17-11-2025, 12:13 PM
గణేష్ నడుచుకుంటూ ఆలా రోడ్ మీద వెళ్తూ ఉన్నాడు కానీ తనకు ఎందుకో ఎవరో తనని వెంటాడుతున్నటు భయం భయం భయంగా వెళ్తున్నాడే కానీ మనసు అంత ఏదో తెలియని కంగారు. ఇంటికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం వుంది తన కార్ ఏమో ట్రాబల్ ఇచ్చింది.ఇంకా చేసిది ఎం లేక ఆలా ఆ చీకటిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆలా వెళ్తూ ఒక సారి ఆకాశం వైపు చూస్తాడు నిండు చందమామ పున్నమి వెలుగు లో అందంగా ఉంటే గణేష్ కి మాత్రం భయానకం గా వుంది దానికి కారణం పౌర్ణమి రోజు తన వెంట ఒక దుష్ట శక్తి పడుతూ ఉంటుంది. అందుకే ఎపుడు పౌర్ణమి రోజు మాత్రం బయట కి రాడు ఇంట్లో లో వాళ్ళ ఆచారి చేపినటు పూజ లో ఉంటాడు ఆలా ప్రతి పౌర్ణమి కి చేస్తూ ఉంటాడు కానీ ఈ సారి పౌర్ణమి సంగతి మర్చిపోయి తన ప్రాణ స్నేహితుడు విదేశాలకు వెళ్తున్నాడు అని సెండోఫ్ ఇవ్వడానికి పూజ లో కూర్చుకోకుండా వేంటనే వచ్చేయచ్చు అని వెళ్తాడు కానీ అక్కడ బాగా లేట్ అవుతుంది ఒక పక్కన గణేష్ వాళ్ళ అమ్మ నాన్న కి కంగారు పెరిగిపోతుంది. ఇలా వచ్చే దారిలో తన కార్ ఆగిపోవడం చూటు నిర్మానుషం కానుచుపు మేర నారా సంచారం కూడా లేదు కానీ గణేష్ వాళ్ళ నాన్న ఎప్పుడు ఒక స్వామీజీ ని నమ్ముతాడు తాను ఈరోజు ఒక మంచి స్థాయి లో ఉండడానికి కారణం ఆయనే. ఆ స్వామీజీ గణేష్ కి ప్రతి పౌర్ణమి రోజు ప్రమాదం పొంచి వుంది అని చెప్పడం ఆ తరువాత పొర్ణమి కి గణేష్ కి బైక్ ఆక్సిడెంట్ అయి పెద్ద ప్రమాదం నుండి బయట పడడంతో ఒకగానొక వారసుడు కనుక ఇంకా జాగ్రత్తగా గణేష్ ని పౌర్ణమి రోజు కంటికి రెప్ప లా కాపుడుకుంటూ వస్తున్నాడు కానీ ఈ రోజు గణేష్ అందరికి మస్కా కొట్టి భయట కి వస్తాడు. ఒకపక్క ఇటు స్వామిజి చేపిన సమయం అవుతుంది అందులో ఆ రోజు గ్రహణం. ఇంకా చేసిది ఎం లేక గణేష్ బిక్కు బిక్కుమాంటూ ఎవరు అన్న వస్తారు ఏమో లిఫ్ట్ అడుగుదాం అని ఎదురుచూస్తూ ఉంటాడు. చుట్టూ చూస్తే భయంకరంగా ఉంది. నరసంచారం కూడా లేని ప్రదేశంలో ఏం చేయలో అర్ధం కాకా అయోమయం లో ఉన్నాడు గణేష్. అలా కాసేపు తన మొబైల్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటి తరువాత బస్సు తన దగ్గరకి వస్తుంది అనగా సడన్ గా తనని ఎవరో పిలిచినట్టు ఉంటే వెనక్కి తిరిగి చూస్తాడు. అలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక నల్ల ఆకారం తనని పిలుస్తూ కనిపిస్తుంది. అలా పిలవడంతో గణేష్ భయం వేస్తుంది అయినా సరే ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకొని ఎవరు అక్కడ నా పేరు మీకు ఎలా తెలుసు అని చిన్నగా ముందుకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుంటే ఒక్కసారిగా ఆ నీడ గణేష్ మీదకి వస్తూ ఉంటుంది. అలా వస్తుండడంతో చింటు భయంతో బస్సు దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కి తన సీట్లో కూర్చునాడు. రొప్పుతూ కిటికీ లో నుండి భయంతో భయటకి చూస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు. హమ్మయా అనుకొని బస్సు లో ఇంకా ఎవరెవరు ఉన్నారా అని చూస్తూ ఉంటాడు. బస్సు లో తన ముందు డ్రైవర్ ఇంకా కండక్టర్ ని చూసి చాలు రా దేవుడా నాకు వీళ్ళు తోడుగా వున్నారు అనుకోని ఒక్క సారి వెనక్కి చూస్తాడు.అలా చూసే టైం కి బస్సు వెనుక విండో పగలగోట్టుకుంటూ ఒక భయంకర రూపం వచ్చి గణేష్ పీక పిసుకుతుంది.............................. To Be Continued


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)
:ఉదయ్