01-12-2025, 11:17 PM
(This post was last modified: Yesterday, 04:17 PM by moggayya. Edited 2 times in total. Edited 2 times in total.)
మాది శివంపేట్, మెదక్ జిల్లా. నా పేరు నరసింహ. మాకు 6 ఎకరాల భూమి ఉంది. తామర పూలు ఉన్న చెరువు పక్కనే మా పొలం. ఇంకోవైపు మా ఇల్లు. మా ఇంటికి ఉత్తరం వైపు శ్రీ హరి గారి ఇల్లు అలా మెయిన్ రోడ్డు వరకు పెద్ద పెద్ద ఆసాముల ఇళ్లు. మా ఇంటి నుండి దక్షిణం వైపు గుట్ట వరకూ చిన్న వాళ్ల ఇల్లు. మా ఇల్లు పెంకుటిల్లు. దక్షిణం వైపు పోగా పోగా గుడిసెలు ఉంటాయి. అటు పెద్ద ఊరు ఇటు చిన్న ఊరుగా మాలో మేము శివంపేటని పిల్చుకుంటాం. అమ్మ మగ్గం నేస్తది. అయ్య పొలం లో వరి పండిస్తాడు. పొలం నుండి వచ్చాక అయ్య కూడా మగ్గం నేస్తాడు. నేను ఒక్కడినే పిలగాన్ని. చిన్న ఊరిలో మొదటగా నేనే పది క్లాస్ పాస్ అయ్యా. అలాగే ఇప్పుడు డిప్లమా కూడా పాస్ అయ్యా. దీనికి ముఖ్య కారణం మా ఇంటి పక్కన ఉన్న శ్రీ హరి మామ, ఆయన భార్య లక్ష్మి అత్త. వాళ్లు నాన్నకి మంచి చెప్పి నన్ను చదివించారు. ఊర్లో ఉన్న అందరి దొరల ఇంట్లో నేను తెలుసు అందరూ నన్ను ఉత్తరాలు రాయడంలో చదవటంలో బాంక్ పనుల్లో మొబైల్ వాడటంలో ఉపయోగించుకునే వాళ్లు. మా ఇంటి పక్కన వెనకాల మొత్తం 12 ఇళ్లు మా చుట్టాలు. అందరం మొగ్గం నేస్తాం. అమ్మ, అయ్య తమ్ములు అన్నలు లెక్క. నా మామ కూతురు అంటే నాకు ఇష్టం. చక్రాల్లాంటి కళ్లు. నిర్మల దాని పేరు. అందరూ మేము ఇద్దరం మొగుడు పెళ్లాం అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అది ఏడుస్తుంది. అంతే కాదు అమ్మ కూడా ఏడుస్తుంది. అత్త కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నాకు జీడిమెట్ల లో జాబ్ వచ్చింది. సికందరాబాద్ స్టేషన్ నుండి 29 నంబర్ బస్సులో వెళ్లాలి..ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అయ్య, మామ నా కూడా వస్తున్నారు. అక్కడ కంపనీలో నన్ను వదిలి అయ్య మామ తిరిగి వస్తారు. జీడిమెట్ల లో కంపనీ చాలా పెద్దది. హెచ్ ఆర్ రాజేంద్ర గారు అయ్యకి మామకి ధైర్యం చెప్పారు. జాయిన్ అయ్యాక బోయన పల్లి లో ఊర్లో ఇంటి పక్క శ్రీ హరి మామ గారి బంధువు ఇంట్లో రెంట్ కి రూం లో చేరా. ఈయన గారి పేరు శ్రీనివాస్. మా ఊర్లో శ్రీ హరి మామ గారికి [b]వరసకి పెద్ద అన్న. ఆయనకి ఇక్కడ చాలా ఇళ్లు ఉన్నాయి అన్నీ ఇలా రెంట్ కి ఇవ్వడం ఆయన వ్యాపారం. అంతా సెటిల్ చేసాక అయ్య మామ రెండు రోజులు ఉండి బయలు దేరారు ఊరికి. అయ్య నన్ను పట్టుకుని నరసింహా ప్రతి నరసింహ జయంతి రోజు నువ్వు యాదగిరి గుట్ట పోవాల మరువకు అని చెప్పినాడు. సరే అయ్యా అని చెప్పినా. ఆ రోజు రాత్రికి మొదటి సారి జిందగిలో ఒంటరిగా రూం లో పడుకున్నా నిద్ర రాలేదు. ఏడుపు వచ్చింది. కానీ జీవితం లో పైకి రావాలంటే ఒంటరి జీవితం గడపాలి అని ఊర్లో వేణుగోపాల స్వామి గుడిలో అయ్యోరు చెప్పింది గుర్తుకు వచ్చి నిద్ర పోయా. ప్రొద్దున్నే లేచి కంపెనీ కి వెళ్లా. [/b]


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

