Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీనియర్ అమ్మాయి - జూనియర్ అబ్బాయి
#1
అందరికి నమస్కారం  నేను కూడా ఈ గాస్పీ సైట్ లో చాలా చాలా సంవత్సరాల నుంచి  కథలు చదువుతున్నాను. నాక్కూడా చాలా రోజుల నుంచి ఏదో ఒక కథ రాయాలి మీకు అందజేయాలి అని అనిపిస్తూ ఉండేది కానీ నాకు ఏ కథ మొదలుపెట్టినా కానీ ఆ ఎక్కడ దాన్ని ముగింపు లేదా ఎక్కడ దాన్ని శిఖరాగ్రస్థాయి తీసుకెళ్లాలి ఎక్కడ దాన్ని దించాలి పెంచాలి అనే దాంట్లో చాలా తికమకలు  ఉండేవి. కావున  మొదలు పెట్టాలని ఆలోచన వచ్చినా కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు నేను విఫలం  అవుతూ  ఉండేదాన్ని .ఎట్టకేలకు ఇప్పుడు ఒక కథను అనుకుంటున్నాను దానిని ఆచరణలో పెడదాము అని అనుకుంటున్నా.  ఆ తర్వాత మీరు సపోర్ట్ చేస్తారని ఆదరిస్తా మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తూ మొదలు పెడుతున్నాను. నేను మీ సలహాలు సూచనలు అన్నిటిని స్వీకరిస్తాను. స్వీకరించి మీకు నచ్చినట్టుగా కథను ముందుకు   నడిపించాలి  అనుకుంటున్నాను .


ఇది ఒక కాలేజీ నేపథ్యంలో  జరిగే ఒక కథ . ఇందులో  కథానాయకి ఎదుర్కొన్న  మనుషులు పరిస్థితులు సందర్భాలు  తనని ఎలా  మార్పు చేశాయి  తను ఎలా  ఎదుర్కొంది  తన ఎలా ముందు కొనసాగింది.  తన జీవితం  ఎలా  మారింది .ఇది  సున్నిత శృంగారం మరియు  సరసాలతో కూడి  నెమ్మదిగా  నెమ్మదిగా  సాగే ఒక కథ .

2015 వ సంవత్సరం  జులై నెల . ఐఐటి  గౌహతి  కాలేజ్ .ఒక ఆహ్లాదకరమైన ఉదయం . కాలేజ్ అంతా చాలా సందడి సందడిగా కోలాహలంగా ఉంది.ఎందుకంటే అది కాలేజ్ యొక్క మొదటి రోజు .సీనియర్స్ అందరూ తమ తమ  బ్రాంచ్లకు రాబోయే  జూనియర్స్ కు స్వాగతం పలుకుతూ  మరికొందరు  సరదాగా ర్యాగింగ్ చేస్తూ చాలా సందడిగా ఉంది .ఒక గ్యా ంగ్ క్యాంటీన్లో  కొంతమందిని సరదాగా ర్యాగింగ్ చేస్తున్నారు .

సాయి పల్లవి . మూడో సంవత్సరం CSE బ్రాంచ్.టాపర్ ఆఫ్ ది బ్యాచ్ .చదువు , అందం,అణుకువ,వినయం , అభినయం ,అమాయకత్వం   కలగలిసిన  ఆడపిల్ల .కాలేజ్  మొత్తానికి ఉన్న పది పదిహేను  అందగత్తెల్లో  మన సాయి పల్లవి  ఒక అమ్మాయి .
కిరణ్  మూడో సంవత్సరం  ECE బ్రాంచ్. చదువులో  మరి సాయి పల్లవి అంత కాకపోయినా  పర్లేదు అనే విధంగా  చదువు , మంచి బాడీ , సంస్కారం అందం కలగలిసిన వ్యక్తి . సాయి పల్లవి ఇంకా కిరణ్ ఇద్దరికీ ఇంటర్ నుంచి  పరిచయం . ఆ పరిచయం  మెల్లగా స్నేహంగా మారి క్రమంగా  ప్రేమగా మారింది . ఆ ప్రేమకిప్పుడు ఐదు సంవత్సరాలు .సాయి పల్లవి ఎప్పుడు  తను ప్రేమలో  పడింది అనుకోలేదు  కానీ  కిరణ్ చూపించిన ప్రేమ, ఆప్యాయత  తనని కిరణ్ చెంతకు చేర్చాయి . ఇన్ని సంవత్సరాలు  ప్రేమలో  ఎక్కడ గొడవ వచ్చినా ఏ చిన్న తప్పు జరిగిన  ఒకరికి ఒకరు సర్దుకుపోయి  పరిష్కరించుకుని వాళ్ళ ప్రేమని ముందుకి  తీసుకెళ్తాను ఇద్దరు  గాఢమైన ప్రేమలో  కొనసాగుతున్నారు.పల్లవికి కిరణ్ అంటే   ఎంతో ప్రేమ ,తనకి నచ్చని  విషయాలు కానీ నొప్పి  కలిగించే  విషయాలు కానీ   ఎప్పటికీ చేయదు. ఇన్ని  సంవత్సరాలలో  కిరణ్ కంటే  ఎంతో  అందమైన ,చదువుకున్న ,తెలివైన  అబ్బాయిలు తనని  ప్రేమలో పడేయడానికి ప్రయత్నించిన  ఏ ఒక్కరికి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు .

ప్రస్తుతం పల్లవి  కిరణ్ ఇంకా  మరికొందరు స్నేహితులు క్యాంటీన్లో కూర్చుని  సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా వచ్చిన జూనియర్స్ ని  ర్యాగింగ్ చేస్తున్నారు .

అప్పుడే వాళ్ళ ముందు నుంచి  ఒక కొత్త అబ్బాయి  చాలా ఉత్సాహంగా, గెంతుకుంటూ , ఎగురుకుంటూ వెళ్తున్నాడు.తన పేరు సిద్ధార్థ , సిద్ . మంచి అందం, ఆహార్యం ,కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయి. విజ్ఞానానికి ,సంస్కారానికి  తప్ప తన సంపాదనకు   చదువు అవసరం లేని  ఉన్నత స్థాయి కుటుంబంలో  పెరిగిన వ్యక్తి .తల్లిదండ్రుల సతాయింపు మరియు కోరిక  మేరకు  ఎంతో కొంత కష్టపడి  ఐఐటీలో సీటు సంపాదించాడు .ముందుగానే కాలేజీ జీవితాన్ని  ఆనందించాలి అనే  ఉద్దేశంతో  చేరిన వ్యక్తి . ఎటువంటి  లక్ష్యాలు కానీ , బాధ్యతలు కానీ  లేకుండా  కేవలం సరదా జీవితాన్ని గడపాలని  అనుకుంటున్నాడు .

సిద్  ని  చూసిన కిరణ్ , అతని వాళ్ళకం చలాకితనం చూసి వీడేంట్రా ఇలా ఉన్నాడు  కాలేజ్ పిల్లోడు లాగా ఎగురుకుంటూ  వెళ్తున్నాడు . వాడిని పిలవండి రా ర్యాగింగ్ చేద్దాం.

కిరణ్  ఫ్రెండ్స్ :  బాబు బాబ్జి  ఇటు రా అమ్మ .
సిద్ :  నేనా ?
కిరణ్ :  నువ్వే  అమ్మ బంగారం .ఇటు రా  బాబ్జి .
సాయి పల్లవి : రేయ్ మీరు మారరా . పాపం రా ఈరోజే వాళ్లకు ఫస్ట్ డే .  మనల్ని  ర్యాగింగ్  చేసినప్పుడు  మనం ఎంత బాధపడ్డాం . వదిలేయండిరా . ఏంటి   కిరణ్   నువ్వు కూడా ?
కిరణ్ :  సరదాకి పల్లవి . మనల్ని చేశారు కదా మనం కూడా చేద్దాం .కేవలం సరదాకి .
సాయి పల్లవి :  మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి .

సిద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు
సిద్ :  హాయ్ బ్రో  
కిరణ్ ఫ్రెండ్1 :  ఏంటమ్మా బాబ్జి . మంచి   ఊపు మీద ఉన్నావ్ .
ఫ్రెండ్ 2: బ్రో ఏంటి బే బ్రో . మేమేమైనా నీ క్లాస్మేట్స్ ఆ ??, సీనియర్స్ బే .సార్ అని పిలు .
సిద్ : సారీ సార్ .
కిరణ్ : సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమా బాబ్జి .
సిద్ : హాయ్ సార్ .నా పేరు సిద్ధార్థ . అందరూ సిద్ పిలుస్తారు.మాది  హైదరాబాద్ .CSE ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఇక్కడ .
కిరణ్  : ఓ హో CSE ? ఒక నిమిషం . బేబీ  ఇదిగో  ఈ  బాబ్జి  మీ బ్రాంచ్  అంట.
(సిద్  అప్పుడు  తనవైపు తిరిగి సాయి పల్లవిని చూసి సిద్  ఒక్క సెకండ్ అలాగే  స్థానవు అయిపోయాడు.తన  జుట్టు  సర్దుకుంటున్న  సాయి పల్లవి  కళ్ళు  ముక్కు బుగ్గలు  పెదవులు  మెడ  జుట్టు  ఇంకా  తన ఆకృతి  చూసి   ముగ్ధుడు అయిపోయాడు.సాయి  పల్లవిని  చూసి  తన కళ్ళు  దిశ మార్చలేక  అలాగే తనను చూస్తూ  ఉండిపోయాడు .మొదటి రోజే  అంతటి  అందమైన  క్యూట్ మరియు  హాట్ అమ్మాయిని  చూస్తాను  అని అనుకోలేదు .తనని అలాగే చూస్తూ  ఉండాలి  అనుకున్నాడు .కానీ సీనియర్స్  సీనియర్స్  ఉండడం వల్ల   వాళ్ళవైపు తిరిగాడు ).

కిరణ్ : ఇదిగో ఈమె  సాయి పల్లవి . నీ బ్రాంచ్ 3రెడ్ ఇయర్ . టాపర్ ఆఫ్  యువర్ బ్రాంచ్ ఇన్ కాలేజ్ .
సిద్ :  ఓ హ్ నైస్  టు  మీట్ యు  మామ్ .
(సాయి పల్లవి ఒక చిన్న  నవ్వు విసిరింది .విరిసిన  ఆ పెదవులను  చూస్తూ  ఉండిపోయాడు  సిద్దు ).
కిరణ్ : బాబ్జి ఇంకా ఏమి వచ్చు మనకి ?
సిద్ :సార్  అది  డాన్స్ పర్లేదు సార్ .
కిరణ్ :సరే ఒక మెగాస్టార్  స్టెప్ వేసి వెళ్ళమ్మా .
sid :సార్ ఇక్కడా ?
కిరణ్ ఫ్రెండ్ : ఆ ఇక్కడే బాబ్జి
సిద్ : సార్ అదీ అదీ ఇక్కడ అంటే........
కిరణ్ ఫ్రెండ్  : ఆ ఇక్కడే .
సాయి పల్లవి : నువ్వు ఆగు . తను నా బ్రాంచ్ . నా జూనియర్  సో నేనే  ర్యాగింగ్ చేయాలి . మీరు ఆగండి .
కిరణ్ : ఆ సరే చెయ్ .
సాయి పల్లవి : మన బ్రాంచ్ ఆడిటోరియంలో  ఫస్ట్  డే  ఇండక్షన్  జరుగుతుంది తొందరగా  వెళ్ళు .
కిరణ్ :  అదేంటి అలా వదిలేస్తున్నావ్ .
సాయి పల్లవి : నా  నా బ్రాంచ్ జూనియర్  నా ఇష్టం  నువ్వు వెళ్ళు.
sid: అబ్బా అబ్బా  అందం అనుకువ తో పాటు కమాండింగ్  ఏముంది రా బాబు  ఫస్ట్ రోజే  ఇలాంటి అమ్మాయిని  చూస్తాను  అని అనుకోలేదు . అది కూడా   సీనియర్స్ లో  ఇలాంటి అమ్మాయి .ట్రై చేస్తే  ఇలాంటి అమ్మాయిని ట్రై చేయాలి  అని  సాయి పల్లవి  చూసుకుంటూ  అక్కడి నుంచి వెళ్లిపోయాడు  .


ఏదో  ఏదో మొదటి ప్రయత్నంగా  ఇలా  మొదలు పెట్టాను  దీనికి మీరు  సహకారం అందిస్తున్నారు  అందిస్తారు  అని ఆశిస్తున్నాను .ఏదైనా అక్షర లోపం  అక్షర దోషం ఉంటే క్షమించి  సూచనలు సలహాలు  అందిస్తారు  అని అనుకుంటున్నాను. సూచనలు సలహాలు చేర్చి  ఈ కథని ముందుకు కొనసాగిస్తాను  
-అనుశ్రీ Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Superb
Like Reply
#3
Nice starting andi. Bagundi
Like Reply
#4
కాన్సెప్ట్ అదిరింది.
కొన్ని కాలేజ్ లలో ఒక రూల్ ఉంటూ ఉంటుంది.

నెంబర్ రూల్.....
సేమ్ నెంబర్ ఉండే జూనియర్ సీనియర్ కి హెల్ప్ చేయాలి. రికార్డ్ రాసి పెట్టడం.. ఏదైనా అడిగితే తెచ్చి పెట్టడం అలా అన్నమాట.. అలాగే ఆ జూనియర్ రెస్పాన్సిబులిటి సీనియర్ తీసుకుంటాడు. వేరే వాళ్ళు ర్యాగింగ్ చేయనివ్వకుండా, అలాగే ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తూ నోట్స్ ఇస్తూ అలా అన్న మాట...
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#5
Good start bagundi
Like Reply
#6
Good start bro. Continue chey manchi gaa big updates and regular gaa ivvu bro my request
Like Reply
#7
bagundi
Like Reply
#8
Good start.. try to add some pics to suit the scenes..
Like Reply
#9
(Yesterday, 04:32 AM)Arjun711 Wrote: Good start bro. Continue chey manchi gaa big updates and regular gaa ivvu bro my request

 థాంక్యూ. ముందుగా రాస్తున్నది రచయిత naa రచయిత్ర అని చూసి కామెంట్ చేస్తే బాగుంటుందండి
-అనుశ్రీ Heart
Like Reply
#10
(Today, 12:33 AM)Sunrisers143 Wrote:  థాంక్యూ. ముందుగా రాస్తున్నది రచయిత naa రచయిత్ర అని చూసి కామెంట్ చేస్తే బాగుంటుందండి

Sorry andi. Pls continue ? ?
Like Reply
#11
Anushree garu, you gave us a good start. Theme, story background every thing is good, though I would like to say one thing, write the story as per your story and approach, if the suggestions deviate your ideology or theme then kindly neglect those type of comments. I am waiting eagerly for upcoming episodes.

Try to give lengthier episodes. Your fan, Amar
Like Reply
#12
clps Nice start happy
Like Reply
#13
అమ్మ అనుశ్రీ! నేను 70 ఏళ్ళ వాడిని!! గత 53 ఏళ్ళుగా ఇది నా ఫాంటసీ!!! మంచి కథ!!!! నీకు నచ్చినట్లుగా బాగా రాయి!!!!!
Like Reply
#14
Excellent update
Like Reply
#15
ఆ తర్వాత సిద్ధాక్కడి నుంచి ఆడిటోరియం కి వెళ్ళిపోయాడు. తనకి అక్కడ రాజ్ పరిచయమయ్యాడు. రాజ్ కూడా సిద్ లాగే సిఎస్సి ఫస్ట్ ఇయర్.
రాజు : ప్రస్తుతం ఎక్కడుంటున్నావ్ బ్రో.
సిద్ : నేను ప్రస్తుతానికి హాస్టల్లో ఉంటున్నాను. ఒక నెల చూస్తాను నచ్చితే అక్కడే ఉంటాను లేదంటే బయట ఎక్కడైనా ఫ్లాట్ తీసుకుంటాను. మరి నువ్వు?
రాజు : నేను నా గర్ల్ ఫ్రెండ్ కృత్తితో కలిసి ఫ్లాట్ తీసుకున్నాను. తను కూడా మన కాలేజీ కానీ EEE బ్రాంచ్.
సిద్ : పక్క ప్లానింగ్ తో వచ్చినట్లు ఉన్నారు కదా. ఈ నాలుగు సంవత్సరంలో ఫుల్ ఎంజాయ్ అనుకుంటా.
రాజ్ : హ హ అంతే అంతే.

ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆడిటోరియంలోకి కాలేజీ ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి ఎంటర్ అయ్యారు . ఇద్దరు కాలేజీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టడీస్ ప్లేస్మెంట్స్ గురించి వివరించారు.

యాంకర్ : ఇప్పుడు టాపర్ ఆఫ్ ద సిఎస్సి బ్రాంచ్ మీ డిపార్ట్మెంట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తారు.

సాయి పల్లవి స్టేజ్ మీదకు వచ్చి డిపార్ట్మెంట్ గురించి వివరిస్తూ ఉంటుంది. సాయి పల్లవి స్టేజ్ పైకి రాగానే తనని చూసిన సిద్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన పక్కనే ఉన్న రాజ్ సిద్ ని పిలిచి, సిఎస్సి లో అమ్మాయిలు అంటే ఏమో అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు సూపర్ గా ఉన్నారు. సీనియర్స్ కూడా సూపర్ ఉన్నారు రా బాబు. ఒక్కసారి దాన్ని చూడు. ఏముంది రా బాబు ఆ నడుము, ఆ కళ్ళు, ఆ లిప్స్, ఫేసు ఒక ప్యాకేజీ లా ఉంది రా బాబు. ఎవడు పడేసి ఉంటాడో కానీ లక్కీ ఫెలో. సిద్దు అవన్నీ వింటూనే సాయి పల్లవిని చూస్తూ ఉన్నాడు.
సిద్ : ఆల్రెడీ లవ్ లో ఉంది అంటావా?
రాజ్: ఏంటి డౌటా? నార్మల్ గా ఉన్న వాళ్ళని వదలట్లేదు. అలాంటిది ఇంత హాట్ ఫిగర్ ని త్రీ ఇయర్స్ కాలేజీలో పెట్టుకొని ఎవడు గోపకుండ ఉంటాడంటావా? గోకినోడికి ఎవడికైనా పడకుండా ఉంటుందంటావా.
సిద్ : ఏమో చూస్తుంటే అలా అనిపించట్లేదు.
రాజ్ : నువ్వు ఏం చేస్తున్నావ్ తెలియట్లేదు కానీ, నేనైతే దాని ఒంపులో దాని ముఖము అబ్బా అబ్బా ఏం ఉందింది రా బాబు. సింగల్ అయితే నువ్వు ట్రై చేస్తావా ఏంటి? హ హ
సిద్: ట్రై చేసిన పడేలా లేదులే. వదిలేయ్ ఇక.
ఇక సాయి పల్లవి కాలేజీ గురించి బ్రాంచ్ గురించి చెబుతూ ఉంది. తను మాట్లాడుతూ ఉన్నంతసేపు అవేమీ గమనించకుండా సాయి పల్లవిని తన అందాన్ని చూస్తూ ఉన్నాడు. సిద్ తన అందానికి ఆకర్షితుడయ్యాడు ఎంతలా అంటే ఎలాగైనా తనతో ఒక్కరోజైనా గడపాలని అనుకుంటున్నాడు.


సాయి పల్లవి: ఓకే జూనియర్స్. ఇది మా కాలేజ్ అండ్ మన బ్రాంచ్ హిస్టరీ అండ్ ప్రైడ్. దీన్ని మీరు ఇలానే కంటిన్యూ చేస్తారని నేను మన సీనియర్స్ మన ప్రిన్సిపల్ ఉండే హెచ్ ఓ డి గారు కోరుకుంటున్నారు. వెల్ కం టు కాలేజ్. అన్నట్టు ఈ వీక్ అంతా ఫ్రెషర్స్ పార్టీ. ఒక్కో బ్రాంచ్ కి ఒక్కరోజు. మన బ్రాంచ్ కి వచ్చే శనివారం ఎవ్వరు మిస్ అవ్వకుండా తప్పకుండా రండి
అక్కడ మీరందరూ మీ క్లాస్మేట్స్ ని మీ జూనియర్స్ ని కలిసే అవకాశం ఉంటుంది వారితో పాటు ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్.

అలా చెప్పగానే సిద్ధ ఉత్సాహంతో ఎలాగైనా ప్రెషర్స్ పార్టీలో జాయిన్ అయ్యి ఎలాగోలా పరిచయం పెంచుకొని తన నెంబర్ తీసుకోవాలి ani అప్పటికీ అక్కడ నుంచి బయలుదేరాడు.

వారం రోజుల తర్వాత ఫ్రెషర్స్ పార్టీ సాయంత్రం 6:00

సిఎస్సి బ్రాంచ్ కి సంబంధించిన ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరం స్టూడెంట్స్ అందరూ సి ఎస్ ఈ డిపార్ట్మెంట్ ఓపెన్ ఆడిటోరియంలో హాజరయ్యారు .
సిద్ మరియు రాజు కూడా మంచి ఫార్మల్ డ్రెస్ లో హుందాగా జాయిన్ అయ్యారు . రాజు అక్కడికి అందంగా ముస్తాబైన ఆడపిల్లలని అందరిని చూస్తూ మురిసిపోతున్నడు . కొద్దిసేపటి తర్వాత సిద్ ని వదిలేసి తనకు నచ్చిన అమ్మాయిలని చూస్తూ వాళ్ల వెంట తిరుగుతున్నాడు . తన కళ్ళ ముందు ఎంత మంది మెరిసే అందమైన అమ్మాయిలు ఉన్నా సిద్దు కళ్ళు మాత్రం ఒకరి కోసం వెతుకుతూ ఉన్నాయి .
తన కళ్ళ ముందు అంత అందాలు తిరుగుతూ ఉన్న తను దేనికోసమైతే వెతుకుతున్నడో ఆ అందమే తనకి కురులు విరబూచుకొని, సహజ సిద్ధమైన తన అందానికి మరి కొంచెం అందం జోడించేలా ఎర్రటి డ్రెస్సులు ప్రత్యక్షమైంది.

జాతరలో తప్పిపోయిన పిల్లాడు తన తల్లిదండ్రులను చూసి సంబరపడ్డట్టు సాయి పల్లవిని చూడగానే తాను అంత ఉబ్బితబీ అయిపోయాడు. సాయి పల్లవి దగ్గరికి చేరి,
సిద్: హాయ్ సీనియర్
సాయి పల్లవి : నువ్వు…..
సిద్ : అదే సీనియర్ ఆరోజు నన్ను ర్యాగింగ్ చేస్తుంటే నన్ను ఆడిటోరియం కి వెళ్ళమని చెప్పారు.
సాయి పల్లవి: ఓకే ఓకే గుర్తొచ్చింది. ఇంతకీ నీ పేరేంటి?
సిద్: సిద్ధార్థ సీనియర్ అందరు సిద్ అని పిలుస్తారు.
సాయి పల్లవి: ఓకే సిద్దు ఎంజాయ్ ద పార్టీ.

యాంకర్: వెల్కమ్ టు ఆల్ ఫ్రెషర్స్ అండ్ సీనియర్స్. రేషర్స్ ఇది ప్రత్యేకంగా మీకోసమే. సో సీనియర్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఫ్యూచర్లో హెల్ప్ కోసం ఈ పార్టీ. సో ఈ పార్టీలో కొన్ని కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి జూనియర్ కి ఒక సీనియర్ ని జత చేస్తాం. ఆ జంట ఈ ఫ్రెష్ పార్టీ అయ్యేంతవరకు అన్ని టాస్కుల్లోనూ కలిసి పాల్గొనాలి. ఈ పార్టీ అయ్యేంతవరకు ఆ సీనియర్ ఆ జూనియర్ కి జోడి.

సీనియర్స్ అండ్ జూనియర్ కొంతమంది ఉత్సాహంగా మరి కొంత మంది తికమకగా ఆలోచిస్తూ ఉన్నారు.

యాంకర్ : మీ డౌటు నాకు అర్థమైంది. ఒక బ్యాచ్ ఉన్న జూనియర్స్ki మూడు బ్యాచ్ లో ఉన్న సీనియర్స్ ని ఎలా జత చేస్తారు అనే కదా?
కానీ దానికంటే ముందు మీ అందరికీ మరొక ఆసక్తికరమైన విషయం చెబుతాను. ఈ జతలో ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉండరు.
జూనియర్స్ అందరూ అయోమయంగా ఆలోచిస్తున్నారు. సీనియర్ స్ అబ్బాయిలందరూ కేరింతల కొడుతున్నారు.
యాంకర్: మీరు అనుకున్నదే సీనియర్ అబ్బాయిలు. ప్రతి చెత్తలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అంటే సీనియర్ అబ్బాయికి జూనియర్ అమ్మాయిని జతచేస్తాను, జూనియర్ అబ్బాయికి సీనియర్ అమ్మాయిని జత చేస్తాo.

సిద్దు పక్కన ఉన్న రాజు : అరే మామ సూపర్ ఛాన్స్ రా. మనకు ఏ కష్టం లేకుండా మనకే అమ్మాయిని సెట్ చేసి ఇస్తున్నారు అది కూడా సీనియర్ అమ్మాయిలు రా.
సిద్దు : అవున్రా. ( ఎలాగైనా నాకు సాయి పల్లవి దొరికేలా చూడు దేవుడా అని తనని చూస్తూ కోరుకుంటున్నాడు )
యాంకర్: ఇప్పుడు జోడిని ఎలా విభజిస్తామో చెప్తాను జాగ్రత్తగా వినండి.
ఇక్కడ మొత్తం ఫోర్ బ్యాచెస్ ఉన్నాయి. ప్రతి బ్యాచ్ లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు.ఒకటి జూనియర్స్ బ్యాచ్ మూడు సీనియర్స్ బ్యాచ్. జూనియర్స్ నుంచి రోల్ నెంబర్ వన్ ni సీనియర్స్ లో ఉన్న రోల్ నెంబర్ వన్ తో జత చేస్తాం.

ఉదాహరణకు జూనియర్స్ లో రోల్ నెంబర్ వన్ అమ్మాయి అయితే మొదటగా రెండవ సంవత్సరం బ్యాచ్ రోల్ నెంబర్ వన్ చెక్ చేస్తాను. రెండవ సంవత్సరం బ్యాచ్ రోల్ నెంబర్ వన్ కూడా అమ్మాయి అయితే మూడో సంవత్సరం బ్యాచ్, మూడో సంవత్సరం బ్యాచ్ కూడా రోల్ నెంబర్ అమ్మాయి అయితే నాలుగో సంవత్సరం బ్యాచ్. నాలుగో సంవత్సరం బ్యాచ్ రోల్ నెంబర్ 1 అబ్బాయి అయితే ఆ అమ్మాయి ఈరోజు అంతా అతనికి జత. అలానే జూనియర్స్ నుంచి రోల్ నెంబర్ 2 అబ్బాయి అయ్యి మిగిలిన సీనియర్స్ అందరూ అందరూ కూడా అబ్బాయి అయితే, సీనియర్స్లో మిగిలిన రోల్ నెంబర్ వన్ అమ్మాయి అబ్బాయికి జత.ఇలా ఒక జూనియర్ అబ్బాయి లేదా అమ్మాయి, సీనియర్ అమ్మాయి లేదా అబ్బాయితో జత అయ్యేవరకు చేస్తాను. మొదటి సంవత్సరం బ్యాచ్ అందరూ జత అయిన తర్వాత మిగిలిపోయిన రెండో సంవత్సరం బ్యాచ్ వాళ్ళని మూడు మరియు నాలుగు సంవత్సరముల బ్యాచ్ తో జత చేస్తాం. అలాగే మూడు రెండవ సంవత్సరం బ్యాచ్ జత అయిన తర్వాత మూడో సంవత్సరం బ్యాచ్ ని నాలుగో సంవత్సరంతో జత చేస్తలో. .అందరికీ అర్థమైంది అనుకుంటా.ఒకవేళ నాలుగు బ్యాచ్లలో ఎవరికి జత అవ్వకపోతే మిగిలి ఉన్న వారిలో దగ్గరగా ఉన్న రోల్ నెంబర్ తో జత చేస్తాం.

అది వినగానే సిద్దు ఎంతో సంతోషపడ్డాడు ఎందుకంటే తన రోల్ నెంబర్ సీనియర్ లో ఉన్న సాయి పల్లవి రోల్ నెంబర్ తో జత అయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇద్దరి పేర్లు s తోనే మొదలవుతుంది. తన బ్యాచ్లో s తో ఉన్న పేర్లు లెక్క వేస్తున్నాడు. తన బ్యాచ్ లో ఆ అక్షరంతో సిబి సిద్ధార్థ శ్రీరామ్ ముగ్గురు మాత్రమే ఉన్నారు కానీ ముగ్గురు అబ్బాయిలు. ఆలోచిస్తూ ఉండగా సిద్ధికి ఇంకో టెన్షన్ మొదలైంది అదేంటంటే ఒకవేళ రెండవ సంవత్సరంలో తన రోల్ నెంబర్తో అమ్మాయి ఉంటే?
( సిద్దు మనసులో ఎలాగైనా సాయి పల్లవి తనకి మ్యాచ్ అయ్యేలా చూడు స్వామి అని కోరుకుంటూ ఉన్నాడు)

యాంకర్: మరి ఇప్పుడు జూనియర్స్ నుంచి డోర్ నెంబర్ వన్ అను స్టేజి పైకి రావాలి.
అను స్టేజ్ పైకి కి వెళ్ళింది.( చాలా చక్కగా అందంగా ఉంది)
యాంకర్: సెకండ్ ఇయర్ రోల్ నెంబర్ వన్ అక్షయ. అమ్మాయి కాబట్టి థర్డ్ ఇయర్ చెక్ చేద్దాం.
మూడవ సంవత్సరం రోల్ నెంబర్ వన్ అభి.
అవి పేరు చెప్పగానే అభి ఫ్రెండ్స్ మరియు సీనియర్స్ అందరు చప్పట్లు కొట్టారు. అభి స్టేజ్ మీద కెళ్ళి అను పక్కన నిలబడ్డాడు.
యాంకర్: అను మరియు అభి ఈరోజుకి మీరే నా మొదటి జోడి. ఈ పార్టీ అయ్యేంతవరకు మీరే జోడి. మీరు కొద్దిగా కేటాయించిన ప్లేస్ కి వెళ్ళండి.
అభి నవ్వుతూ చేయించాడు అను చేయి కోసం. అను సిగ్గుపడుతు చెయ్యి ఇచ్చింది. ఇద్దరు అలా పక్కకు వెళ్లి నిలబడ్డారు.
ఇలా యాంకర్ ఒక్కొక్కరిని జత చేస్తూ మిగిలిన వారిని పక్కన పెడుతూ కొనసాగుతుంది. రోల్ నెంబర్ 34 35 36…. కొనసాగుతోంది.
( ఒకపక్క ఇది ఇలా జరుగుతూ ఉండగా సిద్దు కి టెన్షన్ పెరిగిపోతుంది )
యాంకర్ : జూనియర్ రోల్ నెంబర్ 50 రఘు స్టేజి మీదకి రా .అలానే నాలుగో సంవత్సరం మూడో సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి రోల్ నెంబర్ 50 ఒక్కొక్కరు స్టేజి మీదకు రండి .
నాలుగో సంవత్సరం నుంచి ఒక అమ్మాయికి వచ్చింది .
మూడో సంవత్సరం నుంచి ఇంకో అమ్మాయి స్టేజి మీదకి వచ్చింది . తనని చూడగానే సిద్దూకి గుండె ఆగినంత పని అయింది . ఎందుకంటే తను ఎవరో కాదు సాయి పల్లవి .
తన బ్యాచ్లో ఎస్ అక్షరం స్టార్ అవ్వడానికి అంటే ముందే సాయి పల్లవి స్టేజి మీదకి వచ్చేసరికి సిద్దుకి టెన్షన్ పెరిగింది .సాయి పల్లవి తనకి జతగా దక్కుతుందో లేదో అని భయం మొదలైంది .ఇంతకీ సిద్దుకి సాయి పల్లవి జోడీగా దొరికిందా లేదా అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం .

[Image: sp-s1.jpg]

[Image: SP-S2.jpg]

[Image: SP-FP.jpg]
-అనుశ్రీ Heart
[+] 6 users Like Sunrisers143's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)