Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సూప్స్ తయారీ విధానం
#1
టొమాటో, క్యారెట్‌ సూప్‌

Quote:కావల్సినవి: క్యారెట్లు, - రెండు, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, వేయించిన మిరియాల పొడి - అరచెంచా, జీలకర్ర పొడి - చెంచా, తరిగిన కొత్తిమీర - రెండు చెంచాలు, ఉల్లికాడల తరుగు - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారీ: టొమాటో, క్యారెట్‌, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి, పావుకప్పు నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ఈ గుజ్జు ఉడికి, చిక్కగా అయ్యాక మిరియాలపొడీ, తగినంత ఉప్పూ, జీలకర్రపొడీ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగూ, ఉల్లికాడల తరుగు వేసి దింపేస్తే చాలు.
 
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
రాజ్మా, చిక్కుడు గింజల సూప్‌
Quote:
కావల్సినవి: రాజ్మా - కప్పు, చిక్కుడు గింజలు - కప్పు, టొమాటోలు- రెండు, ఎండుమిర్చి - రెండు, ఉల్లిపాయ- ఒకటి, నిమ్మరసం - రెండు చెంచాలు, వేయించిన జీలకర్ర పొడి - చెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, నూనె- రెండు చెంచాలు, ఉప్పు-తగినంత.
తయారీ: రాజ్మా గింజల్ని పన్నెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరవాత ఉప్పు వేసి కుక్కర్‌లో చిక్కుడు గింజలతో సహా ఐదారు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. చల్లారాక ఆ రెండింటినీ ముద్దలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఎండుమిర్చీ, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక రాజ్మా ముద్ద, రెండు కప్పుల నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకూ ఉడికించుకోవాలి. తరవాత జీలకర్రపొడీ, నిమ్మరసం, మరికొంచెం ఉప్పు వేయాలి. ఇది కాస్త చిక్కగా అవుతున్నప్పుడు కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి.

Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#3
బీరకాయ, బియ్యప్పిండి సూప్‌
Quote:కావల్సినవి; బీన్స్‌ - నాలుగు, క్యాబేజీ - చిన్న ముక్క, క్యారెట్‌ - ఒకటి, బీరకాయ - సగం ముక్క, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి - రెండు చెంచాల చొప్పున, నూనె - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - ఒకటి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాలపొడి - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు.
Quote:
తయారీ: కూరగాయలన్నింటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పచ్చిమిర్చి తరుగూ, జీలకర్ర పొడీ, మిరియాల పొడి వేయాలి. వెంటనే తరిగిన కూరగాయ ముక్కలూ, తగినంత ఉప్పూ, కప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి. కూరగాయ ముక్కలు కాస్త ఉడికాయనుకున్నాక బియ్యప్పిండీ, మొక్కజొన్న పిండిని ఓ కప్పు లోకి తీసుకుని అరకప్పు నీళ్లు పోసి కలపాలి. దీన్ని ఉడుకుతోన్న కూరగాయ ముక్కల్లో వేసి మంట తగ్గించాలి. చిక్కగా అయ్యాక నిమ్మరసరం, కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే చాలు.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#4
పాలకూర, కందిపప్పు సూప్‌
కావల్సినవి: పాలకూర - రెండు కట్టలు, కందిపప్పు - కప్పు, వేయించిన మిరియాలపొడి - అరచెంచా, వేయించిన జీలకర్రపొడి - చెంచా, నిమ్మరసం - రెండు చెంచాలు, పచ్చిమిర్చి - ఒకటి, నూనె- రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.

తయారీ: పాలకూర తరుగూ, కందిపప్పూ, రెండు కప్పుల నీటిని కుక్కర్‌లో తీసుకుని మూడునాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె వేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్రపొడీ, మిరియాలపొడీ వేయాలి. తరవాత ఉడికించిన కందిపప్పూ, పాలకూరా, కప్పు నీళ్లు పోయాలి.. ఇది కాస్త చిక్కగా అయ్యాక నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి దింపేయాలి.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#5
స్వీట్‌ కార్న్‌ పాలకూర సూప్‌
కావల్సినవి: స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - రుచికి సరిపడా, పాలకూర తరుగు - కప్పు, నూనె - రెండు చెంచాలు, క్రీం - కొద్దిగా. 

తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేయించాలి. నిమిషమయ్యాక స్వీట్‌కార్న్‌ వేసి వేయించాలి. అవి కాస్త వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మంట పెంచాలి. అవి మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి దింపేయాలి. ఆ నీళ్ల వేడి తగ్గాక స్వీట్‌కార్న్‌ని మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ నీళ్లలో వేసి పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాల తరవాత పాలకూర తరుగు వేసి మంట తగ్గించాలి. కాస్త ఉడికాక దింపేసి క్రీం వేస్తే చాలు
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#6
టొమాటో సూప్‌
కావలసినవి:

టొమాటోలు: 5, క్యాప్సికమ్‌: ఒకటి(చిన్నది), ఉల్లిపాయలు: ఒకటి, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు, మిరియాలపొడి: రుచికి సరిపడా, పంచదార: 2 టేబుల్‌స్పూన్లు, మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌:టేబుల్‌ స్పూను, తులసి లేదా ఒరెగానొ: టీస్పూను, రెడ్‌ కలర్‌: రెండుమూడు చుక్కలు, క్రీమ్‌: పావుకప్పు (కావాలనుకుంటేనే)

తయారుచేసే విధానం:

టొమాటోలు, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ ముక్కలుగా కోయాలి.పాన్‌లో టేబుల్‌స్పూను వెన్న వేసి వెల్లుల్లి ముక్కలు, ఉల్లిముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు కూడా వేసి నాలుగు కప్పులు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. ఉడికిన తరవాత ఉప్పు, పంచదార, మిరియాలపొడి, తులసి ఆకులు వేసి కలపాలి. స్టవ్‌మీద నుంచి దించి చల్లారాక మిక్సీలోవేసి మెత్తని గుజ్జులాచేసి వడగట్టాలి.పాన్‌లో మిగిలిన టేబుల్‌స్పూను వెన్న వేసి మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌ వేసి తక్కువ మంటమీద గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. తరవాత వడగట్టిన టొమాటో మిశ్రమం పోసి ఉండలు కట్టకుండా కలపాలి. చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొన్ని నీళ్లు కలిపి ఓసారి మరిగించి దించాలి. ఉప్పు సరిచూసుకుని రుచి కావాలనుకుంటే క్రీమ్‌ కలిపితే సూప్‌ రెడీ.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#7
లెమన్‌ అండ్‌ కొరియాండర్‌
కావల్సినవి: కూరగాయలు ఉడికించిన నీరు - నాలుగు కప్పులు, ఉల్లిపాయలు - రెండు (ముక్కల్లా కోయాలి), నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్‌ - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - చెంచా, కొత్తిమీర తరుగు - కప్పు.

తయారీ: కూరగాయలు ఉడికించిన నీటిని ఓ గిన్నెలో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో ఉల్లిపాయముక్కలూ, నిమ్మరసం, ఉప్పూ, సగం కొత్తిమీర తరుగూ, మిరియాలపొడీ, చిల్లీసాస్‌ వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. ఆ నీళ్లు మరిగాక మిగిలిన కొత్తిమీర తరుగు వేసి కప్పుల్లోకి తీసుకుని వడ్డిస్తే సరిపోతుంది
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#8
నీకు సూప్స్ వచ్చా?
Like Reply
#9
(02-12-2018, 07:43 AM)krish Wrote:
స్వీట్‌ కార్న్‌ పాలకూర సూప్‌
కావల్సినవి: స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - రుచికి సరిపడా, పాలకూర తరుగు - కప్పు, నూనె - రెండు చెంచాలు, క్రీం - కొద్దిగా. 

తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేయించాలి. నిమిషమయ్యాక స్వీట్‌కార్న్‌ వేసి వేయించాలి. అవి కాస్త వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మంట పెంచాలి. అవి మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి దింపేయాలి. ఆ నీళ్ల వేడి తగ్గాక స్వీట్‌కార్న్‌ని మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ నీళ్లలో వేసి పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాల తరవాత పాలకూర తరుగు వేసి మంట తగ్గించాలి. కాస్త ఉడికాక దింపేసి క్రీం వేస్తే చాలు

గుడ్ ఫర్ హెల్త్
Like Reply

Users browsing this thread: