Posts: 1,168
Threads: 22
Likes Received: 161 in 121 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
మామిడికాయతో రైతా
కావల్సినవి: మామిడి కాయ - సగం ముక్క (తురమాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు.
తయారీ: ముందుగా మిక్సీలో మామిడి తురుము, కొబ్బరితురుము, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేయాలి. అవాలు చిటపటలాడాక పొయ్యికట్టేసి ఈ తాలింపును పెరుగులో వేస్తే చాలు
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 1,168
Threads: 22
Likes Received: 161 in 121 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
ముల్లంగితో రైతా
కావల్సినవి: ముల్లంగి - ఒకటి (తురుముకోవాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - నాలుగు చెంచాలు, జీలకర్ర - అర చెంచా, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావు చెంచా, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెబ్బ.
తయారీ: కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, తురిమిన ముల్లంగి, జీలకర్ర.. అన్నింటినీ మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలో తీసుకుని పెరుగు కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయించి, కరివేపాకు, ఇంగువ వేయాలి. రెండునిమిషాలయ్యాక దింపేసి పెరుగులో వేస్తే చాలు. చివరగా తగినంత ఉప్పు, కొత్తిమీర కలిపితే ముల్లంగా రైతా సిద్ధం.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 1,168
Threads: 22
Likes Received: 161 in 121 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
కరివేపాకుతో రైతా
కావల్సినవి: కరివేపాకు - కప్పు, పెరుగు - రెండు కప్పులు, మిరియాలు, జీలకర్ర - అరచెంచా చొప్పున, పచ్చిమిర్చి - ఒకటి, చింతపండు - కొద్దిగా, నూనె - చెంచా, ఉప్పు - తగినంత, కొబ్బరితురుము - పావుకప్పు.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావుచెంచా, ఇంగువ - చిటికెడు.
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రెండుమూడు నిమిషాలు వేయించి తీసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అదే బాణలిలో కరివేపాకును కూడా నూనె లేకుండా ఐదు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. తరవాత మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరితురుము, చింతపండును కూడా ముద్దలా చేసుకోవాలి. పెరుగులో కరివేపాకు పొడి, కొబ్బరి మిశ్రమం, జీలకర్ర ముద్ద, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక ఇంగువ వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగులో వేసి బాగా కలిపితే చాలు.
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 25
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 12
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
(02-12-2018, 07:57 AM)krish Wrote: ముల్లంగితో రైతా
కావల్సినవి: ముల్లంగి - ఒకటి (తురుముకోవాలి), పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - నాలుగు చెంచాలు, జీలకర్ర - అర చెంచా, చిక్కటి పెరుగు - రెండు కప్పులు, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - పావు చెంచా, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెబ్బ.
తయారీ: కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, తురిమిన ముల్లంగి, జీలకర్ర.. అన్నింటినీ మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలో తీసుకుని పెరుగు కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు వేయించి, కరివేపాకు, ఇంగువ వేయాలి. రెండునిమిషాలయ్యాక దింపేసి పెరుగులో వేస్తే చాలు. చివరగా తగినంత ఉప్పు, కొత్తిమీర కలిపితే ముల్లంగా రైతా సిద్ధం.
helps to health fit
•
|