండు వెన్నెల నవ్వుతో వీడ్కోలు చెప్పింది. 

నేను మనసారా నవ్వుతూ, చెయ్యూపాను.

.
.
.
.



కొన్నేళ్ల తరువాత,

అమీర్పేట్ మెట్రోస్టేషన్ దగ్గర, మెట్రో ట్రాక్స్ పై అనుమానాస్పదమైన ఐదు డ్రోన్స్ తిరుగుతున్నాయి,

ట్రాఫిక్లో సెక్యూరిటీ అధికారుల వాహనం ఆగి, అందులో యూనిఫాములో, భుజానికి మూడు నక్షత్రాల IPS బ్యాడ్జ్ ఉన్న నేను బైనక్యులారుతో డ్రోన్స్ ని పరిశీలిస్తుంటే, హఠాత్తుగా ఒకటి గాల్లో మంటలు వచ్చి పేలిపోయింది. 

వాటి ముక్కలు కింద RTC 49J బస్సు మీద పడింది. 

ఆ శబ్దానికి వాహనాల నదికి ఒక్కసారిగా భయభ్రాంతి ఆనకట్ట పడింది. 

బస్సులో జనాలు బెదిరి కేకలు పెట్టారు.

ఆ డ్రోన్స్ ఎందుకు మెట్రో ట్రాక్ మీద ఎగురుతున్నాయి? ఇది వాడి పనేనా? 


బస్సు ముందు తెలుపు స్విఫ్ట్ కారులో, వణుకుతున్న  చేతులతో కంగారుగా స్టీరింగ్ పట్టు నలుపుతూ, కనిపించింది శ్రీహిత, తెల్ల కోట్ వేసుకొని. 


.
.
.
.

అయస్కాంతాలు
[+] 10 users Like ITACHI639's post
Like Reply
#4
after long gap
nice update
Like Reply
#5
Super start
Like Reply
#6
Super update
Like Reply
#7
ఆరంభం అదిరింది ఇటాచీ గారు
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#8
Very well written. Bus journey is sweet. Thanks for update. Please continue.
Like Reply
#9
ఈ కథను చలా రోజుల క్రితం మొదలెట్టి ఆపేసారనుకుంటా కదా ఇటాచి బ్రో...ఇద్దరి చిలిపి కబుర్లు, గొడవలు, అలకలు చాలా హృద్యంగా వున్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలను తాజా చేస్తూ...మా దగ్గరికి అదే అమీర్పేట్ మెట్రో దగ్గరికొచ్చేసి డ్రోన్ ను పేల్చేసారు, ఇంకా ఏమేం చేయబోతారో...చాలా ఇంటరెస్టింగా, త్రిల్లింగా వుంది...కొనసాగించండి. 
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#10
(12-01-2026, 12:57 PM)Uday Wrote: ఈ కథను చలా రోజుల క్రితం మొదలెట్టి ఆపేసారనుకుంటా కదా ఇటాచి బ్రో...ఇద్దరి చిలిపి కబుర్లు, గొడవలు, అలకలు చాలా హృద్యంగా వున్నాయి చిన్నప్పటి జ్ఞాపకాలను తాజా చేస్తూ...మా దగ్గరికి అదే అమీర్పేట్ మెట్రో దగ్గరికొచ్చేసి డ్రోన్ ను పేల్చేసారు, ఇంకా ఏమేం చేయబోతారో...చాలా ఇంటరెస్టింగా, త్రిల్లింగా వుంది...కొనసాగించండి. 

హాయ్ uday bro new year రిసల్యూషన్ ఏమి లేదా ఈ సంవత్సరం
[+] 1 user Likes Veeeruoriginals's post
Like Reply
#11
Seems like an old story.

Car ekki heroine vellatam daggara aapinattu gurtu

Aa drones etc.. kosamerupu
Like Reply
#12
Excellent update
Like Reply
#13
(12-01-2026, 01:51 PM)Veeeruoriginals Wrote: హాయ్ uday bro new year రిసల్యూషన్ ఏమి లేదా ఈ సంవత్సరం

వీరు బ్రో ఇంకా ఏమీ అనుకోలేదు, ఈ సంవత్సరం అసలు ఏ గొడవ లేకుండా, మనసుకు నచ్చినట్లు, అసలేవీ అనుకోకుందా గడిపేద్దామని అనుకుంటున్నా...ఏమంటారు
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply




Users browsing this thread: 3 Guest(s)